తమ నెట్ వర్క్ బలంగా ఉన్నప్పుడు, తమ అనుకూలురూ, మద్దతుదారులూ అయిన [ఏజంట్స్] వారు ప్రభుత్వంలోపలా బయటా రాజకీయనాయకులూగా, బ్యూరాక్రాట్లుగా, ఇతర కీలక స్థానాల్లోనూ ఉన్నప్పుడు కుట్రదారులు తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల్ని[వారు ప్రధానమంత్రులైనా సరే] వేధించగలరు, సాధించగలరు, misguide చేయగలరు. కాబట్టే ఇందిరాగాంధీ, ఆవిడ సహచరుల్లోని కొందరు దేశభక్తులూ, ఆనాటి గూఢచార విభాగాలూ ఎప్పుడు వాస్తవాలకు దగ్గరగా వచ్చినా వెంటనే, కుట్రదారులకీ ఆవిషయం ముందుగా చేరేది. వెంటనే ఏదో అలజడులు రేగటం, లేదా కోర్టుకేసులు, తీర్పులతో సంచలనం సృష్టించటం, లేదా ఏ విద్యార్ధియూనియన్ లో లేక కార్మిక యూనియన్ లో సమ్మెలకు దిగటం. సమ్మెలతో ఆగరు బస్సులు, రైళ్ళు తగలేస్తారు. ఒక దశలో రాష్ట్ర ఆర్.టి.సి. లకి బస్సుల దహనమే ప్రధాన నష్టంగా నడిచింది. చీమ చిటుక్కుమంటే బస్సులు తగలెయ్యటమే. నక్సల్స్ సైతం ఎప్పుడూ ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసేవారే. పొరపాటున కూడా బడావ్యాపారవేత్తల ఆస్తుల జోలికి వెళ్ళరు. మరి వాళ్ళ నుండి మామూళ్ళు అందేవో లేక అందర్నీ నడుపుతోంది ఒకే వ్యవస్థగనుక నక్సల్స్ కీ, ఇతర తీవ్రవాదులకీ టాటాల, బిర్లాల, అంబానీల లేదా కార్పోరేట్ ల ఆస్థులు జోలికీ వెళ్ళకూడదన్న Assignments ఉండేవో. అలాగే కోర్టు తీర్పులూ, పార్టీల చీలకలు. ఎప్పుడు పార్టీ చీలినా, ఇందిరాకాంగ్రెస్ కీ మొరార్జీ కాంగ్రెస్ కీ లేదా ఇందిరాకాంగ్రెస్ కీ రెడ్డి కాంగ్రెస్ కీ, లేదా ఇందిరా కాంగ్రెస్ కీ అర్స్ కాంగ్రెస్ కీ ఎన్నికల గుర్తు విషయమై వివాదం ఏర్పడుతుంది. కోర్టు కెళ్ళినా, ఎన్నికల కమీషన్ తీర్పు చెప్పినా, అప్పటి వరకూ ప్రచారంలో ఉన్న గుర్తు పార్టీ చీల్చుకెళ్ళిన వాళ్ళకి పోయేది. కొత్త గుర్తే ఇందిరా కాంగ్రెస్ కి వచ్చేది. వాళ్ళు ఈ గుర్తుని ప్రజల్లోకి తీసికెళ్ళడం అనే ’రెడ్డొచ్చె మొదలాడే పని’ పాపం ఇందిరాగాంధీ నెత్తినా పడేది. ఆ విధంగా ‘కాడి జోడెద్దులు’ పోయి ‘అవుదూడ’ గుర్తు వచ్చింది. అది పోయి ‘హస్తం’ గుర్తు వచ్చింది. అయినా అన్నిసార్లు ప్రజలు ఆవిడ వెంటే ఉండేవారు. కానీ ఈ ఒడిదుడుకులన్నీ తట్టుకోవటంలో ‘తాము పసికట్టిన అసలు విషయం’ ప్రక్క దారి పట్టేది. ఇక నిరూపించగలగటం కలలోనిమాటే. ఆత్మరక్షణే మిగిలేది.
ఇలాంటి విన్యాసాలను సినిమాలలో, నవలలో చూస్తుంటాం, చదువుతుంటాం. అయితే సినిమాకీ దర్శకుడూ, నవలకూ రచయితా ఉంటారు గనుక, ప్రేక్షకులకు, పాఠకులకూ అర్ధం గాకపోతే సినిమా, నవలా ప్రజాదరణ పొందదు గనుకా, అప్పుడు డబ్బులు రావు గనుక సదరు దర్శకుడూ లేదా రచయిత మనకి అర్ధమయ్యేలా చెబుతారు. అదే నిజ జీవితంలో అయితే అలా జరగదు, అందునా అది గూఢచర్యం అంటే రహస్య మంత్రాగం కనుక ఇలాంటి విన్యాసాల్ని గుర్తించడం ఎంతో కష్టం. అందునా మన దేశం మీద కుట్ర ఎక్కడి నుండి, ఎవరి చేత అమలు చేయబడుతుందో తెలియనప్పుడు కుట్రని పసి గట్టటం మరింత కష్టం.
ఇక కుట్రదారులూ, వారి మద్దతు దారైన సోనియా గాంధీ పీ.వి.నరసింహారావుని AICC అధ్యక్షుడుగా, దేశప్రధానిగా ఎంచుకోడానికి కారణాలేవైనా కానివ్వండి గానీ 1991 లో ఈ తెలుగు మేధావి సౌత్ బ్లాక్ లోని PMO లోకి ప్రవేశించాడు. బహుశః ఆయన హయంలోనే ఇండియా – మండల్, మందిర్, ఖలిస్తాన్, హర్షద్ మెహతా సెక్యూరిటీ కుంభకోణం మొదలైన సమస్యలతో కుప్పకూలాలనీ, దానికి ఆయన్నే బాధ్యుణ్ణి చేయాలని వారి పన్నాగం కావచ్చు. అందునా ఆ సమస్యలన్ని ఒక్క మారుగా, అత్యంత తీవ్రంగా 1992 లో చుట్టుముట్టాయి. అదేవిధంగా రామోజీరావు ప్రధాన కుట్రదారుగా గుర్తింపబడగానే, 1992 తర్వాత అసాధారణంగా మరుగున పడ్డాయి. [దీని గురించి నిరూపణలతో సహా తదుపరి టపాల్లో వివరిస్తాను] ఇందిరాగాంధీకి ఆయన ఇచ్చిన సహాయసహకారాలకి, నైతిక మద్దతుకీ, ఆత్మ స్థైర్యానికి, అలాగే రాజీవ్ గాంధీకి ఆయన నేర్పిన పరిణతికీ, ఇచ్చిన మార్గదర్శకానికి ప్రతీకారంగా ఆయన్ని అగౌరపరచాలని, degrade చెయ్యాలని వారి పన్నాగం. అందుకే ఆయన ప్రధాని అయిన సంవత్సరానికే [1991 జూన్ నుండి 1992 జూన్ నాటికే] సమస్యల సుడిగుండాలు పెరిగిపోయాయి. ఇండియాని ఓటమి పాలుచేయటం, కుప్పకూల్చటం[?] వారి లక్ష్యం. ఆ పరిణామానికి ఆయన్ని బాధ్యుణ్ణి చేయటం, ఆ దుష్కీర్తి ఆయన తలకి చుట్టటం వారి ప్రతీకారేచ్ఛ.
అయితే 1991 జూన్ లో, పీ.వి.నరసింహారావు ప్రధాని అయిన సందర్భంలో ఆయన “నాకిప్పుడు 71 ఏళ్ళు. ఇప్పుడు భగవంతుడు నాకు ఇలాంటి అవకాశం ఎందుకిచ్చాడో తెలియదు. భారతదేశానికి మంచి చేయటానికి నా శాయశక్తులా కృషి చేస్తాను” అన్నాడు. 1992 లో రామోజీరావు రహస్య కార్యకలాపాలు గురించి, కుట్రల గురించి నాకు తెలిసినప్పుడు ప్రధాని పీ.వి.నరసింహారావు దృష్టికి, తెచ్చేందుకు నన్ను పురికొల్పింది, 1991 లో ఆయనిచ్చిన ఆ స్టేట్ మెంటే. లేకుంటే సోనియా గాంధీ దృష్టికి తీసికెళ్థామా అని కూడా ఆలోచించాను. అప్పటికి ఆమె ఇంతటి దని నాకు తెలియదు. ఇప్పుడు కదా ఆమె అసలు రూపం, దేశద్రోహం బహిర్గత మౌతున్నాయి?
1991 నుండి 1992 లోపల [అంటే ఒక సంవత్సరం లోపల] భారత్ పరిస్థితి దారుణమైన సమస్యల్లోకి, అవధుల్లోకి లాగబడింది. పైన చెప్పిన మండల్, మందిర్, మెహతా, ఖలిస్తాన్ లకి తోడు కాశ్మీరు మిలిటెంట్లూ, బోడోలు, నక్సల్స్ హింస, తీవ్రవాదం, అఖిల భారత లారీల సమ్మె[20 రోజులుగా కొనసాగుతుంది] నాటి భారత ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోనివ్వటం లేదు. ఆనాటి నేపధ్యం గురించి, ఒకో సమస్య గురించి వివరిస్తాను.
బాబ్రీ మసీదు: మీడియా వార్తా కథనాల ప్రకారం, పీ.వి.నరసింహారావు వ్రాసిన అయోధ్య గ్రంధం ప్రకారం, రామమందిరం – బాబ్రీ మసీదు చరిత్ర సుదీర్ఘమైనది. చరిత్ర ప్రకారం, మొగల్ రాజు బాబర్ పాలనా కాలంలో హిందువులు రామజన్మభూమిగా భావించే స్థలంలో మందిరాన్ని కూలగొట్టి 1528 AD లో మీర్ బఖీ అనే మసీదుని కట్టించాడు.
ఇక్కడ బాబ్రీమసీదు మసీదుకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. 1859 AD లో ప్రార్ధనా స్థలాలను విభజిస్తూ బ్రిటీషు ప్రభుత్వం కంచెను నిర్మించింది. లోపలి భాగం ముస్లింలది. బయటి భాగం హిందువులది. 1885 లో మసీదుకు ఆనుకొని బయటిభాగంలో మందిర నిర్మాణానికి అనుమతి కోరుతూ దావా – అది రద్దయింది. 1949 AD నుండి తరచూ కోర్టుల కేసులతో పలుపరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 1859 AD లోనే లోపలిభాగం ముస్లింలకీ, బయటి భాగం హిందువులకీ ఇస్తూ బ్రిటిషు ప్రభుత్వం కంచె నిర్మించటం, చైనా – టిబెట్ విషయంలో ఇద్దరికీ రాజీ చేస్తూ బ్రిటిషు వాళ్ళు ఔటర్ టిబెట్, ఇన్నర్ టిబెట్ ల వ్యవహారం ఒకేలా ఉండటం యాదృచ్చికమా? అదే స్ట్రాటజీ ఇక్కడా ప్రయోగింపబడటం ఎంత విడ్డూరం? సుదీర్ఘ భవిష్యత్తులో తమ Divide and Rule Policy కి అనుకూలంగా 1859 AD లోనే ప్రాతిపదిక వేయటం వెనుక బ్రిటిషు వారి దూరదృష్టి ఉందా లేక అనువంశిక నకిలీ కణికుడి దూరదృష్టి ఉందా? అంత దూరదృష్టే బ్రిటిషు వారికి ఉంటే రెండవప్రపంచ యుద్దం తర్వాత బ్రిటిషు దివాళా తీసే స్థితికి వచ్చి ఉండేది కాదు. ఏది ఏమైనా దశాబ్ధాల ముందుగా గూఢచర్యపు తంత్రాలు రచింపబడటం, ప్రాతిపదికలు అమలు చేయబడటం సామాన్య ప్రజలకి తెలిసినా తెలియకపోయినా పచ్చినిజం. 1859 AD లో బ్రిటిషు ప్రభుత్వం కంచెని నిర్మించింది. 1934 లో వివాదస్పద కట్టడపు వినియోగంపై మతఘర్షణలు చెలరేగాయి. అదీ స్వాతంత్ర సమరం తీవ్రస్థాయిలో జరుతుతున్నప్పుడు. అదీ కార్య కారణ సంబంధం పని చేసే తీరు. విశ్వహిందు పరిషత్ 1984 లో బాబ్రీ మసీదు పై పోరాటం మొదలుపెట్టింది. 1986 లో రాజీవ్ ప్రభుత్వంలో కోర్టు తీర్పుద్వారా బాబ్రీమసీదు గేట్ తాళాలు తీయటం అయ్యింది. ఎప్పుడు బాబ్రీ మసీదుకు సంబంధించి ఆరోపణ మొదలు పెట్టిన రాజీవ్ ను, కాంగ్రెస్ ను ఆరోపిస్తారు. లబ్ధి మాత్రం బి.జె.పి., ఆర్.ఎస్.ఎస్.లు పొందాయి. ఇదీ కుట్రతీరు.
ఇక్కడ ఇంకొ విషయం చెప్పాలి. ఇప్పుడు చైనా, టిబెట్ మధ్య గొడవులు మనం చూస్తున్నే ఉన్నాం. చైనా, అమెరికాకు వ్యతిరేకం కదా మరి అమెరికా టిబెట్ ను ఎందుకు సపోర్టు చేయదు. బాబ్రీ మసీదు విషయంలోనయినా, టిబెట్ విషయంలోనైనా భారతీయ మూలలకి నష్టం కలగజేయటమే కుట్రదారుల లక్ష్యం .
ఇక, మనం గత టపాల్లో చెప్పుకున్నట్లు 1492 లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్ కు సముద్రమార్గం కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఉత్సాహంగా తాను భారత్ చేరానని ప్రకటించుకున్నాడు. తర్వాత తెలిసింది అది మరో క్రొత్త ఖండమనీ. దాంతో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లనీ, దీవులకి పశ్చిమ ఇండియా దీవులనీ పేరు పెట్టారు. తాము దోచుకోవడానికి మరో విశాల భూఖండం దొరికింది కదాని యూరోపియన్లు తెగ సంబరపడ్డారు. అనంతర అమెరికా స్వాతంత్ర సమరం గురించి, వాషింగ్టన్ నాయకత్వం గురించీ అందరికీ తెలిసిందే.
తదుపరి 400 సంవత్సరాలకి అంటే 1893 లో చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద భారత దేశపు సంస్కృతి యొక్క ప్రాచీనతని, ఔనత్యాన్ని ఎలుగెత్తి చాటుతూ “పాశ్చాత్య ప్రపంచం ఇంకా కన్నులైనా తెరవక ముందే భారత దేశానికి మహోన్నతమైన సంస్కృతీ, తత్త్వసంపదా ఉన్నాయి” అన్నారు. [1991 ముందు సరళీకృత ఆర్ధిక విధానాలు ప్రవేశపెట్టక ముందు భారత్ గురించి “భారత్ మీద కుట్రచేయటానికి ఏంఉందనీ, బీద దేశం, ఆ సంస్కృతి కూడుపెట్టేది కాదు” అనే మాట ఉండేది. ఇప్పుడు అందరూ బలమైన ఆర్ధిక వ్యవస్థ, అతి పెద్ద మార్కెట్ అని పొగుడుతున్నారు గానీ, 1992 కు ముందు ఇండియా మార్కెట్ ఎంత పెద్దదో ప్రచారం ఉండేది కాదు.]
తదనంతర పరిణామక్రమంలో కుట్రదారులతో [అంటే బ్రిటీషు, అనువంశిక నకిలీ కణికుడు] చేయికలిపిన సి.ఐ.ఏ., భారతదేశాన్ని 500 సంవత్సరాల వెనక్కి తీసికెళ్ళాలని తలచింది. 1992 లో మతఘర్షణలతో, అయోధ్య అల్లర్లతో, ఆర్ధిక కుంభకోణాలతో ఇండియా కూలిపోయి ఉంటే ప్రపంచమీడియా యావత్తు అదే ప్రచారించి ఉండేది.
నిజం చెప్పాలంటే ఆర్.ఎస్.ఎస్.,బి.జె.పి.లు తెరమీది సంస్థలనీ, తెరవెనుక వ్యవస్థ సి.ఐ.ఏ. అనే విషయం బహిరంగ రహస్యమే. వ్యూహత్మకంగా బి.జె.పి., ఆర్.ఎస్.ఎస్.లు అయోధ్యలో ఉన్న మసీదు కూలగొట్టి రామమందిరాన్ని నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నాయి. ఈ సున్నిత భావోద్వేగ విషయంతో బి.జె.పి. లోక సభలో తన బలం 2 నుండి 86 కి 1984 నుండి 1989లోగా పెంచుకుంది. 86 నుండి 120 కి 1989 నుండి 1991 కల్లా పెంచుకుంది.
వాస్తవానికి బి.జె.పి., ఆర్.ఎస్.ఎస్. వంటి హిందూ ఉగ్రవాదులు ప్రజల నమ్మకాల మీద, భావోద్యేగాల మీద, జీవితపు భద్రత మీదా ఆడుకోవాలనుకున్నారు. మందిర్ – మసీదు వ్యవహారంలో హిందూ ముస్లింల మధ్య అపనమ్మకం, అనుమానం సృష్టించారు. తద్వారా భారతీయుల సహజీవనానికి, ఐక్యతకీ విఘాతం కలిగించాలన్నది వారి వ్యూహం. ఆ కుట్రలో భాగంగానే శిలాన్యాస్, కరసేవ, రధయాత్రల వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తదనుగుణంగా మీడియా దాన్ని ప్రచారించింది. మత ఘర్షణలకి దారితీసేలా వ్రాసింది. అయితే కేవలం మీడియా వ్రాతలు [ఆనాటికి ప్రైవేట్ టివీ ఛానెళ్ళు లేవు] ప్రజల్ని వీధుల్లోకి వచ్చి కొట్టుకునేలా చెయ్యలేవు. అందుకే కొందరు కిరాయి వ్యక్తులు రెండు మతాల వారిలోనూ ప్రవేశపెట్టబడ్డారు. లేదా డబ్బాశకు లొంగి రెండు మతాల వర్గాల నుండి కొందరు వ్యక్తులు కుట్రదారులకు మద్దతిచ్చారు. ఇలాంటివారు పరస్పరం రెండు మతాల ప్రజలు కొట్టుకునేలా దాడులకు పునాదులు వేసారు. మాస్ మనస్తత్వం కారణం కానివ్వండి, వ్యవస్థీకృతంగా కొంత హింస చెలరేగటం కారణం కానివ్వండి క్రమంగా హింస, అల్లర్లు దేశమంతటా ప్రాకటం ప్రారంభమైంది. హైదరాబాద్ పాతబస్తీ లాంటి దేశంలోని ఇతర ప్రాంతాల్లో హింస మితిమీరిపోయింది.
ఇక ఈ అగ్నిని ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు తీసుకు కెళ్ళెందుకు అద్వానీ వంటి హిందూ [?]నాయకులు, ఇమాం బుఖారీ వంటి ముస్లిం [?] నాయకులూ ఉపన్యాసాలు గుప్పించారు. అద్వానీ, ఉమాభారతి వంటి బిజేపి నేతలూ, సాధ్వి రితంభరి, గోవిందచార్య, వినయ్ కతియార్ వంటి ఆర్.ఎస్.ఎస్. నేతలు తమ ఉద్వేగ పూరిత ఉపన్యాసాలతో, ప్రాసపూరిత పద ఉచ్చారణలతో, అయోధ్యలో రామమందిర నిర్మాణం పట్ల తమ నిబద్దని ఎలుగెత్తి చాటేవారు. [ఉమాభారతి ఇటీవల బి.జే.పి. నుండి బయటికి వచ్చింది. అప్పట్లో తాను గోవిందచార్యాని వివాహమాడగోరానని ఒకసారి ప్రకటించింది. కానీ 1992 నాటికీ ఈవిడ సన్యాసిని. కాషాయాంబరధారణి. సదరు గోవిందచార్య, ఉమాభారతి ఇద్దరూ ఇప్పుడు ఏకారణం చేతనో అంతగా వార్తల్లో కనబడటం లేదు.]
ముఖ్యంగా అద్వానీ తన ఆవేశపూరిత ఉపన్యాసాలతో “మనం అయోధ్య రామమందిర నిర్మాణానికై నిబద్దులమై ఉన్నాం. అంకితమైన ఉన్నాము. అందుకోసం మరణించటానికైనా సిద్దమే. ప్రభుత్వం గానీ, సైనికులు లేదా పోలీసులు గానీ, ముస్లింలు గాని అడ్డుతగిలినా, చివరి వరకూ పోరాడతాం” అంటూ నినదించేవాడు.
వాస్తవానికి వారి అజెండా కేవలం అయోధ్యకు మాత్రమే పరిమితమై లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత బృందావనంలో కృష్ణజన్మభూమిలో కృష్ణమందిర నిర్మాణం తలకెత్తుకోవాలన్నది వాళ్ళ భవిష్యకార్యచరణ. అదే వరుసలో దేశంలోని 3000 చోట్ల ఉన్న మసీదులని పడగొట్టి హిందూ మందిరాలు నిర్మించాలన్నది వాళ్ళ కార్యక్రమం. ఎందుకంటే గతంలో అక్కడ ఉన్న గుడులని ముస్లిం రాజులు పడగొట్టి మసీదులు కట్టారట.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
6 comments:
there is some disconnetion in your postings. you say advani is supporter of CIA... and CIA... main objective is to remove Indian cultures(bharateeya moolaalu) from India. ok. and again you says advani wants to build 3000 temples on the places of masjids. How is this possible?
If advani supports CIA... whereas their interest is to remove hindu cultures from India then why advani builds temples on the places of masjids.
మీ వ్రాతలు చూస్తుంటే, ఇటువంటి అందమైన, విస్పష్టమైన శైలిని అలవరచుకోగలగటానికి ఎంత కష్టపడ్డారో గదా అని ముచ్చటేస్తుంది.
Venkat gaaru,
To clarify your doubts regarding Advani, please follow my next posts. Actually, Advani’s aim was not to construct temples at 3000 places in various parts of India. His target was [is] only to raise communal rivals by taking such projects. Like that, he worked for other country agencies such as C.I.A. etc.
******
నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారూ,
నా శైలి మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ! కృతఙ్ఞతలు.
@venkat:
that migt be the overleaf reason they are showing or CIA making them to show that reason to support their activities.
Lets count how many temples they built in all these years
"వాస్తవానికి వారి అజెండా కేవలం అయోధ్యకు మాత్రమే పరిమితమై లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత బృందావనంలో కృష్ణజన్మభూమిలో కృష్ణమందిర నిర్మాణం తలకెత్తుకోవాలన్నది వాళ్ళ భవిష్యకార్యచరణ. అదే వరుసలో దేశంలోని 3000 చోట్ల ఉన్న మసీదులని పడగొట్టి హిందూ మందిరాలు నిర్మించాలన్నది వాళ్ళ కార్యక్రమం. ఎందుకంటే గతంలో అక్కడ ఉన్న గుడులని ముస్లిం రాజులు పడగొట్టి మసీదులు కట్టారట".
I would like ask you couple of questions. 1) Did you get a chance to read de-Islamization of Spain. 2) Did you read about destruction of Roman Temples by మిషనరి's after they captured power over Rome.
After 1200 years rule of ముల్లా's and మిషనరి's rule, Hindus never get a chance to gain their pride. All the injustices against them were imprinted on their minds and psychology. British granted vast tracts of land to మిషనరి's and మిషనరి's retained that land after independance.
Where as మిషనరి Reddy is looting Hindu Temples and Hindu Temple lands.
Where the country is going. Reservations were provided to ST, SC and BC's to correct the historical injustices. But where is the justice for Hindus who were ruled by ముల్లా's and మిషనరి's for 1200 years?
This question must be answered soon or later for the welfare of India by our intellectuals.
you are seems to be isi agent
i hate you
Post a Comment