ఎప్పుడు ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి.లు శిలాన్యాస్ వంటి కార్యక్రమాలు నిర్వహించినా [ శ్రీ రామ అని వ్రాసి ఉన్న ఇటుకలను దేశం నలుమూలల నుండి రోడ్డుమార్గానా, రైలు మార్గానా ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి. కార్యకర్తలు అయోధ్యకు చేర్చడాన్నే శిలాన్యాస్ అనే వాళ్ళు.] బిబిసి, ఇతర అంతర్జాతీయ మీడియా, అలాగే జాతీయ మీడియా భారీ ప్రచారం ఇచ్చేది. ఇది భారతీయుల్లో, హిందూ ముస్లిం రెండు వర్గాల్లోనూ అయోధ్యలో ఏదో జరగబోతుందని, దేశంలో ఏదో అవుతోంది అన్న ఉద్రిక్తతని సృష్టించేది. పరస్పరం సర్ధుకుపోతూ బ్రతుకుతున్న సమాజంలో అవి అలజడి రేపేవి. ఇరు వర్గాల్లోనూ అభద్రత చోటు చేసుకోవడం, అపనమ్మకం పెరగడం సహజమే కదా! సహకారం, సహ జీవనం దెబ్బతినసాగాయి.

నిజానికి, అయోధ్యలో రామమందిరం ఉన్నా, మీర్ బఖీ మసీదున్నా, వారి జీవితాల్లో దాని ప్రమేయం ఏమీ ఉండదు. కానీ మత ఘర్షణలు మాత్రం వారి జీవితాల్లో సుఖశాంతుల్నీ, ఆస్థుల్నీ, ప్రాణాలనీ కూడా నష్టపరుస్తాయి. ఎటూ ప్రజల్లో కలిసిపోయి కుట్రదారుల ఏజంట్లు హింసనీ, అభిప్రాయాలనీ వ్యాప్తి చెయ్యడానికి సిద్దంగానే ఉన్నారయ్యే.

గాలి తోడైతే మంటలింకా ప్రజ్వరిల్లటం సహజం. అలాగే ఇతర రాజకీయ పార్టీలు, వీ.పి.సింగ్, ములాయం సింగ్ లాంటి నేతలూ తమ తమ పాత్రల్ని కుట్రదారుల స్క్రిప్టు ప్రకారం చక్కగా నిర్వహించారు. అద్వానీ రధయాత్రని నిషేధించి, ఆరెస్టు చేసి వీ.పి.సింగ్ నాటకాన్ని రక్తి కట్టించాడు. అద్వానీ ప్రభుత్వానికిచ్చిన మద్దతు ఉపసంహరించి మరీ గర్జించాడు. ఈ విధంగా ఎవరి పాత్రవారు నిర్వహించారు. అంతగా ప్రభుత్వాధికారంలో లేనప్పుడూ, కోర్టుని ధిక్కరించి మరీ మందిర నిర్మణం కోసం చెమటోడ్చిన అద్వానీ, 1999 తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు కిమ్మన లేదో అతడికే తెలియాలి. పాపం, వారికి పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే అయోధ్యలో గుడి కట్టి ఉండేవారట. కొందరిలా వాదిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉండటం, కోర్టు తీర్పులూ అడ్డంకి కాని వారికి ప్రభుత్వాధికారంలో ఉండి, పూర్తి మెజారిటీ లేకపోవడం అడ్డంకి అయ్యిందా? మరీ భారతీయులు అంత మూర్ఖుల్లా కన్పిస్తున్నారా ఏది చెప్పినా ఔనేమో అనుకోవడానికి?

ఒకసారి గతంలోకి చూస్తే – తెలిసో తెలియకో, స్వచ్ఛందంగానో పరిస్థితులకు లోబడో, కావాలనో, ప్రత్యుర్ధుల ఉచ్చులో పడో, రాజీవ్ గాంధీ హయాంలో కోర్టు ద్వారా అయోధ్యలోని గుడి తలుపుల తాళాలు తెరవబడ్డాయి. బాబ్రీ పోరాట కమిటీ ఏర్పడింది.

ఇక రధయాత్ర, కరసేవల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా భారీగా ప్రచారించింది. భారత్ సాధించిన విజయాలపై [ఇండో పాక్ యుద్దాల దగ్గర నుండి హరిత విప్లవం వంటి విషయాల వరకూ] కిమ్మనని అంతర్జాతీయ మీడియా ‘భారత్ క్లిష్టస్థితిలో ఉందంటూ, భిన్నత్వంలో ఏకత్వం ప్రమాదంలో పడిందంటూ, రేపోమాపో ఇక ఇండియా భగ్గుమని మాడి మసైపోవడం ఖాయమన్నట్లు’ వ్రాసేవి. 1974 ల తర్వాత జాతీయ మీడియా కూడా భారత్ ను సమర్ధించడం మానేసింది. పైకి భారత్ ని పొగిడినా, విమర్శించినా వ్రాతల్లోని అంతరార్ధం మాత్రం ‘బిడ్డని ఎత్తుకున్నట్లే ఉండాలి, పిర్ర గిల్లాలి’ అన్నట్లే ఉండేవి. దేన్నీ విడిచి పెట్టకుండా భారతీయుల్ని చిన్న బుచ్చడమే అంతర్లీన ధ్యేయంగా వ్రాసేవి. కాగ్ నివేదిక [కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్] రాజీవ్ గాంధీని అభిశంసించినప్పుడు మీడియా గగ్గోలు పెట్టింది. ఈనాడు రామోజీ రావైతే ఏకంగా రెండు వారాల పాటు పతాక శీర్షికలూ, సంపాదకత్వాలు వ్రాసాడు. సదరు కాగ్ అధినేత టి.ఎన్.చతుర్వేది 1992 తర్వాత బి.జె.పి.లో చేరాడు. రిటైర్ అయ్యి, ఏ పార్టీలోనూ చేరకుండా ఉండలేదు. అలాంటప్పుడు అతడికి వ్యక్తిగత భావోద్రేకాలేవీ లేవనీ, ఏపార్టీ పట్లా, వ్యక్తుల పట్లా వైషమ్యమో, వ్యామోహమో లేవని ఎలా నమ్మటం? అటువంటి వ్యక్తి ఇచ్చిన నివేదిక నిజాయితీతోనూ, నిష్పక్షపాతంతోనూ కూడుకున్నదనీ ఎలా అనటం? అలాంటిది, అదేదో సమవర్తి [యమ ధర్మరాజు] తీర్పయినట్లు, రామోజీరావు అంతగా ఎందుకు గొంతుచించుకున్నట్లు?[అదేనండి గొంతుకాకపోతే కాగితం] ఏమీ, ఆనాటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్కి వ్యతిరేకిగానూ, నాటి బి.జె.పి. లేదా జె.డి.ల పట్ల అనుకూలంగానూ చతుర్వేది పనిచేసి ఉండకూడదా? మరలాంటప్పుడు అదేదో రాజీవ్ గాంధీ ప్రపంచపేరుమోసిన కరుడు గట్టిన గజదొంగ అయినట్లు రామోజీరావు ఎందుకు గోలపెట్టాడో అతడికే తెలియాలి. ఇప్పుడు 1992 తర్వాత కాగ్ నివేదిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం చాలా మామూలైపోయింది. వై.ఎస్. ప్రభుత్వానికి కూడా కాగ్ వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ఈనాడు దాన్ని లోపల పేజీలలో చిన్న వార్త ఐటమ్ గా కవర్ చేసింది. అంతేకాదు వై.ఎస్.మాట్లాడుతూ “నివేదిక రూపంలో సలహా ఇస్తూంది. అంతే” అన్నాడు. మరి ఈనాడు రామోజీరావు కిమ్మనలేదూ ఎందుకని? ఎందుకనో?

ఇదిగో ఇలాంటి వ్యవహారాల్లో మీడియా ఎలాంటి పాత్ర నిర్వహించిందో, అదేవ్యూహాన్ని బి.జె.పి. రధయాత్ర, అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాల్లోనూ అనుసరించింది. అద్వానీ, ఉమాభారతి వంటి బిజెపి నేతలూ, సాధ్విరితింభర, గోవిందాచార్య, అశోక్ సింఘాల్, వినయ్ కతియార్ లాంటి ఆర్.ఎస్.ఎస్. నేతలూ తాము హిందూమతాన్ని రక్షించడానికే జన్మించినట్లూ, రామమందిర నిర్మాణానికే తమ జీవితాన్ని అంకితం చేసామంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలూ ఇచ్చేవాళ్ళు.

నిజంగా, మత ఘర్షణలు సృష్టించి, వేలాది అమాయకుల్ని హింసించీ, చంపీ ఏవిధంగా భగవానుడైన శ్రీరాముడికి గుడి కడతారో తెలియదు. నిజమైన హిందువు శ్రీరాముడు ఇటుకల తోనో, రాతిబండలతోనో కట్టిన గుడుల్లో మాత్రమే ఉంటాడని ఖచ్చితంగా నమ్మడు. నిజమైన హిందువు శ్రీరాముడు భక్తీ, ప్రేమానిండిన భక్తుల గుండెల్లోనే ఉంటాడని ఖచ్చితంగా నమ్ముతాడు. నిజమైన హిందువు మానవత్వం లేకుండా మతం ఉంటుందని ఖచ్చితంగా నమ్మడు. నిజమైన హిందువు భగవంతుడు సర్వాంతర్వామి అనీ, అంతటా ఉంటాడనీ నమ్ముతాడు. [హిందూ మతం గురించి, ఇతిహాసాల గురించి తరువాత చర్చిద్దాం.] భగవంతుడు మతానికీ, కులానికీ, జాతీయతకీ అతీతుడు. దేవుడందర్నీ ప్రేమిస్తాడు. దేవుడెప్పుడూ జనాలని చంపి తనకి గుడి కట్టమని చెప్పడు.

సాక్షాత్తూ భగవద్గీతే ఈమాట స్పష్టంగా చెబుతుంది.

శ్లోకం:
యో యో యాం యాం తనుంభక్తశ్శ్రద్ధయా ర్చితుమిచ్చతి
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధా మ్యహమ్ !

భావం:
ఎవరు యేరూపాన్ని ఆరాధిస్తే, వారికి ఆ దేవతయందే శ్రద్ధా, విశ్వాసము కలిగేలా – నేనే చేస్తాను.

కాబట్టే భారతీయులు, ముఖ్యంగా హిందువులు ‘పరమతసహనంతో ఉండటం’ అన్నది తమ మూలాల్లోనే కలిగిఉన్నారు. ముక్కోటిదేవతల్ని ఆమోదించే హిందువులకి మరింకో దేవుణ్ణి భరించటం పెద్ద సమస్యకాదు. కాబట్టే ఈ గడ్డమీదకి ఇన్ని మతాలు దురాక్రమణ చేసినా సహించారు. ఫకీరుల్ని సైతం ఆదరిస్తారు. కాబట్టే సాయిబాబాకి అష్టోత్తర, శత సహస్ర నామార్చనలు నడుస్తుంటాయి. బహు దేవతారాధన గురించి, విగ్రహారాధన గురించి ఇతరమతస్థులు ఎలాంటి దుర్భాషలాడినా, హిందువులు సంయమనంతో ఊరుకుంటారు. ‘వారి పాపాన వారే పోతారు’ అనుకుంటారు. సాక్షాత్తూ భగవద్గీతే వారికా ఆత్మ సంయమనం నేర్పింది.

అదీగాక, ఒకవేళ ముస్లింలే అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చిపారేసి మసీదుకట్టారను కుందాం. ముస్లింలే దేశంలోని 3000 చోట్ల హిందూ మందిరాలని పడగొట్టి మసీదులు కట్టారనుకుందాం. గతంలోని ఆ ముస్లింలకీ, నేటి ఆధునిక యుగంలోని బిజేపి, ఆర్.ఎస్.ఎస్. నాయకులకీ తేడా ఏమిటి? వారు మందిరం పడగొట్టి మసీదు కట్టారు, వీరు మసీదు పడగొట్టి మందిరం కట్టాలను కుంటున్నారు. గతకాలంలో ముస్లింలు ఏంచేసారో, అదే తప్పు ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్., బిజేపిలు చేయాలనుకుంటున్నాయి. అటువంటప్పుడు ఆనాటి ముస్లింరాజులూ మూర్ఖులైతే వీళ్ళూ మూర్ఖులే గదా?

గత చరిత్రలోని మహమ్మద్ గజనీ సోమనాధ దేవాలయాన్ని పలుసార్లు ధ్వంసం చేసి సంపదదోచుకు పోయాడు. ఎందరో ముస్లిం రాజులు, వాని అనుచరులూ ఎన్నోచోట్ల హిందూ గుడులు కూలగొట్టి మసీదులు కట్టారు. అది నిజంగా నీచమైన పని, అనాగరికమైన చర్య. నిస్సందేహంగా వాళ్ళు మూర్ఖులు, అఙ్ఞానులు. లేదా దైవభీతి లేని దుర్మార్గులు. ఎందుకంటే ఎవరూ ఏ ప్రాంతంలోని ప్రార్ధనా మందిరాలైనా నాశనం చేయకూడదు. ఎందుకంటే ఏ పేరుతో పిలిచినా దేవుడు దేవుడే గనుక, ఏ భాషలో ప్రార్ధించినా, ఏ పద్దతిలో ప్రార్ధించినా దైవప్రార్ధన దైవప్రార్ధనే గనుక.

అటువంటప్పుడు అయోధ్యలోని మీర్ బఖా i.e. బాబ్రీ మసీదు కూలగొట్టటం మాత్రం నీచమైన పని, అనాగరికచర్య కాదా? ఆర్.ఎస్.ఎస్., బిజేపి నేతలు మాత్రం మూర్ఖులు, అఙ్ఞానులూ, దైవభీతిలేని దుర్మార్గులూ కారా? శ్రీరాముడైనా, క్రీస్తయినా, బుద్దుడయినా తాను నిర్మించిన మానవ హృదయాన్ని, గుండెలనీ వదిలిపెట్టి, మానవులు నిర్మించిన రాతిబండల గుడుల్లోనే ఉంటానని చెప్పాడా? ఏ దేవుడు చెప్పాడు ఏదో వంకబెట్టుకొని ఇతర మతస్థులని చంపమనీ, ఇతరుల ప్రార్ధనా మందిరాలని కూల్చమనీ. శ్రీరాముడు చెప్పాడా అలాగని? అందునా సత్యాన్ని పాటించటానికి, ధర్మాన్ని ఆచరించటానికి రాజ్యాన్నే విడిచిపెట్టిన శ్రీరాముడు చెప్పాడా మత ఘర్షణలు లేపమనీ, రక్తం ఏరులై పారించమనీ, అమాయకుల్ని చంపమనీ? ఏ దేవుడు చెప్పాడు తోటి వాణ్ణి చంపమనీ, కుట్రదారులు గాక? సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిషు, అనువంశిక నకిలీ కణికుడు గాక ఏదేవుడైనా సాటి మానవుల్ని చంపమని చెబుతాడా?

ఆర్.ఎస్.ఎస్.,బిజేపిల వాస్తవ సంకల్పం మత ఘర్షణలు రేపటం తప్ప అయోధ్యలో మందిరనిర్మాణం కాదు. లేకపోతే తాము అధికారంలో ఉండగా 1999 నుండి 2004 వరకూ 5 ఏళ్ళు పాటు ఎందుకు అయోధ్యలో గుడికట్టలేదు? ఎన్.డి.ఏ.లో ప్రధాన పార్టీ బిజేపినే కదా! వాజ్ పేయి ప్రధాని బిజేపి వాడు కాదా, అద్వానీ స్వయంగా గృహామంత్రి కాదా? మరెందుకు తాము కేంద్రంలో అధికారంలో ఉండగా అయోధ్యలో గుడి కట్టలేదు? కోర్టు కేసు పరిధికి లోబడి కట్టలేదన్నది కారణమైతే [కొందరిలా వాదిస్తుంటారు] 1992 లో వారే కోర్టుల్నీ పరిగణనలోనికి తీసుకోలేదేం? స్యయంగా బి.జే.పి. యుపి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ [ఇటీవలే ఈయన ఎస్.పి.పార్టీలో చెరిపోయి ములాయం సింగ్ కి మిత్రుడైపోయాడు. సదరు ములాయం సింగ్ ఆనాడు ముస్లింల బాధ్యత భుజన వేసుకొని పోరాడాడు, కళ్యాణ్ సింగ్ హిందువుల కోసం రణోత్సాహం చూపించాడు] కోర్టుకి ఇచ్చిన వ్రాతపూర్వక commitment letters ని తుంగలో తొక్కి, కేంద్ర బలగాలని రానక్కర్లేదని నిక్కచ్చిగా చెప్పి, బాబ్రీ మసీదు కూలగొట్టేందుకు పరిస్థితులన్నిటినీ సానుకూలం చేసాడేం? [ఎటూ బాబ్రీ విధ్యంసం తర్వాత మతప్రతిపాదికన దేశం చీలితే, అప్పడిక కోర్టు ధిక్కారాలు, కోర్టుల్ని మోసం చేయండాలూ, ఏవీ తననేమీ చెయ్యలేవని కళ్యాణ్ సింగ్ అనుకున్నాడు కాబోలు! లేకపోతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, దేశ ప్రధానికి, కోర్టుకీ వ్రాతపూర్వకపత్రాలు ఇచ్చి, వాటన్నింటినీ ధిక్కరిస్తారా ఎవరైనా? 1992 లో కోర్టు, బిజేపి, ఆర్.ఎస్.ఎస్.ల్ని అయోధ్యలో మసీదు కూలగొట్టకుండా, మందిర నిర్మాణం ప్రారంభించకుండా ఆపలేకపోయింది. అలాంటప్పుడు 1999 నుండి 2004 వరకూ మాత్రం కోర్టు వారిని ఎలా ఆపగలిగింది?

రెండుసీట్ల నుండి ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితికి హిందూత్వ నినాదం తీసుకొచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు రామమందిరం నిర్మాణం చేయలేదు? పూర్తి మెజారిటీ కారణం అయ్యేటట్లయితే వీ.పి.సింగ్ ప్రభుత్వానికి బయటినుండి మద్దతు ఇస్తున్నప్పుడు, మద్దతు ఉపసంహరించుకొని మరీ, హిందూత్వ నినాదం కొనసాగించినప్పుడు, తామే అధికారంలో ఉండగా ఎందుకు రామమందిరం నిర్మించలేదు?

ఏవిధంగా చూసినా, వారి సంకల్పం అయోధ్యలో రామమందిర నిర్మాణం కాదు. నిశ్చయంగా వారి సంకల్పం బాబ్రీ మసీదుని కూలగొట్టడం. తద్వారా వారు భారతదేశం మతప్రాతిపదికన చీలిపోవాలని, 1990 లో USSR కుప్పకూలినట్లు కూలిపోయి ముక్కలూ చెక్కలూ కావాలని ఆశించారు. వారి నిజసంకల్పం ఇండియాని విడగొట్టటమే. పెరిస్త్రోయకాతో USSR కూలిపోయింది. ఇప్పుడు ప్రపంచపటంలో USSR ఉండదు. 19 ముక్కలుంటాయి. అలాగే ప్రపంచపటంలో భారత్ ఉండకూడదు. ఖలిస్తాన్, కాశ్మీర్, బోడోల్యాండ్, నాగాలాండ్, తమిళుల దేశం….. ఇలా….. ఒక రాష్ట్రం లేదా ఒక సంస్థానం ఒక దేశం అయిపోవాలని వారి ప్రయత్నం. ఈ రాజకీయకుట్రని వెనక పెట్టుకొని బిజేపి, ఆర్.ఎస్.ఎస్.లు తెరమీద మతాన్ని అడ్డుపెట్టుకున్నాయి.

ఒకసారి గుర్తు తెచ్చుకుంటే – 2005 లో బిజేపి నేత అద్వానీ పాక్ సందర్శనకి వెళ్ళి, జిన్నా సమాధిని దర్శించి, ’జై’ కొట్టివచ్చాడు. దానికి అద్వానీ ఏ పైకారణాన్ని[over leaf reason] అయినా చూపించనివ్వండి, కరాచీ నుండి వలస వచ్చిన ఈ బిజేపి నేతకి కుట్రలోగల భాగస్వామ్యాన్ని ఇది నిరూపించడం లేదా? మత ప్రాతిపదికన దేశం చీల్చుకెళ్ళిన జిన్నా ఈ హిందునేతకి ఎలా ఆరాధ్యడైనాడు లేదా అభిమాన పాత్రుడైనాడు?

భవిష్యత్తులో ఇలాంటి కరుడుగట్టిన హిందూ నేతలు, హిందువులుగా నటిస్తున్న ముస్లింలయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నిజమైన భక్తుడు, అతడు ఏమతానికి చెందిన వాడైనా సరే దేవుడి పేరు చెప్పి ఇతర భక్తుల్ని మోసగించలేడు, దేవుడికి వ్యతిరేకమైన పనీ చేయలేడు. కాబట్టే కుట్రదారులు హిందువుల మీద కుట్రకు హిందువుగా చెలామణి అయ్యే ముస్లింలనీ ప్రయోగించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదన్నది. లేదా నాస్తికులనైనా ఉపయోగిస్తారు. దేవుడి మీద నమ్మకమే లేని వాడికి, పాపపుణ్యాల మీద నమ్మకం ఉండదు కదా! అలాంటి వారు మతాల మీద కుట్రకు చక్కని పావులుగా ఉపయోగపడతారు.

ఉదాహరణకు – ఎన్.టి.ఆర్. సినిమా దానవీరశూరకర్ణ సినిమా డైలాగులు గుర్తుకుతెచ్చుకొండి. మాటల రచయిత సంస్కృత కళాశాల ప్రిన్స్ పాల్, నాస్తికుడూ అయిన కొండవీటి వెంకటకవి. నాస్తికుడు ప్రభుత్వ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ అవటం లోనే కుట్రదారుల గ్రిప్ కన్పిస్తోంది. ఎందుకంటే సంస్కృత వాఙ్ఞ్మయమే హిందూ భక్తి పూరితమైనది. ఈ నాస్తికుడు ఆ కళాశాలని ఎలా వృద్ధి చేస్తాడు? ఇక DVS కర్ణ, నిజానికి కర్ణా డాట్ కామ్ కాదు, దుర్యోధన డాట్ కామ్. ఈ సినిమాలోని హిందూ వ్యతిరేకత గురించి Coups On World లోని Coup on Indian Epics లో వివరించాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను. వెంటనే చూడాలంటే Fire Pot లో చూడగలరు.

ఆమధ్య వచ్చిన తెలుగు సినిమా ’ఆజాద్’[నాగార్జున, సౌందర్య నటించిన సినిమా]. అందులో విలన్ [రఘవరన్ వేసిన పాత్ర ] భారతదేశంలో మతఘర్షణలు రేపేందుకు పాక్ తరుపున వచ్చిన ముస్లిం. హిందూ సాధు వేషధారణలో ఉంటాడు. ఉద్వేగపూరితంగా ఉపన్యాసాలిస్తూ హిందువుల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. పైన ఉదహరించిన స్ట్రాటజీ ని ఆ సినిమాలో ఉపయోగించారు. ఇంతకు ముందే చెప్పినట్లు కుట్రదారులు [సి.ఐ.ఏ.,ఐ.ఎస్.ఐ.,బ్రిటిషు, అనువంశిక నకిలీ కణికుడు వారి అనుచరులైన రాజకీయనాయకులూ, కార్పోరేట్ కంపెనీలు] తాము పూర్తిగా వినియోగించుకున్నాకే, ఇక ఆ వ్యూహం ‘పాతబడి పోయింది’ అన్నాకే సినిమాల్లోనూ, నవలల్లోనూ ఉపయోగించి, చివరి ప్రయోజనం పొందుతారు. అంటే ఆ స్ట్రాటజీని బహిరంగపరచి డబ్బుగా మార్చుకుంటారన్నమాట.

ఇలాంటి స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగించారో లేదో గానీ, బాబ్రీ – మందిర్ సమస్యని సజీవంగా ఉంచేందుకు మాత్రం అద్వానీ వంటి హిందూ ఉగ్రనేతలూ, ఇమాం బుఖారీ వంటి ముస్లిం ఉగ్రనేతలూ ఇతోధికంగా తమ పాత్రల్ని పోషించారు. తమ వేడి వేడి ఉపన్యాసాలతో మరింత తీవ్ర మత ఘర్షణలకి తెరతీసారు. ఈ నేపధ్యంలో 1990 లో హైదరాబాద్ లోని పాతబస్తీ లోనూ హింస చెలరేగింది. కుట్రదారుల స్క్రిప్ట్ ప్రకారం ఎటూదాని ఏజంట్లు హిందూ ముస్లిం, రెండు వర్గాల్లోనూ చేరిఘర్షణలూ, హింసా వ్యాప్తి చేసారు. వ్యవస్థీకృతంగా, ఒక పద్దతిప్రకారం హింస ఇతర చోట్లకూ ప్రాకింది. రెండు వర్గాల్లోనూ ప్రజలు చంపబడ్డారు. కొందరు గాయపడ్డారు. కిరాయి గూండాల వంటివారు వయో తారతమ్యలు, స్త్రీపురుష భేదాలు లేకుండా ప్రజలపై దాడి చేసారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

well said,

"అదీగాక, ఒకవేళ ముస్లింలే అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చిపారేసి మసీదుకట్టారను కుందాం. ముస్లింలే దేశంలోని 3000 చోట్ల హిందూ మందిరాలని పడగొట్టి మసీదులు కట్టారనుకుందాం. గతంలోని ఆ ముస్లింలకీ, నేటి ఆధునిక యుగంలోని బిజేపి, ఆర్.ఎస్.ఎస్. నాయకులకీ తేడా ఏమిటి? వారు మందిరం పడగొట్టి మసీదు కట్టారు, వీరు మసీదు పడగొట్టి మందిరం కట్టాలను కుంటున్నారు. గతకాలంలో ముస్లింలు ఏంచేసారో, అదే తప్పు ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్., బిజేపిలు చేయాలనుకుంటున్నాయి. అటువంటప్పుడు ఆనాటి ముస్లింరాజులూ మూర్ఖులైతే వీళ్ళూ మూర్ఖులే గదా"

ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే అందులో వాళకొక లాభమైనా వుంది (అధికారం). కానీ.. వాళ్ళన్నమ్ముకొని మతమనగానే లాగులెగబట్టుకొని లగెత్తుకొంటూవెళ్ళి మనలో మనం ఒకర్నొకరు చంపుకొంటున్నామే(మన కుటుంబాల్నీ, మన బాధ్యతల్నీ మానుకొని మరీ) అందుకు... అందుకు మనం మూర్ఖశిఖామణులం.

అదలావుంచండి కాసేపు. వివాదాస్పద మైన భూమి నమాజుక్కూడా పనికిరాదని చెపుతారు(ఇలా ఖురాన్ లో వుందట. ఖురాన్ చదివిన వారెవరైన దీన్ని గురించి మాట్లాడితే బాగుంటూంది) మన వాళ్ళక్కడ మసీదు పుననిర్మిస్తారట తద్వారా ఇస్లాం గౌరవాన్నినుమడింపజేస్తారట (అవసరమైతే ఖురాన్ని కాదని మరీ). ఈ ముల్లాలు మౌల్వీలు అవసరమనుకొంటే ఖురాన్ని కూడా తిరగేసిరాయగలరు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu