‘ఎన్నికలొచ్చి పడ్డాయి. ఏం చెయ్యాలబ్బా?’ అనే టపాలో కామెంట్లలో లోకసత్తా గురించి వ్రాసారు. నేను లోక సత్తాని మరిచిపోలేదు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఒక్కప్పటి ఐ.ఏ.ఎస్. అధికారి. ఆయన వ్రాసిన వ్యాసాలు, సిద్దాంతాలు చాలానే చదివాను. అన్నీబాగానే ఉంటాయి. కానీ, సామాన్యులం మనకే ఇంతగా మీడియా మాయాజాలం కన్పిస్తూంది గదా, జె.పి. మాత్రం ఎప్పుడూ మీడియాకి వ్యతిరేకంగా మాట్లాడడు, విమర్శించడు, నామామాత్రపు విమర్శలు తప్ప! మిగిలిన విషయాల్లో ఆయన చూపెట్టే తార్కికత మీడియా విషయంలో ఉండదు. మౌనమే ఉంటుంది. ఆ విధంగా జే.పి. తన పరిధిని చూపించుకుంటాడు. అతనికి తప్ప, పార్టీలో మిగిలిన నాయకులకెవ్వరికి ప్రచారం కూడా ఉండదు. సెజ్ ల మీదగాని, అవినీతి మీద గాని, దేని మీదా ఉద్యమాలు చేపట్టినట్లు ఇప్పటి వరకూ చూడలేదు. కనీసం Administration ఉద్యమం కూడా చూడలేదు. పేపరు స్టేట్ మెంట్ లకి మాత్రమే పరిమితమైన పార్టీగా వ్యవహరిస్తుంటుంది. ప్రజల్లో కెళ్ళకుండా ప్రజల కోసం ఏంచేస్తారో తెలియదు. చెట్టు మూలానికి చీడ సోకి ఉంటే, కొమ్మలకి వైద్యం చేసి ఫలితమేమిటి?
ఇక లోక్ సత్తా పార్టీ గురించి: అందులో క్రింది స్థాయి నాయకుల అవినీతి గురించి 2000సం. లో సూర్యాపేటలో నాకు చాలా దగ్గర నుండి తెలుసు. అప్పట్లో నల్గొండ జిల్లా లోక్ సత్తా కన్వీనరో, సూర్యాపేట మండల స్థాయి కన్వీనరో [పదవి నాకు బాగా గుర్తులేదు] సూర్యాపేట నివాసి. అప్పటి కింకా లోక్ సత్తా రాజకీయ పార్టీగా పరిణమించలేదు. ఆయన, ఇంకొకరు రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు! ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు గ్రహీత ఒకరు, ‘రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు గ్రహీత ఇంకొకరు. అంతేగాక టీచర్స్ యూనియన్ లలో పదవులు కూడా నిర్వహించేవారు. సూర్యాపేటలోని ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ అభివృద్ది వెనుక వాళ్ళ హస్తం ఉంది. వాళ్ళు ఒకరకంగా గాడ్ ఫాదర్స్ అన్నమాట. సూర్యాపేటలో 7తరగతి పరీక్ష పేపరు నుండి D.S.C. వరకూ ఏ పరీక్ష పేపరయిన దొరుకుతుంది. అంతగా వీళ్ళ గ్రిప్ ఉంది. కార్పోరేట్ కాలేజీలకి అనధికార PRO లుగా పనిచేసేవారు. అంటే, తమ స్కూళ్ళల్లో చదివే పిల్లల్ని, ఎంత మందిని కార్పోరేట్ కాలేజీల్లో చేర్పిస్తే, ‘per head ఇంత’ అని కమిషన్ వస్తుంది. పైగా తమ పిల్లలకి Inter mediate, Long term intensive coaching free.
ఈ స్థితిలో ఓ సారి ఆ వూర్లో కేబుల్ ఆపరేటర్లు పోటాపోటీ పడి నెలసరి రుసుము 35/-Rs. ల దాకా పడేసారు. ఆపైన ఇద్దరూ రాజీపడ్డారు. ఒకరు రెండోవారి కనెక్షన్స్ అన్నీ కొనేసి ఊరంతటికీ monopoly అయిపోయారు. వెంటనే కేబుల్ టి.వీ. రుసుము అమాంతం పెంచేసారు. దాంతో ఆ వూర్లో ఓ యువడాక్టర్ వినియోగదారులందర్నీ కలుపుకొని, “అది మరీ అన్యాయమనీ 60/- రూ.లు తీసుకోవాలని” దాదాపు చిన్నసైజ్ ఉద్యమం చేశాడు. పోటీపడి అంత తక్కువకి ఇచ్చినప్పుడు గిట్టుబాటు కాకపోవటం ఉండదంటూ ఊర్లో అందరూ ఏకమయ్యారు. దాదాపు ఉద్యమం సఫలమయ్యేసమయంలో ఈ టీచర్[టి.ఎల్.నరసింహారావు] [పేర్లతో సహా Coups on World లో ఉన్న Documentary Evidence లో ఉన్నాయి. అప్పటికి నన్ను వేధిస్తున్న వారి వెనుక స్థానిక కారణాలే చూశాను. Ready reference కోసం Fire Pot లో ఉంచుతున్నాను.] రంగప్రవేశం చేసి అసలైన వినియోగదారుల సంఘం తమదేనని, అసలా కుర్రడాక్టరు తన విధినిర్వహణలో చాలా అవకతవకలకి పాల్పడాడనీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కరపత్రాలు పంచారు[ఆరోపణలే తప్ప అసలువిషయం లేదు ఆ కరపత్రాలలో]. కొన్నిరోజులకి కుర్రడాక్టరు సెలవుపెట్టుకు వెళ్ళిపోయాడు. తర్వాత బదిలి అయిపోయాడు. ఉద్యమం నీరుగావిపోయింది. చాలా మామూలుగా కెబుల్ టివీ అపరేటరు [monopoly] అయిపోయాడు గనుక ముక్కుపిండి జనాల దగ్గర్నుండి నెలకు 75/-రూ. తో మెదలుపెట్టి వసూలు చేసుకున్నాడు. తరువాత మేము ఆవూర్లో లేములెండి ఎంతదాకా పెంచారో తెలియదు.
ఇదంతా దగ్గరనుండి చూసాక, సూర్యాపేటలో నా కేసు విషయమై స్థానిక TDP, Congress, ఇతర నాయకుల దగ్గరికి వెళ్ళాను గానీ, లోక్ సత్తా దగ్గరికి అసలు వెళ్ళలేదు. అప్పట్లో అంత ప్రచారం కూడ లేదు. తరువాతే దానికి బాగా ప్రచారం వచ్చింది. అలాంటి క్రింది స్థాయి నాయకుల గురించి జేపి గారికి తెలియదంటే నిజం నాకు తెలియదు గానీ, రాజకీయ పార్టీగా అవతరించక ముందే అదీ పరిస్థితి. లోక్ సత్తాలో అందరూ ఇలాగే ఉన్నారో లేదో నాకు తెలియదుగాని, నా అనుభవం మాత్రం ఇదీ. అందుకే లోక్ సత్తా గురించి నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఏ రాయి అయినా ఒకటే కదా పళ్ళుడగొట్టుకోడానికి? అందుకే ’ఎవరికి ఓటెయ్యాలి అని కాదు ఆలోచించాల్సింది, ఏం చెయ్యాలి అని’ - అన్నాను.
మీరన వచ్చు – “అందరూ అందరే అంటున్నారు. రాజకీయాల్లో ఎవరూ మంచివాళ్ళు లేరంటున్నారు. ప్రభుత్వాలు ప్రతిపక్షాలూ తేడా లేకుండా అన్ని పార్టీలూ కుట్రదారుల మద్దతుదారులే అంటున్నారు. చెట్టువేళ్ళతో సహా చీడపట్టింది, కొమ్మరెమ్మలకి వైద్యం చేస్తే ఏమిటిలాభం అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉన్న చెట్టుని కూలగొట్టినా మరో వృక్షం ఎక్కడి నుండి వస్తూంది? మరైతే ఏం చెయ్యాలి” అని.
అవును! కొమ్మరెమ్మలకి వైద్యం అనవసరం. వ్యవస్థ అనే వృక్షాన్ని వేళ్ళతో సహా కూల్చేస్తే మరో నీడ ఏది? అన్న ప్రశ్న కూడా నిజం.
మరేం చెయ్యాలి? - ఇదీ ప్రశ్న. దీనికి జవాబు వెదికే ముందు ఓ పోలిక చెబుతాను.
భారతీయుల ఆత్మకి ప్రేరణా, స్ఫూర్తి ఇతిహాసలే. అందులో మన ఆది కావ్యం, రామాయణాన్నే తీసుకుందాం. శ్రీరాముడు అడవిలో ఉన్నాడు. మాయలేడి మాయలో పడి సీతని పోగొట్టుకున్నాడు. సీత తన ప్రాణం, తన జీవితం, తన సర్వస్వం. ఎవరెత్తుకెళ్ళారో తెలియదు. ఎందుకు, ఎక్కడికి, ఎలా అపహరించుకు [దొంగిలించుకు] పోయారో తెలియదు.
సీత కోసం రాముడు అడవిలో వెదికాడు. ఏడ్చాడు. మూర్ఛపోయెంత ఏడ్చాడు. ఏడుస్తూ వెదికాడు. వెదుకుతూ ఏడ్చాడు. అయితే వెదికే ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఆ ప్రయత్నంలోనే ఆయనకి జటాయువు కనబడ్డాడు. సీత ఆచూకీ చెప్పాడు. సీతని ఎవరు ఎత్తుకెళ్ళారో తెలిసింది. ఇంకా వెదుకుతూనే ఉన్నాడు. శబరి కనిపించింది. సీతని ఎలా రక్షించుకోవాలో చెప్పింది. ఋష్యమూక మ్మీది సుగ్రీవుడితో స్నేహం చెయ్యమంది. హనుమంతుణ్ణి కలుసుకోమంది. సుగ్రీవుడితో నెయ్యం సీతని వెదికి పెట్టింది. వారధిని నిర్మించాడు. లంక చేరాడు. రాక్షస సంహారం చేశాడు. రావణుణ్ణి వధించాడు. సీతని తిరిగి పొందాడు.
ఆలోచించి చూడండి. ఇప్పటి స్థితిలో ప్రతి భారతీయుడూ[సత్యాన్వేషి మాత్రమే] ఓ రాముడే. అవును మనం రాముడి వంటివారమే. అంతూదరి లేని యాంత్రికపుటడవిలో తిరుగుతున్నాం. ఉరుకులూ, పరుగులూ, ఉద్యోగాలు వ్యాపారాలూ! చుట్టూ అన్నీ అడవిపొదలే! క్షణం తీరిక లేని, మన గురించి మనం ఆలోచించుకోలేని హడావుడే. అన్నీ ముళ్ళే.
శాంతి సౌఖ్యాలని పొగొట్టుకున్నాం. ప్రశాంతతనీ, శారీరక మానసిక ఆరోగ్యాలనీ పోగొట్టుకున్నాం. సంస్కృతినీ పోగొట్టుకున్నాం. మంచిమీద, సత్యం మీద నమ్మకాన్ని కోల్పోయాం. అదే మన సీత. కాబట్టి మనం సీతని కోల్పోయిన రాముడిలాంటి వాళ్ళమే. ఖచ్చితంగా చెప్పాలంటే ఆత్మోన్నతి, అధ్యాత్మిక ఉన్నతి అనే సీతని పోగొట్టుకున్నాం. ‘తుమ్మితే ఊడే ముక్కులాంటిది, చచ్చినా మన వెంటరానిది, ఎంతమాత్రం శాశ్వతం కానిది అయిన ఆర్ధిక అభివృద్ది ఒక్కటే నిజమనే’ మాయలేడి వెంటపరుగులు పెడుతున్నాం.
కార్పోరెట్ కంపెనీలు, కుట్రదారులు, వారి మద్దతుదారులూ, రాజకీయాలూ, రాజకీయనాయకులూ – వీటన్నిటి ఉమ్మడి రూపం రావణాసురుడు. ఔను! మన సీతని రావణాసురుడు అపహరించుకు పోయాడు.
అన్వేషణ ఆపని ధీరుడు రాముడు! రాక్షసుల్ని సంహరించి తన సీతని తాను పొందినట్లే ప్రతీ మనిషీ ప్రయత్నిస్తే……. గెలవ లేమా? రావణుడు ఎంత ధన, సాధన సైన్య సంపత్తి ఉన్నవాడైనా రాముడి ధర్మబలం ముందు, నైతిక బలం ముందు ఓడిపోక తప్పలేదు కదా! సీతని రక్షించుకునే మార్గం, సీతని తిరిగి పొందగలిగే మార్గం లేనే లేదా?
దీనికి జవాబు స్వానుభవంతో తెలుసుకోవలసిందే. ఒక్కటి మాత్రం నిజం. ఇంతగా కుట్రలు జరుగుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా, ఇంకా ఈ గడ్డ సజీవంగా నిలిచి ఉందంటే, ఇక్కడి సంస్కృతీ చైతన్యం ఇంకా మిగిలే ఉందంటే, ఇక్కడి ఆత్మల్లో ఇంకా ఆర్తి మిగిలే ఉందంటే – కారణం మన ఇతిహాసాల పునాదే. అవి మనకి ఇచ్చే స్ఫూర్తి, భగవద్గీత మనకి ఇచ్చే శక్తి.
కాబట్టి మార్గం ఉంది. ఉంటుంది. కాకపోతే ’వర్షం’సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా “వెదకాలి. వెదికితే దొరకనిదేమీ లేదు” అంతే.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
13 comments:
*ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా “వెదకాలి. వెదికితే దొరకనిదేమీ లేదు. *
Ramakrishna Paramahamsa also said
"There are pearls in the deep sea, but one must hazard all to find them. If diving once does not bring you pearls, you need not therefore conclude that the sea is without them. Dive again and again. You are sure to be rewarded in the end. So is it with the finding of the Lord in this world. If your first attempt proves fruitless, do not lose heart. Persevere in your efforts. You are sure to realize Him at last. "
మీరన్నది నిజమే. జే. పీ తక్కా ఇంకా పార్టీలో ఓలున్నారో నాకైతే తెల్వద్. :)
నాకు కూడా జె.పి తప్ప మిగతావారు తెలియదు. అయితే జె.పి చెప్పే సిద్దాంతాలు ఐడియలిష్టిక్ గా ఉంటాయి. చూద్దాం ఏమి జరగబోతోందో
చాలా బాగా చెప్పారు.మనం వెతకాలి... వెతకాలి...వెతుకుతూనే ఉండాలి. మన గమ్యం చేరేదాకా.మన రామాయణం,మన భగవద్గీత, మన భారతం, మన భాగవతం మనకు దారిచూపిస్తూనే ఉంటాయి. వాటి సహాయం మనకెప్పుడూ ఉంటుంది.అందిపుచ్చుకోవటమే తరవాయి.
"అతనికి తప్ప, పార్టీలో మిగిలిన నాయకులకెవ్వరికి ప్రచారం కూడా ఉండదు."
ఈ విషయం మీద పార్టీలో కూడా ఇంతకు ముందు చర్చ జరిగింది.(జేపీకి ప్రత్యామ్నాయం అంటూ ఉండాలన్న విషయం మీద). ఈ నాటికీ "లోక్ సత్తా అంటే జేపీ, జేపీ అంటే లోక్ సత్తా " అన్న అభిప్రాయమే ప్రజల్లో ఉంది. మిగతా నాయకులు గానీ, (వర్మ, ప్రతిభా రావు తప్పించి)కార్యకర్తలు గానీ ఎవరికీ తెలియదు. పోటీ చేసే అభ్యర్థులకు కూడా ప్రచారం ఉండదు. ఒక్క జేపీ తప్పించి పార్టీలో ఇంకెవరూ పార్టీ విధానాల మీద కానీ, అవినీతి గురించి కానీ,మీడియా గురించి కానీ మాట్లాడగా కనపడదు. అధికార ప్రతినిధి(official spokes person) అంటూ ఎవరున్నారో తెలియదు.టీవీ ప్రకటనల్లో అయినా జేపీ తన సేన(అభ్యర్థుల)తో పాటు కనపడతారా అంటే అదీ లేదు.
మహిళా కార్యకర్తలను, బెల్టు షాపులను మూయించడం, మద్యనిషేధానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం వంటి చిన్న పాటి పనులకు ఉపయోగించడం తప్పించి పార్టీ లో మేథోపరమైన చర్చల్లో భాగస్వాములుగా చేయడమ్నన్నది లేదు.ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థుల్లో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి తప్ప, మరెక్కడా మహిళా అభ్యర్థులున్నట్టు కనపడదు.
ఎన్ జీవో గా లోకసత్తా వోట్ల విషయంలో ప్రజలను చాలా జాగృతం చేసింది. ఎన్నికల కమిషన్ కూడా సర్వేల్లో సంస్థ సహాయం తీసుకుంది.పార్టీగా లోక్ సత్తా ఈ విషయాలన్నింటినీ విస్మరించింది. "ప్రభుత్వం ప్రతి వ్యక్తి మీదా ఇంత ఏడాదికింత ఖర్చు పెట్టాలి.మనం తాగే ప్రతి రెండురూపాల టీకప్పులో పది పైసలు ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది" అంటూ జేపీ కాస్తో కూస్తో చదువుకున్న వాళ్లకర్థమయ్యే విషయాలు మాట్లాడతారు కానీ, చదువుకోని నిరుపేద వోటర్ల జోలికెళ్లరు.ఇది కొంచెం అసంతృప్తి కలిగించే విషయం.
అవినీతి గురించి కూడా! మీరు చెప్పిందే కాక మెదక్ జిల్లాలో కూడా పార్టీ పేరు ఉపయోగించి పార్టీ నాయకులు కొన్ని (చిన్న పాటి)అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ప్రజల్లోకెళ్లకుండా,పేపర్ స్టేట్మెంట్ లతోనూ, టీవీ ఛానెళ్లలో "అవినీతి రాజెకీయనాయకులను తరిమికొడదాం" అన్న స్క్రోలింగ్ లతోనూ ఎంత వరకూ ఓటర్లను ఆకట్టుకోగలుగుతారో అర్థం కాని విషయం.
రాముడి వెదుకులాట జటాయువు వల్ల ఒక కొలిక్కొచ్చింది. మన వెదుకులాటకు అంతమంటూ లేనట్లుంది.
j.p jindabad
మీరన్నది నిజమే,జెపి తర్వాత స్ధాయిలో ఎవరుంటారో నాకు ఇంతవరకూ తెలియదు. దీనిగురించి అలోచించాలి.
విశ్వనాధ వారు వేయి పడగలలో అన్నట్టు, ఈ జాతి కూకటివేళ్ళతో పెకలించబడినా ఒక చిన్న అమృత హస్తం అందినా మళ్ళీ శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది.
ఈ మాత్రం ఆదర్శాలు, విధానాలే ప్రజలకి అసాధ్యంలా కనపడుతున్నాయి. ఏ పార్టీ వీళ్ళతో కలిసి సాగడానికి ముందుకు రావటంలేదు.
ఇంకా గొప్పగా ఉండాలంటే ప్రాక్టికల్ గా కుదరదు.
పార్టీగా మారకముందే ఎన్నో విషయాలు ప్రజలకి చెప్పారు.
కొంతమంది చెడ్డవాళ్ళు ఉండవచ్చు అయినా మిగతా పార్టీలతొ పోలిస్తే లోక్ సత్తా బెటరే.
1)loksatta is only party encouraging young,honest,middle-class people.(In the last bye election the candidates i know are katari srinivas, lecturer from CBIT, an IIM student and two software engineers)
2)we have seen parties internal democracy way of functioning. Think of the party as platform for us to vent our anger against existing plitics. Even after having this system if criminals are in the party we have to blame ourself for not having taken this oppurtunity.
3)i would say their manifesto is an ideal one including everything we need today.
4)Regarding only JP appearing in the media, a viewer called JP about this and he said we have a lot of young minds in our party. we always invite these channels to bring them before people. but the channels never show up.
after all these channels are more intersted in showing uncensored versions of roja-shoba abuse wars aren't they?
And also since people are only buying what sells well they are forced to project him.
5)loksatta has more intellectuals, most people from middle class and good representation from all sections of society, more women thanks to its internal democracy.
6)I would say this is our last oppurtunity for better politics. If they fail no one is going to come again like this. sure there may be some irregularities but please look at the bigger picture and they are way better than other parties.
7)I wanted to write a line about congress, tdp, prajarajyam and their scandals, money hunger and their free policies (they may be able to for a while, because of growing economy and they take no responsibility to support that growth but just to destroy it) well every one knows. isn't it?
8)Adi Laksmhi garu, we need people like you in politics and my sincere request is to join loksatta and participate in politics. we have seen for a long time all the criticizing changes nothing and its time we jump into to action.
Iam 22 now and after 3 years i sincerely wish to participate in politics and work for the society.
ps:sorry for any of my ignorance.
Anonymous గారు,
నేను కేవలం రాజకీయాలని, రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకులని విమర్శించడం లేదండి. ఈ రాజకీయ నటీనటుల మీద, వీరిని నడిపిస్తున్న మీడియా దర్శకుడి మీద, వారి కుట్రల మీద 16 ఏళ్ళుగా పోరాడుతున్నాను. ఒక్కసారి నా ఆంగ్ల బ్లాగు ‘Coups On World’ లోని 97 complaints నీ, వాటి పూర్వాపరాలతో కూడిన Events List నీ పరిశీలించండి. అప్పుడు, నావి మాటలో చేతలో వ్యాఖ్యానించండి.
ఇంతకు ముందే నాటపాల్లో చెప్పినట్లు, నేనేదీ ఆశించి ఈ బ్లాగు వ్రాయడం లేదు. నిజాలు చెప్పాలని మాత్రమే వ్రాస్తున్నాను. కాబట్టి రాజకీయాల్లోకి రావడానికో, లేక నా మేధావితనాన్ని చూపెట్టుకోడానికో ఈ వేదికని ఉపయోగించుకోవడం లేదు.
ఇకపోతే మీరు మరో 3ఏళ్ళ తర్వాత రాజకీయల్లోకి ప్రవేశిస్తే, అప్పుడు మీకన్నీ విజయాలు కలిగి అందరికి నిజాయితీగా సేవ చేయలని ఆశిస్తూ………శుభాకాంక్షలు.
ఆదిలక్ష్మి గారు,
నేను మీ టపాలు చాలా వరకు చదివానండి. రొజూ మీ బ్లాగు చూస్తుంటా.
మీలాంటివారు ఈ కుట్రదారులకు వ్యతిరేఖంగా చేసే పొరాడటం కన్నా ప్రత్యక్ష రాజకీయాలలొకి వచ్చి వీరికి స్థానం లేకుండా చేస్తే ఎక్కువ
ప్రయోజనం వుంటుందేమో అని నా ఆశ
తప్పుగా వ్యక్తపరిచినందుకు మన్నించండి.
Anonymous గారు,
నేను మీకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. అది, శ్రీశ్రీ కలం, ఘంటసాల గళంల నుండి మన గుండెల్లోకి దూసుకొచ్చిన పాట “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా”.
మనోహర్ చెనికల గారు,
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా నా టపా చదివి వ్యాఖ్య వ్రాస్తున్నందుకు కృతఙ్ఞతలు. మీరు ప్రస్తుతం విశ్వనాధవారి ‘వేయి పడగలు’ చదివిన స్ఫూర్తితో జ్వలించి పోతున్నట్లున్నారు.
నాకూ ఒకోసారి అన్పిస్తుంది, విశ్వనాధ వారు ఆ రోజుల్లోనే ఎంతగా కుట్రని పసిగట్టగలిగారు కదా అని! అలాగే వెళ్తే జరగబోయే భ్రష్ఠతని ఎంత ముందుగా అంచనా వేయగలిగాడాయన? విష్ణుశర్మ అంటాడు చూడండి, "నేను నేనని నువ్వు చెప్పేదేమిటి? నాకు తెలియదూ నేను నేనేనని?" అంటూ, వ్యక్తి కంటే వ్యక్తి ధృవీకరణ పత్రాలకి ప్రాముఖ్యత పెరగటం అన్న సందర్భంలో అలా నిరసిస్తాడు. నిజంగా విశ్వనాధ వారి మేధస్సు, దూరదృష్టి నాకు అబ్బురమని పిస్తుంది. అందుకేనేమో అప్పట్లో ఆయన గురించి అహంకారి అనీ, అదనీ ఇదనీ ఆయన్ని విసిగించింది అప్పటి మీడియా. తనకి తాను మహాకవి అనుకుంటాడని 70 వ దశకం చివరల్లో దుమ్మెత్తి పోసింది. చివరికి ఆయన “ఆవును. ఈ యుగానికే మహాకవిని నేను” అన్నాడట. దాంతో మరింత గోల పెట్టారు.
Post a Comment