నేను Documentary Evidence పేరిట, Coups On World లో ఉంచిన Complaints File ని ఎలా అధ్యయనం చేయాలో వివరించే ప్రయత్నం చేస్తాను.

Govt. Administration అర్ధం కావడానికి ఒక ఉదాహరణ వివరిస్తాను.

మీరు కారులో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. మీ కారుని ఇంకో కారో, లారినో ఢికొట్టింది అనుకుందాం. మీకు, మీ కారుకి ఇన్సూరన్స్ ఉన్నది. మీరు వెళ్ళి హాస్పటల్ లో చేరి దెబ్బలు తగ్గించుకొని, తీరిగ్గా ఇన్సూరన్స్ ఆఫీసుకు వెళ్ళి ‘నా కారుకి ఫలానా సమయంలో ఏక్సిడెంట్ అయ్యింది, కారు రిపేరుకి ఇచ్చాను, ఇన్సూరన్స్ కట్టాను కాబట్టి నా ఖర్చులు ఇవ్వండి’ అంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసుకి వెళ్ళి, వాళ్ళను అలాగే అడిగితే వారు ఇవ్వరు. మరీ ఎలా మనకు నష్టపరిహారపు సొమ్ములు వస్తాయి?

ఎలాగంటే – ఏక్సిడెంట్ అయిన వెంటనే, దగ్గర నున్న పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. మీకు దెబ్బలు తగిలితే ఆ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ట్రామా హాస్పటల్ లో చేర్చి మీకు చిక్సిత చేయిస్తారు. అదే సమయంలో మీకారు ఇన్సూరన్స్ చేయించుకున్న కంపెనీకి సమాచారం పంపిస్తారు. అప్పుడు సదరు కంపెనీ సర్వేయర్ వచ్చి బండిని రకరకాల కోణాలలో ఫోటోలు తీసుకొని, పోలీసుల చేత సంతకాలు తీసుకొని ఆఫీసులో ఫైల్ చేస్తాడు. ఆసుపత్రి నుండి మీ దెబ్బలకి సంబంధించి డాక్టరు దగ్గరనుండి సర్టిఫీకెట్ తీసుకొని మీ హెల్త్ ఇన్సూరన్స్ కంపెనికీ క్లెయిమ్ చేసుకుంటారు. వీటన్నింటిలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ క్లెయిమ్ లు ఆఫీసులో ఫైళ్ళరూపంలో ప్రాసెస్ జరిగి నిజంగానే మీకారు ఏక్సిడెంట్ అయ్యిందని, మీకు నిజంగానే దెబ్బలు తగిలాయని నిర్ధారణ జరిగి, మీకు నష్టపరిహారపు సొమ్ములు చెల్లింపుజరుగుతుంది. అది తేలటానికి ఎన్ని రోజులు, నెలలు, లేదా సంవత్సరాలు పట్టినా గానీ, అప్పుడు జరిగిన సంగతులు మీరు మరచిపోయినా గానీ, ఆఫీసులో దాని తాలుకూ ’నిజం’ ’రికార్డు’ చేయబడింది అన్నమాట. దానికి తిరుగులేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని Administration అంటారు. ఈ Administration ఏమి జరపకుండా, మీకు ఏక్సిడెంట్ అయిన వ్యవహారాన్ని, కారు నష్టాన్ని, హాస్పటల్ బిల్లు గురించి, మీరు మీకాగితాలలో వ్రాసుకొని, కొన్ని సంవత్సరాల తరువాత బ్లాగులో పెట్టు కుంటే వాటికి విలువలేదు. నాకు సాధ్యమైనంతలో క్లుప్తంగా Govt. Administration గురించి వివరించాను. అలాగే నేనూ ఫిర్యాదులు వ్రాసుకొని, ఇంట్లో పెట్టుకొని, ఇప్పుడు బ్లాగులో పెడితే వాటికి విలువ ఉండదు.

అవినేను వ్రాసిన ఫిర్యాదులే. కాని వాటిని సంబంధింత అధికారికి పంపించాను. అక్కడ న్యాయం జరగలేదు, అతని కంటే పైఅధికారికి పంపించాను. అది ఒక్క డిపార్ట్ మెంట్ మాత్రమేకాదు. వాటర్, కరెంట్, పోలీసు స్టేషన్, ఇంటర్ బోర్డ్, ఎంసెట్, డి.ఇ.ఒ., 7th కామన్ ఎగ్జామ్స్ బోర్డు, సి.ఎం పేషి, గవర్నర్, పి.ఎం. ఆఫీసు, AICC , కేంద్ర హోమ్ అఫైర్స్, ప్రెసిడెంట్ , హైకోర్టు, మానవహక్కులు, కలెక్టర్, ఎస్.పి., దేవాదాయ శాఖ, లోకల్ ఆఫీసులతో సహా అన్ని ఆఫీసులతో వేధింపుల విషయమై కరస్పాండెన్స్ లేదా కంప్లైట్స్ చేస్తూ నడిపిన వ్యవహారాలే ఆ కంప్లైట్స్. అంటే నన్నువేధిస్తున్నారు అన్నవిషయం రికార్డు చేసానన్న మాట.

అలా దానిని క్రింది ఎస్.ఐ. స్థాయి నుండి ప్రెసిడెంట్ స్థాయి వరకూ నాకు న్యాయం జరగలేదన్నది Administrational రికార్డ్ చేసి, Prove చేసాను. అది అర్ధం అవ్వటానికి నేను బ్లాగులో వ్రాసినట్లు కథలాగా ఉండదు. ఆఫీసు Administration అర్ధమయ్యేవాళ్ళకి, ప్రభుత్వ ఆఫీసులో వాళ్ళకి వాటి ప్రాసెస్ అర్ధమవుతుంది.

ఈ Administration పద్దతిలో ఏ ఫైలుని, అధ్యయనం చేసినా, ఏ స్థాయిలో ఏంజరిగిందో, ఎక్కడో ఏ.సి.రూం లో కూర్చున్న పైస్థాయి అధికారి గుర్తించగలడు. అలాగే అవగాహన, తగినంత ఙ్ఞానం కలిగిన మంత్రి /ముఖ్యమంత్రి /ప్రధానమంత్రి గుర్తించగలడు. అదే పద్దతిలో నేనీ కేసుని నిరూపించాను.

ఇక్కడో ఉదాహరణ చెబుతాను.

ఒక ఐ.పి.ఎస్. అధికారి జిల్లాలో ఫిర్యాదులను చూసి అక్కడి క్రైమ్ రేట్ లెక్కిస్తాడు. క్రిందిస్థాయిలో పోలీసులు, రాజకీయనాయకులు, రౌడీలు మామూళ్ళు పంచుకుంటూ, లోకల్ పెదరాయుళ్ళ తీర్పులిస్తూ, జనాలు ఎవ్వరూ ఫిర్యాదు చేయకుండా చూసారనుకొండి. అప్పుడు అక్కడ పోలీసు రికార్డ్ ప్రకారం శాంతి వెల్లివిరుస్తున్నట్లు. నిజానికి అలా ఉందా? అంతేగాక అప్పుడు పై అధికారికి ఏం తెలియదు అనుకుంటాం. కాని, ఎస్.పి.కి ఐ.డి.పార్టీ పోలీసులు జిల్లావ్యాప్తంగా తనప్రత్యేక అజమాయిషిలో పనిచేస్తారు. వారు ఎస్.పి.కి నిజ సమాచారం పంపుతారు. అప్పుడు ఎస్.పి, రౌడిలతో లాలూచి పడిన పోలీసులను పట్టుకొని విచారిస్తాడు. అంతేగాక మీడియా పెద్దరాయుళ్ళ తీర్పును ప్రచారిస్తుంది. అప్పుడు కూడా ఎస్.పి., లంచగొండి పోలీసులను పట్టుకొని విచారిస్తాడు. ఒకోసారి పైఅధికారి, ఎస్.పి.ని జిల్లాలో జరుగుతున్న పెద్దరాయుళ్ళ తీర్పును గురించి ప్రశ్నించినప్పుడు కూడా ఆ ఎస్.పి.కి క్రింద ఏంజరుగుతుందో వాస్తవం అర్ధమౌతుంది. అలా నేరగాళ్ళు, లంచగొండులు తప్పించుకోవటానికి వీలులేని నెట్ వర్కు ఇది. కాకపోతే విషయమేమిటంటే, దీనిని implement చేసేవాళ్ళలో నిజాయితి కావాలి. అప్పుడే అందరికి న్యాయం జరిగి, అందరు సంతోషంగా ఉండగలరు. కాకపోతే మనదేశంలో ఈ Administration తాలూకూ నెట్ వర్కు, రచనా స్థాయి నుండి అమలు స్థాయి వరకూ, కుట్రదారులనే ఎలుకల చేత ముక్కలు ముక్కలుగా కొరికి వేయబడింది.

అందుకే కొందరు ప్రభుత్వ అధికారులు ఈ మొత్తం Administration పెద్ద సాగరమని అది ఎవరికి అర్ధంకాదని, తమకి మాత్రమే తెలుసునని అహంకారంతో అందరిని డీల్ చేస్తారు. ఇకపోతే Documentary Evidence లో నేను పెట్టినవి కేవలం నేను వ్రాసుకున్న ఫిర్యాదులు కావు. ఇవిగాక కార్యకారణ సంబంధంగల ముందు వెనుకల సంఘటనలు, వ్యక్తిగత సందర్శనల తాలూకూ సంభాషణలు కూడా ఆయా ఫిర్యాదు Documents లో ఉటంకించబడ్డాయి.

అవి ఎవరికి Address చేస్తూ వ్రాసానో, వారికి పంపించాను. పంపించిన పోస్టల్ /కొరియర్ రసీదుల్ని, అలాగే ఆయా వ్యక్తులూ, ఆఫీసుల్లోని inward clerks అందుకున్నట్లుగా రసీదులూ కూడా పొందుపరిచాను. ఆయా ఫిర్యాదులు /లేఖలు నేను పంపాక, జరిగిన సంఘటనలు, నేను ప్రభుత్వ అధికారుల నుండి, ముఖ్యమంత్రి కార్యలయం నుండీ, AICC General Secretary మరియు అప్పటి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నుండీ, లోకాయుక్త నుండీ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి [ఉచిత న్యాయసేవాసమితి] నుండీ, రాష్ట్రపతి APJ కలాం నుండీ, అందుకున్న ప్రతిస్పందన లేఖలని, ఇతర పత్రాలనీ కూడా Documentary Evidence లో ఉంచాను. అవసరమైన వాటి original copies ని స్కాన్ చేసి జోడించాను. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక Enquiry Commission ఏవిధంగా అయితే Administration పరంగా విచారణ జరిపి, వివరాలని విశ్లేషించి నివేదిక సమర్పిస్తుందో, అదేవిధంగా నేనూ సంబంధిత పత్రాలన్నిటినీ, Administration పరంగా సమీకరించి, జతపరిచి, విశ్లేషించి ఈమొత్తం కుట్ర [భారతదేశం మీద, విద్యారంగం మీద] వెనుకా, నా మీద జరుగుతున్న వేధింపు వెనుకా ఉన్నది రామోజీరావు అని నిరూపించాను. అయితే ఆ పత్రాలన్నీ ఆంగ్లంలో ఉన్న కారణంగానూ, పొడవుగా ఉన్న కారణంగానూ వాటిని పరిశీలించటానికి తగినంత ఓపిక, తీరిక, అవగాహన కావాలి. వాటిని తెలుగులోకి అనువదించటం కన్నా, వివరిస్తూ, అవసరమైన చోట లంకె వేస్తూ, scanned copies కీ లంకే వేస్తూ నా కేసునీ, పరిశోధననీ తెలియజేస్తాను.

ఇక్కడ మరోసారి నేను నొక్కి చెప్పేదేమిటంటే, ఇది administration పద్దతి. ప్రభుత్వంతో నేను జరిపిన పోరాటం, నిగ్గుతేల్చిన నిజం. ప్రభుత్వ Administration తో పరిచయం ఉన్నవారికీ, ప్రభుత్వ ఫైళ్ళ గురించి అవగాహన గలవారికీ అవి స్పష్టంగా అర్ధం అవుతాయి. మిగిలిన వారికి అది తమకి పరిచయంలేని పద్దతి గనుక అర్ధం చేసుకోవటానికి కొంత సహనం అవసరం. నాకు చేతనైనంత వరకూ తదుపరి టపాలలో వాటిని మీకు అనువదించి, అనువర్తించి వివరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇది సుదీర్ఘమైన పోరాటానికి సంబంధించిన విషయం గనుక ఒక్క టపాలోనో, ఒక్క వాక్యం లోనో వివరించటం అసాధ్యం. నా బ్లాగు చుట్టాలు ఈ విషయం అర్ధం చేసుకోగలరని ఆశిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

ప్రభుత్వ యంత్రాంగం ఒక పని చేయించడం అంటే అది మాటలు కాదు. అన్యులైన బ్రిటీషు వారు స్వదేశియులైన సిబ్బందిని నమ్మలేక అంచలంచలుగా బొమ్మల కొలువులా తీర్చి దిద్దిన యంత్రాంగం ఇది. పడికట్ల పై కప్పిన వస్త్రాన్ని లాగితే ఎలా అన్ని బొమ్మలు వచ్చి పడిపోతాయో అలా ఏర్పాటైంది. పైగా ఈ కొలువు క్రింద త్రుప్పు పట్టిన బియ్యపు డబ్బాలు,కాలు పోయిన బెంచీలు,పందికొక్కుల నివాసం అన్ని ఉంటాయి. అటువంటి బొమ్మల చేత,బొమ్మల కొలువు లాంటి యంత్రాంగం చేత అభివ్రుద్ది జరిగేలా చూడటం ఎంత కష్ఠమో

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu