బోఫోర్సు కుట్ర పధక రచన సి.ఐ.ఏ.,ఐ.ఎస్.ఐ.,బ్రిటిష్, అనువంశిక నకిలీ కణికుడు ఇతరులూ కలిసి చేసినా ఆ కుట్ర అమలులో ప్రధాన పాత్ర మాత్రం, ప్రధాని ఇంట్లో ట్రాన్స్ ప్లాంట్ అయిన సోనియా గాంధీదే. [నా వాదనని తార్కికంగా నిరూపిస్తాను.]

సహజంగా ప్రతీ భర్తా తన భార్యని నమ్ముతాడు. భార్యని నమ్మనివాడు భార్యతో కలిసి జీవించలేడు కూడా! అలాగే, సహజంగానే ప్రతీ భర్తా తన సమస్యల్లో భార్యనుండి నైతిక మద్దతు కోరతాడు. కాబట్టే తన ప్రతీ భావననీ, అనుభవాన్ని మోటివ్స్ నీ, అవసరాల్ని, ఆకాంక్షల్ని భార్యతో పంచుకుంటాడు. ఎందుకంటే ఆమె తనకు వేరుకాదు, తన జీవితం ఆమె జీవితం అంటూ వేరుకావు, ఆమె తన జీవిత భాగస్వామి, జీవిత సహచరి కనుక.

ఇక్కడ ఈ విదేశీ వనిత, సోనియా గాంధీ, భర్తని ఎంతగా ప్రభావితం చేసిందంటే “పార్టీని నడపడానికి, కార్పోరేట్ కంపెనీల నుండి విరాళాలు స్వీకరించడం తప్పుకాదు. విదేశాల్లో అన్ని రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ అలా విరాళాలు తీసుకుంటూ ఉంటారు” అని రాజీవ్ ని ప్రోద్బలించింది. నిజానికి ఈ విదేశీ’తత్త్వం’ లంచానికి పెట్టుకున్న పాజిటివ్ పేరు మాత్రమే. పార్టీ నడవడానికి, ప్రజలు విరాళాలిస్తారు. అందులో వ్యాపారులూ, కంపెనీలు కూడా ఉంటాయి. అయితే ఎక్స్ ఛెంజ్ ఆఫర్ గా తమకు విరాళాలిచ్చిన కంపెనీలకి, వ్యాపార సంస్థలకి ప్రభుత్వం, లేదా పార్టీ, కాంట్రాక్టులో భూములో ఇతర ప్రయోజనాలో కట్టబెట్టకూడదు. అలా కట్టబెడితే అది విరాళం కాదు, లంచమే. అది ఎవరు చేసినా, ఏపార్టీ చేసినా అది లంచమే.

ఒక దశలో మీడియాలో రాజీవ్ గాంధీ బోఫోర్స్ విషయాన్ని అంగీకరిస్తూ “పార్టీకి ప్రజలూ, వ్యాపారులూ, కంపెనీలు విరాళాలు ఇస్తుంటాయి. పార్టీలు తీసుకుంటు ఉంటాయి. అలాగే మేమూ హిందుజాల నుండి విరాళాలు అంగీకరించిన మాట వాస్తవమే” అంటూ ఓ విలేఖరికి జవాబిచ్చినట్లు వార్తలొచ్చాయి. దాంతో గగ్గోలు మరింత పెరిగింది. కుట్రదారులైన సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.,బ్రిటిషు.,నకిలీ కణికుడు వారి మద్దతుదారులైన కార్పోరేట్ కంపెనీల అనుభవంతో పోలిస్తే, రాజీవ్ గాంధీ అనుభవం చాలా తక్కువ. చివరికి గూఢచారిణిగా సోనియా గాంధీ అనుభవంతో పోల్చినా, రాజీవ్ గాంధీకి గల గూఢచర్యానికి సంబంధించిన అవగాహన చాలా తక్కువ. వారితో పోలిస్తే రాజీవ్ గాంధీ పసికూనవంటివాడే. కాబట్టే బోఫోర్స్ ఊబిలో, భార్యకంతగా శ్రమ ఇవ్వకుండానే పడిపోయాడు. హిందూజాలు, ఖత్రోచి మొదలైన వారందరికీ ఇటలీతోనూ, సోనియా గాంధీ బంధువులతోనూ ఉన్న సంబంధాలు 1992 తర్వాతే, [ఇప్పుడు] వెలుగులోకి వచ్చాయి గానీ అప్పటికి ఆ చప్పుడంతగా లేదు.

ఈ విషయాన్ని స్టెప్ బై స్టెప్ పరిశీలిస్తే మొదట రాజీవ్ గాంధీని విదేశీ కంపెనీల నుండి విరాళాలు స్వీకరించవచ్చు అని ఒప్పించారు. తదుపరి స్టెప్ లో హిందూజాల కంపెనీలకి కాంట్రాక్ట్ ఇప్పించారు. తదుపరి స్టెప్ లో ఆ తుపాకులకు సంబంధించి డీల్ వివరాలు బయటకి లీక్ చేసారు. తదుపరి స్టెప్ లో ఆ తుపాకులు పనికిరానివిగా ఢిపెన్స్ అధికారి ద్వారా ప్రకటన చేయించారు. తదుపరి స్టెప్ లో రాజకీయ నాయకులు, మీడియా అందరూ విరగ ప్రచారం చేసారు. తదుపరి స్టెప్ లో తను చేసిన చర్యను సమర్ధించుకునేటట్లు చేసి దాన్ని రాజీవ్ ద్వారానే అంగీకరింపచేశారు. దెబ్బకి మిస్టర్ క్లీన్ రాజీవ్ గాంధీ కాస్తా మిస్టర్ చీట్ అయిపోయాడు.

అయితే, అనుభవం ఏమనిషికైనా కొన్ని పాఠాలు నేర్పుతుంది కదండీ.[అందుకేనేమో, అనుభవమైతే గానీ తత్త్వం బోధపడదు అంటారు మనపెద్దలు] బోఫోర్స్ వివాదం అనుభవంతో రాజీవ్ గాంధీ కొంత అప్రమత్తమయ్యాడు. కుట్రల గురించీ, రాజకీయాల్లో అపాయాల గురించీ కొంచెం అవగాహన పెంచుకున్నాడు. బహుశః అతడు తన భార్య ఇచ్చిన సలహాలకి కారణం ఆమె పాశ్చాత్య దృక్పధం[attitude] అనుకున్నాడేమో. ఏమయినా ఆమె విదేశీ గూఢచార సంస్థల ఏజంటని మాత్రం సందేహించలేదు. ఆవిధంగా అతడు అదృష్టవంతుడు. ఎందుకంటే తన ప్రియభార్య తన మీద కుట్రలు పన్నిందని తెలుసుకోవటం కంటే మరణం మేలుకాబట్టి. తనలో సగం, తన జీవితం అనుకునే ప్రియసతి నుండి ఇంత మోసాన్ని పొందటం కంటే మరణాన్ని పొందటం అదృష్టమే కదా!

ఏదేమైనా బోఫోర్సు అనుభవం తర్వాత రాజీవ్ గాంధీ సోనియాగాంధీతో అన్ని విషయాలు చర్చించటాన్ని తగ్గించుకున్నాడు. [అంతకు క్రితం రాజీవ్ గాంధీకి వ్యక్తిగతసహాయకురాలిగా ప్రధాని కార్యాలయంలో కూడా చక్రం తిప్పిన సోనియాగాంధీ క్రమంగా మళ్ళీ ఇంటికి పరిమితం అయ్యింది.] ఎందుకంటే క్రమంగా అతడు రాజకీయాల్లో కొంత రాటుదేలాడు. రాజకీయనాయకుడిగా ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో అన్న విషయాల్లో మరికొంత పరిణతి సాధించాడు. ఈ ప్రయత్నంలో అతడు క్రమంగా అనుభవంలో, వయస్సులో తన కంటే పెద్దవారూ, తన తల్లికి సహచరులూ అయిన సీనియర్ నాయకులకు దగ్గరయ్యాడు. వారితో చర్చలూ, వారి సలహాలు ఎక్కువుగా పాటించడం లాంటి చర్యలూ పెరిగాయి.

కాబట్టే 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కోల్పోయినప్పుడు, రాజీవ్ గాంధీ ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఆనాటి పార్లమెంటులో ఏ పార్టీకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత మెజారిటీ రాలేదు. అత్యధిక పెద్దపార్టీగా కాంగ్రెస్ అవతరించింది. అయినా గానీ రాజీవ్ గాంధీ ప్రతిపక్షంలో కూర్చొనేందుకు నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నేపధ్యంలోనే రాజీవ్ గాంధీ చూపిన పరిణతి వెనుక సీనియర్లు, అనుభవఙ్ఞుల మార్గదర్శకత్వం ఉంది.

రాజీవ్ గాంధీ గనుక సోనియా గాంధీని సంప్రదించి ఉంటే, "రాజకీయాల్లో రాణించాలంటే ఇతర పార్టీల మద్దతు తీసికోవటంలో తప్పులేదు. పాశ్చాత్యదేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు అలాగే చేస్తారు. కాబట్టి 10 పార్టీల మద్దతైనా తీసుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి” అని సలహా ఇచ్చి ఉండేది. 2004 ఎన్నికల తర్వాత యు.పి.ఏ. ప్రభుత్వానికి కుర్చీవ్యక్తిగా అవతరించి ఈమె చేసింది ఇదే గదా? ఈ సలహానే అప్పుడూ ఇచ్చి ఉండేది.

“1966 తర్వాత ఇందిరాగాంధీ కూడా ఓసారి ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపింది కదా?” అనవచ్చు. నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీకి సోనియా గాంధీకి చాలా వ్యత్యాసం ఉంది. ఇందిరాగాంధీ హరిత విప్లవం సాధించింది. సోనియాగాంధీ సెజ్ ల పేరుతో గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయిస్తు, పచ్చని భూముల్ని లాక్కుంటుంది. ఇందిరాగాంధీ దేశం నుండి పేదరికాన్ని పారద్రోలాలని పెనుగులాడింది. సోనియా గాంధీ దేశం నుండి పేదల్ని పారద్రోలాలని పెనుగులాడుతోంది. ఇందిరాగాంధీ పేదల పక్షం వహించింది. సోనియా గాంధీ కార్పోరేట్ కంపెనీల పక్షం వహించింది. ఇందిరాగాంధీ కుట్రదారులకీ, కుట్రకీ వ్యతిరేకంగా ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడింది. సోనియాగాంధీ నిర్భీతిగా కుట్రదారులకీ, కుట్రకీ సహకరిస్తోంది. ఇద్దరికీ ఉన్న ఏకైక సారూప్యత ఇంటి పేరు ‘గాంధీ’ కావటమే.

1991 ఎన్నికల అనంతరం, రాజీవ్ గాంధీ హత్య నేపధ్యంలో సోనియా గాంధీని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా, నాయకత్వం వహించాల్సిందిగా ఆనాటి కాంగ్రెస్ వాదులు అడిగారు. దీని గురించిన వివరమైన చర్చ తదుపరి టపాల్లో చేస్తాను. ప్రస్తుతం 1989 ఎన్నికలని పరిశీలిద్దాం.

1989 ఎన్నికల్లో, కేంద్రంలో, బోఫోర్స్ నేపధ్యంలో కాంగ్రెస్ ఓడిపోయింది. తుప్పుపట్టిన తుపాకులంటూ బోఫోర్స్ కుంభకోణాన్ని పదేపదే విమర్శించినప్పుటికీ ఆంధ్రాలో ఎన్.టి.ఆర్. పార్టీ ఓడిపోయింది. ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించాలి. 1989 ఎన్నికలకు ఒక సంవత్సరం ముందే మర్రి చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యాడు. ’జైల్ భరో, కోటి సంతకాలు వంటి కార్యక్రమాలతో అతడు కాంగ్రెస్ లో, కార్యకర్తల్లో నవ చైతన్యాన్ని నింపాడు!’ అంటూ మీడియా, ముఖ్యంగా ఈనాడు తెగ ఊదరపెట్టాయి. గాంధీ భవన్ ముందు పార్టీ టిక్కెట్లు కోరుతూ అభ్యర్ధులు క్యూకట్టడాన్ని ఫోటోలతో సహా ప్రచురించింది. ఆవిధంగా గెలుపుని ముందుగానే మీడియా నిర్దేశించింది. ప్రజల్లో తెలుగుదేశం పట్లా, ఎన్.టి.ఆర్. పట్లా విముఖత ఉండడం, కాంగ్రెస్ కి ఆదరణ పెరగడం, దాన్నే తాము ప్రచారించామని మీడియా అన్నది. మీడియా ప్రచారించినందునే కాంగ్రెస్ తెరపైకి, తెదేపా తెరవెనక్కి పోయాయని కొందరు విశ్లేషించారు. చెట్టుముందా, విత్తు ముందా అన్న మరో ద్వంద్వం [paradox] తయారయ్యింది. సరిగ్గా ఇలాగే 2004 ఎన్నికలకు సంవత్సరం ముందుగానే వై.యస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రలకు కవరేజ్ ఇచ్చినట్లుగా నన్నమాట. ఇలాగే వి.పి.సింగ్ కూడా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కాంగ్రెస్ నుండి బయటపడి బోఫోర్స్ కుంభకోణం గురించి మీడియాతో కలిసి విపరీత ప్రచారం చేసుకున్నారు.

ఇక కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోయిన నేపధ్యంలో, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం దూరదర్శన్ లో జరిగింది. ఫోన్లకి అతుక్కొని, పోస్టాఫీసుల దగ్గర గుమిగూడి ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రజలంతా తమ ఇళ్ళలోని ఫ్యాన్లక్రింద, టివీల ముందర కూర్చొని మధ్యమధ్యలో పాత హిందీ సినిమా పాటలు, సినిమాలతో పాటుగా ఎన్నికల ఫలితాలూ, విశ్లేషణలూ చూశారు. రాజీవ్ గాంధీ కలలుగన్న టెక్నాలజీ డెవలప్ మెంట్ ని ప్రతిబింబిస్తూ నిరవధికంగా 24 గంటలూ దూరదర్శన్ లో ఎన్నికల ఫలితాలు విశ్లేషింపబడ్డాయి. ప్రణయ్ రాయ్ సంధానకర్తగా వ్యవహరిస్తూ నిపుణుల్ని ప్రశ్నిస్తూ, విశ్లేషణల్నీ, చర్చల్నీ సమీక్షిస్తూ, మధ్యమధ్యలో ఎన్నికల ఫలితాలని విలేఖరుల నుండి సేకరిస్తూ ఆ కార్యక్రమాన్ని సమర్పించినప్పుడు దేశప్రజలు యావత్తూ అబ్బురపడుతూ, తిలకించారు. వామపక్షనేత ప్రకాష్ కారత్ కి తోడల్లుడూ, బృందా కారత్ సోదరి రాధికా రాయ్ భర్తా అయిన ప్రణయ్ రాయ్ ప్రస్తుతం ND TV అధినేతగా ఉన్నారు. “ఆనాటి [1989] ఎలక్షన్ ఫలితాల విశ్లేషకుడు ప్రణయ్ రాయ్, వామపక్షనేతలకు సమీప బంధువు కావటంలో తప్పేముంది?" అని ఎవరైనా అనవచ్చు. అవును, తప్పేమీ లేదు. బంధువులకి రాజకీయనాయకులు మద్దతివ్వటమూ అసహజం కాదు. అయితే అప్పుడు కాంగ్రెస్ ని, రాజీవ్ గాంధీని వ్యతిరేకిస్తున్న వామపక్షనేతల సమీపబంధువు, ఈనాటి ND TV అధిపతి అయిన ప్రణయ్ రాయ్, ఆనాడు సమర్పించిన విశ్లేషణ నిప్పక్షపాతంగా ఉందని ఎలా అనుకోవటం? ఇదినేను కాంగ్రెస్ మీద అభిమానంతో అనడం లేదు. నిజానికి ఇప్పుడున్న కాంగ్రెస్ నాటి దేశభక్త కాంగ్రెస్ కాదు, కుట్రదారి కాంగ్రెస్ లేదా కుట్రదారుల మద్దతుదారి కాంగ్రెస్. ఇప్పుడీ పార్టీలో దేశభక్తుల చిరునామా కూడాలేదు. కుట్రదారుల ఏజంట్లదే గుత్తాధిపత్యం. ఈ విషయంలో మిగిలిన పార్టీలన్నిటినీ ఓడించింది కాంగ్రెస్.

ఇక 1989 లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చొనేందుకు, నిర్ణయించుకోగా, స్వంత రాష్ట్రంలో ఓడిపోయిన ఎన్.టి.ఆర్. ఆశ్చర్యకరంగా, కేంద్రంలో చక్రం తిప్పాడు. కాంగ్రేసేతర పార్టీలని కలిపి నేషనల్ ఫ్రంట్ పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, నేషనల్ ఫ్రంట్ కి ఛైర్మన్ అయిపోయాడు. 1996 లో ఎన్.టి.ఆర్. చిన్నల్లుడూ, తెదేపా అధ్యక్షుడూ అయిన చంద్రబాబు నాయుడు దేవేగౌడ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి చక్రం తిప్పినట్లున్నమాట. ఇంకా చెప్పాలంటే 1999 లో మరోసారి చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతూ బి.జె.పి. ఆధ్యర్యపు ఎన్.డి.ఏ. ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్లున్నమాట. [అప్పుడు రామోజీరావు బహిరంగంగా రంగంలోకి దిగి మద్దతు ఇప్పించినట్లు మీడియా ప్రచారం ఉంది.] 1996 లో చంద్రబాబు మతవాద పార్టీ బి.జె.పి., కాంగ్రెస్ నీ అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు దేవెగౌడ పార్టీకి మద్దతిచ్చాడట. 1999 లో దేశభద్రత కోసం, బి.జె.పి. ఆధ్యర్యపు ఎన్.డి.ఏ. కూటమికి మద్దతిచ్చాడట. అతడే స్వయంగా నిర్వచించాడు ఇలాగని! ఈ నిర్వచనాల మాట ఎలా ఉన్నా ఎన్.టి.ఆర్., చంద్రబాబు బొమ్మల వెనుక ఉన్నది రామోజీరావు అన్నది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే.

అలా ఎన్.టి.ఆర్. అధ్యక్షతన [కుర్చీవ్యక్తిగా] కేంద్రంలో 1989 లో వి.పి.సింగ్ ప్రధానిగా, దేవీలాల్ ఉపప్రధానిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంకి బయటినుండి ‘కాంగ్రెస్ కు వ్యతిరేకంగా’ అంటూ మరో కొన్ని నిర్వచనాలు చెప్పి బి.జె.పి., వామపక్షాలు ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఎన్నికల్లో గెలిచేందుకు వి.పి.సింగ్ పార్టీ 10,000/- రూ. లోపు వ్యవసాయ ఋణాల్నీ మాఫీ చేయటం, తదనంతర పరిణామాల్లో తదుపరి ప్రధాని చంద్రశేఖర్ బంగారు నిల్వల్ని అంతర్జాతీయ విపణిలో తనఖా పెట్టటం మనం ఇంతకు ముందు చర్చించినదే.

వి.పి.సింగ్ ప్రధాని హోదాలో పంజాబ్ రాష్ట్రంలో 1989 లో టాపులేని జీపులో పర్యటించాడు. 1985 లో రాజీవ్ గాంధీ పంజాబ్ లో బుల్లెట్ ప్రూఫ్ కారులో పర్యటించడాన్ని, వీ.పి.సింగ్ టాపులేని జీపులో పర్యటించడాన్ని ప్రస్తావిస్తూ వీ.పి.సింగూ, అతడి అనుచరులూ దాదాపు అన్ని ఉపన్యాసాల్లో ’రాజీవ్ గాంధీ పిరికివాడని, ధైర్యమంటే వీ.పి.సింగ్ దే’నని అనేవారు. ఒక ప్రధాని ధైర్యసాహసాలు, మేధస్సు, పంజాబ్, కాశ్మీర్ ల్లాంటి సమస్యల్ని పరిష్కరించడంలో, ప్రక్క దేశాలు, అగ్రదేశాల ఒత్తిడిని ఎదుర్కొటంలో ఉండాలిగాని, ఆయా ప్రాంతాల్ని సందర్శించటంలో ఉండదని ఎవరూ అనలేదు. అన్నా మీడియా ప్రచురించలేదు. అందునా వి.పి.సింగుకీ, పంజాబ్ టెర్రరిస్టులకీ మధ్య కుట్రదారుల అదృశ్య సయోధ్య, మ్యాచ్ ఫిక్సింగ్ ఏర్పాటూ ఉంటే అసాధ్యమా, నిర్భితి నటిస్తూ పంజాబ్ లో ఓపెన్ టాపు జీపులో పర్యటించడం? ఉగ్రవాదులు తననేం చేయరన్న భరోసా తన గాడ్ ఫాదర్ లైన కుట్రదారుల నుండి వీ.పి.సింగుకి ఉంటే, అతడు పంజాబ్ లో పర్యటించడా?

నిజానికి వీ.పి.సింగ్, అద్వానీ లాంటి జాతీయ స్థాయి రాజకీయ నాయకులూ, కరుణానిధి వంటి ఇతరరాష్ట్ర నాయకులు సోమాజీగూడ లోని రామోజీరావు ఈనాడు కార్యాలయాన్ని 1992 కు ముందర తరచుగా సందర్శించేవారు. మీడియా, రాజకీయరంగాలు పరస్పర అధారితాలు కాబట్టి ఆయా రాజకీయ నాయకులు ఈనాడు ఆఫీసు చుట్టు తిరిగేవారు అనేటట్లయితే మరి రామోజీరావు కూడా రాజకీయ నాయకుల చుట్టు తిరగాలి కదా? అలా ఎప్పుడూ జరిగేది కాదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే సినిమా నంది ఆవార్డులు పుచ్చుకునేందుకు కూడా రామోజీరావు వచ్చేవాడు కాదు. అదేగాక ఈనాడు ప్రాంతీయ భాషా పత్రిక. అలాంటి దానిచుట్టూ జాతీయనాయకులూ, ప్రక్కరాష్ట్రపు నాయకులూ తిరగాల్సిన అవసరం ఏమిటి? ఈనాడు లో సబ్ ఎడిటర్ గా పనిచేసే నా మిత్రురాలి నుండి నేను సేకరించిన సమాచారాల్లో ఇది కూడా ఒకటి. 1992 లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావుకి నేను అందచేసిన సీల్డ్ కవర్ లో మిగిలిన సమాచారంతో పాటు ఇది కూడా పొందుపరిచాను. దీని గురించిన పూర్తి వివరాలు తదుపరి టపాల్లో వ్రాస్తాను. వెంటనే చూడాలంటే Coups on World లో చూడగలరు. 1992 తర్వాతే రామోజీరావు అన్ని పంక్షన్లకు హాజరవుతున్నది, అందరి చుట్టూ తిరుగుతుంది.

ఇక వీ.పి.సింగ్ పంజాబ్ పర్యటన నేపధ్యంలో, అతడికి గల ధైర్యం గురించి ప్రస్తావిస్తూ, సంజయ్ గాంధీ భార్య, రాజీవ్ గాంధీ మరదలూ అయిన మనేకా గాంధీ ఓ అడుగు ముందుకేసి “అంత భయమైతే ఇంట్లో కూర్చోండి బావగారూ!” అని వ్యాఖ్యానించింది. ఇది అప్పట్లో మీడియాలో కొద్దిరోజులు ప్రధాన వార్తగా చలామణి అయ్యింది. ప్రధాని హోదాలో వీ.పి.సింగ్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఎస్.పి.జీ. రక్షణని రద్దుచేశాడు. నిఘా సంస్థల హెచ్చరికలని పెడచెవిని పెట్టి మరీ రద్దు చేశాడు. ఇదీ అప్పట్లో వార్తల్లో వచ్చిన అంశమే. వీ.పి.సింగ్ హయంలోనే కులప్రాతిపదికన, ఉద్యోగాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ రిజర్వేషన్ల కోసం మండల్ కమీషన్ నియామకం జరిగింది. కమీషన్ నివేదిక పీ.వి.నరసింహారావు హయాంలో వచ్చింది. దాని పర్యవసానం ఎంత హింస, ఆత్మాహుతులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. 1984 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో [అంటే 1985లో] బి.జే.పి.కి పార్లమెంటులో వచ్చిన సీట్లు 2 మాత్రమే. రాజీవ్ గాంధీ హయాంలో బాబ్రీ మసీదు తాళాలు కోర్టు ద్వారా తీయబడ్డాయి. 1985 తర్వాత బి.జే.పి., ఆరెస్సెస్ చోదకశక్తిగా అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమం [శిలాన్యాస్ లాంటివి] చేపట్టింది. దాంతో దేశంలో వివిధ చోట్ల గాలన్లకొద్దీ రక్తం పారింది, టన్నుల కొద్దీ హింస ప్రజ్వరిల్లింది. అయోధ్యలో బిజేపి, ఆరెస్సెస్ లు ఇతర హిందూ ఉగ్రవాద సంస్థలూ కలిసి శిలాన్యాస్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శ్రీరామ అని వ్రాసి ఉన్న ఇటుక రాళ్ళని దేశం నలుమూలల నుండి ఆయా సంస్థల, పార్టీల, కార్యకర్తలు రైళ్ళల్లోనూ, రోడ్డుమార్గం ద్వారా అయోధ్యకి తరలించి పూజలు చేశారు. ఈ నేపధ్యంలో ఎన్నో ఉద్రేకపూరిత ఉపన్యాసాలూ, సంఘటనలూ రధయాత్రలూ చోటు చేసుకున్నాయి. వీళ్ళ చర్యలకి ప్రతిచర్యలన్నట్లు ములాయం సింగ్, బాబ్రిమసీదు పరిరక్షణ సమితి పేరుతో ఇమాం బుఖారిలు, సలాఉద్దీన్ ఓవైసీలాంటి వారు ముస్లింలని రెచ్చగొడుతూ నాటకం రక్తి కట్టించారు. ఈ చర్యలన్నింటితో పార్లెమెంట్ లో బిజేపి ఎం.పీల సంఖ్య 1985 నుండి 1989 నాటికి 2 నుండి 86 కి పెరిగింది. ఈబలంతో 1989 లో అద్వానీ అధ్యర్యంలోని బిజేపి, నేషనల్ ఫ్రంట్ కీ, వీ.పి.సింగ్ కీ బయటినుండి మద్దతు ఇచ్చింది. [అప్పట్లో బిజేపి నాయకత్వం అంటే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఆరెస్సెస్ అధినాయకులదే. వాజ్ పేయి సీట్ల తేలేకపోయాడు కాబట్టి అతడి పేరు అంత ఎక్కువుగా విన్పించేది కాదు. 1992 డిసెంబర్ 6, వరకూ కూడా ఇదే పరిస్థితి.]

1990 లో లాల్ కృష్ణ అద్వానీ మరోసారి రధయాత్ర చేపట్టాడు. ప్రధాని వి.పీ.సింగ్ నిషేధించాడు. [ఆవిధంగా ఎవరి పాత్ర వారు నిర్వహించారు] దానితో బిజేపి, వీ.పి.సింగుకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించు కొంది. దాంతో సంవత్సరం దాటకుండానే, 340 రోజుల్లో వీపిసింగ్ ప్రభుత్వం కుప్పకూలింది. మొత్తంగా ఇతడి హయాంలో మతకల్లోలకీ, కుల ఘర్షణలకీ, తెరతీయబడింది. దేశం ఆర్ధికంగా దివాళా తీసింది. ఈ నిర్వాకం తరువాత ఎంచక్కా ఏవివాదం తనకు అంటకుండా వి.పి.సింగ్ రాజకీయాల నుండి రిటైర్ అయిపోయాడు. కాంగ్రెస్ బయటినుండి ఇచ్చిన మద్దతుతో, భోండ్సీ బాబా[సువిశాలమైన భోండ్సీ వ్యవసాయక్షేత్రం కానుకగా పొందిన] చంద్రశేఖర్ ప్రధాని అయ్యాడు. 10,000/-Rs.ల ఋణమాఫీ దెబ్బకి కృంగిపోయిన ఆర్ధిక పరిస్థితిలో ఇతడు బంగారాన్ని కుదవబెట్టాడు. 3 – 4 నెలల్లోనే ఈ ప్రభుత్వమూ కూలిపోయింది. మధ్యంతర ఎన్నికలకు ప్రకటన జారీ అయ్యింది. ఈ దశలో కాంగ్రెసేతర పార్టీలు కలగూరగంపలనీ, ఆయా పార్టీల నాయకులకి పదవీ వ్యామోహం తప్ప దేశం పట్టదనీ, దాంతో ప్రభుత్వాలు నడపలేవనీ వ్యాఖ్యానాలు వచ్చాయి. అలాగే, వి.పి.సింగ్ ప్రభుత్వం కూలిపోయాక, చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పడడంలోనూ, 3 - 4 నెలల్లో కూలిపోవటం లోనూ కాంగ్రెసే చక్రం తిప్పిందనీ కూడా వార్తలొచ్చాయి. కొన్ని వార్తాకధనాల ప్రకారం రాజీవ్ గాంధీ ఈ విషయంలో రాజకీయపు ఎత్తుగడలు పన్నాడు. మరికొన్ని కథనాల ప్రకారం రాజీవ్ గాంధీ చర్యల వెనుక పీ.వి.నరసింహారావు లాంటి సీనియర్ల బుర్రలు పనిచేసాయి. తమకు అనువైన సమయం కోసం వేచి ఉండి మధ్యంతర ఎన్నికలకు దారి తీసేటట్లు చంద్రశేఖర ప్రభుత్వాన్ని పడగొట్టారని అప్పట్లో ప్రచారమయ్యింది.

ఈ పరిణామం కుట్రదారులని అప్రమత్త పరిచింది. రాజీవ్ గాంధీ ఇదేవిధంగా ముందుకెళ్ళితే, అతడు కుట్రదారులైన సి.ఐ.ఏ.,ఐ.ఎస్.ఐ.,బ్రిటిషు.,అనువంశిక నకిలీకణికులకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో అనుభవంతో నేర్చుకుంటాడు, పైకి కనబడే వి.పి.సింగ్ లాంటి రాజకీయ ప్రత్యర్ధుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు,[వి.పి.సింగ్ రాజీవ్ గాంధీ కాబినెట్లో కొంత కాలం ఆర్ధిక మంత్రిగా, రక్షణ మంత్రిగా కూడా విధులు నిర్వహించాడు.] ఇలాగే వదిలేస్తే రాజీవ్ గాంధీ కూడా తల్లి ఇందిరాగాంధీ లాగా రాటుదేలవచ్చు. మరికొంత పరిణతీ, ధృఢమైన పనితీరూ నేర్చుకోవచ్చు. తల్లికి లాగే రాజీవ్ గాంధీకి కూడా ప్రజల్లో గ్లామరూ, ఇమేజ్, ఆకర్షణా, పేరు ప్రఖ్యాతులూ ఉన్నాయి. ఇందిరాగాంధీకి ప్రజలు చాలాసార్లు వెన్నంటి నిలిచారు. అలాగే తదుపరి ఎన్నికల్లోనూ ప్రజలు రాజీవ్ గాంధీకి అండదండలందించవచ్చు. అప్పడు తమకి మరింత క్లిష్టపరిస్థితులు ఎదురుకావచ్చు. ఓటమి మనిషిని భయపెట్టవచ్చు , రాటు తేల్చనూ వచ్చు. ఏమైనా అనుభవం, అవగాహన పెంచుకునే దిశలో రాజీవ్ గాంధీ ఉంటే అది కుట్రదారులకు ప్రమాదమే. అవగాహనా రాహిత్యంతో తాము పన్నిన ఉచ్చుల్లో పడుతుంటే ఎంచక్కా ఆడుకోవచ్చు గానీ, పరిణతి సాధిస్తే ఎలా? మీడియా, ప్రజల విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ప్రయోగిస్తుంది.

అంతేకాదు, ఇక్కడ మరో తీవ్రసమస్యకూడా ఉంది. ఇలా రాజకీయపు అవగాహన, పరిణతి, నిశిత ఆలోచనా సరళి నేర్చుకుంటే – రాజీవ్ గాంధి భవిష్యత్తులో సోనియాగాంధీని, తనపై ఆమె ప్రభావాన్ని అనుమతించకపోవటమేకాదు, ఆమె వ్యవహారసరళిని గుర్తించవచ్చు. కుట్రదారుల ఏజంటుగా పనిచేస్తున్న ఆమె అసలు రూపాన్ని పసిగట్టవచ్చు. అదే జరిగితే తమకు పెనుప్రమాదం.

పర్యవసానం – 1991 మధ్యంతర ఎన్నికలలో పోలింగ్ దశల మధ్య మే21 న శ్రీపెరంబూదూరులో రాజీవ్ గాంధీ దారుణహత్యకు గురయ్యాడు. పైకారణంగా[over leaf reason] ఎల్.టి.టి.ఇ. నియమింపబడింది. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకకి భారత్ శాంతిసేన పేరిట సైన్యాన్ని పంపింది. ఆ విద్వేషంలో ఎల్.టి.టి.ఇ. రగిలిపోయింది. దాంతో పెద్దపులి వేలుపిళ్ళె ప్రభాకరన్ మానవబాంబు ధనూ, శివరాసన్ లని, శుభ, మురుగన్ గట్రాల బృందాన్ని భారత్ కి పంపాడు. ఆ రోజుల్లో మీడియా ఎప్పుడు ఎల్.టి.టి.ఇ. చీఫ్ వేలుపిళ్ళె ప్రభాకరన్ ని రిఫర్ చేసినా ’పెద్దపులి’ అన్న టాగ్ తగిలించి మరీ చెప్పేది. దావూద్ ఇబ్రహీం, హాజీ మస్తాన్, చోటా షకీల్ మొదలైన వారికి ఎంత కవరేజ్, ఇమేజ్ ఇచ్చేవారో, వారి శక్తి సామర్ధ్యాలు గురించి ఎన్ని వార్తా కథనాలు, ఆసక్తి కర సంఘటనలూ పత్రికల్లో వచ్చెవో క్రమం తప్పుకుండా వార్తాపత్రికలు చదివే పాఠక లోకానికి గుర్తుండే ఉంటుంది. ఈరోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చి ఆరోజు సాయంత్రానికే మాసిపోయే దినపత్రిక వార్తలు గ్రంధాల్లో నిలబడిపోవు. ప్రజల ఙ్ఞాపకాల్లో మిగలాల్సిందే. ‘ఎటూ ప్రజల ఙ్ఞాపక శక్తి స్వల్పకాలికం. ఈరోజువి ఈరోజే మరిచిపోతారు’ అన్న సూత్రమే అంతస్సూత్రంగా నడిచే కవరేజ్ మరియు ఇమేజ్ ఇది.

ఎల్.టి.టి.ఇ.కి లెబనాన్ శిక్షణ నిచ్చిందనీ [హమాస్ లాంటి ముస్లింతీవ్రవాదసంస్థలకి నెలవైన లెబనాన్ కి ఎల్.టి.టి.ఇ.కి శిక్షణనిచ్చే భావసారూప్యత ఏమిటీ? లేక డబ్బే ప్రధానంగా శిక్షణ నడిచిందా?] ప్రభాకరన్ కి రెండంతస్తుల ఏసీబంకర్లున్నాయనీ, తీరా పరిస్థితి వస్తే సామాన్య తమిళుల్ని రక్షణకవచంగా పెట్టుకునీ లేదా సామాన్యుల్ని కాల్చి చంపుతూ ఎల్.టి.టి.ఇ. ఆత్మరక్షణ చేసుకుందనీ – ఈరోజు అంటే మహేంద్రరాజపక్సే ఆధ్వర్యంలోని శ్రీలంక సైనికులు ఎల్.టి.టి.ఇ.పై దాదాపు విజయం సాధించాక బయటికొస్తున్న వార్తలు. అప్పుడైతే వేలుపిళ్ళె ప్రభాకరన్ గురించి ఇవేవీ తెలియవు. అతడో గొప్పదేశభక్తుడు. ఎటూ ఒకవర్గం వేర్పాటువాదం అంటుంది. మరో వర్గం స్వాతంత్ర సమరం అంటుంది కదా! ఏ తమిళ సామాన్యుల కోసం తాము పోరాడుతున్నామన్నారో, ఏ సామాన్య తమిళుల హక్కుల పేరు చెప్పి అమాయకుల్ని మానవబాంబులుగా మార్చారో, ఆ సామాన్యుల్నే చంపుతూ ఈరోజు ఆత్మరక్షణ చేసుకున్న ఎల్.టి.టి.ఇ. కీ, జిహాద్ పేరుతో అమాయక పసిపిల్లల్ని మానవబాంబులుగా మార్చి తమ మతం వారితో సహా ప్రపంచప్రజలందర్నీ చంపుతూ, దాడులు చేస్తూ భయభ్రాంతుల్ని చేస్తున్న ముస్లిం తీవ్రవాద సంస్థలకీ పనితీరులో సారూప్యత ఉండటం తిరుగులేని నిజం. ఇది చెప్పటం లేదా ప్రపంచవ్యాప్తంగా ఏ పేరుతో పిలిచినా ఉగ్రవాదుల్ని, హింసోన్మాదాన్ని నడుపుతుంది ఒకే వ్యవస్థ అని?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

3 comments:

well

మీరు రాస్తున్న టపాలన్నీ చదువుతూ ఉన్నా వ్యాఖ్య రాయడానికి కుదరలేదు. మీరన్న మాటలన్నీ నేను 100% విశ్వసిస్తున్నాను. పి.వి. నరసింహారావుగారు చనిపోయినపుడు ఆయన శవానికి సోనియా చేసిన అవమానం చూస్తే చాలదా.. ఆమె గుణం తెలియడానికి? ఇందిరాగాంధీ ని అనుకరిస్తూ కాటన్ చీరలు కడితే ఈవిడ ఇందిరా గాంధీ అంత గొప్పది అయిపోతుందా? మీరు రాసినవన్నీ చదవకముందే నా మనఃసాక్షికి ఈమె నమ్మదగ్గ వ్యక్తి కాదు అని తీవ్రంగా అనిపించేది. మీరు నమ్మరేమో ఇప్పటికీ పేపర్లో గానీ, టివీలో గానీ ఆమె ముఖం చూడాలంటే చిరాకు నాకు. చాలా మంచి విషయాలను రాస్తున్న మీకు అభినందనలు.

విరజాజి గారు,

మీరు చెప్పింది నమ్ముతానండి. మన మనస్సుతో మనకి ‘సరిపడినతనం’ ఉంటే మీరు చెప్పిన విషయం అనుభవంలోకి వస్తుంది. కారణం లేకుండానే ఒకోసారి కొందరిని చూస్తే ఆకర్షణ లేదా వికర్షణ, అత్మీయతా లేదా ఏహ్యతా లాంటి భావాలు అనుభూతిలోకి వస్తాయి. తర్వాత కారణం తెలియవస్తుంది. ఒకోసారి తెలియకపోవచ్చు కూడా. దీన్ని గురించిన ’చందన వ్యాపారి కథ’ రామకృష్ణామిషన్ వారి బాలల కథా మంజరిలో ఉంది. చాలా మంచికథ. వీలయితే చదవండి.

నాబ్లాగులో వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu