నాబ్లాగు చుట్టాలందరికీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ నాడు ప్రశాంతంగా, ప్రమోదంగా చదువుకునేందుకు ఓ చిన్న టపా.

ఆవి 8 వ శతాబ్ధి నాటి రోజులు. ఓనాడు కాశీపుర వీధుల్లో ఆది శంకరాచార్యులు, శిష్యసమేతంగా భిక్షార్ధియై వెళ్తున్నారు. ఓ ఇంటి వీధి అరుగు మీద, డెభై ఏళ్ళ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. పదేపదే గట్టిగా ’డుకృఞ్ కరణే, డుకృఞ్ కరణే’ అని వల్లిస్తున్నాడు. అది వ్యాకరణ సూత్రం. ఇతడు వృద్దుడు. కొన్ని దంతాలు ఊడిపోయి, కొన్ని వదులైపోయి మాట తొసి పోతున్నది. అసలు వ్యాకరణ సూత్రం ధ్వనిమారి, అతడి తొర్రినోట తప్పు పలుకుతున్నది. ముందుకూ వెనక్కీ ఊగుతూ, అతడు దాన్ని బట్టీ వేస్తున్నాడు. ఆ విధంగా సంపాదించిన పాండిత్యాన్ని – ఏ రాజుల ముందో, చక్రవర్తుల ముందో ప్రదర్శించి, సన్మానాలు, సంపదలూ పొందాలన్నది ఆ వృద్దుడి ఆకాంక్ష.

అది చూసి శంకరాచార్యుల వారికి ఆగ్రహం, జాలి కలిగాయి. ఎదుటి వాడు వృద్ధుడు. జీవితపు చివరిదశకు చేరినా సత్యమేమిటో ఇంకా గ్రహించలేకున్నాడు. ఇప్పటికీ సిరిసంపదలంటూ, సన్మానాలంటూ, పరుగులు పెడుతూనే ఉన్నాడు. అది చూసిన మరుక్షణం శంకరాచార్యుల వారినోట

భజగోవిందమ్ భజగోవిందమ్
గోవిందమ్ భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహిత కాలే
నహినహి రక్షతి డుకృఞ్ కరణే

అన్న శ్లోకం పలికిందట.

“ఓరి మూర్ఖుడా! అంత్యకాలం సమీపించినప్పుడు, ఈ లౌక్యపు విద్యలు, ‘ఉపాధి, సంపద’ ఇస్తాయని సాధన చేసిన ఈ కళలు నిన్ను రక్షించలేవు. ఇప్పటికైనా గోవిందుణ్ణి [భగవంతుణ్ణి] భజించు” అని దాని అర్ధం. ముక్కుముఖం తెలియని ఎదుటివాణ్ణి, వయో భేదాన్ని పట్టించుకోకుండా, ఙ్ఞాన భేదాన్ని పరిగణించి, శిష్యుణ్ణి మందలించినట్లుగా ‘మూఢమతే’ అని మందలిస్తూ, సత్యాన్ని బోధించినందుకేనేమో ఆది శంకరుల వారిని జగద్గురువని పిలుస్తారు. భజగోవింద శ్లోకాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యంలో రంగరించి చెవులబడుతుంటే ఆత్మ విశ్వపర్యటన చేస్తున్నట్లుంటుంది.

తదుపరి శ్లోకాలలో కొన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యులు పూరించారట. భజగోవింద శ్లోకాలని విన్నప్పుడు, చదివినప్పుడూ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.

ఆ వృద్ధుడు రాజు గారి నుండి ప్రశంసలూ, సన్మానాలు, తద్వారా కానుకలు, సంపదలు పొందాలని, వయసైపోయిన తర్వాత కూడా విద్యలు వల్లిస్తున్నాడు. విద్యా ప్రదర్శనతో, ఎలాగైనా రాజప్రీతిని పొందగలిగితే ఆర్ధికలాభం. ఇదీ ఆలోచన.

నిజానికి మన విద్యాసంస్థల్లో బోధించేది, సర్టిఫికేట్లు లో సూచించేది విద్య అనుకుంటాం గానీ, అది అసలైన విద్యకాదు. అది ’డుకృఞ్ కరణే’ వంటి విద్య మాత్రమే. అసలైన విద్య ఏమిటో, దాని పరమార్ధమేమిటో, నాకు చేతనైనట్లుగా ఆదివారం నాటి టపాలో వివరిస్తాను.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

అమ్మఒడి గారికి హృదయపూర్వక విరోధి వత్సర ఉగాది సుభాకాంక్షలు. ఇంటిల్లపాదీ షడ్రుచులను ఆస్వాదించండి.

మీకు ఉగాది శుభాకాంక్షలు.

డుకృతి కరణే అంటే అర్దం ఏమిటి?

అమ్మ చాలా బాగా చెప్పారు. మీకు మీ కుటుంబానికి ఈ లోకానికి విరోధి శుభాకాంక్షలు. మీరనట్టుగా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే

విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

వయసు మీరిన వృద్ధుణ్ణి శంకరాచార్యులు ధనం కోసం పరితప్పించడాన్ని తిట్టడం తప్పులేదు. కానీ జీవన బృతికోసం ఏదో ఒకటి నేర్చుకోవాలి కదండీ! విద్యా సంస్థలలో దానినే ఇప్పుడు విద్య అంటున్నారు. ఎలాంటిదైన జీవన బృతికి ఒకటి కావాలి కదా?

మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు.

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

మీకు కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

arunank గారు,

‘డుకృతి కరణే’ అన్నది మన తెలుగువ్యాకరణ సూత్రం లాగా సంస్కృత వ్యాకరణ సూత్రం. నేను చదివిన వ్యాసంలో కూడా దాని అర్ధం వివరించలేదు. అక్కడ ఆ ముసలి బ్రాహ్మణుడు దానిని ‘బట్టి’ పడుతూ ఉంటాడు కాబట్టి శంకరాచార్యుల వారు, డబ్బు సంపాదించేటందుకు నేర్చుకుంటున్న ఆ విద్యని విమర్శిస్తూ, ఆ ‘బట్టి’ పదాన్ని[డుకృతి కరణే] శ్లోకం లో ఉటంకించాడు. నాకు తెలిసి అంతే.

**********

SAMEEHA గారు,

రేపటి ఆదివారం టపాలో మీ సందేహాన్ని నాకు సాధ్యమయినంతలో తీర్చగలను.

************

అమ్మఒడి పేరుబాగుంది.
నుతన సంవత్సర శుభాకాంక్షలు

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu