సి.ఐ.ఏ.లో తమ మాతృదేశం అమెరికా పట్ల ప్రేమా, భక్తీ, నిబద్దతగల అధికారులూ ఉంటారు. వాళ్ళకి నకిలీ కణిక వ్యవస్థ ‘America is great’ అన్న ఇమేజీతో ఉబ్బేస్తుంది. అలాంటి వారు కొంత ఐడిలిస్టులు, లేక భావవాదులన్నమాట నకిలీ కణికుడి దృష్టిలో. వారికి కాస్త తైరు కొడితే, కొద్దిపాటి ప్రయోజనాలు చూపిస్తే చాలు. దేశద్రోహం చెయ్యమంటే ఒప్పుకోరు వీరు. ఇలాంటి వారికి ’ఇది స్ట్రాటజీలో ఒక భాగం. తాత్కాలికంగా మనకి నష్టం అన్పించినా, భవిష్యత్తులో మనకి చాలా గ్రిప్ ని తెచ్చిపెడుతుంది’ గట్రా తంత్రాలతో కవ్విన్స్ చేస్తారు. ఒక ప్రణాళిక, లేదా తంత్రం తాత్కాలికంగా advantage గా కన్పించి, కాలగమనంలో disadvantage అవ్వటం, లేదా తాత్కాలికంగా disadvantage గా అన్పించి కాలక్రమంలో advantage అవ్వటం మామూలే గనుక వాళ్ళు కన్విన్స్ అవుతారు. పాక్ లాలన విషయంలో సి.ఐ.ఏ.లోని అందరూ ఆమోదించకపోయినా, ఇలాంటి తంత్రాలతో ఆమోదించేటట్లు చేస్తారు. అప్పటికీ ఎవరైనా కన్విన్స్ కాకపోతే, మెల్లిగా ఆవ్యక్తి [సి.ఐ.ఏ.లోని అధికారి కానివ్వండి, రాజకీయ పార్టీల్లోని వ్యక్తి కానివ్వండి, ఎవరైనా సరే] ఒంటరి అవుతాడు. విభజించి పాలించే తంత్రంలో దీన్ని సాధించటం సులభమే. క్రమంగా వేధింపుకి సైతం గురవుతాడు. క్రమంగా అణిచివేయబడతాడు. అడ్రసు గల్లంతవుతాడు. అంత బలం తెలిసాక క్రమంగా వ్యతిరేకత కూడా తగ్గిపోతుంది. ఇది ఒక్క సి.ఐ.ఏ. విషయంలోనే కాదు, ఏదేశంలోనైనా, ఏ దేశ గూఢాచార వ్యవస్థ అయినా పరిస్థితులింతే!

[ఈ స్థితినే మరి ఒక ఉపమానంతో చెప్పాలంటే అమెరికా రక్షణ అధికారిక భవనం పెంటగాన్ కాబట్టి, అమెరికా పట్ల నిబద్దత గల సి.ఐ.ఏ. ఏజంట్లని నెం.5 ఏజంట్లు అనుకోవచ్చు. సందట్లో సడేమియా అన్నట్లుగా, “తమ దేశానికి చేటు జరిగితే తమకేమిటి? దేశభక్తి, తొక్కా అనుకుంటే మట్టిగొట్టుకుపోతాం. వాళ్ళిచ్చిన assignments నిర్వహిస్తే డబ్బు, కీర్తి, కెరియర్ అన్నీ ఇస్తారు. కాదంటే చావదన్నీ చంపుతారు. కాబట్టి దేశద్రోహమైనా సందేహపడక, సంకోచపడక చేసేయ్” అనుకునే స్వార్ధపరుల్ని నెం.10 ఏజంట్లు అనుకోవచ్చన్నమాట. అంటే నకిలీ కణికుడి ఏజంట్లన్న మాట. వీళ్ళమధ్య, ప్రపంచవ్యాప్తంగా, దేశాలకతీతంగా ఒక assignments circle, ఒక సంబంధాల గొలుసు ఉంటుంది. దీన్నే ‘అక్కడొకటి ఇక్కడొకటిగా పడి ఉన్న ఫూసలు అందరికీ తెలుసు. వాటిని గుచ్చేదారం ఒకటి అంతర్లీనంగా ఉందని తెలిసినప్పుడు కదా అక్కడో గొలుసుదాగుందని తెలిసేది’ అని వ్రాసాను తొలిటపాలలో. ఇదే వ్యాక్యాన్ని ఇలాగే వ్రాసాను 1992 లో పీవీ నరసింహారావు గారికి ఇచ్చిన రామోజీరావు రహస్య కార్యకలాపాల మీది ఫిర్యాదులో! అయితే ఈ నకిలీ కణిక ఏజంట్ల వర్గాన్ని నెం.10 తో ఎందుకు పోల్చానంటే బ్రిటీషు వారి వెనక చేరి నకిలీ కణికుడు తన వ్యవస్థను, తన సర్కిల్ ను నిర్మించుకున్నాడు కాబట్టి. అంతేగాక బ్రిటిషు ప్రధాని నివాసం 10 డౌన్ స్ట్రీట్ కాబట్టి, సౌలభ్యం కోసం దీనిని నెం.10 వర్గంగా నిర్వచించాను. అలాగే ఇక్కడ ఒక విషయం పరిశీలించండి. అమెరికాలో పైకి వచ్చిన చాలామందిలో, వారి మూలాలు బ్రిటన్ వి అయిఉంటాయి. మరో రకంగా చెప్పాలంటే మనదేశంలో పైకి వచ్చిన చాలామంది మూలాలు పాక్ లో ఉన్నట్లన్నమాట.

ఏది ఏమైనా ఈ నకిలీ కణిక-6 అల్లిన గూఢచార వలయం [ఇది అతడొక్కడే అల్లలేదు. అప్పటికి తరతరాలుగా, కొంత సమిష్టి కృషిగా ఈ పని నిర్వహించబడింది.] లో ఏ ఏజంటు అయినా [దేశాలకి అతీతంగా, పదవులకీ, కీలక స్థానాలకి అతీతంగా] వ్వక్తిగతంగా బలహీనుడే. తమ ఏజన్సీ, తమ కంటే చాలా బలమైనది అన్న ఒప్పుదల వారి నరనరాన ఉంటుంది. ఏజన్సీ చెల్లిస్తే తాము చెల్లుబాటు అవుతారు లేదా తెరమరుగైపోతారు. కాబట్టి ఏజన్సీకి దాసులై ఉంటారు. ఏ ఏజంటయినా పట్టుబడినా, అతడి ఉనికి ఆయా దేశాల పట్ల నిబద్దత గల వర్గానికి తెలిసిపోయినా, అలాంటి ఏజంటుని, ఆయా ఏజన్సీలు కూడా వదిలేసుకుంటాయి. కొండొకచో, అదే[ఆ ఏజన్సీయే] ఆయా ఏజంట్లని పడగొట్టి, ఆ శిధిలాల మీద మరో క్రొత్త ఏజంటుని నిలబెడుతుంది. అంటే సదరు ఏజంటుని విమర్శిస్తూ, ఖండిస్తూ, నానాయాగీ చేసీ మరో ’సచ్ఛీలుడు’ వెలుగులోకి వస్తాడు. జనం నిజమే గామోసు అనుకుంటారు. కొన్నేళ్ళు గడిచాక, ఈ ‘సచ్ఛీలుడి’ కంటే ఆ ’సచ్చినోడే’ పదిరెట్లు నయం అని తెలుస్తుంది. అప్పుడు అందరికీ అర్ధమౌతుంది, సదరు సచ్ఛీలుడు కూడా ముందట వాడి ఏజన్సీకి చెందిన ఏజంటే అని! కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. ఈ ఏజంటు బలపడిపోతాడు. ఇదే స్ట్రాటజీ ఇక్కడ.

కాబట్టే క్రమంగా వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అనుకోవలసి వచ్చిందన్న మాట. అయితే ఇక్కడ పచ్చినిజం ఏమిటంటే – ఏ ఏజంటు పట్టుబడినా జరిగే ఈ సాధారణ స్ట్రాటజీ, రామోజీరావు విషయంలో తిరగబడటం![ ‘ఇప్పుడు రామోజీరావు కూడా మసకబారుతున్నాడు కదా’ అంటారేమో! కాని ఇతడు ఈమాత్రం మసకబారటానికి ఇప్పటికి 17 ఏళ్ళ సమయం పట్టడం గమనార్హం. అంతేగాక, ఇప్పటికైనా ఇతడి పరిస్థితి ఇలా ఎందుకు పరిణమించిదో, దాని వెనక గల స్ట్రాటజీని సవివరంగా తెలియజేస్తాను.] ఎన్.రామ్ లూ, గోయంకాలు, ఉనికి బహిర్గత మయ్యాక వారి ముందటి స్థితితో పోలిస్తే మసకబారి పోయారు, వారి కోసం వారి ఏజన్సీ, అది సి.ఐ.ఏ. కానివ్వండి, మొస్సాద్ కానివ్వండి, హీనపక్షం ఐ.ఎస్.ఐ. కానివ్వండి, వారికోసం ఏమాత్రం పాకులాడలేదు. అదే రామోజీరావు విషయంలో అయితే – సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.లు, రామోజీరావుని కాపాడుకోవటానికి ఒడ్డిపోరాడుతున్నాయి. అదే లంకలో రాజపక్సే Vs వేలుపిళ్ళై ప్రభాకరన్ ల వ్యవహారంలో మరింత ప్రస్ఫుటంగా కనబడింది.

స్ధూలంగా చెప్పాలంటే ప్రపంచమంతా ఇప్పుడు ఓ ప్రక్క నకిలీ కణిక వ్యవస్థ గానూ, మరోప్రక్క ఆయా దేశాల పట్ల నిబద్దత గల వ్యక్తులంతా కలిసి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంతగా సమైక్యమై, తమ తమ దేశ ప్రయోజనాల కోసం, మానవత్వం కోసం, మనుగడ కోసం, పోరాడుతున్న వర్గంగానూ చీలిఉంది. నకిలీకణిక వ్యవస్థని సౌలభ్యంకోసం 10 వర్గం అనుకుంటే, దాని వ్యతిరేక వర్గం నెం.5 అనుకోవచ్చన్న మాట. అంటే స్థూలంగా ప్రపంచమంతా No.10 మరియు No.5 వర్గాలుగా చీలి ఉందన్న మాట.

ఇది టూకీగా చెప్పాను కాబట్టి, మీకు కొంత గందరగోళంగానూ, తార్కికంగా అవరోధాలున్నట్లుగానూ అన్పించవచ్చు. అందుచేత దీన్ని వివరంగా చెబుతాను.

నకిలీ కణిక-6, రెండుప్రపంచయుద్ధాల నేపధ్యంలో, నిగూఢంగా తాను నడిపిన స్ట్రాటజీలు విజయవంతం కావటంతో చాలా బలపడ్డాడు. అతడి నుండి నకిలీ కణిక-7 పగ్గాలు పుచ్చుకున్నాడు. ఈ నకిలీ కణిక-7 రామోజీరావేనా కాదా అంటే, అతడు కావచ్చు లేదా అతణ్ణి ప్రస్తుతం ప్రొజెక్ట్ చేస్తూ అసలు నకిలీ కణిక-7 ప్రచ్ఛన్నంగా ఉండి ఉండవచ్చు. అయితే రామోజీరావే నకిలీ కణిక-7 అనడానికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి అవి చెప్పేముందు నకిలీ కణిక-6 దగ్గర నుండి మళ్ళీ వివరణ ప్రారంభిస్తాను.

నకిలీ కణిక-6, ఐరాస ముసుగులో ప్రపంచం మీద ఎంతగా అదృశ్య పట్టు సాధించాడో గత టపాలలో వ్రాసాను. అప్పటికే నకిలీ కణిక-6, అతడి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా పెంచటం, ముస్లింలని బలమైన వర్గంగా చెయ్యటంలో బాగానే కృతకృత్యులయ్యారు. మీరు గమనించి చూడండి. సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఒపెక్ దేశాలు గట్రా గట్రా…. ముస్లిం దేశాల పట్ల ఒక ఇమేజ్ పూర్వకంగా పత్రికలు వ్రాస్తాయి. టీవీలు చూపుతాయి. [ఖచ్చితంగా చెప్పాలంటే ఈ స్థితి 1992 కు పూర్వం మరింత ప్రస్ఫుటంగా ఉండేది] బ్రూనే సుల్తాన్ ఐశ్వర్యం గురించి ఎంత ప్రత్యేక కథనాలు నడిచేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. బ్రూనే సుల్తాన్ శరీరం ఎంత ప్రత్యేకమైనదో తెలియదుగానీ, సదరు సుల్తాన్ గారి టాయిలెట్ శుభ్రపరిచే టాయిలెట్ బ్రష్ కూడా బంగారంతో చెయ్యబడిందన్న వార్త ఊదరపెట్టేంతగా ప్రచారింపబడింది. ఇక సుల్తాన్ గారి సోదరుడికి 3.000 కార్లు, 360 మంది ప్రియురాళ్ళు[భార్యలు, ఉంపుడు గత్తెలతో కలిపి] ఉన్నారని, అదేదో ’అబ్బురం’ అనిపించేరీతిలో వార్తాకధనాలు చాలా వచ్చేవి. [భోగలాలసులకి, తెలిసీ తెలియని వయస్సులో ఉన్న ఆకతాయిలకి రోజుకొకరితో శృంగారం అన్న క్రేజుని, చెడుపట్ల మోజుని పుట్టించడం ఇక్కడ స్ట్రాటజీ.] 1992 తర్వాత సదరు సుల్తాన్ సోదరుడు, ఆర్ధికనష్టాల పాలయ్యి, కార్ల అమ్మకం దాకా దిగజారాడు. అంతలోనే గత సంవత్సరం అంటే 2008 లో ముడి చమురు ధరలు అమాంతం 140+ డాలర్లకు ఎగబాకినప్పుడు మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా కోలుకున్నాడు.

ఇక, ఏదేశమైనా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా పెరగటం, ముస్లింలకు గారాబం నడవటం మనకి బాగా తెలిసిందే! ఏకంగా కొన్నిదేశాలు, అవి బౌద్ధ దేశాలు కానివ్వండి, ఇతర మతాల దేశాలు కానివ్వండి, ముస్లిం దేశాలుగా పరిణామం చెందాయి. ప్రపంచంలో మిగిలిన దేశాలు సైతం ముడి చమురు నిల్వలు కలిగి ఉండగా, పెట్రోలియం ఉత్పత్తులును అమ్మగలిగి ఉండినా, కేవలం ఒపెక్ దేశాల అధిపత్యమే ప్రపంచాన్ని శాసించింది. ఇదీ నకిలీ కణికుల స్ట్రాటజీనే. బంగారం, వజ్రాల గనులు కలిగిన దక్షిణాఫ్రికా దేశం, తన విలువైన ఉత్పత్తులని, ముడి వస్తువులని, ఒపెక్ దేశాలు పెట్రోలు అమ్ముకున్నంత ’జబర్ధస్తీ’గా అమ్ముకోలేక పోయింది. అంతెందుకు? మనదేశంలో, మనరాష్ట్రంలో విలువైన వజ్రాలు, జాతి రాళ్ళు, గనులలోని ఇతర విలువైన ఖనిజాలు, చాలా మామూలుగా కొల్లగొట్టబడుతున్నాయి. తరలి పోతున్నాయి. రాష్ట్రానికి, దేశానికి మాత్రం దమ్మిడి ఆదాయం లేదు, రాదు. అచ్చంగా అలాగన్నమాట! అదే, ప్రపంచ ముడి చమురు మౌలిక ఉత్పత్తిలో 40% వాటా మాత్రమే కలిగి ఉన్న ఒపెక్ దేశాలు ప్రపంచానే శాసించాయి, శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, మీడియా, పెట్రోలు మైలేజ్ ఎక్కువ వచ్చే వాహన మోడళ్ళపై మోజు పడనివ్వదు. ఎంత మైలేజ్ వస్తేనేం, మోడల్ క్రేజ్ ముఖ్యం కదా! యువతలో ’ఫలానా మోడల్ పట్ల వెర్రెత్తిపోతుంది. దాని ముందు మైలేజ్ ఎక్కువ అన్న అంశమే పట్టించుకోవటం లేదు’, గట్రా ప్రచారాలతో హోరెత్తిస్తోంది. పెట్రోలు, డీజలుకు ప్రత్యామ్నాలు కనుగొనబడవు. అధవా ఎవరైనా ఔత్సాహికుడు అలాంటి ప్రత్యామ్నాయం కనుగొన్నా అది ప్రచారంలోకి రాదు. క్రమంగా కనుమరుగైపోతుంది. లేదా ఆ ఔత్సాహికుడు అనవసర గొడవల్లో చిక్కుకుని అల్లాడతాడు. మైలేజ్ ఎక్కువ వచ్చే వాహన మోడళ్ళు ప్రోత్సహించబడవు. అలాంటి వాహన తయారీ కోసం అన్వేషణ సైతం తక్కువే. సౌరశక్తి, వాయుశక్తి గట్రా ప్రకృతి వనరులు, సాంప్రదాయేతర వనరులు…. ఉహు! ఏవీ అభివృద్ధి కి నోచుకోవు. అవి చౌకంగా అందించబడే పద్దతుల మీద పరిశోధనలు ఎట్టిపరిస్థితులలో జరగవు.

ఇక పాకిస్తాన్, ప్రపంచంలోని అందరికీ చంకదిగని గారాబు బిడ్డ కావటం చూస్తునే ఉన్నాం. ఈ ముస్లిం గారాబానికి, పాక్ ప్రాబల్యానికి కారణం నకిలీ కణిక వ్యవస్థే! ముస్లింల మత ఛాందసం, తమకి బాగా ఉపయోగపడుతున్నది ఇందుకు ఒక కారణం. ముస్లిం యువకులకి మత మౌఢ్యం నూరిపోవటం, తద్వారా వాళ్ళని మానవ యంత్రాలుగా మలచి, ఏలాంటి పనినైనా సాధించటం, నేడు తాలిబన్ల రూపంలో చూస్తున్నాం. ముస్లింలకి బాల్యం నుండే ఈ రకపు మత మౌఢ్యాన్ని నూరిపోయటం చాలా సులభం. ముస్లిం పెద్దలకి మకార త్రయంలో కొన్నో, అన్నో, అందిస్తే ఆ ’పెద్దలు’ ఎంతటి కర్మకైనా పాల్పడతారన్నదీ వర్తమానం నిరూపించింది. ఇక పాక్ అంటే మాత్రం, నకిలీ కణికులకి మొదటి తరం నుండి నేటి 7వ తరం దాకా అందరికీ వల్లమాలిన అభిమానం, ప్రేమ, ఏకపదంగా చెప్పాలంటే పాకిస్తాన్ నకిలీ కణికులకి బహిః ప్రాణం.

కాబట్టే స్వాతంత్ర సమరం ముమ్మరంగా నడుస్తున్న సమయంలో పట్టుబట్టి పాకిస్తాన్ ని ఏర్పరుచుకోవటంలో, అంతకు ముందు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రయత్నం ఉంది. అతి జాగ్రత్తగా ఇండియాకి రెండు వైపులా రెండు పాకిస్తాన్ లని పెట్టారు. బ్రిటీషు రాజవంశమే ఇదంతా చేసి ఉండొచ్చు గాక. కానీ ఆ రాజవంశానికి తెలిసిందేమీ లేదు. దానిపరంగా ఆలోచిస్తే తనకి మళ్ళీ ఇండియాని కట్టబెట్టడానికి అనుకుంది. ఆ విధంగా బ్రిటీషు ప్రభుత్వాన్ని పైబొమ్మగా[over leaf reason] నకిలీ కణికుడు వాడుకున్నాడు. అదీ నకిలీ కణికుడి యొక్క గూఢచార ఆధిపత్యం!

ఇక ఈ రెండు పాకిస్తానులూ గాక, హైదరాబాదు నిజాం, ‘మధ్య పాకిస్తాన్’ అన్నాడు. ఈ విషయంలో సర్ధార్ పటేల్ కు భారతజాతి ఖచ్చితంగా ఋణపడి ఉంది. అప్పటికే లేడీ బాటన్ చేతిలో చిక్కో, లేక ఆ బ్లాక్ మెయిలింగ్ కి వెనుకంజవేసో, లేక ఇతరత్రా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ, నెహ్రూ కాశ్మీరు ఉదంతాన్ని ఐరాసకి నివేదించాడు. అది ఎంతగా కందిరీగల తుట్టె మాదిరి తయారయ్యిందో స్వాతంత్రానంతర భారత చరిత్ర నిరూపించింది. అప్పటికి ఐరాస పుట్టి రెండుమూడేళ్ళు కూడా పూర్తికాలేదు. దాని తాతవంటి నానాజాతి సమితి అప్పటికే ఘోరవైపల్యం చెందింది. మరే ఆశతో, నమ్మకంతో ఐరాసకి కాశ్మీరు సమస్య నివేదించినట్లు? అలాగే ఏ ఆశతో, ఏ నమ్మకంతో హైదరాబాద్ 7 వ నిజాం కూడా, హైదరాబాద్ సంస్థానపు విషయాన్ని ఐరాసకి నివేదించాడు? అతడు నివేదించీ నివేదించగానే గబుక్కున ఐరాస స్పందించింది ఎందుకు? ఇక మరిన్ని ఆటలకి తావివ్వకుండా, సర్ధార్ పటేల్, నెహ్రూ తో సైతం చెప్పకుండా పోలీసు చర్య చేపట్టాడు గనుకా, అందులో 48 గంటలు తిరక్కుండానే నిజాం కాలికి బుద్ది చెప్పి పాకిస్తాన్ కి పారిపోయాడు గనుకా, ఐరాసతో సహా అన్నిదేశాలూ నోరు మూసాయి గానీ లేకపోతే ఎంత యాగీ చేసి ఉండేవో?

నకిలీ కణికులకీ, ముస్లింలకీ ఏమిటి సంబంధం? నకిలీ కణికులకీ పాకిస్తాన్ కీ ఏమిటి సంబంధం? నకిలీ కణికులు పాక్ ని తమ స్థావరంగా [Den]గా వాడుకుంటున్నందునో, ఇతరత్రా మరో కారణం ఉందోగాని, పాక్ భూభాగం వారికి బహిఃప్రాణం. ఇక హైదరాబాద్ గడ్డ అయితే పంచప్రాణాలూ! USSR కుప్పకూలిపోయి, ముక్కలూ చెక్కలూ అయ్యాక, ఎక్కడ ఉన్న ఆయుధాలు[అణ్వస్త్రాలతో సహా] ఏమయిపోయాయో ఎవరికీ తెలియదు. పటిష్టమైన ప్రభుత్వమో, మరో వ్యవస్థో ఉంటే కదా ఏ లెక్కలైనా తేలేది, ఏ వివరమైనా బయటికొచ్చేది? అలాగే పాకిస్తాన్ లో కూడా!

ఆవిధంగా పాకిస్తాన్ భూభాగం, నకిలీ కణికుడికి ఏ కారణంగానైతే నేమి, బహిఃప్రాణమే. ఇక ముస్లింలకి మత మౌఢ్యం ఎక్కించటం సులభం గనుక, నకిలీ కణికుడికి ముస్లింలంటే అతిప్రేమ. కొంత జన్మతః ఇష్టమూ, ప్రాధన్యతా కూడా ఉన్నాయనుకొండి!

ఇక్కడ ముస్లింల మతమౌఢ్యం గురించి ఓ ఉదాహరణ చెబుతాను. ముస్లిం పిల్లల్ని, [చిన్ని కుర్రవాళ్ళని] గమనించండి. ఎక్కడైనా తొండ కన్పిస్తే రాళ్ళు విసిరి దాన్ని చంపేప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకూ చంపకుండా వదిలిపెట్టరు. జీవ హింస వద్దని వాళ్ళ పెద్దవాళ్ళెవరూ వాళ్ళని వారించరు. ఇతరులెవరైనా వారించినా ఆ పిల్లలు ఖాతరు చెయ్యరు. ఇంతకీ ముస్లిం పిల్లలు తొండలనెందుకు చంపప్రయత్నిస్తారయ్యా అంటే ఒకానొకప్పుడెప్పుడో, మహమ్మదు ప్రవక్త మనుమడు బావిలో దాగుంటే, తొండ తన మెడని పైకి క్రిందికి వూపుతూ శతృవులకు వారి జాడ చెప్పిందట. దాంతో శతృసైనికులు వాళ్ళని చంపేసారట. అందుచేత, ప్రతీకారంగా ముస్లిం పిల్లలు తొండలని చంపుతారు. అది, కనీసం తమ ప్రవక్త మనుమణ్ణి చంపిన శతృవుల వారసులని చంపడం కూడా కాదు. సమర్ధనీయం కాకపోయినా, కనీసం అది ప్రతీకారేచ్ఛ అనన్నా అనుకోవచ్చు. ఇది అలాంటిది కూడా కాదు. అమాయక ప్రాణి హింస! తొండ దాని శారీరక స్వభావ సిద్దంగా మెడపైకి క్రిందికీ వూపుతుంది. అదీగాక వందల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పబడే సంఘటన! నిజంగా జరిగిందో లేదో! ఇప్పటికీ పురుగులేరుకు తినే ఆ చిన్ని ప్రాణుల్ని చంపాలా? ఎక్కడో సౌదీ అరేబియాలోనో, ఆ చుట్టుప్రక్కలో జరిగిన గతం, అందులో ప్రచారం ఎంతో తెలియని గతం, కానీ ఆ ప్రకారం మాత్రం ముస్లిం పిల్లలు తొండల్ని రాళ్ళతో కొట్టిమరీ చంపుతారు, ముస్లిం పెద్దలూ వారించరు. అదీ వారి మౌఢ్యం! అసలయినా మనుష్యుల్లో సగభాగమైన సాటి మనిషి, ‘స్త్రీ’నే మనిషిగా గుర్తించని, గౌరవించని ముస్లింలు, ఇక ప్రాణుల్ని ఏపాటి గుర్తిస్తారూ, గౌరవిస్తారు? వారి మౌఢ్యం ఆపాటిది గనుకనే, తాలిబాన్లను తయారు చేయటం బిన్ లాడెన్ కైనా, అతడి వెనుక ఉన్న వారికైనా సాధ్యమైంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2009 వ సంవత్సరానికి 10 వ తరగతి పరీక్షా ఫలితాలు 27/05/09 న వెలువడ్డాయి. దాదాపు 13 ½ లక్షల మంది విద్యార్ధుల శ్రమ ఫలితాలని, భవిష్యత్తుని వెల్లడించాయి. అందులో 78.5% విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. అందులోనూ సగం ఫస్ట్ క్లాసులే. ఇదే 10వ తరగతి విద్యార్ధులు, మరో సంవత్సరం తర్వాత, ఇంటర్ ప్రధమం వ్రాసేటప్పటికి 43% మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఇది గత సంవత్సరాల నుండి ఈ సంవత్సరం వరకూ జరుగుతున్నదే. ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రధమ పరీక్షలో 43% మాత్రమే ఉత్తీర్ణత ఉండగా, క్రితం సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణత శాతం ఇప్పటిలాగే 75% నికి పైమాటే. పదవతరగతి తర్వాత, అంతంతమాత్రపు ఆర్ధికస్థాయి ఉన్న విద్యార్ధులు, అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులూ, పైచదువులకు వీడ్కొలు చెప్పారనుకున్నా కూడా, ఇంటర్ పరీక్షలు వ్రాసిన 7 లక్షల పైచిలుకు విద్యార్ధుల్లో నుండి, కనీసం 75% కాకపోయినా 70 శాతమన్నా ఉత్తీర్ణత ఉండాలి కదా! ఉండదు. ఎందుకంటే అందులోనూ ఎన్నో కార్పోరేట్ వ్యాపార తంత్రాలున్నాయి గనుక.

పదవ తరగతిలో ఎంతమంది విద్యార్ధులు ఉత్తీర్ణులైతే, అంతగా కార్పోరేట్ కాలేజీలకు ఆదాయవనరులు లభ్యమైనట్లే. కాబట్టే పదవతరగతిలో ఉత్తీర్ణతా శాతం అత్యధికం ఉంటుంది. అందులోనూ సగం మంది ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారంటే ఇక అంతగా కార్పోరేట్ కాలేజీలకు మార్కెట్ లభించినట్లే. సెకండ్ క్లాసో, సాధారణ ఉత్తీర్ణతో పొందిన విద్యార్ధులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ M.P.C., Bi.P.C. ల్లో చేరడానికి, చేర్పించడానికి అందునా కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళడానికి జంకుతారు. అదే ఫస్ట్ క్లాసులు వస్తే? ఒక ఆశ. జీవితం పట్ల ఒక చిరు ఆశ. “ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా! ఏమో ఎవరు చూడ్డొచ్చారు? ఇంకొంచెం కష్టపడితే ఇంటర్ లో మంచి మార్కులు, ఎంసెట్లో మంచి ర్యాంకులూ వస్తాయి. పిల్లవాడు/పిల్ల ఇంజనీరో డాక్టరో కావటం కంటే కావలసింది ఇంకేమిటి? ఎలాగోలా కష్టపడి, అప్పోసప్పో చేసి, పెద్దకాలేజీల్లో చేర్పిస్తే మంచిఫలితాలొస్తాయి” – ఈ ఆకాంక్షతో అమాయక తల్లిదండ్రులూ, జీవితం పట్ల ఆశలూ, ఆకాంక్షలతో పిల్లలూ సాహసిస్తారు.

కాబట్టే పదవతరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్ధుల శ్రమ పాత్ర పరిమితంగానే ఉంటుంది. ప్రభుత్వం, కార్పోరేట్ విద్యాసంస్థల మధ్య గల అనుబంధాల పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఇక, ఇంటర్ తర్వాత విద్యార్ధులు ఇంజనీరింగ్ వైపు వెళ్తే, ఆ కథ వేరు కదా! డిగ్రీ విద్యార్ధుల మీద నడిచే వ్యాపారం, ఎంసెట్ ఐఐటి వ్యాపారాలతో పోల్చితే, పెద్దగా చెప్పుకోదగిందికాదు. అందుచేతే పదవతరగతి ఫలితాలు 78% శాతాల్లోనూ, ద్వితీయ, ప్రధమ ఇంటర్ ఫలితాలు 60 to 40 శాతాల్లోనూ ఉంటాయి.

ఇక ఈ సంవత్సరం పదవతరగతి ఫలితాలలో రాయలసీమ వారి హవా నడిచిందట. ‘సీమ గుమ్మానికి చదువుల పారాణి’ వంటి శీర్షికలతో, పత్రికలు ప్రధానంగా వ్రాసాయి. దాదాపుగా అత్యధిక ర్యాంకులు నంద్యాల బ్రాంచ్ నుండే వచ్చాయి. మా నంద్యాలలో ప్రముఖ కార్పోరేట్ విద్యాసంస్థ కేశవ రెడ్డి స్కూలు, రాష్ట్ర టాప్ 10 ర్యాంకుల్లో 15 ర్యాంకులు పొందింది. ఇదే సంస్థ పోయిన సంవత్సరం టాప్ 10 లో 8 ర్యాంకులు పొందింది. ప్రతీ సంవత్సరం ర్యాంకర్లతో, పూలగుత్తులతో, ముఖ్యమంత్రితో, ఫోటో ప్రదర్శన ఈ సంస్థ ప్రత్యేకతన్నమాట. కడప జిల్లాకి అంతంత ప్రయోజనాలు సమకూర్చే రాయలసీమ రారాజు రాజశేఖర్ రెడ్డి, కడపకు పొరుగునున్న కర్నూలు జిల్లాలోని కేశవ రెడ్డి కార్పోరేట్ పాఠశాలకు, ఆమాత్రం ప్రయోజనం సమకూర్చడం వింతేమీ కాదు. అసలే మన ముఖ్యమంత్రిగారు చెప్పినవి, చెప్పనవి అన్ని ప్రయోజనాలు కల్పిస్తారు కదా! అందునా ఉదారంగా వితరణ లీయగల కేశవ రెడ్డి మరి! కాబట్టే ఈసారి పదవతరగతి ఫలితాలలో కేశవరెడ్డి స్కూలు విద్యార్ధులు, నారాయణ, విజ్ఞాన్, వికాస్, శశి, విశ్వశాంతి, విశ్వభారతి, రవీంద్రభారతి ఇత్యాది పేరేన్నిక గన్న స్కూళ్ళన్నిటినీ ఊడ్చి పారేసారు. పైన పేర్కొన్న ఏ ఒక్కస్కూలుకీ 580 కంటే మించి మార్కులు రాలేదు. ఆ ఆత్మవిశ్వాసమే పొంగి పొరలుతుండగా, కేశవరెడ్డి స్కూలు, సగర్వంగా, "ఆ చరిత్ర విస్తుపోయేలా… రాష్ట్రం నివ్వెరపోయేలా… ఇకపై వేరెవ్వరూ ఛేదించలేని మరో చరిత్ర” అని వ్రాసుకుంది. [ఇక్కడ కేశవ రెడ్డి స్కూలు ఒక విషయం మర్చిపోయినట్లుంది. ఈ మోసాలకు గురువు, శ్రీ చైతన్య కాలేజీ బి.ఎస్.రావు, స్కూళ్ళ వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. తర్వాత కాలంలో అన్ని అవకాశాలు ఎవ్వరికి ఇవ్వడు.]

ఇదే నేపధ్యంలో, మరో స్కూలు గౌతమ్ మోడల్ స్కూల్స్ ’నిజాయితీ మార్కులకు నిజమైన నేస్తం’ అన్న ఉపశీర్షికతో పత్రికలో వాణిజ్య ప్రకటన విడుదల చేసుకుంది. దీనిభావం ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది. [నిజాలు వెలికితీసే మీడియాకు, విద్యారంగానికి సేవ చేసే మేధావులకు ఎప్పుడు అర్ధమవుతుందో] 2007 లో 7వ తరగతికి ఉత్తీర్ణత పరిగణనలో ఉన్నప్పుడు, ర్యాంకులూ, మార్కుల విషయంలో, ఇలాగే విద్యాసంస్థలు మా నంద్యాలలో పోటాపోటీకి దిగి, పరస్పర విమర్శల యుద్దం చేసుకున్నాయి. అది ఎంత వరకూ పోయిందంటే – కరపత్రాలు ముద్రించి మరి, ఎవరు ఎన్ని మార్కులు, ఎన్ని ర్యాంకులూ కొనుగోలు చేసారో బట్టబయలు చేసుకునేదాకా! తర్వాత విద్యాశాఖాధికారుల జోక్యంతో అంతా సద్దుమణిగింది లెండి.

దానాదీనా తేలేది ఏమిటంటే – విద్యా వ్యాపార రంగంలో, ఎవరికి లాబీయింగ్ బాగా నడుస్తుంటే వారికి ర్యాంకుల పంట, మార్కుల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్న మాట. అవి చూపి అడ్మిషన్ల కాసులు రాసులుగా రాబట్టుకుంటారు. కాబట్టే ఒక ప్రభుత్వహయంలో, ఒక ప్రాంతం వారికి లేదా కొన్ని విద్యాసంస్థల వారికీ ఫలితాలు అత్యుత్తమ స్థాయిలో వస్తాయి. ఒకప్పుడు విజ్ఞాన్, వికాస్, మరో XYZ లేదా ABC విద్యాసంస్థలకు ఇలాగే హవా నడిచింది. ఇప్పుడు వాటి స్థానంలోకి కేశవరెడ్డి, భాష్యం వగైరా వగైరాలు వచ్చాయి. అంతే!

మొత్తంగా, ఓట్లు వేసి ప్రభుత్వాలని ప్రతిష్ఠించడంలో ప్రజలు నిమిత్తమాత్రులు. అలాగే కష్టపడి చదివి మార్కులూ ర్యాంకులూ సంపాదించటంలో విద్యార్ధులు నిమిత్తమాత్రులు. అద్భుతము, అపూర్వము అనదగ్గరీతిలో, కార్పోరేట్ విద్యాసంస్థల పరిభాషలో చెప్పాలంటే ‘విస్తుపోయిన చరిత్రలూ, నివ్వెరపోయిన రాష్ట్రం’ సాక్షిగా ఆయా కార్పోరేట్ విద్యాసంస్థల ఫలితాలతో విద్యార్ధులూ, వారి తల్లిదండ్రులూ [ర్యాంకులూ, మార్కులు పొందిన వారే సుమా!] ఆనందంగా ఉన్నారు. ఆ ఫలితాల ప్రభావంతో వెల్లివెత్తిన అడ్మిషన్ల వరదలో ఆయా కార్పోరేట్ విద్యాసంస్థలు ఆనందంగా ఉన్నాయి. ప్రతిఫలంగా అందుకున్న ’ప్రయోజనాలతో’ ప్రభుత్వాధికారులూ, మంత్రి, ముఖ్యమంత్రీ ఆనందంగా ఉన్నారు. కాబట్టి మనసారా మనం చెప్పుకోవచ్చు అందరూ ఆనందంగా ఉన్నారని! ఏమంటారు?

అంతా బాగానే ఉంది గానీ, మరి భవిష్యత్తులో దేశపు సత్తా మాటేమిటి?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇక ఐరాస పనితీరులో అంతర్జాతీయ న్యాయస్థానం ఎంత బూటకమో అందరికీ తెలిసిందే. పెద్దన్నలు ఏది చేసినా ఒప్పు. చిన్న తమ్ముళ్ళు ఏది చేసినా అది తప్పు. ఉదాహరణకి లంక సైన్యం, LTTE మీద యుద్దం ప్రకటిస్తే, యుద్దం చేస్తే అది తప్పు. LTTE కి లెబనాన్ శిక్షణ ఇస్తే అదెవ్వరికీ తప్పనిపించలేదు. LTTE అమానుషహత్యలు చేస్తే, అది పెద్దన్నల అభీష్టం గనుకా, నకిలీ కణికుల అభీష్టం కనుకా, అదెవ్వరికీ తప్పనిపించలేదు. నిజానికి సింహళీయులు ఉత్తరభారతం నుండి లంకకు వలసపోయిన బౌద్ధులు. తమిళులు, బ్రిటిషు హయంలో దక్షిణ భారతదేశం నుండి లంకకు వలసపోయిన హిందువులు. భాషా సమస్య అక్కడ లేవనెత్తిబడింది. ఆపైన రాజకీయం చెయ్యబడింది. లంకలో తమిళుల్ని భాష కావాలా, ఉద్యోగం కావాలా అంటే భాష కావాలి అంటారన్నది, పదేపదే ప్రచారించిన అసత్యం. కాకపోతే, ఎంతోమంది తమిళులు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు నుండి వలస వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఖండాంతర సీమలకు, బ్రతుకుతెరువుకై వలసపోయిన తమిళులున్నారు. వారంతా అక్కడ తమ భాష కోసం ఉద్యమాలు చేస్తున్నారా? ఒకప్పటి నిజాం సంస్థానంలో, రాత్రికి రాత్రి ఉర్దూని అధికార భాష చేసి, ఒక్కరోజులో ఉర్దూరాని హిందువులంతా నాటి ప్రభుత్వోద్యోగాలకి అనర్హుల్ని చేయటంతో పాటు, దాదాపు నిరక్షరాస్యులుగా ముద్రవేయబడ్డారు. అప్పుడు పుట్టుకొస్తుంది భాషాభిమానం. నిజానికి ఆ అభిమానపు మూలాలు ఆర్దిక వనరుల్లో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో ఉన్నాయి. మాతృభాషలో పట్టభద్రులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగార్హులు, కాంట్రాక్టులకు అర్హులు, వ్యాపార పర్మిట్లకు, లైసన్సులకు అర్హులు అంటే, మరు నాటికల్లా తెలుగు బి.ఏ.లకు, ఎం.ఏ.లకి ఎక్కడ లేని డిమాండ్ పుట్టుకొస్తుంది. దెబ్బకి, ఎవరూ, ఏబ్లాగ్లోకాల్లోనో, అహర్నిశలూ కృషి చెయ్యకుండానే తెలుగు బ్రహ్మండంగా వృద్ధి చెందుతుంది. [బ్లాగ్లోకం అని ఎందుకన్నానంటే తెలుగు గురించి ఆమాత్రం ఆలోచిస్తున్నది, అభివృద్ధి అవ్వాలన్నా తపన ఉంది ఇక్కడే కాబట్టి. అంతే!] కాకపోతే ఇలాంటి ఉద్యమాలన్నిటికీ మూలకారణం మరుగుపరచబడి, క్రింది స్థాయి కార్యకర్తకి ప్రచారం మాత్రమే ఒంటబడుతుంది. దాంతో పైస్థాయిలో అధినాయకత్వం ఉద్యమాన్ని ఆర్ధిక సామాజిక రాజకీయ ప్రయోజనాలకు మారకం వేసుకుంటుండగా, క్రింది కార్యకర్త స్థాయి వ్యక్తులు మాత్రం గొంతుచించుకు అరుస్తూ, కిరసనాయిలుతో శరీరాల్ని తగలెట్టికుంటూ ఉంటారు. ఇక ఈ భాషా ఉద్యమాన్ని ప్రక్కన పెట్టి మళ్ళీ ఐరాస దగ్గరికి వద్దాం.

లంకలో అంతర్యుద్దం నేపధ్యంలో ఐరాస, బ్రిటన్, ఫ్రాన్సులు లంకని ‘యుద్దనేరం ఎదుర్కోవలసి వస్తుంది జాగ్రత్త సుమా!’ అని హెచ్చరించాయి, ఒత్తిడి చేశాయి. అదే ఇప్పుడు పాకిస్తాన్, నిన్నమొన్నటి వరకూ తాలిబాన్లతో షరియత్ చట్టం చేసుకుని, హఠాత్తుగా మార్చుకున్న స్ట్రాటజీలో, తాలిబాన్లతో యుద్దం చేస్తున్నానంటూ స్వాత్ లోయలో ప్రజల్ని ఖాళీ చేయిస్తుంటే, అంతర్యుద్దం పేరుతో ప్రజలు నానాబాధలకీ గురవుతుంటే కిమ్మనికూడా అనటం లేదు. ఎందుకంటే అది మరి పాకిస్తాను! ఇస్లామాబాద్ కి అసలే బలం ఎక్కువయ్యే! ఎందుకంటే అది నకిలీ కణిక వ్యవస్థకి బహిఃప్రాణం కదా? కావాలంటే మరో దృష్టాంతం చూడండి. సెప్టెంబరు 11, 2001, WTC పై ఆల్ ఖైదా, తాలిబాన్ల [పేరు ఏదయినా ఒకటే, చేసేది హింస] దాడి నేపధ్యంలో అమెరికా, ‘బిన్ లాడెన్ ఆఫ్గానిస్థాన్ లోని తోరోబోరా గుహల్లో దాగున్నాడంటూ’ రయ్యిన, ఆఘమేఘాల మీద యుద్దానికెళ్ళింది. కార్పెట్ బాంబింగ్ తో దుమ్మురేపి పారేసింది. ఆపైన ఇరాక్ మీదకీ, అలాగే ఒంటికాలిమీద వెళ్ళింది. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్సులతో సహా అన్నీ ఆమోదించాయి. ఐరాస సరేసరి. సరే, మరి లాడెన్, తాలిబాన్లు అమెరికా WTC మీద దాడి చేశారు కదా! కారణం సబబే అన్నారు. నిజమే మరి. అదే తాలిబాన్లు పాకిస్తాన్ లో ఉన్నారని అందరికీ తెలుసు. లాడెన్ సైతం ఆ పాక్ లోనే ఉన్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మీదు మిక్కిలి పాకిస్తాన్, స్వాత్ లోయలో తాలిబాన్లతో హరియత్ చట్టానికి ఒప్పుకొని, బాహాటంగానే తాలిబాన్లతో తన మమేకాన్ని నిరూపించుకుంది. ఇప్పుడు కూడా యుద్దం అన్న మాటపైకి చెబుతూ, తాలిబాన్లూ, పాక్ సైన్యం కలిసి అక్కడి ప్రజలని [అప్పటికే సిక్కుల ఇళ్ళను తాలిబాన్లు ఆక్రమించి, జిజియా(పన్ను)వసూలు చేశారు. ఇప్పుడు సిక్కులు నిరాశ్రయులై వలసలు పోవలసి వస్తుంది.] ఆ ప్రాంతం నుండి వెళ్ళగొడుతోంది. మరే భవిష్యత్తు ప్రయోజనాల కోసమో చోటు ఖాళీ చేయిస్తోంది. అంతే! ఇంత జరుగుతున్నా, ఏదేశమూ, ఐరాస తో సహా, పాకిస్తాన్ ని ఒక్క హెచ్చరికా చెయ్యటం లేదు. సరికదా, అమెరికా అయితే, ముద్దుగా తిడుతూ, పాక్ కి ఆర్ధికసాయం అదీ కోట్ల డాలర్లలో, మునుపటి ప్రభుత్వం కంటే రెండింతలు ఎక్కువ, ఇస్తోంది. సాయం చేస్తూ తిడుతోంది. ఏమాటలు అంటేనేం? చేతల్లో మాత్రం, దండిగా డాలర్లు అందిస్తోంది. అదే నోటితో ఇంతకు క్రితం తము చేసిన ఆర్ధికసాయంతో ఐ.ఎస్.ఐ. తాలిబన్లకు మప్పబెట్టిందని అమెరికా ఆరోపించింది. ఐరాస తానే కాకుండా, ఇతర దేశాలను కూడా, పాకిస్తాన్ కు సాయం చెయ్యమని చెబుతోంది. బహుశ భవిష్యత్తులో మన ప్రధాని, మానవత దృష్టితో పాకిస్తాన్ కు సాయం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒకరెండురోజులు హడావుడి చేసి, తరువాత కిమ్మనకుండా ఉన్నా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

మునపటిలా ’ఇండియా అమెరికా కి వ్యతిరేకం. ఇండియాని కట్టడి చెయ్యటం కోసం పాకిస్తాన్ ని అమెరికా దువ్వుతోంది’ అనటానికి కూడా లేదు. ఎందుకంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగు బాహాటంగానే ‘బుష్ కి ముఖం ఎలా చూపెట్టుకోను?’ అంటూ, నిర్మోహామాటంగానూ, నిర్లజ్జగానూ అమెరికా పాదాలకు మోకరిల్లారు. అణు ఒప్పందంతో, రెండు దేశాల మధ్య స్నేహ సౌరభాలు విరజిమ్ముతున్నాయనీ, సహకార సంబంధాలు వెల్లివిరిసాయనీ ఉభయ దేశాధినేతలూ, ఒండొరులని హత్తుకుని మరీ ఐక్య ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా పాకిస్తాన్ ని అంత బుజ్జగించాల్సిన అవసరం, భుజానికెత్తుకుని పోషించాల్సిన అవసరం, అమెరికాకి ఎందుకున్నట్లు? మీదు మిక్కిలి తనకి అంతగా పడని చైనాని సైతం, పాక్ కి శిక్షణ, మిలటరి పరికరాలు అందజేయాలని అమెరికా ఎందుకు చైనా వెళ్ళల్లా అడగాల్సిన అవసరం వచ్చినట్లు? ఒక్క చైనాకే కాదు, అమెరికా పాక్ కి ఆర్ధిక సాయం చెయ్యమని సౌదీ కూడా వెళ్ళి లాబీయింగ్ చేస్తూంది. ఏమిటి పాక్ ప్రత్యేకత? పాక్ తానే తాలిబన్లని తెచ్చినెత్తిన పెట్టుకుంది. పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ.నే పాక్ లో దారిద్ర్యానికీ, తాలిబన్లు బలీయంగా అవ్వడానికి కారణం అని, పాక్ ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేతలు జర్దారీలు, గిలానీలూ, మాజీలైన నవాజ్ షరీఫ్ లూ కూడా ఒప్పుకుంటున్నారు. అమెరికా దేశపు హిల్లరీ క్లింటన్ లూ అదే, పదేపదే నొక్కి వక్కాణిస్తూన్నారు. మరి మళ్ళీ అదే వంకతో – ‘టెర్రరిజం బాధలకి పాక్ లో దారిద్ర్యం పెరిగిపోయింది. కాబట్టి పాక్ కి ఆర్ధిక సాయం చేయండి’ అని దబాయింపుగా మరీ సలహాలు, సంకేతాలు ఎలా ఇస్తున్నారు? తీరా ఆర్ధికసాయంగా వచ్చిన సొమ్ముతో పాకిస్తాన్ ప్రజల దారిద్రమే పోగొడుతుందో, మరింతగా తాలిబన్లకు ’బలం’ ఇస్తోందో ఎవరూ అడగరు. ఎందుకంటే ఇస్లామాబాద్ కు అంతబలం మరి! ఎందుకంటే పాకిస్తాన్ నకిలీ కణికుల బహిఃప్రాణం మరి! ఈ మొత్తం నాటకాన్నీ, బూటకాన్నీ రమణీయంగా రక్తి కట్టిస్తుంది ఐరాస.

అదే ఇతర దేశాల పైకైతే? నకిలీ కణిక వ్యవస్థ ఆయా దేశాల ఆర్ధిక మూలాలు చితక్కొట్టి, అప్పులు చేసే స్థితికి లాక్కుబోతుంది. ఉదాహరణ ఈ దృష్టాంతాన్ని పరిశీలించండి. 1989 లో జనతాదళ్ ప్రభుత్వం, రైతులకు పదివేల రూపాయలు లోపు రుణాల మాఫీ చేస్తానంటూ, హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక కొంత చేసింది. ఫలితంగా తదుపరి వచ్చిన చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారం తనఖా పెట్టాల్సి వచ్చింది. తదనంతర కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా స్వేచ్ఛావిపణికి తలుపులు తెరవక తప్పనిస్థితి, అప్పులు చెయ్యకా తప్పని స్థితి. అదే ఇప్పుడు ప్రతీరాష్ట్రంలోనూ, ప్రతీ ఎన్నికల్లోనూ జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమం పేరిట, ’కార్బోరేట్ విద్య, వైద్యం అందిస్తాం [ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు ఉంటాయి. సిబ్బందికి జీతభత్యాలు చెల్లింపబడతాయి. పని మాత్రం చేయవు. అదెవ్వరికీ పట్టదు కూడా] అంటూ ప్రజాధనాన్ని అప్పనంగా కార్పోరేట్ సంస్థలకి ప్రభుత్వాలు పబ్లిగ్గా దోచిపెడుతున్నాయి. EVM ల Tampering తో వచ్చే ఎన్నికల ఫలితాలు చూపి, ఈ ఆకర్షక పధకాలు [108, ఆరోగ్యశ్రీ, వంటి పధకాల చూసీ, ‘అధికధరలూ, ఈతి బాధలూ, ప్రభుత్వప్రైవేటూ దోపిడి’ వంటి ఏ సమస్యలూ పట్టించుకోకుండా, ప్రజలు తమని ఎన్నుకున్నారని ప్రచారిస్తున్నారు. కేవలం దేశ సుస్థిరత, దేశభద్రత కోసం కాంగ్రెసుని, సోనియా గాంధీని నమ్మి ఓట్లేసారట. ఇలాంటి ప్రచారాలు ప్రజలతో నిమిత్తం లేకుండానే చేసి, ప్రజలతో నిమిత్తం లేకుండానే ఎన్నికల్లో గెలిచి, దేశాన్ని, రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అప్పుపేరుతో ప్రపంచబ్యాంకుకి తనఖా పెట్టేస్తున్నారు. ప్రపంచబ్యాంకు ఐరాసకి అనుబంధమే. ఇక చూస్కోండి! ప్రపంచబ్యాంకు గుప్పిట్లో ప్రభుత్వాలు. దాని మార్గదర్శకంలో పరిశీలనా పద్దతులు. వెరసి వారి ఏజంట్లకు లాభాలు, ప్రయోజనాలు, ప్రజలకు కడగండ్లు. ఇవన్నీ చూస్తూ సహిస్తున్న ప్రజల సహనానికి నిజంగా చేతులెత్తి మొక్కవలసిందే!

ఇక్కడ ప్రపంచ బ్యాంకు గురించి కొంత చెప్పాలి. బహుశ ఇవి మీకు తెలిసినవే కావచ్చు. ప్రపంచబ్యాంకు అప్పుల కోసం వచ్చే వాళ్ళకి అప్పు ఇవ్వటంతో ఊరుకోదు. అది తీర్చే పద్దతి కూడా అదే చెబుతుంది. ఆ పద్దతులు [రిపోర్టులు] ఆయా దేశాలను బలహీనపరిచేవిగానూ, నకిలీ కణిక వ్యవస్థకి, ముఖ్యంగా వ్యాపార కంపెనీలకు అనుకూలంగానూ ఉండేటట్లు ఉంటాయి. క్రమంగా ఆయా దేశాలు అనివార్యంగా ప్రపంచబ్యాంకు గుప్పిట్లోకి వెళ్తాయి. ఆయా దేశాలు దెబ్బతినడానికి, నకిలీ కణిక వ్యవస్థ ఆయా దేశాలలో, టెర్రరిజం, ప్రాంతీయ గొడవలు, రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయించటం, గట్రాగట్రా పద్దతులతో దేశాన్ని బలహీనపరిచి, తద్వారా ఆయా దేశాలు అనివార్యంగా ప్రపంచబ్యాంకు ముందు మోకరిల్లవలసి వచ్చేటట్లు చూస్తాయి. ఎక్కడా ఈ టెర్రరిజానికి, ప్రపంచబ్యాంకుకు సంబంధం ఉండదు. ఇదే ఇక్కడ స్ట్రాటజీ.

ప్రపంచ బ్యాంకు పట్టుతో, దేశంలో పరోక్షంగా నడుస్తోంది ఐరాస పాలన లేదా అన్యదేశ పాలన. ప్రపంచబ్యాంకు గుప్పిట్లో దేశ, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజాప్రయోజనాలని తనఖా పెడుతున్నాయని, ఎర్రపార్టీల వాళ్ళు ప్రచారమైతే చేసి, ఇక వ్యూహాత్మక నిష్ర్కియాపరత్వం చూపిస్తారు. అదే స్ట్రాటజీ ఇక్కడ. వెరసి అందరికీ తెలుసు ప్రపంచబ్యాంకు అదుపాజ్ఞాలతో రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు నడుస్తున్నాయని! పైకి మళ్ళీ ’ఐరాస అంత వృధా సంస్థ ఇంకోటి లేదు. దాని పనితీరు అంతా చెత్త. పచ్చి బూటకం’ అన్న ప్రచారం నడుస్తోంది. నిజానికి ఈ ప్రచారం ఐరాసకీ, దాని వెనక నున్న నకిలీ కణిక వ్యవస్థ కీ రక్షణ కవచం వంటింది.

“ఇదంతా ఎలా నడుస్తుంది? ఇంపాజబుల్. అసాధ్యం, అసంభవం.” ఇలాంటి అభిప్రాయాలు కొందరు వ్యక్త పరుస్తుంటారు. అందులో కొందరిది అమాయకత్వం. [నిజంగా తెలియనితనం. ఇది నా దగ్గర ఒకప్పుడు ఉండేది గనుక చెబుతున్నాను. నిశిత పరిశీలన, తార్కిక వివేచనా నాకు నిజం చెప్పాయి. అదేఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను] మరికొందరిది ‘అతి మేధావిత్వం.’ ఈ మేధావులని నమ్మించవలసిన అవసరం గానీ, ఒప్పించవలసిన అవసరం గానీ నాకు లేదని మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశం నా ఒక్కదానిది కాదు, మా ఒక్కరిది కాదు, ఏ ఒక్కరిదీ కాదు. అలాగే ప్రపంచమైనా, దేశమైనా అందరిదీ. ఈ గూఢచర్యపు తంత్రాలతో జరుగుతున్న నష్టం ప్రతి సామాన్యుడి జీవితంలోనిది. సామాన్యుడు తనకి తెలియకుండానే, ఎవరి చేతిలోనో ఉపకరణమైపోతున్నాడు. తన శారీరక, మానసిక, కుటుంబ సౌఖ్యలని, సంతోషాలని కూడా త్వజించి, ఎవరి సంపదనో వేల కోట్లకు పెంచడానికి యంత్రమై పోతున్నాడు. ఇందులో రోజు కూలీ దగ్గర నుండి, కాస్త పెద్ద వ్యాపార సంస్థ నడిపే వారి వరకూ అందరూ పావులే. కేవలం నకిలీ కణికుడి ప్రధాన ఏజంట్లు, ఆయా రంగాల్లో మోనోపలీ వైపు దూసుకు పోతున్న దిగ్గజాలు మాత్రమే సంపద పెంచుకోగలగుతున్నాయి. అందులోనూ మళ్ళీ ఎవరి వాటా ఎంతో వారికే తెలియాలి. కాబట్టి అతిమేధావుల సిద్దాంతాలతో నాకు నిమిత్తం లేదు. నిరభ్యంతరంగా వారి సిద్దాంతాల మీద వారు రాద్దాంతాలు వారే వ్రాసుకోవచ్చు. ఎవరికైతే ‘ఈ దోపిడిలో మనమూ సమిధలం అవుతున్నాం. అంచేత ముందు ఇదేమిటో తెలుసుకుందాం. ఆపైన ఇది ఎంత వరకూ సత్యమో అన్వేషిద్దాం, వివేచిద్దాం, విశ్లేషించుకుందాం, అది నిజమే అయితే ఆ సత్యాన్నీ మరింతగా వెలికి తీద్దాం. ఆవిష్కరిద్దాం. అప్పుడు మన జీవితాన్ని మనం వెలిగించుకోగలుగుతాం’ అనుకుంటారో, వారికోసమే, నాకు తెలిసిన విషయాలు వ్రాస్తున్నాను. నమ్మని వారు నిరభ్యతరంగా ఈ విషయాలని పట్టించుకోకుండా నిశ్చింతగా ఉండవచ్చు.

‘ఇక నకిలీ కణిక వ్యవస్థ [కేవలం ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ప్రధాన నిర్వాహకులుగా గల వ్యవస్థ] ఎలా ప్రపంచాన్ని నడిపించగలదు? అదీ ప్రపంచ ప్రజానీకానికి తెలియతెలియకుండా?’ – ఈ సందేహల్ని నివృత్తి చెయ్యటానికి ప్రయత్నిస్తాను. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకప్పుడు మనీ సర్కులేషన్ స్కీములు బాగా నడిచేవి. ముందుగా ‘A’ అనేవ్యక్తి తాను ఓ ఇద్దరినీ చేర్పించాడను కొండి. అతడికి కమీషన్ వస్తుంది. ఈ ఇద్దరూ ఉదాహరణకి A-1, B-1 అనుకుందాం. వీరు ఇద్దరూ ఒక్కొక్కరూ మరో ఇద్దరిని చేర్పించాలి. వారికి A-2,A-3, B-2,B-3 అనుకుందాం. మళ్ళీ అదే వరుస. ఈ క్రమంలో ‘A’ కి తనక్రిందనున్న ఏజంట్లలో 5 గురో, మహా అయితే 10 మందో తెలిసి ఉంటారు. తన పైనున్న ఏజంట్లలో 5 గురో, మహా అయితే 10 మందో తెలిసి ఉంటారు.

ఈ మనీ సర్కులేషన్ స్కీము లోని ఏజంట్లు మాదిరే గూఢచార ఏజంట్లున్నారను కొండి. వారుపైకి ఏవృత్తుల్లోనైనా ఉండనీయండి. ప్రభుత్వ ఉన్నతోద్యోగుల నుండి సాధారణ ఉద్యోగుల వరకూ, రాజకీయ నాయకుల నుండి, కాలనీల్లోని చిన్నచితకా కార్యకర్తల వరకూ, వృత్తివ్యాపారుల లోనూ, వైద్యవిద్యారంగాల్లోనూ – ఇలా గన్నమాట. చివరికి అది వివిధ దేశాలలోని గూఢచార శాఖల్లోనూ విస్తరించి ఉంటుంది. ప్రతీ ఏజంటుకీ, తన పై వారు ఓ ఐదుగురు, తన క్రిందవారు ఓ ఐదుగురు తెలిసి ఉంటారు. పైనుండి తాను assignments అందుకుంటాడు. వాటి ప్రకారం, తన క్రింది వారికి తాను ఏవైనా assignments పంపవలసి ఉంటే పంపిస్తాడు. తన assignments ని తాను నిర్వహిస్తాడు. క్రింది వారు నిర్వహించారో లేదో పర్యవేక్షిస్తాడు. ఫలితంగా తన స్వప్రయోజనం పొందుతాడు. అది డబ్బు కావచ్చు, సెలబ్రిటీ హోదా వంటి కీర్తి ప్రతిష్ఠలు కావచ్చు, అవార్డులూ, గుర్తింపులూ కావచ్చు, కేరీర్ కావచ్చు. పదోన్నతులు కావచ్చు లేక ఉమ్మడిగా కావచ్చు. స్వప్రయోజనాలు మాత్రం బహుళం. అలాగే తన assignments ని సరిగా నిర్వహించలేకపోయాడనుకొండి, కొద్దిసార్లు మాత్రం ఉపేక్షించబడతాడు. ఇంకా అదే అసమర్ధత కొనసాగితే ఇక Fade out అయిపోతాడు. తెరమరుగైపోతాడు. కెరియర్లో తొక్కివేయబడతాడు. ఇక బ్యాలెన్సు తప్పి నోరుజారటమో, మురళిమనోహర్ జోషి, [భాజపా ఒకప్పటి అధ్యక్షుడు] లేక సుష్మాస్వరాజ్ లాగా అక్కసు నియంత్రించుకోలేక పోవడమో, జరిగిందనుకొండి, ఇక వారి పరిస్థితి ఇంతే సంగతులు. జులై 22, 2008 న పార్లమెంటులో యూ.పి.ఏ. విశ్వాసపరీక్షలో నెగ్గెందుకు నోట్లకు ఓట్లును కొన్నుకున్న ఆరోపణలు బయటికి వచ్చాక, బెంగుళూరులో మొదలుపెట్టి జైపూర్, అహమ్మదాబాద్, ఢిల్లీ వగైరా నగరాలలో వరసబాంబు పేలుళ్ళు జరిగాయి. ఆ నేపధ్యంలో సుష్మాస్వరాజ్, సోనియాగాంధీ మీద ’ఓటు కు నోటు వ్యవహారం బయటికి రావటంతో వరస బాంబుపేలుళ్ళు జరుగుతున్నాయి. విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి జరుగుతున్న ఈ సంఘటనల వెనుక యు.పి.ఏ. హస్తం ఉంది’ అన్నది. పాక్ తో కలిపి ఉమ్మడి హస్తమే ఉందో లేక కేవలం కాంగ్రెస్ హస్తం మాత్రమే ఉందో, ఆమె ఇదమిద్దంగా చెప్పలేదు. అయితే, ఆ తర్వాత భాజపా అగ్రనాయకత్వం ’అది సుష్మాస్వరాజ్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు’ అంటూ సదరు ప్రకటన తమ పార్టీకి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంది. కానీ, ఆ తర్వాత వాగ్ధాటి గల నేతగా పేరున్న సుష్మాస్వరాజ్ 2009 ఎన్నికల్లో సైతం రాణించలేదు. ఆమె ఉపన్యాసాలకు ఎక్కువ ప్రచారం లేదు, వాగ్భాణాలూ లేవు. అసలు భాజపా అంతర్గత కుమ్ముటాటల్లో పడి ఎన్నికల్లో పోటీనే ‘ఉండనా, ఊడనా’ అన్నట్లు చేసింది. మరి సుష్మాస్వరాజ్ ని కాంగ్రెస్ ఎలా అణగ తొక్కగలిగినట్లు? సుష్మాస్వరాజ్ లాంటి వారికి తెలిసి తమ [భాజపా] వెనుక అండదండగా ఇజ్రాయేల్ మోసాద్ లాంటి సంస్థలున్నాయన్న మాట ఉంది. సోనియా గాంధీ తమకి తెలిసి వాటికన్ ఏజంట్ లేదా సి.ఐ.ఏ. ఏజంట్ మాత్రమే. కాబట్టే సోనియాగాంధీని సమ ఉజ్జీగా భావించి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అందుకని తరువాత కాలంలో అణగ తొక్కివేయబడింది. కాకపోతే సుష్మాస్వరాజ్ వంటి వారికి కూడా తెలియని మర్మం ఒకటి ఉందిక్కడ.

పురుషులలో పుణ్యపురుషులు వేరయా అంటాడు వేమన. మామిడి పళ్ళల్లో నూజివీడు మామిడి పళ్ళు వేరయా అంటాడు రుచి అస్వాదించేవాడు. అలాగే ఏజంట్లలో కూడా నకిలీ కణికుడి అంతరంగిక ఏజంట్లు వేరయా అన్నదే ఈ మర్మం. అందుకే అద్వానీ లాంటి సీనియర నాయకులు సోనియాగాంధీని తీవ్రమైన ఆరోపణలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే సోనియాగాంధీ పట్టుకు [grip] కారణం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

వాస్తవానికి రూజ్ వెల్ట్ 1944 లో నాల్గవ సారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనాడు. 1945 ఏప్రియల్ లో అతడు మరణించడంతో, ఉపాధ్యక్షుడు హారీ ట్రూమన్ అధ్యక్షుడైనాడు. 1945 ఆగస్టులో, జపాన్ పైన అణుబాంబు ప్రయోగించాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అణుబాంబు ప్రయోగంతో రెండవ ప్రపంచయుద్దం ముగిసింది. జర్మనీ ఓటమి పాలైంది. అప్పటి వరకూ ప్రపంచాన్ని గడగడలాడించిన లేక గడగడలాడించాడని ప్రచారించిన అడాల్ఫ్ హిట్లర్, భార్య ఇవాబ్రౌన్ తో సహా తన బంకరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హిట్లర్ కూ, అతడి భార్యకూ డూప్ లు ఉండేవారని, ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారంతో, హిట్లర్ దంపతుల డూప్ ల శవాలు అసలువిగా చలామణి చేసి, హిట్లర్, అతడి భార్య ప్రాణాలతో తప్పించుకు పోయారనీ తర్వాత వదంతులు ప్రచారమయ్యాయి. ఈ సంచలనాత్మక వార్తలతో కొన్నిరోజులపాటు వార్తా సంస్థలూ, పత్రికలూ ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని చేసుకున్నాయి. పత్రిక ప్రతుల అమ్మకం పెరగడంతో పాటు వాణిజ్యప్రకటనలు అదనపు ఆదాయం కదా? ఆపైన ఇర్వింగ్ వాలెస్ ‘The Seventh Secrete’ వంటి నవలలూ, సినిమాలు… మరింత ఆదాయం, మరింత సంచలనం! నిజంగా హిట్లర్ దంపతులే మరణించారో లేక వారి నకళ్ళే [డూప్ లే] మరణించారో, సత్యాసత్యాలు భగవానుని కెఱుక; లేదా నకిలీ కణిక వ్యవస్థకి ఎఱుక. ఈరోజు ఈ స్ట్రాటజీ నమ్మశక్యంగానే ఉందిగానీ, ఆరోజుల్లో ఇదీ ప్రజలకి నమ్మలేని నిజమే కదా!

ఈ నేపధ్యంలో గుర్తుచేసుకోదగిన మరొక సంఘటన – పాక్ ఒకప్పటి అధ్యక్షుడు జియాఉల్ హక్ విమాన ప్రమాదం లో మరణించటం. ప్రమాదసంఘటనలో జియా ఉల్ హక్ కు సంబంధించిన కట్టుడుపళ్ళ సెట్ తప్ప మరే ఆధారమూ, కాలిబూడిదైన ఆ విమాన శకలాలలో దొరకలేదు. అతడితో పాటు అతడి వెంట ఉన్న ఇతరుల శరీరాలు కూడా దగ్ధమైపోయాయి. అయితే అది ఎంత సులభంగా, కృత్రిమంగా సృష్టించవచ్చో ఇప్పుడు పరిణతి పెరిగిన సినిమాల ద్వారా చాలామందికి తెలిసినదే. అప్పటి వరకూ ఎన్నో ఒత్తిళ్ళతో తమ assignments నిర్వహిస్తూ, తమకు కీలక ఏజంటుగా ఉపయోగపడినందుకు నకిలీ కణిక వ్యవస్థ ఇచ్చే incentive [అదనపు ప్రయోజనం] అన్నమాట. వాళ్ళకు సంబంధించిన చరిత్ర సమాప్తం. కీలక రహస్యాలు ఏవీ బయటకు రావు. చరిత్రప్రకారం, చట్టం ప్రకారం [on record] జియా ఉల్ హక్ చనిపోయాడు. లేదా హిట్లర్ చనిపోయాడు. అయితే off record, ఎక్కడో అనామకంగా, అయితే ఐశ్వర్యవంతుడిగా, ఏ ఒత్తిళ్ళు, ఏ సమస్యలూ లేకుండ హాయిగా ప్రశాంతంగా బ్రతికేస్తాడు. ఎటూ గుర్తింపు, సెలబ్రిటీ హోదా, ప్రముఖ పదవులతో కూడిన జీవితం అనుభవించి ఉంటారు కాబట్టి, అందులోని advantages మీద మోజు తగ్గి, disadvantages పట్ల విసుగెత్తి ఉంటారు కాబట్టి, ఈ గుంపులో గోవింద బ్రతుకు హాయిగా ఉంటుంది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండే ప్రాంతాలకూ వెళ్తారు. లేదా గుర్తుపట్టలేనట్లుగా రూపం మార్చుకోవటమూ, ఈ రోజుల్లో ఆధునిక వైద్యచికిత్సా విధానం అందుబాటు లోకి తెచ్చిందయ్యే. ఇక సమస్య ఏముంది? ఇక్కడో చిన్న విషయం. ఈ జియా ఉల్ హాక్ ఇండియా సందర్శనకు వచ్చినప్పుడే, హఠాత్తుగా క్రికెట్ మైదానంలోకి దూసుకొచ్చిన వండర్ బాయే గా అజారుద్దీన్ అనబడే ముస్లిం ఆటగాడు మెరిసిపోయాడు. ఎందుకు ముస్లిం ఆటగాడని నొక్కి చెప్పానంటే, మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం బయల్పడినప్పుడు, తను ముస్లిం కావటం వల్లే తనని ఇరికించారన్న వాదనని అజారుద్దీన్ లేవనెత్తాడు. అలాంటి వివక్షే ఉంటే అసలు అతణ్ణి ముందుగా ఆటగాడిగా ఎలా వెలగనిచ్చారని, రంగంలోకి దూకుడుగా, అకస్మాత్తుగా, ఎలా దూసుకురాగలిగాడని ఎదురు వాదనకి మౌనం పాటించాడు. సదరు అజారుద్దీన్ మీద ఈనాడు రామోజీరావుకు ఎంత ప్రేమాభిమానాలో, ఎక్కడో యూపీలో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, అల్పాహారం స్వీకరించినా, నిల్చున్నా, తుమ్మినా, దగ్గినా, ఫోటో సహితంగా వార్తలు ప్రచురించి మరీ నిరూపించుకున్నాడు. ఈనాడు రామోజీరావుకి గల ఈ ప్రత్యేక లక్షణానికి కారణాన్ని తర్వాత సవివరంగా వ్రాస్తాను. [ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జ్ఞానంలో కూడా హైదరాబాద్ కే స్థానం ఉండటం యాదృచ్ఛికమా?] ఇప్పటికైతే హిట్లర్ దగ్గరికి తిరిగివద్దాం.

జర్మన్ దేశాధినేత హిట్లర్, ఇటలీ నియంత ముస్సోలినీలని రెండవ ప్రపంచయుద్ద కారకులుగా చెబుతారు. మొదటి ప్రపంచయుద్దానంతరం, జర్మనీపై యుద్ద నేరం మోపి ఆర్ధికంగా అపరాధరుసుం అతిగా వసూలు చేశారన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకొని, జర్మన్ లకి జాత్యంహకారన్ని మరింతగా నూరిపోసి, ఆయుధబలాన్ని విపరీతంగా పెంచుకుంటూ, పొరుగుదేశాల్లో అభద్రతని రేపి, హిట్లర్ రెండవ ప్రపంచయుద్ద కారకుడయ్యాడనీ చెబుతారు. 1933 లో జర్మనీ దేశాధినేత[ఛాన్సెలర్] అయిన హిట్లర్, 1945లో ఆత్మహత్యచేసుకున్నాడన్న ఘటన వరకూ అధికారంలో ఉన్నది దాదాపు 11 సంవత్సరాలపైన కొన్ని నెలలు మాత్రమే. ఈ స్వల్పవ్యవధిలోనే [ప్రపంచ చరిత్రలో ఒక దశాబ్ధం అంటే స్వల్ప వ్యవధే], ఒకే ఒకవ్యక్తి, ఒక దేశాన్నే కాదు, ప్రపంచాన్నే ఒక మలుపు తిప్పాడు. ఒక చరిత్ర సృష్టించాడు. అది మంచిగానా, చెడుగానా అన్నది అనవసరం.[ఎలాపైకి వస్తే నేం? పైకిరావడం ముఖ్యం అనే నకిలీ కణిక నైజమే, ఇక్కడ ఉన్నది కూడా] ఈ ప్రయోగం నకిలీ కణిక-6 కి ఎంతగానో తృప్తి నిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని మరింత మరింతగా పెంచింది.

మరో వైపు బ్రిటిషు రాజవంశపు ఆర్ధిక మూలలని చితక్కొట్టేయటం సాధ్యమైంది. అప్పటికే భారతదేశంలో స్వాతంత్రసమరం పరాకాష్ఠకు చేరుకుంది. ఎంతగా అతివాదులు, మిత వాదులంటూ స్వాతంత్ర సమర యోధుల మధ్య విభేదాలు సృష్టించినా, బ్రిటీషు పాలనే మంచిది అంటూ ఎంతగా పదార్ధ వాద దృష్టిగల సామాన్య ప్రజలని ట్యూన్ చేసినా, స్వాతంత్ర సమరానికి తాత్కాలిక అవరోధాలు కలిగించగలిగారే గానీ, బ్రిటీషు వారుగానీ, వారి వెనుక నున్న నకిలీ కణిక వ్యవస్థగానీ, భారత స్వాతంత్ర సమరాన్ని పూర్తిగా నీరుగార్చలేక పోయారు. దీనికి కారణాలు ఎన్నున్నా, ప్రధాన కారణం మాత్రం ఒకటే – ఏ విషయంలోనైనా నకిలీ కణిక వ్యవస్థ ద్వంద్వాలు సృష్టిస్తుంది. వాటిని ప్రచారిస్తు గందరగోళాలు, వివాదాలు సృష్టిస్తుంది. ఆపైన తాత్సారమే ప్రధానంగా స్ట్రాటజీ నడిపిస్తుంది. దాంతో ఉద్యమాలని నీరుగార్చడం చాలా సులభం. అయితే భారత స్వాతంత్ర సమరం, అప్పటికి ప్రపంచం ఎరగనంత సరికొత్తది. సత్యాహింసలే ఆయుధాలుగా కలిగిన యుద్దం అది. ప్రాణాలు హరించే ఆయుధాలు ప్రయోగించే బ్రిటీషు రాజరికాన్ని, సత్యాగ్రహమనే ఆయుధంతో ఎదుర్కోవడం అది. బ్రిటీషు పోలీసులు, సైనికులు సత్యాగ్రహుల మీద, స్వాతంత్ర సమర యోధుల మీద హింసకు పాల్పడినా, వారు నిరాయుధలుగా, వందేమాతరం మంత్రజపంతో, అహింసతో ఎదుర్కొన్న అపూర్వ యుద్దం అది.

కొందరు అనవచ్చు ఈ అహింస అనే యుద్దం వలననే స్వాతంత్రం అలస్యమయింది అని. కాని హింసతో అయితే కుత్సిత బ్రిటీషు వాళ్ళు ఆయుధాలు ఉపయోగిస్తూ, మనమూ అయుధాలు ఉపయోగిస్తున్నాం అంటూ ద్వంద్వం ఉపయోగించి మరింత అలస్యం చేసి ఉండేవాళ్ళు. అదే అహింస అనే అయుధంతో అయితే, బ్రిటీషు వాళ్ళ ప్రవర్తనే బహిరంగమైంది. అందుకే అహింసయుతమైన పోరాటం అపూర్వమైనది అనవచ్చు. దాంతో నకిలీ కణికవ్యవస్థకీ, బ్రిటీషు రాజరిక వ్యవస్థకీ, ఏ ద్వంద్వం సృష్టించాలన్నా సాధ్యం కాలేదు. ‘ముందుగా భారతీయ విప్లవకారులే లేదా స్వాతంత్ర సమరయోధులే, బ్రిటీషు పోలీసుల్ని, సైనికుల్ని కొట్టారు లేదా వారిపై రాళ్ళు రువ్వారు, దానితో సైనికులూ, పోలీసులూ కాల్పులు జరిపారు’ వంటి వార్తలు ప్రచారించలేకపోయారు. జలియన్ వాలాబాగ్ ల వంటి సంఘటనలూ, జనరల్ డయ్యర్ లూ, అప్పటికి పచ్చిగా ప్రపంచానికి వెల్లడయ్యారు. దాంతో గాంధీ తత్త్వం ప్రజల్లోకి చేరకుండా ఉండేందుకు నానా ఎత్తుగడలూ పన్నారు. అయినా ఆనాటి భారతీయులు బాపూ చెప్పిన సత్యాన్ని అందుకోగలిగారు. కాబట్టే గళం కలిపారు. కదం తొక్కారు. అందుకే నకిలీ కణిక వ్యవస్థ ఈసారి [మరో 60 ఏళ్ళ తర్వాత] భారతీయులలోని ఆ దృక్పధాన్ని, సత్యాన్ని గ్రహించగల, స్పందించగల దృక్పధాన్ని నాశనం చేయటం అన్న ఎత్తుగడ పన్నింది. పర్యవసానమే నేటి మన దుస్థితి.

కాబట్టే ఈరోజు భారతీయులలో చాలామందికి ‘మాతృదేశం’ పట్టటం లేదు. స్వంత మతం, స్వంత ధర్మం, సంస్కృతి ఏదీ పట్టడం లేదు. తన ఉద్యోగం మీదకి, తన వృత్తి, వ్యాపార ఆర్ధిక మూలాల మీదకి, చిన్న ఒత్తిడి వచ్చిందంటే చాలు, అంతవరకూ చెప్పిన ధర్మపన్నాలు కూడా మరచిపోయి, పైసలు వెంట పరుగులు పెట్టక తప్పని స్థితికి, అత్యధిక సంఖ్యలో జనాలు జారిపోయారు. అంతే కాదు అవినీతి అన్నది దేశానికి ఎంత చెరుపు చేస్తుందో తెలిసినా ‘ఇవాళ్ళ, రేపు ఇది మామూలే’ అన్న ప్రవర్తన నరనరానా జీర్ణించుకున్నారు. ఇది ఇప్పటి స్థితి. 1947లో అయితే ఈ దుస్థితి లేదు. ఆరోజు పిల్లా పెద్దా తేడా లేకుండా, ధనికాపేద తారతామ్యం లేకుండా, ప్రజలంతా లక్షల కోట్లై, ఏరులన్నీ కలిసి మహా సాగరమైనట్లు అహింసా మార్గాన, గాంధీజీ వెనుక, దేశ నాయకుల వెనుకా, కదిలి వచ్చారు. [అదే ఇప్పుడైతే ఎదురుగా కనబడే శత్రువు ఎవరు లేరు. నకిలీ కణిక వ్యవస్థ ఈసారి మంచివాళ్ళనందరిని ప్రణాళికాబద్దంగా రాజకీయాల నుండి పారద్రోలి, తము ఎంపిక చేసుకున్న వాళ్ళని నాయకులగా చలామణీ చేస్తూ మనపై ఇప్పుడు రుద్దు తున్నారు. ప్రతీ ఒక్కరికి తెలుసు రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నారని. అదే కదా బ్రిటీషు వాళ్ళు కూడా చేసింది? అప్పడు తప్పగా కనిపించినది, ఇప్పుడు ఎందుకు తప్పుగా కనిపించటం లేదు? ఎందుకంటే నాయకులుగా ఎవరు ఈ తప్పులను ఎత్తి చూపితే వాళ్ళ మీద ఒకవ్యవస్థ వ్యవస్థీకృతంగా వేధించటం చేస్తున్నారు. అందుకే ప్రజలని ఎవ్వరు సంఘటితం చేయలేకపోతున్నారు. అదే స్వాతంత్రం తరువాత నకిలీ కణిక వ్యవస్థ సాధించిన విజయం.]

దాంతో బ్రిటీషు రాజవంశానికి, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు. అప్పటికే ఆర్ధికంగా దెబ్బతిని ఉన్న బ్రిటన్ ఇక నిబ్బరించుకోలేక పోయింది. క్రమంగా ప్రపంచమంతటి నుండి, దాని సామ్రాజ్యం [విత్ డ్రా] వెనక్కి తీసుకోబడింది. దక్షిణాఫ్రికా, మరికొన్ని ప్రాంతాలలో తప్ప, అధిక భాగం సామ్రాజ్యం కోల్పోయి, బ్రిటన్ పాత్ర తమ చిరుప్రాంతానికి, ఇంగ్లాండుకి, పరిమితం అయ్యింది. ఏవిధంగా అయితే భారతదేశంపై పట్టు సాధించాక, ప్రపంచాన్నంతా జయించి, ‘రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం’ అన్పించుకుందో, అదేవిధంగా, భారతదేశంపై పట్టు కోల్పోయాక, బ్రిటన్ రాజవంశం ఇంగ్లాండుకే పరిమితం అయ్యింది. ఇక భారతదేశ రాజకీయ రంగంపై నకిలీ కణిక హస్తం గురించి 1893 సెప్టెంబరు 11న చికాగో లో జరిగిన సర్వమత మహాసభలో, స్వామీ వివేకానంద, భారతీయుల సనాతన ధర్మం గురించి, హిందూ సంస్కృతి గురించి ఎలుగెత్తి చాటాక, సి.ఐ.ఏ., నకిలీ కణిక వ్యవస్థ, భారత్ విషయమై చేతులు కలిపిన వైనం గురించి, భారతరాజకీయ రంగంపై నకిలీ కణికుని సుదీర్ఘ కుట్ర అన్న వరస టపాలలో వివరించాను.

ఈవిధంగా నకిలీ కణిక-6, బ్రిటీషు రాజవంశానికి కూసాలు దింపి కూర్చోబెట్టగలిగాడు. దాంతో తన గూఢచార కౌశలం మీద తనకి నమ్మకం పెరిగిపోయింది. మరికొన్ని ప్రయోగాలు సైతం నిర్వహించుకున్నాడు. మొదటి ప్రపంచయుద్దం తర్వాత నానాజాతి సమితి [The league of Nations] ఏర్పాటయ్యింది. అయితే దాని పనితీరు కుంటి గుర్రం నడక తీరే! నానాజాతి సమితిని ప్రతిపాదించినది, నాటి అమెరికా ప్రెసిడెంటు, డెమొక్రాట్ పార్టీకి చెందిన ఉడ్రో విల్సన్. మొదటి ప్రపంచ యుద్దానంతరం, మొదటి సంవత్సరాల్లో అంటే 1918 తర్వాతి స్వల్ప వ్యవధిలో అమెరికా మార్కెట్లు బలపడ్డాయి. ఆర్ధికంగా ఎన్నో సుఫలాలని అమెరికన్ లు ఆనందించారు. 1929 తర్వాత ఆర్ధిక మంద్యంలో అమెరికా కూరుకుపోయింది. ఈ ఆర్ధిక నేపధ్యంలోనూ, అమెరికా లోని ద్విపార్టీ రాజకీయ విధానాలలోనూ, ఎన్నో నాటకీయ సంఘటనలు సంభవించాయి. దానాదీనా అమెరికా తానే ప్రతిపాదించిన నానాజాతి సమితి [The league of Nations] లో తానే సభ్యత్వం తీసుకోలేదు. అలాగే మిగిలిన దేశాలలో చాలాదేశాలు, బలమైన దేశాలు నానా జాతి సమితిని లెక్కచేయలేదు. చాలా సహజంగా నానాజాతి సమితి విఫలమయ్యింది. జర్మన్ లకీ, ముఖ్యంగా హిట్లర్ కీ ఉన్న యూదు జాతీయుల మీది ద్వేష భావం, ఇతర కారణాలతో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమయ్యింది. 1945 ఆగస్టులో జపాన్ పై అణుబాంబుతో చల్లారింది. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి [United Nations organization] ఆవిర్భవించింది.

నిజానికి నానాజాతి సమితికి, ఐక్యరాజ్యసమితికి నామభేదమే గానీ, స్వరూప స్వభావాల్లో పెద్దగా భేదం లేదు. అయితే చిత్రంగా ఐరాస సఫలీకృతమైంది. మొదట 50 దేశాల నుండి వచ్చిన అహుతులతో, 50 సభ్యదేశాలతో ప్రారంభమైన ఐరాస, క్రమంగా ప్రపంచరాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే దశకు ఈ 60 ఏళ్ళల్లో చేరుకుంది. నానాజాతి సమితికీ, ఐరాస కీ వ్యత్యాసం ఒక్కటే. దాన్ని ప్రపంచదేశాలలో శక్తివంతమైన దేశాలూ, ఎక్కువదేశాలూ లెక్కచెయ్యలేదు. ఐరాస ని లెక్కచేసాయి. అంతే! యుద్ద వినాశనం గురించిన వాస్తవ జ్ఞానం, హిరోషిమా నాగసాకి లపైన అణుబాంబు ప్రయోగంతో గ్రహింపుకు రావటం, పైకారణంగా[Over leaf reason] చూపబడుతోంది. నానాజాతి సమితి వైఫల్యమూ, ఐరాస సాఫల్యము కూడా నకిలీ కణిక వ్యవస్థ చేత నియంత్రించ బడ్డాయి. నానాజాతి సమితితో చేసుకున్న ప్రయోగ ఫలితలన్నిటినీ క్రోడీకరించుకుని, విశ్లేషించుకుని, మరింత మెరుగ్గా ఐరాసని ఉపయోగించుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు నకిలీకణిక-6.

కాబట్టే ఐరాస, తన మానవ హక్కుల విభాగంతో, ఒకదశలో, ప్రపంచవ్యాప్తంగా, ఆయాదేశాలలో ప్రభుత్వాలని సమాంతరంగా నియంత్రించిందనీ, నియంత్రించ ప్రయత్నించిందనీ అంటారు. ఫలానా దేశంలో మానవహక్కులు మంటగలుస్తున్నాయనీ, ఆయా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనీ, మానవహక్కుల సంఘం, అమ్నెస్టీ అనటం అలస్యం, ప్రపంచ మీడియా ఆ విషయమై కోడై కూస్తుంది. అలజడి ఎక్కువయ్యాక, సహజంగానే ఆయాదేశాల ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది కదా! తమకు అనుకూలమైన దేశాలలో ఎంత హింస జరిగినా కిమ్మినదు. ఉదాహరణకు పాకిస్తాన్ లో, మధ్యమధ్యలో అడపాదడపా ప్రజాస్వామ్యం [అదీ పేరుకే ప్రజాస్వామ్యం] తప్ప, మిగిలిన కాలమంతా నడిచింది సైనికపాలనే. భారత్ నుండి వలస వెళ్ళిన హిందువులనే కాదు, ముస్లింలని సైతం చిన్నచూపు చూస్తారు అక్కడ. అసలు హిందువుల జనసంఖ్య అయితే గణనీయంగా పడిపోయింది. అందులో మత మార్పిడి ఎంతో, ప్రాణాలు గల్లంతు ఎంతో లెక్కలు ఎవరికీ తెలియదు. అలాంటి పాకిస్తాన్ లో ఏ మానవహక్కుల ఉల్లంఘనా సదరు సంఘానికీ, అమ్నెస్టీ కీ కనబడదు. అదే భారత్ లో అయితే BSF జవానుల్లోనూ, పోలీసుల్లోనూ మానవహక్కుల ధిక్కారం లెక్కకు మిక్కిలి కన్పిస్తుంది. అలాగే మావోయిస్టులో, LTTE సభ్యులో ప్రజల్ని ఊచకోత కోస్తే, లేదా పోలీసుల్ని చంపితే మానవహక్కుల సంఘం కిమ్మనదు. అదే పోలీసులు మావోయిస్టుల్ని చంపితే, సైన్యం LTTE సభ్యుల్ని చంపితే గోలగోల చేస్తుంది. మానవహక్కుల సంఘం దేశాలకి అతీతం కదా? దానికి పార్టీలతో, ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా, పోలీసులైనా, నేరగాళ్ళైనా, ఉగ్రవాదులైనా, అందరూ మానవులు గానే కనబడాలి కదా? వాస్తవం అలా ఉండదు.

అలాగే యూనిసెఫ్ గట్రా ఇతర సంస్థలు. వాళ్ళ సర్వేలతో ఫలానా దేశం పేదదేశమనో, ఫలానా ర్యాంకులో ఉందనో లెక్కలు గట్టి ముద్ర [Stamp] వేసేస్తుంది. దీన్నిబట్టి ఆయా దేశాల మీద నిబంధనలు, ఒడంబడికలూ ఉంటాయి. తాము ఎవరికైతే ఆర్ధిక సాయం ఎక్కువగా చెయ్యాలనుకుంటారో, సదరు దేశంలో పిల్లలు ఎక్కువశాతం పోషకాహార లోపంతో బాధ పడుతున్నారంటే చాలు. డబ్బు రవాణాకి రహదారులు తెరుచుకున్నట్లే. తీరా డబ్బు దేశాలు దాటి, చేరాల్సిన చోటు చేరాక, అది ఏవిధంగా ఖర్చు అవుతుందో ఎవరు చూడొచ్చారు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నిన్న సాయంత్రం టపా: తెలుగు బ్లాగర్లు మీడియాపై సాధించిన కొన్ని విజయాలు

ఈ నేపధ్యంలో 1914 AD, జూన్ 28 న ఆస్ట్రియా రాకుమారుడు[Crown prince of Austria] ఫెర్డినాండ్ నీ, అతని భార్య సోఫియాని, బోస్నియా రాజధాని సరయేవో లో బోస్నియాకు చెందిన సెర్బులు హత్య చేశారు. దీనిపై మండిపడిన ఆస్ట్రియా, 48 గంటల్లో హంతకులను పట్టి శిక్షించవలసిందిగా బోస్నియాని హెచ్చరించింది. ఈ హత్యకు సంబంధించిన సమాచారమంతా కొన్నివారాలకు ముందే బోస్నియా ప్రభుత్వానికి తెలుసనీ, అసలు ఆ హత్యకుట్రకు మూలసూత్రాదారులు బోస్నియా ప్రభుత్వంలోనే ఉన్నారనీ, అప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. వాటిని బలపరుస్తున్నట్లుగా, బోస్నియా, ఆస్ట్రియా హెచ్చరికకు ఇచ్చిన సమాధానం చేతులుదులుపుకున్నట్లుగా ఉంది. దాంతో ఆస్ట్రియా, బోస్నియా మీద యుద్దం ప్రకటించింది. మొదట్లో ఆ యుద్దం ఆ రెండు దేశాలకే పరిమితం అవుతుందనీ అందరూ అనుకున్నారు. అయితే మెల్లిగా అది యూరపు దేశాలకి, ఆపైన ప్రపంచాన్నంతటినీ చుట్టేసింది. నాలుగేళ్ళ కాలం కొనసాగుతుందనీ ఎవరూ అనుకోలేదు. అటువంటిది ఆ యుద్దం కోటి ప్రాణాలను బలిదీసుకుంది. కొన్ని లక్షల [65 లక్షల] మంది గాయపడ్డారు. 60 లక్షల మంది కనపడకుండా పోవటమో, యుద్దఖైదులుగా శతృదేశాలకు పట్టుబడటమో జరిగింది.

కేవలం ఆస్ట్రియా, బోస్నియాల మధ్య ఏర్పడిన యుద్దంలోకి, క్రమంగా, యూరపు దేశాలే గాక రష్యా, అమెరికాలు కూడా చేరడంలో జాత్యహంకారం, సైనిక బలాల పెంపు [Militarian], దేశాల మధ్య రహస్య ఒడంబడికలు, బాల్కన్ రాజకీయాలు వగైరాలు, కారణాలుగా చెప్పబడినా, వాటిలో వార్తాపత్రికలు నిర్వహించిన ప్రచారపాత్ర కొట్టివేయలేనట్టిది. మొదట యుద్దకారణాలలో, అదీ ప్రముఖంగా చర్చించబడింది. జర్మన్ పత్రికలు బ్రిటీషుకు వ్యతిరేకంగానూ, తమ జర్మనుల జాతీయతా భావాల చేయూతకూ వ్రాసిన వ్రాతలు యూరపు దేశాలన్నిటిలో అభద్రతా భావాల్ని నింపాయట.

పైకి ఏ కారణాలు చెప్పబడినా, లోపలి కారణం మాత్రం నకిలీ కణికుడి గూఢచార వలయపు తంత్రమే. అయితే కాలక్రమంలో మీడియా ప్రచారంలో పదేపదే ఉటంకించటం, గ్రంధ రచయితలూ దాన్నే అనుసరించటం, వగైరా ప్రక్రియలతో పైకారణాలుగా[over leaf reasons] ప్రచారించిన యుద్దకారణాలే రికార్డులవుతాయి. భావితరాలకు మార్గదర్శకాలూ, శిరోధార్యాలూ అవుతాయి. పిల్లలకి పాఠ్యపుస్తకాలూ అవుతాయి. ఉదాహరణకి నిన్నటి 2009 ఎలక్షన్లనే తీసుకొండి. కాంగ్రెస్ గెలుపుకీ, భాజపా కూటమి అయిన ఎన్డీయే మరియు తృతీయ కూటమీల ఓటమికి, మీడియా పలుకారణాలు చూపిస్తోంది. దాన్నే అన్నీపార్టీల నాయకత్వాలూ ధృవీకరిస్తున్నాయి. కొన్నిపార్టీలు తాము వ్యవస్థగత తప్పిదాలు చేసి ఓడిపోయామంటున్నాయి. కొన్నిపార్టీలు అంతర్గత కుమ్ములాటలలో నష్టపోయామంటున్నాయి. వెరసి అందరూ ప్రభుత్వవ్యతిరేక ఓట్లు చీలిపోవటంతో ఓడిపోయామంటున్నారు. అభివృద్ధి కారణంగా గెలిచామని కాంగ్రెస్ అంటోంది. దేశ సుస్థిరత, భద్రతరీత్యా ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారని మీడియా అంటోంది. పలునగరాల్లో వరుస బాంబుదాడులు జరిగినా, చివరికి ముంబై మీద పాక్ తీవ్రవాదులు దాడికి తెగబడినా, ప్రజలు కాంగ్రెస్సే తమకు రక్ష అని, సోనియాగాంధినే తమని కాపాడగలదని నమ్మారట. అధిక ధరలు వాళ్ళకి పట్టలేదట. చివరికి ఏ నియోజక వర్గానికి ఆ నియోజక వర్గంలో కూడా, ఇలాంటి సమీక్షలే గెలుపోటముల మీద వస్తోన్నాయి. ఎమ్మిగనూరులో నల్లేరు బండి మీద నడకలా గెలుస్తాడను కున్న బి.వీ.మోహన రెడ్డి [తెదేపా] తన అనూహ్య అపజయానికి నివ్వెరపడి, ఆనక గెలుపుసులభమనే అతివిశ్వాసం కారణంగా ఓడిపోయామని సమీక్షలు చేస్తున్నారు లేదా మీడియా ఆ విధంగా చేసిన సమీక్షలని అంగీకరిస్తున్నారు. అతివిశ్వాసం అంటే కార్యకర్తలు, బి.వీ.మోహన్ రెడ్డిలు కూడా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు కాబోలు! ఇప్పటికైతే విషయం తాజాగా ఉంది గనుక, అందులోని లొసుగులు మనకి తెలుస్తున్నాయి, గ్రహింపు కొస్తున్నాయి. కానీ కొన్ని రోజులకి మరిచి పోవటం ఖాయం. ఎందుకంటే, ఎవరి జీవన సమరం వారిది. ఎవరి వృత్తి వ్యాపార గొడవల్లో వాళ్ళు పడిపోయి, ప్రజలు పట్టించుకోరు. అదే వృత్తి అయి పట్టించుకోవలసిన మీడియా, తానే కుట్రకు నాయకత్వం వహిస్తుంది గనుక, ఎన్నికల ఫలితాల్లో కన్పిస్తున్న ‘అనూహ్య’తని, అసహజాలని, అవకతవకలని మరుగుపరచి, గెలుపోటములకు తాను చూపిన పైకారణాలని[Over leaf reasons] పదేపదే ప్రచారిస్తుంది. సంవత్సరం గడిచేసరికి ఇదే చరిత్ర అయి కూర్చుంటుంది.

సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీనే మొదటి ప్రపంచ యుద్దం విషయంలో అమలుజరపబడింది. ఇందులో 1917 AD లో రష్యా యుద్దం నుండి విరమించుకోగా ఆస్థానంలోకి అమెరికా వచ్చి చేరింది. మొత్తానికి ఒక చిన్న సంఘటనతో ప్రారంభించి, దాన్ని ప్రపంచానికి చుట్టగలమా లేదా అన్న నకిలీ కణిక-6 ప్రయోగం విజయవంతమైంది. దాంతో నకిలీ కణిక-6 కీ, అతడి అఃతరంగిక బృందానికి, గూఢచర్య పరంగానూ మరింతగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకప్రక్క మొదటి ప్రపంచ యుద్దం జరుగుతుంటే ఇంకోప్రక్క భారత దేశ రాజకీయాల్లో బాపూజీ ప్రవేశించి స్వాతంత్ర సమరం కొత్తమలుపు తిరిగింది.

మరోప్రక్క రష్యాలో చెలరేగిన విప్లవం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అసలీ బోల్షవిక్కుల విప్లవం కారణంగానే రష్యా అర్ధాంతరంగా 1917 AD లో మొదట ప్రపంచయుద్దం నుండి వైదొలిగింది. అప్పటికి రష్యాలో జార్ చక్రవర్తుల దోపిడి కాండ, ప్రజల్ని, రైతుల్ని ఎంతగా పీల్చి పిప్పి చేసిందో, తర్వాత వచ్చిన సాహిత్యం [మాక్సీ గోర్కీ ’అమ్మ’ నవలతో సహా] జగత్తంతటకీ వివరించి చెప్పింది. కులీనులు, భూస్వాములు రైతుల్ని, ప్రజల్ని అసలు మనుష్యులుగా కూడా గుర్తించనంతటి క్రౌర్యంతో హింసించేవాళ్ళు. సగటు మనిషి జీవితం అక్కడ నరకసదృశ్యంగా ఉండేది.

అప్పటికే యూరప్ లో రూసో, ఓల్టేర్ వంటి తత్త్వవేత్త[Philosophers] ల భావ సంచయక ప్రేరితులై, స్ఫూర్తిని పొంది, రాజవంశీయుల్ని గిలిటెన్లకు ఎర చేసిన చరిత్ర ఫ్రాన్సులో జరిగి, యూరప్ మొత్తానికి, శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు ఎంతగా ప్రజాజీవితాన్ని మార్చివేస్తాయో, అంతకు రెట్టింపుగా తత్త్వవేత్తల భావవాదాలు [గతి తార్కిక వాదం, కమ్యూనిజం, హెగెలిజం వగైరా] ప్రజా జీవితాల్నే కాదు దేశ చరిత్రలనే మార్చివేస్తాయన్న సత్యం అనుభవపూర్వకంగా బోధ పడింది. ఫ్రెంచి విప్లవం 1789 AD లో జరిగింది. తర్వాత జరిగిన నెపోలియన్ ఉత్ధాన పతనాలు తర్వాతి ప్రకరణం. ఫ్రెంచి వారికీ, జర్మనులకీ బద్దవిరోధం కారణంగా హెగెల్ ని జర్మన్లు ఎత్తినెత్తిన పెట్టుకున్నారు. భావ సంక్లిష్టత కొంత, భాషా సంక్లిష్టత కొంతా, తెచ్చిపెట్టుకున్నా స్వంత పదాల రీత్యా, హెగెల్ క్లిష్టమైన తత్త్వచింతనని మరింత సంక్లిష్టం చేశాడు. ముక్కుని సూటిగా చూపగలిగే అవకాశం ఉన్నా, జర్మనులు చేతిని తలచుట్టూ తిప్పి చూపిస్తారన్న స్థారకత హెగెల్ ని చూసే పుట్టిందేమో! ఇప్పటికీ ఏవిషయానైనా గందరగోళంగా చెబితే ’జర్మన్ ఫిలాసఫీ చెప్పకు’ అంటారందుకే. హెగెల్ గతి తార్కిక వాదంతో ప్రభావితుడైన కారల్ మార్క్సు, ఏంగెల్స్ లు కలలు గన్న కమ్యూనిజం, సామ్యవాదం! బ్రతికి ఉండగా దుర్భరదారిద్రాన్ని, నరక తుల్య జీవితాన్ని భరించిన అపూర్వప్రేమ మూర్తి కారల్ మార్క్స్! బ్రతుకంతా సామ్యవాదపు సమాజం ఇలపై సాక్షాత్కరించాలని కలలు కన్నాడు. అతడు మరణించాక, దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత రష్యాలో అది సంభవించింది. మార్క్స్ సిద్దాంతాలు అతడి మరణానంతరమే ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. అతడు తన ‘దాస్ కాపిటల్’ ని ప్రచురించినప్పుడు, ప్రవచించినప్పుడూ ఏదీ జరగలేదు. తర్వాత కొన్నేళ్ళకి, ఆ సిద్ధాంతాలు ఊపందుకున్నాయి. దేశాలనే ఊపి పారేశాయి. వాటిలో రష్యా విప్లవం ఒకటి. 1917 AD లో ప్రారంభమై 1920 AD లో సువిశాల USSR గా రుపుదిద్దుకున్న రష్యా విప్లవం వెనుక లెనిన్ నాయకత్వం ఉంది. ఆ నాయకుడి మూర్తిమత్త్వం ఉంది. జార్ ల అమానుషత్వంపై తిరగబడిన బడుగురైతుల నమైక్యత ఉంది. ఈ టపాల మాలికలో ఒకసారి చెప్పినట్లుగా – వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. అందుచేత, కొన్ని సిద్దాంతాలను వ్యాప్తి చెయ్యాలనుకున్నప్పుడు, నకిలీ కణిక వ్యవస్థ, ఆయా భావవాదుల్ని, నాయకులని స్వేచ్ఛగా వదిలేస్తుంది. వాళ్ళ జోలికి రాదు. ఆయా సిద్దాంతల పునాదుల మీద, ఆయా భావవాదాలు ప్రజ్వరిల్లి, ఉద్యమస్థాయికి చేరి, కావలసిన మార్పు సమాజంలో సంభవించాక, అప్పుడు తీరిగ్గా ఈ నకిలీ కణిక వ్యవస్థ అందులో చేయివేస్తుంది. నాయకత్వాన్ని ప్రక్కకి తప్పించి, తమ వాళ్ళని లోపలికి చొప్పిస్తుంది. వాళ్ళు అప్పటివరకూ ఆ విప్లవం సమాఖ్యల్లో రెండవ స్థానంలో ఉండనీయండి లేదా సరికొత్తగా రంగంలోనికి రానివ్వండి. 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు జరిగిన కొన్ని ’అతి’ విషయాలు, అమానుషాల నేపధ్యంలో, చీకటి రోజుల్ని, ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలని నిరసిస్తూ జనతా పార్టీ ఆవిర్భవించినపుడు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, 1977 ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానే జనతా ప్రభుత్వం, మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఏర్పడిన తొలినాళ్ళలోనే మరణించాడు చూడండి, అలాగన్నమాట! దాదాపు ఇదే స్ట్రాటజీ 1924 AD లో రష్యాలో అమలు చేయబడింది. విధివశాత్తు లేదా గూఢచర్యవశాత్తూ, లెనిన్, విప్లవానంతరం రష్యాకు తొలిప్రధాని అయిన లెనిన్, 1924 లో మరణించాడు. 1870 AD లో జన్మించిన లెనిన్ 54 ఏళ్ళకే మరణించాడు. తర్వాత పగ్గాలు అందుకున్నది స్టాలిన్. ఆ తర్వాత కృశ్చేవ్, బ్రెజ్నేవ్, కృశ్చయేవ్… గోర్బోచెవ్. పెరిస్త్రోయికా వంక…. ఎల్సిన్. అంతే. USSR ముక్కచెక్కలై, మళ్ళీ పాత రష్యా, పుతిన్ నాయకత్వంలో మిగిలిపోయింది. పుతిన్ కె.జి.బి. పూర్వాధిపతి. ఏదిఏమైనా 1917 AD నుండి ప్రజ్వరిల్లిన రష్యా విప్లవంతో, శతాబ్ధాల చరిత్రకలిగిన జార్ చక్రవర్తుల అనువంశిక పాలన మాత్రం కుప్పకూలిపోయింది. కెరెన్ స్కీ[Kerensky] ప్రభుత్వం కుప్పకూలిపోయి, ఒక్క రక్తపు బిందువూ చిందకుండానే లెనిన్ నాయకత్వంలో 1917 నవంబర్ 7 న ఏర్పడిన USSR, తర్వాతి కాలంలో ప్రపంచాన్ని శాసించిన రెండు వర్గాలలో [అమెరికా, రష్యాలలో] ఒకటైంది. కెరెన్ స్కీ గుర్తు తెలియని చోటుకి పారిపోయాడు.

ఈమొత్తం పరిణామాలలో నకిలీ కణిక-6 కి ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. శతాబ్దాల తరబడి సువిశాల సామ్రాజ్యాన్ని [సైబీరియా మంచు ఎడారితో కలిపి] ఏలిన రష్యన్ జార్ చక్రవర్తుల్ని సమూలంగా పెకలించగలిగిన తన గూఢచర్య బలం మీద విశ్వాసం పెరిగిపోవటం సహజమే కదా! ఇక తర్వాతి USSR దేశాన్ని, అసలు నాయకులని ఏదో మార్గాన [అర్ధాంతర హఠాన్మరణాలతో] తప్పించి, క్రమంగా తమ ఏజంట్లుని కీలక స్థానాల్లోకి తీసుకొస్తే చాలు. ఆ ప్రాంతామంతా పరోక్షంగా తమ ఏలుబడిలో ఉన్నట్లే. తమకి అనుకూలమైన చట్టాలు, తమకు అనుకూలురైన వ్యక్తుల అభివృద్ధి అన్నీ సులభసాధ్యమే. కాబట్టే 1990లో – 70 ఏళ్ళు, ఇనుపతెరల కావల ఏంజరిగిందో తెలియదు. ప్రచ్ఛన్నయుద్ధంలో అమెరికాతో పోటాపోటీగా నిలిచిన దేశం. ఒలింపిక్స్ లో [అప్పటికే డోపింగ్ టెక్నిక్ తెలుసుండి!] అదరగొట్టిన దేశం. జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల్లో ఎదురు లేని దేశం. అంతరిక్ష పరిశోధనల్లో అందరికంటే ముందున్న దేశం. USSR! 70 ఏళ్ళ తర్వాత పెరిస్త్రోయికా అంటూ గోర్బచేవ్ చేపట్టిన ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో, USSR ఇనుప తెర కవతల దారిద్ర్యం ఉండటం ప్రపంచాన్ని నివ్వెర పరచింది. ఎల్సిన్, గోర్బోచేవ్ ల నటనా వైదుష్యంతో కూడిన పతాక సన్నివేశాల తర్వాత USSR కుప్పకూలిపోయింది. ఆ విధంగా సామ్యవాదం విజయవంతంగా విఫలం అయ్యింది లేదా విఫలం చెయ్యబడింది. ఇక రేపెప్పుడో చైనా ఇనుపతెరలు చిరిగిన రోజున, అక్కడి సత్యమేదో మనకు ఆవిష్కరింపబడాల్సిందే.

‘శతాబ్ధాల చరిత్ర కలిగిన రాజవంశాలని మట్టికరిపించడం సాధ్యమే’ అన్న తర్వాత నకిలీ కణిక-6, అతడి వ్యవస్థ దృష్టి మరోప్రయోగం మీద పడింది. ఒక వ్యక్తి ఒక దేశాన్ని తద్వారా ఆ దేశం ప్రపంచాన్ని నడిపించగలదా? పాజిటివ్ గానైనా సరే, నెగిటివ్ గానైనా సరే! అదే అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ ప్రకరణం! తనని తాను ఆర్యన్ గా చెప్పకునే అడాల్ఫ్ హిట్లర్ ది ఎంత అవకతవకలతో కూడిన తర్కమో, తర్వాత కాలం నిరూపించింది. అప్పుడైతే జర్మన్ మీడియా, వార్తాపత్రికలు ఇచ్చిన ప్రచారం [గోబెల్ ప్రచారంగా ప్రసిద్ది చెందింది] జర్మన్ లలో జాత్యహంకారాన్ని, యూరప్ లోని పొరుగుదేశాల్లో, ఇతర దేశాల్లో అభద్రతనీ రేపింది. జర్మనీ తన ఆయుధసంపత్తిని విపరీతవేగంతో పెంచుకోవటం, మిగిలిన దేశాల్లో అనివార్యమైన పోటీని సృష్టించింది. తర్వాత కాలంలో అంటే 1970 లల్లో అదంతా అయుధ వ్యాపారుల నైపుణ్యంగా ప్రచారించబడిందనుకొండి; అది వేరే విషయం. హిట్లర్ ప్రకరణంతో రెండవ ప్రపంచయుద్దానికి తెరలేపడమే నకిలీ కణిక-6, అతడి గూఢచార వ్యవస్థ లక్ష్యం. ఎందుకంటే ఇందులో ఒకవ్యక్తి దేశాన్ని, ప్రపంచాన్ని గడగడలాడించగలడా అన్న ప్రయోగం ఒక్కటే కాదు, బ్రిటీషు రాజవంశాన్ని పతనం చేయటం కూడా నకిలీ కణిక-6 లక్ష్యం. భారతీయ కణికుడు ధృతరాష్ట్రునికి చెప్పే కణిక నీతిలో – ‘శతృవుని నాశనం చేసే ముందు వారి ఉత్సాహం, ఐశ్వర్యం, మంత్రాంగాలనే త్రివర్ణాలని నాశనం చెయ్యాలి’ అన్నది తొలివాక్యం. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ ఏవ్యక్తినైనా, ఏ సంస్థనైనా, ఏ రాజవంశాన్నైనా చివరికి ఏ దేశాన్నైనా, నాశనం చెయ్యాలంటే ముందుగా వారి ఆర్ధిక మూలాల మీదే దాడి చేస్తుంది. అప్పుడు బ్రిటీషు రాజవంశానిదీ ఇదేకథ. నేటి అమెరికా ఆర్ధిక మంద్యానిదీ ఇదే కథ. నిజానికి 1929 లో, మొదటి ప్రపంచయుద్దానంతరం [1914 – 1918], USSR ఆవిర్భావం తర్వాతి స్వల్ప వ్యవధిలో, అమెరికా ఒకసారి ఆర్ధిక మంద్యాన్ని ఎదుర్కొంది. తిరిగి కొన్ని సంవత్సరాల్లో నిలదొక్కుకుంది. అంతవరకే మనకి తెలిసిన నిజం. ఆ ముసుగులో ఎందరు నకిలీ కణిక వ్యతిరేకులు రాలిపోయారో, ఎందరు నకిలీ కణిక మద్దతుదారులు అభివృద్ధి పధంలోకి వచ్చారో ఎవరికీ తెలియదు. అలాగే ఎన్ని నకిలీ కణిక వ్యతిరేక సంస్థలు, పారిశ్రామిక కంపెనీలు దివాళా తీసాయో, ఎన్ని సంస్థలూ, కంపెనీలు ఆ పరిస్థితుల్లో అనూహ్యంగానో, అనుకున్నట్లుగానో లాభపడ్డాయో కూడా ఎవరికి తెలియదు. అప్పటికి తాత్కాలికంగా మేధావులో, జర్నలిస్టులో విశ్లేషణలు చేసినా, కాలగమనంలో అవన్నీ మాసిపోయి మీడియా చెప్పిందే చరిత్రయి కూర్చుంటుంది. మీడియా పైకెత్తిన సెలబ్రిటీ రచయితలు వ్రాసినవే చారిత్రక గ్రంధాలయి కూర్చొంటాయి.

ఇలాంటి విన్యాసాలతో 1937 లో ప్రారంభమైన రెండవ ప్రపంచయుద్దం 1945 లో జపాన్ పై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల విధ్వంస వినాశనాలతో ముగిసింది. ప్రపంచం ఆయుధ విఙ్ఞానాల పట్ల భయకంపితమైంది. ఆనక, శాస్త్రవేత్తలంతా, తమ వైఙ్ఞానిక పరిశోధనలు వినాశానానికి దారితీసినందుకు ఎంతగానో చింతించారు. అయితే ఆ వైఙ్ఞానిక పరిశోధనలు ఉపయోగించుకుంటూ ఆయుధ, బాంబుల నిర్మాణం జరుగుతున్నప్పుడు మాత్రం, ఎవరూ చింతించలేదు, అభ్యంతరం చెప్పలేదు, వ్యతిరేకించలేదు. సరికదా కనీసం నిరసన కూడా తెలపలేదు. ఇంకా ఇందులో మరో విశేషం ఏమిటంటే, ముందుగా అమెరికా యుద్దంలో పాల్గొనలేదు. జపాన్ అమెరికా యొక్క జలాంతర్గామిని నాశనం చేయటంతో దానికి ఒళ్ళుమండుకొచ్చింది. ఆపైన జపాన్ Vs అమెరికాల పోరాట గాధ, ‘పెరల్స్ హార్బర్’ సినిమాల రూపేణా, నవలల రూపేణా అందరికీ తెలిసిందే. [సదరు సినిమాలు, నవలలు, ఈ నేపధ్యపు కథతో, చెప్పుకోదగిన పరిమాణంలోనే వ్యాపారం చేసి లాభాలు గడించాయన్నది ఇక్కడ గమనార్హం]. చిన్నదేశమైన జపాన్ తమ మీద కాలుదువ్వినందుకు కోపంతో[over leaf reason] మండిపడిన అమెరికా, అణ్వాయుధాన్ని జపాన్ పైన ప్రయోగించింది. అయితే 1944 లో ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ మరణించటంతో, ఉపాధ్యక్షుడు హారీ ట్రూమన్ అమెరికా అధ్యక్షుడై, తీసుకున్న నిర్ణయం అది. ప్రజలకి ఎన్నికల వరకూ కనబడిన నాయకత్వం రూల్ వెల్ట్ ది. అణుబాంబు నిర్ణయం ట్రూమన్ ది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఈ రోజు టపా: నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు [Assumptions] -7[గాడ్ ఫాదర్ల మొదటి దశ]


మీరు గమనించారో లేదో – కొన్నిరోజుల క్రితం, ఫిబ్రవరి 14, 2009 న మన తెలుగు బ్లాగ్లోకంలో ప్రముఖ బ్లాగరు శ్రీ తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం గారు, వ్యాపార ప్రకటనల్లలోని అశ్లీలత గురించి “వేసుకోమనా? విప్పుకోమనా?" అన్న శీర్షికతో ఒక టపా వ్రాసారు. అందులో ఈనాడు వారి బ్రిసా, అలాగే కళామందిర్, సి.ఎం.ఆర్. కళానికేతన్ ల వారి ప్రకటనలు గురించి వ్రాసారు. ఆ ప్రకటనలో సదరు మోడళ్ళు వేసుకున్న జాకెట్ లేని లేదా పమిట వేసుకోని ఫోటోలని విమర్శిస్తూ ఘాటుగా, సూటిగా ప్రశ్నలు గుప్పించారు. అవి తక్కిన వ్యాపార సంస్థలకి ఎలా తగిలిందో నాకు తెలియదు కాని, ఈనాడు పత్రికాధిపతికి, మీడియాకి సూటిగా గుచ్చుకున్నాయనుకుంటా. ఎందుకంటే ఆరోజు నుండి ఈరోజు వరకూ మాత్రం ఈనాడు ఆదివారం సంచిక వెనుక పేజీ మీద పెళ్ళికూతుళ్ళు కుదురుగా జాకెట్లు, పమిటలూ వేసుకుంటున్నారు.

మరో ఉదాహరణ గమనించాలి. కొన్నిరోజుల క్రితం ఫిబ్రవరి 17,2009 న తెలుగు‘వాడి’ని బ్లాగరు సానియామీర్జా క్రీడా ప్రదర్శన, ఆ క్రీడాకారిణికి మీడియా ఇచ్చే ప్రచారాలని సునిశితంగా విమర్శిస్తూ ఒక టపా, ‘బుర్ర ఎక్కువ ఉపయోగించకుండా, తేలికగా/సులభంగా చేయగలిగిన ఉద్యోగం ఏది !?’ వ్రాసారు. ఆరోజు నుండి ఈరోజు వరకూ పత్రికల్లో, ముఖ్యంగా ఈనాడులో, సానియా మీర్జా పెద్దపెద్ద ఫోటోలు వేసి, ఈ అమ్మాయి గెలిచినా ఓడినా, ఆ పిల్ల ర్యాంకు పెరిగినా, తగ్గినా, ఆమె క్వార్టర్ ఫైనల్స్ లోకో, సెమీ ఫైనల్స్ లోకో ప్రవేశించినా లేక వెనుదిరిగినా పేద్ద వార్త వ్రాసి పారేయడం మానేసింది. సానియా మీర్జా గురించి ఏ క్రీడా వార్తా ప్రచురించటానికి వీలుగాక పోతే ఆ అమ్మాయి Dress Sense గురించో, సమయస్ఫూర్తి గురించో, మరింకో విషయం గురించో వార్తా కథనాలు వ్రాయటమూ తగ్గించింది. దాదాపు మానేసిందని చెప్పవచ్చు. ఆవిధంగా మన తెలుగు బ్లాగర్లు కూడా పత్రికల్ని ‘ఏదో కాస్తన్నా’ అదుపులో పెట్టగలుగుతున్నారని చెప్పవచ్చు.

ఇలాంటివి పరిశీలిస్తే బోలెడు బొచ్చెడు ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకి రెండు చెప్పాను. మీరూ గమనించి చూస్తే కోకొల్లలు కన్పిస్తాయి. కాబట్టి మనం తెలుగు బ్లాగర్లకి జేజేలు చెప్పుకోవచ్చు. కాదంటారా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇక నకిలీ కణిక-4 కి ఎన్ని భావోద్రేకాలు కలిగినా [కసి, దుఃఖం, కోపం, ఆక్రోశం వంటివి] వాటితో నిమిత్తం లేకుండా పరిస్థితులు ముందుకెళ్ళిపోతున్నాయి. అప్పటికి నాలుగు తరాలుగా పెంచి పోషించుకొస్తున్న ఆకాంక్షలని, ఆశలని నకిలీ కణిక-4 వదులుకోలేదు. ఎటూ అవి తన తర్వాతి తరానికి, తన వారసుడికి నూరిపోస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో క్రియాశీల గూఢచర్యపు పగ్గాలు స్వీకరించిన నకిలీ కణిక-5, నకిలీ కణిక-4 మార్గదర్శకంలో మెల్లిగా బ్రిటీషు అధినాయకత్వానికి దగ్గర కావటానికి పావులు కదిపాడు. ఆపైన రాజవంశానికి దగ్గరకావటమే లక్ష్యం. అప్పటికే గూఢచర్య తంత్రాలైన, ‘తాము ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో వారికి తామే కష్టం కలిగించి, సానుభూతి, సహాయ సహాకారాలు, మద్దతు గట్రాలతో మానసికంగా దగ్గర కావటం, తమ మీద ఎదుటివాళ్ళు ఆధారపడేలా చేసుకోవటం’ వగైరా స్ట్రాటజీలపైన పూర్తి పట్టు ఉంది. ఇలాంటివే ఎన్నో స్ట్రాటజీలు! పదేపదే ఒకే ’విషయం’ వివిధ మార్గాలద్వారా తము లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తులకి చేరేటట్లు చేసి, ఎదుటి వాళ్ళు తమంతట తామే ఆ ‘విషయం’ పట్ల ఆకర్షితులయ్యేట్లు చేయటం ఇలాంటివే. [ధృతరాష్ట్ర దుర్యోధనులు పాండవులపై వారణావతం లక్కయిల్లు విషయంలో అమలు పరచిన స్ట్రాటజీ ఇదే] ఎటూ ఈ గూఢచర్య తంత్రాలపైన బ్రిటీషు వారికి, బ్రిటీషు రాజవంశానికి అసలే అవగాహనా లేదయ్యె. నకిలీ కణిక-5 కి, అప్పటికే బలంగా రూపుదిద్దుకున్న అతని బృందానికి, అతని గూఢచార వలయానికి, సామ్రాజ్య స్థాపన, నిర్వహణ, గురించిన ఙ్ఞానం, గూఢచర్య స్ట్రాటజీలతో ఎంతటి వ్యక్తి నైనా, ఎలా లొంగదీసుకోవాలి, నిగూఢంగా పనులు ఎలా చక్కబెట్టాలి అన్న ఙ్ఞానం కొట్టినపిండి.

ఇక యూరపు దేశాల్లో సాంస్కృతిక విప్లవం తర్వాత ఎగిసి పడిన [శాస్త్రసాంకేతిక] పారిశ్రామిక విప్లవం, దాని పర్యవసానాలు, ఒక కొత్త శాస్త్ర విషయం, పరికరం, కనుగొన్నాక సమాజం పైనా, ప్రజా జీవితంపైన ఆ శాస్త్రీయ ఆవిష్కరణ తాలూకూ ప్రభావ పరిణామాలు, భవిష్యత్తుకి ఎంతో ఉపయుక్తంగా నకిలీ కణికుడి వ్యవస్థకి తోచాయి. టెక్నాలజీతో భవిష్యత్తులో ఒక దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే ’గ్రిప్’ చేయవచ్చని నకిలీ కణిక-5 ముందుగా గుర్తించాడు. అప్పటికి భారతదేశాన్ని తమ ఏకచ్ఛత్రాది పత్యం క్రిందికి తేవాలని తరాలుగా చేసిన కృషి నిష్ఫలం కావటంతో నకిలీ కణిక-4 ఎంతగా కసితో రగిలిపోయాడో, అంతకు రెట్టింపుగా నకిలీ కణిక-5 మళ్ళీపని ప్రారంభించాడు. బ్రిటీషు రాజరిక వ్యవస్థలో అప్పటికే ఊడలమర్రిలా విస్తరించి ఉన్న లంచగొండి తనాన్ని, స్వార్ధాన్ని, అవినీతిని, చేసేవి చేస్తూనే, స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి ధర్మపన్నాలు చెప్పగల హిపోక్రసీని మరింతగా ఉపయోగించుకునే స్ట్రాటజీని రూపొంచాలంటే మరింతగా దాన్ని అధ్యయనం చేయాలన్న విషయం బోధ పడింది.

తమ గూఢచర్య ఙ్ఞానంతో, రాజవంశానికి, ‘రాజ్యవిస్తరణ’ వంటి ఉపయుక్తమైన కర్మల నిర్వహణ వెనుక తమ నిగూఢపాత్రని చూపించారు. దాంతో సహజంగానే ‘రాజ’ వంశ అంతరంగికుల్లో నకిలీ కణిక-5 యొక్క ఏజంట్లు చేరగలిగారు. ఎక్కడికక్కడ ఆర్ధిక లాభం, కెరియర్ గ్రాఫ్, పేరుప్రఖ్యాతులు వంటివి బహుమతులుగా ఇస్తూ నారదనీతిలో, విదుర, కూటనీతిలో చెప్పబడినట్లు ఆవలి వర్గంలోని వారిని తమ వైపు తిప్పుకోవటం, ఫలితాలు సాధించటమే గాక, ఆ ‘శ్రమ’ని స్ఫుటంగా రాజవంశానికి, కులీనులకి, బ్రిటీషు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకి [establish] గుర్తింపబడేటట్లు చేసుకున్నాడు.

తమ సామ్రాజ్యం అంతకంతకూ విస్తరిస్తూ, ఖంతాంతర సీమలను ఆక్రమిస్తూ, మెల్లిగా ప్రపంచమంతా నిండిపోతే ఎవరికైనా అది ఎంతో మక్కువ కలిగిస్తుంది కదా? ఫలితాలు అంత అద్భుతంగా సాధించి పెట్టిన అంతరంగిక అనుచరగణం మరింత ప్రియమైనది అవుతుంది కదా! ఇలా నకిలీ కణిక వ్యవస్థకి రాజాశ్రయం స్థానంలోకి బ్రిటీషు రాజవంశం వచ్చేసరికి, అంతకు ముందు వరకూ అదే స్థానంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ ఎత్తి కుదెయ్యబడింది. అవసరం తీరిపోయాక అప్పటివరకూ నెత్తిన పెట్టుకున్న లేదా భుజాలపై మోసిన వ్యక్తుల్ని, సంస్థల్ని, ప్రభుత్వాలని, చివరికి దేశాలని సైతం ఎత్తికుదేయటం అన్న లక్షణం నకిలీ కణికులదే. [ఇప్పుడు సత్యంరామలింగరాజు దగ్గర నుండి చిరంజీవి దాకా ఎవరిదయినా ఇదే కథ]

ఈ నేపధ్యంలో బ్రిటీషు సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించి, ‘రవి అస్తమించిన బ్రిటిషు సామ్రాజ్యం’ అన్పించుకుంది. అప్పటికి నకిలీ కణిక-5 కి శాస్త్ర సాంకేతిక పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణలు, సమాజంపై వాటి బలమూ, శాస్త్రీయ ఆవిష్కరణలు ఆర్ధిక మూలాలుగా నిలబడటం పైన చక్కని అవగాహన కలిగింది. చాలా నిగూఢంగా, ప్రచ్ఛన్నంగా అమలు చేయటం మొదలుపెట్టాడు. భారతదేశపు నంతటినీ ఒక్కసారిగా తమ ఏలుబడిలోనిదిగా ప్రకటిస్తూ సామ్రాజ్యాధినేత కావాలన్నా తమ పూర్వీకుల కల 1857 ADలో ఎప్పుడైతే విఫలమయ్యిందో, అప్పడు రగిలిన కసికి, ఈసారి లక్ష్యం ఒకదేశానికి పరిమితం కాలేదు. యావత్ర్పపంచానికి సామ్రాట్టులు కావాలి. జగజ్జేత కావాలి. దాని సాధ్యాసాధ్యాలు బ్రిటీషు రాజవంశాన్ని తెరమీద ఉంచి, ప్రయోగించుకుని చూశారు. ఎందుకంటే ఎవరికీ తెలియని గూఢచార ఙ్ఞానం తమదగ్గర ఉంది. ఏ సంఘటనలకైనా అంతర్గత కారణం తమకి మాత్రమే తెలిసి ఉండగా, అందరూ మాత్రం, తము ప్రచారించిన పైకారణాన్ని నమ్మి, స్వంతీ కరించుకుని, విశ్లేషణలు, సమీక్షలూ, చర్చలూ చేసి సంతృప్తిపడటం చూసే కొద్దీ, తమ లక్ష్యం అంత కష్టతరమైనది కాదని అన్పించసాగింది.

ప్రపంచాన్ని శాసించాలంటే గూఢాచర్యఙ్ఞానం తప్పని సరి. అయితే దానితోపాటుగా ఆయుధ ఙ్ఞానం, శాస్త్రసాంకేతికత, రాజకీయఙ్ఞానం గట్రా గట్రాలు కూడా తగినంతగా కావాలి. అందుచేత నకిలీ కణిక-5 తన తదుపరి లక్ష్యంగా శాస్త్రసాంకేతిక రంగాన్ని ఎంచుకున్నాడు. ఇంకేముంది! నకిలీ కణిక గూఢచార వలయంలోకి కొందరు శాస్త్రవేత్తలు, కొందరు విద్యావేత్తలూ కూడా ప్రవేశపెట్టబడ్డారు. అసలే పాశ్చాత్యదేశాలలో విద్యారంగంలో అవినీతి పాలు ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు కాదు దాదాపు నూరేళ్ళ క్రితం గాంధీజీ బారిష్టరు చదువు నేపధ్యంలోనే ఎంతగా అర్ధరహితంగా [అవినీతి మయంగా] ఉండేదో బాపూజీ తన ఆత్మకథ ‘My Experiments with Truth’ లో ’బారిష్టరు చదువుకీ, ఈ ప్రొఫెసర్లతో విద్యార్ధుల సాన్నిహిత్యం కోసం నడిచే మందుపార్టీలకీ సంబంధం ఏమిటో నాకిప్పటికీ అర్ధం కాదు’ అంటూ చాలా సున్నితంగా, అయినా స్పష్టంగా వ్రాసారు.

ఇక అలాంటి రంగంలోకి నకిలీ కణిక వ్యవస్థ కాలుపెట్టటంతో – యూనివర్సీటీల్లో ఎన్ని రాజకీయాలు ప్రవేశించాయో చెప్పనలవి కాదు. ఇప్పటి మన యూనివర్సిటీల స్థితిని దాదాపు 125 ఏళ్ళ క్రితమే పాశ్చాత్య యూనివర్సీటీలు చేరిపోయాయి. ఒకరి పరిశోధనా ఫలితాలు మరొకరి పేరిట అచ్చవ్వటం, ప్రచారం అవ్వటం వంటి మేధోచౌర్యాలు ప్రారంభమై పెరిగిపోయాయి. తన పరిశోధనాత్మక వ్యాసాలని, ఆవిష్కరణలని చదివి అభిప్రాయం చెప్పాల్సిందిగా, చిన్నచితకా అంటే అప్పటికి అంతగా పేరు ప్రఖ్యాతులు లేని శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ లలో పేరుప్రఖ్యాతులతో వెలిగిపోతున్న శాస్తవేత్తలకి పంపటం, వారు వాటిని తమ పేరుమీదుగా ప్రచారించుకోవటం వంటి ఎన్నో సంఘటనలు తర్వాత వెలుగు చూశాయి, వివాదస్పదం అయ్యాయి. ఎవరైనా పేరు ప్రఖ్యాతులు పొంది సెలబ్రిటీలు ఎలా అవుతారో, ఇప్పటి మీడియాని చూస్తున్నా మనకి, ఈ మీడియాకి ముత్తాతలయిన నకిలీ కణిక పూర్వతరాలు, వారి వ్యవస్థ, వ్యక్తుల్ని ఎలా సెలబ్రిటీలుగా చేస్తుందో అర్ధమౌతుంది గదా!

ఇక ఇది ఎంత పరాకాష్టకు చేరుకుందంటే, ప్రొఫెసర్ల వెనుక, వారి ఆవిష్కరణల వెనుక ఘోష్టులు ఉండటం దాకా! అంటే సెలబ్రిటీలైన ప్రొఫెసర్లు అనామకులైన యువశాస్త్రవేత్తల్ని, ఔత్సహికుల్ని తమకు అసిస్టెంట్లుగా పెట్టుకుని వారి శ్రమని, ఆవిష్కరణలని తమవిగా ప్రచారించుకోవటం అన్నమాట. ఇప్పుడు సినిమారంగంలో చూస్తున్నామే అది! నటులకు డూప్ లు! ఈ ఒరవడి 1992 తర్వాత బాగా తగ్గింది గానీ అంతకు ముందు డూప్ ల ఫీట్లు ఎక్కువగా ఉండేవి. ఫలానా చిత్రంలో ఫలానా రిస్కు షాట్ డూప్ లేకుండా మా హీరోనే చేసాడని చెప్పుకోవటం ప్రచారంలో భాగమయ్యింది. 1992 తర్వాత, అప్పటి వరకూ కర్ణాకర్ణిగా ఉన్న డూప్ ల కథలు బాగా వెలుగులోకి, ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలాగే పాలగుమ్మి పద్మరాజు, దాసరి నారాయణ రావుకి ఘోస్ట్ రచయితగా ఉండేవాడనీ, అందుచేత అతడి మరణం తర్వాత దాసరి నారాయణ రావు స్ర్కిప్టులు విజయవంతం కాక సినిమాలు బాక్సాఫీసు దగ్గర జయప్రదం కావటం లేదని, ఒక వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. నిజనిజాలు భగవంతుడికీ, దాసరి నారాయణరావు వంటి వ్యక్తులకే తెలియాలి. ఇలా రచయితల దగ్గర నుండి, సంగీతకారుల దాకా ఎన్నో విషయాలు బయటికొచ్చాయి. అలాగే సదరు చిత్రసీమలో గాడ్ ఫాదర్ ల దయ ఉంటే కారునల్ల కాంతామణి, కనురెప్పలు కూడా అతికించుకుని, అందాల అభినేత్రిగా, ఆంధ్రుల ఆరాధ్యదేవతగా వెలిగిపోయింది. అంతకంటే అందగత్తెలూ, నైపుణ్యం, కళా సామర్ధ్యం గల వారెందరో ’ఎక్ స్ట్రా’ ల స్థాయిలోనే అణిగారిపోవటం విన్నాం. అలాంటి వారిలో ఎంతోమంది ‘మనలో లేనిదేమిటి? ఆ నటిలో ఉన్నదేమిటి? ఒక్క స్టెప్ సరిగా వేయటం రాదు. ఒక్క డైలాగ్ సరిగా చెప్పటం రాదు. వందటేకులు తింటుంది. కానీ ఏం చేస్తాం. ఆమె స్టార్ అలాగుంది’ అనుకోవటం గురించి ఎన్నోకథలు. ఒక్కోసారి ఈ గాడ్ ఫాదర్ ల పట్టు ఎంత గొప్పగా సాక్షీభూతం అవుతుందంటే, మాలాశ్రీ వంటి నాయకి బాగా లావుగా ఉన్నా ఆవిడ ధరించిన పాత్ర మీద సిలిండర్ అనో, తిండిపోతు అనో సెటైర్ ఉంటుంది గానీ హీరోయిన్ గా ఆవిడ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. ఇప్పటి బొద్దుగుమ్మ నమిత తమిళ చిత్రసీమలో వెలిగిపోతోందని, గుడి కడతామని అభిమానులు అంటే తానే నివారించానని, అందంగా, ఆరోగ్యంగా కనపడటం ఎలా అని అందరూ తనని సలహాలు అడుగుతుంటారని, తెలుగు చిత్ర వార్త విశేష సంచికలు వ్రాస్తుంటే కామోసను కుంటునో, ఛస్ కాదనుకుంటునో చదువుతుంటాం మనం. మన స్పందనతో ఏమాత్రం ప్రమేయం లేకుండానే సదరు నటీ నటులు సెలబ్రిటీలుగా వెలిగిపోతుంటారు. ’నాకింత టేస్తుందని నాకే తెలియదు’ అన్న ’అష్టా చెమ్మా’ సినిమా హీరో ఆనంద్ పాత్ర డైలాగ్ లాగా, మనకింత టేస్టుందని మనకే తెలియదు. ఖచ్చితంగా చెప్పాలంటే ‘దేశసుస్థిరిత’ పట్ల మనకింత నిబద్దత ఉందని, అందుకోసం కాంగ్రెస్ ని ఎన్నుకునేంత అభిమానం మనకి సోనియాగాంధీ మీద ఉందని, మనకే తెలియదు చూడండి, అలాగన్నమాట. ఇంకా చెప్పాలంటే గెలిచినా ఓడినా కొన్నినెలల క్రితం వరకూ సానియా మీర్జా మీడియాలో వెలిగిపోయింది చూడండి, అలాగన్నమాట.

ఎలాగైతే సినిమా రంగంలో, క్రీడారంగంలో, ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా వ్యక్తుల కెరియర్, గాడ్ ఫాదర్ ల అంటే నకిలీ కణిక వ్యవస్థ, చేతిలోకి మళ్ళిపోయిందో, అలాగే 1900 ADలో శాస్త్రసాంకేతిక రంగమూ తయారయ్యింది. ఎక్కడుంటారో, ఎవ్వరో తెలియని అఙ్ఞాత వ్యక్తుల ఆశీర్వాదం లభిస్తే గానీ రాణించని స్థితి శాస్త్రవేత్తలకి ఏర్పడింది. క్రమంగా ఆ స్థితి, క్రీడా, సినీ, రాజకీయ ఇత్యాది అన్ని రంగాలకి కాలక్రమంలో పాకింది. అప్పటికి వ్యాపార సంస్థలలో పరిశోధనా విభాగాలు కూడా ప్రవేశ పెట్టబడ్డాయి. అందులో శాస్త్రవేత్తలకు ఉపాధి అవకాశాలు, ధన సంపాదనా మార్గాలు ఏర్పడ్డాయి. 110 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆ కార్పోరేట్ వాణిజ్య సంస్థల Research and Development విభాగాలు చేసే పరిశోధన, తమ వ్రాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అందుకోసం తమ ఉత్పత్తుల నాణ్యత ఎలా పెంచుకోవాలి, మొదలైన విషయాలని దాటి, ధనార్జనకి కొత్తమార్గాలని తమ శాస్త్రీయ ఆవిష్కరణలతో కనుక్కోనే స్థితికి వచ్చాయి. సబ్బు త్వరగా ఎలా అరిగిపోయేటట్లు చూడాలి, ప్రతి కస్టమర్ తన నెలబడ్జెట్ లో తప్పనిసరిగా తన ప్రొడక్ట్ కొనేటట్లు ఎలా చూడడం. ఉదా: మస్కిటో రిపల్లెట్స్, కాక్రోచ్ రిపల్లెట్స్, గట్రా గట్రా. అంతేగాక ఒక జబ్బుకి ఇవ్వబడే మందు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్ ని మెల్లిగా, ఎవరికీ అనుమానం రాకుండా, ఎక్కడా గగ్గోలు అవకుండా ఎలా పెంచాలి, తద్వారా కొత్తమందులు తయారు చేసి అమ్ముకోగలిగే అవకాశాలు ఎలా పుట్టించుకోవాలి అన్నదాకా పరిశోధనలు సాగాయి. అంతేకాదు కార్పోరేట్ పుడ్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా శ్వాసకోస సంబంధిత వ్యాధులు, ఒబేసిటి సమస్యలు గట్రా గట్రా వస్తాయి. వాటికి కొత్త మందులు కనుక్కుంటారు. ఎక్కడా పుడ్ కంపెనీలకి, ఫార్మకంపెనీలకి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే కొత్తమందుల తయారీ, అమ్మకాలు, పెంచుకునేందుకు కొత్త జబ్బుల కనుగొనేంతగా ఇది అభివృద్ధి చెందింది. ఎటూ కొత్త జబ్బుల గురించి ప్రజల్నీ భయభ్రాంతుల్ని చేయటానికి, తాము సృష్టించిన వ్యాక్సిన్లని ప్రచారం చేసి తమకి ప్రాణ దాతల బిరుదులూ, సెలబ్రిటీ హోదాలూ ఇవ్వటానికి మీడియా ఉంది కదా! ఇక్కడ కూడా చూడండి. అదే స్ట్రాటజీ! కష్టం తామే కలిగించి, మళ్ళీ తామే దాన్నుండి రక్షించే ఆపద్భాంధవులుగా అవతరించటం.

ఇక ఈ రంగంలో ఇప్పడంటే, నూరేళ్ళ తర్వాత, మందులూ, రసాయనాలు [వ్యవసాయక ఎరువులూ, తెగుళ్ళ మందులూ గట్రా] ప్రధాన భూమిక పోషిస్తున్నాయి గానీ నూరేళ్ళ క్రితం ఆయుధాలదే హవా అంతా! తుపాకులు, శతఘ్నులూ, ట్యాంకర్లూ, క్రమంగా పరిణామం చెందుతూ అణ్వాయుధాల దాకా వచ్చాయి. పిదప రసాయనిక ఆయుధాలు, ఇప్పుడు జీవాయుధాలు. జీవాయుధాలంటే ఏముంది, అంటురోగాలు పుట్టించే క్రిమి లేదా సూక్ష్మ క్రిములని వదలటాలు. ఏ స్వైన్ ఫ్లూ, చికున్ గునియాలు, ఎలర్జీలు ఏ బ్యాక్టీరియాతో వస్తాయో, ఏ శాస్త్రవేత్త లేదా ఏ డాక్టర్ చెప్పగలడు?

ఇక ఈపద్దతి అంతటితో నకిలీ కణిక-5, తన ముందటి తరం ఎదుర్కొన్న అపజయం నుండి విజయపు బాటలోకి తన వ్యవస్థని తీసుకువచ్చాడు, మరింత బలోపేతం చేసాడు. అతడి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, అతడి మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది, రంగంలోకి వచ్చిన అతడి వారసుడు నకిలీ కణిక-6 మరింత అప్రమత్తత, జాగరూకత పెంపొందించుకున్నాడు. అప్పటికీ ఈ నకిలీ కణికులకి, వారి అంతరింగిక బృందానికి ఒక విషయం స్పష్టపడింది. రాజవంశీయుల కంటే కూడా, వ్యాపార సంస్థల్ని బలోపేతం చేసి, తమ గుప్పిట్లో ఉంచుకోవటం తమకి శ్రేయస్కరం అని. దాంతో నకిలీ కణికులు వివిధ దేశాల్లో, వివిధ ప్రభుత్వ శాఖ పదవుల్లో, లేదా యూనివర్సిటిల్లో, వివిధ హోదాల్లో, వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉండి, తమకి సేవలందించిన, తమకి సహాయ సహకారాలందించిన తమ ఏజంట్లకు, వారు తమకి సేవలందిస్తున్నంత కాలమూ, తము వారికి ప్రతిఫలంగా అందించిన డబ్బు, కెరియర్ గ్రాఫ్ [పదోన్నతులు], పేరుప్రఖ్యాతులు, అవార్డుల రివార్డులకు అదనంగా మరొక జీవిత సాఫల్యతుల్య బహుమతి అందించటం మొదలు పెట్టారు. అదేమిటంటే కార్పోరేట్ కంపెనీల్లో సీఈవో పదవులూ, వాటాలు. పాక్ లో దాదాపు ప్రతి ఐ.ఎస్.ఐ. అధికారి, సైనికాధికారి, రిటైరయ్యాక ఒక పారిశ్రామిక వేత్త లేదా వాణిజ్యవేత్త అవతారం ఎత్తుతారు. సి.ఐ.ఏ. అధికారులకీ ఉద్యోగి విరమణానంతరం కార్పోరేట్ సంస్థల్లో కీలక వాటాలు, పదవులూ, ప్రత్యక్షంగానో, బినామీ పేర్లతోనో కట్టబెట్టినా ఎవరికి తెలుస్తుంది? మీడియా నిజాలు చెప్పదు కదా! అందునా అమెరికా మీడియా. ఇండియా మీడియాకి పెద్దన్న అదే. సినిమా నటీనటుల సినిమా కెరియర్ తర్వాత పొందే రాజకీయ కెరియర్, క్రీడాకారులు తమ రిటైర్ మెంట్ తర్వాత ప్రారంభించే అయిదు లేదా మూడు నక్షత్రాల హోటళ్ళు గట్రాలలో అధికశాతం ఇలాంటి ముసుగులోనివే.

సామాన్యుణ్ణి ఏవిధంగానైతే, ఏరంగంలోనూ పైకి రానివ్వడం లేదో ఇదీ అంతే. ఎక్కడైనా ఒక్కడు ఏసినిమా హాల్లోనో టిక్కెట్లిచ్చే గుమాస్తా వంటి వ్యక్తి రాజకీయాల్లో పైకి వచ్చి మంత్రో కాగలిగాడంటే అతడిలో ఉన్న ఏవో ‘క్యాలిటీ’లు నకిలీ కణికుడి అనువంశీకులకి నచ్చినందునే. ఆ విషయం రాజకీయ కెరియర్ లో సదరు వ్యక్తి ఎంత అక్రమార్జనకు పాల్పడ్డాడో చూస్తే తెలుస్తుంది కదా! అప్పుడు మనకి అర్ధమయ్యేది ఏమిటంటే అతడు ‘సామాన్యుడు’ కాదని.

ఈ వ్యవస్థ కంతటికీ ఒకో తరం పునాది వేసుకుంటూ వచ్చింది. నకిలీ కణిక-5 నుండి నకిలీ కణిక-6 పగ్గాలు పుచ్చుకున్నాక, పరిస్థితిని సమీక్షించుకుంటే బ్రిటీషు రాజవంశం పేరిట, తము ప్రచ్ఛన్నంగా ప్రపంచాన్నంతటిని ఒకే గొడుగు క్రిందికి తేగలిగామన్న భావన బలపడింది. ఇక ప్రయోగాలతో దాన్ని నిర్ధారించుకోవలానుకున్నాడు. ఎందుకంటే నకిలీ కణిక-4 హయంలోలాగా అంటే 1857 AD లో లాగా ప్రయత్నం విఫలం కాకూడదు. అందుచేత ఈసారి తాము attempt చేస్తే జగజ్జేతలు అనో, ప్రపంచాధినేతలనో, అన్పించుకోవాలి. అంతేగానీ విఫలం కాకూడదు. అందుకు మరింత సమయం పట్టినా, ఫర్వాలేదు. మరింత సహనంతో వేచి ఉండి మరీ, అదనులో ఫలితం దక్కించుకోవాలి. అందుచేత ఈసారి ఏ రిస్కూ ఉంచుకోదలుచుకోలేదు. అందుకే ప్రయోగాలు మొదలు పెట్టాడు. అందుకోసం మరికొన్ని స్ట్రాటజీలు సమాజంలోకి ప్రవేశపెట్టాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇక 1800 AD లో ఈస్టిండియా కంపెనీకి ఉత్తర దక్షిణ భారత దేశాల్లో కీలక ప్రాంతాల్లో పట్టు దొరకటంతో, చాలావేగంగా, రెండు మూడు దశాబ్ధాల కాలంలోనే, దేశమంతటినీ సుస్థిరంగా తన గుప్పిటిలోకి లాక్కోగలిగింది. 1828 AD లో సతీ సహగమానాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చింది. అప్పటికి భారతదేశంలో వర్ణవ్యవస్థ, మూఢాచారాలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఉన్నదాన్ని వెయ్యిరెట్లకు పెంచి ఈస్టిండియా కంపెనీ ప్రపంచమంతా ప్రచారించింది. దాని వెనుక ఉన్నది నకిలీ కణిక-4 బుర్రే !

నిజానికి ప్రపంచమంతా, అన్ని దేశాలలో, జాతులలో వర్గాలూ, తెగలూ ఉన్నాయి. ఆయా వర్గాల మధ్య, స్థానిక కారణాలరీత్యానో లేకో సంస్థాగత కారణాలరీత్యానో, వైషమ్యాలూ ఉన్నాయి. అందుచేత తెగల మధ్య, వర్గాల మధ్యా, పోరాటాలూ ఉన్నాయి. అలాగే మూఢనమ్మకాలూ, మూఢాచారాలూ కూడా ఉన్నాయి. ఇప్పటికీ పోప్ ’పసరు కక్కించడం’ చూస్తూనే ఉన్నాం. అంత్రాలూ, తంత్రాలూ కట్టటం మసీదుల్లో ఫకీర్లు చేయటం చూస్తూనే ఉన్నాం. దాదాపు అన్ని మతాల వారూ దేవుడితోపాటు సైతానుని నమ్ముతారు. దెయ్యాలని నమ్ముతారు. వాళ్ళ నమ్మకాల ప్రకారం దాదాపు దేవుడితో సమానంగా సైతాను శక్తివంతమైనది. దేవుడి స్వర్గానికి సమాంతరంగా సైతాను లోకం ఉంటుంది. ఇంకా భారతీయుల హిందూ మతంలోనే భూతగణాలు శివుని భృత్యుగణాలు. అదీను ఇక్కడ భూత గణాలంటే అవి మనుష్యులకి పడతాయని చెప్పబడే దయ్యాలు, భూతాల వంటివి కావు. జానపద కథల్లో చెప్పబడే భేతాళుడు భూతనాయకుడే గానీ అతడూ మనుష్యులకి పట్టే దెయ్యం మాదిరి కాదు. శివాలయపూజారి. శాపవశాత్తూ విక్రమార్క సేవకుడైన మంత్ర శక్తి సంపన్నుడు, అంతే! ఎప్పుడూ మంచితప్ప ఎవరికీ చెడు చేయనివాడు.

చివరికి అసురులుగా చెప్పబడే రాక్షసగణాలు కూడా కశ్యపప్రజాపతి పుత్రులే. సురాసురులు దితి, ఆదితులని పిలవబడే కశ్యప పత్నుల బిడ్డలు. ఎక్కడా, ఏ పురాణంలోనూ, ఏ ఇతిహాసంలోనూ, దేవుడితో సమబలమైన, దేవుడి లోకంతో సమాంతరమైన లోకాన్ని నడిపే సామర్ధ్యమున్న సైతాను, హిందూ మతంలో ఉండదు. నరకలోకాధిపతి అయిన యమధర్మరాజు ఒక దిక్పాలకుడు. ఆత్మఙ్ఞాని, సమవర్తి. బ్రహ్మ ఆఙ్ఞానువర్తి. దైవభక్తి గలవాడు. శివకేశవులును భజించేవాడు. తన కర్మను తాను నిష్కామంగా పాటించేవాడు. అంతే! భగవంతుణ్ణే ధిక్కరించి, తమకు గుడులు కట్టి ఆరాధించమని ప్రజలని శాసించారన్న హిరణ్యకశ్యపాది రాక్షసులు సైతం, గతజన్మలో శ్రీమహావిష్ణువు యొక్క పరమ భక్తులూ, వైకుంఠద్వారపాలకులూ అనీ, సనక సనందాది మునుల శాపవశాత్తు రాక్షసజన్మఎత్తారనీ, భాగవతం చెబుతుంది. ఈ కథల్లోని నమ్మకాల మాట అటుంచింతే, భారతీయుల జీవన సరళిలో అడుగడుగునా సంయమనాన్ని [Balance ని] పెంచే ప్రయత్నం, హిందూ మతవిశ్వాసాలు, వాంఙ్ఞ్మయం ఎంతగా చేస్తాయో తెలుస్తుంది. హిరణ్యకశ్యపాది రాక్షసుల పూర్యకథ అయిన జయవిజయలు గురించి – ప్రజలు, తమకు తారసిల్లిన దుష్టులని చూసి కూడా, వారిపట్ల, ‘ఏమో ఎవరు చూడొచ్చారు? హిరణ్య కశ్యపుడూ, రావణ కుంభకర్ణాదులే గతజన్మల్లో వైకుంఠ ద్వారపాలకులట. విష్ణు భక్తులుగా 7 జన్మలెత్తుతారా? విష్ణు ద్వేషులుగా మూడు జన్మలెత్తుతారా? అంటే అన్ని జన్మలు దేవుడికి దూరంగా ఉండలేక, మూడు జన్మల విష్ణు ద్వేషమే ఎంచుకున్నారట. అట్లయ్యీ రాక్షస జన్మల్లో శివుణ్ణి కొలిచిన భక్తాగ్రేసరులు. అలా ఏ పుట్టలో ఏపాముందో? ఇదిగో! మన కళ్ళెదుట ఉన్నా ఈ దుష్టుణ్ణి చూసి, మనం వీడెంత భయంకరుడు అనుకుంటున్నాం. ఒకవేళ వీడు శాపవశాత్తు ఈ జన్మఎత్తిన ఏ గొప్పవాడో అయి ఉండొచ్చు. మనమెందుకు ద్వేషించాలి? ఎవరి పాపం వాడిని కాలుస్తుంది. ఎవరి కర్మానా వాళ్ళే పోతారు అనుకుందాం’ అనుకుని, సామాన్యులు తమ ద్వేషాన్ని నియంత్రించుకోగలిగేవాళ్ళు. అన్నివిధాలా, భావోద్రేకాలని నియంత్రించుకునే, జయించే విధంగా, రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు భారతీయుల్ని ప్రేరేపించేవి. నిజం చెప్పాల్సి వస్తే భారతదేశంలోనికి ముస్లింలు ప్రవేశించాకే భారతీయుల ఆలోచనల్లోకి ‘దెయ్యం’ ప్రవేశించింది. అంత్రాలూ, తాయత్తులూ అంటూ, ఇప్పటికీ, కుంకుమో, విభూతో కలిపి, ‘ఓం’ అనో, మరో మంత్రాక్షరమో వ్రాసిన రాగిరేకులు ఇచ్చే గుడిపూజారుల కంటే, చుట్టచుట్టిన రాగిరేకుని, నిమ్మపండునీ, మంత్రించి ఇచ్చే మసీదుల్లోని ముస్లిం ఫకిర్లే [వీళ్ళకి ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి] ఎక్కువమంది ఉన్నారు. ఇక ఈ ‘దయ్యం’, ‘దయ్యం పట్టడం’ అన్న concepts యూరోపియన్ల ప్రవేశంతో మరింత పెచ్చరిల్లింది. భారతదేశం పట్ల మీడియా చేసే విషప్రచారాన్ని దాటి, నిశితంగా పరిశీలించి చూస్తే, మనకంటే ఐరోపా దేశాల్లోని ప్రజల్లోనే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండటం కన్పిస్తుంది. కానీ అదేదో కులమత భేదాలు, ఇండియాలో తప్ప ప్రపంచంలో అసలు మచ్చుకైనా కానరావన్నట్లు, మూఢాచారాలు అసలు ఇండియాలోనే పుట్టి, ఇండియాలోనే ప్రజ్వరిల్లినట్లు, ఇప్పటి మీడియా, అప్పటి యూరోపియన్ల ప్రచారం అతిగా, బాగా అధికంగా ఉండేది. ఈ కుతంత్రం వెనుక ఉన్నది కూడా నకిలీ కణికుడి వ్యవస్థే.

సరైన పుట్టుకలేని దాసీపుత్రుడు తొలితరం నకిలీ కణికుడై నందున, అతడి మనో వికారాలని, అతడి భావోద్రేకాలని, అనారోగ్య కర మనోవైకల్యాలని, అతి ప్రభావవంతంగా తరువాతి తరాలకి నూరి[inject] పోశాడు. దానికి తన ‘గుర్తింపు తృష్ణ’ని కలిపి, రాజ్య స్థాపనాకాంక్షగా తర్వాతి తరాల్లో ప్రవేశపెట్టాడు. ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. కొందరు ఆర్కిటెక్ట్చర్స్ [ఇంజనీర్లు] బృందం ఉందనుకుందాం. ఒక భవన నిర్మాణం గురించి ఒకరు ఒక ప్రణాళిక, ఒక ప్రతిపాదన చేస్తారు. దాని మీద మరికొంత చర్చిస్తారు. మరికొందరు మరికొన్ని ప్రతిపాదనలు చేస్తారు. కొన్ని సవరణలు చేస్తారు. కొన్ని సరికొత్త మార్పులు చేస్తారు. పని ప్రారంభిస్తారు. ప్రణాళిక వాస్తవంలో కార్యరూపం దాల్చేటప్పటికి మరికొన్ని సాధక బాధకాలు అనుభవంలోకి వస్తాయి. దాంతో తమ ప్రణాళికకి మరికొన్ని మార్పు చేర్పులు చేస్తారు. పనిచేస్తుండగా మరికొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. దాంతో ప్రణాళికకు కొన్ని మెరుగులు దిద్దుతారు. ఈ పద్దతి కొనసాగుతూ ఉంటుంది. తీరా కొన్నినెలలు పనిచేసి, భవనం పూర్తియ్యేటప్పటికి, తొలిగా తము ప్రతిపాదించిన ప్రణాళికకి, ఇప్పటి సుందర భవనానికి, అసలు పోలిక ఉందా అన్పిస్తుంది. తమ తొలి ప్రణాళిక చాలా మొద్దు పద్దతిలో, రద్దుగా ఉందనిపిస్తుంది. చాలా crude అన్పిస్తుంది. కానీ ఈ సుందర భవనానికి అదే పునాది. ఆలోచన అక్కడి నుండీ ప్రారంభమై, మొలక పెనువృక్షమైనట్లు ఇప్పటి ఈ రూపాన్ని సంతరించుకుందన్న నిజాన్ని అందరం అంగీకరిస్తాం.

అటువంటిదే నకిలీ కణిక వంశీయుల గూఢచార వలయమైనా, గూఢచార భవనమైనా! నకిలీ కణిక-4 కాలం నాటికి అంటే 1800 AD నాటికి ఉత్తర దక్షిణ భారతదేశంలోని పలుప్రాంతాలపై పట్టు సంపాదించిన ఈస్టిండియా కంపెనీ, క్రమంగా 50 ఏళ్ళు తిరిగేటప్పటికి దాదాపు పూర్తిగా అఖండభారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగింది. అప్పటికి నకిలీ కణిక-4 కి తన శక్తియుక్తుల మీద, నైపుణ్య సామర్ధ్యాల మీదా నమ్మకం కూడా పెరిగిపోయింది. కాబట్టి, తన తరతరాల లక్ష్యసాధనకి, సమయం ఆసన్న మయ్యిందన్న నిర్ణయానికి వచ్చేసాడు. అప్పటికే పాశ్చాత్యప్రపంచ చరిత్రని, ఫిలాసఫీని ఔపోసిన పట్టానన్న భావన అతడికి ఉంది. [మీరు గమనించి చూడండి. ఇండియన్ ఫిలాసఫీ పూర్తిగా ఔపోసన పడితే, ప్రపంచంలోని ఏ ఫిలాసఫీ అయినా అర్ధమవుతుంది. ప్రపంచంలోని అన్ని ఫిలాసఫీలు అర్ధమయినంత మాత్రనా ఇండియన్ ఫిలాసఫీ అర్ధం అవ్వదు. భారతీయ శాస్త్రీయ సంగీతం వచ్చిన వాడు అధునిక జాజ్, బాజ్, రాక్ సంగీతాలను అలవోకగా అభ్యసింపగలిగినట్లు, భారతీయ శాస్త్రీయ నాట్యం నేర్చిన వాడు అధునిక నృత్యాలు అలవోకగా చేయగలిగినట్లే. ఈ మాట నేను అహంకారంతో అనటం లేదు.] 1664 AD లో అమెరికా ఆక్రమణ దగ్గర నుండి, 1789 AD లో జార్జి వాషింగ్టన్ అమెరికా ప్రప్రధమ ప్రెసిడెంటు అయ్యేవరకూ, ఫ్రెంచ్ విప్లవం మొదలు నెపోలియన్ ఉత్థాన పతనాల వరకూ, కాంగ్రెస్ ఆఫ్ వియన్నాల దగ్గరనుండి బానిస వ్యాపారాలలోని ఒడిదుడుగుల వరకూ, అన్నిటినీ ఔపోసన పట్టానన్న భావన అది. 1825 AD లో బ్రిటన్ లో ప్రప్రధమ రైలు మార్గనిర్మాణం [స్టాక్ టక్ నుండి డార్లింగ్ టన్ వరకూ], పిదప 1853 AD లో ఇండియాలో బొంబాయి నుండి ఠాణా వరకూ నిర్మించిన మొట్టమొదటి రైలుమార్గం, ఒక్కసారిగా ప్రజాజీవితంలో, సమాజంలో ఎంత మార్పు తెస్తుందో అవగతం కాసాగింది. ఇక తనకి ఎదురు లేదన్న భావన ఉదయించింది. అప్పటికే చేతికి అంది వచ్చిన వారసుడు, నకిలీ కణిక-5, మరింత నూతనోత్సాహంతో కదనుతొక్కుతున్నాడు.

అప్పటికి ఈస్టిండియా కంపెనీ వారి ’ఎల్లి మీద మల్లి, మల్లి మీద పిల్లి’ వంటి సాకులతో ఇండియాలోని చిన్నచిన్న సంస్థానాల్ని కబళిస్తున్న తీరు పట్ల ప్రజల్లో, సంస్ధనాధీశుల్లో, తీవ్ర ఆగ్రహావేశాలు పేరుకు పోవటం గమనించాడు. ఇప్పుడు గనుక ఈస్టిండియా కంపెనీని బలహీనపరిస్తే, దాని స్థానంలోకి తనని తాను ప్రతిష్ఠించుకుంటే, యావత్ భారతదేశానికి, అఖండ భారతదేశానికి, ఏకైక సామ్రాట్టుతానే. అప్పటికి బ్రిటన్ కు చెందిన వ్యాపార కంపెనీలు అక్కడక్కడా సామ్రాజ్యాలు స్థాపించినా, బ్రిటన్ రాజవంశం యొక్క కనుసన్నల్లోనే ఉండేవి. బ్రిటన్ రాజవంశపు దృష్టి కూడా, తనదేశాన్ని దాటి పోయేది కాదు. చుట్టుప్రక్కల గల ఫ్రాన్స్ వంటి దేశాలతో ఉన్న గొడవలతోనూ, [నిజానికి అక్కడి రాజవంశాలు కూడా బ్రిటన్ రాజవంశానికి బంధువర్గం లోనివే] వాటితో చేసుకునే శాంతి ఒడంబడికల వంటి నానా వ్యవహారాలతో తలమునకలుగా ఉండేది.

నకిలీ కణిక-4కి పరిస్థితులన్నీ పరమ అనుకూలంగా ఉన్నట్లుతోచింది. తన గూఢచర్య మేధస్సు మధనం లోంచి ‘తూటాల కాటిరిడ్జిలకు పూసిన కొవ్వు గురించిన పుకార్లు’ అనే తంత్రం బయటకి తీసాడు. సైనికులకి ఇవ్వబడిన తూటాలును పంటితో నొక్కి లోడ్ చేయవలసి ఉండింది. వాటికి పూసిన జిగురువంటి పదార్ధం ఆవు మరియు పంది కొవ్వులతో తయారయ్యిందన్న వదంతులు సైనికుల్లో ప్రచారమయ్యాయి. మతవిశ్వాసాల ప్రకారం హిందువులకు ఆవు పవిత్రజంతువు. దేవతా సమం. కనుక ఆవు కొవ్వును వారు నోట తాకరు. ఇక ముస్లింలకు పంది అంటే ద్వేషభావం. అందుచేత వాళ్ళూ దాని కొవ్వుని నోట తాకరు. ఇంకేముంది? సైనికులు ఆ తూటాలను ఉపయోగించటానికి నిరాకరించారు. మత విశ్వాసాలతోనూ, ప్రచారాలతోనూ మిళితమైన స్ట్రాటజీతో అనుకున్న ఫలితం సాధించటం అప్పటికే నకిలీ కణిక-4 కి బాగానే ఒంటపట్టింది. మామూలుగా అయితే సైనికులు తూటాలని ఉపయోగించటానికి నిరాకరించినప్పుడు, సమస్యని, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారులు [వీరు ఉద్యోగులు మాత్రమే. కంపెనీకి అంతిమ యజమానులు సాధరణంగా ఇంగ్లాండులో ఉండేవాళ్ళు. కొన్ని పర్యటనల్లో భాగంగా అప్పుడప్పుడు తమ వలస రాజ్యాలకు వచ్చిపోతుండే వాళ్ళు.] సామరస్యంగా పరిష్కరించుకొని ఉండేవాళ్ళు. ఇక్కడే నకిలీ కణికుడి స్ట్రాటజీ, ‘విభజించు – పాలించు ’ అన్న తంత్రం బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారులకీ, సైనికులకీ మధ్య ప్రయోగింపబడింది. ఫలితంగా పరిస్థితులు మరింత ముదిరిపోయాయి. నిజానికి విభజించు పాలించుమన్న స్ట్రాటజీని భారత ఇతిహాసాల నుండి [మహా భారతం] నుండి గ్రహించినా, నకిలీ కణికుడు దాన్ని ఫ్రెంచి వారిపేరిట ప్రతిపాదించి, బ్రిటీషు వారి పేరిట ప్రచారించాడు. అయినా గానీ పాపం, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారులు, అదే policy తమ మీదే ప్రయోగింపబడినప్పుడు, గుర్తించుకోలేక పోయారు. దాంతో సమస్యని పరిష్కరించుకో లేకపోయారు. సిపాయిల తిరుగుబాటు పెద్దపెట్టున లేచింది. మరో వైపు, అప్పటికే బ్రిటిషు వారి దోపిడితో విసిగిపోయిన ప్రజల్లో సైతం, ఆగ్రహావేశాలు పేరుకుపోయి ఉన్నాయి. దాంతో ఝాన్సీ రాణి, తాంతియా తోపే, నానా సాహెబ్ వంటి వారి నాయకత్వన, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ ఎదురుదాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సంక్షోభాన్ని అది నిభాయించుకోలేక పోయింది. ఇంతవరకూ పరిస్థితులు నకిలీ కణిక-4 ఊహించినవే. ఈ స్థితిలో తను ఆ పరిస్థితుల్ని చేతిలోకి తీసుకోగలనన్నది అతడి ఊహ. అందుకు తగినంత అంగ అర్ధ బలాలని సమీకరించుకున్నానన్నది అతడి అంచనా.

అయితే ఆ అలోచన వాస్తవరూపం దాల్చలేదు. బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ విఫలమయ్యింది. అపజయం పాలయ్యింది. అంతటితో పెట్టే బేడా సర్దుకుని పోలేదు లేదా చతికల బడి కూర్చోనూ లేదు. తమ స్వంత దేశంలో తమకున్న అవసరాలరీత్యా, భారతదేశంలో అప్పటివరకూ తాము స్థాపించిన వలసరాజ్యాన్ని, బ్రిటిషు రాణికి పాదకట్నంగా సమర్పించింది. బ్రిటీషు రాజవంశానికి అప్పటికే తరతరాల చరిత్ర ఉంది. ప్రక్కనున్న ఫ్రాన్స్, స్కాట్లండు వంటి దేశాల రాజవంశీయులతో కూడిన బంధుబలగం ఉంది. వందల సంవత్సరాలుగా అందరు రాజవంశీయులు కలిసి, ఉమ్మడిగానో, ఒంటరిగానో, పరస్పర అవగాహనతోనో, లేక ఎవరి పద్దతిననుసరించి వారు గానో, ప్రజల్ని దోపిడి చేసి కూడబెట్టిన సొమ్ము దండిగానూ ఉంది. అసలే అక్కడ రాజవంశీయులు, ధనిక భూస్వామూలూ, మతాధికారులు [పోప్ లు] లతో కలిసి మరీ, ప్రజల్ని వ్యవస్థాగతంగా దోచుకుంటారయ్యె. ఆ కారణంగానే అక్కడ విప్లవాలు రేగటం, అందులో కులీనుల్ని, రాజవంశీయుల్ని, తలలు నరికి చంపటం, ఆపైన ఉద్యమాలను చల్లార్చటం కోసం, రాజులు రకరకాల [అమెండ్ మెంట్సు, కమిట్ మెంట్సు] సంధి ఒప్పందాలు చేసుకోవటం, మళ్ళీ అదను చూసి అన్నిటికీ కాలరాచి ప్రజల్ని రాచి రంపాన పెట్టటం మామూలే! ప్రజల దృష్టి మళ్ళించటానికి రకరకాల ఎత్తుగడలు పన్నటం కూడా వారికి కొంత తెలుసు.

ఈ నేపధ్యంలో ఈస్టిండియా కంపెనీ తనకి కానుకగా సమర్పించిన భారతదేశాన్ని, బ్రిటీషు రాజవంశం ఆనందంగా స్వీకరించింది. అపారమైన తన ఖజానానుండి కావలసినంత సొమ్ము [ఎటు అది పెట్టుబడేగా! తర్వాత అంతకంతా దోచుకోవచ్చన్నది రాజవంశానికి బాగా తెలుసు] ఇండియాకి తరలించి, అవసరమైన ఆయుధ సంపత్తిని, సైనిక బలగాన్ని సమీకరించింది. విప్లవాన్ని అణచిపారేసింది. నకిలీ కణిక-4 ఆశ, ఆకాంక్ష, ప్రణాళిక మెగ్గలోనే నాశనమైంది. ఇది అతడు ఊహించని పరిణామం. ఈస్టిండియా కంపెనీ అలాంటి నిర్ణయం తీసుకుంటుందని గానీ, బ్రిటీషు రాజవంశం అంతవేగంగా ప్రతిచర్య తీసుకుంటుందని గానీ అతడు అనుకోలేదు. పరిస్థితులు తాను చక్కబెట్టుకోగలనుకున్నాడు. తన కల నోటిదాకా వచ్చి జారిపోయిన మృష్టాన్నం లాగా తోచింది. ఆశాభంగం భయంకరమైన కసిని రగిల్చింది. ఆ కసి మొన్న 2009 ఎన్నికల్లో, మార్చి 3న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, మార్చి 19 న సి.ఐ.ఏ. ఛీఫ్ భారత్ సందర్శించి వెళ్ళాక, యూపిఏ భాగస్వామ్య పక్షాలైన లాలూప్రసాద్, రాంవిలాస్ పాశ్వాన్ లు, అమర్ సింగ్, మూలాయం సింగ్ ల పార్టీలు కాంగ్రెస్ కి సీట్లు ఇవ్వడానికి నిరాకరించినందుకు, కాంగ్రెస్ కీ, దాని అధినేత్రి సోనియాగాంధీకి రేగిన కసివంటిది కాదు. ఈనాడు వార్త[17/05/09] ప్రకారం, పైన చెప్పిన కారణంతో, సోనియాగాంధీకి కసిరేగిందట. దాంతో రెట్టింపుగా శ్రమించి, కాంగ్రెస్ కి గెలుపు సాధించి పెట్టిందట. ఇదేమన్నా బాక్సింగ్ క్రీడా లేక క్రికెట్ పోటీనా? కసి రేగి, రెట్టింపు కష్టపడి ప్రత్యర్దిని నాలుగు కిక్కులు పీకి లేదా బంతుల మీద చెలరేగి బ్యాటుతో షాట్లు పీకి గెలవటానికి? తనకి కసి రేగినంత మాత్రన, జనం నాడి 23 రోజుల్లో మారి పోయి, ’పాపం సోనియా గాంధీకి కసిరేగింది’ అనుకుని ఓట్లు వేస్తారా? అవీ తాము కొత్త పధకాలు గానీ, ప్రణాళికలు గానీ ప్రకటించకుండానే! కసిరేగి ‘ఇక చూస్కో నాప్రతాపం’ అని EVM లని Tamper చేయాల్సిందే తప్ప, బాక్సింగ్ క్రీడలో లాగా ప్రత్యర్ధుల్ని పంచ్ లు కొట్టలేరు గదా! మధ్యలో ప్రజలనబడే ఓట్ల బొమ్మలుంటాయి కదా మరి? కాబట్టి నకిలీ కణిక-4 కి కలిగిన కసి, 2009 ఎన్నికల్లో సోనియా గాంధీకి కలిగిన కసి వంటిది కాదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఎత్తుపైఎత్తులు, గూఢచార తంత్రాలు, రాజకీయ వ్యవస్థ పనితీరులు, పాలనా యంత్రాంగపు విశేషాలు, పౌరధర్మాది విశేషాలు, మానవ కామక్రోధాది భావోద్రేక ఫలితాలు [ద్రౌపదీ ధర్మరాజు సంవాదం] విస్తారంగా చర్చించబడిన భారతం, ఇందుకేమాత్రం తీసిపోని రామాయణం ప్రజలనుండి, వారి జీవిత విధానాల నుండి, ఆలోచనా సరళి నుండి దూరం చేయబడటం లోనే నకిలీ కణికుడి విజయం దాగి ఉంది. అందుకే ఎప్పుడూ ఈ నకిలీ కణిక అనువంశికులు, తమ ఏజంట్ల చేత, హిందూమతాన్ని, మత గ్రంధాల్ని కువిమర్శలు చేయిస్తూ, వెటకారం చేయిస్తూ, దుష్ప్రచారం చేయిస్తూ ఉంటారు.

ఈ పద్దతిని కనుగొంది తొలితరం నకిలీ కణికుడే. తర్వాతి తరాల వారు దాన్ని మరింత అభివృద్ధి చేశారు.

ఇంటి నుండి, స్వంత ఊరి నుండి పరారై దేశదిమ్మరిగా మారి ఎక్కడెక్కడో తిరిగిన నకిలీ కణిక-1, హిందూ మత గ్రంధాలపై పట్టుతోపాటు, మరికొంత విషయసముపార్జన కూడా చేశాడు. తిరిగి తిరిగి చివరికి, పుట్టిన గడ్డ గోల్కొండ సంస్థానం చేరాడు. అప్పటికి తల్లిలేదు. ఎప్పుడో కాలధర్మం చెందింది. అందుకు ఇతడికి ఏ చింతా లేదు. ఎటూ ఏ అనుబంధాలు లేవు. అతడి ధ్యాస అంతా ఒకటే – తను ఎదుర్కొన్న అవహేళనలు, అవమానాలు, చీదరింపులూ, అన్నిటినీ తలదన్నేటట్లు తన సత్తా చూపాలి. తనకి గుర్తింపు రావాలి. అందరూ ‘జేజే’లు పలకాలి. అప్పటికే అతడిలో ‘తనకి చాలా విషయాలు తెలుసు. తను చాలా తెలివైనవాడు. తను ‘something special’, తన చుట్టు ఉన్న వారికి తన తడాఖా చూపించాలి’ వంటి భావాలు పెను వృక్షాల్లా ఎదిగి ఉన్నాయి. ఈ భావాల తీవ్రత ఎంతటిదంటే ప్రకోపాలుగా పరిణమించేటంత. అప్పటికి తానీషా రాజ్యానికి కొచ్చాడు. నకిలీ కణిక-1 కి రాజాశ్రయం ఉంటేనే రాణింపు ఉంటుందని తెలుసు. ధనం, కీర్తి, గుర్తింపు, కెరియర్, ఏది సంపాదించాలన్నా ముందుగా రాజాశ్రయం సంపాదించాలని తెలుసు. దాంతో మెల్లిగా రాజుకు దగ్గరకావటానికి ప్రయత్నించాడు. కృతకృత్యుడు అయ్యాడు. ఈ వివరాలు భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్ర [తానీషా ‘కల’ నిజమా, నాటకమా?] [తానీషా ‘కల’ నాటకమే] [తానీషా ’కల’ నాటకానికి దర్శకుడు] టపాలలో వివరించాను.

నకిలీ కణిక వ్యవస్థ గూఢచర్యంతోనూ, నిగూఢతంత్రాలతోనూ అన్నిరంగాలలో అమలు పరచే స్ట్రాటజీలలో ’నీ టాలెంట్ ని నేను మార్కెట్ చేసి పెడతాను’ అనే డీల్, ప్రజల్ని ప్రచారంతో మభ్యపెట్టవచ్చుననే డీల్ చాలా ముఖ్యమైనవి. శ్రీరామదాసు లో ఉన్న భక్తికీర్తనలు వ్రాయగల, సంగీతం సమకూర్చి గానం చేసి ప్రజల్ని భక్తి ప్రేరితుల్ని చేయగల, ప్రజలలో వితరణ గుణం పెరిగేలా చేయగల నైపుణ్యాలని, శ్రీరామ సేవకు గాక తమ స్వార్ధానికి వాడుకోవాలని ప్రయత్నించడంలోనూ, అందుకు ఒప్పుకోని రామదాసుని 12 ఏళ్ళ పాటు చెరసాలలో బంధించి, ప్రతీరోజూ చిత్రవిచిత్ర శిక్షలతో హింసించడంలోనూ ఉన్నది ‘నీ నైపుణ్యాన్ని నేను డబ్బుగా మార్చుకుంటా’ అన్న తీరే! ఇప్పటికీ, ఏ రంగంలోనైనా సరే, ఎంత నైపుణ్యం, కళాత్మకత గల వారైనా తమ నైపుణ్యాన్ని గాడ్ ఫాదర్ లు క్యాష్ చేసుకునేందుకు ఒప్పుకున్న వాళ్ళే పైకి వస్తారు. కమీషన్లు చెల్లించాలి. ఇతర కోరికలు తీర్చాలి. అప్పుడే సినిమాతారలైనా, క్రీడా తారలైనా వెలిగిపోతారు. తమకు దాసోహం అన్నవారినే నకిలీ కణిక వ్యవస్థ పైకి తెస్తుంది. దాన్నే మనం లాబీయింగ్ అంటాం. తమ సంపాదనలో సింహభాగం గాడ్ ఫాదర్ లకి [నకిలీ కణిక వ్యవస్థ లోని ప్రముఖ వ్యక్తులు లేదా వారి ఏజంట్లు] సమర్పించుకోగలిగితే ఆయా సినిమా, క్రీడా, రాజకీయ నాయకులకి అవకాశాలు వెల్లువెత్తుతాయి. లేకపోతే ఇంతే సంగతులు. అలాగే గాడ్ ఫాదర్ లకి లాబీయింగూ, కొరియర్ లాంటివి కూడా నిర్వహించాలి. తమకు విలువలున్నాయని అనకూడదు. అంటే కంచర్ల గోపన్నకి పట్టిన గతే పడుతుంది. గాడ్ ఫాదర్ లు చెప్పిన విలువలు ప్రచారించాలి, పాటించాలి. అంటే పెళ్ళి చేసుకోకుండా సహజీవనం చేసే బిపాసాబసు, జాన్ అబ్రహంల్లాగా అన్నమాట. అప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతాయి. చివరికి వాణిజ్య ప్రకటనలకి వాళ్ళెంత పారితోషికం తీసుకుంటున్నారో, తద్వారా వాళ్ళ ర్యాంకు, సంపాదన ఎంతో మీడియా లెక్కలు గట్టి మరీ ప్రచారిస్తుంది. ఇలా ఒక జంటను చూసి మరో జంట అలా ఉంటే తమకు కూడా కెరీర్ బాగుంటుందని దానిని ఫాలో అవ్వటానికి ప్రయత్నిస్తారు. దానికి తగినట్లు సినిమా మీడియా ఆయా జంట్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని, అందుకే సినిమా హిట్ అయ్యిందని ప్రచారిస్తుంది. దానికి తగినట్లు రెమ్యూనరేషన్ పెరుగుతుంది. ఇలా ఇది ఒక వలయం. తర్వాత తర్వాత ఇది విత్తుముందా చెట్టుముందా లాగా పారడాక్స్ తయారవుతుంది. ఇదీ మీడియా సమాజం పై చూపించే ప్రభావం. మీడియా అంటే నకిలీ కణికుడి పరిపక్వ అవతారం గనుక, విషయం మీకీపాటికి అర్ధమయ్యే ఉంటుంది.

అలాగే నకిలీ కణిక-1 యొక్క మరో స్ట్రాటజీ, అదీ రామదాసు Vs తానీషాల కాలం నాడే ప్రారంభమైన స్ట్రాటజీ ఏమిటంటే ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టటం. ఇప్పటివరకూ అది వాళ్ళకి విజయవంతంగా నడుస్తున్న, ఫలితాల పంట పండిస్తున్న స్ట్రాటజీ. ఈ ప్రచారపు స్ట్రాటజీని శ్రీరామదాసు విడుదల విషయంలో ఎలా ప్రయోగించారో మీరింతకు మునుపు భారతీయ రాజకీయరంగంపై సుదీర్ఘ కుట్ర – తానీషా కల నాటకమే అన్నటపాలో చదివారు.

కంచెర్ల గోపన్నని [రామదాసుని] తానీషా చెరసాలలో పెట్టటానికి ముందే నకిలీ కణిక-1 తానీషాని ఆశ్రయించి ఉండాలి. అంటే రామదాసు నైపుణ్యాన్ని తన స్వార్ధానికి వాడుకోవాలన్న తానీషా ఆలోచన వెనుక నకిలీ కణిక-1 బుర్ర మాత్రమే ఉంది. అంతేగాక రామదాసుని విడుదల చేయటం కోసం తానీషా ఆడిన కల నాటకం వెనుక కూడా ఖచ్చితంగా నకిలీకణిక-1 బుర్ర ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే అప్పటిదాకా రాజులు గూఢచర్యాన్ని తమ రాజ్యానికి శతృరాజ్యాల నుండి వచ్చే ప్రమాదాలు తెలుసుకునేందుకు, తమని తాము కాపాడుకునేందుకు, అలాగే శతృవుల ఆనుపానులు తెలుసుకునేందుకు వాడేవారు. అప్పటినుండే రాజులు, ప్రభుత్వాలు, గూఢచర్యాన్ని ప్రజల్ని మోసగించటందుకు, మభ్య పరిచేటందుకూ వాడటం ప్రారంభమయ్యింది. అప్పటి నుండి ఇప్పటికి, దాదాపు నకిలీ కణికుడి అనువంశిక తరాలు ఏడెనిమిది గడిచేసరికి, మరింతగా ఆ స్ట్రాటజీ ప్రజల మీద అమలు చేయబడుతోంది.

అయితే ఎంతగా అధిక ప్రచారపు స్ట్రాటజీ అమలు జరిపినా, తానీషా పదవీచ్యుతుడు కాక తప్పలేదు. నకిలీ కణిక-1 కి తానీషా పట్ల ‘soft corner’ ఏంలేదు. అతడికి కావలసింది తన కుటీల నీతిని, తననూ ఆదరించేవాడు. కాబట్టే అతడు ఔరంగజేబు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అప్పటికి ఔరంగజేబు దాదాపు 31 సంవత్సరాలుగా, 18 సార్లు గోల్కొండ పై దాడి చేసినా గెలవలేకపోయాడు. అయితే నకిలీ కణికుడి లోపాయకారి తంత్రంతో గోల్కొండ కోట తలుపులు తెరవబడ్డాయి, తానీషా బంధింపబడ్డాడు, ఔరంగజేబు గెలిచాడు. ఔరంగజేబు అప్పటికే సువిశాల మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి. ఔరంగజేబుని ఆశ్రయిస్తే, ఔరంగజేబుని దగ్గరనుండి పరిశీలిస్తే సామ్రాజ్యస్థాపన, దాని నిర్వహణ గురించి అవగాహన కలుగుతుంది. ఆ ఙ్ఞానం తనకి కావాలి. అయితే అప్పటికి దాదాపు నడివయస్సుదాటి ముదిమి వైపు ప్రయాణించే నకిలీ కణిక-1 తన attitude ని, ఆలోచనా సరళిని, భావతీవ్రతని తన కొడుకు లేదా వారసుడికి నూరిపోశాడు. ఎప్పటికైనా సువిశాల సామ్రాజ్యం స్థాపించాలన్నది లక్ష్యంగానూ, అందుకు ఏమార్గమైనా ఫర్వాలేదన్న భావసరళిని, స్వార్ధ పరత్వాన్ని వారసత్త్వంగా అందించాడు. సౌలభ్యం కోసం ఈ వారసుణ్ణి నకిలీ కణిక-2 అంటాను. చిన్నప్పటినుండే ఓ ప్రత్యేక మనస్తత్త్వంతోనూ, అప్పటికి ఎవరికీ తెలియని, నకిలీ కణిక-1 తనకి అనువంశిక వారసత్త్వంగా ఇచ్చిన గూఢచర్య ఙ్ఞానం తాలూకూ అధిపత్యం, బలంతోనూ, రంగంలోకి దిగిన నకిలీ కణిక-2, గూఢచారికి ఉండవలసిన ప్రత్యేక లక్షణం ‘సహనంగా వేచి ఉండటం’ అన్నదాన్ని ఔపోసన పట్టాడు. ఔరంగజేబు కాలధర్మం చెందేనాటికే ఈ నకిలీ కణిక-1, నకిలీ కణిక-2 బాగానే వేళ్ళూనుకున్నారు. అయితే ప్రచ్ఛన్నంగానే! చూడటానికి చక్రవర్తికి లేదా రాజుకు అంతరంగికులుగా కన్పిస్తున్నారు. అంతే! 1687AD లో ఔరంగజేబు తానీషాని ఓడించి, గోల్కొండని వశపరచుకుని, తానీషాని ఢిల్లీకి బందీగా తీసుకుపోయాడు. చెరలోనే తానీషా మరణ పర్వంతం ఉన్నాడు. 1707లో ఔరంగజేబు మరణించే వరకూ నకిలీ కణిక-1, నకిలీ కణిక-2 తో సహా ఔరంగజేబు కు అంతరంగికులుగా మొఘల్ సామ్రాజ్యంలో సుస్థిర స్థానాల్లో వేళ్ళూనుకున్నారు. ఎక్కడ ఏపావులు కదిపారో! 1707 AD లో ఔరంగజేబు మరణంతోనే క్రమంగా మొఘల్ సామ్రాజ్య పతనమూ ప్రారంభమయ్యింది. అప్పటికే నకిలీ కణిక-1కీ, అతడి అనువంశిక వారసుడైన నకిలీ కణిక-2కి ఇక ఔరంగజేబు నుండి గ్రహించవలసిన సామ్రాజ్య విస్తరణ నిర్వహణల గురించిన ఙ్ఞానం పెద్దగా లేకపోయింది. ఔరంగజేబు మరణించాక వీళ్ళకి ఆదరణ తగ్గింది. 1724 AD లో గోల్కొండలో అసఫ్ జాహి నిజాం ల పాలన ప్రారంభమయ్యింది. మనుష్యుల మీద ప్రేమలేకపోయినా, గూఢచర్యం మీద తప్పితే మానవత్వం మీద నమ్మకం లేకపోయినా, నకిలీ కణికులకి హైదరాబాదు సంస్థానం మీద మాత్రం అమిత ప్రేమ. దాంతో తిరిగి హైదరాబాద్ చేరి పోయారు. మళ్ళీ రాజుకు [ఈసారి నిజాం నవాబు] కు దగ్గరయ్యారు. రాజకీయము, గూఢచర్యమూ కవల సోదరులైనందున, రాజులకి గూఢచార మంత్రాంగమూ, కుటిల నీతి చెప్పగల వారిపై ఆదరణ మెండు అయినందునా, అది వారికి కష్ట సాధ్యం కాలేదు.

అప్పటికే దేశంలోకి అడుగుపెట్టి, వ్యాపారావకాశాల కోసం, వ్యాపార స్థావరాలు కోసం స్థానిక రాజులకు సలాంలు కొట్టి, తమలో తాము పోరాడుకుంటున్న బ్రిటీషు, డచ్చి, ఫ్రెంచ్, స్పెయిన్ మొదలైన యూరోపియన్ దేశాల వాణిజ్య కంపెనీలు, వ్యాపార గుంపులు మెల్లిమెల్లిగా విస్తరిస్తున్నాయి. అప్పటికి వాళ్ళు ఇండియాలో అడుగుపెట్టి, దాదాపు 200 ఏళ్ళు పైనే అయ్యింది. నకిలీ కణిక-1 అప్పటికి వృద్దుడయి, దేహయాత్ర చాలించినా, అతడి ప్రగాఢ వాంఛ అయిన సామ్రాజ్యస్థాపన, నకిలీ కణిక-2 లో సజీవంగా ఉంది. ఆ attitude కూడా సజీవంగా ఉంది. ఈసారి యూరోపియనుల దగ్గరున్న తుపాకి మందు, నౌకాయాన ఙ్ఞానం, ప్రపంచ పర్యటనలరీత్యా వివిధ ప్రదేశాల గురించిన వారి భౌగోళిక ఙ్ఞానం నకిలీ కణిక-2 ని ఆకర్షించింది. వారిని పరిశీలించడం జీవితంలో ఓ భాగమయ్యింది. మెల్లిగా ప్రచ్ఛన్న సంబంధాలు ఏర్పడ్డాయి. యూరోపియన్ దేశాల కంపెనీలని పరిశీలిస్తే అందరిలోకి బ్రిటీషు కంపెనీల వారితో మానవత్వపు జాడ తక్కువగా అన్పించింది. తనకు అనుకూల లక్షణాలు[వంచన, నమ్మకద్రోహం మొదలైనవి] ఎక్కువగా కన్పించాయి. తన దగ్గరున్న గూఢచార ఙ్ఞానానికి, సామ్రాజ్య స్థాపన, విస్తరణల ఙ్ఞానానికి, వారి దగ్గరున్న ‘ఆయుధ సాంకేతికత’ అన్న ఙ్ఞానాన్ని జోడిస్తే… ఎటూ ఇద్దరిలోనూ ఉన్నది అమానుషత్వమే. ప్రయోగ ఫలితాలు ఎలా ఉంటాయో?

తనకు తెలిసిన భారతంలోని కణికుడు చెప్పిన కూటనీతిని, నక్క కథని ఫ్రెంచి వారికి ఆపాదించి, బ్రిటిషు వారికి చెప్పాడు. అదీ ఎంత వరకూ చెప్పాలో అంతవరకే. 1742 AD లో ఫ్రెంచి గవర్నర్ అయిన జనరల్ డూప్లే పేరిట దాన్ని కొంత ప్రచారించాడు. 1757 AD లో ప్లాసీ యుద్దంతో బ్రిటిషు వారు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్-దౌలాదార్ జాఫర్ ను ఓడించారు. మొదట అల్లుణ్ణి మచ్చిక చేసి మామను చంపించారు. తర్వాత ‘పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నిన్ను మేమెంత వరకూ నమ్మగలం?’ అంటూ అల్లుణ్ణి వేసేశారు. 1600 AD లో ప్రాణం పోసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 AD లో అమలు జరిపిన ఈ ‘విభజించు – పాలించు’ స్ట్రాటజీతో బెంగాల్ రాష్ట్రంపై అధికారం సంపాదించారు. తర్వాత 1768 AD లో బ్రిటీషు వారు సంధి చేసుకున్నా, ఇతర సంఘటనలు జరిగినా, చాలావాటి వెనుక అంతస్సూత్రంగా నకిలీ కణిక-2, అప్పటికి అతడి చేతికి అందివచ్చిన అతడి వారసుడు నకిలీ కణిక-3 ల గూఢచర్య మేధస్సు ఉంది. అలాగే తరం నుండి తరం అందిపుచ్చుకున్న రాజ్యకాంక్ష ఉంది. దేశం కాని దేశంలో, వ్యాపారం కోసం వచ్చిన అనామకులు, కంపెనీ ఉద్యోగులు క్రమంగా రాజ్యాధినేతలు అయ్యారు. అదీ తమ గూఢచర్య ఙ్ఞానంతో! నకిలీ కణికులకి ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. అప్పటికే మొఘలు సామ్రాజ్యం బాగా క్షీణదశకు చేరుకోవటంతో, దేశమంతా చిన్నచిన్న ముక్కలుగా, చిన్నచిన్న సంస్థానాలుగా అనైక్యంగా ఉంది. అందులో ఎక్కువుగా ముస్లిం రాజుల అధీనంలో ఉంది. జమీందారుల, పాలెగాళ్ళ క్రింద ఉన్న దేశంలోని ఏవిభాగము బలంగా లేదు. క్రమంగా భారత రాజకీయాల్లో, రాజ్యాల, రాజుల మధ్య వ్యవహారాల్లో బ్రిటీషు వారి జోక్యం ఎక్కువయ్యింది. ఈ లోపులో నకిలీ కణిక-2 నుండి వారసత్వం, క్రియశీలత్వం నకిలీ కణిక-3 చేతికి వచ్చి బలపడింది. దాంతో పాటే తమ గూఢచర్య ఙ్ఞానం గురించిన ఆత్మవిశ్వాసం, రాజ్యాస్థాపనా కాంక్ష కొండంతగా పెరిగిపోయింది. ‘తమ సహకారంతో, తమ మేధస్సుతో, ఎక్కడి నుండో ఇక్కడ కొచ్చిన బ్రిటీషు వాణిజ్య కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, ఇక్కడ రాజ్య స్థాపన చేయగలిగినప్పుడు, తము స్థాపించబోయే రాజ్యం చిన్న చితకా కాకూడదు. అది ఒకేసారి భారత దేశమంత సువిశాలమైనది కావాలి. అప్పటి వరకూ ఆయుధఙ్ఞానం ఉన్నా కూడా, 250 ఏళ్ళకు పైగా పెనుగులాడినా, ఏమాత్రం సఫలీకృతులు కాలేకపోయిన బ్రిటీషు వారు, తమ గూఢచర్య ఙ్ఞానం తోడయ్యాక కదా గెలుపు రుచి చూస్తున్నారు? కాబట్టి మరికొంత కాలం ప్రచ్ఛన్నంగానే పనిచేద్దాం. ఒకేసారి దేశం నివ్వెరపోయేలా, ఇప్పటివరకూ ఉత్తరదక్షిణ భారతదేశాలని కలిపి ఏలిన రాజవంశమే ఏదీ లేనిచోట, సువిశాల అఖండ భారత రాజ్యాన్ని స్థాపిద్దాం’ అన్న తీవ్రకాంక్ష నరనరాన నిండిన నకిలీ కణిక-3 పనితీరు మరింత స్ఫుటంగా, బలంగా తయారయ్యింది. చిన్నప్పటి నుండి పెంచబడిన తీరది. ఇంతలో 1773 AD లో బ్రిటీషు ప్రభుత్వం అంటే ఇంగ్లండులోని బ్రిటీషు ప్రభుత్వం వలసపాలనను నియంత్రిస్తూ రెగ్యులేటింగ్ చట్టం చేసింది. మరి తము ఆర్ధిక సాయం[అప్పు] చేస్తే, తము అనుమతులు ఇస్తే, వ్యాపారం కోసం నౌకలు కట్టుకుపోయిన వ్యాపార గుంపులు [ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే సముద్రపు దొంగల గుంపులు] ఇప్పుడు తమ ఇంగ్లాండు కంటే విశాలమైన సామ్రాజ్యాలు, వేరెక్కెడో సుదూర ఖండాంతర సీమల్లో స్థాపిస్తే ఇంకేమైనా ఉందా? తమ గ్రిప్, తమ అధికారం ఏంకాను? ఎవరు ఎంత సంపాదించినా, మాతృభూమికి రాకా తప్పదు, పెళ్ళాం బిడ్డల కోసం వెనుదీయకా తప్పదు. కాబట్టే రెగ్యులేటింగ్ చట్టానికి బ్రిటీషు ఈస్టిండియా కంపెనీతో సహా, తత్సమాన ఇతర గుంపులన్ని తలొగ్గాయి.

ఇటు చూస్తే ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ బాగానే వేళ్ళూనుకొని వలసరాజ్యస్థాపన రేసులో కూడా ముందుంది. మైసూరు యుద్దాల వంటి వాటిల్లోనూ, హైదరాలీ వంటి వారితో సంధి పేరు చెప్పి, సమయం కోసం వేచి ఉండి, అదను దొరకగానే సంధి నియమాలని తామే తుంగలోకి తొక్కి ఓడించడం వంటి వాటిల్లోనూ, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వారు ముందజలో ఉన్నారు. మరాఠాలతో యుద్దాలు, టిప్పు సుల్తానుతో యుద్దాలు, మొదలైన ఎన్నో సంఘటనలలో బ్రిటీషు వారు వేసిన ఎత్తుగడలు, ఆయా ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకోవటంలో చూపిన దౌష్ట్యం, వ్యాపారం పేరుతో దోపిడి గట్రాలతో కాలం సంఘటనలతో క్రిక్కిరిసిపోయింది. అలా వందేళ్ళ పాటు [దాదాపు 1700 AD నుండి 1800 AD దాకా] జరిగిన వేలాది సంఘటనలు, యుద్దాలు, రాజకీయతంత్రాలలో [భారతదేశపు రాజులు పాలెగాళ్ళు మధ్య కావచ్చు, పాలెగాళ్ళు యూరోపియన్ వ్యాపార గుంపుల మధ్య కావచ్చు లేదా అచ్చంగా యూరోపియన్ వ్యాపార గుంపుల మధ్య కావచ్చు, ఎవరి మధ్య జరిగిన సంఘటనలు అయినా, వాటి వెనుక గల రాజకీయ తంత్రాలలో అన్నమాట] కొన్నిటిలో నకిలీ కణిక-3 యొక్క ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. కొన్నిటిలో పరోక్షంగా ఉంది. కొన్నిటిలో అసలు ఏప్రమేయమూ లేదు. ఆయా సంఘటనల పూర్యాపరాల పరిశీలన మాత్రం తప్పనిసరిగా నకిలీ కణిక-3 చేసేవాడు. ఎందుకంటే అది అతడి వారసత్వ లక్షణం మరి! దేశవ్యాప్తంగా ఏ రాజకీయ సంఘటన జరిగినా, అందులో తన ప్రమేయం ఉన్నా లేకపోయినా, సదరు సంఘటనకు ముందున్న పరిస్థితులేమిటి, ఏ పరిస్థితులు ఆ సంఘటనకు దారితీసాయి, అది సంభవించిన తీరు తెన్నులేమిటి, ఆ సంఘటన యొక్క ఫలితాలేమిటి, అందుమూలంగా మరింకే సంఘటనలకు పరిస్థితి దారితీసింది, మొదలైన అన్ని వివరాలు సేకరించటం, పరిశీలించటం, విశ్లేషించటం అతడికి నిత్యకృత్యం. అప్పటికే తాత [నకిలీ కణిక-1], తండ్రి [నకిలీ కణిక-2] ల ద్వారా సంక్రమించిన ఙ్ఞానంతో పాటు బృందాన్ని తయారుచేసుకోగల నైపుణ్యాలూ సామర్ధ్యాలూ కూడా అబ్బాయి. ఒకరకంగా చెప్పాలంటే అది తనదైన వ్యవస్థ! ప్రాధమిక స్థాయిలోనే ఉండొచ్చుగాక, అయినా అది ఒక వ్యవస్థ! మిగిలిన వారు జరిగిన సంఘటనలకి తాము ప్రచారం చేసే పైకారణాలే నమ్ముతుండగా, అసలు కారణాలేమిటో తమకి మాత్రమే తెలిసిన వ్యవస్థ! స్ట్రాటజీని, దాని తాలూకూ ఫలితాలని ఆనందిస్తున్న వ్యవస్థ! అయినా ఇందులోనూ నకిలీ కణిక-3 జాగ్రత్త తీసుకున్నాడు. అన్నీ విషయాలు అందరికీ చెప్పక పోవటమే ఆ జాగ్రత్త. తనకి మాత్రమే కూలంకషంగా అన్నీ విషయాలు తెలిసి ఉండాలి.

ఈవిధంగా నకిలీ కణికుడి 3వ తరానికి వచ్చేసరికి గూఢచార వలయం క్రమంగా ఒకరూపాన్ని, బలాన్ని, అస్థిత్త్వాన్ని సంతరించుకుంది. అప్పటికి కాలం మరికొంత గడిచి క్రీశ 1800 AD వచ్చింది. నకిలీ కణిక-3 స్థానంలోకి నకిలీ కణిక-4 వచ్చాడు. ఈతడు యూరోపులో సంభవిస్తున్న రాజకీయ సామాజిక మార్పుల్ని మరింతగా అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. 1815 AD లో జరిగిన కాంగ్రెస్ ఆఫ్ వియన్నాల వంటి సంఘటనల్లో, ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజాగ్రహాన్నిఅయినా ఎంత తేలికగా, జయప్రదంగా జోకొట్టవచ్చో అర్ధం చేసుకున్నాడు. తన గూఢచార ఙ్ఞానానికి మరింత మెరుగులు దిద్దుకున్నాడు. సమాచార సేకరణ, విశ్లేషణ, సేకరించిన సమాచారాన్ని భద్రపరచుకోవటంలోని మెళకువలు గట్రా మీద మరింతగా దృష్టి కేంద్రీకరించాడు. అప్పటికే అంటే 1768 AD లోనే నిజాం నుండి ఉత్తర సర్కారు జిల్లాలని ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. ఈ ఒప్పందం విషయంలో ప్రధాన పాత్ర నకిలీ కణికులదే.[అది నకిలీ కణిక-3 అయినా నకిలీ కణిక-4 అయినా ఒకటే. వారి జీవన కాలానికి సంబంధించిన అంచనా మాత్రమే ఇది. నిజానికి నకిలీ కణిక అనువంశీకులలో ఎవరు ఏ చర్యలు నిర్వహించినా ఒకటే. వ్యక్తి ఏ తరానికి చెందిన వాడైనా చర్య ఒకటే. వారి తీరుతెన్నులూ, ప్రభావ పరిణామాలూ ఒకటే. పీవీ నరసింహారావు గారు తన ‘లోపలి మనిషి’ రచనలో, అది కాల్పనిక వాస్తవాల సమ్మిశ్రితమని చెబుతూ, తాను ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఎదిగే పరిణామక్రమంలో, ఎందరో ముఖ్యమంత్రులు మారినా, వారిని రెండే పేర్లతో సంబోధించారు. ఎందుకంటే ఎవరైనా ఒకటే. ‘చౌదరి’ అంతే. పేర్లు వేరైనా వ్యక్తుల స్వభావాలు, పనితీరు ఒకటే అయినప్పుడు ఏపేరైతే నేమిటి? అదే స్ఫూర్తిగా నేను ఇక్కడ నకిలీ కణికుల అనువంశీకుల కాలానికి సంబంధించి, తరానికి సంబంధించి వ్యత్యాసాన్ని భావించడం లేదు. అంటే 1768 AD లో నిజాం నుండి ఉత్తర సర్కారు జిల్లాలకి, 1800 AD లో రాయలసీమ జిల్లాలకి ఈస్టిండియా కంపెనీ వారు దత్తత హక్కులు పొందటంలో కీలక పాత్ర పోషించింది నకిలీ కణిక వంశానికి చెందిన 3వ తరం వాడైనా లేక 4వ తరం వాడైనా తేడా లేదన్నది నా అభిప్రాయం. సౌలభ్యంకోసం, ఒకతరం మహా అయితే 50/60 ఏళ్ళు బ్రతకగలుగుతుంది లేదా చురుకుగా పనిచేయగలుగుతుంది అన్న అంచనా తోనూ 1650 AD లో ప్రారంభించిన నకిలీ కణిక-1 కథని 1800AD నాటికి 4వ తరం దగ్గరికి తీసుకువచ్చాను. అంతే! ఒకవేళ ఎవరైనా అల్పాయుష్కులుంటే ఈ సంఖ్య పెరగవచ్చు, దీర్ఘాయుష్కులుంటే తరగనూ వచ్చు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu