“సార్ టీ!” కప్పందించాడు అటెండర్ రాంబాబు!

“నీ టీ దొంగల్దోలా! ఉండవయ్యా! మీరు కంటిన్యూ చెయ్యండి సార్!” ముందుకు వంగి మరీ అన్నాడు గుర్నాధం.

“టీ దారి టీ దే! డిస్కషన్ దారి డిస్కషన్ దే! ముందు టీ తీసుకో!” సుబ్రమణ్యం నవ్వాడు.

“వాఁ ! గొప్ప బాలెన్స్ సుమండీ మీది” సుబ్రమణ్యాన్ని ఉబ్బేస్తూ చెప్పాడు మాణిక్య రావు. అతడి ఫైలు సుబ్రమణ్యం టేబుల్ మీద పెండింగులో ఉంది మరి!

‘మరేమను కున్నావ్?’ అన్నట్లో చూపు విసిరి చర్చ కొనసాగించాడు సుబ్రమణ్యం.

“నువ్వెన్నన్నా చెప్పు గుర్నాధం! సంపాదించడం చేత గాని వాళ్ళే నీతులు చెబుతారు” సిద్ధాంతీకరిస్తున్న కంఠంతో గంభీర్యం ఒలక బోసాడు సుబ్రమణ్యం.

“భేషుగ్గా చెప్పారు” మెచ్చుకోలు చిలకరించారు మాణిక్య రావు, గుర్నాధమూ జాయింటుగా!

ముకుంద రావు గుంభనంగా నవ్వాడు. ‘గుర్నాధం సుబ్రమణ్యానికి సబార్డినేటు. మాణిక్య రావుకి సుబ్రమణ్యంతో పనుంది. మెచ్చుకోక ఏం చేస్తారు?’ అనే అవగాహన అతడి నవ్వులో మెరిసింది.

అది ఆ ఇద్దరికీ స్ఫురించినా పట్టనట్లే పని కానిచ్చారు. వాళ్ళ దృష్టిలో ‘అవన్నీ పట్టించుకుంటే పనులవ్వవు మరి!’

“లేకపోతే ఏమిటి చెప్పండి! ఇంతమంది ఇన్ని నీతులు చెబుతారు. నోట్లు చేతులు మారకుండా పని నడుస్తుందా ఎక్కడైనా? ఇప్పుడు ఈ మాణిక్య రావు గారున్నారు. మన ఆఫీసులో పనిబడి వస్తే పైసలిచ్చుకుంటున్నాడు. మనం మరో చోటికి పనిబడి వెళ్తే పైసలిచ్చుకుంటున్నాం. ఇక్కడ పుచ్చుకుంటున్నాం, మరో చోట ఇచ్చుకుంటున్నాం. అంతే! అవినీతి అంతటా ఉంది, ఉండాలి కూడా! అసలు అవినీతి తోనే అభివృద్ధి ఉంటుంది” గొప్ప మేధావి ముఖం పెట్టాడు సుబ్రమణ్యం.

“భలే చెప్పారు గురు గారూ! రోడ్ మీద వస్తుంటే బండాపి మరీ ‘అది లేదు ఇది లేదు’ అంటూ చలానా కట్టించుకున్నాడు ట్రాఫిక్ ఇన్సెస్పెక్టర్. చలానాకి డబుల్, జేబులో పెట్టించుకున్నారు. ఏమంటాం?” గుర్నాధం కళ్ళెగరేస్తూ అన్నాడు.

“అంతెందుకు? మంత్రుల పేషీ ల దగ్గర నుండి అంతటా అవినీతే! అయినా పనులు నడుస్తూనే ఉన్నాయి కదా! మీరన్నట్లు ఓ చోట పుచ్చుకుంటున్నారు, మరో చోట ఇచ్చుకుంటున్నారు. అవినీతి, జీవితంలో ఓ భాగమై పోయింది, అది లేకుండా పనులు నడవనప్పుడు ఇక దాన్ని ‘అవినీతి’ అనటం, అదేదో వినరాని మాట అన్నట్లు చెయ్యరాని ఘోరమన్నట్లు… ఎందుకీ ఆత్మవంచన!? అసలు అవినీతిని అవినీతి అనటం బదులు, మరో మాట చెప్పటం బెటర్” మాణిక్యరావూ మద్దతుగా చెప్పాడు.

“కరెక్ట్! ఏమైనా సరే! అవినీతి ఉంటేనే అభివృద్ధి సాధ్యం” మరోసారి నొక్కి చెప్పాడు సుబ్రమణ్యం.

“నువ్వేమంటావ్ ముకుందం?”

“మధ్యలో నన్నెందుకు లాగుతావ్ సుబ్బు! నీ అభిప్రాయం నీది?”నవ్వుతూ అనేసి ఫైల్లోకి తలదూర్చాడు ముకుందం.

“ఉండవోయ్! అలా బయటికెళ్ళి ఓ దమ్ములాగి వద్దాం!”అంటూ లేచాడు సుబ్రమణ్యం. సిగరెట్ పెట్టె చేతికందిస్తూ అనుసరించాడు మాణిక్యరావు. వెనకే పరిగెత్తాడు గుర్నాధం.

ఇప్పుడు తన మీద చేట వేసుకునేందుకే వెళ్ళారని ముకుందరావుకి తెలుసు. అదేం పట్టించుకోకుండా పని చేసుకుపోయాడు.

అతడి ఊహా నిజమే! టీ తాగుతూ ఓ అరగంట పాటు ముకుందాన్ని చెరిగేసారు సుబ్రమణ్యం, గుర్నాధాలు. మాణిక్యరావు, మధ్యలోనే సుబ్రమణ్యంతో పని గురించి మాట్లాడుకొని జారుకున్నాడు.

మరికాస్సేపు ముకుందరావు మీద గస పోసుకున్నాక మరో టీ తాగి మెల్లిగా సీట్లలోకి చేరుకున్నారు ఇద్దరూ.

దాదాపు ఇది రోటీన్ కార్యక్రమం. కాకపోతే మాణిక్య రావ్ స్థానంలో రోజు కొకరు మారతారు. అంతే!

~~~~~~

“టీ సార్!” రాంబాబు.

కప్పందుకుంటూ తల తిప్పి చూశాడు ముకుంద రావు.

“ఏమిటీ? ఇంకా సుబ్బూ రాలేదు?” – అన్నాడు గుర్నాధంతో!

“అదే నేనూ చూస్తున్నాను సార్!” అన్నాడు గుర్నాధం.

అంతలోనే ఉస్సురంటూ వచ్చాడు సుబ్రమణ్యం.

“సార్ టీ!” అందించాడు రాంబాబు.

సుబ్రమణ్యం సీట్లో కూలబడి బాటిల్ ఎత్తి మంచినీళ్ళు గడగడా తాగేసాడు. ఆనక టి చేతిలోకి తీసుకొని ఓ సిప్ తాగి భారంగా నిట్టూర్చాడు.

“ఏమైంది సుబ్బూ! బాగా లేట్ అయ్యావు, హైరానాగా ఉన్నావు?” అడిగాడు ముకుందరావు.

“బండి ట్రబులిచ్చింది. మెకానిక్ దగ్గరికి తీసికెళ్తే… వాడు లక్ష సాకులు చెప్పాడు. ‘అది పోయింది, ఇది పోయింది’ అంటూ మూడు వేలు బిల్లు చేసాడు. కొత్త బైకు! వాడు చెప్పినంతవదని తెలుసు. ‘పెట్రోల్ లో, కిరసనాయిల్ కల్తీ కలిసి ఇంజన్ స్టకప్ అయ్యింది’ అంటూనే అవీ ఇవీ గెలికి ప్రాణం తీసాడు” అన్నాడు కోపం, ఏడుపు కలగలిసిన గొంతులో సుబ్రమణ్యం.

“పోనీ మెకానిక్ ని మార్చేయాల్సింది సార్!” గుర్నాధం సలహా!

“ఎవడైనా ఇంతే! ఇప్పటికి వీడు అయిదో మెకానిక్!” నిస్సహాయంగా సుబ్రమణ్యం.

“పెట్రోలు బంకు…” ఏదో అనబోతుండగా “ఆ ఛాన్స్ లూ అయిపోయాయి, ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టుకోటానికి” ఇరిటేటింగ్ గా అన్నాడు సుబ్రమణ్యం.

“పోనీండి సార్! మీరే అంటుంటారుగా! అవినీతి తోనే అభివృద్ధి సాధ్యం అని! ఆ విధంగా… బైకులో, పాడవ్వని పార్టులు పాడయ్యాయంటూ… మెకానిక్ అవినీతి తోనే అభివృద్ధి సాధిస్తున్నాడు. పెట్రోలులో కిరసనాయిల్ కలిపి బంకు వాళ్ళు అవినీతి తో అభివృద్ధి సాధిస్తున్నారు. ఏమైనా మీ సిద్ధాంతం చాలా కరెక్ట్ సార్!” గట్టిగా వినబడే సరికి గతుక్కుమంటూ చూశాడు సుబ్రమణ్యం.

నవ్వుతూ నిలబడి ఉన్నాడు మాణిక్య రావు. సుబ్రమణ్యంతో అతడి పని అయిపోయింది. అందుకే ధైర్యంగా అనేసాడు.

సుబ్రమణ్యం కిక్కుర మనలేదు.

గుర్నాధం గమ్మున, ఏదీ విననట్లు ఎటో చూస్తున్నాడు.

రాంబాబు నవ్వు దాచుకుంటూ కప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు.

ముకుందరావు ముసిముసిగా నవ్వుతూ “నిజమే కదా సుబ్బూ!” అన్నాడు.

~~~~~

“టీ సార్” రాంబాబు.

“ఏరీ సుబ్బూ సార్! రెండు రోజుల నుండీ రావటం లేదు” ఈసారి గుర్నాధం ఆరా! ఇంతలో సుబ్రమణ్యం వచ్చాడు.

“ఏమయ్యింది సుబ్రమణ్యం? రెండు రోజులుగా ఆఫీసుకు రాలేదు!”

“నా శ్రాద్దమైంది!”ధుమధుమలాడాడు సుబ్రమణ్యం. కాస్సేపెవరూ మాట్లాడలేదు.

మళ్ళీ తానే గస వెళ్ళ బోసుకున్నాడు సుబ్రమణ్యం.

“మా ఆవిడకి ఈ మధ్య తరచూ కడుపు నొప్పి వస్తోంది. దగ్గూ జలుబూ అసలు తగ్గటం లేదు, హాస్పటల్ కి తీసికెళ్తే ఆ టెస్టూ, ఈ టెస్టులని ఇరవై వేలు వదిలాయి. ‘కిడ్నీ ఫైయిలైందేమో, లంగ్స్ లో కన్నం పడిందేమో’ అంటూ హడలెత్తించారు” కోపంతో రొప్పుతూ ఆగాడు.

“దాదాపు యాభై వేలు వదిలించాక ‘అవుట్ సైడ్ ఫుడ్ మానేయండి. ఫుడ్ కలర్స్ ఎలర్జీ వలన కడుపునొప్పి వస్తుందని’ అని చెప్పాడు. ఎంత వ్యాపారమైనా, మనుష్యుల ప్రాణాలతోనా! వాళ్ళ మాటలకి భయంతో చచ్చినంత పనయ్యింది” పళ్ళు కొరికాడు సుబ్బు.

“అంత లేసి బిల్డింగ్స్ కట్టుకున్నాక, అన్ని లక్షలు డొనేషన్ కట్టి చదువుకున్నాక ఆపాటి అబద్దాలాడకుండా, అవినీతి చెయ్యకుండా ఆసుపత్రి అభివృద్ది సాధించేదెలా సార్! అవినీతి తోనే అభివృద్ది అన్నదే వాళ్ల సూత్రం కూడా!” ప్రక్కనుండి వినబడింది.

‘ఎవరదీ’ అన్నట్లు ఉలిక్కి పడి చూసాడు సుబ్రమణ్యం.

ఈసారి మాణిక్య రావు స్థానంలో ప్రకాశం నిలబడి ఉన్నాడు. అతడి ఫైలూ సుబ్రమణ్యం టేబుల్ దాటేసింది మరి! అందుకే నిజం తన్నుకొని బయటి కొచ్చేసినట్లుంది.

~~~~~

“సార్ టీ!” రాంబాబు.

“ఉండవయ్యా! నీ టీ నువ్వునూ!” సుబ్రమణ్యం కసిరాడు.

“ఏమైంది సుబ్బూ సార్!” గుర్నాధం సుబ్రమణ్యాన్ని కూల్ చెయ్యబోయాడు.

“నా బొందయ్యింది. ఎల్.ఐ.సీ. పాలసీ కట్టమని వేరే వాడికి డబ్బిస్తే వాడు కాస్తా పైసలెత్తుకుని ఉడాయించాడు. మా వాడి స్కూలు చదువు ఛండాలంగా ఉందని స్కూల్ కెళ్తే వాళ్ళే ఎదురు వంద చెప్పారు. మా వాడు సరిగ్గా స్కూల్ కి రావడం లేదట. చదవటం లేదు. నేను కేర్ తీసుకోవాలట.

అవన్నీ మేమే చూసుకుంటే ఇక మీకు ఫీజులెందుకు కట్టటం అంటే వంద రూల్స్ చెప్పింది వాళ్ళ హెచ్.ఎం. గంట రికార్డు తిప్పి, సాయంత్రం స్కూల్ లోనే ట్యూషన్ చెబుతామని మరో పదివేలు ఎక్స్ స్ట్రా ఫీజు కట్టమంది. లేదంటే మీ ఇష్టం, కావాలంటే టీసీ తీసుకు పొమ్మంది. నోరు మూసుకుని డబ్బు కట్టి వచ్చాను”.

“అంతే మరి! అవినీతితోనే అభివృద్ది అన్నది స్కూళ్ళకి తెలిసినట్లు మరింకెవ్వరికీ తెలియదు సార్!” ఈ సారి ప్రసాద రావు… సుబ్బుతో పని పూర్తయి పోయిన రిలీఫ్ అతడి మాటల్లో ఉంది.

అందరూ అవునన్నట్లు చూశారు.

సుబ్బు మనస్సులోనే ఏడుస్తూ అవునన్నాడు.

~~~~~~~

“సార్ టీ!” రాంబాబు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు సుబ్రమణ్యం.

ఈ సారి ఎవరూ అతణ్ణి కదిలించలేదు. ఆఫీసుకి వచ్చిన దగ్గర నుండి మూడీగా ఉన్నాడు.

కాస్సేపటికి సుబ్రమణ్యం పగిలిన గ్లాసులాగా భళ్ళుమన్నాడు.

‘ఏమైంది?’ అన్నట్లు చూశారు మిగిలిన వాళ్ళు.

“ఏం చెప్పమన్నావు? ఈ మధ్య బ్యాంకు అక్కౌంట్లలో బాలెన్స్ లో తొర్ర లొస్తున్నాయి. ఇంట్లో బీరువాలో ఉన్నట్లుండి డబ్బులు తగ్గిపోతున్నాయి. ఏటీఎం కార్డుల్ని జేబులో పెట్టుకు తిరిగితే దొంగల భయం! ఇంట్లో పెట్టి వస్తే ఇదో చావు! అటు బ్యాంకు స్టాఫ్ టోకరా పెడుతున్నారో, ఇటు ఇంట్లో మా ఆవిడా పిల్లలే చేతివాటం చూపుతున్నారో తెలీటం లేదు.

మా అబ్బాయీ, అమ్మాయీ శ్రీమతి కూడా షాపింగ్ మానియా తో శివాలెక్కి ఉన్నారు. మోడల్ కో సెల్ ఫోన్, డిజైనర్ డ్రస్సులూ, పిక్ నిక్ లూ, పార్టీలూ, షికార్లూ…పుకార్లు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది” వాపోయాడు.

“గట్టిగా మందలించలేక పోయావా?” సాలోచనగా చెప్పాడు ముకుంద రావు.

“అదీ చేసాను. పిల్లలిద్దర్నీ, శ్రీమతినీ కూర్చోపెట్టి గంట క్లాసు పీకాను” ఏడుపు నాపుకుంటూ సుబ్రమణ్యం.

“మరేం?”

“మా సన్నీ గాడు… నాన్నా! మా ఫ్రెండ్స్కి వాళ్ల పేరంట్స్ చాలా డబ్బులిస్తారు. మా ఫ్రెండ్స్ రకరకాల సెల్ ఫోన్లు, ఐ పాడ్ లు తీసుకొస్తున్నారు. నువ్వు అవన్నీ నాకు కొనమంటే కొంటున్నావా!? అందుకే… ‘అవినీతి తోనే అభివృద్ది సాధ్యం’ అని నువ్వే చెప్పావు కదా! అందుకే స్కూల్లో కట్టాల్సిన దానికి డబుల్ చెప్పాను. సూపర్ మార్కెట్ బిల్లులో వీలయినంత నొక్కేసాను. ఆ డబ్బులతో కొన్న నా కలర్ సెల్ ఫోన్ చూసి నా ఫ్రెడ్సంతా ఎంత డంగయి పోయారో తెలుసా? నీ కొత్త కారు చూసి నీ ఫ్రెండ్సు మూర్ఛపోయిన దాని కంటే ఎక్కువే!... అంటూ కళ్ళెగరేసాడు.

అమ్మాయేమో అప్పుడే దాని స్నేహితురాళ్ళతో డిస్కో ధైక్ లకి, పబ్ లకి పోతుంది. నేను డబ్బులకి కట్టడి చేస్తే ఈసారి బాయ్ ఫ్రెండ్స్ తో పోతుందేమోనని భయంగా ఉంది.” ఈ సారి నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి సుబ్రమణ్యానికి.

సానుభూతిగా చూసాడు ముకుంద రావు.

నవ్వు దాచుకున్నాడు గుర్నాధం.

కిసుక్కున నవ్వాడు అటెండర్ రాంబాబు.

“ఎందుకు సార్ బాధపడతారు? మీ అబ్బాయి అన్నదీ నిజమే కదా? అవినీతితోనే అభివృద్ది అన్నప్పుడు… మీరు కొనివ్వకుండానే… అబ్బాయికి సెల్ ఫోన్లు, ఐపాడ్ లూ వొస్తున్నాయి. డబ్బులు ఖర్చుపెట్టడం వస్తే రేపు సంపాదించటం వస్తుంది కదా సార్! రేపు బైక్ లూ కార్లూ వస్తాయి. అమ్మాయికి అమెరికా ప్రయాణాలూ వొచ్చి వొళ్ళొ పడతాయి. పిల్లలు మిమ్మల్నే ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషించాలి గానీ, బాధపడతారెందుకు? ” – పుచుక్కున అనేసాడు రాంబాబు.

‘తెలిసి అన్నాడా అమాయకంగా అన్నాడా?’ అని అటువైపే చూస్తున్న సుబ్రమణ్యానికి

“సర్వేజనా సుఖినో భవంతు” అని మరో వైపు నుండి వినబడింది.

శనివారం పూజ నిర్వహించేందుకు, ఆఫీసులోకి అప్పుడే అడుగు పెడుతున్నాడు పూజారి రామకృష్ణ శర్మ.

సంభాషణంతా వినే అన్నాడో, జనాంతికంగా అన్నారో గానీ…

“అవినీతి తోనే అభివృద్ది సాధ్యం. చెయ్యడం చేతగాని వాళ్ళు చెప్పాల్సిందే నీతులు! ఓ చోట ఇస్తారు, మరో చోట పుచ్చుకుంటారు. ఎవరి అవసరాలు వాళ్ళకి తీరతాయి. సర్వేజనా సుఖనోభవంతు అంటే ఇదే మరి!” ఓ రోజు డిస్కషన్ లో గట్టిగా దడాయించిన తన మాటలే తనకి గుర్తుకొచ్చి మనస్సులోనే ఘొల్లు మన్నాడు సుబ్బూ!

~~~~~

అవినీతి తోనే అభివృద్ధి సాధించటానికి ప్రయత్నిస్తున్న మన్మోహన్ సింగ్ కి,

సుబ్బు సిద్ధాంతాల వంటి వ్యాఖ్యలని వ్రాసే కొందరు అజ్ఞాతలకి

ఈ టపా అంకితం!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇక ఈ గృహ ఋణాల, సూక్ష్మ ఋణాల విషయాన్ని ఇక్కడితో వదిలేసి తిరిగి షేర్ మార్కెట్ మతలబులని పరిశీలిస్తే…

`మణి మాణిక్యాలతో నిండిన బంగారు బిందె’లా కనబడే షేర్ మార్కెట్ ప్రచారాలనీ, ఆర్ధిక గణంకాలనీ… నెం.5 వర్గం lateral thinking ని ప్రయోగించి… ‘బంగారు బిందెల్ని బోర్లా పడేట్లు చేసి, చిల్ల పెంకులని ప్రదర్శింపచేయటం’ గురించి గత టపాలలో వివరించాను. అది పదే పదే జరగటంతో… షేర్ మార్కెట్ లో కీలక పాత్ర పోషించే ‘బుల్’ లకు కీలక పరిణామం ఎదురైంది.

అదేమిటంటే…

సాధారణంగా ‘బుల్’ లు, షేర్ల క్రయ విక్రయదారులకూ, కార్పోరేట్ కంపెనీలకు మధ్య అనుసంధాన కర్తలుగా కూడా వ్యవహరిస్తారు. మార్కెట్ గురించి వాళ్ళ అంచనాలు విలువైనవిగా అటు కంపెనీలు, ఇటు షేర్లలో పెట్టుబడి పెట్టే వారు (షేర్ల క్రయ విక్రయదారులు) భావిస్తారు.

‘బుల్’ లు తమ క్లయింట్లకు (అంటే షేర్ల క్రయ విక్రయాలకై తమ దగ్గరకు వచ్చే మదుపుదారులు) జవాబుదారిగా ఉంటారు. అదే విధంగా కంపెనీలకి ప్రయోజనాలు కలిగించటానికి ప్రయత్నిస్తారు. ఓ పిసరు మొగ్గు, కంపెనీల వైపే ఉంటుంది. కాబట్టి కంపెనీల తరుపున మౌఖిక ప్రచారాన్ని ప్రభావవంతంగా నిర్వహిస్తారు. మీడియా ప్రచారంతో బాటుగా మౌఖిక ప్రచారం కూడా ఈ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

అలాంటి నేపధ్యంలో… ‘బుల్’ లు, పైకి తమ క్లయింట్ల శ్రేయస్సు కోసం పాటుపడినట్లుగా కన్పించినా… అంత కంటే ఎక్కువ మోతాదులోనే కంపెనీల శ్రేయస్సు కోసం పాటు పడేవాళ్ళు. స్వల్ప వ్యవధిలో ఒడిదుడుకులు సరిదిద్ద బడేవి గనక, కంపెనీల కోసం స్వల్పకాలిక మౌఖిక ప్రచారాన్ని నిర్వహించి పెట్టుబడిదారులని ప్రభావపరిచే వాళ్ళు.

అయితే… కొంతకాలంగా… వాస్తవంలో తరుగుదలే కానీ పెరుగదల లేని/ రిస్క్ ఎక్కువగా ఉన్న ఆర్ధిక స్థితి రీత్యా… తమ వ్యాపారంలో గుడ్ విల్ నిలబెట్టుకోవటమే పెట్టుబడి వంటిది గనుక… క్రమంగా ‘బుల్’ లు, క్లయింట్లకు, లోతట్టుగా కంపెనీల గుట్టుమట్లు చెప్పక తప్పలేదు. ఫలానా షేర్లు ఇక పెరగ బోవనో, లేక ఇంత మేరకు తరుగనున్నాయనో… ఇలాగన్న మాట?
ఎందుకంటే - ఇప్పుడు తమ క్లయింట్లందరూ నష్టపోతే… ఆనక తమ దగ్గరికి ఇంకెవరూ రారు! ఆర్ధిక మాంద్యం నుండి కంపెనీలు బయటపడతాయోమో గానీ, గుడ్ విల్ కోల్పోయాక తమ కార్యాలయాలు మాత్రం తెరవబడవు. అందుచేత కూడా… క్లయింట్ల పట్ల కొంతైనా నిజాయితీగా ప్రవర్తించక తప్పనిసరి వారిది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికస్థితి కుదేలవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం!

దాంతో చాలా కార్పోరేట్ కంపెనీలకు… బినామీ పెట్టుబడి దారుల రూపంలో తమ షేర్లని తామే క్రయవిక్రయాలు జరుపుకోక తప్ప లేదు, తప్పడం లేదు. [రిస్కు తీసుకుని షేర్ల వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. వారిని మినహాయిస్తే !] అలాగ్గాక షేర్ ధరలు పడిపోతున్నా చూస్తూ ఊరుకుంటే తమ ఆస్తుల విలువలు కృశించి, బ్యాంకు ఖాతాల లిమిట్స్ కృంగి, కొంగు నెత్తి నేసుకోవాల్సి వస్తుంది మరి!

అదే ఇప్పుడు జరుగుతోంది! మరైతే… ఈ బినామీ క్రయ విక్రయాలకు డబ్బు వెలితి ఎలా పుడ్చుకోబడుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన అంశం!

గమనించి చూడండి! గణాంకాలు అందుబాటులో ఉంటే ప్రాక్టికల్ గా పరిశీలించండి! షేర్ మార్కెట్లు i.e. సెన్సెక్స్ పడిపోయినప్పుడల్లా దానికి రెండు రోజున బంగారం ధరలు ధగధగలాడి పోయాయి, పోతున్నాయి.
2000 - 2001 లో కూడా తులం బంగారం నాలుగున్నర వేల రూపాయలుంది. 2008 తర్వాత విపరీతంగా దూసుకుపోయి ఇప్పుడు ఇరవై వేలై కూర్చుంది. ఎందుకలా దూసుకు పోయింది, పోతోంది?

ఈ ప్రశ్నకు మీడియా గానీ, విశ్లేషకులు గానీ ఉలకరూ, పలకరు. పసిడి ధర ధగధగలాడి పోతోందనీ, అంతయ్యిందనీ, ఇంతయ్యిందనీ, ఇన్నిరెట్లు అన్నిరెట్లు పెరిగిందని మాత్రం… గ్రాఫులు, బార్ డయాగ్రంలు చిత్రిస్తారు. స్వల్పకాలంలో నాలుగు రెట్లుకు బంగారం ధర ఎందుకు పెరిగిందో మాత్రం చెప్పనే చెప్పరు.

పెట్టుదారులు షేర్లపై భద్రతా భావం కోల్పోయి, బంగారం కొనేందుకు ఎగబడటంతో గిరాకీ పెరిగి బంగారు ధర పెరిగిందన్న విశ్లేషణ తరచుగా వింటూ ఉంటాం! (Demand & supply) సిద్ధాంతం ప్రకారం అన్నమాట. నిజానికి అది కాగితపు పులి వంటి సిద్ధాంతమే! చాలా సార్లు కృత్రిమ కొరతలు, కృత్రిమ గిరాకీలు సృష్టింపబడటం చూసిందే!

సరే, అదే నిజమనుకుందామన్నా…. అంతగా పెట్టుబడి దారులు బంగారం కొందామని ఎగబడితే అమ్ముతున్న వారెవ్వరు? ఏ దేశంలో నైనా… ఆయా దేశాలలో గనుల నుండి దేశీయ ఉత్పత్తిగా సమకూడే బంగారం ఎంత? విదేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారం ఎంత? భారత్ విషయాన్నే తీసుకుంటే… మనదేశపు గనుల్లోనో, ఇతరత్రానో ఉత్పత్తి అవుతున్న బంగారు పరిమాణం ఎంత? సాలుసరిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదెంత? ఏడాదికి రిజర్వ్ బ్యాంకు మార్కెట్టులోకి విడుదల చేసే బంగారం ఎంత?

ఈ లెక్కలు డొక్కలన్నీ అంతగా ప్రచారించబడవు. అధికారికంగా ప్రకటింపబడవు. ప్రకటించబడిన నివేదికలలోనూ వివరాలు ఎవరికీ అర్ధం కాకుడదన్నట్లు అవన్నీ గ్రీక్ & లాటిన్ లో ఉన్నట్లు గానో లేక అక్షరాలన్నీ పచ్చపచ్చగా ఎఱ్ఱెఱ్ఱ గానో ఉంటాయి. ఎందుకంటే… అవి ఎవరికీ అవగతం కాకూడన్నదే ప్రభుత్వ లక్ష్యం గనుక!

అదీగాక, షేర్ మార్కెట్ మీద భద్రతా భావం లోపించి పెట్టుబడిదారులందరూ బంగారం కొనేందుకు ఎగబడేసరికి ధర పెరిగిందని ప్రచారిస్తారు. మరైతే షేర్ మార్కెట్ నిలబడినప్పుడు బంగారం ధర పడిపోవాలి కదా! కాని అది జరగదు. మరోసారి షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు, మళ్ళీ బంగారం ధర, క్రితం పెరిగిన ధర నుండి పెరుగుతుంది. అలా అలా బంగారం ధర నిత్యం పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏ దేశమో బంగారం నిల్వలను అమ్మింది అన్నప్పుడు బంగారం ధర కొంత తగ్గుతుంది. అది కూడా పెరిగిన ధరతో పోల్చితే చాలా స్వల్పం.

మరెందుకు… షేర్ మార్కెట్ [సెన్సెక్స్] కుప్పకూలినప్పుడు, ఆ తర్వాతి ఒకటి రెండు రోజుల్లో బంగారం ధర అమాంతం పెరిగి పోతుంది? ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దూసుకు పోతుంది? గత ఆరునెలల కాలంలో ఈ అవినాభావ సంబంధాన్ని పరికించినా ఈ విషయం స్పష్ట మౌతుంది.

కాకపోతే ఆ గణాంకాలన్నీ ఒక చోట మదింపు చేసి వివరంగా అందుబాటులో ఉండాలి. వార్తా పత్రికలని పరిశీలించాలంటే కొంచెం ఓపిక కావాలి. సామాన్యుల బ్రతుకు పోరులో అంత ఓపికా, తీరికా మృగ్యం కదా!? అదే వాళ్ళ భరోసా మరి!

సెన్సెక్స్ ఎగుడు దిగుళ్ళకీ బంగారం ధరల పెరుగుదలకీ సంబంధం ఏమిటి? ఇది నిగూఢమైనది!
ఇక్కడ మీకు కొన్ని పోలికలు ఉదాహరణలు చెబుతాను.

ప్రస్తుతం మనదేశంలో 500 రూ. నోట్లూ, వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఉన్నట్లుండి, ప్రభుత్వం ఆ నోట్లని రద్దు చేసిందనుకొండి. ఎవరి దగ్గరైతే ఆయా నోట్లు ఎన్నెన్ని ఉన్నాయో, వాటికి లెక్కలు చూపించి, బ్యాంకుల్లోనూ, ప్రభుత్వ కౌంటర్లలోనూ ఇచ్చి, చిల్లర నోట్లు అంటే వందలూ యాభైలూ తీసికొమ్మందను కొండి.

అప్పుడు… లంచగొండులు, అవినీతి పరులూ, రాజకీయ నాయకులూ, బడా వ్యాపార వేత్తల దగ్గర దొంగ లెక్కల్తో ఉన్న సొమ్మంతా మురిగి పోతుంది. ఒక్క ప్రకటనతో అయిదు వందల, వెయ్యి రూపాయల నోట్లు చెత్త కాగితాలతో సమానమై పోతాయి.

ముందు రోజు వరకూ ఎంతో విలువైన కరెన్సీ నోటు మర్నాటి కల్లా పనికిమాలినదై పోవడానికి ఒక్క ‘సంఘటన’ చాలు.

అదే విధంగా… ఒక రోజున ఓ దేశం కుప్పకూలిపోయిందను కొండి. 1990లో ఎల్సిన్ Vs గోర్బచేవ్ ల నాటకీయతతో USSR కుప్పకూలి పోయి, 17+ ముక్కచెక్కలుగా మారిపోయినట్లన్న మాట!

ఆ ఒక్క సంఘటన తర్వాత, అప్పటి వరకూ విలువైనదిగా చలామణి అయిన రూబుల్ కాస్తా, విలువ మాసి పోయింది. అంతకు క్రితం… పది రూబుళ్ళు పెడితే ఓ కిలో ఓట్సు వచ్చేది కాస్తా, పది వందల రూబుళ్ళు పెట్టినా అరకేజీ రావడం గగనమై పోతుంది.

ఒక్కసారిగా రూబుల్ అనబడే కరెన్సీ… విలువ కోల్పోవడానికి ఆ ఒక్క సంఘటనా చాలు!

ఇందుకోసం ఓ దేశం కుప్పకూలేంత పరిస్థితే రానక్కర లేదు. ఆ దేశపు ఆర్ధిక రంగం, మార్కెట్లు పేకమేడలా నేలమట్టం అయిపోయినా చాలు! జింబాబ్వేలో జరిగినట్లన్న మాట! అప్పుడు ఓ పెద్ద కర్రల సంచి నిండా కరెన్సీ నోట్లు మోసుకుని పోయి, అరచేతిలో పట్టేంత బన్ను ముక్క తెచ్చుకోవాల్సి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల పట్టునడుస్తున్నప్పుడు… ఇలాంటి సంఘటనలు (అంటే రష్యా లాగా దేశాలు కుప్పకూలటం లేదా జింబాబ్వేలాగా ఆర్దిక రంగం, మార్కెట్టు కుప్పకూలటం) జరిగే ముందే… జరిపించేది తామే కాబట్టి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ… తమకి ప్రీతిపాత్రులైన వారికీ, తమ కీలక ఏజంట్ల వంటి వారికీ, ఆ సమాచారం ముందే చెప్పి ఉంచేవి!

ఆయా దేశాల్లో… ప్రభుత్వ ప్రకటన కారణంగా కరెన్సీ నోట్లు రద్దు చేయబడినా, ఇదే పరిస్థితి! తమవి కాని ప్రభుత్వాలు ఆయా దేశాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ వారు కీలక స్థానాల్లో ఉన్నారు గనక ఆ సమాచారం ముందే వాళ్ళకి ‘లీక్’ కావటం మామూలుగా జరిగిపోయేది.

అప్పుడు తమ ఏజంట్లు (వారిలో కార్పోరేట్ దిగ్గజాలే గాక, రాజకీయులు, బ్యూరాక్రాట్లు గట్రాలు కూడా ఉంటారు) ముందు జాగ్రత్త పడతారు. అయితే ఆ విధంగా ముందు జాగ్రత్త పడగలిగింది కొంత మేరకే!

అందుచేత – కార్పోరేట్ రంగంలో బడా బాబులూ, రాజకీయుల్లో బ్యూరాక్రాట్ల లో అత్యంత సంపాదనా పరులూ, తమ ఆస్థుల్ని నగదు రూపంలో (అంటే కరెన్సీగా) గాకుండా, విలువైన వస్తు రూపంలో దాచుకుంటారు. అందులో విలువైన రాళ్ళు, ఇతర వస్తువుల కంటే, బంగారానిదే అధిక ప్రాధాన్యత!

ఎందుకంటే – బంగారం ఎన్నటికీ వన్నె తరగనిది. మోజు తీరనిది ఎంతగా అంటే… తరాలు, యుగాలు మారినా విలువ తరగనంత! శతాబ్దాలే కాదు, సహస్రాబ్దాలు గడిచినా బంగారం బంగారమే!

గత దశాబ్దం లో విడుదలై, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మమ్మీ’ సినిమాలో… ఎప్పుడో వేల యేళ్ళ క్రితం చంపబడి మమ్మీగా చేయబడిన మాంత్రికుడు, ఇప్పటి మనుష్యుల్లో ఒకణ్ణి బంగారం ఇచ్చి లొంగదీసుకుంటాడు. ఆ బంగారానికి ఆశపడిన ఆ బక్కవాడు, తన సహచరులని కూడా మోసగించి తెచ్చి మంత్రగాడికి అప్పగిస్తాడు. ఆ మంత్రగాడు వారి అవయవాలని గ్రహించి తిరిగి, తన భౌతిక దేహం సంపూర్తి చేసుకుంటాడు.

అంటే బంగారంతో అవయవాలని కొనుక్కున్నాడన్న మాట! అదే నాటి గ్రీకు కరెన్సీ ఉండి ఉంటే, అది ఆ బక్కవాణ్ణి కించిత్తయినా ఆకర్షించి ఉండేదా? (ఆ బంగారం మీది ఆశతోనే, వాడు, బంగారాన్ని బయటకు చేరవేసే ఆత్రంలో ప్రాణాలు పోగొట్టు కుంటాడు లెండి.)

చివరికి ఆనాటి రాగి నాణాల వంటివి అయినా, ఇప్పుడు అంతగా పనికి వచ్చి ఉండేవి కావు. అప్పట్లో ఆ రాగినాణానికి ఎంతో విలువ ఉండవచ్చు గాక, ఇప్పడది బరువుని బట్టి రాగి విలువ అయి ఉంటుంది. అదే బంగారమైతే…? అదెప్పుడూ విలువైనదే! అదెప్పుడూ మనిషిని ఆశకు గురి చేసేదే!

ఇదే సూత్రం కార్పోరేటు రంగంలో కీలక దిగ్గిజాల దగ్గరా పని చేస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మార్కెట్లో డబ్బు సంక్రమణం (Rotate) అయ్యి, కంపెనీలు నిలబడాలి. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయ ఉపాధి పధకం, xyz పధకం పేరుతో పందారం చేస్తుంది. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పధకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించింది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి!

ఆ రూపంగా ఓ ప్రక్క ఓట్లు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేట్ కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింప చేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగా లేదా లంచాలుగా రాబట్టు కుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి వర్తులం. (Robery cycle)

ఇది ఎంత దారుణ దోపిడి అంటే… సూక్ష్మ ఋణ కంపెనీలు, వెంటబడి ఋణాలిస్తే సెల్ ఫోన్ల దగ్గరి నుండి చాలా వినిమయ వస్తువుల్నే అలవోకగా కొనేసుకున్న లబ్ధిదారులు…తీరా ఋణ వాయిదాలు కట్టలేక కూలబడితే, సూక్ష్మ ఋణ కంపెనీల ప్రతినిధులు వారిని నానా దుర్భాషలూ ఆడి ఆత్మహత్యలకి తెగబొడే దాక తీసుకెళ్తున్నారనీ, అది భీమా సొమ్ము కోసమేననీ కొన్ని సంఘటనలు కూడా వెలుగు లోకి వచ్చాయి.

ఏది ఏమైనా, అమెరికాలో గృహ ఋణాలు, భారత్ లో సూక్ష్మ ఋణాలు అంటూ… ఎంతకైనా తెగబడే స్థితికి ఆర్ధిక రంగం, రాజకీయ రంగం పెనవేసుకుని మరీ దారి తీసాయి. అది, కార్పోరేట్ రంగంలోని ఆర్ధిక మందగమనాన్ని తగ్గించుకోవడానికే!
అది ఎలా గంటే…

‘Round the World in 80 Days’ అనే ప్రసిద్ది నవల చాలామంది చదివే ఉంటారు. అందులో ఫిలియాస్ ఫాగ్, అట్లాంటిక్ సముద్రాన్ని దాటేటప్పుడు నౌకలో ఇంధనం అయిపోతుంది. కానీ అతడికి గడువు లోపల గమ్యం చేరటం తప్ప
మరేవీ పట్టవు.

ఇంధనం అయిపోయిన క్లిష్ట దశలో, ఓడ చెక్కల్ని నరికి, ఇంథనంగా వాడి నౌక నడుపుతారు. చివరికి ఫిలియాస్ ఫాగ్, భారత్ లో అతడు సతీసహగమనం నుండి రక్షించిన యువతి ఆయుదా, అతడి అనుచరుడు పాస్పార్తూ, కొద్దిమంది నౌక సిబ్బంది… నిలబడేందుకు అడుగు చెక్క తప్ప, ఓడ మొత్తాన్ని వలిచి తగలెట్టేస్తాడు.

ఇది ధీరోదాత్తుడైన ఫిలియాస్ ఫాగ్ లక్ష్యాన్ని ఛేదించిన తీరు! ఇది పాజిటివ్ కోణం!

ఇదే నెగిటివ్ కోణంలో ఉంటే… అదే ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అందులోని కీలక వ్యక్తుల స్థితి! అందులో కార్పోరేట్ కంపెనీల వారు ‘కీలకమైన ఏజంట్లు’ మరి! ఆర్ధిక మందగమనాన్ని దాటేందుకు ఫిలియాస్ ఫాగ్ నౌక చెక్క నరికినట్లు గానే… ‘ముందు ఈ స్థితి దాటితే చాలు! ఆనక ఇప్పుడు మార్కెట్టులోకి పంపిణీ చేసిన విత్తానికి రెట్టింపు తిరిగి రాబట్టు కోవచ్చు. అదేగాక ఈ గండం గడిస్తే…పట్టు సంపాదించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఒకసారి గూఢచర్య పట్టు తిరిగి సంపాదిస్తే… ఇక మళ్ళీ దోపిడికి అడ్డేముంది? అసత్య ప్రచారాలకి హద్దేముంది?’ – ఇదే తపన!

ఆ పర్యవసానమే… స్వంత ఇంటి ఋణాలైనా, సూక్ష్మ ఋణాలైనా! సామాన్య ప్రజలకి ఋణం రూపేణా డబ్బు ప్రవహింప చేస్తే…స్వంత ఇంటి ఋణాలంటే… ప్లానింగ్ చేసే ఇంజనీరింగ్ కంపెనీలు… నిర్మాణ సంస్థలు, సిమెంటు ఇనుము ఉత్పత్తిదారులు, వడ్రంగి, ఫర్నిచర్, వస్తు నిర్మాణ సంస్థలు… అందరికీ వ్యాపారం వస్తుంది. అచ్చం రోల్స్ రాయిల్స్ కారు ఆర్డరు కథలో లాగే!

అదే సూక్ష్మ ఋణాల విషయంలో కూడా! అడగకుండానే ఇంటికి వచ్చి మరీ అప్పిస్తే… సెల్ ఫోన్లు, కలర్ టీవీలు, బైక్ లూ, మోపెళ్ళు… ఎంత వ్యాపారం!? చివరికి గొర్రెల కాపర్ల చేతిలో కూడా కిలకిల మన్నది సెల్ ఫోన్!

‘ముఫ్ఫై మూడో నాడు అప్పు తీర్చక పోతే తన్ని వసూలు చేసుకుంటాం! అప్పు తీర్చలేక ఋణ గ్రహీతలు చచ్చినా ఫర్వాలేదు. జీవిత భీమా సౌకర్యం కల్పించుకుంటాం. డబ్బు Rotate కావడం ముఖ్యం!’ – ఇదే ప్రాతిపదికగా నడిచిన వ్యాపారమే అది! ‘నల్లడబ్బు సూక్ష్మ ఋణ సంస్థల ద్వారా మార్కెట్ లోకి ప్రవేశించిందని’ ఓ మాట కూడా బయటికి వచ్చింది.
నాలుగైదేళ్ల క్రితం సూక్ష్మఋణాల సంస్థలు రంగ ప్రవేశం చేసినప్పుడు… “రానున్న కాలంలో తిరిగి పట్టు సంపాదించుకోలేమా? ఈ
లోపున ఇరుకును దాటక పోతే కష్టం” అనుకుని చేపట్టిన ప్రణాళిక అది.

2007లో ఈనాడు ఆదివారపు సంచిక సెంటర్ స్ప్రెడ్ లో… అమెరికాలో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి, బంగ్లాదేశ్ లో విజయవంతమైన సూక్ష్మ ఋణాల స్ఫూర్తితో, భారత్ లో నిరుపేదల్ని ఉద్దరించాలనే సదాశయంతో, పేద ప్రజలపై ప్రేమతో, స్వదేశం వచ్చేసిన ఓ యువకుడి గురించి… ఉపమాన ఉత్ర్పేక్ష రూపకాలంకారాలతో వ్రాసింది. ఇంతకీ బంగ్లాదేశ్ లో అది విజయవంతమైందని మీడియా ప్రచారం. భారత్ లో అది విజయ వంతం అయ్యిందని బాంగ్లాదేశ్ లోనో మరో చోటనో ప్రచారించినా ఆశ్చర్యం లేదు. ఎటూ విభజించి ప్రచారించటమే కదా వాళ్ళ స్ట్రాటజీ !?

ఏదేమైనా… స్వగృహ ఋణాలు, సూక్ష్మ ఋణాలు గట్రా పైకారణాలలో మార్కెట్ లోకి డబ్బు ప్రవహింప చేసి (పనిలో పనిగా అందులో నల్లడబ్బు కలిపేసి), ఆర్ధిక మందగమనాన్ని త్వరిత పరచ ప్రయత్నించారు. కాకపోతే ‘బావిలో పోసిన బక్కెట్ నీళ్ళలాగా’ అది నిష్క్రయోజనమైంది. కాలం గడిచినా పరిస్థితి మారక పోవడమే ఇందుకు నిదర్శనం.

ఇదే విషయాన్ని మరో కోణంలో నుండి పరిశీలించండి.

>>> ఆంధ్రజ్యోతి లోని జాహ్నవి గారి ఎడిటోరియల్
>>>07/11

మేధో మథనం

మసకబారిన నల్లసూరీడు
- జాహ్నవి
మంచి మెజారిటీతో ఎన్నికై, ప్రపంచ ప్రజలందరి చేత 'ఔరా!' అనిపించుకున్న ఒబామా రెండే ళ్ళు తిరక్కుండానే పరాజయాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆర్థిక వ్యవస్థ అదుపులోకి రావడం లేదు. ముగుద్దామనుకున్న యుద్ధాలు ముగిసే సూచనలు కనిపించడంలేదు. నిరుద్యోగం తగ్గడంలేదు. డాలరు కొనుగోలు శక్తి రోజురోజుకీ తగ్గిపోతోంది. ఫలితంగా మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం. ఏం జరిగింది? ఎక్క డ తప్పు జరిగింది? దీన్నుంచి మనం నేర్చుకోగలిగిందేమైనా ఉందా?

ఒబామా అధ్యక్షపదవికి ఎన్నికల్లో ప్రచారం చేసే సమయానికే అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. అంతకు ముందు ఎనిమిదేళ్ళు పాలించిన జార్జి బుష్ చేపట్టిన తప్పుడు విధానాల వల్ల 1930లో వచ్చిన స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. 2001-02లో కంప్యూటర్ - ఐటీ రంగం బుడగ పగలడం కారణంగా ఒక మాదిరి సైజులో ఆర్థిక మాంద్యం వచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి ఇంకో బుడగను సృష్టించారు.

అసలు ఆర్థిక మాంద్యం అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రభుత్వం చేసే తప్పిదాల వల్లే వస్తుంది. మార్కెట్‌ను తనపని తాను చేయనీయకుండా, ఆర్థిక వనరుల్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. తనకు పేరు తెచ్చి పెట్టే పథకాలు, ఎన్నికల్లో లబ్దినిచ్చే పథకాల అమలుకు ఆ ఆర్థిక వనరుల్ని వెచ్చిస్తారు. జార్జిబుష్ చేసిందదే. 2001- 02లో వచ్చిన మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేస్తానని బీరాలు పలికాడు.

మనకు రిజర్వు బ్యాం కు ఉన్నట్లే, అమెరికాకు ఉన్న ఫెడరల్ రిజర్వు ద్వారా వడ్డీరేట్లను అథమస్థాయికి బలవంతంగా తగ్గించేశారు. "అమెరికా ప్రజలందరికీ సొంత ఇల్లు'' అనే పథకాన్ని మొదలెట్టారు. బ్యాంకులు నిబంధనలు మార్చేసి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు అతి తక్కువ వడ్డీతో వెంటపడి మరీ రుణాలిప్పిలంచారు. అమెరికలో అన్నీ ప్రైవేటు బ్యాంకులే కదా? తిరిగి చెల్లించలేరు అనుకున్న వాళ్ళకు రుణావ్వరు కదా!

అందుకని కేంద్ర ప్రభుత్వం సొమ్ము తో ఫ్రెడీమాక్, ఫానీమే అనే రెండు సంస్థలను స్థాపించారు. తిరిగి చెల్లించని రుణాల బాధ్యత ఈ రెండు సంస్థలూ తీసుకునేందుకు బ్యాంకులతో ఒప్పందం. ఇక తమకు ఏ రిస్కులేదు కాబట్టి బ్యాంకులు ఎగబడి మరీ రుణాలిచ్చాయి. దాంతో ఇళ్ళకు డిమాండ్ పెరిగింది. ఇళ్ళు ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతున్నాయి కదా ని అవసరమున్నా లేకున్నా ఒక వ్యాపార పెట్టుబడిగా ఇళ్ళు కొనడం మొదలెట్టారు. మన దగ్గర జరిగిన రియ ల్ ఎస్టేట్ బూమ్ లాగే.

కొన్ని బ్యాంకులకు కూడా ఆశపుట్టి సొంత రిస్కు మీద కొన్ని రుణాలివ్వడం మొదలెట్టాయి. అమెరికాలో అర్థిక సేవల మార్కెట్ చాలా సంక్లిష్టమైనది. చాలా పెద్దది కూడా. భవిష్యత్తులో తిరిగి చెల్లించే రుణాల మేర కొన్ని సంస్థలు అప్పులు తీసుకున్నాయి. భవిష్యత్ చెల్లింపులను కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి.

రుణాలు తిరిచి చెల్లిస్తారా లేదా అన్న విషయం మీద కొందరు మార్కెట్‌లో స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధమైన వ్యాపార ప్రక్రియలే. ఒకానొక రోజున ఈ బుడగ పేలింది. వెరసి బుష్‌గారి పథకం పేరుతో, పన్నుల డబ్బును అడ్డంపెట్టుకుని ఆడిన జూదంతో అమెరికా ఆర్థిక వ్యవస్థంతా పతనం అంచున నిలబడింది. ప్రజల నిజమైన అవసరాలు, మార్కెట్‌లతో సంబం ధం లేకుండా ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రయోగాలు కాస్త ముందో, వెనకో విఫలంకాక తప్పదు.

ఆర్థిక సూత్రాలకు ఏ వ్యవస్థయినా తలవంచక తప్పదు. కృత్రిమ బుడగలాంటి ఇళ్ళ బూమ్ 2007- 08లో బద్ధలయింది. దాంతో ఉపద్రవం స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాలకోసం, ప్రభుత్వాలకున్న విశేషమైన అధికారాలతో ఆర్థిక వ్యవస్థ మెడలు వంచి, సోషలిస్టు పుక్కిట పురాణాలతో "నా ప్రజలకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేస్తాను'' అని ఉపన్యాసాలు దంచి ప్రజలు సంపాదించిన డబ్బు ను పన్నుల రూపంలో లాక్కుని తప్పుదారిలో పెట్టుబడులుపెడితే బుడగలు,బూమ్‌లు, బద్దలవడాలు, మాం ద్యాలు తప్పవు. ఇది వందేళ్ళుగా ఆర్థికవేత్తలకు తెలిసిన వాస్తవం.

అయినా అత్యధిక శాతం ఆర్థిక మేధావులు ఆస్థాన మేధావులై, ప్రభుత్వాలు చేసే పాపాలను వెనకేసుకొస్తారు. జరిగిన ఉపద్రవాలకు వేరే ఎవర్నో కారకులుగా ఎత్తి చూపుతారు. ఎవరికీ అర్థంకాని తర్క భాష లో రకరకాల అంకెలు, గ్రాఫుల గీతలతో ప్రజల దృష్టి మరల్చేస్తారు. అమెరికా కూడా దీనికి అతీతం కాదు.

వచ్చిన మాంద్యాన్ని వాల్‌స్ట్రీట్‌లోని పెట్టుబడిదారులు, స్పెక్యులేటర్ల మీదకి తోసేశారు. దాంతో సమస్య మూల కారణాలు మరుగున పడిపోయాయి. 'అమెరికన్లందరికీ సొంతిల్లు' అనే సోషలిస్టు సంక్షేమ పథకం ద్వారా ఇళ్ళ మార్కెట్‌లో ప్రభుత్వం త్రీవమైన జోక్యం చేసుకోవడం అసలు సమస్య అని గుర్తించడానికి నిరాకరించారు. ఇక పరిష్కారాలు మాత్రం ఏమంత హేతుబద్ధంగా ఉంటాయి? ఒబామా మంచి వాక్చాతుర్యంగల నాయకుడు.

ఉపన్యాసాలతో ఓటర్లను ఉత్తేజపరచగలడు. అమెరికా అర్థిక మాంద్యానికి తాను సూచించిన పరిష్కారాలు పూర్తిగా అసంబద్ధమైనవి. ఈ విషయం తన ఎన్నికల ప్రచార సమయంలోనే ఆస్థానంతో సంబంధంలేని ఆర్థికవేత్తలకు అర్థమయింది. కానీ త్రీవమయిన ఆర్థిక మాంద్యం, ఎటూతేలని ఆప్ఘన్, ఇరాక్ యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న ప్రజలు ఒబామా ఏదో ఒకటి చేసి తమను ఒడ్డునపడేస్తారని నమ్మారు.

పాలన చేపట్టిన నాటినుంచి ఒబామా ఒకదానికి మించి ఇంకో తప్పు చేస్తూనే వచ్చారు. ఆర్థిక మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యమే ఈ ఆర్థికమాంద్యానికి మూల కారణం. అయినా పరిష్కారంగా ప్రభుత్వం జోక్యాన్ని ఇంకా పెంచారు. తప్పుడు అంచనాలతో జూదమాడిన సంస్థలకు దివాళా తీయనీయకుండా ప్రజల పన్నుల డబ్బుతో ఆ సంస్థలను నిలబెట్టారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగాల్లో నియంత్రణలు పెంచేశారు.

[బావిలో పోసిన బక్కెట్ నీళ్ళ వంటివే సదరు ఉద్దీపన పథకాలు! – అమ్మఒడి]

ప్రభుత్వ రుణాలను విపరీతంగా పెంచారు. డెభ్భైలక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి సరిపడా డాలర్లు ముద్రకొట్టారు. వడ్డీరేట్లు నేలమట్టానికి తగ్గించేశారు. ఈ చర్యలన్నిటి ఫలితంగా డాలర్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రజలు దాచుకున్న డబ్బు విలువ పడిపోయింది. కొనేశక్తి లేక, మార్కెట్‌లో వస్తు, సేవల డిమాండ్ పడిపోయింది. దాంతో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు రావడంలేదు.

ఉన్నవి విస్తరించట్లేదు, సరికదా, కుదించబడుతున్నాయి. దాంతో ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావడంలేదు. నిరుద్యోగం పదిశాతంలో ఉండి క్రిందకు దిగనంటుంది. పరిస్థితులు ఇలా ఉండగా, తగుదునమ్మా అం టూ అమెరికాలోని ఆరోగ్యం, వైద్యం రంగాన్ని పూర్తిగా జాతీయం చేసే దిశగా పథకాలకు తెరతీశారు.

తద్వారా ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలందించిన చారిత్రక పురుషుడిగా మిగిలిపోవాలని కాంక్షిస్తున్నారు. ఈ శాసనం ప్రతినిధుల సభలో నెగ్గితే అమెరికా ఆర్థికవ్యవ స్థ దివాలా తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పొ చ్చు. ఇంగ్లండు, కెనడాల్లో జాతీయకరణ తర్వాత రోగు ల ఇబ్బందులు చూశాక అమెరికా ప్రజల మీద జాలి కలగక మానదు.

అంతే కాదు, త్రీవ సంక్షోభంలో ఉన్న కొన్ని కార్ల కంపెనీలలో ప్రభుత్వం సొమ్మును పెట్టుబడిగా పెట్టి గట్టెక్కించారు. వాళ్ళు తయారు చేసే కార్లకు డిమాండు సృష్టించేందుకు ఇంకో పథకం వేశారు. తక్కువ మైలేజినిచ్చే కార్లు పక్కనపడేసి ఎక్కువ మైలేజినిచ్చే కార్లు కొనేవాళ్ళకు సబ్సిడీలిచ్చారు. ఆ సబ్సిడీ డబ్బు పన్నుల డబ్బులోనిదే. ఇదే పద్ధతుల్లో చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టి, అవి దివాళా తీయకుండా బలవంతాన అపారు.

[వాళ్ళు ఇన్నాళ్ళుగా అత్యుత్తమమైనదిగా శ్లాఘిస్తూ ప్రచారించిన స్వేచ్ఛా విఫణి సిద్ధాంతానికే విరుద్ధం ఇది. మరో మాటగా చెప్పాలంటే స్వేచ్ఛా వాణిజ్యం యొక్క వైఫల్యం ఇది. – అమ్మఒడి]

ప్రజల డబ్బుతో అంటే జార్జిబుష్ చేసిన తప్పులను, దురాశకు పోయిన కొన్ని ఆర్థిక సంస్థలకు మార్కెట్ పోటీలో నిలవలేని కొన్ని కార్ల కంపెనీలకు ప్రజల చేత పరిహారం చెల్లింపచేశారు. ఈ కార్యక్రమాలన్నింటి పేరిటా పన్నులు పెంచారు. టీ (టీఈఏ-టాక్స్డ్ ఎనఫ్ ఆల్‌రెడీ) పార్టీల పేరుతో చాలా చోట్ల స్వచ్ఛందంగా బృందాలుగా ఏర్పడి, ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికి ఫలితమే మధ్యంతర ఎన్నికల్లో తీవ్ర పరాజయాలు.

అమెరికాలో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఇప్పటిది కాదు. 1930 నుంచే మొదలైంది. రెండు పార్టీలు దీనికి అతీతులు కారు. ఆర్థిక సూత్రాలు విస్మరించి, పాపులారిటీ కోసం తప్పుమీద తప్పు చేయడాన్ని చరిత్ర విస్మరించదు, క్షమించదు. ఇంకా చాలదన్నట్లు ఔట్ సోర్సింగ్ మీద వాగ్దానాలు కురిపించడం సిగ్గుచేటు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల విపరీత జోక్యమే ఆర్థిక మాంద్యాలకు దారితీస్తుంది.

కృత్రిమంగా వడ్డీరేట్ల తగ్గింపు, లోటుబడ్జెట్లు, దానికోసం రూపాయిల ముద్ర ణ, ప్రజల డబ్బులో అత్యధిక భాగం రకరకాల పన్నుల రూపంలో లాక్కోవడం, దాన్ని ఓటర్లకు పంచిపెట్టడం -ఇవీ ప్రభుత్వాలు చేసే పాపాలు. మాంద్యం వచ్చినపుడు ఆర్థిక వ్యవస్థనుంచి ప్రభుత్వం దూరంగా జరగా లి.

కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా వ్యవస్థ తనంతట తాను సర్దుకుంటుంది. తిరిగి వృద్ధి బాటపడుతుం ది. మాంద్యం పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా జోక్యం చేసుకుంటే ఆ మేరకు మాంద్యం నుంచి బయటపడడం ఆలస్యమవుతుంది. వ్యవస్థ ఇంకా తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ఆర్థిక సూత్రం. ఆర్థిక సత్యం. ఎన్ని ఉపన్యాసాలిచ్చినా దీన్ని మార్చలేము. ఉదాహరణ ఆమెరికాను చూడండి. ఒబామాను చూడండి.

- జాహ్నవి

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/7/edit/7edit2&more=2010/nov/7/edit/editpagemain1&date=11/7/2010

>>> కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా వ్యవస్థ తనంతట తాను సర్దుకుంటుంది. తిరిగి వృద్ధి బాటపడుతుం ది. [ఈ అభిప్రాయంతో అమ్మఒడి ఏకీభవించదు. ఎందుకంటే ఆర్ధిక రంగమేమి పత్తిగింజ కాదు. రాజకీయ రంగం అంటే ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు చేసే తప్పిదాలకు ప్రోద్బలం ఆర్ధిక రంగం నుండే ఉంది. సాధారణ పరిస్థితులలో అయితే ఆర్ధిక రంగం కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా తనంతట తాను సర్ధుకోగలదేమో! గానీ, గూఢచర్యం ముడిపడి ఉన్నచోట దోపిడి బయట పడి తీరుతుంది. కాగితపు సంపద ఆవిరై తీరుతుంది. ఆ బాటలోనే ప్రస్తుత ఆర్ధిక+రాజకీయ రంగాలు ఉన్నాయి.]

ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటూ, పైకారణాల ప్రచారంగా సూక్ష్మ ఋణాల ఆత్మహత్యలతో మీడియా కాలం గడుపుతోంది.
గృహ ఋణాలు, సూక్ష్మ ఋణాలే కాదు, మరికొన్ని దోపిడి ప్రత్యామ్నాయాలు కూడా ప్రయోగించారు.

ఒక దశాబ్దం కాలం లోపున…ఐటీ ఉద్యోగులకి జేబులు పట్టనన్ని జీతాలొస్తున్నాయంటూ హోరెత్తించబడింది. దరిమిలా ఐదు లక్షల ఖరీదున్న ప్లాట్లు కూడా పాతిక లక్షలై కూర్చున్నాయి. అధిక మొత్తంలో జీతాలున్నాయి, ఋణ సౌకర్యాలు సులభంగా లభిస్తున్నాయి గనుక… తమ కార్యాలయాలకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంలో అందరూ ఒకే ప్రాంతంలో ప్లాట్ల కోసం ఎగబడేసరికి (అలాగని ప్రచారం చేసారు మరి. అందులో నిజమెంతో?) గిరాకీ ఎక్కువై, 5 లక్షల ప్లాట్లు కాస్తా పాతిక లక్షల పలికాయని హొరెత్తించబడింది.

ఎటూ ‘కామమ్మ మొగుడంటే కామోసను కోవాల్సిందే’ గనక నిజమేననుకున్నాం.

తీరా మాంద్యం దెబ్బకో, మరొకందుకో… ఉద్యోగాలు ‘హుష్ ఫటక్’ అనే సరికి అప్పు భారమై, ఫ్లాట్లు గుండె పోట్లై కూర్చున్నాయి.

పరిశీలించి చూస్తే… ఐటీ ఉద్యోగులు… తిండీ నిద్రలు మాని, భార్యాపిల్లల ముఖాలు చూడటం కూడా కుదించుకుని, 5 లక్షల ప్లాట్లని పాతిక లక్షలకి కొనేందుకు కష్టపడినట్లుంది. ఈ చేత్తో సంపాదించామని పించుకున్నదాన్ని, ఆ చేత్తో ‘సమర్పయామి’ అనటమే కదా? 5 రెట్లు ఎక్కువ విలువకి వస్తువుని కొనటం అంటే దోపిడియే కదా? వెరసి ఎవరి కోసం అహరహమూ మేధస్సు వెచ్చించి శ్రమించినట్లు?

ఇది ‘క్లాస్ దోపిడి’ అన్నమాట!

ఇక మాస్ దోపిడి ఎలాంటి దంటే… నిత్యావసరాల సరుకులు (పప్పూ బియ్యం దగ్గర్నుండీ ఉప్పూ ఉల్లిపాయా చింతపండు దాకా) సిమెంటు ఇనుము వంటి కొంప కట్టుకునే వస్తువులూ, పెట్రోలు వంటి ఇంధనాలు… అన్నిటి ధరలూ సిండికేట్ అయ్యి అంతకంతకూ పెంచేసి చేస్తున్న దోపిడి!

రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, తిండి గింజల వ్యాపారంలోనూ సిమెంట్ వంటి ఉత్పత్తి సంస్థల వ్యాపారంలోనూ ధరల పెరుగుదలని చూసీ చూడనట్లు ఊరుకుంటూ, నియంత్రించకుండా, తెర వెనక మద్దతు ఇస్తూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడి నుండి, రాజకీయ ఏజంట్ల ద్వారా… నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులకి వాటాలు వెళ్ళిపోతాయి.

అందుకే విజిలెన్స్ దాడులుండవు, బ్లాక్ మార్కెట్ కంట్రోలు ఉండదు. సరికదా… సైకిల్ మీద బియ్యపు మూట వేసుకుని ప్రక్క ఊర్లో అమ్ముకొచ్చినంత సులభంగా… రేవుల ద్వారా ‘అనధికారికంగా’ ఎగుమతులు జరిగిపోతాయి. అది బియ్యమైనా, ముడి ఖనిజాలైనా, మరేదైనా! అన్నిటిలోనూ వాటాలు వస్తాయి.

ఆ డబ్బంతా కూడా ప్రస్తుతం వినియోగింపబడుతుంది షేర్ మార్కెట్ ని నిలబెట్టుకోవటానికే!

ఎందుకంటే కంపెనీలు కూలితే.. సామంతులు కూలితే కుప్పకూలిపోయే చక్రవర్తిలాగా… స్తంభాలు కూలిపోతే కుప్పకూలిపోయే భవనం లాగా… నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ కుప్పకూలిపోతుంది మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ప్రజలు ఏ వినిమయ వస్తువుల నైనా… కొనడానికి గానీ, ప్రదర్శనలని తిలకించడానికి గానీ (ప్రదర్శనలకి రుసుముల వంటి వ్యాపార ఇంద్రజాలలు కూడా దోపిడి మాయలో ఓ భాగం మరి!) ఇతరత్రా ఏ లావాదేవీలకి గానీ… స్పందించలేదనుకొండి. అప్పుడేమౌతుంది? ఏ అవసరం రీత్యానైనా… ఒక వేళ ఏ ధనికుడైనా… తన హారాన్నో, ఇంటినో అమ్మాలనుకుంటే… కొనే వాడేవడూ రాడు. తోటి ధనికులదీ తన స్థితే కదా!? స్థిరాస్థులు కదలని స్థితి!

కాగితం మీద దాని ఖరీదు లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. కాని విక్రయం జరిగితే కదా, అది ధనమై చేతిలోకి వచ్చేందుకు? ఇతరత్రా ఉపయోగ పడేందుకు?

చెప్పుకోవడానికి ఉండాల్సిందే… ‘ఫలానా వారి దగ్గర లక్షల ఖరీదు చేసే ఇన్ని హారాలున్నాయి, కోట్ల ఖరీదు చేసే ఇన్ని భవనాలున్నాయి!’ … అని! ఉపయోగ పడేది మాత్రం శూన్యం. రియల్ ఎస్టేట్ బూమ్ డప్పయిపోయినప్పుడు ఏర్పడింది ఇలాంటి స్థితే! [అలా ‘స్టక్’ అయిపోయిన భూ వ్యాపారానికి తిరిగి ప్రాణం పోసేందుకే… ‘తెలంగాణా ఉద్యమం’ పేరిట… విజయ వాడ వంటి కోస్తా, సీమ నగరాలలో భూముల విలువలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వేర్పాటు ఉద్యమంలో ఇదో కోణం.]

వినిమయంలోకి రానిది, విలువ ఎంతని చెప్పబడినా… విలువలేని వస్తువే అవుతుంది. అది కెంపుల హారమైనా, భవనాలైనా! అవసరమైనప్పుడు ధన రూపంలోకి బదలాయింపబడితేనే, సంపదకి విలువ! ధన రూపం గాకపోతే మరోరూపం! ఏ రూపమైనా సరే! పరస్పర మార్పిడితో ఇతర వస్తువుల్ని, సేవల్ని, సుఖాలని అందివ్వగల రూపం!
ఆ విధంగా బదలాయింపబడనప్పుడు అవి మణిమాణిక్యాలైనా చిల్లపెంకులతో సమానమే! బంగారు బిస్కట్లయినా కుక్క బిస్కట్లకి సమానమే!

ఈ స్థితి కొన్నేళ్ళుగా (దాదాపుగా దశాబ్దం పైగా) నెలకొంది. వ్యాపార రంగంలో, షేర్ మార్కెట్ లో, కార్పోరేట్ సంస్థల్లో! పైకి మేక పోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తోన్నారు. మరోప్రక్క నిభాయించుకో ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకుతున్నారు.

వ్యాపార లావాదేవీల్లో సామాన్యుల ప్రమేయం కనిష్ఠ స్థాయికి చేరిన స్థితికి పర్యవసానమే… అమెరికా లో గృహ ఋణాలకి, ఇండియాలో సూక్ష్మ ఋణాలకి దారి తీసింది.

మార్కెట్ లో డబ్బు సంక్రమణం (Rotate) కావాలి. లేకపోతే స్తంభించి పోతుంది. దాన్ని మందగమనం అన్నా, మాంద్యం అన్నా ఒకటే! ఆ మందగమనాన్ని తగ్గించటానికి, అమెరికాలో స్వంత ఇంటి ఋణాలు ఆశగా చూపబడ్డాయి, భారత్ లో సూక్ష్మ ఋణాలు ఇవ్వబడ్డాయి.

ఇందుకు కొన్ని దృష్టాంతాలు చూడండి. ఇటీవల ఆంధ్రజ్యోతిలో జాహ్నవి గారు ఓ వ్యాసం వ్రాసారు. అందులో నుండి కొన్ని విషయాలు క్రింద ఉటంకిస్తున్నాను.

>>> 31/10

మేధో మథనం

ఆహార్రాజకీయ భద్రత
-జాహ్నవి

>>>ఆహార భద్రత పథకం ద్వారా ప్రభుత్వం పండించిన పంటంతా లెవీ, కంట్రోళ్ల రూపంలో ఎఫ్‌సిఐ ద్వారా లాక్కుంటుంది. ఉచితంగా ప్రజల్లోని అత్యధిక శాతానికి పంచిపెడుతుంది. అలా పంచిపెట్టిన తిండిగింజలు తిన్నవాళ్లు తమ కు ఓట్లేయకపోతారా? యువరాజు పట్టాభిషిక్తుడు కాకపోతాడా? ఇది ఆహారభద్రత కాదు.


>>>ఒకటి రెండు సంవత్సరాలు ఇప్పుడున్న అధిక నిల్వలతో, పన్నుల డబ్బు తో, రుణాలతో నడిపిస్తారు. ఈ లోపల ఎన్నికలు, గెలుపు, పట్టాభిషే కం అయిపోతాయి. ఆహార భద్రత కల్పించడం పేరుతో పన్నులు పెంచుతారు. లోటుబడ్జెట్‌తో రూపాయలు ముద్రకొడతారు. దాంతో ద్రవ్యోల్బణం, అన్ని రేట్లూ పెరుగుతాయి. ధాన్యం రేట్లు పెరగాలి. ఖజానాలో డబ్బుకు కొరత. దాంతో తక్కువ రేట్లకే ఆహారధాన్యాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. రైతులు తీవ్రంగా నష్టపోతారు, వ్యతిరేకిస్తారు, ఆందోళనలు చేస్తారు.

ఆఖరుకు గిట్టుబాటుకాక ధాన్యం పండించడం తగ్గించేస్తారు. ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఎదురవుతుంది. అయినా సరే, ప్రభుత్వం తల్చుకుంటే చేయలేనిదేముంది? ఖర్చెంతయినా సరే, విదేశాల్నుంచి దిగుమతి చేసుకుంటారు. వ్యవసాయం కుంటుపడి కూలీలకు పనులు దొరకవు. పెరిగిన రేట్లతో పాటు కూలీల వేతనాలు పెరగవు. పనిచేయకుండానే కూలీ గ్యారం టీ పథకం, దాదాపు ఉచిత ఆహార పథకాలతో, కష్టించి పనిచేసే వాళ్లని హేళన చేసే పరిస్థితి వస్తుంది.

ఈ లోపల వ్యాపారుల్ని, మిల్లర్లను, విదేశీ శక్తుల్ని, మావోయిజం, టెర్రరిజాల్ని నిందిస్తూ అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మరలుస్తారు. యువరాజు పాలనలో స్థిరపడే దాకా మడమ తిప్పరు, వెన్నుచూప రు. వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిన తర్వాత మెల్లగా పంపిణీ చేసే ఆహారధాన్యాల రేట్లు పెంచవలసి వచ్చినప్పుడు ఎవరు పాలిస్తారో, వాళ్లని బ్రతికినన్నాళ్ళూ రాజకీయంగా నిందించొచ్చు. ఏది ఏమైనా ఒకసారి తీవ్రం గా గాడి తప్పిన వ్యవస్థ మళ్లీ కుదురుకోవడం చాలా కష్టం.

అయితేనేం? గొప్పగొప్ప ఆర్థిక వేత్తలు ప్రధానమంత్రులయితేనేం? ఉచితాలు,సబ్సిడీలు పేదరికాన్ని తగ్గించవనీ, పెంచుతాయ ని ఎన్నో సార్లు నిరూపితమయితేనేం? ఇదే దారిలో ఇంతకు ముం దు ప్రయాణించి ఎదురు దెబ్బలు తింటేనేం? రాజ కుటుంబంలో తరం మార్పుసందర్భంగా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు అవసరం మరి! దేశం ఎటుపోతేనేం? ప్రజలేమయిపోతేనేం? ఆర్థిక వ్యవస్థా? ఎవరమె? రాజకీ వ్యవస్థ ఇంట్లో పని మనిషి కాదూ?!

-జాహ్నవి

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/oct/31/edit/31edit3&more=2010/oct/31/edit/editpagemain1&date=10/31/2010
~~~~~~~~
దీన్నే మరో కోణం నుండి విశ్లేషిస్తూ పి. ప్రసాద్ గారు ఈ విధంగా వివరించారు.
>>> 16/11

కార్పొరేట్ ఆలోచనే 'ఆహార భద్రత'
-పి. ప్రసాదు

'ఆహార్రాజకీయ భద్రత' శీర్షికతో జాహ్నవి రాసిన వ్యాసంలో విషయం కుడి ఎడమైపోయింది. 'ఆర్థిక వ్యవస్థా? ఎవరామే? రాజకీయ వ్యవస్థ ఇంట్లో పని మని షి కాదూ'? అనే ప్రశ్నతో జాహ్నవి తన వ్యాసాన్ని ముగించారు.

ఈ ప్రశ్న వేసి పాఠకులతో తాను చెప్పించదలుచుకున్నదీ లేదా తానే పరోక్షంగా చెప్పదలుచుకున్నదీ 'ఔను మరి, మన రాజకీయ వ్యవస్థ చెప్పుచేతుల్లో మన ఆర్థిక వ్యవస్థ బానిసరాలిగా వుంది కదా!' అనే జవాబునే ఎవరు గద్దెనెక్కాలో, ఎవరు ఎక్కకూడదో గద్దెనెక్కినోళ్లు ఏ రాజకీయ విధానాలను అవలంబించాలో స్టాక్‌మార్కెట్ ఉత్థానపతనాల సంకేతా ల ద్వారా ఆదేశిస్తున్న మన ఆర్థిక వ్యవస్థను ఓ ఆటబొమ్మగానో, ఓ కీలు బొమ్మగానో పరిగణించడం ఓ సాహసమే మరి'! ప్రభుత్వాలకు రాజకీయ దిశానిర్దేశనం చేస్తున్న బడా కార్పొరేటు వ్యవస్థను రాజకీయ వ్యవస్థ ఇంట్లో పని మనిషిగా వర్ణించడం జాహ్నవికే సాధ్యమైంది.

నేటి కుళ్లు రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా, తెలివిగా వినియోగించుకున్నారు. రాజకీయ వ్యవస్థను తూర్పారాపట్టిన జాహ్నవి ప్రతిభ అద్భుతంగానే ఉంది. అయితే లాజిక్కు ఎక్కడుందంటే దాని అస్తవ్యస్థతలన్నింటికి మూల కారణమైన ఆర్థిక వ్యవస్థను 'రాజకీయ బాధితురాలి'గా చిత్రించడంలోనే ఉంది. చీము, రసిలతో ఒంటి మీద కంటికి కనిపించే పుండును అద్భుతవర్ణనలతో తూర్పారపట్టారు.

కానీ అందుకు కారణమైన లోపాలున్న వ్యాధిగ్రస్థ క్రిమికారకాల జోలికి వెళ్లలేదు. పైగా వాటికి శస్త్ర చికిత్సేతర తాత్కాలిక మందు బిళ్లలు సౌతం అక్క ర లేదంటున్నారు. కనీసం పెయిన్ కిల్లర్‌లను కూడా వాడనివ్వకుండా చేసి, శరీరంలోని రోగ క్రిములు మరింత రెచ్చిపోవడానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలుండాలని జాహ్నవి చెప్పదలిచారు.

జాహ్నవి దృష్టిలో 'ఆహార భద్రత అనేది దాదాపు ఉచిత ఆహార పథకం'గా మారుతుందనేదే! దానివల్ల 'కష్టించి పనిచేసే వాళ్లని హేళనచేసే పరిస్థితి వస్తుందన్న'దే! అలాగే ఉపాధి హామీ పథకమంటే కూడా 'పని చేయకుండానే కూలీ గ్యారంటీ పథకం'గా మారుతుందనేదే! ఫలానా పరిస్థితులలో ఇలా దారితీస్తుందని చెబుతున్నా తన వైఖరి మాత్రం సుస్పష్టమే!

ఈ తాత్కాలిక ఉపశమనమిచ్చే పరిమి త సంక్షేమ చర్యలమీద తన అక్కసును వెళ్లగక్కారు. వాటిని సోషలిస్టు పథకాలుగా వర్ణించి, అమలు చేస్తున్నవి సోషలిస్టు పథకాలుగా నామకరణం చేశారు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయి దేశాభివృద్ధి నాశనమవుతుందని చెప్పదలిచారు.

నిజానికి మొన్నటి పాత 'పనికి ఆహార పథకమూ', నేటి కొత్త 'ఆహార భద్రతా పథకమూ' బడా కార్పొరేటు ఆర్థిక వ్యవస్థ బుర్రలో పుట్టిన పథకాలే! ఇవేవీ సోషలి స్టు లేదా సోషలిస్టు తరహా భావాల నుంచి పుట్టినవి కావు. 'పెట్టుబడిదార్ల కోసం, పెట్టుబడిదార్ల చేత, పెట్టుబడిదార్ల యొక్క' పథకాలివి. విస్తృతమైన మన గ్రామీణ వ్యవస్థను కార్పొరేటు వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థ అనుసంధానం చేసే ప్రణాళిక లో భాగంగా రూపొందిన పథకాలివి.

దాని మార్కెట్ విస్తరణలో భాగంగా అది సూచిస్తున్న ఇలాంటి పథకాలకోసం మాత్రం కొన్ని వేలకోట్లను మాత్రమే వెచ్చిస్తున్నది. ఈ నగ్న సత్యాలను జాహ్నవి గుర్తించనంత మాత్రాన అవి సత్యాలు కాకుండా బోవు. సంక్షోభం తర్వాత బడా కార్పొరేటు కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై దృష్టిని కేంద్రీకరించాయి. నిపుణుల బృందాలతో సర్వేలు చేయించాయి.

అంతకుముందున్న పనికి ఆహార పథకం తమను సంక్షోభం నుంచి కాపాడిందని నిర్ధారించుకున్నాయి. దానివల్ల గ్రామీణ ప్రజల చేతికి అందిన సొమ్ముతో సాగించిన అదనపు కొనుగోళ్లు కష్టకాలంలో తమకు ఒకింత చేయూతనిచ్చినట్టు కార్పొరేటు కంపెనీలు గుర్తించా యి. ఆ స్ఫూర్తితో అలాంటి మరికొన్ని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశాయి. అందులో భాగమే తాజా ఆహార భద్రత.

పట్టణ మధ్య తరగతి కుటుంబం తమ ఆదాయంలో 20-30 శాతం సొమ్మునే ఆహారావసరాలకు ఖర్చు చేస్తున్నది. మిగిలిందే ఆహారేతర వస్తు సామాగ్రికి, ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నది. కానీ కోట్లాది గ్రామీణ పేదలు తమ అల్ప రాబడిలో సగానికిపైగా ఆహారావసరాలకే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల విషయంలో ఉపాధి హామీ సొమ్ములో తొంభై శాతం ఆహారావసరాలకే మళ్లించబడుతున్నదని అవి నిర్ధారించాయి.

గ్రామీణ పేదల ఆహార బడ్జెట్ వ్యయాన్ని తగ్గిస్తే తప్ప తమకు తగినంత లాభం చేకూరదని కూడా అవి గుర్తించాయి. అందుకే తమ ఇంట్లో మనిషి వంటి రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజాధనంతో తక్కువ ధరలకు పేద ప్రజల ఆహారావసరాలను తీర్చదలిచింది. తద్వారా వారి డబ్బును ఆహారేతర ఖాతాలోకి మళ్ళించి పథకం పన్నింది. జాహ్నవి గుర్తించినా, గుర్తించకపోయినా పచ్చినిజమది.

ఐ.ఎం.ఎఫ్ మానసపుత్రుణ్ని ప్రధానిని చేయడానికి కార్పొరేట్ వ్యవస్థ స్టాక్ మార్కెట్ ద్వారా దేశంలో రాజకీయ ప్రకంపనాన్ని సృష్టించగలిగింది. 'ఫండ్-బ్యాంకు' మేథోత్రయం (మన్మోహన్, చిదంబరం, అహ్లువాలియా) ద్వారా రాజకీయ వ్యవస్థను శాసించగలుగుతున్నది. గ్రీన్‌హంట్, కోస్టల్ కారిడార్, సెజ్‌ల ద్వారా లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొట్టగలుగుతున్నది. సంక్షోభం నుంచి రక్షణ పేరిట ఐదారు లక్షల కోట్లాది రూపాయల పన్నురాయితీలను పొందగలిగింది.

అణు ఒప్పం దం పేరుతో లక్షల కోట్ల లాభాలు గడించగల వాణిజ్య అవకాశాలను పొందగలిగిం ది. వీటి కోసం మన రాజకీయ వ్యవస్థను ఇంట్లో పని మనిషిగా వాడుకోగలుగుతున్నది. అంతటి బ్రహ్మాండమైన శక్తి సామర్థ్యాలు గల ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయిన బానిసరాలిగా జాహ్నవి సూత్రీకరించారు. ఇది పొరపాటు చిత్రీకరణలో, ఉద్దేశపూర్వక వక్రీకరణలో పాఠకులే నిర్ణయించుకోవాలి.

ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దేశ సంపదనంతా యథేచ్ఛగా కొల్లగొడుతున్నా, రాజకీయ వ్యవస్థను ఆటబొమ్మగా వాడుకుంటున్నా జాహ్నవికి అదో బానిసరాలిగా కనిపిస్తుం ది. రైతాంగానికి న్యాయంగా రావాల్సిన డబ్బును కబళిస్తున్నా జాహ్నవికి కోపం రాదు.

కానీ తన లాభాల కోసం పేదలకు అది విసిరేయించిన పట్టెడుమెతుకుల్లో మాత్రం 'సోషలిస్టు' ప్రమాదాన్ని చూస్తున్నారు. తల వంటి ఆర్థిక వ్యవస్థను తోకగా చూపించారు. తోకవంటి రాజకీయ వ్యవస్థను తలగా చిత్రించారు. తోకను తల ఆడిస్తుందన్న భౌతిక సత్యాన్ని తిరగేసి పాఠకుల ఎదుట జాహ్నవి ఆవిష్కరించజూశారు. దానిని తలకిందులు చేసి చూస్తే సరిపోతుంది.

-పి. ప్రసాదు
సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/16/edit/16edit3&more=2010/nov/16/edit/editpagemain1&date=11/16/2010
~~~~~~~~

వెరసి డబ్బు సంక్రమణం (Rotate) అయ్యి, కంపెనీలు నిలబడాలి. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయ ఉపాధి పధకం, xyz పధకం పేరుతో పందారం చేస్తుంది. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పధకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించింది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి! ఆ రూపంగా ఓ ప్రక్క ఓట్లు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేట్ కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింప చేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగా లేదా లంచాలుగా రాబట్టు కుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి వర్తులం Robery cycle).

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నిజానికి ‘బంగారు బిందెలు బోర్లా వేయబడి, వాటిల్లోని చిల్ల పెంకులు ప్రదర్శింపబడటం’తో… బిందెల్లో మణిమాణిక్యాలే ఉన్నాయనుకొని మోసపోయే వారి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు షేర్లతో సహా, చాలా ఆర్ధిక లావాదేవీల్లో పెట్టుబడుల ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు ధనానికి కటకట తయారౌతుంది. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ‘ఆర్ధిక మాంద్యం’తో సహా!

నిజానికి…అమెరికాలో 2001 సెప్టెంబరులో WTC జంట భవనాలపై ముస్లిం తీవ్రవాదుల దాడి తర్వాత ఆర్ధిక మాంద్యం ప్రారంభమైనా, 2008 సెప్టెంబరు దాకా… అది బాగా తీవ్రదశకు చేరేవరకూ, దాని గురించి బయటికి పొక్కకుండా నిభాయించుకున్నారు.

2008 సెప్టెంబరులో ఆర్ధిక మాంద్యానికి పైకారణం (over leaf reason) గా స్వంత ఇంటి ఋణాలు కొకొల్లలుగా ఇవ్వటంతో ‘పొలో’మని పుచ్చుకున్న ఋణగ్రహీతలు కాస్తా… ఋణ వాయిదాలు కట్టలేక ‘ఛలో’మని ఇళ్ళు వదిలేసుకు పోయారనీ, దాంతో ఆర్ధిక సంస్థలు బ్యాంకులు దివాళా తీసాయనీ చెప్పారు.

ఋణ గ్రహీతలు ఋణ వాయిదాలు తిరిగి చెల్లించగలరో లేదో గమనించుకోకుండా… ఆర్ధిక సంస్థలూ, బ్యాంకులూ ఋణాలెందుకు ఇచ్చినట్లు? ‘ఇస్తామంటే చచ్చేవాడూ లేచొస్తాడని’ సామెత! కాబట్టి లోన్ ఇస్తామంటే పోలోమని చాలామంది పుచ్చుకుని ఉండొచ్చు గాక! ఇచ్చేవారు భద్రత చూసుకుంటారు కదా? మరి అవేవీ పట్టించుకోకుండా… బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఎందుకు, ఎలా ఋణాలు ఇచ్చినట్లు?

‘చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?’ అంటే – ‘గడ్డిమోపు అడ్డం వచ్చింది’ అనే ‘రాజు గారి ఏడుగురు కొడుకుల కథ’లోలా… పై ప్రశ్నకు, రాజకీయ కారణాలు చెబుతారు. ఎన్నికల వాగ్ధానాలుగా స్వంత ఇంటి పధకాలు ప్రకటించారనీ, కాబట్టి ఋణ వితరణలకు పరిస్థితులు దారి తీసాయనీ!

ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందేమోననే కనీస జాగ్రత్త లేకుండా రాజకీయ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చినట్లు? ఈ స్థితి మొన్న తమిళనాడులో ప్రతీ ఇంటికీ ఓ కలర్ టీవీ, నిన్న మన రాష్ట్రంలో నగదు బదిలీ పధకం, బీహార్ లో యువకులకు మోటార్ సైకిల్ వంటి పధకాలలో కూడా చూశాము. అసలు రాజకీయ పరిస్థితులు ఇంతగా ‘గండం గడిచి గట్టెక్కితే చాలు! అందుకోసం ఎంతకైనా తెగిస్తాం!!’ అనే స్థితికి ఎందుకు చేరినట్లు?

ఈ ప్రశ్నలకు జవాబులు పరిశీలించే నేపధ్యంలో… మీకు ఓ చిన్న కథ చెబుతాను.

ఇది నాకు గుర్తుండి, సోమర్ సెట్ మామ్ వ్రాసిన కథ! ఇంటర్ పిల్లలకి ఓ దశలో పాఠ్యాంశంగా ఉన్న కథ!

అందులో… జర్మన్ వంటి ఒక యూరప్ దేశంలో ఓ నగరం ఉంటుంది. అక్కడ అన్ని వ్యాపార సంస్థలూ, బార్లూ, హోటళ్ళు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. రకరకాల వృత్తుల వాళ్ళున్నారు. ఫ్యాక్టరీల యజమానులు, ఉద్యోగులు, కార్మికులు…ఎందరో!

అయితే, ఆ ఊరు సర్వ సమృద్ధంగా ఉంది. కొన్నాళ్ళు గడిచేసరికి ఆ ఊళ్ళో అందరికీ అన్ని వినిమయ వస్తువులూ సమకూరాయి. టీవీ, ఫ్రిజ్జ్ వగైరాలు ఇంటింటికీ, కొండకచో గది గదికీ అన్నట్లుగా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఇంటి కో కారు గాక, ఇంట్లో ఉన్న ప్రతీ వ్యక్తికీ ఒకో కారు చొప్పున లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

దాంతో తిండి పదార్ధాలు, ఇంధనాలూ, దుస్తులూ, చెప్పుల వంటి యాక్సెసరీస్ తప్ప, వేరేవీ ఎవరూ కొనుగోలు చేయటం లేదు. దాంతో ఊళ్ళోని ఫ్యాక్టరీలకి ఆర్డర్లు లేవు. దాంతో మిగిలిన దుకాణాలకీ గిరాకీ లేదు. ఎంత తిన్నా… కేవలం తిండీ బట్టా ఖరీదు ఎక్కువ ఉండదు. దాని టర్నోవర్ కూడా నగర పరిమాణపు రాశులతో పోల్చితే చాలా తక్కువ.

దాంతో ఓ స్తబ్ధత ఏర్పడింది. కార్మికులకి పని లేదు. దాంతో ఉద్యోగులకీ పనిలేదు. యాజమాన్యాలకి వ్యాపారం లేదు. ఊరు ఊరంతా… ఓ నిశ్శబ్దం, నిస్తేజం, నీరసం!

ఈ స్థితినంతా గమనించిన ఒక యువకుడు తీవ్రంగా ఆలోచిస్తాడు. ఓ పరిష్కారం కనుగొంటాడు. ఆ ప్రకారం ఆ నగరంలోని రోల్స్ రాయిల్స్ కారు షోరూంని దర్శించి, ఓ కారుకు ఆర్డరు ఇస్తాడు. ఆ దుకాణం ఒక్కసారిగా చైతన్యవంత
మవుతుంది.

అది ఆ ఆర్డరుని కార్ల తయారీ ఫ్యాక్టరీకి పంపుతుంది. ఫ్యాక్టరీ చైతన్యవంతం అవుతుంది. అక్కడి నుండి బ్యాంకు, ఫ్యాక్టరీకి ముడి వస్తువులు, కారు ఉత్పత్తి కవసరమయ్యే చిన్న వస్తువులను తయారు చేసే సంస్థలు…అలా అలా… ఆ చైతన్యం అందరికీ పాకుతుంది. ఒక్క ఆర్డరుతో ‘ఇక మరెన్నో ఆర్డర్లు వస్తాయన్న ఆశ, అంచనాలు’ మొదతౌతాయి.

కొద్ది రోజులలో ఆ నగరంలో చెప్పరానంత చైతన్యం, సందడి నెలకొంటాయి – ఇదీ కథ.

ఈ కథనే కొద్దిగా మార్చి చెప్పుకోవచ్చు.


ఎలాగంటే …

ఒక ఊరిలో అన్ని వృత్తుల వాళ్ళూ, వ్యాపారులు, ఫ్యాక్టరీలు… అన్నీ ఉన్నాయను కుందాం. అయితే, దోపిడి ఎక్కువ అయ్యీ, అయ్యీ… పేదలు నిరుపేదలై, మధ్య తరగతి వారు పేదలై, ఎగువ మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతికి దిగజారి పోయారను కొండి.

దోపిడితో పోగైన సంపద, కొంతమంది దగ్గర పోగుపడుతుంది. వాళ్ళ దగ్గర అన్ని వినిమయ వస్తువులూ, బంగారు ప్లాటినం ఆభరణాలు, పేజ్ 3 పార్టీలు సమకూరాయి. ఇక మధ్యతరగతి, పేదలు, నిరుపేదల దగ్గర ‘తిండి గడిస్తే చాలు’ అనే స్థితి వచ్చేసింది. ‘ఏదో, సర్ధుకు పోదాం’ అనే ధోరణీ వచ్చేసింది.

దాంతో… తిండి, బట్టా తప్ప ఇతర కొనుగోళ్ళు లేవు. వ్యాపారాలూ లేవు. ఊరిలో నిస్తేజం, నీరసం, నిశ్శబ్దం! రోల్స్ రాయిల్స్ కు ఆర్డరిచ్చే యువకులెవరూ లేరు. అప్పుడేమౌతుంది?

చైతన్యం రాదు, మాంద్యం వస్తుంది, అదే వచ్చింది.

ఈ స్థితిని కప్పిపుచ్చేందుకు ‘ప్రజల కోనుగోలు శక్తి తగ్గిపోయిందని’ కొన్నాళ్ళు, ‘లేదు విపరీతంగా పెరిగిపోయిందని’ కొన్నాళ్ళు ప్రచారాలు నిర్వహించారు. వెరసి నిజం బయటకు రానివ్వకూడదనే పెనుగులాటే అది!

[దృష్టాంతం చూడాలంటే – కార్పోరేట్ కంపెనీలు తమ వ్యాపారం, నిత్యం బాగా ఉండటం కోసం, ప్రతి వస్తువూ మనం ఎంత జాగ్రత్తగా వాడిన సరే… దాని లైఫ్ ఇన్ని సంవత్సరాలే అని చెప్పబడుతుంది, అలాగే పనిచేస్తుతుంది. ఒకప్పుడు ఫ్రిజ్జ్ ల వంటి వస్తువులు కూడా 20 సంవత్సరాలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడో 8 సంవత్సరాలు పనిచేస్తే షాపు వాళ్ళే అంటున్నారు “అబ్బా! చాలా బాగా పని చేసిందండి!” అని ! ఇలా ప్రతి వస్తువు మోడల్ క్రేజ్ కోసమైనా వస్తువులు మార్చాలి, లేదా వాళ్ళు నిర్ధేశించినట్లు అవి పనిచేసినన్నాళ్ళు మాత్రమే వాడుకొని, తరువాత కొత్తవి కొనుక్కోవాలి. ఆ విధంగా ప్రక్కా ప్రణాళికతో తమ వ్యాపారం కోసం మన జీవితాలను, మన జేబును నిర్ధేశిస్తున్నారు.]

మరో ఉదాహరణ చెప్పాలంటే… ఓ ఊరిలో ఓ పదిమంది ధనికులున్నారనుకొండి. పదివేల మంది సామాన్యులూ పేదలూ ఉన్నారు. అన్నం పప్పూ ఉంటే చాలనుకునే స్థితి వీరిది, కెంపులహారాలు, ఇంపైన భవనాలూ ఉన్న స్థితి వారిది. సరే! ధనికుల సంపదని కీర్తించే పత్రికల వాళ్ళూ, టీవీల వాళ్ళూ భట్రాజుల రూపంలో ఉన్నారనుకొండి. (ఈనాటి మీడియాకి పూర్వరూపం భట్రాజులే కదా! రాజు లేదా భాగ్యవంతుల్ని, జీతం పుచ్చుకుని కీర్తించటం నాటి భట్రాజుల పని!)

ఆ భట్రాజుల పుణ్యామాని, ధనికుల దగ్గర ఉన్న కెంపుల హారాలు ఒక్కొక్కటి లక్ష వరహాలని, ఇంపైన భవనాలు కోటి వరహాలని ధరలు చెప్పబడ్డాయి. ఆ ధరలు అంతకంతకూ పెంచి వేయబడ్డాయి. అయితే అప్పటికే… శ్రమ దోపిడి, వ్యాపార దగాలకి గురై, పీల్చి పిప్పి చేయబడ్డ పేదల, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.
ఆర్ధిక ఇరుకు పెరిగే సరికి, అనివార్యంగా జ్ఞాన నేత్రం కొంత తెరుచుకుంటుంది కదా!? దాంతో, భట్రాజులు/మీడియా ప్రశంసలు నమ్మి ‘అర్ధరూపాయి సరుకుని అయిదు రూపాయలకి’ అమ్మడాన్ని కొంత స్పృహతోనే పసిగట్టగలిగారనుకొండి. అప్పుడు కెంపుల హారాలకి, ఇంపైన ఇళ్ళకీ… అసలు విలువ కంటే చాలా రెట్లు పెంచి ధరలు చెప్పబడ్డాయని పసిగడతారు కదా!?

అప్పుడు సహజంగానే కొనడానికి గానీ, ప్రదర్శనలని తిలకించడానికి గానీ (ప్రదర్శనలకి రుసుముల వంటి వ్యాపార ఇంద్రజాలలు కూడా దోపిడి మాయలో ఓ భాగం మరి!) ఇతరత్రా ఏ లావాదేవీలకి గానీ… స్పందించలేదనుకొండి. అప్పుడేమౌతుంది? ఏ అవసరం రీత్యానైనా… ఒక వేళ ఏ ధనికుడైనా… తన హారాన్నో, ఇంటినో అమ్మాలనుకుంటే… కొనే వాడేవడూ రాడు. తోటి ధనికులదీ తన స్థితే కదా!? స్థిరాస్థులు కదలని స్థితి!

కాగితం మీద దాని ఖరీదు లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. కాని విక్రయం జరిగితే కదా, అది ధనమై చేతిలోకి వచ్చేందుకు? ఇతరత్రా ఉపయోగ పడేందుకు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

రెండు మూడు రోజుల క్రితం, మిత్రులొకరు ఓ సమాచారం పంపించారు. ఎందుకోసమో సెర్చ్ చేస్తుంటే… ఓ ఉర్దూ పత్రికలో టపాకు స్పందనగా వ్రాయబడిన వ్యాఖ్య అది. దిగువ పొందుపరుస్తున్నాను.

Sonia was born in1944 in Luciana in Italy as per her birth certificate submitted to our Government earlier. Her father Stefano Maino a Nazi was in a Russian prison from 1942 to 1945. Sonia's marriage time it was reported that Rajeev and Sonia were of the same age. Thus Sonia should have been an illegitimate child. So a new birth date of 1946 was created and the place of birth became Orbassano in Italy and the name became Sonia which is uncommon in Italy. In 1966 she was working in London for an ISI operative Salman Thassir. KGB's deposit of US $2 billion in a Swiss bank account in 1985 in the "minor" account of Rahul Gandhi managed by his mother Antonia Maino alias Sonia Gandhi as per .Schweitzer Illustrierte, a Swiss magazine. Archives of the KGB made public has a letter showing regular payment of commission by KGB to Ms.Sonia Gandhi and the Maino family in Italy. When Sonia came to power, Russia called back its Ambassador and posted an ex KGB chief in New Delhi of 1970s as the new ambassador. India made urgent payment to Russia without price negotiation for our contracts.. Italy wanted India to close case on Quattrocchi in 2003 Sonia marrying Rajiv is not a simple boy meets the girl thing, but could be a planned operation by the Vatican. Sonia was groomed and presented in front of Rajiv Gandhi by KGB, to hook Rajiv which was successful. Subsequently Rajiv marries Sonia. .

Edvige Antonia Albina Maino alias Sonia Gandhi was planted in India in Nehru family, for christian conversion work, and to convert Indians to christianity.by archbishop of Rome Paul Marcinkus,who was in to drug running money laundering and murder. Marcinkus who planted Sonia in India was involved in Latin American banks controlled by Sicilian Mafia lord 'the Shark'. Sindona In 1986, when Marcinkus could not set foot in Italy or USA for fear of arrest, Marcinkus was received at 10 Janpath by Sonia Gandhi. The Shark' Sindona, was an advisor to the Vatican and a personal friend of Pope Paul VI, died in an Italian prison, by poisoning, when he said that he will reveal the details of the Vatican planting of Sonia in India. Sonia had smuggled some Rs 10000 crore worth of Indian antique to Italy. Cases registered in TN for smuggling, without naming Sonia. Rupika Chawla helped Sonia to get antique.This helped Chawla to become the Chief Election Commissioner of India. Antique smuggling and money laundering by Sonia with LTTE help was going on since 1984. Boyfriend Quattrocchi, wanted in Bofors, was buying arms from Phuket, Thailand for LTTE. Rajiv killing by LTTE was funded by Quattrocchi and the French intelligence has the evidence bit.ly/254ben, bit.ly/8KLYN , bit.ly/13VS1N,
bit.ly/3C0agf, bit.ly/txg1J, bit.ly/Olsr9, bit.ly/QuLAA, bit.ly/E4ViT, bit.ly/4wARdD, bit.ly/1ydfg9, bit.ly/3ZjC3G, bit.ly/aIfVtZ, bit.ly/9ZjSyC, bit.ly/a5aems, bit.ly/a4fOnR,

అయితే పై వ్యాఖ్యలో చివరిలో సదరు వ్యాఖ్యాత కొన్ని డాక్యుమెంట్లు [ఫ్రాన్స్ ఇంటలిజెన్స్ ఎవిడెన్స్] వంటి వాటిని ఉటంకించాడు. మొత్తంగా ఈ విషయమై లేదా అలాంటి విషయాల గురించి, ఎవరి దగ్గరైన మరింత సమాచారం ఉంటే చెప్పవలసిందిగా కోరుతూ ఈ టపా వ్రాసాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~

బంపర్ ఆఫర్ సినిమాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూర్యప్రకాశ్ (సాయాజీ షిండే) లాగే... ఆయా దేశాలలో కార్పోరేట్ కంపెనీలు, రాజకీయులూ ప్రధాన ఏజంట్లుగా గల నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలు కూడా... అడ్డంగా సంపాయించిన సొమ్మే గానీ అదేమైనా న్యాయంగా సంపాదించిందా!? ఆయా దేశాల ప్రభుత్వాల్లో కీలక వ్యక్తుల సహాయంతో ప్రజాస్వామ్య బద్దంగా, అధికార యుక్తంగా చేసిన దోపిడియేగా! G-2, G-8 G-20, G-xyz లంటూ సమితులు పెట్టుకుని మరీ రచించే ప్రణాళికలూ అవే...! ‘ఏయే చట్టాలూ, స్ట్రాటజీలు అమలు చేసి, ప్రజల నుండి ఇంకా ఎంతగా శ్రమదోపిడి, వ్యాపార దోపిడి చేయగలమా’ అనే!

అలాంటి నేపధ్యంలో... చట్టాల్లోని లొసుగుల్నే ఉపయోగించి, నకిలీ కణిక వ్యవస్థనీ, వాళ్ళ అనుచర వ్యక్తులనీ... వాళ్ళ వేలితో వాళ్ళ కంటినే పొడిపించాలన్నా, వాళ్ళ కాగితపు సంపద వాళ్ళ చేతే దగ్ధం చేయించాలన్నా... జాతరబొమ్మలు/జంట పీతలతో, అది చాలా సుసాధ్యమైన పనే! కేవలం ఎవరికెవరు జాతరబొమ్మలో చూసుకొని, ఒకరి లొసుగుల గురించిన సమాచారం మరొకరికి ‘లీక్’ చేస్తే సరి!

పైకారణం ఏదైనా గానీ గాక ‘సాక్షి Vs. ఈనాడు’ల రూపంలో నడుస్తోందీ, కంపానీ నిధులు సూక్ష్మ ఋణాల్లో ఉన్నాయన్న దానితో బాటు రామోజీరావు లొసుగుల్ని సాక్షి బయటపెట్టటంలో వ్యక్తమౌతుందీ… అలాంటి అంశాలే!

కొన్నాళ్ళక్రితం అమర్ సింగ్ నీ, అమితాబ్ బచ్చన్ నీ వెంటేసుకుని తిరుగుతూ… అనిల్ అంబానీ, తన అన్న ముఖేష్ అంబానీ లెక్కల లొసుగుల్ని బయటపెట్టాడు. ‘తన మీద హత్యాప్రయత్నం సైతం జరుగుతోందని’ ఆరోపిస్తూ ‘తన ఉద్యోగి తన హెలికాప్టర్ ఆయిల్ ట్యాంకులో ఇసుక ఉండటాన్ని కనుగొనడంతో తాను పోలీసుకేసు నమోదు చేయించానని, ఆ ప్రయత్నం వెనక తన ప్రత్యర్ధి కంపెనీ ఉందనీ’ అన్నాడు.

తర్వాత ఏమైందో గానీ సదరు ఉద్యోగి రైలు పట్టాల మీద శవమై తేలటం, పోలీసులు దాన్ని మొదట ఆత్మహత్య అనీ, తర్వాత హత్య అనీ అనటం గురించి… గత టపాల్లో , టపాకాయల్లో ప్రస్తావించాను.

ఇక ముఖేష్ అంబానీ కూడా… అంతక్రితమే, తగురీతిలో స్పందిస్తూ… ‘తన తండ్రి బ్రతికి ఉన్నరోజుల్లో రాజకీయ నాయకుల్ని ‘మానేజ్’ చేసే పనుల్లో, లాబీయింగు నిర్వహించటం వంటి పనుల్లో, తన తమ్ముడు అనిల్ నిమగ్నమై ఉండే వాడన్నాడు’. ఆ మీదట తమ్ముడు అన్న పై పరువునష్టం దావా కూడా వేసాడు. ప్రస్తుతం అది కోర్టులో ఉందో లేక అన్నదమ్ములిద్దరూ రాజీపడినప్పుడు కేసు వాపసు తీసుకున్నారో తెలియదు.

అలా జాతర బొమ్మలు పరస్పరం కొట్టుకుంటాయన్నమాట!
మొదట చిన్న దెబ్బలు కావచ్చు గాక…
కొన్నాళ్ళు విషయాన్ని మాఫీ చేసుకునేందుకు, మూసిపెట్టుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చు గాక… అది పునరావృతం అయినప్పుడూ…
‘చంపు లేదా ఛస్తావ్’ అనేంత పరిస్థితి ఎదురుగా నిలిచినప్పుడూ…
ఏం చేస్తారు?

ఆ విధంగా ఇప్పుడు తెర వెనక మరుగుతున్న వ్యవహారాలు… ఇప్పుడు గుట్లు!
బయటపడినప్పుడు… అదే రచ్చ!
కాకపోతే బయటపడే లోపున నడిచే తతంగమే ఇప్పుడు నడుస్తోంది.
ఇక, ఇది షేర్ మార్కెట్ దాకా ఎలా ప్రయాణించిందో చెప్పేముందు, మరికొన్ని ఉదాహరణలు చెబుతాను.

గత టపాల్లో వ్రాసిన ‘చిల్లపెంకుల బిందె వ్యాపారం కోట్లాది రూపాయలు !’ కథని (http://ammaodi.blogspot.com/2010/10/29.html) మరోసారి ప్రస్తావిస్తాను.

ఆ కథలో బంగారు బిందెలో మణిమణిక్యాలున్నాయనుకొని అంతకంతకూ ఎక్కువ ధర పెట్టి కొంటారు. తీరా పరిపక్వ(మార్కెట్ కుప్పకూలినప్పుడు) సమయం వచ్చాక చూస్తే, అందులో నిండా చిల్లపెంకులు నింపి ఉంటాయి. అప్పటికి అది ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళ నెత్తికి ఆ నష్టమంతా చుట్టుకుంటుంది.

అదే కథని, ఈ ఉదాహరణ లోనూ ఉపయోగిస్తున్నాను. ఓ వందమంది వ్యక్తులు ఒక వృత్తాకార వలయం మీద నిలబడి ఉన్నారనుకొండి. ఓ పది బంగారు బిందెలు వాళ్ళ చేతుల్లో తిరుగుతున్నాయనుకొండి. బంగారు బిందెలు వరుసగా చేతులు మారుతున్నాయి.

ఓ ప్రక్కవారి చేతిలోంచి బిందెనందుకున్న వారు, మరో ప్రక్కనున్న వారికి అందిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణంలో శ్లాబు వేస్తున్నప్పుడు, కూలీల చేతుల్లో కాంక్రీటు కలిపిన బొచ్చెలు తిరుగుతాయి చూడండి, అలాగన్న మాట! నిజానికి ఆ బిందెలు చూడటానికి బంగారు బిందెల్లానే ఉన్నాయి. వృత్త పరిధిపై నిలబడి, బిందెల నందుకుని ప్రక్కవారి కందిస్తున్న ప్రతీ ఒక్కరూ, ఆ బిందెల్లో మణిమాణిక్యాలున్నాయని శ్లాఘిస్తున్నారు.

బిందెల నందిస్తున్నప్పుడు, వాటిల్లోకి చూస్తూ, ఆ మణి మాణిక్యాల వెలుగుల్ని తమ ముఖాల మీదా, కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తున్నారు. అది చూసి చుట్టూ ఉన్నవాళ్ళు చప్పట్లు చరుస్తున్నారు. అంతకంతకూ బిందెల బరువు పెరిగి పోయినట్లుగా వృత్త పరిధి మీద నిలబడి ఉన్నవారు అరుస్తున్నారు, అభినయస్తున్నారు. చూస్తున్న వాళ్ళు ‘అవును కామోసు’ అనుకుంటున్నారు.

కార్పోరేటు కంపెనీలు, బ్యూరాక్రాట్లు, ఆర్ధికవేత్తలు, రాజకీయ నాయకులు వృత్తపరిధి మీద నిలబడిన వ్యక్తుల్లాంటి వాళ్ళయితే, వాళ్ళ చేతుల్లోని చిల్లపెంకులతో నిండిన బంగారు బిందెలు, షేర్లవంటివి, ఆర్ధికాభివృద్ధి లెక్కల్లాంటివి. వాళ్ళ ముఖాల మీద మెరుపులకి కెమెరాలు, వాళ్ళ అరుపులకి మైకులూ అందిస్తూ, ఈ ఆటనంతటినీ రక్తి కట్టిస్తున్నది మీడియానే! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి ప్రధాన అండాదండా మీడియానే కదా! నకిలీ కణిక అనువంశీయులు వేసుకున్నదీ మీడియా ముసుగునే నయ్యె!

నెం.5 వర్గం సమీకరింపబడక ముందు, కేవలం నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు పట్టే ప్రపంచమంతా నడుస్తున్నప్పుడు… ఇదంతా వాళ్ళకి నిరాఘటంగానే నడిచింది. ఆట రక్తి కట్టింది కూడా!

నెం.5 వర్గానికి, కుట్ర తీరు అర్ధమయ్యాక…

ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ ఏమిటంటే--- పైన చెప్పిన ఉదాహరణలో వృత్తపరిధిపై నిలబడిన కార్పోరేట్ కంపెనీలు, బ్యూరాక్రాట్లు, ఆర్ధిక వేత్తలు, రాజకీయ నాయకులు గట్రాల మధ్య…నెం.5 వర్గం ఎవరికెవరు జాతర బొమ్మలో పరిశీలించుకుని ప్రత్యర్ధుల లొసుగుల్ని ఒకరి కొకరికి ‘లీక్’ చేస్తోంది. జాతర బొమ్మలకి ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు ఉంటాయి. నెం.5 వర్గపు పనితీరుతో, సమాచార వెల్లడి కారణంగా, అవి మరింతగా పెచ్చు పెరిగి పోయాయి.

దాంతో ‘చంపు లేదా ఛస్తావ్’ అనే స్థితి ఎదురయ్యింది. ఇక ఈ స్థితిలో ఒకరి లొసుగుల్ని ఒకరు బయట పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అలాంటివి పదే పదే జరిగితే…? పై ఉదాహరణలో వృత్తపరిధిపై నిలబడిన వందమందిలో, తడవకి కొందరు, తమ చేతుల్లోకి వచ్చిన బిందెని, తమ భావోద్వేగాల రీత్యా, బోర్లా వేసి చూపిస్తున్నారనుకొండి. (తమ జాతర బొమ్మల గుట్టు బయట పెట్టినట్లుగానన్నమాట!) అప్పుడేమవుతుంది?

చుట్టూ చూస్తున్న వాళ్ళకి బంగారు బిందెల్లో ఉన్నది మణిమాణిక్యాలు కావని, ఒట్టి చిల్లపెంకులనీ అర్ధమై పోతుంది. ఒకసారికి…చెప్పబడిన పైకారణాలని (over leaf reasons)ని నమ్మి “ఈ సారికి పొరబాటు అయ్యిందేమో” అనుకుంటారు. రెండోసారి జరిగితే…? “ఏమో, మరో పొరబాటేమో” అనుకుంటారు. పదిసార్లు జరిగితే…? పదే పదే జరిగితే…?

అప్పుడు ఖరారుగా… బంగారు బిందెల్లా కనబడుతున్న వాటిల్లో ఉన్నవి మణి మాణిక్యాలు కావని, అలాగని తమ కిన్నాళ్ళు ‘బుస్సు’ కొట్టారనీ, అందులో ఉన్నవి నికార్సుగా చిల్ల పెంకులేనని నిశ్చయంగా తేలిపోతుంది. అదే ఇప్పుడు జరిగింది, జరుగుతోంది,

ఇందుకు కొన్ని దృష్టాంతాలు పరిశీలించండి.

ముందుగా రాజకీయ, మీడియా రంగాలలోని దృష్టాంతాలని చూద్దాం. ఎందుకంటే అవి బాహాటంగా కనబడేవి, స్పష్టంగా అర్ధమయ్యేవీ గనక!

1989-90లలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డిని దించేసి నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ఎక్కించుకోవాలను కున్నాడు. పాత బస్తీ మత ఘర్షణలు, ఘట్ కేసర్ రైలు ప్రయాణీకుల సజీవ దహనాలు జరిగాయి.

జరగాల్సినంత రగడ జరిగాక… చెన్నారెడ్డి సీటు దిగిపోయాడు, నేదురుమల్లి జనార్ధన రెడ్డి సీటు ఎక్కాడు. చెన్నారెడ్డికి తెలుసు తనని ఎవరు దింపేసారో? నేదురుమల్లికీ తెలుసు తనని ఎవరు ఎక్కించారో! వెరసి ఇద్దరికీ తెలుసు… రాజకీయాలని మీడియా, మీడియా ముసుగు వేసుకున్న ‘కింగ్ మేకరూ’ ఎలా ఆడిస్తున్నాడో!

అయినా కిక్కుర మనకుండా కూర్చున్నారు. ఎందుకంటే – మొత్తం పట్టు వాళ్ళదే అయినప్పుడు తముకిక్కుర మంటే ఏమవుతుంది? తాము నొక్కి వేయబడతారు. ఇక ఆపాటి కెరీర్ కూడా ఉండదు. కాబట్టి విధేయత చూపటమే కెరీర్ కి రహదారి, సంపాదనకి మార్గం. కాబట్టే కిక్కుర మనలేదు.

ఆ విధంగా విధేయత చూపినందుకే, తర్వాత చెన్నారెడ్డికి తమిళనాడు గవర్నరు గిరీ దక్కింది. నేదురుమల్లికి ఎంపీ సీటు తప్ప ఇంకేం ఒరగలేదు లెండి. అప్పటికి గూఢచర్య ఏకచ్ఛత్రాధి పత్యమూ నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గానికి చేయి జారిపోయింది మరి!

అయితే, 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు, రామోజీరావు బృందానికి చంద్రబాబుని సీటు దించేయాల్సిన, వై.యస్.ని సీటు ఎక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. (అది ఎందుకో గత టపాలలో వివరించాను.) అదే అసైన్ మెంట్లు జారీ చేయబడితే చంద్రబాబు గునిసాడు. ఎంతగా అంటే – అలిపిరిలో చావు తప్పి కన్ను లొట్టబోయినంతగా! అంతగా మెడ మీదికి కత్తి వచ్చి తృటిలో తప్పి పోయాక గానీ, చంద్రబాబు ఇంకించుకోలేదు.

అప్పటికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి వ్యతిరేకంగా నెం.5 వర్గం పని చేస్తుందని చంద్రబాబుకీ, వై.యస్.కీ ఇద్దరికీ తెలుసు! కాకపోతే ఎవరి పట్టు ఎంతో, ఎవరు ఎంత బలాధిక్యత కలిగి ఉన్నారో తెలియదు. అదే NDAని (అద్వానీని) దింపేసి UPA(సోనియా)ని ఎక్కిస్తానంటే అద్వానీ చంద్రబాబులాగా ఎందుకు గింజుకోలేదో గత టపాలలో వివరించాను.

ఏ కారణంగా తాము సీఎంని చేసినా గానీ, ఆ సీఎం సీటులో కూర్చున్న వై.యస్. ఏ కారణంగానో అర్ధాంతర మరణం పొందినప్పుడు, 2008 లో తిరిగి ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే సీటు నాశించిన వై.యస్.జగన్… మొన్నటి చెన్నారెడ్డి లాగానో, నిన్నటి చంద్రబాబు లాగానో కిక్కురమనకుండా కూర్చున్నాడా? కూర్చుంటే తానూ మర్రి శశిధరరెడ్డి లాగా అయిపోతానని తెలుసు.

కాబట్టే – రామోజీరావు ని సాధ్యమయినంత కంపు కంపు చేస్తున్నాడు. అంబానీలతో, కంపానీలతో అనుబంధాలను గురించి అల్లరల్లరి చేస్తున్నాడు. ఏడుపుగొట్టు రామోజీరావు ఎప్పుడెప్పుడు ఏడుస్తాడో ఏకరువు పెడుతున్నాడు. ‘సహనం నశిస్తే ఉప్పెనే’ అంటూ కాంగ్రెసులోని కుట్రదారులకి అల్టిమేషన్ ఇస్తున్నాడు. పైకారణంగా వీ.హెచ్. గట్రా సీనియర్లని చూపించవచ్చుగాక కానీ అసలు గురి పెట్టింది సోనియా ప్రభృతులకే!

తత్కాల అవసరాల కోసం తాత్కాలిక రాజీలు పడినా, అంతర్గత ఒప్పందాలతో సర్ధుబాట్లు చేసుకున్నా, అసైన్ మెంట్లు తీసుకున్నా… తీరా పీక మీదికి పరిస్థితులు వస్తే… అది రామోజీరావైనా, సోనియా అయినా, వై.యస్. జగన్ అయినా… తమ ప్రాణమే తమకి విలువైనది, తమ కెరీర్ తమకి ముఖ్యమైనది. అంతేగానీ, ముందటి రాజీలూ ఒప్పందాలూ కావు.

ఇచ్చిన మాట కోసమో, దేశం కోసమో, ధర్మం కోసమో, లక్ష్యం కోసమో… ప్రాణాలు అర్పించేందుకు వీళ్ళేమీ భగత్ సింగ్ ల వంటి దేశ భక్తులు కారు, పచ్చి స్వార్ధపరులు!

ప్రయోజనం ఉంటుందనుకుంటే రాజీలు పడతారు, ప్రయోజనం ఉండదనుకుంటే రగడలు పడతారు, ప్రమాదం అనుకుంటే హోరాహోరీ తలపడతారు. అప్పుడు ఒకరి లొసుగులు మరొకరు బయటా పెట్టుకుంటారు, ఒకరి ఉసురు మరొకరు తీయనూ ప్రయత్నిస్తారు.

అదే ఇప్పుడు మనం రాజకీయ, మీడియా రంగాలలో చూస్తున్నాం. ఇదే చాలా రంగాలలో నడుస్తోంది. ఇవి బహిరంగమైన రంగాలు కాబట్టి స్పష్టంగా కనబడుతున్నాయి, మిగిలిన రంగాలలో బయటికి తెలియటానికి మరికొంత కాలం పడుతుంది. అంతే తేడా!

ఇక ఈ పర్యవసానం కార్పోరేట్ వ్యాపార రంగంలోనూ, షేర్ మార్కెట్ లోనూ అయితే…

మీడియా ప్రచారం కంటే కూడా మౌఖిక ప్రచారమే ప్రభావశీలమైన కార్పోరేట్ కంపెనీల అంతర వలయంలో, బుల్ ల నెట్వర్క్లో… జారత బొమ్మలైన ప్రత్యర్ధి కంపెనీల కారణంగా, ఒకరి లొసుగులు మరొకరు బయటపెట్టినప్పుడు షేర్ మార్కెట్ లో కుదుపులు తయారౌతున్నాయి.

ఎప్పటి కప్పుడు వాటికి ‘సెంటిమెంట్’ అనో, ‘FII ఆగమన, తిరోగమనలనో’ ‘ఫలానా ప్రణబ్ ముఖర్జీ లేదా చిదంబరం ఫలానా ప్రకటన ఇవ్వడం షేర్ మార్కెట్ పై ప్రభావం చూపింది’అనో మీడియా పైకారణాలని ప్రచారిస్తుంది. నిజానికి… నిజాలని దాచిపెట్టే ప్రయత్నం అది! మరోమాటగా చెప్పాలంటే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ చేస్తున్న ‘నిభాయించుకునే పెనుగులాట’ అది!

నిజానికి…1993లోనే ఒక్కుమ్మడిగా ప్రపంచ ప్రతిష్ఠాత్మక బ్యాంకు ఒకటి కుప్పకూలడం, అలాగే ఒక యూరప్ దేశీయ షేర్ మార్కెట్ ఉన్నట్లుండి పేక మేడలా కూలిపోవటం జరిగింది. వాటి పేర్లు నిర్ధిష్టంగా గుర్తులేనందున వ్రాయటం లేదు.

ఇప్పుడు, 20 ఏళ్ళ క్రిందటే మాంద్యంలో ఇరుక్కుపోయిందని చెప్పబడుతున్న జపాన్, ఇన్నాళ్ళు గడిచినా బయటపడలేక పోవటానికి ఇలాంటి ‘బంగారు బిందెని బోర్లాపడేసి అందులోని చిల్లపెంకుల్ని ప్రదర్శించటమే’ కారణం.

చిన్నదేశమైన జపాన్ ఆర్ధిక మాంద్యానికి రెండు దశాబ్దాలు గడిచినా పరిష్కారం కనుక్కోలేని వాళ్ళు, అమెరికా, యూరప్ లతో సహా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్ధికమాంద్యానికి, రెండేళ్లలో పరిష్కారం కనుగొనగలిగారా? అలాంటి చోట, ‘అదిగో మాంద్యం నుండి బయటపడ్డాం, ఇదిగో మాంద్యం అంతమయ్యింది’ అనటం అంటే – పచ్చి అబద్దాలు చెప్పటం కాదా మరి!? పక్కా 420 తనం కాదా!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!సాక్షిపత్రికలో నవంబరు 8న ప్రచురింపబడిన పై ఫోటోలో, గొరిల్లా తల్లి ‘కికి’ తన బిడ్డని పొదివి పట్టుకున్న తీరు చూసి, మనస్సులో మెదిలిన ఆలోచనలని, ఈ టపాలో పెడుతున్నాను.


ప్రపంచంలో ఏ ప్రాణికైనా తన బిడ్డ అపురూపం! బిడ్డకి తల్లి సర్వస్వం! అమ్మతనం కమ్మనైనది. అదే కంటితో చూడగలిగితే... భగవంతుడి ప్రేమ అంతకంటే తీయనైనది.


సాధారణంగా అందరమూ... వృత్తిలో పోటీపడి పరుగులు తీస్తుంటాం. నింపాదిగా కూర్చుంటే, మన అవకాశాలని పక్కవాళ్ళు తన్నుకుపోతారని సందేహపడుతుంటాం.


మరికొందరైతే... ప్రక్కవాడు సుఖంగా ఉన్నాడంటే, తాము కష్టాల్లో ఉన్నట్లే నన్నంతగా అసూయపడతుంటారు.


నిజానికి... ఎవరి జీవితం వాళ్లకి రహదారే! ఎందరున్నా, ఎన్ని ప్రాణులున్నా... ఎవరి జీవితం వారిది! సమాంతర రేఖల వంటిది జీవన రహదారి! ఒక రేఖ మరొక దానికి అడ్డం కాదు, మరోదానిని ఖండించదు.


ఆ సత్యం గ్రహించక... కామక్రోధలకీ, లోభమోహలకీ, ఈర్ష్యాసూయలకీ గురవుతాం.


ఎందుకంటే -


ఇన్ని కోటాను కోట్ల ప్రాణులకి ‘ఊపిరి పోసుకునేందుకు’ ఎవరికి వారికే ఓ తల్లి గర్భాన్ని స్థానంగా ఉంచిన వాడు భగవంతుడు! పుట్టగానే అమ్మ రొమ్ముల్లో క్షీరంగానో, పప్పుబద్దల్లో పిండిపదార్ధాలుగానో, గ్రుడ్డులో సొనగానో... ఆహారాన్ని, ముందుగానే సిద్ధం చేసి ఉంచేంత ప్రేమ ఆయనది! తల్లి తన బిడ్డని ఒక్క క్షణమైనా ఏమారుతుందేమో! ఆ తల్లీబిడ్డల్ని కూడా సృష్టించిన భగవంతుడు, ఆ ఒక్కక్షణం కూడా మనల్ని ఏమారడు.


మనమే... ఆ ప్రేమనీ, భద్రతనీ గుర్తించక నానాహైరానపడతాం, ప్రక్కవారిని పెడతాం!


అందుకే... అన్నీ తన మీద వదిలేసి, ఫలితం తనకర్పించేసి, పనిచేసుకు పొమ్మంటాడు శ్రీకృష్ణుడు, గీతలో!


నాకు తెలిసీ... ఇంతకంటే భరోసా మరొకటి లేదు మరి!


అందుకే, అందరికీ తెలిసినా, మరోసారి చెప్పాలనిపించి చెబుతున్నాను... ‘అమ్మతనం ఎంత కమ్మనో... భగవంతుడి ప్రేమ అంతకంటే తియ్యన!’మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నెం.10 వర్గానికి, నెం.5 వర్గం ఇచ్చిన `బంపర్ ఆఫర్’![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 35]

ఈ నేపధ్యంలో ఆర్ధికమాంద్యానికి దారితీసిన పరిస్థితుల్ని ఓసారి పరికిస్తే...

గత టపాలు (301 & 307)లలో... పీవీజీకి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గము అందులోని కీలక వ్యక్తుల అస్తిత్వము, పనితీరు తెలిసాక, నెం.5 వర్గం సమీకరించబడిందనీ, దరిమిలా... ‘దొరికిపోయారు’ అన్న హెచ్చరిక ఇవ్వబడిందనీ వ్రాసాను.

301. ఓటమే స్ట్రాటజీగా... [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? - 06]
http://ammaodi.blogspot.com/2010/02/06.html
307. ప్రధానిగా పీవీజీ ఓటమి వరకూ రెండోదశ [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 11]
http://ammaodi.blogspot.com/2010/02/11.html

ఆ విధంగా హెచ్చరిక ఇవ్వబడినప్పుడు, ఎంత పొగరుగా తలెగరేసారో కూడా, ఉదాహరణ పూర్వకంగా వివరించాను.

నెం.5 వర్గం ఎంచుకున్న ‘ఓటమే స్ట్రాటజీ’ కారణంగానూ, తమకి కల్పించబడిన ఒత్తిళ్ళ కారణంగానూ... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ... ఎప్పటి కప్పుడు, అన్ని రంగాల్లో కూడా, ఎదురొచ్చిన పరిస్థితులతో పాటూ నడిచారు. పరిస్థితులు ఈడ్చుకెళ్ళిన దిశలో, ఈడ్చుకెళ్ళిన వేగంతో వెళ్ళారు. ఇది ఒకప్పుడు వాళ్ళు భారతదేశం పట్ల నిబద్దత గల వ్యక్తుల్ని, ప్రభుత్వాల్నీ తీసుకెళ్ళిన స్థితే!

గూఢచర్యంలో ఎవరికి పట్టు ఉంటే వాళ్ళు, తమ ఎదిరి వర్గానికి విధించగలిగిన స్థితి ఇది!

అందుచేత కూడా... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు... తమకి వచ్చిన విశ్లేషణలకి, అసైన్‌‍మెంట్లకి, ఎదురైన పరిస్థితులకి... తమకి ఇష్టమైన, తమ అరిషడ్వర్గానికి నచ్చిన... భాష్యాలు తాము చెప్పుకున్నారు.

అయితే, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి... రాజకీయ రంగంలోనే గాక, అన్నిరంగాలలో, అప్పటికి తమకి ‘బలిమి’ ఉందని అనుకున్నరీత్యా, నెం.5 వర్గం విసిరిన సవాలు కంటికి ఆనలేదు.

అలా కంటికి ఆనని రంగాలలో ఆర్ధిక రంగం కూడా ఒకటి! అప్పటికే నెం.5 వర్గంతో పోలిస్తే... తమకి ఉన్న అర్ధ, అంగ, ఆయుధ బలాలు విస్తారమైనవన్న అతిశయ అహంకారాలు మెండుగా ఉన్నాయయ్యె! అప్పటికి వాళ్ళు అసలు నెం.5 వర్గాన్ని... ఇంత విస్తారమైనది గాను, బలమైనది గానూ ప్రపంచ వ్యాప్తమైనదీ గానూ అనుకోలేదు కూడా! అంచేత... అప్పటికి భారత్ కు మాత్రమే పరిమితమైన గూఢచర్య సంస్థగా అనుకున్నారు. తమదైన పేరుతో పిలుచుకున్నారు.

ఆ విధంగా హెచ్చరించబడిన ఆర్ధిక రంగంలో ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే...

ఇక్కడ ఓ ఉదాహరణ చెబుతాను. కొద్ది నెలల క్రితం వచ్చిన ‘బంపర్ ఆఫర్’ సినిమా చాలామంది చూసే ఉంటారు. ‘పోకిరి’ లాంటి అత్యంత విజయవంతమైన సినిమా తీసిన పూరీ జగన్నాధ్, తన సోదరుడు సాయిరాం శంకర్ ని హీరోగా పెట్టి తీసిన సినిమా అది.

అందులో హీరోయిన్ తండ్రి సాయాజీ షిండేకు తరగనంత ఆస్తి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సహా చాలా వ్యాపారాలున్న ఈ ఆసామీ ఆ ఆస్థులన్నిటినీ న్యాయంగానో ధర్మంగానో సంపాదించినవేం కాదు. తన కంటే బలహీనుల మీద దందాగిరి చేసి, కబ్జాలు చేసి, అక్రమంగా సంపాదించినవే! అయితే డబ్బు తాలూకూ ‘అతిశయం, అహంకారం’ మాత్రం మెండుగా ఉన్న వ్యక్తి.

మీడియా ఇమేజి మోజుతో ఇతడి భార్య ఉమాదేవి, అతడి సెకండ్ సెటప్ కుమారుడి (భరత్ కుమార్) తిరుగుబాటు పండించిన హాస్యం... డైలాగ్ కామెడీతో, రమణమ్మగా అంబుజం, హీరో స్నేహితులు... చక్కని వినోదం పండించిన సినిమా!

ఆ సినిమాలో... తన కుమార్తెతో ప్రేమాయణం ఉన్న హీరోని, హీరోయిన్ తండ్రి ఛాలెంజ్ చేస్తాడు. ‘తన ఆస్తిలో ఐదో వంతన్నా సంపాదించమని, అప్పుడే అతడి స్టేటస్ ని తాను పరిగణిస్తానని, అప్పుడు తన కూతురినిచ్చి పెళ్ళి చేస్తానని!’

దానికి హీరో... "నువ్వు చెప్పగానే పిచ్చి... లాగా నేను ఓ ఇదైపోయి, మూటలు మోసి, రిక్షాలు తొక్కి... డబ్బులు సంపాదిస్తాననుకున్నావా? (ఈ కధాంశంతో ఒకప్పుడు బోలెడు సినిమాలొచ్చాయి మరి!) నాకేం పన్లేదా? నువ్వు డబ్బు తాలూకూ మదమెక్కి కొట్టుకుంటున్నావ్!? నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు. నేనే నీకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను చూడు. మర్యాదగా నీ కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చెయ్!

లేదంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ మూప్పై మూడు దెబ్బలు కొడతాను. నీ లెవెల్ అదీ నా లెవెల్ ఇదీ అనే కదా, నువ్వు మా ప్రేమని కాదంటున్నావు! నెల తిరిగే సరికల్లా నీ ఆస్తులన్నిటినీ ఊడబెరికి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తాను.అప్పుడు నీ లెవెలూ నా లెవలూ సమానమై పోతాయి. ఆఫ్టర్ వన్ మంత్.... ఆల్ ఫ్యామిలీస్ ఆన్ ది రోడ్స్. ఇదీ నా బంపర్ ఆఫర్" అంటాడు.

అలాగే చెప్పింది చేస్తాడు కూడా! హీరోయిన్ తో "నీ బాబేమన్నా నికార్సుగా సంపాదించాడేమిటే?" అంటాడు కూడా!

హీరోతో న్యాయవాది ఎమ్మెస్ నారాయణ కూడా... చట్టంలో అన్ని బొక్కలేనంటూ... "లిటిగేషన్లు నేను వేస్తాను. చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకుంటే నీ ఇంట్లో నువ్వు ఉండకూడదని కోర్టు నుండి స్టే ఆర్డర్ తేవచ్చు" అంటాడు. "విలన్ తాలూకూ బొక్కలు నువ్వు వెదుకు, పుల్లలు నేను రెడీ చేస్తాను" అంటూ ముక్తాయిస్తాడు. అనుకున్నట్లుగా హీరోయిన్ తండ్రిని, అతడింట్లో అతడు ఉండడానికి వీల్లేకుండా కోర్టు ద్వారా బయటికి ఈడుస్తారు కూడా!

సరిగ్గా ఇదే ‘బంపర్ ఆఫర్’... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10వర్గం, అందులోని కీలక వ్యక్తులకీ... నెం.5 వర్గానికీ మధ్య నడిచింది! కాకపోతే అది సినిమా గనుక... స్క్రిప్టు, డైలాగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సహా స్పష్టంగా ఉంటుంది. వినోదం, హాస్యం మిళాయింపబడి ఉంటుంది. ఇది గూఢచర్య పరిభాషలో పరిణమించింది.

ఇప్పటి వరకూ చట్టంలో లొసుగుల్ని విజయవంతంగా వాడుకుంటూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు పరిస్థితుల్ని తమకి అనుకూలంగా వాడుకున్నారు. పైగా చట్టాల్లో అన్నీ లొసుగులేనంటూ మీడియా విరగ ప్రచారం చేస్తుంది. ఆ లొసుగుల్ని చట్టాల్ని తమకి అనుకూలంగా వాడుకునే వాళ్ళు. తమ ఏజంట్లు, తమ అనుకూలురు పైస్థానాలకి ఎదిగేందుకు ఆ చట్టాలన్నీ ఉపయోగపడాలి. వాళ్ళ కుట్ర తీరు, పనితీరు, తెలియదు గనక, అప్పట్లో భారత్ పట్ల నిబద్దత గల ప్రభుత్వాలు, నిఘా సంస్థలూ, నిజాయితీ గల నేతలూ ఇబ్బంది పడేవాళ్ళు. పాపాల భైరవులై నిందలు మోసే వాళ్ళు.

ఒకసారి వాళ్ళ కేంద్ర స్థానమేమిటో, వ్యూహాలేమిటో, బలాలేమిటో, బలహీనతలేమిటో తెలిసిపోయాక, ఇక నెం.5 వర్గం... నకిలీ కణిక వ్యవస్థని, నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తుల్ని ఆడుకోవడం మొదలెట్టింది. అయితే ఇది ప్రస్ఫుటంగా బయటకు వెల్లడి కావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే స్పష్టబడుతోంది. దశాబ్దాల పైబడే వరకూ ఈ ఆటని నెం.5 వర్గం చాలా జాగ్రత్తగా ఆడింది. మరో మాటలో చెప్పాలంటే ‘ఓటమే స్ట్రాటజీ’గా ఆడింది.
అందునా గూఢచర్యం విస్తారమైనది. కాబట్టి కూడా, గ్రహింపుకి రావడం చాలా కష్టం. పరిస్థితులు విడమరిచి చెప్పగలిగేంత స్పష్టపడినప్పుడూ లేదా పరిపక్వత చెందినప్పుడూ అర్ధం కావాల్సిందే!

కాబట్టి ‘బంపర్ ఆఫర్’ కూడా వాళ్లకి మొదట్లో అవగతం కాలేదు. అవగాహనకి వచ్చే సరికే... కాగితపు మేడలు కూలిపోయాయి/పోతున్నాయి. సంపద ఆవిరైపోయింది/పోతుంది. నిజానికి అది నిజమైన సంపద కూడా కాదయ్యె! ఉన్నదాన్ని కొన్ని వేలరేట్లు కృత్రిమంగా పెంచి ప్రచారించిన కాగితపు సంపదేనయ్యె!

బంపర్ ఆఫర్ సినిమాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూర్యప్రకాశ్ (సాయాజీ షిండే) లాగే... ఆయా దేశాలలో కార్పోరేట్ కంపెనీలు, రాజకీయులూ ప్రధాన ఏజంట్లుగా గల నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలు కూడా... అడ్డంగా సంపాయించిన సొమ్మే గానీ అదేమైనా న్యాయంగా సంపాదించిందా!? ఆయా దేశాల ప్రభుత్వాల్లో కీలక వ్యక్తుల సహాయంతో ప్రజాస్వామ్య బద్దంగా, అధికార యుక్తంగా చేసిన దోపిడియేగా! G-2, G-8 G-20, G-xyz లంటూ సమితులు పెట్టుకుని మరీ రచించే ప్రణాళికలూ అవే...! ‘ఏయే చట్టాలూ, స్ట్రాటజీలు అమలు చేసి, ప్రజల నుండి ఇంకా ఎంతగా శ్రమదోపిడి, వ్యాపార దోపిడి చేయగలమా’ అనే!

అలాంటి నేపధ్యంలో... చట్టాల్లోని లొసుగుల్నే ఉపయోగించి, నకిలీ కణిక వ్యవస్థనీ, వాళ్ళ అనుచర వ్యక్తులనీ... వాళ్ళ వేలితో వాళ్ళ కంటినే పొడిపించాలన్నా, వాళ్ళ కాగితపు సంపద వాళ్ళ చేతే దగ్ధం చేయించాలన్నా... జాతరబొమ్మలు/జంట పీతలతో, అది చాలా సుసాధ్యమైన పనే! కేవలం ఎవరికెవరు జాతరబొమ్మలో చూసుకొని, ఒకరి లొసుగుల గురించిన సమాచారం మరొకరికి ‘లీక్’ చేస్తే సరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ప్రియభాషణా, మృదువర్తనా గలవారిని అందరూ ప్రేమిస్తారు. ఇది నిజం!
శ్రీరాముడు, ధర్మరాజూ అలాంటివారేనని వాల్మీకి మహర్షీ, వేదవ్యాసుడూ చెబుతారు.
ఎంత కష్టంలో ఉన్నప్పటికీ, కోపంలో ఉన్నప్పటికీ, శ్రీరాముడు ఒక్క పరుషపూ మాటా అనడు.
ఆయన మాట మృదుమధురం!
ప్రవర్తన కుసుమ కోమలం!
చిరునవ్వు వెన్నెల శీతలం!

కాబట్టే... రాజ భవనాల్లో లభించే వేళపట్టు సౌకర్యాలు, నీడపట్టు విందువినోదాలు, వింజామరల నుండి చందన సైత్యోపచారాలు చేసే దాస దాసీ జనాలు, పరిమిళ భరిత మృష్టాన్న భోజనాలు... అన్నిటినీ వదిలేసి, శ్రీరాముని వెంట కారడవుడలకైనా సంతోషంగా వెళ్ళిపోయింది సీతమ్మ.

శ్రీరాముని సాన్నిహిత్యం కంటే సంతోషదాయకమైనదీ కోరదగినదీ మరేమీ లేదనీ, ఆ నవ్వుకోసం, ఆ మాట కోసం, ఆ ప్రేమపూరిత ప్రవర్తన కోసం, అన్నిటినీ వదిలేసి వెంట నడిచింది.

లక్ష్మణుడూ అంతే! అన్న సాన్నిహిత్యం కంటే అభిలషించదగినవి ఏదీ లేదాయనకు.

శ్రీరాముడి ప్రియభాషణా, మృదువర్తనా...
విస్తారంగా, లోతుగా, మౌనంగా, మైదానంలో ప్రవహించే నదిలా...
విమల గంభీరమైనవైతే....

శ్రీకృష్ణుడందుకు పూర్తిగా విరుద్ధం!
ఆ నల్లవాడు అల్లరి పిల్లవాడు.
వెన్న దొంగిలించటం ఇష్టం.
గిల్లికజ్జాలు పెట్టటం మరీఇష్టం...
చెలికాండ్రతో కలిసి చెడుగుడు ఆడటం, గోవులు కాయటం... అల్లరే అల్లరి!
కట్టుకొచ్చుకున్న చద్ది, చప్పరించుకుంటూ కలిసి తినటం ఇష్టం.
కన్నయ్య ఉన్నచోట ఎప్పుడూ కలకలమే!
గిరిశిఖరాల నుండి ఉత్తుంగ తరంగమై...
లోయలోకి దూకే పారే జలపాతంలా!
త్రుళ్ళి పడే సెలయేరులా!
కృష్ణుడెక్కడ ఉంటే అక్కడ... ఎగసిపడే నీటితుంపరల్ల్లా నవ్వుల జల్లులే!

అలాగని కృష్ణుడికి కష్టాలు లేవా?
యశోదానందులకి గారాబు కిట్టయ్య కావచ్చు గాక!
దినదిన గండమేగా!
ఉయ్యాలలో పాపడిగా ఉన్నప్పటి నుండి...
పాలిస్తానని చంపబూనిన పూతన!
గాలిలా ఎగరేసుకు పోయే వాడొకడు,
బండి చక్రమై దుసుకొచ్చేవాడు మరొకడు.
గాడిద రూపంతోనో, బకుడి రూపంలోనో నిత్యమూ ముంచుకొచ్చే ఆపదే!
జడివాన కురిపించి జడిపించ బోయే వారొకరు,
గోవుల్నీ లేగల్ని మాయం చేసి పరీక్షించబూనేరొకరు.
ఏ రోజు ప్రశాంతత ఉందని!?

గోవులు కాయబోయిన ప్రతీరోజూ ఏదో ఒక ఉపద్రవమే!
పెరిగి పెద్దయ్యాక అయినా,
అబ్బురంగా పెంచిన అమ్మ యశోదమ్మని విడిచి, కన్న దేవకమ్మని చేరాడు.
కన్నతల్లిని చేరినంత మాత్రానా,
పాలిచ్చి పెంచి, గోరుముద్దలు తినిపించి, గోముగా ముద్దుచేసిన యశోదమ్మని మరచి పోగలడా?
అయినా వ్రేపల్లె విడిచి, బృందావనం విడిచి, మధురానగరి చేరాడు!
కంస చాణూరులు సంహరింపబడ్డారనుకున్నా...
నిత్యమూ యుద్దాల నడుమ...
జరాసంధుడూ, శిశుపాలుడూ...
ఎవరు నిమ్మళంగా ఉండనిచ్చారని!?
నిత్యయుద్దపోరు నివారించేందుకు నడి సంద్రంలో ద్వారక కట్టుకున్నాడు.

"అయ్యో! నాకిన్ని కష్టాలే!" అని ఏనాడూ అనుకోలేదు. నిత్యమూ శ్రీకృష్ణుడికి పండగే! బహుశః అవన్నీ తన సామర్ధ్యానికి సవాళ్ళన్న ఆనందమేమో! ఆనందించే మనస్సే ఉండాలి గానీ, ప్రతిగండమూ ఆస్వాదనా యోగ్యమే! దాటే వరకూ ఉత్కంఠ! దాటాక విజయమూ!

కృష్ణుడెక్కడ ఉంటే అక్కడ అదే ఆనందం.
కష్టాలు లేవని కాదు, రావనీ కాదు.
అయినా కృష్ణుడుండగా భయమెందుకు!, సంకోచమెందుకు?

కాబట్టే... ఆపిల్లన గ్రోవి మ్రోగితే పరిసరాలు, నదీనదాలూ, పశుపక్షులూ, గోపికా గోపాలురు... అందరూ... అన్నీ మరచి, ఇహలోక ఆలోచనే విడిచి... లయించి పోయారు.

కృష్ణుడి మురళి మోగితే... ఒక్క రాధికే కాదు, సకల జరాచర జగత్తు పరవశించింది. లేగలు తల్లిపొదుగు వదలి కృష్ణుడి వైపు పరుగు తీస్తే, గోవులు కట్టుతాడు తెంపుకు దౌడు తీసేవి.

బిడ్డల్ని చంక నేసుకుని తల్లులు, ప్రియురాలి కొంగు విడిచి పెట్టకుండానే యువకులూ...
కృష్ణుణ్ణి అన్వేషిస్తూ, మురళీ నాదాన్ని అనుసరిస్తూ పరుగులు పెట్టారు.

ఎందుకు?

కష్టాలున్నా కృష్ణుడు ఏడుస్తూ కూర్చోలేదు గనుక!
తాను సంతోషంగా ఉంటూ, తన చుట్టూ అందరినీ, అన్నిటినీ సంతోషపెట్టాడు గనుక!
కృష్ణుడెక్కడుంటే అక్కడ బృందావనమే గనక!

ఇంతగా జీవన కళని చేతల్లో చూపించి... ఇంత కంటే గొప్ప పాఠం... ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడు నేర్పగలడు మరి!?

అలాంటి ఆనందం, కష్టాలని లెక్కచెయ్యని ఆనందం, సమస్యల్ని చూసి భయపడి పారిపోని ఆనందం...
మనందరికీ కలగాలనీ...
శ్రీకృష్ణుడు అందరిళ్ళల్లో కొలువై ఉండాలనీ కోరుకుంటూ...

బుల్లి కృష్ణుళ్ళందరూ టపాసుల్ని ప్రమోదంగా (ప్రమాదం రాకుండా, లేకుండా) వినోదించాలని దీవిస్తూ....

అంరికీ దీపాళి శుభాకాంక్షలు!

వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే - ఈ పాటికి ఆర్ధిక రంగంలో ఇంకా చాలా జరిగి ఉండేవి. ఆర్ధికమాంద్యం అసలు వచ్చేదే కాదు. ఎందుకంటే - ఆర్ధిక మాంద్యానికి దారి తీసిన [ఆమెరికాలో కోకొల్లలుగా ఇవ్వబడిన స్వంత ఇంటి ఋణాలు వంటి] పరిస్థితులే సంభవించి ఉండేవి కావు. పైకి ప్రచారింపబడిన పైకారణాల (over leaf reasons) వెనకనున్న అసలు కారణాలని తర్వాత పరిశీలిద్దాం. ఇప్పటికి పైన చెప్పిన విషయాన్ని కొనసాగిస్తాను.

నెం.5 వర్గానికి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు ఆనుపానులు తెలియకపోయి ఉంటే... ఇప్పుడు బహిర్గత మౌతున్న ఎన్నో విషయాలు, గుట్టుచప్పుడు గాకుండా ఉండిపోయేవి. ఆర్ధిక ఆకాశ(కాగిత)హర్మ్యాలు కుప్పకూలి ఉండేవి కావు.

2008, సెప్టెంబరులో 150ఏళ్ళ లేమాన్ బ్రదర్స్ వంటి కంపెనీలు కుప్పకూలిపోవటమే ఎక్కువగా ప్రచారమైంది. 1998లోనే... లండన్ లో అప్పటికి రమారమి 216 ఏళ్ళ చరిత్ర కలిగిన లయన్ బ్రేవరీస్, కేవలం కుటుంబ కలహాలతో కుప్పకూలిపోవటం, వారి మద్యం యొక్క వ్యాపారనామం (Brand Name) చేతులు మారటం... పెద్దగా ప్రచారం లేకుండానే మరుగున పడిపోయింది. మహా అయితే తాత్కాలికంగా, వీలైతే స్థానిక మీడియాతో సరిపెట్టేస్తారు మరి!

2001, జూన్ తొలిరోజుల్లో, నేపాల్ నాటి రాజు బీరేంద్ర కుటుంబాన్ని, అతడి కుమారుడే ‘సింధియాల మేనకోడలితో పెళ్ళి వద్దన్న’ కారణంగా కాల్చి చంపేసి, ఆనక తనని తాను ‘వెన్నులో(?)’ కాల్చుకుని చనిపోయిన కుటుంబ కలహాలు ఎలాంటివో, ఇవీ అలాంటివే! వ్యవస్థీకృతంగా నిర్వహించబడేవి. కాకపోతే... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం... ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీలో అప్పటికి వదిలేసుకున్న ‘కాలు’ వంటి కంపెనీలవి.

ఏదేమైనా... వెరసి అలాంటి ఎన్నో వ్యవహారాలు ప్రచారంతో వెలుగు చూడవన్నదే చెప్పొచ్చేది! లేకపోతే 216 ఏళ్ళపాటు తరతరాలుగా సాగిన కుటుంబ ఐక్యత, 1992 తర్వాత ఆరేళ్ళకే విచ్ఛిన్నం కావాలా? నిజానికి... నెం.5 వర్గంతో ప్రారంభమైన ‘మెదళ్ళతో యుద్ధం’లో భాగమే అది!

ఇలాంటిదే మరో ఉదాహరణ: జపాన్ ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని 20ఏళ్ళయ్యిందని, ఇటీవల తరచుగా వినబడుతున్నమాట. అంటే 1990లోనే జపాన్ ఆర్ధిక మాంద్యంలో పడి ఉండాలి.

అయితే, 1995 వరకూ కూడా... ‘జపానీయుల పని సంస్కృతి గురించీ, ఎలక్ట్రానిక్ పరికరాలని సూక్ష్మపరిమాణంలో తయారు చేయగల వారి నేర్పు గురించీ, ప్రపంచ మార్కెట్టులో జపాన్ వాటా గురించీ, మొత్తంగా జపాన్ లో గృహ పరిశ్రమ స్థాయిలో విస్తరిల్లిన ఎలక్ట్రానిక్ పరిశ్రమ గురించీ’ మీడియాలో ఊదర పెట్టబడింది.

ఒక్కమాటలో చెప్పాలంటే - ‘జపాన్ అంటే చిన్న దేశమైనా ఎంతో గొప్పదేశం! ఏ కోణంలో చూసినా, జపాన్ ఆసియాలోనే తలమానికం వంటిది’ అనే ప్రచారమే నడిచింది. మరి 1990లోనే అది ఆర్దిక మాంద్యంలో చిక్కుకుంటే, తొలినాళ్ళల్లో జపాన్ ‘తన గుట్టు బయటకి రాకుండా కాపాడుకుందను’కున్నా, అయిదేళ్ళు గడిచినా... 1995 నాటికి కూడా... విషయం బయటికి పొక్కలేదా?

అంతర్జాతీయ మీడియా అసలు నిజాన్ని పసిగట్ట లేకపోయిందా? అందునా చీమచిటుక్కుమన్నా తెలుసుకోగలిగే సీఐఏకి, ఏ వార్తనైనా వాసన పట్టేసే బీబీసీకి కూడా తెలియక పోయిందా?

నిజానికి.... జపాన్ ఆర్ధికంగా కూలడం ప్రారంభమైంది 1992 తర్వాతే! నెం.5 వర్గానికి... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10వర్గపు ఉనికి, కుట్రతీరు అర్ధమయ్యాకే! వాళ్ళ మధ్య ‘మెదళ్ళతో యుద్ధం’ ప్రారంభమయ్యాకే! 1995 వరకూ కూడా జపాన్ విషయంలో పరిస్థితిని నిభాయించుకుంటూ వచ్చారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ కూడా!

అచ్చంగా 2001 సెప్టెంబరు తర్వాత, అమెరికా మాంద్యంలోకి ప్రవేశించినా, ఆ విషయాన్ని 2008 సెప్టెంబరు తర్వాతే, ప్రస్ఫుటంగా బయటపెట్టుకున్నట్లు, అప్పటి వరకూ పరిస్థితుల్ని నిభాయించుకో ప్రయత్నంచినట్లు! [అందుకే యిన్నేళ్ళు గడిచినా ఆర్ధికమాంద్యానికి పరిష్కారమే కొనుక్కోలేకపోయారు, జపాన్ లో అయినా, మరెక్కడయినా!?]

ఇక జపాన్ ఆర్ధిక మాంద్యం, 1992 తర్వాత ప్రారంభమై 1995 కి పెరిగినప్పటికీ, ఇప్పుడు [అంటే 18ఏళ్ళ తర్వాత 2010 లో] "జపాన్ ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి 20 ఏళ్ళయ్యింది" అన్న కొత్తపాట ప్రారంభించారు. ఎందుకంటే - నెం.5 వర్గానికీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ మధ్య జరుగుతున్న మెదళ్ళతో యుద్దంలో, అసలు నిజాలని దాచి, అసత్యాలు ప్రచారించేందుకు! తద్వారా "అదేం లేదు, కుట్ర అంతకంటే లేదు. అన్నీ సహజంగా జరుగుతున్నాయి. ఫలానా ABC కారణంగా ఈ XYZ జరిగింది. ఫలానా pqr కారణంగా ఈ def జరిగింది" అని ప్రచారించేందుకు!

కాబట్టే మరో రెండేళ్ల వెనక్కి వెళ్ళి, ‘జపాన్ 1990లోనే ఆర్దిక మాంద్యంలో చిక్కుకుంది’ అనటం!

అలాంటిదే ఇటీవలి కాలంలో... భారత్ పేరు ప్రక్కనే ద్వంద్వ సమాసం స్థాయిలో, చైనా పేరు జపించడం కూడా!

అందులో ఒక స్ట్రాటజీ... ‘భారత్ కు జాతరబొమ్మగా చైనా’ను చూపించడం. కాగా ‘శరవేగంగా అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తులో అగ్రదేశం కానున్న భారత్’ అంటూ కీర్తిపాటలు పాడేటప్పుడు, కేవలం భారత్ పేరే గాకుండా, చైనా పేరూ జత చేర్చడం రెండో స్ట్రాటజీ! చింత చచ్చినా పులుపు చావనితనానికి ఇదో ప్రతీకన్న మాట! నెం.5 వర్గానికి అహపు సంతృప్తి కలిగించడానికి... భారత్ కీర్తిగానం, చట్టసభల్లో వేదమంత్రాల ప్రారంభం వంటి ఈవెంట్స్ నిర్వహించడం ఇటీవల పరిపాటి అయ్యింది.

కాకపోతే... నకిలీ కణిక వ్యవస్థ,నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు ప్రయోగించే ‘అహాన్ని సంతృప్తి పరచడం లేద అహాన్ని రెచ్చగొట్టటం’ (మరో మాటలో చెప్పాలంటే - అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవటం!) నెం.5 వర్గం మీద ఫలించక పోవడమే, ఇప్పుడు వాళ్ళకి ప్రాణసంకటమయ్యింది.

ఇంకొంచెం విపులంగా చైనా వ్యవహారాన్ని పరిశీలిస్తే... ఇప్పుడు మాటి కొస్తే ‘భారత్, చైనాలదే రేపటి రోజు’ అనో ‘రానున్న కాలంలో హవా భారత్ చైనాలదే’ అనో ఊదర పెడుతున్న సంగతి పక్కన పెడదాం.

2008 సెప్టెంబరు తర్వాత, అమెరికాని ఆర్ధిక మాంద్యం ఎత్తికుదేయటం ప్రారంభించినప్పుడు... పదే పదే వినబడిన మాట ఒకటుంది. ‘చైనా దగ్గర లక్షకోట్ల డాలర్లున్నాయని, అది గనక వాటిని మార్కెట్ లోకి విడుదల చేస్తే... దెబ్బకి ఆర్ధిక మాంద్యం సమసి పోతుందని!’ ఇప్పుడు (అంటే 2009 సెప్టెంబరులో వై.యస్. మృతి చెందాక) ఆరోపణల రీత్యా, లక్షకోట్ల రూపాయలు చౌకయి పోయాయి గానీ, రెండేళ్ళ క్రితం లక్ష కోట్ల డాలర్లు (అంటే రమారమి 50లక్షల కోట్ల రూపాయలు) చాలా ఎక్కువనే చెప్పబడ్డాయి.

అప్పటి నుండీ... చైనా గురించి ఇలాంటి కబుర్లు చాలానే చెప్పారు గానీ, ఆ చైనా దగ్గరుందని చెప్పబడ్డ లక్ష కోట్ల డాలర్లని విడుదల చేసిందీలేదూ, ఆర్ధిక మాంద్యం అంతమయ్యిందీ లేదు. ఇంతలో... ఓ ప్రక్క... మీడియా, ఆర్ధిక నిపుణులు... ‘ఇదిగో ఆర్ధిక మాంద్యం నుండి బయట పడ్డాం, అదిగో ఆర్ధిక మాంద్యం అంతమైంది’ గట్రా ప్రచారాలు శక్తివంచన లేకుండా చేశారు, చేస్తూనే ఉన్నారు.

మరోప్రక్క... అమెరికా,యూరప్ లలో కుప్పలుగా ఉద్యోగాలు ‘హుష్ కాకి’ అయిపోతూనే ఉన్నాయి. తెప్పలుగా బ్యాంకులూ, ఇతర వ్యాపార సంస్థలూ దివాళా తీస్తూనే ఉన్నాయి.

అసలింతకీ... చైనా దగ్గర లక్ష కోట్ల డాలర్లు ఉన్నాయో లేవో ఎవరికీ తెలీదు. అంతర్జాతీయ విఫణిలో దాని కరెన్సీ మారక విలువని సవరించ (revise)మంటే, అది వినటమూ లేదు. ఆ జాబితాలో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి లెండి. డాలర్ మారకంతో తమ కరెన్సీ విలువ తరుగుతుందని కాదు, పెరుగనుండగా కూడా సవరించడం లేదు. ఎవరి కారణాలు వాళ్లవి మరి! కమ్యూనిజపు ఇనుప తెరలకి ఆవల ఏముందో... తెర తీసినప్పుడు కదా తెలిసేది?

1990లో USSR కుప్పకూలక ముందు, నాటి రష్యా గురించి కూడా ఇలాగే చెప్పబడింది. తీరా ఆ దేశం కుప్పకూలి, లెనిన్ గ్రాడ్ కాస్తా సెయింట్ పీటర్స్ బర్గ్‌గా పునరవతరించాక... చూస్తే ఏముంది? గొప్పగా ఇతర దేశాలకు సాయమందించిన, సీఐఏతో పోటాపోటీగా కేజీబి సమర్ధ ఏజన్సీగా కీర్తించబడిన... రష్యాలో, దారిద్ర్యం తాండవించడం చూసి... లెనిన్ గ్రాడ్ సెంటర్ లో బాలలు, పర్యాటకులని చెయ్యిచాచి బిక్షమడగటం చూసి... యావత్ర్పపంచం నివ్వెర పోయింది.

ఇది దేశాలకే కాదు, దివాళా తీసే కంపెనీలకీ వర్తిస్తుంది. అదే ఆర్దిక మాంద్యం రూపేణా ఇప్పుడు దేశాలని వణికిస్తున్న పరిస్థితి! అందుకే గత టపాలలో... రెండవ ప్రపంచ యుద్దానంతరం, దివాళా తీసిన యూరప్ దేశాల నేపధ్యంలో... మొన్న బ్రిటన్, నిన్న రష్యా, ఈ రోజు అమెరికా(?) కుప్పకూలితే ఆశ్చర్యమేమీ లేదనీ, అన్నిటి వెనకా శతాబ్దాలుగా పరుచుకున్న నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచార వలయమే, దీనంతటికీ అంతస్సూత్రమనీ వ్రాసాను.

1920లలో మహామాంద్యం తరువాత అప్పటి వరకూ బ్రిటన్, యూరప్ కంపెనీల వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికా అందుకొని ఇప్పటి వరకూ నిలబెట్టుకుంది. ఇప్పుడు ఈ మాంద్యం తర్వాత... భారత్, చైనా పేర్లు వినపడుతున్నాయి. అప్పటికి, ఇప్పటికి, ఒక పోలిక ఏమిటంటే - 1920 మహామాంద్యం తరువాత అమెరికాతో పాటు రష్యా కూడా, దానికి సమాంతరం (జాతర బొమ్మలా) గా 1990 వరకూ నడిచింది. అలాగే ఈ మాంద్యంలో భారత్, చైనా పేర్లు వినబడుతున్నాయి. నిజం బయటపడ్డాక నిగ్గు తేలుతుంది.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

బ్యాంకులు... డబ్బు ఎక్కువ ఉండి పొదుపు, మదుపూ చేసుకునే వారికి... అవసరాలకి అప్పుకోసం దిక్కులు చూసే వారికీ... మధ్యలో అనుసంధాన కర్త వంటివి. వ్యవహర్తలా ఇద్దరి అవసరాలూ తీరుస్తాయి.

సరిగ్గా... ఇలాంటి సత్ర్పయోజనమే, భారీగా వస్తూత్పత్తి చేసే సంస్థలు (కంపెనీలు) పెట్టుబడులు సమీకరించుకునేందుకు, పబ్లిక్ ఇష్యూ విడుదల చేయటంలో ఆశించబడింది.

వస్తూత్పత్తి చేపట్టే భారీ కంపెనీలకు అధికమొత్తంలో పెట్టుబడి అవసరమైనప్పుడూ, అంత మొత్తాన్ని బ్యాంకులు సమకూర్చలేకపోవచ్చు. సమకూర్చినా, అంత మొత్తానికి కంపెనీలు బ్యాంకులకి ష్యూరిటిగా ఆస్తుల్ని చూపించలేక పోవచ్చు.

కంపెనీ మీద నమ్మకంతో (Goodwill)తో, ఏకమొత్తంగా బ్యాంకు ఋణం ఇస్తే... ఒకవేళ అయ్యొచ్చి పైయొచ్చి కంపెనీ నష్టాల పాలైతే... ఆ మొత్తం భారం బ్యాంకు మీద పడుతుంది కదా!

అదీగాక... కొద్దిమొత్తంలో ఆదాయం ఉన్న ప్రజలు దాచుకునే సొమ్ము, అప్ఫు అవసరమైన సామాన్య ప్రజలకు వినియోగిస్తే... పరోక్షంగానైనా సామ్యవాదాన్ని సమర్ధించినట్లవుతుంది. పేద ధనిక తారతమ్యాన్ని తగ్గిస్తూ, అల్ఫాదాయ ప్రజల జీవన స్థాయిని పెంచినట్లవుతుంది. బ్యాంకుల స్థాపనలో అసలు ‘స్ఫూర్తి’ అదే!

అందుచేత కూడా, కంపెనీలు ప్రజల నుండి నేరుగా పెట్టుబడి సమకూర్చు కోవటం మొదట్లో (ఇప్పుడు కూడా) సర్వజనామోదాన్ని పొందింది. అందునా, అప్పట్లో... అన్నీ సానుకూలాంశాలే ప్రచారించబడ్డాయి కదా! ఇప్పుడు కదా అందులోని మోసాలు ఒకటొకటే వెలికి రావడం ప్రారంభమయ్యింది!?

కాబట్టి కూడా, కంపెనీల మీద నమ్మకంతో, ప్రజలు అందులో పెట్టుబడులు పెట్టి భాగస్వాములవ్వడం, అధికమొత్తపు పెట్టుబడి విభజింపబడి తలా కొంతగా చాలామంది కలిసి సమకూర్చడం, బహుళ ప్రయోజనంగా కనబడింది. అటు కంపెనీలకీ, ఇటు పొదుపు చేసిన మొత్తాలని సద్వినియోగం చేసుకోవాలనుకునే సామాన్యులకీ కూడా, పరస్పర ప్రయోజనకారి గానూ కనబడింది.

వ్యాపార విస్తరణకు ‘తలా ఒక చేయి వేసినట్లే, లాభాలనూ తలా కొంచెం పంచుకోవడం’ బావుందనిపించింది. ఒకవేళ అయ్యొచ్చి పైయ్యొచ్చి నష్టమొచ్చినా, తలా కొంత భరిస్తాం గనుక, ఒక్కరే (అది బ్యాంకైనా సరే) మునగటం జరగదు.

సరే! అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ‘పొదుపు చేసిన సొమ్ము కొంచెం ఉంది’ కాబట్టి... ఓ సామాన్యుడు షేర్లు కొంటాడు. రేపు అతడికి ఏ అవసరమో వస్తుంది. అప్పుడెలా? కంపెనీ వ్యాపారం ఉపసహరించినప్పుడు అతడి పెట్టుబడి అతడికి తిరిగిస్తామంటే... పాపం ఆ సామాన్యుడి గతేం కాను? కంపెనీ ఏటా డివిడెండ్ల పేరిట లాభాలు పంచుతుంది గానీ, షేర్ల రూపేణా పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎప్పుడంటే అప్పుడు తీసివ్వ లేదు కదా! అందునా... ఏ కారణం చేతనైనా, అందరూ (లేదా ఎక్కువమంది) మూకుమ్మడిగా పెట్టుబడి తిరిగివ్వమంటే, కంపెనీ మునిగి కూర్చుంటుంది.

అదీగాక, అలా షేర్ల రూపేణా పెట్టిన పెట్టుబడిని, ఎప్పుడంటే అప్పుడు వెనక్కిచ్చేందుకు కాదు కదా సేకరించింది? కంపెనీ విస్తరణ కోసమయ్యె! మరేమిటి చెయ్యడం?

కాబట్టి, షేర్లు కొన్న సామాన్యులకు తిరిగి అమ్ముకునే అవకాశం ఇవ్వబడింది. అదనపు ఆదాయమో, పొదుపు చేసిన సొమ్మో... పెట్టుబడిగా పెట్టగలవాళ్ళు షేర్లు కొంటుంటే... దాచుకున్న సొమ్ము, అవసరాలకు కావాలకున్నవాళ్ళు అమ్ముకుంటారు. ఈ క్రయవిక్రయాలు జరిగేందుకు వేదికలు ఏర్పాటయ్యాయి. వాటినే మనం ‘దలాల్ స్ట్రీట్’ గట్రా పేర్లతో పిలుస్తుంటాం. ఆయా భవనాలనీ, అవి ఉన్న ప్రదేశాలని బట్టి BSE (బాంబే స్టాక్ ఏక్చేంజ్)గట్రాలుగా పిలుస్తుంటాం.

ఇక ఆయా ఫ్లోర్ ల మీద, విషయ సమగ్రత లేకుండా క్రయవిక్రయ లావాదేవీలు నడపటం కష్టం గనక, ఏజంట్ల (మధ్యవర్తులు) అవతారం అవసరపడింది. ఆ విధంగా వచ్చిన ‘బుల్’లు క్రమంగా బలిష్టపడటమూ జరిగింది.

ప్రాధమిక ఇష్యూనాడు, పదిరూపాయల ముఖ విలువతో విడుదల చేయబడిన షేర్లు... ‘కంపెనీ పనితీరుని బట్టి, యాజమాన్యం పై జనంలో ఉన్న నమ్మకం, పరపతిని బట్టి’... షేర్లు చేతులు మారుతున్న నేపధ్యంలో... ధరలు పెరగటం/తరగటం సహజమయ్యింది. కంపెనీ యాజమాన్యం (సభ్యుల మండలి) తన వాటాగా కనీసం 51%, ఆపైన చేతిలో ఉంచుకుంటుంది గనక, మార్కెట్టులో షేర్ ధర పెరిగినప్పుడు కంపెనీ ఆస్తివిలువ కూడా పెరిగినట్లే! తనకు గల షేర్లను బ్యాంకులో హామీగా ఉంచి నిర్వహించే ఖాతా పరిమితి కూడా, షేర్ ధర పెరగటం/తరగటంతో ప్రభావిత మౌతుంది.

గత టపాలలో ‘జగన్మాయ ప్రైవేట్ లిమిటెడ్’ ఉదాహరణలో దానినే వివరించాను.

ఇక ఇంత రంగం సిద్దమయ్యాక, ఈ రంగంలో తెరమీద కనబడని కుట్రదారుల పట్టు ఉన్నాక... ఎన్ని మతలబులు, మాయలూ అయినా సాధ్యమే!

క్రమంగా ‘చిల్లపెంకులతో నింపిన బిందెని సువర్ణకలశం’గా భ్రమింపచేయటమూ సాధ్యమైంది. తమకి అనుకూలమైన కంపెనీలు మాత్రమే నిలబడగలిగి, కానివి కుదేలయ్యేటట్లు పనిచెయ్యటం... దశాబ్దాల పాటు గోప్యంగా, సహనంగా పనిచెయ్యగల కుట్రదారులకి మరింతగా సాధ్యమైంది.

కాబట్టే... మార్కెట్టులోకి ప్రవేశించిన అన్ని కంపెనీలు బ్రతికి బట్టకట్టవు. సమర్ధత ఉన్నా, నటనా సామర్ధ్యమూ, అందమూ అన్నీ ఉన్నా... కొందరు నటీనటులు రాణించలేక పోవటమూ, అలాంటివేవీ లేకపోయినా... లాబీయింగ్ + సినీరంగ గాడ్ ఫాదర్ల దీవెనలూ ఉంటే... అగ్రతారలుగా వెలిగి పోవటం సినిమా రంగంలో ఎలా సాధ్యమో... ఇదీ అంతే! ఫలానా వాళ్ళు రాణించలేక పోయారనీ, వాళ్ళ అదృష్టం బాగాలేదనీ ప్రచారం వస్తుంది. నిజమో కాదో ఆలోచించేంత ఓపిక, పరిశీలించేంత తీరిక మనకు ఉండవు గనక, అది నిజమేనని నమ్మేస్తాం.

ఇక ఈ నేపధ్యంలో... నల్లడబ్బుని తెల్లగానో, తెల్లడబ్బుని నల్లగానో మార్పుకోవాల్సిన తమ అవసరాలని బట్టి, ఆయా కంపెనీల షేరు ధరలు హెచ్చుతగ్గులకి గురౌతాయి. ఇలా నియంత్రించి పెట్టేందుకు కూడా, మీడియాకి, ఆ ముసుగు మాటున దాగిన కుట్రదారుల i.e.నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులకి... డబ్బు లేదా exchange favors చెల్లింపబడతాయి.

తమ అవసరాన్ని బట్టి, అనుకూలతని బట్టి, షేర్ ధరలు హెచ్చుగా ఉన్నప్పుడు లేదా తగ్గి ఉన్నప్పుడు, నిజమైన క్రయవిక్రయాల మాటున బినామీ షేర్లతో కొన్ని క్రయవిక్రయాలు చేయిస్తారు. ఇది అనధికార బైబ్యాక్ అన్నమాట. ఇక అధికారిక బైబ్యాక్ కూడా ఉంటుంది. ఇది ఆర్ధికశాస్త నిర్వచనాల ప్రకారం పక్కాగా ఉంటుంది. ఎటూ... కాపీ పేస్ట్ ల రాజ్యాంగం లాగా.... ఈ ఆర్ధిక శాస్త్రాన్ని, అందులోని నిర్వచనాలని తమ వారికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నావే గానీ, సామాన్య ప్రజల ప్రయోజనార్ధం చేసినవి కావు గదా!

అంతగా నియంత్రణ సాధ్యం గనుకే... అంబానీల్లాంటి వారికి ఇబ్బడిముబ్బడి ఆదాయం ఉంటుంది. వేల కోట్ల రూపాయలతో విలాసవంతమైన విల్లాలు, వందల కోట్ల రూపాయలతో ఇల్లాలికి విమాన, నౌకా బహుమతులు ఇచ్చుకునేంత! అంతే కాదు, ప్రభుత్వ వ్యక్తులకి కూడా అవసరమైనన్ని నిధులు పారించి, అనుకూల నిర్ణయాలు ఇప్పించుకునేంత ఇబ్బడిముబ్బడి ఆదాయమన్న మాట!

ఈ మతలబులు వేటినీ గమనించేందుకు, సామాన్య మదుపర్లకు సాధ్యం కాదు. వాళ్ళ జీవన పోరాటంలో కాళ్ళు తలమునకలై ఉంటారు. అంతేకాదు, పరిశీలించేందుకు తగినంత పరిజ్ఞానం గానీ, పరిశోధించేందుకు తగినంత సానుకూలత గానీ, సమాచారం గానీ, సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇక ఆపైన మీడియా హోరు (పెయిడ్ న్యూస్ లాంటివన్న మాట) ఎటూ సామాన్యుల బుర్రల్ని ‘హైసరబజ్జాలు’/హైజాక్ లు చేస్తూనే ఉంటుంది కదా!?

ఈ ప్రచార హైజాక్ ఎంత మాయ చేస్తుందంటే - షేర్లు కొనటం రీత్యా వాటి ధరలు పెరిగి షేర్ హోల్డర్లు భాగ్యవంతులైనప్పుడు, వాళ్ళ వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ మీడియా ప్రచారిస్తే ‘అవును కామోసు’ అనుకోవాల్సిందే! అలాగే షేర్ ధరలు తరిగి, షేర్ హోల్డర్లు నష్టపోయినప్పుడు, వాళ్ళ వలన కలిగిన ఉపాధి అవకాశాలు కోల్పోతామనీ ప్రచారించినా ‘అవును కామోసు’ అనుకోవాల్సిందే!

నిజానికి వందకోట్లకు పైబడిన జనాభాలో ఆ విధంగా ఉపాధి పొందే వారెంత మంది ఉంటారు? దాన్నే పరిగణించాల్సి వస్తే... మరి, చేతులు మారే అంత ధనంతో జరగవలసిన పారిశ్రామిక వృద్ధి, సవ్యమైన ఆచరణలో ఉంటే, పెరిగే ఉపాధి మాటేమిటి?

ఇంకా పైగా ‘విదేశీ ఇన్వెస్టర్లనీ, స్వదేశీ మదుపుదారులనీ, అదనీ, ఇదనీ’ విశ్లేషణలతో, మీడియా మనల్ని శాసిస్తుంది. ‘పదే పదే చేసే అదే ప్రచారాన్ని’ దాటి, సత్యాన్ని తెలుసుకోవటం అంటే - ఎవరికైనా తలకు మించిన పనే! ఎందుకంటే సామాన్యమదుపరులలో ఎవరికైనా అదే ప్రధానవృత్తి కాదు.

అదీగాక... మీడియా అన్నీ అబద్దాలనే ప్రచారించదు. కొన్ని నిజాలలో, తమకు కావలసిన అబద్దాలు కొన్నిటిని కలగలిపి, వాయిదా పద్దతిలో ప్రచారిస్తుంది. ఏవి నిజాలో, ఏవి అబద్దాలో విడదీసి చూసేందుకు, సామాన్యులేమీ... పాలూ నీళ్ళని వేరుచేయగలిగే ‘రాజహంస’ల వంటి వారు కాదు గదా!

అందుచేత... మీడియాని, అందులో అభిప్రాయాలు వ్యక్తీకరించే నిపుణులనీ అంతగా నమ్ముతాం! నమ్మటం సామాన్యమదుపరుల తప్పుకాదు. నమ్మినవాళ్ళని చల్లగా, మెల్లగా వెన్నుపోటు పొడవటం ప్రచారించే వాళ్ళ తప్పు. నమ్మించి గొంతుకోయటమే నకిలీ కణిక వ్యవస్థ ప్రధాన అస్త్రం అయినప్పుడు ఇక అనుకునేందుకేముంది?

అయితే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నాలుగైదు నెలల క్రితం, నాకు సంపుటి (e-మ్యాగజైన్)తో పరిచయం ఏర్పడింది. లాభాపేక్ష లేకుండా, కేవలం తెలుగు మీది మమకారంతో నడుపుతున్న పక్షపత్రిక బాగుందనిపించింది.

ప్రతి సంచికలోనూ ఓ రెండు కథలు, చిన్నారిలోకం పేరిట పిల్లల కథ, పురాణ విశ్లేషణ, విహారి పేరిట రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు, గుడుల వివరాలతో... సరళంగా, హాయిగా తోచింది.

ఓ వంట, వంటింటి చిట్కాల వివరాలు, మల్లిక్ కార్టూన్ల నవ్వులు, ఓ వ్యంగ్య రచన, ప్రాచీన కళల గురించిన ఆర్తితో బాటుగా కీలుగుర్రం వంటి జానపద కథతో, పత్రిక నాకు చాలా నచ్చింది.

నా దగ్గర కీలుగుర్రం పాత సినిమా సీడీ ఉంది. సంపుటి కీలు గుర్రం సీరియల్ భాగం చదివినప్పుడల్లా... అప్పటికప్పుడు మరోసారి కీలుగుర్రం చూడాలనిపిస్తుంది. అందులో అంజలీ దేవి విలన్! ఓ ప్రక్క వగలు కురిపిస్తూ... మరో వైపు విలనీ, హాస్యం చూపించే ఆమె నటన, మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.

దాంతోపాటు సంపుటిలో సీరియల్ గా వచ్చే కన్యాశుల్కంతో కూడా నాకు ఇదే తంటా! అదీ నా దగ్గర సీడీ ఉంది. సావిత్రి, ఎన్టీఆర్, సీఎస్‌ఆర్, గోవిందరాజుల సుబ్బారావు, వంగరల వంటి మహామహులు పోటీలు పడి నటించిన ఆ సినిమా, చూసినప్పుడల్లా విరగ బడి నవ్వుతూనే ఉంటాం. మరోవైపు ఘంటసాల నోట పుత్తడి బొమ్మ పూర్ణమ్మని ‘చూసి’ కన్నీరు తుడుచుకుంటాం.

అలాంటి ఆపాత మధురాలని గుర్తుకు తెచ్చే ‘సంపుటి’ అందిస్తున్న సాహిత్య సేవ, ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజల్లుతుంది.

మన బ్లాగ్లోకంలో పదునైన కలాలు, (ఇప్పుడు కీబోర్డులనాలేమో!) సొగసైన కలాలు, సునిశిత కలాలూ, నవ్వుల కలాలు, సాహిత్య సౌరభాలని వెదజల్లే కవితా కలాలు, కథల కలాలు... ఎన్నో ఉన్నాయి.

సంపుటికి కథలనీ, రచనలనీ ఆహ్వానిస్తూ, శ్రీలలిత గారు అడిగినప్పుడు... నాకు ఒక్కుమ్మడిగా బ్లాగ్లోకాన్ని అలరిస్తున అందరి కలాలు గుర్తొచ్చాయి.

అందుకే సంపుటి ఆహ్వానాన్ని మీ అందరికీ అందించాలని ఈ టపా వ్రాస్తున్నాను.

సంపుటి e-మ్యాగజైన్ తో పాటు, శ్రీసా టెక్నాలజీస్ నిర్వహిస్తున్న సైటు సంపుటి.కామ్

మన తెలుగుని మురిపిస్తూ, మరిచిపోకూడని అమ్మభాష కమ్మదనాన్ని... పప్పు నెయ్యిలతో కలిపిన వేడి వేడి అన్నంలా అందించాలనే సంపుటి ఆకాంక్షకి, అండదండలందించడం మంచిపనిలో తలా ఓ చెయ్యి వేయడం వంటిదే కదా?

‘భాషా సంస్కృతులు’ అంటూ ద్వంద్వ సమాసాన్ని పెద్దలనటం తరచుగా వింటూంటాం, గానీ పెద్దగా పట్టించుకోం.

నిజానికి భాష, దానితో ముడిపడిన జీవన విధానం, ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే భాష, ఒకో ప్రాంతంలో ఒకో యాసతో ఉండి తనదైన ముద్ర కలిగి ఉంటుంది.

మన శరీరంలో కన్నూ, ముక్కూ, చెవీ, స్వరమూ, కరమూ... దేని పని దానిదీ, దేని ప్రక్రియ దానిదీ అయి ఉండి కూడా, అన్ని కలిసి శరీరంలో భాగాలై ఒదిగిపోయినట్లుగా... మాండలికాలతో కలిసి భాష, భాషలతో కలిసి దేశం, దేశాలతో కలిసి ప్రపంచం! కలిసి ఉంటూనే ఉనికి కాపాడుకుంటూ...! అసలు ప్రకృతిలోనే ఈ సూత్రం ఉంటుంది.

అడవిలో ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, ప్రతి పిట్టా, ప్రతి జంతువూ... దేని ప్రత్యేకత దానిదే! అసలే ప్రత్యేకతా లేని ప్రాణే ఉండదు. అలా ఉంటే - ఏ ప్రత్యేకతా లేకపోవడమే దాని ప్రత్యేకత అవుతుంది. అయినా అన్నీ కలగలిస్తే... అది ఓ అరణ్యం.

అలాంటిదే... భాషలూ, సంస్కృతులూ!

మనందరం చిన్నప్పటి నుండీ విసుగుపుట్టే వరకూ విన్నమాట ‘భిన్నత్వంలో ఏకత్వం’. విసుగుపుట్టినా అది నిజం.

ఇన్ని భాషలూ, ఇన్ని సంస్కృతులూ... కలబోసిన రంగుల హరివిల్లు మన భారతదేశం! అందులో తెలుగు జాతిగా మన ప్రత్యేకత మనది.

తెలుగుదనం.. తీయనిది.
ఆవకాయంత ఘాటైనది.
నేతి ఆరిసెలంత మధురమైనది.
తెలుగింటి ముంగిటి ముగ్గంత మనోహరమైనది.

మనకి మాత్రమే ప్రత్యేకమనిపించే జీవనవిధానం. తీపి,కారం, పులుపూ... ఆరు రుచులూ కలిసిన అరిటాకులో భోజనంలా.. వైవిధ్యంగా... వర్ణభరితంగా!

అలాంటి తెలుగుదనాన్ని, తెలుగు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించాలని ఆకాంక్షించే, సంపుటి.కామ్ లో తెలుగు వారసత్వాన్ని ముందటి తరానికి అందించాలన్న తపన ఉంటుంది. పావలా ఇస్తే పని చెయ్యడానికి వచ్చే ఆనాటి రోజుల్లో, ఆనాటి సాహితీ ప్రియుల రచనలని, ఇప్పటి తరానికి పరిచయం చేయటంలో, ఆ తపనే కనబడుతుంది.

చిట్టి తల్లుల కోసం, బుజ్జిగాళ్ళ కోసం కొన్ని పద్యాలు, అక్షరమాల వంటి వాటితో పాటు, నిఘంటు సౌకర్యాలతో వారి ప్రయత్నం చక్కనిది, చిక్కనైనది.

వాళ్ళే చెప్పుకున్నట్లు తెలుగు దనానికి ఓ చేతి దీపం (Torch Light)లా, చిరువెలుగైనా ఇవ్వటం ‘మాటల కంటే చేతలు మిన్న’ అనటమే కదా!

భక్తి శీర్షికలో మతం గురించి, మన పండుగలు, ఆచరణ గురించి వివరణ ఉంటుంది.

పురాణాలు మనకు వారసత్వంగా అబ్బిన పాఠం వంటివి. ‘ఎప్పటి వరకూ రామాయణం గౌరవింపబడుతుందో అప్పటి వరకూ ఈ గడ్డపైన ధర్మం నిలబడుతుంది’ అన్న ఆర్యోక్తి ఎక్కడో చదివాను. ఎంతగా ట్రిగనా మెట్రీ, ఆల్జీబ్రా, ఫిజిక్స్ కెమిస్ట్రీలలో మునిగిపోయినా, కడుపునింపుకోవటం, జీవితాన్నిసౌకర్యవంతం చేసుకోవటంతో బాటు, అందుకవసరమైన విద్యతో బాటు... మనస్సు నింపుకోవటం, ఆధ్యాత్మిక శిఖరం చేరుకోవటమూ, అందుకవసరమైన విద్యా కావాల్సిందే!

లేకపోతే మనిషికీ, యంత్రానికీ వ్యత్యాసం ఉండదు. ఆ విద్య, మన సంస్కృత సారస్వతంలో పుష్కలంగా ఉంది. అందుకోవటంలో మనదే ఆలస్యం, అలసత్వం కూడా!

సంపుటి వారి సైట్ లో మరో శీర్షిక జ్యోతిష శాస్త్రము. ఆధునిక కాలంలో ఆ శాస్త్రం వంచకులకు సంపాదనా మార్గం కావటంతో కొంత గౌరవం కోల్పోయింది. హేటు వాదుల, మోసకారుల పుణ్యాన, మొత్తంగా నీచపరచబడింది గానీ, వరాహ మిహురుల వంటి ప్రాచీన పండితుల గురించి చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది.

అంతదాకా ఎందుకు? పాత తరానికి, పాత సినిమాలని ఆస్వాదించే ఈనాటి తరానికి కూడా... మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, మాయా బజార్, కన్యాశుల్కం, జగదేకవీరుని కథ... ఇలాంటి అలనాటి సినిమాలలో సీఎస్‌ఆర్ i.e.సీతా రామాంజనేయులు తెలిసి ఉంటారు.

ఆయన తండ్రిగారు గొప్ప జ్యోతిష పండితులట. తన కుమారుడి జాతకం చూసి, నటుడిగా అతడు ప్రసిద్దుడౌతాడని లెక్కలు గట్టి, సీఎస్‌ఆర్ ని పదేళ్ళ వయస్సులోనే స్టేజీ ఎక్కించాడట. నశ్యం పెట్టి మరీ నిద్ర మేల్కొలిపి, నాటకాలలో వేషాలు వేయించాడట. ఆయనెంత విలక్షణ నటుడో ఆనాటి సినిమాలే చెబుతాయి.

కాబట్టి ‘శాస్త్రపు గొప్పదనం అధ్యయనం చేయటం’లో ఉంటుందంటారు. ఈనాటికీ... జ్యోతిష శాస్త్రం మీద విమర్శలెన్ని ఉంటాయో, నమ్మకాలూ అంతే ఉంటాయి. నమ్మటం, నమ్మకపోవటం వ్యక్తిగత స్వేచ్ఛ కదా! సంపుటిలో జ్యోతిష శాస్త్రం గురించి ఓ శీర్షిక నడపబడుతుంది.

శాకాహారాల వివరాలతో ఓ వంట ఇల్లూ పిలుస్తుంటుంది. వీటన్నిటితో బాటు పక్షపత్రిక సంపుటి పలకరిస్తుంది.

కొత్త రచనలని ఆహ్వానిస్తున్న సంపుటి(samputi.com)ని ఓ సారి చూసి, మీ రచనలతో ఆ పత్రికని పరిపుష్టం చేయండి. అలాగే తెలుగు దనానికి మరింత నిండుదనం తేవటానికి మీ సలహాలు కూడా పంపించండి.

ఏమంటారు?సంపుటి పక్షపత్రిక చూడాలంటే ఈ లింకు చూడగలరు.

~~~~~

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu