1980 లో పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉద్యమం పేరిట వేర్పాటువాదం [ఖలిస్తాన్ ఉగ్రవాదుల భాషలో స్వాతంత్రోద్యమం] ప్రారంభమయ్యింది. ఔరంగజేబు హయంలో సిక్కు మతగురువు గురుగోవింద్ సింగ్ ని అతి కౄరంగా బాధించినందుకు భారతదేశపు గడ్డ పైనుండి ఒక్క ముస్లిం కూడా లేకుండా పోయేంత వరకూ గడ్డం, మీసం కత్తిరించమని ప్రతిన బూనారట సిక్కులు, కొన్ని శతాబ్ధాల క్రితం. అలాంటి సిక్కుల్లో నుండి కొందరు, ముస్లిం దేశమైన పాకిస్తాన్ తోనూ, కుట్రదారులతోనూ కుమ్మక్కయి ఖలిస్తాన్ పేరిట[పాకిస్తాన్ లాగా] స్వతంత్రదేశం కావాలని తీవ్రవాదం మొదలుపెట్టారు. 1971 లో భారత ప్రభుత్వం తూర్పు పశ్చిమపాకిస్తాన్ ల అంతర్గత వ్యవహారంలో తలదూర్చి బంగ్లాదేశ్ గా తూర్పుపాకిస్తాన్ ఆవిర్భవించేటట్లు చేసినందుకు ఇది ప్రతీకారమన్న మాట. నిజానికి పాకిస్తాన్ ల అంతర్గత వ్యవహారంలో భారత్ తలదూర్చేటట్లుగా డ్రైవ్ చేశారని గత టపాల్లో వివరించాను. కాకపోతే అలా భారత్ తలదూర్చితే తగవు అంటే యుద్ధం ఏర్పడుతుంది. తమ ఆయుధ బలం మీద అప్పటికి నమ్మకం ఉంది కాబట్టి యుద్ధం రావాలనుకున్నారు, భంగపడ్డారు. దాంతో బంగ్లాదేశ్ అవతరించింది. ఈ ఓటమితో కుట్రదారుల క్రోధం, కుటిలత పెరిగాయి. ప్రతీకారంగా భారత్ నుండి పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టాలని పన్నాగం పన్నారు. 1947 కు ముందు అఖండ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం దేశవిభజన సమయంలో రెండు భాగాలయ్యింది. ఇప్పటికీ పాకిస్తాన్ లో మరో పంజాబ్ రాష్ట్రం ఉంది. పాకిస్తాన్ లో బాగా పంటలు పండే ప్రాంతాల్లో అదీ ఒకటి.

మన దేశంలోని పంజాబ్, పంచనదులు ప్రవహించే సారవంతమైన భూమిగల రాష్ట్రంలోని సిక్కులు బలిష్టులు, శ్రమ జీవులు. అన్నింటి కంటే దేశభక్తులు. బాసుమతి బియ్యం, గోధుమలు బాగా పండే ఈ రాష్ట్రం మీద బ్రిటిషు జమానా రోజుల్లోనే ఎన్నో స్ట్రాటజీలు ప్రయోగించారు. స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో కొంతభాగాన్ని పాక్ కి అప్పచెప్పారు. హరప్పా మొహంజదారోల్లాంటి సింధు నాగరికత చిహ్నాలు కూడా పాకిస్తాన్ కే అప్పగించబడ్డాయి. గొప్పకి మాత్రమే మనం అవి మన పూర్వ [హిందూ] సింధూ నాగరికతలని చెప్పుకోగలం. విదేశీ పర్యాటకానికైనా, స్వదేశీ పర్యాటకానికైనా అవి పాకిస్తాన్ లో ఉన్నాయి. కాకపోతే పశుపతినీ, మాతృదేవతనీ [అంటే పార్వతీ పరమేశ్వరులని] కొలిచే సింధూ నాగరికత పురాతత్త్వ చిహ్నాలు ఇప్పుడు భారతదేశంలో మరికొన్ని చోట్ల లభించడం, పురాతన నాగరికత చిహ్నాలు ఇటీవల దక్షిణ భారతదేశంలోనూ లభించటం భారతీయ సంస్కృతి యొక్క ప్రాచీనతని ధృవీకరిస్తున్నాయి.

ఇక్కడ స్ట్రాటజీకి సంబంధించి ఒక విషయం చెప్పాలి. స్వాతంత్ర సమరం నాడు బాగా పేరుగాంచిన దేశభక్తులు, భావవాదులు, జనాన్ని చైతన్య పరచగలిగిన గొప్పవారు ఎక్కువుగా పుట్టిన గడ్డ బెంగాల్, పంజాబ్. ఆ రెండు రాష్ట్రాలని రెండు ముక్కలుగా చేసి బ్రిటిష్ వాళ్ళు పాక్ కి కట్టబెట్టారు. అలాగే భారతీయ సంస్కృతికి మూల కారణమైన హరప్పా మొహంజదారో లాంటివి కూడా పాక్ కే కట్టబెట్టారు. ఈ రోజు సర్ధార్ధజీలకి బుర్రలేదన్న జోకులతో వాళ్ళ మీద తేలికభావం కలిగేటట్లు ప్రచారిస్తున్నారు. ఇక్కడ తెలియటం లేదా కుట్ర స్వరూపం?

ఇక పంజాబ్ లో 1980 లో ప్రారంభమైన ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకొని, కొన్ని తీవ్రవాద సంస్థలూ, నాయకులూ పుట్టుకొచ్చారు. హింస పెచ్చరిల్ల సాగింది. 1984 ల నాటికి హింస తీవ్రస్థాయికి చేరింది. దాదాపు ప్రతీరోజూ మీడియాలో క్రికెట్ స్కోరులాగా టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పంజాబ్ గ్రామీణుల సంఖ్య ప్రచురింపబడేది. ఈ విషయంలో ‘ఈనాడు’ మరింత ముందడుగు వేసి ఆసక్తికరమైన కథనాలు కూడా ప్రచురించింది. జాతీయస్థాయిలో చాలా పత్రికలు ఇదే పంధా ప్రదర్శించేవి. ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలంటూ ఉద్యమిస్తున్న ఈ సరిహద్దు రాష్ట్ర టెర్రరిస్టులు స్వంత రాష్ట్ర ప్రజల ప్రాణాలెందుకు తీసేవారో ఏ మీడియా అడగలేదు. ఆ నెపాన చోటు ఖాళీ చేయించడం, ఆపైన ఆక్రమణ సాగించడం టెర్రరిస్టులని నడిపే కుట్రదారులకి అలవాటైన స్ట్రాటజీ. [తాలిబాన్లు ఆక్రమిత కాశ్మీర్ లో చేసింది అదే, ఇప్పుడు పాక్ లో చేస్తున్నది అదే.] టెర్రరిస్టులు పంజాబ్ లోని సిక్కులకి పరమ పవిత్రమైన స్వర్ణ దేవాలయాన్ని ఆలవాలంగా మార్చుకున్నారు. మనం ‘ఖడ్గం’ సినిమాలో చూసినట్లు [ప్రకాష్ రాజ్ తమ్ముడు, ముస్లిం తీవ్రవాది, పోలీసులు వెంటబడితే మసీదులోకి దూరిపోతాడు.] నానా హింసా చేసి స్వర్ణ దేవాలయంలోకి అంటే గురుద్వారాల్లోకి దూరి పోయేవాళ్ళు. పోలీసులో, సాయుధ బలగాలో ఆలయాల్లోకి ప్రవేశించడం మతంరీత్యా సెంటిమెంట్ కదా? ఈ ’బలహీనత’ని టెర్రరిస్టులు తమ ’బలం’గా వాడుకునేవారు. మరి టెర్రరిస్టుల దగ్గర ఆయుధాలున్నాయి కదా, అలాంటిది టెర్రరిస్టులు ఆలయాల్లోకి ఎలా ప్రవేశించి తిష్ఠ వేస్తున్నట్లు? ఈ విషయమై మీడియా ప్రజల్ని ఏమాత్రం చైతన్య పరిచే ప్రయత్నం చేయలేదు. అదే, ప్రభుత్వం ఏమైనా చర్య చేపట్టబోతే మాత్రం మనోభావాలు అంటూ గోల పెట్టేవి. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ 1984, జూన్ 6 న ఆపరేషన్ బ్లూస్టార్ కి ఆదేశించింది. సైన్యానికి, టెర్రరిస్టులకి జరిగిన హోరాహోరీ పోరు తర్వాత సైనికులు స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించిగలిగారు. ఆ సందర్భంలో ఆలయం లోపల, టెర్రరిస్టులు బస చేసిన చోట్ల మద్యపు బాటిళ్ళు, స్త్రీల లోదుస్తులూ దొరికాయన్న వార్తలు ఫోటోలతో సహా వచ్చాయి. సైనికులు స్థానిక ప్రజల మీద హింసాకాండ జరపారనీ, స్త్రీలపై అత్యాచారాలు చేసారనీ కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత సిక్కు మత పెద్దల ఆధ్వర్యంలో స్వర్ణ దేవాలయ ప్రాంగణాన్ని పాలతో కడిగి శుద్ది చేసుకున్న వార్తా కథనాల వెల్లువలో పైన పేర్కొన్న రెండు వార్తలూ మరుగున పడిపోయాయి.

దాదాపు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో [ఆగస్టు 16 న] ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని, నాదెండ్ల భాస్కర్ రావు, రామ్ లాల్ కలిపి కూలదోసిన సంఘటన జరిగింది. దేశవ్యాప్త ప్రతీపక్ష మహా నాయకులు అన్న ప్రతిఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎన్.టి.ఆర్. కు మద్దతుగా ప్రచారం చేసారు. దీన్ని గురించి ఇంతకు ముందు టపాల్లో వివరంగా చర్చించాను.

ఈ నేపధ్యంలో ఈనాడు రామోజీరావు పాత్ర ఇందిరాగాంధీకి రామోజీ రావు మీద దృష్టిపడేలా చేసింది. తానింత వరకూ, ఏ కుట్రకు వ్యతిరేకంగా, ఒంటరిగా, దాదాపు ఆత్మరక్షణ, దేశరక్షణ స్థితిలో పోరాడుతోందో, ఏ కుట్రదారుల చిరునామా తెలియక దెబ్బకాచుకుంటూ పోరాటం సాగిస్తోందో, ఆకుట్రలకు ప్రధాన స్థావరం ’ఇతడేనా?’ అన్న అన్వేషణ వైపు ఆవిడ ప్రయాణించింది. ఇది ‘స్థానిక భాషా పత్రిక’లో ఎన్.టి.ఆర్. విషయమై కనబడిన abnormality మీద నిఘా పెట్టేందుకు దారితీసింది.

సెప్టెంబరులో ఇందిరాగాంధీ, నాటి గవర్నర్ రామ్ లాల్ ని వెనక్కి పిలిపించింది. శంకర్ దయాళ్ శర్మని గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ పంపింది. [1992 ఆగస్ట్ లో శంకర్ దయాళ్ శర్మ భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు.] ఆయన రావడంతోనే ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని పునఃప్రతిష్టించాడు. అప్పటి తెలుగు మీడియా, ముఖ్యంగా ఈనాడు ‘ఇందిరాగాంధీ ప్రోద్భలంతోనే రామ్ లాల్ ప్రజాస్వామ్యాయుతంగా ఎన్నికైన ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూలదోసాడని’ గోల పెట్టింది. సత్యమేమిటో 1992 తర్వాత బి.జె.పి.లో చేరిన రామ్ లాల్ కీ, భగవంతుడికీ తెలియాలి.

ఏమైనా ఈ రాజకీయ డ్రామా, ఇందిరాగాంధీ నడుపుతున్న కేంద్రప్రభుత్వ దృష్టి రామోజీరావుని కుట్రకు ప్రధాన సూత్రధారిగా అనుమానించేందుకు దారితీసింది. వెంటనే, ఒక్కనెల రోజుల వ్యవధిలోనే, అక్టోబర్ 31 న ఇందిరాగాంధీ హత్య చేయబడింది. తనని హత్య చేస్తారని ఆవిడకి ముందే తెలుసు. తన చివరి మీటింగ్ లో కూడా ఆవిడ శత్రువులకి అదే సందేశం పంపింది. తన చివరి రక్తపు బొట్టు కూడా దేశం కోసం ధారపోస్తానని చెప్పింది. ఆవిడ తన నివాస గృహంలోనే నెం.1 సప్థర్ జంగ్ రోడ్డులోని ఇంటినుండి బయటికి వస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డులు ఆవిడని కాల్చి చంపారు. ఆరోజే ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలియదు. అలాగే ఆవిషయం బయటనున్న సెక్యూరిటీ గార్డుల కెలా తెలిసిందన్న విషయమూ తెలియదు.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉంటే గుండెకు గురిపెట్టె తుపాకీ తూటా పేల్చినా మరణం సంభవించదు. గాయాల పాలౌతారు అంతే. ఆ విధంగా హత్యా ప్రయత్నం విఫలమైందంటే సెక్యూరిటిగార్డులు పట్టుబడతారు. వారి నుండి నిజం రాబట్టే వరకూ ఇందిరాగాంధీ ఊరుకోదు. కాబట్టే definite probability తో హత్యా ప్రయత్నం చేసారు. అంటే ప్రయత్నిస్తే తప్పని సరిగా పని పూర్తయి తీరాలన్న మాట. అందుకోసం బహుశః కొన్ని రోజులుగా ఎదురు చూసి ఉంటారు.

అలాంటప్పుడు ఎవరు, ఇందిరాగాంధీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నదా లేదా అన్న విషయం బయటికి చేర వేసినట్లు? ఇంటి దొంగ ‘సోనియా గాంధీ’కి కాక ఎవరికి ఆ అవకాశం ఉన్నట్లు? అందుకేనేమో ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు మన పెద్దలు.

సెక్యూరిటి గార్డులు సిక్కులు కావటాన, ఆపరేషన్ బ్లూస్టార్ విషయమై వారి మనోభావాలు దెబ్బతిన్నందున, ఆ యిద్దరు గార్డులు తమంత తాముగా ప్రధానిఇందిరని హత్య చేసారని ‘హత్యకారణం’ వెలుగులోకి వచ్చింది. ఈ కారణాన కేవలం ఇద్దరు గార్డులు తమంతతాముగా, ఎవరి అండదండలూ లేకుండా ఒక ప్రధానిని హత్య చేసే సాహసం చేసారట. అటువంటప్పుడు ఆ గార్డులకి ఇందిరాగాంధి పట్ల ద్వేషం ఉందన్న విషయం వారి తోటి గార్డులకీ, ఇతర కోలిగ్స్ కి తెలియదా? ఎక్కడా ఆ గార్డుల ప్రవర్తనలో అది బయటపడదా? అపరేషన్ బ్లూస్టార్ తరువాత అలాంటివేవీ పరిశీలించకుండానే PMR లో వారికి డ్యూటీ వేస్తారా పై అధికారులు? ప్రధాని నివాసం, కార్యాలయం – ఇలాంటి చోట సేవలు నిర్వర్తించేందుకు గార్డుల్ని, అటెండర్లనీ, ఇతరుల్నీ నియమించేటప్పుడు, నియోగించేటప్పుడు అప్రమత్తత సూత్రాలుంటాయి గదా? ఆ గార్డులకి ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆరోజు వేసుకుందో, లేదో ఎవరు చెప్పాలి? అంటే వాళ్ళిద్దరికి ఇంకా ఎవరో సహాయపడి ఉండాలి కదా? మరి ఆవిషయం ఎందుకు బయటికి రాలేదు? అంతేగాక కేవలం ఇద్దరుగార్డులు స్వయంగా తామే హత్య చేస్తే, మరి ఈ టైముకి ఇందిరాగాంధీ హత్య జరుగుతుంది, అదీ సిక్కు సెక్యూరిటీ గార్డులు హత్య చేస్తారు, ఆ వంకతో ఢిల్లీలోని సిక్కు కుటుంబాల మీద దాడి చేసి మూకుమ్మడి హత్యలు చేయాలన్న పధకం ఎవరు రచించారు, ఎవరు ఆర్గనైజ్ చేసారు, ఎవరి చేత అమలు చేయించారు? ఇందిరాగాంధీ హత్య అక్టోబరు31,1984 ఉదయం 7.00 ప్రాంతంలో జరిగితే ఆ వెంటనే ఢిల్లీ అల్లర్లు జరిగాయి. సిక్కుల ఊచకోత జరిగింది. అప్పటికీ హత్యా ప్రయత్నం ఫలించిందనీ, ఇందిరాగాంధీ మరణించిందనీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించనైనా లేదు. అయినా గానీ అంతగా ఎవరుసమాయత్తమై ఉన్నారు, సిక్కులను ఊచకోత కోయటానికి? ఇందిర అనుకూల వర్గాలకి ఇంకా ఆ షాక్ అయినా తీరదు కదా?

ఈ నేపధ్యం గురించి ఇటీవల సీనియర్ పాత్రికేయుడు మనోజ్ మిట్టా, బాధితుల తరుపున పలుకేసులు వాదించిన న్యాయవాది హెచ్. ఎన్. పుల్కా తమ గ్రంధం ‘When a tree shook Delhi’ లో వివరించారు. 500/-Rs. లకు ఒక హత్య చొప్పన కాంట్రాక్ట్ ఇవ్వబడిందనీ, పధకం ప్రకారం హత్యలు జరిగాయనీ, ఈ అల్లర్లు గురించి నియమించబడిన ఎంక్వయిరీ కమీషన్ కావాలనే నిజాలు తొక్కిపట్టిందనీ, సంఘటన తీవ్రతని తగ్గించి చూపిందనీ, కావాలనే జరిగిన అన్నిటికీ పోలీసుల వైఫల్యమే’ కారణమన్న దనీ, వారు తమ గ్రంధంలో పేర్కొన్నారు. రచయితలిద్దరూ బాధితులను ప్రత్యక్షంగా deal చేసిన వారు. ఈ అల్లర్ల వెనుక గల కుట్రని వారు చాలా స్పష్టంగా విశదీకరించారు. అందుకే ఈ వార్త పత్రికలలో చాలా అప్రాముఖ్యంగా, ఓ మూల, సింగిల్ కాలం న్యూస్ గా 05/12/2007 న ప్రచురింపబడింది. అదే ఏ అరుంధతీ రాయో భారత్ కి వ్యతిరేకంగా వ్రాసిన గ్రంధమై ఉంటే ఈ పాటికి బుకర్ ప్రైజులూ గట్రా వచ్చి ఉండేవి, మీడియా ఎలుగెత్తి విసుగూ విరామం లేకుండా ప్రచారించి ఉండేది.

ఇక ఈ సోనియా గాంధీ 2004 కు ముందు, ప్రతిపక్షంలో ఉండగా, ఓ రోజు పార్లమెంటులో ఆవేశంతో ఊగిపోతూ, కన్నీరొలుకుతున్న కళ్ళతో, గద్గద స్వరంతో “నా అత్తని చంపారు, నా మరదిని చంపారు. నా భర్తని చంపారు” అన్నది. [ఎవరు చంపారు? అయినా సంజయ్ గాంధీ మరణాన్ని అందరూ ప్రమాదంగానే గుర్తించారు గానీ ’చంపబడటం’గా గుర్తించలేదు. ఇందిరాగాంధీ సైతం ఆవిషయమై పెదవి విప్పలేదు. మరి ఈమె ఎలా సంజయ్ గాంధీని ’చంపారు’ గా రిఫర్ చేసిందో?] రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ. చంపింది. చంపించిందెవరో ఇప్పటికీ తేల్చలేదు. ఈ సందర్భంలో 30/04/2008 న ప్రస్తుత భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ’రాజీవ్ హత్య వెనుక అదృశ్య హస్తం’ ఎవరిది? అంటూ తమ ఎన్.డి.ఏ. ప్రభుత్వహయంలో రాజీవ్ హత్య గురించి 50 దేశాలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపామనీ, యు.పి.ఏ. ప్రభుత్వం వచ్చాక ఆ ఫైలుని మూలన పెట్టేసారనీ విమర్శించాడు. [నేను పెట్టిన ఫిర్యాదులే కాదు, రాజీవ్ హత్యకు సంబంధించినవన్నీ తొక్కిపడతారన్న మాట!] 2004 లో అధికారంలోకి వచ్చి, 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న యు.పి.ఏ. ప్రభుత్వానికి ఇందిరాగాంధీ హత్య, ఆపైన ఢిల్లీ అల్లర్లు, రాజీవ్ హత్యల విచారణ గురించి ఎన్ని కమిటీలు వేసారో, అన్ని కమిటీల నుండీ రిపోర్టులు తీసుకొని నిజం నిగ్గు తేల్చుకునేందుకు తీరికే దొరకలేదా? పైపెచ్చు ఎల్.టి.టి.ఇ. కి బాహాటంగా మద్దతిస్తున్న, ఇచ్చిన కరుణానిధితో పొత్తుపెట్టుకొని డి.యం.కె. పార్టీకి మంత్రిపదవులు [కరుణానిధి మనుమడు దయానిధి మారన్ తో సహా] కట్టబెట్టిన యు.పి.ఏ. కుర్చీవ్యక్తి సోనియా గాంధీ, మరి అప్పుడు అంతగా ఎందుకు ఆవేశంగా ఊగిపోయినట్లు? అదీ ఆమె నటనా సామర్ధ్యం!

ఇక, ఈవిధంగా ఢిల్లీ అల్లర్లపై ఎంక్వయిరీ కమీషన్, శతకోటి ఇతర ఎంక్వయిరీ కమీషన్ల లాగే కుట్రలో తన పాత్రని తాను విజయవంతంగా పోషించింది. ఈ ఢిల్లీ అల్లర్లు[1984] గురించి, అప్పుడు దెబ్బతిన్న సిక్కుల మనోభావాల గురించి, ఇందిరాగాంధీ హత్యానంతరం, ఈ గడిచిన 24 ఏళ్ళల్లోనూ ప్రతీవారం దాదాపు క్రమం తప్పుకుండా [ఈ మధ్యే కాస్త తగ్గించాడు లెండి] లండన్ లో భారత మాజీ హైకమీషనరూ, సీనియర్ పాత్రకేయుడూ, పాక్ నుండి వలస వచ్చిన వాడూ అయిన కులదీప్ నయ్యర్ వ్యాసాలు వ్రాస్తూనే ఉంటాడు. ఈతడు దీంతో పాటు దేశంలో జరిగిన, జరుగుతున్న ఇతర హింసాత్మక సంఘటనల గురించి కూడా వ్రాస్తే అదివేరే విషయం కానీ ఈతడు అవేవీ వ్రాయడు. టెర్రరిస్టులు ప్రజల్ని చంపినా, మావోయిస్టులు ఉల్ఫాలు గిరిజనుల్ని చంపినా, నక్సల్స్ పోలీసుల్ని చంపినా, గోద్రాలాంటి సంఘటనల గురించి ఎప్పుడూ కిమ్మనడు. కేవలం సిక్కులకి తప్ప మనోభావాలు మరెవ్వరికి ఉండవన్నట్లు, దశాబ్థాలుగా మరో టాపిక్కే లేకుండా వ్రాస్తునే ఉన్నాడు. ఇతడు వ్రాసే మరో అంశం ఏమిటంటే పాక్ అంతర్గత వ్యవహారాలు! భారత ప్రభుత్వాన్ని పాక్ తో స్నేహహస్తం చాచాలని దాదాపు ప్రతీ వ్యాసంలోనూ భారత్ కి సలహా ఇస్తుంటాడు. పాక్ ఎన్ని దగాలూ, దౌష్ట్యాలూ చేసినా సరే! 1947 లో ఇతడు లాహోర్ నుండి భౌతికంగా మాత్రమే వలసవచ్చాడు గానీ మానసికంగా ఇప్పటికీ ఇతడిదేశభక్తి పాకిస్తాన్ పట్లే ఉంటుంది. మనకి కనిపిస్తూ ఇప్పటికీ పాక్ లోని అన్నిస్థాయిల నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగియున్న ఏకైక పాత్రికేయుడు.

ఇలా పాకిస్తాన్ నుండి శరీరం వలస వచ్చినా మనస్సు అక్కడే ఉండిపోయిన వివిధ రంగాల్లోని ప్రముఖలు మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మాజీ కేంద్రమంత్రి, సినిమా నటుడు సునీల్ దత్ కూడా ఒకడు. అతడి కుమార్తె ప్రియాదత్ కి ప్రత్యక్షంగానూ, కుమారుడు సంజయ్ దత్ కీ పరోక్షంగానూ ఎంత సహాయసహకారాలు యు.పి.ఏ. ప్రభుత్వం నుండి అందుతున్నాయో మనందరికీ తెలిసిందే. ప్రియాదత్ కి సోనియాగాంధీ అశీస్సులుండబట్టి సునిల్ దత్ మరణానంతరం ఎం.పి. టికెట్ వచ్చింది. దాంతో ప్రియాదత్ ముంబై నుండి ఎం.పి. అయ్యింది. సంజయ్ దత్ స్వంత గొంతుతో – పాక్ టెర్రరిస్టులు, మాఫియా గ్యాంగ్ లీడర్లూ అయిన దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులతో సంభాషణా టేపులు బయటికి వచ్చినా, 1993 మార్చిలో బొంబాయిలో పేలిన వరుస బాంబుపేలుళ్ళ కేసులో అతడిపాత్ర గురించి ఆధారాలు బయటిపడినా, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతడి నేరం నిరూపించబడినా, సంజయ్ దత్ గురించి మీడియా ఆసక్తికరమైన కథనాలు వ్రాస్తూనే ఉంది, సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి, ఇప్పుడిక రాజకీయ అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి. మీడియా ఇంటర్యూలలో సంజయ్ దత్ తన తండ్రి గురించి ‘తన గురించి తండ్రే పోలీసులకి ఫోన్ చేసి తనని అరెస్టు చేయించాడని’ కితాబులిచ్చి మరీ చెప్పాడు. [దీనికి పూర్తి వ్యతిరేక కధనాలు 1993 లో వచ్చాయి. కొడుకుని విడిపించుకోవటానికి సునీల్ దత్ అందరి చాలామంది చుట్టూ తిరిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.] అదే అయితే అతడి తండ్రి మరి తన కొడుకు చిన్న వయస్సులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడేలా ఎలా పెంచాడు? అంత విలువల్తో తానుంటే పిల్లల్ని అంత బాధ్యతాయుతంగా పెంచితే, లేక ఎంతో ప్రేమగా, విలువల్తో పెంచితే పిల్లలు డ్రగ్స్ కి అలవాటు పడతారా? ఇప్పటికీ సంజయ్ దత్ కి టిక్కేట్ ఇచ్చి ఎం.పి.ని చేసే గురుతర బాధ్యత నెత్తుకెత్తుకొని అమర్ సింగ్ [సమాజ్ వాది పార్టీ], కోర్టు కేసులురీత్యా, సంజయ్ దత్ కి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వస్తే అతడి కొత్తభార్య మాన్యతకి టిక్కెట్ ఇస్తాం అని ప్రకటించాడు. నేరం నిరూపించబడినా, కోర్టుల నుండి రక్షణా, సినిమాల్లో రాజకీయాల్లో కొనసాగుతున్న కెరియర్ చెప్పడం లేదా కుట్రస్థాయి ఎంత, కుట్రదారుల బలం ఎంత అన్న విషయం? నిజానికి తెరమీదే సంజయ్ దత్ ఖల్ నాయక్ కాదు, నిజంగా కూడా అంతే. అయినా మీడియా అతడి, అతడి భార్యల పునర్వివాహాలకి ఎంత ప్రచారం ఇచ్చిమరీ అతణ్ణి ప్రోత్సహిస్తుంటుంది!

ఒక్క సునిల్ దత్ మాత్రమే కాదు, పాక్ నుండి వలస వచ్చి వెలిగిపోతున్న వారు ఇంకా చాలామందే ఉన్నారు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగూ ఒకరు. అయితే గియితే భవిష్యత్తులో ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రస్తుత ప్రతిపక్షనేత ఎల్.కె. అద్వానీ కూడా పాక్ లోని కరాచీ నుండి వలస వచ్చిన వారే. ఈయన వివాహం చేసుకునేటప్పుడు ఎంచుకొని మరీ అదే కరాచీ నుండి వలస వచ్చిన ’కమల’గారిని వివాహం చేసుకున్నాడు. రాజ్ కపూర్, దేవానంద్, నిన్న అస్కార్ అవార్డు పొందిన గుల్జార్, యష్ చోప్రా, బి.ఆర్. చోప్రా, ....ఇలా ఎందరో. వారంతా తమ తమ రంగాల్లో నిష్ణాతులు, కళల్లో ఆరితేరిన వారు. కాబట్టి పైకి వచ్చారు. అయితే కేవలం వారి సామర్ధ్యమే వారిని పైకి తేలేదనీ, ముంబాయి సినిమా ప్రపంచం పాక్ మాఫీయా గాడ్ ఫాదర్ ల చేతిలో ఉన్నదనీ ఇప్పుడందరికీ తెలిసిన విషయమే. 1980 వ దశకంలో హిందీ చలన చిత్రసీమలోకి కొత్తగా కధానాయికలు రావాలంటే దావూద్ ఇబ్రహీం వంటివారి ఆశీస్సులు ముఖ్యమని అంతా అనుకునే వారు. మందాకిని, దావూద్ ఇబ్రహీంకి సంతానాన్ని కనిచ్చిన విషయం తెలిసిందే. సినిమా గాసిప్స్ పేరిట వార, సినిమా పత్రికలు ఇలాంటి జుగుప్సాపూరిత ప్రచారాన్ని మామూలుగా సిగ్గూ, మొహమాటం లేకుండా ప్రచారం చేసింది. అలాగే ఇప్పుడు దుబాయ్, గల్ఫ్, బ్రిటన్ ల నుండి ఆశీస్సులతో వచ్చి దక్షిణ భారత, హిందీ ఫీల్డ్ లలో ఎన్నో అవకాశాలు అందుపుచ్చుకుంటున్న హీరోయిన్లు మనకి తెలిసిందే.
ఇక మళ్ళీ ఇందిరాగాంధీ విషయానికి వద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, చౌదరి చరణ్ సింగ్ ఉపప్రధానిగా అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీకి సిద్దాంతకర్తగా, మార్గదర్శిగా జయప్రకాష్ నారాయణ్ నిలిచాడు. మీడియా ఆయన్ని లోక్ నాయక్ గా, ఎన్నో ఆదర్శభావాలున్న వ్యక్తిగా అభివర్ణించింది. ఆయన గురించి నాకు తెలిసిందల్లా జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకూ ఈయన్ని బాగా ఉపయోగించుకున్నారనీ, అందుకే మీడియా ఆయనకి బాగా ప్రచారం ఇచ్చిందనీ, జనతా ప్రభుత్వం కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఏర్పడిన స్వల్పవ్యవధిలోనే జయప్రకాష్ నారాయణ్ మరణించారని మాత్రమే.

ఇలాంటి విషయాల్లో కుట్రదారుల స్ట్రాటజీ కొంత క్లిష్టంగా ఉంటుంది. ప్రజల్లో ఒక తరంగం [wave] సృష్టించాలంటే నిజాయితీ, నిజమైన గాఢమైన, భావాలు గల వ్యక్తులు కావాలి. ఎందుకంటే వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు కాబట్టి. భావప్రకంపనలు గల నాయకులే ప్రజల్ని స్పందింపచేయగలరు కాబట్టి. అందుచేత, ఆ పరిస్థితికి తగిన భావాలు, నిజాయితీ గల వ్యక్తుల్ని నాయకులుగా చేసి, వారి వెనుక కుట్రదారులూ, వారి మద్దతుదారులూ చేరతారు. ఈ నాయకులు పాపం నిజంగానే తమ ఆదర్శాలూ, భావాలూ వాస్తవరూపం దాల్చబోతున్నాయనుకొని ఎంతో శ్రమిస్తారు. తీరా పబ్బం గడిచాక ఈ నాయకుల్ని పక్కకు నెట్టి కుట్రదారుల మద్దతుదారులు చక్రం తిప్పడం మొదలెడతారు. ఇలాంటి స్ట్రాటజీ జయప్రకాష్ నారయణ్ మీద ప్రయోగింపబడిందేమో తెలియదు గానీ జనతా ప్రభుత్వం ఏర్పడిన కొద్దినెలల కాలంలోనే జయప్రకాష్ నారాయణ్ అనారోగ్యంతో మరణించాడు.

రెండేళ్ళ పైచిలుకు కాలం అధికారంతో ఉండి జనతా ప్రభుత్వం భారతీయులకీ, దేశానికీ ఏమి మంచి చేసిందో తెలియదు గాని, నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వ్యక్తిగత విషయం మాత్రం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. హఠాత్తుగా ఓ రోజు ఓ విదేశీ ’ఇన్వెస్టిగేటివ్’ విలేఖరి ప్రధాని మురార్జీ దేశాయ్ ని “మీరు ప్రతీరోజూ మీ మూత్రం తాగుతారట కదా!” అని అడిగాడు. దాన్ని నిర్ధ్వంద్వంగా అంగీకరిస్తూ మొరార్జీదేశాయ్ అది తనకు చాలా కాలం నుండీ ఉన్న అలవాటనీ, దాన్ని తను ’జీవజల పానం’ అని పిలుచుకుంటాననీ, ఆ కారణంగానే తను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాననీ చెప్పాడు.

ఇక చూస్కోండీ, ఇంటా బయటా [అంటే స్వదేశీ మరియు విదేశీ మీడియా] ఒకటే రచ్చ. దాని మీద జోకులూ, కథనాలు. ఎంతో నీచంగా, జుగుప్సాకరంగా!

ఇది సహజంగానే దేశభక్తిపరులకి అవమానకరంగా, కుములు బాటుగా అన్పించేది. దేశప్రధానిని వ్యక్తిగా చూడటం సాధ్యం కాదు గదా! అదీగాక మీడియా ‘మొరార్జీ దేశాయ్’ ని అనటం లేదు, భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ ని అంటోంది. ప్రపంచదేశాలన్నీ, వార్త సంస్థలన్నీ, ప్రపంచ ప్రజలంతా ఇండియాని చూసి ఎగతాళి చేస్తున్నారనీ, విరగబడి నవ్వుతున్నారనీ, భారతీయులు అవమాన పడేలా ప్రచారం ఉండేది. అప్పటికే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ కళ్ళుమూసాడు.

ఈ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మీద కొన్ని రాజకీయ అభియోగాలు, మరికొన్ని పెట్టీకేసులు [ఎక్కడో మారుమూల మణిపూర్ లో కోడిపిల్లను దొంగిలించిందన్న నేరాలు నిరూపణ దశకు చేరుకోలేక పోయాయి] మోపి, అరెస్టు చేసి, సంకెళ్ళు వేసి మరీ తీహార్ జైలుకు తీసికెళ్ళింది.

కారణాలు ఏమయినా గానీ, ఇందిరాగాంధీ దొంగో, నేరస్తురాలో కాదు. క్రిమినల్ కాదు. ఇప్పుడైతే టెర్రరిస్టులూ, మావోయిస్టులూ, ఇతర నేరస్తులు సైతం జైల్లో వసతుల్నీ, తమని డీల్ చేయటంలో గౌరవాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితి అప్పడూ ఉండేది. అలాంటిది ఒక రాజకీయ నాయకురాలిని, కేడీ గాళ్ళకు వేసినట్లు చేతులకి సంకెళ్ళు వేసి జైలుకు తీసికెళ్ళారు.

ప్రధాని కావాలని ఆశపడి, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధి వైపు మొగ్గినందున భంగపడి, 1966 - 67 లలో ఇందిరాగాంధీ కాబినెట్లో ఉపప్రధానిగా పనిచేసిన మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్ ప్రభృతులు అంతగా ఆవిడని అవమానించి పగతీర్చుకున్నారు. నిజానికి అది ఆవిడమీద వారి agoni. ఇంకా చెప్పాలంటే అది కుట్రదారులైన సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిషు ఇంకా అనువంశిక నకిలీ కణికులకీ, అప్పటికే వ్యాపారవేత్తలుగా మారిన మాజీ రాజులు, రాణులు, ఇతర బడావ్యాపారులకీ, [వీరంతా కుట్రదారులకు మద్దతుదారులు.] ఇందిరాగాంధీ మీద ఉన్న పగా ప్రతీకారేచ్ఛ. ఆవిడపట్ల కుట్రదారులకున్న ద్వేషమే అది.

ఇందిరాగాంధీ మీద కుట్రదారులకి ఉన్న విద్వేషం ఎంతటి దంటే – 1971 పాకిస్తాన్ యుద్దానంతరం ఇందిరాగాంధీ అమెరికా పర్యటనకు వెళ్ళింది. నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ని కలవటానికి శ్వేత సౌధానికి వెళ్ళిన ఇందిరాగాంధీని ఇచ్చిన అపాయింట్ మెంట్ ను దాటి పదిహేను నిముషాలు వేచి ఉండేలా చేశారు. 1971 పాకిస్తాన్ పై యుద్దవిజయానంతరం అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇందిరా గాంధీని, ఏదో సాయమర్ధించడానికి వచ్చిన ఓ పేద దేశపు ప్రధానిని డీల్ చేసినట్లు చేయాలని శ్వేత సౌధపు ప్రయత్నం. భారతీయుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఆవిడ నిక్సన్ తో కుశల ప్రశ్నలు అడిగి మర్యాదాపూర్వకంగా కలవడానికి వచ్చానని అన్నది. ఆ క్రోధంతో ఆతడు ఆవిడని మంత్రగత్తె [witch] అన్నాడు. అంత విద్వేషం ఎంతకి తెగబడిందంటే ఇందిరాగాంధీ చేతులకి సంకెళ్ళు వేసి తీహార్ జైలుకి తీసికెళ్ళేంత వరకూ. అలాంటి శ్వేతసౌధానికి ఈనాటి సోనియా గాంధీ, ఆమె చేతిలోని రిమోట్ బొమ్మ మన్మోహన్ సింగూ ఎంత సాగిల పడుతున్నారో అందరికీ తెలిసిందే కదా!

అయితే – రాజకీయనాయకులైన మొరార్జీదేశాయ్, తదితరులకి కనీసపాటి విలువలు లేకపోయినా, కనీస మర్యాదా పద్దతుల్ని కావాలనే మరచిపోయినా, సామాన్య భారతీయులు మాత్రం ఈ నైచ్యాన్ని భరించలేకపోయారు. అలాంటి అవమానం ఇందిరాగాంధీకి కాక మరో నాయకుడికి లేదా నాయకురాలికి జరిగినా ప్రజలలాగే స్పందించి ఉండేవారు. వీధి కొళాయి దగ్గరి ఘర్షణల్లా, పార్లమెంట్ స్థాయి రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు ఉండటాన్ని అప్పటి తరం ఓటర్లు ఓర్చలేకపోయారు. వారి లోకఙ్ఞానానికి [common sense] సంబంధించిన స్పందన ఇలా ఉండింది. “ఎమర్జన్సీ కాలంలో ఆవిడ ఏ పొరపాట్లయినా చేసి ఉండొచ్చు గాక! కానీ ఇదిమాత్రం ఆవిడ పట్ల ప్రవర్తించాల్సిన తీరుకాదు. ఆమె భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కూతురు. వారి కుటుంబం తమ విలువైన ఆస్థుల్ని దేశ స్వాతంత్ర సమరం కోసం త్యాగం చేసి, వితరణగా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తమ ’ఆనంద్ భవన్’ని ఇచ్చేసిన త్యాగశీలత వారిది. భారతదేశపు అభివృద్ది కోసం, అంతర్జాతీయ వేదిక మీద దేశ గౌరవం కోసం ఎంతో శ్రమించిన వారు నెహ్రు, ఇందిరాగాంధీ. ఆవిడ మన కోసం, పేదల కోసం ఎన్నో మంచిపనులు చేసింది. అలాంటి వ్యక్తిపట్ల ఇంత అమర్యాద సరైంది కాదు. మొరార్జీ దేశాయ్, అతడి అనుచరులూ దాదాపు ఆవిడని, కౌరవసభలో దుర్యోధనాదులు ద్రౌపదీ దేవిని అవమానించినంతగా అవమానించారు.” [ఇక్కడ ఆవిడ గొప్పదనం చెప్పాలని నా ఉద్దేశం కాదు, ఆవిడవి ఎన్నో తప్పులు ఉండవచ్చు, ఒప్పులు ఉండవచ్చు, కాని ఆవిడ ఒంటరిగా చేసిన పోరాటాన్ని చెప్పటమే నా ఉద్దేశం. అది కుట్ర మీద పోరాటం కాబట్టి. ఆవిడ పుట్టుకతో యోధురాలు, Born Fighter.]

ఈ రకపు స్పందన దేశమంతా పాకింది. 2+ సంవత్సరాల్లోనే జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఉపప్రధాని చౌధురి చరణ్ సింగ్ ప్రధాని కుర్చీ ఆశించడంతో మొరార్జీ దేశాయ్ పదవీచ్యుతుడయ్యాడు. కొద్ది రోజుల్లోనే చరణ్ సింగ్ ప్రభుత్వమూ కూలిపోయింది. ప్రధానిగా ఒక్కరోజు కూడా పార్లమెంట్ కు హాజరుకాలేని ప్రధానిగా చౌధురి చరణ్ సింగ్ [ఇప్పటి నాయకుడు అజిత్ సింగ్ తండ్రి] రికార్డుల కెక్కాడు. తదుపరి 1980 లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి ప్రజాబలం మళ్ళీ సమకూడింది. జనతా ప్రభుత్వపు హయాంలో, మొరార్జీ దేశాయ్ ప్రభృతులు ఆవిడని అవమానించినా ప్రజలు మాత్రం ఆవిడనే తిరిగి ఆహ్వానించినట్లయ్యింది. తిరిగి ప్రధానిగా సౌత్ బ్లాక్ లోకి ప్రవేశించిన ఇందిరాగాంధీ, ఎమర్జన్సీ ప్రకటించే ముందుటి కంటే పెరిగిన అవగాహనతో, మరింత తీవ్రంగానూ, చురుకుగానూ కుట్రదారులని అన్వేషించే పనిలో పడింది. ఎమర్జన్సీ కాలంలో తానెదుర్కున్న అంతర్జాతీయ ఒత్తిడి, కుట్రదారుల బలం పట్ల తనకున్న అంచనాలని మరింత సవరించుకొనేలా చేసింది. రాష్ట్రాలలో కూడా తనకి నమ్మకమయిన వాళ్ళను సి.ఎం. పదవిలో కుర్చోబెట్టసాగింది. కాని అది కాస్తా, ఈరోజు నమ్మకం అనిపించిన వాడు మరునెలకు అపనమ్మకం కలిగే విధంగా పరిస్థితి తయారయ్యింది. దాంతో ఆవిడ వాళ్ళను మార్చి మళ్ళీ ఇంకొకరు, ఇలా మ్యూజికల్ ఛైర్ లాగా ముఖ్యమంత్రి పదవి తయారయ్యింది. ఇంత జరిగినా ఎవరూ కూడా అప్పటికే ఇంటిలో స్థిరపడిన ట్రాన్స్ ప్లాంటర్ సోనియాగాంధీని అనుమానించలేదు. సోనియాగాంధీ నేర్పరితనపు నటనా చాతుర్యం ఇందిరాగాంధీకి కోడలు కాదు కూతురన్నంత దగ్గర చేసింది. ఇందిరాగాంధీ జీవితచరిత్ర వ్రాసిన రచయిత్రి [పేరు మరిచిపోయాను] ఈ విషయాన్ని తన రచనలో ఉటంకించింది. 1992 లో ఇండియా టుడే[తెలుగు] పక్షపత్రికలో దీనిపై సమీక్షా వ్యాసంలో ఈ సమాచారమంతా పొందుపరిచారు. రచయిత్రి మాటల ప్రకారం – ‘1977 నుండి 80 వరకూ జనతా ప్రభుత్వహయంలో ఇందిరాగాంధీ చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఆవిడ ఆర్ధిక సమస్యలతో సహా ఎన్నో సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని సైతం ఎదుర్కొంది. ఓసారి నన్ను 50,000/-Rs. చేబదులు[ఇంటి ఖర్చుల నిమిత్తం] అడిగింది’ అని వ్రాసింది. రచయిత్రి ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలు కూడాను.

అది చదివినప్పుడు, ’భారత దేశపు మాజీ ప్రధాని, దివంగత ప్రధాని నెహ్రు కుమార్తె, అత్యంత ధనికుడైన మోతీలాల్ మనువరాలు, తమ ’ఆనంద్ భవన్’ను కాంగ్రెసుకు విరాళంగా ఇవ్వగలిగిన ధనిక కుటుంబ వారసురాలు అయిన ఇందిరాగాంధీ ఇంత గడ్డుపరిస్థితిని, అందునా ఆర్ధిక దుస్థితిని అనుభవించిందా?’ అని ఆశ్చర్యపోయాను. నమ్మలేక పోయాను కూడా. గూఢచర్యంలో ఏదైనా సాధ్యమే అన్నది అప్పుడు గాకపోయినా తర్వాత పరిశీలనలో కొంత అర్ధమయ్యింది. పోటీ పత్రిక ’ఉదయం’ ఆర్ధిక మూలాలు దెబ్బతీసేందుకు ఈనాడు 1992 లో దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిందని మొన్నీ మధ్య మరో పత్రిక సాక్షిలో చదివినప్పుడు మరికొంత అర్ధమయ్యింది. శతృనాశనానికి ముందు వారి ఉత్సాహాన్ని, సంపదని నాశనం చేయాలని చెప్పే కణికుడి కూటనీతిని చదివాక బాగా అర్ధమయ్యింది.

ఇలాంటి క్లిష్టస్థితిలో అత్తగారికి మరింత చేరువైంది కోడలు సోనియా గాంధీ. ఈ కోడలికి కుట్రదారులతో ఎక్కడా ఏవిధమైన ప్రత్యక్ష సంబంధం లేదు. గడపదాటి బయటకు రాని ఇంటి కోడలిపై ఎలా అనుమానం వస్తుంది? ప్రతీ విషయంనుండీ, ప్రతీ సంఘటన నుండీ అడ్వాంటేజీని పొందగలిగేంత గ్రిప్ కుట్రదారులకీ, వారి గూఢచర్య నెట్ వర్కుకీ అప్పటికే సమకూడింది.

1980 లో తిరిగి అధికారంలోకి వచ్చాక, ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ ఓ రోజు ఫ్లయింగ్ క్లబ్ కి వెళ్ళి శిక్షణ విమానం కూలిన ప్రమాదంలో మరణించాడు. ఇది కన్నతల్లి ఇందిరాగాంధీకి భయంకరమైన ఎదురుదెబ్బ. అది సహజమైన యాదృచ్చిక ప్రమాదం కాదని తెలుసు. నిరూపించగలిగే అవకాశం లేదు. ఏ ఆధారం లేకుండా ఆరోపించి ప్రయోజనం ఏముంది? అందునా తన రాజకీయ వారసుడిగా సంజయ్ గాంధీని ఎంచుకున్న ఆవిడకి, అతని మరణం అశనిపాతమే. ఆరోజు ఉదయం సంజయ్ గాంధీ మరణవార్త అనంతరం, ఆసుపత్రికి, అతడి మృత దేహన్ని చూడటానికి ఇందిరాగాంధీ వెళ్ళింది. ‘మనిషి తొణక లేదనీ, వార్డులోకి ప్రవేశించే ద్వారం దగ్గర మాత్రమే ఆవిడ కాళ్ళు తడబడ్డాయనీ’ వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. పైకి దుఃఖాన్ని ప్రకటిస్తూ గుండెలు బాదుకొని ఏడ్చే స్థితిలో ఆ కన్న తల్లి లేదు. కడుపు కోతని అయినా బహిరంగంగా ప్రకటించి కుట్రదారుల ముందు ఓడిపోదలచని పోరాట యోధురాలు ఇందిరాగాంధీ. యుద్ధభూమిలో, ఎదుటి శతృవు ఆయుధం మననెంతగా బాధించినా, ఓర్చి పోరాటం సాగించటం ధీరలక్షణం. అంతమాత్రం చేత ఆప్తులను కోల్పోయిన దుఃఖం ఉండదా? ఆవిడ దుఃఖాన్నిపైకి ప్రదర్శించలేదన్న వార్తలు వ్రాసిన విలేఖరులే, ఒకవేళ ఆవిడ గనుక బాహాటంగా దుఃఖించి ఉంటే ఎన్ని వైనవైనాలుగా కథనాలు వ్రాసి ఉండే వారో!

ఈ ఎదురుదెబ్బతో ఆవిడ తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని తనకు మద్దతుగా రాజకీయాల్లోకి రమ్మన్నది. ఆ ప్రధాని పదవుల్లో బావుకునేందుకు ఏదో ఉందని, ఆ సంపదని కొడుక్కి కట్టబెట్టాలనీ ఆవిడ రాజీవ్ గాంధీని రాజకీయ ప్రవేశం చెయ్యమనలేదు. ఎందుకంటే ప్రధానిగా ఆవిడ అక్రమార్జన చేసి ఉంటే ఎమర్జన్సీ అనంతర జనతా ప్రభుత్వహయంలో మిత్రురాల్ని ఋణాలడగాల్సిన స్థితిలో ఉండదు. అంతేగాక కుట్ర గురించి తెలిసిన వ్యక్తి! ఎంత సంపద అయినా ప్రాణం కంటే విలువైనది కాదు కదా! రాజకీయాల్లో ఉన్నందున చిన్న కొడుకు ప్రమాదం రూపంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు, అదే ప్రమాదం తనకూ, తన పెద్ద కొడుక్కూ మాత్రం ఉండవా? అయినా ఆవిడ రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి పిలిచిందంటే అది నిశ్చయంగా తన స్వార్ధం కోసం కాదు, దేశం కోసం మాత్రమే. ఎందుకంటే – ఆవిడ, దేశం మీద జరుగుతున్న కుట్ర విషయంలో ఎవరినీ నమ్మే స్థితిలో గానీ, నమ్మగల స్థితిలో గానీ లేదు.

ఈ స్థితిలో రాజీవ్ గాంధీ తల్లి నిర్ణయానికి తలబగ్గే ముందు భార్యని సంప్రదించాడు. ఈవిషయం అతడి భార్య సోనియా గాంధీ స్వయంగా వివిధ ఇంటర్యూలలో, స్వీయ వ్రాతలలో ధృవీకరించింది. అయితే సోనియాగాంధీ రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ససేమిరా అంది, ఆడ బెబ్బులిలా పోరాడిందట.

మరి అలాంటి వ్యక్తి 1998 తర్వాత ఎందుకు రాజకీయాల్లోకి వచ్చిందో ఆమెకే తెలియాలి. 1980 నాటికి ఉన్న ప్రాణభయం[రాజకీయాల్లో భద్రత, ప్రశాంతత లేదన్నది ఆమె వాదన], 1991 లో నిజమై కనబడిన ప్రాణభయం, 1998 లో లేకుండా ఎలా పోయింది? అప్పటికి బాంబుదాడులు [1993 మార్చి నెలలో అప్పటి బొంబాయిలో వరుస బాంబులు పేలాయి] మరింత పెరిగాయి. ఆత్మాహుతి దాడులూ పెరిగాయి. మరి తనకీ, తన పుత్రునికీ రాజకీయాల్లోకి ప్రవేశించినందున ప్రాణభయం ఉండదన్న భరోసా ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎవరిచ్చారు?

అంతేకాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి విపరీత అక్రమార్జన చేస్తూ అందులో కేంద్ర కుర్చీవ్యక్తి అయిన కాంగ్రెస్ అధిష్టానానికి సూట్ కేసుల కొద్దీ డబ్బు దోచీ రోజువారీ రవాణా చేస్తున్నాడనీ, అందుకే ఎవరెంత గగ్గోలు పెట్టినా వై.ఎస్. మీద ఇసుమంత చర్య కూడా కేంద్రం తీసుకోవటం లేదని ప్రతిపక్ష పార్టీలూ, నాయకులు ప్రత్యక్షంగా బహిరంగంగా అరిచి గోల పెడుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నా, సరుకుల దొంగ రవాణా అవుతున్నా ప్రభుత్వం వ్యూహాత్మక ఉదాసీనత చూపుతుంది అంటేనే వారి వాటా వారికి అందుతున్నదని అర్ధం. ఇక సెజ్ ల పేరుతో రైతుల పొలాలు లాక్కొని కార్పోరేట్ కంపెనీలకి కట్టబెడుతున్న తీరు చూసి మనం నోరెళ్ళ బెడుతున్నదే. నోటుకి ఓటు అంటూ కోట్లాది రూపాయలు పెట్టి ఎం.పీ.లని కొని 2008, జులై22 న విశ్వాస పరీక్ష నెగ్గిన యు.పి.ఏ. ప్రభుత్వాన్ని టీ.వీ.లో ప్రత్యక్ష ప్రసారం చూసిందే. అందులో క్రాస్ ఓటింగ్ వేసిన ప్రతిపక్ష ఎం.పీ.లకు టిటిడి ఛైర్మన్ పదవీ, ఏపి భవన్ లో కాబినేట్ హోదా పదవి, సి.ఎం. పదవి ఇవ్వటం అందరికీ తెలిసిందే.

ఇవన్నీ చెప్పడం లేదా సోనియా గాంధీ పనితీరు ఏమిటో? ఇలాంటి వ్యక్తి 1980 లో రాజకీయాలు వద్దని భర్తతో ఎందుకు పోరాడినట్లు? ఎందుకు తాను అధికారంలోకి వచ్చాక ’రాజకీయాలు బాగానే ఉన్నాయి’ అన్నట్లు? ఇంతటి ఈమెని కాంగ్రెసు వాళ్ళు ’అమ్మా, సోనియమ్మా! త్యాగశీలివమ్మ! ‘X’ సార్లు ప్రధాని కాగల అవకాశాన్ని త్యాగం చేశావమ్మ’ అంటూ ఆమె కాళ్ళ మీద పడి దండాలు పెట్టడం చూస్తే ఎంత జుగుప్స కలుగుతుందో చెప్పలేం. ఆమెని చూసి కంటే ఈ కాంగ్రెస్సోళ్ళని చూసి నిర్ఘాంతపోక తప్పడం లేదు.

సరే, మళ్ళీ ప్రస్తుత కాలం నుండి వెనక్కి 1980 కి వెళ్దాం. సంజయ్ గాంధీ మరణానంతరం సంజయ్ గాంధీ భార్య మనేకా గాంధీ, పుత్రుడు ఫిరోజ్ వరుణ్ గాంధీ ఇంటి నుండి బయటి కొచ్చారు. అత్తాకోడళ్ళ జగడం, తోడి కోడళ్ళ తగదాలు అంటూ పత్రిక పతాక శీర్షికలు వచ్చిన మరునాడే ఇందిరాగాంధీ ఆస్తి పంపకం చేసేసింది. మనేకా గాంధీ, వరుణ్ గాంధీ ప్రస్తుతం బి.జే.పి.లో ఉన్నారు. బహుశః సోనియాగాంధీతో పోల్చుకుంటే మనేకా గాంధీ తమకంత ఎక్కువుగా ఉపయోగపడగల వ్యక్తిగా కనబడలేదేమో, కుట్రదారులు మనేకా గాంధీకి పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. అయితే ఈమె పాత్ర మరి అంత తక్కువ కూడా కాదు. మనేకా గాంధీ సైతం కుట్రదారుల పావే. ఎందుకంటే వారి ప్రధాన గురి ఇందిరాగాంధీ గనుక. ఆవిడ కుట్రకు వ్యతిరేకంగా పోరాడుతుంది గనుక. కుట్రదారుల కాటాలో సోనియాగాంధీ ఎక్కువ బరువు తూగిందేమో, ఇప్పటికైతే గాంధీ – నెహ్రు కుటుంబ వారసులు పాపం మనేకా గాంధీ,ఆమె పుత్రుడు వరుణ్ గాంధీ కాకుండా పోయారు. కేవలం ఈ విదేశీ సోనియా గాంధీ, ఆమె సంతతి వారే అయ్యారు. ఇందిరాగాంధీ వారసులలో నాయకత్వ లక్షణాలను పెంపకంలోనే నలిపేసారు. [ఇద్దరిలో ఎవరైనా మనకి ఒకటే అన్న విషయం ఇక్కడ గమనార్హం!] స్వాతంత్ర సమర యోధుల వారసుల మీద కూడా ఇదే ప్రయోగించారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

మరో వైపు ముస్లిం బలం పెరగటం చాపక్రింద నీరులా నడిచింది. సెక్యులర్ ప్రభుత్వం వారి మత విశ్వాసాల్లో కల్పించుకోకూడదు. అప్పటి నిరుద్యోగ, దారిద్రరేఖకు దగ్గరగా ఉన్న ముస్లింలు సంతాననిరోధ ఆపరేషన్లకు వ్యతిరేకంగా ఉండేవారు. అలా వ్యతిరేకంగా ఉండాలని మసీదుల, మదరసాలు, [అప్పడు ఇవి ఎక్కువుగా లేవులెండి. వాటిని ఆరబిక్ స్కూల్స్ అనేవాళ్ళు.] ముల్లాలు, ముస్లింలకి నూరిపోసేవారు. ముల్లాల గ్రిప్ ముస్లింల మీద ఎంత ఉంటుందంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఫలానా ప్రాంతంలోని ముస్లింలందరూ ఫలానా పార్టీ అభ్యర్ధికే ఓటు వేయాలంటే తూచా తప్పకుండా ఓటు వేసేంత. దీని వలన ముస్లిం సామాన్య జనంకు ఎలాంటి లాభం ఉండదు. వాళ్ళలో అభద్రతాభావం పెంచి, వాళ్ళు అనివార్యంగా మసీదుకు తలవొగ్గేటట్లు చూసుకోవడమే ఇక్కడి స్ట్రాటజీ. అందుకు అవసరమైతే హిందూ – ముస్లింల మధ్య ఘర్షణలు పెరిగేటట్లు చూడగలరు. వాళ్ళ ఓట్లు మసీదును అనుసరించి ఉండేటట్లు చూసుకుంటారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఒకటి చెబుతాను. ముస్లిం ఓటుబ్యాంకు కోసం రాజకీయపార్టీలు నానాగడ్డీ కరుస్తాయి. ‘14% ముస్లిం ఓట్లు అంత ముఖ్యమైనప్పుడు 79% హిందూ ఓట్లు ఎందుకు ముఖ్యం కాదు?’ అని తార్కికంగా ఆలోచించి ఆశ్చర్యపోతుంటాం మనం. కాని ముస్లిం ఓట్లను మసీదులు ప్రభావితం చేస్తుంటాయి. వాటికి వెనుక కారణాలు చాలా ఉంటాయి. వీళ్ళ మసీదులకి సౌదీ అరేబియా మొదలైన ముస్లిం దేశాలనుండి ఫండ్స్ వస్తుంటాయి. ఆ నిధులతో మదరసాల నిర్వహణ చేస్తుంటారు. ముషారప్ సీటు దిగేటప్పుడు సౌదీ పాత్ర చాలా ఉంది. అమెరికా, బ్రిటన్ లను సంప్రదించినంతగా సౌదీనీ సంప్రదించిన తరువాతే ముషారప్ సీటు దిగాడు. అలాగే, 1992 లో బాబ్రీ మసీదు విషయంలో కూడా సౌదీ అలాంటి పాత్రే తీసుకోవటానికి ప్రయత్నించగా, అప్పటి భారత ప్రభుత్వం అంత అవకాశం ఇవ్వలేదు. ఇలా మన దేశపు మసీదుల మీద సౌదీ ప్రభావం చాలా ఉంది. ఆ విధంగా కుట్రదారుల పై ముఖం [over leaf reason]గా సౌదీరాజులాంటి వారు ఉంటారు.

ఇక – ఓట్ల విషయానికి వస్తే హిందూ ఓట్లు చీల్చటానికి కుట్రదారులు ఓట్లు చీల్చగల పార్టీలనూ, ఆయా నియోజక వర్గాలలో తిరుగుబాటు అభ్యర్దుల పేరుతో ఎక్కువ మంది పోటీలో ఉండేటట్లు చూస్తారు. చాలా పార్టీలను, చాలా మంది అభ్యర్దులను నిలబెట్టి హిందూ ఓట్లను చీల్చుతారు. ఆవిధంగా ముస్లీం ఓట్లు, అభ్యర్ధుల గెలుపుఓటమిలను ప్రభావితం చేస్తాయి. అంతేగాక మసీదుల నుండి ఓట్లను ఫలానా పార్టీ అయితేనే మనకు భద్రత అని, కాబట్టి తాము చెప్పిన పార్టీకే ఓట్లు వేయమని ఓటర్లులను ప్రభావితం చేస్తారు. కొద్దిశాతం ఓట్లు చీలినా అధిక శాతం ఓట్లు ముద్దరగా ఒకే పార్టీకి పడతాయి. ఏపార్టీని గెలిపించాలన్న నిర్ణయం కుట్రదారులు తీసుకుంటారు.

ఈవిధంగా ముస్లిమేతరులలో ‘విభజించు పాలించు’ అన్న నీతి అమలుచేయబడితే, ముస్లింలలో ముల్లాలు, మతపెద్దల ద్వారా ’కలిసి ఉండు, లాభం పొందు’ అన్న పాలసీ అమలు చేయబడుతుంది. ఈ కిటుకు తెలుసు కాబట్టే రాజకీయనాయకులు పార్టీల కతీతంగా ముస్లింలకు అనుకూలంగా ఉంటారు. ఈవిధంగా ముస్లిం గారాబం నడిపింపబడుతుంది. ఇలాంటి చాలా స్ట్రాటజీలు ముస్లింలకి ప్రపంచవ్యాప్తంగా అనుకూలంగా నడిపింపబడుతున్నాయి. అయితే అది చాలామంది ముస్లింలకి కూడా తెలియదు. వారిలో అత్యధికులు విద్యాహీనులు, చేతి వృత్తుల వారు. ముల్లా ఏంచెబితే అది చేయటానికి అలవాటు పడిన వారు. ఆట అంతా పైస్థాయిలోనే ఉంటుంది. ప్రయోజనమూ పైవారికే కలుగుతుంది. మధ్యలో పేదముస్లిం ఓటరు పావుమాత్రమే. తనకి తాను కూడా ఏమాత్రమూ ఉపయోగపడని పావు.

ఇదే నెట్ వర్క్ ని ఉపయోగించి, అప్పట్లో అంటే 1975 నాటికి, దేశంలో ముస్లిం జనాభా వృద్ధి రేటు అందోళనకర స్థాయిలో ఉండింది. అలాగే వదిలేస్తే ఇండియా ఇప్పటికి మరో ఇండోనేషియా అయ్యేది. ఒకప్పటి బౌద్ద దేశం ఇండోనేషియా, ఇప్పుడు ముస్లిం దేశం. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలున్న దేశంగా ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. రెండో ర్యాంకులో పాకిస్తాన్ ఉంది. ఆనాడు భారత్ లో పెరుగుతున్న ముస్లిం జనాభా వృద్దిరేటు ఈ భవిష్యస్థితి ఊహకందే దూరంలో ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థని గానీ, చివరికి కుటుంబస్థితిని గాని పరిగణనలోకి తీసుకొనే స్థితిలో ముల్లాలు లేరు. దాంతో ముస్లిం పేదలూ లేరు. తినడానికి తిండి గింజలకు ఇంట్లో కరువుండేదేమో గానీ పిల్లలకి కాదు. ఇంతకు ముందు నేను ఒకసారి వ్రాసినట్లు నాబాల్యం గుంటూరు మాయా బజార్ లో గడిచింది. అక్కడ పేద ముస్లింలు చాలామంది ఉండేవారు. చిన్న గదుల్లో కాపురం. ఇంట్లో కనీసం 7 నుండి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ముక్కుపచ్చలారని పిల్లల్ని, ఆటోమొబైల్ సర్వీస్ షాపుల్లో, మేస్త్రీకి హెల్పర్లుగా తెచ్చివదిలిపెట్టేవారు. బొడ్డుకోసి పిల్లల్ని మాయా బజార్లో వదలిపెడతారని సాక్షాత్తూ ఆ ముస్లిం మేస్త్రీలే అనేవారు. ఆటా పాటా, ముద్దు మురిపం అన్నీ పనిలోనే, మేస్త్రీతోనే. బేరం హడావుడీలో ఉన్నప్పుడు స్ర్కూడ్రైవర్ సరిగా అందించని పసి హెల్పర్ ని గుండు మీద అదే స్ర్కూడ్రైవర్ తో బాదే మేస్త్రీలు, బుగ్గలపై మసి చారికలతో పాటు కన్నీటి చారికలతోనూ పసిహెల్పర్లూ, పనేం లేనప్పుడు, తీరికగా ఉన్నప్పుడు ’ఇందాక పని ఒత్తిడిలో బుడ్డోడినికొట్టానే’ అన్న పశ్చాతాప్తంతో చేగోడిలో, పుల్ల ఐస్ లో పసివాళ్ళకీ కొనిచ్చి ముద్దు చేసే మేస్త్రీల చేతుల్లో, దెబ్బలు మరిచిపోయి నవ్వులు కురిపించే పిల్ల హెల్పర్లూ – అక్కడ సర్వసాధారణ దృశ్యాలు.

ఇంత దారుణ దరిద్ర స్థితిలోనూ “ఏమయ్యా! ఇంతమంది పిల్లలతో ఎందుకంత కష్టం? చదివించలేవు. పైకి తేలేవు. ఆపరేషన్ చేయించుకోకూడదు?" అంటే “మనమేం చేస్తాం? దేవుడిస్తున్నాడు. ఆపరేషన్ పాపం. ఖురాన్ ఒప్పకోదు” అనేవాళ్ళు. ఖురాన్ లో ఏముందో చదివేందుకు వారికి అరబిక్ రాదూ, సరికదా తెలుగు కూడా చదవటం, వ్రాయటం రాని నిరక్షరాస్యులే. కానీ ముల్లాలు, మత పెద్దలూ ఖురాన్ లో అలా ఉందని చెప్పారు, నమ్మాలి అంతే. ఈ నమ్మికనీ, అమాయకత్వాన్నీ జయప్రదంగా తమ స్వార్ధానికి ఉపయోగించుకొనే వారు పైస్థాయిలోని కుట్రదారులు.

దాంతో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుందన్న ఆందోళన సర్వత్రా ఉండేది. వారిలో విద్యనీ, సామాజిక స్పృహనీ పెంచే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించింది ప్రభుత్వం. ఫలితం మాత్రం శూన్యం. దాదాపు ప్రభుత్వ పధకాలన్నీ ఇదే స్థితిలో ఉండేవి. పధక రచనకూ, అమలుకూ కోటానుకోట్లు వెచ్చింపబడేవి. ఫలితం మాత్రం గుండు సున్నాలు వచ్చేవి.

ఈస్థితిలో కుట్రదారులకూ, ఇందిరాగాంధీ ప్రభుత్వానికీ దొంగా పోలీసు ఆట అయ్యింది. ఈ నేపధ్యం ఇందిరాగాంధీ, దేశంలో ఎమర్జన్సీ విధించే వరకూ ప్రయాణించింది. ఆవిడా, ఆవిడకు తోడుగా నిలిచిన కొద్దిమంది మంత్రివర్గ సహచరులూ ఎమర్జన్సీని బాగా సమర్ధించారు. వారికి దేశంలో జరుగుతున్న కుట్ర అనుభవానికి అందుతోంది. నిరూపించేందుకు నిస్సహాయులు.

ఆ కొద్దిమంది మంత్రివర్గ సహచరులూ భారతదేశం పట్ల నిబద్దత, దేశభక్తిగలవారు. వారికి కుట్ర అనుభవానికి అందుతోంది. కానీ ఎక్కడి నుండి అమలు చేయబడుతుందో, ఎవరు సూత్రధారులో తెలియలేదు. తోచిన అన్ని దారుల్లోనూ అన్వేషించారు. అయితే ఇంటి కోడలిగా, గడపదాటని ఇల్లాలిగా సోనియాగాంధీని గానీ, స్థానిక తెలుగు పత్రికకి చెందిన చిన్న వ్యాపారి రామోజీరావుని గానీ అనుమానించలేకపోయారు. చంకలో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతా వెదికినట్లు వెదికారు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఎందుకంటే మనవారి మీద, ‘మన వారు’ అనుకున్న వారి మీద మనకుండే నమ్మకం. అందుకే ఇందిరాగాంధీ తన కోడల్ని అనుమానించలేకపోయింది. అయినాగానీ, ఎమర్జన్సీ సమయంలో కొన్ని నెలలు రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ స్వదేశం విడిచిపెట్టి దేశాంతర నివాసం చేసారు. అప్పుడు కూడా కుట్రతీరులో ఏమార్పు రాకుండా జాగ్రత్త పడ్డారు కుట్రదారులు. ఒక మనిషిని absent చేసినా కూడా యధాతధంగా పని నడిచినప్పుడు మనం ఏమనుకుంటాం? సదరు పనిలో ఆవ్యక్తి ప్రమేయం ఏమీ లేదనుకుంటాం. సరిగ్గా అదే జరిగింది. అనవసరంగా అనుమానించామే అన్న పశ్చాత్తాపం కూడా ఇందులో ప్రభావం చూపుతుంది. అందుకనే ఎమర్జన్సీ అనంతరం జనతా ప్రభుత్వహయంలో, ఇందిరాగాంధీ క్లిష్టస్థితిలో, సోనియాగాంధీ ఆవిడకి మరింత చేరువయ్యింది. తలలో నాలుక అయ్యింది. మరింత మానసిక మద్దతు ఇచ్చింది. తాము గురిపెట్టిన వ్యక్తికి – కష్టం తామే కలిగించి, తమవారిని దగ్గర చేయటం అనే స్ట్రాటజీ ఇది. అప్పుడు తమ వారి స్థానం మరింత బలపడుతుంది. తాము ఎవరి మీదైతే గురిపెట్టారో ఆవ్యక్తి తమ ఏజంటు మీద పూర్తిగా మానసికంగా ఆధారపడతారు. ఇదీ మానసిక తంత్రమే. గూఢచార మంత్రమే.

మరోవైపు అప్పటికే ఇందిరాగాంధీ క్యాబినేట్ లో స్థిరపడిన కుట్రదారుల మద్దతుదారులు ఆవిడని, ఆవిడకు నమ్మకస్తులైన కొద్దిమంది దేశభక్తుల్నీ అప్పటి విషయాలకు సమస్యలకూ అప్పటికి పైకి కనబడే కారణాలని[over leaf reasons] చూపెట్టి convince చేయటానికి, misguide చేయటానికి విశ్వప్రయత్నం చేసేవాళ్ళు. మీడియా ఎటూ ఉండనే ఉన్నది. అదే ప్రధాన కుట్రదారు అనుకోలేదు గనుక మీడియా వ్రాసేదంతా అబద్దమనో, కుట్ర అనో అనుకోరు. సరిగదా మీడియా వ్రాసే దాన్ని ఎంతోకొంత నిజం అనీ, కొండొకచో ఎక్కువభాగం నిజమనే ఆవిడ వర్గం కూడా అనుకొనే వాళ్ళు.

1975 లో ఎమర్జన్సీ విధింపబడింది. ఎంతోమంది రాజకీయ నాయకుల్నీ, రచయితల్నీ, కాస్తోకూస్తో పేరున్న చాలామందిని జైల్లో పెట్టారు. కొందరు అఙ్ఞాతంలోకి పోయారు. అప్పటి మీడియా వార్తలకి నియంత్రణ విధింపబడింది. అప్పటికి ఈనాడు వైజాగ్ ఎడిషన్ పుట్టి సంవత్సరమే అయ్యింది. హైదరాబాద్ ఎడిషన్ 1975 లో పుట్టింది గనుక ఎమర్జన్సీ అరెస్టుల ప్రమాదం రామోజీరావుకి మిగిలిన వారికి ఉన్నంత తీవ్రంగా లేకపోయింది.

అయితే కుట్రదారుల బలం, కుట్రని ఎదుర్కోనే వారి బలం కన్నా, తీవ్రంగానూ, ఎక్కువుగానూ ఉండింది. అప్పటికే ఆయా స్థానాల్లో స్థిరపడిన కుట్రదారుల ఏజంట్లు, మద్దతుదారుల బలం దీనికి తోడయ్యింది. అలాంటి కుట్రదారుల మద్దతుదారులలో కొందరు రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ కూడా ఉన్నారు.

ఇక్కడ విస్మయకరమైన ఒక విషయాన్ని మీదృష్టికి తెస్తాను. బాబూ జగ్జీవన్ రామ్ అనే దళిత నాయకుడు అప్పట్లో ఇందిరాగాంధీ క్యాబినేట్ లో సీనియరూ, ప్రముఖుడూ కూడాను. అతడు ఎమర్జన్సీ ప్రకటనకి సరిగ్గా ఒకటి రెండు రోజుల ముందు లేదా ప్రకటించిన ఒకటి రెండు రోజుల తర్వాత ఇందిరా గాంధీ ఎమర్జన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశాడు. అతడు రాజీనామా చేసిన రోజున రామోజీ రావు, ఈనాడులో ఇందిరాగాంధీ అతడికి వ్రాసిన లేఖ పూర్తి పాఠాన్ని “బాబూజీ మీరు కూడానా?" అన్న శీర్షికతో ప్రచురించాడు. [షేక్స్ పియర్ నాటకం జూలియర్ సీజర్ లోని ‘యూ టూ బ్రూటస్’ లాగా అన్నమాట] రాజీనామా నిర్ణయానికి జగ్జీవన్ రామ్ కారణాలు ఏమైనా ఉండవచ్చు కానీ, అతడి ప్రవర్తన మాత్రం నైతికత కాదు. అప్పటి వరకూ తాను ప్రయాణించిన నౌకని నట్టేట ముంచుతూ ఉమ్మడి బాధ్యత నుండి తృటిలో తప్పించుకుంటూ, ఎమర్జన్సీ నిర్ణయం క్యాబినెట్ లో చర్చించలేదంటూ, అసలు తనకి ఆవిషయమే తెలియదంటూ, ఇది ఇందిరాగాంధీ నియంతృత్వపోకడ అంటూ ఒక్కసారిగా టీంని వదిలేసాడు. ఇందులోని నిజానిజాలు ఎవరో మేధావుల గ్రంధాల కంటే, అప్పటి మీడియా కధనాలు చూస్తే బాగా తెలుస్తాయి. ఆ జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 5న జాతీయ సెలవుదినంగా నేటి యు.పి.ఏ. ప్రభుత్వకుర్చీవ్యక్తి సోనియాగాంధీ ప్రకటించింది. దళిత ఓట్ల కోసం అన్న పైకారణం [over leaf reason] చూపెట్టబడింది. అయితే ఆవిధంగా జగ్ జీవన్ రామ్ ఆత్మకి, అతడి వారసులకి [return gift] ప్రతి బహుమతి ఇచ్చారు. అదేవిధంగా కుట్రమద్దతుదారులకు సిగ్నల్ ఇచ్చారు. ‘తమని నమ్మి చెడిన వారు లేరు’ అన్నట్లన్న మాట. ఏపార్టీకి అయితే వెన్నుపోటు పోడిచాడో, ఆపార్టీ చేతనే అతడికి గౌరవం దక్కేటట్లు చేయడం ఇక్కడి స్ట్రాటజీ. అప్పడే కదా మరికొందరు ధైర్యంగా ముందుకొస్తారు, తమకి సహకరించడానికి?

ఇక ఎమర్జన్సీని జయప్రదంగా ఓటమి పాలు చేయగలిగారు కుట్రదారులు. సంజయ్ గాంధీ దగ్గరుండి ముస్లిం యువకులకి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించాడనీ, అందులో 12 ఏళ్ళ అబ్బాయిలు కూడా ఉన్నారనీ, డాక్టర్లకి లక్ష్యాలు నిర్ణయించి మూకుమ్మడి ఆపరేషన్లు చేయించాడనీ, దాంతో డాక్టర్లు లక్ష్యం సంఖ్య [Target No.] చేరుకోవడానికి చిన్నపిల్లలకి కూడా ఆపరేషన్లు చేశారనీ, మొదటగా విదేశీ మీడియా బయటపెట్టగా, తదుపరి స్వదేశీ మీడియా గళం, కలం కలిపాయి. జయప్రదంగా ఎమర్జన్సీ భారతదేశచరిత్రలో మాయని మచ్చనీ, ప్రజాస్వామ్యపు ముఖం మ్మీద నల్లమచ్చనీ, చీకటి రోజులనీ, అంధయుగమనీ హోరెత్తించారు.

కుట్ర గురించి అసలు తెలియని, ఊహించని స్వేచ్ఛాప్రియులు అది నిజమని ఎలుగెత్తారు. ప్రజలు అవి నమ్మారు. మొత్తంగా ఎమర్జన్సీ అన్న అంకం అలా పూర్తి అయ్యింది. ఓటమి పొందింది.

ఇందిరాగాంధీ 1977 లో ఎమర్జన్సీ రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించింది. ‘ఇప్పుడు ఎన్నికలు జరిపిస్తే గెలుస్తామని’ నివేదిక ఇచ్చి నిఘా సంస్థలు ఇందిరాగాంధీని తప్పదోవ పట్టించాయని అప్పట్లో వార్తలొచ్చాయి. కుట్రదారులే నిఘా సంస్థల్ని తప్పు దోవపట్టించారో, లేక కుట్రదారులు నిఘా సంస్థలోని కొందరు కీలక వ్యక్తుల్ని లోబరుచుకున్నారో తెలియదు. ఏది చేయటానికైనా కుట్రదారులు సమర్ధులే.

అయితే, ఆవిధమైన వార్త కధనాలు వ్రాయటం ద్వారా భారత గూఢచార, నిఘా సంస్థలకీ, ఇందిరాగాంధీ కి మధ్య అపార్ధాలనీ, కమ్యూనికేషన్ గాప్ నీ సృష్టించగలిగారు. భవిష్యత్తులో తాము కొనసాగించబోయే కుట్రలకు సానుకూల పరిస్థితులు సృష్టించుకొనేందుకు ప్రభుత్వానికి, నిఘా సంస్థలకీ మధ్య అపనమ్మకాన్ని ప్రవేశపెట్టటం, సమన్వయాన్ని దెబ్బతీయటం చేశారు. గూఢచర్యంలో ఇలాంటి స్ట్రాటజీలు అతి నైపుణ్యంతోనూ, దూరదృష్టితోనూ అమలు చేయబడతాయి. ఎంత దూరదృష్టి అంటే దశాబ్దాల కాలాన్ని ముందుగా ఊహించి మరీ పధక రచన చేస్తారు. ఒకోసారి కొన్ని స్ట్రాటజీలకు కాలవ్యవధి 50 సంవత్సరాల కన్నా ఎక్కువుగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. [ఇక అనువంశిక నకిలీ కణికుల సహనం అయితే శతాబ్ధాల పాటిది.] ప్రపంచప్రజలందరికీ instant food, instant result అలవాటు చేసి, ’సహనం, వేచి ఉండటం’ అన్న లక్షణాలని ప్రజల నుండి దూరం చేస్తారు. తాము మాత్రం తమ గూఢచార పధక ఫలితాలని, నెమ్మదిగా సుదీర్ఘంగా చాపక్రింద నీరులా పొందగల సహనం కలిగి ఉంటారు. అప్పుడు ప్రజలు ఈ గూఢచర్య తంత్రాన్ని తెలిసినా నమ్మలేరు కదా!


ఏమయితేనేం – నిఘావర్గాల సలహాలే కానివ్వండి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి రీత్యా కానివ్వండి, ఎమర్జన్సీ చీకటిలో ఇండియాలో దారుణ మారణకాండ, [ముస్లింలకి నిర్బంధ సంతాన నిరోధ ఆపరేషన్ల వంటివి] నియంతృత్వం జరిగిపోతున్నాయని అంతర్జాతీయ మీడియా ప్రచారం వల్ల కానివ్వండి, ఇందిరాగాంధీ 1977 లో ఎమర్జన్సీ రద్దుచేసి ఎన్నికలు ప్రకటించింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇక ఇందిరాగాంధీ ఊపిరి సలుపుకోవడానికి వీల్లేనంతగా సమస్యల వెల్లువ సృష్టించబడింది. అన్నీ ద్వంద్వపూరిత విషయాలే! అంటే Paradoxes అన్నమాట. ముస్లిం ప్రత్యేక చట్టాలు, కోర్టు తీర్పులు, సామాజిక అంశాల్లాంటివి. ఉదాహరణకి: ముస్లిం విడాకుల చట్టం. అప్పట్లో ’షాబానో’ అనే ముస్లిం మహిళ విడాకుల కేసు సంచలనం సృష్టించింది. ఈ విషయం ఎన్నో విమర్శలకీ, విబేధాలకీ, సిద్దాంతరాద్దాంతాలకీ తెరతీసింది. ముస్లింల చట్టం ప్రకారం – వారి మతంలో ఉన్న అమానుషత్వం రీత్యా గానివ్వండి, స్త్రీలపట్ల వారికున్న చిన్నచూపురీత్యా కానివ్వండి, భార్యనుండి విడాకులు తీసుకోవాలంటే మూడుసార్లు ‘తలాక్!’ అంటే చాలు. దీని మీదట సిద్దాంత చర్చలు ఎలా రేగాయంటే – “ఇది న్యాయసమ్మతమా?", "ఇది అమానుషమా కాదా?", "ఎందుకు ముస్లింలు మతం పేరిట సౌలభ్యాలు అనుభవించగలుగుతున్నారు?" "కోర్టు ముందు అందరికీ ఒకే చట్టం ఉండాలి గానీ ముస్లింలకి ప్రత్యేక చట్టం ఉండటమేమిటి?" ఇలా.

ఇక్కడ కొంచెం ముస్లిం మతం గురించి చర్చించాలి. సాటి మనిషిని, మనిషి జన్మకు సగం కారణమైన స్త్రీని, తల్లినీ, చెల్లినీ, భార్యనీ తమకి సమానంగా వారు గౌరవించరు. ఒక పురుషుడు నలుగురు స్త్రీలని వివాహం చేసుకోవచ్చు. రాజులూ రంగప్పల రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా! వద్దనుకుంటే భరణాల్లేవు, కేసుల్లేవ్. తలాక్ అని 3 సార్లంటే చాలు. తల్లి పిల్లల్ని 16 ఏళ్ళు పెంచి, పిల్లలు చేతి కొచ్చే వయస్సుకి తండ్రికి అప్పచెప్పాలి. ఆ విధంగా స్త్రీ శరీరశ్రమకి కూడా విలువలేదు. స్త్రీ ఒక భోగ వస్తువు తప్ప సాటి మనిషి కాదు వారి దృష్టిలో. ఇప్పుడు చూస్తున్నాం కదా స్వాత్ లోయలోని షరియా చట్టాన్ని? ఆడపిల్లలు చదువుకోగూడదు. తన్ని, బడులు మూయిస్తున్నారు. మళ్ళీ రోగమొస్తే ఆడవాళ్ళు మగ డాక్టరు చేత వైద్యం చేయించుకోకూడదు. ఆడ డాక్టరు దగ్గరే వైద్యం చేయించుకోవాలి. ఆడవాళ్ళు చదువు కోకూడని చోట ఆడ డాక్టర్లు ఎక్కడ నుండి వస్తారూ? అంటే రోగమొస్తే చావండి అని పరోక్షంగా ఆడవారిని శాసిస్తున్నారన్న మాట. సాటి మనిషినే మనిషిగా గుర్తించని మతం – ‘సర్వే జనాః సుఖినో భవంతు’, ‘సమస్త సన్మంగళాని సంతు’ అని సర్వజీవుల క్షేమాన్ని కాంక్షించే హిందూ మతపు మానవత్వ స్థాయిని అందుకోగలదా? అందుకోవటం సంగతటుంచి, కనీసం అర్ధం కూడా చేసుకోలేదు. ఒకటో తరగతి చదివే కుర్రాడికి Theory of Relativity నో లేక Theory of Probability నో చెప్పడం లాంటిది ఆ మతఛాందస వాదులతో వాదించి నిజం అంగీకరింపచేయలను కోవటం. ఎందుకంటే అది వారి మానసిక స్థాయికి అర్దంకాని, అందని పరిణతి. అదృష్టవశాత్తు భారతీయ ముస్లింలలో అధికులు తాలిబాన్లంత మత చాందసులు కాకపోవటంతో భారత్ లో స్వాత్ లోయలు పుట్టలేదు.

ఇక మళ్ళీ ’షాబానో’ కేసు దగ్గరికి వద్దాం.

ఇక అలాంటి రోజుల్లో, ఓ రోజు ఈనాడు పత్రిక “ఈ రోజు భారతదేశంలో ఇందిరాగాంధీ కంటే నాకే ఎక్కువ పేరుప్రఖ్యాతులున్నాయి” అని షాబానో అన్నదని వ్రాసింది. అంతేగాక క్రమం తప్పకుండా ‘ఈనాడు’ షాబానో వార్తల్ని, కొన్ని ఎడిటోరియల్ వ్యాసాలతో సహా ప్రచురించి follow up ఇచ్చింది. ఇప్పుడు సానియా మీర్జా కి ఇస్తున్నట్లన్న మాట. మరో పోలిక చెప్పాలంటే 2008లో బిల్ గేట్స్ కంటే బిన్ లాడెన్ కే ప్రజల్లో గుర్తింపు [ర్యాంకింగ్] ఉందని వ్రాసినట్లన్నమాట. బిన్ లాడెన్ notorious, బిల్ గేట్స్ famous. మొదటి వాడు విధ్వంసకారి, రెండో వ్యక్తి నిర్మాణాత్మక కార్యశీలి.

అదేవిధంగా షాబానో notorious ఇందిరాగాంధీ famous. కాలం గడిచాక, ఈరోజు షాబానో ఎవరో ఎవరికీ తెలియదు. అదే ఇందిరాగాంధీ అయితే అందరికీ తెలుసుకదా! అందుకే అంటారేమో మన పెద్దలు ’నిజం నిలకడ మీద తెలుస్తుంది’ అని.

కానీ ఆ రోజుల్లో ఆ తాత్కాలిక ఇమేజిలో [అదీ పత్రికలు షాబానోకి ఇచ్చిందే, తమ News Coverage తో] షాబానో వ్యాఖ్యలూ, తదుపరి చెత్త[Nasty] చర్చలతో మీడియాలో హోరిత్తించబడింది. ఈ చర్చలతో, ఇలాంటి వ్యాఖ్యల ప్రచురణలతో ఏవిధంగా మీడియా ప్రజలకి సేవ చేసినట్లో ఎవరికీ తెలియదు, ఎవరూ ప్రశ్నించలేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా మీడియా ప్రచురించదు కదా! ఇలాంటి వార్తల కవరేజ్ తో, ఎడిటోరియల్స్ తో ప్రజలపట్ల మీడియా బాధ్యత నెరవేర్చినట్లు ఎలా అవుతుందో, ఇలాంటి సంచలనాత్మక వార్తలతో ఎలా ప్రజా సేవ చేసినట్లో రామోజీరావుకి మాత్రమే తెలియాలి. ఇలాంటి వార్తలే ఎక్కువగా పేపర్లో ఉండేవి. [నీనా గుప్తా గర్భానికి తండ్రెవరు లాంటివి మరికొన్ని.] అప్పట్లో బడిలో ప్రతిరోజూ వార్తా పత్రికా పఠనం నా బాధ్యత అయినందున ఇలాంటి వార్తలు నాకు బాగా గుర్తున్నాయి. అయితే అలాంటి వార్తలు ప్రజల్లో అసహనాన్ని రేపేవి. ఇందిరాగాంధీని, ఆవిడని అభిమానించే సామాన్యప్రజలని అవి మరింత చికాకు పెట్టేవి.

మరొక వైపు, ఈ కుట్రలో భాగమా అన్నట్లు విలేఖరులు, వివిధ సందర్భాల్లో, ఇందిరాగాంధీని ఇంటర్యూలలో ఈవిషయం మీద ప్రశ్నించటమో లేదా వ్యాఖ్యానించమని అర్ధించటమో చేసేవారు. కొంతమంది మంత్రి పుంగవులు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు వ్యాఖ్యనించేవారు. దాని మీద మళ్ళీ ఇందిరాగాంధీని విలేఖర్లు వ్యాఖ్యనించమని అడుగుతుండే వాళ్ళు. సహజంగానే ఇలాంటి nastiness కొనసాగితే ఎవరైనా సైకలాజికల్ గా బ్రేక్ అవుతారు. ఇందిరాగాంధీ అయినా, మరొకరైనా ఈ సహజ ప్రక్రియకి అతీతులు కారు. అందునా బ్రేక్ అయ్యేంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది కూడా. అలా బ్రేక్ అయ్యి, ఏ స్పందన చూపినా, ఇక మీడియా ’చూస్కో నా తడఖా’ అంటుంది. ఈ స్పందనతో మరింతగా తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల మీద గురిపెట్టి మరీ మరింత ఇరిటేట్ చేస్తుంది. నల్లమేక నలుగురు దొంగలు కథలోని దొంగల్లా నలుగురు విలేఖర్లు ఇరిటేట్ చేయలేకపోతే 40 మంది విలేఖర్లు పుట్టుకొచ్చి మరీ కొనసాగిస్తారు.

ఎటూ, ఇంకా ఎంత ఇరిటేట్ చేస్తే ఇందిరాగాంధీ బ్రేక్ అవుతుందో, ఆవిడ motives, moods, opinions, emotions బయటకి చేరవేయడానికి ఇంటిలోపల కోడలుంది. బయట ఇందిరాగాంధీ మంత్రి వర్గంలోనూ, కార్యాలయంలోనూ అప్పటికి మరికొందరు అవతరించారు.

ఈవిధంగా సందేహాస్పదం కాకుండా, జయప్రదంగా కుట్రదారుల స్ట్రాటజీ 1974 తర్వాత మరింత జోరుగా సాగింది. 1974 ఎందుకంటున్నానంటే ఈనాడు పుట్టింది 1974 ల్లోనే. ఖచ్చితంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ ప్రధానిగా 1966 లో బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ఎన్నికల్లో పాల్గొని తదుపరి ప్రధాని అయ్యింది. 1966 నుండి 5½ సంవత్సరాల్లో అంటే 1971, 72 వరకూ ఆవిడ ఖాతాలో ఎన్నోవిజయాలున్నాయి. బ్యాంకుల జాతీయకరణ, ప్రీవీ పర్సులు రద్దు[రాజాభరణాల రద్దు], 500/-, 1000/-Rs. నోట్లచలామణి రద్దు, 1971 ఇండో – పాక్ యుద్ధం విజయం, బంగ్లా దేశ అవతరణ, హరిత విప్లవ రూపేణా అధిక ధాన్యోత్పత్తి, శ్వేతవిప్లవం అంటూ పాల ఉత్పత్తి పెరుగుదల, ఇంకా పార్టీ పరంగా కాంగ్రెసు సీనియర్లలతో పార్టీ చీలికలని తట్టుకొని పార్టీని గ్రిప్ చేయగలిగింది…….ఇలా.

అయితే 1974 తర్వాత, ముఖ్యంగా ఇంటికోడలిగా సోనియా గాంధీ నమ్మకంగా ఇంట్లో స్థిరపడ్డాక, ఇందిరాగాంధీ అతివేగపు సమస్యల ఒరవడిలో పడిపోయింది. దేశంలో శాంతి నశింపసాగింది. డ్రగ్స్ వాడకం గురించిన వార్తలు, మేధోవలసల తాలూకూ వత్తిళ్ళు, స్త్రీ రాజ్యమేలుతున్న దేశంలో పసిపిల్లల పాలపొడి డబ్బాలకు కరువు లాంటి సమస్యలతో అల్లాడింది. మనలో మనమాట. భారతదేశంలో అప్పటికి వేలసంవత్సరాలుగా తల్లులు లేరా, పిల్లలు లేరా? అప్పుడెప్పుడూ పాలపొడి డబ్బాల అవసరం రాలేదు. తల్లిపాలు తాగే పిల్లలు పెరిగారు. కానీ ఇందిరాగాంధీ హయంలో 1975 నాటి కల్లా పిల్లలకి పాలిస్తే శరీర సౌష్ఠవం దెబ్బతింటుందన్న మీడియాకథలూ, సినిమా కథల ప్రచారంతో పాలపొడి డబ్బాల వాడకం పెరిగింద[ట]. వాటికీ కరువొచ్చింది. అప్పటికే మధ్యతరగతి ప్రజల్లో కూడా తల్లిపాలు చాలక పిల్లలకి డబ్బాపాలు పట్టడం మొదలయ్యింది. గర్భిణిలకు ఇవ్వబడిన మందుల మూలంగానే ఈ defects అనే వార్తలూ వచ్చాయి. నిజానిజాలు మాత్రం భగవంతుడికే తెలియాలి. అప్పుడు అనుమానించకపోయినా, కుట్రదారుల అమానుషత్వం తెలిసాక ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీలని అనుమానించకుండా ఉండలేం కూడా. ఏది ఏమయినా ఇలాంటివి సెంటిమెంట్ తో కూడిన విషయాలు. ఇవి ఇందిరాగాంధీని ఇబ్బందిపాలు చేసినవి.

ఇందిరాగాంధీ ఈ కుట్రలకీ, దేశంలో అశాంతి చెలరేగడానికి కారణం విదేశీ కుట్ర, ముఖ్యంగా పాకిస్తాన్ కుట్ర అనేది. అప్పటికే పాకిస్తాన్ కి అమెరికా బాహాటంగా సహాయసహకారాలు ఇస్తూండేది. రష్యాతో భారత్ స్నేహం మాటల్లో కోటలు దాటేది, చేతుల్లో గడపలు దాటేది కాదు. చిన్న చిన్న సాయాలు తప్పితే రష్యా ఎప్పడూ స్నేహంలో నిబద్దత చూపింది లేదు. దాన్ని క్రయోజనిక్ ఇంజన్ల అమ్మకం విషయంతోనూ, అన్నిటితోనూ కాలం నిరూపించింది. ఇప్పుడంటే – అస్సలు సామరస్యం లేని చైనా, అమెరికాకి రెండు ట్రిలియన్ల డాలర్ల విదేశీ ద్రవ్యం సమకూరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల వెనుక ఉన్నది ఒకే చోదకశక్తి అని తెలుస్తోంది గానీ అప్పుడంటే దాన్ని ఊహించను కూడా లేంకదా! అందుచేత ఇందిరాగాంధీ దేశంలో జరుగుతున్న అలజడులకీ, అశాంతికీ పాకిస్తానే కారణం అనేది. దాంతో మీడియా “ఇందిరాగాంధీ ‘పాక్ బూచి’ని చూపెట్టి తనపదవినీ, అధికారాన్నీ, ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజల్ని గ్రిప్ చేయటానికి పాక్ బూచిని చూపెడుతుంది” అని ఎలుగెత్తి అరిచేది.

అయితే ఈ సంఘటనలకి ముందు, ఖచ్చితంగా చెప్పాలంటే 1974 కు ముందు ఇండియా మీడియా “ఇందిరంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా” అనేది. అదే మీడియాలో 1974 తర్వాత పరిస్థితి ఇలా మారిపోయింది.

మీడియా ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ మీద గురిపెట్టింది. అతణ్ణి ’రాజ్యాంగేతర శక్తి’గా అభివర్ణించేది. ప్రతీరోజూ పత్రికల్లో అతడి గురించిన కథనాలు వచ్చేవి. కొన్ని సార్లు అతడి సమర్ధతని పొగుడుతున్నట్లు వ్రాసేవాళ్ళు. కొన్నిసార్లు అతణ్ణి rude and egoistic అని వ్రాసేవాళ్ళు. వెరసి అతడు మంచివాడో, చెడ్డవాడో, అసలెలాంటి వాడో తెలియదు. ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ రాజకీయాల పట్ల విమఖడు. అతడి భార్య సోనియా గాంధీ కూడా అతణ్ణి సపోర్ట్ చేయటంతో అతడు పైలట్ గా ఉద్యోగంలో కొనసాగేవాడు. దాంతో ఇందిరాగాంధీ పూర్తిగా తన రెండవ కుమారుడు సంజయ్ గాంధీ మీద ఆధారపడింది. బహుశః రాజకీయాల గురించి, దేశం మీద కుట్రల గురించి తనకున్న అవగాహనని కుమారుడికి పంచుతూ, అతణ్ణి educate చేసుకుంటూ, తన వారసుణ్ణి తయారు చేసుకోవాలనుకొనేది. కుమారుడి పట్ల ఆవిడ పనితీరు అలాగే ఉండేది.

కొన్నాళ్ళు ఇందిరాగాంధీ తండ్రికి వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసింది. పిల్లలని తీర్చిదిద్దుకోవాలను కున్నప్పుడు ఆవిడ ఇంటికి పరిమితమైపోయింది. తరువాత చైనా యుద్దం తరువాత మళ్ళీ తండ్రికి సహాయకురాలిగా పనిచేసింది. తండ్రితనకి ఎలా శిక్షణ ఇచ్చాడో ఆవిడకి స్పృహ ఉంది. బహుశః అలాగే తనూ తన కొడుక్కి రాజకీయాల గురించి, అందులో తీవ్రసమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవలసిన తీరు గురించి, సవాళ్ళ గురించీ, రాజకీయ పరిశీలన, నీతిఙ్ఞతల గురించి శిక్షణ ఇవ్వాలనుకోనేది కాబోలు. అందుకోనేమో ఈనాడు రామోజీరావు, అతడి అనుచర పత్రికలు సంజయ్ గాంధీ మీద గురిపెట్టాయి. నాటి కొన్ని సినిమాల్లో ఆ పోలికల్తో విలన్లుండేవారు. అతణ్ణి దురుసు, అహంకారి గా చిత్రించాయి. అప్పటికే పైకి కనబడకుండానే establish అయిన అనువంశిక నకిలీ కణికుడి నెట్ వర్క్, దాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్ళేటట్లు ప్రత్యక్ష పరోక్ష ప్రచారం గావించింది.

1971 నుండి 1975 వరకూ 5 ½ ఏళ్ళల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఊపిరిసలపని సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. ఎక్కడో ఏదో జరుగుతుందని అర్ధమయ్యేది. ఎక్కడో, ఎలాగో, ఎవరు చేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. ఆవిడతో పాటుగా ఆవిడ కాబినెట్లో ఉన్న కొందరు నాయకులు [భారతదేశం పట్ల నిబద్దతగల నాయకులైన పి.వి.నరసింహా రావు లాంటి కొందరు] కూడా ఈ కుట్ర అస్థిత్వాన్ని గుర్తించగలిగారు. కుట్రతీరు ఏమిటి, ఎలా పనిచేస్తూందీ, ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు మద్దతిస్తున్నారు – ఇలాంటి వివరాలు అయోమయంగా ఉండేవి. ఉదాహరణకి ఈరోజు ఒకవ్యక్తి ఒకతీరున కన్పించి, అనుమానిస్తే మరికొన్నాళ్ళు పరిస్థితులన్నీ మారిపోయి ఆవ్యక్తి ఫక్తు దేశభక్తుడిగా కన్పించేవాడు. అతణ్ణి దేశద్రోహిగా అనుమానించి పొరపాటుపడ్డామనే భావన ఇందిరాగాంధీకి, ఆవిడ అనుచరులకీ కలిగేది. [ఇక్కడ ఇంటి ‘స్పై’ సోనియాగాంధీ పాత్ర చాలా ముఖ్యమైనది.]

ఇందిరాగాంధీ తన మంత్రివర్గంలోని దేశభక్తి, నిబద్దత, నిజాయితీ గల ఇతర సహచరులతో కుట్ర గురించి లోతైన చర్చలు జరపకుండా, తన అవగాహనని ఇతర సహచరులతో పంచుకోకుండా, ఆవిడకి అక్రమసంబంధాల పుకార్లు అంటగట్టేవారు. ఎందుకంటే ఒక బుర్రకి పదిబుర్రలు కలిస్తే క్రమంగా దేశభక్తుల బలం పెరుగుతుంది గనుక. ఎలాగైనా ఆవిడని ఒంటరిని చేయటమే లక్ష్యం, ఒంటరి వ్యక్తిని బ్రేక్ చేయడం సులభం గనుక. అందుకే ఇక్కడా ‘విభజించు పాలించు’ అన్న సూత్రమే అమలు చేయబడింది.

ఇంత జరుగుతుంటే ఆనాడు నిఘాసంస్థలకి తెలియ లేదా అంటారేమో? ఇది గడిచి 33 ఏళ్ళు అయ్యింది గనుకా, నిజం నిలకడ మీద తెలుస్తుందన్న పెద్దల మాట ప్రకారం ఇప్పటికి నిజం నిగ్గు బాగా తేలుతోంది గనుకా మనకి కుట్ర అర్ధమౌతుంది. అంతేగాక, గడిచిన 33 ఏళ్ళలో ప్రధాన కుట్రదారుగా రామోజీరావు ఉనికి తెలిసి 16 ఏళ్ళు అయ్యింది గనుకా, ఇప్పుడు మరింత స్పష్టంగా, కుట్రదారునితో పాటుగా కుట్రా తెలుస్తోంది. ఎందుకంటే ఈ 16 ఏళ్ళల్లో సినిమా మాధ్యమం గూడా ఎన్నో ’ఎత్తు పై ఎత్తుల్నీ’, కుట్రల్నీ, మేధోమిశ్రిత రాజకీయాల్నీ, పవర్ గేముల్నీ ప్రజా బాహుళ్యంలోకి పరిచయం చేసింది. కాబట్టే మనకి కుట్ర తీరు మరికొంత విశదంగా తెలుస్తోంది. మరోసారి గుర్తు చేస్తున్నాను. 1992 కు ముందర ‘ఢీ’, ‘గమ్యం’, …… లాంటి సినిమాలు ఉండేవి కావు. శ్రీవారి ముచ్చట్లు, రామకృష్ణులు, రాముడు కాదు కృష్ణుడు, రావణుడే రాముడైతే లాంటివి ఉండేవి. కణిక నీతిలోని తొలివాక్యం – “శతృ నాశనానికి ముందు వారి ఉత్సాహాన్ని హరించాలి” అన్న పద్దతిలో కళలు ఉండేవి. కంచు కాగడాతో వెదికినా మన సినిమాల్లో తార్కికత ఉండేది కాదు [ఏ భాషైనా ఒకటే.]

అందుచేత కుట్రతీరుని ప్రజలు అర్ధం చేసుకొనే స్థాయిలోఉండేవారు కాదు. అర్ధం చేసే ప్రయత్నము ఎవరూ చేసేవారు కాదు. నిఘా సంస్థలు సైతం కుట్రని ఎదుర్కొనే స్థితిలో ఉండేవి. ఎందుకంటే దెబ్బకాచుకునే వాడికి, ఇక దెబ్బకొట్టేదెవరో, ఎక్కడి నుండి, ఎలా దెబ్బకొడుతున్నారో తెలుసుకోగలిగేంత ఓపికా, తీరికా ఉండవు కదా! నిరంతరం డిఫెన్స్ లోనే ఉండాలి. ఓ పోలిక చూడండి.

ఒడ్డునున్న మనకి, నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి అందుబాటులో చెట్టో, దుంగో ఉన్నట్లు కన్పిస్తుంది. అందులో పడి ఈదేవాడికి మాత్రమే ఒరవడి ఎంతో తెలుస్తుంది. ఆ చెట్టునో, దుంగనో ఆసరాగా తీసుకోగలిగే అవకాశం ఎంతుందో తెలుస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోగలరో లేదో, వాళ్ళ ఒత్తిడి, అనుభవమూ వాళ్ళవి. కొన్నిసార్లైనా అలాంటి అవకాశం వదులుకోకుండా పోరాడారు గనుకే ఇంకా ఇండియా అంటూ ఓదేశం ప్రపంచపటంలో మిగిలి ఉంది అని నేను అనుకుంటాను. ఈ కుట్రని మొత్తంగా కాలంతో పోల్చిచూస్తేనే బాగా అర్ధమౌతుంది.

ఇలాంటి సందర్భంలోనే ఇందిరాగాంధీ ‘విదేశీ హస్తం’ గురించి రిఫర్ చేసేది. భారత్ మీద విదేశీ కుట్ర జరుగుతుందనడం ఆవిడ ఉద్దేశం. ఆకుట్ర కీలకం ఇంట్లో తిష్ఠవేసిన కోడలని అనుకోకపోవటం ఆవిడ దురదృష్టం. ఇక ఈ విదేశీ హస్తం మీద లెక్కలేనన్ని జోకులూ ఎగతాళీ పుట్టాయి. వాటి గురించి ఇంతకుముందే మనం ముచ్చటించుకున్నాం. ఆరోజైతే ‘భార్య గర్భవతి అయినా ఇందులో విదేశీ హస్తం ఉదంటుంది కాంగ్రెస్’ అంటూ పచ్చి జోకులు వేసాడు రామోజీరావు. మరి ఇప్పుడు నకిలీ స్టాంపులు, నకిలీ పాస్ పోర్టులూ, నకిలీ నోట్లు, పేలుతున్న బాంబులు, ముంబాయి దాడులూ అన్నింటిలో విదేశీ హస్తం , ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో అన్నింటిలో విదేశీ హస్తం నిరూపితమై కూర్చున్నాయి. కళ్ళముందే కన్పిస్తున్నాయి కదా! మరి ఇప్పుడు జోకులు వేయడేం సోనియాగాంధీ మీద, ఆవిడ రాజ్యాంగేతర శక్తిమీద, ఇంకా ఆవిడ కుమారుడి మీద? ఇది అనువంశిక పాలన కాదా? కేవలం ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలు మాత్రమే మహారాణి – యువరాజులా? [అనువంశిక పాలకులా?] సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కారా? నిన్న మొన్న కూడా ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నాయకులు కూడా ‘ప్రధాని కాగల అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయి’ అంటూ ప్రకటించారే? అసలు ’ప్రభుత్వానికి కుర్చీవ్యక్తి’ అనే పదవి రాజ్యాంగంలో ఉందా? ఇప్పుడు ఈవిషయాల మీద కిమ్మనడం లేదు గానీ అప్పట్లో రామోజీరావు చండ్రనిప్పులు కురిపించేవాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1968 లో సోనియాగాంధీ ఇండియాకి వచ్చింది. 1969 లో ఇందిరాగాంధీ ఇంట కోడలిగా, రాజీవ్ భార్యగా అడుగుపెట్టింది. వివాహానికి పూర్వం ఆవిడ అమితాబ్ బచ్చన్ ఇంట అతిధిగా ఉంది. ఆ కుటుంబంతో సోనియా గాంధీకి సన్నిహిత స్నేహసంబంధాలుండటం అప్పటి వార్తల్లో ప్రధానాంశంగా ఉండేది. ఆవిడ అమితాబ్ బచ్చన్ ని ’అమిత్ భయ్యా’ అని పిలిచేది. [ఇలా అని సోనియాగాంధీ స్వయంగా చెప్పినట్లూ ఓ ఇంటర్యూలో ప్రచురించారు.] ఈ స్నేహం 1991-92 ల దాకా కొనసాగింది. రాజీవ్ గాంధీ దహన సంస్కారలప్పుడు కూడా సోనియాకీ, అమితాబ్ పెద్దదిక్కుగా వ్యవహరించాడు. 1980 ల్లో సంజయ్ గాంధీ మరణానంతరం, ఇందిరకు మద్దతుగా రాజీవ్ రాజకీయరంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు సోనియా గాంధీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆడబెబ్బులిలా[like a tigress] వ్యతిరేకించానని ఆవిడే అన్నట్లుగా పైన చెప్పిన ఇంటర్ వ్యూలో చదివాను. ఆ ఇంటర్ వ్యూ 1992 లో ఇండియా టుడే లోనూ ఇతర పత్రికల్లోనూ ముద్రితమైంది. అప్పుడు అంటే 1980 లో సోనియాగాంధీ నిర్ణయాన్ని అమితాబ్ బచ్చన్ సమర్ధించాడని వార్తలు అప్పట్లో ఉండేవి. అమితాబ్ బచ్చన్ కూడా తర్వాత అంటే 1980 ల్లో రాజకీయాల్లోకి రావడం అందరికీ తెలిసిందే. పార్లమెంట్ సభ్యుడిగా కూడా కొంతకాలం అతడు పనిచేసాడు. అలాగే 1996 తర్వాత కూడా సోనియాగాంధీని రాజకీయాల్లోకి ప్రవేశించవద్దని సలహా ఇచ్చాడని వినికిడి. అప్పటికి అతడి రాజకీయ కెరీర్ వెనుకంజలో పడింది కూడా! అయితే ఏం జరిగిందో తెలియదు గానీ 1992 తర్వాత అమితాబ్ – సోనియాల మధ్య స్నేహ సంబంధాలు సన్నిగిల్లాయి. 1998 తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలోనే అమితాబ్ కుమారుడు అభిషేక్ – ఐశ్వర్యరాయ్ ల వివాహానికి సోనియా కుటుంబం హాజరవుతుందా అన్న చర్చ ఆ మధ్య అంతటా ఆసక్తి గొలిపింది. ’అర్ధం లేని ప్రశ్న’ అంటూ సోనియా కుమార్తె ఈ ప్రశ్న అడిగిన విలేఖరికి తెగేసి చెప్పటంతో చర్చ ముగిసింది.

అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఇప్పడందరికీ తెలిసిన విషయమే, ముంబాయిలోని హిందీ సినిమారంగం, సినీ నటీనటుల కెరీర్ ఐ.ఎస్.ఐ. ఏజంట్లయిన దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ వంటి మాఫియాలీడర్ల కనుసన్నల్లో ఉందన్నది. అటువంటప్పుడు సోనియా గాంధీ – అమితాబ్ బచ్చన్ ల నాటి స్నేహ సౌభాతృత్వాలనీ, నేటి ఉదాసీన ఎడాపెడా ముఖాలనీ ఎందుకు సందేహించగూడదు? అందునా ఈ స్నేహ సంబంధాలు 1992 తర్వాత, అంటే ఏ సంవత్సరంలో అయితే రామోజీరావు వంటి ప్రధాన కుట్రదారు ఉనికి నాటి భారత ప్రభుత్వానికి తెలిసిందో ఆ తర్వాత అంతరించిందంటే, ఏ నిఘా సంస్థల కన్నుగప్పడానికి ఈ స్ట్రాటజిక్ వైరుధ్యం సృష్టించబడిందో?

మళ్ళీ 1971 ఇండో – పాక్ యుద్దానంతర కాలం దగ్గరికొద్దాం. యుద్దానంతర విజయం ఇంటా బయటా ఉత్సాహపరచగా భారతీయులు, ఇందిరా గాంధీ హయంలో హరితవిప్లవం పేరిట అధిక ధాన్యోత్పత్తి సాధించారు. దాంతో ధరలు అందివచ్చాయి. [ఇప్పుడూ రికార్డుల ప్రకారం అధిక ధాన్యోత్పత్తి జరిగిందనీ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పత్రికల్లో ప్రచారం చేస్తుంది కాని బియ్యంధరలు మాత్రం 30/- దాటి మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఇలాంటి మాయా మతలబు లెక్కలు కావు ఆనాటివి. ఆనాడు అధిక ధాన్యోత్పత్తి జరిగింది అని ప్రభుత్వరికార్డులు చెబితే తదనుగుణంగా ప్రజల అనుభవానికి కూడా ధాన్యపు ధరలు తగ్గేవి. దీనికి విరుగుడుగా తర్వాతి దశాబ్ధంలో అన్ని వస్తువుల ధరల కంటే ఉల్లి ధర అమాంతం హఠాత్తుగా పెరిగి ఇందిరాగాంధీని గొప్ప ఇబ్బందిలోకి నెట్టింది. అలాగే పాల పొడి డబ్బాల ధరలు కూడా. ఆ స్ట్రాటజీ గురించి తర్వాత వివరిస్తాను.]

ఇక హరిత విప్లవంతో పాటు శ్వేత విప్లవం అంటూ పాలు, పాల ఉత్పత్తులు పెంచే ప్రాజెక్టులు చేపట్టారు. అంతేగాని పింఛన్లూ, రేషన్ బియ్యం, ఆరోగ్యశ్రీ అంటూ [చేపలు ఇచ్చే] సంక్షేమ పధకాలు చేపట్టలేదు. ప్రజల ఉపాధి పెరిగేటట్లు, ప్రజలు తమ కాళ్ళు మీద తాము నిలబడేలా చేయాలని యోచించిన [చేపలు పట్టడం నేర్పే] ప్రాజెక్టులు చేపట్టారు.

ఈ విజయాలతో పాటు, ఇందిరాగాంధీకి నాటి పత్రికల్లో అధికభాగం నైతికమద్దతుగా ఉండేవి.

ఇక మెల్లిగా ప్రధాని ఇంట్లో ఇన్ స్టాల్ చేయబడిన ట్రాన్స్ ప్లాంటర్, [స్పై] ఇంటికోడలు హోదాలో స్థిరపడిన తాలూకూ అడ్వాంటేజ్ లు బయటికి తేవటం మొదలు పెట్టారు కుట్రదారులు. [సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిషు, అనువంశిక నకిలీ కణికుడు వారి మద్దతుదారులు] ముందుగా ఇంటికోడలు సోనియా గాంధీ ఆ ఇంట నమ్మకం సంపాదించుకొనే వరకూ చాలా సహనంగా వేచి ఉన్నారు. నిజం చెప్పాలంటే సోనియాగాంధీని, అత్త ఇందిరాగాంధేయే కాదు, యావత్భారత దేశమూ ఇంట అడుగపెట్టిన కోడలన్నట్లే అదరించింది, విశ్వసించింది. ఏ మాత్రమూ శంకించలేదు. ఎందుకంటే అది భారతీయుల జన్మతః సంస్కారం. ఇంటి కోడల్ని అనుమానించకూడదన్న సెంటిమెంటు. దాన్ని అఙ్ఞానం అనీ అమాయకత్వం అనీ అనవచ్చోలేదో గానీ సంస్కారం అనిమాత్రం అనవచ్చు. “విదేశీయురాలైనంత మాత్రాన, ఇటలీ లో జన్మించినంత మాత్రాన, ఇంటి కోడల్ని అనుమానించకూడదు. దేశాల హద్దులకీ, జాతిభేదాలకీ అతీతమైనవి మానవతా విలువలు, మానవ భావోద్వేగాలూ, ప్రేమానుబంధాలు. పాశ్చాత్య దేశాల వారికి ప్రేమలూ, అనుబంధాలూ, అప్యాయతలూ, విలువలూ ఉండవనుకోవడం ఒకవిధంగా జాత్యహంకారమూ, జాతివివక్షా వంటివే. పుట్టుకని బట్టి మనిషిని సందేహించటం కుసంస్కారమే” – ఇదీ భారతీయుల సెంటిమెంటు. ప్రక్క మతాన్ని విమర్శించకూడదు అనుకొనే ఈ సంస్కారం విషయంలో కుట్రదారులు పాకిస్తాన్ కు అనుకూలంగా ముస్లింలను, క్రైస్తవంకు అనుకూలంగా సోనియాగాంధీని ఉపయోగించుకోవటం ఇప్పుడు మనకి కన్పిస్తుంది.

కాబట్టే సామాన్య ప్రజలు గానీ, నాటి ప్రభుత్వ వ్యక్తులు గానీ, నిఘా సంస్థలు గానీ, స్వయానా అత్తగారూ, దేశప్రధాని అయిన ఇందిరాగాంధీ గానీ సోనియా గాంధీని సందేహించలేదు. [ఇప్పుడు 2004 లో అధికారంలోకి యు.పి.ఏ. వచ్చాక, అంతకు ముందు 1998 లో AICC అధికార పగ్గాలు చేపట్టాక కదా నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి!] అంతేగాక సోనియాగాంధీ నటనా కౌశలం కూడా చాలా గొప్పది. గొప్ప శిక్షణతోనూ, తర్బీదు తోను పూర్తిగా రాటుతేలిన నటనా వైదుష్యం అది. తెర మీద లేదా స్టేజి మీద నటించే వారే తెలుసు మనకు. నిజ జీవితంలో నటించ గల నైపుణ్యం నిజంగా అనుభవంలోకి వచ్చాకే తెలుసుకోగలం. కాబట్టే అందుకోసమే ప్రత్యేక శిక్షణ తీసుకొని వచ్చిన సోనియాగాంధీ, జయప్రదంగా, తన కార్యకలాపాలని ఎవరికీ అనుమానం రానంత నేర్పుగా నిర్వహించుకు రాగలిగింది. ఎంత నేర్పుగా అంటే ఎమర్జన్సీ అనంతర క్లిష్ట, కష్ట దశలో ఇందిరాగాంధీకి సోనియా గాంధీ ఎంతగా తలలో నాలుక అయ్యిందంటే ‘కోడలు కాదు, కూతురు అన్నంతగా’ అంతగా నమ్మించగలిగింది కాబట్టే అత్తగారి motives, moods, opinions, emotions – అన్నిటినీ ముందస్తుగా బయటికి చేరవేయగలిగింది. ఎంత Advanced Technology ని ఉపయోగించిందో మరి!

ఇక్కడ మరో అంశం ఏమిటంటే – కుట్రదారులు కూడా సోనియా గాంధీ, భారత ప్రధాని ఇంట్లో నమ్మకంగా స్థిరపడేదాకా Time allow చేశారు. తదనుగుణమైన డ్రామాలే నడిపారు. నమ్మించగలిగామన్న పూర్తి నమ్మకం కలిగాక ఇక అప్పుడు ఈనాడు రామోజీరావు పత్రికాధిపతిగా అవతరించాడు. అయితే ఇది అంటే ’ఈనాడు’ చాలా చిన్న పత్రిక. స్థానిక భాషా పత్రిక. జాతీయ పత్రికలైన The Hindu, The Indian Express లాంటి పత్రికల మీద, వాటి ఎడిటర్ లైన ఎన్.రామ్, రామ్ నాధ్ గోయంకా మొదలైన వ్యక్తుల మీద భారత నిఘా సంస్థల దృష్టి పడేట్లు ’హైజాక్’ స్ట్రాటజీ అమలుచేయబడింది. దృష్టి అంతా అక్కడ కేంద్రీకరింప చేసి చల్లగా తమపని తాము చేసుకోవటం అనే స్ట్రాటజీ ఇదే. బ్యాంకులో డబ్బు డ్రా చేసుకొచ్చే కస్టమర్ మీద దొంగలు ప్రయోగించే ట్రిక్ లాంటిది. చిన్న పరిణామంలో చూస్తే అంత సింపుల్ ట్రిక్. పెద్ద పరిమాణంలో చూడాలంటే ఎంతో క్లిష్టమైన ట్రిక్.

సహజంగానే అందరూ ఒక స్థానిక భాషా పత్రికకు అధిపతి అయిన ఓ చిన్న వ్యాపారికి అంత సీన్ ఉంటుందని అనుకోరు. అదే పెద్ద రక్షణ కవచం. అందునా ఏమాత్రం ప్రమాద హెచ్చరిక అన్పించినా పత్రికా స్వేచ్ఛ అన్న స్లోగన్ ఎత్తుకొని తప్పించుకోవచ్చు.

స్వాతంత్ర సమయంలోనూ, 1962 చైనా యుద్ధం, 1965, 1971 ల్లో ఇండో – పాక్ యుద్దాల్లోనూ అప్పటి ఇండియా మీడియాలో అత్యధిక భాగం, నిజాలు వ్రాస్తూ, దేశభక్తినీ, స్ఫూర్తినీ ప్రజల్లోనూ, సైనికుల్లోనూ నింఫుతూ భారత్ కోసం పరిశ్రమించాయి, ప్రభుత్వానికి మద్దతుగా కృషి చేశాయి. అందుకే కుట్రదారుల తదుపరి తంత్రం మీడియా అయ్యింది. ఎక్కడ ఓటమి ఎదురయ్యిందో అక్కడి నుండే మళ్ళీ ప్రయత్నం ప్రారంభించడమన్న స్ట్రాటజీ ఇది.

ఈ స్ట్రాటజీలో భాగంగానే రామోజీ రావు తన ’ఈనాడు’ ని సంచలనాత్మకంగా [టెక్నాలజీ పరంగా కూడా] సమాజంలోకి ప్రవేశపెట్టాడు.

ఆ రోజులలో ఆనాటికి మార్కెట్లో ఉన్న పేపర్లన్నీ ప్రజలకి ఆలస్యంగా చేరేవి. ఒక్కోరోజు ఉదయం 11 గంటలయ్యేది. పేపరూ, ముద్రణా కూడా నాసిగా ఉండేవి. అంతేగాక ముద్రారాక్షసాలు ఎక్కువుగా ఉండేవి. నలుపు తెలుపు ఫోటోలతో, అనాసక్తి కరమైన వార్తా శీర్షికలతో, రొటీన్ వార్తలతో, తక్కువ పేజీలతో ఉండేవి.

అయితే ’ఈనాడు’ పత్రిక మార్కెట్లోకి రావడమే రాకెట్ లా దూసుకొచ్చింది. నాణ్యత గల, మృదువుగా మెరిసే పేపరు. ఆకర్షణీయమైన రంగుల్లో ముద్రణ. ముద్రారాక్షసాలు లేవు. రంగురంగుల వర్ణచిత్రాలు. ఆసక్తికరమైన, శృతి లయలతో, ప్రాసలతో కూడిన పతాక శీర్షికలూ, వార్తా శీర్షికలు! చదివించే కధనాలు. మనస్సుకి హత్తుకునే విధంగా వ్రాయబడిన వార్తలు. ఎక్కువపేజీలు. సరసమైన ధర. రకరకాల, వైవిధ్యపూరిత పేజీలు, క్రీడా పేజీ, సినిమా పేజీ, పిల్లలకీ రోజూ కార్టూన్ కథ ….. ఇలా. ధర కంటే కూడా నాణ్యత చాలా ఎక్కువుగా ఉండింది.

అంతేగాక ప్రారంభంలో ప్రజలు ’ఈనాడు’కి అలవాటు పడేందుకోసం, ప్రచారంలో భాగంగా కొన్నిరోజులపాటు పేపరు ఉచితంగా, ప్రజలకి, సూర్యోదయానికి ముందే ఇంటి గడపలోకి ఇవ్వబడింది. ఇవన్నీ వ్యాపార పరంగా, విజయ సోపానాలే. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతీయులకి ’టీ’ అలవాటు చేసేందుకు గ్రామ కూడళ్ళల్లో పొలాలకి వెళ్ళే రైతులకి కొన్ని రోజుల పాటు ఉచితంగా ’తేనీరు’ అందించిన స్ట్రాటజీ ఇక్కడ కన్పిస్తుంది. అంతే! మా వూరిలో ఈనాడు వారం రోజులు ఉచితంగా ఇవ్వబడింది. అప్పటికి విద్యార్ధి దశలో ఉన్నమాకు అదో సంచలనమే.

ఆవిధంగా ‘ఈనాడు’ సంచలనాత్మక వ్వాపార విజయాన్ని నమోదు చేసింది. కుట్రదారులకు మద్దతుదారులైన కార్పోరేట్ కంపెనీల వారు ’ఈనాడు’ విజయానికి సాక్షీభూతంగా తమ వ్యాపార ఉత్పత్తుల వాణిజ్యప్రకటనలను భారీఎత్తున ’ఈనాడు’కి ఇచ్చారు. ఇదంతా ప్రజల్ని మరింత అకర్షించింది. ఫలితంగా పేపర్ circulation పెరిగింది. ఈనాడు circulation పెరిగింది కాబట్టి కార్పోరేట్ కంపెనీలు తమ వాణిజ్యప్రకటనలకు ఈనాడుని మరింతగా prefer చేశాయి. ఇది మరింత circulation ని పెంచింది….. ఇలా ఇదో చక్రభ్రమణం. దీంతో అనివార్యంగా అన్ని పత్రికలు ఇదే ట్రెండ్ ని తొక్కాయి. లేకుంటే వ్యాపార పోటీ తట్టుకోలేరు కదా!

నెమ్మదిగా, సహజంగా అన్ని పత్రికలూ ఈనాడుని ఫాలో అవటం మొదలెట్టాయి. పత్రిక ముసుగులో ఈనాడు మెల్లిగా తన కుట్రని అమలుచేయటం ప్రారంభించింది. దీన్ని గురించిన మరిన్ని వివరాలు Coups on World లోని Responsibility of Media లో పొందుపరిచాను. తరువాతి టపాల్లో ’ఈనాడు’ వ్రాతల్లోని మతలబు ఏమిటో, అది ఏవిధంగా కుట్రలో భాగమో వివరిస్తాను.

’ఈనాడు’ – నాణానికి ఒకవైపు అయితే, ఇందిరాగాంధీ ఇంట్లో ట్రాన్స్ ప్లాంట్ చేయబడిన ఏజంటు సోనియా గాంధీ, నాణానికి రెండో వైపు వంటిది. ప్రధాని ఇంట్లోని వ్యక్తిగా ప్రధాని ఇంటి [PMR] లోనూ, ప్రధాని అఫీసు [PMO] లోనూ జరుగుతున్న విశేషాలని ఎప్పటికప్పుడు బయటికి చేరవేయగలిగింది. ఎంత అధునాతన రహస్య సమాచార టెక్నాలజీ వాడారో తెలియదు గానీ అతి నైపుణ్యంగా మాత్రం ఆ పనిని ఆ నటి నిర్వహించింది. అంతేగాక ప్రధానమంత్రి తత్కాల, తాత్కాలిక emotions తాలూకూ information ని కూడా చేరవేసేది. అంటే ఎలాంటి విషయాల మీద ఇందిరాగాంధీ ఇరిటేట్ అవుతోంది, బ్యాలెన్స్ కోల్పోతోంది, ఎలాంటి లేదా ఏ విషయాల మీద ప్రస్తుతం ఆసక్తితో ఉంది, ఇలాంటి వన్నీ. ఈ సమాచారం కుట్రదారులైన సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., అనువంశిక నకిలీ కణికులకి ఇందిరాగాంధీని మరింత ట్రబుల్ చేయడానికీ, ఇరిటేట్ చేయడానికి, మిస్ గైడ్ చేయటానికి, ఎంతో సహాయపడింది. ఈ సౌలభ్యంతో ప్రభుత్వ యంత్రాంగపు పనితీరుని సైతం బడిదుడుగులకు గురిచేయగలిగారు. ఇక ఇందిరాగాంధీ ఊపిరి సలుపుకోవడానికి వీల్లేనంతగా సమస్యల వెల్లువ సృష్టించబడినది. అన్నీ ద్వంద్వపూరిత విషయాలే అంటే Paradox అన్నమాట. మీరు వెనక్కి పరిశీలించి చూడండి – సోనియా గాంధీ అడుగుపెట్టిన తర్వాత ఇందిరాగాంధీ, అలాగే ఇండియా కూడా సమస్యల వలయంలో కూరుకుపోయింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

అమృతాన్ని ఆశించి క్షీరసాగర మధనం చేస్తూంటే, అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. వెలువడిన విషపుధాటికి లోకాలన్ని అల్లకల్లోలమయ్యాయి. హాలాహలపు జ్వాలలకు అందరూ హాహాకారాలు చేస్తున్నారు.

కాపాడమని పరమశివుని ప్రార్ధించారు. సమస్య తనది కాదు. మింగితేనే తననేమీ చేయలేని విషం, మింగకపోతే అసలేమీ చేయలేదు. అయినా లోకహితం కోరి ఆ విషాన్ని పానం చేశాడు పరమేశ్వరుడు. ఆయన ఆదిభిక్షువే, అయినా అది హాలాహలం. దాన్ని గొంతులోనే నిలిపివేసాడు శివుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మాడ్చింది. అందుకే శివుడిని గరళకంఠుడనీ, నీలకంఠుడనీ పిలుస్తారు. తన యోగశక్తితో హాలాహలాన్ని, దాని శక్తిని అణిచివేసాడు పరమశివుడు. అంత కష్టాన్ని – లోకహితం కోసం, లోకాలకు శ్రేయస్సు కలిగించటం కోసం భరించాడు.

విషపానం చేసే ముందు పార్వతీ దేవితో శివుడు “ఇందరి ప్రాణ రక్షణ నా చేతులలో ఉంది. శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తాను” అనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది.

“మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళ మనియును
మేలని ప్రజకున్ మ్రింగమనె
సర్వ మంగళ! మంగళ సూత్రంబు
నెంత మది నమ్మినదో! “


అందుకే ఆ తల్లి లోకమాత.

అందుకే శివపార్వతులు ఆదిదంపతులు. సర్వలోకాల్లోని సకలప్రాణులకి జననీ జనకులు.


పరమశివుడు పచ్చివిషాన్ని కంఠాన బంధించేందుకు, తన యోగశక్తితో హాలాహలాన్ని అణిచేందుకు కన్నులు మూసుకొని వెత భరించాడు. ఎంతటి వారికైనా ఏ పనీ ’హాంఫట్’ అని అయిపోదు. దానికి కావలసిన ‘కర్తవ్య నిర్వహణ’ చేయవలసిందే. అందుచేత పరమశివునికీ ఆ ‘effort’ తప్పలేదు. కాబట్టే తర్వాత అమృతం పుట్టడం, దాని పంపకంలో జరిగిన గల్లంతూ, జగన్మోహినీ అవతారం శివుడు చూడలేదు.

ఆనాడు పరమశివుడు భరించిన వెతని తలుచుకుంటూ, శివరాత్రి నాడు, భక్తులందరూ శివనామ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు. ఉపవాస దీక్షలో గడుపుతారు. అదే శివరాత్రి పండుగ.

ఈ పండుగరోజున ఆదిదంపతులైన ఆ పార్వతీపరమేశ్వరులు మనందరినీ చల్లగా చూడాలనీ, ఈనాడు ప్రపంచాన్ని దహిస్తున్న విషజ్వాలల నుండి సర్వజీవుల్నీ కాపాడాలని కోరుకుంటూ……….

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఆదివారం ఆరామంగా చదువుకొనేందుకు ఓ చిన్న టపా.

రెండు విషయాలు ఈ రోజు మీదృష్టికి తేవాలనుకుంటున్నాను.

మొదటిది : క్రింది ఫోటో చూడండి.ఇందులో బొమ్మ ఒంటిమీద చిత్రించుకున్న వారందరూ ఎక్కడెక్కడో ఉన్నారనుకొండి. వాళ్ళ ఒంటిమీద ఉన్న బొమ్మ ఏమిటో మనకి ఎప్పటికీ అర్ధం కాదు. అందరూ ఒకచోట, అదీ ఓ క్రమపద్దతిలో నిలబడినప్పుడు మాత్రమే, వారిమీద చిత్రించిన బొమ్మ ఏమిటో చూపరులకి అర్ధమౌతుంది. లేనట్లయితే చిత్రకారుడికి మాత్రమే ఆ బొమ్మ ఏమిటో తెలిసి ఉంటుంది. చివరికి ఆ బొమ్మలోని భాగాలు తమ ఒంటి మీద చిత్రింపజేసి కొన్నవారికి కూడా, ఆ బొమ్మ ఎందులోని భాగమో, మొత్తం బొమ్మ ఏమిటో తెలిసే అవకాశం కొంత మాత్రమే. మన మీద జరిగిన, జరుగుతున్న సుదీర్ఘకుట్ర ఇటువంటిదే.

ఇక రెండవ విషయం :

ఇది చర్చించే ముందు ఓ పోలిక చెబుతాను. ఉదాహరణకి మన కాలనీలో మెయిన్ రోడ్డు ఉందనుకొండి. చూడటానికి రోడ్డు బాగానే ఉంది. కానీ రోడ్డుపై ప్రయాణిస్తున్నావారు ప్రమాదాలకి గురవుతున్నారు. అంతేకాదు, చిత్రంగా అందరూ కొన్ని నిర్ధిష్టమైన ప్రదేశాల్లోనే ప్రమాదాలకి గురవుతున్నారు. రోడ్డు నిర్మాణం లోనే పైకి కనబడని ఎత్తుపల్లాలు ఉన్నాయెమో తెలియదు. మొత్తానికి రోజూ ఎవరో ఒకరు ప్రమాదానికి గురవుతున్నారు. రోజూ కాళ్ళు, చేతుల ఎముకలు విరగొట్టుకుంటూనే ఉన్నారు. ఓ రోజు మన పిల్లాడు సైకిలు తొక్కుతూ రోడ్డు మీద జారిపడి మోకాలిచిప్ప పగలగొట్టుకున్నాడు. అందరూ గుమిగూడారు. కొందరు పిల్లాణ్ణి లేవదీసారు. మరికొందరు సైకిలు సైతం లేపారు. కారుతున్న రక్తం తుడిచి కట్టుకట్టారు. కబురు తెలిసి మనం పరిగెత్తుకెళ్ళాం. అప్పటికే అక్కడ కాలనీ వాళ్ళంతా చేరి చర్చిస్తున్నారు.

ఒకరన్నారు :
ఈరోడ్దు మీద ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు పడిపోతూనే ఉన్నారు. ఎప్పుడూ ఒకే చోటులో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇంకొకరు :
రోడ్డు నాసిగా వేసి ఉండవచ్చు గదా!

మరొకరు:
ఎవరా కాంట్రాక్టరు. హెచ్చరిక చేద్దాం. ఇలా నాసిరోడ్డు మరోసారి వెయ్యకుండా చూద్దాం.

ఇంకొకరు:
అదీ అయ్యింది. ఈసారి అందరం జాగ్రత్త తీసుకొని మరీ, రోడ్డు వేస్తున్నప్పుడు నాణ్యత ఉండేలా జాగ్రత్త తీసికున్నాం. అయినా మళ్ళీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

మరొకరు:
ఈ పిల్లలు కూడా నిర్లక్ష్యంగా సైకిలు తొక్కి ఉంటారు లేదా సైకిలు తొక్కుతూ విన్యాసాలు చేసారేమో. పడిపోయి దెబ్బలు తాటించుకున్నారు.

ఇంకొకరు :
పిల్లలే కాదు. పెద్దలు కూడా పడుతూనే ఉన్నారు గదా! పెద్దవాళ్ళయితే నిర్లక్ష్యంగానో, విన్యాసాలు చేస్తునో ప్రయాణించరు గదా?

మరొకరు:
రోడ్డు నిర్మాణంలోనే మతలబు ఉందనుకుంటా. ఈ రోడ్డు నిర్మాణం వెనుకనున్న రహస్యం ఏమిటై ఉంటుంది?

తక్కినవాళ్ళు:
అవును, ఈ రోడ్డు నిర్మాణంలోనే మతలబు ఉన్నది. దీని సంగతి కనిపెట్టాలి!

అన్నారు ముక్తకంఠంతో అందరూ!

ఇదంతా జరుగుతుండగా చుట్టు ముగిన జనంలోంచి హఠాత్తుగా కొందరు రంగనాయకమ్మలూ, అరుంధతీ రాయిలూ, ఎర్ర చొక్కాలు, కాషాయ చొక్కాలు, ఖద్దరు చొక్కాల వారు పెద్దగొంతుతో అరవటం మొదలుపెడతారు. వాళ్ళ వాదన ఇలా ఉంటుంది.

"ఇదంతా అనవసర చర్చ. ఫాల్ట్ రోడ్డులోనూ లేదు. గోతుల్లోనూ లేదు. సైకిల్ తొక్కడం లోనూ లేదు. అసలు రోడ్డు ఏ ప్రిన్సిపుల్ మీద వేస్తారో తెలుసా? నిర్ధిష్ట నిష్పత్తిలో సిమెంట్, ఇసుకా, కంకరా కలిపి రోడ్డువేస్తారు. రోడ్డు వేయడం అన్న ప్రక్రియ ఫలానా ‘XYZ’ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సైకిలు ‘రెండు చక్రాలు, వాటికి కలిపే గొలుసు’ సిద్దాంతం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ సిద్ధాంతాలు ‘XYZ’ దేశాల్లో విజయవంతం అయ్యాయి. కావాలంటే ఫలానా వారు వ్రాసిన ఫలానా పుస్తకం చదివి తెలుసుకొండి.”

ఇలా గట్టిగా గావుకేకలు పెడతారు. అంతలో గబాలున మీడియా వాళ్ళొచ్చి ఈ రంగనాయకమ్మలూ, అరుంధతమ్మలు, ఎర్రచొక్కాలూ, కాషాయ చొక్కాలూ, ఖద్దరు చొక్కాల వారి మీద ఫ్లడ్ లైట్ వేసి, మైకులు పెడతారు. ఆ హడావుడికి మనకళ్ళు జిగేలుమంటాయి. మనగొంతు మనకే వినబడదు. వాళ్ళ అరుపులు మాత్రం మన చెవుల్లో మార్మోగిపోతాయి. అలా మీడియా సమకూర్చిన ఫ్లడ్ లైట్లు, మైకులూ చేతబూని ఈ అతిమేధావులు మనల్ని మన ’వాస్తవిక యదార్ధ జీవితపు అనుభవం’ కంటే – ఎవరో అతిమేధావులు వ్రాసిన పుస్తకాల్ని, అందులోని సిద్దాంతపు వ్రాతల్ని నమ్మమంటారు. ఎటూ ఆయా పుస్తకరచయితలు వీళ్ళలాంటివారే. ఈవిధంగా మన అనుభవం అనే ’మన చేతిలోని నల్లమేక’, మేక కాదు, ఈ అతిమేధావులైన పుస్తక రచయితలనబడే నలుగురు దొంగలు వ్రాసిన సిద్దాంత రచనలైన నల్లకుక్కే నిజం, నమ్మండి అంటారు. నమ్మే వరకూ గోలపెడతారు. నమ్మకపోతే నలుగురు అతిమేధావులకి మరో నలభైమంది తోడొస్తారు. అప్పటికీ నమ్మకపోతే మనల్ని అక్కణ్ణుండి తరమగొడతారు.

వెరసి మన పిల్లలు పడి దెబ్బలు తగిలించుకోవడానికి కారణమైన రోడ్డు విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకేదో పనికిమాలిన రోడ్డు నిర్మాణం, సైకిలు పనితీరు ప్రిన్సిపల్సూ గురించి రాద్దాంతాలు మొదలౌతాయి. మనం నోరు మూసుకొని ఇంటికెళ్ళిపోతాం. మర్నాడు మరో పెద్దాయన పడతాడు. మళ్ళీ టించరూ, దూది తీసికొని కట్టు కట్టించుకోవటం యధాతధం!

ఎప్పుడు మనం ఆరోడ్డు నిర్మాణం గురించి ఆరాతీయబోయినా, అక్కడ పడి మన బతుకులు అతుకుల మయం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినా, అప్పుడు అర్జంటుగా ఈ అతిమేధావులు బయటికొస్తారు. వాళ్ళ వితండవాదాలతో చర్చని ప్రక్కదారి పట్టించి అసలు నిజం బయటకు రాకుండా ’గోతులు తీస్తున్న పెద్దమనుష్యులకు’ ఈవిధంగా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి సహాయంగా ఆ పెద్దమనుషులు వీళ్ళకి ఫ్లడ్ లైటూ, మైకూ అందిస్తారు. వెనక నుండి పైకమూ జమచేస్తారు.

కాబట్టే ఈ రంగనాయకమ్మలూ, అరుంధతమ్మలూ, అన్ని రంగుల చొక్కాల [ఎర్ర,కాపాయ,…..] వాళ్ళు తమ వితండవాదంతో ఎంత వైషమ్యాన్ని, విద్వేషాన్ని ప్రజల నుండి మూటగట్టుకున్నా బెదరరు, చెదరరు. ఇలాంటి వారు 1980 ల్లో చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాంటి వారు అంటే ’గోతుల తీసే పెద్దమనుషులకు’ మద్దతుదారులు దేశమంతటా ఉన్నారు.

అలాంటి వారే పైన ప్రచురించిన ఫోటోలోని ఒంటిపైన రంగుల బొమ్మలోని భాగాలని చిత్రింపజేసికొన్న వారన్నమాట.

ఈ అవాంతరాలని దాటి, ఎప్పుడైతే మనం మన కాలనీ రోడ్డు రహస్యాన్ని ఛేదించగలుగుతామో, తప్పు మన పిల్లల సైక్లింగ్ లోనూ, రోడ్డు నాణ్యతలోనూ లేదని, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటామో – అప్పుడు రోడ్డు మీద కనబడని ఎత్తుపల్లాల రహస్యాన్ని, కనరాని గోతులు తీస్తున్నవారి అస్థిత్వాన్ని కనిపెట్టగలుగుతాం.

మన భారతీయ సంస్కృతి రోడ్దు లాంటిదైతే, మన సైక్లింగ్ మన సంస్కృతిపట్ల మనకు గల నిబద్దతలాంటిది.

నిజం చెప్పాలంటే ఈ రంగనాయకమ్మలూ, అరుంధతమ్మలూ, అన్నిరంగుచొక్కాల వాళ్ళు కుట్రదారుల మద్దతుదారులే. వీరు భగవద్గీతలో చెప్పిన అసురీ స్వభావులు, తామసులు. ఆ అసురీ, తామస లక్షణాలనే కుట్రదారులు ప్రోత్సహిస్తున్నారు. ఇవే మనకి కనబడని ఎత్తుపల్లాలు, గోతులు.

ఈ విషయం గీత మనకి స్పష్టంగా చెబుతుంది.

శ్లోకం:
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృతా
సర్వార్ధాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్ధ! తామసీ

భావం:
అధర్మాన్ని ధర్మంగాను, అన్ని విషయాలనూ అపసవ్యంగాను గ్రహించేది తామస బుద్ధి.


శ్లోకం:
అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్
అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్

భావం:
వీళ్ళు[అసురీ స్వభావులు] ఈ ప్రపంచమంతా మిధ్య – అస్ధిరం అంటారు. దేవుడనే వాడంటూ యెవడూ లేడనీ – స్త్రీ పురుష సంయోగం వలననే సృష్టి అంతా జరుగుతోందనీ – కామంవినా మరే కారణమూ లేదనీ వాదిస్తారు.

శ్లోకం:
ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మా నోల్ప బుద్దయః
ప్రభవ స్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః

భావం:
అల్పబుద్ధులైన ఈ అసురీ స్వభావులు – ప్రపంచానికి నిష్ప్రయోజకాలూ, హానికరాలూ అయిన పనుల్ని చేస్తూంటారు.

శ్లోకం:
చిన్తామపరమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః
కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాః

శ్లోకం:
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః
ఈహంతే కామభోగార్ధ మన్యాయే నార్ధసంచయాన్

భావం:
కామక్రోధవశులై, విషయవాంఛలే పురుషార్ధంగా యెంచి, వాటి అనుభవంకోసమే ఆక్రమ ధనార్జన చేస్తూ, జీవితాంతం నిత్యమూ అశాపాశాలలో చిక్కుకొని ఉంటారు.

గమనించి చూడండి సర్వత్రా ప్రోత్సహింపబడుతోంది తామస లక్షణాలే! తామస గుణం, తామస యఙ్ఞం, తామస దానం, తామస త్యాగం, తామస ఙ్ఞానం, తామస కర్మ[పని], తామస బుద్ది, తామస ధృతి [పట్టుదల], తామస సుఖం, తామస కర్తృత్వం, తామస అహారం – వీటిని గురించిన పూర్తివివరాలు గుణత్రయ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగయోగం, దైవాసురసంపద్విభాగయోగం, మోక్ష సన్యాస యోగంలో ఉన్నాయి. నేను ఒకటి రెండు శ్లోకాలే ఉటంకించాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

ఇక ప్రధాని ఇంటిలోని Transplanter అయిన సోనియాగాంధీ సహకారంతో తాము సృష్టిస్తున్న అంతర్గత సమస్యలతో పాటుగా, బయటనుండి మరికొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేసారు కుట్రదారులు. దాని ఫలితమే 1971 ఇండో – పాక్ యుద్ధం. ఇటువంటి భవిష్యకుట్రలకు ఆధారం కోసమే 1947 లో అఖండ భారత్ ను విభజించి, రెండు పాకిస్తాన్ ముక్కలని భారత్ కి చెరో వైపూ ఉంచారు. అలాంటి ముక్కల్లో ఒక్కటైన తూర్పు పాకిస్తాన్ లో ప్రజలు పశ్చిమపాకిస్తాన్ నుండి స్వాతంత్రం కావాలన్నారు. భారత్ కి పాక్ తాలూకూ ఆ అంతర్గత గొడవలో తలదూర్చడం ఇష్టం లేదు. అప్పుడే కాదు ఎప్పుడూ భారత్ కి ప్రక్కవారి అంతర్గత గొడవల్లో తలదూర్చడం ఇష్టం ఉండదు. అది బంగ్లాదేశ్ అయినా, టిబెట్ అయినా, నేపాల్ అయినా…….

నేపాల్ రాజధాని ఖట్మాండూలో జూన్ 2, 2001 న రాజకుటుంబం మొత్తం హత్యకు గురయ్యింది. మాధవరావ్ సింధియా మేనకోడలితో తన ప్రేమ వివాహాన్ని అంగీకరించనందుకు నేపాల్ యువరాజు, తన తల్లితండ్రులైన రాజు, రాణీలనీ, సోదరిని ఇతరుల్నీ తుపాకీతో కాల్చిచంపేసి, తరువాత తనకి తాను వెన్నులో [?] కాల్చుకొని చనిపోయాడు. తర్వాత బీరేంద్ర రాజయ్యాడు. మొన్న 2008 లో ప్రచండ గారొచ్చి బీరేంద్రని రాజప్రసాదం వదలి బయటికి పొమ్మన్నాడు. [ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. కుట్రదారులు కావాలనుకుంటే ఏ రాజకుటుంబాన్ని అయినా సమూలంగా తుడిచిపెట్టగలరు. లేదంటే గ్వాలియర్, జైపూర్, మైసూర్ వడయార్ లాంటి రాజకుటుంబాలకు సర్వం నడిచేటట్లు చూడగలరు.] ఇన్ని జరిగినా భారతీయులు నేపాల్ ని సాక్షుల్లా చూశారే గానీ, ప్రక్కింటి గొడవలో తలదూర్చలేదు. ఆ లక్షణం భారతీయులకి లేదని చెప్పడమే నా ఉద్దేశం.

కాబట్టే 1971 వరకూ తూర్పుపాకిస్తాన్ లో జరుగుతున్న వాటిని భారత్ మౌనంగా పరిశీలిస్తోందే గానీ జోక్యం చేసుకోలేదు. అయితే పరిస్థితులు ముంచుకు వచ్చాయి. అందునా అందులో మనం ఇన్ వాల్వ్ అయితీరాలన్నది కుట్రదారుల పధక రచన అయినప్పుడు ఆ పరిస్థితులు మనం ఇన్ వాల్వ్ అయ్యోదాక ముంచుకొస్తూనే ఉంటాయి. తూర్పు పాకిస్తాన్ నుండి లక్షలాది జనం, కాందీశీల్లాగా సరిహద్దుదాటి భారత్ లో ప్రవేశించడం మొదలయ్యింది. వీళ్ళల్లో చాలా మంది ఆనాడు ముస్లిందేశం తమకేదో ఒరగబెడుతుందని తట్టాబుట్టా సర్ధుకొని పోయినవారే. మరికొంత మంది అక్కడే ఉన్నవాళ్ళు. ఏమైతేనేం ఇప్పుడు బాధితులు.

ఇదిగో, సరిగ్గా ఇలాంటి విపత్తులూ, వివాదాలూ సృష్టించేందుకే 1947 లో దేశవిభజన చేసేటప్పుడు కుట్రదారులు ముందస్తు జాగ్రత్తలు తీసికున్నారు, ముందస్తు ప్రణాళికలు వేసుకున్నారు. అందుకే ఒకేదేశమైన పాకిస్తాన్ కు చెందిన రెండు భూభాగాలని భారత్ కు చెరో వైపునా ఉంచటమే గాక, దేశ సరిహద్దులుగా ఏవిధమైన ప్రకృతి సహజగుర్తులు లేకుండా సరిహద్దురేఖ నిర్ణయించారు. ఓ కొండో, సరస్సో, లోయో, నదో ఏదీ లేదు. కనుచూపు మేరా ఒకటే రకపు భూమి లేదా ఎడారి. ఇదిగో ఈ గీత వరకూ ఇటు భారత్ అటు పాక్ అని ఎలా నిర్ధారించడం? సరిహద్దు కంచో, గోడో నిర్మించినా ప్రజలు వాటిని అటూ ఇటూ జరపరని లేదా ధ్వంసం చేయరనీ ఏమిటి గ్యారంటీ? [ 1964 లో కంజర్ కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ భారత భూభాగంలోకి 1½ మైళ్ళు చొచ్చుకు వచ్చి రోడ్డు నిర్మించింది. ఆ విషయం కలకలం రేగాకే భారత కేంద్రప్రభుత్వానికి తెలిసింది.] ఎటూ సరిహద్దు గ్రామ ప్రజల మధ్య బంధుత్వాలూ, పిల్లనిచ్చి పుచ్చుకోవడాలూ, పంటభూములో, బీడు భూములో గ్రామాని కావల ఉండడాలూ ఉన్నాయియ్యె! ఎందుకంటే 1947 కు పూర్వం ఇదంతా ఒకేదేశం కదా! ఇంకా బెంగాల్ రాష్ట్రవిభజన అంటూ బ్రిటిషుప్రభుత్వం కుతంత్రం పన్నక ముందు [బెంగాల్ రాష్ట్ర విభజనతోనే స్వాతంత్రోద్యమం ఊపందుకొంది.] అసలదంతా ఒకే రాష్ట్రమయ్యే. ఇప్పటికీ బంగ్లా వలసదారులు ఈశాన్య భారతంలో లక్షల సంఖ్యలో ఉండటం, వారికి రేషన్ కార్డులూ, ఓటు కార్డులూ ఇవ్వాలని కొందరూ, వద్దని కొందరూ – బోలెడంత రాజకీయం నడపడం మనం రోజూ మీడియాలో చదువుతున్నదే. సమస్య స్థానికులకి మరింత పెద్దది. దూరంగా ఉన్న మనలాంటి వారికి మీడియా ఎటూ విభజించి ప్రచారించు అన్న సూత్రం/ సిద్దాంతం ప్రకారం నిజం అందించలేదు, అందించదు. స్థానికంగా మాత్రం ఇది సజీవ సమస్య, ఇప్పటి మన తెలంగాణా లాగా అన్నమాట. అయితే వలసల సమస్య ప్రభుత్వానికి పట్టించుకొని తీరవలసినదే కదా!

సరేనంటూ, ఈ సమస్య పరిష్కారం కోసం సరిహద్దు పొడవునా కంచె నిర్మించాలంటే సాధ్యమా? సాధ్యమైనా ఎంత ఖర్చువుతుంది? ఎప్పటికి పూర్తవుతుంది?[ఇప్పుడు పూర్తికావచ్చిన దశలో ఉందని నిన్నో మొన్నో డి.డి. వార్తల్లో చూశాను.] అయినా అలాంటి కంచెని నిర్మించి, కాపాలా కాయాలంటే నిరంతరాయంగా ఎంత ఖర్చువుతుంది? భారతీయులు కంచె దాటి ప్రక్కదేశాల్లోకి వెళ్ళి తీవ్రవాదం నెరపరేమో గానీ పాకిస్తానీలు అలా చేయరని ఎవరనగలరు? ఇప్పుడు యదార్ధమై కనబడుతున్న సత్యం కదా అది? ఇప్పుడు తీవ్రవాదం నెరపేందుకు సరిహద్దులు దాటి వస్తున్న పాక్ ముష్కరులు, అప్పట్లో మాదకద్రవ్యాల అక్రమరవాణా నెరపేందుకు సరిహద్దులు దాటి వచ్చేవాళ్ళు. మొన్నామధ్య ఇండో – పాక్ సరిహద్దువెంబడి భారత్ లోని ఓగ్రామంలోని ఇంటినుండి పాక్ లోనికి సొరంగమార్గం కనుగొని నోరెళ్ళబెట్టారట భారత్ అధికారులు. అచ్చం భట్టి విక్రమార్క కథల్లోలా ఉంది కదూ! అలాంటి గూఢచర్య తంత్రాలున్న పంచతంత్రం, భట్టివిక్రమార్కలాంటి కథలన్నీ ప్రజలకు అందుబాటులో లేకుండా అదృశ్యం చేసారు లెండి కుట్రదారులు. ఎంతైనా వారికి ‘ముందు జాగ్రత్త’ ఎక్కువ కదా!]

ఇస్లామాబాద్ నుండి, బంగ్లాదేశ్ నుండి ఐ.ఎస్.ఐ. సాయంతో ఇండియాలోకి దొంగల్లా చొరబడి, మధ్యపాకిస్తాన్ కాబోయి తృటిలో తప్పిపోయిన హైదరాబాద్ పాతబస్తీ చేరి, గోకుల్ ఛాట్ లూ, లుంబినీ పార్క్ లూ, ఇంకా దేశంలోని పలుచోట్ల బాంబులు పేలుస్తున్న ముష్కరమూకల్ని ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా! ఇది ఇప్పటికి నిరూపితమయ్యింది. అప్పటికైతే అది ఊహకీ అంచనాకీ మాత్రమే అందే విషయం. ఊహాని గానీ, అంచనాని గానీ బయటకి చెబితే అంతర్జాతీయ మీడియా దగ్గర నుండి అందరూ ఏకగ్రీవంగా ఖండించే విషయం. అసలు వాస్తవాల్ని, యదార్ధసంఘటనలతో సహా చెబితేనే ఒప్పుకోని వారు, అంచనాలు చెబితే ఒప్పుకుంటారా?

1971 నాటికి తూర్పు పాకిస్తాన్ ముజిబుర్ రహమాన్ నాయకత్వాన ఇస్లామాబాద్ నుండి స్వాతంత్రం కోసం పోరాడుతోంది. దరిమిలా అమెరికా, చైనా, బ్రిటన్ గట్రా దేశాలన్నీ తమ తమ పాత్రల్ని జయప్రదంగా పోషించి, ఇండియా పాకిస్తాన్ ల యుద్ధం అనివార్యం చేశాయి. 1965 లో శాస్త్రీజీ నాయకత్వాన నడిచిన ఇండో – పాక్ యుద్ధం నాటి అంతర్జాతీయ మీడియా కథనాలు షరా మామూలుగా నడిచాయి. పాకిస్తాన్ గెలవబోతుందనీ, ఇండియా ఓడిపోతుందనీ ఊదర బెట్టడం మామూలే. ముందుగా ఊహించనందునా, అప్రమత్తంగా లేనందున, 1962 చైనా యుద్ధంలో మాత్రమే కుట్రదారులు ఇండియాపై విజయం సాధించారు. తర్వాత జరిగిన 1965, 1971 ఇండో – పాక్ యుద్ధాల్లో, భారత్ ముందు నుండీ అప్రమత్తంగానూ ఉంది, పొరుగుదేశం నుండి దగానీ, కుట్రనీ ఊహించగలిగే స్థితిలోనూ, ఎదుర్కోగల స్థితిలోనూ ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు యుద్ధాల తర్వాత కుట్రదారులు ఇక తమ ఆయుధ సంపత్తిని నమ్ముకోవడం మానేసారు. అందుకని యుద్దాలూ మానేసారు. ఇండో – పాక్ యుద్ధాల్లో ఓటమి తర్వాత వ్యూహం మార్చి తీవ్రవాదం మొదలు పెట్టారు. భారత్ ని ఆయుధాలతో యుద్ధంచేసి గెలవలేమని అర్ధమయ్యాక మార్చుకున్న పధకం తీవ్రవాదం. ఎందుకంటే తమ ఆయుధబలం కన్నా, వాటిని operate చేయగల సామర్ధ్యం, Personal ability భారతీయులకి ఎక్కువన్న విషయం అంతర్గతంగానైనా అంగీకరించుకొక తప్పలేదు కుట్రదారులకి. దాంతో 1971 యుద్ధం తర్వాత ‘మేధో వలసలు’ అన్న సమస్యని భారత్ ఎదుర్కొంది. విదేశాలకు ముఖ్యంగా అమెరికా, జర్మనీ మొదలైన దేశాల్లో భారతీయులకి ఉద్యోగావకాశాలు వెల్లువెత్తాయి. ఇక్కడి నుండి మేధావులు బయటికి వెళ్ళటం ఎక్కువైందనీ, అది సమస్య అయ్యేంత తీవ్రతరమైందనీ ఇందిరాగాంధీ హయాంలో ఎక్కువుగా చర్చించబడుతూ ఉండేది. మన దేశంలోని రాష్ట్రాల వేర్పాటువాదులతో [పంజాబ్, కాశ్మీర్, అస్సాంలతో] మొదలుపెట్టి తీవ్రవాదాన్ని సృష్టించారు. ఇక తర్వాతి పరిణామం తాలిబానిజం. అంటే ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చి భారత్ కి వ్యతిరేకంగా బాంబులు పేల్చడం మొదలైనవి. అది ఈ 1992 తర్వాత అత్యంత ప్రాచుర్యంలోకి రావడం అందరికీ తెలిసిందే.

1971 లోని ఇండో – పాక్ యుద్ధంలో, పాకిస్తాన్ మన విశాఖ పట్నంలోని షిప్ యార్డ్ ని ధ్వంసం చేయాలని పధకం రచించింది. ఆ ప్రకారం విశాఖ తీరానికి చేరువుగా వచ్చిన జలాంతర్గామిని చేపల వేటకు వెళ్ళిన జాలరి వాళ్ళు గమనించారట. వారు ఇచ్చిన సమాచారంతో నావికాదశాధికారులు అప్రమత్తమై విశాఖను కాపాడుకున్నారట. అప్పుడు ఆ జలాంతర్గామిని పట్టుకున్నారట. దాన్ని యుద్ధ ఙ్ఞాపకాలకీ, గెలుపుకీ చిహ్నంగా మ్యూజియంగా మార్చుతామని ప్రభుత్వం ప్రకటించిందట. ఈ కథని నేను నా చిన్నప్పుడు, 1971 యుద్ధం తర్వాత విన్నాను.

2008 జూన్ లో, వార్త పత్రికల్లో భారతీయ నావికాదళానికి ఎంతో సేవ చేసిన ఓ జలాంతర్గామిని మ్యూజియంగా మార్చి విశాఖలో ప్రారంభించినట్లు చదివాను. విశాఖ వాసులకి ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఉంటుందనుకుంటాను.

ఇండో – పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపధ్యం ఇదీ :

ప్రపంచంలో ఏమూల వేర్పాటువాదం ఏర్పడినా దానికి కారణాలు క్రింది వాటిలో కొన్నో లేక అన్నీ ఉంటాయి. నెగిటివ్ కాప్షన్ అయితే వేర్పాటువాదం, పాజిటివ్ కాప్షన్ అయితే స్వాతంత్రసమరం. ఇప్పుడు కాశ్మీర్ లోనూ, లంకలోనూ మనం చూస్తున్నది ఇదే. పంజాబ్ లోనైనా, అస్సాం లోనైనా, సెర్బియా అయినా, లిబియా అయినా – ఏప్రదేశమైనా ఇంతే. సరే! తూర్పుపాకిస్తాన్ – పశ్చిమ పాకిస్తాన్ విషయంలో గల కారణాలు చూద్దాం.

1]. పశ్చిమ పాకిస్తాన్[నేటి పాక్], తూర్పుపాకిస్తాన్ [నేటి బంగ్లాదేశ్] మీద సవతి తల్లిప్రేమ చూపుతుంది. తూర్పుపాకిస్తాన్ [బంగ్లాదేశ్] నుండి అయిన ఎగుమతుల ఆదాయాన్ని ఇస్లామాబాద్ లో ఖర్చుపెడుతుంది.

2]. 16 ప్రాజెక్టులు చేపడితే అందులో 13 ఇస్లామాబాద్ కోసం, 3 మాత్రమే బంగ్లాదేశ్ కోసం చేపట్టారు. అన్ని అవకాశాలు పశ్చిమ పాకిస్తాన్ ప్రజలకి మాత్రమే ఉంటున్నాయి.

3]. కేవలం ఉర్దూ మాత్రమే అధికార భాష అన్నారు. దాంతో బంగ్లాదేశ్ లో అధిక సంఖ్యలో ఉన్న బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు రాత్రికి రాత్రి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు. ఇది సమాజంలో పెద్ద యెత్తున ఒత్తిడి కలిగించింది.

4]. తమని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా పశ్చిమ పాకిస్తాన్ నిర్లక్యం చేస్తోందని తూర్పుపాకిస్తాన్ భావించింది. 1965 భారత్ పై యుద్ధం విషయంలో కనీసం తమని సంప్రదించలేదని ఆరోపణలున్నాయి.

5]. ఈ కారణాలతో అక్కడ అలజడి రేగింది. దాన్ని అణచటానికి వెళ్ళిన పశ్చిమ పాకిస్తాన్ సైనికులు తూర్పుపాకిస్తాన్ ప్రజల మీద దౌర్జన్యం చేశారు, ఆడవారిపై అత్యాచారాలు చేశారు. [కాశ్మీర్ లో, అస్సాంలలో బి.యస్.ఫ్. సైనికులు ఇదేచేశారనీ, ఆపరేషన్ బ్లూస్టార్ కోసం వెళ్ళిన జవాన్లు పంజాబీల మీద ఇదే చేశారనీ, చివరికి నక్సల్స్ ని అణచటానికి వెళ్ళిన పోలీసులు గిరిజన గ్రామాల్లో ఇదే చేశారనీ, లంక సైనికులు తమిళుల మీద కూడా ఇదే చేశారనీ ……….. ఇలా ఎక్కడైనా ఇవే ఆరోపణలు జరుగుతుంటాయి. అందులో నిజాలుండవచ్చు మరికొన్ని అబద్దాలు కలపబడవచ్చు. కానీ సర్వత్రా ఒకే స్ట్రాటజీ ఎలా సాధ్యం?]

ఏదేమైనా ఇలాంటి చాలా కారణాలతో తూర్పుపాకిస్తాన్ నుండి లక్షల కొద్దీ ప్రజలు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించడం ప్రారంభమైంది. అయినా భారత్ ఆ వ్యవహారంలో తలదూర్చేందుకు నిరాకరించింది. ఓ దశలో ఈ విషయంపై పార్లమెంట్ లో గందరగోళం చెలరేగింది. తదుపరి తీవ్రమైన చర్చ జరిగింది. ఆ చర్చల్లో ప్రతిపక్ష అధికారపక్ష సభ్యుల్లో చాలామంది ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా ఇందిరాగాంధీ పై ఒత్తిడి తెచ్చారు. చర్చకు సమాధానం ఇస్తూ ఇందిరాగాంధీ ’ఎట్టి పరిస్థితుల్లో ప్రక్క దేశపు అంతర్గత గొడవుల్లో తలదూర్చేది లేదని’ తెగేసి చెప్పింది. అయినా తదుపరి పరిణామాల తర్వాత జోక్యం చేసుకోక తప్పనిస్థితి సంభవించింది. మనం కల్పించుకొనే వరకూ సమస్యని పొడిగించటం అన్న స్ట్రాటజీని ఎదుటివారు మనమీద ప్రయోగించినప్పుడు పరిస్థితులు అలాగే ముంచుకొస్తాయన్నమాట.


ఇక 1971 ఇండో – పాక్ యుద్ధపరిణామాలుగా తూర్పుపాకిస్తాన్, బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది. ఈ దశలో ఇందిరాగాంధీ పేరు మార్మోగిపోయింది. దీంతో భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీకి బలమైన నాయకురాలిగా పేరొచ్చింది. ఆ సమయంలోనే ఓసారి పార్లమెంట్ లో ఆటల్ బిహారీ వాజ్ పాయ్ ఇందిరాగాంధీని అపరకాళిగా శ్లాఘించాడు. ఇక ఆ పొగడ్తల పరంపర అంతటితో ఆగలేదు. అదేపనిగా అందరూ పొగడమే!

ఇందులోనూ ఓ సున్నితమైన, నిగూఢమైన అంశం ఇమిడి ఉంటుంది. అది కుట్రదారులు గూఢచర్య కౌశలం అన్నమాట. ఈ కౌశలం ఎంతటిదంటే – ప్రతీ సంఘటననీ తమకి అనుకూలంగా మలుచుకుంటుంది. ఎప్పుడైనా ఎదురుదెబ్బతగిలినా సరే, ఆ ఎదురుదెబ్బనుండే advantage పొందేందుకు ప్రయత్నిస్తుంది. అదే స్ట్రాటజీ ప్రకారం, ఇండో – పాక్ యుద్దంలో భారత్ గెలిచింది. ఇందిరాగాంధీ నాయకత్వం మరింత బలాన్ని సంతరించుకొంది. దాంతో ఇక పొగడ్తలవర్షం ప్రారంభించి, ఎదుటి వ్యక్తిలో ఆ అహాన్నిప్రవేశపెడతారు. అహం తలకెక్కితే వ్యక్తి పొరపాట్లు చేయడం, పొరబాటు నిర్ణయాలు తీసుకోవడం సహజం. అప్పుడు ఏ వ్యక్తి అయిన తాను always correct అన్న పాయింట్ దగ్గర ఉంటాడు. అప్పుడు మరిన్ని తప్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీలో ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని బాగా ఎక్కువగా నన్నా చూపిస్తారు, లేదా బాగా తక్కువుగా నన్నా చూపిస్తారు. ఆ వ్యక్తి విజయాన్ని సరిగ్గా ఎప్పుడూ చూపరు. అది తమ అనుచరులయినా అంతే, తమ వ్యతిరేకులయినా అంతే! ఎందుకంటే ప్రజలకి ఎప్పుడు ప్రమాణికాలు [parameters] తెలియనివ్వకూడదని వాళ్ళ ప్రయత్నం. ఇదే ఇక్కడ ఉపయోగించే స్ట్రాటజీ. ఒకవేళ ఎదుటివ్యక్తి, అహాన్ని తలకెక్కించుకోకుండా అప్రమత్తంగానూ, ఆత్మసంయమనంతోనూ ఉన్నాడను కొండి. అప్పుడు ఆ వ్యక్తి ఏంచేసినా ’ఏం లేదు. అది పొరబాటు నిర్ణయమే. ఎందుకంటే ’సదరు వ్యక్తిలో అహం పెరిగిపోయింది. ఫలనా విజయం తర్వాత ఆవ్యక్తి ఎవరినీ లెక్కచేయటం లేదు’ అని పదే పదే ప్రచారించి అహపు స్టాంపు కొట్టేస్తారు. ఇంతటితో స్ట్రాటజీ అయిపోదు. ఆ పైన పొగడ్తల స్థానే విమర్శలూ, తెగడ్తల జడివాన ప్రారంభిస్తారు. Superiority complex తర్వాత inferiority create చేయాలనుకోవడం, అహాన్ని ఎక్కించి పిదప అపహాస్యం చేయటం – ఇవన్నీ మానసిక యుద్ధతంత్రాలు, గూఢచర్య మంత్రాలు.

నకిలీ కణికుడి స్ట్రాటజీలలో నమ్మకద్రోహంతో పాటు, అహన్ని సంతృప్తి పరచడం, అహాన్ని రెచ్చగొట్టడం ఇత్యాది కొన్ని విశేషాంకాలున్నాయి. భారతీయుల ’గీత’ అహాన్ని విస్మరించమంటుంది. నకిలీ కణికుడి ‘నీతి’ అహాం మీదే ఆధారపడి అన్ని తంత్రాల్నీ రచిస్తుంది.

ఇక ఈ చర్చ వదిలి మళ్ళీ ఇందిరాగాంధీ హయాం నాటికి వద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఈ బెనిఫిట్స్ అన్నిటితో పాటు, 1970ల్లో ఈ మాజీరాజులూ, రాణులూ భరణాలని పొందుతుండేవాళ్ళు. ఈ మాజీరాజులు, రాణులు, జమీందారులలో చాలామంది ఈస్ట్ ఇండియా కంపెనీ హయంలో కంపెనీకి అనుకూలురు, బ్రిటీషు రాణి హయాంలో రాణికి అనుకూలురు. ఏదోవిధంగా ప్రయోజనం పొందాలన్న స్వార్ధం వీరిలో మెండుగా ఉండేది. దేశభక్తి పూరితమైన సంస్థానాధిశులంతా కట్టబొమ్మనల్లాగా ఎప్పుడో మట్టిలో కలిసిపోయారయ్యే! ఇక స్వాతంత్రం పొందిన తరువాత సైతం, తమ గతవైభవాన్ని కాపాడు కొనేందుకు, వీరు కుట్రదారులకు మద్దతు ఇచ్చారు. సుదూర భవిష్యత్తులో గతవైభవాన్ని తిరిగి పొందగలమన్న ఆశ కూడా వీరిలో చాలామందికి లేకపోలేదు. అప్పటికే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి కూడా గణనీయమైన పరిమాణంలో ఈ మాజీరాజుల, రాణుల, జమీందారుల, దేశ్ ముఖ్ ల చేతిలో ఉండేది. ఆచార్య వినోభా భావే, ఈభూముల్ని, వారిని Convince చేసి పేదప్రజలకి ఇప్పించాలని కృషి చేశాడు. నెహ్రు సామరస్యంగా అది జరగాలని అభిలషించాడు. ఆ కారణంగానే భూసంస్కరణల చట్టం అమలు కొంత మందగొడిగా ఉండేది. అప్పటికే నెహ్రుతరం నాయకుల్లో “మనదేశం బ్రిటీషు వారి చేతిలో దోచుకోబడి శిధిలావస్థలో తిరిగి మనచేతికి వచ్చింది. ఇది మన ఇల్లు వంటింది. పందికొక్కులు తవ్విన బొరియలతో, కూలిన దూలలతో, కూలుతున్న పైకప్పుతో, రాలుతున్న గోడలతో తిరిగి మన ఇల్లు మనకి దక్కింది. దీన్ని ఓపద్దతి ప్రకారం మనం మరమ్మత్తు చేసుకోవాలి” అన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈ పోలికని ప్రజలకి చెప్పారు కూడా! అందుచేత కందిరీగల తుట్టిని కదిపినట్లుగా వారి పనితీరు ఉండేంది కాదు. అదీగాక కుట్రఏదో జరుగుతుందన్న సందేహం వారికి లేదయ్యె! దాంతో భూసంస్కరణలు మందగొండిగా ఉండేది.

అయితే ఇందిరాగాంధీ కుట్రగురించిన స్పష్టమైన అవగాహనతోనే పని ప్రారంభించింది. గనుకనే ఎన్ని వత్తిళ్ళు ఎదురైనా రాజాభరణాలని రద్దుచేసింది. భూసంస్కరణలు చట్టం మీద దృష్టిని పెట్టింది. ఈ విధంగా కుట్రదారుల ప్రధాన మద్దతుదారులైన మాజీరాజుల, రాణుల, జమీందారుల, దేశ్ ముఖ్ ల ఆర్ధికమూలాల మీద వేటువేసింది. ఎందుకంటే ఆ ఆర్ధికమూలాలే వారి బలాలు గనుక.
ఈ రాజులూ, రాణుల స్వార్ధం గురించి చెప్పాలంటే ఓ సంఘటన వివరిస్తాను. జైపూర్ లో ధార్ ఎడారి ఇంత విశాలంగా విస్తరించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏమిటంటే – 1900 AD తర్వాత తొలి దశాబ్ధాల్లో భారతదేశంలో స్వాతంత్ర సమరపు వాసనలు రాగానే అక్కడి స్థానిక రాజావారు భారత్ లో ఉండటం కంటే బ్రిటన్ లో స్థిరపడటం మేలన్న నిర్ణయానికి వచ్చేసారట. దాంతో తన సంస్థానాన్ని ఇతరులకి బదలాయించి, ధనంగా మార్చుకొని, మూటాముల్లె సర్ధుకొని లండన్ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేముందు తన టెరిటరీ లోని అడవినంతటనీ కటింగ్ మిషన్లని తెప్పించి మరీ, చెట్లని నరికించి, కలపగా మార్చుకొని సొమ్ముచేసుకొని వెళ్ళిపోయాడు. ప్రత్యక్షంగా, అప్పటికప్పుడు ఎన్ని వన్యప్రాణులు నశించిపోయాయో! పరోక్షంగా, కాలక్రమంలో మంచినీటికి సైతం మైళ్ళదూరం నడుస్తూ, ఎడారి బ్రతుకులు ఈడుస్తూ, ఎందరు కృశించి పోయారో? ఈ విషయాన్ని ’చిప్ కో’ ఉద్యమనేపధ్యంలో ఆరా తీస్తే బాగా పండుముసలి పెద్దాయన మొత్తం కథ చెప్పుకొచ్చాడు. ఇది ఏదో జర్నల్ లో చదివాను. ఇలాంటి వాస్తవాలు చదివినప్పుడు దిగ్భ్రాంతి పడాల్సిందే. ఇంతటి కరుడు గట్టిన స్వార్ధం వారిది. ఆయా రాజుల్లో, రాణుల్లో అసలు మంచివాళ్ళే లేరా అంటే ఉంటారు. కానీ వారి నిష్పత్తి స్వల్పం. అంతేగాక అలాంటి వారు కాలక్రమంలో అంతరించి పోయారు కూడా!

ఇందిరాగాంధీ రాజాభరణాలు రద్దు చేసిన నేపధ్యం ఇది!

అది కుట్రదారులకి ఎంత రగిలించి ఉంటుందో, ఆవిడపై పెరిగిన బత్తిడి చెపుతుంది.

అప్పటికే 1969 లో ఆవిడ 14 బ్యాంకుల్ని జాతీయం చేసింది. అందులో అత్యధిక వాటాలు ధనికులవీ, మాజీ రాజవంశీయులవే. వారిలో ఎవ్వరూ పేద ప్రజలకి ఋణాలివ్వడానికి ఇష్టపడేవారు కారు. వ్యాపారమే వారి లక్ష్యం. ఎటూ 40 ఏళ్ళ తర్వాత తిరిగి బ్యాంకులు అక్కడికే వచ్చినట్లున్నాయి. 1969 నాటికి జాతీయం చేయబడినవి 14 బ్యాంకులే గానీ, ఒకో బ్యాంకుకీ అనుబంధబ్యాంకులూ, సంస్థలూ గణనీయమైన సంఖ్యలోనే ఉండేవి. పట్టాభిసీతారామయ్య గారు స్థాపించిన ఆంధ్రాబ్యాంకు వంటివి కొన్ని బ్యాంకులే. అత్యధిక బ్యాంకులలో ధనవంతుల, మాజీరాజుల, రాణుల, జమీందారుల వాటాలే ఎక్కువుగా ఉండేవి. అంతేగాక పేదల కష్టం మీద వడ్డీవ్యాపారం చేసే వారు గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర బస్తీల్లోనూ కుప్పలు తెప్పలుగా ఉండేవారు. ఈ స్థితిని మరింత నిర్ధిష్టంగా పరిశీలించేందుకు పి.వి.నరసింహారావు గారి ’లోపలి మనిషి’ నుండి క్రింది విషయం ఉటంకిస్తాను.

శంకర్ దాసు:
“బ్యాంకుల జాతీయకరణ వంటి అంశాలలో అధిష్ఠాన వర్గంలో తీవ్రవిభేదాలున్నట్లు మాత్రం నిశ్చయంగా తెలుసు. ఈ అలోచన జనరంజకంగానూ, ఆకర్షణీయం గానూ ఉండవచ్చు. కానీ కొత్తవిధానంలో బ్యాంకులు ఎటువంటి పూచీకత్తులు లేకుండా పెద్ద సంఖ్యలో పేదలకు రుణాలు ఇవ్వవలసివస్తుంది. దాంతో అవి నష్టాలబరువుకింద కుంగిపోయి, జరుతుతున్నదేమిటో తెలుసుకొనే లోగానే దేశ అర్ధికస్థితి కుప్పకూలిపోతుంది…..”

ఆనంద్:
"గ్రామప్రాంతాల్లో శతాబ్ధాలుగా వడ్డీవ్యాపారం చేస్తున్న వేలాదిమంది అనుభవం మీకు తెలుసోతెలియదో? పేదలకు తామిచ్చిన రుణాల్ని వసూలు చేసుకోవడంలో వాళ్ళేమైనా ఇబ్బందినెదుర్కొంటున్నారా? అదే నిజమైతే వాళ్ళు అదేవ్యాపారాన్ని అంటిపెట్టుకుని ఉండి క్రమేణా సంపన్నులు, ఇంకా సంపన్నులు కావడం ఎలా సాధ్యమైఉండేది? ఇక సకాలంలో చెల్లింపుల విషయానికొస్తే బడా భూస్వాముల నుంచే పెద్దఎత్తున భూమిశిస్తు బకాయిలు పేరుకు పోయాయన్న విషయం మీకు తెలియదా? నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి పన్నులెగగొడుతూ పెద్దమొత్తాల్లో బకాయి పడడం మాగ్రామ ప్రాంతాల్లో హోదాకు చిహ్నం!”

మళ్ళీ ఆనందే అన్నాడు:
"ప్రత్యక్ష, తక్షణ సమాచారం సేకరిస్తా చూడండి”, ఫోన్ తీసుకొని తన ప్రైవేట్ సెక్రటరీకి స్థానిక భాషలో క్లుప్తంగా ఏవో ఆదేశాలిచ్చాడు. శంకర్ దాసు ఇనుమడించిన ఆసక్తితో చూస్తుండగా సెక్యూరిటీ గార్డు ఒక మహిళను, కూరగాయలు నిండిన ఆమె తోపుడిబండితో సహా కాంపౌండ్ లోకి వెంటబెట్టుకొని వచ్చాడు. ఆమె ముఖంలో భయం, ఆశ, అయోమయం ముప్పిరిగొన్నాయి. అరగంట క్రితం కానిస్టేబుల్ కు తాను రెండురూపాయల మామూలు చెల్లించినా ఒకపోలీసు మనిషి తనను ఇక్కడికెందుకు తీసుకొచ్చాడో అర్ధంకాక భయం; తన బండిలో ఉన్న తాజా కూరగాయలు ఒక పెద్దబంగళాలో ఉన్న వాళ్ళదృష్టిని ఆకర్షించినందుకు ఆశ; ఇటువంటి పరిస్థితి గతంలో తనకెప్పుడూ అనుభవంలోకిరాలేదు కనుక అయోమయం.

ఆనంద్, శంకర్ దాస్ ను తీసుకొని డ్రాయింగ్ రూం నుంచి ఇవతలకువచ్చి ఆ కూరలమ్మితో మృదువుగా, దయగా, చనువుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎంతో లాలనగా మాట్లాడుతూ ఇంతవరకు ఎవరికీ కాగితం మీద పెట్టాలని కూడా అనిపించని ఒక బాధకరమైన కథనాన్ని మెల్లమెల్లగా ఆమెనుంచి రాబట్టాడు. విస్తుపోయి చూస్తున్న తన ప్రైవేట్ సెక్రటరీతో ఆమె వద్ద కూరగాయలు కొనమని చెప్పి ఆమెతో మాట్లాడడం, ఆమె కూరగాయలు తనకెంతో నచ్చాయన్న అభిప్రాయాన్ని ఆమెకి కలిగించి పంపించాడు. తర్వాత మళ్ళీ శంకర్ దాస్ ను డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళాడు. ఏంచేయాలోతోచని ఆ పెద్దమనిషి మారు మాట్లాడకుండా యాంత్రికంగా ఆనంద్ ను అనుసరించాడు.

"చాలా కృతఙ్ఞుణ్ణి దాసు గారూ!” ఆనంద్ ప్రారంభించాడు. “ఆ పేద మహిళ మనసులో ఏముందో ఇప్పటికప్పుడు శోధించి తెలుసుకోడానికి మీప్రశ్నలే నన్ను పురిగొల్పాయి. ఆమె కథ ఎంతో ఆకట్టుకునేదీ, హృదయాన్ని కలచివేసేదీ కూడా. నగరానికి దక్షిణంగా ముప్పైమైళ్ళ దూరంలో ఉన్నగ్రామం ఆమెది. భర్తతో కలిసి పదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చింది. భర్త సైకిల్ రిక్షా తొక్కుతాడు. ఆ రిక్షాను అతడు ఓ వర్తకుడి దగ్గర అద్దెకొనుగొలు పద్దతిలో తీసుకున్నాడు. దినసరి అద్దె చెల్లించగా, వాళ్ళు జీవించడానికి మిగిలేది చాలా తక్కువ. ఒక్క పొద్దుకూడా పూర్తిగా కడుపునింపుకోలేని దుర్భరస్థితి. ఆ రిక్షా సొంతం చేసుకోడానికి భర్త రాత్రనక పగలనక కష్టపడ్డాడు. అంతలో రోగమొచ్చి హఠాత్తుగా చనిపోయాడు. అదేం రోగమో కనిపెట్టి చికిత్స చేసిన వాళ్ళెవరూ లేరు. భార్య నిరాధారంగా మిగిలింది. ఓవడ్డీ వ్యాపారి వద్ద అయిదువందల రూపాయలు అప్పచేసి తోపుడుబండి కొనుక్కొని నగరంలోని వీధుల్లో సందుల్లో కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతోంది. నగరంలో ఎక్కడ చూడండి, అటువంటి బళ్ళు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఒక్కొక్క బండి యజమాని వెనుక ఎటువంటి విషాదగాథలు గూడుకట్టుకున్నాయో ఎవరికి తెలుసు? దినసరి పెట్టుబడి కోసం ఆమె మరో వడ్డీవ్యాపారి దగ్గర ప్రతిరోజూ యాభైరూపాయలు బదులు తీసుకొని సాయంత్రానికి రెండురూపాయల వడ్డీని కూడా కలిపి ఆ యాభైరూపాయలను తిరిగి చెల్లించేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ ఆమె ఈ లావాదేవీని సాగిస్తూనే ఉంటుంది, ఆ విషయం మరచి పోకండి; ఆమె ఆవిధంగా ఎంత వడ్డీ చెల్లిస్తోందో మీరే ఉహించుకోవచ్చు. ఈ వృత్తాంతంలో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏమిటంటే, ఆ వడ్డీ వ్యాపారిపట్ల ఆమె అపారమైన కృతఙ్ఞతను ప్రకటించుకుంటూ, మనస్ఫూర్తిగా అతడి మేలుకోరుకుంటూ ఉండడం, నాలుగేళ్ళుగా చెమటోడ్చి శ్రమ పడుతున్నా, బండి కొనుక్కోడానికి తీసుకున్న అప్పును ఆమె ఇంత వరకూ చెల్లించలేకపోయింది. కేవలం వడ్డీ మాత్రం ముట్టజెప్పగలుగుతోంది. అసలుమొత్తాన్ని ఆమె ఏనాటికీ చెల్లించలేదన్నది ఇందువల్ల స్పష్టమైపోతోంది.”

శంకర్ దాసుకు ఇంతకు మించిన విశదీకరణ అవసరం లేకపోయింది. “బ్యాంకుల్ని జాతీయం చేయడం మీరెందుకు కోరుతున్నారో ఇప్పుడు నాకర్ధమైంది”, అని మనస్ఫూర్తిగానే అన్నాడు. “అయితే ఈ వ్యవహారమంతా ఆ కూరలమ్మి దృక్కోణం నుంచి కనిపించినంత తేలికదైతే ఎంత బాగుండేదో, అని నేనూ అనుకుంటాను. ఏదేమైనా ఇక పార్టీలో చీలిక రాకతప్పుదు. దేవుడే మిమ్మల్ని చల్లగా చూడాలి, పార్టీని రక్షించాలి!”……

బ్యాంకుల జాతీయం వెనుక ఉన్న నేపధ్యం ఇదీ!

ఇందిరాగాంధీ ’గరీబ్ హఠావో’ అనే నినాదాన్ని ఇచ్చింది. అధిక విలువగల అంటే 1000, 500 రూపాయల నోట్ల చలామణి రద్దుచేసింది. దాంతో దాచుకున్న నల్లడబ్బు విలువ కోల్పోయింది. బ్యాంకుల్లో 1000, 500 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే ప్రభుత్వానికి లెక్కచెప్పాలి. దాంతో ధనికులు చాలామందీ ఆనోట్లను కాల్చివేస్తూ [మరి ఐ.టి. రైడ్ జరిగితే ప్రమాదం కదా!] ఇందిరాగాంధీని కారుకూతలు తిట్టుకున్నారని నా చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు, ఇతర పెద్దల చర్చల్లో విన్నాను.

ఈ చర్యలన్నిటితో సామాన్య భారతీయులు ఇందిరా గాంధీలో ఉన్న intution ని గుర్తించారు. పేదలకి సహాయ పడాలనీ, దేశాన్ని వృద్ధి బాట పట్టించాలనీ ఆవిడకున్న సంకల్పాన్ని గుర్తించారు. [కుట్రని ఎదుర్కొంటున్న విధానాన్ని ఆవిడ పైకి చెప్పనూ లేదు, చెప్పినా సానుకూల పరిస్థితి రాదు] దాంతో ప్రజలు ఆవిడకి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. సామాన్య ప్రజలకి, ఆమె వ్యతిరేకులు ఋణాలని ఎగ్గొట్టమని పరోక్ష ప్రోత్సాహం ఇచ్చారు. ఋణాలు ఆలస్యమయ్యేటట్లు ఉద్యోగులనూ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నాటికి, నేటికి పరిస్థితిలో తేడాలేదు. స్ట్రాటజీలో తేడా లేదు. అదే కుట్రతీరు. అప్పటి మీడియా, ఇందిరాగాంధీ పేదరికాన్ని వెళ్ళగొట్టడం లేదనీ, పేదల్నీ వెళ్ళగొడుతుందనీ, దేశాన్నీ దివాళా తీయించడానికే పేదలకు ఋణాలిస్తుందని ఎంతగా ప్రచారించినా ప్రజలామెని గౌరవించారు, ఆదరించారు, విశ్వసించారు. ఆవిడని అభిమానించారు. అంతేగానీ ఆవిడ తమ గుడిసెలలో తమతో కలిసి తిన్నందుకూ, తమ సాంప్రదాయ దుస్తులు వేసికొని, తమతో కలిసి నాట్యం చేసినందుకు కాదు.

భారతీయులూ, గ్రామీణులలో అత్యధికులు అఙ్ఞానులు కారు. వారిలో ఎక్కువమంది నిరక్షరాస్యలే కావచ్చు. ప్రభుత్వ పాలసీలూ, సిద్దాంతాలూ వారికి తెలియకపోవచ్చు. కాని నాయకుల్లోని సంకల్పాన్ని, నిజాయితీని గుర్తించగల నేర్పు మాత్రం కలవారే. రాజకీయ నాయకులు తమ తిండి తిన్నంతమాత్రాన, తమ గుడిసెలో నిద్రించినంత మాత్రానా, రోడ్డుప్రక్కన విడిది చేసినంత మాత్రాన, గిరిజన దుస్తులతో డాన్సులు చేసినంత మాత్రాన ఏమారిపోరు. మహా అయితే తొలిసారి మోసపోతారేమో. కాబట్టే ఇప్పుడు కె.సి.ఆర్.లూ, వై.ఎస్.ఆర్.లూ, చంద్రబాబులూ, బాలకృష్ణలూ, చిరంజీవులూ, రాహుల్ గాంధీలూ ఎవరెన్ని ఫీట్లు చేసినా ప్రేక్షకులై చూస్తున్నారు. అత్యధికులు కిరాయి లేదా కూలీ తీసికొని సభలకు హాజరవుతున్నారని కూడా వింటున్నాం. కాబట్టే ఆనాడు ఇందిరాగాంధీకి అంతటి ఆదరణ ప్రజలనుండి లభించింది. [ఎన్.టి.ఆర్. కి మొదటిసారి మాత్రమే రోడ్డుప్రక్కన డ్రామాలు ఫలించాయని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.]

దేశప్రధానిగా, ప్రధాన కుట్రదారుల చిరునామా తెలియకపోయినా, జరుగుతున్న కుట్రపట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవ్యక్తిగా, ఇందిరాగాంధీ ప్రభుత్వయంత్రాంగపు పనితీరు చాలా నిర్ధిష్టంగానూ, వేగంగానూ ఉండేది. ఈ విషయంలో నిఘాసంస్థల అన్వేషణ కుట్రతీరునీ, కుట్రదారుల ఉనికినీ కనుగొనేందుకు సమాంతరంగా నడిచేది.

స్త్రీ అయిన ఇందిరాగాంధీ యొక్క పట్టుని జీర్ణించుకోవటం ఆమె సహచర రాజకీయ నాయకులకీ, సీనియర్ నాయకులకీ కష్టంగానూ, అసూయ గానూ ఉండేదట. ఈ కారణాన్ని అంతర్గత కారణంగా చూపిస్తూ, రాష్ట్రపతి ఎన్నిక [జాకీర్ హుస్సేన్] లేదా ఆనాటికి ఏది current affair అయి ఉందో దాన్ని పైకారణంగా [over leaf reason] చూపిస్తూ ఇందిరాగాంధీ సహచర రాజకీయ నాయకులు మొరార్జీ దేశాయ్, కాసు బ్రహ్మనందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దేవరాజ్ అర్స్, మొదలైన వాళ్ళు చాలామంది ఆవిడని ముప్పతిప్పలు పెట్టారు. ఆవిధంగా వారు కుట్రదారులకి తెలిసి ఇష్టపూర్వకంగా కొంత, తెలియక కొంత సహకరించారు. భావోద్రేకాలనీ, అపార్ధాలనీ, అవగాహనా లోపాలనీ కారణంగా చూపెడుతూ నిత్యం ఏవో సమస్యలు సృష్టించబడుతూనే ఉండేవి. ఒకటికి రెండుసార్లు ఇలాంటి కారణాలతో కాంగ్రెసు పార్టీ ముక్కలైంది. మళ్ళీ ముక్కలు విలీనం అవుతుంటాయి, మళ్ళీ మళ్ళీ ముక్కలౌతుంటాయి. నిరంతర అసంతృప్తి పార్టీ సాంప్రదాయం అయిపోయింది.

ఈరోజు ఒకరిని నమ్మిన ఇందిరాగాంధీ మర్నాడే వాళ్ళని దూరం తోసేదని పేరు ఉండేది. దీనికి కారణం ఏమిటంటే – ఉదాహరణకి ఈ రోజు ఇందిరాగాంధీ, ‘A’ అనే వ్యక్తి పట్ల నమ్మకం, సదభిప్రాయం కలిగి ఉందనుకొండి. ఇంట్లోనో, తన కుటుంబసభ్యులతో, కనీసం రాజకీయల్లో తనకు తోడు, తన తర్వాత వారసుడు అనుకొన్న చిన్నకొడుకు సంజయ్ గాంధీకి నేర్పేందు కోసం, తనకు ఎలివేషన్ కోసం చర్చిస్తుంది కదా! ఆ చర్చల్లోని అంశాలు, ఆవిడ motives, moods, emotions, అభిప్రాయాలు బయటికి చేరవేయబడేవి. అంతే! కుట్రదారులు దృష్టి ‘A’ మీద ఉంటుంది. అతడి చుట్టూ project అయ్యే చట్రంతో ఈసారి ఇందిరాగాంధీకి అతడు నమ్మదగని వ్యక్తిగా కన్పిస్తాడు. ఇటువంటి అపార్ధాలు సృష్టిచడం చాలా సులభం. మన అఫీసులో బాస్ లకి తోటి వారి మీద పితూరీలు చెబుతూ మనకీ బాస్ కీ మధ్య తంపులు పెట్టేవాళ్ళు చాలామంది పాటించేది ఇలాంటి తంత్రాలనే. దాంతో ’ఇందిరాగాంధీ ఎవర్నీ నమ్మదు’ అనే అభిప్రాయం బాగా పాపులర్ అయ్యింది. ఎవరో ఎక్కడో మనకి కీడు చేస్తున్నారు అని అన్వేషణలో ఉన్నవ్యక్తి, ఆకీడు తాలుకూ ఫలితాలు ఇతరులకి అర్ధమైనా కాకపోయినా, తన స్వానుభవానికి తెలుస్తున్న వ్యక్తి ఎవరినీ ఒక పట్టాన నమ్మలేకపోవడం సహజం. ఎందుకంటే పాపం ఆవిడది ఒంటరిపోరాటం! జయప్రదంగా ఆవిణ్ణి ఒంటరిని చేయగలిగింది అనువంశిక నకిలీ కణికుడి గూఢచర్యం. దానికి ప్రధాని ఇంటి లోపలి నుండి బయటికి చేరవేయబడిన సమాచారమే మూల బలం [ఇంత జరుగుతుంటే ఇంటలిజన్స్ కు తెలియదా అంటే, తెలియకపోవడం, అనుమానించకపోవడం పచ్చినిజం. అది ఎలా నిజమో వర్తమానం నిరూపిస్తుంది. అందుకే గతంలో నుండి వర్తమానంలోకి, వర్తమానం నుండి గత చరిత్ర లోనికి మనం ప్రయాణించాల్సి వస్తోంది, పరిశీలించాల్సి ఉంది. తెలుగులో తదుపరి టపాలలో దీనిని నిరూపిస్తాను. Coups On World లో Documentary Evidence తోనూ నిరూపించాను.
ఇక్కడ మరో విషయం కూడా మనం గుర్తించాలి. మన అబ్బాయో, అమ్మాయో బడి ఎగ్గొట్టి రోడ్లమీద తిరుగుతున్నారన్నా విషయం ఊరందరికీ తెలుస్తుంది గానీ, మనకి మాత్రం తెలియదు. ఎందుకంటే మనం మనవారిని నమ్ముతాం. ’మన వారని’ అనుకున్నవారిని నమ్ముతాం. గనుక త్వరగా అనుమానించం. అందుకే నమ్మకద్రోహం అన్నది కుట్రదారుల ప్రధాన తంత్రాల్లో ఒకటి అయ్యింది. ]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu