రెండు పాకిస్తాన్ లకు తోడుగా, కుట్రదారులు హైదరాబాద్ కిచ్చిన ప్రాముఖ్యత గురించి ఇప్పటికే మనం చాలాసార్లు ముచ్చటించుకున్నాం. పోలీసు చర్యతో తమ పన్నాగాన్ని మార్చుకోవలసి వచ్చినందున కుట్రదారులు ఇక కొత్తపుంతలు తొక్కారు. ఈ నేపధ్యంలో 1948, సెప్టెంబరు 13 న హైదరాబాదుపై పోలీసు చర్య తీసుకొన్న సర్ధార్ పటేల్ 1950 లో తన 75 వ ఏట మరణించాడు. ఆయన ఆనారోగ్యంతో మరణించనీయండి, వార్ధక్యంలో మరణించనీయండి, గుండెపోటుతో మరణించనీయండి – అది సహజ మరణం కావచ్చు, అసహజ మరణం కావచ్చు. ఇలాంటిదే శాస్త్రీజీ తాష్కెంటులో గుండెపోటుతో మరణించటం కూడా ! లాల్ బహుదూర్ శాస్త్రి, 1965 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో, ఇండియా విజయం సాధించాక జరిగిన శాంతి చర్చల్లో పాల్గొనేందుకు, తాష్కెంట్ [రష్యా] వెళ్ళినప్పుడు, గుండెపోటుతో మరణించాడు. అప్పుడు ఎవరూ దాన్ని అనుమానించలేదు. అనుమానించే అవకాశం కూడా లేదు. అనుమానించినా రుజువు చేసే టెక్నాలజీ లేదు. [1965 పాక్ తో యుద్ధం, మిత్రుడి ముసుగులో USSR మనతో నెరపిన నమ్మక ద్రోహం 1992 లో క్రయోజనిక్ ఇంజన్ల అమ్మకం విషయంతో సహా ముందు ముందు వివరిస్తాను] అయితే ఇప్పుడు ఇంత అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీ [ఏవిధమైన జబ్బునైనా సృష్టించగల] గురించి తెలిసాక, అనుమానించవచ్చు అనిపించడం లేదూ? మొన్నామధ్య విడుదలైన కళ్యాణ్ రామ్ సినిమా “హరే రామ్” లో చూపినట్లు రోగాన్ని, మందునీ కూడా సృష్టించే కార్పోరేట్ కంపెనీలని, ఫార్మాస్యూటికల్ కంపెనీలని గురించి వింటున్నాం కదా!

ఆనాడైతే ఇదేదీ ఊహించనూ లేం, సందేహించనూ లేం.

ఇప్పుడు ఆధునిక వైద్యవిధానం మనిషిని 150 ఏళ్ళు బ్రతికిస్తుందని వింటున్నాం. వాస్తవానికి కుట్రదారులు, వారి మద్దతుదారులైన కార్పోరేట్ కంపెనీల వారు అడ్వాన్స్ టెక్నాలజీని గ్రిప్ చేసుకొని, అవధుల్లేని వ్యాపారం చేసుకొని, దీర్ఘకాలం తర్వాత గానీ – ఆ టెక్నాలజీని గానీ, దాని గురించిన వార్తల్ని గానీ బయటకు వదలరు. ఆ సమయానికి వారి చేతిలో అంతకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అంటే మరింత అడ్వాన్స్ టెక్నాలజీ ని గ్రిప్ చేశాకే, పాతదాన్ని బయటికి వదలటం చేస్తారన్న మాట. ఈ విధంగా ఎల్లప్పుడూ అడ్వాన్స్ టెక్నాలజీ తమ కంట్రోల్ లో ఉండేలా చూసుకుంటారు. అందుచేతే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాల ప్రభుత్వాలూ కార్పోరేట్ కంపెనీల, కుట్రదారుల చేతిలో కీలుబొమ్మలై పోయాయి. ఉదాహరణకి పోలీసుల దగ్గర కంటే టెర్రరిస్టుల దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఆయుధాలు ఉంటాయి. ఎప్పటికి ప్రభుత్వం అంతకంటే అడ్వాన్స్ టెక్నాలజీని పోలీసులకి అందించలేదు.

ఈ స్ట్రాటజీ కేవలం సాంకేతికత విషయంలోనే కాదు, కుంభకోణాలు, పాలసీలు, కుట్రల స్ట్రాటజీ విషయంలో కూడా ఇలానే ఉంటుంది. కుట్రదారులు మన దేశంలో [ప్రపంచమంతా కూడా ఇంతేసుమా!] ఒక స్ట్రాటజీని వాడారనుకొండి అది Notorious అయిపోయిందనుకొండి, అంటే ప్రజలకి ముందే అర్ధమయిపోవటం మొదలయ్యిందనుకొండి. అప్పుడు కుట్రదారుల [సినిమా గాడ్ ఫాదర్ ల] నుండి హాలీవుడ్, బాలీవుడ్, టాలీఉడ్, కోలీ వుడ్, లేదా xyz ఉడ్ లలోని సినిమా దర్శక, నిర్మాతలకి సదరు స్ట్రాటజీ ని తమ సినిమా కథల్లో వాడుకునేందుకు అనుమతి వస్తుంది. ఆ సమయానికి అంతకంటే అభివృద్ధి చెందిన, సంక్లిష్టమైన స్ట్రాటజీ కుట్రదారులు చేతిలోకి వచ్చి ఉంటుంది. ఇక ఈ కొత్తదాన్ని యధేచ్ఛగా యావత్ర్పపంచంలో అమలు చేస్తారు. ఇలా వాడేసిన స్ట్రాటజీని సినిమాల్లోకి వదలి బహిరంగం చేయటంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనం ఏమిటంటే అప్పటివరకూ నిగూఢంగా వాడుకున్నా స్ట్రాటజీని ఇప్పుడు బహిరంగ పరచి, సినిమాలు, నవలలు ద్వారా డబ్బు చేసుకోవటం. మరో ప్రయోజనం ఏమిటంటే – ఏ దేశంలో నైనా, ఏ ప్రభుత్వమైనా లేదా వ్యక్తి అయినా ఈ కుట్ర స్ట్రాటజీని ప్రజలకి expose చేయబోతే ప్రజలు నమ్మరు. అంతేగాకుండా “ఆ. ఇది సినిమాల్లో చూపినట్లుంది” అంటారు. రామ్ గోపాల్ వర్మ సినిమా ’క్షణం క్షణం’లో నాయక శ్రీదేవి, హీరో వెంకటేష్ తను చిన్నప్పుడే దొంగగా ఎందుకు మారాడో చెబుతాడు. [ఆ సినిమాలో అది కట్టుకథే]. వెంటనే శ్రీదేవి అమాయకంగా ముఖం పెట్టి “ఈ సినిమా నేను చూశా” అంటుంది. హీరోకి కోపం వస్తే “అది కాదండి. మీరు చెప్తూ ఉంటే నాకు ముందే తెలిసిపోతూ ఉంది. మొన్నామధ్యే చూశాను” అంటూ సంజాయిషీ ఇస్తుంది. అలాగన్నా మాట. నిజానికి యండమూరి ఓ నవలలో వ్రాసినట్లు ‘వాస్తవాలు ఒకోసారి కల్పన కంటే అద్భుతంగా ఉంటాయి.’

ఈ సందర్భంలో మీకు ఒక ఆసక్తికరమైన, నమ్మశక్యంకాని సంఘటన చెబుతాను. ఇది నేను 1999 కార్గిల్ యుద్ధం సమయంలో, ఏదో పత్రికలో చదివాను.

1971 ఇండో – పాక్ యుద్ధంలో విమాన దాడులతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన కల్నల్ గురించిన సంఘటన అది. [ఆయన పేరు మరచిపోయినందుకు క్షంతవ్యురాలిని, మన్నించాలి.] పాకిస్తాన్ పై యుద్ధంలో అతడు పాక్ సైన్యం మీద విరుచుకుపడి, స్ఫూర్తివంతమైన సాహసాన్ని చూపాడట. అది భారత సైనికుల్ని ఎంతగానో మోటివెట్ చేసిందట. యుద్ధంలో గెలిచిన తర్వాత అతడి శౌర్యానికి గుర్తింపుగా, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నుండి పురస్కారాలు కూడా అందుకున్నాడు.

అయితే దురదృష్టం [?] ఏమిటో తెలుసా? అంతటి నైపుణ్యం, సాహసం గల వైమానిక దళ యోధుడు 1971 తర్వాత విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఒక సైనిక శిబిరం నుండి మరో కాంప్ కి, సైనిక విమానంలో ప్రయాణిస్తూ, ఆ విమానం కూలిపోవడంతో మరణించాడు. చాలా కొద్దిమంది [5 గురిలోపు] ప్రయాణించగల ఆ విమానప్రమాదంలో బ్రతికి బయటిపడింది పైలెట్ మాత్రమే. ఆ పైలెట్ గానీ లేక మరొకరు గానీ కుట్రదారులకు అమ్ముడుపోయే అవకాశాన్ని కొట్టివేయలేం కదా! ప్రతివాడి నిజాయితీకి ఓ రేటుంటుంది. ఏదయినా జరిగాకే కదా అనుకోగలం, తెలుసుకోగలం? నమ్మకద్రోహాలూ అంతే! మిత్రుడిపేరుతో దరిచేరి మోసం చేస్తారు కొందరు. మోసపోయాకే అర్ధమవుతుంది మనకు. అలాగని ప్రతి మిత్రుణ్ణీ, ముందు నుండే అనుమానంతో చూస్తే ఇక ఎవ్వరి తోనూ స్నేహం చేయలేం కదా! అప్పుడు బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. అందుకేనేమో, మన పెద్దలు నమ్మకద్రోహం పాపాల్లో కెల్లా పాపం అంటారు. ‘తడిగుడ్డతో గొంతుకోయటం’, ‘నమ్మించి ముంచటంగా’ నమ్మకద్రోహాన్ని వర్ణిస్తారు. దీనిమీద 1980 ల్లో కొన్ని సినిమా, వారపత్రిక జోకులుండేవి. ఎలాగంటే

ఒకవ్యక్తి:
దుర్మార్గుడా !నమ్మించి మోసం చేస్తావా?

రెండోవ్యక్తి:
సర్లే ! నమ్మకపోతే మోసమెలా చెయ్యగలం?

ఇలాంటి జోకులతో క్రమంగా, నమ్మించి మోసం చేయటం పెద్ద తప్పుకాదనీ, అది మామూలేనని, పైపెచ్చు లౌక్యమనీ, ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇదే బ్రతకనేర్చిన తనమనే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా నాటారు. ఇలా Public Attitude ని మీడియా [సినిమా, వారపత్రికలు, కథలూ కాకరకాయలూ కూడా] ప్రభావితం చేయటం కూడా మనమీద జరుగుతున్న సుదీర్ఘకుట్రలో భాగమే. నిజానికి ఇలాంటి కుట్రలు ఝాన్సీ లక్ష్మీబాయి, వీరపాండ్యకట్టబొమ్మన వంటి దేశభక్తులు విషయంలోనే గుర్తించాం కదా !

ఇక నెహ్రు పై కుట్ర తీరు వివరిస్తాను.

సాపేక్షంగా చూస్తే భారతీయులు, ప్రపంచంలో ఇతర దేశీయుల కంటే ఎక్కువుగా, మంచిని గురించి కలలు గనే స్వాప్నికులు. భారతీయ ప్రాచీన సంస్కృత వాఙ్ఞ్మయం ’సర్వేజన సుఖినోభవంతు! సమస్త సన్మంగళానిసంతు’ అంటుంది. సర్వజనులకీ సుఖసంతోషాలు కలగాలనీ, ’సమస్త’ అంటే సర్వజీవులకి శుభం కలగాలని ఆకాంక్షించడం అది. ఈ వారసత్త్వంతో నెహ్రు ఒక ఆదర్శ, సర్వతోముఖాభివృద్ది చెందిన భారతదేశం గురించి కలలుకన్నాడు. “పి.వి.నరసింహారావు, భూసంస్కరణవాదిగా ధనిక భూస్వాములకు పగవాడిగా మారుతున్నా పట్టించుకోలేదు. 1991 లో సరళీకృత ఆర్ధికవిధానాలకి, ఒక పరిమితికి లోబడి తలుపులు తెరుస్తూ భారతదేశపు అభివృద్ధి గురించి కలలు గన్న ’స్వాప్నికుడు’గా ఆయనకున్న ధృక్పధాన్ని నిరూపించుకున్నాడు. రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతికతలో భారత్ ముందడుగు వేయాలని కలలుగన్నాడు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలుకన్నాడు. ఆనాటి స్వాతంత్ర సమరయోధులంతా బ్రిటీషువారి కోరల నుండి, వ్యాపార దోపిడి నుండి విముక్తమైన భారత్ గురించి కలలు గన్నారు. ఇప్పటి యు.పి.ఏ. ప్రభుత్వసారధి మన్మోహన్ సింగ్ కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టడం అనే కలలతో తన ధృక్పధాన్ని నిరూపించుకుంటున్నాడు.

[ఇది నేను కాంగ్రెసు మీద అభిమానంతో వ్రాయటం లేదు. నిజానికి, ఇప్పుడు మన దేశంలో, విదేశీ మహిళ సోనియాగాంధీ అధ్యక్షతన ఉన్న రాజకీయ పార్టీని , నాటి దేశభక్త కాంగ్రెస్ గా నేను గుర్తించటం లేదు.]

ఇక ఇలాంటి స్వాప్నిక వారసత్వంతో నెహ్రు ప్రతిపాదించిన, ప్రారంభించిన మిశ్రమ ఆర్ధికవ్యవస్థ, సహకార వ్యవస్థ, వాటి అమలు తీరులో ప్రవేశించిన లోపాలు, కుట్రలూ, తద్వారా కార్పోరేట్ కంపెనీలకు మద్దతుదారులైన కుట్రదారులు మన ఆర్ధికవ్యవస్థ మీద పనిచేసిన తీరుని Coups On World లోని Coup On Business….., Fire Pot Mixed Economy – Dream of Nehru లో వివరించాను. తెలుగులో తర్వాత చర్చిస్తాను.

ఇక్కడ కేవలం రాజకీయ రంగం మీద కుట్రని మాత్రమే వివరిస్తున్నాను. నెహ్రు మరణానంతరం [మరింతగా] ’కాశ్మీరు తదితర అంశాలపై మెతకవైఖరి పాటించాడనీ, తన వ్యక్తిగత స్నేహితులైన కొందర వ్యక్తుల [లేడి బాటన్] ప్రభావానికి, వత్తిడులకీ తల ఒగ్గాడనీ’ నిందారోపణలున్నాయి. ఎంత ప్రభావితుడయ్యడో తెలియదు గానీ మూల్యం మాత్రం అతడి కుటుంబవారసులే చెల్లించుకున్నారు. [ఇలా చూసినా మనం చేసిన మంచి చెడుగులు మన పిల్లలకి అనువర్తిస్తాయనే, మన పెద్దల నమ్మకమే, నిజమై కన్పిస్తుంది.]

ఐడియలిస్టిక్ దృక్పధంతో నెహ్రు, ఇరుగుపొరుగు దేశాలతోనూ, ప్రపంచమంతటా భారత్ సంబంధాలలోనూ, శాంతి, స్నేహం, సామరస్యపూర్వక వాతావరణం సృష్టించాలని కలలు కన్నాడు. ప్రయత్నాలు చేశాడు. అప్పటికి ప్రపంచమంతా దాదాపు రెండు వర్గాలుగా విడిపోయి ప్రచ్ఛన్న యుద్ధపు మేఘాల నీడన అమెరికా, రష్యా శిబిరాలుగా మారిపోయింది.

ఈ నేపధ్యంలో నెహ్రు అలీన విధానం ప్రతిపాదించాడు. దీనిప్రకారం ఇండియా ఏ వర్గానికి అనుచర దేశంగా మారలేదు. అప్పటికే పాకిస్తాన్ అమెరికా అనుయాయి అనేదారిలో నడుస్తోంది. పంచశీల అంటూ ఐదు అంశాలు ప్రతిపాదించి, విదేశాంగవిధానాన్ని రచించాడు. ఈరకపు కొత్త ఫిలాసఫీ, విదేశాంగవిధానం, ఆర్ఢికవిధానం నెహ్రుకి ప్రపంచమంతటా ఓ గుర్తింపునీ, గౌరవాన్నీ తెచ్చిపెట్టాయి. భారతదేశపు వారసత్త్వ తాత్త్వికతతో నాయకుడికి, నాయకత్వం నుండీ దేశానికి కీర్తిప్రతిష్ఠలు పెరిగాయి. దేశ ప్రధానమంత్రి మూలంగా ఆ రోజుల్లో భారత్ ఓ గౌరవాన్ని ప్రపంచవేదికపై తెచ్చుకుంటే, అప్పటికే పాక్ లో ప్రజాస్వామ్యం కూలిపోయి సైనికపాలనలో కూరుకుపోయింది. 1948 కల్లా జిన్నా చనిపోయాడు. 10 సంవత్సరాల కాలంలో 7 మంది తూతూమంత్రం ప్రధానమంత్రులు మారిపోయారు. తరువాత సైనికపాలనతో ఇస్లామిక్ రాజ్యాంగం తెచ్చుకున్నారు. [అప్పటికి ప్రపంచం మీద, సి.ఐ.ఏ., బ్రిటిషుల పట్టు ప్రపంచయుద్ధాల కారణంగా కొంత ఒడిదుడుగులకు గురియై ఉంది. ఏఏ దేశాలు యుద్ధం చేసుకున్నా, లాభపడింది మాత్రం ఆయుధ కంపెనీలు కావటాన, సి.ఐ.ఏ., బ్రిటన్ లు ఆర్ధికంగా కొన్ని బడిదుడుగుల్లో ఉన్నాయి. బ్రిటన్ విషయమైతే బహిరంగరహస్యమే. ఆవిధంగా అనువంశిక నకిలీ కణికుడు బ్రిటన్ ని fade out చేసి కంపెనీలని fade in చేసే ప్రక్రియని విజయవంతంగా నడిపించాడు. అయితే భారత గడ్డమీద బలపడటానికి మరికొంత సమయం కావలసి, వేచి యుండే స్థితిలో ఉన్నాడు. అప్పటికే పాక్ ని గ్రిప్ చేసాడు. ] ఒకేసారీ స్వాతంత్రం పొందిన దాయాది దేశాలు ఇండియా, పాక్ లలో ఇండియా కొంత అభివృద్ధి బాటలోనూ, [అప్పటికే బహుళార్ధసాధక ప్రాజెక్టులైన భాక్రనంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం వగైరాలు నిర్మాణ స్థితిలో ఉన్నాయి] పేరుప్రఖ్యాతులు మూట గట్టుకుంటోంది. ప్రధానిగా ఉన్నవ్యక్తి కారణంగా ఇండియాకి సంక్రమించిన కీర్తికి ప్రతీకారంగా – తర్వాత కాలంలో [1977 – 78 ల్లో] ప్రధానిగా ఉన్నవ్యక్తి [మొరార్జీదేశాయ్ హయంలో, అతడి ’జీవజల పానం’ అంటే స్వమూత్రాన్ని తాగటం కారణంగా. దాన్ని అతడే స్వయంగా ఓ విదేశీ విలేఖరి అడిగినప్పుడు ఒప్పుకున్నాడు. దాంతో అది గగ్గోలు అయ్యింది.] కారణంగా ఇండియాకి సంక్రమించిన అపకీర్తితో చెల్లుచీటి ఇచ్చాడు అనువంశిక నకిలీ కణికుడు. వీటి గురించి తర్వాత వివరంగా చర్చిస్తాను. వెంటనే చూడాలంటే Coups On World లోని Coup on Politics లేదా RAMOJI RAO’S WRITINGS AND ACTIVITIES BEFORE 1992 AND AFTER 1992 లో చూడగలరు.

అయితే 1960 ల కల్లా, ఇలా ప్రపంచవేదిక మీద ఇండియా ప్రతిష్ఠ వారికి భరించ లేనిదయ్యింది. అప్పటికే పేదరికం దేశంలో ఉండవచ్చు. కానీ ప్రవర్తనతో, వ్యక్తిత్వంతో ఓ ప్రతిష్ఠ పొందింది. [ఇప్పుడంటే పూర్తిగా, ’డబ్బుంటేనే గౌరవం’ అనేస్థితికి సమాజం వచ్చిందిగానీ, ఒకప్పుడు పేదవాడైనా మంచిప్రవర్తనగలవాడికి గౌరవం ఉండేది కదా.]

ఇక దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఇండియా మీద తమ స్ట్రాటజీని Speed up చేయక తప్పదన్న స్థితికి కుట్రదారులు వచ్చేసారు. ఫలితమే చైనా యుద్ధం.

హఠాత్తుగా చైనా భారత్ మీద యుద్ధానికి తెగబడింది. తర్వాత, ఇందుకు టిబెట్, దలైలామా, ఇండియాకి ఆశ్రుతుణ్ణంటూ రావడం పైకారణాలుగా [Over leaf reasons] గా చూపబడ్డాయి. ఈ వ్యవహారంలో ఎంత ’డ్రామా’ నడిచిందో, ఇండియా ఏవిధంగా Involve అయ్యిందో, ఎంతగా avoid చేసిందో చరిత్రలో నాటి సంఘటనల్ని, రాజకీయ రచనల్ని చదివితే తేట తెల్లమవుతుంది.

ఇలా ఇండియాపైకి చైనా యుద్ధానికి రావడాన్ని భారత్ అసలు ఊహించలేదు. కాని భారత్ లోనే ఉన్న ‘కొందరి’కి మాత్రం ఇది ముందే తెలుసు. వాళ్ళు చాలా ‘మామూలుగా’ రహస్యంగా సిద్ధమైపోయారు. ఫలితంగా సైనికులకి చేరాల్సిన చలిదుస్తులూ, రగ్గులూ, బూట్లు, కలకత్తా వీధుల్లో నల్లబజార్లో అమ్మకానికి తేలాయి. ‘చలిలో, యుద్ధభూమిలో, శతృవులతో పోరాడుతున్న సైనికులకి చేరాల్సిన అత్యవసర వస్తువుల్ని డబ్బుకాశపడి దారిమళ్ళించారట ’ఎవరో’ అవినీతిపరులు. ఈవిషయానికి విదేశీ మీడియా మరింత ప్రచారం ఇచ్చింది. సైనికుల ఆత్మస్థైర్యము, భారతీయుల నైతిక స్ధైర్యమూ దెబ్బతినేంతగా ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు అరుంధతీ రాయ్ ల్లాంటి మేధావుల రచనలకి ఎంత ప్రచారం ఇస్తుందో అంతకు రెట్టింపన్న మాట. దీంతో యావత్ర్పజలూ, దేశమూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది.

ఈ నేపధ్యంలో, నెహ్రు మీద విమర్శలూ వెల్లువెత్తాయి. భారత్ ఓటమికి బాధ్యత ప్రధాని అయిన అతడిదే అవ్వటం సహజం. దాన్ని ప్రపంచమీడియా, దాని వెనుక ఉన్న కుట్రదారులు వీలయినంతగా ప్రచారించారు. అప్పట్లో ప్రతీరోజూ విదేశీ పత్రికలు ఏవేవో వ్రాసేవట. దాన్ని ఉటంకిస్తూ ఇక్కడ విలేఖర్లు ప్రధానిని, ఇతర మంత్రుల్ని ప్రశ్నల వర్షంలో ముంచెత్తేవారట. ఏదో ఒకటి వ్యాఖ్యానించేవరకూ వదలిపెట్టేవారు కాదట. ఈ విధంగా భారత ప్రభుత్వం యొక్క మోటివ్స్ తెలుసుకునేవారు. తదనుగుణంగా మర్నాడు మళ్ళీ విదేశీ పత్రికలు వ్రాసేవి. మళ్ళీ ఇక్కడ విలేఖరుల ప్రశ్నలు. అటు చైనా ఇనుపగోడల మధ్యనుండి అధికార ప్రకటనలు తప్ప మరేమాటా బయటికొచ్చేది కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ముంబైదాడుల మీద అనుసరిస్తున్నది దాదాపు అదే స్ట్రాటజీ! ప్రతిసారి పాక్ ప్రభుత్వం కంటే ముందుగా పాక్ పత్రికలు వ్రాయటం, దానిపై ఇక్కడ మీడియా ప్రణబ్ ముఖర్జీని అడగటం, పరోక్షంగా సమాచార మార్పిడి జరగటం, మనం రోజూ చూస్తున్నదే. అప్పుడూ ఇలాంటిదే జరిగిందన్న మాట.

ఇక ఈ ఊదరతో ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రతిష్ఠ దిగజారిపోయింది. ప్రపంచమీడియా, బి.బి.సి.తో సహా, "నెహ్రు ఐడియలిస్టిక్ కలలు ఓటమి పాలయ్యాయి. మారిన ఈ కాలానికి, పరిస్థితులకి ఐడియలిస్టిక్ దృక్పధం తగినది కాదు. అది Impractical”. ఇలాంటి presentation తో గగ్గోలెత్తించాయి. ఇది ‘నల్లమేక నలుగురు దొంగలు పంచతంత్రం’ కథలోని ముసలివాడి మీద దొంగలు ప్రయోగించిన మానసిక తంత్రంమే. ఇదే ఊదరబెట్టే కంఠంతో ప్రపంచమీడియా గానీ, ఆ ముసుగులో ఉన్న కుట్రదారులు గానీ, ఒక్కసారంటే ఒక్కసారి, చైనా చేసిన దురాక్రమణని గానీ, ఇండియా పట్ల దాని నమ్మకద్రోహాన్ని గానీ, ఒక్కమాట కూడా అనలేదు. [ ‘చైనా నమ్మకద్రోహమేం చెయ్యలేదు. అది ఎప్పుడూ మనతో స్నేహం పాటించలేదు’ అంటూ ‘కొందరు’ కుట్రదారుల విషప్రచారం తలకెక్కించుకొని మరీ, వకాల్తా పుచ్చుకొని వాదించేవారు. చైనా మనతో గొప్పస్నేహం పాటించక పోవచ్చు. గొప్ప శతృత్వమూ పాటించలేదు. కనీసం యుద్ధం చేసేంత శతృత్వం రెండు దేశాల మధ్యలేదు. ఈనాటికీ సోనియా గాంధీ, ఆగస్టు 7, 2008 న బీజింగ్ వెళ్ళి కాంగ్రెసు పార్టీ – అక్కడి అధికార పార్టీతో రాజకీయ సమాచార మార్పిడి ఒప్పందం చేసుకునేంత [AICC జనరల్ సెక్రటరీ హోదాలో రాహుల్ గాంధీ ఆ ఒప్పందంపై సంతకాలు పెట్టాడు.] స్నేహపూర్వక పర్యటనలూ అటు నుండి ఇటూ, ఇటు నుండీ అటూ జరుగుతుండగా, మధ్యమధ్యలో చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటుంది. సరిహద్దులను ముందుముందుకు జరపుతూ అక్రమణలు చేస్తుంది. ఈ స్ట్రాటజీ అప్పటి నుండి మొదలయ్యింది, ఇప్పటికీ కొనసాగుతుంది.]

సహజంగానే చైనా యుద్ధంలో ఓటమి, నెహ్రుని బలంగా ప్రభావితం చేసింది. 73 దాటిన వయస్సులో, అతడి జీవితంలో దారుణమైన ఓటమి రుచి చూశాడు. దాదాపు సామాన్య భారతీయులంతా అతడి వెన్నంటి నిలిచారు, వ్యూహాత్మకమైన కొందరు కుట్రదారులు తప్ప. అప్పటికి వారి సంఖ్య, కంఠమూ కూడా బలహీనమే. ఇప్పుడున్నంత బలం లేదు. ఆనాటికి, ఇంకా ఇండియా మీడియా పూర్తిగా కుట్రదారులు పట్టులోకి పోలేదు. దాంతో ఇండియా మీడియాలో అత్యధిక భాగం భారతప్రభుత్వానికి, నెహ్రుకి మద్దతు ఇచ్చి, చైనా కుటిలతనీ, అంతర్జాతీయంగా దానికి అనుకూలంగా నడిచిన coup strategy ని విమర్శించాయి. ఈనేపధ్యంలో వ్రాయబడిన ఎన్నోరచనలు, పుస్తకాలు, పత్రిక సమీక్షలూ, ఇప్పుడు మనం తిరగేసినా నిజం తెలుసుకోవచ్చు.

అప్పట్లో నెహ్రు ఓ బహిరంగ సభలో తన ఓటమిని అంగీకరిస్తూ, కన్నీరు పెట్టుకున్నాడట. ఆ తదుపరి ఒత్తిళ్ళతో 1963 - 64 ల్లో ఓసారి సభలో కునికిపాట్లు పడ్డాడట. 1962 చైనాయుద్ధం నెహ్రుని మానసికంగా దెబ్బతీసింది. అతడిపై వత్తిడి సృష్టించింది. మెల్లిగా వార్ధక్యమూ, అనారోగ్యమూ అతణ్ణి ఆక్రమించసాగాయి. ఈ స్థితిలో ఒకసారి మీటింగ్ లో అతడు కొన్నిక్షణాలు పడిన కునికిపాట్లుతో, అతడి సుదీర్ఘరాజకీయ చరిత్రలో అతడు చేసిన కృషి, పడినశ్రమ, 16 ఏళ్ళుగా ప్రధానిగా పడిన శ్రమ, కృషి, అతడి నిజాయితీ, అతడిలోని మంచి లక్షణాలు, సామర్ధ్యం, మేధస్సు అన్నీ గంగలో కలిసినట్లేనా? అతడు నెహ్రు కాబట్టి, అతడు ఐడియాలిస్టు కాబట్టి, అలాంటి చిన్న తప్పు కూడా జరగకూడదు, అంతే! ఇది కాదా వాదన? అలాంటప్పుడు ఇలాంటి సంచలనం సృష్టించడం వెనుక కుట్రదారుల హస్తం లేదనగలమా?

ఇలాంటి సంఘటనలు పైకి చూడటానికి చాలా ’సిల్లీ’గా అన్పిస్తాయి. కానీ అవి ప్రజల దృక్పధం మీద కలిగించే ప్రభావం చాలా తీవ్రంగా, నిగూఢంగా ఉంటుంది. వెంటనే పైకి కనబడదు. కాలం గడిచే కొద్దీ దాని దుప్ర్పభావం తెలుస్తుంది. సాధారణంగా సామాన్యుడు ఈ స్ట్రాటజీనంతా సీరియస్ గా తీసుకోడు; జాగ్రత్తగా పరిశీలించడు, లోతుగా ఆలోచించడు. వారికి వారి జీవనపోరాటం సరిపోతుంది. మిగిలిన సమయంలోనైనా లోతుగా పరిశీలించి ఆలోచించడానికి సామాన్యుడికి కుట్ర తీరుతెన్నులూ, ప్రభావఫలితాలూ ఊహకైనా తెలియవు. ఇప్పుడు కళ్ళెదుట జరుగుతున్నా ఎందరం చూడగలుగుతున్నాం? అంతే ఎప్పుడైనా! ఇదే కుట్రదారులకు, వారి మద్దతుదారులకు ఉన్న వెసులుబాటు. ఇక ఎప్పుడైతే ప్రజలు ఈ స్ట్రాటజీలని అర్ధంచేసుకునే స్థితికి వస్తారో, అప్పుడు వీటిని జనరలైజ్ చేయటం, సినిమాలు గట్రాతో పాపులర్ చేయటం చేస్తారు. మరికొన్ని కొత్త స్ట్రాటజీలు బయటికి తీస్తారు.

అయితే 1962 లో చైనా యుద్ధం నుండి భారతీయులు ఓ గుణపాఠం నేర్చుకున్నారు. అప్పుటి నుండి భారతీయులు, నిజాయితీ నిబద్దత కలిగిన ఆనాటి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. “మనం ఒక్కరం స్నేహం పట్ల నిజాయితీతో, నిబద్దతతో ఉంటే సరిపోదు. ఎదుటివాడు కూడా ఉండాలి. మనం ఐడియలిస్టిక్ గా, మంచిగా ఉంటే చాలదు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలి. మనం ఇతరుల తో నిజాయితీ ఉంటాం కాబట్టి, ఎదుటి వాడూ మనతో అలా ఉంటాడనుకోకూడదు. ప్రక్కదేశాలు మన మీద కుట్రపన్నే అవకాశం చాలా ఉంది” అన్న వాస్తవం అర్ధమయ్యింది. కాశ్మీర్, చైనా సంఘటనలతో భారతదేశంపై కుట్ర మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది.

ఇది నెహ్రుని, అతడి తరంలోని ఇతర సీనియర్ నాయకులనీ వెన్నుచరిచి, తమ తరువాతి తరం నాయకులని హెచ్చరించేలా చేసింది.

పంచశీల విజయం, పంచవర్షప్రణాళికల విజయం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వనరుల అభివృద్ధి, బహూళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణం వంటి కొన్ని పనులు తన ఖాతాలో ఉన్నా, కొన్ని కుంభకోణాల వార్తలు వెలుగుచూడటం, ముఖ్యంగా చైనాతో యుద్ధంలో ఓటమి, నెహ్రుని బాగా కలవరపరిచాయి. ఆ కలల మనిషి 1964 లో తన బాటలో తాను ‘బహుదూరపు బాటసారి’లా సాగిపోయాడు. అప్పుడు ఏర్పరిచిన మిశ్రమ ఆర్ధిక వ్యవస్థై, ఈరోజు ఆర్ధిక మాంద్యం నుండి మనల్ని రక్షిస్తున్నది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

earliar i used to curse nehru for these kind of things, but i got to know what were all behind these. very good article , keep posting quickly

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu