ఇక ప్రధాని ఇంటిలోని Transplanter అయిన సోనియాగాంధీ సహకారంతో తాము సృష్టిస్తున్న అంతర్గత సమస్యలతో పాటుగా, బయటనుండి మరికొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేసారు కుట్రదారులు. దాని ఫలితమే 1971 ఇండో – పాక్ యుద్ధం. ఇటువంటి భవిష్యకుట్రలకు ఆధారం కోసమే 1947 లో అఖండ భారత్ ను విభజించి, రెండు పాకిస్తాన్ ముక్కలని భారత్ కి చెరో వైపూ ఉంచారు. అలాంటి ముక్కల్లో ఒక్కటైన తూర్పు పాకిస్తాన్ లో ప్రజలు పశ్చిమపాకిస్తాన్ నుండి స్వాతంత్రం కావాలన్నారు. భారత్ కి పాక్ తాలూకూ ఆ అంతర్గత గొడవలో తలదూర్చడం ఇష్టం లేదు. అప్పుడే కాదు ఎప్పుడూ భారత్ కి ప్రక్కవారి అంతర్గత గొడవల్లో తలదూర్చడం ఇష్టం ఉండదు. అది బంగ్లాదేశ్ అయినా, టిబెట్ అయినా, నేపాల్ అయినా…….

నేపాల్ రాజధాని ఖట్మాండూలో జూన్ 2, 2001 న రాజకుటుంబం మొత్తం హత్యకు గురయ్యింది. మాధవరావ్ సింధియా మేనకోడలితో తన ప్రేమ వివాహాన్ని అంగీకరించనందుకు నేపాల్ యువరాజు, తన తల్లితండ్రులైన రాజు, రాణీలనీ, సోదరిని ఇతరుల్నీ తుపాకీతో కాల్చిచంపేసి, తరువాత తనకి తాను వెన్నులో [?] కాల్చుకొని చనిపోయాడు. తర్వాత బీరేంద్ర రాజయ్యాడు. మొన్న 2008 లో ప్రచండ గారొచ్చి బీరేంద్రని రాజప్రసాదం వదలి బయటికి పొమ్మన్నాడు. [ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. కుట్రదారులు కావాలనుకుంటే ఏ రాజకుటుంబాన్ని అయినా సమూలంగా తుడిచిపెట్టగలరు. లేదంటే గ్వాలియర్, జైపూర్, మైసూర్ వడయార్ లాంటి రాజకుటుంబాలకు సర్వం నడిచేటట్లు చూడగలరు.] ఇన్ని జరిగినా భారతీయులు నేపాల్ ని సాక్షుల్లా చూశారే గానీ, ప్రక్కింటి గొడవలో తలదూర్చలేదు. ఆ లక్షణం భారతీయులకి లేదని చెప్పడమే నా ఉద్దేశం.

కాబట్టే 1971 వరకూ తూర్పుపాకిస్తాన్ లో జరుగుతున్న వాటిని భారత్ మౌనంగా పరిశీలిస్తోందే గానీ జోక్యం చేసుకోలేదు. అయితే పరిస్థితులు ముంచుకు వచ్చాయి. అందునా అందులో మనం ఇన్ వాల్వ్ అయితీరాలన్నది కుట్రదారుల పధక రచన అయినప్పుడు ఆ పరిస్థితులు మనం ఇన్ వాల్వ్ అయ్యోదాక ముంచుకొస్తూనే ఉంటాయి. తూర్పు పాకిస్తాన్ నుండి లక్షలాది జనం, కాందీశీల్లాగా సరిహద్దుదాటి భారత్ లో ప్రవేశించడం మొదలయ్యింది. వీళ్ళల్లో చాలా మంది ఆనాడు ముస్లిందేశం తమకేదో ఒరగబెడుతుందని తట్టాబుట్టా సర్ధుకొని పోయినవారే. మరికొంత మంది అక్కడే ఉన్నవాళ్ళు. ఏమైతేనేం ఇప్పుడు బాధితులు.

ఇదిగో, సరిగ్గా ఇలాంటి విపత్తులూ, వివాదాలూ సృష్టించేందుకే 1947 లో దేశవిభజన చేసేటప్పుడు కుట్రదారులు ముందస్తు జాగ్రత్తలు తీసికున్నారు, ముందస్తు ప్రణాళికలు వేసుకున్నారు. అందుకే ఒకేదేశమైన పాకిస్తాన్ కు చెందిన రెండు భూభాగాలని భారత్ కు చెరో వైపునా ఉంచటమే గాక, దేశ సరిహద్దులుగా ఏవిధమైన ప్రకృతి సహజగుర్తులు లేకుండా సరిహద్దురేఖ నిర్ణయించారు. ఓ కొండో, సరస్సో, లోయో, నదో ఏదీ లేదు. కనుచూపు మేరా ఒకటే రకపు భూమి లేదా ఎడారి. ఇదిగో ఈ గీత వరకూ ఇటు భారత్ అటు పాక్ అని ఎలా నిర్ధారించడం? సరిహద్దు కంచో, గోడో నిర్మించినా ప్రజలు వాటిని అటూ ఇటూ జరపరని లేదా ధ్వంసం చేయరనీ ఏమిటి గ్యారంటీ? [ 1964 లో కంజర్ కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ భారత భూభాగంలోకి 1½ మైళ్ళు చొచ్చుకు వచ్చి రోడ్డు నిర్మించింది. ఆ విషయం కలకలం రేగాకే భారత కేంద్రప్రభుత్వానికి తెలిసింది.] ఎటూ సరిహద్దు గ్రామ ప్రజల మధ్య బంధుత్వాలూ, పిల్లనిచ్చి పుచ్చుకోవడాలూ, పంటభూములో, బీడు భూములో గ్రామాని కావల ఉండడాలూ ఉన్నాయియ్యె! ఎందుకంటే 1947 కు పూర్వం ఇదంతా ఒకేదేశం కదా! ఇంకా బెంగాల్ రాష్ట్రవిభజన అంటూ బ్రిటిషుప్రభుత్వం కుతంత్రం పన్నక ముందు [బెంగాల్ రాష్ట్ర విభజనతోనే స్వాతంత్రోద్యమం ఊపందుకొంది.] అసలదంతా ఒకే రాష్ట్రమయ్యే. ఇప్పటికీ బంగ్లా వలసదారులు ఈశాన్య భారతంలో లక్షల సంఖ్యలో ఉండటం, వారికి రేషన్ కార్డులూ, ఓటు కార్డులూ ఇవ్వాలని కొందరూ, వద్దని కొందరూ – బోలెడంత రాజకీయం నడపడం మనం రోజూ మీడియాలో చదువుతున్నదే. సమస్య స్థానికులకి మరింత పెద్దది. దూరంగా ఉన్న మనలాంటి వారికి మీడియా ఎటూ విభజించి ప్రచారించు అన్న సూత్రం/ సిద్దాంతం ప్రకారం నిజం అందించలేదు, అందించదు. స్థానికంగా మాత్రం ఇది సజీవ సమస్య, ఇప్పటి మన తెలంగాణా లాగా అన్నమాట. అయితే వలసల సమస్య ప్రభుత్వానికి పట్టించుకొని తీరవలసినదే కదా!

సరేనంటూ, ఈ సమస్య పరిష్కారం కోసం సరిహద్దు పొడవునా కంచె నిర్మించాలంటే సాధ్యమా? సాధ్యమైనా ఎంత ఖర్చువుతుంది? ఎప్పటికి పూర్తవుతుంది?[ఇప్పుడు పూర్తికావచ్చిన దశలో ఉందని నిన్నో మొన్నో డి.డి. వార్తల్లో చూశాను.] అయినా అలాంటి కంచెని నిర్మించి, కాపాలా కాయాలంటే నిరంతరాయంగా ఎంత ఖర్చువుతుంది? భారతీయులు కంచె దాటి ప్రక్కదేశాల్లోకి వెళ్ళి తీవ్రవాదం నెరపరేమో గానీ పాకిస్తానీలు అలా చేయరని ఎవరనగలరు? ఇప్పుడు యదార్ధమై కనబడుతున్న సత్యం కదా అది? ఇప్పుడు తీవ్రవాదం నెరపేందుకు సరిహద్దులు దాటి వస్తున్న పాక్ ముష్కరులు, అప్పట్లో మాదకద్రవ్యాల అక్రమరవాణా నెరపేందుకు సరిహద్దులు దాటి వచ్చేవాళ్ళు. మొన్నామధ్య ఇండో – పాక్ సరిహద్దువెంబడి భారత్ లోని ఓగ్రామంలోని ఇంటినుండి పాక్ లోనికి సొరంగమార్గం కనుగొని నోరెళ్ళబెట్టారట భారత్ అధికారులు. అచ్చం భట్టి విక్రమార్క కథల్లోలా ఉంది కదూ! అలాంటి గూఢచర్య తంత్రాలున్న పంచతంత్రం, భట్టివిక్రమార్కలాంటి కథలన్నీ ప్రజలకు అందుబాటులో లేకుండా అదృశ్యం చేసారు లెండి కుట్రదారులు. ఎంతైనా వారికి ‘ముందు జాగ్రత్త’ ఎక్కువ కదా!]

ఇస్లామాబాద్ నుండి, బంగ్లాదేశ్ నుండి ఐ.ఎస్.ఐ. సాయంతో ఇండియాలోకి దొంగల్లా చొరబడి, మధ్యపాకిస్తాన్ కాబోయి తృటిలో తప్పిపోయిన హైదరాబాద్ పాతబస్తీ చేరి, గోకుల్ ఛాట్ లూ, లుంబినీ పార్క్ లూ, ఇంకా దేశంలోని పలుచోట్ల బాంబులు పేలుస్తున్న ముష్కరమూకల్ని ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా! ఇది ఇప్పటికి నిరూపితమయ్యింది. అప్పటికైతే అది ఊహకీ అంచనాకీ మాత్రమే అందే విషయం. ఊహాని గానీ, అంచనాని గానీ బయటకి చెబితే అంతర్జాతీయ మీడియా దగ్గర నుండి అందరూ ఏకగ్రీవంగా ఖండించే విషయం. అసలు వాస్తవాల్ని, యదార్ధసంఘటనలతో సహా చెబితేనే ఒప్పుకోని వారు, అంచనాలు చెబితే ఒప్పుకుంటారా?

1971 నాటికి తూర్పు పాకిస్తాన్ ముజిబుర్ రహమాన్ నాయకత్వాన ఇస్లామాబాద్ నుండి స్వాతంత్రం కోసం పోరాడుతోంది. దరిమిలా అమెరికా, చైనా, బ్రిటన్ గట్రా దేశాలన్నీ తమ తమ పాత్రల్ని జయప్రదంగా పోషించి, ఇండియా పాకిస్తాన్ ల యుద్ధం అనివార్యం చేశాయి. 1965 లో శాస్త్రీజీ నాయకత్వాన నడిచిన ఇండో – పాక్ యుద్ధం నాటి అంతర్జాతీయ మీడియా కథనాలు షరా మామూలుగా నడిచాయి. పాకిస్తాన్ గెలవబోతుందనీ, ఇండియా ఓడిపోతుందనీ ఊదర బెట్టడం మామూలే. ముందుగా ఊహించనందునా, అప్రమత్తంగా లేనందున, 1962 చైనా యుద్ధంలో మాత్రమే కుట్రదారులు ఇండియాపై విజయం సాధించారు. తర్వాత జరిగిన 1965, 1971 ఇండో – పాక్ యుద్ధాల్లో, భారత్ ముందు నుండీ అప్రమత్తంగానూ ఉంది, పొరుగుదేశం నుండి దగానీ, కుట్రనీ ఊహించగలిగే స్థితిలోనూ, ఎదుర్కోగల స్థితిలోనూ ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు యుద్ధాల తర్వాత కుట్రదారులు ఇక తమ ఆయుధ సంపత్తిని నమ్ముకోవడం మానేసారు. అందుకని యుద్దాలూ మానేసారు. ఇండో – పాక్ యుద్ధాల్లో ఓటమి తర్వాత వ్యూహం మార్చి తీవ్రవాదం మొదలు పెట్టారు. భారత్ ని ఆయుధాలతో యుద్ధంచేసి గెలవలేమని అర్ధమయ్యాక మార్చుకున్న పధకం తీవ్రవాదం. ఎందుకంటే తమ ఆయుధబలం కన్నా, వాటిని operate చేయగల సామర్ధ్యం, Personal ability భారతీయులకి ఎక్కువన్న విషయం అంతర్గతంగానైనా అంగీకరించుకొక తప్పలేదు కుట్రదారులకి. దాంతో 1971 యుద్ధం తర్వాత ‘మేధో వలసలు’ అన్న సమస్యని భారత్ ఎదుర్కొంది. విదేశాలకు ముఖ్యంగా అమెరికా, జర్మనీ మొదలైన దేశాల్లో భారతీయులకి ఉద్యోగావకాశాలు వెల్లువెత్తాయి. ఇక్కడి నుండి మేధావులు బయటికి వెళ్ళటం ఎక్కువైందనీ, అది సమస్య అయ్యేంత తీవ్రతరమైందనీ ఇందిరాగాంధీ హయాంలో ఎక్కువుగా చర్చించబడుతూ ఉండేది. మన దేశంలోని రాష్ట్రాల వేర్పాటువాదులతో [పంజాబ్, కాశ్మీర్, అస్సాంలతో] మొదలుపెట్టి తీవ్రవాదాన్ని సృష్టించారు. ఇక తర్వాతి పరిణామం తాలిబానిజం. అంటే ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చి భారత్ కి వ్యతిరేకంగా బాంబులు పేల్చడం మొదలైనవి. అది ఈ 1992 తర్వాత అత్యంత ప్రాచుర్యంలోకి రావడం అందరికీ తెలిసిందే.

1971 లోని ఇండో – పాక్ యుద్ధంలో, పాకిస్తాన్ మన విశాఖ పట్నంలోని షిప్ యార్డ్ ని ధ్వంసం చేయాలని పధకం రచించింది. ఆ ప్రకారం విశాఖ తీరానికి చేరువుగా వచ్చిన జలాంతర్గామిని చేపల వేటకు వెళ్ళిన జాలరి వాళ్ళు గమనించారట. వారు ఇచ్చిన సమాచారంతో నావికాదశాధికారులు అప్రమత్తమై విశాఖను కాపాడుకున్నారట. అప్పుడు ఆ జలాంతర్గామిని పట్టుకున్నారట. దాన్ని యుద్ధ ఙ్ఞాపకాలకీ, గెలుపుకీ చిహ్నంగా మ్యూజియంగా మార్చుతామని ప్రభుత్వం ప్రకటించిందట. ఈ కథని నేను నా చిన్నప్పుడు, 1971 యుద్ధం తర్వాత విన్నాను.

2008 జూన్ లో, వార్త పత్రికల్లో భారతీయ నావికాదళానికి ఎంతో సేవ చేసిన ఓ జలాంతర్గామిని మ్యూజియంగా మార్చి విశాఖలో ప్రారంభించినట్లు చదివాను. విశాఖ వాసులకి ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఉంటుందనుకుంటాను.

ఇండో – పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపధ్యం ఇదీ :

ప్రపంచంలో ఏమూల వేర్పాటువాదం ఏర్పడినా దానికి కారణాలు క్రింది వాటిలో కొన్నో లేక అన్నీ ఉంటాయి. నెగిటివ్ కాప్షన్ అయితే వేర్పాటువాదం, పాజిటివ్ కాప్షన్ అయితే స్వాతంత్రసమరం. ఇప్పుడు కాశ్మీర్ లోనూ, లంకలోనూ మనం చూస్తున్నది ఇదే. పంజాబ్ లోనైనా, అస్సాం లోనైనా, సెర్బియా అయినా, లిబియా అయినా – ఏప్రదేశమైనా ఇంతే. సరే! తూర్పుపాకిస్తాన్ – పశ్చిమ పాకిస్తాన్ విషయంలో గల కారణాలు చూద్దాం.

1]. పశ్చిమ పాకిస్తాన్[నేటి పాక్], తూర్పుపాకిస్తాన్ [నేటి బంగ్లాదేశ్] మీద సవతి తల్లిప్రేమ చూపుతుంది. తూర్పుపాకిస్తాన్ [బంగ్లాదేశ్] నుండి అయిన ఎగుమతుల ఆదాయాన్ని ఇస్లామాబాద్ లో ఖర్చుపెడుతుంది.

2]. 16 ప్రాజెక్టులు చేపడితే అందులో 13 ఇస్లామాబాద్ కోసం, 3 మాత్రమే బంగ్లాదేశ్ కోసం చేపట్టారు. అన్ని అవకాశాలు పశ్చిమ పాకిస్తాన్ ప్రజలకి మాత్రమే ఉంటున్నాయి.

3]. కేవలం ఉర్దూ మాత్రమే అధికార భాష అన్నారు. దాంతో బంగ్లాదేశ్ లో అధిక సంఖ్యలో ఉన్న బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు రాత్రికి రాత్రి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు. ఇది సమాజంలో పెద్ద యెత్తున ఒత్తిడి కలిగించింది.

4]. తమని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా పశ్చిమ పాకిస్తాన్ నిర్లక్యం చేస్తోందని తూర్పుపాకిస్తాన్ భావించింది. 1965 భారత్ పై యుద్ధం విషయంలో కనీసం తమని సంప్రదించలేదని ఆరోపణలున్నాయి.

5]. ఈ కారణాలతో అక్కడ అలజడి రేగింది. దాన్ని అణచటానికి వెళ్ళిన పశ్చిమ పాకిస్తాన్ సైనికులు తూర్పుపాకిస్తాన్ ప్రజల మీద దౌర్జన్యం చేశారు, ఆడవారిపై అత్యాచారాలు చేశారు. [కాశ్మీర్ లో, అస్సాంలలో బి.యస్.ఫ్. సైనికులు ఇదేచేశారనీ, ఆపరేషన్ బ్లూస్టార్ కోసం వెళ్ళిన జవాన్లు పంజాబీల మీద ఇదే చేశారనీ, చివరికి నక్సల్స్ ని అణచటానికి వెళ్ళిన పోలీసులు గిరిజన గ్రామాల్లో ఇదే చేశారనీ, లంక సైనికులు తమిళుల మీద కూడా ఇదే చేశారనీ ……….. ఇలా ఎక్కడైనా ఇవే ఆరోపణలు జరుగుతుంటాయి. అందులో నిజాలుండవచ్చు మరికొన్ని అబద్దాలు కలపబడవచ్చు. కానీ సర్వత్రా ఒకే స్ట్రాటజీ ఎలా సాధ్యం?]

ఏదేమైనా ఇలాంటి చాలా కారణాలతో తూర్పుపాకిస్తాన్ నుండి లక్షల కొద్దీ ప్రజలు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించడం ప్రారంభమైంది. అయినా భారత్ ఆ వ్యవహారంలో తలదూర్చేందుకు నిరాకరించింది. ఓ దశలో ఈ విషయంపై పార్లమెంట్ లో గందరగోళం చెలరేగింది. తదుపరి తీవ్రమైన చర్చ జరిగింది. ఆ చర్చల్లో ప్రతిపక్ష అధికారపక్ష సభ్యుల్లో చాలామంది ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా ఇందిరాగాంధీ పై ఒత్తిడి తెచ్చారు. చర్చకు సమాధానం ఇస్తూ ఇందిరాగాంధీ ’ఎట్టి పరిస్థితుల్లో ప్రక్క దేశపు అంతర్గత గొడవుల్లో తలదూర్చేది లేదని’ తెగేసి చెప్పింది. అయినా తదుపరి పరిణామాల తర్వాత జోక్యం చేసుకోక తప్పనిస్థితి సంభవించింది. మనం కల్పించుకొనే వరకూ సమస్యని పొడిగించటం అన్న స్ట్రాటజీని ఎదుటివారు మనమీద ప్రయోగించినప్పుడు పరిస్థితులు అలాగే ముంచుకొస్తాయన్నమాట.


ఇక 1971 ఇండో – పాక్ యుద్ధపరిణామాలుగా తూర్పుపాకిస్తాన్, బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది. ఈ దశలో ఇందిరాగాంధీ పేరు మార్మోగిపోయింది. దీంతో భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీకి బలమైన నాయకురాలిగా పేరొచ్చింది. ఆ సమయంలోనే ఓసారి పార్లమెంట్ లో ఆటల్ బిహారీ వాజ్ పాయ్ ఇందిరాగాంధీని అపరకాళిగా శ్లాఘించాడు. ఇక ఆ పొగడ్తల పరంపర అంతటితో ఆగలేదు. అదేపనిగా అందరూ పొగడమే!

ఇందులోనూ ఓ సున్నితమైన, నిగూఢమైన అంశం ఇమిడి ఉంటుంది. అది కుట్రదారులు గూఢచర్య కౌశలం అన్నమాట. ఈ కౌశలం ఎంతటిదంటే – ప్రతీ సంఘటననీ తమకి అనుకూలంగా మలుచుకుంటుంది. ఎప్పుడైనా ఎదురుదెబ్బతగిలినా సరే, ఆ ఎదురుదెబ్బనుండే advantage పొందేందుకు ప్రయత్నిస్తుంది. అదే స్ట్రాటజీ ప్రకారం, ఇండో – పాక్ యుద్దంలో భారత్ గెలిచింది. ఇందిరాగాంధీ నాయకత్వం మరింత బలాన్ని సంతరించుకొంది. దాంతో ఇక పొగడ్తలవర్షం ప్రారంభించి, ఎదుటి వ్యక్తిలో ఆ అహాన్నిప్రవేశపెడతారు. అహం తలకెక్కితే వ్యక్తి పొరపాట్లు చేయడం, పొరబాటు నిర్ణయాలు తీసుకోవడం సహజం. అప్పుడు ఏ వ్యక్తి అయిన తాను always correct అన్న పాయింట్ దగ్గర ఉంటాడు. అప్పుడు మరిన్ని తప్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీలో ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని బాగా ఎక్కువగా నన్నా చూపిస్తారు, లేదా బాగా తక్కువుగా నన్నా చూపిస్తారు. ఆ వ్యక్తి విజయాన్ని సరిగ్గా ఎప్పుడూ చూపరు. అది తమ అనుచరులయినా అంతే, తమ వ్యతిరేకులయినా అంతే! ఎందుకంటే ప్రజలకి ఎప్పుడు ప్రమాణికాలు [parameters] తెలియనివ్వకూడదని వాళ్ళ ప్రయత్నం. ఇదే ఇక్కడ ఉపయోగించే స్ట్రాటజీ. ఒకవేళ ఎదుటివ్యక్తి, అహాన్ని తలకెక్కించుకోకుండా అప్రమత్తంగానూ, ఆత్మసంయమనంతోనూ ఉన్నాడను కొండి. అప్పుడు ఆ వ్యక్తి ఏంచేసినా ’ఏం లేదు. అది పొరబాటు నిర్ణయమే. ఎందుకంటే ’సదరు వ్యక్తిలో అహం పెరిగిపోయింది. ఫలనా విజయం తర్వాత ఆవ్యక్తి ఎవరినీ లెక్కచేయటం లేదు’ అని పదే పదే ప్రచారించి అహపు స్టాంపు కొట్టేస్తారు. ఇంతటితో స్ట్రాటజీ అయిపోదు. ఆ పైన పొగడ్తల స్థానే విమర్శలూ, తెగడ్తల జడివాన ప్రారంభిస్తారు. Superiority complex తర్వాత inferiority create చేయాలనుకోవడం, అహాన్ని ఎక్కించి పిదప అపహాస్యం చేయటం – ఇవన్నీ మానసిక యుద్ధతంత్రాలు, గూఢచర్య మంత్రాలు.

నకిలీ కణికుడి స్ట్రాటజీలలో నమ్మకద్రోహంతో పాటు, అహన్ని సంతృప్తి పరచడం, అహాన్ని రెచ్చగొట్టడం ఇత్యాది కొన్ని విశేషాంకాలున్నాయి. భారతీయుల ’గీత’ అహాన్ని విస్మరించమంటుంది. నకిలీ కణికుడి ‘నీతి’ అహాం మీదే ఆధారపడి అన్ని తంత్రాల్నీ రచిస్తుంది.

ఇక ఈ చర్చ వదిలి మళ్ళీ ఇందిరాగాంధీ హయాం నాటికి వద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

u haven't mentioned that US had sent its armies in support of pakistan and by the time they reached pak, our soldiers had finished the job

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu