ఇప్పటి వరకూ దేశ విభజన వెనుకా, స్వాతంత్ర సమర సమయంలో జరిగిన కుట్రకోణాన్ని చర్చించాను. కుట్ర చేసిన తీరుని మరో విధంగానూ పరిశీలించవచ్చు.

బాపూజీ మీద కుట్ర తీరు:

గాంధీజీ ఓ కొత్త పోరాట పద్దతిని పరిచయం చేశాడు. దానికి సత్యం, అహింస అన్నవి రెండు కళ్ళ వంటివి. ప్రజలు, తన అనుచరులు సత్యం యొక్క శక్తిని తెలుసుకునేట్లు చేశాడు. ప్రజలు సత్యాన్ని నమ్మేటట్లు చేశాడు. స్వాతంత్ర సమరానికి దైవభక్తిని జోడించాడు. కర్మాచరణ, అంటే కర్మయోగాన్ని జోడించాడు, ఆధ్యాత్మికతని, తాత్త్విక చింతననీ, భావవాదాన్ని జోడించాడు. రాజకీయాల్లోకి మతాన్ని ప్రవేశపెట్టాడు. అదీ పాజిటివ్ మార్గంలో! [ ప్రతీ దానిలో నుండి Disadvantage ని పుట్టించే కుట్రదారులు తదనంతర కాలంలో మత రాజకీయాలతో ఎంత నష్టపరిచారో తరువాతి టపాలలో వివరిస్తాను.] గాంధీజీ స్వయంగా ’తాను రాజకీయాలని మతం నుండి విడదీసి చూడలేనని’ ప్రకటించాడు.

ఎందుకంటే – ప్రాధమికంగా భారతీయులు శాంతికాముకులు, సత్యప్రేమికులు. [ కాబట్టే ఇన్ని కుట్రలు తట్టుకొని ఇంకా ఈ కర్మభూమి మనగలుగుతోంది. లేకుంటే ఎప్పుడో భారతదేశం కుప్పకూలిపోయి ప్రపంచపటంలో కనిపించకుండిపోయేది.] ఇంకా ఆరోజుల్లో అంటే 1947 కు పూర్వం ప్రజల మీద కుట్రదారుల ప్రభావం ఇప్పుడున్నంత స్థాయిలో లేదు. కాబట్టే ఆనాటి భారతీయులు గాంధీ మార్గానికి ప్రతిస్పందించారు. దానితో ఆనాటి స్వాతంత్రసమరం ఆధ్యాత్మిక పరిమళాలని, తాత్త్విక వెలుగుల్నీ సంతరించుకుంది.

స్వాతంత్ర సమరంలో – నిరాహార దీక్షలు, హర్తాళ్ లూ, ఊరేగింపులూ, ర్యాలీలు – వందేమాతరం అని ఎలుగెత్తి జపిస్తూ, వందేమాతరం గీతాన్ని గొంతెత్తి ఆలపిస్తూ – స్త్రీ పురుష బేధం లేదు, బాల వృద్ధులన్న తేడా లేదు. ఎందరో భారతీయులు కొదమ సింహాల్లా సమర భూమిలో దూకారు. ఈ వేదభూమిలో కర్మయోగులకి కొదవలేదని నిరూపించారు. మాతృభూమి కోసం పోరాడటంలో ఉన్న ’ఆత్మతృప్తి’, ’ఆత్మానందం’ వంటి దివ్యమైన అనుభవాల్ని, రమ్యమైన అనుభూతుల్ని అస్వాదించారు. కష్టాన్ని మరపించే అమృత తుల్యం అది! అనుభవిస్తేనే తెలిసే ఆనందం అది!

కాబట్టే బాపు దండియాత్ర ప్రారంభించినపుడు ఉపనదులు మాతృనదిలో సంగమించినట్లు, సబర్మతి నుండి దండివరకూ, దారిపొడవునా, ప్రజా సమూహాలు రామభజన చేస్తూ, దేశభక్తిని గానం చేస్తూ తప్పెట్లు, తాళాలతో సహా యాత్రలో చేరాయి. అదో ఉత్సవమే! ఇది ప్రజల్లో దేశభక్తినీ, దైవ భక్తినీ ఉత్తుంగ తరంగాల్లా నింపింది. దేశమంతటా ఈ సజీవ చైతన్యఝరి ప్రసరించింది. అగ్ని ప్రజ్వరిల్లినట్లుగా భారతీయుల గుండెల్లో స్వేచ్ఛా ఘంటిక మ్రోగించింది.

కాబట్టే బాపూ దండిగ్రామ సముద్రపుఒడ్డున, క్రిందికి వంగి, పిడికెడు ఉప్పు చేతబూని “ఇది మీకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతుంది” అన్నప్పుడు భారతీయులకి అది అర్ధమైంది. బ్రిటిషు వారికి అర్ధంకాలేదు. తర్వాత అనుభవం వారికి దాన్ని అర్ధం చేసింది. ఎందుకంటే వాళ్ళు మనిషి సంకల్పాన్ని, నమ్మకాన్ని నమ్మరు. తుపాకుల్ని, బాంబుల్ని నమ్ముతారు కాబట్టి.

ఈ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని గుర్తించిన తర్వాత ఇక దాన్ని నాశనం చేయటానికి కుట్రదారులు [బ్రిటిషు, సి.ఐ.ఏ., మరియు అనువంశిక నకిలీ కణికుడు. అనువంశిక నకిలీ కణికుడు అంటే నకిలీ కణిక వంశంలో ఆ తరంలోని వాడన్నమాట.] పన్నని పన్నాగం లేదు. విభజించి పాలించు, విభజించి ప్రచారించు అన్న పద్ధతుల్లో నాయకుల మధ్య, ప్రజల్లోనూ విబేధాలు సృష్టించారు. కొన్ని దశల్లో ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్ర సమరం నిశ్శబ్ధమై, నిస్తేజమై పోయేవి. మళ్ళీ చైతన్యం ఎగసేది. ఇప్పుడు ఆనాటి స్వాతంత్ర సమర గాధ చదివితే ఈ కుట్ర పనితీరు స్పష్టంగా అర్ధమౌతుంది. ఎందుకంటే అది, ఇప్పుడు నడుస్తున్న స్ట్రాటజీకి ప్రతిరూపమే కాబట్టి. అయితే ఆనాటికి మన నాయకులు గానీ, ప్రజలు గానీ, ఇంత కుటిలతని కనీసం ఊహించనైనా లేదు. శతృ పన్నాగం తెలియక పోయినా స్వాతంత్ర సమరం విజయం సాధించిందంటే అది నిజంగా ’నిజం’ యొక్క బలం.

ఇక నాడు కుట్రదారులు ప్రయోగించిన కుట్రతీరు అర్ధం చేసుకోవడానికి చిన్న తాజా ఉదాహరణలు ఇస్తాను. ఇవి మన చుట్టు జరుగుతుండగా మనం నిత్యం చూస్తూ ఉన్నవీ, పత్రికల్లో చదువుతూ ఉన్నవే.

రాత్రి పడుకునే ముందు మన గ్రామంలో, లేదా కాలనీలో, లేదా పట్టణంలో లేదా నగరంలో అన్నీ బాగానే ఉంటాయి. అంతా ప్రశాంతంగానే ఉంటుంది. తెల్లవారేసరికి కాలనీ నడిబొడ్దులో నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అంబేద్కర్ బొమ్మ మెడలో చెప్పులు దండ ఉంటుంది. తక్షణమే కొందరు దళిత నేతలు ఆందోళన చేపడతారు. ఇదంతా చాలా తక్కువ సమయంలో జరిగిపోతుంది. ఎవరు ఆ దండ ఆ విగ్రహం మెడలో వేశారో ఎవరికీ తెలియదు. ఒకవేళ రాత్రికి రాత్రి పేరూ, కెరీర్ సంపాదించుకోవటానికి సదరు నాయకులే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైతేనేం అందోళన, రాస్తారోకో గట్రా గట్రా ప్రారంభమైపోతాయి. గొంతుకు చించుకు అరుస్తారు. ఇంతలో అదుపు చేయటానికి గనుక పోలీసులు వస్తే వాళ్ళ పై రాళ్ళ రువ్వుతారు. తర్వాత లీటర్ల కొద్దీ పాలు తెచ్చి అంబేద్కర్ బొమ్మకి క్షీరాభిషేకం చేస్తారు. ఆ తర్వాత మరో చెప్పల దండ తీసికెళ్ళి గాంధీ బొమ్మ మెడలో వేస్తారు.

మరుక్షణమే వైశ్య నాయకులు రోడెక్కుతారు. గాంధీ రక్షణ తమ తక్షణ కర్తవ్యమయ్యే మరి. మళ్ళీ పాలాభిషేకాలు, చెప్పుల దండలూ షరా మామూలే. ఎవరు చెప్పారు ఈ రెండు వర్గాల వారికీ అంబేద్కరు, గాంధీ తమ వర్గానికి లేదా కులానికి మాత్రమే సంబంధించిన నాయకులని? ఏ రాజకీయనాయకుడూ, ఏ మీడియా, ఏ మేధావి కూడా ఈ కుల ఉద్యమాల్లోని ఆందోళన కార్యక్రమల్లోని నాన్ సెన్స్ నీ, కు తర్కాన్ని, అసంబద్ధతనీ ప్రజలకి వివరించే ప్రయత్నంగానీ, విశ్లేషించే ప్రయత్నం గానీ చేయరు. మీడియా వాటిని ప్రింటు చేసి ప్రచారిస్తుంది.

దీంతో, మొత్తానికి దళితులూ, వైశ్యులూ ఒకరి నొకరు దూషించుకొని, మరణించిన నాయకులకి కుల గజ్జినీ, మత పిచ్చినీ అంటగట్టి చెప్పుల దండలతో అవమానాలు చేసి అచ్చంగా పరమానందయ్య గారి శిష్యులు కథ[గురువు గారి కాళ్ళు ఒత్తటం] లోలా విజయవంతంగా రచ్చచేస్తారు.

ఇదేరకపు స్ట్రాటజీ మనం తరచుగా మతాల మధ్య, ప్రార్ధనా స్థలాల మీద చూస్తూ ఉంటాం. రాత్రి పడుకునే ముందు ఆన్నీ ప్రశాంతంగానే ఉంటాయి. తెల్లవారేసరికి రోడ్డుప్రక్కనో, రోడ్డు మధ్యలోనో ఉన్న గుడో, మసీదో, పగల గొట్టబడి ఉంటుంది. ఇక ఘర్షణలు, గృహదహనాలూ మొదలు. నిజానికి ఆ కాలనీలోని హిందువుల్లో గానీ, ముస్లింల్లో గానీ ఎవ్వరూ కూడా సదరు గుడినీ లేదా మసీదుని ఎవరు పగలగొట్టారో చూడలేదు. అయినా ఇరువురూ పరస్పరం అనుమానిస్తారు, నిందిస్తారు.

ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమా ’అజాద్’ [నాగార్జున, సౌందర్య నటించారు] లో లాగా ఓ ముస్లిం హిందువు వేషం వేసికొని ఈ ఘర్షణల్ని రెచ్చగొట్టినా అశ్చర్యం లేదు. అలాగే ఓ హిందువు ముస్లిం వేషమూ వేయవచ్చు. ఇలా ఘర్షణలు రేపితే ఆ తర్వాత కుట్రదారులు తమకు కెరీర్ ని, ప్రయోజనాల్ని కట్టబెడతారు కదా! ఇవి సినిమాల్లో చూస్తాం. ’ఆ. అది సినిమా’ అనుకుంటాం. నిజంగా జరిగినా మన దృష్టి ’ఆ ఇది మామూలే!’ అన్నట్లే ఉంటుంది. ఇది నిర్భయమైన దారి కుట్రదారులకి. ఇలా సినిమాల ద్వారా ఈ కుట్రలని ’మామూలే’ అనుకునేటట్లు ప్రజలకి సైకాలజీకల్ డెవలప్ మెంట్ తెస్తారు. ఆ విధంగా ఉపయోగించుకోడానికి సినిమా మీడియాని గ్రిప్ చేస్తారు.

ఈ విధంగా గాంధీ అంబేద్కరుల విగ్రహాలు, గుడి మసీదుల కూలగొట్టడాల వంటి ఎన్నో పధకాలు స్వాతంత్ర సమరంలో పలురకాలుగా ప్రయోగింపబడ్డాయి. ఇలాంటి కుటిల కణిక నీతితో వారు కొంత విజయం సాధించగలిగారు. ఫలితమే ఇండియా పాకిస్తాన్ లుగా దేశ విభజన. అదే సమయంలో వారి కుటిల నీతి పరాజయం పాలయ్యింది. ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం రావడం.

చివరికి స్వాతంత్రం ప్రకటించేటప్పుడు కూడా కుట్రదారులు [బ్రిటిషు, సి.ఐ.ఏ., మరియు అనువంశిక నకిలీ కణికుడు] పాకిస్తాన్ కి 1947, ఆగస్టు 14 న, భారత్ కు 1947, ఆగస్టు 15 న స్వాతంత్రం ప్రకటించారు. దీనితో మీడియాలో 1975 నుండి 1992 ముందు వరకూ ఓ జోకు ముమ్మరంగా ప్రచారంలో ఉండేది. అదేమిటంటే – ‘పాక్ భారత్ కంటే ముందు స్వాతంత్రం సంపాదించుకొంది. [ఒక్కరోజు ముందు] భారత్, పాక్ కంటే ముందు స్వాతంత్రం సంపాదించుకోలేక పోయింది. కాబట్టి భారత్ కంటే పాకిస్తానేకే సత్తా సామర్ధ్యాలు ఉన్నాయి’. పైకి చూడటానికి ఈ ప్రచారం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు, ప్రజల్ని Motivate చేస్తున్నట్లు ఉండేవి. కానీ మీడియా Coverage మాత్రం భారతీయుల్ని కించపరిచేలా, ఆత్మన్యూనత పడేలా ఉండేది. కాకపోతే మరి అప్పటికే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం మంటగలిసిపోయింది. ఇండియాలో స్వాతంత్రం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మనగలుగుతున్నాయి. మరి ఈ సత్తా సామర్ధ్యాల గురించి మాట్లాడిందా ఈ మీడియా? నిజానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో, దేశాన్ని నిభాయించుకోగలమా అన్న ఆందోళనకి గురయ్యారట తొలి తరం నాయకులు. అంత ఒత్తిడి వారిపై ఉండేది. పైకి కనబడని కుట్రతో, కుట్రదారులకిది చాలా తేలికైన పని, వత్తిడిని వ్యక్తుల మీద సృష్టించడం!

అలాంటి మరో జోక్ ఏమిటంటే “భారత దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. ఇంకా తెల్లవార లేదు”. ఈ ప్రచారం కూడా 1975 నుండి 1992 వరకూ ముమ్మరంగా సాగిందే. 1992 తర్వాత ఇప్పుడు సినిమాల్లో ఒక్కటన్న జెండా పాట లేదా జెండా సీన్ ఉన్నట్లు, 1992 తర్వాతే ఇలాంటి కుళ్ళు జోకుల నోళ్ళు మూత పడ్డాయి.

నకిలీ కణిక వంశానికి, తనకూ ఏదో బలీయ సంబంధం ఉన్న రామోజీ రావు యొక్క ఉనికి, అతడి పని తీరులోని విలక్షణ కోణం నాటి ప్రధాన మంత్రికి, నిఘా సంస్థలకి 1992 లో తెలియటమే, 1992 తర్వాత మార్పులకి కారణం అని చెప్పటమే ‘మాటి మాటికి 1992’ అనటంలో నా ఉద్దేశం. కుట్రతీరుని [w.r.t. time] సమయంతో పోల్చిచూసినప్పుడే దాని స్వరూపం మరింత స్పష్టంగా కనబడుతుంది. రామోజీ రావు కుట్ర తీరులోని విలక్షణ కోణాన్ని ముందు ముందు మరింత వివరిస్తాను.

“చాలా మందిని కుట్రకు మద్దతుదారులుగా పేర్కొంటున్నారు, మరి పి.వి.నరసింహారావు సైతం ఎందుకు కుట్రదారుల మద్దతుదారుడు కాకూడదు?” అంటారేమో! ఆయన కుట్రదారులకు మద్దతుదారుడు కాదనీ, కుట్రదారులకి వ్యతిరేకంగా పోరాడాడనీ చెప్పటానికి నేను బ్రతికి ఉండటమే సాక్ష్యం. ఎందుకంటే రామోజీరావు మీద Complaint చేసినందుకు నన్ను ఇంతగా, Organized గా harass చేసిన రామోజీరావుకి నా పీక పిసకటం పెద్ద పని కాదు. అయినా harass మాత్రమే చేసాడంటే అందులోనీ Strategy ఏమిటో నాకు తెలియదు. కానీ రామోజీ రావు నన్ను harass చేసాడనీ, చేస్తూనే ఉన్నాడనీ చెప్పడానికి, కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి, కుర్చీవ్యక్తి, రాష్ట్రంలో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, అతడి మద్దతుదారులే నని చెప్పడానికి మాత్రం నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలున్నాయి. వాటి తెలుగు అనువాదం క్రమంగా దశల వారీగా చేస్తాను. వెంటనే చూడాలంటే Coups On World లోని Documentary Evidence చూడగలరు. పూర్తిగా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తో కూడిన బ్రతుకు పోరాటం తాలుకూ వివరాలు అవి. ఇక్కడ మరో విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. నేను ఇదంతా ఎవ్వరి మీదో వ్యక్తిగత విద్వేషంతోగానీ, లేక వ్యక్తిగత అభిమానంతో గానీ వ్రాయటం లేదు. సుదీర్ఘకాలంగా మనమీద, మానవత్వం మీదా జరుగుతున్న కుట్రని, నిజాన్ని తెలియజెప్పడానికి వ్రాస్తున్నాను. ఇది నిజమని నమ్మమని కూడా నేను ఎవర్నీ convince చేయను. ఎవరైనా సరే చదివి, పరిశీలించి, విశ్లేషించుకోమని చెబుతాను. చదవక ముందే నచ్చకపోయినా, నమ్మదగినదిగా అన్పించక పోయినా ఈ బ్లాగుని విస్మరించవచ్చు. అంతేగానీ ఒక్క మాటలో, ఒక్క టపాలో మొత్తం విషయం చెప్పమని అడగ వద్దు.

మళ్ళీ చర్చని ఇక్కడ నుండి మళ్ళించి గాంధీజీ దగ్గరికి వద్దాం.

ఏదేమైనా గాంధీజీతో కుట్రదారులు పెద్ద ప్రమాదాన్ని గుర్తించారు. “ఈయన బ్రతికే ఉంటే, స్వల్పకాలంలోనే ఇప్పుడు విడిపోయిన రెండుదేశాల ప్రజలనీ [ఇండియా – పాక్ ], హిందూ ముస్లింలని ’సత్యం’ గ్రహించే స్థితికి తిరిగి తెచ్చేస్తాడు. ప్రజలకి ఈ సత్యాన్ని ఏదోక రూపంలో ప్రస్పుటంగా చూపిస్తాడు.అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఇంతకు ముందు ఈయన నిర్వహించిన అహింస యుద్దం తమ క్రౌర్యాన్ని బయటపెట్టింది. అలాగే ఈసారి మతఘర్షణల వెనక నున్న కుటిలతని బయటపెడతాడు”. ఈ ఆలోచనతో వారు గాంధీజీ హత్యకు తెగబడ్డారు. ఈ ’అసైన్ మెంట్’ నిర్వహించడానికి వారు నాధూరాం గాడ్సేని, ఆర్.ఎస్.ఎస్. ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే ముందస్తుగా ఆర్.ఎస్.ఎస్. నుండి బహిష్కరింపబడిన నాధూరాం గాడ్సేని ఎన్నిక చేసుకున్నారు. నాధూరాం గాడ్సే ఎప్పుడో ఆర్.ఎస్.ఎస్.నుండి బహిష్కరింపబడ్డాడు గనుక, నాధూరాం గాడ్సేకి ఆర్.ఎస్.ఎస్.కి సంబంధం లేదు. కనుక ఆర్.ఎస్.ఎస్.కీ, గాంధీజీ హత్యకీ సంబంధం లేదు. ఇదీ సమర్ధింపు వాదన, చక్కని ఎలీబీ! ఇలాంటి పధకం ఆచరణకు అసాధ్యమా? అయోధ్యలోని ‘రామమందిర నిర్మాణం – బాబ్రీ మసీదు వివాదం’ తాలూకు కుట్రలో ఆర్.ఎస్.ఎస్. పాత్రని తర్వాత వివరిస్తాను.

దేశ విభజన నేపధ్యంలో జరిగిన మీరట్ అల్లర్ల వంటి వందలాది సంఘటనల్లో లక్షల మంది మరణించారట. కానీ జరిగిన హింస పరిమాణంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. అప్పుడే కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకూ!

ఇక్కడో సంఘటన చెబుతాను.

ఒకసారి వాయువ్య భారత్ పర్యటనలో ఉండగా నెహ్రు వెంట ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఉన్నదట. అప్పుడు గుంపులో ఒక వ్యక్తి ఆవిడ చెయ్యి పట్టుకు లాగాడట. కోపంతో నెహ్రు అతడి చెంప పగలకొట్టాడట. మౌనంగా చెంప తడుముకొన్న ఆ వ్యక్తి సూటిగా నెహ్రుని చూస్తూ “పండిట్ జీ! ఇప్పుడు నేను చేసిన పనికి మీకింత ఆగ్రహం కలిగింది. మరి లాహోర్ లో నా భార్యకీ, నా సోదరికి జరిగిన [?] దానికి నేను ఏమనాలి?" అన్నాడట. అతడికి నెహ్రు క్షమాపణ చెప్పుకున్నారని పి.వి.నరసింహారావు గారి ’ఇన్ సైడర్’ లో చదివాను.

బాపూజీని హత్య చేసిన తరువాత కుట్రదారులు [అంటే బ్రిటీషు, సి.ఐ.ఏ., అనువంశిక నకిలీ కణికుడు] నెమ్మదిగా ఆయన వ్యక్తిత్వాన్ని హత్య చేయటం ప్రారంభించారు. అందులో భాగంగానే వారు ‘బాపూజీకి కీర్తికండుతి, తనకు పేరు ప్రఖ్యాతులు కావాలి. అందుకే కుటుంబ సభ్యుల్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు’ అని ప్రచారించారు.

నిజంగా ఇది దారుణమైన ప్రచారం. 1980 ల్లో నేను విద్యార్ధి దశలో ఉండగా, మా కాలేజిలో విద్యార్ధుల మధ్య ఈ విషయ చర్చలు నడిచేవి. నిజానికి విద్యార్ధులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైతే బాపూజీ, ఇంకా ఇతర గొప్పవ్యక్తుల గురించి నెగిటివ్ గా వాదించే వారో, వాళ్ళల్లో ఎవరికీ అసలు నిజంగా ఏం జరిగిందో, కనీసం ఆ చరిత్ర పుస్తకాల్లో [అందులోనూ అధికభాగం తప్పులే. అయినా అలాంటి చరిత్ర పుస్తకాలైనా సరే] ఏం వ్రాసి ఉందో చదివే ఓపిక లేదు. స్వాతంత్ర సమరానికి సంబంధించిన ఏ పుస్తకాలు చదివే వారు కాదు. నిజం తెలుసుకునే ప్రయత్నమే ఉండేది కాదు. చాలా మామూలుగా మీడియా ప్రచారించిన దాన్ని స్వీకరించి, స్వంతీకరించి అభిప్రాయాలు వెల్లడి చేసేవాళ్ళు. [మళ్ళీ ఆ అభిప్రాయాల్ని ఎవరైనా సహేతుకంగా, దృష్టాంతసహితంగా విమర్శిస్తే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకి దిగేవాళ్ళు. ఇలాంటి వాదనల అనుభవాలు విద్యార్ధి దశలో ఎన్నో ఎదుర్కున్నాను.] ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పటి విద్యార్ధుల్లో ఈపాటి చర్చలన్న ఉండేవి. ఇప్పటి యువతరంలో చాలా కొద్ది మందిని మినహాయిస్తే ఎక్కువ మంది సినిమాల గురించి, అందులోని ’గోచీ డాన్సుల గురించి’, బీర్లు గురించీ, పబ్బుల గురించీ, మరింకో దాని గురించి తప్ప ఇంకేమి చర్చించడం లేదేమో! ఈ రోజు అంతర్జాలంలో గానీ, మీడియాలో గానీ, సినిమాలలో గానీ అత్యధిక ప్రాముఖ్యం గలవి రెండే అంశాలు. ఒకటి శృంగారం. ఆ రకం జోకులూ, తారల సంబంధాల పుకారులూ, బొమ్మలూ, సినిమాలు లెక్కలకు మిక్కిలి. రెండోది డబ్బు వెంట పరుగు. రాజకీయాలు, కుంభకోణాలు, పరస్పర అవినీతి ఆరోపణలు, ఎలక్షన్లూ, ప్రచార యాత్రలూ, గెలుపులూ, ఓటములూ, కాంట్రాక్టులూ, షేర్లూ, వ్యాపారాలు – అన్నింటికీ అల్లిక తాడు ‘డబ్బు వెంట పరుగే’.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

మంచి విషయాలు తెల్పుతున్న మీకు ధన్యవాదములు. చాలా విశ్లేషణాత్మక వివరణలు ఇస్తున్నారు.

స్వంతీకరించి - స్వతంత్రీకరించి అనుకుంటా.

మీ విశ్లేషణ బాగుంది.

This comment has been removed by a blog administrator.

today's eenadu has invited all bloggers to let them know the details of blogs being posted by them on internet.i suggest that you also e mail them all your blog urls with blog names. let us see in what way eenaadu responds to your blogs. it is my personal feeling that eenadu is obliged to give its version as against your various allegations against its boss.if it does not, then people will be at their liberty to form their opinions about eenadu and its boss.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu