లాల్ బహుదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యింది. భారత దేశమ్మీద కుట్రజరుగుతుందన్న స్పష్టమైన అవగాహన, ధృఢమైన అభిప్రాయంతోనే ఆమె సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయంలోనికి ప్రవేశించింది. 1962 చైనా యుద్ధంలో ఎప్పుడైతే చైనా నుండి దగాని, ఓటమిని పొందామో, ఎప్పుడైతే చైనా భారత భూభాగంపై దురాక్రమణ చేసిందో, పైకి ఏ కారణాలు చూపెట్టనివ్వండి, [టిబెట్ అనీ, దలైలామా తన 80,000 మంది అనుచరులతో ఇండియాకీ రావడం అనీ] భారతప్రభుత్వం మాత్రం కుట్రని పసిగట్టగలిగింది. కుట్రతీరు ఏమిటో, కుట్రదారులు ఎవరో స్పష్టత ఇంకా రాకపోవచ్చు గానీ మౌలికంగా కుట్ర అస్తిత్వాన్నీ వాళ్ళు పసిగట్టగలిగారు. ఇది నెహ్రుని, ఆయన సహచరులనీ తమ తర్వాతి తరాన్ని హెచ్చరించేలా చేసింది. ఆ స్పష్టతతోనే ఇందిరా గాంధీ ప్రధానిగా తన పనిని ప్రారంభించింది.

బాల్యం నుండీ తండ్రి నెహ్రు ఆమెని బలమైన వ్యక్తిత్వం, నిర్ధిష్టమైన ఆలోచనా విధానం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. స్వాతంత్రసమర యోధుడిగా తాను జైలులో ఉన్న రోజుల్లో కుమార్తెకు ఆయన వ్రాసిన లేఖలు ప్రజల్లో ప్రసిద్ధి చెందాయి.

కెరీర్ కోరి నాటి , నేటి రాజకీయ నాయకుల్లాగా గాంధీ – నెహ్రు కుటుంబాన్ని నేను పొగడటం లేదు. కుట్రకోణాన్ని విశ్లేషించే క్రమంలో నిజాలు వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను. అంతే!

వాస్తవానికి, జవహర్ లాల్ తండ్రి మోతీలాల్ నెహ్రు కాశ్మీరీ పండిత వర్గానికి చెందినవాడు. స్వాతంత్ర సమరం నాటికి చాలా ధనవంతుడు. పేరు ప్రఖ్యాతలున్న న్యాయవాదిగా, మోతీలాల్ కు కాంగ్రెసుకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పనిచేసిన కెరీర్ గ్రాఫ్ ఉంది. ఒక దశలో నాటి కాంగ్రెస్ నాయకులతో, ముఖ్యంగా గాంధీజీతో అభిప్రాయభేదాల కారణంగా ‘స్వరాజ్య పార్టీ’ని స్థాపించాడు. ఏం చేసినా, భారతదేశం పట్ల నిబద్దత గలవాడు. కాబట్టే ఆ తండ్రీతనయులు స్వాతంత్రం వచ్చాక, ఖాదీ టోపి పెట్టి కాంగ్రెసు వాదులు అవలేదు. స్వాతంత్రం కోసం చెరసాలకు పోయిన, ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర వారిది.

ధనికుడైన మోతీలాల్ నెహ్రు గురించి ప్రజల్లో కొన్ని సంఘటనలు ప్రచారంలో ఉండేవి. వాటిప్రకారం – ఓసారి తన బ్రిటిషు మిత్రులతో జరిగిన వాదప్రతివాదనల అనంతరం, తన ధనాన్ని, ధనం పట్ల తనకున్న డిటాచ్ మెంట్ [తాపత్రయం లేనితనం] నీ చూపడానికి, ఆనాడు చలామణిలో ఉన్న అత్యంత విలువైన కరెన్సీ నోట్లను తగలేసి, ఆ మంటపై అతిధులకి టీ కలిపి ఇచ్చాడట. తన కుమారుడు జవహర్ లాల్ ని కేంబ్రిడ్జిలో చదివిస్తున్నప్పుడు, దేశంగాని దేశంలో, కొడుకు ఏ మార్గంలో బయటికొస్తే, ఆ గేట్ దగ్గర ఉండాలన్నట్లు నాలుగు వాహనాలు maintain చేసాడట. ఆవిధంగా తన ధనాన్ని, ఖర్చుని పట్టించుకొని తనాన్ని ప్రదర్శించేవాడట. దీనికి తార్కాణమా అన్నట్లు తమ ‘ఆనంద్ భవన్’ని కాంగ్రెసు కార్యాలయంగా ఇచ్చేసాడు.

అటువంటి ధనిక కుటుంబ నుండి వచ్చిన జవహర్ లాల్ నెహ్రుకి ధనం పట్ల వ్యామోహం లేదు కాబట్టే తనకు తానుగా భారత స్వాతంత్ర సమరంలో దూకి, పలుసార్లు జైలుకెళ్ళాడు. కటికనేల మీద పడుకున్నాడు, జైలు తిండి తిన్నాడు. ఈ రోజు నేరం చేసి జైలు కెళ్ళిన ఆర్ధిక, రాజకీయ నేరగాళ్ళు జైలులో ప్రత్యేక గది సౌకర్యాల కోసం కోర్టుకెళ్ళుతున్నారు, కోర్టు నుండి అనుమతులు ’సంపాదిస్తున్నారు’. అలాంటి నేపధ్యంలో ఆనాటి స్వాతంత్ర సమర యోధుల నిబద్దతను ఒక్కసారి ఆలోచిస్తే మనం అబ్బురపడాల్సిందే. ఇలాంటి నిబద్దత, నిజాయితీలతో జవహర్ లాల్ తన కుమార్తెలోనూ అలాంటి పాజిటివ్ లక్షణాలనే ప్రోది చేశాడు. కుమార్తెకు తండ్రి వ్రాసిన లేఖలు అందుకు దోహదపడ్డాయి. అవి ఆమె కొక్కదానికే కాదు, ఆనాటి యువతరంలో ఎంతో మందిని ఉత్తేజ పరిచాయి. ఇప్పుటికీ జవహర్ లాల్ నెహ్రు వ్రాసిన [ Discover of India, Glimpses of World History ] ఏ రచన చదివినా, ఆయన జీవిత చరిత్ర చదివినా, ఆయన వ్యక్తిత్వంలోని మేధస్సు, దార్శనికత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.

అటువంటి motivation తో, ఇందిరాగాంధీ, చిన్న వయస్సు నుండే తన తండ్రి, బాపూజీ, తదితర నాయకుల నుండీ, స్వాతంత్రసమర యోధుల నుండీ, స్వాతంత్ర సమరం నుండీ స్ఫూర్తి పొందుతూ పెరిగింది. ఆవిడ చిన్నవయస్సులో ఉండగా ఓసారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల్ని మంటల్లో వేసి తగలబెట్టమన్నారట. అప్పుడు తన బొమ్మని మంటల్లో వేయటానికి చాలా సేపూ సందేహించాననీ, సంఘర్షణానంతరం బొమ్మపైన మోహం వదులుకొని మంటల్లో వేసానని ఆవిడే చెప్పగా చదివాను. సహజంగానే పిల్లలకి తము ఆడుకునే బొమ్మల మీద చాలా ప్రీతి ఉంటుంది. అటువంటిది ఆ వ్యామోహాన్ని దాటి చిన్నవయస్సులోనే దేశభక్తి గట్టిపడాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నదే. ఆవిధంగా చూసినా ఆవిడ దేశం పట్ల ఓ అంకితభావంతో పెరిగింది అన్న విషయం సుస్పష్టం.

అయితే జీవితంలో ‘వైచిత్రి’ అంటే ఇదేనేమో అన్పించేటట్లు – చిన్న వయస్సులో విదేశీ వస్తువుల్ని బహిష్కరించిన ఇందిరాగాంధీ విదేశీ కోడల్ని స్వీకరించింది. జాతీయతని బట్టి మనిషిని లెక్కవేయకూడదనే సంస్కారం ఆవిడది. ఈ Transplanter i.e. సోనియా గాంధీ ప్రధాని ఇంట్లో నిలదొక్కుకున్నాక కుట్రదారులకి [సి.ఐ.ఏ., బ్రిటిష్, అప్పటికి ఐ.ఎస్.ఐ. కూడా బాగానే బలం పుంజుకుంది, ఇక అనువంశిక నకిలీ కణికుడు] కనబడని బలం పెరిగిపోయింది. ఎందుకంటే లోపలి నుండి ప్రధాని motives, activities, and moods బయటికి చేరవేయబడుతుండేవి గనుక. కుట్రలో సోనియాగాంధీ పాత్ర గురించి తరువాతి టపాలలో వ్రాస్తాను.

ఇక ఇందిరాగాంధీ విషయానికి వస్తే, స్వాతంత్రం పొందేనాటికి ఆవిడ 30 ఏళ్ళ యువతి. పి.వి.నరసింహారావు 26 ఏళ్ళ వాడు. ఎన్.టి.ఆర్.కి 25 ఏళ్ళు. ఇందిరాగాంధీ స్వాతంత్ర సమరంలో పొల్గొన్నతీరు, రామదండు అందరికీ తెలిసిందే. పి.వి.నరసింహారావు గారి నిజాం వ్యతిరేక పోరాటం, స్వాతంత్ర సమరం, అఙ్ఞాత జీవితం, అన్నీ మనకు తెలిసినవే. అలాగే ఎన్.టి.ఆర్. స్వాతంత్రసమరంలో సైతం పాల్గొనని సినిమా కెరీర్ 60 ఏళ్ళవరకూ ‘అదేలోకం’ అన్నతీరూ అందరికీ తెలిసిందే. ఆనాటికి స్త్రీ పురుష బాల వృద్ధ తేడా లేకుండా ‘కట్టండి వీరకంకణం’ అంటునూ, "వీర గంధము తెచ్చినారమూ, వీరులెవరు రండయా!” అంటూ అందరూ రణోత్సహాంతో ఉర్రూతలూగుతున్నా స్పందించని వ్యక్తి ఎన్.టి.ఆర్. ఆనాడు లక్ష్మీబాయమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, సుబ్బమ్మ గారు, ఉన్నవ వారు, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ల వంటి మహిళా యోధులు సింహాల్లా పోరాడారు. అప్పుడు సైతం మౌనంగా తన కెరీర్, తన స్వార్ధం తను చూసుకున్న ఎన్.టి.ఆర్. ని మీడియా ’యుగపురుషుడు’ అంటుంది. ఎందుకో వారికే తెలియాలి. సినిమాల్లో నటించినంత మాత్రనా యుగపురుషుడు అయిపోతారా ఎవరైనా? అదే అయితే ఎస్.వి.రంగారావు కూడా బాగా నటించారు. ఎన్నో పాత్రలు, ఎన్నో భావాలు అవలీలగా పోషించారు. మరి ఆయన్ని అనలేదేం? ఎన్.టి.ఆర్. పాలనా కాలంలో ఎన్.టి.ఆర్. ప్రజలకి నిబద్దుడో, మరెవ్వరికి నిబద్దుడో అందరం చూసిందే. స్టెడ్స్ కంపెనీ వ్యవహారం లాంటివి కోకోల్లలు. ఇప్పటికీ అతడి అల్లుళ్ళు, కొడుకులూ, ఇతర కుటుంబసభ్యుల్ని పరిశీలిస్తూనే ఉన్నాం. అతడి అల్లుడు నారా చంద్రబాబు నాయుడి నిజాయితీ కుట్రదారుల పట్ల ఎంతటిదో, ప్రజల పట్ల ఎంతటిదో, కార్పోరేట్ కంపెనీల పట్ల, అంతర్జాతీయ బ్యాంకుల్లాంటి వ్యవస్థల పట్ల బానిసత్వం ఎంతటిదో చూశాం, చూస్తునే ఉన్నాం. కాకపోతే ఈవిషయంలో వై.ఎస్., అతడి బాస్[బాసిని] సోనియాగాంధీ చంద్రబాబుని ఓడించి ముందువరసలో ఉన్నారనుకొండి. ఇక ’ఒక్కమగాడు’ పాండురంగడు పేరుతో భక్తి సినిమాని సైతం శృంగారం సినిమా తీయడం, తొడలు కొట్టడం…. ఎన్.టి.ఆర్. పుత్రరత్నం గురించి చెప్పాల్సిందేముందు? ఈ మాస్ సంస్కృతిని తెచ్చినందుకు ఎన్.టి.ఆర్.ని యుగపురుషుడు అనాలా?

ఇప్పటికే ఎన్.టి.ఆర్. గురించి చెప్పినా మళ్ళీ ఎందుకు రిఫర్ చేసానంటే అప్పటిరోజుల్లో అంటే 1980 ల్లో ఇందిరాగాంధీ ఎన్.టి.ఆర్.ని చూసి, అతడి పాపులారిటీకి అసూయ చెందీ నాదెండ్ల, రామ్ లాల్ ల సాయంతో అతడి ప్రభుత్వాన్ని కూలదోసిందంటు మీడియా, రామోజీరావు తెగ బనాయించారని గుర్తు చేయడానికి. ఎన్.టి.ఆర్., ఇందిరాగాంధీలు స్వాతంత్రసమరంలో ఎలా ప్రతిస్పందించారో గుర్తుచేయాలని.

ఇక ఎన్.టి.ఆర్. Vs నాదెండ్ల అగస్టు16,1984 డ్రామా గురించి, ఇంతకు ముందే వ్రాసాను. ఇందిరాగాంధీ 1966 లో ప్రధానిగా పి.యం.వో. లోకి ప్రవేశించేనాటికే దేశం మీద కుట్ర జరుగుతుందన్న క్లియర్ మైండ్ తోనే ఉంది. కానీ ఎక్కడి నుండి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరు సూత్రధారులో తెలియదు. అదే ఎన్.టి.ఆర్. Vs నాదెండ్ల డ్రామాతో రామోజీరావు పై ఆవిడ దృష్టి పడింది. ‘తామింత కాలం వెదుకుతున్న ప్రధాన కుట్రదారు ఇతడేనా’ అన్న విషయం మీద దృష్టి కేంద్రీకరించింది. అందుచేతే 2½ నెలల్లో ఆవిడ హత్యకావింపబడింది. అక్టోబరు31,1984 న ఆవిడ తన నివాసంలో నెం.1, సప్థర్ జంగ్ రోడ్ లో నుండి బయటికి వస్తూ ఉండగా, సెక్యూరిటీ గార్డులు తుపాకి గుళ్ళకు బలయ్యింది. పైకారణం [Over leaf reason] గా ఖలిస్తాన్ ఉద్యమం, స్వర్ణ దేవాలయం పై ఆపరేషన్ బ్లూస్టార్ చెప్పబడింది. అదే నిజమైతే, పంజాబ్ ప్రజలు ఖలిస్తాన్ అంటూ ప్రత్యేక దేశం కోరిందే నిజమైతే 1992 లో రామోజీరావు ఉనికి అప్పటి కేంద్రప్రభుత్వానికి తెలిసిన తర్వాత ఎందుకు పంజాబ్ ప్రశాంతమైపోయింది? దీని గురించి పూర్తి వివరాలు ముందుముందు వ్రాస్తాను. వెంటనే కావాలంటే Coups on World లో చూడగలరు.

అక్టోబరు 31న, 1984 లో, బయటనున్న సెక్యూరిటీ గార్డులకి ఇందిరాగాంధీ ఆరోజు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదని ఎవరు చెప్పారు? ఇంటిదొంగకి తప్ప ఎవరికి ఆ అవకాశం ఉంది? ఎందుకంటే ప్రధాని మీద హత్య ప్రయత్నం చేసి, ప్రధానిని చంపకుండా పట్టుబడితే, ఆ హత్యాప్రయత్నం చేసిన సెక్యూరిటీ గార్డులు పట్టుబడతారు. ఆధారాలు బయటికి తేలే వరకూ ఆవిడ నిద్రపోదు. అందుకే ’attempt’ చేస్తే, ప్రధాని హత్య పూర్తయితీరాలి అన్న తరహాలో పనిచేసారు. బహుశః వారు ఈఅవకాశం కోసం కుట్రదారులు చాలా రోజులుగా ఎదురు చూస్తుండవచ్చు. ఇందిరాగాంధీకి తన అంతశ్చేతన [సమాచారమా?] చెప్పిందేమో అన్నట్లు ఆవిడ, "నా చివరి రక్తపు బొట్టు వరకూ దేశశ్రేయస్సు కోసమే ఖర్చు చేస్తానని” అన్నది, తన చివరి బహిరంగసభలో. అది భువనేశ్వర్ లో జరిగింది. ఆ ప్రాంతంలోని రాయి ఒకటి హస్తం ఆకృతిలో ఉందట. అది తెచ్చి ఆవిడ సమాధి శక్తిస్థలంలో ఉంచారు. అలాంటి నోట్ ఒకటి ఆవిడ టేబుల్ పై లభించిందట.

ఏది ఏమైనా అక్టోబరు 31న ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసికోలేదనే సమాచారం మాత్రం ఎవరో లోపలి నుండి బయటి సెక్యూరిటీ గార్డ్స్ కి చేరేశారు. ఎవరికి ఆ అవకాశం, అవసరం ఉన్నాయి? పని వారికంటే కూడా ఆ అవకాశం, అవసరం ఇంటిదొంగ సోనియా గాంధీ కే ఉన్నాయి. 1968 లో ఆ ఇంట అడుగు పెట్టిన ఈ విదేశీ కోడలు వరుసగా మరిది సంజయ్ గాంధీని, పిదప అత్త ఇందిరా గాంధీని, ఆ తర్వాత భర్త రాజీవ్ గాంధీల జీవితాలని మింగేసింది. ఈ ట్రాన్స్ ప్లాంటర్ వెనక గల గూఢచార కెరీర్ గురించి పూర్తి వివరణ తదుపరి టపాలలో ఇస్తాను.

అయితే 1966 నాటికి ఇంకా ఈ విదేశీ వనిత ఇంట అడుగు పెట్టలేదు. ప్రధానిగా ఇందిర ప్రభుత్వపగ్గాలు చేపట్టారు. కుట్ర గురించి స్పష్టమైన దృక్పధంతో ఆవిడ భారత్ లోపల కుట్రదారులకు మద్దతుదారులెవరో, అసలు కుట్రదారులెవరో అన్వేషణ ప్రారంభించింది.

అప్పటికి భారతదేశంలో మాజీరాజులు, మాజీ రాణులూ, మాజీ జమీందారులూ ప్రభుత్వం నుండి భరణాలు అందుకుంటున్నారు. వారిలో చాలామంది అప్పటికే రాజకీయ నాయకులుగా, పారిశ్రామిక వేత్తలుగా, బ్యాంకుల అధిపతులుగా, వ్యాపారవేత్తలుగా మంచి కెరీర్ తో ఉన్నారు. వారిలో అత్యధికులు కుట్రదారుల మద్దతుదారులే. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మాజీ రాజవంశీయుల్లో అత్యధికులు కుట్రదారుల నెట్ వర్కులోని కొన్ని స్థంభాలవంటి వారే. ఇంతకు ముందే వివరించినట్లు సింధియాలూ, విజయనగర గజపతి రాజులూ వంటి వారు చాలామందే కుట్రదారులకి సహాయ సహకారాలందిస్తున్నారు.

అందుకే సి.ఐ.ఏ., బ్రిటన్, ఐ.ఎస్.ఐ., అనువంశిక నకిలీ కణికుడూ, అంతర్జాతీయ మీడియా ఈ మాజీ రాజుల, రాణులకు సంబంధించిన పర్యాటకప్రాంతాల గురించి ప్రపంచవ్యాప్త ప్రచారం ఇస్తారు. రాజస్తాన్ లోని పింక్ సిటి జైపూర్, మైసూర్ వడయార్ ల దసరా ఉత్సవాల వంటివి దీనికి మంచి ఉదాహరణలు. రాజస్తాన్ లోనూ, మైసూర్ లోనూ, ఇంకా ఇలాంటి పర్యాటక ప్రదేశాలలోని మ్యూజియంలు చూడటానికి టికెట్ కొనుక్కొని లోనికి వెళుతూ మనం ఆయా మ్యూజియంలూ, ప్యాలెస్ లూ, భారత కేంద్ర లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని అనుకుంటాం. కానీ ఇది పాక్షిక సత్యం మాత్రమే. పర్యాటక కేంద్రాలలోని ఆకర్షక అంశాలు, ప్రాంతాలు మాజీ రాజుల, రాణుల ఆదాయ కేంద్రాలు. మనం టిక్కెట్లు కొనుక్కుని మరీ వారి ప్యాలెస్ లనీ, ఒకనాటి నగలనీ, వారి పూర్వీకుల దుస్తులనీ, అలంకరణ వస్తువుల్నీ, ఇతర విశేషాలనీ జైపూర్ లూ, మైసూర్ లు వెళ్ళి మరీ చూస్తున్నాం అన్నమాట. ఆ టిక్కెట్ల సొమ్ము ఆయా రాజులకీ, రాణులకీ చెందుతుంది. ఆ సొమ్ము పాఠశాలలు నడపడానికి, వైద్యశాలలు నడపడానికి ఖర్చుపెడుతున్నాం అంటారు. [అంతేకాదు జైపూర్ రాజులూ, రాణులకి వారి పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా చలువరాతి గనుల వ్యాపారాలూ ఉన్నాయి.] ఈ విషయమై ప్రభుత్వం కూడా స్వదేశీ పర్యాటకులకి గానీ, విదేశీ పర్యాటకులకి గానీ ఏ స్పష్టతా ఇవ్వదు. అంతేగాక ప్రభుత్వ పర్యాటక శాఖలు కూడా ఈ విషయమై మౌనం పాటిస్తూ పర్యాటక ఆకర్షణల గురించి ప్రచారం చేసుకుంటూ పర్యాటకాభివృద్ధి చేసుకుంటాయి. ఎందుకంటే – అది వ్యాపారం, దేశ ఆర్దిక పరిస్థితిలో ఓభాగం. విదేశీ మారక ద్రవ్యం రీత్యా, అక్కడి ప్రజల ఆర్ధిక, సామాజిక జీవనసరళి దాని మీద ఆధారపడినందువల్ల, భారత కేంద్రప్రభుత్వం ఈ విషయమై అప్రమత్తమయ్యేలోపునే ఈ నెట్ వర్కు వేళ్ళునుకున్నందువల్లా, ఇక ఈ మాజీరాజుల, రాణుల పర్యాటక వ్యాపారంపై ఏమీ చెయ్యలేని స్థితి కల్పించబడింది. అదీ కుట్రదారుల పధకరచనా కౌశలం! ఇదే శ్రీకృష్ణదేవరాయల వంశస్థుల విషయంలో ఇలా లేదే? వారి గురించి ప్రచారం కూడా మనకి తెలిసింది లేదు. వారి వంశస్థుడు మాజీ ఎం.పి.గా ఉన్నాకూడా ప్రచారం లేదు, ఆర్ధిక ప్రగతి కూడా లేదు. మరీ వారి పూర్వీకులకు కూడా నగలూ, దుస్తులు, అలంకరణ వస్తువులు ఉన్నాయి కదా! మరీ వాటి గురించి మీడియా ఎందుకు ప్రచారం ఇవ్వదు? ఎందుకంటే వారి చరిత్ర దేశభక్తి స్ఫూర్తినీ రగిలిస్తుంది కాబట్టి. మైసూర్, జైపూర్ రాజులకి అలాంటి చరిత్ర లేదు. మన మధురై,రామేశ్వరం, తంజావూర్, భువనేశ్వర్ మొదలైన ప్రదేశాలకు మీడియా ఏ మాత్రం ప్రచారం ఇస్తోందో అందరికీ తెలిసిందే.

మనం పర్యాటక కేంద్రాలకి వెళ్ళినప్పుడు, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాలకీ, మ్యూజియంలకీ గల ప్రవేశరుసుముకూ, మాజీరాజుల, రాణుల స్వంత పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాలకీ, మ్యూజియంలకీ గల ప్రవేశరుసుముకూ ఉన్న వ్యత్యాసం గమనించవచ్చు. ఉదాహరణకి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఆర్కియాలాజికల్ కానీండి, ఇతర మ్యూజియంలు కానివ్వండి వాటి ఎంట్రీ టికెట్ 2/- లేదా 5/- రూపాయలు మహా అయితే 10/- రూపాయలు ఉంటుంది. అదే మాజీ రాజుల, రాణుల అధ్వర్యంలోని ఆర్ట్ గ్యాలరీకో, మ్యూజియమో అయితే దాని ఎంట్రి టికెట్ ఒక్కొక్కొరికీ 50/- నుండి 100/- రూపాయల దాకా ఉంటుంది. పర్యాటకులని ఆకర్షించేందుకు సదరు మాజీరాజులు, రాణులు [నిర్వాహకులు అన్నమాట] ఏనుగుల పోటీల పండుగలూ, ఒంటెల పరుగు పందేలు, అలంకృత ఏనుగుల, ఒంటెల ప్రదర్శనలు, ఫలపుష్పప్రదర్శనలూ, పండుగ సంబరాలూ ఆయా బుతువులు బట్టీ నిర్ణీత కాల వ్యవధిలో నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో మీడియా వాటిని తెగ వర్ణించి, వర్ణభరిత ఫోటోలతో, మనసూరించే ఉపమానాలతో ఆర్టికల్స్ వ్రాసి ప్రపంచమంతట ప్రచారిస్తుంది. ఇందులో తప్పేమీ కనబడదు.

అయితే మీడియా ఆయా పర్యాటక కేంద్రాల్లోని ప్రదర్శనల్లో మాజీరాజుల, రాణుల ఆదాయవనరు ఎంతో ఎప్పుడూ చెప్పదు. అంతేగాక మీడియా ఇచ్చే కవరేజ్ ఎలా ఉంటుందంటే, ఆయా పర్యాటక కేంద్రాలు ప్రభుత్వాధీనంలో ఉన్నాయేమో అన్పించేటట్లు ఉంటుంది. ఇంత పర్యాటక ఆదాయం ఒనగూడింది అని వ్రాస్తుందే గానీ ఎవరికి ఒనగూడిందో ఎప్పుడూ వ్రాయదు. ఇప్పటికీ ఆయా కోటల్లో, అంతఃపురాల్లో, ఉద్యానవనాల్లో, కొన్ని మాజీరాజుల, రాణుల స్వంత ఆస్థులే అన్నది అక్కడికి విహార యాత్రకు వెళ్ళే పర్యాటకుల్లో ఎందరికి తెలుసు?

ఈ విధంగా మీడియా ప్రజల్ని, పర్యాటకుల్ని మాజీరాజుల, రాణుల పూర్వ వైభవాన్ని, భాగ్యసిరిని వారికి డబ్బు[ప్రవేశ రుసుము] చెల్లించి మరీ, చూసి వచ్చేలా డ్రైవ్ చేస్తోంది. ఈ విధంగా జైపూర్ లూ, మైసూర్ లూ వెళ్ళి చూసిరావడానికీ, బంజారా హిల్స్ లోనో, జూబ్లి హిల్స్ లోనో ఉన్న భాగ్యవంతుల కాలనీలు చూసి రావడానికి తేడా ఏమిటి?

ఒకవేళ ఏ ధనవంతుడైనా తన భవనం ఎంతో అందమైనదనీ, ఎన్నో కళాత్మక వస్తువులు ఉన్నాయనీ, కనుక పర్యాటకులు ఎంట్రీ టికెట్ కొనుక్కొని దాన్ని చూసిపోవచ్చుననీ నేరుగా ప్రకటిస్తే ఎంతమంది చూడటానికి వెళ్తారు? నిశ్చయంగా ఎవరూ వెళ్ళరు. వెళ్ళినా అతి కొద్దిమందే! [ఏం వెళ్ళి చూసొస్తే తప్పేమిటని వాదించే వాళ్ళు కొద్దిమందే కాబట్టి!] నిజానికి జైపూర్ లూ, మైసూర్ లూ దర్శించే పర్యాటకుల్లో అత్యధికులు ఆయా ప్రాంతాలు చరిత్రకు సంకేతాలుగా, ఙ్ఞాపకాలుగా తలచి సందర్శిస్తారు. అది కాదని తెలిస్తే చాలామంది టికెట్ కొనుక్కొని ఓ ధనవంతుని ఇంటిని చూసి రావడం నామోషీ గానూ, ఆత్మగౌరవానికి దెబ్బగానూ భావిస్తారు. నిశ్చయంగా చాలామంది “వారికి డబ్బుంటే ఉందిగాక, వారు భాగ్యవంతులైతే అవుగాక, వారికి అందమైన భవనాలు ఉంటే ఉండుగాక, కానీ డబ్బుపెట్టీ ఎంట్రీ టిక్కెట్టు కొనుక్కొని అబ్బురపడుతూ, చొంగ కార్చుకుంటూ వారి ఇళ్ళు చూడవలసిన అవసరం మనకేమిటి? మన ఇల్లు అంత ఖరీదైనది కాకపోవచ్చు, అందమైనది కాకపోవచ్చు. కానీ నా ఇల్లు నాకు నచ్చుతుంది. నా ఇల్లు, నాచోటు నాకిష్టం” అనుకుంటారు.

అందుకే మీడియా ఈ నిజాన్ని బయటకు పొక్కనివ్వదు. పైపెచ్చు ఆయా పర్యాటక కేంద్రాలలో, వాటిలోని అంశాలూ 100% ప్రభుత్వాధీనంలోనికే అన్నట్లు పిక్చర్ ఇస్తుంది. ఈ విధంగా, పరోక్షంగా మాజీరాజులకీ, రాణులకీ ఆదాయాన్ని సమకూర్చిపెడుతుంది. ఈ వ్యాపారంలో, ప్రజలకి ‘చరిత్ర’ మీద గల మమకారాన్ని మాజీరాజుల, రాణులకు అనుకూలంగా మీడియా ఉపయోగిస్తుంది. బి.సి.సి.ఐ. చేసే ప్రైవేట్ క్రికెట్ ని ‘టీం ఇండియా’ అంటూ ప్రజల దేశభక్తిని వాడుకున్నట్లుగా అన్నమాట. ఆయా క్రికెట్ వ్యాపారంలో ప్రజలకీ, ప్రభుత్వానికీ చెందేది ఒక్క పైసా ఉండదు. అయినా ప్రజలంతా ఇండియా గెలిచింది అనుకుంటారు. ఇక్కడ ప్రజల దేశభక్తి అనే ‘సెంటిమెంటు’ని వ్యాపారంగా బిసిసిఐ కి మీడియా మలుస్తోంది. అలాగే ప్రజలకి చరిత్ర మీద గల సెంటిమెంటుని మాజీ రాజులకీ, రాణులకీ వ్యాపారంగా మీడియా మలుస్తోంది.

ఇలా మీడియా కల్పిస్తోన్న వ్యాపారంలో ఆయా మాజీరాజులకీ, రాణులకీ ఒనగూడే ఆదాయంలో ఎంట్రి టికెట్ల సొమ్మేగాక, ఆర్ట్ గ్యాలరీలలో అమ్ముడయ్యే పూసల దండలూ, వస్త్రవిశేషాలూ గణనీయంగానే ఉంటాయి. అందునా విదేశీ పర్యాటకుల నుండి భారీగా లాభాలు వస్తాయి.

మాజీరాజులకీ, రాణులకీ మరింత పర్యాటక ఆకర్శణనీ, ఇమేజ్ ని సమకూర్చేటందుకు మీడియా వారి పట్టాభిషేక మహోత్సవాలకీ, పండుగల సందర్భాల్లో వారు నిర్వహించే దర్బారులకీ ప్రత్యేక కవరేజి ఇస్తుంది. జ్యోతిరాదిత్య సింధియా పట్టాభిహేకానికీ, వడయార్ ల దసరా పండుగ నాటి దర్బార్ లకీ, వారి సంప్రదాయ దుస్తుల, దృశ్యాలతో, వర్ణ చిత్రాలతో కూడిన ఆర్టికల్స్ తో ప్రచారం ఇస్తుంది. ఇవిగాక అంతర్జాతీయ మీడియా ఆయా రాజులకీ, రాణులకీ విశేషబిరుదులిచ్చి సత్కరిస్తుంది. దాన్ని స్వదేశీ మీడియా వీలయినన్ని సార్లు ప్రచారిస్తుంది. జైపూర్ రాణి గాయత్రి దేవికి తన 80 వ ఏట కూడా కాపాడుకోగలుగుతున్న సౌందర్యాన్ని శ్లాఘిస్తూ ఓ విదేశీ పత్రిక కితాబులిచ్చి, ర్యాంకింగ్ ఇచ్చింది. ప్రభావశీలమైన మహిళల్లో తొలి వందమందిలో ‘X’ ర్యాంకు, అత్యంత ప్రజాదరణగల మహిళ, లేదా ఆకర్షణీయమైన మహిళ గట్రాగట్రా అన్నమాట. నిజానికి ఇవన్నీ కుట్రదారులకి [సి.ఐ.ఏ., బ్రిటన్, ఐ.ఎస్.ఐ., అనువంశిక నకిలీకణికుడు] ఈ మాజీరాజులూ, రాణులూ అందిస్తున్న సహాయ సహకారానికి ఇవన్నీ రిటర్న్ గిప్ట్స్ అన్నమాట.

అయితే ఇవన్నీ కూడా చట్టబద్దమైనవి, రాజ్యాంగబద్దమైనవి.

ఈ మాజీ రాజులు, రాణుల, జమీందారుల్లో అత్యధికులు కుట్రదారులకు మద్దతుదారులే. రాజాభరణాలు రద్దు చేసినందుకు ఇందిరాగాంధీ ఎంత తీవ్రపరిణామాలని ఎదుర్కొందో - ముందు ముందు వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

4 comments:

సోనియా గాంధీ నాకు కూడా నచ్చదు. కానీ ఇందిరా గాంధీ హత్య లో పాత్ర ఉందంటే నమ్మను. సోనియా గాంధీ చేతిలో మోసపోయే అంతటి తెలివితక్కువరాలు కాదు ఇందిరా గాంధీ అని నా ప్రగాఢ నమ్మకం.

జీడిపప్పు గారు,

ఇందిరాగాంధీ తెలివైనదని నేనూ ఒప్పుకుంటాను. అయితే సోనియాగాంధీ నటనాకౌశలాన్ని మనమింకా బాగా పరిశీలించాల్సి ఉంది. ఇప్పటి వరకూ మనం తెరమీద లేదా స్టేజీ మీద నటించగల నటీనటులనే ఎక్కువగా చూశాం. జీవితంలో నటించగల వాళ్ళని చూడటం అరుదు. అందులోనూ అందుకే తర్భీదు పొందివచ్చిన ఏజంటుని గుర్తించడం మరింత కష్టం. అందుచేత నిశితపరిశీలన తప్పనిసరి. ఏ నెట్ వర్క్ సాయమూ లేకుండానే దేశాన్నేలే స్థితికి ఆమె ఎలా వచ్చిందంటారూ? ఆమెని విమర్శించాలంటే అర్జున్ సింగులాంటి సీనియర్లు వణికిపోతారు, విమర్శించినందుకు మార్గరెట్ ఆల్వాల్లాంటి సీనియర్లు ఇంటికి పోతారు. ఇందుకు ఏపార్టీ వాళ్ళూ అతీతులు కాదు.

ఇదే శ్రీకృష్ణదేవరాయల వంశస్థుల విషయంలో ఇలా లేదే? వారి గురించి ప్రచారం కూడా మనకి తెలిసింది లేదు. వారి వంశస్థుడు మాజీ ఎం.పి.గా ఉన్నాకూడా ప్రచారం లేదు?who is that Ex M.P May I know His name and details

Adi Lakshmi gaaru,

Excellent writeup. Keep up the good work.

When you wrote about Nehru, you should have mentioned the following points also to balance it out.

1. He cling to power until his death. This act of Nehru denied the rights of many true patrioits who sacrificed their leves for us. There was a example set in America 150 years before Nehru. Gerorge Washington, and others who followed him served as Presidents at most two terms. This allowed other founding fathers to serve the country as Presidents until 1825.

2. His socialist economic growth rate (derogatively called as "Hindu Rate of Growth" by Marxists to blame Hindus) of less than 3% for 50 years caused the death of millions of poor and illiterate people in India due to famines.

3. His shrot sightedness cost India dearly. When China and Pakisthan invaded India, there was no country that supported India. It means that there were no friends in the world. No body there to sell us arms, technology, and lend us money to kick start our economy. This is the fault of Nehru.

4. Nehru with the help of Marxists systematically taken over Hindu institutions. He nationalized Hindu Temples, Temple Lands, with his misguided vision he came up with Hindu personal laws, Muslim personal laws, etc. Hindus were denied the chance to form a nodal organization on the lines of minorities (Pope etc). His policy of divide Hindus on Caste lines and supporting missionaries costed us dearly.

4. Caste based reservations were instituted for 10 years. But he allowed them to continue for ever.

5. He systematically dismantlled Indian Army. He introduced religion based politics into Indian Army.

6. His ego ruined India. And he was a shortsighted person living in his own dream world. Where as a tiny Pakisthan alined with West challanging India, he made enemies all over the world.

7. Because of his shortsighted policies India was at the mercy of West to get food grains. Indian formers are the best in the world. But Nehru ruined them with his shotsighted policies.

8. He got the supreme mandate, with that he could have achieved wonders. And his grandson got supreme majority in 80s, but he also wasted it.

9. Nehru's appeasement of Minorities and Marxists was legendary.

10. His hatered against Hindus is well known.

11.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu