విశ్వమత మహాసభలో ప్రారంభమైన స్వామి వివేకానంద ప్రభంభనంతో అప్రమత్తమైన సి.ఐ.ఏ., దాని మిత్ర కార్పోరేట్ సంస్థలూ తమ దృష్టిని ఇండియా మీద, భారతీయ సంస్కృతి మీదా, హిందూ మతమ్మీదా, భారతీయుల ఆధ్యాత్మిక స్ఫూర్తి, ఆలోచనా సరళి ల మీదా కేంద్రీకరించాయి. నిజానికి బ్రిటీషు, రష్యా, చైనా లేదా ఏ ధనిక దేశమైనా కార్పోరేట్ కంపెనీలు సి.ఐ.ఏ. లాంటి సంస్థలకి అనుకూలంగా పనిచేస్తుంటాయి. ఒక దేశంలోని కార్పోరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు మరో దేశపు నిఘా సంస్థలకి తొత్తుగా పనిచేయటం కూడా ఎక్కువే. ఇక్కడ వాళ్ళ సిద్ధాంతం ఒక్కటే ‘డబ్బు సంపాదించటమే’.

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏపేరుతో పిలిచినా – ఈ ధనికుల్లో [అంటే ఒకప్పుడు బ్రిటన్ లో ల్యాండ్ లార్డ్స్ అని పిలవబడ్డారు, సర్ గట్రా బిరుదులతో గౌరవింపబడ్డారు, ఇప్పుడు రాజకీయ నాయకులుగా, కార్పోరేట్ కంపెనీల అధిపతులుగా వెలుగుతున్నారు, ఇలా గన్నమాట. ఏ పేరైనా ఎక్కడయినా వీరంతా ధనిక వర్గాలు కావటమే ఇక్కడ విషయం.] తమ ధనార్జన కోసం వీరిలో ఎక్కువమంది తమ స్వంత దేశానికి వ్యతిరేకంగా పనిచేయటానికి మొగ్గు చూపేవారే. ఇలాంటి సంఘటనల్నీ టోనీ బ్లెయిర్ బ్రిటన్ ప్రధాని, 2001 లో WTC పై తీవ్రవాదులు దాడి తదనంతరం పరిణామాల్లో ’పుల్లయ్య యవ్వారం’లా తిరిగినప్పుడు, ఓటుని నోట్లతో కొని విశ్వాస పరీక్షలో నెగ్గి అణు ఒప్పందం కోసం యూ.పి.ఏ. ప్రభుత్వం ఆఘామేఘాల మీద పరుగులు పెట్టినప్పుడూ చూశాం. [అణు ఒప్పందంతో లక్ష ఉద్యోగాలు వస్తాయంటూ జులై, 2008 లో ఊదర బెట్టారు. ఇప్పుడు వారానికి లక్షల్లో ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఊడిపోతున్నాయి. సేవారంగానికి, ఉత్పత్తి రంగం కంటే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే జరిగేది ఇదే.]

ఇలా ధనిక వర్గ ఏజంట్లతో ఓ నెట్ వర్క్ కలిగి ఉన్న సి.ఐ.ఏ. 1893 మత మహా సభ తర్వాత భారత దేశం మీద దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించింది. భారతీయ సంస్కృతి పై, హిందూ మతంపైన, భారతీయుల జీవన విధానం పైన కుట్ర ఎలా జరిగిందో వివరాలు Coups On World లో చూడగలరు. ఇక్కడ కేవలం రాజకీయరంగం పై కుట్రని మాత్రమే ఆంధ్రీకరిస్తున్నాను. ఇక్కడ – ఎందుకు, ఎప్పుడు సి.ఐ.ఏ. ఈ కుట్రలోకి భాగస్వామి అయ్యిందో [అప్పటికే నకిలీ కణికుడి అనువంశిక అనుశృత కుట్ర బాగానే వేళ్ళూనుకుంది.] వివరించాలని ప్రయత్నిస్తున్నాను.

ఇక్కడ ఓ విషయం ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది. పరిశీలించండి – ఇండియాని సి.ఐ.ఏ. 500 సంవత్సరాల గతం లోకి లాక్కుపోవాలని అంటే 1492 లోకి తీసుకుపోవాలని పధకం రచించింది. 1492 AD లో అంటే దాదాపు 516 ఏళ్ళ క్రితం క్రిస్టఫర్ కొలంబస్ ఇండియాకి సముద్రమార్గం కనుక్కోబోయి అమెరికాని కనుగొన్నాడు. తాను చేరిన దీవులని ఇండియా దీవులనుకొన్నాడు. తర్వాత వాటికి West Indies దీవులనీ, స్థానికుల్ని రెడ్ ఇండియన్లనీ పిలవటం జరిగింది. 1992 లో 500 సంవత్సరాల క్రితం కట్టబడిందిగా ప్రచారించిన అయోధ్యలోని బాబ్రీమసీదుని కూల్చడం ద్వారా ఇండియాని 500 ఏళ్ళ గతంలోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మసీదు కూల్చడం అన్న ప్రక్రియతో ఇండియాని మరోసారి ముక్కలు చెక్కలు చేయాలన్నది వాళ్ళ పధకం. ఓ సారి అఖండ భారతావని ౩ ముక్కలైంది 1947 లో. మరోప్రక్క 1920 లో రష్యన్ నాయకుడు లెనిన్ సారధ్యంలో ఏర్పడిన USSR ని 1990 లో విజయవంతంగా 17 ముక్కలు చేయగలిగారు. కనుక ఇండియాని విడగొట్టటం తమకో లెక్కా అనుకున్నారు. ఓసారి గతం గుర్తుతెచ్చుకుంటే Dec 6, 1992 లో బాబ్రీ మసీదు కూలగొట్టేటప్పుడు, ఆ ముందు రోజుల్లో, ప్రపంచ మీడియా ఎంత హడావుడీ చేసిందో, ప్రపంచవ్యాప్తంగా Live Telecaste కి ఎన్ని ఏర్పాట్లు చేసుకుందో, బి.బి.సి.తో సహా! [బి.బి.సి. అన్నపేరు విని అది బ్రిటిషు ప్రభుత్వసంస్థ అనుకున్నాను. కాదట. అచ్చం మన బి.సి.సి.ఐ. లాగా అన్నమాట.]

ఒక వేళ వాళ్ళ పధకమే గనుక ఫలించి, ఇండియా కుప్ప కూలిపోయి 24 లేక 25 పార్లమెంటులయ్యేలాగా ముక్కలైపోయి ఉంటే ‘500 ఏళ్ళు గతంలోకి నెట్టివేయబడ్డా ఇండియా’ అంటూ ప్రపంచమీడియా ఎంత ఎలుగెత్తి చాటి ఉండేదో! ఎటూ 500 ఏళ్ళ క్రితం ఇండియా అఖండ లేదా సమైక్య భారతావని కాదు గదా! ఎన్నో, చిన్న, పెద్దా రాజ్యాలు ఉన్నాయయ్యె!

భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్రలో బాబ్రీ మసీదు కూల్చివేత ఓ పెద్దతాజా అధ్యాయం. దాన్ని గురించి తరువాతి టపాల్లో ప్రచురిస్తాను. వెంటనే కావాలంటే Coups On World లో చూడగలరు. ఈ కుట్రలో సి.ఐ.ఏ.పాత్ర, ఐ.ఎస్.ఐ.పాత్ర, బి.జే.పి. పాత్ర, ఆర్.ఎస్.ఎస్. పాత్ర,, సోనియా గాంధీ పాత్ర, ఆ విషయంపై రాహుల్ గాంధీ అపరిపక్వత మొదలైన విషయాలు గురించి తార్కిక, దృష్టాంత సహిత, సాక్ష్యాధారాలని మీకు వివరంగా చూపించగలను. మరిన్ని వివరాలు పి.వి. నరసింహారావు గారి ’అయోధ్య’ అన్న గ్రంధంలో చదవవచ్చు.

ఇలా ఇండియాని తమ అమెరికా కనుగొనబడిన 500 సంవత్సరాల క్రితపు గత స్థితికి తీసుకువెళ్ళాలని సి.ఐ.ఏ. పన్నిన పధకం ఫలించక పోవడం నిజంగా భారతీయుల అదృష్టం, ఆనాటి నిఘా సంస్థల విజయం.

ఇకపోతే 1893 లో విశ్వమత మహాసభ జరిగింది. 1885 లో అఖిల భారత కాంగ్రెసు ఆవిర్భవించింది. ఈ సంస్థని ప్రారంభించింది అనీబిసెంటు అయినా ఆనాటి కాంగ్రెసు మాత్రం దేశభక్తులతోనూ, నిజాయితీ పరులతోనూ నిండి ఉండింది. 1905 లో అప్పటి బ్రిటిషు వైస్రాయి ’లార్డ్’[దేవుడా?] కర్జన్ బెంగాల్ రాష్ట్రవిభజన చేశాడు. బెంగాల్ రాష్ట్రవిభజనకు కారణాలు, దాని ప్రభావం, మన దేశ స్వాతంత్ర సమర చరిత్రలో ఆ సంఘటనకి ఉన్న ప్రాముఖ్యత మనం చరిత్రలో చదివాము. ఇది బంగ్లాదేశ చరిత్రకూ సంబంధించినది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒకప్పుడు అందులో భాగమే కదా! ఒక్కసారి భారత స్వాతంత్ర సమర చరిత్ర పరిశీలిస్తే ఈ కుట్ర గురించి స్పష్టతా, బెంగాల్ రాష్ట్ర విభజన చేయటంలో బ్రిటీషు అడ్మినిస్ట్రేషన్ లోని కుటిలతా మనకి బాగా అర్ధం అవుతాయి. ఈ నేపధ్యంలోనే 1906 ‘వందేమాతరం’ ఉద్యమం ఊపందుకుంది. నిజానికి ఈ గీతం బంకింగ్ చంద్ర ఛటర్జీ 1882 లో వ్రాసిన ’ఆనంద మఠం’ నవలలోనిది. ఆ గీతం, అందులో మాతృభూమిని తల్లిగా సంబోధించిన స్ఫూర్తి ప్రతీ భారతీయుణ్ణీ మేలు కొలిపింది. ఇప్పటికీ AR రెహ్మాన్ కూర్చిన ’వందే మాతరం’ అల్బమ్ చూస్తే మనం ఊగిపోతాం కదా! అంత బలం ఈ భావంలోనే ఉంది. ఇప్పటికీ కేరళలో కొన్ని పాఠశాలల్లో వందేమాతరం పాడరని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఈమధ్య వందేమాతరం గీతం పై వివాదాలు చూశాం.

అదే 1906 లో, ముస్లింలీగ్ పార్టీ ఆవిర్భవించింది. దాదాపు 1000 ఏళ్ళుగా భారతదేశంలో దాదాపుగా అన్ని మతాల సామాన్య ప్రజలూ అంటే హిందూ, ముస్లిం, బౌద్ధ, జైనులు కలిసిమేలిసే జీవిస్తున్నారు. ఆది శంకరాచార్యుల సమయంలో బౌద్ధులపై హింస జరిగిందన్నది హిందూమతాన్ని నీచ పరిచే ప్రక్రియలో భాగంగా చేసిన ప్రచారమే. ఇక మహయాన హీనయానాలుగా చీలిపోయిన బౌద్ధులూ, వైష్ణవ వీరశైవుల పరస్పర హింసలూ, ముస్లింలు వచ్చిన తొలినాళ్ళల్లోని అత్యాచార దోపిడిలూ, ముస్లిం రాజుల హయాముల్లోను తప్పితే, సామాన్య ప్రజల మధ్య సామరస్యం ఎక్కువుగానే ఉండేది. 1498 తర్వాత యూరోపియన్లతో పాటే క్రైస్తవం మన దేశంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా కొందరు ప్రజలు [ముస్లిం రాజుల హయాంలో లాగానే] పాలకులని మంచిచేసుకునేందుకు, వారి నుండి ప్రయోజనాలు పొందేందుకు మతం మారారు. అంతేగాక ఆయా మతాల్లో సమానత్వం ఉందన్న ప్రచారం కూడా ఇందుకు చాలా దోహదపడింది. ఇప్పుడు కదా మనకి తెలుస్తుంది ముస్లింలలో షియాలు, సున్నీలు, ఫస్తున్లు గట్రాగట్రా తెగలున్నాయనీ, వాళ్ళల్లో వారు కొట్టుకుంటున్నారనీ! ఇదే కథ క్రైస్తవ మతానిది కూడా! అయితే పోల్చిచూసినా కూడా, భారతీయ హిందువుల్లోని కులవర్గీకరణలు క్రైస్తవ మతంలో పోలిస్తే తక్కువకావటంతో హిందువుల్లో తక్కువవారిగా పరిగణింపబడే వర్గాల్లోంచి ఎక్కువుగా ప్రజలు క్రైస్తవంలోకి మారారు. [ఆర్ధికపరమైన ఆకర్షణలు కూడా]

అయినా గానీ విభిన్న భాషా సంస్కృతులతో, విభిన్న మతాలతో, విభిన్న కులాలతో ఉన్నాకూడా సామాన్య భారతీయులంతా ఏ ఇబ్బందీ లేకుండానే, అంతర్గత కలహాలు, దాడులూ లేకుండానే ప్రశాంతంగా వందల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే 1893 తర్వాత, ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పుడైతే స్వాతంత్రేచ్ఛ భారతీయుల్లో పొడసూపిందో అప్పుడు హఠాత్తుగా ప్రజల్లో వివిధ వర్గాల, మతాల వారి మధ్య అనుమానాలు, అపనమ్మకాలు ప్రవేశించాయి.[ఎలా ప్రవేశించాయి?] ఒకరి మీద ఒకరు విశ్వాసం కోల్పోయారు. పరస్పర దాడులు, దారుణ మారణ కాండలూ మొదలయ్యాయి.

1908 లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ’స్వాతంత్రం నా జన్మహక్కు’ అని గర్జించాడు. [’పుట్టు భోగులము మేము ఒరులు మాకియ్య వలెనా?’ అన్న అన్నమయ్య పదం గుర్తుకు రావడం లేదూ?] “స్వాతంత్రం మీరు మాకిచ్చేదేమిటి? అది మా జన్మహక్కు” అన్న తిలక్ మాట ప్రతి భారతీయుడి గుండెల్లో గుడి గంటలా ప్రతిధ్వనించింది. అందుకు ఆయన్ని బ్రిటీషు ప్రభుత్వం చెరసాలలో పెట్టింది. [ఇలాంటి ఈ బ్రిటీషు వారు స్వేచ్ఛ గురించి ఎన్నో నిర్వచనాలు, ఉపన్యాసాలు ఇవ్వడం అసలైన కామెడీ. దీన్ని గురించిన మరిన్ని వివరాలు తర్వాత చర్చిస్తాను.] 1910 – 11 లో బెంగాలు విభజన బ్రిటీషు ప్రభుత్వం రద్దుచేసింది. 1915 లో గాంధీజీ దక్షణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ముక్తి సాధనకి మార్గంగానే తను రాజకీయాల్లోకి వచ్చాననీ, తన జీవితమే తన సందేశమనీ చెప్పగలిగిన బక్కచిక్కిన ఆ మేరునగధీరుడూ భారత స్వాతంత్ర సమరానికి ఓ ఒరవడి తెచ్చాడు.

భారత స్వాతంత్ర సమరం మొదలైన నాటి నుండి, దేశ విభజనానంతరం [తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ నేటి పాక్, మరియు భారత్ గా మూడు ముక్కలుగా విడిపోయింది.] భారత స్వాతంత్రం 1947 లో సిద్ధించే వరకూ, బ్రిటీషు. ప్రభుత్వం భారతీయుల మీద, భారతీయ ఉద్యమ నాయకుల మీద ఎన్ని స్ట్రాటజీలు, ఎన్ని కుయుక్తులూ పన్నిందో చెప్పాలంటే అవి ఒక మహా ఉద్గ్రంధం అవుతుంది. ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఎన్నో విభేదాలని ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేశారు. దానితో స్వాతంత్ర సమరయోధుల్లో ఎన్నో బేధాభిప్రాయలు! వర్గాలుగా చీలిపోయారు. అతివాదులూ, మితవాదులని, హిందూ నాయకులూ, ముస్లిం నాయకులనీ, అగ్రవర్ణనాయకులూ, అణగారిన వర్గనాయకులనీ – ఇలా ఎన్నో వర్గాలు. దేశభక్తిలోనూ, మాతృదేశ దాస్యశృంఖలాలను ఛేదించాలన్న భావోద్వేగాలలోనూ నాయకులలో ఉన్న భావప్రకటనా పద్దతుల్ని ఆధారంగా చేసుకొని, [భావాన్ని ప్రకటించే విధానం అతిగా ఉన్న, మితంగా ఉన్నా భావమైతే ఒకటే అయినా గానీ,] బ్రిటీషు ప్రభుత్వం, వారి వైస్రాయిలు ఇతర ఉన్నతోద్యోగులు స్వాతంత్రసమర నాయకులని అతివాదులని, మితవాదులనీ విభజించి, స్టాంపు వేసి ప్రచారించారు. అప్పటి బ్రిటీషు మీడియా, సి.ఐ.ఏ., నకిలీ కణికుడి అనువంశీకులూ ఎటూ నిగూఢచోదక శక్తులై ఉన్నారయ్యె.

నిజానికి అలా అతివాదులుగా ముద్రపడ్డ వారిలో తిలక్ వంటివారికీ, మితవాదులుగా ముద్రపడ్డ వారిలో బాపూజీ వంటి వారికీ కూడా మార్గదర్శి భగవద్గీతే. లోకమాన్య తిలక్ గీతాచరణలోని తన అనుభవసారాన్ని ’గీతా రహస్యం’ పేరిట గ్రంధస్థం చేస్తే, బాపూజీ సత్యశోధన పేరిట గ్రంధస్థం చేశారు. అలా చూస్తే అసలు అతివాదానికి మితవాదానికి తేడా ఏమిటి? ఇంతేకాక ఈ కుట్రదారులు [సి.ఐ.ఏ., బ్రిటిషు రాజరిక ప్రభుత్వం, అనువంశిక నకిలీ కణికుడు ఇంకా వారి మద్దతుదారులు] వీలయినన్ని విభేదాలూ, వివాదాలూ, అపోహలూ, అభిప్రాయభేదాలు నాయకుల మధ్య కులమత ప్రాతిపదికన సృష్టించగలిగారు. ఇక దీనికి పరాకాష్ట ఏమిటంటే బి.ఆర్. అంబేద్కరు దళితులకీ, బాపూజీ వైశ్యులకీ, జ్యోతిరావుపూలే బి.సి.లకీ వారి మరణానంతరం, వారి ప్రమేయం లేకుండానే, ఎన్నో దశాబ్ధాల తర్వాత కుల నాయకులుగా అవతరించారు. [రాజ్యాంగ నిర్మాణం, ఆచరణలో లోసుగులు గురించి తర్వాత చర్చిస్తాను.] కులాల ఆధారంగా అమలుచేయబడిన కుట్రని Coups On World లోని Coup On Caste…… లో వివరించాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

ఈ కుట్రదారులు నాయకులలో విభేదాలు మత ప్రాతిపాదికన మరింత బాగా ఎగదోయగలిగారు. స్వాతంత్రసమరానికి కనీసం 1000 ఏళ్ళ క్రితమే ముస్లింలు భారతదేశం మీదకి దండెత్తి వచ్చారు, దేశంలోని కొన్ని ప్రాంతాలని ఏలారు. ఎందరో హిందూ రాజులు – అశోకుడు, చంద్రగుప్తుడు, పాండ్యులు, చోళులూ, సాళువలు, తుళువ వంశీయులూ ఇలా ఎందరో హిందూరాజులు ఈ దేశాన్ని నీతి నిజాయితీ, ధర్మచింతన లాంటి మానవీయ విలువలతో పరిపాలించారు. బానిస వంశం, మొగల్, తుగ్లక్, లోడి గట్రా ఎన్నో ముస్లిం వంశాలూ పరిపాలించాయి. కానీ ఎప్పుడూ కూడా భారతదేశంలో అధిక సంఖ్యాకులైన హిందువులు ఏవిధమైన రక్తపాత విప్లవాలూ లేవదీయలేదు. ఫాన్స్ లో లాగా ’గిలిటన్’ యంత్రాలతో ధనిక భూస్వామ్య రాజవంశస్థులను నరికిపోగులు పెట్టలేదు. ఎందుకంటే హిందువుల దృక్పధం ఎక్కువుగా పదార్ధవాదం కంటే అధ్యాత్మికత వైపు, భావవాదం వైపు, తాత్త్విక చింతన వైపు ఉండేది. [దీన్ని నిష్ర్కయా పరత్వం అని ఎవరైనా వాదిస్తే అది వారి ఇష్టానికి వదిలేస్తాను.] [దీని గురించిన చర్చ Coup On Indian Epics లోను, గీత గురించిన వ్యాసం లోనూ చేసాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.]

ఇలాంటి నేపధ్యంలోనూ – ఎప్పుడైతే భారతీయులు స్వాతంత్రం కావాలన్న నినాదం చేసారో, ఆ తర్వాత హిందూ ముస్లింలుగా విడిపోయి రక్తం ఏరులైపారే దాకా కొట్టుకున్నారు. ఇదీ తెర వెనక కుట్ర పనిచేసిన తీరు. ముందు ముందు ఈ కుట్రతీరు గురించి వివరంగా చెబుతాను.

జయప్రదంగా కుట్రదారులు [అంటే బ్రిటిషు, సి.ఐ.ఏ., అనువంశిక నకిలీకణికుడు] వారి మద్దతుదారులు [వైస్రాయిలు, బ్రిటిషు ఉన్నతోద్యోగులూ గట్రా] ముస్లిం నాయకుల్లో “మేం ఇండియాలో కలిసి ఉంటే హిందువులు మమ్మల్ని Dominate చేస్తారు. ముస్లింలు ఇండియాలో 2వ తరగతి పౌరులౌతారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం అనివార్యమైతే, ముస్లింలకీ ప్రత్యేక దేశం ’పాకిస్తాన్’ ఇవ్వాల్సిందే” అని వాదన చేసేలా ప్రేరేపించారు, ప్రోత్సహించారు. [ఇక్కడ ఒక్క విషయం, పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుండి భారత్ నుండి వెళ్ళిన ముస్లింల పరిస్థితి ఏమిటంటే, భారత్ వలస ముస్లింలు రెండవ తరగతి పౌరులు. వాళ్ళలో ఒక్క ముషారప్ మాత్రమే ఉన్నతస్థాయికి వచ్చింది. మిలిటరీలో గానీ, ప్రభుత్వంలో గానీ, మిగతా రంగాలలో గానీ ఇండియా నుండి వలస వెళ్ళిన ముస్లింలకు ఉన్నతస్థానాలలో చోటు దక్కదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇక అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి ఊహించండి.] అలాంటి ముస్లిం నాయకులలో మహమ్మదాలీ జిన్నా జయప్రదంగా ఈ వాదనని తెరమీదకు తెచ్చి, చివరికి భారతదేశాన్ని ముక్కల కొట్టడానికి దోహదపడ్డాడు. అప్పట్లో అధిక ప్రచారం పొందిన వార్తల ప్రకారం అతడు గాంధీజీని ‘మిస్టర్. గాంధీ’ అని సంబోధించడాని. అప్పటికే రవీంద్రనాధ్ ఠాగూర్ పిలవడంతో గాంధీజీని ‘మహాత్మా’ అని అందరూ పిలుస్తుండే వాళ్ళు. అంతమాత్రం చేత మహమ్మదాలీ జిన్నా బాపూని అవమానించాడని అనటం లేదు. అది అతడి ఇచ్ఛ. అయితే బాపూజీ తనను మహాత్ముడనమని కోరనూ లేదు, అభిలషించనూ లేదు. అంతే కాదు, బాపూజీని ఒక్క హిందువులకే నాయకుడిగా పరిగణించడం కూడా అల్పబుద్ధిగా భావిస్తాను. ఆయన ఎవరైతే ’సత్యం’ పట్ల నిబద్దత, ఎవరికైతే విలువల పట్ల నమ్మకముందో అలాంటి మనుష్యులందరికీ నాయకుడాయన.

ఇక జిన్నా, పాకిస్తాన్ గా ముస్లిం దేశాన్ని భారతదేశం నుండి విడగొట్టాలని కోరడంలో అంతర్గత కారణాలు ఎన్నో ఉండొచ్చు. భారత్ లాంటి దేశంలో అతడెన్నటికీ దేశాధ్యక్షుడు లేక ప్రధానమంత్రి కాలేడు. అదే పాకిస్తాన్ కైతే కాగలడు. ఇలాంటి ఆకాంక్షతో అతడు కుట్రదారులైన బ్రిటిషు, సి.ఐ.ఏ. గట్రా కుట్రదారుల చేతిలో కీలుబొమ్మ అయ్యాడని అంటారు. జిన్నా తన చివర రోజుల్లో పాకిస్తాన్ ని చీల్చుకువచ్చి తను తప్పుచేసానని అంటూ ఉండేవాడని వార్తలు కూడా వచ్చాయి.

ఇక్కడ మీకు ఓ నమ్మలేని నిజం చెప్పాలి. మతప్రాతిపదికన దేశాన్ని చీల్చిన జిన్నా, ముస్లింలను పాకిస్తాన్ లో స్థిరపడవల్సిందిగా, వారికై ఓ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేసిన జిన్నా! అతని మనవడు నుస్లీవాడియా మాత్రం ’బాంబేడయింగ్’ పేరుతో బట్టల వ్యాపారం చేసుకుంటూ ఎంచక్క ఇండియాలోని బాంబేలోనే ఉండిపోయాడు తెలుసా! ప్రతి ఆరునెలలకు వీసా పొడిగించుకుంటూ ఇండియాలోనే ఉన్నాడు. ఇటీవల ఐ.పి.ఎల్. క్రికెట్ పోటీల నేపధ్యంలో నటి, వ్యాపారిణి అయిన ప్రీతీ జింతా ఈతడి కుమారుణ్ణి వివాహమాడబోతుందన్న వార్తలు మీడియాలో వెలువడ్డాయి. సామాన్య ముస్లింలకు పాకిస్తాన్ సరైన చోటు అంటూ దేశవిభజనకు పట్టుబట్టిన జిన్నా సంతానం, వారసులు మరి ఇండియాలో ఎందుకు ఉండిపోయినట్లు, ఎంచక్కా వ్యాపారాలు ఎందుకు చేసుకుంటున్నట్లు? ఇంకా ఇండియాలోని మీడియా అయాచితంగా బాంబేడైయింగ్ కి ప్రచారం చేసిపెడుతుంది. ఎలా గంటే ’వర్షంలో బురద నీళ్ళు చింది పడిన చీర బాంబేడైయింగు ప్రింటులా’ అయ్యిందనీ, అందమైన అమ్మాయి చక్కని దుస్తుల్లో ఉంటే బాంబేడైయింగ్ ప్రింటులా ఉందనీ, బాంబేడైయింగ్ బెడ్ షీట్ లా వర్ణభరితంగా ఉందనీ – గట్రా గట్రా విశేషణాలని కథలూ సినిమాల ద్వారా జనంలోకి ప్రవేశ పెట్టడం ద్వారా అన్నమాట. ఇంతగా ’బాంబేడైయింగ్’ ని ప్రచారించిన మీడియాకి తెలియదా కొట్లాడి దేశాన్ని చీల్చుకు పోయిన పాక్ జాతిపిత జిన్నా మనుమడే ఈ ’బాంబేడైయింగ్’ అధినేత అనీ? ఎందుకో తెలియదు గాని 1992 తరువాత నుండి క్రమంగా బాంబేడైయింగ్ నష్టాల పాలవుతూ ప్రస్తుతం రేసులో వెనకబడింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

3 comments:

ఇంకో కొత్త విషయం నెస్ వాడియా గురించి చెప్పినందుకు.
ధన్యవాదాలు

జిన్నా గురించి మీరు చెప్పింది బాగుంది.
అసలు బాంబే డైయింగ్ వాళ్ళదే అని నాకింతవరకూ తెలియదు.
ఇక భగవద్గీత విషయానికొస్తే దాన్ని ప్రజలనుండి రూపు మాపలేమని తెలిసే దాన్ని ముసలివాళ్ళ పుస్తకంగా అభివర్ణించడం శోచనీయం(profile of www.mssbp.blogspot.com). తద్వారా చదవాల్సిన వయసులో యువత దాన్ని చదవకపోవడం వల్ల వాళ్ళకీ తెలియదు, భవిష్యత్తరాల వాళ్ళకీ తెలియకుండా పోతుంది. ఇదీ వాళ్ళ ప్లాన్.

In 1947, abut 24% of Pakistani polulation was Hundu. In 2009 it is about 1%. What happened to those millions of Hindus in Pakistan.

As long as ordinary Hindus are illiterate and ignorant foreigners rule India with out any problems.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu