1980 లో పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉద్యమం పేరిట వేర్పాటువాదం [ఖలిస్తాన్ ఉగ్రవాదుల భాషలో స్వాతంత్రోద్యమం] ప్రారంభమయ్యింది. ఔరంగజేబు హయంలో సిక్కు మతగురువు గురుగోవింద్ సింగ్ ని అతి కౄరంగా బాధించినందుకు భారతదేశపు గడ్డ పైనుండి ఒక్క ముస్లిం కూడా లేకుండా పోయేంత వరకూ గడ్డం, మీసం కత్తిరించమని ప్రతిన బూనారట సిక్కులు, కొన్ని శతాబ్ధాల క్రితం. అలాంటి సిక్కుల్లో నుండి కొందరు, ముస్లిం దేశమైన పాకిస్తాన్ తోనూ, కుట్రదారులతోనూ కుమ్మక్కయి ఖలిస్తాన్ పేరిట[పాకిస్తాన్ లాగా] స్వతంత్రదేశం కావాలని తీవ్రవాదం మొదలుపెట్టారు. 1971 లో భారత ప్రభుత్వం తూర్పు పశ్చిమపాకిస్తాన్ ల అంతర్గత వ్యవహారంలో తలదూర్చి బంగ్లాదేశ్ గా తూర్పుపాకిస్తాన్ ఆవిర్భవించేటట్లు చేసినందుకు ఇది ప్రతీకారమన్న మాట. నిజానికి పాకిస్తాన్ ల అంతర్గత వ్యవహారంలో భారత్ తలదూర్చేటట్లుగా డ్రైవ్ చేశారని గత టపాల్లో వివరించాను. కాకపోతే అలా భారత్ తలదూర్చితే తగవు అంటే యుద్ధం ఏర్పడుతుంది. తమ ఆయుధ బలం మీద అప్పటికి నమ్మకం ఉంది కాబట్టి యుద్ధం రావాలనుకున్నారు, భంగపడ్డారు. దాంతో బంగ్లాదేశ్ అవతరించింది. ఈ ఓటమితో కుట్రదారుల క్రోధం, కుటిలత పెరిగాయి. ప్రతీకారంగా భారత్ నుండి పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టాలని పన్నాగం పన్నారు. 1947 కు ముందు అఖండ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం దేశవిభజన సమయంలో రెండు భాగాలయ్యింది. ఇప్పటికీ పాకిస్తాన్ లో మరో పంజాబ్ రాష్ట్రం ఉంది. పాకిస్తాన్ లో బాగా పంటలు పండే ప్రాంతాల్లో అదీ ఒకటి.

మన దేశంలోని పంజాబ్, పంచనదులు ప్రవహించే సారవంతమైన భూమిగల రాష్ట్రంలోని సిక్కులు బలిష్టులు, శ్రమ జీవులు. అన్నింటి కంటే దేశభక్తులు. బాసుమతి బియ్యం, గోధుమలు బాగా పండే ఈ రాష్ట్రం మీద బ్రిటిషు జమానా రోజుల్లోనే ఎన్నో స్ట్రాటజీలు ప్రయోగించారు. స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో కొంతభాగాన్ని పాక్ కి అప్పచెప్పారు. హరప్పా మొహంజదారోల్లాంటి సింధు నాగరికత చిహ్నాలు కూడా పాకిస్తాన్ కే అప్పగించబడ్డాయి. గొప్పకి మాత్రమే మనం అవి మన పూర్వ [హిందూ] సింధూ నాగరికతలని చెప్పుకోగలం. విదేశీ పర్యాటకానికైనా, స్వదేశీ పర్యాటకానికైనా అవి పాకిస్తాన్ లో ఉన్నాయి. కాకపోతే పశుపతినీ, మాతృదేవతనీ [అంటే పార్వతీ పరమేశ్వరులని] కొలిచే సింధూ నాగరికత పురాతత్త్వ చిహ్నాలు ఇప్పుడు భారతదేశంలో మరికొన్ని చోట్ల లభించడం, పురాతన నాగరికత చిహ్నాలు ఇటీవల దక్షిణ భారతదేశంలోనూ లభించటం భారతీయ సంస్కృతి యొక్క ప్రాచీనతని ధృవీకరిస్తున్నాయి.

ఇక్కడ స్ట్రాటజీకి సంబంధించి ఒక విషయం చెప్పాలి. స్వాతంత్ర సమరం నాడు బాగా పేరుగాంచిన దేశభక్తులు, భావవాదులు, జనాన్ని చైతన్య పరచగలిగిన గొప్పవారు ఎక్కువుగా పుట్టిన గడ్డ బెంగాల్, పంజాబ్. ఆ రెండు రాష్ట్రాలని రెండు ముక్కలుగా చేసి బ్రిటిష్ వాళ్ళు పాక్ కి కట్టబెట్టారు. అలాగే భారతీయ సంస్కృతికి మూల కారణమైన హరప్పా మొహంజదారో లాంటివి కూడా పాక్ కే కట్టబెట్టారు. ఈ రోజు సర్ధార్ధజీలకి బుర్రలేదన్న జోకులతో వాళ్ళ మీద తేలికభావం కలిగేటట్లు ప్రచారిస్తున్నారు. ఇక్కడ తెలియటం లేదా కుట్ర స్వరూపం?

ఇక పంజాబ్ లో 1980 లో ప్రారంభమైన ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకొని, కొన్ని తీవ్రవాద సంస్థలూ, నాయకులూ పుట్టుకొచ్చారు. హింస పెచ్చరిల్ల సాగింది. 1984 ల నాటికి హింస తీవ్రస్థాయికి చేరింది. దాదాపు ప్రతీరోజూ మీడియాలో క్రికెట్ స్కోరులాగా టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పంజాబ్ గ్రామీణుల సంఖ్య ప్రచురింపబడేది. ఈ విషయంలో ‘ఈనాడు’ మరింత ముందడుగు వేసి ఆసక్తికరమైన కథనాలు కూడా ప్రచురించింది. జాతీయస్థాయిలో చాలా పత్రికలు ఇదే పంధా ప్రదర్శించేవి. ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలంటూ ఉద్యమిస్తున్న ఈ సరిహద్దు రాష్ట్ర టెర్రరిస్టులు స్వంత రాష్ట్ర ప్రజల ప్రాణాలెందుకు తీసేవారో ఏ మీడియా అడగలేదు. ఆ నెపాన చోటు ఖాళీ చేయించడం, ఆపైన ఆక్రమణ సాగించడం టెర్రరిస్టులని నడిపే కుట్రదారులకి అలవాటైన స్ట్రాటజీ. [తాలిబాన్లు ఆక్రమిత కాశ్మీర్ లో చేసింది అదే, ఇప్పుడు పాక్ లో చేస్తున్నది అదే.] టెర్రరిస్టులు పంజాబ్ లోని సిక్కులకి పరమ పవిత్రమైన స్వర్ణ దేవాలయాన్ని ఆలవాలంగా మార్చుకున్నారు. మనం ‘ఖడ్గం’ సినిమాలో చూసినట్లు [ప్రకాష్ రాజ్ తమ్ముడు, ముస్లిం తీవ్రవాది, పోలీసులు వెంటబడితే మసీదులోకి దూరిపోతాడు.] నానా హింసా చేసి స్వర్ణ దేవాలయంలోకి అంటే గురుద్వారాల్లోకి దూరి పోయేవాళ్ళు. పోలీసులో, సాయుధ బలగాలో ఆలయాల్లోకి ప్రవేశించడం మతంరీత్యా సెంటిమెంట్ కదా? ఈ ’బలహీనత’ని టెర్రరిస్టులు తమ ’బలం’గా వాడుకునేవారు. మరి టెర్రరిస్టుల దగ్గర ఆయుధాలున్నాయి కదా, అలాంటిది టెర్రరిస్టులు ఆలయాల్లోకి ఎలా ప్రవేశించి తిష్ఠ వేస్తున్నట్లు? ఈ విషయమై మీడియా ప్రజల్ని ఏమాత్రం చైతన్య పరిచే ప్రయత్నం చేయలేదు. అదే, ప్రభుత్వం ఏమైనా చర్య చేపట్టబోతే మాత్రం మనోభావాలు అంటూ గోల పెట్టేవి. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ 1984, జూన్ 6 న ఆపరేషన్ బ్లూస్టార్ కి ఆదేశించింది. సైన్యానికి, టెర్రరిస్టులకి జరిగిన హోరాహోరీ పోరు తర్వాత సైనికులు స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించిగలిగారు. ఆ సందర్భంలో ఆలయం లోపల, టెర్రరిస్టులు బస చేసిన చోట్ల మద్యపు బాటిళ్ళు, స్త్రీల లోదుస్తులూ దొరికాయన్న వార్తలు ఫోటోలతో సహా వచ్చాయి. సైనికులు స్థానిక ప్రజల మీద హింసాకాండ జరపారనీ, స్త్రీలపై అత్యాచారాలు చేసారనీ కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత సిక్కు మత పెద్దల ఆధ్వర్యంలో స్వర్ణ దేవాలయ ప్రాంగణాన్ని పాలతో కడిగి శుద్ది చేసుకున్న వార్తా కథనాల వెల్లువలో పైన పేర్కొన్న రెండు వార్తలూ మరుగున పడిపోయాయి.

దాదాపు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో [ఆగస్టు 16 న] ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని, నాదెండ్ల భాస్కర్ రావు, రామ్ లాల్ కలిపి కూలదోసిన సంఘటన జరిగింది. దేశవ్యాప్త ప్రతీపక్ష మహా నాయకులు అన్న ప్రతిఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎన్.టి.ఆర్. కు మద్దతుగా ప్రచారం చేసారు. దీన్ని గురించి ఇంతకు ముందు టపాల్లో వివరంగా చర్చించాను.

ఈ నేపధ్యంలో ఈనాడు రామోజీరావు పాత్ర ఇందిరాగాంధీకి రామోజీ రావు మీద దృష్టిపడేలా చేసింది. తానింత వరకూ, ఏ కుట్రకు వ్యతిరేకంగా, ఒంటరిగా, దాదాపు ఆత్మరక్షణ, దేశరక్షణ స్థితిలో పోరాడుతోందో, ఏ కుట్రదారుల చిరునామా తెలియక దెబ్బకాచుకుంటూ పోరాటం సాగిస్తోందో, ఆకుట్రలకు ప్రధాన స్థావరం ’ఇతడేనా?’ అన్న అన్వేషణ వైపు ఆవిడ ప్రయాణించింది. ఇది ‘స్థానిక భాషా పత్రిక’లో ఎన్.టి.ఆర్. విషయమై కనబడిన abnormality మీద నిఘా పెట్టేందుకు దారితీసింది.

సెప్టెంబరులో ఇందిరాగాంధీ, నాటి గవర్నర్ రామ్ లాల్ ని వెనక్కి పిలిపించింది. శంకర్ దయాళ్ శర్మని గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ పంపింది. [1992 ఆగస్ట్ లో శంకర్ దయాళ్ శర్మ భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు.] ఆయన రావడంతోనే ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని పునఃప్రతిష్టించాడు. అప్పటి తెలుగు మీడియా, ముఖ్యంగా ఈనాడు ‘ఇందిరాగాంధీ ప్రోద్భలంతోనే రామ్ లాల్ ప్రజాస్వామ్యాయుతంగా ఎన్నికైన ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూలదోసాడని’ గోల పెట్టింది. సత్యమేమిటో 1992 తర్వాత బి.జె.పి.లో చేరిన రామ్ లాల్ కీ, భగవంతుడికీ తెలియాలి.

ఏమైనా ఈ రాజకీయ డ్రామా, ఇందిరాగాంధీ నడుపుతున్న కేంద్రప్రభుత్వ దృష్టి రామోజీరావుని కుట్రకు ప్రధాన సూత్రధారిగా అనుమానించేందుకు దారితీసింది. వెంటనే, ఒక్కనెల రోజుల వ్యవధిలోనే, అక్టోబర్ 31 న ఇందిరాగాంధీ హత్య చేయబడింది. తనని హత్య చేస్తారని ఆవిడకి ముందే తెలుసు. తన చివరి మీటింగ్ లో కూడా ఆవిడ శత్రువులకి అదే సందేశం పంపింది. తన చివరి రక్తపు బొట్టు కూడా దేశం కోసం ధారపోస్తానని చెప్పింది. ఆవిడ తన నివాస గృహంలోనే నెం.1 సప్థర్ జంగ్ రోడ్డులోని ఇంటినుండి బయటికి వస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డులు ఆవిడని కాల్చి చంపారు. ఆరోజే ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలియదు. అలాగే ఆవిషయం బయటనున్న సెక్యూరిటీ గార్డుల కెలా తెలిసిందన్న విషయమూ తెలియదు.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉంటే గుండెకు గురిపెట్టె తుపాకీ తూటా పేల్చినా మరణం సంభవించదు. గాయాల పాలౌతారు అంతే. ఆ విధంగా హత్యా ప్రయత్నం విఫలమైందంటే సెక్యూరిటిగార్డులు పట్టుబడతారు. వారి నుండి నిజం రాబట్టే వరకూ ఇందిరాగాంధీ ఊరుకోదు. కాబట్టే definite probability తో హత్యా ప్రయత్నం చేసారు. అంటే ప్రయత్నిస్తే తప్పని సరిగా పని పూర్తయి తీరాలన్న మాట. అందుకోసం బహుశః కొన్ని రోజులుగా ఎదురు చూసి ఉంటారు.

అలాంటప్పుడు ఎవరు, ఇందిరాగాంధీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నదా లేదా అన్న విషయం బయటికి చేర వేసినట్లు? ఇంటి దొంగ ‘సోనియా గాంధీ’కి కాక ఎవరికి ఆ అవకాశం ఉన్నట్లు? అందుకేనేమో ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు మన పెద్దలు.

సెక్యూరిటి గార్డులు సిక్కులు కావటాన, ఆపరేషన్ బ్లూస్టార్ విషయమై వారి మనోభావాలు దెబ్బతిన్నందున, ఆ యిద్దరు గార్డులు తమంత తాముగా ప్రధానిఇందిరని హత్య చేసారని ‘హత్యకారణం’ వెలుగులోకి వచ్చింది. ఈ కారణాన కేవలం ఇద్దరు గార్డులు తమంతతాముగా, ఎవరి అండదండలూ లేకుండా ఒక ప్రధానిని హత్య చేసే సాహసం చేసారట. అటువంటప్పుడు ఆ గార్డులకి ఇందిరాగాంధి పట్ల ద్వేషం ఉందన్న విషయం వారి తోటి గార్డులకీ, ఇతర కోలిగ్స్ కి తెలియదా? ఎక్కడా ఆ గార్డుల ప్రవర్తనలో అది బయటపడదా? అపరేషన్ బ్లూస్టార్ తరువాత అలాంటివేవీ పరిశీలించకుండానే PMR లో వారికి డ్యూటీ వేస్తారా పై అధికారులు? ప్రధాని నివాసం, కార్యాలయం – ఇలాంటి చోట సేవలు నిర్వర్తించేందుకు గార్డుల్ని, అటెండర్లనీ, ఇతరుల్నీ నియమించేటప్పుడు, నియోగించేటప్పుడు అప్రమత్తత సూత్రాలుంటాయి గదా? ఆ గార్డులకి ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆరోజు వేసుకుందో, లేదో ఎవరు చెప్పాలి? అంటే వాళ్ళిద్దరికి ఇంకా ఎవరో సహాయపడి ఉండాలి కదా? మరి ఆవిషయం ఎందుకు బయటికి రాలేదు? అంతేగాక కేవలం ఇద్దరుగార్డులు స్వయంగా తామే హత్య చేస్తే, మరి ఈ టైముకి ఇందిరాగాంధీ హత్య జరుగుతుంది, అదీ సిక్కు సెక్యూరిటీ గార్డులు హత్య చేస్తారు, ఆ వంకతో ఢిల్లీలోని సిక్కు కుటుంబాల మీద దాడి చేసి మూకుమ్మడి హత్యలు చేయాలన్న పధకం ఎవరు రచించారు, ఎవరు ఆర్గనైజ్ చేసారు, ఎవరి చేత అమలు చేయించారు? ఇందిరాగాంధీ హత్య అక్టోబరు31,1984 ఉదయం 7.00 ప్రాంతంలో జరిగితే ఆ వెంటనే ఢిల్లీ అల్లర్లు జరిగాయి. సిక్కుల ఊచకోత జరిగింది. అప్పటికీ హత్యా ప్రయత్నం ఫలించిందనీ, ఇందిరాగాంధీ మరణించిందనీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించనైనా లేదు. అయినా గానీ అంతగా ఎవరుసమాయత్తమై ఉన్నారు, సిక్కులను ఊచకోత కోయటానికి? ఇందిర అనుకూల వర్గాలకి ఇంకా ఆ షాక్ అయినా తీరదు కదా?

ఈ నేపధ్యం గురించి ఇటీవల సీనియర్ పాత్రికేయుడు మనోజ్ మిట్టా, బాధితుల తరుపున పలుకేసులు వాదించిన న్యాయవాది హెచ్. ఎన్. పుల్కా తమ గ్రంధం ‘When a tree shook Delhi’ లో వివరించారు. 500/-Rs. లకు ఒక హత్య చొప్పన కాంట్రాక్ట్ ఇవ్వబడిందనీ, పధకం ప్రకారం హత్యలు జరిగాయనీ, ఈ అల్లర్లు గురించి నియమించబడిన ఎంక్వయిరీ కమీషన్ కావాలనే నిజాలు తొక్కిపట్టిందనీ, సంఘటన తీవ్రతని తగ్గించి చూపిందనీ, కావాలనే జరిగిన అన్నిటికీ పోలీసుల వైఫల్యమే’ కారణమన్న దనీ, వారు తమ గ్రంధంలో పేర్కొన్నారు. రచయితలిద్దరూ బాధితులను ప్రత్యక్షంగా deal చేసిన వారు. ఈ అల్లర్ల వెనుక గల కుట్రని వారు చాలా స్పష్టంగా విశదీకరించారు. అందుకే ఈ వార్త పత్రికలలో చాలా అప్రాముఖ్యంగా, ఓ మూల, సింగిల్ కాలం న్యూస్ గా 05/12/2007 న ప్రచురింపబడింది. అదే ఏ అరుంధతీ రాయో భారత్ కి వ్యతిరేకంగా వ్రాసిన గ్రంధమై ఉంటే ఈ పాటికి బుకర్ ప్రైజులూ గట్రా వచ్చి ఉండేవి, మీడియా ఎలుగెత్తి విసుగూ విరామం లేకుండా ప్రచారించి ఉండేది.

ఇక ఈ సోనియా గాంధీ 2004 కు ముందు, ప్రతిపక్షంలో ఉండగా, ఓ రోజు పార్లమెంటులో ఆవేశంతో ఊగిపోతూ, కన్నీరొలుకుతున్న కళ్ళతో, గద్గద స్వరంతో “నా అత్తని చంపారు, నా మరదిని చంపారు. నా భర్తని చంపారు” అన్నది. [ఎవరు చంపారు? అయినా సంజయ్ గాంధీ మరణాన్ని అందరూ ప్రమాదంగానే గుర్తించారు గానీ ’చంపబడటం’గా గుర్తించలేదు. ఇందిరాగాంధీ సైతం ఆవిషయమై పెదవి విప్పలేదు. మరి ఈమె ఎలా సంజయ్ గాంధీని ’చంపారు’ గా రిఫర్ చేసిందో?] రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ. చంపింది. చంపించిందెవరో ఇప్పటికీ తేల్చలేదు. ఈ సందర్భంలో 30/04/2008 న ప్రస్తుత భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ’రాజీవ్ హత్య వెనుక అదృశ్య హస్తం’ ఎవరిది? అంటూ తమ ఎన్.డి.ఏ. ప్రభుత్వహయంలో రాజీవ్ హత్య గురించి 50 దేశాలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపామనీ, యు.పి.ఏ. ప్రభుత్వం వచ్చాక ఆ ఫైలుని మూలన పెట్టేసారనీ విమర్శించాడు. [నేను పెట్టిన ఫిర్యాదులే కాదు, రాజీవ్ హత్యకు సంబంధించినవన్నీ తొక్కిపడతారన్న మాట!] 2004 లో అధికారంలోకి వచ్చి, 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న యు.పి.ఏ. ప్రభుత్వానికి ఇందిరాగాంధీ హత్య, ఆపైన ఢిల్లీ అల్లర్లు, రాజీవ్ హత్యల విచారణ గురించి ఎన్ని కమిటీలు వేసారో, అన్ని కమిటీల నుండీ రిపోర్టులు తీసుకొని నిజం నిగ్గు తేల్చుకునేందుకు తీరికే దొరకలేదా? పైపెచ్చు ఎల్.టి.టి.ఇ. కి బాహాటంగా మద్దతిస్తున్న, ఇచ్చిన కరుణానిధితో పొత్తుపెట్టుకొని డి.యం.కె. పార్టీకి మంత్రిపదవులు [కరుణానిధి మనుమడు దయానిధి మారన్ తో సహా] కట్టబెట్టిన యు.పి.ఏ. కుర్చీవ్యక్తి సోనియా గాంధీ, మరి అప్పుడు అంతగా ఎందుకు ఆవేశంగా ఊగిపోయినట్లు? అదీ ఆమె నటనా సామర్ధ్యం!

ఇక, ఈవిధంగా ఢిల్లీ అల్లర్లపై ఎంక్వయిరీ కమీషన్, శతకోటి ఇతర ఎంక్వయిరీ కమీషన్ల లాగే కుట్రలో తన పాత్రని తాను విజయవంతంగా పోషించింది. ఈ ఢిల్లీ అల్లర్లు[1984] గురించి, అప్పుడు దెబ్బతిన్న సిక్కుల మనోభావాల గురించి, ఇందిరాగాంధీ హత్యానంతరం, ఈ గడిచిన 24 ఏళ్ళల్లోనూ ప్రతీవారం దాదాపు క్రమం తప్పుకుండా [ఈ మధ్యే కాస్త తగ్గించాడు లెండి] లండన్ లో భారత మాజీ హైకమీషనరూ, సీనియర్ పాత్రకేయుడూ, పాక్ నుండి వలస వచ్చిన వాడూ అయిన కులదీప్ నయ్యర్ వ్యాసాలు వ్రాస్తూనే ఉంటాడు. ఈతడు దీంతో పాటు దేశంలో జరిగిన, జరుగుతున్న ఇతర హింసాత్మక సంఘటనల గురించి కూడా వ్రాస్తే అదివేరే విషయం కానీ ఈతడు అవేవీ వ్రాయడు. టెర్రరిస్టులు ప్రజల్ని చంపినా, మావోయిస్టులు ఉల్ఫాలు గిరిజనుల్ని చంపినా, నక్సల్స్ పోలీసుల్ని చంపినా, గోద్రాలాంటి సంఘటనల గురించి ఎప్పుడూ కిమ్మనడు. కేవలం సిక్కులకి తప్ప మనోభావాలు మరెవ్వరికి ఉండవన్నట్లు, దశాబ్థాలుగా మరో టాపిక్కే లేకుండా వ్రాస్తునే ఉన్నాడు. ఇతడు వ్రాసే మరో అంశం ఏమిటంటే పాక్ అంతర్గత వ్యవహారాలు! భారత ప్రభుత్వాన్ని పాక్ తో స్నేహహస్తం చాచాలని దాదాపు ప్రతీ వ్యాసంలోనూ భారత్ కి సలహా ఇస్తుంటాడు. పాక్ ఎన్ని దగాలూ, దౌష్ట్యాలూ చేసినా సరే! 1947 లో ఇతడు లాహోర్ నుండి భౌతికంగా మాత్రమే వలసవచ్చాడు గానీ మానసికంగా ఇప్పటికీ ఇతడిదేశభక్తి పాకిస్తాన్ పట్లే ఉంటుంది. మనకి కనిపిస్తూ ఇప్పటికీ పాక్ లోని అన్నిస్థాయిల నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగియున్న ఏకైక పాత్రికేయుడు.

ఇలా పాకిస్తాన్ నుండి శరీరం వలస వచ్చినా మనస్సు అక్కడే ఉండిపోయిన వివిధ రంగాల్లోని ప్రముఖలు మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మాజీ కేంద్రమంత్రి, సినిమా నటుడు సునీల్ దత్ కూడా ఒకడు. అతడి కుమార్తె ప్రియాదత్ కి ప్రత్యక్షంగానూ, కుమారుడు సంజయ్ దత్ కీ పరోక్షంగానూ ఎంత సహాయసహకారాలు యు.పి.ఏ. ప్రభుత్వం నుండి అందుతున్నాయో మనందరికీ తెలిసిందే. ప్రియాదత్ కి సోనియాగాంధీ అశీస్సులుండబట్టి సునిల్ దత్ మరణానంతరం ఎం.పి. టికెట్ వచ్చింది. దాంతో ప్రియాదత్ ముంబై నుండి ఎం.పి. అయ్యింది. సంజయ్ దత్ స్వంత గొంతుతో – పాక్ టెర్రరిస్టులు, మాఫియా గ్యాంగ్ లీడర్లూ అయిన దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులతో సంభాషణా టేపులు బయటికి వచ్చినా, 1993 మార్చిలో బొంబాయిలో పేలిన వరుస బాంబుపేలుళ్ళ కేసులో అతడిపాత్ర గురించి ఆధారాలు బయటిపడినా, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతడి నేరం నిరూపించబడినా, సంజయ్ దత్ గురించి మీడియా ఆసక్తికరమైన కథనాలు వ్రాస్తూనే ఉంది, సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి, ఇప్పుడిక రాజకీయ అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి. మీడియా ఇంటర్యూలలో సంజయ్ దత్ తన తండ్రి గురించి ‘తన గురించి తండ్రే పోలీసులకి ఫోన్ చేసి తనని అరెస్టు చేయించాడని’ కితాబులిచ్చి మరీ చెప్పాడు. [దీనికి పూర్తి వ్యతిరేక కధనాలు 1993 లో వచ్చాయి. కొడుకుని విడిపించుకోవటానికి సునీల్ దత్ అందరి చాలామంది చుట్టూ తిరిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.] అదే అయితే అతడి తండ్రి మరి తన కొడుకు చిన్న వయస్సులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడేలా ఎలా పెంచాడు? అంత విలువల్తో తానుంటే పిల్లల్ని అంత బాధ్యతాయుతంగా పెంచితే, లేక ఎంతో ప్రేమగా, విలువల్తో పెంచితే పిల్లలు డ్రగ్స్ కి అలవాటు పడతారా? ఇప్పటికీ సంజయ్ దత్ కి టిక్కేట్ ఇచ్చి ఎం.పి.ని చేసే గురుతర బాధ్యత నెత్తుకెత్తుకొని అమర్ సింగ్ [సమాజ్ వాది పార్టీ], కోర్టు కేసులురీత్యా, సంజయ్ దత్ కి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వస్తే అతడి కొత్తభార్య మాన్యతకి టిక్కెట్ ఇస్తాం అని ప్రకటించాడు. నేరం నిరూపించబడినా, కోర్టుల నుండి రక్షణా, సినిమాల్లో రాజకీయాల్లో కొనసాగుతున్న కెరియర్ చెప్పడం లేదా కుట్రస్థాయి ఎంత, కుట్రదారుల బలం ఎంత అన్న విషయం? నిజానికి తెరమీదే సంజయ్ దత్ ఖల్ నాయక్ కాదు, నిజంగా కూడా అంతే. అయినా మీడియా అతడి, అతడి భార్యల పునర్వివాహాలకి ఎంత ప్రచారం ఇచ్చిమరీ అతణ్ణి ప్రోత్సహిస్తుంటుంది!

ఒక్క సునిల్ దత్ మాత్రమే కాదు, పాక్ నుండి వలస వచ్చి వెలిగిపోతున్న వారు ఇంకా చాలామందే ఉన్నారు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగూ ఒకరు. అయితే గియితే భవిష్యత్తులో ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రస్తుత ప్రతిపక్షనేత ఎల్.కె. అద్వానీ కూడా పాక్ లోని కరాచీ నుండి వలస వచ్చిన వారే. ఈయన వివాహం చేసుకునేటప్పుడు ఎంచుకొని మరీ అదే కరాచీ నుండి వలస వచ్చిన ’కమల’గారిని వివాహం చేసుకున్నాడు. రాజ్ కపూర్, దేవానంద్, నిన్న అస్కార్ అవార్డు పొందిన గుల్జార్, యష్ చోప్రా, బి.ఆర్. చోప్రా, ....ఇలా ఎందరో. వారంతా తమ తమ రంగాల్లో నిష్ణాతులు, కళల్లో ఆరితేరిన వారు. కాబట్టి పైకి వచ్చారు. అయితే కేవలం వారి సామర్ధ్యమే వారిని పైకి తేలేదనీ, ముంబాయి సినిమా ప్రపంచం పాక్ మాఫీయా గాడ్ ఫాదర్ ల చేతిలో ఉన్నదనీ ఇప్పుడందరికీ తెలిసిన విషయమే. 1980 వ దశకంలో హిందీ చలన చిత్రసీమలోకి కొత్తగా కధానాయికలు రావాలంటే దావూద్ ఇబ్రహీం వంటివారి ఆశీస్సులు ముఖ్యమని అంతా అనుకునే వారు. మందాకిని, దావూద్ ఇబ్రహీంకి సంతానాన్ని కనిచ్చిన విషయం తెలిసిందే. సినిమా గాసిప్స్ పేరిట వార, సినిమా పత్రికలు ఇలాంటి జుగుప్సాపూరిత ప్రచారాన్ని మామూలుగా సిగ్గూ, మొహమాటం లేకుండా ప్రచారం చేసింది. అలాగే ఇప్పుడు దుబాయ్, గల్ఫ్, బ్రిటన్ ల నుండి ఆశీస్సులతో వచ్చి దక్షిణ భారత, హిందీ ఫీల్డ్ లలో ఎన్నో అవకాశాలు అందుపుచ్చుకుంటున్న హీరోయిన్లు మనకి తెలిసిందే.
ఇక మళ్ళీ ఇందిరాగాంధీ విషయానికి వద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

3 comments:

@గొప్పకి మాత్రమే మనం అవి మన పూర్వ [హిందూ] సింధూ నాగరికతలని చెప్పుకోగలం
ప్రస్తుత కాల మాన పరిస్తితులను పక్కనపెడితే, ఎన్ని దేశాలుగా విడిపోయినా ఎన్ని పేర్లున్నా చరిత్రకు సంబంధించినంత వరకు భారత ఉపఖండం మొత్తాన్ని భారతదేశం(హిందూదేశం?) అంటారు, ఇటీవలె బిబిసి వారి ద స్టోరీ ఆఫ్ ఇండియా అనే డాకుమెంటరీ చూసాను, బాగానే ఉంది. ఆరింట నాలుగు భాగాలు చూసాననుకుంటా. మొత్తనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు అనేవి ఉన్నాయన్న ఊసెత్తలెదు దానిలో. తమిళనాడు భూములు అత్యంత ఉత్కృష్టమైన పంటభూములని అంగ్లేయులు పేర్కొన్నట్లు చెప్పారు, అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాదా? దీని గురించి ఏమైనా తెలుసా.

ఆ డాక్యుమెంటరీలో పాఆఆఆఆత విషయాలు ఆసక్తికరంగా చూపారు, వీలైతే ఒకసార్ది చూడండి. యూట్యూబ్ లో ద స్టోరీ ఆఫ్ ఇండియా అని వెతకండి.

Kanna gaaru,

2001లో తాలిబాన్లు ఆఫ్గాన్ లో బుమియాన్ బుద్ధుల్ని పగలగొట్టారు. అలాగే రేపెప్పుడో హరప్పా మోహంజదారోలని నాశనం చేసినా ఏమీ చెయ్యలేం. ఎందుకంటే అవి హిందూ సంస్కృతి మూలాలు గానీ ఇస్లాం మతానికి సంబంధించినవి కావు. కాబట్టి వారికవి విలువైనవి కావు. మతప్రాతిపదికన దేశవిభజన చేసేటప్పుడు హిందూ సంస్కృతి చిహ్నాలని పాక్ కి కట్టబెట్టడంలోని కుట్ర గురించే నేను చెప్పాను. పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి భారత్ కి రెండుప్రక్కలా పెట్టగలిగిన బ్రిటన్, కుట్రదారులు హిందూ సంస్కృతి మూలాలున్న హరప్పా, మొహంజదారోలని పాక్ కి గాకుండా భారత్ కి ఇచ్చి ఉండాల్సింది కదా! అలా ఇచ్చే చిత్తశుద్ది వాళ్ళకి ఉంటే మార్గమే దొరికేది కాదా? ఇందులోని కుట్రనే నేను చర్చించాను.

ఇక మీరు చెప్పిన Documentary నేనింకా చూడలేదు. చూశాక నా అభిప్రాయం చెబుతాను. అయినా తమిళనాడు భూములు సారవంతమైనవి అన్నంతమాత్రనా ఆంధ్ర అన్నపూర్ణ కాదనీ, పంజాబ్ పండదనీ అన్నట్లు అర్ధం అని ఎవరన్నారు? అన్నిరాష్ట్రాల గురించీ చెప్పేందుకు ఆ Script రచయితకి అవగాహన లేకపోవచ్చు, సమగ్రత లేకపోవచ్చు లేక film నిడివి సరిపోకపోవచ్చు. కాకపోతే ఏవిషయంలో నైనా ’పదేపదే అదే ప్రచారం’ చేస్తే అప్పుడు మాత్రమే, మనం దానిలో నెగిటివ్ ని పరిగణించాలి అనుకుంటాను.

wellsaid, దేశంలో ఇద్దరు ప్రధానులు హత్యకు గురైతే, ఇంతవరకూ తేలలేదంటేనే అర్ధం అవుతుంది

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu