నెహ్రు తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి చేతికి ప్రభుత్వ పగ్గాలు వచ్చాయి. 1962 చైనా యుద్దంతో అప్రమత్తమైనందున శాస్త్రీజీ ‘జైజవాన్ – జైకిస్తాన్’ అన్న నినాదాన్నిచ్చారు. అది బాగా పాపులర్ అయ్యింది. ప్రజలు దానికి బాగా ప్రతిస్పందించారు. శాస్త్రీజీ తో పాటుగా, ఆయన మంత్రివర్గ సహచరుల్లో చాలామంది, భారత మీడియాలో అధిక శాతం, ప్రజలు నూరుశాతం దేశభద్రత విషయంలో జాగరూకులై ఉన్నారు.

ఆ సమయంలో దాదాపు భారత్ కి మిత్రదేశం అంటూ ఏదీ లేదు. భారత్ కి సహాయం చేయటానికి గానీ, ఆయుధాలు అమ్మడానికి గానీ, సాంకేతికతనీ, శిక్షణనీ ఇవ్వడానికి గానీ ఏదేశమూ ముందుకు రాలేదు. దాదాపు భారతీయులంతా తాము ఒంటరి వారమన్నా భావనకి గురయ్యారు. ఇంతగా ఇండియా వెలివేయబడినట్లయినా, ఇంత సహకార లేమిలో ఉన్నా నాటి భారత ప్రభుత్వం, నాయకుల్లో అత్యధికులు, భారతీయులు అధైర్యపడలేదు. పైపెచ్చు దేశభద్రత విషయంలో మరింత జాగ్రత్త పడ్డారు.

ఇది 1965 లో జరిగిన ఇండో – పాక్ యుద్దంలో నిరూపించబడింది. అప్పుడు పాక్ అధిపతి జనరల్ అయూబ్ ఖాన్. పాకిస్తాన్ ని చీల్చుకుపోయిన జిన్నా 1947 దేశ విభజన తర్వాత 1948 సెప్టెంబరులో [ఒక సంవత్సరం ఒక నెలకే] మరణించాడు. కొద్దికాలంలోనే అక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చెయ్యబడి 1958 లో ఇస్లాం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సైనిక పాలనా వచ్చింది. అప్పటినుండి ఇప్పటికీ, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఓతంతు మాత్రమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు సైనిక పాలనా రాగలదు, ప్రజాస్వామ్యం రాగలదు. ఎందుకంటే ఏ పేరైనా అక్కడ నడిచేది ఒకటే గనుక. బయట ప్రపంచాన్ని నమ్మించడానికి మాత్రమే అక్కడ ప్రజాస్వామ్యం. కానీ భారత్ లో అయితే కనీసం 1996 దాకా [మధ్యమధ్యలో ఒకటి రెండేళ్ళు కాలవ్యవధీ ప్రభుత్వాలు తప్ప] ప్రజాస్వామ్యం ఉంది. 1996 నుండి ఇప్పటివరకూ నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాదు, రాజకీయ వ్యభిచారస్వామ్యం. ఎవరికీ సిద్దాంతాలు లేవు. నిన్న తిట్టుకొని, ఈరోజు కలుస్తున్నారు. రేపు మళ్ళీ విడిపోతామన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. రాష్ట్రంలో పొత్తులు, కేంద్రంలో వ్యతిరేకం లేదా కేంద్రంలో పొత్తులు, రాష్ట్రంలో వ్యతిరేకం. స్నేహపూర్వక పోటీలు లాంటి రకరకాల ప్రక్రియలు తీసుకొచ్చారు. ఇంకా నయం స్నేహపూర్వక గొంతుపిసుకుడు ప్రక్రియ తీసుకురాలేదు. దీన్ని ప్రజాస్వామ్యం అనాలా లేక ఏమనాలి? ఇక్కడ తెలియటం లేదా అందరిని ఒక్కరే నడిపిస్తున్నారు అన్న విషయం? ప్యాకింగ్ మారుతుంది, లోపల పదార్ధం మాత్రం అదే. సోనియా సామ్రాజ్యం మనం చూస్తూనే ఉన్నాం కదా. తదుపరి టపాలలో పూర్తి విశ్లేషణ వ్రాస్తాను, దృష్టాంతాలతో సహా!

ప్రస్తుతం మళ్ళీ 1965 ఇండో – పాక్ యుద్ధం దగ్గరికి తిరిగి వద్దాం. అమెరికా, చైనా ఇతర దేశాలు పాకిస్తాన్ కి అత్యాధునిక ఆయుధాలనిచ్చాయి. [పాకిస్తానంటే అమెరికాకీ ముద్దే, చైనాకీ కూడా ముద్దే. అమెరికా, చైనాలకు మధ్యమాత్రం పడదు. ఇద్దరికీ ఇండియా అంటే అసలు పడదు. ఏం విచిత్రం?] అతినీలలోహిత హెడ్ లైట్స్ గల ప్యాటన్ టాంకుల్నీ, సేబల్ జెట్లను, అమెరికా షెర్మాన్లు, ఫ్రెంచి చాఫీల్నీ పోటీలు పడి మరీ పాకిస్తాన్ కి సమకూర్చారు. ఇంకా ఆయుధ టెక్నాలజీని, ఆయుధాలని ఉపయోగించటంలో పాక్ సైనికులకి శిక్షణనీ కూడా ఇచ్చారు. [ఇండో – చైనా, ఇండో – పాక్ యుద్ధాల నేపధ్యం గురించి, పూర్వాపరాల గురించి ప్రముఖ విశ్లేషకుడు రస్సెల్ బ్రైన్స్ రచనలు లేదా పి.వి.నరసింహరావు గారి ’ఇన్ సైడర్ (లోపలి మనిషి)’లో చూడగలరు.]

పాక్ పొందిన ఈ వ్యూహాత్మక సహాయ సహకారాల వెనుక ఎవరున్నారో ఈపాటికి మీకు అర్ధమయ్యేఉంటుంది. ఇక దీంతో పాటు, అంతర్జాతీయమీడియా గొంతులు చించుకొని చేసిన ప్రచారం ఏమిటంటే “పాక్ దగ్గర భారత్ కంటే ఎక్కువసైన్యం, ఆయుధాలు, యుద్దవిమానాలు, టాంకులూ ఉన్నాయి. వెరసి భారత్ కంటే పాక్ ఎంతో బలోపేతంగా తయారయ్యింది. ఒకవేళ ఇండో – పాక్ యుద్దమే జరిగితే నిశ్చయంగా పాకిస్తానే గెలుస్తుంది”. ఈరకపు ప్రచారం 1965 కు ముందు ముమ్మురంగా సాగింది. ఈ ప్రచారం ఎంతగా సాగిందంటే చివరికి ‘కామమ్మ మొగుడంటే కామోసనుకున్నట్లు’ పాకిస్తాన్ కూడా తనకంతటి బలసంపత్తి ఉందని నమ్మేసింది.

1962 లో ఇండో – చైనా యుద్దంలో ఇండియా ఓడిపోయిందంటే అందుకు సగం కారణం ముందుగా ఊహించక పోవటమే, ముందస్తు జాగ్రత్తలో లేకపోవటమే. బయటి శత్రువునే ఊహించని చోట లోపల శత్రువుని ఎక్కడ ఉహించగలరు? పాకిస్తాన్ కీ, దాని వెనుక నున్న కుట్రదారులకీ [సి.ఐ.ఏ., బ్రిటన్, అనువంశిక కణికుడూ ఇంకా వారి మద్దతుదారులైన కొన్ని కార్పోరేట్ కంపెనీలు] డబ్బు, సంపద, ఆయుధాలు, టెక్నాలజీ మీద నమ్మకం ఎక్కువ. దాంతో భారతీయ సైనికుల ఆత్మబలం, వ్యక్తిత్వధీరత కంటే తమ ఆయుధాలు గొప్పవని చాలా మిడిసిపడ్డారు. ఎందుకంటే ఈ కుట్రదారులంతా పదార్ధవాదాన్ని నమ్ముతారు. కాబట్టే ఆయుధ సంపత్తిని గొప్పదిగా భావించారు. భారతీయులు భావవాదాన్ని నమ్ముతారు. కాబట్టే విల్ పవర్ నీ, వ్యక్తిత్వధీరతనీ, ఆత్మస్థైర్యాన్నీ, నైతిక బలాన్ని గొప్పవిగా భావిస్తారు. నైతికబలమే గొప్పదన్నా సత్యాన్ని నాటి భారత కురుక్షేత్రం మొదలు నిన్నమొన్నటి 1965, 1971 ల్లోని ఇండో – పాక్ యుద్దాలు నిరూపించాయి.

ఈ సందర్భంలో మహాభారతంలోని ఒక సంఘటనని 1965 ఇండో – పాక్ యుద్దానికి అన్వయించుకొని చూడటం అసందర్భం కాదు.

మహా భారతంలో, పాండవులు ఉద్యోగపర్వానంతరం ఉపప్లావ్యంలో నివసిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్దం అందరికీ వూహాతీతం కాదు. కురుపాండువులిద్దరూ పరస్పరం రాయబారాలు నడుపుతూనే మరోవైపు యుద్దసన్నద్దులై, సైన్యసమీకరణాలు చేస్తున్నారు. [భారత కథల్లో ఎన్.టి.ఆర్. స్వంత సినిమాలలో ఎన్నిప్రక్షిప్తాలు చొప్పించాడో, ఎంత వక్రీకరణ జరిగిందో Coups on World లోని Coup on Indian Epics లోనూ చూడగలరు. ఈ సహకారానికి ప్రతిగానే అతడికి సినిమా, రాజకీయ రంగాలలో కెరీర్ ఇవ్వబడింది.] సైన్యసమీకరణల సందర్భంలో ఒకరోజు ధర్మరాజు, అర్జునుణ్ణి శ్రీకృష్ణుని సహాయాన్ని అర్ధించడానికి పంపించాడు. అర్జునుడు ద్వారక చేరే సమయానికి, అదేపనిమీద దుర్యోధనుడు, అర్జునుడి కంటే ముందుగానే వచ్చి ఉన్నాడు.

దుర్యోధనుడు అర్జునుడి కంటే ముందుగానే కృష్ణమందిరం చేరాడు. ఆ సమయానికి కృష్ణుడు నిద్రిస్తున్నాడు లేదా నిద్ర నటిస్తున్నాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని తలవైపుగల ఆసనంలో కూర్చోన్నాడు, కాళ్ళవైపు ఆసనంలో కూర్చోవడంలో అవమానమని తలిచాడు. [అందులో తప్పేమి లేదనీ, అది అతడి ఇచ్చనీ అనుకోవచ్చు] కాస్సేపటికీ అక్కడికీ ప్రవేశించిన అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల చెంత నిలిచి వేచిచూడసాగాడు. [అర్జునుడికి కృష్ణునిపట్ల భక్తి, గౌరవం, గురుభావనా ఉన్నాయి గనుక ఇది ఇతడి ఇచ్ఛ.]

కొద్దీక్షణాల తర్వాత శ్రీకృష్ణుడు లేచి ఇద్దరినీ కుశలమడిగాడు. తర్వాత ఏపని మీద వచ్చారో కనుక్కున్నాడు. ఇద్దరూ ‘రానున్న యుద్దంలో సహాయార్ధం వచ్చాం’ అన్నారు.

దుర్యోధనుడు:
"కృష్ణా, ముందుగా నేను వచ్చాను. కనుక ముందుగా నాకు సహాయం చేయటం న్యాయం” అన్నాడు.

శ్రీకృష్ణుడు:
ముందుగా వచ్చావు నీవు. కాని నేను ముందుముందుగా అర్జునుని చూశాను. మీరిద్దరూ నాకు బంధువులే. నా సహాయం మీ ఇద్దరికీ చెందాలి. నా సైన్యంలో 10,000 మంది నాకు సమానులైన వారు, నారాయణాంశగల యోధులున్నారు. వారొకవైపు. నేనొకవైపు. వారు యుద్ధం చేస్తారు. నేను యుద్ధం చేయను. యుద్ధంలో కావలసిన సలహాలు, మాట సహాయం చేస్తాను. ఇక మీకు ఏవికావాలో కోరుకొండి. కానీ అర్జునునికి ముందుగా కోరుకునే అవకాశం ఇస్తాను. ఏమందువు అర్జునా?

దుర్యోధనుడు:
కృష్ణా! నీయవచ్ఛక్తీనీ వినియోగించి, ఇందు అర్జునునకు భాగము కల్పించుటయే గాక కోరుకొనుటలోను అతడికీ ముందరవకాశ మొసంగి, బావా నీయభిప్రాయమేమి అని అడుగుచున్నావు. అహ! ఇంతకన్న ఎవరి అభిప్రాయమెట్లుండెడిది బావా?

శ్రీకృష్ణుడు:
బావా దుర్యోధనా! నీవు స్వతంత్రుడవు. అర్జునుడు సేవకుడు. అన్న ఆఙ్ఞలకు బద్దుడై చరిచెడి వాడు. అందుకే అలా వేరుగా అడగవలసి వచ్చింది.

దుర్యోధనుడు: [స్వగతంలో] కృష్ణుడెంత మోసము చేస్తున్నాడు? ఆయుధం పట్టడట, యుద్ధం చేయడట. ఊరికే సాయం చేస్తాడట. తన సైన్యాన్నంతా ఒకవైపు పెట్టి, తాను ఒక వైపు నిలుచున్నాడు. కంచిగరుడ సేవ లాంటి ఇతడితో ఏమీ ఉపయోగం? అర్జునుడు మాత్రం కృష్ణుణ్ణి ఎందుకు కోరుకుంటాడు? సైన్యాన్నే కోరుకుంటాడు.

కానీ అర్జునుడు కృష్ణుణ్ణే కోరుకుంటాడు. దుర్యోధనుడు “కృష్ణుని కపటోపాయము మనకే కలిసివచ్చింది” అనుకుంటూ సంతోషంగా సైన్యాన్ని తీసికొని, అర్జునునిపై జాలిపడి మరీ వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడు అర్జునుణ్ణి అడుగుతాడు, "ఆయుధపాణులైన యోధుల్ని వదిలి, ఒట్టిగోపాలుణ్ణి, నన్ను కోరుకున్నావు, బాలుడవువైతి వక్కటా” అంటాడు.

అర్జునుడు “కృష్ణా! నాకు యోధులు, ఆయుధాలు, నీ యుద్ధకౌశలం అక్కరలేదు. నీవు నా అండనుండుటయే చాలు. నేనే అన్నిటినీ గెలవగలను” అంటాడు.

ఆవిధంగా అర్జునుడు భావవాది గనుక, పదార్ధాన్ని గాక విల్ పవర్ నీ, తన ఆత్మబలాన్ని, సంకల్పబలాన్ని నమ్మాడు, లక్ష్యాన్ని ఛేదించాడు. ‘యతో ధర్మతతో జయః’ అన్నట్లు పాండవులు కురుక్షేత్రంలో గెలుపొందారు కదా!

ఇదిగో, ఈ ఐడియలిస్టిక్ జీన్స్ తో కూడిన రక్తంతో, భారతీయులు 1965 లో – పత్యక్షంగా పాక్, పరోక్షంగా కుట్రదారులు పాల్గొన్న యుద్ధంలో గెలుపుని కైవసం చేసుకున్నారు. ఒకవేళ జనరల్ అయూబ్ ఖాన్ పధకము [కలలు]ఫలించి ఉంటే పాక్ సైన్యం జి.టి.రోడ్డు వెంట బియాస్ నది ఒడ్డునున్న ఖరణ్ ఖేర్ నుండి న్యూఢిల్లీ దాకా కవాతు తొక్కుతూ ప్రయాణించి ఉండేవాళ్ళే! పాక్ పధకాలు, కలలూ ఫలించకుండా భారతీయసైనికులు పాక్ సేనల్ని తరిమి కొట్టారు. 1965, సెప్టెంబరు 9 తేది నుండి 23 తేదీ వరకూ జరిగిన యుద్దంలో పాక్ సైనికులు భారతదేశపు చెరుకుతోటల్లో తమ ప్యాటన్ టాంకుల్ని వదిలేసి పారిపోయారు. వాటి నేత్రాలు అతినీల లోహితాలు [Ultra violet Head lights] కనుక అందులోని పాక్ సైనికులు రాత్రిపూట కూడా మార్గాల్ని చూడగలరు. అలాంటి టాంకుల్ని ఇక్కడ వదిలేసి ‘బ్రతుకు జీవుడా’ అని పలాయనం చిత్తగించారు. అప్పటి అక్కడి భారతీయ గ్రామీణులు, ప్రజలు ఎంతగా ఆ ప్యాటన్ టాంకుల్ని ఎగతాళి చేశారంటే చివరికి, వాటిని తయారు చేసిన కంపెనీ, భారత ప్రభుత్వానికి ‘పాక్ సైనికులు భారతీయ పొలాల్లో వదిలివెళ్ళిన టాంకుల ఫోటోలను ప్రదర్శించవద్దని’ అర్ధించింది.

ఆ యుద్దసమయంలో అప్పటి భారతీయ మీడియా [అత్యధికంగా] భారత దేశానికి, ప్రభుత్వానికి, ప్రధాని శాస్త్రీజీకి, భారతీయ సైనికులకి అండగా నిలిచింది. శాస్త్రీజీ యుద్ధసమయంలో చాలా స్పష్టమైన, నిర్ధిష్టమైన, పట్టుదలతో కూడిన నిర్ణయాల్ని తీసికున్నారు. మాటల్లో గానీ, నిర్ణయాల అమలులోగానీ ఎక్కడా తొట్రుబాటు లేదు. ఆ పొట్టినాయకుడు అంత గట్టివాడని ఊహించని కుట్రదారులకి ఇది అశనిపాతమే!

యుద్ధం సాగుతున్నంతసేపూ అంతర్జాతీయ మీడియా, ఇండియా ఓడిపోతోందనీ, ఓడిపోయిందనీ లేదా ఓడిపోబోతుందనీ ఊదర పెట్టాయి. అంతే పరిమాణంలో పాక్ సామర్ధ్యాన్ని పొగిడాయి. ఇంకేముంది గెలిచేసింది, గెలిచేసింది అన్న స్టాంప్ వేసే ప్రయత్నం నిర్విరామంగా చేసింది. అయితే ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే భారత్ సేనలు పాక్ ని తరిమికొట్టిందే గాక పాక్ భూభాగంలోకి ‘లాహోర్’ దాకా చొచ్చుకుపోయాయి. ఇది కుట్రదారులైన సి.ఐ.ఏ., బ్రిటన్, అనువంశిక నకిలీ కణికుడు ఊహించనిది. బహుశః వాళ్ళు “భారత్ ఐడియలిస్టిక్ కదా! శాంతికాముక దేశం [‘పాపం! మంచోడు’ అంటాము అలాగన్న మాట] కాబట్టి సరిహద్దు దాటదు. దాటకూడదన్న నిబద్దతకి కట్టుబడి ఉంటుంది. పదార్ధవాదులం కాబట్టి, లేదా కుట్రదారులం కాబట్టి సరిహద్దులు దాటి దురాక్రమణ చేయటం మన హక్కు. దురాక్రమణ చేసినా కూడా భారత్ సరిహద్దులు దాటి మన భూభాగంలోకి చొచ్చుకురారులే” అని అభిప్రాయపడ్డారేమో! [దురాక్రమణ దారుల్ని తరిమికొడుతూ వాళ్ళ భూభాగంలోకి అడుగుపెట్టడం దురాక్రమణ అవ్వదని భారత వ్యతిరేకులకి చెప్పవచ్చు.]

భారత సేనలు లాహోర్ కి చాలా చేరువుగా, వారి విమానాశ్రయాన్ని పట్టుకోగలిగేంత దూరంలో ఉన్నాయి. ఇక అప్పుడు అంతర్జాతీయ మీడియా ఒక్కసారిగా నెత్తీనోరు కొట్టుకుంటూ గావుకేకలు వేసింది. ఏకపక్షంగా “ఇది సరైనది కాదు. భారత్ లాహోర్ ని పట్టుకోకూడదు. పాక్ భూభాగంలోకి భారత్ సేనలు చొచ్చుకురాకూడదు” అంటూ అరిచాయి.

ఎంతస్పష్టమైన కుట్ర ఇది? హఠాత్తుగా చైనా, భారత భూభాగంలోకి దురాక్రమణ చేసినప్పుడు అంతర్జాతీయ మీడియా ఒక్క అభ్యంతరమూ లేవనెత్తలేదు. పాక్ సేనలూ, టాంకులూ బియాస్ నది ఒడ్డునున్న మాగాణి చెరకు తోటల్లోకి తీసుకొచ్చినప్పుడూ, ఖరణ్ ఖేర్ వరకూ భారత భూభాగంలోకి దురాక్రమణ చేసినప్పుడు అంతర్జాతీయ మీడియా ఒక్క అభ్యంతరమూ లేవనెత్తలేదు. పైపెచ్చు పాక్ సామర్ధ్యాన్ని తెగ పొగిడిపారేసాయి. అదే మీడియా, భారత్, పాక్ ని చిత్తుచేసేటప్పటికి మొత్తం అంతర్జాతీయ మీడియా ఒక్కటై ఇరుగుపొరుగు దేశాల మధ్య ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించీ, సంబంధబాంధవ్యాల సిద్దాంతాల గురించి రాద్దాంతం చేయటం మొదలు పెట్టాయి.

[ఇదే స్ట్రాటజీ ఇప్పటికీ వీలయన అన్నిచోట్లా అమలు చేస్తూనే ఉన్నారు ఈ కుట్రదారులు. ఉదాహరణకి భారతీయ సంస్కృతిని విమర్శిస్తూ ఒక రంగనాయకమ్మ లేదా ఒక అరుంధతీరాయ్ వ్రాసిందనుకొండి. దాన్ని అంతర్జాతీయ మీడియా, 1975 తర్వాత అత్యధిక ఇండియా మీడియా కూడా, గొంతేసుకొని వారిని పొగుడుతాయి. వీళ్ళ క్యాలిఫీకేషన్స్ పెంచటానికి అన్నట్లు అవార్డులు, బిరుదులు, బుకర్ ప్రైజులు లాంటివి ఉంటాయి. వాళ్ళని ఉదహరించే ముందు, ‘టాగ్’ లాగా ఆ బిరుదులు ఉదహరిస్తారు. సదరు రంగనాయకమ్మల్నీ, అరుంధతీ రాయల్నీ లేదా మరొకరిని – మిగిలిన భారతీయులు, ఉషశ్రీ, విశ్వనాధ సత్యనారాయణ వంటి వాళ్ళు సహేతుకంగా విమర్శిస్తూ, వారి రచనల్ని విశ్లేషించి, అందులోని లొసుగుల్ని బయటపెడుతున్నారనుకొండి మరుక్షణం వందలాది జూ.రంగనాయకమ్మలూ, జూ.అరుంధతమ్మలూ పుట్టుకొస్తారు. పాపం ఉషశ్రీలకీ, విశ్వనాధ సత్యనారాయణులకీ ఒక్కరూ తోడురారు. అందుకే విశ్వనాధ వారు ’నువ్వు భారత ఇతిహాసాలని, సంస్కృతినీ విమర్శించు. వందమంది నీతో గొంతు కలుపుతారు. శ్లాఘించు. వందమందీ నిన్ను రాళ్ళిచ్చుకు కొడతారు. నీకు నేను చెప్పేది నచ్చకపోతే నీవూ ఓరాయందుకో’ అన్నారు కాబోలు. ఇప్పటికీ అదే స్ట్రాటజీ. అంతటా అదే స్త్రాటజీ. ఇక్కడ తెలియడం లేదా ఎంత పకడ్బందీగా వ్యవస్థీకృతంగా, సంఘటితంగా ఈ కుట్ర భారతీయుల మీద, భారతీయ సంస్కృతి మీదా అమలు జరపబడుతుందో? సరే! ఇక ఈ చర్చవదిలిపెట్టి మళ్ళీ 1965, ఇండో పాక్ యుద్ధం దగ్గరికొద్దాం.

అంతర్జాతీయ మీడియా యొక్క ఈ కుటిల స్ట్రాటజీని ఆనాటి భారతీయ మీడియా తమ కలం, మేధస్సుల బలంతో తార్కికంగా బహిర్గతం చేశారు. ఈ నేపధ్యంలోనే కుట్రదారులకి భారతదేశంపై కుట్ర చేసేందుకు భారతీయ మీడియా సహకారం ఎంతగా అవసరమో అర్ధమయ్యింది. దానితో పదేళ్ళు తిరిగేసరికి చిన్నపత్రిక, స్థానిక పత్రిక ముసుగులో రామోజీరావు రంగప్రవేశం జరిగింది. ఎన్.రామ్, రామ్ నాధ్ గోయంకాల సంఖ్య పెరిగింది. కృష్ణపత్రిక లాంటివి మేనేజ్ మెంట్లు మారాయి. తరువాత పేర్లు మారి రూపాంతరం చెందాయి. 1965 ఇండో – పాక్ యుద్ధం గురించిన మరిన్ని వివరాలు మీరు పి.వి.నరసింహారావు గారి ఇన్ సైడర్ [లోపలి మనిషి] లో చూడగలరు.

ఈ నేపధ్యంలో దిగ్భ్రాంతికరమైన, అతి కఠోరమైన ఒక వాస్తవాన్ని మనం చూడాలి. దాన్ని అర్ధం చేసుకునే ముందు ఓ చిన్న పోలిక పరిశీలిద్దాం.

ఉదాహరణకి, మన కాలనీలో ఇద్దరు బలమైన వ్యతిరేక వర్గాలకు చెందిన ‘A’ మరియు ‘B’ నాయకులు ఉన్నారనుకొండి. దాదాపుగా మన కాలనీలోని అందరూ ‘A’ లేక ‘B’ కో మద్దతుదారులైపోయారు. ఏదో ఒక శిబిరంలో చేరిపోయారు. మన స్వభావం రీత్యానో లేక ఆత్మగౌరవం అనుకొనో లేక డబ్బున్నవాడికి చెంచాగిరి చేయటం ఇష్టం లేకనో మనం ఏగ్రూపులోనికీ చేరలేదనుకొండి. దాంతో ముందుగా ‘A’ అనే నాయకుడికి మన మీద కోపం వచ్చింది. మన పొరుగింటి వాణ్ణి మన మీదకి ఎగదోసాడు. వీడెటూ ‘A’ కి మద్దతుదారుడే గనుక సరిహద్దు గోడ వివాదమో, ఉదయాన్నే వాకిలి ఊడ్చిన దుమ్ము వివాదమో లేక చెట్టు నీడ వివాదమో లేవనెత్తాడు. మనం ఎంత సామరస్యంగా ఉందామన్నా, వాడు ముందే తగవు పడాలన్న Intution తో, కృతనిశ్చయంతో ఉన్నాడు గనుక పోట్లాట తప్పలేదు.

అప్పుడు సహజంగా ఏం జరగాలి? ‘శతృవు యొక్క శతృవు మనకు మితృడు’ అన్న సూత్రం [సిద్దాంతం] ప్రకారం ‘B’ అన్న నాయకుడికి మనం ప్రీతి పాత్రం కావాలి, పత్యక్షంగానో పరోక్షంగానో ‘B’ మనల్ని అప్రోచ్ అవుతాడు. ‘B’ అన్న నాయకుడు ‘A’ యొక్క మద్దతుదారుని ఓడించేందు కోసం మనకి మద్దతివ్వాలి కదా! “పోనీ వాళ్ళకి [భారత్ కి] గీర[అహం] ఉన్నప్పుడు నాకెందుకు” అనుకున్నా ‘B’ గమ్మునన్నా ఉండాలి. అటువంటప్పుడు……

1965 నాటికి ప్రపంచంలో, ప్రచ్చన్నయుద్దపు మేఘచ్ఛాయలో, అమెరికా రష్యా అన్న రెండువర్గాలుగా దాదాపు ప్రపంచదేశాలన్నీ రెండు శిబిరాలుగా ఉన్నాయి. అయితే అమెరికా ప్రేరిత పాక్ మనమీద దురాక్రమణకి తెగబడినప్పుడు రష్యా మనకి ఏ సాయమూ అందించలేదు. ఏ మద్దతు పలక లేదు. భారతీయులు అది సహజ పరిణామం కాబోలునను కొన్నారు. భారత్, రష్యా శిబిరంలో చేరనందున రష్యా మన పట్ల ఉదసీనంగా ఉంది కాబోలు అనుకున్నారు. బహుశః అలీనవిధానం ఇలా మనల్ని ఒంటరిని చేసిందన్న విమర్శలు కూడా ఇరుగుపొరుగుల పేరిట అంతర్జాతీయ మీడియా లేవనెత్తింది. [నేటి యు.పి.ఏ. ప్రభుత్వానికి ఇచ్చినంత మద్దతు, ప్రాముఖ్యత అమెరికా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఇవ్వలేదనీ, పనిగట్టుకుని మరీ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ భారత ప్రధానిని అవమానించాడనీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి]

అయితే హఠాత్తుగా రష్యా ఈ విషయంలో జోక్యం చేసుకొంది. కానీ నేనుపైన చెప్పిన సహజ రీతిలో కాదు. రష్యా ఎందుకు Involve అయ్యిందంటే – ఇండియా పాక్ ల మధ్య సంధి చేసేటందుకు Involve అయ్యింది. ఎప్పుడు Involve అయ్యిందంటే – ఇండియా పాక్ ని చిత్తుగా ఓడించినప్పుడు! అదేపాక్ ఇండియా భూభాగంలోకి ప్యాటన్ టాంకులేసుకొని ఉరుక్కుంటూ వచ్చినప్పుడు Involve కాలేదు. అప్పుడు సంధి అవసరం అన్పించలేదు కాబోలు. సరిగ్గా ఇలాగే ఇండియా మీద చైనా దురాక్రమణ చేసినప్పుడూ, ఇండియా మీద చైనా గెలిచినప్పుడు కూడా రష్యా Involve కాలేదు. పాక్ మీద ఇండియా గెలిచినప్పుడు మాత్రం అర్జంటుగా సంధి చేయడానికి నడుం కట్టింది.

భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని సంధి చర్చలనిమిత్తం రష్యా తాష్కెంట్ కు ఆహ్వానించింది. ఆ శాంతి చర్చల సమయంలోనే శాస్త్రీజీ తన 62వ ఏట గుండె పోటుకి గురై మరణించాడు. అప్పుడంటే ఎవ్వరూ అనుమానించ లేదుగానీ, ఇప్పుడు కుట్ర నేపధ్యమూ, కోణమూ, పెరిగిన టెక్నాలజీ తెలిసాక ఎందుకు అనుమానించ కూడదు?

ఇక్కడ తెలియటం లేదా, పాక్ కి ఎంత బలమో! పాక్ ని అమెరికా రక్షిస్తుంది, చైనా రక్షిస్తుంది, రష్యా రక్షిస్తుంది. మళ్ళీ ఒకరంటే ఒకరికి పడదు. అంతేగాక అంతర్జాతీయ మీడియా పాక్ కి అనుకూలంగా ప్రచారిస్తూంది. ఐ.రా.స. కూడా కాశ్మీర్ విషయంలో అనుకూలంగా పనిచేసింది. ఐ.రా.స. ఎవరి జోబులో బొమ్మలో మనకి ఇప్పుడు బాగా తెలుసు. దీన్ని ఏమనాలి? వీళ్ళందరి వెనుక ఉన్నది ఒక్కరే అన్నది అర్ధం కావడం లేదూ? అదే నకిలీ కణికుడి వ్వవస్థ. అందుకే ‘పాక్’ ని రక్షిస్తుంది. పాక్ ప్రజలని కాదు.

1965 నాటికి రష్యా గూఢచార సంస్థ కె.జి.బి.కి అంతర్జాతీయ మీడియాలో, ప్రపంచదేశాలన్నిటిలో అమెరికా సి.ఐ.ఏ.కి దీటైన సంస్థని పేరుప్రఖ్యాతులున్నాయి. ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో, The Second Lady, The Almighty, The Seventh Secret, The Miracle లాంటి Novels లోనూ ప్రఖ్యాత సినీ దర్శకులూ, నవలా రచయితలు కె.జి.బి., సి.ఐ.ఏ.ల నైపుణ్యాలనీ, సామర్ధ్యాలనీ పోటాపోటీలతో మరీ తెలియజెబుతూ ప్రసిద్ది కెక్కాయి.

అయితే 1990 లో గోర్బోచేవ్, ఎల్సిన్ ల డ్రామాలతో [ఒకరు ఇంకొకరిని బహిరంగంగా చిన్న పిల్లాణ్ణి గద్దించినట్లు గద్దించడం, ఆ భావ ప్రకటనలతో సహా అప్పటి టీవీ వార్తల్లో చూసిన వారికి గుర్తుండే ఉంటుంది.], 17 ముక్కలుగా మారిన USSR పరిణామంతో, ఎక్కడ ఆయుధాలు అక్కడే [అణ్వాయుధాలతో సహా] మాయం అయిపోవటంతో – ఇప్పుడు కె.జి.బి., సి.ఐ.ఏ. కి పోటీదారా లేకా సహకారా అన్నది తేటతెల్లమయ్యింది, గానీ అప్పటికి ఎవరైనా అనుమానించగలరా? అనుమానించినా బయటికి అంటే అంతర్జాతీయ మీడియా అన్నవారిపైబడి కాట్లాకుక్కలా చీల్చి చెండాడదూ?

ఇక తర్వాతి అంకం ఇందిరా గాంధీది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

analasys baagundi.

ఇన్నాళ్ళు భారత్ అంతర్జాతీయ ఒత్తిళ్ళకు తలొగ్గి, లాహోర్ వరకు వెళ్ళి వెనక్కు వచ్చేసారని అనుకుంటూ ఉండే వాడిని. వివరించినందుకు ధన్యవాదాలు.

అమ్మా! ప్రపంచం మొత్తం పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చినా అన్నిటినీ మించిన దైవశక్తి అనేది ఒకటుంది. అదే మన భారతదేశాన్ని రక్షిస్తుంది. దేవుడిచ్చేది పోదు,మనిషి ఇచ్చింది మిగలదు. మీ టపాలు చాలా ఆలోచినంపజేసేవి గా ఉన్నాయి.

Mee Vyasaalu Baagunnayi. Thanks

మీరు ఒక్కసారి ఈ వారం "స్వాతి"లో PVRK Prasadగారు రాస్తున్న "అసలేం జరిగిందంటే" శీర్షిక చూడండి. అందులో 1996లో అరెస్టయిన చంద్రస్వామి గారు అప్పటి అమెరికా అధ్యక్షుడికి lunch arrange చేసాడంట. అది అప్పటి అమెరికాలోని భారత కార్యాలయం వల్ల కూడా కాలేదు. అది ఒక్కసారి చూడండి.

ఈ మధ్య వ్యాఖ్యలు రాయకపోయినప్పటికినీ, నేను లేచిన వెంటనే మీ బ్లాగు చదవటంతోనే నా రోజు ప్రారంభం.
ఈ టపా ఎంతో ఉపయుక్తమైనది, ఎందుకంటే యుద్దమైందని తెలుసు గాని టాంకర్లు వదిలేసిన సంగతి మనం లాహోర్ వరకు వెళ్లిన సంగతి నాకు తెలియని విషయాలు తెలుసుకోవలిసిన వీషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

చాలా బాగుంది వివరణ.

"నువ్వు భారత ఇతిహాసాలని, సంస్కృతినీ విమర్శించు. వందమంది నీతో గొంతు కలుపుతారు. శ్లాఘించు. వందమందీ నిన్ను రాళ్ళిచ్చుకు కొడతారు. నీకు నేను చెప్పేది నచ్చకపోతే నీవూ ఓరాయందుకో’"
మన భారతీయుల రక్తమే అలాంటిది. చాలాదేశాల్లో పచ్చి నిజమయినా (ఉదా: సెప్టెంబరు 11 దాడుల్లో అమెరికా ప్రభుత్వానిదే ప్రధాన హస్తం అని ఇప్పుడు చాలమంది అమెరికన్లకు కూడా తెలుసు. అయినా సరే తమ దేశం గురించి చెడుగా చెప్పరు. ప్రతిపక్షాలు నోరు విప్పవు) అది తమ దేశానికి చెడ్డ పేరు తెచ్చేదయితే బయట చెప్పరు. కానీ మనము మాత్రం మాత్రం ఉత్సాహంతో ఉరకలేస్తూ చెప్తాము. మన రక్తమే అలాంటిది ఎందుకో!!

పొద్దున్నుంచి చూచిచూచి చాలైపొతొంది. ఇంకా ఎప్పుడు మీ తరువాతి టపా.

జీడిపప్పు గారు,

అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు అంటూ ఏం లేదండి. ఇది ప్రపంచవ్యాప్తంగా మీడియా మాయాజాలం. మీడియా ఎలా ప్రచారించదలుచుకుంటే అలాప్రచారిస్తుంది. అమెరికా ప్రజలు నోరు విప్పరని మీడియా అంటే ప్రజలు నోరు విప్పినా మీడియా ప్రచారించదు. ఇండియాలో ప్రజలు తమ సంస్కృతిని తామే వ్యతిరేకిస్తారనీ, అసలు మన సంస్కృతే చెత్తనీ రంగనాయకమ్మలూ, అరుంధతీ రాయ్ లూ అరుస్తారు. వీరెటూ మీడియా ఏజంట్లే కనుక దానికి ప్రజల పేరిట స్టాంపు కొట్టి మీడియా ప్రచారిస్తుంది. ఇదే కిటుకు ప్రపంచమంతటా అమలు చేయబడుతుంది. విభజించి ప్రచారించుటమే ఇందులోని మతలబు.

**********

Anonymous గారు,

నిన్నటి నుండీ మాప్రాంతంలో విద్యుత్ సరఫరా సరిగా లేదండి. ఆ అంతరాయమే నా టపాలో అంతరాయం కలిగించింది.

మీరిస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.

**********

Excellent writeup. Poor and illiterate Indians fall prey to those external forces repeatedly. Indian media is controlled and funded by missioanries and Marxists.

Any insignificant event(s) that is involved by Hindus become a major International news and propaganda against Hindus. For example Graham Stains incident in Orissa and recent Karnataka incident.

Caste infighting keep Hindus busy and the foreigners were ruling India for over 1000 years. Sonia single handedly ruling Indians.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu