8]. ఇటూ జగన్ ని పరిశీలించినా, కేవిపి ని పరిశీలించినా….. ఇద్దరూ కూడా అధిష్టానంతో తలపడితే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియని వారు కాదు. అందునా నెం.10 వర్గపు బలం ఏమిటో, గూఢచర్య నేపధ్యం ఏమిటో, ఇప్పటికి[అంటే వై.యస్. మరణం తర్వాత] మరికొంచెం ఎక్కువే అర్ధం అవుతుంది. అయినా ఘర్షణ ధోరిణితో ఎందుకు వెళుతున్నట్లు?

ఎందుకంటే రాజీ ధోరణిని నెం.10 వర్గము, కాంగ్రెస్ అధిష్టానము entertain చేయటం లేదు, చేయదూ గనుక! తమతోనే ’చర్లాట’లాడి, తమకి 4 ½ ఏళ్ళుగా ’బుస్సు’ కొట్టి, నెం.5 వర్గం చేతిలో తము ఇంతగా చిక్కిపోవటానికి కారకుడైన వై.యస్.ని బ్రతికి ఉంటే కూడా వదిలిపెట్టి [క్షమించి] ఉండేవాళ్ళు కాదు. ఇక అందులో ఇతోధిక పాత్ర వహించిన వై.యస్. మిత్రుణ్ణీ, పుత్రుణ్ణీ క్షమించే ప్రసక్తి, వాళ్ళతో రాజీపడే ప్రసక్తి, పోనీలే అనుకుని వదిలేసే స్థితీ అస్సలుండవు. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోయాక, తిరిగి ఎవరూ ఎవర్నీ నమ్మలేరు గనుక!

అదీగాక మరణించిన వై.యస్. ఇంకా ఏమేమి చేశాడో? తమకి చెప్పినవాటిల్లో నిజాలెన్నో? అబద్దాలెన్నో? వాటిల్లో ఎవరికి, ఎన్ని, ఎంతవరకూ చెప్పాడో? ఎవరెవరితో ఏమేం వ్యవహారాలు నడిపాడో? అతణ్ణి నమ్మి తాము ఏమేమి ఎత్తుగడలు వేసారో? వాటిల్లో ఇప్పుడు ఏవి ఎన్ని రకాలుగా తయారయ్యాయో, ఏఏ ఫలితాలని ఇచ్చాయో! వెరసి తామెంతగా దగా పడ్డారో, ఎంత నష్టపోయారో? ముఖ్యంగా డబ్బూ, కాలమూ ఎంతగా నష్టపడ్డారో? ఇవన్నీ తలచుకున్నప్పుడు వై.యస్. గనుక బ్రతికే ఉంటే, ఇప్పుడు తామే చంపేసేంతగా క్రోధం పెరిగిపోయింది. అలాంటి చోట ఆ ’చర్లాట’లో వాటా ఉన్న కేవిపిని గానీ, జగన్ ని గానీ Spare చేసే పరిస్థితి, చాలా చాలా తక్కువ. ఇక నమ్మే పరిస్థితి అయితే దాదాపు శూన్యమే!

ఈ స్థితిలో కేవిపి కైనా, జగన్ కైనా…. ఆత్మరక్షణ రీత్యా కూడా…. ఘర్షణ బాట తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణ పరమ హంస చెప్పిన కథ చెబుతాను.

అనగా అనగా…..

ఓ సారి ఓ గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఓ భార్యభర్తల జంట, ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంటి కప్పెక్కి కూర్చున్నారు. క్రిందంతా నీరు, పైన వర్షం, ఈదురు గాలి! మెల్లిగా వాన తగ్గుముఖం పట్టింది గానీ వరద తగ్గలేదు. చలిగాలి వీస్తోంది. అంతలో నీటిలో నల్లటి జంతు చర్మం ఏదో కొట్టుకుపోవటం చూశారు.

భార్య “ఏమండీ! ఏదో జంతువు చర్మం నీళ్ళల్లో కొట్టుకుపోతోంది. వెళ్ళి తీసుకురండి. చలికి వెచ్చగా కప్పుకోవడానికి పనికి వస్తుంది” అంది.

భర్త కూడా సరేననుకొని వరదనీటిలో ఈదుకుంటూ వెళ్ళాడు. తీరా వెళ్ళి చర్మాన్ని తాకితే అది వొట్టి జంతుచర్మం కాదు. నీళ్ళల్లో కొట్టుకుపోతున్న ఎలుగ్గొడ్డు. అప్పటికల్లా భార్య కూడా అది జంతుచర్మం కాదని, ఎలుగుబంటి అనీ గుర్తించింది.

ఆవిడ పెద్దగా కేక వేస్తూ “ఏమండీ! అది చర్మం కాదు. ఎలుగ్గొడ్డు. దాన్ని వదిలేసి వచ్చేయండి” అని అరిచింది. అప్పటికే భర్త ఎలుగుబంటితో పెనుగులాడుతున్నాడు. అతడంత కంటే పెద్దగా కేకపెడుతూ “నేను దాన్ని ఎప్పుడో వదిలేసాను. అదే నన్ను వదిలిపెట్టటం లేదు” అన్నాడట.

ఎలుగుబంటిని వ్యసనంతో పోలుస్తూ శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది. గూఢచర్యం కూడా ఎలుగుబంటి వంటిదే. ఒకసారి దాన్ని పట్టుకున్న వాణ్ణి [వాడు స్వార్ధపరుడైనా, నిస్వార్ధపరుడైనా] అది ఇక విడిచిపెట్టదు.

కాబట్టి కేవిపి కైనా, జగన్ కైనా…. నడిచినన్నాళ్ళు ’సందట్లో సడేమియా’ వంటి గూఢచర్యాన్ని నడిపి, సంపాదించుకున్నంత సంపాదించుకున్నాక, పరిస్థితులు తారుమారైనాయి గనుక ‘ఇక మానేస్తాం’ అంటే అటు నెం.10 వర్గమూ ఊరుకోదు, ఇటు నెం.5 వర్గమూ ఊరుకోదు. తమకే నమ్మకద్రోహం చేస్తాడా అన్న కారణంగా కూడా నెం.10 వర్గం ఊరుకోదు.

ఇప్పటి వరకైతే[Sep.27,2009] ఇదే కనపడుతుంది. ఇక ఏ కారణంగా అయినా స్ట్రాటజీ మార్చుకుంటే, అప్పుడు మారిన పరిస్థితుల్ని మనం పరిశీలించాల్సిందే! జరిగిపోయిన వాటిని విశ్లేషించగలం గానీ, జరగబోయే వాటిని ఊహించలేం కదా! కాబట్టే ఏం జరిగినా జరిగే వరకూ వేచి చూడక తప్పదు. ఇదే విషయం జనవరి, 2009లో వ్రాసిన నా టపా ’రాజ, రామోజీల యుద్ధం నిజమా? నాటకమా?’ లో కూడా వ్రాసాను.

ఇక ఇటు చూస్తే…. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్థులకి పిల్లలు వారసులౌతారు. అలాగే వారి పాప పుణ్యాలకు కూడా పిల్లలు వారసులే! అందుకే మన పెద్దలు ’మనం చేసిన మంచి, మన పిల్లలకి మంచి చేస్తుందనీ. చేసిన పాపం తరతరాలని అనుభవింపచేస్తుందనీ’ అంటారు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ఆ నమ్మకాలన్నిటినీ ’ట్రాష్’ అంటూ కొట్టిపారేయించి, అవహేళన చేసి, కొన్నిచోట్ల ఈ నమ్మకాలకి విపర్యయాలు జరిగేటట్లు చేసి, ఆయా సంఘటనలని విపరీతంగానూ, నిరంతరాయంగానూ ప్రచారించి, ’రోజులు మారిపోయాయి’ అన్న దృక్పధాన్ని ప్రజలలో పెంచింది.

‘తమ పాప పుణ్యాలు తరతరాలని ప్రభావపరుస్తాయి’ అన్న నమ్మకాలు ప్రజలలో దుష్ర్పవర్తనని కట్టడి చేసేవి. అవి కూలదోయబడటంతో అవినీతి ప్రవర్తన, నేరప్రవృత్తి బాగా పెరిగిపోయాయి. పైపెచ్చు ’ఒక్కరం పేట్రేగి సంపాదిస్తే, తర్వాత పదితరాలు హాయిగా బ్రతకుతాయి. కాబట్టి ఏ గడ్డి కరిచి సంపాదించినా సరే, డబ్బు సంపాదించటం ముఖ్యం!’ అంటూ తమ అక్రమార్జనకి ’పిల్లల మీదా, కుటుంబం మీదా ప్రేమతోనే, పిల్లల కోసమే ఈ తాపత్రయం’ అన్న పాజిటివ్ కాప్షన్ పెట్టుకోవటమూ మొదలయ్యింది.

ఈ కుహనా వాదనలని, ఆత్మవంచనలని నెం.5 వర్గం ఒప్పుకోదు. కాబట్టి కూడా వై.యస్. చేసిన ’పాపం’ ’అవినీతి’ల ఫలితాలకీ జగన్ వారసుడు గాక తప్పదు. అందునా, అందులో వాటా కూడా ఉన్నందున కేవిపికీ తప్పదు, జగన్ కీ తప్పదు. వారిద్దరికే కాదు, వై.యస్. నడిపిన ’సందట్లో సడేమియా’ లో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉంటే, వారంతా తమ తమ సువర్ణముఖిలు అందుకోక తప్పదు. వై.యస్. చేసిన వాటి పర్యవసానం జగన్ కి ఎందుకు చెందుతుందీ అంటే – అది మిగిలిన రాజకీయ నాయకులకీ, కార్పోరేట్ మదగజాలకి ఒక హెచ్చరిక అన్న మాట. తాము పోయినా, తమ వెనుకనున్న పిల్లలూ, మనుమలూ అనుభవింపవలసి వస్తుందన్న భయమే ఇప్పుడు యమదండమై నెం.10 వర్గంలోని పెద్ద ఏజంట్లందరి ముందూ నిలబడి ఉంది. అలా నిలబెట్టిది నెం.5 వర్గమే.

దీనికి ఉదాహరణగా భాజపా ఒకప్పటి యంగ్ టర్క్, ప్రముఖనేత ప్రమోద్ మహాజన్ గురించి చెప్పుకోవచ్చు. భాజపాలో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు [ఫైనాన్సియల్ లాబీయింగ్] నిర్వహించటంలో అతడు దిట్ట అని పేరు. ఎక్కడ ఏ అనుమానం పుట్టిందో గానీ, ’ప్రమోద్ మహాజన్ ని అతడి సోదరుడు ప్రవీణ్ మహాజన్ తుపాకితో కాల్చి చంపాడు’ అన్న పైకారణంతో[over leaf reason] అతడి కథ ముగించబడింది. దీని వెనుక ఉన్నది నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థే! కాబట్టే తమకి అత్యంత ముఖ్యుడైన అనుచరుడు, ఆ విధంగా హత్య గావింపబడినా, భాజపాలోని అగ్రనేతలెవరూ నోరు మెదపలేదు. ఏ ఆరోపణా చేయలేదు. హత్యోదంతంపై ఏ సందేహాలూ లేవనెత్తలేదు.

అంతేకాదు, ప్రమోద్ మహాజన్ హత్య చేయబడిన తర్వాత, అతడి కుమారుడు రాహుల్ మహాజన్ మాదకద్రవ్యాల కేసులోనూ, మరితర వివాదాల తోనూ రోడ్డున వెయ్యబడ్డాడు. భార్యతో విడాకుల కేసుతో మరింత అపకీర్తి పాలయ్యాడు. అలాగే అతడి కేరియర్ కూడా అంతే వేగంగా ముగిసిపోయింది. అయినా ఎవరూ మాట్లాడలేదు. మరో ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ మనుమరాలు అతి దారిద్ర్యంలో ఉండటం. అది చూడలేక కొందరు విరాళాలు సేకరించి ఆమెకు సాయపడ్డారు.

దీని వెనుక ఏ గూఢచర్యం ఉంటేనేం, తండ్రి పాపపుణ్యాల తనయునకూ చెందటమే ఇక్కడ నడిచిన స్ట్రాటజీ! మన’కర్మ’ల ఫలితాన్ని, ఈ జన్మలోనూ, జన్మాంతరాల్లోనూ పొందుతారన్నది భారతీయుల నమ్మకం.

9]. ఇక కేవిపి ఢిల్లీలో లాబీయింగ్ వ్యవహారంలో…. ‘తాము ఎవ్వర్నీ ఢిల్లీకి పిలవలేదనీ, అతడే వచ్చాడనీ’ వీరప్ప మొయిలీ అన్నట్లు 09/09/09 పత్రికల్లో వచ్చింది. సెప్టెంబరు 7 నుండి 10 వ తేదీ వరకూ కేవిపి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా పెద్దతలకాయల్ని కలవటంలో మునిగిపోయాడు. మొదటగా ’స్నేహితుడు మరణించినపుడు, అతడి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి’ వచ్చాడన్న పైకారణంతో సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరగా, మొదట అహ్మద్ పటేల్ నీ, మరొక నేత ?] ని కలిసిన తర్వాత రావల్సిందిగా చెప్పబడిందట.

ఈ విషయం ఆంధ్రజ్యోతి వ్రాసింది. షరా మామూలుగా ఈనాడు, వార్తల్ని దాయటం, పెంచి లేదా తగ్గించి వ్రాయటం, వీలయినంత వక్రీకరించి వ్రాయటం…. చేస్తుంది కాబట్టి, ఈ వార్త ఈనాడులో రాలేదు. ప్రధానమంత్రితో 45 నిముషాలు, 10 జనపధ్ లోకి సాయంత్రం 4.50 కి వెళ్ళి 6.30 తిరిగి రావటం ఇత్యాది విశేషాలున్నా ఈ ’జోరుగా లాబీయింగ్’లో, అంత సుదీర్ఘ సమావేశాల్లో కేవలం ’వై.యస్. కుటుంబసభ్యుల క్షేమం గురించిన ఆరా మాత్రమే ఉందా? అంత Concern ఉంటే తర్వాత ఆ కుటుంబం పట్ల డీల్ ఇలా ఉంటుందా?

’వై.యస్. సతీమణి షాక్ నుండి తేరుకున్నారా? సాధారణ జీవితంలోకి వచ్చారా? మీరు వారికి పూర్తి సహాయసహకారం అందించండి’ అని చెప్పారు. ‘రాష్ట్రరాజకీయాల గురించి వివరాలడిగారు. నేను నాదగ్గర ఉన్న సమాచారం ఇచ్చాను’ అని కేవిపి విలేఖరులకి చెప్పాడు. ప్రధానమంత్రుల Appointments 5 నిముషాలు, 10 నిముషాలు దొరికితే ఎక్కువ. అలాంటిది, అంత సుదీర్ఘ సమయం పాటు ఇచ్చిన Appointmentsలో కేవలం వై.యస్. సతీమణి ఆరోగ్యం గురించి అడగటానికి పట్టే సమయం మహా అయితే 2 నిముషాలు లేదా 5 నిముషాలు. రాష్ట్ర రాజకీయాల గురించి సైతం, ఇతడొక్కడినే ఎందుకు అడుగుతారు? ఒక్కరినే అడిగితే ఆ ఒక్క కోణంలోని విషయాలే కదా తెలుస్తాయి? ఎవరినడిగితే వాళ్ళు, తమ వెర్షన్ మాత్రమే చెబుతారు కదా!

కాబట్టే కదా కాంగ్రెస్ వారికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని మార్చాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా, కేంద్రం నుండి పరిశీలకులు వస్తుంటారు? మరి కేవలం కేవిపి నుండి ఏం సమాచారం తీసుకుంటారు? సమాంతరంగా పొన్నం ప్రభాకర్, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు గట్రా గట్రా బృందాలు వెళ్ళినా, వాళ్ళు జగన్ జిందాబాద్ అనే…. గట్టిగానో, నెమ్మదిగానో చెప్పారని వార్తలొచ్చాయి. వై.యస్. బ్రతికి ఉన్నంత వరకూ అధిష్టానం అతడికిచ్చిన సీన్ చూసి, అతడు పోయిన తొలి రోజుల్లో నడిచిన వ్యవహారాలు చూసి, అధిష్టానం వై.యస్.కి Favorable అనుకొని, ప్రమాదం యాదృచ్చికం అనుకొని, ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పి.లూ, ’జగన్ జిందాబాద్’ అంటూ అరిచి కేకలు వేసారు. మంత్రుల్లో చాలామందిదీ ఇదే కేసు.

కాకపోతే అందరిలో, తమ పెట్టుబడులూ, ఆదాయాలు గురించిన ఆందోళన కూడా ఉంది. తీరా అధిష్టానపు వైఖరి చూసాక మెల్లిగా గొంతులు తగ్గిపోయాయి. ఆపైన ’అధిష్టానం ఏం చెప్పినా ఒకే. మేం శిరసావహిస్తాం’ అనేసారు. ‘అధిష్టానాన్ని ఎదిరిస్తే ఫ్యూజులు లేచి పోతాయ్’ అని తెగేసారు. ఇక ‘కేవిపి ని మేం పిలవలేదూ, అతడే వచ్చాడు’ అని మొయిలీ చెప్పినట్లు సెప్టెంబరు 9 న పత్రికల్లో వచ్చింది కదా! అయితే వై.యస్. సంతాప సభకోసం సెప్టెంబరు 11 న హైదరాబాద్ బయలు దేరిన కేవిపిని, శనివారం అంటే 12 కల్లా అందుబాటులో ఉండమని ఆదేశించారని కూడా పత్రికల్లో వచ్చింది. తాము పిలవకుండా కేవిపినే, మిత్రుడి కుమారుడి కోసం లాబీయింగ్ చేయటానికి వస్తే ’అందుబాటులో ఉండాలనే ఆదేశాలెందుకు’ వస్తాయి?

అంటే – ఏకే ఆంటోనీ, ప్రణబ్, మొయిలీ, అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీలని కలిసి విడతల వారిగా జరిపిన సుదీర్ఘ చర్చలలో ఏం జరిగింది?సమాచార సేకరణ అంటే ఇంటరాగేషనేనా?

10]. అక్కడ చర్చలు జరిపిన కేవిపి, హైదరాబాదు కి వచ్చి… విలేఖరులతోనూ, తమ మద్దతుదారులైన మంత్రులూ, ఎం.ఎల్.ఏ.లతోనూ, “జగన్ కి అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు. ఏమైనా అధిష్టానం చేతుల్లోనే ఉంది” అంటూ ప్రకటించినప్పుడల్లా…. సమాంతరంగా మనీష్ తివారీ, అభిషేక్ సింఘ్వీ, జయంతీ నటరాజన్ వంటి ఏఐసిసి ప్రతినిధులు, పత్రికావిలేఖరులతో ’ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రివర్గం ఉంది, పటిష్టమైన ప్రభుత్వం ఉంది’ అని ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగాయి. దీన్నే ’బెదిరింపు ధోరణి’గా తర్వాత ప్రచారం జరిగింది. రాజీ సూత్రాల గురించి కూడా వార్తలొచ్చాయి. అయితే ‘అధిష్టానం ఆలోచన కేవిపి చెవిలో’, ‘ఏం జరిగినా జగన్ ప్రత్యక్ష జోక్యం తోనే’ వంటి, ‘జగన్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న’ వార్తలు కొన్ని పత్రికలలో వచ్చాయి. ’ఏం లేదు. అధిష్టానం జగన్ కు అనుకూలంగా లేదు’ అని కొన్ని పత్రికల్లో.... ఇలా పరస్పరం విరుద్ధ వార్తాలు ప్రచారం అయ్యాయి.

అంతేకాదు, హెలికాప్టర్ ప్రమాదంలోని సివిఆర్ విశ్లేషణ గట్రా సాంకేతిక అంశాల విషయంలో లాగానే, జగన్ విషయం లో కూడా, ఒకే పత్రికలో సైతం ఈ రోజు వచ్చిన వార్తకు విరుద్దంగా మర్నాటి వార్తలు వచ్చాయి. ఇదంతా ఎంతో గందరగోళాన్ని…. ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో సృష్టించింది. పనిగట్టుకుని మీడియా ఎందుకిలా పరస్పర విరుద్ధవార్తలు ప్రచారించింది? దాని వెనుక ఏదో ప్రయోజనం ఉండాలి కదా? పోనీ ‘మీడియా ఏ విషయంలోనైనా ఇలాగే రకరకాలు వార్తలు ప్రచారించి డబ్బు చేసుకుంటుంది’ అనుకోవడానికి, వై.యస్.ని ’దేవుణ్ణి’ చేసేటప్పుడు, మీడియా మొత్తం కోరస్ గానే చేసింది కదా?

11]. ఇక మొయిలీ లాంటి సీనియర్ల ప్రవర్తన కూడా అసహజంగానే ఉంది. 3 వ తేదీ వై.యస్. మరణ వార్త ధృవీకరణ అనంతరం, రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో మొయిలీ ’ఇది రాజ్యాంగ అవసరాల దృష్ట్యానే. తర్వాత సి.ఎల్.పి. సమావేశం ఉంటుంది’ అని చెప్పాడు. నాల్గవ తేదీ వై.యస్. అంత్యక్రియల తర్వాత, అతడు ఢిల్లీ తిరిగివెళ్ళిపోయాడు. Sep. 6 వ తేదీ ఆదివారంనాడు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సోనియాగాంధీతో అతడు అత్యవసర భేటీ జరిపాడు. అదే సమయంలో ‘మీడియా కి దూరంగా ఉండమని మేడం ఆదేశం. అందుచేత మీడియాకి మొహం చాటేసిన మొయిలీ!’ గురించి వార్తలొచ్చాయి.

‘Money makes many things!’ అన్నది జగమెరిగిన సత్యమే! రాజకీయాల్లో ప్రవేశించి, టిక్కెట్లు కొనుక్కుని, ఆ పైన ఖర్చుపెట్టి ఎం.ఎల్.ఏ., ఎం.పి. లయ్యేది – మంత్రులయ్యేందుకు, తిరిగి సంపాదించుకునేందుకే. ఎందుకంటే అన్నీ వ్యాపారాల కంటే రాజకీయ వ్యాపారం లాభదాయకం, మిగిలిన వ్యాపారాలకి ఆధారభూతం. కాబట్టి “వై.యస్. ఆడిన ’సడేమియా’ నాటకంలో ’డబ్బు తినేసి’ మొయిలీ కూడా తమకేమైనా ’బుస్సు’ వేసాడా?" అన్న అనుమానం అధిష్టానానికి రావటం సహజం. అతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మరి! కాబట్టే అతడి మీద ఆధిష్టానం ఆగ్రహం వెలిబుచ్చిందన్న వార్తలొచ్చాయి. అలాగే కోర్ కమిటీ మీటింగ్ కి అతడికి పిలుపు రాలేదన్న వార్తలూ వచ్చాయి.

12]. మరో ప్రక్క వై.యస్. ’సడేమియా’ లో భాగంగా, తనకు ఫలానా ఫలానా వారు ఇబ్బంది కలిగిస్తున్నారంటే…. నిజమేననుకుని తామే కొందర్ని నలగ్గొట్టారు. అలాంటి వారిలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఒకడు. అందుకే అతడికి 2009 ఎలక్షన్లలో ఎం.పి. టిక్కెట్ రాలేదు. రాజ్యసభకీ, అందునా తక్కువ కాలపరిమితి ఉన్న సీట్ కీ వెళ్ళాల్సి వచ్చింది. [ఇదే వ్యక్తి 2004లో కాంగ్రెస్ గెలవగానే, తనకిక సీన్ వస్తుందనుకొని అలకలు పోవడం గురించి, ‘భారత రాజకీయరంగంపై నకిలీ కణికుడి సుదీర్ఘ కుట్ర’లో వివరించాను] అంతేకాదు, వాకాడు సమీపంలో చావు అంచుదాకా వెళ్ళి వచ్చాడు. [నక్సల్స్ ల్యాండ్ మైన్ పేల్చారు. నిజానికి నక్సల్స్ హైకమాండ్ లో దాదాపుగా కీలక వ్యక్తులందరు తెలుగువారే. ఇది ఎలా సాధ్యం? అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా నక్సల్స్ ను కట్టడి చేయలేని ఆంధ్రప్రభుత్వం వై.యస్. హయాంలో నక్సల్స్ ను రాష్ట్రం నుండి తరిమేసి, కొందరి నక్సల్స్ ను చంపించి, మొత్తానికి హీరో అయ్యాడు. ఇదెలా సాధ్యం?] ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్న నేదురుమల్లి, అర్జంటుగా ఢిల్లీ నుండి పిలుపురాగా, ఆఘమేఘాల మీద Sep.16 న ఢిల్లీ వెళ్ళాడు.

ఆంధ్రజ్యోతి వ్రాసిన, డి.డి.[సప్తగిరి] ప్రసారం చేసిన, ఈ వార్త ఈనాడులో కనబడలేదు. ఎందుకంటే ఈనాడు వార్తల్ని ప్రజల కోసం వ్రాయదు. ప్రతీ వార్తని…. వక్రీకరించో, దాచో, పెంచో, తగ్గించో, ఏమైనా సరే, నియంత్రించి వ్రాయటంలో ఈనాడు ప్రయోజనాలు ఈనాడువి. నకిలీ కణిక వ్యవస్థలోనూ, నెం.10 వర్గంలోనూ కీలక వ్యక్తి అయిన రామోజీరావు తన స్ట్రాటజీలకి అనుగుణంగానే ప్రతీ అక్షరమూ వ్రాయిస్తాడు. ఇంతకీ నేదురుమల్లిని ఢిల్లీ పిలిపించింది ఎందుకంటే…. వాస్తవాలని తెలుసుకోవటానికి. వై.యస్. అప్పుడు చెప్పిన కథని, ఇప్పుడు నిర్ధారణ[Triangulate] చేసుకోవడానికి!

13]. ఇదే కేసు కే.కే. ది కూడా! ఈ రాజకీయ నాయకుడికి అరిషడ్వర్గాలు, అహంకారాలు ఎక్కువే. Off course, ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో అత్యధికులు ఇలాంటివాళ్ళే! కోపం నరం తెగిపోవటానికి, వీళ్ళకేమీ ’సందట్లో సడేమియా’ నడిపే పరిస్థితులు లేవు. అలా పరిస్థితులు కలిసి రావు కదా! ఇక ఇలాంటి వారి కుమారులు కూడా, తమ తండ్రుల కున్న పరపతి రీత్యా, తండ్రుల నుండి పుణికి పుచ్చుకున్న వారసత్వాల రీత్యా, అరిషడ్వర్గాలనీ, అహంకారాలనీ బాగానే తలకెక్కించుకుంటారు.

అందునా వై.యస్. చేత ప్రేరిపితులైన అధిష్టానం, నలగ్గొట్టిన మరో నాయకుడు కె.కె. దాంతో ఈ కుటుంబానికి ఉన్న వ్యాపారాలలో[Real Estates etc.] ఒత్తిళ్ళకి తక్కువేం లేదు. ఇక వ్యాపార భాగస్థులు ఆక్రమ సంబంధాలు, అక్రమార్జనలూ గలవాళ్ళు. వాళ్ళమధ్య వైషమ్యాలూ మామూలే. ‘వెనుక మేమున్నా మని’ భరోసా ఇస్తే, ’పిసిసి ప్రెసిడెంట్ కుమారుడవైతే నాకేంటి?’ అనే రెచ్చగొట్టే ధోరణి భాగస్థుల్లో కనిపించేటట్లు చేయడం సులభం. ఇటు కె.కె. కుమారుడిలో ‘పిసిసి ప్రెసిడెంట్ కొడుకుని. నన్నే లెక్కచెయ్యవా?’ అనే అహంకారాన్ని రెచ్చగొట్టటం మరింత సులభం. వెరసి ఓ అనుభవం లేని, గూఢచర్యం తెలియని, పిసిసి అధ్యక్షుడి కొడుకుని హత్యకేసులోకి దింపటం నెం.10 వర్గానికి పెద్ద విషయం కాదు. అప్పుడు వై.యస్.ని నమ్మి, అతడి కోసం కె.కె.ని నలగ్గొట్టారు. ఇప్పుడందులో వాస్తవాలని తెలుసుకునేందుకు, అంటే నిర్ధారణ[Triangulate] చేసుకునేందుకు కె.కె.ని దగ్గరికి తీసారు. ఆ ’హల్ చల్’నే కె.కె. చూపిస్తున్నాడు.

14]. ఇలాంటి నలుగుడుకి గురయ్యే మర్రి శశిధర రెడ్డి సైలెంటైపోయాడు. ఒత్తిడికి గురై పిజేఆర్ గుండెపోటుతో మరణించాడు. అతడి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చేటప్పుడు తనకు సాగిలపడేటట్లు చేయించుకున్నాడు వై.యస్.!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి!
ఆకలి కొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ
లాలించి పాలించే భ్రమరాంబ
తప్పు చేస్తే దండించే దుర్గ
మహిషాసురులని మర్ధించే మహంకాళి
అమ్మలగన్న యమ్మ, మేటి పెద్దమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ
మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని,
మనకన్నిటా విజయాల్ని ప్రసాదించాలని
కోరుతూ……

అందరికీ దసరా శుభాకాంక్షలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

అనుకూల, ప్రతికూల వాతావరణాలని ప్రపంచమంతా గాకపోయినా, కొంత పరిమిత పరిధి మేరకు ప్రభావపరచటం – అన్న ప్రక్రియ గూఢచర్యంలో భాగమే. కనుక, హెలికాప్టర్ ప్రమాదంలో నెం.5 వర్గపు ప్రమేయాన్ని, నెం.10 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావులు తోసిపుచ్చలేకపోయారు. అయితే నిందించనూ లేరు, నిరూపించనూ లేరు. నిందించాలంటే నెం.5 వర్గపు అస్థిత్వాన్ని ప్రకటించాలి, బాహాటంగా అంగీకరించాలి. అలా చేయటం అంటే తమని తాము ప్రకటించుకున్నట్లే. మరోమాటలో చెప్పాలంటే తమ ఓటమిని అంగీకరించినట్లే.

ఇందులో ఉన్న ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీ ఆసక్తికరమైనది. నెం.5 వర్గపు ఉనికిని అంగీకరిస్తూ, బాహాటంగా ప్రకటిస్తే తమ ఉనికినీ ప్రకటించుకున్నట్లే! అంటే ఇప్పటి వరకూ నెం.10 వర్గంగా తము చేసిన పనులు బయటకి వస్తాయి. అప్పుడు ప్రజలందరికి గూఢచర్యం గురించి అవగాహన వస్తూంది. ప్రజలలో అవగాహన వస్తే, తము నడిపే దోపిడి సాగదు. ఆ రీత్యా తమ ఓటమిని అంగీకరించినట్లే. ఇది కన్నుని వదిలేసుకోవటం వంటిది. అంచేత ఈ కన్నుని, అంటే నిందించటమూ, నిరూపించటమూ కూడా మానేసుకుని గూఢచర్యాన్ని కొనసాగిస్తూ పోతే, ఈ Expose, ఈ సువర్ణముఖిలు కొనసాగుతూనే ఉంటాయి.

దానికి తోడు ఇప్పుడు కొత్తగా బయటపడిన YSR అనే ఈ అనుచరుడి ’సందట్లో సడేమియా’ వంటి భాగోతాలు బయల్పడటం ప్రారంభమైతే, నెం.5 తమని ఎంతగా ’దద్దమ్మల్ని’ చేసి కూర్చోబెట్టిందో, అందరికీ [అనుచరవర్గానికి] అర్ధమైపోతుంది. దాంతో తాము తమ అనుచరులకి మరింత చులకన అయిపోతారు. ఒకర్ని చూసి మరొకరు, ’ఫలానా వాడు చర్లాటలాడితే ఏం చెయ్యగలిగారు? మనం అనవసరంగా భయపడుతున్నాం’ అనుకొని….. ఇలా ఒకరికి మరి కొందరు, ఇంకా కొందరు తయారౌతారు. క్రమంగా తమ నెట్ వర్క్ మొత్తం కూలిపోతుంది. ఇది కాలుని వదిలేసుకోవటం వంటిది. ప్రస్తుతానికి కాలు వదిలేసుకున్నా….. తర్వాత కన్ను వదిలేసుకోకతప్పదనీ, ‘పిసినారి ధనయ్య’ వంటి నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావూ వరుసగా అన్ని శిక్షలూ అనుభవిస్తారనీ మీరు గతంలోనే పరిశీలించారు. ఈ నేపధ్యంలో నిందించటమే చెయ్యని చోట ఇక నిరూపించటం ఎలా సాధ్యం?

ఈ రీత్యా, హెలికాప్టర్ ప్రమాదం విషయంలో, తేలు కుట్టిన దొంగల్లా ఊరుకోవాల్సి వచ్చింది. అంతేగాక పైకారణంగా[over leaf reason] ఇద్దరి[రాజ, రామోజీరావులూ] మధ్య తగాదా డ్రామా వల్ల, హఠాత్తుగా ఒకరు[YSR] చనిపోయినప్పుడు, రెండోవ్యక్తిని అందరూ X-Ray కళ్ళతో గమనిస్తారు. అందుకోసం మీడియా, కాంగ్రెస్ అధిష్టానం, అందరూ కలిసి, రామోజీరావు రక్షణ కోసం ’చచ్చినోడి కళ్ళు కిలోమీటర్లు’ అనాల్సి వచ్చింది. అతణ్ణి అర్జంటుగా దేవుణ్ణి చేయాల్సి వచ్చింది. తదుపరి వ్యూహరచన కోసం సమయం gain చెయ్యాల్సి వచ్చింది.

తనకి ఎదురేలేదన్న ధీమాతో, విలాసపు నడకలూ, విపరీత హావభావాలు, ’కోపం నరం తెగిపోయిన వెకిలి నవ్వులూ’ ఒలికించిన YS భౌతిక దేహం, ముక్కలు చెక్కలుగా ఛిద్రమై, అతిదారుణమైన మరణాన్ని పొందటం ఒక ఎత్తైతే, ఆ విషయం, ప్రమాదం జరిగిన నాలుగైదు గంటల్లోనే తేలిపోయినా, ప్రపంచానికి రహస్యంగానే ఉంచి, తాము ఎత్తు పై ఎత్తులు ఆలోచించవలసి రావటం మరో ఎత్తైంది. పర్యవసానంగా ఇప్పటి వరకూ, తమ కళ్ళ ఎదురుగా మసలిన వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలై, అడవిలో, అనాధ మాదిరి, కాలి, వర్షానికి తడిసి, ఉబ్బి, కౄరమృగాల మధ్య దిక్కూమొక్కు లేకుండా పడి ఉండటం, పడిఉండవలసి రావటం, పడవేసి ఉంచవలసి రావటం…. విధి, గూఢచర్యం ఎంత కౄరమో కళ్ళముందు నిలబెట్టింది. అయితే ఈ స్థితిని అనుభవించింది కేవలం నకిలీ కణికవ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలకవ్యక్తులైన రామోజీరావు, సోనియాగాంధీ మరికొందరు కేంద్రంలోని ముఖ్యమైన మంత్రులూ మాత్రమే!

గూఢచర్యపు కౄరత్వం తాము ఇతరుల మీద ప్రయోగించినపుడు తమకేమీ అన్పించలేదు. అది ఇప్పుడు తమ మెడమీదకు వచ్చేసరికి అదెంత కౄరమో ఇప్పుడర్ధమైంది. ఇప్పటి దాకా తమలో ఒకరుగా లేదా తమ వంటివాడే అయిన వై.యస్. భయంకర మరణం, వ్యక్తికన్నా వ్యవస్థ ఎంత బలమైనదో తమదాకా తెచ్చి చూపించినట్లయ్యింది. ఇప్పటివరకూ తమ గూఢచర వ్యవస్థ ఇతరులతో ఆడిన ఆట ఇది. దాంతో మొదలైన ప్రాణభీతికి ప్రారంభ చర్యే ఎకానమీ క్లాస్ ప్రయాణం. పొదుపు పైకారణం[over leaf reason].

వై.యస్. మరణించిన సెప్టెంబరు 2 వ తేదీ, ఆ తర్వాత 24 గంటలూ నెం.10 వర్గానికి అతణి మరణ కారణపు పరిశోధనా, తదుపరి వ్యూహరచన తోనే సరిపోయింది. ఎందుకంటే ముందుగా ముంచుకొస్తున్న పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాలి గదా! ఆ తదుపరి సెప్టెంబరు 7 వ తేదీ రాత్రి నుండి ప్రారంభమైన కేవిపి ఇంటరాగేషన్ తో గానీ, వై.యస్. ఎంతగా తమతో ’చర్లాట’ లాడాడో, ఎంత బుస్సు కొట్టాడో, తమని ఎంతగా గోతిలో పడేసాడో అర్ధం కాలేదు. అందుకే సోనియాగాంధీలో జగన్, కేవిపిల పట్ల క్రోధం పెరిగిపోయింది.

మరో సువర్ణముఖి ఏమిటంటే – ’సందట్లో సడేమియా’ స్ట్రాటజీ! ఇంతకు ముందు టపాలలో వివరించినట్లు, దాదాపు 350 ఏళ్ళకు పైగా, ఏడెనిమిది తరాలుగా, నకిలీ కణికులు క్రమంగా వృద్ది చెందుతూ, క్రమంగా మెరుగు పరుచుకుంటూ నిర్మించిన నెట్ వర్కే – ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు బ్రిటీష్, తర్వాత కేజిబి, తదుపరి సిఐఏ+ఐ.ఎస్.ఐ, ఇప్పుడు ముస్లిం తీవ్రవాదం గట్రాగట్రా పైముఖాల[over leaf reasons] చాటున ఏర్పడిన నకిలీ కణిక వ్యవస్థ. దాన్నే నకిలీ కణికుల గూఢచార వలయంగా గతటపాలలో పరిచయం చేశాను. ఒకో ’ఎరా’లో ఒకో పైముఖం [కేజిబి, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ. గట్రా] వేసుకుని ‘సందట్లో సడేమియా’ గా అనువంశిక నకిలీ కణికులు తయారు చేసుకున్నదే నకిలీ కణిక వ్యవస్థ! అయితే దీన్ని సిద్దించుకోవటానికి అనువంశిక నకిలీ కణికులకి ఏడెనిమిది తరాలు, మూడున్నర శతాబ్ధాలూ పట్టింది. ఈ క్రమాన్ని గతంలో ప్రచురించిన టపాల మాలికలో వివరించాను.

ఇక్కడో ఆసక్తికరమైన ఉదాహరణ చెబుతాను. ఇటీవల వచ్చిన ’ప్రయాణం’ సినిమా కొందరైనా చూసి ఉంటారు. అది కేవలం వినోదార్ధం తీసిన సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోం. కానీ అందులోనూ ఒక ఆసక్తికరమైన స్ట్రాటజీ ఉంది. మామూలుగా మూడేళ్ళో, కనీసం ఆరునెల్లో నడిచే ఓ ప్రేమకథని, [హీరో, హీరోయిన్ ని impress చేసి ప్రేమకు అంగీకరింప చేసుకోవటం]విమానం ఆలస్యమైన మూడుగంటల వ్యవధిలో పూర్తి చేయాలి. అందుకోసం హీరో, అతడి స్నేహితుడు ఓ ప్రేమకథలోని అంకాలని విభజించి, Time bound తో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. చివరికి విజయం సాధిస్తారు. సరిగ్గా ఇదే స్ట్రాటజీని నెం.5 వర్గం, నెం.10 వర్గానికి Apply చేసింది. ఇప్పుడు క్రింది విషయాన్ని పరిశీలించండి.

నెం.5 వర్గం, నెం.10 వర్గానికీ అందులోని కీలక వ్యక్తి రామోజీరావు కీ ’సందట్లో సడేమియా’ అన్న స్ట్రాటజీ, తమకే అనువర్తింపబడితే ఎలా ఉంటుందో ఈ నాలుగున్నరేళ్ళలోనే వై.యస్. రూపేణా చూపించింది. ఎదుటి వాళ్ళు నమ్మితే అదెంత సులభమో చూపించింది. ఆపాటి స్ట్రాటజీ చేయడానికి ఓ పెద్ద మేధస్సేమీ అక్కర్లేదని చూపించింది. గతంలో తనకు ఎదురు తిరిగిన వాణ్ణి ముఠాకక్షల పేరిట, ఫ్యాక్షనిజం పేరిట ప్రాణాలు తీసేయటమే తప్ప బుర్ర ఉపయోగించటం తెలీని ఓ ఛోటా రాజకీయనాయకుడు వై.ఎస్. తము ’సీన్’ ఇస్తే బలపడిన వాడు. తీరా తాము నమ్మితే, తమకి తెలియకుండా తమ గూఢచర్యపు దారిలోంచే ’సందట్లో సడేమియా’ నడిపాడు. ఇది ఇతరులకి తము Apply చేసిన స్ట్రాటజీ. అప్పడది తమ తెలివితేటలుగా, తమ గూఢచర్య జ్ఞానంగా కనబడింది. అదే ఇప్పుడు తిరిగి తమకి Apply చేయబడితే? చేసిన ’కర్మ’ అనుభవించటం ఎలా ఉంటుందో తెలియచేసింది. అందునా తాము తరాల కొద్దీ, శతాబ్ధాల కొద్దీ అందుకు కృషి చేస్తే, అది అత్యల్ప సమయంలో తమకి Apply చేయబడటం, చాలా సులభంగా తాము ఆ గోతిలో పడటం! దాంతో మెదళ్ళతో యుద్ధం ఎలా ఉంటుందో కూడా అర్ధం అవుతోంది.

నిజానికి సెప్టెంబరు 2 వతేదీ మొదలు కొని ఇప్పటివరకూ జరిగిన అనేక సంఘటనలకి, వివిధ నేపధ్యాలున్నాయి. కాబట్టి ముందుగా వై.యస్. నడిపిన ’సందట్లో సడేమియా’ ను నిరూపించే తర్కాన్ని, సంఘటనలని ముందుగా వివరిస్తాను.

1]. సెప్టెంబరు 2 వతేదీ ఉదయం 9.35[?] కల్లా, వై.యస్. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో సంబంధాలు లేవని ATC అధికారులు తెలియజేసారు. అయినా 12 గంటల తర్వాత గానీ అధికారికంగా గాలింపు చర్యలకు ఇతర హెలికాప్టర్లు బయలు దేరలేదు. మరి 11 గంటల సమయంలో నల్లకాల్వ వద్ద పశువుల కాపర్లు చూసిన హెలికాప్టర్ ఎవరిది?

2]. 12 గంటల తర్వాత దాదాపు 7 హెలికాప్టర్లు బయలుదేరి ప్రతికూల వాతావరణ పరిస్థితుల రీత్యా వెనుదిరిగి వచ్చాయి. 11+ హెలికాప్టర్లు, 5000 మంది పైన సిబ్బందీ, పడి వెదికినా, సుఖోయ్ విమానాలు, ఇస్రో విమానము, అమెరికా సాయం కోరడం…. ఇంత హడావుడి జరిగినా, జాడ కనుక్కోవడం అన్న ’పని’ మాత్రం సాధ్యపడలేదు. అయితే అంతర్జాతీయంగా ఇది చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఇంతగా అభివృద్ది చెందిన సాంకేతికత, బలమైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సుశిక్షితులైన సైన్య సిబ్బంది ఉండీ, ఎంతగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, జాడ తెలియకుండా పోయిన ఒక హెలికాప్టర్ ఉనికిని కనిపెట్టలేకపోయారు. ఈ లెక్కన ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అదనుగా తీసుకుని, ఏ పొరుగుదేశాలో భారతదేశమ్మీదికి దురాక్రమణకి దిగితే ఈ ప్రభుత్వాలు ఇంతే అసమర్ధంగా పనిచేస్తాయా? పోనీ అంతగా అసమర్ధ ప్రభుత్వమే అనుకుందాం, మరి సోనియా, చిదంబరంలకు హెలికాప్టర్ కూలినరోజే జాడ తెలిసిందేమో ననీ అనుమానాలు ఎలా వెల్లడి అయినట్లు? [సెప్టెంబరు 4, ఈనాడు 12 పేజీ]

3]. బుధవారం, సెప్టెంబరు 2వ తేదీ హెలికాప్టర్ మిస్సయ్యింది. రాత్రంతా సోనియా గంటగంటకూ సమాచారం తెలుసుకుంటూనే ఉంది. గురువారం హైదరాబాద్ కు సోనియా రావచ్చుననీ రోశయ్య తెలిపిన వార్త గురువారమే పత్రికల్లో వచ్చింది. [అంటే వై.యస్. తప్పిపోయినరోజే (బుధవారమే) ఆ వార్త పత్రికా ఆఫీసుకు చేరాలి]. క్షేమంగా వస్తాడని ఆశిస్తున్నప్పుడు గురువారం హైదరాబాద్ రావాల్సిన పనేముంది? క్షేమంగా వచ్చిన వై.యస్.ని ఫోన్ లో క్షేమ సమాచారాలు అడగవచ్చు లేదా వై.యస్. తర్వాత ఎటూ ఢిల్లీ వస్తాడు. ఇక గురువారం, సెప్టెంబరు 3, ఉదయం మృతుల్ని కనుగొన్నారు. హైదరాబాద్ కు తరలించారు. శుక్రవారం సెప్టెంబరు 4, ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, వై.యస్. మృతికి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. ’దార్శనికుడు’, ’మార్గదర్శి’ అన్న పదప్రయోగాలతో మరీ సంతాప సందేశం వ్రాసారు ఏఐసిసి అధినేత్రి , ఆమె కుమారుడు.

4]. అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 3 వ తేదీ సాయంత్రం, విలేఖరుల సమావేశంలో వై.యస్. మృతి గురించి మాట్లాడుతూ, గద్గత స్వరంతో కన్నీటి పర్యంతమైంది. అంతగా తమ పార్టీ సహచరుడి మరణానికి కదిలిపోయిన నాయకురాలు వారం తిరక్కుండానే సదరు ’పార్టీ సహచరుడి’ కుమారుణ్ణి ఎత్తికొట్టేసిందేం? ఎంతగా తమను బెదిరించ ప్రయత్నిస్తున్నడన్నా, ఎంతగా అహం దెబ్బతిన్నది అనుకున్నా…. 60 ఏళ్ళు దాటిన తనకు 40 ఏళ్ళు నిండని ’జగన్’ అనే ఈ కుర్రవాడు, తన కుమారుడు రాహుల్ గాంధీ వంటివాడే కదా! తండ్రిపోయిన ఆశనిపాతం, దిగ్ర్భాంతిలతో ఏర్పడ్ద భద్రతా రాహిత్యమూ, భవిష్యత్తు పట్ల భయములతో ఉండి ఉండచ్చు అన్న సానుభూతితోనూ, Concern తోనూ డీల్ చెయ్యాలిగా? కనీసం పిలిచి కౌన్సిల్ చేయాలిగా? బదులుగా పరామర్శించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేనెపంతో అయినా, కలవడానికి అపాయింట్ మెంట్ అడిగితే, నిరాకరణ ఎదురైందన్న వార్తలు ఎందుకు వచ్చాయి?

5]. వై.యస్. జగన్ అయినా, కేవిపి అయినా, ఏదన్ను చూసుకుని, లేదా ఏ కారణంతో అధిష్టానాన్ని ఎదిరిస్తున్నారు? వై.యస్. కైనా అధిష్టానం ఇస్తేనే సీన్ నడిచింది! ఈ స్పృహ కాంగ్రెస్ లో, ఈ రోజు రాజకీయాలలో చేరిన కొత్తముఖానికైనా తెలుసుకదా! అంత వ్యవహార జ్ఞానం లేని వాళ్ళా జగన్ అయినా, కేవిపి అయినా? ‘మహారాష్ట్రలో ఎన్.సి.పి. స్థాపించిన శరద్ పవార్ కి కెరియర్ నడిచింది కదా’ అన్న పోలిక తెస్తున్నారు కొందరు. నిజమే. అయితే పవార్ సోనియాగాంధీ నాయకత్వాన్ని, ఆమె విదేశీయతని ప్రశ్నించి, పార్టీ చీల్చుకుపోయి కొత్తపార్టీ పెట్టుకున్ననాడు, ఈ ఇటలీ మహిళ సోనియాగాంధీ అప్పుడే రాజకీయాల్లో కెరీర్ ప్రారంభించింది. పవార్ కి దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉంది. అన్నింటి కన్నా ఆర్ధిక రాజధాని ముంబై కార్పోరేట్ కంపెనీలతో, బాలివుడ్ సినిమా పరిశ్రమతో సంబంధాలు బాగా ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేంద్రంలో మంత్రిగా, రక్షణ శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించాడు. ఒకానొక ’ఎరా’లో కేంద్రంలో అతడికి నెం.2 స్థానం అని కూడా అన్నారు. అంత సీనియారిటీ ఉన్నవాడు. అట్లయ్యీ, సోనియాగాంధీ బలమెంతో అర్ధమై, చచ్చినట్లూ పొత్తుపెట్టుకున్నాడు. మరి జగన్, KVP ల కైతే అంత అనుభవమూ లేదు, సీనియారిటీ అంతకన్నా లేదు కదా? అధిష్టానాన్ని ఎదిరించి నిలబడగలమని ఎలా అనుకున్నట్లు? మరి ఎందుకు ప్రచ్చన్న వైషమ్యం, బలప్రదర్శన వంటి దారిలోకి మళ్ళినట్లు?

6]. 1991 లో, రాజీవ్ గాంధీ మానవబాంబు దాడిలో ఆకస్మిక మరణం పొందినప్పుడు కూడా, బహిరంగంగా కంటనీరు పెట్టలేదు రాజీవ్ గాంధీ భార్యయైన ఈ సోనియాగాంధీ. అప్పుడు వార్తాపత్రికలు వ్రాసిన విశేషణాలు….. గంపెడు దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పట్టిన ధీరవనిత. పిల్లల కోసం, దుఃఖాన్ని దిగమ్రింగి, మౌనంగా రోదించిన మాతృమూర్తి. జీవిత సర్వస్వం పోగొట్టుకున్నా బయటికి కంటనీరు చిందించకుండా, కొండంత దుఃఖాన్ని మనస్సులోనే అదిమి పట్టిన మేరునగధీర…. ఇత్యాది విశేషణాలతో ఆ రోజున పత్రికలన్నీ కోరస్ గా ఈమెని శ్లాఘించాయి.

7]. అప్పుడే కాదు, అత్తగారు ఇందిరాగాంధీ పోయినప్పుడు కూడా, తొణకని ధైర్యంతో, భర్తకు అండగా నిలిచిందని అప్పట్లో పత్రికలు తగుమాత్రంగా కొనియాడాయి. అంతటి వీరధీర గంభీర మహిళ, ఈరోజు తమపార్టీ సహచరుడు పోయినందుకే, విచలిత అయిపోయి, బహిరంగంగా కంటతడిపెట్టి, డగ్గుత్తికతో విలేఖరుల ఎదుట మాట్లాడింది. ఎంతైనా కుటుంబసభ్యుల కంటే పార్టీ సహచరుడు ఎక్కువ కాడు కదా? సరే పోనీ, అప్పటి కంటే ఇప్పుడు వయస్సు, పరిణతి పెరిగి, అనుబంధాల విలువలు తెలిసాయి అనుకుంటే, తమ సహచరుడి కుమారుణ్ణి, అసలే తండ్రిని కోల్పోయి దిశానిర్దేశం పోగొట్టుకున్న వాణ్ణి ఆదరించాలి కదా? పిలిచి “యంగ్ మాన్! ఇలాక్కాదు. నీ అనుభవం తక్కువ. కాబట్టి ఇలా చేద్దాం. లేదంటే రాష్ట్రంలో ఏకంగా పార్టీ ఉనికే తన్నేస్తుంది. లేదూ ఇదిగో ఈ సమస్య వస్తుంది. నీ తండ్రికైనా మేం ఇస్తేనే కదా నడిచింది? అతడెప్పుడూ అధిష్టానానికి [అంటే సోనియాకీ] విధేయుడిగానే పేరు తెచ్చుకున్నాడు కదా? టిక్కెట్లు దగ్గరి నుండి అన్ని విషయాలు మాతో చర్చించి, మమ్మల్ని ఒప్పించే పొందాడు కదా? కాబట్టి కంగారు పడకు. అన్నిటికీ మేమున్నాము. నీ తండ్రి మాకు ఆప్తుడు. కాబట్టి నువ్వు మా బిడ్డ వంటి వాడివే. చెప్పుడు మాటలు వినకు” గట్రా గట్రా….. లతో కౌన్సిల్ కదా చేయాలి?

మరెందుకు ఇలా ఘర్షణాత్మక వైఖరి తెరమీదకి వచ్చింది? ఈ లెక్కన సోనియాగాంధీ, వై.యస్. మరణించినందుకు దుఃఖపడిందా? లేక ’కొంపమునిగింది, సరిగ్గా కీలక సమయంలో ఇతడు చచ్చిపోయాడు. ఇరుక్కుపోయామే’ అనుకుని, తమ క్లిష్టదశకు దుఃఖపడిందా?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

వై.యస్.రాజశేఖర్ రెడ్డి – నెం.5 వర్గమూ, నెం.10 వర్గాల మధ్య, తాను చాలా బాగా ’సందట్లో సడేమియా’ చేయగలుగుతున్నాననుకొని మరీ ’ఎక్స్ ట్రా’లు పోయాడు. గారెల వంట వంటి గూఢచర్యం చేస్తూ, అందులో తాను గొప్ప చాకచాక్యంగా అన్నీ నిర్వహించ గలుగుతున్నాననుకున్నాడు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అంతర్గతంగా ముస్లింలను ఎత్తుకునీ, అంతంత మాత్రంగా క్రైస్తవుల్ని ఎత్తుకున్నది గనుక, తాను బాహుటంగానే క్రైస్తవుల్ని ఎత్తుకుంటే సరిపోతుందనుకున్నాడు. ఆ దన్నుతోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుండీ, అన్ని దేవాలయాల్లో నానా ’నీచమూ’ చేశాడు. చివరికి దేవాలయాల్లో, ఆకలికి, అప్పులకు అల్లాడుతూ సామాన్యులు ఆత్మహత్యలు చేసుకునే దాకా ’చర్లాటలు’ ఆడాడు. ఒక పత్రిక, ఒకటీవీ పెడితే, మీడియా వ్యవస్థ కలిగి ఉన్న రామోజీరావుకి సమ ఉజ్జీ నై పోతాననుకున్నాడు.

హిందూ, ముస్లిం ఘర్షణల్లానే మత మార్పిడుల పేరుతో హిందూ క్రైస్తవ ఘర్షణలు పెరిగేటట్లు చూస్తే అంతర్జాతీయంగా తనకి ’ఫండింగ్’ లభిస్తుందనుకున్నాడు. ఇందుకు చేసిన కృషిలో భాగంగానే, అప్పటికే స్వంత విమానాలు, అమెరికా ప్రెసిడెంట్లతో సమావేశాలు…. గట్రా లాబీయింగులు గల క్రైస్తవ మతప్రచారకుల ’వ్యాపారాని’కి పోటీ పడ్డాడు. అల్లుడు అనిల్ కుమార్ ని, అందుకే ప్రపంచమంతా పరుగులు పెట్టించాడు. తనకన్నీ, అలా ‘కలిసి రావటం’ అన్న దాని వెనుక, ’నెం.5 నన్ను నమ్మింది’ అంటూ తను ఆడుతున్న నాటకాన్ని నమ్మి నెం.10 వర్గమూ, ఆ నాటకాన్ని తమకి కావలసినంత వరకూ పండించటానికి నెం.5 వర్గము కూడా, పరిస్థితుల్ని allow చేస్తున్నాయి, పరిస్థితుల్ని సమకూర్చుతున్నాయి – అన్న విషయం రాజశేఖర్ రెడ్డి కి తెలియదు.

ఇక్కడో ఉదాహరణ చెబుతాను. ఇటీవల వచ్చిన ’రెడీ’ సినిమాలో [రామ్ హీరోగా నటించాడు] బ్రహ్మనందం పాత్ర ఏం ఊహిస్తే అది జరిగిపోతుంటుంది. ఊహల్లోని పాత్రలన్నీ ప్రాణం పోసుకుని అందరి ముందుకీ వచ్చేస్తాయి. దాని గురించి అతడు అయోమయంతోనూ, సందిగ్ధంతోనూ ఉంటే రామ్ “నీ గొప్పదనం నీకు తెలియదు మావఁయ్య! నువ్వు Extraordinary creativity ఉన్నవాడివి” అంటూ నమ్మిస్తాడు. అలాగన్న మాట! ఏ సందర్భంలోనైనా, ఏదైనా ఇబ్బంది పడుతూ, బుర్ర గిలకొట్టి, మిత్రులిద్దరూ[YS&KVP], లేదా మిత్రులు మరికొందరు సన్నిహితులతో కలిసి, తెగ ఆలోచించి పరిష్కారం కనుక్కొన్నారనుకొండి. అది అద్భుతంగా పనిచేస్తుందన్న మాట. ఎలాగైతే బ్రహ్మానందం అనుకుంటే, రామ్ అతడి కుటుంబసభ్యులు దాన్ని నిజం చేసారో అలాగ! దాంతో మిత్రులిద్దరూ లేదా పరిమిత మిత్రబృందం మహదానందపడిపోయి, తమ సామర్ధ్యాన్ని, కృషినీ తామే ప్రశంసించేసుకుంటారు. ఇలా మరి కొన్ని సంఘటనలు జరిగితే చాలు. ఆత్మవిశ్వాసం అంచెలంచెలుగా పెరిగి ఎంత కొండనైనా ఢీ కొట్టగలమనిపిస్తుంది. ఇప్పటికీ… పోయిన ముఖ్యమంత్రికి అవకాశం లేదు గానీ…. బ్రతికి ఉన్న అతడి మిత్రుడికి, పుత్రుడికి తాము పొట్టేళ్ళ పోరాటంలో నలిగిన నక్క వంటి వారిమని గాని, ఆంబోతుల పోరాటంలోకి ఉబలాటం కొద్దీ దూరి ఊపిరి వదిలిన, ఊపిరి సలుపుకోలేక పోతున్న, లేగ దూడల వంటి వారిమని గానీ స్పృహ లేదు. ఆ స్పృహ రావటం అంత తేలికా కాదు. ఎందుకంటే అది గూఢచర్యపు సంక్లిష్టత.

YS కి తెలిసిందల్లా ’తను ఏమనుకుంటే అది జరుగుతోంది. తను ఏం అభిలషిస్తే అది నెరవేరుతోంది. తను ఏ ప్రత్యర్ధుల్ని నలగెయ్యాలనుకుంటే అది నెం.10 వర్గంమో లేక నెం.5 వర్గమో చేసిపెడుతున్నాయి’ - దీనితో అతడికి ఎంచక్కా ’కోపం నరం’ తెగిపోయింది.

గీతలోని క్రింది శ్లోకాలని పరిశీలించండి.

శ్లోకం:
ధ్యాయతో విషయా పుంస స్సంగస్తేషూప జాయతే
సంగా త్సంజాయతే కామః కామా త్ర్కోధో౨ భిజాయతే

భావం:
ఎల్లప్పుడు వస్తువిషయాల గురించి ఆలోచన చేసే వాడికి వాటిమీదే ఆసక్తి గల్గుతుంది. ఆ ప్రీతి చేత కామం[కోరికలు] – కామం వల్ల క్రోధమూ కలుగుతాయి.

శ్లోకం:
క్రోధా ద్భవతి సమ్మోహఃసమ్మోహా త్స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశా ద్భుద్ధినాశో బుద్ధినాశా త్ర్పణశ్యతి

భావం:
కోపం వలన అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం దాని వలన బుద్ధీ చెడతాయి. ఆ బుద్ధి చెడగానే మనిషి నశించిపోతాడు.

గీతలోనే కాదు, ఉపనిషత్తులలోనూ, రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలలోనూ, స్పష్టంగా చెప్పేదేమిటంటే కామం [అంటే కోరికలు, ఆకాంక్షలు] తీరకపోతే క్రోధం కలుగుతాయని.

కాబట్టి తన కోరికలన్ని తీరే వాడికి, బావిలోని నీరు తోడే కొద్దీ ఊరినట్లుగా మళ్ళీ మళ్ళీ కోరికలు పుడతాయి గాని, క్రోధపడవలసిన అవసరం తక్కువ. తన ’సందట్లో సడేమియా’తో రాజశేఖర్ రెడ్డి, తన బలాన్ని, బలగాల్ని[టీంని] వృద్ధి చేసుకోవటం అన్న ప్రక్రియ జయప్రదంగా చేసుకోగలిగాడు. అందులో భాగంగానే తనని నమ్మిన వాళ్ళకి అన్నీ దోచిపెట్టటం, వ్యతిరేకించిన వాళ్ళని చితక్కొట్టి అణిచి పారేయటం చేసాడు. గారెల వంటలో అదీ భాగమే. ఇవన్నీ గతంలో రామోజీరావు చేసినవే! దాన్ని రాజశేఖర్ రెడ్డి అనుసరించాడు. ఎటూ నెం.10 వర్గమూ, నెం.5 వర్గమూ కూడా, తమతమ కారణాల రీత్యా [ఆయా కారణాలేవో రాజశేఖర్ రెడ్డికి తెలియకపోవచ్చుగాక] తనకి ‘మడమ తిప్పని వీరుడు, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాడు’ ఇత్యాది ఉపమాన ఉత్ర్పేక్షలతో ఇమేజ్ ఇస్తున్నాయి కూడా! దాంతో చెలరేగిపోయాడు. అన్నీ తన కోరికలకి అనుగుణంగానే జరుగుతున్నప్పుడు ఇక ’కోప నరం’ తెగిపోక ఏం చేస్తుంది? అదే అసెంబ్లీలో, ఒకోసారి, ‘ఎదుటివాడు నోరుముయ్యటం లేదు’ అనుకున్నప్పుడు ఇరిటేట్ అయ్యి నోరు జారటం జరిగింది.

ఈ స్థితిలో, వై.యస్.రాజశేఖర్ రెడ్డి, తనకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలా, అవినీతితో రాష్ట్రాన్ని దోచిన సొమ్ముని, కేవలం గూఢచర్యానికి ఖర్చుపెట్టలేదు. అలా పెడితే చంద్రబాబునాయుకి లానే తనకి తదుపరి ఎన్నికల్లో 50 మంది ఎం.ఎల్.ఏ.లే మిగులుతారు. [అప్పటికి EVM ల ఊహలేదు మరి! కాబట్టి ఆలోచన అంత వరకే చేయగలడు] అంతేగాక చంద్రబాబునాయుడు అవినీతిని Centralized చేసాడని అంటారు. అసలే తానున్నది తెదేపా వంటి స్థానిక పార్టీ కాదు. అసమ్మతి ఆనవాయితీగా గల జాతీయపార్టీ. అందునా గతంలో తానే, వంద అసమ్మతి ముఠాలు కట్టిన నిత్య అసంతృప్తి వాది షాపేన్ హోవర్ వంటి వాడయ్యె!

అందుచేత – సెజ్ ల నెపంతో భూములమ్మనీ, క్రైస్తవమంత్రుల్ని, ఛైర్మన్లనీ పెట్టి దేవాదాయ శాఖల ద్వారా హిందూ ఆలయాల ఆదాయాన్ని దోచనీ, ప్రాజెక్ట్ లంటూ కాంట్రాక్టులిస్తూ, ఆరోగ్యశ్రీ ల పేరిట కార్పోరేట్ ఆసుపత్రిలకి డబ్బు ప్రవహింపచేస్తూ, అందులోంచి వాటాలు పుచ్చుకోనీ – ఇలా వీలయిన అన్నిమార్గాల్లో చేసిన అవినీతి, పోగేసిన సొమ్ముతో కొంత అధిష్టానానికీ పంపినా, ఎక్కువ మొత్తం క్రింది మంత్రులకి కూడా పంచాడు. అప్పడే కదా తనకి భక్తులు ఏర్పడతారు? అదీగాక, తమ తమ వ్యూహాలరీత్యా కొన్ని పనులను నెం.10 వర్గమూ, నెం.5 వర్గమూ కూడా అనుకూల పరుస్తుండగా, ఆయా పనుల కోసం లాబీయింగ్ చెయ్యటానికి కావలసిన సొమ్ము మిగిలిపోతుంది కదా! ముఖ్యమంత్రిగా తన అధికారమూ, అందుకు నెం.5, నెం.10 వర్గాలు చేస్తున్న సాయమూ కూడా కలిసి వస్తుందయ్యె! అందుకే బాగా బలగాన్ని, భక్తగణాన్ని, డబ్బుని కూడా పోగెయ్యగలిగాడు. వేలకోట్ల డబ్బుంటే గూఢచర్యం చేయటం, గారెలు వండట మంత సులభం అనుకున్నాడు. అందుచేత చంద్రబాబు తొక్కిన మార్గానికి భిన్నమైన మార్గం తొక్కాడు.

నిజానికి గతంలో 9 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు కూడా అవినీతిలో తక్కువేమీ కాదు. అయితే అతడు, దోచిన సొమ్మునీ, నెం.10 వర్గమూ, రామోజీరావు తనకి అదనంగా సమకూర్చిన సొమ్మునీ, తన బలం, బలగం పెంచుకోడానికి ఉపయోగించలేదు. అందుకే అతని హయాంలో ’అవినీతిని కూడా ఈ హైటెక్ ముఖ్యమంత్రి Centralize చేసాడు’ అన్నమాట వచ్చింది. అంతేకాదు 2004 ఎలక్షన్లలో అతడికి కేవలం 50 మంది ఎం.ఎల్.ఏ.లని మాత్రమే మిగిల్చింది. ’తను తినటమే గానీ క్రింది వాళ్ళని ఎక్కువ తిననివ్వడు’ అన్న కీర్తి పార్టీశ్రేణుల్లో వ్యాపించింది. అది మాపు కోవటానికి చంద్రబాబునాయుడు, పదేపదే ’నా మైండ్ సెట్ మార్చుకున్నాను. ఇక అందరికీ అందుబాటులో ఉంటాను’ అంటూ ప్రకటించుకోవలసి వచ్చింది.

నిజానికి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా, రామోజీరావు కోసం ప్రపంచపు అంచులదాకా ’పెట్టుబడులు ఆకర్షించటం’ అన్న నెపాన బృందాన్ని వెంట వేసుకుని అతడు చేసింది ఈ లాబీయింగే! దాంతో చంద్రబాబు తాను చాలా గొప్పవాడిని అయిపోయానన్న ఫీలింగ్ తో, ‘ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి’ అన్న వ్యవహార సరళితో అందరికి నెగిటివ్ అయికూర్చున్నాడు. ఆ కారణంగానే “కార్యకర్తలకి అసలు అందుబాటులో లేడు” అన్న పేరుపొందాడు. నిజానికి అతడి హయాంలో అతడికీ మస్తు హవా నడిచింది. అమెరికా అప్పటి అధ్యక్షుడు ‘బిల్ క్లింటన్ ఇచ్చిన సమయం కంటే అధిక సమయం చంద్రబాబుతో గడిపాడు. భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా మాట్లాడాడు’…. గట్రాగట్రా ఎన్నో ’ఇమేజ్ ఇచ్చే కార్యక్రమాలు’ నడిపింపబడ్డాయి.

అయితే పాపం చంద్రబాబునాయుడు ’పిల్లనిచ్చిన మామకి సైతం నమ్మకద్రోహం, వెన్నుపోటు పొడవగలిగాడు’ గానీ, కెరియర్ ఇచ్చిన రామోజీరావుతో ’చర్లాట’లు ఆడలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి [Sep.1, 1995 నాటికీ, 1999 నాటికీ కూడా] పరిస్థితి మరీ ఇంత దిగజారలేదు. 2004, 2005 ల నాటికి దిగజారినంతగా 1995 కో, 1999 కో పరిస్థితులు దిగజారి ఉంటే, రామోజీరావు, తన అవసరం గురించి, తన స్థితి గురించి, మరింత ఎక్కువ సమాచారాన్ని చంద్రబాబునాయుడికి చెప్పి ఉండే వాడు. అప్పుడు చంద్రబాబు కూడా, రాజశేఖర్ రెడ్డి లాగా ’సందట్లో సడేమియా’ నడిపి, కెరీర్ ఇచ్చిన బాసుకయినా వెన్నుపోటు పొడవగలనని నిరూపించుకునేవాడు.

ఎందుకంటే – ఎదుటివాడు అవసరంలో ఉన్నాడంటే సాయం చేయకపోగా Exploit చేయటం, ఎదుటి వాడు తమని నమ్మతున్నాడంటే ద్రోహం చేయటం – ఇవే విజయ సూత్రాలనీ, బ్రతక నేర్చిన తనాలనీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ప్రజా దృక్పధంలో బాగానే ఇంకించింది. ఆ దృక్పధాన్ని మరింతగా ఇంకించుకున్న వారే నకిలీ కణిక వ్యవస్థ, 10 వర్గమూ నిర్మించిన నెట్ వర్కులో సునాయాసంగా పైకి వచ్చే విధంగా డిజైన్ చేయబడింది. కాబట్టి అటువంటి దృక్పధం ఉన్నవారే ఆర్దికంగా, రాజకీయంగా బలపడ్డారు, అభివృద్ధిలోకి వచ్చారు. అది ప్రభుత్యోద్యోగులైనా, వ్యాపారులైనా, రాజకీయ నాయకులైనా, సినిమా తారలైనా…. ఎవరైనా సరే! కాబట్టే ‘గాడ్ ఫాదర్’ లేదా ‘ఫలానా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నాయి’ అన్న పదాలు బాగా పాపులర్ అయ్యాయి.

కాబట్టి చంద్రబాబు నాయుడైనా, ఇప్పుడు రామోజీరావు, నెం.10 వర్గమూ ఉన్న స్థితిని, వై.యస్.లాగే, అంతకు కొంచెం ఎక్కువ మోతాదులోనో తక్కువ మోతాదులోనో, Exploit చేసే ప్రయత్నము చేసేవాడు. KVP, వై.యస్.లకి ఉన్నపాటి బుర్ర, చంద్రబాబుకీ లేకపోలేదు. కాబట్టి వ్యత్యాసం పరిస్థితుల్లోనే ఉంది అని చెప్పటమే నా ఉద్దేశం. విపులంగా చెప్పాలంటే ఈ స్థితి, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులకు – తము ప్రయోగించిన ఆయుధం తిరిగి వచ్చి తమనే గాయపరచిన స్థితే! ఇదీ ఒక సువర్ణముఖే!

ఇక్కడ ఓ ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మషిషాసురుడి కథ మనందరికీ తెలిసిందే! యుద్దరంగంలో మషిషాసురుడి శరీరం నుండి నేలకు జారిపడిన ప్రతీరక్తపు బిందువు నుండీ మషిషాసురుడంతటి మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. అందుచేతనే, జగన్మాత అయిన పార్వతీ దేవి, కాళికయై, తన అనేక బాహువులతో వివిధ ఆయుధాలు ధరించి మషిషాసురుడితో యుద్ధం చేస్తూనే, తను, వాడి శరీరం మీద చేసిన గాయాల నుండి కారిన రక్తం నేలకు జారకుండా, తన నాలుకను పొడవుగా పెంచి, ఆతడి క్షతగాత్ర శరీరం నుండి కారే రక్తాన్ని నాకేస్తుంది.

తల్లినే కామించిన ఆ నీచ రాక్షసుడి శరీరం నుండి కారిన ప్రతీరక్తపు బిందువూ నేలను చేరితే మళ్ళీ మహిషాసురుడంత రాక్షసుడు పుట్టటం ఎలాంటిదో, ఇప్పుడు ప్రజానీకంలో ఉన్న అవినీతి కూడా అలాంటిదే. జగన్మాతనే కామించిన మహిషాసురుడిలాగా, ఈ అవినీతిపరులు కూడా కన్నతల్లి వంటి దేశాన్ని దోచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది అవకాశం రాక మంచితనంతోనూ, నీతితోనూ ఉండటమే! దీన్నే నిరూపించాడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గనుక RFC అంతటి స్థానంలో ఉంటే, రామోజీరావుకి ఏమాత్రమూ తీసిపోడు. ’సందట్లో సడేమియా’ నడిపి, ఇస్లాం స్థానే క్రైస్తవం తీసి, ‘మీడియా సంస్థ పెడితే, బలగాన్ని డబ్బుని సమీకరిస్తే చాలు కింగ్ నైపోతాను’ అనుకుని రాజశేఖర్ రెడ్డి చాలా వేగంగా దూసుకెళ్ళిపోయాడు.

ఇతడొక్కడే కాదు, ఎవరికి ఇంతగా పరిస్థితులు కలిసి వస్తే, ఎవరికి గూఢచర్యం వంటివి అందుబాటులోకి వస్తే, వారు అంతగా ’పనితనం’ చూపిస్తారన్నదే ఇక్కడ విషయం. కాబట్టే సమస్య రామోజీరావుతో లేదు. ప్రజల దృక్పధంలోనే ఉంది. ఒక్క మహిషాసురుణ్ణి చంపితే, నేల జారిన వాడి ప్రతి రక్తపు బొట్టు, మరో మహిషాసురుణ్ణి సృష్టించినట్లు, ఒక రామోజీరావు అంతమొందితే, మరెందరో రామోజీరావులు తయారౌతారు. ’ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే, నేల రాలిన ప్రతి రక్తపు బొట్టూ వందలూ వేల సీతారామరాజుల్ని సృష్టిస్తుంది – ఇటువంటి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు, ఒకప్పుడు ప్రజల్ని స్వాతంత్ర్యోద్యమంలోనికి దుమికేలా ప్రేరణ కల్గించాయి. ’వందేమాతరం’ అన్న ఒక్క నినాదమే ప్రజలని ఎంతో ప్రేరేపించింది.

ఆ విధమైన ప్రజల దృక్పధమే, నాడు నకిలీ కణికవ్యవస్థకి తీరని దుఃఖం, చేదు ఓటమి మిగిల్చింది. యదార్ధం చెప్పాలంటే భారతీయుల బలం వారి దృక్పధమే. అందుకే, దాన్నే భారతీయుల బలహీనతగా మార్చే ప్రయత్నం నకిలీ కణికవ్యవస్థ చేసింది. ఆనాడు, అంటే స్వాతంత్రసమరపు సమయంలో, ప్రజాదృక్పధాన్ని సంఘటిత శక్తిగా మార్చిందీ, సరైన రీతిలో నడిపిందీ, దేశభక్తుల చేత నడిపింపబడిన ఆనాటి వార్తా పత్రికలే [అంటే మీడియా] . అందుకే, తదనంతర కాలంలో నకిలీ కణిక వ్యవస్థ, తన ప్రధాన సాధనంగా మీడియానే ఎంచుకుంది. ఆ విధంగా భారతీయులని నిర్వీర్యులుగా, దుర్భలురుగా, నిస్సహాయులుగా మార్చప్రయత్నించింది. కొంత వరకూ సఫలీకృతమైంది.

అందుకోసమే పదార్ధవాదాన్ని, పలాయన వాదాన్ని, కుహనా భావవాదాన్ని ప్రచారించింది, ప్రభోదించింది. అయితే తాను ప్రచారించిన కుహనా భావవాదం రీత్యానే నెం.5 వర్గం ఎవ్వరి ప్రాణాలూ తీయదని గుడ్డిగా నమ్మేసారు నకిలీ కణికవ్యవస్థా, వారి నెం.10 వర్గమూ కూడా! ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారులే’. ‘ముక్తి కోరేవాడు అందర్నీ క్షమించాలి’ గట్రాగట్రా ధర్మపన్నాలతో…. తామే ప్రచారించిన కుహనా భావవాదపు మాయలో తామే పడిన పర్యవసానం అది.

అయితే దేనికైనా ఒక అవధి ఉంటుందని, సామ దాన భేద దండోపాయాలలో ఏదీ ఒకదానికొకటి తీసిపోదని, అవసరమైన చోట సరైన దండన విధించడం తప్పు కాదని, నెం.5 వర్గానికి తాము ప్రచారించిన కుహనా భావవాదపు అభ్యంతరాలు ఏవీ లేవని నెం.10 వర్గం గ్రహించలేకపోయింది.

ఇక్కడ ఓ సత్యం చెప్పుకోవాలి. నెం.10 వర్గానికి, నకిలీ కణికులకీ, శతాబ్ధాలుగా గూఢచర్యం నడిచింది అంటే – అది దైవం నడవనిస్తేనే! ఇప్పుడు పరిస్థితులు తిరగబడి, నెం.5 వర్గానికి బలం పెరిగింది, నెం.10 వర్గాన్ని Expose చేయటం, సువర్ణముఖి అనుభవింప చేయటం వంటి గూఢచర్యం నడపగలుగుతోంది అంటే – అదీ దైవం నడిపిస్తేనే! గూఢచర్యమైనా దైవఘటనకీ, దైవానుగ్రహానికీ అతీతం కాదు. దేనికైనా పాపం పండాలి, కాలం కలిసి రావాలి. అందుకే గీతలో విభూతియోగంలో

శ్లోకం:
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం
జయో౨స్మి వ్యవసాయో౨స్మి సత్త్వం సత్త్వవతామహమ్

భావం:
వంచకాలలో జూదాన్నీ, తేజోవంతులలోని తేజాన్నీ, విజయం పొందేవారి విజయాన్ని, కృషి చేసే వారి ప్రయత్నాన్నీ, సాత్త్వీకులలోని సత్త్వగుణాన్నీ నేనే.

అని చెబుతాడు భగవంతుడు. ఇంకా

శ్లోకం:
కాలో౨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతే౨పి త్వాం న భవిష్యంతి సర్వే యే౨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః

భావం:
ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాలస్వరూపుడిని నేను. ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే, నువ్వు తప్ప, మీ ఉభయపక్షాలలోనూ ప్రతిపక్షంలో ఎవడు కూడా మిగలడమనేది అసంభవం.
అని కూడా చెబుతాడు.

భగవంతుడి పేరిట గూఢచర్యపు నీచపు స్ట్రాటజీలు నడపటమే గొప్ప అనుకోవటం, కంచర్ల గోపన్న[భద్రాచల రామదాసు] కాలంలో ప్రారంభమైన నకిలీ కణిక వ్యవస్థ వంశీకులకి అలవాటే. అలాంటి వారికి భగవంతుడి గురించిన ఈ లోతు అర్ధం కావటం అసంభవం. కాబట్టి వారు గూఢచర్యాన్నే చూసారు. అయితే నెం.10 వర్గానికి, నకిలీ కణికవ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాగాంధీలకి, దైవం గురించిన లోతు అర్ధం గాకపోయినా దైవం గురించిన భయం మాత్రం ఇప్పుడు సోకింది. అదీ ప్రాణభయం దగ్గరికి, పరిస్థితి వచ్చేసరికి, అది అనుభవంలోకి వచ్చింది.

కావాలంటే పరిశీలించండి. హెలికాప్టర్ ప్రమాదంలో YS రాజశేఖర్ రెడ్డి మరణం, రుద్రకోడూరు పరిధిలోని, రుద్రకోటేశ్వరస్వామి ఆలయానికి 18 కిమీ దూరంలోని రుద్రకొండ వద్ద జరిగిందని, సెప్టెంబరు 3,4 తేదీలలోని తొలివార్తలలో వచ్చింది. తర్వాత అది పూర్తిగా పావురాలగుట్టగా మాత్రమే గుర్తింపబడింది. ఎక్కడా ’రుద్ర’కోడూరు ప్రసక్తిగానీ, రుద్రకోటేశ్వరస్వామి ఆలయంగానీ, రుద్రకొండ ప్రసక్తి గానీ మీడియా తేవటం మానేసింది. ప్రజలకి ఎక్కడ దేవుడు గుర్తుకొస్తాడోనన్న భయమూ, గుర్తురాకూడదన్న జాగ్రత్తా, మీడియా తీసుకుంది. [లయకారుడైన శ్రీశైల మల్లిఖార్జున స్వామి సామ్రాజ్యంగా నల్లమల కొండలకు పేరు. ఇంకెక్కడా శివుడికి సామ్రాజ్యం ఉన్నట్లు చెప్పబడదు. సిద్దవటం, ఉమామహేశ్వరం, ఆలంపూరం, త్రిపురాంతకం ఈ నాలుగు దేవస్థానాలు నాలుగు ద్వారాలుగా, వీటి మధ్యనున్న నల్లమల అడవులని శ్రీమల్లిఖార్జున స్వామి సామ్రాజ్యంగా చెప్పబడింది. క్రైస్తవుడయి ఉండి, వై.యస్., శివరాత్రి పర్వదినాన ’నా మనసే మహాశివుడు’ అని ప్రకటించుకున్నందుకు, లయకారుడైన శ్రీశైల మల్లన్న ’రుద్ర’ తాండవమా ఇది?] రుద్రుడంటే భయమేసిందేమో మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

సెప్టెంబరు 2 వతేదీ ఉదయం 9.35 తర్వాత, వై.యస్. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కి భూతల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి అన్న విషయం తెలియగానే, [ఈ విషయం 9.36 గంటలకి ముఖ్యలకీ, ఉన్నతాధికారులకి తెలియజేసారని ’వార్త’ పత్రిక భోగట్టా] అధికారికంగా గాలింపు చర్యలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభం అయ్యాయి.

ఈ మూడుగంటల జాప్యం లోపల, నకిలీ కణికవ్యవస్థ నెం.10 వర్గం, పంపిన పరిశోధకులు సంఘటనా స్థలం ఆచూకీ తెలుసుకోగలరు. చేరనూ గలరు. పరిశోధించనూ గలరు. కేంద్రప్రభుత్వం తమదే అయినందునా, ఎంతగా రాజశేఖర్ రెడ్డి ’సందట్లో సడేమియా’ చేసినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మీడా తమకి గ్రిప్పు ఉన్నందునా, సదరు పరిశోధన నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, అసాధ్యం కాదు, కాలేదు. [నల్లకాల్వ దగ్గర పశువుల కాపరులు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ వెళ్ళటం చూసామని చెప్పటం ఇక్కడ గమనార్హం.]

‘హెలికాప్టర్ ప్రమాదం యాదృచ్చికమా? విద్రోహ చర్యా? గూఢచర్యంలో భాగమై పధకం ప్రకారం జరిపించబడిందా?’ ఏ సంభ్యావతో తేలే వరకూ అసలు వార్తనే బయటికి పొక్కనివ్వలేదు. సదరు పరిశీలనలో నెం.10 వర్గానికీ, రామోజీరావుకీ, స్పష్టంగా తేలింది ఏమంటే – హెలికాప్టర్ ప్రమాదం విద్రోహ చర్యకాదు. ఏ విస్పోటనాలూ, విస్పోటన పదార్ధాలూ దొరకలేదు. క్రిందనుండి ఏ నక్సల్సో, టెర్రరిస్టులో పేల్చరు. తాము Assignment ఇవ్వకుండా ఏ నక్సల్స్ గానీ, పాక్ లేదా మరొక గ్రూప్ టెర్రరిస్టులు గానీ ఏ విద్రోహచర్యా జరపరు కదా? గూఢచర్యంలో ఉండి, యాదృచ్చికాలని తాము నమ్మరు. అందునా, ప్రస్తుతం ’వై.యస్.’ అన్న ఏజంటు నుండి రాబట్టవలసిన సమాచారం, తెలుసుకోవలసిన నిజాలూ చాలా ఉన్న సందర్భంలో, ఎప్పుడు ఈ పావు తప్పించబడితే తమకు అత్యధిక నష్టమో సరిగ్గా ఆ సందర్భంలో, ’యాదృచ్చిక’ ప్రమాదం ఎలా జరుగుతుంది?

అసలుకే….ఏ పేరుతో పిలిచినా, ఏమతం అనుసరిస్తున్నామని పైకి చెప్పుకున్నా, తమకి దేవుడి మీద భయమూ, భక్తి లేవయ్యె! అలాంటి చోట ’యాదృచ్చిక’ సంభవ్యతని అసలు అంగీకరించలేరు. కాబట్టే ’క్యుములో నింబస్ మేఘం’ కారణంగా కనబడింది. గూఢచర్యం మీద ఎవరికి పట్టుంటే వారికి, ఆధునిక సాంకేతిక మీద కూడా పట్టు ఉంటుంది. ఆధునిక సాంకేతికతతో వాతావరణ పరిస్థితుల్నీ, ప్రాకృతిక పరిస్థితులనీ నియంత్రించవచ్చు అన్న విషయం ఇప్పటికి చాలా సార్లే నిరూపితమయ్యింది. ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు 08/08/08 బీజింగ్ ఒలెంపిక్స్ ప్రారంభ ఉత్సవాలకి, వర్షం ఆటంకం కలిగించకుండా, ఆధునిక సాంకేతికతని ఉపయోగించి, చైనా, బీజింగ్ నగరం మీదకి రాకుండా మేఘాలని చెదరగొట్టింది. కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు కొన్ని వ్యాపారసంస్థలుండటం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా బయటికి, అందరికీ తెలిసేంత బాహాటానికి, వ్యాపార సంస్థల అందుబాటులోకి, రాని ఆధునిక సాంకేతికత ఉంటే, దాని గురించి సామాన్యులకి తెలిసే అవకాశం లేదు గాని, ఆ విషయం గూఢచార సంస్థలకి కొంత అంచనాలోనూ, మరికొంత అందుబాటులోనూ ఉంటుంది.

ఆ విధంగా, ఆధునిక సాంకేతికత సహాయంతో వర్షాలూ, వర్షాభావ పరిస్థితులూ, వరదలూ, కరువులూ, కార్చిచ్చులూ, భూకంపాలూ కూడా సృష్టించవచ్చన్న విషయం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండువర్గాలుగా చీలి గూఢచర్యయుద్ధంలో మునిగి ఉన్న, మెదళ్ళతో యుద్ధం చేసుకుంటున్న రెండువర్గాలకూ[నెం.10 & నెం.5] తెలిసిన విషయమే!

ఈ నేపధ్యంలో నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులకి వై.యస్. కథ ’ముగింపు’ దిగ్ర్భాంతి కలిగించింది. తమ ’పని’ ఇంకా సగంలోనే ఉండగా ఇది జరగటం, మరింత అనుమానాల్ని, ఆందోళనని కలిగించింది. నెం.5 ని నమ్మించమని తాము ఇచ్చిన Assignment నీ, నెం.5 ని నమ్మించవలసిన తమ అవసరాన్నీ, ఆసరాగా తీసుకుని, వై.యస్. చాలా ’ఆటలు’ ఆడాడని అర్ధమయ్యింది. అందుచేత అతడి అంత్యక్రియలు పూర్తి అయిన రెండు రోజులకే అతడి మిత్రుడు కెవిపి ఢిల్లీ రప్పించబడ్డాడు.

ఇటు కెవిపి కూడా స్తబ్ధతలో ఏమీలేడు. తానూ, తన స్నేహితుడూ కలిసి రెండువర్గాల మధ్య, తాము బలపడేటట్లూ, తమకి తెలిసిన గారెల వంట వంటి గూఢచర్యం నడిపారు. మిడతం బొట్లు కథలాగా తమకి పరిస్థితులూ కలిసి వచ్చాయి. అలా పరిస్థితులు కలిసి వచ్చే పరిస్థితిని నెం.5 కల్పించిందని గానీ, పరిస్థితుల్ని allow చేసిందని గానీ వీరికి తెలియదు. ఈ స్థితిలో స్నేహితుడు ప్రమాదంలో మరణించాడు. నెం.10 కి ఉన్న అవసరం రీత్యా, అప్పటి వరకూ ఉన్న పరిస్థితి రీత్యా, ప్రమాదం ఎలా జరిగిందన్న ప్రాధమిక విచారణ రీత్యా నెం.10 గానీ, నెం.5 వర్గం గానీ తన స్నేహితుడి కథ ముగించలేదని అనుకున్న కేవిపి, పరిస్థితులు చెయ్యిదాటిపోకుండా ఉండేందుకు వేగంగానే కదిలాడు. వై.యస్. కొడుకు జగన్ దీ అదేపరిస్థితి. గారెల వంట వంటి గూఢచర్యంలో భాగంగా ఓ పత్రికనీ, టీవీని కూడా పెట్టి ఉన్నారయ్యె! వై.యస్., కెవిపి కలిసే అన్నీ ఆలోచించరయ్యె. [గూఢచర్య స్ట్రాటజీ ఆలోచించాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరి వల్ల కాదు. ఒకటికి రెండు బుర్రలూ కావాల్సిందే. ఇంకొంచెం ఎక్కువ బుర్రలున్నా ఫర్వాలేదు గానీ, ఒక్క బుర్ర మాత్రం చాలదు]

ఒకసారి నదిలో దూకాక ప్రవాహమే లాక్కుపోతుంది. నదీప్రవాహమూ, గూఢచర్యమూ ఒకలాంటివే. ఒకసారి involve అయ్యామా వదిలిపోవాలన్నా అది వదిలి పెట్టదు. అంతేకాదు, నెం.10, నెం.5 ల మధ్య గూఢచర్యపు ‘చర్లాట’ మొదలుపెట్టి, అర్ధాంతరంగా అసువులు బాసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డికి కుమారుడు జగన్, స్నేహితుడు కెవిపి… ఇద్దరికీ ఈ ’చర్లాట’లో వాటా ఉంది. ఇక ఈ స్థితిలో స్థిమితంగా ఎలా ఉండగలరు? కెరీయర్ పరంగానూ, భౌతికంగా కూడా మెడమీద కత్తి ఉన్నట్లే!

ఈ పరిస్థితుల ఫలితంగా శవం ఇంకా హైదరాబాదు వదలక ముందే రాజకీయాలు వేగం అందుకున్నాయి. ఎటూ ’మైండ్ సెట్’ ని గ్రహించి కదిలే రఘవీరారెడ్డి, రాయపాటి సాంబశివరావుల వంటి ఇతర రాజకీయనాయకులు సిద్దంగానే ఉంటారయ్యె! ఇంకేముంది? సంతకాలూ, ర్యాలీలూ, మీటింగులూ, ఫ్యాక్స్ లూ, ప్రకటనలూ, పెద్దతలకాయలని కలవటాలూ…. ఫుల్లు లాబీయింగ్. ’ప్రత్యేక విమానం’లో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలని చూసి, వారుపయోగించిన ’దార్శనికుడు వై.యస్’ వంటి పద ప్రయోగాలని చూసి, రాజకీయాల వేగం మరింత పెరిగింది. ఎవరి పరుగు వారిదయ్యె! నెం.5 Vs నెం.10 మెదళ్ళ యుద్ధంగానీ, నెం.10 కి నెం.5 ని నమ్మించాల్సిన అవసరం ఉండిన నేపధ్యంలో వై.యస్. కు ’సీన్’ నడిచిన విషయంగానే, తెలియని చాలామంది రాజకీయనాయకులు, [సీనియర్లు కానివ్వండి, జూనియర్లు కానివ్వండి] అనుకున్నదేమిటంటే –

1]. సోనియాగాంధీ క్రిస్టియన్ అయినందున, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అయినందున అతడికి సీన్ నడుస్తోంది.

2]. సెజ్ ల బేరాల దగ్గర నుండి, సిమెంటు లాబీయింగ్ ల దాకా, ఖనిజాల గనుల దగ్గర నుండి బ్లాక్ మార్కెటింగ్ దాకా, ఎంత వీలైతే అంతగా సొమ్ము పోగేసి పైకి పంపుతున్నాడు గనుక వై.యస్. కి ఢిల్లీ నుండి దీవెనలు అందుతున్నాయి, దన్ను వస్తోంది. దాంతో ’సీన్’ వస్తోంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ ’అన్ని రాష్ట్రలతో ఆంధ్రప్రదేశ్ ని పోల్చలేం’ అనేంత ప్రత్యేకమైంది. అలాగే వై.యస్. అంత బలమైన వాడూ, అధిష్టానానికి ఇష్టమైన వాడూ అయ్యాడు.

ఇలాంటి పై కారణాలనే [Over leaf reasons] వారూ చూశారు. ఓ విధంగా చెప్పాలంటే మీడియా ప్రచారించిన దానిని నమ్మారు. అంతేగాక ఎంతటి సీనియర్లయినా ఎం.ఎస్.సత్యనారాయణ, జి.వెంకటస్వామి, వీహెచ్ వంటివారు, తెలంగాణా వంటి అంశాలతోనూ, వై.యస్.తో విభేదించిన సందర్భాల్లోనూ, ఢిల్లీలో పడిగాపులు పడినా AICC అధిష్టాన దేవత సోనియాగాంధీ 10, జనపధ్ లోకి అడుగుపెట్టేందుకు అనుమతి [Appointment] నిరాకరించటం వంటి ఎన్నో అవమానాలు పొంది ఉన్నారు. తమ పిల్లలకీ, తమకీ కూడా సీన్ కట్ అయిపోయింది. కెరియర్ మాసిపోయింది. ఇక డబ్బు సంగతి చెప్పేదేముంది? ఒకరిద్దరి సంతానాలకి ఏదో బుల్లిబుల్లి మంత్రిత్వ శాఖలున్నా ఆశ ’ఏనుగులు తినే వాడికున్నంత’ ఉంటే, వాస్తవంలో ఆదాయం ’పీనుగుల పిండాకూడు’ అంత ఉంది. దాంతో అభివృద్ధి సూత్రం ‘వై.యస్. భజనే’ అనుకొని తలా ఓమాట ’జగన్ జిందాబాద్’ అనేసారు. ఇందులో కాకా Vs వి.హెచ్.ల వ్యాఖ్యానాలు వారి అనవగాహననే సూచించాయి.

ఈ గందరగోళం రెండురోజులుగా నడుస్తుండగా [సెప్టెంబరు 4 నుండి 6 దాకా], ఈలోపునే ముఖ్యమంత్రిగా రోశయ్య 3 వ తేదీ ప్రమాణస్వీకారం చేశాడు. అప్పటికి అధిష్టానం ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియనందున అది కేవలం తాత్కాలికం అని అందరూ అనుకున్నారు. వాస్తవానికి అప్పటికి అధిష్టానానికీ అంతకంటే స్పష్టత లేదు. వాళ్ళ ధ్యాసంతా ఏం జరిగిందో తెల్సుకోవటం మీదే ఉంది. కాబట్టే పరిస్థితి రకరకాలుగా మారింది. 6 న మంత్రులంతా ప్రమాణస్వీకారం చేశారు. దాని మీద పెద్ద ఎత్తున నాటకీయత నడిచింది. దీని గురించీ చివరిలో విశ్లేషిస్తాను.

ఇక సెప్టెంబరు 7 వ తేదీ సోమవారం రాత్రి కేవిపి ఢిల్లీ వెళ్ళాడు. ’మేం ఎవరినీ రమ్మని పిలవలేదు. అతడే వచ్చాడు’ అన్న ప్రకటన, ఢిల్లీలో మొయిలీ వంటి పెద్దతలకాయలు ముందస్తు జాగ్రత్తగా చెప్పారు. ఇక చూస్కోండి ఎడతెరపి లేకుండా కేవిపి…. ఢిల్లీలో ఆంటోనీ, అహ్మద్ పటేల్, ప్రధాని, మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ, సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ గట్రాగట్రాలతో గంటల కొద్దీ, రాత్రిపొద్దుపోయాక, ఒకటి కంటే ఎక్కువసార్లు కలిసి చర్చలు జరిపాడు. వై.యస్. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఎంక్వయిరీ చేయటం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి అడగటంతో కేవిపి తన దగ్గరున్న సమాచారం ఇవ్వటం, జగన్ కోసం లాబీయింగ్ చేయటం…. ఇత్యాది పైకారణాలతో నడుపబడ్డ ఆ సుదీర్ఘ సమావేశాల్లో అసలు జరిగింది. కేవిపి ని Interrogate చేయటం. ఆ Interrogation తో నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అతడి సోదరీతుల్య సోనియాగాంధీలకి నూరుశాతం తెలిందేమిటంటే – నెం.5 తనని నమ్మిందంటూ తమని నమ్మించి వై.యస్.రాజశేఖర్ రెడ్డి తమకి నమ్మకద్రోహం చేశాడని, ’సందట్లో సడేమియా’ గా తనూ, తన ముఠా బలపడే ప్రయత్నం చేశాడని, తమకి ‘బుస్సు’ కొట్టాడని, తమని బాగా బోల్తా కొట్టించాడని.

దాదాపు నాలుగేళ్ళకు పైగా నడిచిన ఈ వ్యూహంలో, తము నెం.5 చేతిలో ’చిత్తు’గా చిక్కుకుపోయామన్నది అర్ధమయ్యింది. దెబ్బకి కేవిపి నీ, జగన్ నీ ఎత్తికొట్టారు. ఇప్పటికి అంటే సెప్టెంబరు 23 వ తేదీ వరకూ ఇదే స్థితి. మీదు మిక్కిలి ఒక ప్రచ్ఛన్న వైషమ్యానికి, పోరాటానికి పరిస్థితులూ శరవేగంగా కదులుతున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారితే…. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

నేను వ్రాస్తోంది సస్పెన్స్ థ్రిల్లర్ నవల కాదు గనుకా, మిమ్మల్ని ఉత్కంఠలో ముంచటం నా లక్ష్యం కాదు గనుకా విషయాన్ని క్లుప్తంగా చెప్పాను. క్లుప్తంగా చెప్పడానికీ నాలుగు టపాలు పట్టిందంటే విషయం ఎంత సంక్లిష్టమైనదో అర్ధం చేసుకోగలరు. ఇప్పుడు Logical గా, Sequence లో, Circumstantial తో వివరిస్తాను. ఇందులో నడిచిన సువర్ణముఖి గురించి కూడా వివరిస్తాను.

నకిలీ కణికవ్యవస్థ ఉనికి, ప్రపంచవ్యాప్తంగా పరుచుకొని ఉన్న గూఢచార వలయపు అస్థిత్వం నెం.5 వర్గానికి తెలిసి 17 ఏళ్ళకు పైనే అయ్యింది. నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య కార్యకలాపాల తీరుతెన్నులూ అర్ధమయ్యాయి. సవాళ్ళు, ప్రతిసవాళ్ళ మధ్య [ఈ విషయమై గత టపాలలో వివరించాను] అనువంశిక నకిలీ కణికులనీ, వారి ఏజంట్లనీ, వారు ఉపయోగిస్తున్న పైకారణాలు [Over leaf reasons] తో సహా బహిరంగ పరుస్తూనూ, చేసిన ’కర్మ’ అనుభవించటం అనే సువర్ణముఖిని అనువర్తింపచేస్తూనూ, నెం.5 వర్గం, నెం.10 వర్గానికి అసలైన గూఢచర్యం ఎలా ఉంటుందో అనుభవింపచేస్తోంది.

అయితే ఈ పరిస్థితిలో, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గంతో, మరేదైనా గూఢచార సంస్థ యుద్ధానికి సిద్దపడితే, యుద్దపు తీరు ఇలా ఉండదు. ముందుగా ఏ ఏజంటు ఉనికి అయినా తెలిసిపోతే, వీలైతే నిర్వీర్యం చేస్తారు, వీలుగాకపోతే ప్రాణాలు తీస్తారు. ఏది చేసినా గూఢచర్యం అంతర్గత కారణమైతే, పైకారణంగా [Over leaf reasons] పలు అంశాలు ఉంటాయి. సదరు ఏజంటు వ్యక్తిగత ఆరోగ్యం లేదా బలహీనతలు, లేదా అనూహ్య సంఘటనలు…. ఇలాగన్నమాట. ఒకవేళ ప్రాణాలు తీయటమే అయితే కూడా అనారోగ్యం, ప్రమాదం లేదా బంధుమిత్రులో మరొకరో హత్య చేయటం లేదా ప్రత్యర్ధుల దాడి, లేదా గుర్తు తెలియని హంతకులు…. ఇలాగన్న మాట.

ఇవే నెం.10 కూడా తన ప్రత్యర్ధి గూఢచార సంస్థల మీదా, వారి ఏజంట్ల మీదా ప్రయోగించే తంత్రాలు కూడా. అయితే ఈ 17 ఏళ్ళుగా నెం.5 వర్గం అనుసరిస్తున్న యుద్దరీతి ఇందుకు భిన్నంగా ఉంది. ఉనికి బయల్పడిన నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తుల్నీ, ఏజంట్లనీ నెం.5 వర్గం నిర్వీర్యమూ చెయ్యలేదు, ప్రాణాలూ తీయలేదు. బహిరంగ పరుస్తునూ [Expose చేస్తూనూ], చేసిన ’కర్మ’ అనుభవింపజేస్తూనూ పోయింది.

అందుచేత నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గము కూడా తామే ప్రచారించిన కుహనా భావవాదాన్ని నెం.5 వర్గం అనుసరిస్తోందని అనుకున్నారు. కుహనా భావవాదమంటే ఏమిటంటే –

ఉదాహరణకు లౌకిక వాదాన్నే తీసుకొండి. రాజ్యాంగపరంగా అన్నిమతాలూ సమానం అన్నది లౌకికవాదం. ’హిందూ మతం, హిందువులు తక్కువ సమానం, ముస్లిం, క్రైస్తవ మతాలు, ముస్లింలూ, క్రైస్తవులూ ఎక్కువ సమానం’ అన్నది కుహనా లౌకిక వాదం.

అలాగే దుష్టుణ్ణి చంపటం కాదు, దౌష్ట్యాన్ని చంపాలి అన్నది కూడా కుహనా భావవాదమే! ఖచ్చితంగా చెప్పాలంటే కుహనా మంచితనం లేదా కుహనా క్షమాగుణం. దీని మూలకర్తలు అనువంశిక నకిలీ కణికులే. దీన్ని అనుసరించే భారతీయ శిక్షాస్పృతి – ’ వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు, ఒక్క నిర్ధోషికి శిక్షపడకూడదు’ అంటుంది. ఇందులో ప్రధానంగా రెండు లొసుగులు ఉన్నాయి. ఒక్క నిర్దోషికి, మహా పడితే జైలు శిక్షపడుతుంది. లేదంటే ఉరిశిక్షపడుతుంది. ఉరిశిక్షపడటం అన్నది అత్యల్పశాతం. అధవా పడినా క్షమాభిక్షలుంటాయి. యావజ్జీవ శిక్షగా మార్చబడుతుంటుంది. ఇవేవీ గాక ఉరిశిక్ష ఖరారు అయినా, అమలుకు ఏళ్ళుపూళ్ళు పడుతుంది. ఈ లోపున ఏమైనా జరగవచ్చు. అయితే ఈ ఒక్క నిర్ధోషిని తప్పించటానికి 100 మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదను కుంటే, తప్పించుకున్న ఒక్కొక్క దోషీ, తప్పించుకోవటం ఎంత సులువో అర్ధమయ్యాక, మరింత పేట్రేగి, తలా వంద మందిని అంటే 10,000 మంది అమాయకుల్ని, బలహీనుల్ని, మరో మాటలో చెప్పాలంటే నిర్దోషుల్ని బాధిస్తున్నారే? అంటే ఒక్కనిర్దోషిని రక్షించటానికి 100 మంది దోషుల్ని వదిలిపెట్టి సమాజంలో 10,000 మందిని శిక్షిస్తున్నారే! ఇలాగా శిక్షాస్పృతి ఉండవలసింది? ఇది పూర్తిగా దోషుల్ని కాపాడటానికి ఉన్న చట్టం లాగా లేదూ? అందుకేనేమో జైళ్ళలో ఖైదీలకే ఎక్కువ హక్కులూ, సౌకర్యాలూ ఉన్నాయి. కాబట్టే కసబ్ లకి రంజాన్ సంబరాలు, సంభారాలు [మాంసం, బిర్యానీ గట్రాలు] అందుతున్నాయి. నళినిలని వదలపెట్టాల్సిందిగా తోటి ఖైదులు నిరాహార దీక్షలూ, నిరసన ఉద్యమాలు చేపడుతున్నారు.

ఇక రెండో లొసుగు ఏమిటంటే – అక్కడికి జైలుకు పంపటం ఏదో మహాకౄరమైన శిక్ష అయినట్లు, నిర్దోషికి శిక్షపడకూడదనటం. జైల్లో కరెంటు ఉంటుంది, ఫ్యాన్లుంటాయి, ఆదివారం టీవీలు చూడవచ్చు, వినోద వికాస కార్యక్రమాలుంటాయి, ప్రతీరోజు పక్కామెనూ ఉంటుంది, అందులో ఆదివారం మాంసం, గుడ్లూ కూడా ఉంటాయి. ఇన్ని సౌకర్యాలు మురికి కుపాల్లాంటి పేదలబస్తీల్లో మచ్చుకైనా లేవు. ప్రతీ ఆదివారం మాంసం తినగల, మురుగునీరు చుట్టు లేకుండా నివసించగల, ఏ పూటా తిండికి ఢోకా లేకుండా బ్రతకగల స్థితి, ఈ పేదలకి ఎంతో కష్టపడితేగానీ దక్కదు, దక్కటం లేదు.

ఇలాంటి నేపధ్యంలో ఒక్కనిర్దోషిని కాపాడం అన్న వంకతో వందమంది దోషుల్ని విడిచిపెట్టటం ఎంత వరకూ సబబు? ఇది కుహనా శిక్షాస్పృతి. భారతంలోని ’నారదనీతి’ [ఇంతకు ముందు టపాల్లో వివరించాను] స్పష్టంగా “దోషిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. వాడిమీద ఏమాత్రం కనికరం చూపినా సామాన్యులలో దోషప్రవృత్తి విపరీతంగా రేగుతుంది. అందుచేత నేరం చేసిన వాడిని సకాలంలో శిక్షపడవలసిందే!” అని చెబుతుంది. [భారత న్యాయవ్యవస్థపై నకిలీ కణికుల కుట్రగురించి విపులంగా ఆంగ్లంలో నా బ్లాగు Coups on World లోని Coups on Law & Justice లో వ్రాసాను.]

ఇంతకు ముందే చెప్పినట్లు నారదనీతికి విపర్యయమే నకిలీ కణిక నీతి! ’సకాలంలో శిక్షపడటం’ అన్నది సుప్రీం కోర్టు నుండి స్థానిక మున్సిఫ్ కోర్టు దాకా ఎంత విపర్యయంగా ఉపయోగింపబడుతుందో, ఎంత జాగు జాప్యాలతో కోర్టు తీర్పులు వెలువడతాయో, ఎందుకలా న్యాయవ్యవస్థ పని చేస్తుందో ఇప్పుడర్ధం చేసుకోవచ్చు. ఇతోధికంగా ఇందుకు కృషి చేసే కర్ణాటక, హైకోర్టు న్యాయమూర్తి దినకరన్ ల వంటి వారి గురించిన వ్యవహారాలు ఇప్పుడంటే బయటికొస్తున్నాయి గానీ 1992 కు ముందైతే ’న్యాయమూర్తులు’ అందరూ ఎన్టీఆర్ జస్టిస్ చౌదరిలే! ఈ విషయమై భారతీయతపై సినిమారంగం ద్వారా కుట్రలో కూడా వివరించాను. ఆంగ్లంలో Coups on India through Cinema Field లో వ్రాసాను. ఇక ఇక్కడితో ఈ చర్చ ఆపి, మళ్ళీ నెం.5 వర్గం దగ్గరికి వద్దాం.

ఆ విధంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ తామే ప్రచారించిన కుహనా న్యాయస్పృతి, శిక్షాస్పృతి, మంచితనం గట్రా తంత్రాల మాయలో తామే పడ్డట్లు, నెం.5 వర్గం కూడా అవే నిర్వచనాలు పాటిస్తుంది అనుకున్నారు. కాబట్టే ఉనికి బయల్పడిన ఏజంట్లని నిర్వీర్యం చేయటమో, ప్రాణాలు దీయటమో గాకుండా వారిలోని దుష్టత్వాన్ని రూపుమాపే ప్రయత్నమూ, పరివర్తన తెచ్చే ప్రయత్నమూ చేస్తుందేమో ననుకున్నారు. ఎందుకంటే ‘మొత్తం తమ ఏజంట్లే ఉన్నప్పుడు, ఇప్పటికి ఇప్పుడు మొత్తంగా మంచివాళ్ళను ఎక్కడిని నుండి తెచ్చి ఇన్ స్టాల్ చేయగలరు?’ అన్నది వాళ్ళ ధీమా! ఆ భ్రమలో పడి తాము Expose అవుతున్నతీరు గానీ, సువర్ణముఖి అనుభవిస్తున్న తీరుగానీ గుర్తించుకోలేదు. ఆయా సంఘటనలనీ, స్ట్రాటజీని తము ప్రచారించిన ’కుహనా’ దృష్టి [Pseudo Vision] తోనే చూసారు.

నిజానికి గీత ’యుక్తాహర విహారాస్య’ అని చెప్పినట్లు దేనికైనా ఒక అవధి [Limit] ఉంటుంది. కాబట్టి శిక్షించటంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. దీన్నే భగవద్గీత విభూతి యోగంలో

శ్లోకం:
దండో దమయతానుస్మి నీతిరస్మి జిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్

భావం:
దండించే వారి దండనీతినీ, జయించే వారి రాజనీతినీ, గోప్యములలో మౌనాన్నీ, జ్ఞానులలో జ్ఞానాన్నీ నేనే.

అని స్పష్టంగా చెబుతుంది. ఇది తెలియని, ఇది అర్ధం కాని నెం.10 వర్గం, ఎప్పటికప్పుడు వత్తిడిలోనూ, అప్పటికి మెదళ్ళతో యుద్ధంలోని అంకాన్ని ఎదుర్కోవడంలోనూ తలమునకలై ఉంది.

ఈ స్థితిలో, అనుకోని ఆశనిపాతమే వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం. ప్రతికూల వాతావరణం హెలికాప్టర్ ప్రమాదానికి కారణం. దీన్ని ఎవరూ ఏమన లేరు. కాదు నెం.5 వర్గం జరిపించింది అని నకిలీ కణిక వర్గమూ, నెం.10 అనలేదు. అందులోని కీలకవ్యక్తి అయిన రామోజీరావు అంతకంటే అనలేడు. అసలే వ్యవహారం అటూ ఇటూ అయితే తన మెడకి చుట్టుకునే స్థితి. ఈ పైకారణం [over leaf reason] తో తన ఆస్థులు అగ్నికి ఆహుతి అయినా, తమకు భౌతిక నష్టం కలిగినా చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఇతడి సోదరితుల్య సోనియాగాంధీ అంతకంటే ఏమీ చేయలేదు. ఒకప్పుడు దేశమ్మీద కుట్రజరుగుతుందని తెలిసినా ఇందిరాగాంధీ ఏ విధంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో ఉండిందో అదే ఇప్పుడు తమపరిస్థితి కూడా! ఆనాడు ఇందిరాగాంధీ విదేశీ హస్తాన్ని ఎలా నిరూపించలేకపోయిందో, ఈనాడు నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థా కూడా నెం.5 ని నిరూపించలేదు. ఇది ఒక సువర్ణముఖి.

అంతేకాదు! తమ కుట్రలకి వ్యతిరేకంగా పోరాడిన ఎందరో యోధుల్ని, మానవతావాదుల్ని, దేశభక్తుల్ని ప్రాణభీతికి గురిచేసినందుకూ, ప్రాణాలు హరించినందుకూ ఇప్పుడు తామూ ’ప్రాణభీతి’ని అనుభవించవలసి రావటం మరో సువర్ణముఖి. ఈ ప్రాణభీతే ప్రత్యేక విమానాలని వదిలి ఏకానమీ క్లాసులో ప్రయాణింప చేస్తుంది. దీని గురించి తర్వాత వివరిస్తాను.

ఇక దీనికి మరోపార్శ్యం ఏమిటంటే….
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

అది నెం.10 వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ అయితే, ఇదే విషయంలో నెం.5 వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ ఏమిటంటే – టీవీల్లో, పత్రికల్లో ’చచ్చినోడి కళ్ళు చారెడు’ అన్న సామెతకు బదులుగా ’చచ్చినోడి కళ్ళు చారెడు, బారెడు కాదు ఏకంగా మైళ్ళకొద్దీ’ అనేంతగా వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించినా, ఆర్జంటుగా అతణ్ణి లోకనాయకుడు, ఆపద్భందువు, అపర భగీరధుడు, జలదాత, జననేత…. గట్రా గట్రా చేసేసినా, దేవుణ్ణి చేసేసినా ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. మహా అయితే ’ఇదేం పోకడరా బాబూ!’ అన్న చికాకూ కలగచ్చు. ఇంకా ఎక్కువైతే జుగుప్స కలగొచ్చు. అది కొద్దిపాటి అసౌకర్యమే! భరించలేకపోతే జనాలు టీవీలు కట్టేసు కుంటారు, లేదా చేతిలో పేపరు గిరాటేసుకుంటారు. అంతే!

అదే అభిమానులం అంటూ కొందరు రోడ్ల కెక్కితే…. అందులో ఏదీ తెలియని, నిజమైన అభిమానులు కొందరుండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దామనుకునే కుతుహలంతో కొందరు చేరొచ్చు. ఆ గుంపులోకి కొందరు లూటీదార్లూ చేరతారు. స్థానికంగా ఉండే ఛోటామోటా నాయకులు, వీళ్ళని ’అన్నా’ అని పిలుస్తూ వెంట దిరిగే మరికొందరు అనుచరులూ, ‘రోడ్డు కెక్కటం’ అన్న ప్రక్రియ, ఆయా స్థానిక ఛోటామోటా నాయకులకి తమ తమ రాజకీయనాయకులతో ఉన్న సంబంధాల పైనా, Communication పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే గుంపుగా జనాలు రోడ్డు కెక్కుతారో, అందులోకి లూటీదారుల వంటి నేరగాళ్ళు దూరతారు. ఇక కిరాణా దుకాణాలు, సూపర్ బజారులూ, మద్యం, టీవీ, ఫ్రిజ్జ్ లూ, మిక్సిలూ అమ్మే దుకాణాల దగ్గరి నుండి వెండి బంగారు దుకాణాల వరకూ, వస్త్ర దుకాణాల వరకూ…. అందినవి, అందినట్లు దోచుకుంటారు. హోటళ్ళు గట్రాలని తగలబెడతారు. వాహన షోరూంల షట్టర్ లను కూడా బద్దలు కొట్టి కొత్త వాహనాలని ఎత్తుకుపోయిన సంఘటనలు విజయవాడలో వంగవీటి మోహనరంగా హత్యానంతరం, దేవినేని మురళి హత్యానంతరం, జరిగాయి. ఆ సమయంలో ఏ వస్తువు లూటీ చేసినా అందినంత లాభమే! పోలీసులు, కేసులు… ఏ గొడవా ఉండదు.

విజయవాడలో రంగా హత్య తర్వాత జరిగిన లూటీల్లో అయితే - ఓ వ్యక్తి బ్లాక్ & వైట్ టీవీ, చిన్నది, లూటీ చేసుకు ఇంటికి వెళ్ళితే అతడి భార్య కలర్ టీవీ తేలేదని తిట్టిందట. అందుకోసం మళ్ళీ రోడ్డుమీదకి వచ్చిన సదరు భర్త, అప్పటికి మొదలైన పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ వార్తని ఫోటోతో సహా బాక్సు కట్టి పత్రికల్లో ప్రచురించగా గుంటూరు, విజయవాడలలో అప్పట్లో అది విపరీతంగా చర్చనీయాంశం అయ్యింది. అలాంటి వార్తలని మీడియా అప్పట్లో మరింతగా ఎందుకు ప్రచారించిందంటే, అరాచకం ప్రబలిపోయిందనీ, ప్రజలు బుర్రలకి ఎక్కించటానికి. నకిలీ కణిక వ్యవస్థ ప్రణాళిక ప్రకారం ’ముఠా రాజకీయాలు’ అన్నపైకారణం [over leaf reason] తో నిర్వహించిన అరాచకాల్లో అదీ ఒకటి. ఆ సమయంలో ఎవరి అనుచరులు ఎక్కువ లూటీలు, దహనాలు చేశారో, తరువాత స్వల్పవ్యవధిలో వాళ్ళు బలమైన స్థానిక నేతలుగా ఎదిగారు. అందునా లూటీలు చేసిన వారిపై కేసులు రాకుండా చూడటం, వచ్చిన కేసుల్ని మాఫీ చేయించటం వంటి చర్యలతో మరింత బలం పెంచుకున్నారు.

ప్రజాజీవనంలో అవినీతి అప్పడే అంతగా ఉండగా, ఇప్పటి పరిస్థితి వేరుగా చెప్పుకోవాలా? టమాటాలు మార్కెట్లో, రైతుకి కేజీకి 35 పైసలు కూడా చెల్లించని దళారులపై కడుపుమండి, కాయలు తెంపిన కూలీ గిట్టని వ్యధతో, వృధాగా రోడ్లపై టమాటాలు పారేయలేని రైతులు, తమ నిరసనని తెలిపేందుకు, టమాటాలు మినీలారీలలో, ఆటోలలో తెచ్చి, ప్రజలకి ఉచితంగా పంచిపెట్టడానికి వస్తే….ఆత్మాభిమానం గానీ, ’మనం మార్కెట్లో 4/- రూపాయలకి టమాటాలు కొంటున్నాం [అప్పటి ధర], రైతుకి 35 పైసలు కూడా గిట్టక రైతు ఇక్కడికి తెచ్చాడట. కనీసం మనం మార్కెట్ రేటులో సగమన్నా ఇద్దాం’ అన్న ఆలోచన గానీ, లేకుండా గంపలూ, బకెట్లతో టమాటాలు తీసుకోవడానికి ప్రజలు ఎగబడటం, కొన్నిరోజుల క్రితం జరగగా, టపాకాయలో పేల్చాను.

అంతగా, ప్రజలలో చాలామందికి, ఊరికే వచ్చే సొమ్ము తియ్యగా ఉంది అనుకునే అవినీతి వర్తన అలవాటు అయ్యింది. ఇలాంటి దృక్పధాన్ని అలవరిచేందుకు, పదుల సంవత్సరాలుగా మీడియా, నకిలీ కణిక వ్యవస్థా చేసిన నిరంతర ప్రయత్న ఫలితమది. అలాంటి చోట, గుంపుగా జనం, ‘అభిమానులమంటు’ రోడ్లపై గుమిగూడితే, కేవలం లూటీలతోనే ఆగిపోదు. ఆ గుంపుల్లో దూరిన నేరగాళ్ళు, స్వార్ధపరులూ, తమకి అక్కసూ, కోపం ఉన్నవారి మీద, పాత తగదాలున్న వారి ఇళ్ళ మీదా పడి, ఇంట్లో వస్తువుల్ని ఎత్తుకుపోవటం, ఆడవాళ్ళని అవమానించటం, హింసా విధ్వంసాలకు పాల్పడటం కూడా, అక్కడక్కడా గతంలో జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు చాలా మామూలుగా తము ఈ పరిస్థితిని ఊహించలేదని, కాబట్టి వాటిని ఆపలేకపోయామని సమాధానం చెప్పడం కూడా కద్దు. వీటన్నింటి వెనుకా అప్పటి అధికారపార్టీ మద్దతు ఉంటుంది.

అలాంటి వేవీ జరగకుండా, ముందుగా సీ.ఎం. మిస్సింగ్… ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మీడియా ద్వారా సృష్టింపబడింది. అందులో నెం.10 వర్గపు అవసరం నెం.10 ది కావచ్చు గాక. ఆ సస్పెన్సు కొద్దీ టీవీల ముందు చతికిలబడిన జనం, అదే అయోమయంతోనూ, సస్పెన్సుతోనూ ఉన్న రాజకీయనేతల గణం….. రోడెక్కలేదు.

మర్నాటికి ముఖ్యమంత్రి మరణ వార్త తెలిసినా, అప్పటికి మీడియా అతణ్ణి దేవుణ్ణి చేసేస్తూ ప్రశంశల సునామీ సృష్టించటంతో అంతా అదే ఒరవడిలో వెళ్ళిపోయింది. ఆ విధంగా పోలీసులను అలర్ట్ చేయటం జరిగింది.

లూటీలు, దహనాలు, పాతకక్షలని సాధించుకుంటూ హింసా విధ్వంసాలు, నివారింపబడేటప్పుడు, అతిప్రచారాలతో కలిగే చికాకూ వెగటూ వంటి మానసిక అసౌకర్యం పెద్దగా పరిగణనలోకి తీసుకోవలసిన అంశం కాదు. ఇది నెం.5 వర్గం నెరవేర్చుకున్న ఆకాంక్ష. ఎందుకంటే నెం.5 కి మనుషుల పట్లా, మానవత్వం పట్లా, రాష్ట్రం, దేశాల పట్లా, ప్రజల పట్లా నిబద్దత ఉంది గనుక!

ఇక్కడ ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే – ఈనాడు రామోజీరావుకు కూడా దాదాపు ఇలాంటి అవసరమే ఉండటం. తమ స్ట్రాటజీలో భాగంగా రామోజీరావుకూ రాజశేఖర్ రెడ్డికీ వైరాన్ని, ఈనాడు Vs సాక్షిల యుద్ధాన్ని తెగ ప్రచారించారయ్యె! అది నమ్మే ’మీడియా ప్రభావితులు’, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అకాలమృత్యువు పాలయ్యాడనగానే, హెలికాప్టర్ ప్రమాదం మీద అనుమానాలు పుట్టుకొస్తాయి. అందరి చూపులు రామోజీరావుమీద, చంద్రబాబునాయుడిల మీద కేంద్రీకరించబడతాయి. అసలుకే సెప్టెంబరు రెండుకు ముందు, ఆగస్టు 31న రాజశేఖర్ రెడ్డి తెదేపా పని ఫినిఫ్ అయిపోతుందనీ, దాని మీద సెప్టెంబరు ఒకటో తారీఖు ’ఎవరు ఫినిఫ్ అవుతారో చూద్దాం’ అని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. పరిస్థితి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా, ఇప్పటికే సృష్టింపబడిన వై.యస్. భక్తగణం, అభిమానుల దళం, మొదట దాడి చేసేది రామోజీరావు, చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యక్తిగత ఆస్థులపైన, ఈనాడు, మార్గదర్శి, కళాంజలి, బ్రిసా గట్రా గట్రాలపైనే. వై.యస్.ని అర్జంటుగా ’దేవుణ్ణి’ చేయటం వెనుక ఇది కూడా ఓ పైకారణం[Over leaf reason]గా చెప్పుకోవచ్చునన్న ఆలోచన కూడా రామోజీరావుకి ఉంది. అయితే ఆస్థుల సంరక్షణ కంటే పెద్ద ప్రయోజనం, వై.యస్.మరణం వెనుక అనుపానులు తెలుసుకోవటమే, దాన్ని బట్టి తదుపరి వ్యూహరచన చేయవలసిన అవసరం ఉండటమే!

నిజానికి దేశంలో గానీ, రాష్ట్రంలో గాని, అధికారంలో ఉన్న నాయకులు, ముఖ్యనేతలూ, ఆకస్మికంగా మృతి చెందినప్పుడు అరాచకాలు ప్రబలకుండా, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేటందుకూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేటందుకు ఆయా వార్తలని నియంత్రిస్తారు. నెమ్మదిగా, అంచెలంచెలుగా నిజాలు వెలువరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా, ఏ దేశంలో అయినా ఇదే సూత్రం అనుసరించబడుతుంది.

జాన్.ఎఫ్.కెన్నడీ అధికారంలో ఉండగా, కారుర్యాలీలో హత్య చేయబడితే, అతడు ఘటనాస్థలంలోనే మరణించినా, ఆసుపత్రికి తరలించిన కొన్ని గంటల వ్యవధి తర్వాత మరణవార్త ధృవీకరింపబడింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం కూడా, ఆమె ఘటనా స్థలలోనే మరణించినా, ఆసుపత్రికి తరలించిన కొన్నిగంటలు తర్వాత, అధికారికంగా మరణ వార్తా ప్రకటన జరిగింది. [అయినప్పటికీ సిక్కుల ఊచకోత జరిగింది. అది వ్యవస్థీకృతమనీ, ముందుగా రచించుకున్న పధకం ప్రకారం జరిగిందనీ ఇప్పటికే నిరూపించబడింది. అయినా ఇన్నేళ్ళుగా కులదీప్ నయ్యర్ సిక్కుల మనోభావాల గురించి నిరంతరాయంగా వ్రాస్తూనే ఉంటాడు, అది వేరే విషయం.]

అది అప్పడప్పుడూ జరిగే సహజ ప్రక్రియ. అయితే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి మృతి విషయంలో, పరస్పర విరుద్ధ వార్తలూ, రోజు రోజుకీ వెలువడటం గమనార్హం. ఇది పూర్తిగా అసహజం. ఈ రోజు వచ్చిన వార్తకు తరువాత విరుద్ధ వార్త, ఆ తరువాత మరో విరుద్ద వార్త. ఇలా…. దాదాపు ప్రతీ వార్తా మరో వార్తకి విరుద్దంగా ఉంటూ, అందులోనూ అసహజ బాష్యాలూ, నాటకీయ పరిణామాలు ఉండటం ఇక్కడ విస్మరించకూడని విషయాలు. వీరప్ప మొయిలీ వంటి నాయకులు సైతం ఈరోజు ప్రకటనకీ, మర్నాటి ప్రకటనకీ పొంతన ఉండకపోవడం – మీడియా మాయాజాలమో, రాజకీయ నాయకుల మాటకారి తనమో, అన్నిటినీ కమ్ముకు వచ్చిన గూఢచర్య తంత్రమో వారికే తెలియాలి.

ఇక మీడియాకి ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే – ఎటూ తము పాముల వారిలాగా నాగస్వరం ఎటు ఊపితే అటు, పాముల్లాగా జనాలూ ఊగుతారు.

ఇప్పుడు తామూ, అధిష్టానమూ ప్రాముఖ్యత ఇస్తున్నామంటే… ‘మరణించిన ముఖ్యమంత్రి చరిత్రని సినిమా తీస్తాం, అతడికి గుడి కట్టిస్తాం, అతడి కోసం పదవే త్యాగం చేస్తాం, అతడి వారసులని సీట్లో కూర్చోబెట్టకపోతే మానవబాంబులమౌతాం’ అనే వీరాగ్రేసరులంతా రేపు తామూ, అధిష్టానము ’ఛల్’ అనగానే మామూలుగా ప్లేటు ఫిరాయిస్తారు గనుకా….

అధిష్టానానికి ఎదురుతిరిగితే ప్యూజులు ఎగిరిపోతాయి. కాబట్టి అధిష్టానం ఏది అంటే అది శిరోధార్యం అంటారు గనుకా….

ఇప్పుడు జయహో అన్న నోటితోనే రేపు వ్యతిరేకంగా మాట్లాడమన్నా వెనుకాడరు గనుకా….

ఎటూ ప్రజల జ్ఞాపక శక్తి తాత్కాలికం గనుక…..

ఇప్పుడు ఎలా ప్రచారించినా ఫర్వాలేదు. ముందు తమ గూఢచర్యం, తమ పనులు, తమకు సానుకూల పడటం ముఖ్యం.

కాబట్టే సహజ మరణాలను కూడా అభిమానుల ఆగిన గుండెచప్పుళ్ళుగా దైనందిక స్కోరు ప్రకటించారు. జాతీయ పత్రిక ‘ఇండియా టుడే’ అనుబంధ పత్రిక ‘మెయిల్ టుడే’ సర్వే చేసి, ‘అసలు టీవీ కూడా లేని వృద్ధుడు టీవీ చూసి ఏడ్చి ఏడ్చి మరణించటం వంటి సంఘటనలు ఎలా జరిగాయి?’ అంటూ లెక్కలు బయటికి తీస్తే….

స్థానిక పత్రిక అయి ఉండీ, అందునా కాంగ్రెస్ కి తాను వ్యతిరేకమని న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా [ఆ నాటికి ప్రయోజనకరం అన్పించి అనుసరించిన స్ట్రాటజీ అది] అఫిడవిట్ సమర్పించిన ఈనాడు కీ….

అందునా నిజాలు నిర్భయంగా వ్రాసే ట్రెండ్ సెట్టర్ గా తమని తాము అభివర్ణించుకున్న ఈనాడు యజమాన్యానికి….

ఈ మరణాలలో నిజాలెన్ని, ఎంతో కొంత పైకం, రాజకీయనాయకులో[టీజీ వెంకటేష్ కి లాగా] లేక ప్రభుత్వమో ముట్టచెప్పకపోతుందా అని ఆశతో, సహజమరణాలని దుఃఖంతో మరణించారని చెప్పబడిన వెన్ని?... అన్న విషయం తెలియదా? ఏకధాటిగా, దినదినానికి తగ్గుముఖం పట్టటానికి బదులుగా, పెరిగిపోయిన ప్రజాభిమానాన్ని, కొనసాగుతూనే ఉండిన అభిమానుల దుఃఖాతిశయ మరణాలని, పావురాల గుట్ట [రుద్రకోడూరు]కి జాతరలాగా జనం కదలిపోతున్న వైనాన్ని ప్రచురిస్తూనే ఉండటం వెనుక గల ’కొన్ని’కారణాలలో Time gain చేయటం ప్రధానమైనది.

ఆ విధంగా వై.యస్. మరణానంతరం ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ జరుగుతున్న పరిణామాల గురించి తము చెప్పింది వినటం, వ్రాసింది చదవటం తప్ప, ప్రజలు పరిశీలించకూడదు, ఆలోచించకూడదు అన్నది వాళ్ళ అవసరం. ప్రజలే కాదు, ఎవరికీ…. చివరికి ‘రాజకీయనాయకులకి సైతం పెద్దగా ఏదీ అర్ధం కాకూడదు’ అన్నది అక్కడ తీసుకోబడిన జాగ్రత్త. అదెందుకో కూడా వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

"నెం.5 వర్గం నన్ను నమ్ముతోంది. ఇదిగో ఈ సీనియర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇదిగో ఈ XYZ లు నన్ను ఇరుకున బెడుతున్నారు. ఈ problem solve అయితే మరింకా చాలా ప్రోగెస్ వస్తుంది” అంటూ నమ్మబలికాడు. అతడన్నదానికల్లా నెం.5 కూడా ఇతోధికంగా అవునన్న Picture ఇచ్చింది. ఆ XYZ లు సీనియర్లు కాకా, వీ.హెచ్.ల వంటి వారు కావచ్చు. కే.కే.ల వంటి వారు కావచ్చు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి వంటి వారు కావచ్చు. పి.జె.ఆర్., మర్రిశశిధర్ రెడ్డిల వంటి వారు కావచ్చు. ఒక్కొక్కరినీ ఒక్కోవిధంగా నలగేసి గ్రిప్ వచ్చేటట్లు…. సాక్షాత్తూ నెం.10, రామోజీరావు కూడా ఏ.ఐ.సి.సి. అధిష్టానం ద్వారా గ్రిప్ ఇచ్చేటట్లు…. రాజశేఖర్ రెడ్డి చూసుకున్నాడు.

పంచతంత్రం కథలో గుడ్లగూబకి పిల్లినీ, పిల్లికి వేటగాణ్ణి చూపించి, పబ్బం గడుపుకున్న ఎలుకలాగా తాను చాలా తెలివిగా గూఢచర్యం నడుపుతున్నాననుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇందులో ఉన్న స్ట్రాటజీ గానీ…. రామోజీరావుకీ, నెం.10 కీ, సోనియాగాంధీకి నడవవలసి ఉన్న సువర్ణముఖి రీత్యానూ, వాళ్ళ నిజరూపాలు బహిర్గతం [Expose] కావటం కోసమూ, నెం.5 ఇదంతా allow చేస్తోందనిగానీ…. గ్రహించగలిగేంత తెలివితేటలు రాజశేఖర్ రెడ్డికి లేవు. తనకు నెం.5 ని చూపిస్తూ, మధ్యలో రాజశేఖర్ రెడ్డి ’సందట్లో సడేమియా’ అన్న సామెత చందాన, మరింకేవో నడుపుతున్నాడన్న అనుమానం, నకిలీ కణికవ్యవస్థకి, రామోజీరావుకి రాలేదు. వచ్చిన పరిస్థితులు అందుకు Support చేయలేదు.

ఒక వ్యక్తికీ, ఒక వ్యవస్థకీ ఇనుపతెర[Iron curtain] వేయటం గూఢచర్యంలో సాధారణం. ఎవరికి పట్టు ఎక్కువ ఉంటే వారు ఇది చెయ్యగలరు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఎమర్జన్సీ విషయంలో నకిలీ కణిక వ్యవస్థ అనుసరించింది ఈ తంత్రమే [స్ట్రాటజీనే]. రష్యా విడిపోక ముందు ఇలాంటి తెర వేసే, సోవియట్ రష్యా గురించి ప్రపంచానికి చూపించింది.

ఇటీవల వచ్చిన ’కింగ్’ సినిమాలో, హీరోయిన్ త్రిషకి, హీరో నాగార్జున, ఆమె పాటకి అభిమానులు పడిచచ్చిపోతున్నారని, ఆమె పాడనంటే నిజంగా అత్మహత్యలు చేసుకోబోతున్నారనీ నమ్మిస్తాడు. అతడి అనుచరులంతా కలిసి ఇచ్చిన పిక్చర్ కి, ఆమె నిజంగానే తనకి అందరు అభిమానులున్నారనీ, తానో గొప్ప గాయకురాలిననీ నమ్మేస్తుంది. అది సినిమా కాబట్టి, అందులో అది వినోదార్ధం ఉన్న హాస్యం కాబట్టి మనం నవ్వేస్తాం. పెద్దగా ఆలోచించం. కానీ అది గూఢచర్యంలో అవసరానికి బాగా ఉపయోగపడే బలమైన స్ట్రాటజీ.

’ఇదేమిటి, ఈవిడ అన్ని సినిమాల్లో అంశాలు చూపిస్తుంది’ అనుకోకండి. 1992 కు ముందర వరకూ నకిలీ కణిక వ్యవస్థ, ప్రజలలో తార్కిక శక్తిని నాశనం చెయ్యటానికీ, ఉత్సాహ ధైర్యాలని హరించటానికీ సినిమా మాధ్యమాన్ని వాడుకుంటే 1992 తర్వాత పీవీజీ, నెం.5 వర్గం, అదే సినిమా మాధ్యమాన్ని, టీవీ [సీరియళ్ళ]మాధ్యమాన్ని ప్రజలు కుట్రలని అర్ధం చేసుకునే స్థాయికి తీసికెళ్ళటానికి ఉపయోగించింది, ఉపయోగిస్తోంది.

సరే! మళ్ళీ విషయం దగ్గరికి వద్దాం. నెం.5 వర్గాన్ని నమ్మిస్తున్నానంటూ నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తి రామోజీరావునీ, అతడి సోదరతుల్యరాలైన సోనియాగాంధీని నమ్మిస్తూ తన బలం, బలగం పెంచుకుంటూ పోయాడు రాజశేఖర్ రెడ్డి. కాబట్టే ఇప్పుడు తిరిగిచూస్తే అతడి సంపాదన 73వేల కోట్లనీ, అంతకు కొంచెం ఎక్కువో తక్కువో ఉంటుందనీ వార్తలొస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ దగ్గర నుండీ, వీలయిన అన్ని మార్గాల్లో అతడు అక్రమార్జన చేసాడన్నది అతడి మరణానికి పూర్వం నుండే ఉన్న విమర్శలలో ఒకటి.

ఈ నేపధ్యంలో ‘సందట్లో సడేమియా’ అన్న చందాన రాజశేఖర్ రెడ్డి తన బలం బలగం పెంచుకుంటూ పోతుండగా, చివరికి ప్రభుత్వధనంతో పర్సనల్ ఇమేజ్ పెంచుకునే విధంగా ‘నా మనసే మహా శివుడు’ అంటూ ప్రకటనలు ఇచ్చుకున్నా, అందర్నీ తనకు విధేయులయ్యేటట్లుగా మలచుకున్నా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు గానీ, సోనియాగాంధీ కానీ అభ్యంతర పెట్టలేదు. మీదు మిక్కిలి అధిష్టానం రాజశేఖర్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉందన్న సంకేతాలూ ఇచ్చారు.

అయితే, క్రమంగా ’రాజశేఖర్ రెడ్డి అక్కడున్నదానిని తాను గ్రహిస్తున్నాడా లేక తాననుకున్నది అక్కడుందను కుంటున్నాడా? విషయాన్ని సరిగ్గా గ్రహిస్తున్నాడా లేదా! సమాచారాన్నీ సరిగా గ్రహించి విశ్లేషిస్తున్నాడా లేక తాను అనుకున్నది తమకి చెపుతున్నాడా’ అన్న సందేహం వచ్చింది. అంతే తప్ప రాజశేఖర్ రెడ్డి తమకే ’బుస్సు’ వేసేంతగా తోక ఝాడించగలడని అనుకోలేదు. ఎందుకంటే గూఢచర్య జ్ఞానం ఏమాత్రం ఉన్నవాడైనా తమతో అలాంటి చర్లాటలు ఆడడు గనుక! ముఖ్యమంత్రి సీట్ ఎక్కించే ముందే రాజశేఖర్ రెడ్డిని తగినంతగా నలగేసి ఎక్కించినందున, అతడంత రిస్క్ తీసుకోడన్న అభిప్రాయంతో ఉన్నందున, నెం.10 వర్గం రాజశేఖర్ రెడ్డి గ్రాహ్యశక్తిని మాత్రమే అనుమానించి, అతడి నుండి మరింతగా విషయసేకరణ చేయాలన్న ప్రయత్నం చేసింది.

ఆ క్రమంలో, రాజశేఖర్ రెడ్డి, గూఢచర్యంలో తనదైన ’మిర్చి మసాలా’ కలపటం లేదు కదా అన్న అనుమానం రామోజీరావుకు వచ్చింది. సమాచారాన్ని తమకు పారదర్శకంగా చెప్పడం లేదనీ, ఇంకేదో Hide outs ఉన్నాయనీ తోచింది. అబద్దాలు చెప్పేటప్పుడూ, నిజాలనూ దాచినప్పుడు, అతకూ పొతుకూ లేని సమాధానాలు రావడం, తడబాట్లు పడటం, పరస్పర విరుద్ధమైన సమాధానాలు, వివరణలు చెప్పడం సహజం. అది గ్రహించలేనంత అమాయకత్వం నెం.10 వర్గంలోనూ, నకిలీ కణికవ్యవస్థలోనూ లేదు, రామోజీరావులో అంత కంటే లేదు.

దెబ్బతో గూఢచర్యపు వేగం పెరిగింది. కొంచెం కెలికి చూడటంతోనే రాజశేఖర్ రెడ్డి దగ్గర తేడా ఉందని అర్ధమైంది. మొత్తం వ్యవహారం చక్కదిద్దుకునే క్రమంలో, ముందుగా ఏంజరిగిందో కనుక్కోవాల్సి ఉంది. అది పూర్తయ్యింతర్వాతే తాము ఏ చర్య అయినా తీసుకోగలిగేది. ఏం జరిగిందో సమాచారం సేకరించుకునే ప్రయత్నంలో తానుండగానే, రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయ్యింది. హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయన్న విషయం తెలిసిన తర్వాత, ఏం జరిగిందో తెలుసుకోవటానికి బయటికి చెప్పినట్లు 24 గంటల సమయం పట్టదు. అసలు గాలింపు చర్యలు ప్రారంభం అయ్యేలోపున గడిచిన మూడుగంటల్లోనే హెలికాప్టర్ ఏమయ్యిందో, ఎక్కడ కూలిపోయిందో…. ప్రజలకి తెలియకపోవచ్చు గానీ, అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వానికీ, నెం.10 వర్గానికీ కాదు. గల్లంతు విషయం బయటికి పొక్కేలోగానే తమపని ప్రారంభించారు. ఎందుకంటే తాము విషయసేకరణ అనంతరం, అంటే కొంత వ్యవధి తర్వాత తప్పించదలచుకున్న పాత్ర, ఇంత అర్దాంతరంగా, తమ విషయసేకరణ, తమ పని, సగంలో ఉండగానే ఎలా తప్పించబడింది? యాదృచ్చికంగానే ప్రమాదం జరిగిందా? ఎవరైనా జరిపించారా?

ఇది వెంటనే తేల్చుకునే నిమిత్తమే, గాలింపు చర్యలూ, మిస్సింగ్ వార్త బయటికి పొక్కటమూ కూడా, హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయిన కొన్నిగంటల తర్వాత జరిగాయి. ఉదయం 8.35 కి బయలుదేరిన హెలికాప్టర్ కి రాడార్ తోనూ, భూతల కేంద్రం తోనూ 9.35కి సంబంధాలు తెగిపోతే మధ్యాహ్నం 12 గంటలు తర్వాత గానీ వెదుకులాట ప్రారంభం కాలేదు. రమారమి మూడుగంటలు జాప్యం. ఈ లోపున ఏం జరిగింది? నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలకవ్యక్తి రామోజీరావూ తరుపు ’పరిశోధకులు’ ముందుగా సంఘటనా స్థలంని చేరుకుని, ‘ప్రమాదం యాదృచ్చికమా?, ప్రయత్నపూర్వకమా?’ అన్నదానిని నిర్ధారించుకున్నారు. విస్పోటన పదార్ధాలున్నాయా? హెలికాప్టర్ శకలాలు పడి ఉన్న తీరు, మృతులు శరీరాల పరిస్థితి…. అన్నిటినీ పరిశీలించుకుని, తదుపరి పరిశీలనార్ధం సాంకేతికంగా రికార్డు చేసుకున్నాక మాత్రమే, వార్త బయటకి, మీడియాకి పొక్కింది. దాదాపు అదే సమయంలో గాలింపు మొదలయ్యింది. ఆ తర్వాత, సాయంత్రం నాలుగు గంటలకి అప్పటి ఆర్ధికమంత్రి రోశయ్య, అధికారికంగా, సీ.ఎం. హెలికాప్టర్ గల్లంతయ్యిందని ప్రకటించాడు.

అనధికారికంగా, సీ.యం.హెలికాప్టర్ క్షేమంగా లాండ్ అయిందనీ, వర్షం వల్ల బయటికి రావటానికి ఇబ్బంది పడుతుండవచ్చనీ తను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పాడు. ఇక ‘అక్కడ లాండ్ అయ్యిందట. ఇక్కడ లాండ్ అయ్యిందట. సీ.ఎం. నడుచుకుంటూ వస్తున్నాడట’ అంటూ అనేకరకాల ఉహాగానాలూ, కట్టుకథలు ప్రచారమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువన చూశామని కొందరూ, దిగువున చూశామని కొందరూ, నీరుగంగ దగ్గరని కొందరూ, అక్కమహాదేవి గుహదగ్గరని కొందరూ, రిజర్వాయర్ నీటిలో ఇంధనం తెట్టుకట్టిందనీ, మెరుపు మెరిసిందనీ, పెద్దచప్పుడయ్యిందనీ, అలాంటివేవీ గమనించలేదనీ…. ఇలా రకరకాల వదంతులు. వీటికి మీడియా కూడా తనవంతు ప్రాధాన్యం ఇచ్చి మరింత సంచలనాలు రేపింది.

అదేదో నల్లమల అడవులు, భట్టివిక్రమార్క కథల్లోని లాంటి దుర్గమారణ్యాలు అయినట్లు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అయినట్లు వెదుకులాటకు 24 గంటలు సమయం పట్టింది. ఎంత వర్షం కురిసి వాగులు వంకలూ పొంగాయి అనుకున్నా, నల్లమల అడవులు అంత దుర్భేద్యమైనవి కావు. శ్రీశైలంలో ఏడేళ్ళు నివసించిన మాకు తెలిసిన, విన్న సమాచారంతో, అక్కడి గిరిజన యువకులు అడవి లోతట్టుప్రాంతాలకు ఎంత వర్షంలోనైనా వెళ్ళి రాగలరు.

అసలు, వేసవి కాలంలో చూస్తే, నల్లమల కొండలన్నీ గుండు కొట్టినట్లు, ఆకులు రాలిన చెట్లకొమ్మలతో రెండుమూడు కిలోమీటర్ల లోపల ఏముందో, రోడ్డుమీదనుండి కనిపించేటట్లుగా ఉంటాయి. అంతగా అడవిని గొరిగి తినేస్తున్నారు. దీనిలో ప్రధాన వాటా ఫారెస్ట్ డిపార్డ్ మెంటు వారిదే! తత్తూరు జాతరకి నాగలి, ఎడ్లబండి కి కావలసిన కలపను తీసుకురావటానికి అడవి లోపలికంటా వెళ్ళి, పెద్దపెద్ద మానుల్ని కొట్టుకొస్తారు. అది కూడా కొండలోయలు దాటి! ఎక్కడ తమకి కావలసిన కలప దొరుకుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ఫారెస్ట్ డిపార్ట్ మెంటు కంటే వీళ్ళకే అడవి గురించి బాగా తెలుసన్న మాట. శివరాత్రి తర్వాత మొదలుపెట్టి, కాలినడకన, ఉగాదికి శ్రీశైలం చేరే, కన్నడ భక్తులు, అడవి దారిలో వస్తూ, చాలా ఎత్తూ, లావూ ఉండే వెదురు బొంగుల్ని కొట్టుకొస్తారు. వాటిని అలంకరించి ఉగాది నాడు రధాన్ని అలంకరిస్తారు. అడవిలో అతి లోతట్టుప్రాంతాలుగా పిలిచే ప్రదేశాల వరకూ కాలిబాటలున్నాయి. మేకలు కాసే వాళ్ళు, గడ్డికోసం, కట్టెల కోసం వెళ్ళేవాళ్ళ ’పుణ్యం’ అది. ఇది గాక దాదాపు ప్రతి రాత్రీ, అడవిని తగలేసి బొగ్గులు తయారు చేసేవారి పుణ్యాన అడవి మరింత పల్చబడింది. ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో తమ వాటా తమకి వస్తూంది కాబట్టి, ఫారెస్టు డిపార్ట్ మెంటు వారు ఆనందంగా అంధులైపోతారు. ఫలనా ఫారెస్ట్ రేంజ్ వాళ్ళు ఇంత తింటున్నారు, మేం తక్కువ తింటున్నామని, తమ ఉన్నతాధికారులతో మీటింగ్ లలో సైతం అందరూ కలిసి వాదించటం మేమే స్వయంగా చూసాము.

వర్షాకాలంలో చిగురించిన చిగురులతో అడవంతా ఆకుపచ్చగా శోభించే మాట నిజం. వాగులూ వంకలూ జలపాతాలూ ఉన్నమాటా నిజమే. అయితే అడుగుపెట్టలేనంత లేదా ఏ అనుపానులూ కనిపెట్టలేనంత దుర్గమం అయితే కాదు. అంత దుర్గమమే అయితే, నక్సల్స్ కదలికలు మాత్రం ఎలా సాధ్యం?

అదీగాక సీ.ఎం. హెలికాప్టర్ మిస్సయ్యిందన్న సెప్టెంబరు 2 వ తేదీన, అప్పటికి రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం, 2 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మా నంద్యాలలో హఠాత్తుగా తెరిపి ఇచ్చింది. వాతావరణం హఠాత్తుగా ఫెయిర్ అయిపోయింది. [బీజింగ్ లో ప్రారంభమైన ఒలింపిక్స్ ఉత్సవాలకి వర్షం ఆటంకం కలిగించకుండా మబ్బుల్ని చెదరగొట్టారు. కృత్రిమ వర్షాలకోసం బడా కంపెనీలు కాంట్రాక్టులని పుచ్చుకుని పనిచేస్తున్నాయి. కాబట్టి వర్షం కురిపించగల, తెరిపి ఇప్పించగల సాంకేతికత ఉందన్న విషయం అందరికీ తేటతెల్లమే.] నంద్యాలకు ప్రమాదస్థలం అయిన పావురాలగుట్ట ప్రాంతం రెడియల్ గా మహాఅయితే 50 కిలోమీటర్లు మించి ఉండదు.

ఇది మైదాన ప్రాంతం, అది కొండలూ గుట్టలూ ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అనుకున్నా, రెండవ తేదీ రాత్రి వరకూ వర్షం తెరిపి ఇవ్వకుండా కురిస్తుందన్నా, సుఖోయె విమానాలకీ, 11 హెలికాప్టర్లకీ జాడ తెలియకపోవచ్చు గానీ, కాలినడకన 5000 మంది CRPF సిబ్బంది[మంత్రి పల్లంరాజు ప్రకటన] అడవిని అంగుళం అంగుళం గాలించినా జాడ తెలియకపోవటం అంటే అసహజమే!

నక్సల్స్ గాలింపులో భాగంగా గ్రౌహోండ్స్ దళాలకి అడవిలో గడపటమూ అలవాటే, అడవిలో తిరగటమూ అలవాటే. ఇక స్థానిక గిరిజనులకి అది పుట్టుకతో వచ్చే అలవాటు. పాములపాడు BSNL టవర్ లో నమోదైన కాల్ కి, నల్లకాల్వ వైపు హెలికాప్టర్ వెళ్ళటం చూసినట్లు గ్రామస్తులు చెప్పిన సమాచారన్ని కలగలుపుకొని, గిరిజనులు సహకారంతో ఆ పరిసరాల్లో వెదికితే అచూకీ పట్టుకోవడం అసంభమేమీ కాదు. ఎందుకంటే రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు తలుచుకుంటే – మనసుంటే మార్గానికి కొదవరాదు, రాజు తలుచుకుంటే దెబ్బలకీ కొదవరాదు. కాబట్టి గల్లంతయిన హెలికాప్టర్ ఆచూకీ, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురి క్షేమ సమాచారం 24 గంటలకు పైగా జాప్యం తర్వాత వెలికి రావటంలో చాలా నాటకీయత ఉందని నిర్ధారణగా చెప్పవచ్చు. [ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ టపాల మాలికలోనే, తర్వాత చర్చిస్తాను.]

ఎందుకంటే – హెలికాప్టర్ గల్లంతు వార్త బయటకి పొక్కి గాలింపు చర్యలు ప్రారంభం కావటానికి మధ్య మూడుగంటల జాప్యం ఉంది. ఆ సమయాన్ని నెం.10 వర్గమూ, నకిలీ కణికవ్యవస్థా, రామోజీరావు, హెలికాప్టర్ ప్రమాదం సంభవించిన తీరు[యాదృచ్చికమా, లేక పధకం ప్రకారం జరిగిందా అన్న విషయం] గురించి శోధించడానికి gain చేసుకున్నారు. ఇక ప్రమాద/మరణ వార్త బయటకి తెలియటానికి తీసుకున్న 24 గంటల సమయాన్ని, తదుపరి వ్యూహాన్ని రచించుకోవడానికి gain చేసుకున్నారు.

ఇదంతా బహిరంగం కాకుండా ఉండేందుకూ, ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా ఉండేందుకు, మీడియా ’అతి’ సంచలనాలు రేపింది. అతుకుబొతుకు లేని వార్తాంశాలు ప్రచారం చేసింది. నిరవధిక ప్రత్యక్ష ప్రసారాలు చేసింది. దానికి తగ్గట్లే ప్రభుత్వమూ ’3 హెలికాప్టర్లు, 7 హెలికాప్టర్లు, 11+ హెలికాప్టర్లు రంగంలోకి దింపి, సమయం గడిచే కొద్దీ…. సైనిక ట్రూపులూ, సుభోయ్ విమానాలు, ఇస్రో విమానాలు, చివరికి అమెరికా అన్ని రకాల సాయం చేస్తుందన్న వరకూ, రకరకాల హైరానా పడింది. అంతకంతకూ ప్రయత్నాలు పెరిగిపోయినా, ఫలితం రానందున, ఎల్లెడలా ఉత్కంఠ పెరిగి పోయింది.

1992 కు ముందరైతే, నకిలీ కణిక వ్యవస్థకి ఎదురేలేదు గనుక దశాబ్ధాల క్రితమే, సుదీర్ఘమైన పధకాలు రచించి, వెంట్రుక వాసి తేడా లేకుండా జరిపించగలిగింది. ఎవరికి గూఢచర్య బలమూ, పట్టూ, ఎక్కువ ఉంటే, వారు ఇలా జరిపించుకోగలరు. ఒక సంఘటనను డిజైన్ చేస్తే, తదుపరి కార్యక్రమాన్నంతా కూడా, ముందే సిద్దం చేసుకున్నాకే రంగంలోకి దిగుతారు.

ఉదాహరణకి 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోనూ, మరికొన్ని చోట్లా సిక్కుల ఊచకోత చేసినట్లు! తర్వాత మీడియాకి కావలసినన్ని సంచలనల వార్తలు! 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరమూ ఇదే కథ. LTTE గురించీ, వారి సైనేడ్ గుళికల గురించి, అప్పటికి మానవబాంబులు కొత్తయినందున ఆ సంచలనాల గురించి, ఊపిరి సలపనంతగా వార్తాపత్రికల పేజీలు కిక్కిరిసిన వార్తలతో నిండిపోయాయి. ’ఆత్మహుతికి సిద్దపడేటట్లు చిన్నపిల్లల్ని తీసుకుని ’బ్రెయిన్ వాష్’ చేయటం తప్పుకదా’ అన్న విమర్శలు వస్తే, మరుక్షణం ’అసలలా Train up చేయగలిగారంటే ఆ LTTE నాయకత్వం ఎంత గొప్పది కదా’ అన్న ప్రశంసలూ వెల్లువెత్తాయి. అదే ఇప్పుడైతే మానవబాంబుల్ని తయారుచేయటం అతి సాధారణం, అతి చౌక అయిపోయాయి. అమ్మఒడిలో ఆటలాడుకునే పాలబుగ్గల పసిపాపల వయస్సునుండే బ్రెయిన్ వాష్ చెయడం ఎంత ’అమానుషమో’ అందరికీ అర్ధమయ్యేంతగా బహిర్గతమయ్యింది.

ఇలాంటి వాటికి మరో ఉదాహరణ వంగవీటి మోహనరంగా హత్యకేసు. హతుడు రౌడీ. తర్వాత రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. అతడేమీ అహింసావాది కాదు, గాంధీమహత్ముడు అంతకన్న కాదు. అలాగే హంతకులూ అలాంటివాళ్ళే. అదీగాక హతుడూ, హంతకులూ కూడా నకిలీ కణిక గూఢచార వలయంలో ఛోటామోటా పావులే! ఆ స్పృహ వారికి కూడా లేనంత ఛోటా మోటా పావులు. అంటే తమపైన, తమ చుట్టూ, అంతగా గూఢచర్యం అల్లుకుని ఉంటుందని వారికే తెలియనంతగా అన్నమాట. హత్యాకాండ గూఢచర్య తంత్రంలోని భాగమే. పధకం ఎంత పక్కాగా ఉండిందంటే, అతడి హత్యానంతరం విజయవాడ, గుంటూరులలో చెలరేగిన దమనకాండలో…. లూటీ, దహనాలు విపరీతంగా జరిగాయి. అవన్నీ organized గా జరిగాయి అని స్థానిక వ్యాపారులు తర్వాత మొత్తుకున్నా అతీగతీ లేకుండా పోయింది. స్థానిక ఆంధ్రప్రదేశ్ మీడియానే గాకుండా, ఢిల్లీ డి.డి. తో సహా, దాదాపు 15 రోజులకు పైగా తొలివార్తా, వార్తల సమయం, పేజీల్లో సగానికి పైగా ఆక్రమించిన ప్రధాన వార్తా ఇదే![అమెరికా లో నల్లవారు కూడా ఇదేవిధంగా దోపిడి చేయటం గమనార్హం!] అంతగా ఒక ముఖ్య సంఘటన, దాని తదుపరి పరిణామాలు, వాటిపై మీడియా వ్యూహమూ ఒక పద్దతి ప్రకారం ఉంటాయి.

అటువంటిది ఈ వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో, మీడియా చేసిన ’అతి’ సందడిలో తాత్కాలికంగా చేసిన Time gain మాత్రమే ఉంది. సెప్టెంబరు 2 వతేదీ సీ.ఎం. మిస్సింగ్ మాత్రమే కాదు, మూడవ తేదీ ఉత్కంఠ, 4 వతేదీ అంతిమ యాత్ర…. తదుపరి వరుసగా ఆగిన అభిమానుల గుండెలూ, ఆత్మహత్యల పరంపర. నెలకి ’200రూ.’ వృద్దాప్యఫించను ఇచ్చే ’దేవుడు’ ఇక లేడన్న సత్యం మింగుడుపడక గుండెలాగి మరణించిన అభిమానులు, వికలాంగ ఫించన్లు రావని గుండెపోటులు తెచ్చుకున్న అభిమానులు! ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు ఇక రావని అన్నం నీరూ మానేసి టీవీ చూస్తూ ఏడ్చి ఏడ్చి మరణించిన వందలాది పౌరులూ! తిరుపతిలో కోటిరూపాయలతో గుడికట్టిస్తానన్న చెవిలో పువ్వురెడ్డి. ఇంకానయం! వై.యస్. స్వర్ణప్రతిమ పెట్టి అష్టోత్తర శతనామావళి, క్షీరాభిషేకమూ చేయిస్తారంటూ మీడియా ఊదర బెట్టలేదు గానీ, పెట్టి ఉంటే, టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన భక్తుల ఫోటోలు కూడా ప్రచురణకు నోచుకుని ఉండేవి.

ఈ విధంగా మీడియా, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ఎందుకు అంత అర్జంటుగా దేవుణ్ణి చేసేసిందంటే – ఆ సంచలనం, ఆ ’అతి’ హడావుడి పేరిట, జనాల దృష్టిని హైజాక్ చేయటానికి. ఆ విధంగా దాదాపు కొన్నిరోజులపాటు [10 నుండి 14 రోజులపాటు] Time gain చేసుకునేందుకు. ఇప్పుడు తాము [అంటే మీడియా] దేవుడంటే – ఇప్పటికిదే ట్రెండు అనుకుంటూ అనుసరించే నాయకులూ, వారిక్రింది [తమ్ముళ్ళు] మంది మార్భలమూ, వ్యూహాత్మక కార్యకర్తలూ, అమాయక కార్యకర్తలూ పొలోమంటూ అదే అనుసరిస్తారు. అందరూ అదే అంటున్నారు, మనం అనకపోతే ’ఉలిపికట్టెలం’ అయిపోతామని మరికొందరు అమాయక పౌరులు హడావుడీ పడిపోతారు. పదిమంది వెళ్ళిన దారిలో వెళ్ళాలనుకోవడం మనిషికి సహజ లక్షణం. పుట్టుకతో వచ్చే లక్షణం. ఎందుకంటే మనిషి సంఘజీవి గనుక!

కాబట్టి ఆ విధంగా చచ్చిపోయిన ముఖ్యమంత్రిని అర్జంటుగా దేవుణ్ణి చేసేస్తే, భజన చేస్తూ కొందరూ, ’ఇదెక్కడి గోల? ఇతడు దేవుడేమిటి?’ అంటూ చికాకూ, ఆందోళనా పడుతూ మరికొందరూ…. ఎవరి గొడవలో వారుంటారు. ఈ లోపున తము, ఆనూ పోనూ తెలుసుకోవచ్చు, ఏం జరుగుతోందో అర్ధం చేసుకుని తదుపరి వ్యూహాం సిద్ధం చేసుకోవచ్చు.

ఇది నెం.10 వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ. అయితే ఇదే విషయంలో నెం.౫ వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ ఏమిటంటే…..

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నేను ఈ టపాల మాలికలో వ్రాస్తున్న అంశాలని logical గానూ, Sequence తోనూ, Circumstantial గానూ నిరూపిస్తాను. అందుచేత ఈరోజు మొదలయిన ఈ టపాల మాలిక పూర్తి అయ్యేవరకూ ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాను.

ఈ నెల [Sep.] 2 వతేదీన వై.యస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించాడు. అంతేకాదు, అది అతి భయంకరమైన మరణం కూడా! విధి, గూఢచర్యం, ఎంత కౄరంగానైనా ఉండగలవనటానికి సజీవ సాక్ష్యం ఆ హెలికాప్టర్ ప్రమాదం. అది యాదృచ్చికంగా జరిగిన ప్రమాదమా? లేక పధకం ప్రకారం జరిపించబడిందా? గూఢచర్యంలో ’యాదృచ్చికం’గా ఏ సంఘటన అయినా జరగడానికి అవకాశాలు బాగా తక్కువ. అధవా…ఎప్పుడైనా, ఏ సంఘటన అయినా జరిగినా, మరుక్షణం దానిపైన గూఢచర్య కార్యకలాపాలూ, స్ట్రాటజీ ఊడల మర్రిలా దిగిపోతాయి. చిక్కుముడిలా అల్లుకుపోతాయి. రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏ సంభావ్యత ఉంది? యాదృచ్చికంగా ప్రమాదం జరిగి, దానిపైన గూఢచర్యం అల్లుకుందా? లేక గూఢచర్యంలో భాగంగా, పధకం ప్రకారం ప్రమాదం జరిపించబడి, తదుపరి గూఢచర్యం కొనసాగుతోందా?

రాజశేఖర్ రెడ్డి మరణానికి దారితీసిన పరిస్థితులేమిటి? ప్రమాదానికి పూర్వాపరాలేమిటి? రాజశేఖర్ రెడ్డి మరణానికి, ఇప్పుడు కేంద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకి, కేంద్రమంత్రుల ప్రవర్తనా సరళికి మధ్య కార్యకారణ సంబంధం ఏమిటి? ఎవరి సువర్ణముఖి ఏమిటి?

రాజశేఖర్ రెడ్డి మరణించిన హెలికాప్టర్ ప్రమాదం నిశ్చయంగా యాదృచ్చికం కాదు. అయితే ఇది రాజశేఖర్ రెడ్డికి శతృవులాగా నటించిన రామోజీరావు జరిపించింది కూడా కాదు. రామోజీరావుని సైతం దిగ్ర్పాంతి పరిచిన సంఘటన ఇది. నిజానికి, నడుస్తున్న రాజకీయ సినిమాకి దర్శకుడూ, నిర్మాతా, స్క్రిప్టు రచయితా రామోజీరావే. ఏ పాత్ర ఎంతకాలం తెరమీద ఉండాలో, ఎప్పుడు ఎవరు తెరమరుగై పోవాలో నిర్ధేశించేది అతడే. ఎటూ తాను, కొన్ని రోజుల లేదా నెలల తర్వాత రాజశేఖర్ రెడ్డి కాల్షీటుని ముగించదల్చుకుని ఉండగా, ఆ లోపున పూర్తి చేయవలసిన పనుల్లోనూ, రాబట్టవలసిన సమాచారంలోనూ తలమునకలై ఉండగా, అంతలోనే పులిమీద పుట్రలా మరొకరు ’జరిపించగా’ రాజశేఖర్ రెడ్డి కథ ’ఫినిఫ్’ అయిపోయింది. [సెప్టెంబరు రెండుకు ముందు, ఆగస్టు 31న రాజశేఖర్ రెడ్డి తెదేపా పని ఫినిఫ్ అయిపోతుందనీ, దాని మీద సెప్టెంబరు ఒకటో తారీఖు ’ఎవరు ఫినిఫ్ అవుతారో చూద్దాం’ అని చంద్రబాబు ప్రకటించడం కూడా యాదృచ్చికం కాకపోవచ్చు. జనాలు ఆ వార్తాను చదవటం పూర్తిచేసుంటారేమో, అంతే! అప్పటికే వై.యస్. మిస్సింగ్! తమ తమ Assignments ప్రకారం, ఇద్దరు నాయకులూ తమతమ వాగ్బాణాలు సంధించుకున్నారు.
అయితే అర్ధాంతరంగా రాజశేఖర్ రెడ్డి కథ ఎందుకు ముగిసిపోయింది? ఎవరు ముగించారు?

ఇది తెలుసుకోవడానికి ముందు రాజశేఖర్ రెడ్డి మనస్తత్వం గురించీ, అతడి కుటుంబ వారసత్వం గురించీ, కొంత తెలుసుకోవటం తప్పని సరి! Jan.10, 2009 న వ్రాసిన నా గత టపా ’రాజ – రామోజీల యుద్ధం నిజమా? నాటకమా?’లో వివరించిన విషయాలని మరోసారి పరిశీలించటం కూడా తప్పని సరి! ఎందుకంటే ఈ వివరణని నేను అక్కడి నుండే ప్రారంభిస్తున్నాను కాబట్టి, అక్కడి నుండే ప్రారంభించాలి కాబట్టి!

మీడియా ఊదరబెట్టి మరీ ప్రచారించన దాని ప్రకారం, రాజశేఖర్ రెడ్డి 1975 లో రాజకీయాల్లో ప్రవేశించాడు. ఇప్పుడింతగా మీడియా మొత్తం, రాజశేఖర్ రెడ్డి భక్తులూ, [వీళ్ళెలా ఏర్పాడ్డారో, మీకు ఈ టపాల మాలికలోనే చెబుతాను] కలగలసి కోరస్ గా ’రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షనిస్టు కాదు, ఫ్యాక్షనిజంని రూపమాపేందుకు ప్రయత్నించిన దార్శనికుడు’ అంటూ అతణ్ణి దేవుణ్ణి చేసేసినా, అతడి చరిత్ర ఏమిటో, అందరికీ తెలిసిందే! 1992 కు ముందు అతడి ముఠా రాజకీయాలు, నిరంతర అసంతృప్త వాదమూ అందరూ చూసిందే! ఇప్పటి ముఖ్యమంత్రి,, నిన్నటి వరకూ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో నెం.2గా చెలామణి అయిన ఆర్దికమంత్రీ, రోశయ్య, రాజశేఖర్ రెడ్డిని ఇప్పుడెంతగా ప్రశంసలు వర్షంలో ముంచెత్తుతున్నా, అప్పట్లో అయితే ’ఇతడొక చీడపురుగు. ఇతణ్ణి బహిష్కరించండి’ అంటూ అధిష్ఠానానికి అర్జీలు పెట్టుకున్నవాడే! అయినా అప్పట్లో కాంగ్రెస్ లో ముఠాలు లేవంటే నేతిబీర కాయలో నెయ్యి ఉందన్నట్లే!

రాజశేఖర్ రెడ్డి బైరటీస్ గనుల వివాదం, ఈనాడు హోరెత్తించగా 1989 ప్రాంతాల్లో అందరూ చదివిందే. అసలు రాయలసీమలో ఫ్యాక్షనిజం గురించి మీడియా చేసిన ప్రచారమే ఓ పెద్ద దొంగ ప్రచారం. ఇక్కడ కుటుంబ గౌరవాల కోసం, తరతరాలుగా వారసులు కూడా కొట్టుకుంటారనీ, అనివార్యమైన పగాప్రతీకారాలతో, ఆలయాల్లో ప్రధమ పూజల దగ్గర నుండీ అన్నిటా ఆధిపత్యం, గౌరవాల కోసం కొట్టుకుంటారని మీడియా తెగ ప్రచారం చేసింది. దశాబ్ధాల నుండి ప్రచారం చేసింది. ఈనాడు వారి ‘చతుర’లో ‘మానవ హోమం’ పేరిట ఇదే ప్రచారిస్తూ ఓ నవల కూడా ప్రచురితమైంది.

అయితే ఇక్కడి కొచ్చి చూస్తే… రాయలసీమలో కుటుంబగౌరవం, ఆధిపత్యం సెంటిమెంటుతో కొట్టుకోరు. ఆ నెపం వెనుక ఉండేది వ్యాపార పోటీ, దోపిడిపోటి. యజ్ఞం సినిమాలో చూపిన కథా నేపధ్యానికీ ఇక్కడి ఫ్యాక్షనిస్టుల నేపధ్యానికీ తేడా ఏం ఉండదు. ఎవరికి బలముంటే వాళ్ళు ఇసుక తవ్వుకుపోతారు. ప్రక్కవాడి గనుల కూడా తవ్వుకు పోతారు. అసలు ప్రభుత్వ అనుమతులే లేకుండా యధేచ్ఛగా ప్రకృతి సంపద నుండి, సామాజిక వ్యక్తిగత సంపదలు కూడా బలదూర్ గా దోపిడి చేస్తారు. అడవులు సైతం ఇందుకు మినహాయింపు కావు. అందుకోసమే ముఠాలు నిర్వహింపబడతాయి. వాటికే ఫ్యాక్షన్ ముఠాలనే పేరుపెట్టి, దశాబ్ధాల తరబడి ’ఫ్యాక్షనిజం’లో ఉన్న డబ్బు, ప్రమేయాన్ని ప్రక్కన బెట్టి, సెంటిమెంటు ప్రమేయాన్ని మాత్రమే మీడియా ప్రచారించింది. ఎందుకంటే – ‘ఈ ముఠాలలో తమకు అనుకూలమైన ముఠాని బలపడేటట్లు చేసి, దోపిడిలో వాటా పుచ్చుకోవటం’ అన్న ప్రక్రియ బహిరంగమవ్వకూడదు కాబట్టి. విభజించి పాలించు, విభజించి ప్రచారించు అన్న రెండు సూత్రాలూ నకిలీ కణికుల ప్రధాన స్ట్రాటజీలు కావటం తెలిసిన విషయమే!
ఇలాంటి నేపధ్యమే రాజశేఖర్ రెడ్డిది కూడా!

ఫ్యాక్షన్ రాజకీయాలన్నవి ఇతడి తండ్రి హయం నుండే వింటున్న మాట. అంతేకాదు జన్యుపరంగా కూడా ఇతడి పూర్వీకులు పదార్ధవాదులే. కాబట్టే నమ్మకాలు వదిలేసి ఇతడి తాత హయంలోనే మతమార్పిడికి ఒడిగట్టారు.

ఇక్కడ ఓ నిజసంఘటన వివరిస్తాను. మా తాతగారి ఊరు[నరసరావుపేట దగ్గర]లో ఊరి మొదట్లోనే వాగుదాటగానే రాముల వారి గుడి ప్రక్కనే, పెద్ద చర్చి ఉండేది. ప్రక్కప్రక్కనే ఉన్న వాటి గురించి అడిగినప్పుడు మా బాబాయి ఇదంతా చెప్పారు. ఆ ఊర్లోకి క్రైస్తవులు వచ్చి, మతం మార్చుకొమ్మనీ, క్రైస్తవులుగా మారితే స్కూలు, ఆసుపత్రి, చర్చి కట్టిస్తామనీ, ఉచితంగా చదువు చెప్పి, ఆపైన తమ సంస్థల్లోనే ఉద్యోగాలు ఇస్తామనీ అన్నారట. అయితే ఆ ఊరిలో ఎవరూ మతం మార్చుకునేందుకు ముందుకు రాలేదట. ఒకే ఒకవ్యక్తి ’ఇన్నాసి రెడ్డి’ అనే ఆయన, ముందుకొచ్చాడట. దాన్నే ప్రిస్టేజ్ గా తీసుకున్న ఆ క్రైస్తవ మత సంస్థ, అతడొక్కడి కోసం, ఇంకెక్కడ చోటే లేనట్లు రాముల వారి గుడిప్రక్కనే చర్చి కట్టించిందట. మొదట ఊరివాళ్ళు ఇన్నాసిరెడ్డిని వెలివేసారట. అయితే ఒక్కడి కోసం, అంత ఖర్చుపెట్టి, అంతపెద్ద చర్చి కట్టించిన క్రైస్తవ మిషనరీని చూసి, వాళ్ళు అతడికిస్తున్న ప్రాముఖ్యతనీ, ఆర్దిక తోడ్పాటు చూసి, మరికొందరు మతం మారారట. మంది ఎక్కువ అయ్యేసరికి క్రమంగా వెలి వెలిసి పోయిందట.

అతడు మా తాతగారికి బంధువే. అతడోసారి మా తాతగారి ఇంటికి వచ్చాడు. మా తాత “ఏం ఇన్నాసయ్యా? వచ్చావు, చెప్పు?" అన్నారు. అతడు [అప్పటికి కాస్త వయస్సు మళ్ళిన వాడే] “ఇన్నాసయ్య ఏంది మామా! ఇన్నాసి రెడ్డి అను” అన్నాడు. “మతం మార్చుకున్నొడివి నువ్వు రెడ్డి ఏంటిరా? ఇన్నాసయ్య అంతే” అన్నాడు మా తాత! అతడూ నవ్వి ఊరుకున్నాడు. తర్వాత మా చిన్నాన్న చెప్పిందేమంటే ఆయన్నందరూ ‘ఇన్నాసయ్య’ అనే పిలుస్తారని. ఇది మా చిన్నప్పుడు జరిగిన సంఘటన.

మా వారి తాతగారి ఊరిదీ మరో కథ. అది పొన్నూరు దగ్గరలోని ఓ చిన్న గ్రామం. స్కూలు అన్నా, ఆసుపత్రి అన్నా ప్రక్క ఊరికి వెళ్ళాల్సిందే! ఊరందరూ మతం మారితే ఆ ఊరిలో స్కూలు, ఆసుపత్రి కట్టిస్తామని చెప్పారు క్రైస్తవ మిషనరీ వాళ్ళు. ఆ ఊరిలో ఎవరూ స్కూలు, ఆసుపత్రి వంటి ప్రలోభాలకి లొంగలేదు. ఒకే కులానికి చెందిన వారున్న ఆ ఊరిలో మాత మార్పిడిని ఎవరూ అంగీకరించలేదు. ఇది 50 ఏళ్ళక్రిందటి కథ.

అయితే రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో ఈ మత మార్పిడి కథ మరింత గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ మతం మార్చుకున్న వాళ్ళు, తాము అటు ‘క్రైస్తవులం’ అంటూ చర్చికి వెళతారు, ఇటు ‘హిందువులం’ అన్నట్లు బొట్లు పెట్టుకుని గుళ్ళకీ వెళతారు. వెరసి వీరిది ఎంత పదార్ధవాదమంటే రెండింటిలోనూ తమకు ప్రయోజనాలు [Benefits] కావాలనుకుంటారు.

అసలు మతం మార్చుకునేందుకు సంసిద్ధులయ్యేదే పదార్దవాదులు. ఆకలికి అల్లాడే, దారిద్ర్యంతో బాధలు పడేవారికి ఏ సిద్ధాంతాలు వర్తించవు. ఏ నమ్మకాలూ పనిచేయవు. కాబట్టి మతం మారితే వచ్చే ప్రయోజనాలను ఆశించి, ఇప్పుడు, ఈ ఇటలీ స్త్రీ ప్రభుత్వంలోనూ, స్వాతంత్రానికి పూర్వం బ్రిటిషు వాడి ప్రభుత్వంలోనూ మతం మార్చుకుంటున్న, మార్చుకున్న, నిరుపేదలు ఎవరైనా ఉంటే, వారి గురించి నేను పైవ్యాఖ్య చేయటం లేదు. ఎవరైతే ఆస్థిపాస్తులూ, ఆదాయావనరులూ బాగానే ఉండి కూడా, మరింతగా డబ్బూ, కెరియర్ పొందవచ్చన్న ఆశతో మతం మార్చుకున్నారో, గత 1200 సంవత్సరాలుగా మారారో వారినే ’పరమ పదార్ధవాదులని’ అంటున్నాను. వందల సంవత్సరాలకు పూర్వం నుండీ కూడా, ముస్లింలకి బలమూ, అధికారమూ ఉన్నాయనుకున్నప్పుడు వారి ప్రాపు పొందితే ప్రయోజనాలుంటాయనుకున్నవారు ముస్లింలయ్యారు. తర్వాత వచ్చిన యూరోపియన్లకి బలమూ, అధికారమూ ఉందనుకున్నప్పుడు, వారి ప్రాపకం పొందితే ప్రయోజనాలుంటాయను కున్నవారు క్రైస్తవులయ్యారు. ఆయా మతాల్లోని సిద్దాంతాలు నచ్చాయి అనటం ఏ.ఆర్.రెహమానులకూ, బ్రదర్ అనిల్ కుమార్ లకూ అలవాటే!

కాబట్టే మతం మారటం అంటే ఉద్యోగం మారటం వంటిదేననే అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. వేలూ వందల సంవత్సరాలుగా వాళ్ళ ’జీన్స్’ అంతే! ఈ దేశంలోని ముస్లింలెవరూ అరబ్బు దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. అలాగే ఈ దేశంలోని క్రైస్తవులూ యూరప్ లో పుట్టి ఇక్కడికి వలస వచ్చిన వారు కారు. తరాల క్రితం, శతాబ్ధాల క్రితం పూర్వీకులు మతం మారగా ఆయా మతస్థులైన వారే! హిందూమతంలోని దురాచారాలు, కులం వర్గాల అహంకారాలు మాతమార్పిడులకు కారణం అన్నది స్వల్పంగా ఉన్న అంశం మాత్రమే! దాన్ని నకిలీ కణిక వ్యవస్థ 350 సంవత్సరాల పైగా తరతరాలుగా చేసుకొస్తున్న కుట్రలో భాగంగా, ఉన్నదాన్ని వెయ్యింతలు చేసి ప్రచారించింది. వై.యస్. ని నిన్నటిదాకా తిట్టిన ఆ ‘రెండు’ పత్రికలు చనిపోగానే హఠాత్తుగా వై.యస్.ని దేవుణ్ణి చేసినట్లు!

ఏది ఏమయినా కన్నతల్లి వంటి నమ్మకాలని అమ్ముకునే వారే, విలువల కంటే పదార్ధానికే ఎక్కువ విలువనిచ్చే వారే, తరాల క్రితం, శతాబ్ధాల లేదా దశాబ్ధాల క్రితం మతాలు మారారు. తరతరాలుగా వారి ’జీన్స్’ అదే పదార్ధవాదాన్ని మోసుకొచ్చాయి. అలాంటి అనేక కుటుంబాల్లో ఒకటి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా! అంతేకాదు – ఫ్యాక్షన్ రంగంలో, మాఫియా రంగం కొత్తగా ముఠాలు కట్టటం, నెమ్మదిగా నిలదొక్కుకోవటం కూడా పరిపాటే. అయితే ఇక్కడ సూక్ష్మమైన అంశం ఏమిటంటే, గూఢచార వ్యవస్థల దీవెనలు ప్రోత్సాహం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న ముఠాలే ఫ్యాక్షన్ రంగంలో అయినా, మాఫియా రంగంలో అయినా ప్రాబల్యంలోకి వస్తాయి. ఇక్కడ ప్రత్యక్షసంబంధాలు ఉండనవసరం లేదు. ఆ దృక్పదం కలిగి ఉన్న ముఠానాయకత్వాలకి, ఆ ప్రోత్సాహం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.

ఈ మర్మం తెలియదు కాబట్టి, రాయలసీమలో ఫ్యాక్షన్ ముఠాకట్టినంత సులభంగా, గూఢచర్యంలోనూ ముఠాకట్టవచ్చని, కొత్తగ్రూప్ పెట్టవచ్చని అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇతడిది ఇంత హ్రస్వదృష్టి [Short sight] కాబట్టే, "ఇతడు అక్కడున్నది తను తెలుసుకోడు. తాను అనుకున్నది అక్కడ ఉంది అనుకుంటాడు. గూఢచర్యం విషయంలో ఇతడు ఇంత అజ్ఞాని” అని వ్రాసాను. ఆగస్టు 3, 2009 న వ్రాసిన నా టపా ‘నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్నిదృష్టాంతాలు[Circumstantial] -4 [సువర్ణముఖి – ఎవర్నీ ఎంత వరకూ నమ్మటం?]’ లో!

ఇంతకు ముందు టపాల్లో చెప్పినట్లు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న గూఢచర్యపు పోరులో నకిలీ కణిక వర్గమైన నెం.10 కి తన ప్రత్యర్ధి వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల పట్ల నిబద్దత గల నెం.5 వర్గాన్ని నమ్మించవలసిన అవసరమూ, తద్వారా స్ట్రాటజీ ముందుగా తెలుసుకుని తదనుగుణమైన వ్యూహరచనలు చేయవలసిన అవసరమూ ఉన్నాయి.

డీవిడీ ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయటం మాత్రమే వచ్చినట్లుగా, నమ్మకద్రోహం వంటి స్ట్రాటజీలు, ఎదుటి వాళ్ళకు తెలియనప్పుడు మోసగించటం వంటి ఎత్తుగడలూ మాత్రమే తెలిసిన నకిలీ కణికవర్గానికీ, అందులోని కీలక వ్యక్తి అయిన రామోజీరావుకీ, అసలైన గూఢచర్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నొప్పి! ఇక మెదళ్ళతో యుద్ధం చేయటం అంటే మరింత నొప్పి! అంచేత తమ ఏజంటుని నెం.5 చేత నమ్మించి, ఆ వర్గంలోకి install చెయ్యటం అవసరం.

అందుకోసం రాజశేఖర్ రెడ్డిని ఎలా అంచెలంచెలుగా ముఖ్యమంత్రి కుర్చీలోకి తెచ్చాడో గతటపాలలో వివరించాను. అందులో భాగంగానే, రామోజీరావు, రాజశేఖర్ రెడ్డికి చాలా సీన్ ఇచ్చాడు. ఈ సందట్లో రాజశేఖర్ రెడ్డి తన ఫ్యాక్షన్ తెలివితేటలతో, స్నేహితుడు కెవిపి లీగల్ జ్ఞానాన్ని జోడించి సరికొత్త వ్యూహం పన్నాడు. నెం.5 వర్గం తనని నమ్ముతోందనీ, తాను వారిని నమ్మించగలిగాననీ రామోజీరావుని నమ్మించాడు. అది నమ్మిన రామోజీరావు నెం.5 వర్గాన్ని మరింతగా నమ్మించేందుకు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని హీరోని చేసి, తనను తాను జీరో చేసుకున్నాడు. ఫలితమే ఈనాడు ఇడుపులపాయనీ తీస్తే, వై.యస్., రామోజీరావు ని కోర్టుగుమ్మాలు ఎక్కించి దించడాలు, మార్గదర్శి కేసులు!

ఈ నేపధ్యంలో నెం.5 కూడా “అవునవును. మేం రాజశేఖర్ రెడ్డిని నమ్ముతున్నాం. అతడికి అనుకూలం [భారతంలోని ’అశ్వత్ధామ హతాహతః కుంజరః’] అన్నట్లు, అతడికి మరింత హవా నడిచేటట్లు సానుకూలతను ఏర్పర చింది.

దానితో రామోజీరావు ఎంతగా ఆశకి గురయ్యాడంటే – స్వయంగా తాను తన రెండో కొడుకు సుమన్ తో తగాదా పెట్టుకుని, సుమన్ చేత ప్రత్యేక ఇంటర్యూని సాక్షికి ఇప్పించే దాకా! దీని గురించిన వివరాలు కూడా గత టపాలలో వ్రాసాను.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, రాజశేఖర్ రెడ్డి తన గ్రూప్ ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏముంది గూఢచర్యం అంటే? డబ్బు పోగెయ్యాలి. స్వంతవర్గాన్ని పెంచుకోవాలి, రామోజీరావుకు RFC ఉన్నట్లు, బలమైన కోట వంటి స్వంత ప్రదేశాన్ని తయారు చేసుకోవాలి, మతాన్ని కూడా ఒక బలమైన ఆయుధంగా వాడుకోవాలి. స్ట్రాటజీలు నడపాలి. ప్రజల మద్దతు కోసం కొన్ని పనులు చేయాలి. కొన్ని చేస్తున్నట్లు నటించాలి. ప్రత్యర్ధులను తొక్కివేయాలి. తన వర్గాలోకి వచ్చిన వారిని ఆర్దికంగా, రాజకీయంగా బలవంతులుగా తయారు చేసుకోవాలి! అంతే కదా!’ అని తన ఫ్యాక్షన్ దృష్టితో చూశాడు. వెనుకటికి గారెల వంటకం నేర్చుకున్న గృహిణిలాగా అన్నమాట.

ఆ కథేమిటంటే…

పెళ్ళై కొత్తగా కాపురానికి వచ్చిన ఓ అమాయకపు గృహిణిని భర్త గారెలు వండమని అడిగాడట.

ఈవిడ “నాకు రాదండి!” అంది.

"ప్రక్కింటి పిన్నిగారిని అడిగి నేర్చుకో!” అన్నాడు భర్త. సరేనని ఆవిడ ప్రక్కింటావిడని అడిగింది. ప్రక్కింటి పిన్నిగారు భర్తృవిహీన.

ఆవిడ సాదరంగా "దాని కేం భాగ్యం అమ్మాయ్! ముందుగా మినప్పప్పు నానబోయాలి” అంది.

"ఓ తెలిసింది తెలిసింది” అంటూ ఈ అమాయకపు గృహిణి హడావుడిగా ఇంటికెళ్ళి పప్పునానబోసింది.

తర్వాత ‘ఏముంటుంది లెద్దూ, పొట్టుతీసి రుబ్బాలి’ అనుకుని, పప్పు నానాక పొట్టు తీసి రుబ్బి పారేసింది. తర్వాతేం చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పిన్నిగారి దగ్గరి కెళ్ళింది.

పిన్నిగారు, "అందులో ఉప్పు, జీలకర్రా, ఉల్లిముక్కలూ, పచ్చిమిరప కాయముక్కలూ కలపాలి” అంది.

ఈ గృహిణి “తెలిసింది. తెలిసింది” అంటూ హడావుడీగా ఇంటికొచ్చేసి అన్నీ పిండిలో కలిపింది. మళ్ళీ సందేహం. ఏం చెయ్యాలి? మళ్ళీ పిన్నిగారూ!

పిన్నిగారు “నూనె కాగబెట్టి, అందులో, చేతి వేళ్ళమీద పిండి తట్టుకుని, మధ్యలో చిల్లుపెట్టి పిండిముద్దల్ని నూనెలో వెయ్యాలి...” అంటూ ఇంకా చెప్పబోతుండగా ఇంతలో వారింటికి మంగలి పొదితో వచ్చాడు. పిన్నిగారు వితంతవు కావటం చేతా, వితంతవులు తలమీద వెంట్రుకలు తీయించుకోవటం వాళ్ళ ఇంటి ఆచారం కావటం చేతా, ఆవిడ వెళ్ళి మంగలి ఎదురుగా కూర్చొని శిరోముండనం చేయించుకుంది.

అంతే. ఈ గృహిణి కూడా “తెలిసింది. తెలిసింది” అంటూ మంగలిని తన ఇంటికి పిలిపించుకుని, గుండు కొట్టించేసుకుని, ఆపైన గారెలు వండి, భర్తకోసం ఆనందంగా, ఆత్రంగా, విజయ దరహాసంతో ఎదురు చూడసాగింది.
వేడి వేడి గారెలు ఆనందిద్దాం అనుకుంటూ ఇంటికొచ్చిన భర్త, ఆమె అవతారం చూసి కళ్ళు తేలేసాట్ట.
‘ఏమీ తెలియకుండా, ఎదుటివారిని అనుకరించటం పనికి మాలిన తనం’ అని చెప్పటానికి మన పెద్దలు ఈ కథ చెబుతారు.

సరిగ్గా రాజశేఖర్ రెడ్డి చేసింది ఇదే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఈరోజు ’ఆనందిని’ బ్లాగులో సంతోష్ కుమార్ గారు వ్రాసిన 'తరతరాల బూజు - నిజాం నవాబు' టపాలో నిజాం గురించి, ఆనాటి దారుణాల గురించి, తెలంగాణ పోరాటం గురించి చాలా చక్కగా వివరించారు. ఒకసారి పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నిన్నటి నా టపా ‘ఈనాడు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిపై కురిపిస్తున్న ప్రశంసల వర్షం - ఇదేదో తేడాగా ఉన్నట్లుందే!’ – లో వ్యాఖ్య.

>>> “నా కామెంట్ ఇక్కడ వారికి నచ్చక పోవచ్చు కాని మనది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎప్పుడైనా ఎలా ఆయినా వాళ్ళ అభిప్రాయం చెప్ప వచ్చు. సరే ఇంక ఈనాడు కథనాల విషయానికి వద్దాం, ఎప్పుడు లేనిది ఎందుకు వై.ఎస్.ఆర్. జపం చేస్తుంది? ఈనాడు దిన పత్రిక నిన్నా మొన్న వచ్చిన కొత్త పత్రిక కాదు, చాలా సంవత్సరాల అనుభవంతో ఆచి తూచి అడుగు వేసే పత్రిక, ఇది వరకు కాలంలో అయితే తెలుగు దేశం కాక మరే ఇతర పార్టీకి జనాదరణ ఉందని ఆ పత్రిక పొరపాటున కూడా చెప్పేది కాదు, ఒక వేళ చెప్పినా కూడా ఏదో నెగటీవ్ అంశం కలగలిపి చెప్పేది, కాని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చాలా బలంగా ఉంది, జరుగుతున్న వాటిని ఏదో ఒక పార్టీకి నష్టం ఆయినా లేక లాభం ఆయినా వెంటనే చూపిస్తున్నాయి, మరి ఇటు వంటి పరిస్థితిలో "అబ్బే వై.ఎస్.ఆర్. మరణానికి ఏమీ స్పందన లేదు" అని ఎలా చెప్పగలదు? ఇంకో విషయం ఏమిటంటే ఏ పత్రికకు ఏ సొంత అజెండా ఉన్నా ప్రజల అభిప్రాయంకు విరుద్ధంగా వార్తలు ప్రచురిస్తే అది తిరస్కరించ బడుతుంది, అందులోను ప్రజలు ఇలాంటి భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు అది పత్రికకు చెడు చేసే అవకాసం ఉంది, ఈ వ్యాపార సూత్రం అనుభవజ్ఞుడైన రామోజీరావు గారికి తెలీదని ఎలా అనుకుంటాం! ఈనాడు చేస్తున్న ఈ వై.ఎస్.ఆర్. జపం చాలా తాత్కాలికం, మన ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని ఈనాడుకు బాగా తెలుసు, ఈ జనం కొన్ని రోజులు లేదా నెలకో రెండు నెలలకో వై.ఎస్.ఆర్.ను మర్చి పోతారు, అప్పుడు మళ్లీ మాములుగా తన చంద్ర బాబు జపం మొదలు పెడుతుంది, కాబట్టి ఈనాడు, తెలుగు దేశం లేదా చంద్ర బాబు అభిమానులు ఏమీ బెంగ పెట్టుకోనక్కర లేదు, అయితే ఒకటి మాత్రం నిజం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీల పరంగా, కులాల పరంగా ఇంకా వారి వారి స్వలాభ అవసరాల పరంగా వివిధ వర్గాలుగా విడి పోయారు, ఇంకో విషయం ఏమిటంటే మీడియా ఇప్పుడు కేవలం రామోజీ రావు చేతిలోనో, రాధ కృష్ణ చేతిలోనో లేక జగన్ చేతిలో మాత్రమే లేదు, కాబట్టి ఇది వరకులా ఈనాడు లాంటి పత్రికలు తమ స్వంత అభిప్రాయాన్ని పదే పదే ప్రచురిస్తూ అదే జనాభిప్రాయంగా మార్చడం అంత సులభం కాదు, కాబట్టి పత్రికలలో తమ పాజీటీవ్‌లు బాగా చెప్పుకుంటూ నెగటీవ్‌లు దాచుకుంటూ ఇంకా ఇతర పార్టీల నెగటీవ్‌లను అదే పనిగా చూపించే పత్రికలకు, నాయకులకు కాలం చెల్లి పోయి నిజంగా నిరు పేదలకు సేవ చేసే మంచి నాయకులు రావాలని ఆశిద్దాం.”

నిన్నటి నా టపాలో, మీకంటే ముందు ఇద్దరు అజ్ఞాతలు ఇదే వ్యాఖ్యని అక్షరం తేడా లేకుండా వ్రాసారు. ’అజ్ఞాతలకి అంత సీన్ ఏముంది లెద్దూ’ అని మేం ప్రచురించలేదు. తిరిగీ అదే వ్యాఖ్య, తుచ తప్పకుండా మీరు వ్రాస్తే, ఇక దానికి జవాబివ్వడం భావ్యమని ఈ టపా రూపంలో స్పందన వ్రాస్తున్నాను.

మీరు రామోజీరావుని సమర్ధిస్తూ వ్రాసిన వ్యాఖ్య బాగుంది. అయితే అందులోని లొసుగుల్ని ఇప్పుడు మనం చర్చిద్దాం.

1]. మీరే అన్నారు, ప్రజల జ్ఞాపక శక్తి తాత్కాకమని. అది నిజమే! ముఖ్యమంత్రి దారుణ మరణం పొందింది సెప్టెంబరు 2 వ తేదిన, ఆ విషయం బయటికొచ్చింది 3 వ తేదీన. [ఈ ఆలస్యం వెనకనున్న నాటకీయత గురించిన పూర్వాపరాలు మరోసారి టపాలో వ్రాస్తాను.] ఇన్నిరోజులు గడిచినా ప్రజల భావోద్రేకాలు తగ్గలేదని ఈనాడు రామోజీరావు భావిస్తున్నాడా?

2]. నిన్నటికి నిన్న అంటే సెప్టెంబరు 14 వ తేదీన, ముందటిరోజున రాష్ట్రహోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అకాల మృత్యువాత పడిన పావురాల దిబ్బ[రుద్రకోడూరు]ని సందర్శించిన నేపధ్యంలో, ప్రధాన సంచిక, కర్నూలు జిల్లా సంచికలతో కలిపి 15 ఫోటోలూ, నాలుగైదు వార్తాంశాలతో ఈనాడు వ్రాసింది. ఇదీ ప్రజల భావోద్వేగమేనంటారా?

3]. ఆ ముందురోజు, సెప్టెంబరు 13న సి.ఎస్.రమాకాంత్ రెడ్డి, డీ.జి.పి.యాదవ్ సందర్శనకూ ఇదే విధంగా పదుల కొద్దీ ఫోటోలతో వార్తాంశాలు వ్రాసింది. ఇదీ ప్రజల భావోద్రేగమేనంటారా?

4]. బాపూజీ, నెహ్రు, ఇందిరాగాంధీ ఇంకా ఇతరనాయకులు పోయినప్పుడు ప్రజలు ఇంతే భావోద్రేగాలకు గురై ఉంటారు కదా? అప్పుడు పత్రికలు ఇదే సూత్రాన్ని అనుసరించాయా?
>>>‘ప్రజల భావోద్రేగాలకు వ్యతిరేకంగా వ్రాస్తే పత్రిక తిరస్కరింపబడుతుందనే వ్యాపార సూత్రం తెలియని వాడు కాదు రామోజీరావు’ అని మీరన్నారు. నిజమే?మరి ఇదే సూత్రం, ఈ వ్యాపారవేత్త, రాజీవ్ గాంధీ హత్య చేయబడినప్పుడు ఎందుకు అనుసరించలేదు? మే 21, 1991 తర్వాత దాదాపు నెలరోజుల పాటు, ఈనాడు, రాజీవ్ గాంధీపై ప్రశంసలు వ్రాయలేదు గానీ ఎల్.టి.టి.ఇ. గొప్పదనం గురించి, శివరాసన్, ధనూల సాహసం గురించి, హత్యాస్థలానికి హంతక బృందం ప్రయాణించిన తీరుతెన్నుల గురించి, సిట్ నుండి హంతక ముఠా ఎలా తప్పించుకున్నది వైనవైనాలుగా వ్రాసింది. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ప్రజలు భావోద్రేగాలకి గురికాలేదా?

5]. అప్పుడే కాదు, 1984 అక్టోబరు 31 న ఇందిరాగాంధీ హత్యగావింపబడినప్పుడు, ఈనాడు, సిక్కులపై జరిగిన హింసాకాండకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. దానితోపాటుగా ఇందిరాగాంధీని ’ఆమె కళ్ళు బారెడు గాక పోయినా కనీసం చారెడ’ని మాటవరసకి కూడా అనలేదు. ఆ తర్వాత రెండునెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోయినంతగా ఇందిరాగాంధీ సానుభూతి ప్రభంజనాన్ని, అంతర్జాతీయంగా మీడియా నోరెళ్ళబెట్టి చూసిందే. అంతగా ప్రజలు భావోద్వేగాలకి గురయ్యారు కదా? ఆ తర్వాతే మరణించిన నాయకుల భార్యలూ లేదా కుమారులకి, ‘వారసత్వపు టిక్కెట్లు ఇవ్వడం’ అన్న ప్రక్రియ, అన్నిపార్టీలలో చోటు చేసుకుంది. మణెమ్మ అంజయ్య దగ్గర నుండి, సబితా ఇంద్రారెడ్డి, పరిటాల సునీతా రవి గట్రాల వరకూ ఈ కోవకి చెందిన వాళ్ళే.

ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో, కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటి రావటం, ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోవటం గురించి ఈనాడు రామోజీరావు ’ఇందిరాగాంధీ చచ్చి సాధించింద’ని తన సంపాదక, ఉప సంపాదకుల మీటింగ్ లో అన్నాడని, నా ఈనాడు ఉపసంపాదక మిత్రురాలు 1992 లో చెప్పిన సమాచారం.[First hand information] దీని గురించి పూర్తి వివరాలు ‘భారతరాజకీయ రంగంపై నకిలీ కణిక సుదీర్ఘ కుట్ర’ గురించిన నా గత టపాలలో వివరించాను.

అటువంటి నేపధ్యంలో సైతం, ఇందిరాగాంధీ హత్యానంతరం, ఈనాడు, ఇందిరాగాంధీని ప్రశంసల వర్షంలో ముంచెత్తక పోయినా కనీసం పొడిపొడి జల్లులు కూడా కురిపించలేదు. అప్పుడు ప్రజలు భావోద్వేగాలకి గురి కాలేదా?

6].ప్రజలు తమ నాయకులు చనిపోతేనే కాదు, తమ కుటుంబసభ్యులు చనిపోయినా రోజులు గడిచే కొద్దీ తేరుకుంటారు, మరిచిపోతారు. ’ఇవాళ పోతే రేపటికి రెండు. పోయిన వాళ్ళతో మనమూ పోతామా? ఏడవకండి! ఏదో రోజు అందరం పోయేవాళ్ళమే’ అంటూ మరణించిన వారి బంధువులని ఓదార్చటం తెలుగునాట పరిపాటి. సాక్షాత్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబసభ్యులూ, బంధుమిత్రులూ, అనుచరులే సర్దుకుని, మిగిలిన పనుల్లో నిమగ్నమయ్యారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ రోజువారీ పనుల దగ్గర నుండి రాజకీయపు పనులలో కూడా నిమగ్నమయ్యాడు. ‘శరీరాలు వేరేగానీ ఆత్మలు ఒకటే’ నన్పించుకున్న ఆప్తమిత్రుడు కె.వి.పి.రామచంద్రరావు, ఢిల్లీలో ఎడతెరపి లేకుండా లాబీయింగ్ చెయ్యగలుగుతున్నాడు. ప్రజలు మాత్రం రోజురోజుకీ దుఃఖాన్ని మరిచిపోవటం గాకుండా, క్రమక్రమంగా భావోద్రేగాలు పెరిగిపోతున్నాయన్న స్థాయిలో, ఈనాడు పత్రిక, పావురాల దిబ్బ[రుద్రకోడూరు]కు ప్రముఖల సందర్శనల దగ్గరి నుండి, అభిమానుల పాదయాత్రలూ, రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలూ గురించిన కవరేజ్, రోజురోజుకీ పెంచుకుంటూ పోయింది గానీ తగ్గించేప్రయత్నం కూడా చెయ్యలేదు.

7].అయితే – రాజశేఖర్ రెడ్డి మరణం గురించి, ప్రజల భావోద్రేగాల గురించి, అతడి పార్టీయైన కాంగ్రెస్సే పట్టించుకోలేదు. ఈ భావోద్రేగాలు ‘సహజం’ అని కొట్టిపారేసింది. పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేసింది. దాన్నే ఆంధ్రజ్యోతి మూడునాలుగు రోజుల్నుంచీ ప్రచురిస్తోంది. కాంగ్రెస్ స్పోక్స్ మన్ మనీష్ తివారి ’ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉన్నారు. మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. పూర్తిప్రభుత్వం పనిచేస్తోంది’ అని 11 Sep, 2009న ప్రకటిస్తే, ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి 12 Sep. న ప్రధాన శీర్షికగా వ్రాసింది. ఈనాడు మాత్రం ‘మరింత సాగతీత’ అన్న శీర్షిక క్రింద ఏకవాక్యంగా రిఫర్ చేసి, రెండోపేజీలో సింగిల్ కాలమ్[‘ముఖ్యమంత్రంటే ముఖ్యమంత్రే’ అన్న ఉపశీర్షిక]తో సరిపెట్టేసింది.

చూడబోతే రాజశేఖర్ రెడ్డి స్వంత కుటుంబ సభ్యుల కంటే, స్వంత పార్టీసభ్యుల కంటే, కాంగ్రెస్ అధిష్టానం కంటే, ప్రజల కంటే కూడా, రాజశేఖర్ రెడ్డి మరణం గురించి రామోజీరావుకే భావోద్వేగాలు ఎక్కువుగా ఉన్నట్లున్నాయి.

8]. అదీగాక ప్రజల జ్ఞాపకశక్తి ఎటూ తాత్కాలికమే గనుక మీడియా నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్లు పరిస్థితులని సృష్టిస్తుందని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘటనాత్మకంగా నిరూపితమైంది. ఈ సత్యం గురించి నేను ఒక్కదాన్నే కాదు, బ్లాగ్లోకంలో, బ్లాగుమిత్రులు అనేకులు, వివిధ దేశాల్లోని సంఘటనల్ని ఉదహరించి మరీవ్రాసారు. ఈ నేపధ్యంలో, ఈనాడు పత్రికా, రామోజీరావు ప్రజల భావోద్వేగాలని ప్రతి బింబించారనుకుంటే అది హాస్యాస్పదమే!

9]. కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో ఏర్పడిన ఉద్విగ్న పరిస్థితుల్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తోందని, జాతీయ మీడియా కూడా పట్టించుకోవటం మానేసిందని ఈరోజు[15 Sep.2009] ఈనాడు, రెండో పేజీలో ’క్రమంగా తెరమరుగు’ అన్న ఉపశీర్షిక పెట్టి, ఏదైనా విషయాన్ని ఎలా తెరమరుగు చేయవచ్చో వ్రాసింది. ఆంధ్రజ్యోతి ఈ పనిని 12 వతేదీ నుండే చేస్తోంది. ఎప్పుడైనా, ఎక్కడైనా కాలం గడిచేకొద్దీ భావోద్వేగాలు తగ్గుతాయి గానీ పెరగవు. అది సహజం. ఈనాడు వ్రాతల్లో ఈ సహజత్వానికి విపర్యయం ఉండడాన్నే నేను ఎత్తి చూపింది!

10]. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – నిన్నటి నా టపా, మీ వ్యాఖ్య… తర్వాత యాదృచ్చికమో, ప్రయత్నపూర్వకమో గానీ, ఈనాడు, ఈరోజు రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షానికి హఠాత్తుగా తెరిపి ఇచ్చింది. మూడు నాలుగు రోజుల క్రితం మనీష్ తివారీ నోట వచ్చిన ప్రకటన Repetition గాఅభిషేక్ సింఘ్వీ నోట ప్రచురించింది. ప్రజల భావోద్రేకాలు, భావోద్వేగాలు క్రమంగా చల్లబడతాయి గానీ, హఠాత్తుగా చల్లబడవు కదా!

11]. “అంటే మీ టపాకి, నా వ్యాఖ్యకి, ఈనాడు వ్రాతలకీ సంబంధం ఉందంటారా?" అంటారేమో! ఖచ్చితంగా ఉండి ఉండాలి. కావాలంటే మరో తార్కాణం చూడండి.

నిన్నటి వరకూ కూడా, పావురాల దిబ్బ[రుద్రకోడూరు] దగ్గర వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణించిన చోటుని పర్యాటన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి మొదలు, కర్నూలు జిల్లాకు చెందిన గృహనిర్మాణశాఖామంత్రి శిల్పామోహన్ రెడ్డి దాకా, ప్రకటిస్తునే వచ్చారు.[ఇతడి ప్రకటన నిన్నటి ఈనాడు కర్నూలు జిల్లా ఎడిషన్ లో కూడా వచ్చింది] అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా ’19న వై.యస్.స్మారక నిర్మాణాలపై సమావేశం’ పేరిట ‘పర్యాటక కేంద్రం’ స్థానే ’స్మారక కట్టడాలు’ అన్న పదాన్ని చేర్చి, ఈనాడు, పకడ్బందీగా వార్త వ్రాసింది.

12]. ఇక మీరన్న మరోమాట – >>> ఈనాడు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాతో పోటీని ఎదుర్కోలేక… ఇలా వ్రాస్తోంది.

నిజానికి ఈనాడు రామోజీరావుకూ ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు, వార్తా ఛానెళ్ళు, ఒక్కతెలుగులోనే కాదు పలుభాషల్లోనూ ఉన్నాయి కదా! ఇక అతడూ, అతడి పత్రిక పోటీపడలేనిదేముంది? అందునా విలువలకు ప్రాణం ఇస్తాడాయే రామోజీరావు? వ్యాపారంలో పోటీపడలేక విలువలు వదిలేసుకున్నాడంటారా?

మీరు రామోజీరావుని వెనకేసుకు రాకుండా, సత్యాసత్యాలని విశ్లేషిస్తూ, విషయ సమీక్ష చేసి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. ఎందుకంటే వ్యక్తుల కంటే సత్యం గొప్పదీ, బలమైనదీ గనుక!

ఏదేమైనా… నాబ్లాగులో వ్యాఖ్య వ్రాసి, మరింత అర్ధవంతమైన, వివరణాత్మకమైన చర్చకు దోహదపడినందుకు మీకు నెనర్లు. మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించగలరు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu