మా చిన్నప్పుడు ముస్లింల రంజాన్ పండుగ అంటే ‘సేమ్యా’ అనే ప్రత్యేక వంటకం ఉండాల్సిందే. అదీ, సేమ్యాని ముస్లిం మహిళలు – గోధుమలు మరపట్టించి, మెత్తగా చేసిన పిండిని తడిపి, కొంతసేపు నానబెట్టి, నేతిని అరచేతికి రాసుకుని వత్తుతూ, పళ్ళెం బోర్లా వేసి దానిపైకి చుట్టల్లా తిప్పుతూ సేమ్యాని తయారుచేసేవాళ్ళట. ప్రతీరోజూ పగలంతా ఉపవాసం ఉంటూ నెలంతా ఇలా సేమ్యా చేస్తే, అది పండుగనాడు పాయిసాలూ, తీపి పదార్ధాలు చేసే సరికి అయిపోయేదట. కానీ నేతితో చేస్తారు గనుక చాలా రుచిగా ఉండేది. ఇంతలో మా గుంటూరు ‘మాయాబజారు’ లో ఒకాయన, బస్సు స్టీరింగు చక్రాన్నీ, మరికొన్ని గొట్టాలనీ ఉపయోగించి, మన ఇంట్లో ఉండే చక్రాల గిద్ద మూసలో పేద్ద సేమ్యా చక్రాల్ని తయారు చేసే యంత్రం తయారు చేశాడు. కరెంటుతో పనిలేకుండా, స్టీరింగు చక్రాన్ని తిప్పుతుంటే క్రింద అమర్చిన గొట్టాలకు అడ్డంగా ఉంచిన చిన్ని రంధ్రాలున్న బిళ్ళలోంచి సేమియా క్రిందికి పడుతుంది. దాన్ని వెడల్పాటి పళ్ళేల మీదికీ, చేటల మీదికీ పరచినట్లుగా పడేటట్లు చేసి ఆరబెట్టుకుంటే కావలసినంత సేమియా. అప్పట్లో అది మా ఊర్లో మహా సంచలనం రేపింది. అందరూ వెళ్ళి చూసొచ్చారు. కేజీ పిండి తీసికెళ్ళి, చెప్పినంత రుసుము అయిదో పదో చెల్లిస్తే, సేమియా పళ్ళాల మీద వేయించుకుని వచ్చి ఇంట్లో ఆరబెట్టుకోవడమే. దాంతో ముస్లింలతో పాటు హిందువులు కూడా పోలోమంటూ వెళ్ళి, సేమియా వేయించుకొన్నాం. ఎంతో ఆనందంగా సేమ్యా పాయసాన్ని ఆస్వాదించాం. ఆ తర్వాతి సంవత్సరం బాంబినో [సేమ్యా] వెర్మిసెల్లి మార్కెట్లోకి వచ్చింది. సామాన్య మెకానిక్ లు కూడా సేమియా తయారు చేస్తే, ఇక సేమియా ప్రత్యేకత అంతరించినట్లే గదా! బహుశః అందుకనే ఇక కార్పోరేట్ సేమియా మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది.

అందునా స్టీరింగు చక్రంతో చేసిన సేమియాతో వండిన వంటకం కొంచెం ముద్దగా వచ్చేది. బాంబినో వెర్మిసెల్లి విడివిడిగా పొడిపొడిగా వచ్చేది. స్వీటయినా, హాటయినా అంటే పాయసమైనా, సేమ్యా బిర్యానీ లేదా ఉప్మా అయినా చాలా రుచిగా ఉండేది. ఇక కార్పోరేట్ సేమ్యా మార్కెట్లోకి వచ్చాక, కేవలం ముస్లింల పండుగ రంజాన్ సందర్భాల్లోనే సేమియా వండటం అన్న రివాజు అంతరించి పోయింది. హిందూ పండుగలకీ, ప్రతీ సందర్భానికీ, స్వీటు అవసరం అన్నప్పుడల్లా సేమ్యా వండటం మామూలైపోయింది. అందునా బాంబినో సేమ్యా మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఆంధ్రభూమి వారపత్రికలో, అప్పట్లో సంచలనంగా ప్రచురింపబడుతున్న సీరియాల్లో బర్డ్స్ నెస్ట్ లూ, గాడిదగుడ్డుల పేరిట వంటల గురించి కథలో చొప్పించి, [హీరో పాత్ర ఈ వంటలన్నీ చేస్తాడు]. ఆపైన పాఠకులకి బాంబినో సేమ్యాతో వంటల పోటీలు నిర్వహించి, విజేతలకి కేజీల కొద్దీ బాంబినో పాకెట్లు బహుమతిగా ఇచ్చారు. అప్పటికి సరికొత్త సంచలనాలైన ఇలాంటి కార్యక్రమాలతో, సదరు కార్పోరేట్ సేమ్యా మార్కెట్లోకి ఒక సునామీని తెచ్చింది. కాలక్రమేణా బోలెడు సేమ్యా కంపెనీలు, వెర్మిసెల్లి ఉత్పత్తులు వచ్చాయి. దాంతో రంజాన్ కి సేమ్యా ప్రత్యేక వంటకం అన్న ఇమేజ్ చల్లారిపోయింది. అలాగే కొన్నేళ్ళు గడిచాయి.

గత పదేళ్ళలో, మరో కొత్త వంటకం ‘హలీం’ తెరమీదికి వచ్చింది. గొర్రె మాంసాన్ని తీసుకుని, ఎముకలు తీసివేసి, మెత్తగా చేసి, సగందాకా నిప్పుల్లో కూరిన పాత్రలో వేసి, నీరు, ఇతర మసాలా దినుసులతో దాదాపు 10-12 గంటలు ఉడికించి, దానిలోకి నానవేసి పొట్టుతీసిన గోధుమ గింజల్ని, నీరుపోసి మెత్తగా రుబ్బగా వచ్చిన పిండిని కలిపి ఉడికిస్తారట. వడ్డించేటప్పుడు వేడి నెయ్యి, నిమ్మరసం, కొత్తిమీర వగైరాలు చల్లి వడ్డిస్తారు. నిజం చెప్పాలంటే హలీం వంటకం మహారుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది రంజాన్ స్పెషల్ అన్నమాట.

ఇక దాని తయారీ పద్దతి గురించి, రుచి గురించి, ముస్లింలకు దానిపట్ల ఉన్న ఇష్టత గురించి, దాని ప్రాశస్త్యం గురించి, ఏప్రాంతం నుండి ఇక్కడికి పాకింది, ఇంకా పలు ప్రాంతాలకు అది పాకుతున్న తీరు గురించి, ప్రింటు, ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా కథలు కథలుగా ప్రచారం చేస్తోంది. అచ్చు ఒకప్పుడు సేమియా గురించి చేసినట్లుగానే. వెరసి ముస్లింల రంజాన్ అంటే ఓ ప్రత్యేక వార్తా స్రవంతి ఉండాలి మరి! 2002 లో అనుకుంటా, రంజాన్ మాసం అయిపోయాక కూడా, మెహదీపట్నం, నానల్ నగర్ సెంటర్లలో హలీం వంటకం అమ్మకం కొనసాగిస్తే మత పెద్దలు పిలిచి మందలించారని దుకాణదారు చెప్పగా విన్నాను. సంవత్సరమంతా హోటళ్ళలో హలీం వండటం వడ్డించటం చేస్తే దాని ప్రత్యేకత పోతుందనీ, కాబట్టి రంజాన్ మాసంలో మాత్రమే దాన్ని వండి వడ్డించాలని హితవు చెప్పారట. వాళ్ళ సంస్కృతీ సాంప్రదాయాల్ని అలా ముస్లింలు పరిరక్షించుకోవటం మెచ్చదగిందే. అయితే ఇతరులకీ అలాంటి మనో భావాలే ఉంటాయని గుర్తించని అహంకారం క్షమార్హమా?

ఇక ముస్లింలలో, [అందరిలో కాకపోయినా చాలామందిలో] మూర్తీభవించిన అహంకారం ఎంతటిదంటే – మీకు ఓ చిన్న యదార్ధసంఘటన వివరిస్తాను. ఓసారి మేం సాయంకాలపు నడకకి వెళ్తుండగా రోడ్డుప్రక్కన కొందరు కూలీలు ఆటో కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. వారిలో ఒక [ముస్లిం] కూలి, తోటి కూలివారితో [హిందువులతో] “మీ ఏకాశ ఉపాసాల గురించి చెప్పమాకు. అన్నం మానేసి పళ్ళుపాలూ, ఉప్మా పులిహోరాలూ తింటారు. మా రంజాన్ ఉపాసం అంటే అటాగిట్టా గ్గాదు. పొద్దంతా అన్నం నీరూ ఉండదు. ఉమ్మి కూడా మింగం తెలుసా?” అంటూ అతిశయంగా చెబుతున్నాడు. పొంగిన అతడి భుజాలు అహాన్ని, వంగిన కనుబొమలు హేళనని సూచిస్తున్నాయి. అక్కడికి అతడేదో 24 గంటలు లేదా రోజుల తరబడి పచ్చిగంగ కూడా ముట్టని కటిక ఉపవాసం చేస్తున్న స్థాయిలో ఉంది అతడి భావ వ్యక్తీకరణ! నిజానికి వాళ్ళయినా సూర్యోదయానికి ముందు భోజనం చేస్తారు. తిరిగి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తారు. రమారమి 11 లేదా 12 గంటలుపాటు ఉపవాసం చేస్తారు. అంతేకదా?

ఇప్పుడంటే హిందూమతాచారాలు, అనుష్టానము కూడా భ్రష్ఠుపట్టాయి గాని, ఒకప్పుడు ఏకాదశి అంటే ఏకాదశి ఘడియలు పూర్తయ్యే వరకూ 24 గంటలపాటు కటిక ఉపవాసమే చేసేవాళ్ళు. ద్వాదశి ప్రవేశించాక పారణ చేసేవాళ్ళు. భాగవతం లోని అంబరీషు చక్రవర్తి కథా ఇదే చెబుతుంది. అంబరీషుడు ఏకాదశీ ఉపవాసం పూర్తి చేసి, ద్వాదశి పారణ చేయబోతుండగా దూర్వాసమహర్షి అతిధిగా వచ్చాడట. గృహస్తధర్మం ప్రకారం ఆదరించి అతిధ్యమివ్వబోయిన చక్రవర్తిని పరీక్షించగోరి, దుర్వాసుడు ‘నదీస్నానం చేసి వస్తాను నిరీక్షించమని’ వెళ్ళాడట. అంతే! ద్వాదశి ఘడియలు పూర్తికావస్తున్న రాడు. దాంతో అంబరీషుడు అతిధి రాకుండా భోజనం చేయకూడదన్న నియమంతో ఎదురుచూసాడట. చివరికి మంత్రి, పురోహితుల సలహా మేరకు నీరుతాగి ద్వాదశి పారణ ముగించాడట. ఆ క్షణమే తిరిగి వచ్చిన దుర్వాసుడు కోపంతో అంబరీషుని చంపమని ఒక మహారాక్షసిని సృష్టించాడట. అయితే అంబరీషుడు శ్రీహరిని స్మరించగా సుదర్శన చక్రం దూర్వాసుణ్ణి వధించ వచ్చిందట. ప్రాణ రక్షణార్ధం పధ్నాలుగు లోకాలూ తిరిగిన దూర్వాసుడు, చివరికి వైకుంఠం చేరి నారాయణుడిని ప్రార్ధించాడట. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు “సుదర్శన చక్రాన్ని నిరోధించి నిన్ను రక్షించగలవాడు అంబరీషుడే. భగవంతుని కంటే భక్తులే శక్తిమంతులని తెలుసుకో” అని పంపేసాడట. చివరికి దూర్వాసుడు అంబరీషునే శరణుకోరి, క్షమార్పణ వేడి ప్రాణాలు కాపాడుకున్నాడట.

ఈ కథ ద్వాదశ వ్రతాన్ని వివరిస్తుంది. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం అన్నా, శివరాత్రి ఉపవాసం అన్నా హిందువులు, పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పళ్ళు, ఫలహారాలు తీసుకుంటున్నారు. అలాగైనా అదేమీ రంజాన్ ఉపవాసానికి తీసిపోదు కదా? అయినా, అక్షరం ముక్కరాని పామరుడైనా సరే, ముస్లిం అన్నవాడు[అందరూ గాకపోయినా అధిక సంఖ్యలోనే] మతాంహకారం చూపకుండా ఉండడు. అలా మతాహంకారం చూపని వాడు కనబడటం నిజంగా అరుదే!

పోతే, మీడియా మాత్రం, ముస్లింల పండుగ గురించి, హలీంలో సేమియాలో… వగైరా ప్రత్యేకతల గురించి ఇఫ్తార్ లూ సహార్ ల గురించి నెలంతా ఊరిస్తూ వ్రాస్తూనే ఉంటుంది. ప్రచారం చేస్తూనే ఉంటుంది. అంతే భారీగా హిందూ పండుగలనో, మతాచారాల గురించో, ముస్లిమేతరుల పండగ పబ్బాలనో, సంస్కృతీ సాంప్రదాయలనో నెత్తికెత్తుకోదు. ఎందుకంటే ముస్లింలు మీడియాకి ముద్దుబిడ్డలు కదా మరి!

ఇంకో విచిత్రం చెప్పాలి? ఇప్పుడంతగా లేదుకాని, మా చిన్నప్పుడు గుంటూరులో, హిందువుల పండగ ఏది వచ్చినా ఆ ముందురోజు పంపుల్లో మంచినీళ్ళు బందయ్యేవి, పండుగరోజు కరెంటు పోయేది. అదే ముస్లింల పండుగ నాడైతే ముందురోజే ప్రభుత్వప్రకటనలు [నీళ్ళు, కరెంటు నిరాటంకంగా సరఫరా చేయబడతాయని] వచ్చేవి. అలాగే జరిగేది కూడాను. దానికి గల కార్యకారణ సంబంధాలు కేవలం వోటుబ్యాంకు రాజకీయాలని అప్పడంతా అనుకునేవారు గానీ, ఇప్పుడైతే అదంతా హిందువుల మీద, భారతీయుల మీదా కుట్రని అర్ధమౌతుంది కదా! నిజానికి ఈ కుట్రదారులకి ముస్లింల మీద ప్రేమ కూడా అవ్యాజ్యమైన దేమీ కాదు. మత మౌఢ్యం ఎక్కిస్తే మానవత్వం మరిచిపోయి, ఎంతటి దారుణాలకైనా ముస్లింలో అత్యధికులు ఒడిగడతారు. కాబట్టే ఆ పక్షపాతం! అది కూడా విభజించు పాలించమన్న కణికనీతిలో భాగమే. ఒకవేళ హిందువులు గానీ, మరో మతస్థులు గానీ, ఇప్పటి ముస్లింల లాగే మతం, మరొకటి[అది దేశం గానీ, జాతీయత గానీ, మానవత్వంగానీ ఏదైనా కానివ్వండి!] లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే, మతం వైపే మొగ్గుతారు చూడండి, అలాంటి మతమౌఢ్యాన్ని అలవరుచుకుంటే, అప్పుడు నకిలీ కణిక వ్యవస్థ తప్పకుండా సదరు మతస్థుల్ని కూడా నెత్తిన పెట్టుకుని, ఇప్పుడు ముస్లింలని గారాబం చేసినంతగా కాకపోయినా, ఎంతోకొంత చేస్తుంది. కాకపోతే నకిలీ కణిక వ్యవస్థకి ఓ మొగ్గు ముస్లింల పట్లే ఉండటం కూడా సత్యం!

ఏదైతేనేం ఒకప్పటి రంజాన్ స్పెషల్ సేమ్యా స్థానే నేడు హలీం కూర్చుంది. ఒకవేళ దీనికి రెడీమేడ్ మిక్స్ లు మార్కెట్లోకి వస్తే, మరో వంటకం సృష్టించబడుతుంది. ఇదండీ సేమ్యా ల, హలీంల కథా కమామిషు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

నిజం చెప్పారు! నచ్చింది.

very very good..keep blogging.

హిందువుల పండగ ఏది వచ్చినా ఆ ముందురోజు పంపుల్లో మంచినీళ్ళు బందయ్యేవి, పండుగరోజు కరెంటు పోయేది.
మాకు ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది.

మీరు వ్రాసిన హిందూ పండుగరోజులలో నీళ్లు మామూలుగానే లేక తక్కువ ఇచ్చి, ముస్లిం పండుగరోజులలో రోజంతా నీరు, ఖరంటు ఇచ్చే సంఘటనలు కాశీలోనూ ఎక్కువే.

correct ga chepparu.

Ekaadashi upavaasam gurimchi nenu corect ga telusukunnadi veyi padagallone (malli veyipadagalu). appatinundi saadhyamainappudalla nenu ekadashi roju upavaasam untunnaanu(atleast bhishma ekadashi,maha shivaratri rojullo).

bhagavatam ika ippudu chadavabotunna kaabatti chudali.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu