నేను ఈ టపాల మాలికలో వ్రాస్తున్న అంశాలని logical గానూ, Sequence తోనూ, Circumstantial గానూ నిరూపిస్తాను. అందుచేత ఈరోజు మొదలయిన ఈ టపాల మాలిక పూర్తి అయ్యేవరకూ ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాను.

ఈ నెల [Sep.] 2 వతేదీన వై.యస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించాడు. అంతేకాదు, అది అతి భయంకరమైన మరణం కూడా! విధి, గూఢచర్యం, ఎంత కౄరంగానైనా ఉండగలవనటానికి సజీవ సాక్ష్యం ఆ హెలికాప్టర్ ప్రమాదం. అది యాదృచ్చికంగా జరిగిన ప్రమాదమా? లేక పధకం ప్రకారం జరిపించబడిందా? గూఢచర్యంలో ’యాదృచ్చికం’గా ఏ సంఘటన అయినా జరగడానికి అవకాశాలు బాగా తక్కువ. అధవా…ఎప్పుడైనా, ఏ సంఘటన అయినా జరిగినా, మరుక్షణం దానిపైన గూఢచర్య కార్యకలాపాలూ, స్ట్రాటజీ ఊడల మర్రిలా దిగిపోతాయి. చిక్కుముడిలా అల్లుకుపోతాయి. రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏ సంభావ్యత ఉంది? యాదృచ్చికంగా ప్రమాదం జరిగి, దానిపైన గూఢచర్యం అల్లుకుందా? లేక గూఢచర్యంలో భాగంగా, పధకం ప్రకారం ప్రమాదం జరిపించబడి, తదుపరి గూఢచర్యం కొనసాగుతోందా?

రాజశేఖర్ రెడ్డి మరణానికి దారితీసిన పరిస్థితులేమిటి? ప్రమాదానికి పూర్వాపరాలేమిటి? రాజశేఖర్ రెడ్డి మరణానికి, ఇప్పుడు కేంద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకి, కేంద్రమంత్రుల ప్రవర్తనా సరళికి మధ్య కార్యకారణ సంబంధం ఏమిటి? ఎవరి సువర్ణముఖి ఏమిటి?

రాజశేఖర్ రెడ్డి మరణించిన హెలికాప్టర్ ప్రమాదం నిశ్చయంగా యాదృచ్చికం కాదు. అయితే ఇది రాజశేఖర్ రెడ్డికి శతృవులాగా నటించిన రామోజీరావు జరిపించింది కూడా కాదు. రామోజీరావుని సైతం దిగ్ర్పాంతి పరిచిన సంఘటన ఇది. నిజానికి, నడుస్తున్న రాజకీయ సినిమాకి దర్శకుడూ, నిర్మాతా, స్క్రిప్టు రచయితా రామోజీరావే. ఏ పాత్ర ఎంతకాలం తెరమీద ఉండాలో, ఎప్పుడు ఎవరు తెరమరుగై పోవాలో నిర్ధేశించేది అతడే. ఎటూ తాను, కొన్ని రోజుల లేదా నెలల తర్వాత రాజశేఖర్ రెడ్డి కాల్షీటుని ముగించదల్చుకుని ఉండగా, ఆ లోపున పూర్తి చేయవలసిన పనుల్లోనూ, రాబట్టవలసిన సమాచారంలోనూ తలమునకలై ఉండగా, అంతలోనే పులిమీద పుట్రలా మరొకరు ’జరిపించగా’ రాజశేఖర్ రెడ్డి కథ ’ఫినిఫ్’ అయిపోయింది. [సెప్టెంబరు రెండుకు ముందు, ఆగస్టు 31న రాజశేఖర్ రెడ్డి తెదేపా పని ఫినిఫ్ అయిపోతుందనీ, దాని మీద సెప్టెంబరు ఒకటో తారీఖు ’ఎవరు ఫినిఫ్ అవుతారో చూద్దాం’ అని చంద్రబాబు ప్రకటించడం కూడా యాదృచ్చికం కాకపోవచ్చు. జనాలు ఆ వార్తాను చదవటం పూర్తిచేసుంటారేమో, అంతే! అప్పటికే వై.యస్. మిస్సింగ్! తమ తమ Assignments ప్రకారం, ఇద్దరు నాయకులూ తమతమ వాగ్బాణాలు సంధించుకున్నారు.
అయితే అర్ధాంతరంగా రాజశేఖర్ రెడ్డి కథ ఎందుకు ముగిసిపోయింది? ఎవరు ముగించారు?

ఇది తెలుసుకోవడానికి ముందు రాజశేఖర్ రెడ్డి మనస్తత్వం గురించీ, అతడి కుటుంబ వారసత్వం గురించీ, కొంత తెలుసుకోవటం తప్పని సరి! Jan.10, 2009 న వ్రాసిన నా గత టపా ’రాజ – రామోజీల యుద్ధం నిజమా? నాటకమా?’లో వివరించిన విషయాలని మరోసారి పరిశీలించటం కూడా తప్పని సరి! ఎందుకంటే ఈ వివరణని నేను అక్కడి నుండే ప్రారంభిస్తున్నాను కాబట్టి, అక్కడి నుండే ప్రారంభించాలి కాబట్టి!

మీడియా ఊదరబెట్టి మరీ ప్రచారించన దాని ప్రకారం, రాజశేఖర్ రెడ్డి 1975 లో రాజకీయాల్లో ప్రవేశించాడు. ఇప్పుడింతగా మీడియా మొత్తం, రాజశేఖర్ రెడ్డి భక్తులూ, [వీళ్ళెలా ఏర్పాడ్డారో, మీకు ఈ టపాల మాలికలోనే చెబుతాను] కలగలసి కోరస్ గా ’రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షనిస్టు కాదు, ఫ్యాక్షనిజంని రూపమాపేందుకు ప్రయత్నించిన దార్శనికుడు’ అంటూ అతణ్ణి దేవుణ్ణి చేసేసినా, అతడి చరిత్ర ఏమిటో, అందరికీ తెలిసిందే! 1992 కు ముందు అతడి ముఠా రాజకీయాలు, నిరంతర అసంతృప్త వాదమూ అందరూ చూసిందే! ఇప్పటి ముఖ్యమంత్రి,, నిన్నటి వరకూ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో నెం.2గా చెలామణి అయిన ఆర్దికమంత్రీ, రోశయ్య, రాజశేఖర్ రెడ్డిని ఇప్పుడెంతగా ప్రశంసలు వర్షంలో ముంచెత్తుతున్నా, అప్పట్లో అయితే ’ఇతడొక చీడపురుగు. ఇతణ్ణి బహిష్కరించండి’ అంటూ అధిష్ఠానానికి అర్జీలు పెట్టుకున్నవాడే! అయినా అప్పట్లో కాంగ్రెస్ లో ముఠాలు లేవంటే నేతిబీర కాయలో నెయ్యి ఉందన్నట్లే!

రాజశేఖర్ రెడ్డి బైరటీస్ గనుల వివాదం, ఈనాడు హోరెత్తించగా 1989 ప్రాంతాల్లో అందరూ చదివిందే. అసలు రాయలసీమలో ఫ్యాక్షనిజం గురించి మీడియా చేసిన ప్రచారమే ఓ పెద్ద దొంగ ప్రచారం. ఇక్కడ కుటుంబ గౌరవాల కోసం, తరతరాలుగా వారసులు కూడా కొట్టుకుంటారనీ, అనివార్యమైన పగాప్రతీకారాలతో, ఆలయాల్లో ప్రధమ పూజల దగ్గర నుండీ అన్నిటా ఆధిపత్యం, గౌరవాల కోసం కొట్టుకుంటారని మీడియా తెగ ప్రచారం చేసింది. దశాబ్ధాల నుండి ప్రచారం చేసింది. ఈనాడు వారి ‘చతుర’లో ‘మానవ హోమం’ పేరిట ఇదే ప్రచారిస్తూ ఓ నవల కూడా ప్రచురితమైంది.

అయితే ఇక్కడి కొచ్చి చూస్తే… రాయలసీమలో కుటుంబగౌరవం, ఆధిపత్యం సెంటిమెంటుతో కొట్టుకోరు. ఆ నెపం వెనుక ఉండేది వ్యాపార పోటీ, దోపిడిపోటి. యజ్ఞం సినిమాలో చూపిన కథా నేపధ్యానికీ ఇక్కడి ఫ్యాక్షనిస్టుల నేపధ్యానికీ తేడా ఏం ఉండదు. ఎవరికి బలముంటే వాళ్ళు ఇసుక తవ్వుకుపోతారు. ప్రక్కవాడి గనుల కూడా తవ్వుకు పోతారు. అసలు ప్రభుత్వ అనుమతులే లేకుండా యధేచ్ఛగా ప్రకృతి సంపద నుండి, సామాజిక వ్యక్తిగత సంపదలు కూడా బలదూర్ గా దోపిడి చేస్తారు. అడవులు సైతం ఇందుకు మినహాయింపు కావు. అందుకోసమే ముఠాలు నిర్వహింపబడతాయి. వాటికే ఫ్యాక్షన్ ముఠాలనే పేరుపెట్టి, దశాబ్ధాల తరబడి ’ఫ్యాక్షనిజం’లో ఉన్న డబ్బు, ప్రమేయాన్ని ప్రక్కన బెట్టి, సెంటిమెంటు ప్రమేయాన్ని మాత్రమే మీడియా ప్రచారించింది. ఎందుకంటే – ‘ఈ ముఠాలలో తమకు అనుకూలమైన ముఠాని బలపడేటట్లు చేసి, దోపిడిలో వాటా పుచ్చుకోవటం’ అన్న ప్రక్రియ బహిరంగమవ్వకూడదు కాబట్టి. విభజించి పాలించు, విభజించి ప్రచారించు అన్న రెండు సూత్రాలూ నకిలీ కణికుల ప్రధాన స్ట్రాటజీలు కావటం తెలిసిన విషయమే!
ఇలాంటి నేపధ్యమే రాజశేఖర్ రెడ్డిది కూడా!

ఫ్యాక్షన్ రాజకీయాలన్నవి ఇతడి తండ్రి హయం నుండే వింటున్న మాట. అంతేకాదు జన్యుపరంగా కూడా ఇతడి పూర్వీకులు పదార్ధవాదులే. కాబట్టే నమ్మకాలు వదిలేసి ఇతడి తాత హయంలోనే మతమార్పిడికి ఒడిగట్టారు.

ఇక్కడ ఓ నిజసంఘటన వివరిస్తాను. మా తాతగారి ఊరు[నరసరావుపేట దగ్గర]లో ఊరి మొదట్లోనే వాగుదాటగానే రాముల వారి గుడి ప్రక్కనే, పెద్ద చర్చి ఉండేది. ప్రక్కప్రక్కనే ఉన్న వాటి గురించి అడిగినప్పుడు మా బాబాయి ఇదంతా చెప్పారు. ఆ ఊర్లోకి క్రైస్తవులు వచ్చి, మతం మార్చుకొమ్మనీ, క్రైస్తవులుగా మారితే స్కూలు, ఆసుపత్రి, చర్చి కట్టిస్తామనీ, ఉచితంగా చదువు చెప్పి, ఆపైన తమ సంస్థల్లోనే ఉద్యోగాలు ఇస్తామనీ అన్నారట. అయితే ఆ ఊరిలో ఎవరూ మతం మార్చుకునేందుకు ముందుకు రాలేదట. ఒకే ఒకవ్యక్తి ’ఇన్నాసి రెడ్డి’ అనే ఆయన, ముందుకొచ్చాడట. దాన్నే ప్రిస్టేజ్ గా తీసుకున్న ఆ క్రైస్తవ మత సంస్థ, అతడొక్కడి కోసం, ఇంకెక్కడ చోటే లేనట్లు రాముల వారి గుడిప్రక్కనే చర్చి కట్టించిందట. మొదట ఊరివాళ్ళు ఇన్నాసిరెడ్డిని వెలివేసారట. అయితే ఒక్కడి కోసం, అంత ఖర్చుపెట్టి, అంతపెద్ద చర్చి కట్టించిన క్రైస్తవ మిషనరీని చూసి, వాళ్ళు అతడికిస్తున్న ప్రాముఖ్యతనీ, ఆర్దిక తోడ్పాటు చూసి, మరికొందరు మతం మారారట. మంది ఎక్కువ అయ్యేసరికి క్రమంగా వెలి వెలిసి పోయిందట.

అతడు మా తాతగారికి బంధువే. అతడోసారి మా తాతగారి ఇంటికి వచ్చాడు. మా తాత “ఏం ఇన్నాసయ్యా? వచ్చావు, చెప్పు?" అన్నారు. అతడు [అప్పటికి కాస్త వయస్సు మళ్ళిన వాడే] “ఇన్నాసయ్య ఏంది మామా! ఇన్నాసి రెడ్డి అను” అన్నాడు. “మతం మార్చుకున్నొడివి నువ్వు రెడ్డి ఏంటిరా? ఇన్నాసయ్య అంతే” అన్నాడు మా తాత! అతడూ నవ్వి ఊరుకున్నాడు. తర్వాత మా చిన్నాన్న చెప్పిందేమంటే ఆయన్నందరూ ‘ఇన్నాసయ్య’ అనే పిలుస్తారని. ఇది మా చిన్నప్పుడు జరిగిన సంఘటన.

మా వారి తాతగారి ఊరిదీ మరో కథ. అది పొన్నూరు దగ్గరలోని ఓ చిన్న గ్రామం. స్కూలు అన్నా, ఆసుపత్రి అన్నా ప్రక్క ఊరికి వెళ్ళాల్సిందే! ఊరందరూ మతం మారితే ఆ ఊరిలో స్కూలు, ఆసుపత్రి కట్టిస్తామని చెప్పారు క్రైస్తవ మిషనరీ వాళ్ళు. ఆ ఊరిలో ఎవరూ స్కూలు, ఆసుపత్రి వంటి ప్రలోభాలకి లొంగలేదు. ఒకే కులానికి చెందిన వారున్న ఆ ఊరిలో మాత మార్పిడిని ఎవరూ అంగీకరించలేదు. ఇది 50 ఏళ్ళక్రిందటి కథ.

అయితే రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో ఈ మత మార్పిడి కథ మరింత గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ మతం మార్చుకున్న వాళ్ళు, తాము అటు ‘క్రైస్తవులం’ అంటూ చర్చికి వెళతారు, ఇటు ‘హిందువులం’ అన్నట్లు బొట్లు పెట్టుకుని గుళ్ళకీ వెళతారు. వెరసి వీరిది ఎంత పదార్ధవాదమంటే రెండింటిలోనూ తమకు ప్రయోజనాలు [Benefits] కావాలనుకుంటారు.

అసలు మతం మార్చుకునేందుకు సంసిద్ధులయ్యేదే పదార్దవాదులు. ఆకలికి అల్లాడే, దారిద్ర్యంతో బాధలు పడేవారికి ఏ సిద్ధాంతాలు వర్తించవు. ఏ నమ్మకాలూ పనిచేయవు. కాబట్టి మతం మారితే వచ్చే ప్రయోజనాలను ఆశించి, ఇప్పుడు, ఈ ఇటలీ స్త్రీ ప్రభుత్వంలోనూ, స్వాతంత్రానికి పూర్వం బ్రిటిషు వాడి ప్రభుత్వంలోనూ మతం మార్చుకుంటున్న, మార్చుకున్న, నిరుపేదలు ఎవరైనా ఉంటే, వారి గురించి నేను పైవ్యాఖ్య చేయటం లేదు. ఎవరైతే ఆస్థిపాస్తులూ, ఆదాయావనరులూ బాగానే ఉండి కూడా, మరింతగా డబ్బూ, కెరియర్ పొందవచ్చన్న ఆశతో మతం మార్చుకున్నారో, గత 1200 సంవత్సరాలుగా మారారో వారినే ’పరమ పదార్ధవాదులని’ అంటున్నాను. వందల సంవత్సరాలకు పూర్వం నుండీ కూడా, ముస్లింలకి బలమూ, అధికారమూ ఉన్నాయనుకున్నప్పుడు వారి ప్రాపు పొందితే ప్రయోజనాలుంటాయనుకున్నవారు ముస్లింలయ్యారు. తర్వాత వచ్చిన యూరోపియన్లకి బలమూ, అధికారమూ ఉందనుకున్నప్పుడు, వారి ప్రాపకం పొందితే ప్రయోజనాలుంటాయను కున్నవారు క్రైస్తవులయ్యారు. ఆయా మతాల్లోని సిద్దాంతాలు నచ్చాయి అనటం ఏ.ఆర్.రెహమానులకూ, బ్రదర్ అనిల్ కుమార్ లకూ అలవాటే!

కాబట్టే మతం మారటం అంటే ఉద్యోగం మారటం వంటిదేననే అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. వేలూ వందల సంవత్సరాలుగా వాళ్ళ ’జీన్స్’ అంతే! ఈ దేశంలోని ముస్లింలెవరూ అరబ్బు దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. అలాగే ఈ దేశంలోని క్రైస్తవులూ యూరప్ లో పుట్టి ఇక్కడికి వలస వచ్చిన వారు కారు. తరాల క్రితం, శతాబ్ధాల క్రితం పూర్వీకులు మతం మారగా ఆయా మతస్థులైన వారే! హిందూమతంలోని దురాచారాలు, కులం వర్గాల అహంకారాలు మాతమార్పిడులకు కారణం అన్నది స్వల్పంగా ఉన్న అంశం మాత్రమే! దాన్ని నకిలీ కణిక వ్యవస్థ 350 సంవత్సరాల పైగా తరతరాలుగా చేసుకొస్తున్న కుట్రలో భాగంగా, ఉన్నదాన్ని వెయ్యింతలు చేసి ప్రచారించింది. వై.యస్. ని నిన్నటిదాకా తిట్టిన ఆ ‘రెండు’ పత్రికలు చనిపోగానే హఠాత్తుగా వై.యస్.ని దేవుణ్ణి చేసినట్లు!

ఏది ఏమయినా కన్నతల్లి వంటి నమ్మకాలని అమ్ముకునే వారే, విలువల కంటే పదార్ధానికే ఎక్కువ విలువనిచ్చే వారే, తరాల క్రితం, శతాబ్ధాల లేదా దశాబ్ధాల క్రితం మతాలు మారారు. తరతరాలుగా వారి ’జీన్స్’ అదే పదార్ధవాదాన్ని మోసుకొచ్చాయి. అలాంటి అనేక కుటుంబాల్లో ఒకటి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా! అంతేకాదు – ఫ్యాక్షన్ రంగంలో, మాఫియా రంగం కొత్తగా ముఠాలు కట్టటం, నెమ్మదిగా నిలదొక్కుకోవటం కూడా పరిపాటే. అయితే ఇక్కడ సూక్ష్మమైన అంశం ఏమిటంటే, గూఢచార వ్యవస్థల దీవెనలు ప్రోత్సాహం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న ముఠాలే ఫ్యాక్షన్ రంగంలో అయినా, మాఫియా రంగంలో అయినా ప్రాబల్యంలోకి వస్తాయి. ఇక్కడ ప్రత్యక్షసంబంధాలు ఉండనవసరం లేదు. ఆ దృక్పదం కలిగి ఉన్న ముఠానాయకత్వాలకి, ఆ ప్రోత్సాహం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.

ఈ మర్మం తెలియదు కాబట్టి, రాయలసీమలో ఫ్యాక్షన్ ముఠాకట్టినంత సులభంగా, గూఢచర్యంలోనూ ముఠాకట్టవచ్చని, కొత్తగ్రూప్ పెట్టవచ్చని అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇతడిది ఇంత హ్రస్వదృష్టి [Short sight] కాబట్టే, "ఇతడు అక్కడున్నది తను తెలుసుకోడు. తాను అనుకున్నది అక్కడ ఉంది అనుకుంటాడు. గూఢచర్యం విషయంలో ఇతడు ఇంత అజ్ఞాని” అని వ్రాసాను. ఆగస్టు 3, 2009 న వ్రాసిన నా టపా ‘నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్నిదృష్టాంతాలు[Circumstantial] -4 [సువర్ణముఖి – ఎవర్నీ ఎంత వరకూ నమ్మటం?]’ లో!

ఇంతకు ముందు టపాల్లో చెప్పినట్లు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న గూఢచర్యపు పోరులో నకిలీ కణిక వర్గమైన నెం.10 కి తన ప్రత్యర్ధి వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల పట్ల నిబద్దత గల నెం.5 వర్గాన్ని నమ్మించవలసిన అవసరమూ, తద్వారా స్ట్రాటజీ ముందుగా తెలుసుకుని తదనుగుణమైన వ్యూహరచనలు చేయవలసిన అవసరమూ ఉన్నాయి.

డీవిడీ ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయటం మాత్రమే వచ్చినట్లుగా, నమ్మకద్రోహం వంటి స్ట్రాటజీలు, ఎదుటి వాళ్ళకు తెలియనప్పుడు మోసగించటం వంటి ఎత్తుగడలూ మాత్రమే తెలిసిన నకిలీ కణికవర్గానికీ, అందులోని కీలక వ్యక్తి అయిన రామోజీరావుకీ, అసలైన గూఢచర్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నొప్పి! ఇక మెదళ్ళతో యుద్ధం చేయటం అంటే మరింత నొప్పి! అంచేత తమ ఏజంటుని నెం.5 చేత నమ్మించి, ఆ వర్గంలోకి install చెయ్యటం అవసరం.

అందుకోసం రాజశేఖర్ రెడ్డిని ఎలా అంచెలంచెలుగా ముఖ్యమంత్రి కుర్చీలోకి తెచ్చాడో గతటపాలలో వివరించాను. అందులో భాగంగానే, రామోజీరావు, రాజశేఖర్ రెడ్డికి చాలా సీన్ ఇచ్చాడు. ఈ సందట్లో రాజశేఖర్ రెడ్డి తన ఫ్యాక్షన్ తెలివితేటలతో, స్నేహితుడు కెవిపి లీగల్ జ్ఞానాన్ని జోడించి సరికొత్త వ్యూహం పన్నాడు. నెం.5 వర్గం తనని నమ్ముతోందనీ, తాను వారిని నమ్మించగలిగాననీ రామోజీరావుని నమ్మించాడు. అది నమ్మిన రామోజీరావు నెం.5 వర్గాన్ని మరింతగా నమ్మించేందుకు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని హీరోని చేసి, తనను తాను జీరో చేసుకున్నాడు. ఫలితమే ఈనాడు ఇడుపులపాయనీ తీస్తే, వై.యస్., రామోజీరావు ని కోర్టుగుమ్మాలు ఎక్కించి దించడాలు, మార్గదర్శి కేసులు!

ఈ నేపధ్యంలో నెం.5 కూడా “అవునవును. మేం రాజశేఖర్ రెడ్డిని నమ్ముతున్నాం. అతడికి అనుకూలం [భారతంలోని ’అశ్వత్ధామ హతాహతః కుంజరః’] అన్నట్లు, అతడికి మరింత హవా నడిచేటట్లు సానుకూలతను ఏర్పర చింది.

దానితో రామోజీరావు ఎంతగా ఆశకి గురయ్యాడంటే – స్వయంగా తాను తన రెండో కొడుకు సుమన్ తో తగాదా పెట్టుకుని, సుమన్ చేత ప్రత్యేక ఇంటర్యూని సాక్షికి ఇప్పించే దాకా! దీని గురించిన వివరాలు కూడా గత టపాలలో వ్రాసాను.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, రాజశేఖర్ రెడ్డి తన గ్రూప్ ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏముంది గూఢచర్యం అంటే? డబ్బు పోగెయ్యాలి. స్వంతవర్గాన్ని పెంచుకోవాలి, రామోజీరావుకు RFC ఉన్నట్లు, బలమైన కోట వంటి స్వంత ప్రదేశాన్ని తయారు చేసుకోవాలి, మతాన్ని కూడా ఒక బలమైన ఆయుధంగా వాడుకోవాలి. స్ట్రాటజీలు నడపాలి. ప్రజల మద్దతు కోసం కొన్ని పనులు చేయాలి. కొన్ని చేస్తున్నట్లు నటించాలి. ప్రత్యర్ధులను తొక్కివేయాలి. తన వర్గాలోకి వచ్చిన వారిని ఆర్దికంగా, రాజకీయంగా బలవంతులుగా తయారు చేసుకోవాలి! అంతే కదా!’ అని తన ఫ్యాక్షన్ దృష్టితో చూశాడు. వెనుకటికి గారెల వంటకం నేర్చుకున్న గృహిణిలాగా అన్నమాట.

ఆ కథేమిటంటే…

పెళ్ళై కొత్తగా కాపురానికి వచ్చిన ఓ అమాయకపు గృహిణిని భర్త గారెలు వండమని అడిగాడట.

ఈవిడ “నాకు రాదండి!” అంది.

"ప్రక్కింటి పిన్నిగారిని అడిగి నేర్చుకో!” అన్నాడు భర్త. సరేనని ఆవిడ ప్రక్కింటావిడని అడిగింది. ప్రక్కింటి పిన్నిగారు భర్తృవిహీన.

ఆవిడ సాదరంగా "దాని కేం భాగ్యం అమ్మాయ్! ముందుగా మినప్పప్పు నానబోయాలి” అంది.

"ఓ తెలిసింది తెలిసింది” అంటూ ఈ అమాయకపు గృహిణి హడావుడిగా ఇంటికెళ్ళి పప్పునానబోసింది.

తర్వాత ‘ఏముంటుంది లెద్దూ, పొట్టుతీసి రుబ్బాలి’ అనుకుని, పప్పు నానాక పొట్టు తీసి రుబ్బి పారేసింది. తర్వాతేం చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పిన్నిగారి దగ్గరి కెళ్ళింది.

పిన్నిగారు, "అందులో ఉప్పు, జీలకర్రా, ఉల్లిముక్కలూ, పచ్చిమిరప కాయముక్కలూ కలపాలి” అంది.

ఈ గృహిణి “తెలిసింది. తెలిసింది” అంటూ హడావుడీగా ఇంటికొచ్చేసి అన్నీ పిండిలో కలిపింది. మళ్ళీ సందేహం. ఏం చెయ్యాలి? మళ్ళీ పిన్నిగారూ!

పిన్నిగారు “నూనె కాగబెట్టి, అందులో, చేతి వేళ్ళమీద పిండి తట్టుకుని, మధ్యలో చిల్లుపెట్టి పిండిముద్దల్ని నూనెలో వెయ్యాలి...” అంటూ ఇంకా చెప్పబోతుండగా ఇంతలో వారింటికి మంగలి పొదితో వచ్చాడు. పిన్నిగారు వితంతవు కావటం చేతా, వితంతవులు తలమీద వెంట్రుకలు తీయించుకోవటం వాళ్ళ ఇంటి ఆచారం కావటం చేతా, ఆవిడ వెళ్ళి మంగలి ఎదురుగా కూర్చొని శిరోముండనం చేయించుకుంది.

అంతే. ఈ గృహిణి కూడా “తెలిసింది. తెలిసింది” అంటూ మంగలిని తన ఇంటికి పిలిపించుకుని, గుండు కొట్టించేసుకుని, ఆపైన గారెలు వండి, భర్తకోసం ఆనందంగా, ఆత్రంగా, విజయ దరహాసంతో ఎదురు చూడసాగింది.
వేడి వేడి గారెలు ఆనందిద్దాం అనుకుంటూ ఇంటికొచ్చిన భర్త, ఆమె అవతారం చూసి కళ్ళు తేలేసాట్ట.
‘ఏమీ తెలియకుండా, ఎదుటివారిని అనుకరించటం పనికి మాలిన తనం’ అని చెప్పటానికి మన పెద్దలు ఈ కథ చెబుతారు.

సరిగ్గా రాజశేఖర్ రెడ్డి చేసింది ఇదే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

హస్వదృష్టి కాదండీ హ్రస్వదృష్టి

కన్న గారు,

చాలా రోజుల తర్వాత వ్యాఖ్య వ్రాసారు. హ్ర విషయంలో తప్పుదిద్దినందుకు నెనర్లు.

స్వల్పకాలిక ప్రయోజనాల కోసం, దూరదృష్టి లోపంతో, కేవలం ఒకరి మీద ద్వేషంతో, నినాదాల హోరులో కొట్టుకునే పోయే మతమార్పిడుల గురించి, "పదార్థ వాదు"లంటూ చక్కగా చెప్పారు.

nice

నేను వ్యాఖ్యానించలేదు కాని మీ టపాలన్ని చదువుతూనే ఉన్నా!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu