రామోజీ రావు ముందు పెట్టబడిన సవాల్ లో “ప్రపంచమంతటనీ నడిపిస్తున్న నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ కీలక వ్యక్తిగా అన్నిటినీ బయటపెట్టుకుంటావా లేక ‘చిన్నవాణ్ణి నేను, చిన్నపత్రికాధిపతి’ని అన్నట్లుగా, మామూలుగా Fade out అవుతావా?" అన్నదే – ఇక్కడ ’కన్నా?’ లేక ’కాలా?’ స్ట్రాటజీ.

ఈ సవాల్ తాలుకూ పర్యవసానాన్ని రామోజీరావు, అతడి నెం.10 వర్గం, మొదట్లో అంతగా అంచనా వేసుకోలేకపోయాయి. కాబట్టే ఓ వైపు తాను చిన్నవాణ్ణన్న పిక్చర్ ఇచ్చుకుంటూ, మరోవైపు తమ గూఢచార వలయాన్ని, వ్యవస్థనీ కాపాడుకునే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగానే, చంద్రబాబునాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ‘విదేశీపెట్టుబడుల ఆకర్షణ’ నెపంతో ప్రపంచపు అంచుల దాకా పరుగులు పెట్టిమరీ లాబీయింగ్ నిర్వహించాడు. అదేబాటలో కేంద్రప్రభుత్వంలోని కీలక వ్యక్తులూ, ప్రముఖ వ్యక్తులూ కూడా పయనించారు. అయినా గానీ, అతి చిన్న, పేద, దేశమైన పాకిస్తానూ, దానికి భారతదేశంలోని హైదరాబాద్ తో గల సన్నిహిత సంబంధాలూ, ముఖ్యంగా పాతబస్తీ తో గల అవినాభావ, అవిచ్ఛన్న సంబంధాలూ, భారత దేశంలోని రకరకాల సంఘటనలతో [నకిలీ నోట్లు, తెల్గీ నకిలీ స్టాంపుల వ్యవహారంలాంటివి] పాకిస్తాన్ లింకులూ, ప్రపంచం మొత్తమ్మీదా రాజకీయ, ఆర్ధిక, పారిశ్రామిక, సినిమా, మీడియా రంగాల్లో ఒకే శృతి – ఈ విధంగా ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్న ఒకానొక వ్యవస్థా లేదా ఏజన్సీ ఉండటం అన్న ’సంభావ్యత’ అచ్చంగా బహిర్గతమైపోయింది.

ఏ వ్యక్తైనా, ఏదైనా గూఢచార ఏజన్సీకి ఏజంటుగా గుర్తింపబడితే, అతణ్ణి ఆ ఏజన్సీ వదిలేసుకుంటుంది. చాలా స్పల్ప వ్యవధిలోనే ఆ వ్యక్తి, అతడెంత పెద్ద రాజకీయనాయకుడైనా లేక పారిశ్రామికవేత్తయినా Fade out అయిపోతాడు. కనుమరుగైపోతాడు. అలాంటి స్థితి రామోజీరావుకి లేదూ, పాకిస్తానుకు అంతకంటే లేదు. తాలిబాన్లు, వారి నాయకులు బిన్ లాడెన్ వంటి వాళ్ళు ఆఫ్గాన్ తోరాబోరా గుహల్లో ఉన్నారంటే, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు రఁయ్యిన ఆఫ్గాన్ మీద యుద్ధవిమానాలు దించాయి. సైనిక చర్య చేపట్టి ఆఫ్గానిస్తాన్ ని కార్పెట్ బాంబింగ్ తో దున్నిపారేసాయి. అదే తాలిబాన్లు, లాడెన్ లు పాకిస్తాన్ లో ఉన్నారని, ఎన్ని నిరూపణలు, వార్తలు, దృష్టాంతాలు కన్పించినా “పాపం, పాకిస్తాన్ కూడా తీవ్రవాద బాధిత దేశమే. కాబట్టి అందరూ దానికి ఆర్ధికసాయం చెయ్యండి” అంటూ మీటింగులు పెట్టి మరీ, డబ్బు సమకూరుస్తున్నాయి. మరి ఆఫ్గానిస్తాన్ తీవ్రవాద బాధిత దేశం కాదా? ఆఫ్గాన్ మీదకైతే రఁయ్యిన కయ్యానికి పోయిన అమెరికా, బ్రిటన్ లకి పాకిస్తాన్ అయితే అంత వ్యత్యాసం ఎందుకు? మరోప్రక్క తాము చేసిన ఆర్ధిక సాయాన్ని పాక్ దుర్వినియోగం చేసిందని ప్రకటనలిస్తూనే ఉంటారు. సాక్షాత్తూ అమెరికా రక్షణాధికారులు [పెంటగాన్ అధికారులు. గతంలో సి.ఐ.ఏ. అధికార భవనం పెంటగాన్ గా వివరించిన పొరపాటును ఇక్కడ సరిదిద్దడమైనది] దీన్ని ధృవీకరిస్తారు. స్వయంగా పాక్ అధినేతలూ దాన్ని అంగీకరిస్తారు. మళ్ళీ మామూలుగా పాకిస్తాన్ కి మిలియన్ల డాలర్లు అందజేయబడుతున్నాయి. రేపోమాపో పాక్ కి సాయం అందించే దేశాల్లో భారత్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైపెచ్చు దాన్ని ప్రపంచ మీడియా భారత ప్రభుత్వాధినేతలు మన్మోహన్ సింగ్, సోనియాగాంధీల ‘ఉదారత, ఉదాత్తత, పరిణతి’ అని పొగిడినా ఆశ్చర్యపోనక్కర లేదు.

ఇప్పటికే పాకిస్తాన్ ముష్కరులు ముంబాయి పై చేసిన ముట్టడిని ప్రక్కనపెట్టి పాకిస్తాన్ తో చర్చలకి మొన్న ఈజిప్టు పర్యటనలో ఒప్పుకుని వచ్చిన మన్మోహన్ సింగూ, అతడి రిమోట్ ని చేతిలో పెట్టుకుని ఆడిస్తున్న సోనియా గాంధీ అందుకు వెనక్కి తగ్గుతారనుకోలేము. ఈజిప్టులో పాక్ తో కలిసి సంయుక్త ప్రకటన ఇచ్చిన మన్మోహన్ సింగ్ కి కార్గిల్ యుద్దం గుర్తుకురాలేదా? అప్పుడు పాకిస్తాన్, తాలిబాన్లకి ఇచ్చిన సాయం గుర్తుకురాలేదా? పాకిస్తాన్ సువర్ణముఖిని మరోటపాలో వివరిస్తాను. ప్రస్తుత టపాలో రామోజీరావు ’సువర్ణముఖి’తాలుకూ ఒక కోణాన్ని పూర్తి చేస్తాను.

నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ పెట్టబడిన చెక్ [సవాల్] ’కన్నా?’కాలా?’ స్ట్రాటజీలో – ప్రపంచాన్నంతటినీ నడుపుతున్న నకిలీ కణిక వ్యవస్థ గానూ, కీలక వ్యక్తిగానూ బహిర్గతమై ఛస్తావా లేక ఇప్పటి వరకూ భారత ప్రభుత్వాన్ని, ప్రజల్ని నమ్మిస్తున్నట్లుగా ’చిన్న వాణ్ణి, స్థానిక పత్రిక వాణ్ణి’ అన్న ముసుగులోనే ఛస్తావా? అన్న స్ట్రాటజీ చాలా క్లిష్టమైనది. [ఇక్కడ చావు అంటే భౌతికమైన మరణం కాదనీ, గూఢచర్యపరమైన మరణమనీ అర్ధం చేసుకోవాలి. గూఢచార అస్తిత్వం, గూఢచార కార్యకలాపం బహిర్గతమవ్వడంతో పోల్చితే భౌతికమైన మరణం చాలా సుఖవంతమైనది.]

స్వవిషయంలో “కన్నా?కాలా?" అన్న స్ట్రాటజీ ఎందుకు క్లిష్టమైనది అంటే – తనది కాకపోతే కాశీ దాకా డేకమన్నాడట’ అన్నది పెద్దలు చెప్పేసామెత. అందుచేత చావు తన దాకా వస్తే, తన కన్నో, కాలో వదిలేసుకోవాల్సి వస్తే స్ట్రాటజీ ‘క్లిష్టమైనది’ అయిపోతుంది. అదే తనకు ఎంత ఆప్తులూ, ఆంతరంగికులూ అయినా తన ఏజంట్ల విషయంలో అయితే A&B లలో ఎవరో ఒకరిని వదిలేసుకోవాల్సివస్తే, బాధాకరమైనా, అనివార్యమైనది కాబట్టి ‘A’ నో లేక ‘B’ నో ఆ సమయానికి ’కాలు’ అనేసుకుని వదిలేసుకోగలిగారు.

అదే స్వయంగా తమ విషయానికి వచ్చేసరికి కన్నూ ముఖ్యమే అన్పిస్తోంది, కాలూ ముఖ్యమే అన్పిస్తోంది. కాబట్టే నకిలీ కణికవ్యవస్థనీ బహిర్గతం చేసుకోవటం [కన్ను] లేక స్థానిక పత్రికాధిపతి ముసుగులో అణగారిపోవటం [కాలు] అన్న విషయంలో, ఎదురైన ప్రతీ సంఘటనలోనూ, ప్రతీ సవాలులోనూ ఎప్పటికప్పుడు ఓసారి కన్ను తప్పించుకోవటానికి కాలుని వదిలేసుకోవటం, మరోసారి దానికి విపర్యయంగా అప్పటి సంఘటనలో కాలునే ఎంచుకుని కన్నుని వదిలేసుకోవటం చేస్తూ వచ్చింది నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, వీళ్ళ తాలుకూ నెం.10 వర్గమూ.

మరికొంత వివరంగా చెబుతాను. మొదట్లో నకిలీ కణిక వ్యవస్థగా అంటే ప్రపంచాన్నంతా నడుపుతున్న వ్యవస్థగా బహిర్గతమైనా సరే, నిభాయించుకోగలిగేంత బలం తమకి ఉందని నమ్మింది నెం.10 వర్గం.[So what అనేంత బలం తమకుందని నమ్మటం] ఓ రకంగా చెప్పాలంటే రిమోట్ తో DVD ని అపరేట్ చేయటమే గొప్పనైపుణ్యం అని చాలా ఎక్కువగా నమ్మింది. పదేపదే అదే ప్రచారించిన తమ మాయలో తామే పడిపోయినట్లన్న మాట. పదేపదే అదే అనుకొని జబ్బలు చరుచుకున్నతనం, వాపుని బలుపని నమ్మేలా చేసింది. నెం.5 వర్గం తమని వ్యతిరేకించటం, తమకే ఛాలెంజ్ విసరటాన్ని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం లెక్కచేయలేదు. అందుకే అప్పటి వరకూ అలా అలా మెల్లిగా నడుస్తున్న రామోజీ ఫిల్మ్ సిటి నిర్మాణం ఒక్కసారిగా ఊపందుకుని పూర్తయ్యింది. 1992 కు ముందర బాటసింగారం దగ్గర భూసేకరణలో కూడా ’పాపం’ రామోజీరావు కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నాడు. 1992 తర్వాత ఒక్క రామోజీఫిల్మ్ సిటి నిర్మాణమే కాదు, జాతీయంగా వివిధ భాషల్లో టీవీ ఛానెళ్ళు కూడా ఎడాపెడా పెట్టేసాడు. [అసలు ప్రైవేటు ఛానెళ్ళే భారతదేశంలోని 1991 తర్వాత ఆర్ధిక సరళీకరణంతో ప్రవేశించాయిలెండి.] ఎడాపెడా అంతర్జాతీయ సంస్థలూ, గిన్నెస్ రికార్డులూ కూడా వచ్చేసాయి. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలూ, భారీ నిర్మాతలూ, దర్శకులూ కితాబులు కూడా ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేసారు. ఇదే కాలంలో చంద్రబాబునాయుడూ అంతర్జాతీయంగా తిరిగి లాబీయింగ్ చేసి పెట్టాడు.

కానీ ప్రతీ సంఘటనలోనూ [లేదా సంఘటనాత్మక సవాలులోనూ] అపజయమే ఎదురయ్యింది. ఎప్పటికప్పుడు నకిలీ కణిక వ్యవస్థా, దాని స్ట్రాటజీనే బహిర్గతం అయ్యింది. మొదట్లో ఇది – విదేశాల్లో జరగటం లోనూ, మీడియా బండారం ప్రపంచవ్యాప్తంగా ఇంతగా బయటపడకపోవటంతోనూ బయటకు అంతగా తెలియకుండా నిభాయించుకునే ప్రయత్నం చాలా చేశారు. తొలి సంఘటనలు కాబట్టి సహజంగానే కొంత వెసులుబాటు పొందారు. క్రమంగా…. కాలం గడిచే కొద్దీ… బహిర్గతమౌతున్న సంఘటనలు, స్ట్రాటజీలు పెరిగాయి. మొదటవి అర్ధంకాకపోయినా, మెల్లిగా జనాలకూ అలాంటి సంఘటనలూ, స్ట్రాటజీలూ, ఒకటికి పదీ ఇరవై….. ఇలా సంఘటనలు పెరిగే కొద్దీ అర్ధం అవుతుంది కదా! అందునా నెం.5 వర్గం రిమోట్ అపరేట్ చెయ్యటమే గొప్ప చారకళ అనుకునేది కాదు. భారతీయ ఇతిహాసాల దగ్గర నుండి ప్రాధమిక గూఢచార తంత్రాలనీ, అన్నిదేశాలలోనూ, మేలిమిజ్ఞానం, సత్యం, నిజాయితీల మిశ్రితాన్ని కలగలుపుకున్నది. మానవత్వం పట్ల నిబద్దత ఉన్నది. కాబట్టే సహనంగా, ఏకాగ్రంగా, పట్టువిడవని కార్యనిర్వహణతో ప్రతీ సంఘటననీ నడుపుకొచ్చింది.

దాంతో, దశాబ్ధం గడిచేటప్పటికి, నకిలీ కణికవ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, నెం.10 వర్గానికీ రామోజీరావుకీ, కన్నుపోగొట్టుకోక తప్పదని పించింది. దాంతో కనీసం కాలు నిలబెట్టుకుంటే…. అంటే ప్రస్తుతానికి ’చిన్నవాణ్ణి’ అన్నముసుగులో తెరమరుగైపోతే భవిష్యత్తులో మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడన్నా మళ్ళీ తన భావితరాలన్నా ప్రాణం పోసుకోవచ్చు, మళ్ళీ చక్రం తిప్పవచ్చు.

మరో దశాబ్ధం గడవనుండే సరికీ అదీ సాధ్యం కాదనీ, తమ పాకిస్తాన్ మూలాల దగ్గర నుండి హైదరాబాద్ కు అంతర్గత సంబంధాల దాకా – అన్నీ వెలికి వస్తాయనీ అర్ధమౌతూ వస్తోంది. ఈ లోగానే, మరోవైపు నుండి, అప్పటి వరకూ తము గుప్పిలి బిగించి ‘తాము చెప్పిందే నిజమని’ నమ్మిస్తూ వచ్చిన మీడియా బండారం, అంతర్జాతీయంగా బయటపడి, తమ ప్రాణనాడి అయిన విశ్వసనీయతని పోగొట్టుకుంటోంది. తర్కరాహిత్యాన్ని, అనవసర మోజుల్నీ, విపరీత పోకడలనీ, ప్రజలకి నూరిపోసిన సినిమా రంగం, డివీడి పైరసీల టెక్నాలజీతో కుప్పకూలటంతో – మనుగడ కోసం, డబ్బుకోసం, గత దశాబ్ధాలకు భిన్నంగా సినిమాలలో కొత్తదనం చూపించటం కోసం, తార్కిక కథల్నీ, వాస్తవాల్ని ప్రజలకి చూపించాల్సి వస్తోంది. దాంతో కుట్రల గురించి, మోసాల గురించి, వాస్తవాల గురించి ప్రజలకి కొంత అవగాహన కలిగించగల కథాంశాలతో సినిమాలు రావటం వ్యాపారరీత్యా అనివార్యమైంది. దాంతో, నకిలీ కణిక వ్యవస్థ పట్టు ప్రజలలో కొంత జారిపోయింది. పైరసీ వలన డబ్బుపరంగా కూడా నష్టపోయింది. ఇది ఎవరు పరిశీలించినా, పరిశీలించకపోయినా నిజం. నమ్మినా నమ్మకపోయినా సత్యం. ఇది భారీ పరిమాణంలో ఉంది గనుకా, విస్తారత ఎక్కువ గనుకా, ఆ మార్పు బాగా దృగ్గోచరం కావటానికి కొన్ని సంవత్సరాల పట్టింది, పడుతోంది. ఇంతకు ముందు చెప్పినట్లు మనిషి జీవితంలో సంవత్సర కాలం అంటే, దేశాల విషయంలో అది దశాబ్ధాలతో సమానం. కాబట్టి ఆయా మార్పులు బాగా స్పష్టపడటానికి ఆపాటి సమయం పట్టటం సహజమే. అదే విధంగా ఆర్ధికరంగం కూడా! ద్రవ్యోల్పణానికీ సరుకుల ధరలకీ సంబంధం ఉండదని పదేళ్ళక్రితం చెబితే ఎవరైనా ఒప్పుకునే దేనా? స్టాక్ మార్కెట్ మాయాజాలంల గురించి ఎవరైనా పుస్తకాలు వ్రాసినా, అవి ఆంబోతుల రంకెల్లో అణగారిన లేగదూడల అంబారావాలే కదా! కార్పోరేట్ కంపెనీల పట్టు ప్రభుత్వాల మీద ఇంతగా ఉంటుందని ఎవరో ’మేధావుల’కు తప్ప సామాన్యులకు తెలిసే విషయమేనా? అర్ధమయ్యే విషయమేనా? నమ్మగలిగే విషయమేనా?

నెం.10 Vs నెం.5 ల సవాళ్ళ, ప్రతిసవాళ్ళ వంటి సంఘటనల్లో – సినిమా రంగం, మీడియా, రాజకీయం, ఆర్ధిక రంగం, వ్యాపార రంగం, ఏదీ అతీతం కాదు. ప్రతీ సంఘటన [Event]లోనూ కన్నో, కాలో పోగొట్టుకుంటేనే, ఇంతగా… ఇన్ని విషయాలు… ఇప్పటికి… బహిర్గతమయ్యాయి.

ఎప్పుడూ నాబ్లాగులో ముందుగా ఓకథ చెప్పి, దాని అనువర్తనతో టపా ముగించటం చేస్తుండేదాన్ని. ఈసారి అనువర్తన ముందుగా చెప్పాను. కథతో ముగిస్తాను. ఈ కథ ’పిసినారి ధనయ్య’ అని మూడవతరగతి పిల్లల తెలుగుపాఠంలోనిది.

అనగా అనగా….
ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు. ఓసారి ఊరికామందు ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి. దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది. వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు. వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు. అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు. కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు. దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు. నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు.

పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.

నకిలీ కణిక వ్యవస్థా, రామోజీరావూ కూడా ’తనది కాకపోతే కాశీ దాకా డేకమన్నా’ చందాన ఇతర అనుచర ఏజంట్ల విషయంలో అయితే నిస్సంకోచంగా కన్నో, కాలో వదిలేసుకున్నారు గానీ, తీరా తమదాకా వచ్చేసరికి కన్నూ, కాలూ దేన్నీ వదులుకోలేక, అచ్చంగా పిసినారి ధనయ్య లాగా అన్ని శిక్షలూ అనుభవిస్తున్నారు. ఇదీ వాళ్ళ ’సువర్ణముఖి’ లో భాగమే! ఎందుకంటే ఎవరి చేతుల్లో నుంచి తప్పించుకున్నా భగవంతుడి చేతి నుండి ఎవరూ తప్పించుకోలేరు కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నాకు తెలిసిన ఒకతను ఒకరోజు మాటల మధ్యలో “ఈ సంవత్సరం నాకు చాలా లక్షల నష్టం వచ్చింది” అన్నాడు. నేను “అదేంటీ! ఈ సంవత్సరం మీకు బాగానే లాభం వచ్చింది కదా, నష్టం అంటారేమిటి?" అన్నాను. దానికి అతనిచ్చిన వివరణ “నేను ఈ సంవత్సరం ఇంకా చాలా లక్షల రూపాయల లాభం వస్తుందనుకున్నాను. కానీ అన్ని లక్షలు రాలేదు, కొన్ని లక్షల లాభమే వచ్చింది. అంటే నష్టం వచ్చినట్లే కదా?" అన్నాడు. అతడి ఉద్దేశంలో ‘తాను ఆశించినంత లాభం రాకపోవడమే నష్టం’ అంటాడు. ఇది చాలా విడ్డూరమైన వాదన. నష్టానికి కొత్తనిర్వచనం [చెత్తనిర్వచనం] ఇచ్చాడు. అలాంటిదే…. మరొక ఉదాహరణ.

ప్రభుత్వం, ‘ప్రజలకు చమురు ఉత్పత్తుల మీద సబ్బిడి ఇస్తున్నాము’ అంటూ ఉంటుంది. ‘అందువల్ల చమురుకంపెనీలకు నష్టాలు వస్తున్నాయి’ అంటూ ఉంటుంది. నిజానికి ప్రభుత్వపోకడ చాలా విడ్డూరంగా ఉంటుంది. మనకు ఇచ్చే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాసుల మీద ప్రభుత్వం 56% నుండి 13% వరకూ పన్నులు వడ్డిస్తుంది. ఈ దోపిడి మనందరికీ తెలిసిన విషయమే. ఇది గాక మరొకటి మనం ఇప్పుడు చూద్దాం. “ప్రభుత్వం చమురు ఉత్పత్తుల మీద పెద్దఎత్తున పన్నులు వేసి, వాటిని కొనుగోలు చేయాలని చమురు కంపెనీలను పురమాయిస్తుంది. తరువాత కొన్నదానిపై కాసింత తక్కువధరకు ఉత్పత్తులను అమ్ముకోవాలని సూచనలిస్తుంది. ఈ క్రమంలో చమురు కంపెనీల నష్టాలను పూడ్చే పేరిట ప్రభుత్వం, చమురు బాండ్లను జారీ చేస్తూంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలకు జరుగుతున్న మేలు శూన్యం. దీన్ని మరింత వివరంగా చెప్పాలంటే ప్రభుత్వం 100/-రూ. అంతర్జాతీయ ధరవద్ద చమురును కొనుగోలు చేస్తూందనుకుందాం. దానిపై పన్నురూపంలో మరో 50/-రూ. ప్రభుత్వం వడ్డిస్తోంది. తరువాత మొత్తంగా ఆ 150/-రూ. పై 25/-రూ. సబ్సిడీగా ఇస్తున్నట్లు ప్రకటిస్తూంది. వాస్తవంగా అయితే 25/-రూ. సబ్బిడి ఇస్తున్నట్లు చెప్తూనే 50/-రూ. పన్ను విధిస్తుంది. ఇదీ సబ్సిడీ కథ! [మొదటి ఉదాహరణలో ఇవ్వబడిన నష్టానికి నిర్వచనం ఎంత చెత్తో, ఈ సబ్సిడీ వ్యవహారం అంత చెత్త!] ఈ 25/-రూ. నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం, చమురు బాండ్లను విడుదల చేస్తుంది. దీంట్లో వినియోగదారులు ‘ప్రభుత్వం నుండి ఎప్పుడూ సబ్సిడి అందుకుంటున్నవారి’లాగే కనిపిస్తారు.

చమురు వెలికితీత నుండి దాన్ని వినియోగదారుడికి చేర్చడం వరకూ ఎన్నో దశలున్నాయి. చమురు నిల్వలను కనుగొనడం, వాటిని వెలికితీసి రవాణా చేయడం, శుద్దిచేసి విపణికి చేర్చడం వంటి వివిధ దశల్లో ఒ.ఎన్.జి.సి., గెయిల్, రిలయన్స్ వంటివి పాలుపంచుకుంటున్నాయి. ఈ సంస్థలన్నీ 2008-09 గాను బ్రహ్మాండమైన లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఆదాయాల రూపంలో ఒ.ఎన్.జి.సి. 16,126 కోట్ల రూపాయలు, గెయిల్ 2,804 కోట్లరూపాయలు, రిలయన్స్ 15,279 కోట్ల రూపాయలను వెనకేసుకున్నాయి. ఈ సంస్థలు ఇన్నిన్నిలాభాలను మూటగట్టుకుంటుంటే – మరోవంక పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాసులపై సబ్సిడీలు ఎక్కువైపోతున్నాయంటూ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తూంది. తామే పన్ను వడ్డించి మళ్ళీ తామే ధర పెరిగినందున సబ్సిడీ ఇస్తున్నామంటూ, అంటే ప్రజలని ఉద్దరిస్తున్నామంటూంది. వేసే పన్నులో ఇచ్చే సబ్సిడీ కొంచెమే.
చమురు పరిశ్రమల అభివృద్ధి బోర్డుకోసమని 1976 నుండి 2006 వరకూ భారతప్రభుత్వం 64,000/-రూ. కోట్లను సమీకరించి – అందులో కేవలం 902 కోట్ల రూ.మాత్రమే ఖర్చుపెట్టింది. మిగిలిన సొమ్మంతా భారత సంచిత నిధికి జతపడి పాలన ఖర్చుల రూపంలో [అంటే జీతభత్యాల మొదలయిన అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు] ఆవిరవుతోంది. మరోవంక, మినహాయింపులను వర్తింపజేయడంలోనూ ప్రభుత్వం కొన్ని కంపెనీల పట్ల ప్రత్యేకప్రేమను కనుబరుస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినందుకుగానూ, ఆయా కంపెనీలకు ముడిచమురు దిగుమతుల్లో ఆమేరకు కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐదు సంవత్సరాల క్రితం భారతప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి రిలయన్స్ కు మాత్రమే అత్యధిక మినహాయింపు అందుతోంది గానీ , మిగిలిన వాటికి ప్రభుత్వం మొండిచేయి చూపుతుంది. ప్రభుత్వం దీనిపై ఇస్తున్న వివరణలు సంతృప్తికరంగాలేవు. చమురు ఉత్పత్తుల ద్వారా అమ్మకం పన్నురూపంలో రాష్ట్రాలు అపారలాభాలను సంపాదిస్తున్నాయి.

సి.పి.ఐ.పార్టీ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి ఆరోపణ ప్రకారం – ‘ఆదాయం పన్ను చట్టంలో 35 A.D. అనే కొత్త సెక్షన్ ఏర్పాటు ద్వారా కేంద్రం రిలయన్స్ గ్యాసుకు సుమారు 20 వేలకోట్లరూపాయల మేర ఆదాయపన్ను రాయితీ కల్పించింది’. అంతేగాక ‘కేజీ బేసిన్ లో గ్యాసు, క్రూడ్ ఆయిల్, వెలికి తీసినందుకు రిలయన్స్ కు మాత్రమే కేంద్రం రాయితీ కల్పించిందనీ, దీనివల్ల ఆ సంస్థకు మరో 20 వేలకోట్లరూపాయల మేర లబ్ది చేకూరుతుంద’న్నారు. రిలయన్స్ కు వచ్చే 40 వేలకోట్ల రూపాయల లబ్ధితో పోల్చుకుంటే, కేంద్రప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పధకం కోసం కేటాయించిన సొమ్ముకూడా తక్కువే.

ఇంతకీ, "ప్రజల కోసం ప్రభుత్వమా? లేక ప్రభుత్వం మరియు వ్యాపారసంస్థల కోసం ప్రజలా?"
[నిజమేలెండి! చీమల పుట్టలో శ్రామిక చీమలు ఉండేది రాణి చీమ, దాని అనుచరగణమైన కొన్ని మగచీమల సేవల కోసమే.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

గత టపాలోని ఎన్టీఆర్ సువర్ణముఖి పరిశీలిస్తే మనకి కొన్ని విషయాలు సుస్పష్టంగా అర్ధమౌతాయి. సువర్ణముఖిలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే – ఏ వ్యక్తి లేదా ఏజంట్ అయినా, వ్యవస్థ లేదా సంస్థ అయినా, దేశాలైనా, రంగాలైనా…. తాము చేసిన కర్మ తాము అనుభవించటం ఒక అంశం. ఆ క్రమంలోనే ఆయా వ్యక్తుల లేదా ఏజంట్ల, వ్యవస్థల, సంస్థల, రంగాల, దేశాల [ఏదయినా సరే] నిజ స్వరూపం, నిజమైన వ్యక్తిత్వం, తేటతెల్లం [Expose] కావటం రెండో అంశం.

ఇందుకు ఏ వ్యక్తీ, ఏ సంస్థా, ఏ రంగమూ, ఏ దేశమూ అతీతం కావు. రామోజీరావు నుండి అతడి సోదరీతుల్య సోనియాగాంధీ వరకూ, రాజశేఖర రెడ్డి నుండీ చంద్రబాబు, చిరంజీవిల వరకూ, అమెరికా నుండి పాకిస్తాన్, ఐరాస ల వరకూ…… ఎవరూ, ఏదీ అతీతం కాదు.

ఈ ’సువర్ణముఖి’ కాన్పెప్ట్ అర్ధంచేసుకోవడానికి, సత్యాసత్యాలని పరిశీలించటానికీ మరో ఉదాహరణ చూద్దాం. అది –

మీడియా సువర్ణముఖి:

ప్రాచీన కాలంలో ప్రజలు మునులని “ఇతడు స్వార్ధరహితుడు, ప్రజాహితుడు. మనం వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళగలిగిన వాడు. మనం చూడలేని సంఘటనలు చూడగలిగిన వాడు. మీదుమిక్కిలి ప్రజాహితం కోరేవాడు. ఇతడు ఏది చెప్పినా మనం నమ్మితీరాలి” అని గౌరవించేవారు. మునులు ఏది చెప్పినా నిస్సంశయంగా నమ్మేవారు.

ఆధునిక కాలంలో ప్రజలు మీడియాకి అంతటి స్థానం ఇచ్చారు. ఏదేశంలో అయినా, ఏ కాలంలో అయినా మీడియా, ప్రారంభదినాలలో స్వార్ధరహితులు, ప్రజాహితుల చేతే ప్రారంభింపబడి, నడిపింపబడింది. క్రమేణా నకిలీకణిక వ్యవస్థ, మీడియా మహత్తు, శక్తిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోనేందుకు, ఆయా మీడియా సంస్థల నుండి స్వార్ధరహితులని తప్పించి తమ ఏజంట్లని ప్రతిష్ఠించింది. నిరాటంకంగా ప్రపంచాన్ని శాసించింది. తమకు అనుకూలమైన దేశాలకూ, సంస్థలకూ, నేతలకూ, వ్యక్తులకూ తిరుగులేని ఇమేజిని ఇవ్వడం, తము గురిపెట్టిన దేశాలకు, మతాలకు, సంస్థలకు, వ్యక్తులకు ’డామేజ్’ కలిగించడం, తమకు అనుకూలంకాని ప్రభుత్వాలని ప్రజాభిప్రాయం పేరిట శాసించటం – ఎంతో నేర్పుగా, పటిష్ఠంగా అమలుజరిపింది. ప్రజాభిప్రాయం ముసుగులో, తము ఏది కోరుకుంటే అది జరిగేలా పరిస్థితులనీ, ప్రభుత్వాలనీ కూడా నకిలీ కణిక వ్యవస్థ నిర్దేశించింది.

కావాలంటే ఓ తాజా ఉదాహరణ పరిశీలించవచ్చు. ఈనాడు 1992 లో సారావ్యతిరేక ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా నడిపించింది. ప్రజా ఉద్యమాన్ని నడుం కట్టి, పేజీలకు పేజీలు కేటాయించి మరీ ఉధృతంగా నడిపింది. సారా నిషేధం వచ్చేవరకూ నడిపింది. అది మీడియా చెయ్యవలసిన పని. శ్లాఘనీయమైన పని. అయితే ఇప్పుడూ లిక్కర్ తో జనజీవితం కకావికలం అవుతుంది. మరి ఇప్పుడు, ఎందుకు, ఏ ఉద్యమాలు చేయటం లేదు? పేజీలకు పేజీలు కేటాయించటం లేదు? అలాగే…. సారా రక్కసి మాత్రమే ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నదీ, కుటుంబాలకు కుటుంబాలను కూల్చివేస్తున్నదీనా? ధరల పిశాచపు కోరల్లో, ప్రజల జీవితాలు, కుటుంబాలకు కుటుంబాలు దీనావస్థలో లేవా? మరి ఇప్పుడు పేజీలకు పేజీలు కేటాయించి బియ్యం, కందిపప్పుల వంటి నిత్యావసరాల ధరల నియంత్రణలకు ఉద్యమం చేపట్టదేం? ఏదో నామామాత్రంగా ఓ వార్త, ఓ ఉపసంపాదకీయం, ఓ కార్టూన్, ఓ ప్రధాన సంపాదకీయం! ఇంతేనా? ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేటట్లూ, ప్రజలంతా తమ ప్రతిఘటనని చూపించేటట్లుగా ఎందుకు motivate చెయ్యటం లేదు. మీడియా బాధ్యత ‘వార్త వ్రాయటం అదీ అలా అలా వ్రాయటం’ – ఇంతవరకేనా? మరి ఏ పేపరూ, ఏ టీవీ ఛానెలూ ఏ ఉద్యమాన్ని స్ఫూర్తింపచెయ్యటం లేదేం? ప్రతిపక్షాలూ చేయవు. మీడియా కూడా చేయదు. ఎందుకంటే తమ వాటా తమకు వస్తోంది గనుక. అసలుకే ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకుని, EVM ల మాయాజాలంతో మట్టిగొట్టుకుని, కరువు పట్టి ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షనేతలు ఓ ధర్నా చేసి గమ్మున ఉండిపోతున్నారు. సామాన్యుడి పరిస్థితి మాత్రం పప్పూ, ఉప్పూ ఏదీ కొనలేని స్థితే. మార్కెట్లో సరుకు లేక ఖరీదు పెరగటం లేదు. ఖరీదు పెడితే ఎంత సరుకు కావాలంటే అంత [కందిపప్పుతో సహా] అందుబాటులోనే ఉంది. ధరకీ, వస్తు లభ్యతకీ సంబంధం లేకపోవటం ఇప్పుడే చూస్తున్నాం. ద్రవ్యోల్బణం రేటుకీ, ధరలకి సంబంధం లేకపోవటం వంటిదే ఇది కూడా! మరి ఇప్పటి వరకూ నడిచిన ఆర్ధిక శాస్త్ర సిద్ధాంతాలూ, ఆర్ధికవేత్తలూ ఏమంటారో?

సరుకులు దొరకక, ‘బ్లాక్ మార్కెట్’ కూడా కాదిది. పబ్లిగ్గా, ప్రభుత్వం సాక్షిగా, ప్రభుత్వమే చేస్తున్న, వైట్ మార్కెట్టే, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు! మరి ఎందుకు మీడియా నోరు విప్పటం లేదు? ఈనాడుతో సహా! ఎందుకంటే…. డబ్బు తమకీ అవసరం గనుక! రిలయన్స్ ఫ్రెష్ ల లాంటి కార్పోరేట్ సంస్థలు, చిల్లరకొట్టు వ్యాపారాలలోనికి వచ్చినప్పుడే చెప్పారు, ధరలకి అదుపు ఉండదని. కావాలంటే అవి వచ్చిన మొదట్లో, చిల్లర వ్యాపారులు, రాజకీయ నాయకుల ప్రకటనలు పరిశీలించి చూడండి.

ఇలాంటి ఈ మీడియా, ముఖ్యంగా ’ఈనాడు’ - పత్రికా నైతికవిలువల గురించి ఎన్ని కథలు చెప్పింది? ఎన్ని సంపాదకీయాలు వ్రాసింది? అందునా, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది, రామోజీరావుకి పరమ శతృవు లాగా వ్యవహరించి కోర్టుల చుట్టూ తిప్పించిన రాజశేఖర్ రెడ్డి కదా? మరెందుకు గమ్మున ఊరుకుంటున్నాడు రామోజీరావు? ’ముద్దబంతి పెళ్ళికూతురు’ సానియా మీర్జా కోసం, నిరంతరాయంగా, రోజులపాటు పేజీలు కేటాయించగలిగిన రామోజీరావుకు, కందిపప్పు, బియ్యం,[35/- రూపాయల రేటుకు అలవాటుపడిపోయాం], ఇతర నిత్యావసరధరల మంట గురించి, పేజీలు కేటాయించటం అసాధ్యమా? కష్టమా?

పైపెచ్చు, ఈ పత్రికావిలువల నేతిబీరతనం ఎంతంటే – ఓ పత్రిక వ్రాసిన దాన్ని విమర్శిస్తూనో, లేక వానికి విరుద్ధంగానో మరో పత్రిక వ్రాయకూడదట. ఈవిషయం ఈనాడు Vs సాక్షి పత్రిక మధ్యజరిగిన యుద్ధంలో బయటపడిన విషయం. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు, పత్రికల మధ్య ఎంత చక్కని ఒడంబడిక? దాన్ని బయటపెడుతూ సాక్షి పత్రిక, ఈనాడు మీద యుద్దం ప్రకటిస్తూ, అదే చేత్తో అంటే అదే కలంతో, దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం [1992 లోది] ప్రజల మీద ప్రేమతో కాదు, ప్రత్యర్ధి పేపరుని తొక్కేయడానికి స్ఫూర్తింపచేశాడు రామోజీరావు, అని కూడా ప్రచురించి మరీ, నిరూపించింది. అంటే ‘ఈ విషయం బయటకు రావడానికి దాదాపు 16 సంవత్సరాల పైనే పట్టింది.’

ఆ విధంగా, మీడియా, తమతో తాము కొట్టుకుని, తమ అసలు రంగు బయట పెట్టుకుంది. తానేమిటో తనే Expose చేసుకుంది. ఈరోజు ప్రజలందరికీ, ఓ విషయం స్పష్టపడింది – ఏ పత్రికా నిజం వ్రాయదని, ఏ టీవీ ఛానెలూ నిజం చూపించదనీ, అన్నీ తమకి కావలసినట్లు ప్రచారిస్తాయనీ! ఏ మీడియా సంస్థకైనా, ఊపిరి ‘విశ్వసనీయత.’ ఆ విశ్వసనీయతనే పోగొట్టుకుంటే, ఇక అది జీవశ్చవంతో సమానమే! క్రమంగా కృశించి, ఆర్ధికంగా కూడా నశించిపోతుంది. ఆ బాటలో ఈనాడు కూడా, ప్రస్తుతానికి, ’పైకి కనబడుతూ’ ఉంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా, శనివారం అందించే ప్రతిభ సంచికని, శుక్రవారంకి మార్చింది. మెల్లిగా మూసేసుకుంది. ఈ జాబితాలో మరికొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. కాకపోతే వీటి ఆర్ధిక కృంగుబాటు ’పైకి కబడుతూ’ కాదు. వాస్తవంలో కూడానన్నమాట. ఆ విధంగా మీడియా తన ‘సువర్ణముఖి’ని తాను అనుభవిస్తోంది. అంతర్జాతీయ మీడియా నుండి ప్రాంతీయ మీడియా వరకూ అబద్ధాలు ప్రచారిస్తాయని దానంతట అదే నిరూపించుకుంది. అంతర్జాతీయ మీడియా, కార్పోరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ వాటిని నిలబెడటానికి ప్రయత్నిస్తూ ప్రజలకి Expose అయ్యాయి. ఆ విధంగా వాటి విశ్వసనీయత పోగొట్టుకున్నాయి. జాతీయ మీడియా, రాజకీయనాయకుల మధ్య గొడవులతో, ఒకరిమీద ఒకరు ఆరోపణలతో, జాతీయ మీడియా విశ్వసనీయతనీ పోగొట్టుకున్నాయి. ఇలాంటి రకరకాల కారణాలతో ప్రజల పక్షం, ఈ మీడియా వహించవన్న సంగతి ప్రజలందరికి అర్ధమయ్యింది. ఆ విధంగా మీడియా విశ్వసనీయతని పోగొట్టుకున్నాయి. అందుచేత ఈ టపాకి ‘మీడియా సువర్ణముఖి’ అని శీర్షిక వ్రాసాను.

అయితే ఇందులో ఓ విశేషాంశం ఉంది. మీడియా నవాబు రామోజీరావు ’సువర్ణముఖి’ తాలూకూ ఓ కోణం కూడా ఇక్కడ ప్రాధాన్యత కలిగి ఉంది. రామోజీరావుని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిజంగానే అన్నిరకాలుగా ముప్పతిప్పలు పెట్టాడా? ‘రాజ – రామోజీల యుద్ధం నిజమా, నాటకమా’ అన్న నా గతటపాలో దీని పూర్వాపరాలు వివరించాను. వాళ్ళయుద్ధం నిజం కాదు నాటకం అనటానికి కావలసిన దృష్టాంతాలని చూపించాను. అయితే ఆ నాటకానికి కారణాలేమిటో ఆ టపాలో వ్రాయలేదు. రాజ, రామోజీల యుద్ధ నాటకానికి కారణం రామోజీరావు సువర్ణముఖి తాలూకూ ఓ కోణమే! అదిప్పుడు వివరిస్తాను.

ఒకప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావు, భారతదేశంపట్ల నిబద్దత గల కేంద్రప్రభుత్వాలని, శాస్త్రీజీ దగ్గరనుండి పీవీజీ దాకా [మధ్యలో తనకి అనుకూలమైన ప్రధాన మంత్రులు – మొరాజ్జీ దేశాయ్, వీపీసింగ్ ఇత్యాదులు సీట్ ఎక్కినా, ఎక్కువ రోజులు నిభాయించుకోలేక పోయారు లెండి] ప్రధాన మంత్రుల్నీ, తమ గూఢచర్య తంత్రాలతో ముప్పతిప్పలు పెట్టారు. దేశప్రగతి సంగతి దేముడెరుగు, నిరంతరం దేశ భద్రత, రక్షణలతో పాటు, వ్యక్తిగత, ఆత్మరక్షణ [భౌతికంగానే కాదు, వ్యక్తిత్వపరంగా కూడా] లో ఉండేవిధంగా, నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావుల పట్టు ఉండేది. నాటి భారత ప్రభుత్వానికి, నిఘా సంస్థలకీ, తమ శతృవర్గాల పట్ల ఓ అంచనా మాత్రమే ఉండేది. [ఇందిరాగాంధీ విదేశీ ’కుట్ర’, భారతదేశంపై జరుగుతుందని ప్రకటించినప్పుడూ, దాని మీద ’ఈనాడు’ కుళ్ళు జోకులు వేసినప్పుడూ, ఇప్పటి బ్లాగర్లలలో చాలా మంది పుట్టి ఉండరు] ఐ.ఎస్.ఐ. బదులు సి.ఐ.ఏ.నీ, పాక్ బదులు అమెరికానీ, రామోజీరావుకు బదులు రామ్ నాధ్ గోయంకా వంటి వారినీ, చూపటం వల్ల ఎప్పుడూ ’నిజం’ నుండి హైజాక్ చెయ్యబడేవాళ్ళు. కాబట్టి శతృవు ఉన్నాడన్నది తెలుసు. ఎవరో తెలీదు. ఎక్కడుంటాడో తెలీదు. ఇక ఏం చేస్తున్నాడో తెలిసే అవకాశమే లేదు. కుట్రదారులే తెలియనప్పుడు కుట్రస్వరూపం ఎలా తెలుస్తుంది? చీకట్లో తడుముకున్నట్లు, ఆనాటి, వారి ‘యుద్ధం’ ఉండేది.

ఆ పరిస్థితుల్లో కూడా నాటి భారత ప్రభుత్వాలూ, నిఘాసంస్థలూ అలుపెరగని పోరాటం చేశాయి.

అయితే, ఇప్పుడు, నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావుల పరిస్థితి తిరగబడింది. 1992 లో పీవీజీ, మరియు నెం.5 వర్గం ఇచ్చిన హెచ్చరికతో, నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ తమ అంతుచూసేందుకు తమ వైరివర్గం నెం.5 ఉందని ఖచ్చితంగా తెలుసు. అంచనా ఎంతమాత్రం కాదు. అంతేకాదు, తాము నాటి భారత ప్రభుత్వాల మీదా, భారతీయ నిఘాసంస్థల మీదా చేసినట్లు, నమ్మించి మోసం చెయ్యటం, దొంగచాటుగా సమాచారం సేకరించటం, తెరచాటున వ్యవహారాలు నడపటం వంటిది కూడా కాదు, ఇప్పటి యుద్దరీతి! పీవీజీ, నెం.5 వర్గం ఇచ్చిన సవాలుతోనే యుద్దరీతి చెప్పబడింది. ’కన్నా? కాలా?’ అన్న స్ట్రాటజీ ప్రకారం, తమ వ్యవస్థనీ, నెట్ వర్కునీ, తమచేతే కూల్పిస్తామన్న సవాలు అది! అది – ‘చెప్పి మరీ తన్నటం’, ‘ప్రకటించి యుద్ధం చెయ్యటం’ వంటిది.

అయితే నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ చేసిన కర్మ అనుభవించటం ఒకటుంది. అదేమిటంటే – నెం.5 వర్గం ఉందని తెలుసు. అది తమ అంతు చూస్తుందనీ తెలుసు. తమనీ, తమ ఏజంట్లనీ కూడా ఆత్మహత్యా సదృశ్య Assignments తో [గూఢచార పరంగా కుక్కచావు] చంపుతోందనీ తెలుసు. అయితే ఈ నెం.5 వర్గం ఎక్కడి నుండి పనిచేస్తుందో, ఎవరి నేతృత్వంలో పనిచేస్తుందో, ఎవరెవరు అందులో ఉన్నారో తెలియదు. సరిగ్గా 1992 కు ముందర తామెవ్వరో, తము ఎక్కడి నుండి పనిచేస్తున్నారో, ఎవరెవరు తమ వారో, నాటి భారతప్రభుత్వాలకీ, భారత నిఘాసంస్థలకీ తెలియనట్లుగానే! ఇదీ రామోజీరావు ’సువర్ణముఖి’లోని ఓ కోణం.

ఈ నేపధ్యంలో – చంద్రబాబుతో ప్రపంచవ్యాప్తంగా లాబీయింగ్ చేయించుకున్న రామోజీరావు, తిరిగి తిరిగి మళ్ళీ యధాస్థానంకు వచ్చి భారతదేశంలోనే వెదుక్కునే ప్రయత్నం చేసాడు. నెం.5 ని, వై.యస్. రాజశేఖర్ రెడ్డి తనకు శతృవనీ, తనని ముప్పతిప్పలు పెడుతున్నాడనీ, పెట్టగలుగుతున్నాడనీ, నమ్మించేందుకు యమా నాటకం వేసాడు రామోజీరావు! ఇందులో మరికొందరు చిన్నాచితక నటులు, రాజమండ్రి ఎం.పీ. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ళు ఉన్నారు. [ఇతడు 2006 లో ’వారంరోజుల్లో రామోజీరావు దేశద్రోహి’ అని నిరూపించబడుతుంది అంటూ రామోజీరావుకి సవాలు విసిరాడు. అప్పటి నుండీ ఇప్పటివరకూ, పాపం, ఈ ఎం.పీ. దృష్టిలో వారంపూర్తి కాలేదు. మధ్యలో అంబేద్కరు విగ్రహాన్నీ, దళితుల్నీ అవమానించాడంటూ గొడవల్లో చిక్కుకున్నాడు. అంబేద్కరు విగ్రహానికి క్షీరాభిషేకాలూ, పాదాభివందనాలు చేసి ’బ్రతుకుజీవుడా’ అనుకున్నాడు. దాని వెనుక రామోజీరావు పధకం ఉన్నట్లుగా పరోక్షంగా ఆయాసపడ్డాడు.] ఇక వై.యస్.రాజశేఖర్ రెడ్డి అయితే, రామోజీరావు ఇచ్చిన స్కీప్టు ప్రకారం నాటకాన్ని చాలా రక్తికట్టించాడు. మంత్రిరోశయ్య కూడా తన డైలాగులతో తన పాత్రకి తాను న్యాయం చేసాడు. ఏమాత్రం నెం.5 వర్గం నమ్మినా, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ఉపయోగించి మరికొన్ని కూపీలు లాగి తమనుతాము రక్షించుకోవచ్చన్నది… నకిలీ కణికవ్యవస్థ, రామోజీరావూ పన్నిక పధకం. అది బెడిసి కొట్టిందేమో మరి, ప్రస్తుతం ఇద్దరూ గమ్మున ఉన్నారు. ’అతడు మాజోలికి వస్తే మేము ఊరుకోము’ అన్న డైలాగ్ తో వై.యస్.రాజశేఖర్ రెడ్డి, రామోజీరావు మీద యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చాడు. అలాగే పాపం, పనిలో పనిగా, ఎన్నికలకు ముందు రామోజీరావు పత్రికకి, ప్రభుత్వసొమ్ము భారీగా వెచ్చించి మల్టీపుల్ పేజీలు ప్రకటనలు కూడా ఇచ్చాడు.

‘రామోజీరావు కూడా, తాను ముసలి వాడవ్వటం చేతా, జవసత్వాలు కొంతతగ్గి, కొంత పరిస్థితులకు తలొగ్గాడట [?]. కొడుకులు అప్రయోజకులవ్వటం చేతా, మీడియా రంగంలో పోటీపెరగటం వల్లా, వై.యస్.రాజశేఖర్ రెడ్డి విషయంలో వెనక్కి తగ్గుతున్నాడట’ – ఈ వాదన ఈమధ్య వినబడింది. ఇందిరాగాంధీకి, అందునా ఆవిడ హవా బాగా నడుస్తున్నా రోజుల్లో కూడా వెనక్కి తగ్గని రామోజీరావు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని చూసి గజగజలాడి పోతున్నాడన్న మాట. పోనీ అలాగే అనుకుందామన్నా, శతృశేషం లేకుండా ఉతికి పారేయాలన్న ఫార్ములాతో చంద్రబాబునీ, ఇతరప్రత్యర్ధుల్నీ నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఈ కడప ఫ్యాక్షనిస్టూ, చితికిపోయిన పార్టీలని, తెదేపా, ప్రరాపాలని మరింత చిదిమేయడానికి ’ఆకర్ష, ఆకర్ష’ అంటూ ఆపరేషన్లు చేపడుతున్నాడని, స్వయంగా ’ఈనాడే’ ఘోషపెడుతున్న ఈ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, ’పోనీలే పాపం! కొంత విరామం తీసుకుని, ఎదుటివాడు బలం పుంజుకున్నాక, మళ్ళీ యుద్ధం చేద్దాం’ అనుకుని ’అతడు మళ్ళీ మా జోలికి వస్తే మేమూ ఊరుకోము!’ అంటూ రామోజీరావుకి యుద్ధవిరామం ఇస్తాడా? తనకు నడుస్తున్నప్పుడే ఎదుటివాణ్ణి మరింత తొక్కేస్తే, భవిష్యత్తు భద్రం అనుకునే కాదా ఇతర ప్రత్యుర్ధుల్నీ, ప్రత్యర్ధి పార్టీలని చిత్తుచేస్తున్నాడు? మరి ‘ఈనాడు రామోజీరావు’కి మాత్రం, ఎందుకు మినహాయింపు ఇచ్చినట్లు? ఇదంతా నాటకమని ఇక్కడే స్పష్టం కావటం లేదా?

అందునా ఈ నాటకీయవైరం ఎంతదూరం పోయిందంటే, రామోజీరావుతో గొడవపడ్డ అతడి చిన్న కుమారుడు ’సుమన్’ తన ప్రత్యేక ఇంటర్యూని సాక్షికి మాత్రమే ఇచ్చేటంతగా! అయినా ఫలితం దక్కలేదు కాబోలు, మళ్ళీ రామోజీరావు, గమ్మున కొడుకుని వెనక్కి తెచ్చుకున్నాడు. ఆ విధంగా తన స్వంత స్ర్కిప్టు, తన స్వంత Assignments తోనే, తన కుటుంబాన్ని తానే రోడ్డున పడేసుకున్నాడు. ఒకప్పుడు గురిచూసుకుని మరీ, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలలో ’తరాల అంతరం’ పై కారణంగా చూపెడుతూ, వాళ్ళ కుటుంబపు పరువునీ రోడ్డున పడేసిన ‘కర్మ’ని, ఇప్పుడు, సుమన్ మరియు ప్రభాకర్ ల అంకంగా, అనుభవించాడు. ఇది రామోజీరావు ’సువర్ణముఖి’ తాలూకూ శత సహస్ర కోణాల్లో మరొకటన్నమాట.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1992 లో మారిన గూఢచార నేపధ్యంలో, పీవీజీ, నెం.5 ఇచ్చిన అల్టిమేటంతో నకిలీ కణికుడికి ‘ఎన్టీఆర్ ని తెరమీద ఉంచి తెరవెనుక చిన్నలుడి మంత్రాంగం’ చాలని స్థితి ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ ని అడ్డుతొలిగించుకోవటం అప్పటికి అవసరం అయ్యింది. ఇక స్ట్రాటజీ రచింపబడింది, అమలు జరపబడింది. అదే లక్ష్మీపార్వతిగా రూపం దిద్దుకుంది.

నిజానికి లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలో 1992 నాటికి కొత్త పాత్రకాదు. 1985 లో ఈవిడ, ఈవిడ భర్త వీరగంధం సుబ్బారావుతో సహా, జీవిత చరిత్ర వ్రాస్తామంటూ ఎన్టీఆర్ వెంటపడ్డారు. 1987 లో అనుమతి సంపాదించారు. ఆ రీత్యా అతడి జీవిత సంఘటనలు, విశేషాలు, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు, ఇతర భావాలు తెలుసుకునే క్రమంలో అతడితో సమావేశం కాగల, సంభాషించగల వ్యక్తి లక్ష్మీపార్వతి. 1992 వరకూ కూడా, ఆమె పాత్ర రచయిత్రి పాత్రే! అయితే 1992, జూన్ తర్వాత నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావు కీ ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడి అవసరం ఎక్కువగా ఉంది. అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ కేంద్రంలోని పీవీజీ కి, రామోజీరావు తాలూకూ గూఢచర్యం తెలిసిపోయాక, అతడికి విశ్వాసపాత్రుడు, అతడి చేతిలో బొమ్మ అయిన నేదురుమల్లి పాత్ర కూడా బాగా అర్ధమైపోయాయి గనుక నేదురుమల్లి కూడా డ్రాప్ చెయ్యవలసిన కార్దువంటివాడే! ఆ ఆటలోనే హఠాత్తుగా ఇంజనీరింగ్ కాలేజీలలో కాపిటేషన్ ఫీజుల రచ్చ మొదలైంది. సెప్టెంబరు, 1992 లో మొదలైన గల్లంతు అక్టోబరు 09, 1992 న నేదురుమల్లి నుండి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలని కోట్ల విజయభాస్కర రెడ్డి స్వీకరించటంతో చల్లారింది. 1992, మార్చిలో, తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో అద్భుతమైన ఇమేజ్ తో వెలిగిపోయిన నేదురుమల్లి ప్రాభవం, ‘ఇది పీవీజీకి, నేదురుమల్లికీ సమ్మతమైన జాబితా’ అంటూ ఆఫీసు బేరర్ల నియామకాల దగ్గర నుండీ C.W.C. సభ్యుల జాబితా వరకూ ప్రస్తావించబడిన నేదురుమల్లి వైభవం, 1992, జూన్ తర్వాత మూడు నెలలకే ముగిసిపోవటం, ముఖ్యమంత్రి పదవి ఊడిపోవటం వెనుక, పైకి కనబడిన కారణం ఇంజనీరింగ్ కాలేజీలలో కాపిటేషన్ ఫీజుల వివాదం. లోపలి కారణం ’కన్నా? కలా?’ అన్న స్ట్రాటజీనే. నిజానికి నేదురుమల్లి [ఇతడికీ రామోజీరావుకీ ఉన్న అనుబంధం గురించి భారత దేశ రాజకీయ రంగంపై నకిలీకణికుడి సుదీర్ఘకుట్ర అన్న టపాలలో సవివరంగా చెప్పాను] 1989 లో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రైలు పెట్టెల్ని ప్రయాణికులతో సహా తగలేసిన సంఘటనలూ, ఇతర హింసాత్మక సంఘటనల కారణంగా చెలరేగిన అలజడిరీత్యా, మర్రి చెన్నారెడ్డి స్థానే నేదురుమల్లి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుండి రమారమి 20 నెలలు పాటు ఎదురులేని నేదురమల్లి, అసమ్మతి తననేమీ చెయ్యలేని స్థితిలో ఉన్న నేదురమల్లి, ఆ విధంగా పదవీచ్యుతుడయ్యాడు. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపిఏ, 2004 లో అధికారంలోకి వస్తుందన గానీ నేదురుమల్లి భార్యా, అతడూ హడావుడీ పడిపోయిందీ, తమకిక మళ్ళీ ’సీన్’ రావడం ఖాయం అనుకొని అలకలు పోయిందీ – రామోజీ రావు, సోనియాగాంధీల మీదా ఉన్న నమ్మకంతోనే! అంతేకాదు వారి గూఢచర్య సంబంధ బాంధవ్యాలు గురించి తెలిసి ఉన్నందునే, ఆ నమ్మకం వాళ్ళకి! అయితే తమకి ’సీన్’ రాదు అన్న విషయం వాళ్ళకి ఇంకడానికి దాదాపు 1 ½ దశాబ్ధం పైనే పట్టింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే జీర్ణమౌతోంది.

అదే నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ అయితే… పరిస్థితి వేరు. దశాబ్ధాల ముందే పరిస్థితుల్ని అంచనా వేసుకుని, తదనుగుణంగా స్ట్రాటజీ నడుపుకోవడానికి ముందుగా పునాదులు వేసుకోవడం గూఢచర్యంలో తప్పని సరి. ఆ కారణంగానే 1992 తర్వాత రాష్ట్రంలో జరగవలసి ఉన్న అసెంబ్లీ ఎన్నికలలో[1995] ఈసారి కాంగ్రెస్ ని అధికారంలోకి రానివ్వకూడదన్నది నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావు పధకం. అందుకోసమే కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అతడు రాష్ట్ర అధికారాన్ని ‘పళ్ళెం’లో పెట్టి ప్రతిపక్షానికి అందిస్తాడనీ, గతంలో అలాగే జరిగిందనీ ఓ ’సెంట్ మెంట్’ ని మీడియా ప్రచారంలోకి తెచ్చింది. తర్వాత అదే జరిగింది కూడా! అయితే, అందుకు ఈనాడు పత్రిక, నెల్లూరు జిల్లా దూబగుంట్ల గ్రామాన్ని అందులో నుండే సారా ఉద్యమాన్ని వెల్లువెత్తించింది. అపురూపమైన ప్రజా ఉద్యమంగా, మహిళా శక్తిగా ’ఈనాడు’ తన సంపాదకీయాలతో హోరెత్తించింది. నిజంగానే పల్లెల్లో కుటుంబాలకు కుటుంబాలు ’సారా’కి ఆహుతైపోతున్నాయి గనుకా, పత్రికల మాయ అప్పుడింతగా ప్రజలకి తెలియనందునా, ఆనాటి సారా వ్యతిరేక ఉద్యమంకి బాగా స్పందన వచ్చింది. ‘ఈనాడు’ పూర్తిగాపేజీలు కేటాయించి మరీ, దానికి బాగా ఊపునిచ్చింది. ’అదంతా తన ప్రత్యర్ధి పేపరుని దెబ్బకొట్టడానికీ, వ్యాపార పోటీదారు ఆర్ధిక మూలాలని నలిపివేయడానికి ‘ఈనాడు’ ఆనాడు ఆ స్ట్రాటజీ చేపట్టిందని దృష్టాంతపూరితంగా మరీ, ఇప్పుడు తేలిపోయింది. అయితే ఈనాడు, రామోజీరావుల స్ట్రాటజీకి అదొక్కటే కారణం కాదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ని, రెండేళ్ళ తర్వాత జరిగే ఎన్నికలలో ప్రక్కకు తోసి, తెదేపా ని పైకి లేపాలంటే కూడా ఓ ’మంచి బలమైన కారణం’ కావాలి. దానికి తగిన ఊపు ఉండాలి. అందుకోసం కూడా దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. అది ప్రజాఉద్యమమే అయితే, అందుకు ఈనాడు మీడియాకూ నిబద్దతే ఉంటే, ఇప్పుడు సారా ఏరులై ప్రవహిస్తూ ఉండేది కాదు కదా!

ఆవిధంగా తమ రాజకీయపు ఆటలో, గూఢచర్యపు తంత్రాల్లో భాగంగా లేవనెత్తబడిన సారా ఉద్యమాన్ని ఎన్టీఆర్ అందిపుచ్చుకున్నాడు. తను అధికారంలోకి వస్తే తొలి సంతకం సారా నిషేధం మీదే చేస్తానన్నాడు. ఎన్టీఆర్ కున్న ఇమేజ్ కి ఇది మరింత నప్పింది. ఎంత ఇమేజ్ ఉన్నా 1989 ఎన్నికల్లో ’వొట్టి విస్తరి మంచినీళ్ళు’ వంటి ఉపన్యాసత్మక రాజకీయాలు చెల్లక పోవటం చేత, ఓడిపోయిన ఎన్టీఆర్ కి, సారా ఉద్యమపు ఊపుని ఊతగా ఇచ్చి గద్దెనెక్కించి, ఆ తర్వాత అతణ్ణి తప్పించి అతడి అల్లుడు నారా చంద్రబాబు నాయుడిని సీట్ ఎక్కించుకుంటే తనకి కావలసిన చాలా పనులు చేయించుకోవచ్చు. – ఇదీ నకిలీ కణికుడు వ్యవస్థ, రామోజీరావుల పధకం! అందుకు ముందస్తు ప్రాతిపదికగా 1992 ద్వితీయార్ధంలో, ఎన్టీఆర్, ఇంటిలో నిరాదరణకి గురయ్యాడు. అదీ అనారోగ్యంతో బాధపడుతుండగా! సేద తీర్చేవారు, అత్మీయంగా సేవ చేసే వారు కరువయ్యారు. ఆ స్థితిలో లక్ష్మీపార్వతి అతడికి సేవలు చేసింది. ఒంటరితనంలో వ్యధ పంచుకునేతోడు అయ్యింది. కుటుంబ సభ్యులందరికీ రామారావు పట్ల అంత deviation రావటం అన్నది – గూఢచర్యం కుటుంబ సంబంధాలలోకి రావటంతో తేలికగానే సాధ్యపడుతుంది.

తదుపరి పర్యవసానాల్లో ఏప్రిల్ 15, 1993 న లక్ష్మీపార్వతి భర్త వీరగంధం సుబ్బారావు నుండి విడాకులు తీసుకుంది. ఆమెని తాను వివాహం చేసుకోబోతున్నట్లు ఎన్టీఆర్ సెప్టెంబరు 10 న బహిరంగ సభలో ప్రకటించాడు. సెప్టెంబరు 11 న సాంప్రదాయబద్దంగా తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యుల స్పందనలు, అప్పడందరికీ – సంచలనాత్మక, ఆసక్తికర కథనాలు అయ్యాయి. ఎవరేమన్నా, ఎవరెలా స్పందించినా 71 ఏళ్ళ వయస్సులో, ఎన్టీఆర్ రెండోసారి ఒకింటి వాడయ్యాడు. అతడి ద్వితీయ సతీమణి లక్ష్మీపార్వతిది కూడా అదే స్థితనుకొండి.

ఇక్కడో తమషా ఏమిటంటే 71 ఏళ్ళ వయస్సులో ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్నాడు. అదీ అప్పటికి చాలా ఏళ్ళక్రితమే భార్యా వియోగుడైనందున, ఒంటరితనం రీత్యా వివాహమాడాడట. ఒంటరి వృద్ధుడు మానసికంగా తోడు కోసమే వివాహం చేసుకున్నట్లయితే – సంతానం కోసమో, దాంపత్య సుఖం కోసమో ’స్టెరాయిడ్స్’ ఎందుకు వాడినట్లు? స్టెరాయిడ్స్ వాడారనీ, అందుచేతే ఎన్టీఆర్ త్వరగా మరణానికి చేరువయ్యాడనీ, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, తర్వాత రోజుల్లో చాలాసార్లే ఆరోపించాడు. దానాదీనా తేలేదేమిటంటే – 25 ఏళ్ళ వయస్సులో ఎన్టీఆర్, దేశస్వాతంత్రం కోసం పిల్లాపాపా మొదలు ముసలీ ముతకా వరకూ, స్త్రీపురుష బేధం లేకుండా అహింసా పోరు సాగించిన రోజుల్లోనూ, ‘తన స్వార్ధం తనది’ అన్నట్లు తనకెరీర్ కోసమే పాటుపడ్డాడు తప్ప, అంతటి స్ఫూర్తి పూరిత వాతావరణంలోనూ దేశం గురించి ఏదీ చెయ్యలేదు. అలాంటివాడు, తన సినిమా కేరీర్ ముగిసిన తరువాత, తన 58 ఏళ్ళ వయస్సులో, హఠాత్తుగా…. ‘దేశభక్తి, రాష్ట్రభక్తి’తో ఊగిపోయాడు.

అలాగే 71 ఏళ్ళ వయస్సులో, వృద్ధాప్యంలో ఒంటరితనం ఓర్వలేకో, ఎందరో హీరోయిన్లు తనకళ్ళ ఎదుటే యవ్వనంతో మెరిసి ఆపైన ముసలితనంతో తెరమరుగైపోయినా తానుమాత్రం నిత్వయవ్వనుడిలా హీరోగా కొనసాగానన్న స్వాతిశయంతో, యుగపురుషుడు, ఎదురులేని మనిషి గట్రా ఉపమానాలతో పొగడబడినందున కలిగిన అతిశయంతో, 71 ఏళ్ళ వయస్సులో సైతం యవ్వనం అనుభూతించో గాని, మొత్తానికి పెళ్ళికొడుకయ్యాడు. ఈ కోణంలో ’సువర్ణముఖి’ సుస్పష్టంగానే ఉంది.

సరిగ్గా 71 ఏళ్ళ వయస్సులోనే పీవీజీ 1991లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టేముందు, “నాకిప్పుడు 71 ఏళ్ళు. భగవంతుడు ఇప్పుడీ అవకాశం నాకెందుకు ఇచ్చాడో తెలియదు. నాకు చేతనైనంతగా దేశానికి, ప్రజలకి మంచి చెయ్యడానికి ప్రయత్నిస్తాను” అన్నారు. నిజానికి అప్పటికే ఆయన రాజకీయాల నుండి వైదొలగి విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు కూడా. అదీ ఎన్టీఆర్ అనబడే ఈ యుగపురుషుడికీ, నిజమైన ప్రజాసేవకుడికీ ఉన్న వ్యత్యాసం!

సరే! ఏమైతేనేం 1993 సెప్టెంబర్ 11 న ఏన్టీఆర్, లక్ష్మీపార్వతిల వివాహమయ్యింది. సారా ఉద్యమపు ఊపుతో 1994 చివరిలో జరిగిన ఎన్నికల్లో తెదేపా గెలిచింది. 1995 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. తొలిసంతకం సారానిషేధపు ఫైలు మీదే చేసాడు. అక్కడి నుండి 8 నెలలు నిండే సరికీ ఎన్టీఆర్ ప్రభుత్వానికి నూరేళ్ళు నిండిపోయాయి. ఈసారి నాదెండ్ల భాస్కరరావు స్థానంలో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడే ఉన్నాడు. ఎం.ఎల్.ఏ.లలో అధికభాగం, చిన్నల్లుడు వెంట పోయి సామ్రాట్ హోటల్ లో మకాం వేసారు. పార్టీలో లక్ష్మీపార్వతి పెత్తనం పెరిగిపోయిందన్నది పైకారణం అయ్యింది. నా చెప్పులని నిలబెట్టినా ఎన్నికల్లో గెలుస్తాయన్న ఎన్టీఆర్ అతిశయం ఏమయ్యిందో, "నా తెలుగు తమ్ముళ్ళు! బయటికి రండి” అంటూ ఎన్టీఆర్, మైకు చేత్తో పట్టుకుని సామ్రాట్ హోటల్ చుట్టూ చైతన్యరధం మీద తిరగటాన్ని ప్రజలు ప్రత్యక్షంగానూ, టీవీ లోనూ వీక్షించారు. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడూ, ఇలాగే ఎం.ఎల్.ఏ.లందర్నీ క్యాంపుల్లో ఉంచినప్పుడూ, ఎన్టీఆర్ ఆ క్యాంపు చుట్టూ తిరగలేదు. ‘తెలుగుతమ్ముళ్ళారా’ అంటూ మైకుపెట్టుకు ఆరవలేదు. సుడిగాలిలా రాష్ట్రంలో తిరిగాడు. ప్రజల మధ్యకు వచ్చాడు. అలా ప్రజల మధ్యకు రావటాన్ని మీడియా బాగా కవర్ చేసింది. అలా కవర్ చేసింది కాబట్టే ఎన్టీఆర్ అప్పుడు ప్రజల్లోకి వచ్చాడు. మీడియా కథలు కథలు వ్రాసింది. అభిమానుల అత్మాహుతుల్ని పెద్దక్షరాల్లో వ్రాసింది. గవర్నర్ రామ్ లాల్ కాదు రావణ్ లాల్ అంది. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందన్నది. అయితే 1995 లో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్ళలేదు. వెళ్తే మీడియా సపోర్ట్ ఇవ్వదన్నది అర్ధమయ్యింది గనుకే ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎం.ఎల్.ఏ.లైన తెలుగు తమ్ముళ్ళన్నా తనమాట వినకపోతారా అని మైకు పట్టుకుని సామ్రాట్ హోటల్ చుట్టూ తిరిగాడు.

నాటి నాదెండ్ల డ్రామాలో తన పాత్ర తాను అద్భుతంగా పోషించి, తెలిసి కొంత, తెలియకుండా మరికొంత, ‘కుట్రలో తన వాటా తాను’ నిర్వహించినందుకు ప్రతిబహుమతిగా ’సువర్ణముఖి’ ప్రసాదించిన ఘట్టమే సామ్రాట్ హోటల్. దానికి దర్శకుడు రామోజీరావే. అందులో – రామోజీరావుకి, అప్పటికి ‘ఎన్టీఆర్ సువర్ణముఖి’ అర్ధం కాలేదు. అసలు ’సువర్ణముఖి’ అన్న concept కూడా రామోజీరావుకి తెలీదు, అర్ధం కాలేదు. అప్పటికి మామ[ఎన్టీఆర్]ని fade out చేసి, అల్లుణ్ణి [చంద్రబాబునాయుడిని] fade in చేసుకోవలసిన ‘తన అవసరమే’ తప్ప ఎన్టీఆర్ ’అతడు చేసిన ఖర్మని అతను అనుభవించే విధంగా’ స్ట్రాటజీ తామే రచిస్తున్నామనుకోలేదు. అల్లుడికి తామిచ్చిన Assignment, ఎన్టీఆర్ కి ’సువర్ణముఖి’ అవ్వడాన్ని అప్పటికి రామోజీరావు చూడలేకపోయాడు. అందునా అవి 1992 తర్వాతి తొలి సంవత్సరాలు కదా!

ఈ వ్యవహారంలో ఎన్టీఆర్ ఎంత ఆక్రోశానికీ, ఆవేశానికీ గురయ్యాడంటే – మొన్న 2009 ఎన్నికల ముందు ఎన్టీఆర్ పెద్దల్లుడు, బాలకృష్ణకి వ్రాసిన లేఖ [పత్రికల్లో ప్రచురితమైంది] లో చెప్పబడినట్లుగా, ఆనాడు ఎన్టీఆర్ బాలకృష్ణకి “నువ్వే గనుక నాకొడుకువి అయితే చంద్రబాబుని చంపి, ఆ కత్తిని నాకు చూపించు” అనేటంత! అతడు 74 ఏళ్ళ వయస్సులోనూ తన ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షపదవిని, అల్లుడు ఊడబీకాడన్న కోపం, కసి, ఆక్రోశం ఎంతటి వంటే, ఆ దుఃఖంతో కొడుకుని ‘నువ్వేగనుక నాకొడుకువి అయితే నీ అక్కభర్తని చంపిరా’ అనేటంత! తాను కోరుతుంది తన కూతురి వైధవ్యాన్నే! అదీ అతడి అరిషడ్వర్గాల స్థాయి. అందునా అంత వృద్ధాప్యంలో! అదీ అతడి వ్యక్తిత్వం! [ఇక్కడ చిన్నమాట. రామాయణంలో రాముడు ఒక సందర్భంలో లక్ష్మణుడితో అంటాడు “లక్ష్మణా! ఆవేశంలో కూడా అనరాని మాటలు అంటున్నావు” అని. అంటే ఆవేశంలో కూడా కొన్ని మాటలు అనకోడదని కదా! అలాంటిది రాముడి పాత్రలు పోషించి, కనీసం ఆ పాత్ర ప్రభావం ఏపాటి ఎన్టీఆర్ మీద ఉన్నట్లు? ఎన్టీఆర్ నటుడు మాత్రమే! అతడు దేవతా పాత్రల వేషధారి మాత్రమే! యుగపురుషుడో, దైవాంశసంభూతుడో కాదు!]

ఈవ్యధతో 1996, జనవరిలో ఎన్టీఆర్ మరణించాడు. స్టెరాయిడ్స్ వాడినందునే మరణించాడో, మానసిక వ్యధతో మరణించాడో గానీ, జీవితపు చరమదశలో అపజయాన్నీ, కీర్తిచంద్రుడిలో మచ్చలనీ మూటకట్టుకుని మరణించాడు. ‘లక్ష్మీపార్వతి’ అన్న అంకమే అతడి జీవితంలో లేకపోతే ఎన్టీఆర్ కధే వేరు. ఎన్టీఆర్ అనగానే అతడి నటనా వైదుష్యం, రూప విలాసం, కీర్తికిరిటం, రాజకీయ వైభవం మాత్రమే గుర్తుకొచ్చేవి. ఇప్పుడో! ఎన్టీఆర్ ని ఎవరు ఎంతగా పొగిడినా సామాన్యుడి దృష్టిలో, చరిత్రపేజీల్లో మాత్రం అతడి జీవితకథలో అపజయం, వ్యధాపూరిత మరణం కూడా గుర్తుంటాయి.

ఈ యుగపురుషుడి రెండోభార్య ఇతడి మరణానంతరం ఇతడి జీవిత చరిత్రని ’ఎదురులేని మనిషి’ పేరుతో విడుదల చేసిందట. జీవితపు చివరి రోజుల్లో గానీ ఎన్టీఆర్ కి రామోజీరావు బలమేమిటో అర్ధం కాలేదు. అప్పటి వరకూ అతడి దృష్టిలో రామోజీరావు పత్రికాధిపతి మాత్రమే. తనకి మీడియా సపోర్టు ఇచ్చిందని మాత్రమే తెలుసు. మీడియా అధిపతిగా రామోజీరావు బలమైన వాడు అనుకున్నాడు. అంతవరకే అతడి గూఢచర్య పరిజ్ఞానం. అంతకంటే ‘ఎక్కువ’ ఎన్టీఆర్ అర్ధం చేసుకోలేక పోయాడు. అదే చంద్రబాబు నాయుడికైతే అంతకంటే ఎక్కువ తెలుసు. ఎక్కువ అర్ధం చేసుకోగలిగాడు. గూఢచర్యంలో అవగాహన, అర్ధంచేసుకోగలిగే జ్ఞానం ఎన్టీఆర్ కి లేదు. అది చంద్రబాబు నాయుడిలో ఉంది. ఎంత అర్ధం చేసుకోగలడో, అంతగా దేశద్రోహానికి తలపడగలడు. స్వంత మామకే కాదు, ఎవరికయినా వెన్నుపోటు పొడవగలిగే అవకాశవాది. తనకోసం, తన అధికారం కోసం ఎవ్వరితోనయినా చేతులు కలపగలిగినవాడు, అధికారం వస్తుందంటే దేశానికి ద్రోహం చెయ్యటానికి వెనుకాడతాడా? ఎన్టీఆర్ కి అల్లుడయ్యేటప్పటికీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉండవచ్చుగాక! కానీ కాంగ్రెసులో ముఖ్యమంత్రి స్థానానికి ఎదగటం అంత తేలిగ్గా జరగదు. తోటివాడు, సమవయస్కుడు వై.యస్.రాజశేఖర్ రెడ్డికి అతడి 55 ఏళ్ళ వయస్సులో, అదీ మారిన రాజకీయ, గూఢచార నేపధ్యంలో వచ్చింది ముఖ్యమంత్రిపదవి.[పంచె కట్టుకుని, పాదయాత్రలు చేయగానే ముఖ్యమంత్రిపదవులు వస్తాయా? వస్తాయంటే ఈపాటికి అందరూ అదేబాటలో ప్రయాణించేవారు. ఒక కథతో ఒక సినిమా హిట్ అయితే అదే మూసలో చాలా సినిమాలు వచ్చినట్లే!] లేకపోతే ఆ సీట్ జీవితకాలంలో అతడు ఎక్కగలిగేది కాదు. ఎక్కినా మూనాళ్ళ ముచ్చటే! అదే కేసు చంద్రబాబునాయుడిది కూడా! ఫీల్డులో పడి కొట్టుకులాడగా కొట్టుకులాడగా ఎప్పటికో ఎగబాకగలిగి ఉండేవాడు. అదే ఎన్టీఆర్ కి అల్లుడవ్వటం కారణంగానే తెదేపా ప్రభుత్వంలో నెం.2 గా చలామణి అయ్యాడు. వెన్నుపోట్లు పొడవటం చంద్రబాబునాయుడికి ఉన్న ఎగ్ స్ట్రా క్యాలిఫీకేషన్. ఆ కారణంగానే రామోజీరావుకి, అప్పటికి, చంద్రబాబు నాయుడు ’కన్ను’ లాగానూ, ఎన్టీఆర్ ‘కాలు’ గానూ అయ్యారు. ఎన్టీఆర్, దెబ్బకి మటాష్ అయిపోయాడు. చరమదశలో కథ కొంత, ఎన్టీఆర్ కి అర్ధం అయ్యింది. అందుకే రామోజీరావు గురించి, “అతడెవ్వరో కూడా నాకు తెలియదు. రాజకీయాల్లోకి వచ్చేముందు అతడితో నాకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మా పార్టీకి అతడి పత్రిక ఎంతో ప్రచారాన్నిచ్చింది. అతడెందుకు, నా మీద, ఆమె [లక్ష్మీపార్వతి] మీద అంత పగబట్టేడో నాకు తెలీదు. మమ్మల్ని టార్గెట్ చేసుకున్నాడు” అంటూ వాపోయాడు. ఈ వ్యధనంత అతడు పుస్తక రూపంలో ప్రచురించాడని కూడా ఇటీవల వార్తల్లో ప్రచారంలోకి వచ్చింది.

ఆ విధంగా ఎన్టీఆర్ బొమ్మని చూపెట్టి, సారా వ్యతిరేక ఉద్యమాన్ని మాధ్యమంగా తీసుకుని, తెదేపాని అధికారంలోకి తెచ్చుకున్నాక….. ఎనిమిది నెలలు తిరక్కుండా ఎన్టీఆర్ ని ఇంటికి పంపించేసి, అల్లుణ్ని సీటు ఎక్కించుకున్నాడు రామోజీరావు. ఆ తర్వాత ఇక చూస్కో! నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే నెపంతో విదేశాలు పట్టుకు తిరిగాడు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుపెట్టబడ్డాడు. [ఆ పేరు పెట్టింది ఎటూ మీడియానే లెండి. మీడియా అంటే ఎవరు? ఈనాడూ, రామోజీరావు గాక?] చంద్రబాబుకు ఇమేజ్ పెంచేందుకు ’ఒకే ఒక్కడు’ వంటి సినిమాలు, సాహిత్యం సృష్టింపబడింది. ఈనాడు వంటి పత్రికల్లో ప్రభుత్వ పనితీరు గణాంక వివరాలతో, నిష్పత్తి ఆధారాలతో ‘అభివృద్ధి’ వ్రాయబడింది. ఇంకుడు గుంతల లెక్కలతో సచివాలయం అలిసిపోయింది. ముఖ్యమంత్రి పేషి అవినీతిని సెంట్రలైజ్ చేసింది. చంద్రబాబు నాయుడి హడావుడికి అంతే ఉండేది కాదు. పెట్టుబడుల ఆకర్షణ నెపంతో ప్రపంచపు అంచులదాకా, భూగోళమంతా పరుగులు పెట్టాడు. ఎటూ ముఖ్యమైన మంత్రులూ అనుచరుల బృందం కూడా వెంట ఉండేది . రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కంటే, రామోజీరావు, నకిలీ కణికుల కోసం చేసిపెట్టిన లాబీయింగ్ కోసమే ఈ శ్రమంతా చంద్రబాబు పడ్డాడు. ఈ విషయంలో చంద్రబాబు పాత్రనీ, అతడి సువర్ణముఖినీ తర్వాత పరిశీలిద్దాం. ఇప్పటికి ఎన్టీఆర్ ఎపిసోడ్ పూర్తి చేద్దాం.

ఎన్టీఆర్ సువర్ణముఖి ఇప్పటికి మీకు బాగా అర్ధమయ్యిందను కుంటాను. నిజానికి ‘చేసిన కర్మమూ చెడని పదార్ధం’ అంటారు పెద్దలు. మంచైనా, చెడైనా అది మనల్ని , మన తర్వాతి తరాలని సైతం వదలదు. ఈ భయమే ఒకప్పుడు భారతీయుల్ని చెడు చెయ్యకుండా నియంత్రించేది. అది ఏ చట్టమూ, ఎప్పటికీ చెయ్యలేని పని. కేవలం మత విశ్వాసాలూ, జీవన సరళి, దృక్పధం మాత్రమే చెయ్యగలిగిన పని. దాన్ని చెరపటమే లక్ష్యంగా నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. అయితే 1992 తర్వాత ఇది తిరగబడింది. ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా ఇది సత్యం. మొదట్లో అంతగా ప్రస్పుటంగా కనపడకపోయినా ఇప్పుడు బాగానే ఆవిష్కృతమౌతున్న దృశ్యం! ఎన్టీఆర్ నే ఉదాహరణగా తీసుకొండి. అతడి కర్మ అతడు అనుభవించాడు. అతడి సంతానం కూడా అనుభవిస్తోంది.

అప్పట్లో, అంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లోనే, ఎన్టీఆర్ ‘స్టడ్స్ హెల్మెట్ల కంపెనీ’ వంటి వాటికి వ్యాపారపు సావకాశాలు ఇస్తూ, వారి దోపిడికి తన బ్రహ్మముహుర్తపు అయిడియాలతో ఊతనిస్తున్న రోజుల్లోనే, ఎన్టీఆర్ ఒక్కో కొడుక్కీ 200 కోట్లరూపాయల ఆస్థి కూడబెట్టి ఇవ్వాలనుకుంటున్నాడని, అందుకే ఓవైపు రెండు రూపాయలకి కిలో బియ్యం అంటూ, మరోవైపు ఇలాంటి పనులు [హెల్మెట్స్ స్టంట్స్ వంటివి] చేస్తున్నాడనీ అనుకునేవారు. అలాగే ఆస్థులన్నీ సంతానానికిచ్చి “నాదగ్గరేముంది బూడిద? నేను సన్యాసిని” అనేవాడు అతడు కూడా! 1982-83 లో బాలకృష్ణకి ’పోటీదారు సుమా’ అన్నట్లుగా నటుడు సుమన్ రైజింగ్ స్ఠితిలో ఉన్నాడు. టి.కృష్ణ దర్శకత్వంలో నేటి భారతం సినిమా అతడికి బాగా పేరుతెచ్చిపెట్టింది. రెండర్ధాల డైలాగుల సినిమాలతో బాలకృష్ణ అప్పటికి హిట్ హీరోగా మలచబడ్డాడు. దాంతో సుమన్ బ్లూబాయ్ గా, ఆడపిల్లల బూతుబొమ్మల తీసాడనో, వ్యభిచారం చేయించాడనో కేసుపెట్టబడి సంవత్సరం జైలులో ఉంచబడ్డాడు. నేటి భారతంలో ’మానవత్వం పరిమళించే మంచిమనిషికి స్వాగతం’ అంటూ సుమన్ పాత్రని పొగుడుతూ ఇతర పాత్రలు పాడే పాట ఒకటి ఉంటుంది. అతడి అరెస్టు తర్వాత ఈనాడులో కార్టూన్ వేస్తూ ’మానవత్వం మంటగలిపిన ’మహా’మనిషికి స్వాగతం’ అంటూ జైలు అధికారులు సుమన్ ని స్వాగతిస్తున్నట్లుగా ప్రచురించారు. సరే! అతడి విషయంలో ’సత్యాసత్యాలు భగవానుడికి కెరుక! సుమన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చిన వ్యక్తి. “జైలులో యోగా సాధన చేసాను. మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా యోగా నేర్చుకున్నాను. అదే నన్నప్పుడు నిరాశతో పిచ్చివాడవ్వకుండా కాపాడింది” అంటూ అతడు చెప్పడం తర్వాత రోజుల్లో చదివాను.

ఆ కర్మఫలమో కాదో గానీ, బాలకృష్ణ మాత్రం కెరీర్ లో అడ్డుతొలిగించుకునేందుకు, పోటీ దారుల్ని తప్పించటం సత్యం. అతడే కాదు, అతడి తండ్రి ఎన్టీఆర్ కీ హర్ నాధ్ అనే పాత తరం నటుడు పోటీదారు అవుతాడమోనని హరనాధ్ పైన ఒత్తిడి కలగజేసి, తాగుడుకు బానిస అయ్యేలా చేసారని ఓ వినికిడి ఉండేది. సినిమా రంగంలో ప్రత్యుర్ధుల వెనుక ఈ విధమైన గోతులూ, కుట్రలూ మామూలే!

ఆ విధమైన కర్మల తాలూకూ ’సువర్ణముఖి’ - బాలకృష్ణ, బెల్లకొండ సురేష్ మీద జరిపిన కాల్పుల ఉదంతం. జైలుకు వెళ్ళకుండా ఉండేందుకు బాలకృష్ణ, తండ్రి నుండి తనకు సంక్రమించిన ఆస్థిలోనూ, తానూ జీవితకాలం సంపాదించుకున్న ఆస్థిలోనూ ఖర్చుపెట్టుకుంటూ ఉన్నాడు. జైలుకి వెళ్తేనే శిక్షింపబడినట్లా? ఏవి తమకు ధైర్యమో, ఏవి తమకు ఆశా దీపాలో, అటువంటి ఆస్థులు కరిగిపోవడం అంటే జైలుకి పోవటం కంటే పెద్ద శిక్ష వంటివే. జైలు చాలా చిన్న శిక్ష! ఆస్థులు కరిగిపోవటం అంటే ప్రాణాలు మెల్లిగా పోవటం వంటిదే. అలాంటి శిక్ష ఒక్క బాలకృష్ణకే కాదు. చాలామందికీ పడింది. బాలకృష్ణ, హరికృష్ణలు మాత్రమే కాదు ఎన్టీఆర్ మనుమలూ, మనుమరాండ్ర్లూ కూడా వారసత్వంగా ఆస్థినే గాక కర్మఫలాన్ని కూడా పొందారు, పొందుతున్నారు. ఒళ్ళు కాల్చుకుని ఆత్మహత్మచేసుకున్న ఎన్టీఆర్ మనుమరాలు ’కుముదిని’ వంటి సంఘటనలు అటువంటి వాటిలో కొన్ని మాత్రమే.

ఎన్టీఅర్ కుటుంబం 1993 వరకూ రోడ్డున పడ్డది కాదు. లక్ష్మీపార్వతితో వివాహం తర్వాత కుటుంబ కలహాలూ రచ్చకెక్కాయి. ఇప్పుడైతే అతడి కుమారుల అక్రమ సంబంధాలూ, హత్యోదంతాలూ, కూడా బహిరంగమే! ఇక అక్క ఇంటిముందు తమ్ముడు మీసాలు మెలేసి తొడగొట్టటాలూ ఉన్నాయి. ఆ దెబ్బకీ గదా పెద్దల్లుడు అప్పటి ఉత్తరాలని పత్రికలకి విడుదల చేసాడు?

లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ వాడినందునే మరణించాడన్నది హరికృష్ణ చేసిన ఆరోపణ. దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పిన ఉదంతం ఎన్టీఆర్ బాలకృష్ణని 1995 లో బావని చంపి రమ్మన్నాడన్నది. బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ పై కాల్పుల వ్యవహారం మరొకటి, ఆ ఇంట్లోనే మరొకరి హత్య కథ! వీటిలో దేని వెనుకా ఎవరూ కారణంగా కనబడరు. కుటుంబ సభ్యులే ఇంటిగుట్టు రచ్చచేసుకున్నారు. [ఒక్క కాల్పుల వ్యవహారం తప్ప] అదీ గూఢచర్యపు తంత్రబలం. నిందించేందుకు ఎవరూ ఉండరు. అంతా స్వయంకృతంగానే కనపడుతుంది. ‘ఎవరినైనా హత్య చేస్తే నేరం. అదే ఆవ్యక్తి తనంతట తానే ఆత్మహత్య చేసుకునేలా చేస్తే అది గూఢచర్యం.’ ఈ స్ట్రాటజీ అటువంటిదే. పీవీజీ, నెం.5 విసిరిన సవాల్ ని ఎదుర్కొనే ప్రయత్నంలో రామోజీరావు ప్రేరేపించిన ఆత్మహత్యలే ఇవన్నీ. Suicidal Assignments ……. ఈ స్ట్రాటజీలో భాగం వంటివే! ఈ విధంగా ఎన్టీఆర్ కథ ముగిసింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

మొన్నామధ్య, ప్రభుత్వం, చౌకధరల దుకాణాల్లో ఇచ్చే కందిపప్పు ధర అమాంతం 30 నుండి 45 కి పెంచేసి అందులో కేజీ నుండి అరకేజికి కోతపెట్టింది. అంతే! మార్కెట్లో కందిపప్పు ధర అమాంతం 55-60 నుండి దాదాపు 75-80 రూ. లకు ఎక్కికూర్చుంది. సబబే కదా! ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనీ పెద్దలు చెప్పే సామెత. అలాంటిది, ప్రభుత్వమే స్వయంగా ధరలు పెంచేస్తే ప్రైవేటు వ్యాపారులు ఊరుకుంటారా? ఇలాంటిదే పెట్రో ధరలు పెంపకం కూడా! బియ్యం దారీ అదే! మళ్ళీ మరోప్రక్క – ప్రభుత్వం, పత్రికలు, టీవీ గట్రా మీడియా, ఈ సంవత్సరం ‘సిరులు పండించిన వరి’ అంటూనూ, ధాన్యం ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి అయ్యిందనీ, దిగుబడి పెరిగిందనీ, గణాంక వివరాలతో సహా ప్రకటిస్తూ ఉంది. మరి ధరలెందుకు పెరుగుతున్నాయి? నియంత్రించాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేసి తానే రేషన్ షాపుల్లోని ధరలు పెంచేయటంలో మతలబు ఏమిటి?

నిశితంగా పరిశీలిస్తే ... ప్రభుత్వం రేషన్ షాపుల్లో కందిపప్పు ధర పెంచటం ద్వారా, ప్రైవేటు వ్యాపారులకి ఒక సంకేతం [signal] ఇచ్చేసిందన్న మాట. ’ఇక మీ దోపిడి మీరు కానివ్వండి. ఆనక మా వాటా మాకు ఇచ్చేయండి’ అని! ఎటూ, ప్రభుత్వం ధరలు నియంత్రించటానికి, బ్లాక్ మార్కెట్ ని నిరోధించటానికి ఉపయోగించే పాలనా యంత్రాంగాన్ని, అధికారులనే, వసూళ్ళ నిర్వహణకు ఉపయోగించుకుంటోందయ్యె! గమనించి చూడండి. ఆ మధ్య ప్రతీ ఊళ్ళో అక్రమనిల్వలపై దాడులు జరిగాయి. మా నంద్యాలలో అయితే భారీగానే అక్రమనిల్వలు బయటపడ్డాయి. తర్వాతేమయ్యిందో? విచారణ సాగుతూ.......నే ఉంది. తర్వాత ప్రభుత్వం కందిపప్పుధరలు పెంచింది. దెబ్బతో కందిపప్పుతో సహా చాలా నిత్యావసరాసరుకులు ధరలు [బెల్లం, చక్కెరలతో సహా] అమాంతం పెరిగి కూర్చున్నాయి.

మామూలుగా ప్రభుత్వం, ప్రతిసంవత్సరం మార్కెఫెడ్ సంస్థ ద్వారా పప్పు ధాన్యాలు కొని ఉంచుతుంది. మార్కెట్లో పప్పుధాన్యాలు పెరిగినప్పుడు మార్కెఫెడ్ మార్కెట్లోకి పప్పు ధాన్యాలను విడుదల చేస్తుంది. ఆ విధంగా మార్కెటులోని అధికధరలని కంట్రోలు చేస్తుంది. కాని క్రితం సంవత్సరం ఎలక్షన్స్ కు ముందు వై.యస్. ప్రభుత్వం, మార్కెఫెడ్ చేత కొనుగోలు చేయించలేదు. కారణం ప్రభుత్వాధికారులకి, వై.యస్.కి మాత్రమే తెలుసు.

ప్రభుత్వం ఎందుకని మార్కెఫెడ్ చేత పప్పు ధాన్యాలు కొనుగోలు చేయించలేదు? ప్రభుత్వం ముందే ఊహించలేకపోయిందా లేక ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం, వ్యాపారులు అందరు కుమ్మక్కయి ప్రజలని దోపిడి చేస్తున్నారా? ప్రభుత్వం ముందే ఊహించలేకపోయింది అన్న కారణమయినా, ప్రభుత్వం కన్నుగప్పి వ్యాపారులు ప్రక్క రాష్ట్రాలకు, ప్రక్కదేశాలకు దొంగచాటుగా తరలించగలుగుతున్నారంటే ప్రభుత్వం విఫలమయ్యింది అనాలి. అడ్మినిస్ట్రేషన్ ఫెయ్యీలర్ ని ఒప్పుకోవాలి? లేదా తము ప్రజలను దోచుకోవాడానికే ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యామని ఒప్పుకోవాలి? రెండోది ఎలాగూ ఒప్పుకోరు. అటువంటప్పుడు మొదటి కారణమయిన అడ్మినిస్ట్రేషన్ ఫెయ్యీర్ ని ఒప్పుకోవాలి. వ్యాపారులకి ప్రభుత్వం అంటే లెక్కలేదని ఒప్పుకోవాలి.

ఇదంతా చూస్తుంటే ఓపోలిక గుర్తొస్తుంది –

కార్పోరేట్ కాలేజీలలో, బయటికి, తల్లిదండ్రులకి తాము లెక్చరర్లకి ఏడాదికి పదుల లక్షలు చెల్లిస్తున్నామని ’బుస్’లు కొట్టినా, లోపల ఏ లెక్చరర్ అయినా తన సామర్ధ్యం మీద నమ్మకంతో ’మా టీచింగ్ అవసరం మీకుంది’ అన్నట్లు ప్రవర్తించాడనుకొండి. వెంటనే కాలేజీ యాజమాన్యం – ‘ఓస్! మహా నువ్వు చెప్పినందుకు, ర్యాంకులు వస్తున్నాయేంటి? మా దారులు మాకున్నాయి లే!’ అన్న డీల్ చూపిస్తుంది.

సరిగ్గా అలాగే ఇప్పటి ప్రభుత్వాలు జనాలని ’ఓస్! మేం మీకు చేసిన సేవలు చూసి మీరు ఓట్లేస్తే మేం గెలుస్తున్నామేంటి? EVM టాంపరింగ్ లాంటి మా దారులు మాకున్నాయమ్మా!’ అన్న డీల్ చూపిస్తోంది.

కాబట్టే నిశ్చలంగా ధరలు పెంచుకుంటూ పోతుంది. లెక్కల మాయలనే ప్రణవనాదాలుగా మారుమోగిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ మాట నిజాయితీగా ఒప్పుకోవాలి. ప్రజల సహన శక్తి గొప్పది అనాల్సిందే నిజంగా జనాల ఓర్పు, సహనాలకి జోహరులు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఎన్టీఆర్ ’సువర్ణముఖి’, ఎన్టీఆర్ కి, ఆతడి జీవిత చరమాంకంలో ‘లక్ష్మీపార్వతితో వివాహం’ అన్న బహుమతిని ఇచ్చింది. ఇది ప్రజానీకానికి బహిర్గతం అయ్యింది 1993, సెప్టెంబరులో కావచ్చు గాక! కానీ దీనికి అంకురార్పణ 1992 జూన్ తర్వాతే జరిగింది. ఈ పెళ్ళి అనే రసవత్తర అంకానికి స్ర్కిప్టు రచయితా, దర్శకుడూ, పురోహితుడూ అన్నీ రామోజీరావే! అయితే రామోజీరావుకి, ఎన్టీఆర్ కి అతడి 71 ఏళ్ళ వయస్సులో మరో పెళ్ళి చేయవలసిన అవసరం ఎందుకొచ్చింది? రామారావుకి సైతం ఆ వయస్సులో ’పెళ్ళి’ అవసరం ఎందుకొచ్చింది? రెండో ప్రశ్నకి జవాబు మొదటి ప్రశ్నకు పైకారణం[over leaf reason] వంటిది మాత్రమే.

అప్పట్లో రామారావు ఎందుకు లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకున్నాడు? అన్న సందేహంకు సమాధానంగా బయటికొచ్చిన కథనం ఇది – 1989 లో అధికారం కోల్పోయాక క్రమంగా రామారావు ఇంట్లో నిరాదరణకి గురయ్యాడట. పార్టీకి అతడే ఆధారం. అతడి కుటుంబసభ్యులకి, కూతళ్ళకీ, అల్లుళ్ళకీ, కొడుకులూ, కోడళ్ళకీ అతడే ఆస్తి దాత, సర్వదాత. మరి ఎలా, ఎందుకు నిరాదరించారో వారికే తెలియాలి. అందునా ఇప్పుడు తమ తండ్రి లేదా మామని ఇంద్రుడూ, చంద్రుడూ అంటూ తెగపొగిడేసే హరికృష్ణ, బాలకృష్ణ వంటి అతడి పుత్రులూ, పురందేశ్వరి వంటి కూతుళ్ళూ, దగ్గుబాటి, నారా చంద్రబాబునాయుడి వంటి అల్లుళ్ళకి ఆ మతలబు బాగా తెలిసి ఉండాలి. ఏదైతేనేం -1987 నుండి భర్త వీరగంధం సుబ్బారావు సహితంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర వ్రాస్తానంటూ ఎన్టీఆర్ వెంటబడి అనుమతి సాధించుకున్న లక్ష్మీపార్వతి అనబడే ఈ హరికథా కళాకారిణి, [ఈవిడ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగా కూడా పనిచేసిందట] 1992 నుండి 1993సెప్టెంబరులోపల కుటుంబ సభ్యుల నిరాదరణతో కృంగిపోయి, అనారోగ్యంతో బాధపడుతూ, నిరాశా నిస్పృహల వలయంలో చిక్కుకున్న ఎన్టీఆర్ కి, సేదతీర్చే స్నేహపు చెలిమ, సేవలందించిన ఆత్మీయ చెలియా అయ్యిందట. దెబ్బతో, లక్ష్మీపార్వతి తొలిభర్తకు విడాకులిచ్చేసింది. ఎన్టీఆర్ వీరలెవెల్లో కొడుకులూ, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళకూ హోల్ సెల్ గా తన ప్రతీకారపు దెబ్బచూపిస్తూ, ద్వితీయ వివాహం బాంబుపేల్చాడట. అందునా అతడి ఆస్థిపాస్థులన్నీ స్వార్జితాలయ్యె. ఆ తర్వాత లక్ష్మీపార్వతి వదినగా, అన్నగారి సామ్రాజ్యాన్ని ఏలేయటం, అది సహించలేక చంద్రబాబు తిరుగుబాటు లేవదీసి ఎం.ఎల్.ఏ.లని సామ్రాట్ హోటల్ లో దాచేయటం – అన్నీ తెలుగు ప్రేక్షక ప్రజలకి బాగానే గుర్తుండే అంశాలు, అంకాలు. ఈ పైకారణానికి[over leaf reason] లోపల ఉన్న గూఢచర్యపు అసలు కారణాలు ఏమిటంటే –

భారతదేశం పైనా, ప్రపంచంపైనా, అప్పటికే శతాబ్ధాలుగా పరుచుకున్న, పటిష్టమైన గూఢచార నెట్ వర్కుతో, నకిలీ కణికుడి నేతృత్వంలోని నెం.10 వర్గం, తమ ఉనికి, అస్తిత్వం తెలియకుండా, రహస్యంగా చరిస్తూ, నమ్మించి ద్రోహం చెయ్యటమే ’గొప్ప’గూఢచర్యం అన్నది. ‘మిత్రుల్లా ఉంటూ సమాచారాన్ని సేకరించి తమకి అనుకూలంగా ఉపయోగించుకోవటం, తమ లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తుల్ని, జాతుల్ని, దేశాల్ని నాశనం చేయటమే గూఢచర్యం’ అన్నది వాళ్ళ భాష్యం. అయితే పీవీజీ, గూఢచర్యానికి అసలు నిర్వచనాన్ని నకిలీకణికుడి చేత చదివింపించారు. నిక్కచ్చిగా చెప్పాలంటే నకిలీ కణికుడి వ్యవస్థ చేత బట్టీ వేయించాడు.

అప్పటి వరకూ నకిలీ కణికుడి దృష్టిలో నమ్మించి మోసం చెయ్యటం, రహస్యంగా కుట్రలు పన్నడం, మిత్రుడి ముఖం పెట్టుకుని, అదను చూసుకుని ఎదుటి వ్యక్తి పీక కొయ్యటం [కుట్రపన్నటం పీక కొయ్యటం వంటిదే] గొప్ప వీరత్వమా? అది గొప్ప సామర్ధ్యమా? చెప్పితన్నటం, ప్రకటించి యుద్ధం చెయ్యటం ‘క్షాత్రధర్మం’. అది భారతీయతత్త్వం. భారతీయులు [ఇతిహాసాల దగ్గర నుండి చారిత్రాకాల వరకూ] గూఢచర్యాన్ని ఆత్మ రక్షణకు, మాతృదేశ రక్షణకు, సమాజంలో ధర్మపరిరక్షణకు, చెడుని గుర్తించి శిక్షేంచేందుకు ఉపయోగించటమే ధర్మమనే నమ్మకం గలవారు. వెన్నుపోటు పొడవటం, యుద్ధంలో పారిపోవటం కంటే నీచమని విశ్వసిస్తారు. భారతీయుల దృక్పధం ఇప్పుడెంతగా కలుషితం అయ్యిందనుకున్నా, మూలాల్లోని భావజాలం ఇదే. వెయ్యేళ్ళ క్రితం, ఈ గడ్డమీదకి ఆఫ్ఘాన్ తురక ముష్కరులు, ఆపైన యూరపు సముద్రపు దొంగలు రాకముందు, భారతీయుల రక్తంలోని ఈ దృక్పధం, భావజాలం మరింత బలంగా ప్రస్ఫుటంగా ఉండేది.

అయితే బహుభాషా పండితుడు, ఇతిహాసాలని, సనాతన ధర్మాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవాడూ అయిన పీవీజీ, శతృవు ఎవరో తెలియకపోయినా అలుపెరగకుండా పోరాడిన యోధుడు! ఆధునిక భారతీయ స్వాతంత్ర సమరవీరులకు నిజమైన వారసుడు.

అందుచేత, పీవీజీ, ఆయన నేతృత్వంలోని భారతీయ నిఘా సంస్థలకి, ఎప్పుడైతే తామింత వరకూ వెతుకుతున్న శతృవు ఉనికి స్పష్టపడగానే, నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ గూఢచార వలయపు ఆస్తిత్వం దృగ్గోచరమై, దృష్టాంతపూరితంగా నిరూపితంకాగానే, నెం.5 వర్గాన్ని సమీకరించి, సమాయత్తం చేసుకున్నారు. అదే సమయంలో, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి, రామోజీరావుకీ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఈ మొత్తం గూఢచర్యాన్ని వ్యక్తులతో సహా, సాక్ష్యాలతో సహా నిరూపించటమే లక్ష్యం! వారిని రెడ్ హాండెడ్ గా నిలబెట్టటం పైనే గురి. అందుచేత ’దొరికిపోయావ్’ అన్న హెచ్చరిక చాలా నిక్కచ్చిగా ఇచ్చారు. “నీ వేలితో నీ కంటినే పొడిపిస్తాం. అదీ చెప్పి మరీ పోరు సాగిస్తాం. నీలాగా రహస్యంగా కుట్రలు పన్నటం కాదు. ఇక ఈ క్షణం నుండీ యుద్ధం, అదీ గూఢచర్య యుద్ధం ప్రారంభమే. ఇన్నాళ్ళూ మాకు నువ్వెవ్వరో తెలియదు. ఇక నీ స్ట్రాటజీ ఏమిటో తెలిసే అవకాశమే లేదు. అయినా ఆత్మరక్షణ చేస్కున్నాం. ఎదురు పోరాడి నిలబడ్డాం. ఇక ఇప్పుడు నీవంతు! నీలాగా రహస్యంగా మేమెవ్వరో తెలియకుండా కూడా మేం గూఢచర్యం చేయం. అందుకే ఇదిగో నీ ఉనికి మాకు తెలిసిపోయింది అని చెబుతున్నాం. ఇక కాస్కో! ఇన్నాళ్ళు, నీవు అల్లుకున్న నెట్ వర్కు , గూఢచర్య వలయాన్ని తుత్తునియలు చేస్తాం. నీ సామ్రాజ్యాన్ని నీచేతే కుప్పకూల్పిస్తాం. నీ ఏజంట్లని, నీ పావుల్ని నువ్వే చావగొట్టేలా చేస్తాం. ప్రతీ క్షణం ’కన్నా?, కాలా? దేన్ని వదులుకుంటావు?’ అనే స్థితే ఇకనీకు! మాదేశాన్ని, మంచినీ, మతాన్ని, మానవత్వాన్ని, ధర్మాన్ని ఎలా రక్షించుకుంటామో, నిన్నూ, నీ వాళ్ళని ఎలా శిక్షిస్తామో చుద్దువు గాని” అన్నదే ఆ హెచ్చరిక. [పీవీజీ పరిభాషలో ఆయుధాలతో గాక, మెదళ్ళతో యుద్ధం చెయ్యటమంటే ఇదే!]

దీనికి పైమాటగానే, ఆనాడు పీవీజీ ’చట్టం తన పని తను చేసుకుపోతుంది’ అన్నారు. దాన్నే మనం ఇప్పుడు బోలెడు సినిమాల్లో కమేడియన్లు సైతం వాడటం విని నవ్వుకుంటున్నాం. అయితే గడియారపు లోలకం మీద జైలుకీ ఇంటికీ తిరిగిన లాలూ దగ్గరనుండి [‘నామీద చెయ్యివేస్తే బీహార్ లో రక్తం ఏరులై పారుతుంది’ అని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించిన తదనంతరమే, అతడు జైలుకీ, ఇంటికీ పింగ్ పాంగ్ బాల్ లా తిరిగాడు, దాణాకేసు నిమిత్తమై! రబ్రీదేవి అయితే కంటికి మంటికీ ధారపాతంగా, బాహుటంగా ఏడ్చింది. అంత భయం ఎందుకు కలిగినట్లు?] కబ్ తక్ సమోసా మే ఆలూ, తబ్ తక్ బీహార్ మే లాలూ అనే లాలూప్రసాద్ యాదవ్ మీద, పైన చెప్పిన ‘గడియారపు లోలకం మీద కూర్చొని జైలుకీ, ఇంటికీ తిరుగుతున్నట్లు’ కార్టూన్ ప్రచురించుకున్న రామోజీరావు దాకా, అద్వానీల నుండి నకిలీ కణికుడి అంతర్జాతీయ ఏజంట్ల దాకా’ అందరికీ మాత్రం పీవీజీ ఆనాడు తెగేసి ప్రకటించిన ’చట్టం తనపని తను చేసుకుపోతుంది’ అన్న డైలాగ్ అంటే గుండెదడే! ఎందుకంటే తను బ్రతికి ఉన్నా, లేకపోయినా వ్యవస్థ[చట్టం] పనిచేస్తూంది అన్ని చెప్పటమే ఆయన ఉద్దేశం.

’కన్నా? కాలా? దేన్ని వదులుకుంటావు?’ అన్న స్ట్రాటజీ వివరించేటందుకు ఓ పోలిక చెబుతాను. మనం చదరంగం ఆడేటప్పుడు వేసే ఎత్తు పై ఎత్తుల్లో, ఒకవేళ ప్రత్యర్ధి వేసిన ఎత్తుగడ ఫలితంగా గుర్రం, శకటాల్లో దేన్నో ఒకదాన్ని వదులుకోవలసి వస్తే ఏంచేస్తాం? గుర్రాన్ని అట్టిపెట్టుకుని శకటం వదిలేసుకుంటాం. తదుపరి గుర్రం, మంత్రి – ఈ పావుల్లో దేన్నో ఒకదాన్ని వదులుకోవాలంటే ఈసారి గుర్రాన్ని వదిలేసి మంత్రివైపు మొగ్గుతాం. అలాంటిదే ఈ స్ట్రాటజీ. ఒక ఏజంట్ అవుట్ అయ్యాడంటే, మరొకడ్ని కాపాడుకునేందుకు లేదా మరో స్ట్రాటజీని కాపాడుకునేందుకు, ఈ ఏజంట్ ని అతడి ఏజన్సీ వదిలేసుకుందన్న మాట. అంటే బలిచ్చేసుకుందన్నమాట. అటువంటిది రామోజీరావుని సి.ఐ.ఏ.గానీ, మరో దేశపు ఏజన్సీ గాని వదులుకోవటం లేదంటే, అతడు ఏజన్సీలకి అతి ముఖ్యమైన ’కన్ను’ అయి ఉండాలి. ఏజన్సీలు కూడా బహిర్గతమై బలవుతున్నాయి గానీ రామోజీరావుని మాత్రం వదులుకోవటం లేదు. అంటే అసలు ఏజన్సీలే కాలు వంటివైతే రామోజీరావే కన్నులాంటి వాడు కాబోలు, నకిలీ కణిక వ్యవస్థకి! అంతేకాదు. ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. అది ఏమిటంటే – చదరంగం భారతీయుల ప్రాచీన క్రీడ. అందులో గూఢచర్యం వంటి ఎత్తు పైఎత్తులే కాదు, మేధోవికాసం, Theory of Probability పేర గణికశాస్త్రంలో బోధించే subject కంటే కూడా నిశితమైన probabilities ని practical గా నేర్పించే క్రీడ. చురుకుదనాన్ని, తార్కికతని, కార్యకారణ సంబంధ విశ్లేషణనీ విశేషంగా నేర్పే ఆట అది. అయితే, అది క్రమంగా భారతీయుల చేయి జారి, రష్యా అగ్రగామియైన స్థితి 1992 వరకూ ఉంది. 1992 తర్వాతే, మనం విశ్వనాధన్ ఆనంద్ ల గురించీ, హంపీ, హారికల గురించీ, హరికృష్ణల గురించీ వింటున్నాం.

సరిగ్గా చదరంగంలో చెప్పిన గుర్రం Vs శకటం, మంత్రి Vs గుర్రం వంటి ప్రక్రియే – ‘కన్నా?, కాలా?’ అన్న స్ట్రాటజీ! కన్నో, కాలో ఏదో ఒకటి బలిగా ఇచ్చుకుని ప్రాణాలు కాపాడుకోవలసిన స్థితి వస్తే, ఏమనిషి అయినా ఎక్కువగా కాలే వదులుకుంటాడు. [లేదా అతడికి కాలే అవసరం అన్పిస్తే కన్ను వదులుకుంటాడు.] అంటే A,B అనే ఏజంట్లలలో ‘A’ ని కన్ను అనుకుని,[అంటే ఎక్కువ ఉపయుక్తకరం అనుకుని], ‘B’ ని కాలుగా పరిగణించి [అంటే తక్కువ ఉపయోగం అని] సదరు ఏజన్సీ వదులుకున్నదనుకొండి. అప్పటికి ఆ ఏజన్సీకి ‘B’ అనే ఏజంటు నష్టం. [ఏజన్సీకి ఒక ఏజంటుని వదులుకోవటం అంటే కష్టమే. శిక్షణ ఇచ్చి, పనిలో ఢక్కా మొక్కిలు తిని Assignments నిర్వహించటంలో యదార్ధ అనుభవం పొంది ఉన్న ఏ ఏజంటుని వదులుకోవటానికీ ఏజన్సీ తొందరగా ఇష్టపడదు. ఎందుకంటే ఏజంట్లే ఆస్థులు ఏజన్సీలకి. ఏజంట్లు ఉంటేనే కదా ఏ స్ట్రాటజీ అయినా నిర్వహించగలిగేది, ఆస్థులు సమకూర్చుకోగలిగేది?] అయితే, తదుపరి కాలంలో ‘A’కి పోటిగా మరో ’C’ అనే ఏజంటుని తెస్తుంది ప్రత్యర్ధి ఏజన్సీ. అంటే మళ్ళీ ‘A’ యొక్క ఏజన్సీ ‘A’ మరియు ’C’లలో ’C’ కనుక కన్ను వంటి వాడైతే ఈ సారి ‘A’కి నూకలు చెల్లినట్లే. దెబ్బతో ‘A’ కెరియర్ మటాష్ అయిపోతుంది. అంటే A,C లలో వారి ఏజన్సీ ఈసారి ‘A’ని వదిలేసుకుని ’C’ని కాపాడుకుంటుందన్న మాట.

అయితే ఈ ఒరవడిలో, క్రమంగా, సదరు ఏజన్సీ యొక్క పావులన్నీ[ఏజంట్లందరూ] A to Z ఛస్తాయన్న మాట. ఈ క్రమంలో ఏజన్సీ బలహీనమూ అవుతుంది, బహిర్గతమూ అవుతుంది. ఎందుకంటే ప్రత్యర్ధి ఏజన్సీ [అంటే నెం.5 అనుకోవచ్చు] A మరియు B లకి ఎసరుపెట్టటం అంటే భౌతికంగా కాదు, Expose పరంగానే అవుతుంది. అలాగే A, B ల ఏజన్సీ[అంటే నెం.10 అనుకోవచ్చు] A,B ని వదులుకోవటం అంటే అదీ భౌతికంగా కాదు, కెరియర్ పరంగానే. ఇక B fade out అయిపోతాడన్న మాట. సదరు ఏజన్సీకి ఇక ఎందుకూ పనికి రాకుండాపోతాడు. అది గూఢచారికి మరణం వంటిదే!

ఈ స్ట్రాటజీలో భాగంగానే – నకిలీ కణికునికీ, రామోజీరావు కీ, మారిన గూఢచర్య రంగంలో, ఎన్టీఆర్ ‘కాలు’ లాగా, చంద్రబాబునాయుడు ‘కన్ను’ లాగా కనబడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి స్థితిగతులు వేరు. ఇప్పటి స్థితి గతులు వేరు. చంద్రబాబుతో పోలిస్తే, ఎన్టీఆర్ గూఢచర్యం విషయంలో అంతగా సమర్ధుడు కాదు. బాహాటంగా దేశ ద్రోహానికి తలపడేంత దుర్మార్గం, గుండె దిటవూ కూడా ఎన్టీఆర్ కు లేవు. సినిమా రంగంలో గాడ్ ఫాదర్ లు ఉండటం సహజ ప్రక్రియ అయిపోయింది గనుక, అది అతడికి జీర్ణమైపోయింది. రాజకీయాల్లో కుతంత్రమూ జీర్ణమయ్యాయి. ‘ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచెయ్యగల ఇమేజ్ ఉన్నది’ అన్న పైకారణం[overleaf reason] తనకి వైట్ హౌస్ నుండి ఆహ్వానం తెచ్చిపెట్టింది అనుకున్నాడు. అంతేగాని అందులోని గూఢచర్యపు లోతు, సాంద్రత అంతగా తెలిసిన వాడు కాదు. పరిస్థితి లోతుగా తెలిసి, దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్పడటం అంటే – అతడికి అంత సామర్ధ్యము లేదు. నటనావృత్తిలోనే ముసలివాడవ్వటం చేత అంత జవసత్వాలూ లేవు. నటుడిగా తనకున్న ఇమేజ్ పట్ల స్వాతిశయంతో, చాలాసార్లే, ఇతడు నకిలీ కణికుడి చేతిలో, రామోజీ రావు చేతిలో, చావుదెబ్బలు తిన్నాడు. ఓసారి ’బాలయ్యే నా వారసుడు’ అంటూనూ, ఆ వెంటనే నాలుక కరుచుకుంటూనూ, చాలాసార్లు ’సరి దిద్దబడ్డాడు’, అదీ గాక నటుడూ, కళాకారుడూ అయినందున, ఎంత బండవాడైనా, చంద్రబాబు వంటి గుండెలు తీసిన బంటుతో పోలిస్తే సున్నిత హృదయుడే. పైగా మొండివాడు. మొండివాడు తన వాదనని పదేపదే విన్పించ ప్రయత్నిస్తాడు గానీ, ఎదుటి వారి వాదనని విన్పించుకునే ప్రయత్నం చెయ్యడు.

అందుచేత 1992 లో మారిన గూఢచార నేపధ్యంలో, పీవీజీ, నెం.5 ఇచ్చిన అల్టిమేటంతో నకిలీ కణికుడికి ‘ఎన్టీఆర్ ని తెరమీద ఉంచి తెరవెనుక చిన్నలుడి మంత్రాంగం’ చాలని స్థితి ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ ని అడ్డుతొలిగించుకోవటం అప్పటికి అవసరం అయ్యింది. ఇక స్ట్రాటజీ రచింపబడింది, అమలు జరపబడింది. అదే లక్ష్మీపార్వతిగా రూపం దిద్దుకుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

’నకిలీ కణిక వ్యవస్థ గురించిన ప్రతిపాదనలు’ అనబడే నా ఈ టపాల పరంపర ప్రారంభించినపుడు, ఈ ప్రతిపాదనలకు నిదర్శనాలు[practical verification] చూపిస్తానని వ్రాసాను. శాస్త్రీయంగా కూడా, ముందుగా ప్రతిపాదించిన సిద్దాంతాలను Facts కు లేదా circumstantial కు అనువర్తించి, ఆ సిద్దాంతం సరైనదో కాదో తేల్చుకుంటారు కదా! అదే పద్దతిని ఈ విషయంలో అనుసరిస్తున్నాను. ’ఇకపోతే ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి?’ అన్న మీ సందేహాన్ని, ఈ టపాల మాలిక చివరిలో తీరుస్తాను. ఇప్పుడు… ఒకో స్ట్రాటజీ, ఒకో దేశం, ఒకో వ్యక్తి, లేదా ఏజంట్ ఏవిధంగా బహిర్గతం[expose] అయ్యారో, అందులో ఉన్న తాత్విక తంత్రమూ[Philosophical strategy] , గూఢచార తంత్రమూ కూడా, మీకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

ఇక్కడ ఎవరికైనా ఓ సందేహం కలగవచ్చు. ’అసలెందుకు ఇలా ఏజంట్లనీ, వాళ్ళ స్ట్రాటజీని బహిర్గతం చేయటం? ఎవరు ఈ కుట్రలు చేస్తున్నారో, వాళ్ళ ఉనికి తెలిసినప్పుడు వారిని చట్టపరంగా శిక్షించవచ్చు గదా?’ అనిపించవచ్చు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఏజంటు, వారి కార్యకలాపాలు, వారి స్ట్రాటజీలని expose చెయ్యకుండా శిక్షించటం అంటే, దానికీ, ఎమర్జన్సీకి తేడా ఉండదు. అప్పుడు బలం నకిలీ కణిక వ్యవస్థదే అవుతుంది. అంతేకాక ఎలా నిరూపించాలి? ఏ సాక్ష్యాధార పత్రాలు, వీడియో టేపులు చూపాలి? ఇవి ఏవి చూపినా, ‘ప్రభుత్వం తల్చుకున్నప్పుడు ఎలాంటి సాక్ష్యాలయిన సృష్టించగలదని’ ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది. సాక్ష్యాత్తు ఏజంట్ల చేతనే చెప్పించినా కూడా, ’ప్రభుత్వం వాళ్ళని బెదిరించి, ఒప్పించింది’ అంటారే గానీ, అది నిజమని నమ్మే అవకాశం చాలా చాలా తక్కువ. పరిస్థితి తనకు అనుకూలం అవ్వగానే ఏజంట్ కూడా ప్రభుత్వం తనని బెదిరించి ఒప్పించింది అంటాడు. అంతేగాక ప్రతికలు చేసే విషప్రచారాన్నే ప్రజలు నిజమని నమ్ముతారు. ఇది గతంలో నిరూపించబడిన సత్యం. 1992 లో పీవీజీ నేతృత్వం వహిస్తున్న భారతదేశపు కేంద్ర ప్రభుత్వం, నకిలీ కణిక వ్యవస్థ కంటే బలమైనది కాదు. అది మైనారిటీ ప్రభుత్వం అయినందున కాదు. మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థ శతాబ్ధాల క్రితం నుండి పనిచేస్తున్న, ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠమైన గూఢచార వలయం గనుక, నెట్ వర్కు గనుక! ఈ వ్యవస్థతో పోలిస్తే, అసలు ఏ దేశపు ప్రభుత్వం కూడా బలమైనది కాదు. పైకి పనికిమాలినదిగా చెప్పబడే ఐరాస కూడా, ఆయా దేశపు ప్రభుత్వాల కంటే బలమైనదే. అటువంటప్పుడు నకిలీ కణిక వ్యవస్థని శిక్షించగల, తుత్తునియలు చేయగల శక్తి ఎవరికుంటుంది? అది ఓ దేశపు ప్రధాని అయినా సరే! అంతేగాక ఈ దేశం ఒక్క ప్రధానమంత్రి దేనా? ఆ ప్రధాని పీవీజీ అయినా సరే, ఇందిరాగాంధీ అయినా సరే, లాల్ బహుదూర్ శాస్త్రి అయినా సరే! ఈ దేశం ఒక్క ప్రధాన మంత్రి దేనా? లేదా ఐ.బి., ’రా’ వంటి నిఘాసంస్థలదేనా? ‘దేశమంటే మట్టికాదనీ, దేశమంటే మనుషులనీ’ గుఱజాడ చెప్పనే చెప్పాడు కదా! మరి ప్రజలకి ఈ దేశం పట్ల ఏ బాధ్యతా లేదా? ఉంది! నిక్కచ్చిగా ఉంది. అయితే ప్రజలకి జరుగుతున్న కుట్రతెలిస్తే కదా, తమ బాధ్యత ఏమిటో, తమకు మూడుతున్న ప్రమాదం ఏమిటో, దాని నుండి తమకు రక్షణ ఏమిటో తెలియడానికి? 17 ఏళ్ళ క్రితం అంటే 1992 లో సోనియాగాంధీ గురించి, ఆమె చేస్తున్న గూఢచర్య కార్యకలాపాల గురించి, చెబితే ఎవరైనా నమ్మగలరా? గడపదాటని ఇల్లాలి గురించి, ఆమె సి.ఐ.ఏ. ఏజంటని చెబితే, ఎవరైనా నమ్మగలరా? అదే ఇప్పుడైతే...? రాజకీయాల పేరిట ఆమె చేస్తున్న గూఢచర్య కార్యకలాపాలు, ఆ నెపాన చేస్తున్న మత మార్పిడి మద్దతలు.... గుడ్డి భక్తులకి కూడా, రెప్పలు తెరచి మరీ చూపిస్తున్నట్లుగా, ఆమె చేతలూ, మాటలూ, ఆమె చేతిలోని కీలుబొమ్మలైన ప్రధాని, [మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ వంటి] ఇతర మంత్రులపై ఆమె నియంత్రణా, స్పష్టంగా కన్పిస్తున్నాయి కదా?

అందుకన్నమాట ఇలా నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ స్ట్రాటజీని, దేశాలని, సంస్థలనీ, పార్టీలని, ఏజంట్లనీ కూడా expose చేయటం! Top to Bottom అన్నట్లు, పైనుండి క్రింది దాకా, స్ట్రాటజీ దగ్గరి నుండి వ్యక్తిగత ఏజంట్ల దాకా, ప్రతి అంశాన్ని, దృష్టాంత సహితంగా బహిర్గతం అయితేనే, సామాన్యుడికి అర్ధం అవుతుంది, అవగాహన కలుగుతుంది. ముందు కుట్ర అర్ధం అయితే గదా పరిష్కారించుకోగలిగేది, తమని తాము రక్షించుకోగలిగేది? అందుకే మోసం ఎలా జరుగుతుందో అర్ధం అయితేనే గదా మోసపోకుండా ఉండగలిగేది అని వ్రాసాను, నాబ్లాగు తొలి టపాలలో!

ఇంతకు క్రితం టపాలలో స్ట్రాటజీ గురించి, దేశాలపై నకిలీ కణిక వ్యవస్థ పనితీరు గురించి వ్రాసాను. అందుచేత ఇప్పుడు ఏజంట్ల expose తో ప్రారంభించి, పార్టీలు, సంస్థల expose తో కొనసాగి, దేశాల గురించీ, స్ట్రాటజీ గురించి పునః సమీక్ష చేద్దాం. ముందుగా ఇంటి నుండి అంటే మనరాష్ట్రం నుండి ప్రారంభిద్దాం.

ముందుగా నకిలీ కణికుడికి ప్రియమైన ఏజంటు అయినప్పటికీ, 1995లో అప్రియమైన ఏజంటుగా మారిపోయిన ఎన్.టి.రామారావు గురించి వ్రాస్తాను. ఈతడు అందగాడు. అద్భుతమైన నటుడు. నటుడిగా క్రమశిక్షణ గలవాడు. అధికంగా శ్రమించగలిగిన వాడు. అంతమాత్రం చేత సౌశీల్యవంతుడనలేం. మంచినాయకడనీ అనలేం. నటుడు కాబట్టి వాచకత్వం, వాగ్పటిమ ఉన్నాయి. అభినయానికి అనుగుణంగా, హెచ్చుతగ్గులు స్వరంలో పలికిస్తూ బహుపద సమాసాలతో, ఉపన్యాస కళతో ప్రజలని ఆకట్టుకున్నంత మాత్రానా మంచినాయకుడైపోడు. ఇతడు సినిమాల్లో ఉండగా కూడా, తనకు తెలియకుండా కొంతకాలం[తొలిరోజుల్లో], తెలిసి మరికొంతకాలం, సినిమారంగపు గాడ్ ఫాదర్ లకు అంటే నకిలీ కణికునికీ తొత్తుగా పనిచేశాడు. మరికొంతకాలం ఈ వెండితెర వేలుపు తానే ఓ గాడ్ ఫాదర్ గానూ [అంటే నకిలీ కణికుడికి మరింత ప్రియమైన, ముఖ్యుడైన, ఏజంటు అయ్యాడని అర్ధం] పనిచేసాడు. అతడి ఆశీర్వాదం ఉంటే సినిమారంగంలో ఎవరైనా నిలదొక్కుకోగల, రాణించగల స్థితికి చేరుకున్నాడు. చివరికి తగినంత అందచందాలు, అభినయనివేశమూ, కళా చాతుర్యమూ లేకపోయినా కూడా, కొందరు నటీ నటులని కెమెరామెన్, మేకప్ మెన్, ఇతర సాంకేతిక సిబ్బంది, సాంకేతికతల సహాయంతో, నకిలీ కణిక వ్యవస్థా, ప్రత్యక్షంగా ఎన్.టి.ఆర్. వంటి వారూ పైకి తెచ్చారు. ఆ విధంగా, మొత్తం సినిమారంగపు నాణ్యతని శాసించారు.

ఓ ఉదాహరణ చెబుతాను. నలుపుతెలుపు సినిమా రోజుల్లోనే ’పరమానందయ్య శిష్యుల కథ’ అనే సినిమా వచ్చింది. దానికి ముందు, శోభన్ బాబు హీరోగా నటించిన ‘వీరాభిమన్యు’ సినిమా వచ్చి ఘనవిజయం సాధించింది. అందులో అందంగానూ, నటనపరంగా ఫర్వాలేదనిపించుకుంటూనే శోభన్ బాబు కొంత రాణించాడు. తర్వాత కెరియర్ బాగుంటుందని ఊహించాడు. అయితే అతడి ఊహ నిజం కాలేదని, అతడే చెప్పుకున్నట్లుగా అతడి మరణానంతరం వచ్చిన వ్యాసాలలో చదివాను. వీరాభిమన్యు సినిమా తర్వాత, అతడి ఆశలు నిరాశలవ్వటంతో పదిహేనువందల పారితోషికం కోసం మెడలో పాముల్ని వేసుకుని పరమశివుడి వేషం వేసాడట. ఆ రోజుల్లో పదిహేనువందలు ఎక్కువమొత్తమే కావచ్చు గానీ, సినిమా నటుల పారితోషికం విషయంలో అది తక్కువ మొత్తమే. ఇంతాచేసి, పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో ఎన్.టి.ఆర్. ధరించిన పాత్ర అంత సంక్లిష్టమైనదీ కాదు, అతడు తప్ప శోభన్ బాబువంటి చిన్న నటులు చెయ్యలేనంతటదీ కాదు. అందునా ఆ పాత్రని నటించటంలో ఎన్.టి.ఆర్.లో ఓ విధమైన నిర్లక్ష్యం [అలవోక అని అతడి అభిమానులు అంటారు. నటుడిగా ఎన్.టి.ఆర్. నటనని నేనూ వీరాభిమానంతో ఆస్వాదించి ఆనందిస్తాను. అయితే లోపాన్ని లోపంగా గుర్తించనిది గుడ్డితనమే కాని అభిమానం అనిపించుకోదు] ద్యోతకమౌతుంది. ఎందుకంటే, అప్పటికే, నకిలీ కణికుడు, లేదా అతడి ఏజంట్లు అయిన, అప్పటి సినిమారంగ గాడ్ ఫాదర్ లు, మెల్లిగా రంగంలో తలెత్తి, బయటకు కనబడటం ప్రారంభమయ్యింది. పరోక్షంగా ఉన్న ఆ గ్రిప్, ఎన్టీఆర్ కి ప్రత్యక్షంగానే దన్ను ఇచ్చింది. దాని తాలుకూ భరోసానే పాత్రలకు న్యాయం చేయటంలో నిర్లక్ష్యంగా ఎన్టీఆర్ లో కనబడింది. ఈ స్థితి ఈ ఒక్క సినిమాలోనే కాదు. ఆ ఎరాలో వచ్చిన అంటే ఆ దశాబ్ధం, ఆ తర్వాతి దశాబ్దంలో వచ్చిన సినిమాలలో స్పష్టంగా కన్పిస్తుంది. అయితే పత్రికలు మాత్రం ఎన్టీఆర్ నటనని ‘ఆహా! ఓహో!’ అనీ, అద్భుతమనీ ప్రచార హోరెత్తించాయి. అదే చిత్రంలో కొత్తగా పరిచయం చేయబడ్డ కథానాయిక కె.ఆర్. విజయ. గొప్ప అందగత్తెగా నాటి మీడియా స్టాంపు వేసి ప్రచారించిన ఆనాటి స్టార్. ఆవిడ ధరించిన పాత్ర ఓ సన్నివేశంలో నర్తించవలసి ఉంది. అదీ ఎల్.విజయలక్ష్మి తో పోటీ పడి నర్తించాలి. సదరు కథానాయిక కె.ఆర్. విజయకు నాట్యం రాదు. ఇక కెమెరామెన్, నాట్యదర్శకుల తిప్పలు తెరమీదే చూడాలి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సంగీతదర్శకుడు, గీతరచయితా కలిసి, గాయని సుశీల చేత ’హుఁ హుఁ’ అంటూ హూంకరింపులు కూడా పెట్టించారు. కథాపరంగా నాయిక నాట్యంలో అందెవేసిన చెయ్యి అయి ఉండాలి. అటువంటప్పుడు మరో కథానాయికే దొరకకపోయిందా? కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించగల నటీమణులూ, ముద్దు సన్నివేశాల్లో చొంగకారుస్తూ మరీ సజీవంగా[కెమిస్త్రీ పండించటం కాబోలు] నటించగల నటీమణులకు, కొంచెం పూర్వకాలంలోని ఇటువంటి సినిమాలలో, కథ డిమాండ్ చేస్తే నాట్యం చేయగల నాయికలే దొరకలేదా? బాపూ రమణలు తమ ’రంగుల రాట్నం’ అన్న పుస్తకంలో ఇలాంటి విశేషాలనే[ఇది కాదులెండి] చెబుతూ ’సత్తు బేడలు కూడా చెల్లుతాయని’ తాము ఊహించలేకపోయాం అంటారు. అలా సత్తు బేడల్ని నకిలీ కణిక వ్యవస్థ బ్రహ్మాండంగా చెల్లించింది. పోటీ నివ్వగల నటీనటుల్ని రంగం నుండి ఇంటికి పంపించేసి, కెమెరా, మేకప్ ఇతర సాంకేతికతో ఎన్నో సత్తుబేడల్ని చెల్లించింది. ఇక్కడా నారదనీతికి విపర్యయం, కణిక నీతే అమలుపరచబడింది. ఇక రుద్దగా రుద్దగా, మీడియా ప్రచారించగా ప్రచారించగా, కెమెరామెన్ ఆయా నటీనటుల్ని అందంగా చూపగా చూపగా, మరో పోలికేది లేక కూడా, సదరు ఆముదం చెట్టువంటి నటీనటులు మహా వృక్షాల్లాగా కనబడేవారు. ఇది ఒక్క కె.ఆర్.విజయ వంటి నటి విషయంలోనే కాదు, షావుకారు జానకి, కృష్ణకుమారి, దేవిక, వాణిశ్రీ వంటిఎందరో నాయికల విషయంలో అమలుచేయబడిన స్ట్రాటజీ. తద్వారా ప్రతిష్ఠితం చేసుకుని, ప్రకటించుకున్న నకిలీ కణికుడి గ్రిప్. వరకట్నం సినిమాలో సావిత్రి Vs. కృష్ణ కుమారి పాత్రల విషయంలో, కృష్ణకుమారి పోషించిన నాయిక పాత్రకు వదిన పాత్రలో సావిత్రి చేత నటింప చేయవలసిన అవసరం ఏదీ లేదు. అప్పటికే సావిత్రి తమకు ఉపయోగపడదన్న విషయం స్పష్టపడటంతో, నకిలీ కణికవ్యవస్థ, ఆమెని డీగ్రెడ్ చేసేందుకు, ఆ చిత్రంలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించి మరీ, అనివార్యమై సావిత్రి ఆ పాత్రని చెయ్యవలసిన పరిస్థితి కల్పించారట. ఇదీ… తర్వాతి కాలంలో ప్రచారంలోకి వచ్చిన ఉదంతం.

చాలా చిత్రాల్లో సదరు కృష్ణకుమారిని గ్లామరస్ గా చూపించటం, అందుకు వీలయ్యే కథలతో చిత్రాలు తయారు కావటం కూడా జరిగింది. అలాగే షావుకారు జానకి విషయం కూడా! ఈవిడ కోసం పాత్రలు సృష్టింపబడటం కూడా జరిగింది. ఎన్టీఆర్ నిర్మించిన పాండురంగ మహత్యంలో, నాయిక అంజలీ దేవి, భర్తతో గొడవపడి పుట్టింటికి చేరిన సందర్భంలో తండ్రి ఆమెని మందలిస్తాడు. కథలో అవసరం లేకపోయినా, ఆమెకో విధవ అక్కగారి పాత్ర అందులో ఉంటుంది. ఆ పాత్ర నాయికకు సంసారం గురించి నీతులు చెబుతుంది. అద్భుతమైన ఆ సినిమా మొత్తంలో అత్యంత కృతకంగా ఉండేది ఈ సన్నివేశమే. అదే విధంగా దేవికనీ ఆనాటి ప్రేక్షకల నెత్తిన రుద్దారు. [ఇప్పుడు అలాంటి నటీనటులు కొల్లలుగా మన నెత్తిన రుద్దబడుతూనే ఉన్నారులెండి] ఆ తదుపరి వాణిశ్రీ. ఆమె షూటింగ్ స్పాట్ కు తన కుర్చీ తాను తెచ్చుకునేదట. ఇక ఇలాంటి చిలువలూ పలవలతో కూడిన ఆసక్తికరమైన కథనాలతో ఆయా నటీనటులకు ఎంతగా క్రేజ్ సృష్టించారో నకిలీ కణికులకీ తెలుసు, సగటు ప్రేక్షకులకీ తెలుసు. కాకపోతే ప్రత్యేకమైన పరిశీలనే ఉండదు.

ఈవిధంగా నకిలీ కణికుల ఆశీస్సుల పొందగలిగిన నటీనటులు తదనంతరం మరింత ప్రమోట్ అయి తమ ఆశీస్సులతో మరికొందరిని పైకి తేగలరన్న మాట. 1990 లో గనుక చిరంజీవి తను హీరోగా చేసే సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో సుధ [నేటి తల్లిపాత్రల ధారణి] ని ప్రమోట్ చేసినట్లుగా నన్నమాట. అలా అలా ఎంతో బలంగా వేళ్ళూనుకున్న వటవృక్షంలాంటి ఎన్టీఆర్, సినిమా రంగంలో ఎంతగా చలాయించుకున్నాడో ఎవరూ నోరు విప్పరు.

ఇతడు శ్రీకృష్ణుడుగా నటించిన శ్రీకృష్ణార్జున యుద్దంలో సత్యభామ పాత్ర ఎస్. వరలక్ష్మి పోషించింది. ఈమె అక్కినేని నాగేశ్వర రావుకు కూడా సీనియర్ నటి. స్వయంగా గాయని. కథాపరంగా, పాత్రపరంగా ఆ సినిమాలో ఈమె శ్రీకృష్ణుని పాత్రధరించిన ఎన్టీఆర్ ని కాలితో తన్నింది. తదనంతర కాలంలో ఎన్టీఆర్ నిర్మించిన శ్రీకృష్ణపాండవీయం అనే చిత్రంలో ఎస్.వరలక్ష్మి కుంతీదేవి పాత్ర నటించింది. ఆ స్థితికి ఆ పాతతరం నటి డ్రైవ్ చేయబడిందనీ, ’ఎంతలో ఎంతమార్పు’, ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా వేసిన ఎస్.వరలక్ష్మి ఇంతలో ముసలావిడ అయిపోయి మేనత్త వేషం వేసింది. ఎన్టీఆర్ మాత్రం అలాగే ఉన్నాడు’ అన్న ప్రేక్షకుల వ్యాఖ్యలు వెల్లువెత్తాయనీ చెప్పుకున్నారు. ఇవే వ్యాఖ్యల్ని నేను దానవీర శూరకర్ణ చిత్రంలోనూ విన్నాను. [పాత్రపరంగా కాలితో తంతే మాత్రం, ఆవిడ్ని డిగ్రేడ్ చేస్తారా? అనవచ్చు. ఇక్కడ మీకు ఒకవిషయం చెప్పాలి. షూటింగ్ స్పాట్ లో ఒకప్పుడు పాత్రపరంగా హీరోయిన్ తో రాష్ గా ప్రవర్తించిన పాత్రధారులు, రేప్ సీన్ లో నటించిన పాత్రధారులు, షూటింగ్ షాట్ అయిపోయిన ప్రతీసారి హీరోయిన్ [ప్రముఖనటి అయితేనే సుమా] కి క్షమాపణలు చెప్పుకుంటారు. ఎందుకంటే – ఆలా క్షమాపణలతో హీరోయిన్ కి ఆహం సంతృప్తి కలిగించటం ద్వారా ’తమ కెరీర్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటారు’ అని అనుకునేవారు. ఆ రంగంలో అహాల స్థాయి ఎంత ఉంటుందో తెలియటానికి ఇదో ఉదాహరణ.]

క్రమంగా ఈ స్టాంపు కూడా ఈ నటుడు ఎన్టీఆర్ మీద, ఇతడి సహానటుడు ఎ.ఎన్.ఆర్. మీద పడ్డాయి. వీళ్ళ కళ్ళెదురుగా ఎందరో[లేత]హీరోయిన్లు వస్తుంటారు. పోతుంటారు. ఈవృద్దనటులు మాత్రం అప్పటికి 50/55 ఏళ్ళు దాటినా ఇంకా కుర్రహీరోయిన్లతో డాన్సులు, ప్రేమ సన్నివేశాలూ నటిస్తూ ఉండేవారు. చివరికి ఏదో సినిమాలో ఎన్టీఆర్ పొట్టినిక్కరు వేసుకుని ’అమ్మా! నేను పదో తరగతి పాసయ్యాను’ అనే డైలాగ్ ఉందట.[నిజమో కాదో గానీ] జోక్ గా చెప్పకునేవారు. ఓ రకంగా చెప్పాలంటే తమ స్ట్రాటజీని మరింత పకడ్బందీగా అమలు చేసుకునేందుకు నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే ఉపాయం[ట్రిక్] ఇది. తామే దాని మీద బోలెడు వ్యంగ్యాస్త్రాలూ, జోకులూ వేసి, ఎందరెంత హేళన చేసినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయానే నైరాశ్యపు విమర్శ కొందరి చేత, ఎందరెన్ని అన్నా ఆయా నటులకి నిర్మాతలూ, ప్రజలూ బ్రహ్మరధం పడుతూనే ఉన్నారనే పరోక్ష/ప్రత్యక్ష పొగడ్తలు మరికొందరి చేతా, ప్రచారింపచేస్తూ, చేతల్లో మాత్రం తమ స్ట్రాటజీని కొనసాగిస్తూనే ఉంటాడు నకిలీ కణికుడు. ఇలాంటి చాలా తంత్రాలతో 1981 వరకు ఎన్టీఆర్ కు సినిమా రంగంలో తిరుగులేని పట్టు నడిపించబడింది. ఇందుకు ప్రతిగా, ఎన్టీఆర్, నకిలీ కణికుడికి, భారతీయ ఇతిహాసాలని ముఖ్యంగా భారతాన్ని, సినిమాల ద్వారా భ్రష్ఠపు ప్రచారాన్ని కలిగించడానికి, ప్రక్షిప్తాలను చొప్పించి వక్రీకరించడానికి ఎనలేనంతగా ఉపయోగపడ్డాడు.

శ్రీకృష్ణపాండవీయం సినిమాలో శకుని గురించిన ప్రక్షిప్తపు కథ అటువంటిదే. దుర్యోధనుడు శకునిని అతడి తండ్రీ సోదరులతో సహా[అంటే తాతా మేనమామలని అన్నమాట] భూగృహంలో చెరలో వేయించి వందమందికి రోజుకు వందమెతుకులు పెట్టాడనీ, మిగిలిన వారంతా ఆకలిచావులు చావగా, పగతీర్చుకునేందుకు శకుని ప్రాణాలతో మిగిలాడనీ చెబుతుంది ఆ కథ! దాంతో కౌరవుల పక్షాన్నే ఉంటూ కౌరవులకు కీడు మూడించాడట శకుని! మరి ఇలాంటి శకుని ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనాదుల్ని గెలిపించడానికి పుత్రపౌత్ర సహితంగా పోరాడి మరీ చచ్చిపోయాడో? అలాగే దానవీరశూరకర్ణలో ద్రౌపదీ దేవి చేత ’కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలని ఉందన్న’ కాంక్షని చెప్పించటం. ఆ పాత్రని నటించిన శారద అభినయం సైతం [దర్శకుడు చెబితేనే గదా నటి అభినయాన్ని చూపేది?] అదే కాముకత్వాన్ని చూపిస్తుంది. శ్రీకృష్ణుని బహుభార్యల్లో ఒకరైన సత్యభామా దేవికి, అయిదుగురు భర్తలకి ఇల్లాలై కూడా, అందరి ఆదరాభిమానాల్ని గౌరవాన్ని పొందుతూ, అరణ్యవాసంలో గుట్టుగా సంసారం నడుపుకొస్తున్న ద్రౌపదీ దేవి, భర్తప్రేమని, గౌరవాన్ని పొందటం ఎలాగో, సంసారాన్ని దిద్దుకోవటం ఎలాగో, స్త్రీగా, ఇల్లాలిగా ప్రవర్తనా సరళి ఎలా ఉండాలో ఎంతో సౌమ్యంగా చెబుతుంది. ధర్మరాజుతో అతిశాంతం పనికి రాదనీ, క్రోధం ఉండాలనీ వాదిస్తుంది.[తదుపరి సంవాదంలో ధర్మరాజు శాంతగుణం ప్రాసస్త్యాన్ని వివరిస్తాడు. వెరసి ఈ ఇద్దరి సంవాదంలో క్రోధం, శాంతం ఎప్పుడు, ఎంతవరకూ ఉండాలో, వాటి వాటి పరిమితులేమిటో వ్యాసమహర్షి మనకి వివరిస్తాడు. నేర్చుకోవాలన్న తపన గలవాళ్ళకు, జీవితకాలం నేర్చుకోగల పాఠాలని నేర్పగలదు భారతం.] అటువంటి సౌశీల్యవతి ద్రౌపదీ దేవిని ఆ విధంగా చూపగలిగిన వాడు, దుర్యోధనుణ్ణి కథానాయకుడిగా మలచగలిగిన వాడు, ఎన్టీఆర్ మాత్రమే. నిజానికి – భారతంలో శ్రీకృష్ణుడు, యుద్ధానికి ముందు, కర్ణునికి అతడి జన్మరహస్యాన్ని వివరించి ’పాండవపక్షం వహించమని చెబుతూ, అలా చేస్తే ద్రౌపదీ దేవి ఆరవ భర్తగా కర్ణుణ్ణి వరిస్తుందని చెబుతాడు. అంతేగాని ద్రౌపదీ దేవికి ఆ కాంక్ష ఉందనటం ఆ పాత్రని అశ్లీలంగా, అగౌరవ పాత్రంగా మలచటమే. ఇందులోనే కాదు ‘శ్రీమదిర్వాట పర్వం’ సినిమాలో ద్రౌపదీ దేవి కీచకుణ్ణి నర్తనశాలకు రమ్మనే సన్నివేశంలో ఏకంగా గెంతుతూ డాన్సే చేస్తుంది.

ఈవిధంగా, రామాయణ విషవృక్షంతో రంగనాయకమ్మ నెగిటివ్ ముఖమే పెట్టుకుని విషం చిమ్మితే, ఎన్టీఆర్ తన సినిమాల స్ర్కీప్టులతో [నాస్తికులతో వ్రాయించుకున్న స్ర్కిప్టులూ ఉన్నాయి] పాజిటివ్ ముఖం పెట్టుకుని మరీ, అంతకు రెట్టింపు విషమే చిమ్మాడు. సినిమా అత్యంత శక్తి గల మాధ్యమం అయినందునా, అందులో ఎన్టీఆర్ కి తన సుదీర్ఘ కెరీయర్, అందచందాలు, నటనా చాతుర్యాలకు తోడు నకిలీ కణికుడిచ్చిన ఇమేజి ఉన్నందునా, ప్రజా దృక్పధాన్ని మరింత ప్రభావ పరచగలిగే విధంగా మలచబడ్డాడు. ఆ విధంగా తనకి ఉపయోగపడినందునే, నకిలీ కణికుడు ఎన్టీఆర్ కి సినిమా కెరియర్ తర్వాత రాజకీయ కెరియర్ కూడా ఇచ్చాడు. అతడి సంతతికీ బాగానే ’సీన్’ ఇచ్చాడు.

ఈ విధంగా నకిలీ కణికుడు ఇచ్చిన సీన్ తో ఎన్టీఆర్ లో కూడా ‘తాను ఎవర్ గ్రీన్ హీరో, అదృష్టజాతకుడు, యుగపురుషుడు, తన కళ్ళ ముందే ఎందరో హీరోయిన్లు పారేనదిలోని నీళ్ళల్లా వస్తుంటారు, పోతుంటారు’ అన్న భావన ఏర్పడింది. తానే ‘సూపర్ మ్యాన్’ చిత్రంలో పాటలో అభినయించినట్లుగా “అన్ని పూలకీ ఒక్కతుమ్మెదే జవాబు చెబుతుంది” అన్న భావన బలపడింది. అందునా వృద్ధాప్యం పెరిగే కొద్దీ ఆ భావం మరింత పెరిగిందేమో, ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు తనతో నటించే కుర్రహీరోయిన్ల అందాల్ని, పాత్రోచితంగా ఆనందించటం గాక ఆయా పాత్రలో జీవించేసి మరీ నటించేవాడు. ఆయా సన్నివేశాల్లో కుర్రహీరోయిన్ల పిరుదల మీద దరువులు వేస్తూ[యమగోలలో జయప్రద, వేటగాడు, కొండవీటి సింహాం గట్రాలలో శ్రీదేవి] స్టెప్పులు వేసినప్పుడు ఆ నటుడి కళ్ళల్లో నటన పరిమితుల్ని దాటిన ’యావ’ ఉండటం ఇప్పుడు ఆ సి.డి.లు వేసుకుని చూసినా సుస్పష్టంగానే కన్పిస్తుంది. ఈ విషయమై చాలామంది హీరోయిన్లు లోలోపల సణుక్కునో, గొణుక్కునో, ఆపైన నోరుమూసుకుని సర్ధుకుపోయార్ట కెరియర్ కోసం. కాగా జయప్రద ఆ విషయమై గొడవపెట్టిందనీ , అతడి ప్రక్కన నటించనన్నదనీ అప్పట్లో చెప్పుకున్నారు. అందునా జయప్రదని నటుడు ఎన్టీఆర్ ఓ పాటలో నటిస్తూ తెరమీద కర్చిఫ్ ని నలిపినట్లు నలిపి పారేసాడని అప్పట్లో అనటం విన్నాను.

ఇంతగా లేటు వయస్సులో ఘాటుప్రేమనీ, నటన సాకుతో తనకు మనవరాళ్ళ వయస్సు హీరోయిన్లని పిరుదుల మీద కొడుతూ[అదే మాస్ అన్న ముద్రవేసుకుని] తీర్చుకున్న మనోవికారాన్ని ప్రజలు గుర్తించకపోయి ఉండొచ్చు. మీడియా గుర్తింపనివ్వకపోయి ఉండొచ్చు. ఏకొందరైనా గుర్తించినా, మీడియా పెట్టే ప్రచారహోరుతో అదీ సమసిపోయింది. అయితే ఈ మనోవికారమే అతడి ‘సువర్ణముఖి’ అతడికి, లక్ష్మీపార్వతిని ద్వితీయ కళత్రంగా కానుక ఇవ్వడానికి కారణమైంది. ఇంతక్రితం రాముడు, కృష్ణుడు పాత్రలను తల్చుకుంటే ఎన్టీఆర్ గుర్తుకువచ్చేవాడు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ తో పాటు లక్ష్మీపార్వతితో వివాహం, అతడి జీవిత చివరిదశలో కుటుంబకలహాలు, అల్లుడి వెన్నుపోటు, రాజకీయ జీవిత వైఫల్యం గుర్తుకువస్తాయి. ఒక్క ’లక్ష్మీపార్వతి’ అనేపాత్రతోనే ఇది సాధ్యమయ్యింది. అది ఇక్కడి స్ట్రాటజీ!

ఆ స్ట్రాటజీ వెనుక ఉన్నది నకిలీ కణికవ్యవస్థ, రామోజీరావే! ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని వెనుక ఉన్న గూఢచర్య తంత్రం చాలా ఆసక్తికరమైనది. నకిలీ కణికుడు ఎన్టీఆర్ పట్ల పన్నిన వ్యూహం, అతడికి అప్పటికి సరైనదిగా కన్పించి ఉండవచ్చు. కాలం గడిచాక చూస్తే అది ఎవరిని ఎంతగా expose చేసిందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
***********

ముందుగా ఒకటికి రెండు కథలు చెప్పి, వాటి అనువర్తనతో మా బ్లాగు చుట్టాలని అలరించాలని….

కైరో నగరంలో ఉన్న మెహమూద్, జరీనా దంపతులకు ఉన్న ఆస్తంతా ఒక బక్కచిక్కిన గొర్రెపిల్ల మాత్రమే!

ఒకనాడు జరీనా భర్తతో “ఏమండీ! నెలరోజుల్లో వర్షాకాలం రాబోతుంది. అప్పుడు కూలి పనులుండవు. అందుకని ముందుగానే మనగొర్రె పిల్లని అమ్మేసి ఆ డబ్బులు దాచుకుంటే మేలు” అని సలహా ఇచ్చింది.

సరేనని మెహమూద్ గొర్రెపిల్లని సంతలో అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ బక్కగొర్రెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక వెనుదిరిగి వస్తుంటే దారిలో ఒక శ్మశానం దగ్గర పచ్చిక విస్తారంగా ఉండడం కన్పించింది. ‘గొర్రెనిక్కడ ఎలా గోలా కొన్నాళ్ళు ఉంచితే, పచ్చిక తిని బలంగా తయారవుతుంది. అప్పుడు అమ్మితే మంచి ధర పలుకుతుంది’ అనుకుని ఒక ఉపాయం ఆలోచించాడు.

తిన్నగా కాటికాపరి ఆలీఖాన్ వద్ద కెళ్ళి “ఆలీభాయ్! నీకు ఈ గొర్రెపిల్లను కానుకగా యిద్దామని వచ్చాను” అన్నాడు.

“ఎందుకు?” అనడిగాడు ఆలీఖాన్ ఆశ్చర్యంగా.

“మరేం లేదు భాయ్! నేనా ఒంటరివాడిని. చనిపోతే నన్ను ఎవరు పూడ్చి పెడతారు? అందుకని ముందే సుంకంగా గొర్రెపిల్లని ఇద్దామని వచ్చా” అన్నాడు మెహమూద్. వీడెవడో మూర్ఖుడులా ఉన్నాడనుకున్న ఆలీఖాన్ లోలోపల సంతోషించి “ఓ! నిక్షేపంగా! నీవు చచ్చిన తరువాత నీ శవాన్ని పాతిపెడతానులే!” అంటూ గొర్రెపిల్లను తీసుకున్నాడు.

కొన్నాళ్ళు గడిచేసరికి గొర్రె తెగ బలిసింది. అది గమనించిన మెహమూద్, ఆలీఖాన్ దగ్గరకు వెళ్ళి “భాయ్! నేను మక్కా పోతున్నాను. నువ్వూ మూటాముల్లే సర్ధుకుని బయల్దేరు!” అంటూ తొందర చేశాడు.

“నీకు మతి చలించలేదు కదా? నీతో నేనెందుకు?” అన్నాడు ఆలీఖాన్.

“భలే వాడివే. నేను చస్తే పాతిపెట్టడానికి గొర్రెను తీసుకున్నావుగా? మరి నేను మక్కాలో పోతేనో? కాబట్టి పదపద” అన్నాడు మెహమూద్. ఆలీఖాన్ కి ఆరికాలి మంట నెత్తి కెక్కింది. “ఏంటీ? నీ గొర్రెను తీసుకున్న పాపానికి నీతో ఊరేగాలా? కుదర్దు. కావాలంటే నీ గొర్రె పిల్లని నువ్వే పట్టుకుపో” అంటూ కేకలేశాడు.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న మెహమూద్ “సరే… మరి నీ ఇష్టం!” అంటూ గొర్రెను తీసుకుని, తిన్నగా సంతకి వెళ్ళి మంచి ధరకి దాన్ని అమ్మేశాడు. వర్షాకాలంలో ఆ దంపతులకు ఏ లోటూ రాలేదు.

శ్రీపాద సత్యనారాయణ గారు వ్రాయగా, ఈనాడులో నేను చదివిన కథ ఇది. ఇందులో తెలివిగలిగిన మెహమూద్ [పేదవాడే కావచ్చు గాక] తన మేధోబలంతో కాటికాపరి అలీఖాన్ ని మోసగించాడు. ఎక్కడా “నా గొర్రెని నాకు ఇచ్చెయ్!” అన లేదు. కాటికాపరే, తనంతట తానే “గొర్రెని తీసేసుకో!” అనేలా చేసాడు. వెరసి కాటికాపారి కష్టాన్ని, మెహమూద్ దోచుకున్నాడు.

మరో కథ చూద్దాం. ఇది మన పురాణాల్లోని [భాగవతం] కథ. నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉండగా, కార్త్యవీర్యార్జునుడు అనే రాజు, యుద్దకాంక్షతో అన్నిదేశాలూ తిరుగుతూ, ఆయా రాజుల్ని ఓడిస్తూ, యుద్దోన్మాదంతో తిరుగుతూ ఉంటాడు. అతడి యుద్దోన్మాదాన్ని భరించలేక, కొందరతడికి, “ఆశ్రమంలో నరనారాయణులున్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యి! నీ యుద్దకాంక్ష చల్లారుతుంది” అని సలహా ఇస్తారు. కార్తవీర్యార్జునుడికి వేయిభుజాలు[చేతులు] ఉంటాయి. అమిత బలవంతుడు. ఆ బలగర్వంతోనే అందర్నీ యుద్దానికి ఆహ్వానిస్తూ, ఆ గెలుపులలో కలిగిన విజయగర్వంతో మరింత విర్రవీగుతూ, చివరికి యుద్దోన్మాది అయ్యాడు. అలాంటి కార్త్యవీర్యార్జునుడికి పైసలహా నచ్చింది. దాంతో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరాడు. యుద్దఘర్జనలు చేస్తూ వారిరువురినీ యుద్దానికి పిలిచాడు. వారు “ఎందుకయ్యా యుద్దం! మేం ప్రశాంతంగా తపస్సు ఆచరిస్తున్నాం! మమ్మల్నెందుకు అలజడి చేస్తావు? వెళ్ళు!” అన్నారు. అతడు విన్పించుకోలేదు. ’యుద్ధం చెయ్యడానికి భయం కాబోలు!’ అని వెక్కిరించాడు. చేవలేదని ఛీత్కరించాడు. ఓడిపోతారని సంకోచమంటూ రెచ్చగొట్టాడు. ’యుద్ధం చెయ్యమని తన చేతులు తీటపెడుతున్నాయనీ, యుద్ధం చెయ్యకతప్పదనీ’ అన్నాడు. ’యుద్ధం చేస్తే వాళ్ళ ఓటమి, తన గెలుపూ ఖాయమనీ’ ప్రగల్భాలు పలికాడు.

అతడి గోలతో నరనారాయణుల ప్రశాంతత దెబ్బతింటోంది. చివరికి నారాయణ ప్రేరితుడై, నరుడు కార్త్యవీర్యార్జునుడితో యుద్ధం చేసేటందుకు లేచాడు. ఒక ధర్భను మంత్రించి, అదే శరంగా అంటే ఆయుధంగా సంధించాడు. కార్త్యవీర్యార్జునుడు ఎంతగా పెనుగులాడినా, ప్రతిఘటించ ప్రయత్నించినా నరుడు ప్రయోగించిన ఆయుధంతో యుద్ధం చెయ్యలేకపోయాడు. చివరికది అతడి 998 చేతులనూ ఖండించి, రెండు చేతులను వదలివేసింది. పరాజితుడైన కార్త్యవీర్యార్జునుడు భయంతో, పశ్చాత్తాపంతో నరనారాయణుల కాళ్ళపైబడ్డాడు. అప్పుడు వారిరువురూ “కార్త్యవీర్యార్జునా! బలం ఉన్నది బలహీనులని బాధించేందుకు కాదు. వారిని రక్షించేటందుకు! ఇకనైనా బుద్ధిగా ప్రజలని, బలహీనులని కాపాడుతూ రాజ్యం చేసుకో!” అని చెప్పి పంపారు.

ఆ విధంగా భారతీయ ఇతిహాసాలు ’బలం ఉంటే, అది శారీరక బలం కానివ్వండి, మేధోబలం [తెలివి] కానివ్వండి, ఆ బలంతో బలహీనులని రక్షించాలి గానీ దగా చేయకూడదు, బాధించకూడదు’ అని చెబుతాయి! ఇలాంటి ధర్మాలని ప్రభోదిస్తూ భారతీయ ఇతిహాసాలు ప్రజా దృక్పధాన్ని పాపం, పుణ్యం అని ప్రభావపరుస్తాయి. కాబట్టే హిందూమతాన్ని మతాలకతీతంగా జీవన సరళి అనీ, సనాతన ధర్మమనీ అంటారు.

’నేను తెలివైన వాణ్ణి. చట్టప్రకారం వ్యాపారం చేసాను’ అని తను చేసిన మోసాన్ని సమర్దించుకుంటూ, ఎవరైనా అంటే…. ఏమనగలం? చట్టం మానవనిర్మితం. అది రాజ్యాంగం అనబడే ఓ పుస్తకాన్ని బట్టిఉంటుంది. కాని ధర్మం మానవత్వాన్ని బట్టి ఉంటుంది. దృక్పధాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మతం ప్రబోధిస్తుంది. కాబట్టే ఏకాదశ నాడు ఉపవాసం చేసి [ఫలహారాలు తిని అన్నం తినకపోవటం ఉపవాసం కాదు, అసలు ఆహారమే గ్రహించక పోవటం ఉపవాసం అవుతుంది] ఆకలిని అనుభవపూర్వకంగా గుర్తుచేసుకున్న తర్వాత, ద్వాదశి రోజున అతిధి అభ్యాగతులకు భోజనం పెట్టి, ఆపైన ద్వాదశి పారాయణ చేయటం అన్నది సాంప్రదాయంగా ఉండేది. డబ్బున్నవాడు పేదలకి దానధర్మాలు చేయటం, బలవంతుడు బలహీనుల్ని రక్షించటం అన్న క్షాత్రధర్మాన్ని పాటించటం, పండితుడు శాస్త్రజ్ఞానాన్ని ప్రజలకి బోధించటం – ఇలాంటి వాటిని తమకు తామే, స్వచ్ఛందంగా, తమ విద్యుక్తధర్మంగా పాటించి ఆచరించటం – ఇలాంటి వాటిని ఏ చట్టమూ ప్రేరేపించలేదు, ప్రజలు పాటించేలా చేయలేదు. వీటిని ఆచరించేలా చేసేది ప్రజల దృక్పధం మాత్రమే. ఆ దృక్పధాన్ని, అంటే ఆలోచనా సరళిని, పాపం పుణ్యం పేరిట ప్రభావ పరిచేది మత విశ్వాసాలే! అలాంటిచోట, మత విశ్వాసాలని ధ్వంసం చేస్తే, ఇక ఆ జాతిని ధ్వంసం చేయటం ప్రాణంలేని కట్టెను తగలబెట్టినంత సులభం! కాబట్టి ప్రతీ మనిషి ఆర్ధికాభివృద్ధితోపాటు, ఆత్మోన్నతి కోసం ప్రయత్నించక తప్పదు. భాగవతంలో – ‘ధర్మమంటే సత్యమూ, భూతదయ, దానము, తపస్సు – ఈ నాలుగూ ధర్మం యొక్క పాదాలు’ అని చెప్పబడుతుంది.

ఈ విషయంలో ఒక అనువర్తన చెప్పి, ఈ టపా ముగిస్తాను. మొదటి కథలో మెహమూద్ లా రాజకీయనాయకులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరూ తమకు అనుకూలంగా ప్రభుత్వాలను మలుచుకుంటూ, సామాన్యప్రజలను దోచుకుతింటూ, అవి తమ తెలివితేటలుగా చెప్పుకుంటున్నారు. సామాన్య ప్రజలతో పోల్చుకుంటే ప్రభుత్వాలు అన్నిరకాలుగా బలమైనవి. ప్రారబ్ధం ఏమిటంటే ఈనాటి ప్రభుత్వాలన్నీ[ఏపార్టీలయినా ఒకటే] తమకున్న ఆర్ధిక అంగబలాలతో, ప్రజల్ని రక్షించడానికి గాకుండా, ప్రజల్ని దగా చేయడానికి పనిచేస్తున్నాయి. దానాదీనా తేలేది ఏమిటంటే, ఏ ప్రభుత్వమైనా తనకున్న బలాన్ని, బలహీనులైన ప్రజల్ని రక్షించేందుకు గాకుండా భక్షించేందుకు పనిచేస్తుంది అని!

హిందూధర్మాన్ని[ఇది మతధర్మం కాదు, మానవధర్మం] ఆచరించకుండా, ఏ చట్టాలు చేసినా, ఏ రూల్స్ మార్చినా ఉపయోగం లేదు. సంస్కారం, ఇరుగుపొరుగు మధ్య సంబంధాలు, మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధబాంధ్యవాలను [ధర్మాలను] ఏ చట్టం, ఏ రూల్సుతో సరిదిద్దలేము. కాబట్టే, ఒకప్పుడు సత్రాలు కట్టించి బాటసారులకు భోజన, వసతులు కల్పించినా, పేదలకు దానాలు చేసినా, పండుగ నాడు తప్పని సరిగా దానధర్మలు చేసినా పుణ్యం వస్తుందని అనుకునేవారు. ఆ విధంగానైనా ప్రక్కవాడి పట్ల దయతో ఉంటాడు అని ‘పాపం,పుణ్యం’ అన్న కాన్సెప్ట్ పెట్టారు. అంతేగాని ‘ఏది పాపం, పుణ్యం చూపించు’ అంటే ఎవ్వరు చూపించలేరు. అందరు సంతోషంగా ఉంటే తాము సంతోషంగా ఉంటామని అందరి సంతోషంలో తమ సంతోషం వెదుక్కునే వారు. ఆ విధంగా సమాజహితం కోరుతూ ‘సర్వేజన సుఖినో భవంతు’ అంటూ చెప్పారు. వీటిని ఏ చట్టం నిర్దేశించలేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu