8]. ఇటూ జగన్ ని పరిశీలించినా, కేవిపి ని పరిశీలించినా….. ఇద్దరూ కూడా అధిష్టానంతో తలపడితే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియని వారు కాదు. అందునా నెం.10 వర్గపు బలం ఏమిటో, గూఢచర్య నేపధ్యం ఏమిటో, ఇప్పటికి[అంటే వై.యస్. మరణం తర్వాత] మరికొంచెం ఎక్కువే అర్ధం అవుతుంది. అయినా ఘర్షణ ధోరిణితో ఎందుకు వెళుతున్నట్లు?

ఎందుకంటే రాజీ ధోరణిని నెం.10 వర్గము, కాంగ్రెస్ అధిష్టానము entertain చేయటం లేదు, చేయదూ గనుక! తమతోనే ’చర్లాట’లాడి, తమకి 4 ½ ఏళ్ళుగా ’బుస్సు’ కొట్టి, నెం.5 వర్గం చేతిలో తము ఇంతగా చిక్కిపోవటానికి కారకుడైన వై.యస్.ని బ్రతికి ఉంటే కూడా వదిలిపెట్టి [క్షమించి] ఉండేవాళ్ళు కాదు. ఇక అందులో ఇతోధిక పాత్ర వహించిన వై.యస్. మిత్రుణ్ణీ, పుత్రుణ్ణీ క్షమించే ప్రసక్తి, వాళ్ళతో రాజీపడే ప్రసక్తి, పోనీలే అనుకుని వదిలేసే స్థితీ అస్సలుండవు. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోయాక, తిరిగి ఎవరూ ఎవర్నీ నమ్మలేరు గనుక!

అదీగాక మరణించిన వై.యస్. ఇంకా ఏమేమి చేశాడో? తమకి చెప్పినవాటిల్లో నిజాలెన్నో? అబద్దాలెన్నో? వాటిల్లో ఎవరికి, ఎన్ని, ఎంతవరకూ చెప్పాడో? ఎవరెవరితో ఏమేం వ్యవహారాలు నడిపాడో? అతణ్ణి నమ్మి తాము ఏమేమి ఎత్తుగడలు వేసారో? వాటిల్లో ఇప్పుడు ఏవి ఎన్ని రకాలుగా తయారయ్యాయో, ఏఏ ఫలితాలని ఇచ్చాయో! వెరసి తామెంతగా దగా పడ్డారో, ఎంత నష్టపోయారో? ముఖ్యంగా డబ్బూ, కాలమూ ఎంతగా నష్టపడ్డారో? ఇవన్నీ తలచుకున్నప్పుడు వై.యస్. గనుక బ్రతికే ఉంటే, ఇప్పుడు తామే చంపేసేంతగా క్రోధం పెరిగిపోయింది. అలాంటి చోట ఆ ’చర్లాట’లో వాటా ఉన్న కేవిపిని గానీ, జగన్ ని గానీ Spare చేసే పరిస్థితి, చాలా చాలా తక్కువ. ఇక నమ్మే పరిస్థితి అయితే దాదాపు శూన్యమే!

ఈ స్థితిలో కేవిపి కైనా, జగన్ కైనా…. ఆత్మరక్షణ రీత్యా కూడా…. ఘర్షణ బాట తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణ పరమ హంస చెప్పిన కథ చెబుతాను.

అనగా అనగా…..

ఓ సారి ఓ గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఓ భార్యభర్తల జంట, ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంటి కప్పెక్కి కూర్చున్నారు. క్రిందంతా నీరు, పైన వర్షం, ఈదురు గాలి! మెల్లిగా వాన తగ్గుముఖం పట్టింది గానీ వరద తగ్గలేదు. చలిగాలి వీస్తోంది. అంతలో నీటిలో నల్లటి జంతు చర్మం ఏదో కొట్టుకుపోవటం చూశారు.

భార్య “ఏమండీ! ఏదో జంతువు చర్మం నీళ్ళల్లో కొట్టుకుపోతోంది. వెళ్ళి తీసుకురండి. చలికి వెచ్చగా కప్పుకోవడానికి పనికి వస్తుంది” అంది.

భర్త కూడా సరేననుకొని వరదనీటిలో ఈదుకుంటూ వెళ్ళాడు. తీరా వెళ్ళి చర్మాన్ని తాకితే అది వొట్టి జంతుచర్మం కాదు. నీళ్ళల్లో కొట్టుకుపోతున్న ఎలుగ్గొడ్డు. అప్పటికల్లా భార్య కూడా అది జంతుచర్మం కాదని, ఎలుగుబంటి అనీ గుర్తించింది.

ఆవిడ పెద్దగా కేక వేస్తూ “ఏమండీ! అది చర్మం కాదు. ఎలుగ్గొడ్డు. దాన్ని వదిలేసి వచ్చేయండి” అని అరిచింది. అప్పటికే భర్త ఎలుగుబంటితో పెనుగులాడుతున్నాడు. అతడంత కంటే పెద్దగా కేకపెడుతూ “నేను దాన్ని ఎప్పుడో వదిలేసాను. అదే నన్ను వదిలిపెట్టటం లేదు” అన్నాడట.

ఎలుగుబంటిని వ్యసనంతో పోలుస్తూ శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది. గూఢచర్యం కూడా ఎలుగుబంటి వంటిదే. ఒకసారి దాన్ని పట్టుకున్న వాణ్ణి [వాడు స్వార్ధపరుడైనా, నిస్వార్ధపరుడైనా] అది ఇక విడిచిపెట్టదు.

కాబట్టి కేవిపి కైనా, జగన్ కైనా…. నడిచినన్నాళ్ళు ’సందట్లో సడేమియా’ వంటి గూఢచర్యాన్ని నడిపి, సంపాదించుకున్నంత సంపాదించుకున్నాక, పరిస్థితులు తారుమారైనాయి గనుక ‘ఇక మానేస్తాం’ అంటే అటు నెం.10 వర్గమూ ఊరుకోదు, ఇటు నెం.5 వర్గమూ ఊరుకోదు. తమకే నమ్మకద్రోహం చేస్తాడా అన్న కారణంగా కూడా నెం.10 వర్గం ఊరుకోదు.

ఇప్పటి వరకైతే[Sep.27,2009] ఇదే కనపడుతుంది. ఇక ఏ కారణంగా అయినా స్ట్రాటజీ మార్చుకుంటే, అప్పుడు మారిన పరిస్థితుల్ని మనం పరిశీలించాల్సిందే! జరిగిపోయిన వాటిని విశ్లేషించగలం గానీ, జరగబోయే వాటిని ఊహించలేం కదా! కాబట్టే ఏం జరిగినా జరిగే వరకూ వేచి చూడక తప్పదు. ఇదే విషయం జనవరి, 2009లో వ్రాసిన నా టపా ’రాజ, రామోజీల యుద్ధం నిజమా? నాటకమా?’ లో కూడా వ్రాసాను.

ఇక ఇటు చూస్తే…. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్థులకి పిల్లలు వారసులౌతారు. అలాగే వారి పాప పుణ్యాలకు కూడా పిల్లలు వారసులే! అందుకే మన పెద్దలు ’మనం చేసిన మంచి, మన పిల్లలకి మంచి చేస్తుందనీ. చేసిన పాపం తరతరాలని అనుభవింపచేస్తుందనీ’ అంటారు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ఆ నమ్మకాలన్నిటినీ ’ట్రాష్’ అంటూ కొట్టిపారేయించి, అవహేళన చేసి, కొన్నిచోట్ల ఈ నమ్మకాలకి విపర్యయాలు జరిగేటట్లు చేసి, ఆయా సంఘటనలని విపరీతంగానూ, నిరంతరాయంగానూ ప్రచారించి, ’రోజులు మారిపోయాయి’ అన్న దృక్పధాన్ని ప్రజలలో పెంచింది.

‘తమ పాప పుణ్యాలు తరతరాలని ప్రభావపరుస్తాయి’ అన్న నమ్మకాలు ప్రజలలో దుష్ర్పవర్తనని కట్టడి చేసేవి. అవి కూలదోయబడటంతో అవినీతి ప్రవర్తన, నేరప్రవృత్తి బాగా పెరిగిపోయాయి. పైపెచ్చు ’ఒక్కరం పేట్రేగి సంపాదిస్తే, తర్వాత పదితరాలు హాయిగా బ్రతకుతాయి. కాబట్టి ఏ గడ్డి కరిచి సంపాదించినా సరే, డబ్బు సంపాదించటం ముఖ్యం!’ అంటూ తమ అక్రమార్జనకి ’పిల్లల మీదా, కుటుంబం మీదా ప్రేమతోనే, పిల్లల కోసమే ఈ తాపత్రయం’ అన్న పాజిటివ్ కాప్షన్ పెట్టుకోవటమూ మొదలయ్యింది.

ఈ కుహనా వాదనలని, ఆత్మవంచనలని నెం.5 వర్గం ఒప్పుకోదు. కాబట్టి కూడా వై.యస్. చేసిన ’పాపం’ ’అవినీతి’ల ఫలితాలకీ జగన్ వారసుడు గాక తప్పదు. అందునా, అందులో వాటా కూడా ఉన్నందున కేవిపికీ తప్పదు, జగన్ కీ తప్పదు. వారిద్దరికే కాదు, వై.యస్. నడిపిన ’సందట్లో సడేమియా’ లో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉంటే, వారంతా తమ తమ సువర్ణముఖిలు అందుకోక తప్పదు. వై.యస్. చేసిన వాటి పర్యవసానం జగన్ కి ఎందుకు చెందుతుందీ అంటే – అది మిగిలిన రాజకీయ నాయకులకీ, కార్పోరేట్ మదగజాలకి ఒక హెచ్చరిక అన్న మాట. తాము పోయినా, తమ వెనుకనున్న పిల్లలూ, మనుమలూ అనుభవింపవలసి వస్తుందన్న భయమే ఇప్పుడు యమదండమై నెం.10 వర్గంలోని పెద్ద ఏజంట్లందరి ముందూ నిలబడి ఉంది. అలా నిలబెట్టిది నెం.5 వర్గమే.

దీనికి ఉదాహరణగా భాజపా ఒకప్పటి యంగ్ టర్క్, ప్రముఖనేత ప్రమోద్ మహాజన్ గురించి చెప్పుకోవచ్చు. భాజపాలో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు [ఫైనాన్సియల్ లాబీయింగ్] నిర్వహించటంలో అతడు దిట్ట అని పేరు. ఎక్కడ ఏ అనుమానం పుట్టిందో గానీ, ’ప్రమోద్ మహాజన్ ని అతడి సోదరుడు ప్రవీణ్ మహాజన్ తుపాకితో కాల్చి చంపాడు’ అన్న పైకారణంతో[over leaf reason] అతడి కథ ముగించబడింది. దీని వెనుక ఉన్నది నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థే! కాబట్టే తమకి అత్యంత ముఖ్యుడైన అనుచరుడు, ఆ విధంగా హత్య గావింపబడినా, భాజపాలోని అగ్రనేతలెవరూ నోరు మెదపలేదు. ఏ ఆరోపణా చేయలేదు. హత్యోదంతంపై ఏ సందేహాలూ లేవనెత్తలేదు.

అంతేకాదు, ప్రమోద్ మహాజన్ హత్య చేయబడిన తర్వాత, అతడి కుమారుడు రాహుల్ మహాజన్ మాదకద్రవ్యాల కేసులోనూ, మరితర వివాదాల తోనూ రోడ్డున వెయ్యబడ్డాడు. భార్యతో విడాకుల కేసుతో మరింత అపకీర్తి పాలయ్యాడు. అలాగే అతడి కేరియర్ కూడా అంతే వేగంగా ముగిసిపోయింది. అయినా ఎవరూ మాట్లాడలేదు. మరో ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ మనుమరాలు అతి దారిద్ర్యంలో ఉండటం. అది చూడలేక కొందరు విరాళాలు సేకరించి ఆమెకు సాయపడ్డారు.

దీని వెనుక ఏ గూఢచర్యం ఉంటేనేం, తండ్రి పాపపుణ్యాల తనయునకూ చెందటమే ఇక్కడ నడిచిన స్ట్రాటజీ! మన’కర్మ’ల ఫలితాన్ని, ఈ జన్మలోనూ, జన్మాంతరాల్లోనూ పొందుతారన్నది భారతీయుల నమ్మకం.

9]. ఇక కేవిపి ఢిల్లీలో లాబీయింగ్ వ్యవహారంలో…. ‘తాము ఎవ్వర్నీ ఢిల్లీకి పిలవలేదనీ, అతడే వచ్చాడనీ’ వీరప్ప మొయిలీ అన్నట్లు 09/09/09 పత్రికల్లో వచ్చింది. సెప్టెంబరు 7 నుండి 10 వ తేదీ వరకూ కేవిపి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా పెద్దతలకాయల్ని కలవటంలో మునిగిపోయాడు. మొదటగా ’స్నేహితుడు మరణించినపుడు, అతడి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి’ వచ్చాడన్న పైకారణంతో సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరగా, మొదట అహ్మద్ పటేల్ నీ, మరొక నేత ?] ని కలిసిన తర్వాత రావల్సిందిగా చెప్పబడిందట.

ఈ విషయం ఆంధ్రజ్యోతి వ్రాసింది. షరా మామూలుగా ఈనాడు, వార్తల్ని దాయటం, పెంచి లేదా తగ్గించి వ్రాయటం, వీలయినంత వక్రీకరించి వ్రాయటం…. చేస్తుంది కాబట్టి, ఈ వార్త ఈనాడులో రాలేదు. ప్రధానమంత్రితో 45 నిముషాలు, 10 జనపధ్ లోకి సాయంత్రం 4.50 కి వెళ్ళి 6.30 తిరిగి రావటం ఇత్యాది విశేషాలున్నా ఈ ’జోరుగా లాబీయింగ్’లో, అంత సుదీర్ఘ సమావేశాల్లో కేవలం ’వై.యస్. కుటుంబసభ్యుల క్షేమం గురించిన ఆరా మాత్రమే ఉందా? అంత Concern ఉంటే తర్వాత ఆ కుటుంబం పట్ల డీల్ ఇలా ఉంటుందా?

’వై.యస్. సతీమణి షాక్ నుండి తేరుకున్నారా? సాధారణ జీవితంలోకి వచ్చారా? మీరు వారికి పూర్తి సహాయసహకారం అందించండి’ అని చెప్పారు. ‘రాష్ట్రరాజకీయాల గురించి వివరాలడిగారు. నేను నాదగ్గర ఉన్న సమాచారం ఇచ్చాను’ అని కేవిపి విలేఖరులకి చెప్పాడు. ప్రధానమంత్రుల Appointments 5 నిముషాలు, 10 నిముషాలు దొరికితే ఎక్కువ. అలాంటిది, అంత సుదీర్ఘ సమయం పాటు ఇచ్చిన Appointmentsలో కేవలం వై.యస్. సతీమణి ఆరోగ్యం గురించి అడగటానికి పట్టే సమయం మహా అయితే 2 నిముషాలు లేదా 5 నిముషాలు. రాష్ట్ర రాజకీయాల గురించి సైతం, ఇతడొక్కడినే ఎందుకు అడుగుతారు? ఒక్కరినే అడిగితే ఆ ఒక్క కోణంలోని విషయాలే కదా తెలుస్తాయి? ఎవరినడిగితే వాళ్ళు, తమ వెర్షన్ మాత్రమే చెబుతారు కదా!

కాబట్టే కదా కాంగ్రెస్ వారికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని మార్చాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా, కేంద్రం నుండి పరిశీలకులు వస్తుంటారు? మరి కేవలం కేవిపి నుండి ఏం సమాచారం తీసుకుంటారు? సమాంతరంగా పొన్నం ప్రభాకర్, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు గట్రా గట్రా బృందాలు వెళ్ళినా, వాళ్ళు జగన్ జిందాబాద్ అనే…. గట్టిగానో, నెమ్మదిగానో చెప్పారని వార్తలొచ్చాయి. వై.యస్. బ్రతికి ఉన్నంత వరకూ అధిష్టానం అతడికిచ్చిన సీన్ చూసి, అతడు పోయిన తొలి రోజుల్లో నడిచిన వ్యవహారాలు చూసి, అధిష్టానం వై.యస్.కి Favorable అనుకొని, ప్రమాదం యాదృచ్చికం అనుకొని, ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పి.లూ, ’జగన్ జిందాబాద్’ అంటూ అరిచి కేకలు వేసారు. మంత్రుల్లో చాలామందిదీ ఇదే కేసు.

కాకపోతే అందరిలో, తమ పెట్టుబడులూ, ఆదాయాలు గురించిన ఆందోళన కూడా ఉంది. తీరా అధిష్టానపు వైఖరి చూసాక మెల్లిగా గొంతులు తగ్గిపోయాయి. ఆపైన ’అధిష్టానం ఏం చెప్పినా ఒకే. మేం శిరసావహిస్తాం’ అనేసారు. ‘అధిష్టానాన్ని ఎదిరిస్తే ఫ్యూజులు లేచి పోతాయ్’ అని తెగేసారు. ఇక ‘కేవిపి ని మేం పిలవలేదూ, అతడే వచ్చాడు’ అని మొయిలీ చెప్పినట్లు సెప్టెంబరు 9 న పత్రికల్లో వచ్చింది కదా! అయితే వై.యస్. సంతాప సభకోసం సెప్టెంబరు 11 న హైదరాబాద్ బయలు దేరిన కేవిపిని, శనివారం అంటే 12 కల్లా అందుబాటులో ఉండమని ఆదేశించారని కూడా పత్రికల్లో వచ్చింది. తాము పిలవకుండా కేవిపినే, మిత్రుడి కుమారుడి కోసం లాబీయింగ్ చేయటానికి వస్తే ’అందుబాటులో ఉండాలనే ఆదేశాలెందుకు’ వస్తాయి?

అంటే – ఏకే ఆంటోనీ, ప్రణబ్, మొయిలీ, అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీలని కలిసి విడతల వారిగా జరిపిన సుదీర్ఘ చర్చలలో ఏం జరిగింది?సమాచార సేకరణ అంటే ఇంటరాగేషనేనా?

10]. అక్కడ చర్చలు జరిపిన కేవిపి, హైదరాబాదు కి వచ్చి… విలేఖరులతోనూ, తమ మద్దతుదారులైన మంత్రులూ, ఎం.ఎల్.ఏ.లతోనూ, “జగన్ కి అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు. ఏమైనా అధిష్టానం చేతుల్లోనే ఉంది” అంటూ ప్రకటించినప్పుడల్లా…. సమాంతరంగా మనీష్ తివారీ, అభిషేక్ సింఘ్వీ, జయంతీ నటరాజన్ వంటి ఏఐసిసి ప్రతినిధులు, పత్రికావిలేఖరులతో ’ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రివర్గం ఉంది, పటిష్టమైన ప్రభుత్వం ఉంది’ అని ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగాయి. దీన్నే ’బెదిరింపు ధోరణి’గా తర్వాత ప్రచారం జరిగింది. రాజీ సూత్రాల గురించి కూడా వార్తలొచ్చాయి. అయితే ‘అధిష్టానం ఆలోచన కేవిపి చెవిలో’, ‘ఏం జరిగినా జగన్ ప్రత్యక్ష జోక్యం తోనే’ వంటి, ‘జగన్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న’ వార్తలు కొన్ని పత్రికలలో వచ్చాయి. ’ఏం లేదు. అధిష్టానం జగన్ కు అనుకూలంగా లేదు’ అని కొన్ని పత్రికల్లో.... ఇలా పరస్పరం విరుద్ధ వార్తాలు ప్రచారం అయ్యాయి.

అంతేకాదు, హెలికాప్టర్ ప్రమాదంలోని సివిఆర్ విశ్లేషణ గట్రా సాంకేతిక అంశాల విషయంలో లాగానే, జగన్ విషయం లో కూడా, ఒకే పత్రికలో సైతం ఈ రోజు వచ్చిన వార్తకు విరుద్దంగా మర్నాటి వార్తలు వచ్చాయి. ఇదంతా ఎంతో గందరగోళాన్ని…. ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో సృష్టించింది. పనిగట్టుకుని మీడియా ఎందుకిలా పరస్పర విరుద్ధవార్తలు ప్రచారించింది? దాని వెనుక ఏదో ప్రయోజనం ఉండాలి కదా? పోనీ ‘మీడియా ఏ విషయంలోనైనా ఇలాగే రకరకాలు వార్తలు ప్రచారించి డబ్బు చేసుకుంటుంది’ అనుకోవడానికి, వై.యస్.ని ’దేవుణ్ణి’ చేసేటప్పుడు, మీడియా మొత్తం కోరస్ గానే చేసింది కదా?

11]. ఇక మొయిలీ లాంటి సీనియర్ల ప్రవర్తన కూడా అసహజంగానే ఉంది. 3 వ తేదీ వై.యస్. మరణ వార్త ధృవీకరణ అనంతరం, రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో మొయిలీ ’ఇది రాజ్యాంగ అవసరాల దృష్ట్యానే. తర్వాత సి.ఎల్.పి. సమావేశం ఉంటుంది’ అని చెప్పాడు. నాల్గవ తేదీ వై.యస్. అంత్యక్రియల తర్వాత, అతడు ఢిల్లీ తిరిగివెళ్ళిపోయాడు. Sep. 6 వ తేదీ ఆదివారంనాడు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సోనియాగాంధీతో అతడు అత్యవసర భేటీ జరిపాడు. అదే సమయంలో ‘మీడియా కి దూరంగా ఉండమని మేడం ఆదేశం. అందుచేత మీడియాకి మొహం చాటేసిన మొయిలీ!’ గురించి వార్తలొచ్చాయి.

‘Money makes many things!’ అన్నది జగమెరిగిన సత్యమే! రాజకీయాల్లో ప్రవేశించి, టిక్కెట్లు కొనుక్కుని, ఆ పైన ఖర్చుపెట్టి ఎం.ఎల్.ఏ., ఎం.పి. లయ్యేది – మంత్రులయ్యేందుకు, తిరిగి సంపాదించుకునేందుకే. ఎందుకంటే అన్నీ వ్యాపారాల కంటే రాజకీయ వ్యాపారం లాభదాయకం, మిగిలిన వ్యాపారాలకి ఆధారభూతం. కాబట్టి “వై.యస్. ఆడిన ’సడేమియా’ నాటకంలో ’డబ్బు తినేసి’ మొయిలీ కూడా తమకేమైనా ’బుస్సు’ వేసాడా?" అన్న అనుమానం అధిష్టానానికి రావటం సహజం. అతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మరి! కాబట్టే అతడి మీద ఆధిష్టానం ఆగ్రహం వెలిబుచ్చిందన్న వార్తలొచ్చాయి. అలాగే కోర్ కమిటీ మీటింగ్ కి అతడికి పిలుపు రాలేదన్న వార్తలూ వచ్చాయి.

12]. మరో ప్రక్క వై.యస్. ’సడేమియా’ లో భాగంగా, తనకు ఫలానా ఫలానా వారు ఇబ్బంది కలిగిస్తున్నారంటే…. నిజమేననుకుని తామే కొందర్ని నలగ్గొట్టారు. అలాంటి వారిలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఒకడు. అందుకే అతడికి 2009 ఎలక్షన్లలో ఎం.పి. టిక్కెట్ రాలేదు. రాజ్యసభకీ, అందునా తక్కువ కాలపరిమితి ఉన్న సీట్ కీ వెళ్ళాల్సి వచ్చింది. [ఇదే వ్యక్తి 2004లో కాంగ్రెస్ గెలవగానే, తనకిక సీన్ వస్తుందనుకొని అలకలు పోవడం గురించి, ‘భారత రాజకీయరంగంపై నకిలీ కణికుడి సుదీర్ఘ కుట్ర’లో వివరించాను] అంతేకాదు, వాకాడు సమీపంలో చావు అంచుదాకా వెళ్ళి వచ్చాడు. [నక్సల్స్ ల్యాండ్ మైన్ పేల్చారు. నిజానికి నక్సల్స్ హైకమాండ్ లో దాదాపుగా కీలక వ్యక్తులందరు తెలుగువారే. ఇది ఎలా సాధ్యం? అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా నక్సల్స్ ను కట్టడి చేయలేని ఆంధ్రప్రభుత్వం వై.యస్. హయాంలో నక్సల్స్ ను రాష్ట్రం నుండి తరిమేసి, కొందరి నక్సల్స్ ను చంపించి, మొత్తానికి హీరో అయ్యాడు. ఇదెలా సాధ్యం?] ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్న నేదురుమల్లి, అర్జంటుగా ఢిల్లీ నుండి పిలుపురాగా, ఆఘమేఘాల మీద Sep.16 న ఢిల్లీ వెళ్ళాడు.

ఆంధ్రజ్యోతి వ్రాసిన, డి.డి.[సప్తగిరి] ప్రసారం చేసిన, ఈ వార్త ఈనాడులో కనబడలేదు. ఎందుకంటే ఈనాడు వార్తల్ని ప్రజల కోసం వ్రాయదు. ప్రతీ వార్తని…. వక్రీకరించో, దాచో, పెంచో, తగ్గించో, ఏమైనా సరే, నియంత్రించి వ్రాయటంలో ఈనాడు ప్రయోజనాలు ఈనాడువి. నకిలీ కణిక వ్యవస్థలోనూ, నెం.10 వర్గంలోనూ కీలక వ్యక్తి అయిన రామోజీరావు తన స్ట్రాటజీలకి అనుగుణంగానే ప్రతీ అక్షరమూ వ్రాయిస్తాడు. ఇంతకీ నేదురుమల్లిని ఢిల్లీ పిలిపించింది ఎందుకంటే…. వాస్తవాలని తెలుసుకోవటానికి. వై.యస్. అప్పుడు చెప్పిన కథని, ఇప్పుడు నిర్ధారణ[Triangulate] చేసుకోవడానికి!

13]. ఇదే కేసు కే.కే. ది కూడా! ఈ రాజకీయ నాయకుడికి అరిషడ్వర్గాలు, అహంకారాలు ఎక్కువే. Off course, ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో అత్యధికులు ఇలాంటివాళ్ళే! కోపం నరం తెగిపోవటానికి, వీళ్ళకేమీ ’సందట్లో సడేమియా’ నడిపే పరిస్థితులు లేవు. అలా పరిస్థితులు కలిసి రావు కదా! ఇక ఇలాంటి వారి కుమారులు కూడా, తమ తండ్రుల కున్న పరపతి రీత్యా, తండ్రుల నుండి పుణికి పుచ్చుకున్న వారసత్వాల రీత్యా, అరిషడ్వర్గాలనీ, అహంకారాలనీ బాగానే తలకెక్కించుకుంటారు.

అందునా వై.యస్. చేత ప్రేరిపితులైన అధిష్టానం, నలగ్గొట్టిన మరో నాయకుడు కె.కె. దాంతో ఈ కుటుంబానికి ఉన్న వ్యాపారాలలో[Real Estates etc.] ఒత్తిళ్ళకి తక్కువేం లేదు. ఇక వ్యాపార భాగస్థులు ఆక్రమ సంబంధాలు, అక్రమార్జనలూ గలవాళ్ళు. వాళ్ళమధ్య వైషమ్యాలూ మామూలే. ‘వెనుక మేమున్నా మని’ భరోసా ఇస్తే, ’పిసిసి ప్రెసిడెంట్ కుమారుడవైతే నాకేంటి?’ అనే రెచ్చగొట్టే ధోరణి భాగస్థుల్లో కనిపించేటట్లు చేయడం సులభం. ఇటు కె.కె. కుమారుడిలో ‘పిసిసి ప్రెసిడెంట్ కొడుకుని. నన్నే లెక్కచెయ్యవా?’ అనే అహంకారాన్ని రెచ్చగొట్టటం మరింత సులభం. వెరసి ఓ అనుభవం లేని, గూఢచర్యం తెలియని, పిసిసి అధ్యక్షుడి కొడుకుని హత్యకేసులోకి దింపటం నెం.10 వర్గానికి పెద్ద విషయం కాదు. అప్పుడు వై.యస్.ని నమ్మి, అతడి కోసం కె.కె.ని నలగ్గొట్టారు. ఇప్పుడందులో వాస్తవాలని తెలుసుకునేందుకు, అంటే నిర్ధారణ[Triangulate] చేసుకునేందుకు కె.కె.ని దగ్గరికి తీసారు. ఆ ’హల్ చల్’నే కె.కె. చూపిస్తున్నాడు.

14]. ఇలాంటి నలుగుడుకి గురయ్యే మర్రి శశిధర రెడ్డి సైలెంటైపోయాడు. ఒత్తిడికి గురై పిజేఆర్ గుండెపోటుతో మరణించాడు. అతడి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చేటప్పుడు తనకు సాగిలపడేటట్లు చేయించుకున్నాడు వై.యస్.!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

అమ్మఒడి , నిజమో కాదో కానీ, టపాలను మత్రం వదలకుండా చదివిస్తున్నారు. బాగున్నాయి :)

not 100% truth
but some thing is truth

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

బాగుంది! ఎలుగుబంటి (వ్యసనం) కధ మరీ బాగుంది!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu