యదార్ధం చెప్పుకోవాలంటే ఇప్పటి రాజకీయనాయకులూ, బడా కార్పోరేట్ సంస్థలూ, మీడియా తోడుదొంగలు. రాజకీయ నాయకుల్లో చాలామంది కార్పోరేట్ సంస్థల అధినేతలు, మీడియా కూడా అదే మాదిరి. ఇక రాజకీయ నాయకులు ఇప్పుడు మీడియా అవతారం ఎత్తేసారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడి పేరిట సాక్షి పత్రిక పెట్టబడటం అందరికీ తెలిసిందే. బినామీ పేరుతో సూర్యలాంటి పత్రికలున్నాయని ఓ దశలో ఇతడి తోటి ఇతర పార్టీ రాజకీయనాయకులు దుమ్మెత్తి పోశారు. కరుణానిధి, జయలలితలకు స్వంత టీవీ ఛానెళ్ళున్నాయి. మన రాష్ట్రంలోకి టీవీ ఛానెళ్ళు[అవి ఛానెళ్ళు కాదు, బాకాలు] సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ప్రముఖ రాజకీయ నాయకులకో, వారి సమీప [కుటుంబ సభ్యులు] బంధువులకే ప్రైవేట్ టీవీ ఛానెళ్ళలోనూ, పత్రికల్లో వాటాలున్నాయి. ఆంధ్రజ్యోతి లేదా మరో పత్రికలో చంద్రబాబుకు వాటాలున్నాయని ఓ వినికిడి. సామాన్యులకు నిజనిజాలు తెలుసుకొనే అవకాశం లేదు. ఏ ఇంటలిజెన్స్ సంస్థా, ఏ స్వచ్ఛంద సంస్థా ఇలాంటి నిజాలు వెలికి తీయదు. దాంతో పాపం సామాన్య జనం, ఏం చేయగలదు, గుడ్లప్పగించి జరిగేవి చూడటం తప్పా?

ఈ సంధర్బంలో ఓ ఆసక్తికర అంశాన్ని గుర్తు చేయటం సమంజసంగా ఉంటుంది. రామోజీరావు, వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఇడుపుల పాయ Vs మార్గదర్శి వ్యవహారంలో యుద్ధం నడుస్తున్న నేపధ్యంలో ఓ రోజు ’ది హిందూ’ పత్రిక ఎన్.రామ్ ఈనాడు పత్రిక తొలిపేజీలో ఇలా ప్రకటించాడు. “వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఇలా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మీద దాడులు చేయకూడదు. సమస్యలు పరిష్కరించుకొనే పద్ధతి ఇది కాదు. ముఖ్యమంత్రికి, మీడియా వ్యక్తి అయిన రామోజీ రావుతో ఏమైనా సమస్యలుంటే మాటలు [చర్చలు] ద్వారా పరిష్కరించుకోవచ్చు. రామోజీ రావు ’సాప్ట్ గోయింగ్ మాన్’ వై.ఎస్.ఆర్, ఆయన దగ్గరికి వెళ్ళచ్చు, మాట్లాడు కోవచ్చు. వై.యస్.ఆర్.కి ఏవి కావాలన్నా రామోజీ రావు గారు [సాయం?] చేయగలరు. వై.యస్.ఆర్. ఆలోచించగలరని ఆశిస్తాను.”

ఇలాంటి ప్రకటన ఈనాడులో వస్తే దాని అర్ధం ఏమిటి? ఈ ప్రకటనని మీరు ’ఈనాడు’ ఫిబ్రవరి, 2007 సంచికల్లో చూడవచ్చు.[ఖచ్చితంమైన తేదీని మరచిపోయి నందున ప్రచురించలేక పోతున్నందున మన్నించాలి.] మరో అంశం ఏమిటంటే ది హిందూ పత్రికలోని ఎన్.రామ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలోని రామ్ నాధ్ గోయంకాలు CIA ఏజంట్లుగా 1980 ల్లోనే పేరుగాంచారు.

సరే మళ్ళీ ఎన్.టి.ఆర్. దగ్గరికి తిరిగివద్దాం. 1981 లోనో 1982 లోనో ఎన్.టి.ఆర్. తనను తాను సంసారబంధాన్ని, సంపదనీ, కుటుంబాన్నీ త్వజించివచ్చిన సర్వసంగ పరిత్యాగిగా, సన్యాసిగా ప్రకటించుకున్నాడు. అందుకే తాను కాషాయ వస్త్రాలు ధరించానని చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఖాఖీ దుస్తులేసుకొని కార్మిక శ్రామికుణ్ణంటూ మరో ’షో’.

అయితే 11 ఏళ్ళ తర్వాత [1992 తరువాత] 1993 లో ఈ కాషాయాంబర ధారి, ఈ సన్యాసి తన 70 ఏళ్ళ వయస్సులో లక్ష్మిపార్వతి ని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం లక్ష్మి పార్వతీ, ఎన్.టి.ఆర్.లు ఇద్దరికీ ద్వితీయమే. ఎన్.టి.ఆర్. భార్య చనిపోయిన వ్యక్తి అయితే లక్ష్మీ పార్వతి భర్తకి విడాకులిచ్చిన వ్యక్తి. ఎన్.టి.ఆర్. తొలి వివాహం 1942 లో, అతడి మేనమామ కూతురైన బసవరామ తారకంతో, అతడికి 20 ఏళ్ళ వయస్సులో జరిగింది. ఇతడికి దశాధిక సంతానం కూడాను. ఆవిడ మరణానంతరం కొన్నేళ్ళు తర్వాత, ఈ లక్ష్మీ పార్వతి అతడి జీవిత కథా రచయిత్రిగా అతడి జీవితంలో ప్రవేశించి చివరికి జీవిత భాగస్వామి అయ్యింది. ద్వితీయ వివాహం తర్వాత మూడు ఏళ్ళకి 1996, జనవరి 18 న ఎన్.టి.ఆర్. చనిపోయాడు. ఆ సందర్భంలో ఎన్.టి.ఆర్. కుమారుడు హరికృష్ణ, లక్ష్మీ పార్వతి సంతానా న్నాశించి తన తండ్రికి ఆ వయస్సులో ’స్టెరాయిడ్సు’ వాడిందనీ, అందుచేతే ఎన్.టి.ఆర్. మరణానికి చేరువయ్యాడనీ ఆరోపించాడు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ – ఓ సన్యాసి, ఓ సర్వసంగపరిత్యాగి జీవితంలో ఎలాంటి పరిణామం ఇది? ఈ లెక్కన అసలు ’సన్యాసం’, ’సర్వసంగ పరిత్యాగి’ ఇలాంటి పదాల నిర్వచనాలు, అర్ధాలు మార్చి చెప్పుకోవాలెమో!

మరో వాస్తవం ఏమిటంటే రాజకీయ రంగంలో ’నియంత్రణ లేని నాలుక’కి అతడే ఆద్యుడు కావటం. అతడి రాజకీయ ప్రవేశపు తొలి రోజుల్లో, అతడు కాంగ్రెసు వాళ్ళని “కొజ్జా”లనీ, "కుక్క మూతి పిందెల”నీ ఇంకా ఇలాంటి పదాలతోనే తిట్టేవాడు. 1981, 1982 ల్లో తరచుగా [దాదాపు రోజూ] ఎన్.టి.ఆర్. కాంగ్రెసు వాళ్ళని నీచ భాషలో తిట్టేవాడు. రెట్టింపు నీచ భాషలో మర్నాడు జలగం వెంగళరావు. ఎన్.టి.ఆర్. నీ, అతడి పార్టీనీ తిట్టేవాడు. మర్నాడు ఎన్.టి.ఆర్. ఆ మర్నాడు జలగం వెంగళ రావు. రోజురోజుకీ భాష మరింత నీచ స్థాయికి పడిపోయేది. ఇదంతా ప్రతీ రోజూ ఈనాడు పత్రికలో రామోజీరావు మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో వేసేవాడు. ఆ విధంగా జయప్రదంగా ఈ తోడుదొంగలంతా కలిసి రాజకీయ రంగాన్ని అప్పటికి ’ఉందా లేదా’ అన్నట్లున్న హుందాతనం నుంచి అచ్చమైన డ్రైనేజ్ స్థాయికి తెచ్చేసారు.

ఈ స్థితి మనకి బాగా తెలిసిన పరమానందయ్య గారి శిష్యులు కథని కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన కథే అయినా మరోసారి గుర్తు తెచ్చుకోదగింది.

తెలుగు సాహిత్యంలో పరమానందయ్య గారి శిష్యుల కథలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న కథలు. పరమానందయ్య గారికి ఏడుగురు [పన్నెండు మందని కొందరంటారు] శిష్యులు. వీళ్ళు అమాయకులు, లోకఙ్ఞానశూన్యులు. [శాపగ్రస్తులైన తాపసులు] వీరు తమ అఙ్ఞానంతోనూ అమాయకత్వం తోనూ గురువుగారినీ, గురుపత్నినీ ఇబ్బందుల పాలు జేస్తూ ఉంటారు. అయితే ప్రతీసారి ఈ ఇబ్బందులు గురువు గారికి మేలే చేస్తుంటాయి.

ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్న భోజనం చేసి కాస్సేపు నడుం వాల్చాలను కుంటారు. తన శిష్యుల్లో ఇద్ధరిని పిలిచి తన కాళ్ళు పట్టవలసిందిగా ఆఙ్ఞ ఇచ్చి నిద్రకుపక్రమిస్తాడు. శిష్యులిద్దరూ భక్తిగా గురువు గారి కాళ్ళుపిసకటం మొదలు పెడతారు. ఆ మర్ధనా సుఖానికి గురువు గారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కాళ్ళ పడుతున్న శిష్యుల్లో ఒకడు తను వత్తుతున్న గురువు గారి కాలును మురిపెంగా చూసుకొంటూ “నేను ఒత్తుతున్న గురువుగారి కాలు చూడు. ఎంత బాగా మర్ధనా చేసానో. మిలమిల్లాడుతోంది” అన్నాడు.

రెండో వాడు “ఏడిశావ్ లేరా! నా కాలు చూడు. ఎలా తళతళ్లాడు తుందో? నేనే బాగా మర్ధనా చేసాను” అన్నాడు.

మొదటి వాడికి చిర్రెత్తు కొచ్చింది. “కాదు. నాకాలే మెరుస్తోంది. నీకాలు వికారంగా ఉంది” అన్నాడు కోపంగా.

రెండోవాడికి ఇంకా మండుకొచ్చింది. “నోరు ముయ్యి. నీకాలు చెత్తది. నా కాలు బంగారం” అన్నాడు గురువు గారి కాలుని చేత్తో నిమిరుతూ.

మొదట వాడు కోపంతో రొప్పుతూ “నువ్వు నా కాలుని అవమానించావు. చూస్కో నేనేం చేస్తానో?" అంటూ రెండోవాడు ఒత్తుతున్న గురువుగారి కాలిని ఒక్కటి కొట్టాడు.రెండో వాడు అంతకంటే కోపంతో “నా కాలునే కొడతావా? చూస్కో నీ కాలుని నరికేస్తాను” అంటూ గొడ్డలి తెచ్చాడు.

మొదటి వాడు “నీ కాలుని మాత్రం నే వదులుతానా?" అంటూ కత్తి పట్టుకొచ్చాడు.

ఇద్దరూ కలిసి గురువు గారి కాళ్ళని కొట్టటం అయిపోయి నరికేందుకు సిద్ధ పడ్డారు. ఈ గొడవకు నిద్ర లేచిన గురువు గారు ఇద్దరి అఘాయిత్యాల్ని ఆపమంటూ గావుకేక పెట్టారు.

తర్వాత ఆయన సహనంగా ఇద్దరు కలిసి తన కాళ్ళనే బాధించిన విషయాన్ని బోధపరచి వారిని వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేశాడు.

అలా, పరమానందయ్య గారి శిష్యుల్లాగా ఎన్.టి.ఆర్., ఆనాటి కాంగ్రెసు నాయకులూ [ఎన్.టి.ఆర్.తో సహా వీళ్ళేవరూ పరమానందయ్య గారి శిష్యుల్లా అమాయకులు కాదన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.] కలిసి తమ శక్తి వంచన లేకుండా రాజకీయ రంగాన్ని భాషా విలువల్తో సహా భ్రష్ఠు పట్టించారు. ఏ మేధావీ, ఏ మీడియా కూడా పరమానందయ్య గారిలా సదరు రాజకీయ నటనాయకుల్ని గానీ, ప్రజలని గానీ ఈ భ్రష్ఠత గురించి వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేయలేదు.

దానితో జయప్రదంగా సినిమాల్లో మాస్ పేరిట దిగజారుడు తనాన్ని పెంచి షోషించిన ఎన్.టి.ఆర్. అదే దిగజారుడు తనాన్ని భాషతో సహా రాజకీయాల్లోకీ పట్టుకొచ్చాడు.

ఇలాంటి పరిస్థితుల్లో నుండే ఎన్.టి.ఆర్. 1983 లో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే కొద్ది వ్యవధీలోనే అతడి ప్రజాకర్షణ రంగు వెలిసేట్లు కనబడింది. ఎందుకంటే సినిమాల్లో ఒంటి చేత్తో వందమందిని తన్ని పారెయ్యటం, అన్ని సమస్యలనీ సమర్ధంగా పరిష్కరించేయటం, లక్ష్యాలని అద్భుతంగా సాధించేయటం, అసాధ్యాలని అలవోకగా సాధ్యం చేయటం లాంటివన్నీ చూడటానికి అలవాటు పడిన ప్రజలు ’ఆ సినిమా హీరో’ నుండి ఎక్కువ ఆశించారు. దాంతో ఇమేజ్ కరగటం మొదలయ్యింది. దీన్ని నివారించి, అతడి ఇమేజిని పెంచేందుకు, దాని తోనే ఇందిరా గాంధీనీ డామేజ్ చేసేందుకు మరో నాటకం రూపుదిద్దుకుంది.

అప్పటికి తెదేపాలో నెంబర్ టూ [అట] హోదాలో నాదెండ్ల భాస్కర రావు ఉండేవాడు. ఈతడు అందుకు ముందు కాంగ్రెసు పార్టీలో ఉండేవాడు. అలాంటి నాదెండ్ల భాస్కర రావు 1984 ఆగస్టు 16 న అప్పటికి 1 సంవత్సరం 8 నెలలు వయస్సున్న ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కుట్రపన్ని కూలదోసాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్, నాదెండ్ల భాస్కర రావుతో కుమ్మకై, రాజ్యాంగలొసుగుల్ని ఆధారం చేసికొని ఎన్.టి.అర్.ని తొలగదోసి నాదెండ్ల భాస్కరరావుని సి.ఎం.ని చేశాడు. అప్పటి మీడియా, ప్రత్యేకించి ఈనాడు ఈ రాజ్యాంగ లొసుగుల మీద మండిపడింది. [రాజ్యాంగం, దాని నిర్మాణం, దానిలోని లొసుగులు, గురించి తర్వాత చర్చిద్దాం.] అంతేగాక రామ్ లాల్ నీ, నాదెండ్ల భాస్కర రావునీ అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్న కాంగ్రెసుకీ, ఇందిరా గాంధీకి ఏజంట్లుగా వర్ణిస్తూ మీడియా, ఈనాడు దుమ్మెత్తి పోసాయి. ఈనాడు తొలి పేజీలో గవర్నర్ రామ్ లాల్ ’ఇతడు రామ్ లాల్ కాదు రావణ్ లాల్’ అంటూ కార్టూన్లు వేసింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, ప్రజాస్వామికంగా ఎన్నికైన ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూలదోయటానికే ఈ పన్నాగం పన్నిందంటూ సంపాదకీయాలు వ్రాసింది. జాతీయ స్థాయి నాయకులు అందరూ వచ్చి మద్దతూ గా ఎన్.టి.ఆర్.తో పాటు రాష్ట్ర పర్యటనలు చేస్తూ ఎన్.టి.ఆర్.కి మరింత ఇమేజ్ ఇచ్చారు. దాదాపుగా జాతీయ స్థాయిలో మీడియా దీనికి మరింత ప్రచారం ఇవ్వడంతో ఎన్.టి.ఆర్. జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తరువాతి కాలంలో నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ అయ్యేందుకు ఉపయోగపడిన వాటిలో ఇది ఓ కారణం. కొన్ని రోజుల పాటు సాగిన ఈ డ్రామా బహుశః కేంద్రాన్ని, నిఘా సంస్థలనీ AP లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించేలా చేశాయి కాబోలు, కేంద్రప్రభుత్వం రామ్ లాల్ ని గవర్నర్ గా వెనక్కి పిలిచి శంకర్ దయాళ్ శర్మని గవర్నరుగా AP కి పంపింది. సెప్టెంబరు 15,1984 న శంకర్ దయాళ్ శర్మ, ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని పునరుద్దరించాడు. అయితే 1984 లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటుగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళెందుకు సి.ఎం.గా ఎన్.టి.ఆర్. నిర్ణయించాడు. నాదెండ్ల భాస్కరరావు గొడవకి తాజాగా ప్రజల తీర్పు కోరతానని ప్రకటించాడు. అయినప్పటికీ అప్పటి ఎలక్షన్లలో ఎన్.టి.ఆర్.కీ ఓట్లు దక్కింది గతంలో పోలిస్తే తక్కువని కొన్ని సర్వేల భోగట్టా ఉండింది.

ఈ నెల రోజుల నాదెండ్ల డ్రామాలోనూ, గవర్నరుగా రామ్ లాల్ ప్రవర్తన, ఇతరులు అంటే నాదెండ్ల, అతని మద్దతుదారుల ప్రవర్తన, దానికి తగినట్లుగా ఈనాడు వ్రాతలూ విమర్శలూ, కేంద్రప్రభుత్వాన్ని రామోజీ రావుపై దృష్టి కేంద్రీకరింపచేశాయి. అప్పటికే దేశంలో దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విదేశీ హస్తాల్ని, స్వదేశీ హస్తాల్ని అనుమానిస్తున్న కేంద్రాప్రభుత్వానికి, నిఘా సంస్థలకీ రామోజీ రావులో ’అసాధారణం’ కనబడింది. ఇది అక్టోబర్ 31,1984 న ఇందిరాగాంధీ హత్యకి దారితీసింది. 1992 తర్వాత సదరు రామ్ లాల్ బి.జె.పి. పార్టీలో చేరాడు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం ’మామూలు’ విషయమే. అలాగే ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి అనుకూలంగా లేదా ఉన్న పార్టీకి ద్రోహం చేయడం కూడా ’మామూలు’ విషయమే గదా! అప్పుడంటే అలాంటివి నిగూఢం గాని ఇప్పుడు బహిరంగమే కదా!

అయితే ఇందిరా గాంధీ హత్యకి పరిస్థితులు మరింతగా తోసుకురావడం వెనుక అమృత్ సర్ దేవాలయం పై ఆవిడ జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్ పైకారణం [Over leaf reason] మాత్రమే గాని, ఆవిడకి రామోజీ రావే – దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ప్రధాన బిందువు లేదా కేంద్రబిందువు అని అనుమానం రావడమే అంతర్గత కారణం [గూఢచార కారణం] అనీ చెప్పడానికి మరో దృష్టాంతం పరిశీలించండి.

తెదేపాలో నాదెండ్ల భాస్కర రావు నాటకం తర్వాత ఎన్.టి.ఆర్. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పుడే ఒక రాజ్యాంగ సంక్షోభం పత్రికా రంగానికి, రాజకీయ రంగానికి అంటే ప్రభుత్వానికి మధ్య చెలరేగింది. అది చాలా సాంకేతిక సంక్షోభం కూడాను. దీనికి మూలం ఏమిటంటే రామోజీ రావు తన పత్రిక ఈనాడులో ఒక సంపాదకీయం వ్రాయడమే. ఆ సంపాదకీయంతో ఎన్నో వివాదాలు, చర్చోపచర్చలు రేగాయి. అతడి పై విచారణ చేపట్టాలన్న మాట బయటికొచ్చింది. చివరికి అతణ్ణి అసెంబ్లీకి పిలిపించి క్షమాపణ చెప్పించాలని నిర్ణయించబడింది. ఇవాళో రేపో రామోజీ రావుని రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ఇంటలిజన్స్ సంస్థ గానీ ఆరెస్టు చేయనుందని పుకార్లు షికార్లు చేశాయి. ఏ పుకారుకీ ఆధారం లేదు. కానీ ’కర్ణపిశాచం’ వార్తలూ, ’తెలియవచ్చింది’ అన్న పేరిటా మీడియా భోగట్టాలు వచ్చాయి. రామోజీ రావు అండర్ గ్రౌండ్ కి వెళ్ళి పోయాడనీ, తర్వాత సమస్య పరిష్కరించుకున్నాడనీ కొన్ని వార్తలొచ్చాయి. సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకొని సమస్య పరిషర్కించు కొన్నాడని కొన్ని వార్తలొచ్చాయి. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరించుకున్నాడని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ సంక్షోభం తర్వాత రామోజీ రావు అర్జంటుగా అఖిల భారత పత్రికా సంపాదకుల [ఎడిటర్ గిల్డ్] సమాఖ్యకు అధ్యక్షుడై పోయాడు.

ఇలాంటి నేపధ్యంలో – ఏ నెపంతో నైనా అరెస్టు అవ్వడం అన్నది గూఢచార వృత్తినీ, వ్యవస్థనీ నడుపు తున్న వ్యక్తికి ప్రమాద సూచికే. కాబట్టే ఇందిరా గాంధీని ఇక బ్రతక నివ్వదలుచుకోలేదు ఈ నకిలీ కణికుడి వారసుడు. ఎన్.రామ్ లనో, గోయంకా లనో అనుమానించుకుంటూ కూర్చున్నంత కాలం ఫర్వాలేదు గానీ, ఏకంగా రామోజీ రావు దగ్గరిదాకా అనుమానం పాకితే ఇక ఎవ్వరినీ ఉపేక్షించకూడదన్నది ఈనకిలీ కణికుడి వ్యవస్థ యొక్క ‘ముందు జాగ్రత్త’. దాంతో ఇందిరా గాంధీ హత్య , రాజీవ్ గాంధీ ప్రధాని కావడం జరిగాయి. [ఇందులో మరింత లోతుగా చర్చ తర్వాత వ్రాస్తాను. వెంటనే వివరాలు కావాలంటే Coups On World లోని Coup On Politics …. లో చూడగలరు.]

ఇక తర్వాత సార్వత్రిక ఎలక్షన్లలో, ఆసెంబ్లీ ఎన్నికలలో [ 1989 ] ఎన్.టి.ఆర్. తెదేపా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. [అధికారంలో ఉండగా ఎన్.టి.ఆర్. కార్పోరేట్ కంపెనీలకు, నకిలీ కణికుడి కుట్రకు వ్యాపారంతో ఎంతగా తోడ్పడిందో, ’స్టడ్స్’ కంపెనీ హెల్మెట్ల వంటి దృష్టాంతాలతో విపులమైన చర్చ Coups On World లోని Coup On Business & Commercial field లో వ్రాసాను.] అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెసు అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఎన్.టి.ఆర్. మాత్రం ఇంట ఓడి రచ్చ గెలిచాడన్నట్లు కేంద్రంలో కాంగ్రెసేతర నాయకులు వి.పి.సింగూ, దేవీలాల్ వంటి వారిని కూడగట్టి నేషనల్ ఫ్రంట్ కి ఛైర్మన్ అయిపోయాడు. కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. తాను అధికారంలో ఉండగా వి.పి.సింగ్, అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి SPG భద్రతని ఉపసంహరించాడు. దీంతో 1991, మే 21 న శ్రీ పెరంబుదూరులో మానవ బాంబు ధనూ రాజీవ్ గాంధీని సులువుగా చేరుకొని హత్య చేయగలిగింది. ఈ ధనూ ఎల్.టి.టి.ఇ. బృంద సభ్యురాలు. ఎల్.టి.టి.ఇ. కి లెబనాన్ శిక్షణ ఇచ్చిందని 28/01/09 న ఈనాడు సంపాదకీయంలో వ్రాసారు. శ్రీలంకలో తమీళ ప్రత్యేక దేశం కోరుతున్న ఎల్.టి.టి.ఇ. కి లెబనాన్ లోని హమాస్ సంబంధిత ముస్లిం ఉగ్రవాద సంస్థకీ ఏమిటి సంబంధం? శిక్షణ ఇచ్చేందుకు డబ్బే కారణమైతే తీవ్రవాదం వ్యాపారమా? ఇది చెప్పడం లేదూ ప్రపంచవ్యాప్తంగా ఏ పేరుతో ఉన్నా, అన్ని తీవ్రవాద సంస్థలనీ నడుపుతుంది ఒక వ్యవస్థే నని?

వి.పి.సింగ్ SPG రక్షణ తొలిగించటం, లంకకి శాంతి సేన పంపినందుకు ఎల్.టి.టి.ఇ. రాజీవ్ గాంధీని హత్య చేయటం ఇవన్నీ మనందరం అప్పటి పత్రికల్లో పతాక శీర్షికల్లో చదివిన వార్తలు. అవన్నీ బహిరంగ నిజాలు. మరి తెరవెనుక కారణాలేమిటి? [తర్వాత టపాల్లో వ్రాస్తాను. వెంటనే కావాలంటే Coups On World లోని Coup on Policitcs &….. చూడగలరు.]
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

4 comments:

Interesting but not really believable - CBI was not so powerless to close in on Ramojirao if he was behind Indira Gandhi's murder - keeping in mind that Rajiv Gandhi ruled the country for 5 years with 2/3 majority after that (and for most part of it, VP Singh was in congress) - Ramoji Rao could never have escaped for his downfall would have hit NTR very hard. Even YSR would have tried to put him in soup in their fight, using this issue

Malakpet Rowdy గారూ,

ఒకసారి ఈ లింక్ లోని నా పాత టపా చదవండి.
http://ammaodi.blogspot.com/2009/01/2_07.html

ChadivaanandI ... Very interesting - Obviously you did a lot of research - I cant counter you unless I read about these issues thoroughly. I never read/heard about many of these things that you have been mentioning.

well written post,
ఈసారి ఉషశ్రీ గారి రామాయణం మీద పడ్డానండి, అందుకే చదవడం లేటయ్యింది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu