సాక్షిపత్రికలో నవంబరు 8న ప్రచురింపబడిన పై ఫోటోలో, గొరిల్లా తల్లి ‘కికి’ తన బిడ్డని పొదివి పట్టుకున్న తీరు చూసి, మనస్సులో మెదిలిన ఆలోచనలని, ఈ టపాలో పెడుతున్నాను.


ప్రపంచంలో ఏ ప్రాణికైనా తన బిడ్డ అపురూపం! బిడ్డకి తల్లి సర్వస్వం! అమ్మతనం కమ్మనైనది. అదే కంటితో చూడగలిగితే... భగవంతుడి ప్రేమ అంతకంటే తీయనైనది.


సాధారణంగా అందరమూ... వృత్తిలో పోటీపడి పరుగులు తీస్తుంటాం. నింపాదిగా కూర్చుంటే, మన అవకాశాలని పక్కవాళ్ళు తన్నుకుపోతారని సందేహపడుతుంటాం.


మరికొందరైతే... ప్రక్కవాడు సుఖంగా ఉన్నాడంటే, తాము కష్టాల్లో ఉన్నట్లే నన్నంతగా అసూయపడతుంటారు.


నిజానికి... ఎవరి జీవితం వాళ్లకి రహదారే! ఎందరున్నా, ఎన్ని ప్రాణులున్నా... ఎవరి జీవితం వారిది! సమాంతర రేఖల వంటిది జీవన రహదారి! ఒక రేఖ మరొక దానికి అడ్డం కాదు, మరోదానిని ఖండించదు.


ఆ సత్యం గ్రహించక... కామక్రోధలకీ, లోభమోహలకీ, ఈర్ష్యాసూయలకీ గురవుతాం.


ఎందుకంటే -


ఇన్ని కోటాను కోట్ల ప్రాణులకి ‘ఊపిరి పోసుకునేందుకు’ ఎవరికి వారికే ఓ తల్లి గర్భాన్ని స్థానంగా ఉంచిన వాడు భగవంతుడు! పుట్టగానే అమ్మ రొమ్ముల్లో క్షీరంగానో, పప్పుబద్దల్లో పిండిపదార్ధాలుగానో, గ్రుడ్డులో సొనగానో... ఆహారాన్ని, ముందుగానే సిద్ధం చేసి ఉంచేంత ప్రేమ ఆయనది! తల్లి తన బిడ్డని ఒక్క క్షణమైనా ఏమారుతుందేమో! ఆ తల్లీబిడ్డల్ని కూడా సృష్టించిన భగవంతుడు, ఆ ఒక్కక్షణం కూడా మనల్ని ఏమారడు.


మనమే... ఆ ప్రేమనీ, భద్రతనీ గుర్తించక నానాహైరానపడతాం, ప్రక్కవారిని పెడతాం!


అందుకే... అన్నీ తన మీద వదిలేసి, ఫలితం తనకర్పించేసి, పనిచేసుకు పొమ్మంటాడు శ్రీకృష్ణుడు, గీతలో!


నాకు తెలిసీ... ఇంతకంటే భరోసా మరొకటి లేదు మరి!


అందుకే, అందరికీ తెలిసినా, మరోసారి చెప్పాలనిపించి చెబుతున్నాను... ‘అమ్మతనం ఎంత కమ్మనో... భగవంతుడి ప్రేమ అంతకంటే తియ్యన!’మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

then, why u always run after Ramoji???

అజ్ఞాత గారు: రామోజీరావు మీద మీ అభిమానం చాలా విలువైనదే సుమా! వీలైతే అలాంటి ‘రాగద్వేషాలని’ దాటి చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు, ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి పనిచేయటం అనే ‘భగవద్గీత’ concept మీకు అర్ధమవుతుందేమో! :)

పొద్దు గూకులూ రామోజీ మీద ద్వేషాన్ని కుంభవృష్టిలా వర్షించే మీరు "రాగ ద్వేషాలను" దాటి చూడమనడం "ఎవరో" నీతులు వల్లిస్తున్నట్లుగా లేదూ!

:)) బాగా చెప్పారు.

హజ్ఞాత గారు, మీకు ఒకళ్ళ వాళ్ళ భాధ కలిగితే అది నలుగురికి నిజం ఇది అని తెలియచేస్తే అది ద్వేషం అవుతుందా చెప్పండి? హ్మ్..మీరు ఎదగాలండీ..లేకపోతే ఇదుగో ఇలా అరకొరగా అరదం అవుద్ది

expecting some article on sonia ,after ex-rss chief commented on sonia abt the cia.

రాజేష్ గారు: నెనర్లండి!

అజ్ఞాత గారు: కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదండి. దాదాపు రెండేళ్ళక్రితం ఇదే విషయం మీద టపాలు వ్రాసానండి. ఈరోజు టపాకాయలో అదే విషయం మీద వ్రాసాను. క్రింది లింకులు పరిశీలించగలరు.
[ 35. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా? – 1 [Jan.06, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/1.html
36. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా ? – 2 [Jan.07, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/2_07.html ]

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu