నకిలీ కణికుడి వంశంలోని తొలితరం కుటిలుడి కాలం క్రీ.శ. 1650 నుండి 1700 దాకా ఉండొచ్చు. దీనికి పది ఏళ్ళు అటూ ఇటూ అయినా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే అతడి కాలాన్ని గురించిన ఈ అంచనా ఖచ్చితత్వంతో [accuracy] కూడినది కాదు. అది అంచనా మాత్రమే. అయితే తానీషా కాలంనాటి వాడన్నది మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకు నిస్సందేహంగా చెప్పవచ్చు ఇంతకు ముందు టపాలు భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర –11 [తానీషా ‘కల’ నిజమా, నాటకమా?], భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర –12 [తానీషా ‘కల’ నాటకమే], భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర –13 [తానీషా ’కల’ నాటకానికి దర్శకుడు] లో చెప్పాను. సౌలభ్యం కోసం ఈ నకిలీ కణికుడి వంశ మూలకర్తని, తొలితరం కుటిలుణ్ణి, ‘నకిలీ కణిక1 ‘ అని పిలుస్తాను.

బహుశః ఇతడు 1650 AD నాటికి బాల్యంలో ఉండి ఉంటాడు. అప్పటి రాజకీయ నేపధ్యం ఏమిటంటే – తానీషా పూర్వకులు రాజ్యమేలుతున్నారు. అసలు ఇస్లాం మతంలోనే మానవ జనాభాలో సగమైన స్త్రీలని మనుష్యులుగా గుర్తించని అమానుషత్వం ఉంది. అటువంటిది – ఇంకా డబ్బుతో, అది ఇచ్చిన అహంకారంతో, రాజరికంతో, అది ఇచ్చిన అధికారమదంతో ఉన్న నవాబుల పాలనా విధానం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అంతకు క్రితం 1518 లో కుతుబ్ షాహీ వంశపాలన గోల్కొండ రాజధానిగా ఏర్పడినా, 1550 – 80 లమధ్యకాలంలో ఇబ్రహీం కుతీబ్ షాహీ పాలనలో సరస్సులూ, తాటాకాది నిర్మాణాలతో ప్రజోపయోగ పనులు జరిగినా, అది తమ పాలనని సుస్థిరపరుచుకోవడానికే గానీ ప్రజల మీద ప్రేమతో కాదు. అంతేగాక అప్పుడు నిజంగా జరిగిన ప్రజోపయోగ పనుల కంటే, ఆ తర్వాత అంటే 1900 తర్వాత, ఖచ్చితంగా చెప్పాలంటే 1950 తర్వాతా ఇవ్వబడిన ప్రచారమే ఎక్కువ. ఇబ్రహీం కుతుబ్ షాహీకి ఇవ్వబడిన ‘మాల్కాభిరామ’ బిరుదుతో సహా! అంచేత ప్రాధమికంగా చెప్పెదేమిటంటే ఆ కుతుబ్ షాహీ వంశ నవాబుల పాలనలో మానవీయ విలువలు వెల్లివిరిసి పోలేదని. అసలే భోగలాలసులు కావటంతో మద్యం, మాంసంలతో పాటు వాళ్ళకి మగువ కూడా భోగవస్తువే. మాతృదేవోభవ అంటూ పరస్త్రీని తల్లిగా భావించటం వాళ్ళకి తెలియదు. అందంగా ఉందంటే పట్టుకుపోయి జమానాలో భోగవస్తువుగా పడేయ్యటమే తెలుసు. ఆ కారణంగానే కుతుబ్ షాహీ నవాబుల కాలం నుండి నిజాంల కాలం దాకా, గోల్కొండ రాజధానిగా గల తెలంగాణా ప్రాంతంలో దాసీ వ్యవస్థ ఉండింది. దాసీ అంటే కేవలం మన ఇంటి పనులు చూసే స్త్రీకాదు, ఒంటి పనులు కూడా చూసేదన్నమాట. ‘అందంగా’ ఉండటం ఆడదాని పాపం! నవాబుల నుండి ప్రతిఫలం కోరే ప్రతి సేనానీ, సైనికుడూ, తనకు తెలిసిన, తనకు బలమున్న ప్రాంతాల నుండి అందమైన అమ్మాయిల్ని లాక్కుపోయి నవాబులకు బహుమతిగా [నజరానా] గా ఇచ్చేవాళ్ళు. నవాబులు సైతం అందమైన ఆడపిల్లల్ని కొనేవాళ్ళు. ఇక మర్యాదగా అమ్మకం చెయ్యని తల్లిదండ్రులని తన్ని, వాళ్ళ కూతుళ్ళని లాక్కొని పోయేవాళ్ళు. ఆ విధంగా జమానాలో దాసీజనం ఉండేది.

ఈ వ్యవస్థని రూపుమాపటం కోసం తర్వాత కాలంలో ఎందరో సంఘ సంస్కర్తలు [రఘపతి వెంకట రత్నం నాయుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు వంటి వారు] ఎంతో కృషి చేసారు. నిజానికి వేశ్యావృత్తి, వేశ్యావాటికల వ్యవస్థ హిందూ రాజ్యాలలోనూ, హిందూ సంస్కృతిలోనూ కూడా ఉన్నాయి. భట్టి విక్రమార్క కథల్లో వేశ్యలు రాజాస్థానాల్లో, వణిక్ర్పముఖులతో, కవి పండితులతో సమానంగా గౌరవ మర్యాదలందుకున్నారు. [ధనవతి, గుణవతి కథ, చిలుక పరకాయ ప్రవేశం కథ వంటి వెన్నో వున్నాయి.] తమిళ ఆళ్వారులలో ప్రముఖుడైన బిల్వమంగళుడు కథలో [బిల్వమంగళుడు అన్నదీ ఆళ్వారు కాకముందటి పేరు] చింతామణి అనే వేశ్యకథ తెలుగునాట అందరికీ పరిచితమే. మరో తమిళ ఆళ్వారు విప్రనారాయణుని జీవిత కథలోని ‘దేవదేవి’ రాజ సన్మాన పాత్రురాలైన వేశ్య. ఇవి చారిత్రిక కథలు. తొలి సంస్కృతి నాటకాలలో ప్రసిద్దమైన మృచ్ఛకటికం లోని కథానాయిక ‘వసంతసేన’ సైతం రాజాస్థానంలో గౌరవమర్యాదలూ, నగరంలో పేరు ప్రతిష్ఠలూ కలిగిన వేశ్య. భట్టి విక్రమార్కుల సవతి సోదరుడైన భర్తృహరి తల్లి, భట్టి విక్రమార్కుల తండ్రి చంద్రవర్ణుడికి ఒక భార్య, అయిన అమృత వల్లి వేశ్య. ఇది జానపధ కథ. ఇక ఇతిహాసల్లోనూ, పురాణాల్లోనూ, వేశ్యల ప్రసక్తి ఉంది. అయితే వారిని దారుణంగా Exploit చేయటం అన్నది నవాబుల కాలంలోనూ, తదనంతరం వారి వ్యవహార వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న దేశ్ ముఖ్ ల హయాంలోనూ ఉంది. భారతీయుల జీవన సరళిలో వేశ్యావృత్తికి ఉన్న స్థానం ఎవరూ తోసిపుచ్చలేనిది. మాతంగి, దేవదాసి ఇత్యాది నామరూప భేదాలతో అది దేశమంతటా ఉన్న వ్యవస్థే! వేశ్యల జీవితాలు నరకతుల్యాలే. అయితే వాటికి పరాకాష్ఠ నవాబుల కాలంలోనిది. అదే ఇక్కడ నేను నొక్కి చెప్పదలచింది.

నవాబుల జమానాలో వేశ్యలు, దాసీలు పగలు అంతఃపుర భవనాల శుభ్రత, నవాబులకు, బేగంలకు భోజనాది సౌకర్యాలు, ఇతర సేవలు చేయటంతోనూ, రాత్రి నవాబుల, ఉన్నతాధికారుల, వజీరుల, నవాబు బంధుమిత్రుల శృంగారకాంక్షలను తీర్చటంతోనూ బ్రతుకు వెళ్ళదీస్తుండేవాళ్ళు. అందునా నవాబుకు విశిష్ఠ అతిధులు వస్తే ఈ దాసీలలో అందమైన దాసీలకు అదనపు డ్యూటీలు పడేవి. అందమైన దాసీ గనుక, ఈమె అందంతో ఏ నవాబుని, లేదా పైస్థాయిలోని ఏపురుషుణ్ణీ లోబరుచుకొని హోదాని, ధనాన్ని, భవనం మొదలైన ఆస్థుల్ని, సౌకర్యాలనీ పొందలేదు. అవి పొందగల ఉంపుడుగత్తెలు మళ్ళా ముస్లిం వనితలే. వీళ్ళు కేవలం దాసీలు. పగలు దాసీలు. రాత్రి వేశ్యలు. వారి ఆరోగ్యాలతో, సౌకర్యాలతో ఎవరికీ నిమిత్తం లెదు. ఉపయోగపడినంత కాలం ఉపయోగించుకుంటారు. ఛస్తే పారేస్తారు. ’కోతి చచ్చింది. గోడవతల పారేసాం’ అన్నట్లుంటుంది వ్యవహారం. ఈ దాసీలకి పుట్టిన సంతతి కూడా దాసదాసీ జనమే. అచ్చం మన ఇంటపుట్టిన గేదేదూడ మన పశువుల మందలోనిదే కావడం లాగే ఇదీను. మగపిల్లలైతే పశువుల కాపర్లుగానూ, పాలేర్లుగానూ ఉపయోగింపబడతారు. ఆడపిల్లలైతే షరా మామూలే. వయస్సు వచ్చేదాకా ఇంటి చాకిరీ, తర్వాత తల్లుల్లాగానే పిల్లలూనూ. అంతే! ఈ దాసీల కుటుంబాలకు సరైన నివాస సౌకర్యలుండవు. ఇక చదువు సంధ్యలు ఊహించగలరా? తిండితిప్పలు పెద్దవిషయం కాదు. నవాబులు, వారి ఇలాకాలు తిన్నట్లు ప్రతిపూటా మద్యమాంసాలు లేకున్నా ఏదో కడుపునిండటానికి మాత్రం కరువులేదు.

ఇలాంటి దాసీ పుత్రుడు నకిలీ కణిక1 [ఈ assumption కి సంబంధించిన practical verification కూడా మీకు చూపిస్తాను] ఇతడి తల్లి అందగత్తె. ఎంత అందగత్తె అయితే అంత కష్టాలు తప్పవు. అంతగా అవమానాలూ తప్పవు. ఎందుకంటే, ఇలాంటివాళ్ళని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ, చెప్పుచేతల్లో పెట్టుకోకపోతే తమ నవాబుగిరీ, అధికార దర్పానికి అది చాలా లోటు, లోపం కదా! ఊరుమ్మడి వేశ్య. ఏ బీజం ఆ కడుపున అంకురమై, శిశువుగా జన్మించి, బాలుడిగా ఎదిగి యువకుడిగా పరిణమించిందో గానీ ఈ నకిలీ కణికుడికి అమితమైన మేధస్సు, తార్కికశక్తి, ధారణ శక్తి ఉన్నాయి. తల్లి స్థితి, తన సాంఘీక స్థాయి అర్ధం అయ్యేకొద్దీ, కసీ, కోపం, ప్రతీకారం, వయస్సుతో పాటే పెరుగుతూ వచ్చాయి. గొర్రెల్నీ, బర్రెల్నీ కాస్తూ చదువుసంధ్యలు లేకుండా బీడు పొలాల వెంట తిరుగుతున్నప్పుడు తోటి పిల్లలందరూ వెదుక్కున్న అనందాలలో తనూ భాగం వెదుక్కోలేక పోయాడు. తన లాగే frustration కి గురైన మరికొందరు కుర్రాళ్ళు, [దాసీపుత్రులు] ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు, ‘నవాబూలూ, వారి అనుయాయూలు తమ తల్లుల్ని వాడుకుంటున్నారన్న’ కసితో, నవాబుల భార్యలు, బేగంలూ, తమలాంటి పనివాళ్ళ దగ్గర సుఖం వెదుక్కుంటున్నారని కొన్ని ఉహాజనిత వార్తల్ని, కొన్ని పుకార్లని, కొన్ని నిజాలని కలిపి మాట్లాడుకుంటూ అక్కసు వెళ్ళబోసుకుంటుండంగా ఈ నకిలీ కణికుడు1 మాత్రం దీనికి భిన్నంగా ఉండేవాడు. చివరికి ఆ దాసీల పుత్రులు ఏకంగా ఊహాల్ని మరికొంత దూరం ఉరికించి తమనే బేగం సాహెబా పిలిచిందనీ, తమతో గడిపిందనీ కోస్తున్నా అతడు పట్టించుకునేవాడు కాదు.

తీవ్రమైన ఆలోచనా మధనంతో ఉండేవాడు. తనెందుకిలా ఉన్నాడు! తను తనతల్లి కడుపున గాక ఏబేగం సాహెబా కడుపునో పుట్టి ఉంటే? తన కళ్ళ ముందు, దాదాపు తమ వయస్సే ఉన్న నవాబు కుర్రపుత్రరత్నాలు తల్లి వైపు ఆకలిగా చూడటం ఇతడికి తెలుసు. పదహారు, పదిహేడు ఏళ్ళయినా నిండని ఆ కుర్ర రాజవంశీయుల్లో ఎవరికీ నిజంగా అసలు శృంగార మంటే ఏమిటో తెలియదు. తెలిసిందల్లా ఫలానా దాసి అందగత్తె అనీ, ఆమె కోసం మగవాళ్ళు అంగలారుస్తారనీ ఉన్న పుకారు మాత్రమే. తాము ’మగవాళ్ళు’ అయ్యారు గనుక తము కూడా అలా ప్రవర్తించాలన్న initution తప్ప మరేం లేదు అక్కడ. అయితే అందులో అవతలి స్త్రీ తమ తల్లి వయస్సులో ఉందన్న ఇంగితం కూడా గుర్తురానంత అధికారమదం, గారాబపు అహంకారం ఉన్నాయి. తాము ‘రాజ [నవాబు] వంశీయులు గనుక, తాము ప్రతి మేలిమినీ అనుభవించటానికే పుట్టాం, ప్రతీదీ తమ ఆనందం కోసమే’ అని నూరిపోయబడ్డ భావజాలం అది. చదువు, సంస్కారం, ఆత్మోన్నతి అన్నవి ఆ మద్యమాంస మగువ ప్రియులకు వినబడని మాట. [ఒకప్పటి ముస్లింలు ఎంతగా ఙ్ఞానద్వేషులో, నాటి నలంద విశ్వవిద్యాలయంలో, రోజుల తరబడి పొగ ఆరని విధంగా పుస్తకాలు తగులబెట్టినప్పుడే నిరూపితమైంది. అప్పుడే కాదు, ఈరోజు కూడా తాలిబాన్ల ప్రవర్తనలో సైతం ఉన్నది ఈ ఙ్ఞాన ద్వేషమే. అదృష్టం ఏమిటంటే, ఎప్పుడో కొన్ని తరాల క్రితం మాతమార్పిడి చేసుకున్న భారతీయ ముస్లింలలో ఇంకా భారతీయ మూలాలు ఉండటం, ఆ కారణంగా వీళ్ళలో అధికశాతం తాలిబన్లు కాకపోవటం! లేకపోతే భారతీయ ముస్లింలు కూడా పాక్ లోని తాలిబాన్లు అయిపోయి ఉండేవాళ్ళు. అయితే 1650 ల్లో అధికారం డబ్బుతో మదించిన ముస్లిం నవాబులు, వారి అనుయాయూలూ తాలిబాన్లకు తీసిపోనివారే!]

ప్రతిరోజూ ఏ అర్ధరాత్రి దాటాకో ఇల్లు [అనబడే తమ పేద గుడిసె] చేరిన తల్లి, తన చుట్టూ ఉన్న నీచమైన జీవితం చూసి ఈ నకిలీ కణిక1 లో రోజురోజుకీ కోపం, కసి, నిస్సహాయతతో కూడిన ప్రతీకారేచ్ఛ పెరిగి గడ్డకడుతూ వస్తోంది. అతడికి తన బ్రతుకు పట్లా అసహ్యం, రోత. జన్మతః తనకు కలిగిన దుస్థితి, పుట్టుక కారణంగా తన వయస్సే ఉన్న ఇతర పిల్లల జీవితాల్లో ఉన్న వ్యత్యాసంలోని సృష్టి రహస్యం ఏమిటో తనకి తెలియదు. దాని పట్ల అసంతృప్తి తప్పితే! డాబూ దర్పం చూపే ముస్లిం కులీనుల పట్ల ఈర్ష్య, ద్వేషం అతడి మనస్తత్వంలో ఓ భాగమైపోయాయి. అతడి పుట్టుకని హేళన చేస్తూ, చీదరించుకునే హిందూకులీనుల పట్ల కూడా అతడికి పట్టరానంత ద్వేషం, కసి, కోపం. వెరసి అతడికి తనతో తనకి పడదు. తన చుట్టూ ప్రపంచంతోనూ పడదు. ఒక రకంగా ప్రపంచం పట్ల, మనుష్యుల పట్ల, మానవత్వం పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి నుండి పారిపోయాడు. దేశ దిమ్మరిలా మారాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరెవరినో ఆశ్రయించాడు. దొరికిన చోట తిన్నాడు. దొరకని నాడు పస్తున్నాడు. అయితే ఇతడికి ఇవి కష్టాలు కావు. తల్లిదగ్గిర ఉన్నప్పుడు మాత్రం కడుపెరిగి పెట్టిన చెయ్యేది? వేళ కింత ముద్ద పదిమంది జీతగాళ్ళతో కలిసి తినటమే! అయితే ఇతడి ఙ్ఞానదాహం మాత్రం తీరుతోంది. తీరే కొద్దీ పెరుగుతోంది. హిందూ గురువులని ఆశ్రయించాడు. తండ్రెవరో తెలియని బిడ్డ. తల్లి ఉన్నా ఆదరణకు నోచని జన్మ. ఇతడు హిందువనీ, ముస్లిం అనీ గుర్తించలేనట్టివి అతడి మూలాలు. ఒకసారి పుట్టిన గడీ దాటి వచ్చాక, వ్యక్తిగత గుర్తింపు ఉండదు. అతడేది చెబితే అదే గుర్తింపు. ఆవిధంగా అతడు అర్హులని ఆశ్రయించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. తెలుసుకునే కొద్దీ అతడి ప్రపంచం విశాలమయ్యింది. కానీ అతడి [frustration] మనో వైకల్యపు పునాది అంతకంతకూ గట్టిపడింది. తననందరూ హేళన చేశారు. తన తల్లి, తనూ exploit అవుతున్నారు. ఇలా కాదు. ఏనాటికైనా అందరూ తనకి దాసోహం అనాలి. ఇదే ధ్యాస, ఇదే ఆకలి, ఇదే దాహం, ఇదే నిద్ర, ఇదే బ్రతుకు. నిరంతరం ఇదే ఆలోచన.

ఈ క్రమంలోనే అతడు హిందూ ఇతిహాసాలని, పురాణాలని, ఔపోసన పట్టాడు. వాటిలో మంచిని పెంచే పద్దతి భారతదేశంలో అంతకు ముందు అమలులో ఉండింది. నవాబుల కాలంలో గోల్కొండ సామ్రాజ్యంలో అది మరుగైపోయింది, మృగ్యమై పోయింది గానీ, ఇతర ప్రాంతాల్లో ఇంకా మిగిలే ఉంది. ఈ నకిలీ కణిక1 కి, అసలే మనో వైకల్యం మితిమీరి ఉంది. ఆ కసీ, కోపం, పగ ప్రతీకారం వంటి అసురలక్షణాలకి తోడు, ముస్లింరాజులు భారతదేశంలోకి తీసుకొచ్చిన ‘వంచన’తో హిందూ ఇతిహాసాలని చెడుని పెంచేందుకు ఎలా ఉపయోగించవచ్చో స్ఫురించింది. దాన్ని మరింతగా అన్వేషించి, విశ్లేషించి, మెరుగు పరుచుకునే ప్రయత్నం చేశాడు.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను.

మయ సభ నిర్మాణానంతరం నారద మహర్షి ఇంద్రప్రస్థానికి వస్తాడు. ఆ సమయంలో ధర్మరాజుకు నీతి బోధ చేస్తాడు. నారద నీతిగా ఇది ప్రసిద్ది చెందింది. రాజ్యపాలనకు సంబంధించిన ఎన్నో విషయాలు, రాజు బాధ్యతలు, ఇందులో చెప్పబడినాయి. నేడు ప్రజాస్వామ్యం పేరిట నారద నీతికి విపర్యయం అమలు జరపబడుతోంది.


నారదుడు: ధర్మనందనా! నువ్వు నీ తండ్రి తాతలు నడిచిన న్యాయమార్గాన నడుస్తున్నావా? [అసలు న్యాయం అంటే ఏమిటో ఈనాటి పాలకులైన రాజకీయనాయకులకి తెలియదు.] నీ రాజ్యంలో ప్రజలందరినీ సమదృష్టితో చూస్తున్నావా? [ఇది అసలే పరిస్థితుల్లోనూ జరగనిది. తమ వారికి దోచిపెట్టడం, ఇతరులని దోచుకోవటం బంధుమిత్రుల పరంగానూ, పార్టీ పరంగానూ సర్వత్రా జరుగుతుంది.] ధనలోభంతో ధర్మకార్యాలను విడిచిపెట్టడం లేదుకదా! [ధర్మకార్యాలా? అవేమిటి? అంటారు నేటి పాలకులు] అలానే కామబుద్దితో ధర్మార్ధాలను వదులుకోకూడదుసుమా. ఉదయవేళ దానధర్మకార్యాలూ, మధ్యాహ్నవేళ అర్ధార్జన కార్యాలూ, రాత్రులు కామోపభోగమూ సాగించాలని శాస్త్రం ఘోషిస్తున్నది. [అసలు ఉదయాన్నే నిద్రలేచే మహానుభావులేరి? రాత్రి సేవించిన మద్యం తాలూకూ మైకం (హోంగోవర్) వదిలితే గదా లేవడానికి? అర్ధరాత్రిదాకా మందుపార్టీల్లో మంత్రాంగం నడుపుతారని, రాజకీయనాయకులు ఒకరిని ఒకరు తిట్టుకోవడం మనం రోజూ చూస్తున్నదే] చతుర్ధశ స్థానరక్షణతో, చక్రవర్తి, షడ్గుణాలూ అభ్యసించి, ఉపాయసప్తకం ఎరిగిఉండాలి. శత్రువు మనకంటే బలవంతుడయితే వానితో స్నేహం చెయ్యాలి.

నీ ప్రకృతిజను లెవ్వరూ శత్రుకూటంతో చేతులుకలపకుండా చూడాలి. ధనం ఉన్నదే అది దుర్వ్యసనాలవైపు మనస్సును నడుపుతుంది. దాన్ని నిరోధిస్తున్నావా?

చతుర్దశస్థానాలు:
రధ,గజ, తురుగ, పదాతులూ, ధన, లేఖన, గణన, అధికార, అంతఃపుర, దుర్గ, దేశశాస్త్రబలాదులూ కోటకు చతుర్దశస్థానాలు. [అంటే ఎంత బలగం ఉందీ, ఎంత ధనం కోశాగారంలో ఉందీ, ఎంతమంది ఉద్యోగులున్నారు ఇత్యాది అన్ని వ్యవహారాలూ అన్నమాట. అసలు ప్రభుత్వానికే సరైన లెక్కలు లేవు. అదీగాక ప్రతీ అయిదేళ్ళకోసారి, ఎన్నికలు జరిగినప్పుడు, ప్రభుత్వం చేతులు మారుతుందన్న అనుమానం వచ్చినప్పుడల్లా, సచివాలయంలో ఫైళ్ళు, కంప్యూటర్లూ ఇతర గణన గ్రంధాలూ అన్నీ బుగ్గిపాలవటం చాలా మామూలు కూడా]


షడ్గుణాలు:
విషయవివేచనాశక్తి[అంటే ఏ విషయాన్నైనా, సమాచారాన్నైనా విశ్లేషించగలిగే శక్తి], భూతకాల విషయస్మృతి [అంటే గతించిన కాలంలో ఏమేమి జరిగాయో వాటికి ఙ్ఞాప్తిలో ఉంచుకోవటం] , దూరదృష్టి [అంటే భవిష్యత్తుని చూడగలగటం. ఈ స్ట్రాటజీ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏమవుతుందో అంచనా వేయగలగాలి], నీతిఙ్ఞత [నీతిగా ఎందుకు ఉండాలో తెలిసి ఉండటం], తర్కశాస్త్రఙ్ఞానం[అంటే logic sense. ఎదుటివాళ్ళు మాట్లాడిన దానిలో లొసుగులేమిటో, ఇవ్వబడిన సమాచారంలో ఎక్కడ లోపం ఉందో, ఎంత చురుగ్గా పసిగట్టగలిగితే పాలకుడు అంత సమర్ధుడన్నమాట.], ప్రగల్భవర్తన [మామూలుగా ప్రగల్భాలు పల్కటం అంటే డాబుసరిగా మాట్లాడటం. సామాన్యుడికి ఈ లక్షణం ఉండటం మంచిది కాదంటారు పెద్దలు. అయితే నాయకుడికి, పాలకుడికి ఈ లక్షణం కొంత అవసరం. అతడి మాటల్లో ధృఢవైఖరి, కఠినవైఖరి, స్పష్టమైన తీరు కనబడి తీరాలి. అది కొంత గంభీరంగా ఉండాలి. గొప్పగా ఉండాలి. బీదపలుకులు, బేల పలుకులు నాయకుడికి శోభించవు. పాలితులు, ప్రజలు, అనుచరులు, నేరగాళ్ళు ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలంటే, నాయకుడికి ఈ ప్రగల్భ వర్తన అన్నలక్షణం ఉండి తీరాలి.] – ఇవి షడ్గుణాలు.

ఉపాయసప్తకం:
సామ, దాన, భేద, దండమార్గాలు, మంత్రశక్తి[స్ట్రాటజీ], ఔషధవిఙ్ఞానము, ఇంద్రజాలము[ఈ పదాన్ని గూఢచర్యానికి సమానార్ధకంగా తీసుకోవచ్చు.] – ఇవి ఉపాయసప్తకం.


ప్రకృతిజనులు:
ధర్మాధ్యక్ష[అంటే న్యాయామూర్తుల వంటివారు] దుర్గాధ్యక్ష[అంటే ఆధునిక కాలంలో పోలీసులు ఐ.పి.ఎస్. అధికారుల వంటివారు], బలాధ్యక్షులూ[అంటే దాదాపు ఐ.ఏ.ఎస్., ఇతర ఉన్నతాధికారులు వంటివారు], పురోహిత[పురోహితులంటే ఒకప్పుడు పురోహితులే గురువులు కూడా టీచర్లనుకోవచ్చు], వైద్య, కార్తాంతిక[అంటే నాకు తెలియదండి. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు], సేనాపతులూ[అంటే సైనిక బలం] ప్రకృతిజనులు [ఇప్పుడు చూస్తూంటే పైన చెప్పిన ప్రకృతి జనులలో అధిక శాతం శత్రువులతో చేతులు కలిపినట్లే ఉంది].

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

http://sreemadaandhramahaabharatam.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B0%AD%E0%B0%BE%20%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81
in my above site,poems from sabha parvam (naaraduni sambhashana with dharmaraju) and their meanings are written by me as i understand the same in about 10 posts. interested persons may visit the same.

ఇక్కడ నాకు ఒక చిన్న సందెశం, ముస్లిం రాజ్యలు ఒక్క గొల్కొండ లొనె కాకుండ మన దెశంలొ మిగత చొట్లకూడ వెలిశాయి కదా. మీకు ఇక్కడె (గొల్కొండ) లొనె మొదలు అయినట్లు ఎలా అనుమానం వచింది (అంతె ఒక్క తనీష నె కాకుండ మరి ఎమైన కారనాలు ఉన్నయ)?

Read this article maDam
Converting plastic waste into petrol!
T. Jahnavi

(http://www.tribuneindia.com/2003/20030928/spectrum/main4.htm)

మన దేశ దుస్థితి ఇదే. మన పురాణాలు ఇతిహాసాలు పూర్వ వైభవం ఎవ్వరికి గుర్తు లేదు. రాజకీయవేత్తలు గుర్తు చేయలేరు ఎందుకంటే శ్రీ కృష్ణ దేవరాయున్ని పొగిడితే అతను హిందువు అని క్షత్రీయుడని అంటారు ప్రతిపక్షాలు.. బీ.సీ లని పొగ్గడ్డం లేదు అంటారు. ముస్లింలని పొగడ్డం లేదు అంటారు. సెక్యులరిజం పేరిట మన ఇతిహాసాలనే మార్చేస్తున్నారు. మనం సిగ్గు లేకుండ వాటినేమి పట్టీంచుకోకుండా అలనే జివితాలు గడిపేస్తున్నాం. వెయ్యేళ్ళ బానిసత్వానికి అలవాటైపోయాం. ఈ దేశాన్ని ఎవ్వడు బాగుచేయలేడా అని అనుమానం వస్తుంది. శాస్త్రి గారనట్టు "నిగ్గదేసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.." అని ప్రశ్నించడమే మానేసాం. నేను నా ఫార్ లూప్, నా లాప్ టాప్, నా కారు నా ఇళ్ళు నా నా నా అనే ఆలోచిస్తాం. will we never realize that this is our country. this is our world. and that we can make a difference.

శషాంక్ గారు, గాంధి గారు స్వాతంత్రము తెవటము ఆయన గొప్ప మాత్రమె కాదు. వారి వెంట నడచిన కోట్ల మంది ప్రజలది కూడ. నలుగురు బట్టలు లెని వారి మధ్యకు బట్టలు వున్నవాడు వెలితె వాడిని కొట్టారని సామెత. ఆందరు మంచిని కోరుకుంటెనె అది జరుగుతుంది. ఓకరిద్దరి మాట నెగ్గదు.

to ananymous:
మీరన్నది రైటే, కానీ చెడునే లౌక్యం పేరుతో మంచి అని నమ్మబలుకుతున్నారు, ప్రజలు అలాగే అనుకుంటున్నారు. అందరూ మంచిని కోరుకొనేలా ఎవరు మోటివేట్ చేస్తారు, అలా నిలబడ్డవాళ్ళని ఎంతవరకు ఉండనిస్తారు? అన్నది ప్రశ్న.

నాకు తోచినంతవరకు, ఎవరికి వాళ్ళు తమలో తమ కుటుంబాలలో ఈ స్ఫూర్తిని నింపగలగడానికి ప్రయత్నిస్తే కొంత వరకు సాధ్యం కావచ్చు.

http://video.google.com/videoplay?docid=4429400474217380163&ei=uBAMStLDLaGgqQPr3KU3&q=dr+swamy

http://janataparty.org/

http://gandhiheritage.org/

http://video.google.com/videoplay?docid=4429400474217380163&ei=QlIMSqjLKY6mwgO33_ClBA&q=dr+swamy

No need to post my comment here
This is just for your info

http://www.youtube.com/watch?v=-BfdiWpICo4

anon గారు - అసలు గాంధి వళ్ళనే స్వాతంత్రం ఒక పదేళ్ళు లేట్ గా వచ్చింది అని భావించేవాళ్ళలో ఒక్కడిని. అలా ఒక్కడి వళ్ళే స్వాతంత్రం కాని అసలు యే పని అయినా జరుగుతుంది అని నేను ఎప్పుడూ అనుకోను. :)
కుటుంబం లో మన చుట్టు ఉన్న చిన్న ప్రపంచం లో మనం కొంథ మార్పు తేగలమేమో.. కాని దేశాన్ని ఉద్దరించాలి అంటే దానికి ఇలా కొన్ని లక్షల మంది కావాలి. ఇప్పుడున్న పరిస్థుతుల్లో అది సాధ్యం ఔతుంది అంటారా?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu