ఈ రోజు టపా: నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు [Assumptions] -7[గాడ్ ఫాదర్ల మొదటి దశ]


మీరు గమనించారో లేదో – కొన్నిరోజుల క్రితం, ఫిబ్రవరి 14, 2009 న మన తెలుగు బ్లాగ్లోకంలో ప్రముఖ బ్లాగరు శ్రీ తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం గారు, వ్యాపార ప్రకటనల్లలోని అశ్లీలత గురించి “వేసుకోమనా? విప్పుకోమనా?" అన్న శీర్షికతో ఒక టపా వ్రాసారు. అందులో ఈనాడు వారి బ్రిసా, అలాగే కళామందిర్, సి.ఎం.ఆర్. కళానికేతన్ ల వారి ప్రకటనలు గురించి వ్రాసారు. ఆ ప్రకటనలో సదరు మోడళ్ళు వేసుకున్న జాకెట్ లేని లేదా పమిట వేసుకోని ఫోటోలని విమర్శిస్తూ ఘాటుగా, సూటిగా ప్రశ్నలు గుప్పించారు. అవి తక్కిన వ్యాపార సంస్థలకి ఎలా తగిలిందో నాకు తెలియదు కాని, ఈనాడు పత్రికాధిపతికి, మీడియాకి సూటిగా గుచ్చుకున్నాయనుకుంటా. ఎందుకంటే ఆరోజు నుండి ఈరోజు వరకూ మాత్రం ఈనాడు ఆదివారం సంచిక వెనుక పేజీ మీద పెళ్ళికూతుళ్ళు కుదురుగా జాకెట్లు, పమిటలూ వేసుకుంటున్నారు.

మరో ఉదాహరణ గమనించాలి. కొన్నిరోజుల క్రితం ఫిబ్రవరి 17,2009 న తెలుగు‘వాడి’ని బ్లాగరు సానియామీర్జా క్రీడా ప్రదర్శన, ఆ క్రీడాకారిణికి మీడియా ఇచ్చే ప్రచారాలని సునిశితంగా విమర్శిస్తూ ఒక టపా, ‘బుర్ర ఎక్కువ ఉపయోగించకుండా, తేలికగా/సులభంగా చేయగలిగిన ఉద్యోగం ఏది !?’ వ్రాసారు. ఆరోజు నుండి ఈరోజు వరకూ పత్రికల్లో, ముఖ్యంగా ఈనాడులో, సానియా మీర్జా పెద్దపెద్ద ఫోటోలు వేసి, ఈ అమ్మాయి గెలిచినా ఓడినా, ఆ పిల్ల ర్యాంకు పెరిగినా, తగ్గినా, ఆమె క్వార్టర్ ఫైనల్స్ లోకో, సెమీ ఫైనల్స్ లోకో ప్రవేశించినా లేక వెనుదిరిగినా పేద్ద వార్త వ్రాసి పారేయడం మానేసింది. సానియా మీర్జా గురించి ఏ క్రీడా వార్తా ప్రచురించటానికి వీలుగాక పోతే ఆ అమ్మాయి Dress Sense గురించో, సమయస్ఫూర్తి గురించో, మరింకో విషయం గురించో వార్తా కథనాలు వ్రాయటమూ తగ్గించింది. దాదాపు మానేసిందని చెప్పవచ్చు. ఆవిధంగా మన తెలుగు బ్లాగర్లు కూడా పత్రికల్ని ‘ఏదో కాస్తన్నా’ అదుపులో పెట్టగలుగుతున్నారని చెప్పవచ్చు.

ఇలాంటివి పరిశీలిస్తే బోలెడు బొచ్చెడు ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకి రెండు చెప్పాను. మీరూ గమనించి చూస్తే కోకొల్లలు కన్పిస్తాయి. కాబట్టి మనం తెలుగు బ్లాగర్లకి జేజేలు చెప్పుకోవచ్చు. కాదంటారా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

మొదటగా మీ సునిశిత పరిశీలనకి జోహార్లు,ఆ పైన ఆయా పోస్టుల రచయితలకు అభినందనలు.ఒక్కొక్కళ్ళుగానే ఇలా చిన్నపాటి విజయాలు సాధిస్తే అందరూ కలిస్తే కాస్త ఉపయోగకరమయిన పనయ్యే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.ఉందిలే మంచి కాలం ముందు ముందునా,అందరూ సుఖపడాలి నందనందనా...

ఛ! ఇక తాడేపల్లి గారిని ఈనాడు సంపాదకులుగా చేస్తారేమో :))

శ్రీనివాస్ పప్పు గారు,
నేను కూడా కోరస్ పాడతాను.

శరత్ గారు,
వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.

ఈనాడు లాగ మిగతా పత్రికలూ కూడా స్పందిస్తే బాగుండేది. జర్నలిజం లో మొదటినుండి కూడా ఈనాడు కొన్ని విలువలు పాటిస్తుంది. ఉదాహరణకు కొంత సర్క్యులేషను పెరిగే వీలున్నా కూడా, వార ఫలాలు ప్రచురించదు.

ఇది నిజమో కాకతాళీయమో. ఏమైనా, బ్లాగర్ల మాటలకే పద్ధతి మార్చుకుంటుందంటే ఈనాడు నిజానికి చాలా పద్ధతిగా నడుస్తుందనే. రామోజీని అభినందించాలి ఈ విషయంలో.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu