అడ్మిషనిస్ట్రేషన్ గురించి అవగాహన రావటానికి కొన్ని సంఘటనలు చెప్తాను. నాజీవితంలో నుండే ఉదాహరణలు ఇస్తాను. 1989 లో నేను బ్యాటరీ ఇండస్ట్రీ స్థాపించాను. 1990 లో మా ప్రాంతంలో పెద్ద తుఫాన్ సంభవించింది. అప్పటికి బాలారిష్టాలు దాటి, అప్పడప్పుడే గాడిన పడుతున్న నా ఫ్యాక్టరీ, ఇందులో కొంత దెబ్బతింది. నాకు ఇన్సూరెన్స్ సొమ్ము, ఆలస్యంగానైనా సరే వచ్చింది. అయితే ఈ లోపున బ్యాంకు ఋణాలపై వడ్డీలు పెరిగిపోయాయి. ఈ దశలో నా దగ్గర ఓ మేనేజర్ పనిచేసేవాడు. అతడు బ్యాంకింగ్ వ్యవహారాల్లో అనుభవఙ్ఞుడు. అతడు నాకు ప్రధాన మంత్రికీ, కేంద్ర ఆర్ధిక మంత్రికీ, తుఫాన్ నేపధ్యంలో బ్యాంకు ఋణాలపైన వడ్డీ exempt చెయ్యమని అంటే తొలిగించమని ఆర్జీపెట్టుమన్న సలహా ఇచ్చాడు. ప్రతి 15 రోజులకీ ఒక లేఖ చొప్పున వ్రాయమన్నాడు. నేను 15 రోజులకి ఓసారి రిమైండింగ్ రిక్వెస్టుతో లెటర్లు పెడుతూనే ఉన్నాను. అప్పటికి వీ.పి.సింగ్ ప్రభుత్వం ఉంది. అది కూలిపోయి చంద్రశేఖర్ ప్రభుత్వం వచ్చింది. అయినా ఆపకుండా దాదాపు నాలుగైదు నెలలపాటు లేఖలు వ్రాస్తూనే ఉన్నాను. ఫలితంగా, ఓరోజు నా ఖాతా ఉన్న బ్యాంకుకి ఋణంపై వడ్డీని exempt చేయమని కేంద్ర ఆర్ధిక మంత్రి నుండి ఆర్డర్సు వచ్చాయి. అదీ అడ్మినిస్ట్రేషన్ పనిచేసే తీరు. ఇది జరిగింది 1990 – 1991 లో. నేను ఒక్కసారి ఢిల్లీ వెళ్ళలేదు. ఒక్కరికమండేషన్ చేయించలేదు. వాళ్ళెవరు నాకు చుట్టాలు కారు. ఎంతగా లంచాలు నడిచాయి అన్నా, కొంత నిజాయితీగా పనిచేయటం కూడా ఉంటుంది. ఆయా సీట్లలో ఉన్న ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు “పోనీలే పాపం! క్రమం తప్పకుండా వ్రాస్తున్నారంటే నిజమే అయిఉంటుంది. Genuine కాకపోతే sincere effort చేయరు అన్న సూత్రం ప్రకారం స్పందిస్తారు. Concern Seat లో ఉన్నందుకు 100 కి కొంత శాతమన్నా Genuine వ్యక్తులనీ, కేసులకీ న్యాయం చెయ్యాలి అనుకుంటారు. అంతేకాని నూటికి నూరు శాతం అవినీతే నడవదు.
మరో ఉదాహరణ చెబుతాను. ఇదీ నా జీవితం లోంచే. ఇదీ 1992 కు ముందరిదే. అప్పట్లో బ్యాంకులోనూ, APSFC లోనూ లంచాల కారణంగానే గాక, మహిళా వివక్షని కూడా ఎదుర్కొంటున్నాను. అప్పట్లో గుంటూరులో ACB అధికారిగా సాయిబాబా అనే ఇన్స్ పెక్టర్ ఉండేవారు. నిజాయితీ గల అధికారిగా ఆయనకి చాలా పేరుంది. ఆయన్ని కలిసి, గొంతెమ్మకోరికలతో నన్ను విసిగిస్తున్న ఓ అధికారి గురించి ఫిర్యాదు చేశాను. నాకు ఆయన ఒక సలహా ఇచ్చాడు. “చూడమ్మా! మీ ఫిర్యాదు తీసుకుని నేను కేసు రిజిస్టర్ చేస్తాను. అవతలి వాడి ఉద్యోగం పోతుంది. అవినీతిపరులకి అది పడవలసిన శిక్షే! మీ స్థానంలో మరో మగవాడుంటే నేను క్షణం ఆలోచించకుండా కేసు తీసుకునేవాణ్ణి. కాని మీరు ఆడపిల్ల. ఉద్యోగంకి ఎసరు వస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మీ మీద వ్యక్తిత్వపరంగా నిందలు వేస్తారు. అంచేత నేను మరో కేసులో అతణ్ణి పట్టుకుని బుద్ది చెబుతాను. అవినీతి పరుడైనందున నాకు మరెక్కడో దొరక్కపోడు. మీజోలికి రాకుండా కట్టడి చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. అంతేగాని మీ పేరుతో కేసు రిజిస్టర్ చేయను. మీకు సమస్య తీరితే చాలు కదా!” అన్నాడు. నేను సంతోషంగా అందుకు ఒప్పుకున్నాను. ఆయన “చూడమ్మా. ఏదో చెయ్యాలని ఈ డిపార్ట్ మెంట్ లోనికి వచ్చాను. ఇందాక నువ్వు చూశావు కదా! లంచం తీసుకుని గాయాల గురించి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు ఆ డాక్టరు. [నేను వెళ్ళెటప్పటికి అతణ్ణి ఈయన ఇంటరాగేట్ చేస్తున్నాడు. ఆ ప్రశ్నల పరంపరంలో అవతలి డాక్టరు తప్పు ఒప్పుకుని కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు.] అయినా మేమూ రాజీ పడక తప్పదు. ఇదిగో నా ఈ చిన్ని ఇల్లు కట్టుకోవడానికి, ఉడావాడు పర్శిషన్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టాడు. ఏదో రకంగా సంపాదించాను. అది ఈ రోజు వ్యవస్థలో అవినీతి ఉన్నతీరు. మీ ఉత్సాహం, పోరాటం చూసి ముచ్చట వేసి చెబుతున్నాను. వెళ్ళిరండి” అని చెప్పాడు.
అక్కడ కేసు తీసుకోవటం, తమ వృత్తి రూలే కాదు, ఎదుట వ్యక్తి పై దాని పర్యావసానాలు కూడా ఆలోచించేటంత సామాజిక బాధ్యత ఉంది. అదే సమస్య తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలని వెదికింది. ఉద్యోగికి వ్యక్తిగత నిర్ణయస్వేచ్ఛ కొంత ఉంటుంది. దానినే ఇప్పుడు ఉద్యోగులు అవినీతికి ఉపయోగిస్తున్నారు. నిజాయితీగా సేవచేయలనే స్ఫూర్తి ఎంతమంది ఉద్యోగుల్లో ఉంది?
మరో విషయం చెప్పటం ఇక్కడ అప్రస్తుతం కాదు. మనం ఒక నాణాన్ని ఎగరేస్తే బొమ్మో, బొరుసో పడే అవకాశం 1:1 నిష్పత్తి లో ఉంటుంది. 50%,50% అవకాశాలంటారు. ఇది Theory of Probability. అలాగే ఒక ప్రయత్నం చేస్తే జయాపజయాలు నిష్పత్తి కూడా 50:50. 1992 కు ముందర నాజీవితంలో ఈ నిష్పత్తి 70:30 గా ఉండేది. వంద ప్రయత్నాలు చేస్తే అందులో దాదాపు 70 సార్లు విజయం సాధించగలిగేదాన్ని, 30 సార్లు అపజయం ఎదురయేవి. అదే 1992 తర్వాత, నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలలో, నూటికి నూరుశాతం ఓటమే. సంభావ్యత సిద్దాంతం ప్రకారమైనా ఇది ‘Definite event’ అవుతుంది. అంటే ఖచ్చితమైన ఘటన. ఆ ప్రకారం కూడా రామోజీరావు ఉనికి సత్యం. అతడు మాపైన వ్యవస్థీకృత వేధింపు చేసింది సత్యం. లేదా రాజ్యాంగం విఫలమయ్యింది అనవలసి ఉంటుంది.
ఎందుకంటే ఒక సామాన్యుడు ఇంతకంటే రాజ్యాంగబద్దమైన [అడ్మినిస్ట్రేషన్ పరమైన] పోరాటం చెయ్యగలడా? ఏదశలోనూ, ఏ స్థాయిలో, ఏ విభాగంలోనూ [న్యాయ, రాజకీయ, పాలనా యంత్రాంగ పు ఏశాఖలో కూడా] న్యాయం జరగలేదంటే ఇది రాజ్యాంగం విఫలమవడం కాదా? సామాన్యుణ్ణి ఇంతగా, నూటికి నూరు శాతం కాపాడలేకపోవటం అంటే రాజ్యాంగం విఫలమవ్వడమే. అసలే మనం ఎక్కడెక్కడి పాయింట్లనో కాపీ/పేస్టు చేసుకుని, ఎన్నో లొసుగులతో, కంతలతో గల రాజ్యాంగాన్ని అత్యంత ప్రియంగా తెచ్చుకుని, నెత్తిన పెట్టుకున్నామన్నా విమర్శలు తరచూ వినబడుతున్న నేపధ్యంలో, అయితే గియితే ఇది రాజ్యాంగంపు వైఫల్యం కావాలి, లేదా, రామోజీరావు వంటి నకిలీ కణికుడి వ్యవస్థ అస్థిత్వం కావాలి. రెండు కావటం అనే సంభ్యావత కూడా ఉంది.
నేను పెట్టిన కేసులను రెండురకాలుగా విడగొట్టవచ్చు. ఒకటి: రామోజీరావు లేడు అన్నప్పడు పైకారణంగా [overleaf reason] వేధించిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి [చంద్రబాబు నాయుడు ప్రభుత్వకాలంలో ఎంసెట్ కేసు, ఇంటర్ పేపర్ లీకు కేసు, సూర్యాపేటలో వ్యవస్థీకృత వేధింపు కేసులు. వీటిలో నేను ఎక్కడా రామోజీరావు పేరు ఉదహరించలేదు కదా?] రెండు: శ్రీశైలంలో పెట్టిన వ్యవస్థీకృత వేధింపు కేసులు వీటికి మూలమైన 1992 లో రామోజీరావు మీద పి.వీ.నరసింహారావు కు నేనిచ్చిన ఫిర్యాదు. [రామోజీరావే వ్యవస్థీకృతంగా వేధిస్తున్నాడని అడ్మినిస్ట్రేషన్ పరంగా నేనే నిరూపించాను. అదే రాష్ట్రపతి హోంఆఫైర్స్ కు పంపారు.] ఈకేసులలో కూడా రామోజీరావు పైగాని, నన్ను వేధించిన వారిపై గాని చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉంది రెండు వేరు వేరు పార్టీలయినా [TDP, Congress] అతడికే కొమ్ముకాశాయి. ఈవిధంగా పరిశీలించినా రాజ్యాంగం విఫలమైందనే అనాలి. లేదా నకిలీ కణికుడి వ్యవస్థ ఉందనాలి. ఏది ఏమయినా ఈ రాజ్యాంగం గాని, చట్టం గాని, పాలనా యంత్రాంగం గాని, రాజకీయ వ్యవస్థగాని సామాన్యుడిని కాపాడటం లేదన్నది అక్షర సత్యం.
ఒక ఉదాహరణ చెబుతాను. నరసరావుపేటలో ఇటీవల[2008] జరిగిన సంఘటన! ఓ కుటుంబానికి తాత తండ్రులనుండి వారసత్వంగా సంక్రమించిన ఓ పాత పెంకుటిల్లు ఉంది. అదిప్పుడు ఊరు మధ్య సెంటర్ కావటంతో ఆ భూమికి బాగా గిరాకీ ఉంది. ఓ డబ్బున్న ఆసామి ఆ ఇంటి స్థలాన్ని అమ్మమని అడిగాడు. వీళ్ళు మార్కెట్టు ధర అడిగారు. అతడు తనకిష్టమైన ధర చెప్పాడు. అమ్మడానికి వీళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు అడిగిన ధరకీ, తాను ఇస్తానన్న ధరకీ మధ్య ఉన్న వ్యత్యాసంలో పదోవంతు ఖర్చు పెట్టి, స్థానిక పోలీసుల్ని కొన్నాడు. ఓరోజు తెల్లవారు జామున వచ్చి బుల్ డోజర్లతో ఇంటిని నేలమట్టం చేశారు. పోలీసు స్టేషన్ కి వెళ్తే అక్కడి సి.ఐ. ఫిర్యాదు తీసుకోలేదు సరికదా, ఇచ్చింది తీసుకుని అవతలికి పొమ్మని చెప్పాడు. బహుశః పోకిరి సినిమాలో ఇన్స్ స్పెక్టర్ పశుపతి, బిల్డర్ విశ్వనాధంతో “ఏయ్! విశ్వనాధ్! ఈ ఎన్ కౌంటర్ లో నువ్వు పోలేదు, సంతోషించు” అన్నట్లుగా “ఆ బుల్ డోజర్ల క్రింద ఇంటితో పాటు మిమ్మల్ని తొక్కేసి ఉంటే ఎవరికి చెప్పుకునేవాడివి? ఏ ఎక్సిడెంటో అని చెప్పి కేసు మూసేస్తాం!” అని ఉండవచ్చు. అంతగా ఈ రాజ్యాంగం విఫలమయ్యింది. ప్రజస్వామ్యం పరిహాస పాత్రమయ్యింది.
నిజానికి “దీన్ని రాజ్యాంగం విఫలం కావటం అనాలా? లేక వ్యవస్థీకృతవేధింపు అనాలా” అన్న ప్రశ్నని ప్రధానమంత్రికీ, సోనియాగాంధీకి, రాష్ట్రపతికీ ఏప్రియల్ 8, 2007 న సంధించాము. రాష్ట్రపతి తప్ప మిగిలిన వాళ్ళు స్పందించలేదు.
మరో మాట: ఇంతకు ముందు చెప్పినదే అయినా మరోసారి చెబుతాను – నేను ఈ బ్లాగుని ఎవ్వరి నుండి ఏప్రయోజనం ఆశించి వ్రాయటం లేదు, ఈబ్లాగుతో ఎవరినీ నమ్మించవలసిన అవసరం గానీ, కవ్విన్స్ చేయవలసిన అవసరం గానీ నాకు లేదు. ఎవరైనా దీన్ని నమ్మితే నాకు ఒనగూడే లాభంగానీ, నమ్మకపోతే వచ్చే నష్టంగానీ లేవు. ఎవరైతే ఇదినిజమని అనుకుంటారో, ఎవరి పరిశీలనకైతే దేశం మీద, మన మతం మీద, మన జీవన సరళి మీద కుట్ర జరుగుతుందని గ్రహింపు కొస్తుందో, వారి పరిశీలనకి మరింత పదును సమకూర్చటం కోసం, నా అనుభవాలని జోడించి ఇక్కడ ఉంచాను. ‘అదేమీ లేదనీ, కుట్రలు జరుగుతున్నట్లు ఎక్కడ పేపర్లలో రావటం లేదు కాబట్టి, హిందూమతం పై కుట్రాలా పాడా, అది మీ భ్రమ’ అనుకునే వాళ్ళు, భారతదేశ రాజకీయ, పాలనా యంత్రాంగం బ్రహ్మండంగా పనిచేస్తుందని, ప్రజలందరు సుఖ, సంతోషాలతో ఉన్నారని, లంచాలన్నవే లేవనే వాళ్ళు, ఇలాంటి అభిప్రాయాలు గల అఙ్ఞాతలు నిరభ్యంతరంగా ఈ బ్లాగుని వదిలేయ వచ్చు. ఇది ‘స్ర్కిజోఫినియా’ అని తమ అమూల్య అభిప్రాయాలను వెలువరించనక్కరలేదు. పిచ్చివాళ్ళ వ్రాతని పట్టించుకోకుండా వెళ్ళిపోవటం విఙ్ఞత కదా! ఎవరైతే ఇది నిజం అనుకుంటారో, వాళ్ళు దీన్ని గురించి మరింత తర్కిస్తే, మరికొంత అవగాహన పెరుగుతుంది. మరికొంత సత్యం వెలుగుతుంది.
1992 తరువాత నకిలీ కణికుడి పట్టుజారిపోతున్నందున, ఆ ఏజంట్లు, ఆ వ్యవస్థ ఎలా expose అవుతున్నాయో వివరంగా చెప్పేముందు, దాని పూర్వాపరాల గురించి మరికొంచెం చెప్పాలి. ఇది గమనించగలరు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
8 comments:
ఏమాటకామాటే !!! మీ అన్ని టపాలలోకి నాకీ టపా బాగా నచ్చింది. విశ్లేషించాలంటే నిడివి పెద్దదవుతుందని క్లుప్తంగా చెబుతాను.
"ధనమూలం ఇదం జగత్" అని పెద్దలు ఎప్పుడో చెప్పారంటే ఎంత కఠోర జీవితాన్ని అనుభవించి చెప్పివుంటారు? మారేది సమాజమే కానీ, ఆ సమాజానికి వెన్నుముక గా నిలిచిన మనిషి కొన్ని వేల సంవత్సరాలనాడు ఏరకమైన ఆలోచనలు చేశాడో, ఇప్పుడూ అలానే చేస్తున్నాడు. ఇకముందూ అలానేచేస్తాడు. చచ్చేంతవరకు ధనం/పెద్దరికం/కీర్తి కోసమే ప్రాకులాట. చనిపోయేముందు ఆలోచిస్తాడేమో కాని, అప్పటికి చేయాల్సిందంతా చేసేసి వుంటాడు. మధ్యలో మానాలన్నా యుద్ధంలో సైనుకుడు వెనక్కి రావాలంటే రాగలడా? బ్రతికినంతకాలం ముందుకే...
నాకీటపానే నచ్చటానికి కారణం..మీరు చెప్పినవి నమ్మడానికి సహేతుకంగా వున్నాయి. అంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి మీరే....ప్రత్యర్థి నేరుగా మీతో తలపడ్డాడు..
మిగిలినవి ఇందుకు భిన్నం... జరగలేదని కాదు.. ప్రత్యర్థి నేరుగా తలపడనప్పుడు నిరూపించడం కష్టం..ఒక్కోసారి సాధ్యమేకాకపోవచ్చు. బహుశా ఈ కారణంచేతనే ఎక్కడో కొడిగట్టిన దీపంలా నిజాయితీ వెలుగుతుందనుకున్నా, చేతులు ముడుచుకొని కూర్చుందేమో !!!.. అసలే అటువైపు ఒక వ్యవస్థ. కోరి కోరి వైరం ఎందుకనేమో ? అదే ఈ మీ టపాలో లాగా ప్రత్యర్థి ఒక సాధారణ పౌరుడయ్యుంటే..మీమొదటి ఫిర్యాదుకే సంభావ్యత ౧౦౦ శాతం మిమ్మల్నివరించి వుండేది. ఇది సమాజ న్యాయం.న్యాయమెప్పుడూ ధర్మమే అవ్వక్కరలేదు.
మిమ్మల్ని ‘స్ర్కిజోఫినియా’ అన్నవారి కే నిజం గా ‘స్ర్కిజోఫినియా’ ఉంది. వారు బ్లగ్స్ రాసే వారైతే వాళ్ళ పేర్లు మీరు రాయండి, అటువంటి వ్వారి అసలు స్వరూపం అందరికి తెలుస్తుంది. లేక పొతే నాలుగు కవిత్వాలు,రెండు వ్యాసాలు రాసి బ్లొగ్స్ లోకం లో చాలా మేధవులుగా చేలామణి అయిపోతారు. ఈ 2000 సం||బ్లొగ్స్ లోకం లో చాలా మంది 1940సం|| ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. ఆ రోజులలో కొంతమంది కవులు సామజిక కార్యక్రమాలలో పాల్గొని వారి అనుభవాలను రచనల రూపం లో వెలువరించేవారు. ఇక్కడ (బ్లొగ్స్ లో )అంతా రివర్సు చాలమంది బ్లొగ్స్ రాయడం ద్వారా తామేదొ మంచి వారైనట్లు, ప్రజలను ఉద్దరిస్తునామను కుంట్టున్నారూ. వీరు ప్రజలకి చేసెది ఎమి ఉండదు.
what ever you are writing, we believe in you. keep writing and one day those who called you mental patient will be in a need to go through this blog when they face the facts,im sure..
Akka! Mee Vishaya parignanam, Daanni vivarinche theeru, Chronological orderlo vache sanghatanalu mee medha shakthi ki nidarshanaalu. Mana Baadha naluguritho panchukunte taggutundi. Santhosam panchukunte peruguthundi. Ee blog valla meeku adi neraverithe nenu santhoshistanu. - Oka Tammudu
@భాస్కర రామిరెడ్డి,
నిడివి ఎక్కువైనా ఫర్వాలేదు. నీ విశ్లేషణ మరింత వివరంగా వ్రాయాల్సింది. ఏమాటకామాట చెప్పుకోవాలి. నాకు నీ విశ్లేషణలో కొంత అర్ధం అయ్యింది, కొంత అర్ధం కాలేదు సుమా! మరోలా అనుకోవద్దు.
****
@జయహో గారు,
మనుషులు చెడు చేయకుండా చట్టాలు కొంత వరకూ మాత్రమే నియంత్రించగలవు. మనుషుల ఆలోచనాసరళి, వారి ధృక్పధమే వారి చర్యల్ని ప్రభావపరుస్తుంది. బ్లాగ్లోకంలోనూ అంతే! కాబట్టి అఙ్ఞాతల ‘కువ్యాఖ్యల్ని’ నేను పట్టించుకోను. అందుకే చాలాసార్లు ప్రచురించను. కొన్నిసార్లైనా ఎందుకు ప్రచురిస్తానంటే, అలాంటివారు కూడా ఉంటారని నా బ్లాగు చుట్టాలకి తెలియటానికి. అంతే! అలాంటి అఙ్ఞాతల గురించీ, వారి వ్యాఖ్యల గురించి మన సమయం వృధా చేసుకోవటం ఎందుకు? అందుకే వదిలేద్దాం!
*****
@మనోహర్ గారు,
నాబ్లాగు మొదలు పెట్టినప్పుడు తొలిరోజుల్లో మీరు
>>> Manohar said...
చాలా మందిమి రాయాలనుకొని, రాయగలమో లేమో అని ,రాసిన వాటిని conspiracy లు కాదు అని రుజువు చేసుకోలేమోనని భయపడే వాళ్ళ గళాలన్నీ మీ గళంలో పలికిస్తున్నారు.
great..
December 10, 2008 5:24 PM
అన్నారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ మీరు నాకు మద్దతిస్తూనే ఉన్నారు. ఇది నాకెంతో శక్తినిస్తోంది. కృతఙ్ఞతలు.
*****
@అఙ్ఞాత తమ్ముడికి,
నేను నాబాధ మీతో పంచుకోవాలని ఈ బ్లాగు వ్రాయలేదు. అందరికీ ఈ సత్యం తెలియాలని వ్రాసాను. ఎందుకంటే ఈ దేశం నా ఒక్కదానిదీ కాదు. మా ఒక్కరిదీ కాదు. అందరిదీ. అందరూ కలిస్తేనే మన మాతృభూమిని, మన మట్టిని, మన సంస్కృతిని, మన మతాన్ని, మన బ్రతుకునీ రక్షించుకోగలం. జరుగుతుందేమిటో తెలియక, అన్యాయాన్ని సహించలేక, ముంబాయిపేలుళ్ళ సమయంలో ’జమదగ్ని’లా రగిలిపోయిన ఎన్నో హృదయాల తపననీ, అన్వేషణనీ గమనించి, విషయం తెలిస్తే, కారణం తెలిస్తే ఆ తపన, ఆ రగులుబాటు, ఆ అన్వేషణ సరైన దారిలో ప్రయాణించి, నిర్ణయాత్మక మార్పుని తమ జీవితాల్లోకి తెచ్చుకోగలదని వ్రాసాను. అందులో ‘అందరూ నా బాధని పంచుకోవటం’ అన్నది అదనంగా నాకు ఒనగూడిన ప్రయోజనం. ఇందుకు మాకూ సంతోషమే!
*****
అమ్మా!
నేనే మీకు కృతఙ్ఞతలు చెప్పాలి. ఇన్ని విషయాలు చెప్తున్నందుకు.
మీ పోరాటం ముందు నేను చేసిందెంత, కేవలం నైతిక మద్దతు. అది కూడా ఇవ్వకపోతే , మీరు అందరికీ తెలియచేయాలని రాస్తున్న విషయాలు తెలుస్తున్నాయని, కనీసం కొంతమందైనా మీ బ్లాగ్ కోసం రోజూ ఎదురు చూస్తుంటారని తెలియదేమో అని రాస్తున్నాను.
మీరు రాసిన లాస్ట్ పేరా (మరో మాట ) మేము ఒకటి రెండు సార్లు ఇంతకు ముందె మాలొ మెము విశ్లెషించుకుని , మీరు రాసెది makes sense అనుకున్నకె రెగ్యులర్ గా చదవటం మొదలుపెట్టాం.
నేను రాద్దమనుకున్న అభిప్రాయాలు పైన రెడ్డి గారు, జయహొ , మనొహర్ రాసారు.
మొదట్లొ నేను జస్ట్ చదివి వూరుకునె వాడిని. (response ఇవ్వడానికి బద్దకం వల్ల). కానీ మీలాంటివారికి (మీకు, నేతాజి గురించి రాసె శ్రీధర్ గారికి) ప్రొత్సహం ఇవ్వాలని, మీరు చెప్పెది మెము నమ్ముతున్నం అని మీకు చెప్పాలని అనిపించడానికి మాకు ఇన్స్పిరెషన్ మాత్రం మనొహర్. అతను రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టడం చూసి మాకు అలా చెయ్యలి అన్న అలొచన కలిగింది. థాంక్స్ మనొహర్.
మీ 15 రోజులకో ఉత్తరం గురించి చదివితే నాకో సినిమాలో సన్నివేశం గుర్తొచ్చింది. షాశంక్ రిడెంప్షన్ అని ఒక ఆంగ్ల చిత్రం, అందులో జైల్లో ఉన్న హీరో జైల్లో లైబ్రరీని అబివృద్ది నిమిత్తమై కొంత డబ్బు కేటాయించాలని సంబందిత అధికారికి వారానికో ఉత్తరం రాస్తాడు. కొన్ని నెలలకి ఏవో చారిటీ వాళ్లిచ్చిన కొన్ని పుస్తాకాలు పంపి మళ్లీ ఉత్తరాలు రాయవద్దని అబ్యర్దిస్తారు. దానితో సంతృప్తి చెందక బడ్జెట్లో సముచిత స్థానం కోసం రోజుకో ఉత్తరం రాయటం మొదలెడతాడు. ఇది నిజ జీవిత ఆధారిత సినిమా!
Post a Comment