సద్దాంహుస్సేన్!
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలని ఉర్రూవలూగించిన, ఉత్తేజపూరితుల్ని చేసిన పేరు. మీడియా హోరెత్తించిన పేరు. అతడికి చాలామంది డూప్ లున్నారని, అసలెవరో నకిలీ ఎవరో ఎవరూ కనిపెట్టలేరనీ, అదనీ, ఇదనీ అతడి గురించి ఎన్నో కథలు మీడియావారివి. 2003 క్రిస్మస్ ముందురోజుల్లో పట్టుబడి, 30 డిసెంబరు, 2006 న ఉరితీయబడ్డ ఇరాక్ మాజీ అధ్యక్షుడు. ఇప్పుడంటే, జైల్లో అతడు ప్రతీరోజూ ఏడ్చేవాడని, వార్తలూ లేఖలూ బైటకి పొక్కుతున్నాయి కానీ, అప్పట్లో అయితే, మీడియా ముఖ్యంగా ఈనాడు, సద్దాంహుస్సేన్ గంభీర కంఠంతో తనను విచారించే హక్కు, అధికారం అమెరికాకి లేదని గర్జించాడనీ, తుదిక్షణం వరకూ భయమెరుగడనీ, కంట దుఃఖాశ్రువులే చిందని మేరు నగధీరుడనీ తెగరాసి పారేసింది.
2003 లో ఆ రోజునే అతడు బంకర్ లో దొరుకుతాడని, అప్పుడు ఫోటోలు తీసిన ఫోటో గ్రాఫర్ కి ఎలా తెలుసు? పోనీ, సద్ధాం హుస్సేన్ ని పట్టుకున్న సైనికులకి కలొచ్చిందా ఈ రోజు తాము సద్దాంహుస్సేన్ ని పట్టుకోబోతున్నామని, ఫోటో గ్రాఫర్లని వెంట బెట్టుకుపోవడానికి? లేదూ, ప్రతీరోజూ, ప్రతి సైనిక బృందంతోనూ ఫోటో గ్రాఫర్లు వెళుతూనే ఉంటారా, ఏక్షణం ఏ బంకర్లో సద్దాం హుస్సేన్ దొరుకుతాడోనని?
నిజానికి సద్దాం హుస్సేన్ 2003 క్రిస్మస్ ముందురోజుల్లోనే దొరకలేదు. ముందుగానే దొరకబుచ్చుకున్న సద్దాం హుస్సేన్ ని, ఆరోజు ప్రపంచానికి దొరికాడని చూపించదలుచుకున్నారు గనుక, తీసుకుపోయి బంకర్లో ప్రవేశపెట్టి, ఫోటోలు వీడియోలతో సహా మరోసారి బంధించారు, లేదా పట్టుకున్నారు. ఇది మనం బోలెడు సినిమాలలో చూసిన ట్రిక్కే. బోలెడు సార్లు వార్తల్లో విన్న ట్రిక్కుకూడా! దొంగలని, నేరగాళ్ళని పోలీసులు ముందే అదుపులోకి తీసుకున్నా, తాము ఎప్పుడు ఆవిషయం బయట పెట్టదలుచుకుంటే, అప్పుడే పట్టుకున్నట్లుగా చెబుతారని అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా ఈ టిక్నిక్కే సద్దాం హుస్సేన్ విషయంలో ప్రయోగింపబడింది.
సరిగ్గా ఇలాంటి టెక్నిక్కే ఇప్పుడు శ్రీలంకలో, వేలుపిళ్ళై ప్రభాకరన్ విషయంలో ప్రయోగింపబడుతోంది.
వేలుపిళ్ళై ప్రభాకరన్!
ఎల్.టి.టి.ఈ. అధినేత. మీడియా చేత పెద్దపులిగా పిలవబడుతున్న నాయకుడు. హమాస్ వంటి ముస్లిం ఉగ్రవాద సంస్థలకు నిలయమైన లెబనాన్ లో తమ సభ్యులకి శిక్షణ నిప్పించిన దిట్ట.[ఈ లాబీయింగ్ ఎవరు చేసిపెట్టారో? లెబనాన్ వంటి దేశానికి లంక తమిళుల సమస్యతో సంబంధమేమిటో? డబ్బు తీసుకుని శిక్షణ నిచ్చిందో మరి?] ప్రపంచానికి తొలిసారిగా మానవబాంబుల్ని, ఆత్మాహుతి దాడుల్ని పరిచయం చేసిన ఘనుడు. పట్టుబడితే చాలు, సైనేడు గుళికలు మ్రింగి ప్రాణాలు తీసుకునేంతగా తమ సభ్యుల్ని మోటివేట్ చెయ్యగలిగిన వాడు. రాజీవ్ గాంధీని హత్య చేసిన ధనూ, తనను తాను పేల్చుకుని మరణించింది. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసిన శివరాసన్, శుభల బృందం, సిట్ పోలీసులు తమని చుట్టుముట్టగానే సైనైడు మింగి చచ్చిపోయారు.
తమ సైనికుల్ని, లేదా సభ్యుల్నే అంతగా ప్రాణాలకు తెగించేలా పోరాడేటట్లు తీర్చిదిద్దిన నాయకుడు, తన ప్రాణాలకు ఆశించి, పిరికిపందలా పారిపోతాడా? పారిపోవచ్చని కరుణ [ప్రభాకరన్ మాజీ అనుచరుడు, ప్రస్తుత లంక మంత్రి] వంటివారు అంటున్నారు. రాజీవ్ గాంధీ హత్య గురించిన నిర్ణయం కేవలం వేలుపిళ్ళై ప్రభాకరన్, ఎల్.టి.టి.ఇ. ఇంటిలిజెన్స్ ఛీఫ్ పొట్టుఅమ్మన్ లు ఇద్దరే తీసుకున్నారనీ, అత్యంత రహస్యంగా ఆ ఆపరేషన్ ని ఉంచారని కరుణ ఆరోపిస్తున్నాడు. అంత రహస్యంగా, తమ అనుచరులకి కూడా చెప్పకుండా, కేవలం తామిద్దరే ఆ ’డీల్’ ఎవరితో, ఎంతకి చేశారో మరి? తమిళ ఈలం అనే ప్రత్యేక రాజ్యం కోసమైతే, అనుచరుల్లో మరి కొందరికైనా చెప్పేవాళ్ళు గదా! ప్రభాకరన్ పై యుద్దాన్ని ఆపివేయాలని, ముల్లైతీవు మొదలైన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవద్దని, ప్రపంచవ్యాప్తంగా రాజ్ పక్సేని ఒత్తిడి చేస్సున్నారు. కరుణానిధి రెండు ఎయిర్ కూలర్లూ, పరుపూ, మంచం గట్రా వేసుకుని మరీ ‘ఆమరణ నిరాహార దీక్ష’ పూనాడు. పైకారణంగా లంకసైనికులు, ఎల్.టి.టి.ఇ. సభ్యుల మధ్యపోరులో అమాయక తమిళులు నలిగిపోతున్నారన్న మానవతా వాదం చెప్పబడింది. దీనికి రాజపక్సే ప్రభుత్వం తిరుగు ఎత్తుగడ వేసింది. వీళ్ళు అందరికీ చూపించే ‘రెడ్’ టేపిజాన్ని’ వీళ్ళకే చూపించింది. “మీ ఆందోళన అంతా అమాయక తమిళ ప్రజల గురించే కదా! ఎటూ వేలుపిళ్ళై ప్రభాకరన్ [పెద్దపులి] దాదాపు ఆరు చదరపు కిలోమీటర్లలో [అప్పటికి, ఇప్పుడైతే అతడి గుహని చుట్టుముట్టాం అంటున్నారు] పరిమితం అయిపోయాడు. కాబట్టే భారీ సైన్యం, భారీ ఆయుధాలు ఇక మాకు అవసరం లేదు. తేలికపాటి ఆయుధాలు ఉపయోగిస్తాం. అధిక సంఖ్యలో సైనికుల్ని, తమిళ ప్రజలకు సహాయం చేయటానికి, వాళ్ళని సహాయశిబిరాలకి తీసికెళ్ళటానికి ఉపయోగిస్తాం” అని ప్రకటించింది. పాపం! దెబ్బకి కరుణానిధికి నిరాహారదీక్ష మంచం దిగక తప్పలేదు.
అయితే సమస్య అక్కడితో తీరలేదు. ఇక సూటిగా వేలుపిళ్ళై ప్రభాకరన్ ని సైన్యం పట్టుకోకూడదు అనాలి. [చంపకూడదని, ఇంకా అదీ ఇదనీ నసిగాడనుకొండి.] ఇక అటు చూస్తే అసలు పెద్దపులి ఎప్పుడో రాజపక్సే ప్రభుత్వానికి చిక్కి ఉండాలి. అందుకే అప్పటివరకూ రఁయ్యి మన్న యుద్దం, ఇక ఇప్పుడు “ఈ క్షణమో, మరు క్షణమో ప్రభాకరన్ ని పట్టుకుంటాం. పెద్దపులి తప్పించుకోలేదు. లొంగిపోవడమో, మరణించటమో. ఇవే అతడి ముందున్న దారులు” అంటూనే కొన్నిరోజులుగా యుద్దం సాఆఆఆ…గుతోంది. అంటే ఎప్పుడు తాము ప్రపంచానికి ప్రభాకరన్ ని పట్టుకున్నట్లుగా చూపించదలచుకున్నారో, అప్పుడు అతణ్ణి, అతడి బంకరు దగ్గరో, మరో గుహ దగ్గరో ప్రవేశపెట్టి, ఫోటోలు వగైరా సాధనాలతో పట్టుకుంటారన్న మాట.
ఇంతకీ అతడు పట్టుబడితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎంత నష్టం? తమ దేశంలో ప్రభాకరన్, అతడి సభ్యులు చెయ్యని ఘోరం లేదు. తమ దేశాధ్యాక్షుడు ప్రేమదాసతో సహా ఎందరో రాజకీయ నాయకులని, ప్రజలని ఎల్.టి.టి.ఇ. పొట్టన బెట్టుకున్నది. అయినాగానీ రాజపక్సే ప్రభుత్వం పొరుగునున్న పెద్దదేశంగా భారత్ ను మన్నిస్తూ “ప్రభాకరన్ దొరికితే, భారత్ అతణ్ణి అప్పగించమని కోరితే, తప్పకుండా అప్పగిస్తామని” పదేపదే ప్రకటిస్తోంది. ఇటు కేంద్రప్రభుత్వంలోని ప్రధానమంత్రిగానీ, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న కుర్చీవ్యక్తి, రాజీవ్ గాంధీ భార్య అయిన సోనియాగాంధీ గానీ, ఆ విషయమై నసుగుతారే గానీ, గట్టిగా నోరు విప్పితే ఒట్టు. హుటాహుటిన ఎన్.నారాయణన్, శివశంకర్ మీనన్ లు మాత్రం ఆఘమేఘాల మీద [అక్షరాలా ఆఘమేఘాల మీదే, ఢిల్లీ నుండి కొలంబోకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన ఈ రక్షణ వ్యవహారాల నిపుణుడూ, విదేశాంగ కార్యదర్శి, ఇద్దరూ కూడా కొలంబోలో అధ్యక్షభవనానికి నేరుగా హెలికాప్టరులో వెళ్ళారు] ఒకటికి నాలుగుసార్లు పరుగులుపెట్టి రాజపక్సేని అనుకూల పరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. [ఎంత లాబీయింగో?] ఇదే విషయమై, ప్రభాకరన్ పై యుద్దాన్ని ఆపాలంటూ, అమెరికా లంకమీద ఒత్తిడి తెస్తోంది. బ్రిటన్, ఫ్రాన్సులు ప్రత్యేకంగా రంగంలోకి దిగి కొలంబో వెళ్ళి మరీ బేరాలాడాయి. ఒళ్ళుమండిన రాజపక్సే, అతడి సహచరులు “ఏమీ, ఎల్.టి.టి.ఇ. అమాయక ప్రజల్ని బాంబుదాడులతో చంపినప్పుడూ, హింసోన్మాద చర్యలకి పాల్పడినప్పుడూ, ఒక్కదేశమూ కిమ్మనలేదే? ఇప్పుడు యుద్దంలో సైతం, ఆత్మాహుతి దళ సభ్యులు ప్రజల్లోకి వెళ్ళి తమని పేల్చుకుంటే, ప్రజల్ని తమకి రక్షణ కవచంగా వాడుకుంటుంటే, యూరప్ దేశాలు, ప్రపంచదేశాలు ఒక్కమాట ఎల్.టి.టి.ఇ.ని అనలేదే? ఇప్పుడు ప్రభాకరన్ పట్టుబడే దశకు వచ్చేసరికి, అందరూ మాపైన ఒత్తిడి తెస్తున్నారు?" అంటూ నిలదీసారు. నిజానికి ప్రభాకరన్ ఇప్పటికే రాజపక్సే ప్రభుత్వ ఆధీనంలోని రహస్య స్థావరానికి, తరలింపబడకపోయి ఉంటే, ఈపాటికి ఈ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులన్నీ అతణ్ణి తప్పించే పనిలో బిజీగా ఉండి ఉండేవి. యుద్దం ఆపమన్న పైకారణం[over leaf reason] పెట్టుకుని, అతణ్ణి విడిచిపెట్టమని లాబీయింగ్ చేసేవి కావు.
అయితే, ప్రభాకరన్ పట్టుబడితే ఎవరికి ప్రమాదం? ఎవరి రహస్యాలు వెల్లడి అవుతాయని ఈ వత్తిడంతా? [పాపం! ఆ భయంతోనే కాబోలు కరుణానిధి జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు.] 2006 లో శ్రీశైలంలో సి.ఐ. కరుణాకర్ [అతడిప్పుడు ప్రమోషన్ తో అనంత పురం డి.ఎస్పీగా పనిచేస్తున్నాడు లెండి.] రాజీవ్ గాంధీ హత్య విషయంలో రామోజీరావు కుట్రగురించిన నాకేసు విషయమై మాట్లాడుతూ “ఇప్పుడు మనం ఎప్పుడో చనిపోయిన రాజీవ్ గాంధీ హత్య గురించి మాట్లాడితే అందరూ మనల్నీ పిచ్చివాళ్ళను కుంటారు” అన్నాడు. మూడేళ్ళు తిరక్కుండానే, ఇప్పుడు ప్రభాకరన్ పట్టుబడితే, రాజీవ్ గాంధీ హత్య కేసు విషయమై అతణ్ణి భారత్ కు అప్పగిస్తామని, స్వయంగా లంకప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు చాలామందే ఆ విషయం మాట్లాడుతున్నారు. అందరికీ పిచ్చేనా?
అప్పట్లో అంటే 1991 లో, రాజీవ్ గాంధీ హత్య తామే చేసామని సగర్వంగా ఎల్.టి.టి.ఇ. ప్రకటించుకుంది. పైముఖంగా ఉన్న ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్, రాజీవ్ గాంధీ లంకకి శాంతి సైన్యం పంపడమే హత్యకు తమ పైకారణంగా చూపించాడు. పైముఖంగా ధనూని, శివరాసన్ బృందాన్ని వాడాడు. ఇప్పుడు తెరవెనుక ఏకారణాలూ, ఏ వ్యక్తులూ వెలుగులోకి వస్తాయనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వగైరాదేశాలన్నీ లంకప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి? నిజానికి ప్రభాకరన్ పట్టుబడితే వాళ్ళకేం నష్టం? వాళ్ళ దేశాలకేం కష్టం? అంటే ఎవరిని కాపాడటానికి, ఎవరి పనుపున, ఎవరికోసం, ఈవత్తిడంతా, ఈ లాబీయింగ్ అంతా, వాళ్ళు చేస్సున్నట్లు? ఇది చెప్పడం లేదా ప్రపంచాన్నంతా నడుపుతుంది ఒకే వ్యవస్థ అని, అది నకిలీ కణికుడిదని?
నిజానికి ఆత్మాహుతి చేసుకోగల సభ్యుల్ని తయారు చేసిన నాయకుడు తాను విజయమో, వీర స్వర్గమో ఎంచుకోకుండా, పారిపోవడమూ లేదా విడిచిపెట్టమని పరోక్షంగా ప్రత్యర్ధిని వత్తిడి చేయటమూనా? ఇదా నాయకత్వం? ఈ నాయకత్వాన్నా పెద్దపులి, ధీర గంభీర XYZ అంటూ మీడియా తెగ పొగిడింది. కలుగులో ఎలుకల్లా [ఈమాట సద్దాం హుస్సేన్ పట్టుబడినప్పుడు అతడి గురించి మీడియా ఉపయోగించింది.] తాము బంకర్లలో దాక్కుని తమ అనుచరుల్ని మాత్రం చావో రేవో తేల్చుకుని రమ్మనటం యుద్దమా? రాముడో, భీష్ముడో తాము శిబిరాల్లో కూర్చొని, సైనికుల్ని యుద్దం చెయ్యమన లేదు. అప్పటి రోజులెందుకు? మొన్నటి శివాజీ తాను కోటలో కూర్చుని, సైనికుల్ని పోరాడి రమ్మనలేదు. రాక్షసుడి వంటి హెయిస్తుఖాన్ తో పోరాటానికైనా తానే వెళ్ళాడు. ఏ యుద్దానికైనా ముందు అడుగువేసి నడిపిన నాయకత్వం ఆవీరుడిదే. నిన్నటి బాపూజీ సైతం, తాను సబర్మతి లో కూర్చొని సత్యాగ్రహుల్ని దండి మార్చ్ చెయ్యమనలేదు. ఉద్యమకారులపై బ్రిటిషు ముష్కరులు తుపాకి గురిపెడితే తొలితూటా తన గుండెల్లోనే సుమా అన్నట్లు అగ్రభాగాన నిలిచి అనుచరులని నడిపించాడు. అది కదా నాయకత్వం అంటే?
అలాగ్గాక, తాము ఏసీ బంకర్లలో లేదా తోరాబోరా గుహల్లో కూర్చుని, పసితనం నుండి ఉన్మాదం తలకెక్కించిన పిల్లల్ని సైనికులంటూ, ఆత్మాహుతి సభ్యులంటూ ప్రజలమీదకి బాంబుల దాడులూ, దమన కాండలూ నిర్వహించడానికి పంపే ప్రభాకరన్ లూ, బిన్ లాడెన్ లూ, మీడియా ఇమేజ్ ఇచ్చి నాయకులు గానీ, లేకపోతే ఇదా నాయకత్వం? మొత్తానికి ఇలాంటి ఈ నాయకమ్మణి, వేలుపిళ్ళై ప్రభాకరన్ అలియాస్ పెద్దపులి బయటికొస్తే, ఆ తోక పట్టుకుని ఎన్ని రహస్యాలు వెల్లడి కావాలో వేచి చూడాల్సిందే!
మరో యదార్ధం ఏమిటంటే – ప్రభాకరన్ పట్టుబడితే, అయితే గియితే రాజీవ్ గాంధీ హత్యవెనుక, సి.ఐ.ఏ. హస్తం బయటికి వస్తుందని, అది అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఐ.రా.స.ని తోడుగా తీసుకుని, లంకమీద ఒత్తిడి తెస్తున్నాయని అనుకుందామన్నా, అలాంటి సమస్యలు సి.ఐ.ఏ.కి కొత్తకాదు. అంతేనా? అలాంటివాటిని సి.ఐ.ఏ. తన గొప్పదనానికి, బలానికి తార్కాణాలుగా భావిస్తుంది. కాబట్టే 1991 ల్లో రాజీవ్ గాంధీ హత్యానంతరం, హత్యకు ధనూ ఉపయోగించిన బాంబుల్లోని పేలుడు పదార్ధం ఆర్.డి.ఎక్స్. అనీ, అది సి.ఐ.ఏ. దగ్గరి మాత్రమే లభ్యమౌతుందనీ సగర్వంగా, బాహాటంగా, మీడియా ద్వారానే ప్రచారించుకుంది. అటువంటప్పుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ పట్టుబడితే కరుణానిధికి ఇబ్బంది కావచ్చు. అయితే, కేవలం భారతదేశంలో ఒక రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి [భవిష్యత్తులో గెలుస్తాడో లేదో తెలియదు], కరుణానిధి కోసం సి.ఐ.ఏ., అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐ.రా.స.లు రాజపక్సేతో లాబీయింగ్ చేస్తాయా? లంకమీద ఒత్తిడి తెస్తాయా? ఒకవేళ డి.ఎం.కె. పార్టీ తమ భాగస్వామ్య పార్టీ గనుక, కేంద్రంలోని యూ.పి.ఏ. ప్రభుత్వం ప్రయత్నించి అమెరికా, బ్రిటన్ ,ఫ్రాన్సులు లంకమీద ఒత్తిడి తెచ్చేలా చేసిందని అనుకుందామన్నా, తన భర్తని హత్య చేయించిన ప్రభాకరన్ ని కాపాడటానికి సోనియాగాంధీ అధ్యక్షుతన పనిచేస్తున్న యూ.పి.ఏ. ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తున్నట్లు? ప్రయత్నించినా, యూ.పి.ఏ. మాట ప్రపంచదేశాలు [అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐరాస] వింటాయా? వినేటట్లయితే 26/11 ముంబాయి ముట్టడి నేపధ్యంలో కూడా యూ.పి.ఏ. మాట చెల్లుబాటు అయి, ఇస్లామాబాద్ మీద ఒత్తిడి వచ్చి ఉండాల్సింది గదా? బదులుగా అన్ని దేశాలతో పాటు ఇస్లామాబాద్ కాదు, చివరికి కసబ్ కూడా ఒంటెద్దు పోకడ చూపిస్తున్నాడయ్యో, అచ్చంగా ఇస్లామాబాద్ ఏసాక్ష్యం చూపినా ఇది చాలదన్నట్లుగా, కసబ్ కూడా మొన్న ‘నేను మైనర్’ని అన్నాడు, నిన్న ‘నిర్దోషిని’ అంటున్నాడు.
ఈ నేపధ్యంలో, మరి యూ.పి.ఏ. ప్రభుత్వం, ఎలా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఐరాసలనీ కదపగలదు? కదిపి, లంకమీద ఒత్తిడి తెచ్చేలా చేసిందనుకుందామన్నా ఎందుకు చేస్తున్నట్లు? యూ.పి.ఏ. చేయనట్లయితే మరి ఎవరికోసం ఆయాదేశాలన్నీ లంకమీద, ప్రభాకరన్ ని వదిలెయ్యమని ఒత్తిడి చేస్తున్నట్లు? ఇక్కడ స్పష్టంగా కన్పించడం లేదా ప్రపంచాన్ని నడుపుతుంది ఒక గూఢచారవలయమనీ, సి.ఐ.ఏ., బ్రిటన్, ఫ్రాన్స్, వగైరా దేశాలైనా, ఐరాస అయినా, ఆ గూఢచార వలయంలోని ఉపాంగాలేనని?
అయినా ఇందరిని ఎదిరిస్తూ, చిద్విలాసంగా, ‘ఈనాటికి మాకూ ’సీన్’ వచ్చింది, ఇన్నిదేశాల నుండి ప్రతినిధులు మన చుట్టు తిరుగుతూ పెద్దపులిని వదిలేయమంటూ’ నానాఫీట్లూ చేయడాన్ని ఉత్సాహంగా, ఒకింత ‘వినోదంగా’ తిలకిస్తున్న రాజపక్సేకి, ఒక చిన్నదేశం, లంకకి, [రేపు ఈ దేశాలన్ని కలిసి తమని నానా ఇబ్బందులకూ గురిచేస్తాయన్న భయం లేకుండా ఇంత చేస్తున్న లంకకి, రాజపక్సేకి] ఎవరు ఇంత శక్తిని ఇచ్చినట్లు? ఆ శక్తి ఏ స్ట్రాటజి వల్ల వచ్చింది? ఆ శక్తే నకిలీ కణికుణ్ణి, అతడి వ్యవస్థనీ, అతడి ఏజంట్లనీ, వాళ్ళ స్ట్రాటజీని బహిర్గత పరుస్తుంది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
14 comments:
సద్దాం హుస్సేన్ బంకర్లో పట్టుబడినప్పడు ఫోటొల్లేవే!!
ఫస్ట్ పిక్చర్స్ బయటకు వచ్చింది ఆ తర్వాత, తనని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు/చేస్తూన్నప్పుడు రిలిజ్ చేసారు. తననో ఖైదీ లాగా ట్రీట్ చేస్తున్నట్లు ఫోటోలు రిలీజ్ చేయడం అనేది ఓ స్ట్రాటజీ లో భాగం.
మీ టపా మొదటి భాగం is not accurate.
chaala adbutham ga chepparu nenu monna adigina sandehaniki (ade ee nakili kanikudu ela gila gila kottukuntunnadani).
rendu,moodu rojula kritham TOI,Bangalore chadivethapudu srilanka news choosa, rajapakse cheppadu " merenduku LTTE itharulanu chanpinapudu eematram adducheppaledu kaani ippudu mathram vaallaki supportga vasthunnaru " ani.
idi chadiviva naaku artham kaledu, intha chinna srilanka ee vidhaga ela prasna veyagaluguthini! entha diryam undi ani.
ippatiki naaku koncham arthaminadi.
mee tarvathi tapaallo marinchaga telusukovalani uthsahapaduthunnau
ee vishayalanu maaku chaala baaga artham ayyela telupu thunnathu chaala santhosham.
baaga raasaru medam chaala bhaavundhi
@ KumarN గారు,
ఆ ఫోటోని నేనే చూశాను. నాకు గుర్తుండి ఈనాడులోనే వచ్చింది.
@Anonymous గారు,
ప్రక్కన లేఖిని ఉంది కదా. తెలుగులో టైపు చేయటానికి ప్రయత్నించండి. వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.
@pullaraokanaparthi గారు,
వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు
శ్రీలంక ధైర్యం చూస్తుంటె నకిలీ కనికుడి లాంటి మరొ వ్యవస్థ అండగా వుందనిపిస్తొంది. ఒక వేళ ప్రభాకర్ దొరికితె విషయం అంతా తెలుసుకొని CIA ని బ్లాక్ మైల్ చేస్తూ పబ్బం గడుపుకోవచ్చు కాని విషయాన్ని లీక్ చెయ్యకపొవచ్చు. ఈ విషయం లొ చైనా ఎమైన శ్రీలంక కి అండగా వుందా అని అనుమానం. ఎందుకంటె చైనీయులు సిమ్హళీలు బౌద్దులే కధ.
http://www.defence.lk/new.asp?fname=20090422_11
http://kalugu.com/2009/01/05/ltte-china-or-ltte-pakistan-partnership-possible/
good one
వెంకట్ గారు,
సి.ఐ.ఏ.కి వ్యతిరేకంగా చైనా పనిచేసేటట్లయితే మరి పాకిస్తాన్ వెనుక అమెరికా, చైనా రెండూ ఎలా ఉన్నట్లు? చైనా, పాకిస్తాన్ కి 1965 లోనూ, 1971 లోనూ జరిగిన యుద్దాల్లో మనకి వ్యతిరేకంగా ఆయుధసాయం కూడా చేసింది కదా! అలాగే చైనా, లంకకి మద్దతు ఇచ్చేందుకు బౌద్దం కారణం అయ్యేటట్లయితే, మరి బౌద్దానికి జన్మస్థానం భారతదేశమే కదా! మరి మన భూభాగాన్ని ఎలా దురాక్రమించినట్లు? ఇప్పటికి అదే ప్రయత్నం అరుణాచల్ ప్రదేశ్ తమదే అనటం? కాబట్టి అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సు, ఐరాస, పాకిస్తాన్ అన్నీ నకిలీ కణిక వ్యవస్థలోని ఉపాంగాలే ! కాబట్టి ఇంకా ఏమి జరుగుతుందో వేచి చూద్దాం!
సద్దాం హుస్సేన్‌ని బంకర్లోనుండి బయటికి తీస్తున్న ఫోటోలున్నాయి. అయితే వాటి విషయంలో అమ్మఒడి గారి అనుమానాలే అసమంజసంగా ఉన్నాయి. ఆ మాత్రం ఫొటోలు తీయటానికి మీడియా అవసరం లేదు. అమెరికన్ సైనికులకి తూటాలు పేల్చటమే కానీ ఫొటోలు తీయటం రాదా? సెర్చ్ పార్టీలతో మిలటరీ ఫొటోగ్రాఫర్లనీ తీసుకెళ్లే సంప్రదాయం చాలాచోట్ల ఉంటుంది.
అమ్మఒడిగారికి రామోజీ అంటే ద్వేషం ఉండొచ్చు. దాని వెనుక సహేతుకమైన కారణాలే ఉండొచ్చు. కానీ రామోజీకి దేశ చరిత్ర గమనాన్నే సమూలంగా మార్చిపారేసే శక్తి యుక్తులున్నాయనటం, ఆయన ప్రతి చర్య వెనుకా అంతర్జాతీయ స్థాయి కుట్రే ఉందనటం హాస్యాస్పదంగా ఉంది. ఆ స్థాయిలో కుట్రలు చేసేవాడు, అమ్మఒడిగారి కుటుంబాన్ని వేధించిన వాడు .. ఆవిడీ రకంగా శరపరంపరగా వ్యాసాలు రాసి ఆయన్నేకుతుంటే చూస్తూ ఊరుకునేంత పిచ్చివాడా? నిజంగా ఆవిడ చెప్పే నైజమూ, స్థాయీ, అవసరమూ రామోజీకుంటే ఆమెనేమైనా చేసి తన చేతికి మట్టంటకుండా చేసుకోగల తెగువ కూడా ఉంటుంది. ఎందుకీ వృధా ప్రయాస?
మూడుముక్కల్లో బా గుం ది.
సద్దాం హుస్సేన్ పట్టుబడింది డిశంబర్ 13, 2003న, క్రిస్ట్ మస్ న కాదు.
అతను పట్టుబడిన తర్వాత మొట్టమొదట రిలీజ్ చేయబడిన పిక్చర్స్ ఈ క్రింద లింకులో ఉన్నాయి.
http://news.bbc.co.uk/2/hi/in_depth/photo_gallery/3318041.stm
దాని తర్వాత ఒక పిక్చర్ కేవలం ఇంటర్నెట్ లో మాత్రమే తిరుగాడిన ఫోటో ఈ క్రింద లింకులో ఉంది, కాని దాని ఎవ్వరూ authentify చేయలేదు ఇప్పటివరకీ.
http://en.wikipedia.org/wiki/File:SaddamSpiderHole.jpg
సద్దాం పట్టుబడింది, సాయంత్రం 8.30పి ఎం కి. జాగ్రత్తగా చూస్తే ఈ ఫోటోలో ఎక్కడా బంకర్ లోంచి అతన్ని బయటకు లాగుతున్నట్లుగా లేదు. అలాగే దాని క్రింద ఉన్న టెక్స్ట్ కూడా చూస్తే, ఆ ఫోటో జూలై 2004 లో తీసినట్లుగా ఉంది, కాని అది నిజం కాకపోవచ్చు. 2004 లో సద్దం జైల్లో ఉంటాడు కాని బయట గ్రౌండ్ లో ఎందుకుంటాడు? I question the photo and the history behind it.
ఒకవేళ అదంతా నిజమయినా కూడా, ట్రూప్స్ పర్సనల్ కెమెరాలు క్యారీ చేయొచ్చు. అమెరికన్ మిలటరీ రూల్స్ పర్సనల్ కెమెరాలని అనుమతిస్తాయి, కాపోతే కాంట్రొవర్షియల్ ఫోటోలకి అనుమతి ప్రొసీజర్స్ వెరే ఏవో ఉంటాయి.
అబ్రకదబ్ర గారు,
సద్దాం హుస్సేన్ ని బంకర్లో నుండి బయటకు తీస్తున్న ఫోటోలున్నాయని మీకూ గుర్తున్నందుకు, ఆ విషయం ఇక్కడ చెప్పినందుకు కృతఙ్ఞతలు. మీ మాట ప్రకారం సైనికులు తూటాలతో పాటు కెమెరాలు కూడా పట్టుకుని వెళ్ళవచ్చు. మీరు ఆ విషయం ఎత్తి చూపినందుకు మరోసారి కృతఙ్ఞతలు. ఇక మీరు అన్నాక మరికొన్ని సందేహాలు ఎత్తి చూపాలన్న ఆలోచన వచ్చింది.
అమెరికా క్రిస్టియన్ దేశం. ఇరాక్ ముస్లిం దేశం. దాదాపుగా రెండు మతాలమధ్య, రెండు మతపరమైన దేశాలమధ్య, జరుగుతున్న యుద్దంలో, సరిగ్గా క్రిస్మస్ ముందురోజుల్లో సద్దాం హుస్సేన్ పట్టుబడటం, క్రిస్టియన్ల్ దేవుడు ముస్లింల దేవుడిపై సిబాలిక్ గా విజయం సాధించినట్లు, అంత యాదృచ్ఛకంగా ఎలా జరిగిందబ్బా?
ఇక రెండవ పేరాలో మీరు వ్యక్తీ కరించిన సందేహాలన్నిటికీ నేను సహేతుకంగా, సవివరంగా సమాధానాలు వ్రాస్తాను. కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పగలిగినవి కావు గనుక.
కుమార్ ఎన్. గారు,
మీరు చెప్పింది నిజమేనండి! నేను మరోసారి తిరగేసాను. సద్దాం హుస్సేన్ పట్టుబడినట్లుగా చెప్పబడింది క్రిస్మస్ కి కొద్ది రోజుల ముందు. దాన్ని నేను క్రిస్మస్ రోజుగా పొరపడ్డాను. టపాలో సరిదిద్దాను. కృతఙ్ఞతలు.
కుమార్ గారు,
నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ’ఏరోజు పట్టుకున్నారు, ఫోటో, విడియోలతో సహా పట్టుకున్నారా లేదా’ అని కాదు. ముందుగానే దొరకబుచ్చుకున్న సదరు వ్యక్తులని తాము ఏరోజు ప్రపంచానికి చూపించదలుచుకుంటే ఆరోజు పట్టుబడినట్లుగా చెబుతారన్న స్ట్రాటజీ గురించి నేను ప్రధానంగా చెప్పాను. అదే స్ట్రాటజీ సద్దాం హుస్సేన్ విషయంలో ప్రయోగింపబడిందనీ, ప్రభాకరన్ విషయంలోనూ అదే ప్రయోగింపబడుతుందని చెప్పాను.
Post a Comment