సైన్సు విద్యార్ధులకి, ఇంటర్ మీడియట్ సిలబస్ లో బోర్స్ పరమాణు నమూనా గురించిన పాఠం ఉంటుంది. అందులో కొన్ని [3] ప్రతిపాదనలు [Assumptions/ Postulates] ముందుగా చెబుతాము. ఆ ప్రతిపాదనలతో సిద్దాంతాన్ని[పరమాణు నమూనాని] వివరిస్తాం, విశ్లేషిస్తాం. తర్వాత యదార్ధ సంఘటనలకు [Practical Verification] అనువర్తించి, సిద్దాంతాన్ని దాని పునాది అయిన ప్రతిపాదనలని పరిశీలిస్తాం. వాటికి సరిపోలితే, అంటే యదార్ధ సంఘటనలని ఆ ప్రతిపాదనలు సరిగా వివరించగలిగితే అవి ఆమోద యోగ్యమవుతాయి. లేదా బుట్టదాఖలా అవుతాయి. ఆ విధంగా బోర్స్ ప్రతిపాదనలు పరిశీలించినప్పుడు, అటామిక్ స్పెక్ట్రమ్ లైన్స్, జీమన్ ఎఫెక్ట్ వంటి facts అవి విశదీకరించలేకపోయాయి. n=1 అయిన ఆర్బిటాల్ కు, అంటే వృత్తాకృతిలో గల ఆర్బిటాల్ ఉన్న పరమాణువుని మాత్రమే [అంటే హైడ్రోజన్ ని మాత్రమే] బోర్స్ ప్రతిపాదనలు వివరించగలిగాయి. కాబట్టి బోర్స్ నమూనాని మరికొంత ముందుకు తీసుకువెళ్ళి, సోమర్ ఫీల్డు దీర్ఘ వృత్తాకార [elliptical] ఆర్బిటాల్ ను ప్రతిపాదించాడు. అది శాస్త్రీయ పద్దతి.

అంటే, మొదటగా కొన్ని ప్రతిపాదనలు తీసుకుని, వాస్తవిక సంఘటనలతో సరిపోల్చి, అనువర్తించి పరిశీలించడం అన్నమాట. ఇది గణతంలోనూ ఉన్నపద్దతే. మనం బీజ గణితంలో ఏదైనా సమస్య సాధించవలసివచ్చినప్పుడు, ముందుగా మనం సాధించవలసిన దాన్ని ‘x’ గా ప్రతిపాదిస్తాం. తర్వాత లెక్కలో ఇచ్చిన దత్తాంశం [Dataని] సమీకరణంగా వ్రాస్తూ ‘x’ కు అనువర్తిస్తాం. తర్వాత సమీకరణాన్ని సాధిస్తూ ‘x’ విలువ ఏమిటో, ‘x’ అంటే ఏమిటో తెలుసుకుంటాం.

మరో పద్దతి ఉంది. ముందుగా [Practical facts and natural phenomena] వాస్తవిక సంఘటనలని తీసుకుని, వాటిని విశదీకరిండానికి సిద్దాంతాలని ప్రతిపాదిస్తారు. ఉదాహరణకి – సోలార్ స్పెక్టమ్ ని పరిశీలించాక ఫ్రాన్ హోఫర్ అందులో కొన్ని తరంగ ధైర్ఘ్యం గల రేఖలు అదృశ్యం కావడాన్ని గమనించాడు. ఆ వాస్తవిక సంఘటన ఆధారంగా సూర్యునిలో హీలియం తదితర పదార్ధాలు ఉన్నాయన్న సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదీ శాస్త్రీయపద్దతే.

నకిలీ కణికుడి వ్యవస్థ వివరించడానికి నేను మొదట పద్దతి ఎంచుకుంటున్నాను. తర్వాత, అవసరాన్ని బట్టి రెండో పద్దతిలో కూడా నిరూపించే ప్రయత్నం చేస్తాను.

నకిలీ కణికుడి వ్యవస్థ గురించి, వాళ్ళ గూఢచార వలయాల గురించి, మీకు గల సందేహాలని నివృత్తి చేసే ప్రయత్నంలో వ్రాస్తున్నవే ఈ వరుస టపాల మాలిక. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ ఆ వ్యవస్థ ఏజంట్లున్నారని, అందర్నీ నడుపుతోంది ఒకే వ్యవస్థ అని, శాస్త్రీయంగా, తార్కికంగా, యదార్ధ లేక వాస్తవ సంఘటనల సహితంగా, అంటే దృష్టాంతపూరితంగా [circumstantial] గా నిరూపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నా ప్రతిపాదనలు గురించి -

ఇది ప్రతిపాదనలే అయినందున, వీటిని సంఘటనలకు జోడించి నిరూపించేవరకూ సహనంతో వేచి ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ లోపున మీకు వచ్చే సందేహాలని ప్రచురిస్తాను. నివృత్తి చేయటం మాత్రం నా టపాల మాలిక పూర్తయ్యాక, ప్రతీ ఒక్కరి, ప్రతీ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకూ సహకరించవలసింది. ఇవి ప్రతిపాదనలు [assumptions] మాత్రమే. ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల నిజజీవిత చరిత్రకాదు. అలాగని రచయిత్రి ఊహల నుండి ప్రాణం పోసుకున్న కాల్పనికత కూడా కాదు. ‘యదార్ధ కాల్పనికతల సమ్మిశ్రత సమ్మేళనం’ ఇది. గతించిన దాదాపు 360 ఏళ్ళ చరిత్రని ఒక క్రొత్త దృక్కోణంలో దర్శించవలసి ఉన్నందున, ఈ ప్రతిపాదనలని వాస్తవ సంఘటనలకి అనువర్తించి విశదీకరించే వరకూ ఓపికపట్టగలరు.

ఇక నా ప్రతిపాదనలు :-
నకిలీ కణికుడి వ్యవస్థ భారతదేశం మీద, ప్రపంచం మీద, నిగూఢంగా పనిచేయటం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్ధాలు కాదు, కొన్ని శతాబ్ధాలు అయ్యింది. దాదాపు 360 ఏళ్ళుగా ఈ వ్యవస్థ నిజాం సంస్థానం కేంద్రంస్థానంగా, వాళ్ళ నిగూఢ సామ్రాజ్యానికి రాజధానిగా నడుస్తోంది. సగటున ఒక్కోతరం 50 ఏళ్ళు పనిచేసిందనుకున్నా, దాదాపు ఏడు తరాలుగా అనువంశికంగా, అనుశృతంగా పనిచేస్తున్న వ్యవస్థ ఇది.

మనకి శతాబ్ధాల తరబడి దేశాలని పరిపాలించిన రాజవంశాలు తెలుసు. తరం నుండి తరానికి పెరిగిన నైపుణ్యాలతో పనిచేయటం తెలుసు. అలాగే తరతరాలుగా సంగీత ఙ్ఞానాన్ని, ఆయుర్వేద వైద్యఙ్ఞానాన్ని, కవిత్వ పాండిత్యాలని కొనసాగిస్తున్న వంశాలు తెలుసు. సాక్షాత్తూ వేద వాంఙ్ఞ్మాయం, మనదేశంలో, ఈ పద్దతిలోనే వేల సంవత్సరాలు మనగలిగింది, ఇప్పటికీ కొనసాగుతుంది. అంతెందుకు? దాదాపు 140+ ఏళ్ళుగా ఝంషెడ్ టాటా దగ్గరనుండి నేటి రతన్ టాటా వరకూ కొన్నితరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న టాటాల వంటి వంశాలు లేవా?[ సెప్టెంబరు 2008 తర్వాత అమెరికాలో దివాళా తీసిన లెమాన్ బ్రదర్స్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి.] తరం నుండి తరానికి అందించబడుతున్న ‘వ్యాపార మెళకువలు, ఙ్ఞానం, నైపుణ్యాలు’ పెరగటం, అంతకంతకూ విస్తరిస్తున్న వారి అభివృద్ధిలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి కదా? ఇవి వ్యాపారరంగానికి, ఇతర రంగాలకి చెందిన వంశాలు గనుక బాహాటంగా కన్పిస్తోన్నాయి. గూఢచర్యం అన్నది రహస్యంగా నిర్వహించిబడేది గనుక, తరతరాలుగా నిర్వహించబడిన ఆ వలయం గానీ, వంశీయులు గానీ, వారి కార్యక్రమాలు గానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే తప్ప కనబడవు. ఇది వాస్తవ విరుద్దం కాదు, అసంభవం అంతకన్నా కాదు. అయితే ఇదంతా మీకు ఇది వరకు చెప్పిందే.

ఇప్పుడు చెప్పేదేమిటంటే - 360 ఏళ్ళక్రితం, అంటే దాదాపు క్రీ.శ. 1650 లో మొదలైన వాస్తవ గాధ గురించి. నకిలీ కణికుడి వంశంలోని తొలితరం కుటిలుడి ఆవిర్భావం గురించి.

7 comments:

మీ తరువాతి వ్యాసం ఎప్పుడు? ఒక ఆరు నెలల క్రితము అంటే నేను బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో అచ్చం ఇలాంటి టపాలే వ్రాయాలని ఋగ్వేదంతో మొదలు పెట్టి కొంత రాసి , ఈ సబ్జెక్టును డీల్ చేయడం నావల్ల కాదని ప్రచురించకుండా ఆగిపోయాను. ఇప్పుడు మీ కలంనుంచి బ్రిటీష్ ఇండియా తొలినాళ్ళనుండి జరిగిన లేదా జరిగినవన్న ప్రతిపాదనలు ఎప్పుడెప్పుడు చదవాలా అని ఉత్సాహంగా వుంది.

భాస్కర రామిరెడ్డి,

నీకు కుదిరితే మీడియా మాయాజాలం లేబుల్ లోని 1 నుండి 4 టపాలు చదువు. అలాగే నకిలీ కణికుడి లేబుల్ లోని మూడు టపాలు, మన పై సుదీర్ఘ కుట్ర లేబుల్ లోని రెండు టపాలు చదువు. నీకు బాగా అర్ధమవుతుంది. అలాగే మనపై కుట్రని భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర టపాల్లో బుద్దుడి దగ్గర నుండి ప్రధాన సంఘటనలు గురించి చెప్తూ వచ్చాను. నకిలీ కణికుడి వ్యవస్థ ఉనికిని తానీషా, శ్రీరామదాసు కాలం నుండి టూకీగా చెప్పుకొచ్చాను. ఇప్పుడు దాన్నే మరింత లోతుగా, వివరంగా కుట్రకోణాన్ని, కుట్రచరిత్రని వివరించేప్రయత్నమే నేను వ్రాయబోయే టపాలు. ఎందుకంటే నకిలీ కణికుడి వ్యవస్థ చేతివేళ్ళపైన ప్రపంచ చరిత్ర ఎలా మెలికలు తిరిగిందో, వీళ్ళ ప్రతిచర్య వెనుకా అంతర్జాతీయ కుట్ర ఏవిధంగా ఉందో, తెలియచెప్పాలన్నదే నా ప్రయత్నం.

మీకు వచ్చిన ఈ ఆలోచన చాల గొప్పది. నేను ఎన్నో పుస్తకాలు చదివాను. ఎక్కడ ఎప్పుడు ఎవ్వరికి ఈ ఆలోచన రాలేదు ఎవ్వరు రాయలేదు. ఈ కోణము లో నుంచి చరిత్రను ఎవ్వరు పరిశిలించ లేదు.
హాట్స్ ఆఫ్, మేడం.

మీరు చెప్పిన టపాలు నేను చదివాను.
రాబోయే టపాల కోసం వెయిటింగ్

@శ్రీకర్ గారు,
అవునండీ! ఇంతవరకూ ఎవరూ కుట్రకోణంలో మన చరిత్రని పరిశీలించలేదు. ప్రోత్సహిస్తున్నందుకు కృతఙ్ఞతలు.

@మనోహర్ గారు,
మొదటి నుండి అనుసరిస్తున్న వారికి భాస్కర రామిరెడ్డికి వ్రాసిన టపాలు తెలిసినవే. మధ్యలో అనుసరించడం మొదలు పెట్టిన వారికి అవి తెలియవు. అందుచేత వ్రాసాను.

నా మొదటి పరిశీలన ప్రహ్లాదుడిమీద . ఈ బ్లాగ్ చూడండి...

aatmajyothi.blogspot.com

when will the next post... I am eagarly waiting for next post.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu