శ్రీశైలంలో మమ్మల్ని ఆదుకున్న ఖాసిం భయ్యా వాళ్ళ కుటుంబానికి కూడా మా కృతఙ్ఞత సూచకంగా అనేక బహుమతులు ఇచ్చి, అతిధిమర్యాదలు చేశాము. ‘వాళ్ళు మనకి లేనప్పుడు సాయం చేశారు. అందునా ఎంత సాయం చేసారు అన్నదాని కంటే’ ఎలాంటి సమయంలో చేసారో అన్నది ముఖ్యం. అటువంటి వారికి మనం చేయ్యగలిగినప్పుడు, మన కృతఙ్ఞత చూపిస్తూ ప్రత్యుపకారం చేస్తే, భవిష్యత్తులో వాళ్ళు మనలాంటి మరికొందరికి సాయం చేస్తారు. మంచి వాళ్ళకి మనం ఇవ్వగలిగిన బహుమతి ఇదే’ – అన్నది మా అభిప్రాయం. అందుచేత ఖాసిం భయ్యా వాళ్ళు నంద్యాలకీ బదిలీ అయి, వెళ్ళుతున్నప్పుడు కూడా నగదు బహుమతిగా ఇచ్చాము. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నామన్నారు. ఆ తర్వాత మేమే నంద్యాల వచ్చిపడ్డాము. నంద్యాలలో ఇల్లు తీసుకోవటానికి ముందు, దాదాపు నెలరోజులు పాటు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అయితే ఈసారి మా దగ్గర డబ్బు ఉన్నందున, వాళ్ళకి ఆర్ధిక భారం కాకుండా జాగ్రత్త తీసుకున్నాము. వాళ్ళ సాయంతోనే కంప్యూటర్ కొనుక్కోవటం, నెట్ కనెక్షన్ తీసుకోవటం వంటివన్నీ చేయగలిగాము. ఇందుకు వాళ్ళపట్ల మాకు చాలా గౌరవం, కృతఙ్ఞత ఉండేవి.

అయితే వీటన్నిటి వెనుకా అంతర్గతంగా ఉన్న అంశం, మాదృష్టికి వచ్చినప్పుడు అది మాకు అశనిపాతమై తగిలింది. 2005 వరకూ మేం మా జీవితంలో రామోజీరావు అస్థిత్వాన్ని సందేహించనందున, కష్టాల కడలిలో ఉన్నా, ఆ ఒరవడిలో కొట్టుకుపోతూ పైకి కనబడే కారణాన్ని నమ్ముతూ, విశ్లేషిస్తూ నడిచేవాళ్ళం. 2005 లో రామోజీరావుని అనుమానించాక మా జీవన చిత్రమే మారిపోయింది. శ్రీశైలంలో ఉన్నప్పుడు, రోజూ చాలామంది మా ఇంటికి, స్కూలుకి వచ్చిపోతుండేవాళ్ళు. ఎవరితో ఏమీ మాట్లాడేమో మాకూ గుర్తుండేది కాదు, పట్టించుకొనేవాళ్ళం కాదు. అంచేత అప్పుడు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పెద్దగా అవగాహన ఉండేది కాదు. అయితే నంద్యాల వచ్చాక, ఇక ఇతరత్రా స్నేహితులు ఎవరూ లేకపోయాక, మా మోటివ్స్ కనుక్కోనేందుకు, ముఖ్యంగా 2007, నవంబరులో ఢిల్లీ హోంశాఖను కలవటానికి వెళ్ళినప్పుడు, ఈ ఇద్దరూ పడుతున్న తిప్పలూ, చేస్తున్న ప్రయత్నాలు గమనించి నప్పుడు మాకు స్ట్రాటజీ అర్ధమయ్యింది. గుంటూరు స్నేహితుడు, నంద్యాల స్నేహితుడు ఇద్దరి మధ్య ఒక శృతి, లయ కన్పించాయి. వివరంగా చెబుతాను.

మనదగ్గర ఓ ప్రశ్నవేసి, ఓవ్యక్తి ‘A’ అని జవాబు చెప్పించుకుని వెళ్ళాడనుకొండి. మరొక వ్యక్తి [మొదటి వ్యక్తికి తెలిసిన వాడు కావచ్చు, అపరిచితుడు కావచ్చు] వచ్చి, మొదటి ప్రశ్నకు కొనసాగింపు ప్రశ్న వేస్తారు. మనం ‘B’ అనే జవాబు చెబుతాం. ఆ తర్వాత మరొకరు, మరో ప్రశ్న లేదా చర్చ. ఇది మన మీద అమలవుతున్నప్పుడు మనం దీన్ని గుర్తించలేం. అదే ఒకే వ్యక్తి, అన్నిప్రశ్నలూ వివరాలూ అడుగుతున్నాడనుకొండి, అప్పుడు మనకి స్పష్టంగా అర్ధమవుతుంది. ఎదుటివ్యక్తి మన నుండి కూపీలు లాగుతున్నాడని, మన మోటివ్స్ కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నాడని! నిజానికి ఖాసిం భయ్యా, మావారి గుంటూరు మిత్రుడు, ఈ ఇద్దరితో ఈ స్ట్రాటజీ అనుభవంలోకి వచ్చాకే మాకు మరింత అవగాహన కలిగింది.

కొన్నేళ్ళు పాటు అన్యోన్యమైత్రి నడిపి, పరస్పర సహాయ సహాకారాలు అందించుకుని, తర్వాత అవతలి వాళ్ళలోపాల్ని, తప్పిదాల్ని చెప్పుకోవటం అంటే మనల్ని మనమే కించపరుచుకున్నట్లవుతుంది. అందుచేత జరిగిన సంఘటన లేవో, వారి స్నేహం మూలంగా మాకు జరుగుతున్న మేలు కంటే కీడే ఎక్కువన్న విషయం మా పరిశీలనకి ఎలా వచ్చిందో, దాన్ని మేం ఎలా నిర్ధారించుకున్నామో ఇక్కడ వ్రాయటం లేదు.

అయితే కొన్నినెలలు పాటు మా ఇద్దరు మిత్రుల్ని పరిశీలించిన మీదట, స్నేహాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చాము. గుంటూరు మిత్రుడు ఎటూ దూరంగానే ఉన్నాడు గనుక పెద్దగా సమస్యలేదు. అయితే ఖాసిం భయ్యా కుటుంబానికి మాత్రం, నిర్ధ్వంద్వంగానూ, సున్నితంగానూ, చెప్పాము. నింద మాపైనే వేసుకుంటూ “మా స్నేహం మూలంగా మీకు జరుగుతున్న మేలు కంటే కీడే ఎక్కువ సార్! అంచేత స్నేహం Shut Down చేసుకుందాం. నిజానికి మీతో స్నేహం మాకేలాభం కదా! మీరుంటే గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇస్తారు [శ్రీశైలం నుండి గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ ఫర్ అవ్వదని కనెక్షన్ కొనేటప్పుడే చెప్పారు], ఏదైనా పని కావాలంటే చేసి పెడతారు, ఏ సాయం కావాలన్నా చేస్తారు. అయినా ఇదే నిర్ణయం ఎందుకు తీసుకుంటాం చెప్పండి? ఎందుకంటే, మీకు అర్ధం కావటం లేదుకానీ, మా స్నేహం మీకు చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ. Being Friend, మనం అలా చెయ్యకూడదు గదా! చేస్తే మేలు చెయ్యాలి. లేకపోతే లేదు. అంతేగాని స్నేహితులై ఉండి, కీడు మాత్రం చెయ్యకూడదు. నేనైతే ఇలాగే అనుకుంటాను. అందుచేత మన స్నేహం ఇక్కడికి తెంపుకుందాం. ఇన్నాళ్ళు స్నేహం చేసి, చేదు సంఘటనతో విడిపోవటం కంటే ఇది మంచిది. ఇక మా సమస్యలంటారా, అవి మాకెప్పుడూ అలవాటే! 15 ఏళ్ళుగా అలవాటు. మా వెనుక ఏం జరుగుతుందో మాకు అర్ధమౌతుంది సార్!” అని చెప్పారు మావారు. నిజానికి అది నింద మాపైన వేసుకోవటం కూడా కాదు. అది నిజం కూడా! ఎందుకంటే వాళ్ళు మాతో ఎందుకైనా స్నేహం చెయ్యనివ్వండి, మేం మాత్రం నిజాయితీగా స్నేహం చేసాము, నిబద్దతతో స్నేహం చేసాము. కాబట్టి ప్రభావ ప్రలోభాలకు లొంగి, వాళ్ళు స్నేహం పట్ల, స్నేహము పేరుతో, చేస్తున్న ద్రోహం ఎంత భయంకరమైనదో వాళ్ళకి తెలియకపోయినా మనకి తెలిసినపుడు, మనమే ఆ స్నేహం తెగతెంపులు చేసుకుంటే, ఇక వాళ్ళకలా చేసే అవకాశం అయితే ఉండదుగా? ఆ విధంగా మనం స్నేహితులకి మేలు చేసినట్లే!

నిజానికి ఖాసిం భయ్యాతో నేను చాలా అనుబంధం పెంచుకున్నాను. నాతోబుట్టువుల్లో నేనే పెద్దదాన్ని. ఎవరైనా నన్ను అక్కా అనటమే గానీ నేనెవరికీ చెల్లిగా ఆత్మీయతను పొందలేదు. అంచేత ఈ కుటుంబం పట్ల, ఈ ‘భయ్యా’ పట్ల నేనెంతో ఆత్మీయతానురాగాలు పెంచుకున్నాను. అలాంటి చోట నిష్ఠుర నిజం నన్ను చాలా బాధ పెట్టింది. అందునా చేదు నిజం ఏమిటంటే – సూర్యాపేటలో మమ్మల్ని వేధించిన చికెన్ కొట్టు భాగ్యలక్ష్మి దగ్గర నుండి, శ్రీశైలం చల్లా వెంకయ్య సత్రం క్రింది అంతస్థులోని రమణయ్య, అతడి భార్య వరకూ, ఎవరికీ, మేమెవరిమో, ఏంచేశామో తెలియదు. తమ వెనుక తమకి డబ్బులూ, కెరీర్ ఇస్తూ, అసైన్ మెంట్స్ ఇస్తూ చేరిన వాడు తమకేమవుతాడో, మాకేమవుతాడో వాళ్ళకి తెలియదు. వాడు మంచివాడో, చెడ్డవాడో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది డబ్బు మాత్రమే. అయితే ఈ ఖాసిం భయ్యాకి అలా కాదు. 1992 నాటి నుండి మా కథ ఏమిటో స్పష్టంగా తెలుసు. మాతో మాట్లాడే సంభాషణల్లో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతనీ, భావవాదాన్నీ, నీతి, ధర్మం మొదలైన మానవీయ విలువల్ని గురించి మాట్లాడతాడు. ‘మన భగవద్గీత’ అంటాడు. అలాంటి వ్యక్తి ఇంతగా మననుండి సమాచారాన్ని బయటికి చేరవేస్తూ, తెలిసి తెలిసీ పీచు మిఠాయి వ్యాపారం చెయ్యటం, చాలా దారుణమైన నమ్మక ద్రోహం అన్పించింది. అప్పటివరకూ నేను పెరిగిన వాతావరణం రీత్యా, చిన్నప్పుడు ముస్లిం కుటుంబాలతో కలిసి మెలిసి పెరిగిన రీత్యా, నాకు ముస్లింలపట్ల గౌరవం, నమ్మకం ఉండేవి. అయితే ఖాసిం భయ్యా చూపిన నమ్మక ద్రోహం అనుభవంలోకి వచ్చాక, వాళ్ళ మీద నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. అసలు నమ్మకద్రోహం వారి రక్తంలోనే ఉందా అన్పించింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ నాటి నుండి ఇదే కథ కాబోలు అన్పించింది. చాలా తీవ్రమైన భావోద్రేకాలకి గురయ్యాను. ఇది జరిగింది 2007, చివరి రోజుల్లో!

ప్రయత్నించి ఆత్మసంయమనం తెచ్చుకున్నాను. ఎందుకంటే, నా చుట్టూ ఉన్నవారిమీద, ప్రభావ ప్రలోభాలు నడుస్తున్నందున ఈ పరిస్థితులూ, ఫలితాలూ గానీ అందరూ ఇలాగే లేరుగా? ప్రధానమంత్రి అయి ఉండీ, పాక్ నుండి వలసవచ్చిన ఈఆర్ధిక రాజకీయవేత్త మన్మోహన్ సింగ్ కి భారతదేశ శ్రేయస్సు పట్టలేదు. ప్రభుత్వకుర్చీవ్యక్తి అయిన ఇటలీ దేశస్త్రీకి భారతదేశ శ్రేయస్సు పట్టదు. కాని రాష్ట్రపతి పదవిలో ఉన్నందుకు, రామేశ్వరంలో పెరిగిన ఈ భారతీయ ముస్లిం, శాస్త్రవేత్త అయిన APJ అబ్ధుల్ కలాంకు భారతదేశ శ్రేయస్సు పట్టింది కదా! మాకు రెస్పాండ్ అయ్యాడు కాబట్టి అతడిని శ్లాఘించటం లేదు. అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా అతని చర్యలు చాలా విలువైనవి. అందుచేతనే, అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, రామోజీరావు కేసుని హోం మంత్రిత్వ శాఖకు పంపడం వంటి ప్రక్రియలు నెరవేర్చాడు. భవిష్యత్తులో ప్రభుత్వ కుర్చీవ్యక్తి సోనియా గాంధీకి, ఆమె వెనుకనున్న గూఢచార ఏజన్సీలకి కోపం వచ్చి, తనని అప్రతిష్టపాలు చేస్తారని గానీ, ఇబ్బందులకు గురిచేస్తారేమోనని గానీ, వెనకడుగు వెయ్యలేదు. అలాంటప్పుడు, ఒక్క ‘ఖాసిం’ని చూసి, ముస్లిం లందరినీ ఒకేగాట కట్టెయ్యవలసిన అవసరం లేదు అన్పించింది.

నిజానికి నా స్నేహితుల్లో చాలామంది భయంకరమైన చేదుని చూపించారు. అయినా నాకు స్నేహం మీద నమ్మకం పోలేదంటే అది నిజంగా భగవంతుడు నామీద చూపించిన కరుణ మాత్రమే. ఎందుకంటే నా భర్త, నామెడలో మాడు మూళ్ళు వేసే ముందు క్షణం వరకూ కూడా నాకు మిత్రుడు మాత్రమే. పెళ్ళయిం తర్వాత ఇద్దరం ఒకటే అయిపోయి ఉండవచ్చు గాక! అప్పటివరకూ మా మధ్య స్నేహమే. ఇప్పటికీ తను నా ఆప్తమిత్రుడే! ప్రాణ స్నేహితుడే! ఇంతవరకూ ఎప్పుడూ ఒక్కక్షణం పాటు కూడా “ నీమూలంగానే ఈ కష్టాలన్నీ!” అని ఒక్కసారీ అనలేదు. ఒక్కసారి కూడా మనసులో సైతం అనుకోలేదని నేను ఘంటాపధంగా చెప్పగలను. అంతగా తను నాతోడు, నీడ.

కాబట్టే ఇన్ని సమస్యలు ఎదుర్కున్నా, ఇంత వేధింపులకి గురైనా, ఇప్పటికీ మాకు మంచితనం మీద నమ్మకంపోలేదు. ‘మనుషు’ల మీద నమ్మకం పోలేదు. ’ఎందుకిలా జరుగుతుంది, ఇలా జరక్కూడదు, అందరూ ఆనందంగా ఉండటం ఎందుకు సాధ్యం కావటంలేదు’ అని ఆన్వేషించే ఆర్తి, జిఙ్ఞాస కలిగిన వారు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టే, ఇప్పటికీ ఈ జగత్తు ఇంకా నిలబడుగలిగింది – నా ఈ విశ్వాసమే నాచేత ఇవన్నీ వ్రాయించింది. మా చుట్టూ ఇనుపతెర వేయబడిందా అన్నంతగా, మాకు తారసపడిన స్నేహితులు, స్నేహం పేరుతో నమ్మకద్రోహం చేసి ఉండవచ్చు, ఇరుగుపొరుగులు అకారణంగా శతృత్వం పెంచుకుని ఉండవచ్చు, కానీ ఈ ఎడారి కృత్రిమమైనది, తాత్కాలికమైనది. దీనికి ఆవల ఏ సంబంధం లేకపోయినా సత్యం తాలూకూ బంధంతో, నా కష్టానికి కన్నీరు చిందించగల ‘మనుష్యులు, మానవత్వం,’ అనే ఒయాసిస్సులు ఉన్నాయన్నది మా నమ్మకం. ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే, ఇది భగవద్గీత మీద మాకున్న నమ్మకం, భగవంతుడి మీద మాకున్న నమ్మకం.

ఆ నమ్మకంతోనే, నకిలీ కణికుడు మొత్తం మానవజీవితం మీద నడుపుతున్న కుట్రని, ముఖ్యంగా భారతీయుల మీద, హిందూమతం మీద మూడు శతాబ్ధాల పర్యంతం అనుశృతంగా నడుపుతున్న సుదీర్ఘ కుట్రని వివిధ శీర్షికల క్రింద వ్రాసాను. ఇప్పుడు కేవలం రాజకీయ రంగం మీద కుట్రని మాత్రమే తెలుగులోకి అనువదించాను. నిజానికి ఈ కుట్రని అర్ధం చేసుకునేందుకు వివిధ శీర్షీకలు పెట్టటమే గానీ, ఇది ఒకే కుట్ర. అందుకే అన్ని శీర్షికల నడుమా ఇంట్రాక్షన్ ఉంటుంది.

ఇక ప్రస్తుత మాపరిస్థితి అంటారా? షరా మామూలే! మేం ఎక్కడున్నా సమస్యలూ, స్ట్రాటజీ మాతోనే ఉంటాయి గదా? అయితే ఇవి మేము సమస్యలుగా పరిగణించము. ఎందుకంటే “ఈరోజు ఎలా గడపటం?" అన్న ప్రశ్న మా ఒక్కరిదే కాదు. ఈ దేశంలో కోట్లాది నిరుపేదలది, ఉద్యోగం కోల్పోయిన లక్షలాది కుటుంబాలది. ఈ సమస్యని మేం పరిష్కరించుకోవటం, మళ్ళీ మళ్ళీ అదే సమస్యని ఎదుర్కోవటం, ఇది కూడా మాకు అలవాటే. 1992 లో రామోజీరావు మీద ఫిర్యాదు ఇవ్వాలా వద్దా, ఈ యుద్ధం చెయ్యలా వద్దా అని తర్జన భర్జనలు పడేటప్పుడు స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చాను.
శ్లోకం:
“హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం
తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయః”


భావం:
అర్జునా! యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. గెలిస్తే యీ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక, యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం గలవాడవై, లే.

అని. అంచేత ఆర్ధిక సమస్యలకి మేము కృంగిపోము, బెదరిపోము.

1992 కు ముందర నేను ఇండస్ట్రియలిస్టుని. ఫ్యాక్టరీ నడిపేటప్పుడు నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అప్పటి నా Struggle చూసి, నా స్నేహితులు నాకు పెట్టిన పేరు “Born Tough” . అదే నా బ్లాగులో పెట్టుకున్నాను. నాకు నేను స్ఫూర్తి తెచ్చుకునేందుకు “ఓటమి అనేది నాకు లేదు. ఎందుకంటే గెలిచే వరకూ పోరాటం ఆపను గనుక” అనేదాన్ని. ఇప్పటికీ నా దృక్పధం అదే. ఎలాగోలా బ్రతకడం అంటే అది సమస్యకాకపోవచ్చు, ఇలాగే బ్రతకాలి అనుకుంటే అది సంఘర్షణే!

ఇదీ నాకథ!

మా కథ!

అయితే దీన్ని నాకథగా నేను పరిగణించటం లేదు. ఎందుకంటే ఇది ఓ సామాన్యుడి కథ. ఎందుకంటే మీలో ఎవరు నా స్థానంలో ఉన్నా, మీ జీవితం ఇలాగే ఉంటుంది గనుక! కాకపోతే నేను ఎంసెట్ కుంభకోణంలో మేధో చౌర్యానికి గురైన రమాదేవిని చూసి స్పందించి ఉండొచ్చు. మత ఘర్షణలో గాయపడి, కుట్లు పడిన పసిబిడ్డ ముఖాన్ని చూసి స్పందించి ఉండొచ్చు. మీరు మరో మోసం చూసి, అమానుషం చూసి స్పందిస్తారు. అంతే తేడా! ఎవ్వరైనా సరే, ఈ వ్యవస్థతో రాజీపడి, అదే అవినీతిలో తాము ఓ భాగమై, తోసుకుంటూ వెళ్తున్నంత కాలమూ ఈ సమస్యలుండవు. [కాకపోతే వేరేరకం సమస్యలుంటాయి. ఇవేవి లేకుండా ఉద్యోగం, ఇల్లు అనుకునేవాడికి కూడా ఏవో సమస్యలుంటాయి. కళ్ళముందర జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడమే సుఖంగా ఉంటుంది, సహించడం కన్నా లేదా అందులో భాగమై పోవడం కన్నా! దీన్ని గురించి తర్వాత వివరిస్తాను.] ఎప్పుడైతే ఎదురుతిరుగుతారో అప్పుడు మీపోరాటం మొదలౌతుంది. అంతే! ‘అసలెప్పటికీ ఎవరికి ఏ అన్యాయం జరిగినా స్పందించను, నా దారిన నేను పోతాను’ అనుకునే వారికి సైతం చివరికి అన్యాయం, Exploitation తమ జీవితంలోపలికి, చొచ్చుకు వచ్చిన తర్వాతైనా, పోరాటం తప్పదు. సెజ్ లు, భీంరామ్ భాడా లాంటి సంఘటనలతో సామాన్యుడికి పోరాటం తప్పని స్థితి అయ్యింది.

ఇక నా బ్లాగుకి ‘అమ్మఒడి’ అని పేరెందుకు పెట్టానంటే – అమ్మ , మనల్ని చిన్నప్పుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని, తను తన అమ్మ అంటే మన అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నదీ, తన జీవితంలో అనుభవం ద్వారా తెలుసుకున్నవీ, అవగాహనతో అర్ధం చేసుకున్నవీ, అన్నిటినీ మనకి చెబుతుంది. “నాన్నా! ఇది నిప్పు! తాకితే చేయి కాలుతుంది. ఇది తప్పు! చేస్తే బ్రతుకే కాలుతుంది. ఇది మోసం. ఎవరైనా నీకు చేస్తే చాలా కష్టం. అందుకే ఇలా జాగ్రత్తపడాలి. నాకు తెలియక ఈపొరపాట్లు చేశాను. అందుకు ఈ ఫలితాలు వచ్చాయి. అంచేత నువ్వు ఇలా చెయ్యి. ఇలా చెయ్యవద్దు” అంటూ – తన అనుభవాలని మనకి చెబుతుంది. వినటం, వినకపోవటం పిల్లవాడి ఇచ్ఛ, స్వేచ్ఛ! అలాగే నేనూ నా అనుభవాలని, నాకు తెలిసిన విషయాలని అందరికీ చెప్పటానికే ఈ బ్లాగు వ్రాస్తున్నాను. అందుకే ‘అమ్మఒడి’ అన్న పేరు ఎంచుకున్నాను. ఎవరైనా నన్ను మాతృ సమానంగా భావిస్తే, అది నేను చాలా సంతోషంగా, గౌరవంగా స్వీకరిస్తాను. అదే వాత్సల్యాన్ని, ఆత్మీయతని పంచాలనుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి ‘నేను, నావాళ్ళు’ అన్న పరిమితి దాటేస్తే మనకి విశ్వమంతా భగవానుడి ప్రేమ నిండి కన్పిస్తుంది. ఇది నేను స్వానుభవంతో నేర్చుకున్నది.

ఇక్కడ మీకు ఓ అద్భుతమైన, అత్యంత ఉత్తేజకరమైన నిజాన్ని చెబుతాను, యదార్ధాన్ని మీ కళ్ళ ముందే చూపిస్తాను. ఒకసారి ఈక్రింది చిత్రాన్ని చూడండి. ఇది గతంలో ఒకసారి ఈ బ్లాగులో చూసిందే!





ఒక బొమ్మలో ఓ కుర్రవాడు టేబుల్ పైన చేతులు పెట్టుకుని నింపాదిగా కూర్చొని ఉన్నట్లు కన్పిస్తుంది. అదే ఆ బొమ్మని తిరగేసి చూస్తే, నీళ్ళల్లో కొట్టుకుపోతూ చేతులెత్తేసిన కుర్రవాడున్నట్లు కన్పిస్తుంది.




సరిగ్గా ఇలాగే, ఇప్పటివరకూ టేబుల్ మీద చేతులు పెట్టుకుని నింపాదిగా కూర్చొని ఉన్నట్లున్న నకిలీ కణికుడి వ్యవస్థనీ, రామోజీరావునీ, అతడి ఏజంట్లయినా రాజకీయ నాయకులనీ, బడా వ్యాపార వేత్తల్నీ, మీరు చూశారు. నాబ్లాగులో కూడా నేను అదే వివరించాను. ఇప్పుడు మీకు రెండో చిత్రం చూపిస్తాను. అది నీళ్ళల్లో కొట్టుకుపోతున్న రామోజీరావు, అతడి వ్యవస్థ, అతడి ఏజంట్ల జీవన చిత్రం! మనకళ్ళ ఎదుట ఉన్న విచిత్రం, వాస్తవ చిత్రం!

1992 లో నేను రామోజీరావు గురించి చెబితే, నమ్మింది ఒకరిద్దరే! నా స్నేహితుల్లో కొందరు కొట్టిపారేసారు, కొందరు రామోజీరావు విదేశీ ఏజంటని బుడ్డోళ్ళకి కూడా తెలుసన్నారు. ఇక అలాంటి నేపధ్యంలో సోనియా గాంధీ నిజస్వరూపం గురించి నేను కాదు కదా, సాక్షాత్తూ నాటి ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావు చెప్పినా, ఎవరూ నమ్మి ఉండేవాళ్ళు కాదు. ఎవరి దాకానో ఎందుకు? నేనే నమ్మి ఉండేదాన్నికాదు. అప్పటికే ఎమర్జన్సీ అనంతర కష్టకాలంలో అత్తగారైన ఇందిరాగాంధీకి కోడలు కాదు కూతురన్నంతగా మద్దతిచ్చిన గడపమెట్టిన కోడల్ని, భర్తని రాజకీయాల్లోకి రావద్దని ఆడబెబ్బులిలా పోరాడి అలసిన, ‘తన కుటుంబం, ఓ సామాన్య పైలట్ భార్యగా తన సంసారం’ ఈ చిన్న పరిధి దాటి పెద్దగా ఏదీ ఆశించని ఉత్తమ ఇల్లాలిని, చిన్న వయస్సులో భర్తని పోగొట్టుకుని, అప్పటికి 21 ఏళ్ళ కొడుకు, 19 ఏళ్ళ కూతురితో ఒంటరిగా ఆ ఇంట మిగిలిన వితంటువునీ ఎవరు సందేహించగలరు?

అదే ఇప్పడైతే? ఆ వ్యక్తి అసలు స్వరూపం ఏమిటో ఆ వ్యక్తి చర్యలే బహిర్గతం చేశాయి. అది ఈ సోనియాగాంధీ ఒక్క విషయంలోనే కాదు, రామోజీరావు దగ్గరి నుండి అందరి స్థితి ఇదే. వారి పనులే, వారి [Suicidal Assignments] ఆత్మహత్యా సదృశ చర్యలే వారేమిటో నిరూపిస్తున్నాయి. 1992 నుండీ, ఎప్పుడైతే నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దృష్టి, తద్వారా నిఘాసంస్థల దృష్టీ, ఈ గూఢచార వలయంపై పడిందో, అప్పటి నుండీ, అంటే ఈ పదిహేడేళ్ళ నుండీ వాళ్ళ స్థితి నీటిలో పడి గిలగిల కొట్టుకోవటమే. ఈ స్థితిని ఆ తెలుగు మేధావి పీ.వి.నరసింహారావు ఎలా ప్రారంభించాడో, ఎవరికీ ఏదీ చెప్పకుండానే ఆ ‘లోపలి మనిషి’ మౌనంగా నిష్ర్కమించాడు. ఆయన మాటల్లో చెప్పని నిజాన్ని, వాస్తవం ఆవిష్కరిస్తోంది.

ఆ విచిత్రమే, ఆ అద్భుతమే – మనం గమనించినా, గమనించకపోయినా మన కళ్ళెదుట ఉంది. ఆ అద్భుతమే వేధింపు కన్నా ప్రాణాలుతీయటం తేలికైన రామోజీరావుని, మా చుట్టూ తిరిగేలా చేస్తోంది. ఏదో రహస్యం ఉందనుకొని శోధించి వేధించేలా చేస్తోంది. ఇదే, ఇప్పుడు మొదలైన అసలు కథ! దీన్ని గురించి తదుపరి టపాల్లో వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

hats off to you madam.

ఎప్పుడైతే నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దృష్టి, తద్వారా నిఘాసంస్థల దృష్టీ, ఈ గూఢచార వలయంపై పడిందో, అప్పటి నుండీ, అంటే ఈ పదిహేడేళ్ళ నుండీ వాళ్ళ స్థితి నీటిలో పడి గిలగిల కొట్టుకోవటమే...
kastha pi vyakyanu vivarishtara (ante vallu evidanga neetilo padi gila gila kottukunttunarai?). leda nanu " lopali manishi " pusthakanni chadivi artham chesukomantara?

well said,

>>అసలెప్పటికీ ఎవరికి ఏ అన్యాయం జరిగినా స్పందించను, నా దారిన నేను పోతాను’ అనుకునే వారికి సైతం చివరికి అన్యాయం, Exploitation తమ జీవితంలోపలికి, చొచ్చుకు వచ్చిన తర్వాతైనా, పోరాటం తప్పదు..

దొంగలు పడింది పక్కింట్లోనే కదా మనం ముసుగేసుకుని పడుకుందాం అనుకుంటే రేపు మనింట్లోనే పడతారు. ఆ విషయం తెలుసుకోనంతకాలం జీవితాలింతే

@నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)గారు,
@మనోహర్ చెనికల గారు,

కృతఙ్ఞతలండీ!

@Anonymous గారు,
దీన్ని గురించి తదుపరి టపాల్లో వివరిస్తాను.

మీకు జొహర్లు. అంత కంటె ఇప్పుడు ఎమి చెప్పలెం.


p.s.
నేను ఎప్పుడు 'మెము ' అని బహువచనం లొ రాసిన అది మా గ్రూప్ (మా కుటుంబం + కజిన్స్) తరపున అని చదువుకొగలరు.

"అయితే ఖాసిం భయ్యా చూపిన నమ్మక ద్రోహం అనుభవంలోకి వచ్చాక, వాళ్ళ మీద నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. అసలు నమ్మకద్రోహం వారి రక్తంలోనే ఉందా అన్పించింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ నాటి నుండి ఇదే కథ కాబోలు అన్పించింది. చాలా తీవ్రమైన భావోద్రేకాలకి గురయ్యాను. ఇది జరిగింది 2007, చివరి రోజుల్లో!"

ఖిల్జీ రోజులనుంచి కాదు, బద్ర్ యుద్దం రోజులనుండీ ముస్లిములు అంతే. బాగా నమ్మించడం, నమ్మినవారిని నట్టేట ముంచడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇది ముస్లిములలో అత్యధికులు చేసే పని.

మంచు పల్లకీ గారు,
మీరు చూపిస్తున్న అభిమానానికి, ఆత్మీయతకి కృతఙ్ఞతలండీ!

ఇస్లాం - కొన్ని నిజాలు గారు,
అవునండి!ఇది మా స్వానుభవంలో మరోసారి నిరూపితమైనది.

అమ్మ... మీ ఓపిక, సహనానికి సహస్ర వందనాలు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. మంచి రోజులు రాకమానదు. అల అనుకోనే ఉండాలి కద!! పీ.వి లాంటి మాహానుభావుడ్ని మన జాతి ఎంతలా వేధించిందో లోక విధితమే కదమ్మ. ఆయన నిజంగానే మేధావి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో శేకర్ గుప్తా పీ.వి మేధస్సు గురించి చాలా వ్యాసాలు రాశారు. మీరు రాశెవాటికోసం ఆసక్తిగా వేచి చూస్టూనా.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu