ఈ రోజు టపా:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 86 [వేలుపిళ్ళై ప్రభాకరన్ పట్టుబడితే ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?]

New Sense రమణ గారికి, దేవుడిచ్చిన ద్వితీయ బహుమతి చిన్నారి పాపాయి. ప్రధమ బహుమతి అయిదేళ్ళ పిడుగు, ఉత్సాహంతో కుతుహలంతో అలనాటి బాపూ – ముళ్ళపూడి వారి బుడుగులా ప్రశ్నలు గుప్పిస్తాడు గదా మరి? ఈ సందర్భంగా బుడుగు నుండి…..

“పుట్తార్టడం అంటే, మనం ఎక్కడో దొరకడం అన్నమాట. అంటే దేవుడు మన్ని తెచ్చి మా యింటో పడేస్తాడు. అపుడు అమ్మా నాన్నా కుంచెం రోజులు పెంచుతారు. తరువాత పెంకి భడవా కానా బడుద్దాయీ అంటారు. అప్పుడు గబుక్కున అష్చరాభాసం చేసి బళ్ళో పెట్టేస్తారు.

బడుద్దాయీ అనడం తప్పు. బుడుద్దాయీ అనాలి. నాపేరు బుడుగు కదా అందుకు.”



ఇన్నాళ్ళు బ్లాగులోకంలో మా కందరికీ చక్కని అందమైన [ఫోటోలు] బొమ్మలు కానుకగా ఇచ్చినందుకు, మీకు భగవంతుడు ఓ చక్కని అందమైన బొమ్మని కానుకగా ఇచ్చాడన్నమాట. మీ పాపాయికి మా దీవెనలు. మీ అయిదేళ్ళ బుడతడికి కూడా.

[మేము ’అమ్మఒడి’లో హిట్ కౌంటర్ పెట్టుకోబోయి ‘lay out’ ఎగరగొట్టేసాం. మళ్ళీ తాడేపల్లి వారి సలహాతో తిరిగి ‘lay out’ తెచ్చుకోగలిగామనుకొండి. రమణగారే మొదట మాకు హిట్ కౌంటర్ పెట్టి ఇచ్చారు. రమణగారు, మా తొలి ఫాలోయర్ కూడాను.]


మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
***********

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu