నిన్నటి టపాలు:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 75[అడ్మినిస్ట్రేషన్ పరంగా మా యుద్ధం]

ఎన్నికలలో, ఎన్ని లీలలో……[3]ఆత్మహత్యా సదృశ్య ప్రకటనలు, ప్రవర్తనలు వై.ఎస్. ఎందుకు చేసినట్లు?

మేము ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ ఇల్లు తీసుకున్నా – కరెంటు , నీళ్ళు వేధింపులు తప్పేవి కావు. [చాలా తక్కువ చోట్ల మాత్రమే మేమీ వేధింపులు పడకుండా ప్రశాంతంగా ఉన్నది! అలాంటి ఇళ్ళల్లో ఉన్నప్పుడు కెరీర్ పరంగా ఇబ్బందులు పడేవాళ్ళం. అంటే సింగిల్ ధమాకా అన్నమాట.] అదీ తీవ్రతరంగా ఉంటుంది. ఒకరోజు, ఒక వారం లేదా ఒక నెలరోజులు నీటికి ఇబ్బందిపడటం అంటే ఎలాగో ఓర్చుకోవచ్చు. నిరంతరం, ఏ ఊళ్ళో ఉన్నా, 365 రోజుల పాటు నీటికి గొడవపడవలసి రావటం అంటే జీవితం యాష్టకి వస్తుంది. నిజానికి ఇలాంటి సమస్యలు చెప్పడానికి సిల్లీగా ఉంటాయి. స్థాయికి తగని విధంగా, మురికివాడల్లోని వీధి పంపు తగాదాల్లా ఉంటుంది. కానీ ప్రతీరోజూ దాన్ని అనుభవించేవాడికి తెలుస్తుంది, దాని నొప్పీ, బాధా ఏమిటో! అర్ధం చేసుకున్న వాళ్ళకే అందులోని కష్టం తెలుస్తుంది. ఈ సమస్య గురించి గుంటూరు ఐ.బి.ఆఫీసులో అధికారి [ఇతణ్ణి మేం అక్టోబరు 20, 2006 కలిసాము.] “ఇలాంటి సిల్లీ ధింగ్స్ ని వేధింపులు [harassment] అంటే ఎలా? ఆ మాట కొస్తే మాకూ ఈ రోజు నీళ్ళు రాలేదు. ఇంత వరకూ నేను స్నానం కూడా చెయ్యలేదు. ఏం చెప్పమంటారు?" అన్నాడు. అప్పటికి శ్రీశైలంలోని మా నీటి సమస్య [సూర్యాపేట, నంబూరుల గురించి కూడా అతడికి చెప్పాను.] పోలీసు కేసుల దాకా వెళ్ళింది. ఆ ఋజువుల పత్రాలు కూడా నాదగ్గరున్న ఫైల్ లో ఉన్నాయి. అవి అతడికి చూపించాను కూడా! అయితే అతడవేవీ పట్టించుకోలేదు లెండి. అతడి ఏకాగ్రత ఎంతసేపూ “రామోజీరావు గ్రేట్ పర్సన్!” అని వాదించటం మీదే ఉంది. దాదాపు రామోజీరావుకి డిఫెన్స్ న్యాయవాది స్థాయిలో వాదించాడు. ఆ వివరాలు తర్వాత టపాలలో వ్రాస్తాను.

ఇదే సమస్య గురించి వార్త సబ్ ఎడిటర్ కూడా “After all నీటి సమస్య! మీరు కంప్లైంట్లు పెట్టటానికి ఎంత ఖర్చు అయ్యిఉంటుంది. దానికి బదులుగా నెలకీ 500/- రూ. లిచ్చి మనిషిని పెట్టుకుంటే పోయేదానికి కంప్లైంట్లు పెట్టుకుంటారా?" అన్నాడు.[ఇంకా చాలా అన్నాడు లెండి. అవన్నీ తర్వాత వ్రాస్తాను.] 500/- రూ. లిచ్చి మనిషిని పెట్టుకోవాలట. అంతేగాని కంప్లైంట్లు పెట్టకూడదట. సరే, మనిషిని పెట్టుకుందామన్నా దొరికేదెక్కడ? పనిమనిషి దొరికినా నీళ్ళు దొరికే తావెక్కడ? అదీగాక నీటి సమస్య శ్రీశైలంలో అయితే మా ఒక్కరిదే కాదు, మొత్తం మా అంతస్థులోని 9 కుటుంబాలది కూడా. ఇలా ఈ నీటి వేధింపు, కరెంటు వేధింపు 2007, మే దాకా మాకు నిరంతర, సమాంతర ప్రక్రియ అయిపోయింది. ఏ ఊర్లో ఉన్నా ఇదే సారూప్యం!

ఇక మరో అంశం ఏమిటంటే – సూర్యాపేటలో మా ఇంటి ఓనర్ చికెన్ కొట్టు నడిపే వ్యక్తి. గతంలో పనిమనిషిగా ‘చరిత్ర’ కలిగిన ‘స్త్రీ’. అటువంటి వ్యక్తిని కూడా ఆ జిల్లా ఎస్.పి.గానీ, ఆఊరి డి.యస్.పి. గానీ, సి.ఐ.,ఎస్.ఐ.,లు గానీ, తెదేపా, కాంగ్రెస్ లీడర్లు గానీ, స్వంతంగా తిరుగుబాటు అభ్యర్ధుల్నీ నిలబెట్టి గెలిపించగల ఆ ఊరి ప్రముఖ వ్యక్తులు గానీ, ఒక్కరంటే ఒక్కరూ నియంత్రించలేకపోయారు. పిలిపించి ఒక్కమాట, ‘ఇంకో నాలుగు నెలలు ఆగమ్మా, వారి ఊరు వారు పోతారట’ అని చెప్పలేకపోయారు. పోనీ మరో ఇల్లు మాకు అద్దెకు ఇప్పించలేకపోయారు. మా ఇంటి పర్నిచర్ [Huge Furniture] తో సహా ఆమె అన్నిటినీ స్వంతం చేసుకుని మమ్మల్ని రోడ్డుమీదకి గెంటేసినా ప్రేక్షకుల్లా ఉండిపోయారు.

సరిగ్గా అలాగే… శ్రీశైలంలో మా క్రింది అంతస్థులోని నాల్గవతరగతి కాంట్రాక్టు ఉద్యోగి, అటెండర్ కం కుక్ అయిన రమణయ్యని ఆ ఊరి సి.ఐ.గానీ, యస్.ఐ.గానీ, ఈ.వో.గానీ, డి.ఈ.వో.గానీ, చివరికి శ్రీశైలం MLA ఏరాసు ప్రతాపరెడ్డి కూడా నియంత్రించలేకపోయారు. ఇది మరో సారూప్యత!

2001 ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం పై, మేము పెట్టిన ఫిర్యాదు దగ్గరి నుండి, 2001 వ్యవస్థీకృత వేధింపులు, 2007 దాకా కొనసాగిన వేధింపుల మీద, దాదాపుగా మేం 100 ఫిర్యాదులు, వివిధ హోదాల్లో గల వ్యక్తులకీ, సంస్థలకీ పెట్టాము. ప్రతీ సారీ ఒకే అనుభవం. ఫిర్యాదులో పేర్కొనబడ్డ ప్రతివారూ [దాదాపుగా] ఫిర్యాదు పెట్టినందుకు ఏడుస్తూంటారు. అలాగని వేధింఫు మానరు. ఫిర్యాదులంటే భయం ఉంటే వేధించకూడదు కదా? పోనీ భయం లేదంటే ఫిర్యాదుపెట్టినందుకు ఏడవకూడదు కదా! అదీగాక మేం పెట్టిన ఫిర్యాదుల మూలంగా తమకేమీ ఇబ్బంది లేదనీ, తమని ఎవరూ ఏం చెయ్యలేరనీ సదరు వ్యక్తులే అనేవారు. [ఇది సూర్యాపేటలోని పోలీసు వారి దగ్గర నుండీ శ్రీశైలంలో మమ్మల్ని నీటి వేధింపులు చేసిన వారి వరకూ, అందరూ అన్నదే.] ఫిర్యాదులతో చెత్తబుట్టలు నిండటం తప్ప మరే ప్రయోజనం లేదని తెగేసి చెప్పారు. మళ్ళీ అదే నోటితో “అలా కాదు ఇలా, అని మాట్లాడుకోవాలి గానీ, ఫిర్యాదులు పెట్టుకుంటారా?" అనేవాళ్ళు. “రాజీపడాలి గానీ పోరాడి ఏం సాధిస్తారు?" అంటూ తెగ తిట్టేవాళ్ళు. అదేమేము “గొడవెందుకు. ఇలా చెద్దాం….” అంటూ ఏదైనా మధ్యేమార్గం ప్రతిపాదించినా కలిసిరారు. సూర్యాపేటలోని త్రివేణి కాలేజీ యాజమాన్యం, మా ఇంటి ఓనరు, దగ్గర నుండి శ్రీశైలంలో క్రింది అంతస్థు వారి వరకూ ఇదే ధోరణి! మరి ఎవరితో రాజీ? ఏమని రాజీ? ఇదీ ఒక సారూప్యత! అయితే అప్పట్లో ఇది మాకు అస్సలు అర్ధం అయ్యేది కాదు. క్రమంగా ఇందులో కొంత స్పష్టత వచ్చింది. వివరంగా చెప్పేముందు ఓ ఉదాహరణ……

శ్రీశైలంలో ఫణిధర ప్రసాదు దేవస్థానం ఉద్యోగి. నాల్గవ తరగతి ఉద్యోగ సంఘంలో అతడికి ఏదో పదవి కూడా ఉంది. అతడు అవినీతి ఆరోపణల మీద అప్పటికే అంటే 2003 నాటికే రెండు మూడు సార్లు పేపర్ కి ఎక్కి ఉన్నాడు, సస్పెన్షన్లకు గురియై ఉన్నాడు. తన అవినీతి మీద పేపర్లలో వచ్చినా తనకేం నష్టం లేదని అతడు బాహాటంగా అంటాడట. సస్పెండ్ అయిన ప్రతీసారి ఏదో ‘మేనేజ్’ చేసి మళ్ళీ ఉద్యోగంలోకి రావటం ఇతడికి పరిపాటి. 2006 లో శ్రీశైలంలో జరిగిన సామూహిక బదిలీలలో భాగంగా మహానందికి వచ్చిపడిన ఇతడు, 2007 లో మరోసారి సస్పెండు అయ్యాడు. తర్వాతమైందో మాకు తెలియదుగానీ ఇటీవల మళ్ళీ ఉద్యోగంలో చేరాడని వార్త. వై.ఎస్. ప్రభుత్వం రూల్స్ మార్చి మరి సస్పెండ్ అయిన 1 ½ సంవత్సరం లోపల విచారణలో కేసు తేలకపోతే ఆటోమాటిక్ గా మళ్ళీ ఉద్యోగంలో చేరే అవకాశం ఇచ్చారట. ఉద్యోగులకి ఇచ్చిన వరాలలో ఇది ఒకటి.

అతడి గురించి మాకు చాలామంది “అతడు చాలా చెడ్డవాడు” అంటూ, పరోక్షంగా అతడికి భయపడండి అని చెప్పేవారు. చివరికి మాకు చల్లా వెంకయ్య సత్రంలో పూజారి గది [నెం.18] ని తాత్కాలికంగా ఇప్పించిన ఈ.వో.డ్రైవరు, ‘ఫణీధర ప్రసాదు అంటే తమకి భయమని, అందుకే అతడి జోలికి వెళ్ళం’ అనీ, మా పేరిట గది [నెం.10] ఇప్పించిన రాధిక కూడా ‘తమకి అతడితో తలనొప్పి’ అని చెప్పేవారు. నిజానికి మేమైనా అతడి జోలికి వెళ్ళిందేముంది? ఏనాడూ ముఖాముఖి పరిచయం కూడా లేదు. అతడి పేరే తొలిసారిగా AP Transco A.E. జేబులో టేపు రికార్డరుతో వచ్చి, చెప్పినప్పుడు బాగా తెలిసింది. అప్పటివరకూ తెలిసింది అతడి వదిన ఓ సంవత్సరం క్రితం స్కూలు పెట్టిందని. అంతే!

ఇదే నేపధ్యంలో ఓసారి, ఓ కానిస్టేబుల్ భార్య [వీరి పిల్లలు మా స్కూల్లోనే చదువుతున్నారు.] “ఫణీధర్ ప్రసాద్ చాలా చెడ్డవాడట మేడం. చాలా లిటిగేంటే అట. మావారే అతడితో మనకెందుకు అని జంకుతారు. అతడు చాలా చెడ్డవాడట” అంది నొక్కి చెబుతూ. అప్పటికి ఆ మాట కనీసం పాతికమంది నోట వినీ వినీ విసుగెత్తి ఉన్నాను. దాంతో నాకు చిర్రెత్తింది. “అవునండీ! చాలా చెడ్డవాడట. నేనూ విన్నాను. ఎంత చెడ్డవాడు గాక పోతే వదినని ఉంచుకుంటాడు చెప్పండి!” అన్నాను. అంతే! మళ్ళీ ఇంకెవ్వరూ అతడి గొప్పతనం గురించో, చెడ్డతనం గురించో నాతో అంటే ఒట్టు.

నిజానికి శ్రీశైలం చాలా చిన్నఊరు. అక్కడ ప్రతీవారూ ప్రతీవారికీ తెలిసి ఉంటారు. ఒక్కరితో అన్నమాట ఊరంతా తిరుగుతుంది. అయితే ఇలా ఊళ్ళో ఒకరిని చూపి ‘ఫలానా వారికి భయపడండి. వాళ్ళు చాలా శక్తిమంతులు’ అని చెప్పటం మాకు కొత్తకాదు. నంబూర్లో విన్నాను, సూర్యాపేటలో విన్నాను. త్రివేణి కాలేజీ యాజమాన్యం గురించి ఇదే చెప్పారు.

నిజానికి రామోజీరావుకి మమ్మల్ని ఇలా వేధించటం కంటే పీకలు కొయ్యటం చాలా సులభం. చాలా తక్కవఖర్చు. సమయం వృధాకాదు. బదులుగా ఇలా వేధింపు ఎందుకు ఎంచుకున్నాడన్నది మాకు అప్పటికే కాదు, ఇప్పటికీ అంతుబట్టని వ్యవహారమే. ఎంతగా పగా ప్రతీకారం అన్పించినా, ‘నా మీదే ఫిర్యాదు చేసేంత పొగరా చూస్తాను’ అనుకునే అహంకారం అయినా, వేధింఫు కంటే ప్రాణాలు తీయించటం చాలా సులభం. అది గాకుండా భయపెట్టటం ఎందుకు చేస్తాడో తెలియదు. భయపెట్టి, దాసోహం అన్పించుకున్నా, మా దగ్గర నుండి తెలుసుకోవలసిన రహస్యాలేమీ లేవు. ఈ విషయం 2005 లోనే, ఎప్పడైతే ఈ వేధింపుల వెనుక ఈనాడు రామోజీరావు ఉన్నాడని అర్ధమయ్యిందో, అప్పడే చెప్పాము. అదీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి వ్రాసిన ఫిర్యాదులో వ్రాసాము.

అసలయినా, ‘ఎందుకు భయపెట్టటం, ఏమిటి లాభం’ అంటే మాకు తెలియదు. చంద్రబాబు నాయుడి ద్వారా మా తమ్ముళ్ళని దరిచేర్చుకుని [భయపెట్టో, ప్రలోభ పెట్టో] రామోజీరావు పొందిన ప్రయోజనం ఏమిటో కూడా మాకు తెలియదు. మాకు అర్ధమయ్యింది అతడి intuition మాత్రమే. ఆ intuition వెనుక ఉన్న రిజన్ ఏమిటో మాత్రం మాకు తెలియదు. అతడికే తెలియాలి. ఏరోజైనా అతడు చెబితే అప్పుడు అందరికీ, మాకు కూడా తెలియాలి.

ఈ సందర్భంలో మీకు ఓవార్త గుర్తు చేస్తాను. 2002 లో హైదరాబాదులో ‘కుందన్ బాగ్’ కేసుగా వెలుగులోకి వచ్చిన వార్త ఇది. ఈనాడు ఈ వార్తని తొలిపేజీ వార్తగా, ప్రముఖంగా, వరుసగా కొన్ని రోజులు ప్రచురించింది. అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న [కుందన్ బాగ్ లో] ఇంటిలో, మేడసాని జయప్రద అనే మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు [ఇద్దరు పాతికదాటిన వయస్సు అవివాహిత యువతులు] చచ్చిపోయి పడి ఉన్నారు. శరీరాలు కుళ్ళి, కంపెత్తి, చివరికి అస్థిపంజరాలుగా మారిపోయాయి. మూడు అస్థిపంజరాలు మంచానికి అడ్డంగా పడి ఉన్న ఫోటో కూడా ప్రచురింపబడింది. అది ధనవంతుల కాలనీ ఏమో మరి, ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఎవరూ గుర్తించలేదు. [చివరికి శవాలు కుళ్ళి కంపుకొడుతున్న పట్టించుకోలేదేమో] వాళ్ళు కూడా విచిత్రంగా ప్రవర్తించేవాళ్ళట. పేపరు వారికీ, పాలవాడికీ ముందే అడ్వాన్సు డబ్బులు ఇచ్చేసేవాళ్ళట. కరెంటు, టెలిఫోన్ బిల్లులూ అంతే. వీధిచివర చెత్తకుండీలో చెత్తవేసి రావటానికి కూడా కారులో వెళ్ళేవారట. ఎక్కువగా పళ్ళరసాల వంటి ద్రవాహారం తీసుకునేవారట. ఇంటి గేటుదగ్గర కొత్తవాళ్ళు కన్పిస్తే పిచ్చిగా కేకలు పెట్టే వాళ్ళట. రాత్రిళ్ళు కాండిల్స్ పట్టుకుని చీకటిలో దయ్యాలల తిరిగేవాళ్ళట. వాళ్ళు కొన్నాళ్ళు USA లో ఉండివచ్చారట. ఇంటికెవరూ అతిధులు రారట. తమని సి.ఐ.ఏ. వేధిస్తోందనీ, చంపటానికి ప్రయత్నింస్తోందనీ ప్రధానమంత్రికీ, ముఖ్యమంత్రికీ, స్థానిక పోలీసుస్టేషన్ లో ఫిర్యాదులు వ్రాసేవారట. [ఎందుకు వేధిస్తుందో, ఎందుకు చంపటానికి ప్రయత్నిస్తుందో… ఆ కారణాలేమిటో, వాళ్ళు ఆయా ఫిర్యాదులలో చెప్పారో లేదో, సదరు వార్తాపత్రికలో వ్రాయలేదు.] ఆత్మహత్యే చేసుకున్నారో, హత్యే జరిగిందో గానీ… ఓ దొంగ ఆ ఇంట దొంగతనం చెయ్యటానికి అర్ధరాత్రి ఇంట్లో దూరేసరికి ఇంట్లో చచ్చిపడి ఉన్న మూడు శవాలు! అప్పటికే అస్థిపంజరాలు. మొదట వాడికి భయమేసిందట. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, నగా నట్రా డబ్బూ దస్కం. ‘భలే ఛాన్సులే!’ అనుకుని ఆ దొంగ దాదాపు ప్రతీరోజూ ఆ ఇంటికి వెళ్ళి దొరికిన వస్తువులు దొరికినట్లు అమ్ముకున్నాడట. తర్వాత తన స్నేహితులు కొందరికి కూడా చెప్పాడట. దాదాపు మూడు నెలలు పాటు తరచుగా ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఓ ప్రక్క శవాలు ఉండగానే, వస్తువులు తీసుకుపోయాడట. చివరికి బాత్ రూం పంపులు కూడా వదలిపెట్టకుండా తస్కరించాడు. చివరికి వాటిని అమ్ముతూ ఎందుకో అనుమానింపబడి పోలీసులకి చిక్కిపోవటంతో, ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. అప్పటికి బిల్లులు కట్టనందున టెలిఫోన్, కరెంటు కట్ చేసారట సదరు డిపార్ట్ మెంట్ వాళ్ళు. ఇంటి ముందు పేపర్లు, చెడిపోయిన పాల పాకెట్లు అలాగే ఉన్నాయట. విషయం పేపరులో వచ్చాక ఆ మహిళ భర్త [ఇతడామెతో చాలా సంవత్సరాల క్రిందటే విడిపోయి వేరుగా ఉంటున్నాడట, హైదరాబాదులోనే], ఆ అస్థిపంజరాలకి కర్మకాండలు జరిపించాడని వ్రాస్తూ, ఆశ్రేణి వార్తలు ముగింపబడ్డాయి. తొలిరోజు ఈ వార్తని మా ఇంటిఓనర్ కూతురు “చూడండి ఆంటీ! ఎంత ఘోరమో! దిక్కుమొక్కు లేకుండా కుక్కచావు చచ్చిపోయారు వాళ్ళు!” అంది. అప్పటికి నానల్ నగర్ లో రేకుల షెడ్డూలో ఉండేవాళ్ళం. అప్పటికి మాకు డబుల్ ధమాక్ [అంటే వేధింఫు+వృత్తి లేకపోవటం అన్నమాట] ఇస్తున్న రోజులు. అప్పటికే ఆవార్త కూలంకషంగా చదివి ఉన్నాను. ఆ వార్త నాకు దిగ్ర్భమగా అన్పించింది. ‘ఓర్నాయనో నగర జీవితం’ అన్పించింది. అదే పల్లెలో అయితే ప్రక్కింట్లో ఏంజరుగుతుందో ఆ మాత్రం పట్టించుకుంటారు కదా! అదే అన్నాను ఆ పిల్లతో. అప్పుడు, అంటే 2002 లో అంతకంటే ఆలోచించలేదు గాని 2005 లో మేం పడుతున్న వేధింపులన్నిటి వెనుకా రామోజీరావు ఉన్నాడని అర్ధమయ్యాక మేడసాని జయప్రదకి సంబంధించిన ఈ కుందన్ బాగ్ కేసు గుర్తుకు వచ్చింది. అప్పట్లో ఈనాడు చదివిన వారికి ఈ వార్త గుర్తుండవచ్చు. ఏతావాతా తనని చూసి భయపడమన్నది అక్కడి సందేశం లేదా సంకేతం అన్నమాట. అప్పటికి మా బ్రతుకు బస్టాండ్ చేసి చూపించారు. మాకు రెండువైపులా సంబంధాలు లేవు. మా తమ్ముళ్ళతో సంబంధాలు ఉన్నా ఎవ్వరు వచ్చేవారు కాదు. మేమే వాళ్ళ ఇంటికి ఆదివారాలు వెళ్ళేవాళ్ళం. ఒకరకంగా దిక్కులేదు అన్న ఫీలింగ్ కలగజేయటానికే ఇవన్నీ చేసాడని, తరువాత, 2005 లో అన్పించింది. అదేమాట, ‘చంపి పాతర వేసినా అడిగే దిక్కు లేదు. ఏం చూసుకొని పొగరు’ అని సూర్యాపేటలో మా ఇంటి ఓనరు కూడా ఒకసారి అన్నది. అదే శ్రీశైలంలో మా ఓల్డ్ స్టూడెంట్ ఒకరు “సార్! పోలీసులు, మిమ్మల్ని నక్సలెట్లు అని తీసుకుని వెళ్ళి ఎన్ కౌంటర్ చేసారనుకొండి. మీరేం చెయ్యగలరు? అడగటానికి కూడా మీకు ఎవ్వరు లేరు” అని అన్నాడు. మేం ఒకటే సమాధానం చెప్పాం “అదిగో గుళ్ళో మల్లయ్య, భైరమ్మ ఇద్దరు ఉన్నారు. మాకేందుకు భయం! జరగనీ అప్పుడు ఏంజరుగుతుందో వాళ్ళందరు చూస్తారు” అని చెప్పాం. ఇక తరువాత ఎప్పుడు ఆప్రసక్తి తేలేదు.

అలాంటి [కంప్లైంట్లు పెట్టకు, రాజీ పడు] సందేశం లేదా సంకేతం మాకు ఆ వార్తలోనే కాదు, అంతకు ముందునుండీ విన్పిస్తూనే ఉంది. 2001 లో సూర్యాపేటలో మా ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి ఓరోజు తిట్లతో భాగంగా నన్ను “నువ్వు చదువుకున్నావు గానీ, నీకస్సలు తెలివిలేదు. అలా క్కాదు ఇలాగ అని మాట్లాడుకుంటారు గాని కంప్లయింట్లు పెట్టుకుంటారా?” అంది. అప్పటికే మేము ఊళ్ళోని పెద్దమనుష్యులు దగ్గర పంచాయితీ పెట్టి ఉన్నందున ఈమె డైలాగ్ ఆరోజు అస్సలు అర్ధంకాలేదు. 2005 లో ఈనాడు రామోజీరావు పాత్ర తెలిసాక అర్ధమయ్యింది.

అదే నేపధ్యంలో మా విద్యార్ధి తండ్రి గోవిందస్వామి [ఆ వివరాలు గత టపాల్లో వ్రాసి ఉన్నాను] “గడ్డివామి దగ్గర కుక్కలా ఉంటే మీకేమిటిలాభం? సమాజానికి ఎదురీది ఏమీ సాధించలేరు” అని గద్దించాడు. అప్పుడూ అంతే! అప్పుడర్ధంకాలేదు గానీ 2005 తర్వాత అర్ధమయ్యింది. 2006 లో మార్గదర్శి వ్యవహారమై రచ్చ జరుగుతున్నప్పుడు ది హిందూ పత్రిక ఎడిటర్ ఎన్.రామ్, ఈనాడు తొలిపేజీలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి “రామోజీరావు మంచివ్యక్తి. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఏమైనా కావలసి ఉంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు. రామోజీరావు అర్ధం చేసుకుంటారు. అంతేగానీ ఇలా వేధించటం సరికాదు. సమస్యల్ని పరిష్కరించుకునే తీరు ఇదికాదు” అన్నాడు. ఆవిధంగా రామోజీరావు ఎటువంటి వాడో, అతడి ఇన్ ట్యూషన్ ఏమిటో ఎన్.రామ్ చెప్పాడన్నమాట. చెప్పింది వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికే. అయితే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రామోజీరావు చేతిలోని బొమ్మ అన్నది మాకేసు విషయంలో May17, 2007 న ఢిల్లీ ఏ.పీ. భవన్ లో సంఘటానాత్మకంగా, పత్రాలతో సహా ఋజువు అయ్యింది. [ఆ వివరాలు Coups on World లో ఉన్నాయి. తెలుగులో తదుపరి టపాలలో వ్రాస్తాను.] అదీగాక వై.యస్.కే చెప్పదలుచుకుంటే, ఆ మాట పత్రికాముఖంగా ఎవ్వరు చెప్పుకోరు. ఎందుకంటే ఆఫర్ పబ్లిక్ గా చెబుతారా? లోపాయికారిగా సరిదిద్దుకుంటారు గానీ! అటువంటప్పడు ఎన్.రామ్ పత్రికాముఖంగా ఎవరెవరి కోసం ప్రకటించాడో మరి! బహుశః నిఘా సంస్థల కోసం ప్రకటించి ఉంటాడు అనుకున్నాము. దీన్నిగురించి తర్వాత వివరిస్తాను.

ఇదేవిధంగా IG of CBCID , Mr. కృష్ణరాజ్ [మార్గదర్శి కేసు డీల్ చేసిన అధికారి] కూడా చెప్పాడు. “ఈ attitude తో మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు” అని. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పుడు దృక్పధమా? [Wrong attitude?] అలా ఫిర్యాదు చేయకుండా ఏంచేస్తే నాది Right Attitude అని సదరు అధికారి అంటాడు? ఇదే ప్రశ్నని ప్రధానికి వ్రాసిన ఫిర్యాదులో సంధించాను. వాక్యాలు వేరైనా దాదాపు ఇదే విషయం చెప్పాడు, వార్త సబ్ ఎడిటర్. కృష్ణ రాజ్, వార్త సబ్ ఎడిటర్ ఇద్దరూ కూడబలుకున్నట్లుగా [ముందురోజు కృష్ణ రాజ్ ని, రెండో రోజు వార్త సబ్ ఎడిటర్ ని కలిసాను వారి వారి కార్యాలయాల్లో] చెప్పిన ఉమ్మడి అర్ధం మరొకటుంది. నేను నా Attitude తో నా జీవితమే గాక, నా భర్త జీవితమూ, నాబిడ్డ జీవితమూ కూడా నాశనం చేస్తున్నానట. ఈ బ్రెయిన్ వాష్ దాదాపు గంటసేపు చేశాడు. ఆ విధంగా నాబుర్రలోకి, నా పాప, మావారి బుర్రల్లోకి ఓ శంక ప్రవేశపెట్టే ప్రయత్నం! ఏ బలహీన క్షణంలోనైనా అది పనిచేయకపోతుందా, ప్రభావం చూపెట్టకపోతుందా అన్న ప్రయత్నం! నా తల్లి, చెల్లి, తమ్ముళ్ళని ఇలాగే మా బంధువులు ఫ్యాక్టరీ నుండి బయటికి వచ్చేటట్లు చేసారు. నాపాప చదువు, భవిష్యత్తు గుర్తుచేస్తూ – “ఎంసెట్టులూ, గట్రా మోసాలు, అవినీతి నడుస్తూనే ఉంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు. మీకంతగా నీతి, విలువలు గల వ్యక్తిగా పేరుప్రఖ్యాతులు కావాలంటే మాకు మంచి ఆర్టికల్స్ వ్రాసి పంపండి, మేం ప్రచురిస్తాం. లేదా శ్రీశైలం అడవుల్లో చాలా మంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్పండి మేం ఆర్ధికసాయం చేస్తాం” అని ఆఫర్ చేసాడు.

ఫ్యాక్టరీ పోగొట్టుకున్న Frustration కొద్దీ నాకీ చిత్తచాంచల్యం కలిగిందట. దానికి మావారు “మరి నేనే ఫ్యాక్టరీ పోగొట్టుకోలేదు కదండీ! ఆవిడకి కన్పిస్తున్న ప్రతి అంశమూ, వేధింపు నాకూ అనుభవంలోకి వస్తున్నాయ్ కదా!” అంటే వెంటనే మాట దొర్లించాడు. చివరికి ఇదే అంటూ శ్రీశైలం డి.ఈ.వో. కృష్ణయ్య “ఇలాంటి ఆడామెని నేనెక్కడా చూడలేదు. రామోజీరావు మీద కంప్లైంటు పెట్టింది. చంద్రబాబు నాయుడి మీద కంప్లైంటు పెట్టింది. నామీద కంప్లైంటు పెట్టింది. మా దేవస్థానం రూమ్ లో ఉంటూ మామేదే కంప్లైంట్ చేస్తే మాకెందుకీ గోల? అందుకే రూమ్ కాన్సిల్ చేశాను” అన్నాడు. ఇదే ప్రతిపాదన శ్రీశైలం సి.ఐ. కరుణాకర్ ది కూడా. సవివరంగా తర్వాత టపాల్లో వ్రాస్తాను.

ఈనేపధ్యంలో వీరంతా అన్నది ఒక్కటే…. ఫిర్యాదు పెట్టటంకాదు, రాజీ పడండి! సూర్యాపేట ఎ.ఎస్.పి. శివానందరెడ్డి దగ్గర నుండి శ్రీశైలం సి.ఐ. కరుణాకర్ దాకా, 2001 నుండి 2007 దాకా, అదేమాట. ఎవరితో రాజీ? ఏమని రాజీ? ఎందుకు రాజీ? ఏమీ అర్ధంకాదు. “అర్ధమైతే రాజీపడతారా?” అంటే ఛస్తే పడను. అదే విషయం 2007, మార్చి 8 న శ్రీశైలం సి.ఐ., మేము ఢిల్లీలో ప్రధానికి, సోనియాగాంధీకి, భారత రాష్ట్రపతికీ పెట్టిన ఫిర్యాదులు, CBCID నుండి ఎస్.పి. ద్వారా, తనకి Forward అయ్యాయని చెప్పి స్టేట్ మెంట్లు కావాలని, తీసుకుంటూ అడిగినప్పుడు కూడా తెగేసి చెప్పాను. ఈ నేపధ్యంలో నడిచిన కేసు తీరులోనే, పూర్తిగా కేసు ఋజువై, సాక్ష్యాధార పత్రాలు, దృష్టాంతాలతో సహా సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మొదలైన వారంతా రామోజీరావు మనుషులుగా నిరూపింపబడ్డారు. వివరంగా తదుపరి టపాల్లో వ్రాస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ఫస్ట్ నుండి ఫాలో అవ్వని వాళ్ళకి టూకీ గా చెప్పారు. శత్రువు కొట్టే దెబ్బ కంటే కొడతాడు కొడతాడు అనే భయమే వాళ్ళకు ముఖ్యం. ఈ భయన్ని incorporate చెయ్యడానికి సామాన్య జనాన్ని వాడుకొంటారు. ఎందుకంటే వాళ్ళైతేనే కొత్తవాళ్ళని ఈజీగా భయపెట్టగలరు. అందులే అసాధారణత కూడా కనపడదు.

మనోహర్ చెనికల gaaru,

అవునండి! దర్శకుడు పాతవాడే. నటీనటులే కొత్తవాళ్ళు. నేను, అదే పాత సినిమాని వేర్వేరు ఊళ్ళల్లో కొత్తనటీనటులతో చాలాసార్లు చూసాను. ప్రధానికి వ్రాసిన చివరి ఫిర్యాదులలో అదే వ్రాసాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu