రోజు టపా:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 76[వేధింఫుల వెనుక అంతరార్ధం]

ఏప్రియల్ 3 వ తేదీన ప్రియాంక వాద్రకి మామగారు, సోనియా గాంధీకి వియ్యంకుడు అయిన రాజిందర్ వాద్రా మరణించాడు. ఉరివేసుకు ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని పత్రికల్లో[ఈనాడులో కాదు] వార్తలొచ్చాయి. హత్యో, ఆత్మహత్యోగాని బలవన్మరణం లేదా హఠాత్మరణం చెందాడన్నది మాత్రం నిజం. ఆ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వివిధ కారణాలతో మరణించారు. మొత్తం కుటుంబంలో మిగిలింది ప్రియాంక వాద్రా భర్త, రాబర్ట్ వధేరా మాత్రమే. రాజిందర్ వాద్రాకుటుంబం దేశ విభజన నాడు పాకిస్తాన్ నుండి భారత్ కు వలస వచ్చారు. ఇతడు క్రిస్టియన్ అయినా ఆర్.ఎస్.ఎస్. తో చాలా సంబంధాలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు లింక్ చూడండి.

ఇక, రాజిందర్ వాద్రా మరణించగానే, చాలా హడావుడిగా వాళ్ళ మతవిశ్వాసాలకు విరుద్ధంగా, అతడి పార్ధివ శరీరాన్ని కాల్చేసారు. [ఎందుకో?] ఈ వార్తని పత్రికలు ఓ మూలన అప్రాముఖ్య వార్తగా వ్రాసాయి. అది వింతకాదు. పత్రికలు తమకు కావలసిన వారి గురించి కావలసినట్లుగా, వ్యతిరేకుల గురించి వక్రభాష్యాలుగా వ్రాయటం మనకి కొత్తకాదు, వింతాకాదు. అసలు వింత ఎక్కడంటే – ప్రతిపక్ష నేతలు గానీ, మరొకరు గానీ, ఈ విషయమై నోరెత్తకపోవటం! మాయావతిగానీ, అద్వానీ గానీ, లెప్ట్ పార్టీల నేతలు గానీ కిమ్మంటే ఒట్టు. అదే తాము అలజడి రేపదలుచుకుంటే, ఒక సంఘటనని సంచలనం చేయదలుచుకుంటే, ఇక అదేపనిగా దాని గురించి సమర్ధిస్తూనో, వ్యతిరేకిస్తూనో మాట్లాడతారు. ఇటీవలి వరుణ్ గాంధీ వ్యవహారం దాన్నే నిరూపించింది. వరుణ్ గాంధీ అన్నదాని పైన మాయవతి నాసాచట్ట ప్రయోగం, మనేకాగాంధీ, మాయవతీల పరస్పర విమర్శనాస్త్రాలు, మాతృత్వం గురించిన విశ్లేషణలు!

ఒకప్పుడు, సంజయ్ గాంధీ మరణానంతరం మనేకాగాంధీ, ఇందిరాగాంధీల మధ్య ఆత్తకోడళ్ళ పోరనీ, ఆస్తి పంపకాలు అత్తగారు చేయటం లేదనీ, పసికందు తల్లి మనేకా గాంధీ పట్ల సానుభూతి కురిపిస్తూ పత్రికలు పతాక శీర్షికలు వ్రాసాయి. వెంటనే ఇందిరాగాంధీ మనేకాగాంధీకి ఆస్థి పంపకం చేయటం, మనేకాగాంధీ వేరే ఇంటికి వెళ్ళిపోవటంతో తాత్కాలికంగా వార్తాసంచలనం కొంచెం వేగం తగ్గింది. అదే సోనియాగాంధీ వ్యవహారమైతే పత్రికలకే కాదు, ప్రతిపక్షనేతలకీ కూడా హడలే. నోరెత్తరు. అదీ ఆమె బలం! అందరూ వ్యూహాత్మకంగా మౌనం వహించటం…. ఇక్కడ తెలియటం లేదా అందరిని నడుపుతున్నది ఒకే వ్యవస్థే అన్నది?

కావాలంటే మరో ఉదాహరణ చూడండి. ఇటీవల భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధిపతి ఆనంద్ వర్మ ప్రకటన ఆంధ్రజ్యోతిఆన్ లైన్ ఎడిషన్ లో వచ్చింది. దానిమీద పత్రికలు గానీ, ప్రైవేటు ఛానెళ్ళు గానీ ఏమాత్రం స్పందించలేదు. దానిపై ఫోకస్ చెయ్యలేదు. దాన్ని సంచలనం చేయలేదు. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరదూషణలు కూడా చేసుకోలేదు. చాలా వ్యూహాత్మకంగా లేదా అంతర్గత సర్ధుబాటుగా అందరూ దానిమీద మౌనం పాటించారు. అదే కాగ్ ఒకనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ని అభిశంసించితే గగ్గోలు పెట్టారు. పత్రికలు, ముఖ్యంగా ఈనాడు పుంఖానుపుంఖాలుగా, విసుగు విరామం లేకుండా వ్రాసింది. ప్రముఖ న్యాయవాది రాంజఠ్మాలానీ ‘తనని తాను కుక్కగా’ అభివర్ణించుకుంటూ దొంగల పట్ల తాను మొరుగుతుంటానని, అలా ప్రజల్ని అప్రమత్తం చేస్తానని అన్నాడు. [కాంగ్రెస్ వాది ఎవరో అన్న వ్యాఖ్యకి ప్రతివ్యాఖ్యగా అలాఅన్నాడు.] అటువంటిది ఇప్పుడు ఎవరూ అలా ప్రజల్ని అప్రమత్తుల్ని చేయటం లేదే? ఎందుచేతనో? ఎవరిని కాపాటానికి? బహుశః ఆనాటి ప్రధానులు [ఇందిరా, రాజీవ్, పీ.వీ. వగైరా] తమకు వ్యతిరేకులు గనుక ఈకుట్రదారులు ఆరోజు ‘కుక్కల్లా మొరిగి ఐనా ప్రజల్ని అప్రమత్తం చేస్తాం’ అంటూ గావుకేకలు పెట్టారు. ఈరోజు ఎన్.డి.ఏ. అయినా, యు.పి.ఏ. అయినా, సోనియాగాంధీ అయినా, తమ కుట్రలో భాగస్తులే గనుక అందరూ మూకుమ్మడి మౌనం పాటిస్తున్నారు కాబోలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

"ఇక, రాజిందర్ వాద్రా మరణించగానే, చాలా హడావుడిగా వాళ్ళ మతవిశ్వాసాలకు విరుద్ధంగా, అతడి పార్ధివ శరీరాన్ని కాల్చేసారు".

మీరు మంచి విషయం మీద వ్రాస్తున్నారు. This proves that (two things)
1) anti-national forces (backed up by Christian Missionaries from West) want to destabilize India and convert one Billion Hindus.
2) Islamic forces backed up by Pakistan want to eliminate India (read Hindus).

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu