గతనెల [మార్చి] 3వ తేదిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. తొలివిడిత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో మలివిడిత పోలింగ్ కి ఇంకా మూడు రోజుల వ్యవధి ఉంది.

ఈ నేపధ్యంలో, గడిచిన నెలన్నర రోజుల్లో, ఎన్నికల ప్రచార సరళిలో ఎన్ని వ్యూహాలో! ఎన్ని ఎత్తుగడలో…. అన్నీకాదు గానీ, వరుసగా కొన్నిటిని పరిశీలిద్దాం.

అన్ని విషయాల్లో లాగానే ఓటర్లు ఓటు కొనడం విషయంలోనూ ఎలా ‘Exploit’ చేసారో మొన్న పరిశీలించాం. ఈరోజు నగదు బదిలీలో దాగి ఉన్న నిజాలని పరిశీలిద్దాం.

ఎన్నికల ప్రకటన వెలువడ్డాక, మార్చి 9 వ తేది జరగాల్సిన మహా గర్జనని మార్చి మూడో తేదీనే వాయిదా వేసుకుని, సీట్లు సర్ధుబాటు పైన సంప్రదింపులు ఫలించక, నానా వెతలూ పడుతున్న నేపధ్యంలో ‘బుర్ర’ గిలక్కొట్టి[?], ఎంతో గుంజాటన పడుతూ, చంద్రబాబు నాయుడు నగదు బదిలీ పధకం ప్రకటించాడు. అప్పుడెంత ముందు వెనుకలాడాడో వార్తలు క్రమం తప్పకుండా చదివే వారు మరోసారి గుర్తుతెచ్చుకోవచ్చు. నగదుబదిలీ పధకం ప్రకటించగానే అదేం హిట్టయిపోలేదు. సహజంగానే ఏ పధకమైనా ప్రజల్లోకి వెళ్ళి హిట్టో, ఫట్టో అవ్వడానికి ఆమాత్రం సమయం పడుతుంది. అయితే అది మార్చి 19 వ తేదిన సి.ఐ.ఏ. అధిపతి ఇండియాకి వచ్చిపోయాక, అప్పటివరకూ కాంగ్రెస్ కి ఫర్వాలేదనిపించిన విజయవకాశాలు ఒక్కసారిగా తల్లక్రిందులైపోయాక, అనూహ్యంగా చంద్రబాబు, [మహా కూటమి] నగదు బదిలీ పధకం సూపర్ డూపర్ హిట్టయిపోయింది. మీడియా ఉవాచ ప్రకారం జనం మహా కూటమికి బ్రహ్మరధం పడుతున్నారు.

‘లబ్థిదారులైన మహిళలకు నెలనెలా వెయ్యి నుండి రెండు వేల రూపాయల దాకా నగదు డైరెక్టుగా ఖాతాలో వచ్చి పడుతుంది. ఏటియం ల్లో నగదు ’డ్రా’ చేసుకోవటమే!’ అంటూ ప్రతీరోజూ ఎటీఎం ముందు నోట్లు లెక్కపెట్టుకుంటున్న మహిళ ఫోటోతో, ఫుల్ పేజీ ప్రకటనలతో తెదేపా, మీడియా కూడా ఊదర పెడుతున్నాయి. మధ్యలో దళారులా, ఉద్యోగులా ప్రసక్తి లేదు గనుక అవినీతికి తావులేదట. మరి ఖాతాలు తెరిచేందుకూ, అర్హులను గుర్తించేందుకు, ATM ల్లో డబ్బు జమ చేసేందుకు ఉద్యోగులూ, దళారులూ ఉండరు కాబోలు!

అసలు తెల్లకార్డులు ఉన్నది ఎంత మందికి? అందులో నిజమైన పేదవారు ఎందరు? మాఇంటి ఎదురుగా ఓ రిటైర్డు ప్రభుత్వద్యోగి ఉన్నారు. స్వంత ఇల్లు కలిగిన ధనికుడు. ఆయనకి తెల్లకార్డు ఉంది. శ్రీశైలంలో దేవస్థానపు దుకాణాల్లో 40% ముస్లింలవే. బినామీ పేర్లతో టెండర్లు పాడుకున్న, ఆ ముస్లిములూ, ముస్లిమేతరులైన గిరిజనుల వెనుకా ఉన్నది ఒకే ఒక్క ముస్లిం. ఇతనో మాజీ సినిమా నిర్మాత. ప్రస్తుతం శ్రీశైలంలో బినామీ పేర్లతోనే గాక స్వంత పేరుతో రెండు బట్టల దుకాణాలు, ఓ గిప్ట్ ఆర్టీకల్స్ దుకాణము ఉన్నాయి. శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీలో ప్రభుత్వపట్టాభూమిని కలిగి ఉన్న పేదవారి నుండి భూమి లోపాయికారిగా కొని, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. రెండు, మూడు వాహనాలు[కార్లు, వాటిలో ఒకటి స్కార్పియో] కలిగి ఉన్న ధనవంతుడు. ఇతడికి తెల్లకార్డు ఉంది. ఇతనే కాదు ఇలాంటి నిరుపేద ధనవంతులు ఈ ఊరిలో చాలామంది తెల్లకార్డులు కలిగిఉన్నారు. ఈ లెక్కలో ఇలాంటి వారందరికీ కూడా నగదు బదిలీ అవుతుందా?

అసలు కిలో రెండు రూపాయల బియ్యాన్ని 2/-Rs. కి పెంచుతూ 3.50/-Rs. 2004 కు ముందు, చంద్రబాబు నాయుడు, బోగస్ కార్డులు ఏరివేత అంటూ చాలా తెల్లకార్డుల్ని రద్దుచేసేడన్న వార్తలున్నాయి. [బోగస్ కార్డులు ఉన్నదీ నిజమేకదా!] అలాంటిప్పుడు రేపైనా నకిలీ వంటూ నిజమైన లబ్ధిదారుల తెల్లకార్డులు రద్దు చేయడని గ్యారంటీ ఏమిటి? ఇతడు గతంలో ఏమైనా విశ్వసనీయత నిలబెట్టుకున్నాడా? పిల్లనిచ్చిన మామ నే వెన్నుపోటు పొడిచిన వాడు, కెరీర్ బాగుంటుందేమో అని ఎర్రపార్టీ నేత రాఘవులు కూతురితో తన కొడుకు లోకేష్ వివాహం నిశ్చయించ ప్రయత్నించిన వాడూ, ఆపిల్ల ప్రేమవివాహం చేసుకుంటానన్న కారణంగా, ఇక తప్పదన్నట్లు బావమరిది బాలకృష్ణ కుమార్తె బ్రహ్మాణిని కోడలిగా తెచ్చుకున్నవాడూ అయిన చంద్రబాబుని – బాలకృష్ణ కాబట్టి నాదెండ్లది ఎన్.టి.ఆర్.కి వెన్నుపోటు గాను బావచంద్రబాబుది వెన్నుపోటు కాదు, అది పార్టీని బలపేతం చెయటం అన్న ప్రకటన ఇవ్వగలిగాడు గానీ ప్రజలు నమ్మగలరా? పనికివస్తాడు అంటే ఎవరినైనా ఎత్తినెత్తిన పెట్టుకుంటాడు, పనిరాడంటే విసిరి నేలకు కొడతాడు అన్నపేరున్న చంద్రబాబుని,[నిజానికి ఈ స్ట్రాటజీ చంద్రబాబు స్వంతం కాదులెండి. అతణ్ణి ఒకప్పుడు కింగ్ ని చేసిన, అతడి గురువు రామోజీరావుది], తన రెండో భార్య సంతానం జూ. ఎన్టీ ఆర్ ని ఎత్తినెత్తిన పెట్టుకుంటూ, తన అసలు భార్య కొడుకు కళ్యాణ రామ్ నీ, తమ సోదరుల సంతానాన్నీ, తమనీ నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబుని హరికృష్ణ తలవొంచుకు సమర్ధిస్తాడేమో గానీ ప్రజలు సమర్ధిస్తారా? అయితే సమర్ధిస్తారని, సమర్ధిస్తున్నారనీ మీడియా అంటోంది. నిజమెంతో వేచి చూడాల్సిందే?’

ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ప్రభుత్వానికి తన ఉద్యోగులెంతమందో తనకే తెలియదు అని ఈనాడు, మొదలైన పత్రికలే ఎన్నో సార్లు చెప్పాయి. 2001 సంవత్సరంలో 222 మంది దొంగ సర్వీసు రికార్డులతో దొరికిపోయారు. ఉపాధ్యాయ బదిలీల నేపధ్యంలో బదీలీలపై వచ్చామంటూ దొంగ సర్వీసు రికార్డులతో మరోచోట ఉద్యోగవిధుల్లో చేరిపోయారు. మామూలుగా వాళ్ళకి కొన్నేళ్ళు పాటు జీతాల చెక్కులూ, కరువుభత్యాలు గట్రా చెక్కులూ వచ్చాయి. ఇదంతా సెక్రటేరియట్ లోనూ, ఉపాధ్యాయ సంఘనేతల ద్వారాను ‘మేనేజ్’ చెయ్యబడింది. ఏ కారణం చేతనో ఇదంతా బట్టబయలై విషయం పేపర్లకి ఎక్కినప్పుడు ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఇలాంటివి అన్ని జిల్లాల్లో, అన్ని డిపార్టుమెంటుల్లో కలిసి ఎన్నో!

ఇలాంటి నేపధ్యంలో అసలు ప్రభుత్వం [అది మహాకూటమి అయినా, కాంగ్రెసు అయినా, మరో మినీ కూటమి అయినా] లబ్ధిదారులని గుర్తించగలదా? నగదు సరిగా బదిలీ చేయగలదా? అయినా అసలు ప్రజలకి పనిచేసుకు సంపాదించుకుని హాయిగా రాజాల్లా బ్రతకగలిగే ఉపాధి అవకాశాలు కల్పించాలి గానీ ‘మీరు ఊరికే కూర్చోండి. మేం నగదు ఇస్తాం’ అనటం ప్రజా సంక్షేమమా? దేశ సంక్షేమమా? ఎక్కడో లాటిన్ ఆమెరికాలో విజయవంతం అయిన పధకమట ఇది. మరి అర్జెంటెనా లో ఛావెజ్ విదేశీ కార్పోరేట్ సంస్థల ఆస్తులు లాక్కుని, వాళ్ళందరినీ దేశం నుంచి తరిమేసేసాడుగా! అన్ని సంస్థలను జాతీయం చేసి ప్రభుత్వమే నడుపుతున్నది కదా! అలాంటి పధకాలు ఎంచుకోవచ్చుగా!

ఒకప్పుటి భారతీయులు కష్టించి పనిచేసి ఆత్మ గౌరవంతో బ్రతకాలని కోరుకునేవారు గానీ బిచ్చగాళ్ళల్లా ఒకరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాలని కోరుకునేవారు కాదు. అలాంటి భారతీయుల్ని ఈరోజు ఈ స్థితికి లాక్కువచ్చిన ఈ రాజకీయనాయకులు, భారతీయుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతారు. ‘జిన్నాకి జిందాబాద్’ అనే అద్వానీలూ ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అంటూ రంకెలూ పెట్టిన తెలుగుదేశం ఇప్పుడు నగదు బదిలీ అంటూ సోమరితనానికి తలుపులు తెరుస్తూ ఆత్మగౌరవపు నినాదాలు మాత్రం చెబుతోంది. రేపు గెలిచాక ఆ నగదు నెలనెలా ఇచ్చేదెంతో వచ్చెదెంతో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం ఆశల కాగితం పడవలు తెగ ఎక్కించేస్తుంది.

వై.యస్. ప్రాజెక్ట్ ల కోసం అంటూ తెగభూములు అమ్మేసాడు. ‘విరగ ఉద్యోగాలు వస్తాయి’ అంటూ సెజ్ ల పేరుమీద వ్యవసాయ భూములు అమ్మేసాడు. ఇప్పుడు ఒకవేళ మహా కూటమి ప్రభుత్వం గానీ ఏర్పాటు చేసిదంటే అమ్మడానికి ఇంకా ఏం ఉన్నాయో? బహుశః రిలయన్స్ కి హెయిర్ సెలూన్లు గుత్తగా అమ్మేస్తారేమో, ఎంత రేటు అయినా గుండు కొట్టించుకోడానికి నగదు బదిలీ పధకం ఉంది కదా అంటారేమో?

‘నగదు బదిలీ పధకం తెగ హిట్టయిపోతుంది, అందుకే పోటీ పార్టీలకి పిచ్చెక్కి పోతుంది’ అంటూ మీడియా ఆదరగొట్టేస్తుంది. అంతేమరి, మీడియా నంది అంటే నంది, పంది అంటే పంది!

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

idi media mayajalam.....
http://www.independent.co.uk/news/world/asia/1500-farmers-commit-mass-suicide-in-india-1669018.html
if this news is true mana media mana kallu mustundi.....
nijam kaka pote INDIA ni digajarina country ga chupistindi british media..

Meeru chappindi aksarala nijam, media taluchukunte emaina chestundi...

మనమూ ఒక ఛానల్ పెట్టాలేమో ఇక

వెంకట్ గారు,

మంచి సమాచారం ఇచ్చారు. ఆ బ్రిటిష్ పత్రికలో హెడ్డింగ్ లో ‘1500 మంది mass suicide [సామూహిక ఆత్మహత్యలు?] చేసుకున్నారు’ అన్నట్లు వ్రాసారు. వార్తలోపల ‘కాలగతిలో వేరు వేరు గ్రామాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని’ వ్రాసారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇక్కడి మీడియా వ్రాస్తుంది. ఐతే హెడ్డింగ్ లోనూ, వార్తలోనూ వేరు వేరుగా ఉంటంకించటం, అర్ధం కాకూడదన్నట్లుగా వ్రాయటం వంటి జిమ్మిక్కులు, మీడియా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నది. మంచి వివరాలు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu