ఆరోజు మేం హైదరాబాదు చేరేసరికి సాయంత్రం ఆరు దాటింది. నేరుగా ఈనాడు లోని నా మిత్రురాలిని కలిసేందుకు సోమాజీగూడ ఈనాడు ఆఫీసుకి వెళ్ళాము. అంతకు ముందు ఫోన్ లో చెప్పిన విషయాన్నే ఆమెకు ముఖాముఖి వివరించాను. ప్రెస్ మీట్ ఇస్తే ఎవరూ వెయ్యలేదని చెప్పాను. ఆమె ఓ కప్పు కాఫీ ఇప్పించి, ఇంకేసాయమూ చేయలేనని పరోక్షంగా తేల్చింది. దాదాపు రాత్రి 9 గంటలవుతుండగా ఇమ్లిబన్ బస్టాండ్ చేరి డార్మిటరీలో రాత్రి బస చేసాము. నిజానికి ఆచోటు అంత గౌరవప్రదంగానూ, శుభ్రంగానూ ఉండేది కాదు. కానీ ఏ హోటల్ లోనో బస చేసేంత డబ్బు మాదగ్గర లేదు. సాయం చేసే స్నేహితులూ లేరు. అప్పటికే స్నేహాలు తెగిపోయి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. మర్నాడు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటికి వెళ్ళాము. అక్కడ సందర్శకులని అనుమతించరని చెప్పారు. సెక్రటేరియట్ కు వెళ్ళాము. రోజంతా నిరీక్షణ తర్వాత సాయంత్రం అయిదు గంటలకి ’సమతా’లోకి పాస్ వచ్చింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.[సందర్శకుల logbook లో వివరాలు వ్రాసుకునేటప్పుడు మీడియా విలేఖరుల స్పందన గురించి ఇంతకు ముందు వ్రాసి ఉన్నాను.] దాదాపు 7:30PM గంటలకి నా భర్తని సందర్శకుల గదిలోనే కూర్చోమని, నన్ను, మరి కొందరిని మాత్రం సీ.ఎం.ని కలిసేందుకు అక్కడి సిబ్బంది అనుమతించారు. తీరా చూస్తే అదీ అతడు కారిడార్లో [లిప్ట్ దగ్గరికి వెళ్ళేదారిలో] కలిసి చెప్పాల్సి ఉంది. సందర్శకుల్లో నేనే ముందు నిలబడి ఉన్నాను. చంద్రబాబు నాయుడు నేరుగా నడుచుకుంటూ మాదగ్గరికి వచ్చాడు. అతణ్ణి టీవీలో తప్ప ఎదురుగా అంతకు ముందెప్పుడూ నేను చూసి ఉండలేదు. అంతక్రితం 1999 ఎన్నికప్పుడు ప్రచారంలో భాగంలో మాఇంటి ముందు నుండి చంద్రబాబు వెళ్ళగా అప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను. అందువలన నేను చూడలేకపోయాను. అయితే నేను వివరాలు క్లుప్తంగా చెబుతూ “సర్! నేను ఎంసెట్ 2000 ర్యాంకు కుంభకోణం మీద ఫిర్యాదు చేసాను. అప్పటినుండి సూర్యాపేట లోకల్ కాలేజీ వాళ్ళు నన్ను organised గా harass చేస్తున్నారు” అంటు ఇంకా చెప్పబోతున్నాను. అతడు తీవ్రస్వరంతో “ఎందుకు? ఎందుకు harass చేస్తున్నారు?" అని గర్జిస్తున్నట్లుగా అడిగాడు. ఒక్కక్షణం నేను షాక్ తిన్నాను. అంతలోనే “నేను వాళ్ళమీద complaint ఇచ్చాను సార్. ఆ వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసాను” అన్నాను. అతడదేమీ విన్పించుకోకుండా వెళ్ళపోయాడు. నేను నా చేతిలోని complaint bundle [దాదాపు 23 ఫిర్యాదులు. జిరాక్స్ చేయించడానికే 40/- లదాకా అయ్యింది] చూపుతూ మళ్ళీ రిక్వెస్ట్ చెయ్యబోయాను. అతడు తన పి.ఏ. వైపు చూసాడు. అతడు వివరాలు casual గా విని నా చేతిలోని bundle తీసుకున్నాడు. ఇంతలో చంద్రబాబునాయుడు వెళ్ళిపోయాడు. ఇటుచూస్తే, అప్పడే సినిమానటుడు బాబూ మోహన్ లిఫ్ట్ లోకి వెళ్తున్నాడు. అప్పటిదాకా నా కొంగుపట్టుకు నిల్చున్న మాపాప “మమ్మీ బుజుకు బుజుకు” అంటూ లిఫ్ట్ వైపు పరుగుపెట్టేసింది. తనకి ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో నటించిన బాబూ మోహన్ ని ’బుజుకు’గా గుర్తుంచుకుంది. నేను ఒక్క అంగలో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పాపను తెచ్చుకున్నాను. తర్వాత సి.ఎం. పి.ఏ.కి మళ్ళా వివరాలు చెప్పాను. అంతావిని అతడు మరో ఐ.ఏ.ఎస్.ని కలవమన్నాడు. అతడూ అలాగే ఓ పదినిముషాలు నా సోదంతా విని మరో ఐ.ఏ.ఎస్.ని కలవమన్నాడు. ఈ ఐ.ఏ.యస్. ఉమామహేశ్వర రావు అంతావిని “మీరు అనవసరంగా ఇంతదూరం వచ్చారు. మాకు ఏ complaint వచ్చినా concern authorities కి వెంటనే పంపిస్తాము. మీ complaint నల్గొండ కలెక్టర్ కి పంపిఉంటాము. వెళ్ళి కలెక్టర్ ని కలవండి” అని చెప్పాడు.
"సర్! నల్గొండ యస్.పి. నాకు, being IPS Officer తానేమీ చేయలేనని చెప్పాడు” అని చెప్పాను. అతడు “ we have a very good collecter at Nalgonda. You go and meet him” అనేసి మమ్మల్ని వెళ్ళమన్నాడు. “సర్! ఇప్పుడు మేం నడిరోడ్డుమీద ఉన్నాము. మాకు మరో alternative లేదు సార్” అని చెప్పాము. ఆ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ “అందరు అదేమాట అంటారు. ఏం లేదు మీరు వెళ్ళి నల్గొండ కలెక్టర్ ను కలవండి” అన్నాడు. చేసేది లేక వెనుదిరిగాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రవర్తన మాకు భయకరమైన దిగ్ర్భాంతి కలిగించింది. [ఇదే చంద్రబాబునాయుడు, అతడి కుమారుడు లోకేష్ లకి నా తమ్ముళ్ళిద్దరితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని తెలిసినప్పుడు, నా ఈ దిగ్ర్భాంతి రెట్టింపయ్యింది.]
ఏ రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, తమకి ఇష్టం లేనిపని గురించైనా సరే ‘చెయ్యము’ అని చెప్పరు. “చూస్తాం. మేం ఎంక్వయిరీ చేస్తాం.” ఇలా అంటారు. అలాంటిది, అంత blunt గా, అంత rude గా “ఎందుకు harass చేస్తారు” అని నన్ను ఎందుకు గద్దించినట్లో అర్ధంకాలేదు. అయితే అప్పటికే నా మనస్సు బాగా మొద్దుబారిపోయింది. ఆ నిరాశ, నిస్పృహ, దిగ్ర్భాంతోనే సెక్రటేరియట్ బయటకు వచ్చాము. ట్రాఫిక్ పోలీసు wrong parking అనీ స్కూటర్ సైడ్ డోమ్ ను తీసుకుపోయాడు. మాకు తెలియదు. సెక్రటేరియట్ పాస్ తీసుకునేటప్పుడు అందరు బయటే వెహికల్స్ ను పార్కింగ్ చేసారు కాబట్టి అక్కడే పార్కింగ్ చెయ్యాలికాబోలు అని అక్కడే పార్కింగ్ చేసాము. ఫైన్ కట్టే డబ్బులేదు. అసలు నిలువనీడలేదు. ఎంతోకొంత చంద్రబాబు నాయుడిమీద ఆశపెట్టుకుని వచ్చాము. ఫేస్ గ్లామర్ లేనందున పనిచేసే ప్రభుత్వాధినేతగా అతణ్ణి నమ్మాము. ఆ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కి క్లుప్తంగా విషయం చెప్పి, రిక్వెస్ట్ చేసాము. అతడికి మాస్థితి చూసి జాలేసిందో ఏమో, ఫైన్ కోసం గానీ, లంచం కోసంగానీ పట్టుబట్టకుండా బండి డోమ్ ఇచ్చేసాడు. మళ్ళీ బస్టాండ్ చేరాము.
నేను బాగా desperate అయిపోయాను. నా భర్త నన్ను ఓదార్చటానికీ, నాకు ధైర్యం చెప్పేందుకు, ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేనూ కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతలో మాపాప “నువ్వేం బెంగపడకు మమ్మీ. ఈ చంద్రబాబు నాయుడు కంటే గొప్పవాళ్ళుంటారు కదా? వాళ్ళని కలుద్దాంలే” అంది. తనకి అప్పటికే administration లో క్రింది నుండి పైకి డీల్ చెయ్యటం చూసింది కాబట్టి చంద్రబాబుపై ఇంకా ఎవరో ఒకరు ఉంటారని తన నమ్మకం. అంత నిరాశలోనూ నాకు ఒక్కసారిగా నవ్వొచ్చింది. క్రమంగా ఆ నిస్పృహ నుండి తేరుకున్నాను. మాపాపకి నేను చెప్పిన కథలు వృధాపోలేదనిపించింది. సూర్యాపేటలో ప్రెస్ మీట్ పెట్టిన రోజున, మాపాపను ఓ విలేఖరి ముద్దు చేస్తూ ఏదో అడిగాడు. అంతలో తను మా కేసు మొత్తం క్లుప్తంగా వివరించి చెప్పింది. దాదాపు ప్రెస్ మీట్ లో ఇచ్చేందుకు నేను సిద్దం చేసిన మూడు పేజీల రిపోర్టులోని ప్రతీ అంశం, అప్పటికి ఇంకా ఆరేళ్ళు పూర్తిగా నిండని పసిది అలా చెప్పేసరికి అందరితోపాటు మేమూ తెల్లబోయాము. ఈ సంఘటనని నా పాప గొప్పదని అనుకునో, నా అతిశయం కొద్దీనో వివరించడం లేదు. కథలు చెప్పటం, అందునా అమ్మ కథలు చెబూతూ బిడ్డల్ని పెంచడంలో ఎంత ప్రభావం ఉంటుందో వివరించేందుకు చెప్పాను.
మొత్తానికి ఆరోజు అంటే మార్చి 20,2001 మాపాప, నా భర్త ఇచ్చిన ఓదార్పు, ఉత్సాహాలతో తిరిగి Recharge అయ్యాను. మర్నాడు బంజారాహిల్స్ లోని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళాము. అప్పటికి అతడు సి.ఎల్.పి.లీడర్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో అతడు మాకు దొరికే సరికి సాయంత్రం అయ్యింది. నడి ఎండలో, అక్కడి సిటీ బస్ షెల్టర్ లో కాలం గడిపాము. సాయంత్రం, అతడికి మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాము. అతడేమనుకున్నాడో గానీ మమ్మల్ని లోపలిగదిలోకి తీసుకెళ్ళాడు. సోఫాలో కూర్చున్నాక చెప్పమని సంఙ్ఞ చేసాడు. మరోసారి చెబుతూ నేను “సర్! 1992 లో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉండగా నేను మిమ్మల్ని కలిసాను. అప్పుడేదో ఆవేశం కొద్దీ ఆనండి, దేశభక్తి అనండీ ప్రధానమంత్రికి ఈనాడు రామోజీరావు గురించి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి గురించీ ఫిర్యాదు చేసాను. కుముద్ బెన్ జోషి అన్నట్లు అప్పట్నుంచీ లైఫ్ misrable అయిపోయింది. తర్వాత ఫ్యాక్టరీ నష్టపోయాను. పెళ్ళి చేసుకున్నాను” అంటూ నా భర్తని పరిచయం చేసాను. అతడు ఆశ్చర్యంగా నాభర్తని ఎగాదిగా చూసాడు. నేను కొనసాగిస్తూ 2000 ఎంసెట్ ర్యాంకు కుంభకోణం గురించి ప్రస్తుత రాష్ట్రప్రభుత్వానికి నేను ఇచ్చిన ఫిర్యాదు గురించీ, ఆపైన మేం వేధింపులు పాలైన తీరు గురించీ చెప్పాను. ఈ విషయాన్ని ప్రజలదృష్టికి తెచ్చేందుకు నాకు మద్దతివ్వాల్సిందిగా కోరాను. అతడు దానికేమీ చేయలేనని, కావాలంటే సూర్యాపేట కాంగ్రెసు నాయకుడు మీలా సత్యనారాయణకు ఇంటి సామాను ఇప్పించమని రికమండేషన్ లెటర్ వ్రాసి ఇస్తానన్నాడు. అది వృధా అని, అలాంటి రికమండేషన్ లెటర్ వద్దన్నాను. అంతకంటే ఇంకేసాయమూ తానూ చెయ్యలేనంటూ అతడు ఆఫీసు గదిలోంచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మేం వెనుదిరిగి బస్టాండ్ చేరాము. ఇక ఆరాత్రి డార్మిటరీ కి అద్దె కట్టేందుకు కూడా డబ్బుల్లేవు. రాత్రంతా బస్టాండ్ బెంచ్ మీద కూర్చొన్నాం. మర్నాడు ఉదయం మా వారి స్నేహితుడు ఫోన్ నెంబరు పట్టుకొని ఫోన్ చేశాము. అదృష్టవశాత్తూ అతడు హైదరాబాద్ లోనే ఉండటంతో అతడు మా దగ్గరికి వచ్చాడు. అప్పటికి అతడూ అమెరికాకి వెళ్ళాలనే ప్రయత్నాల్లోనూ ఉన్నాడు. అతడు కొద్దిపాటి ఆర్ధికసాయం చేశాడు. తదుపరి రోజులలో మా ఫిర్యాదుల ఫైలు మొత్తం enclose చేస్తూ [అప్పటికి 23 ఫిర్యాదులున్నాయి] రాష్ట్రప్రధాన న్యాయమూర్తి సత్యబ్రతసిన్హాకి ఆర్జీ వ్రాసాము. ప్రస్తుతం బస్టాండులో తలదాచుకుంటూ ఇది వ్రాస్తున్నామనీ, స్పందించమనీ వ్రాసాము. మేం ఎక్కడికి వెళ్ళినా మా దురదృష్టం అంతకంటే ఓ అడుగు ముందే ఉండేది గనుక అతడు స్పందించలేదు.[అప్పటికి దాన్ని దురదృష్టమనే అనుకున్నాను] అయితే 2006 లోనో ఈనాడు పత్రికలో పతాకశీర్షికగా ఓ వార్త వచ్చింది. అందులో ఖమ్మం నుండి ఓవృక్తి తను అసమర్ధుడిగా, నైపుణ్యం లేని వ్యక్తిగా తయారు కావడానికి తను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలే కారణమనీ, అందుకే తన జీవితం వృధా అయ్యిందనీ ఆరోపించాడు. దాన్నే సుమోటగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి స్పందించినట్లు వార్త చదివాను. అదెంతవరకూ నిజమో నాకు తెలియదు గానీ, నేను మా మీద జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపు గురించిన నిరూపణలు, సాక్ష్యాధారపత్రాలతో సహా సమర్పించినా స్పందించలేదు.
అప్పటికి ఫర్నిచర్ తో సహా గూడు కోల్పోయామన్నది కొద్దికొద్దిగా ఇంకుతుంది. సూర్యాపేటలోని మా ఇంట్లో అధిక ఫర్నిచర్ తో పాటు, చిన్నప్పటి నుండీ సేకరించినకున్న ఫోటోలు, చదువుల్లో నాకు వచ్చిన చిన్ననాటి బహుమతులు, మంచిమంచి పుస్తకాలు[మంచి లైబ్రరీయే ఉండేది] , మా పాప బొమ్మలూ అన్నీ ఉన్నాయి. ఇంకా పబ్లిష్ చేసి, అమ్మకాలు చేయవలసిన పుస్తకాలున్నాయి. దుస్తులూ, ఇంకా ఇంటికి కావలసిన టివీ, వాషింగ్ మీషన్, ప్రిడ్జ్ లాంటి వస్తువులూ……. పూర్తిగా అన్నిటినీ కోల్పోయామని అర్ధమయ్యింది. నడిరోడ్డున, దాదాపు నయాపైస చేతిలో లేకుండా నిలబడి ఉన్నాము. దిక్కూదరీ లేదు. ఏంచెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా బ్రతకాలో తెలియదు. పుట్టి పెరిగిన ఊరు గుంటూరు వెళ్ళాము. స్నేహితుల సహాయం ఆర్ధించాము.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
Sorry to hear your story. What you think why it happened with you all these things? Is it happening to all the people in India?
ఇన్ని తట్టుకున్న మీ ధైర్యానికి , మిమ్మల్ని అర్ధం చేసుకొనే కుటుంబసభ్యులకూ (మీ పాప, మీ వారికి) జోహార్లు
My goodness!
జానేభీదో యారో సినిమా చూస్తున్నట్టుగా ఉంది.
మీ ధైర్యానికి జోహార్లు!!
@Anonymous : How many people are like Amma vodi?
Post a Comment