ప్రధానిపైనే విదేశీ నిఘా!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏడ్చి మొత్తుకున్నట్లుందని నిఘా విభాగం 'రా' మాజీ అధిపతి ఆనంద్ వర్మ స్వయంగా అంగీకరించారు. విదేశీ గూఢచారులకు కళ్లెం వేయడంలో వైఫల్యం నిజమని ఒప్పుకొన్నారు. చివరికి... ఒకసారి ప్రధానమంత్రిపైనే విదేశీ నిఘా కన్ను పడిందని తెలిపారు. ఆ ప్రధాని ఎవరు, ఏమిటి.. వంటి వివరాల్లోకి మాత్రం వెళ్లలేదు.
భారత కౌంటర్ ఇంటెలిజెన్స్‌పై ఆయన 'ఇండియన్ డిఫెన్స్ రివ్యూ' పత్రికకు ఒక వ్యాసం రాశారు. "విదేశీ గూఢచారులు వివిధ శాఖల్లో పైస్థాయి హోదాల్లోనూ అడుగుపెట్టారు. దీనిని మన కౌంటర్ ఇంటెలిజెన్స్ అడ్డుకోలేకపోయింది. ఈ వ్యవస్థ పనితీరును పరిశీలిస్తే విజయాలతోపాటు అనేక వైఫల్యాలూ కనిపిస్తాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్‌లో నిక్కచ్చి సమాచారం తెలుసుకునేందుకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. వాటిని సరిగా సమకూర్చులేకపోతున్నాం.
మొన్నటికి మొన్న జరిగిన ముంబై ముట్టడిలో విదేశీయులు బాధితులు కాకపోతే.. దానికి సంబంధించిన సమాచారం ఏమాత్రం తెలిసేది కాదంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు'' అని ఆనంద్‌వర్మ వ్యాఖ్యానించారు. భారత నిఘా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న భాగస్వామ్య సంస్థలేవీ గతంలో పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమం, అందులో చైనా పాత్ర గురించి సమాచారం అందించిన దాఖలాలే లేవన్నారు.
ఈ వార్త ఆంధ్రజ్యోతి 19/04/2009 ఆన్ లైన్ ఎడిషన్ నుండి యధాతధంగా సంగ్రహించాను. ఈనాడులో అసలు ప్రచురింపబడలేదు. దీన్ని గురించిన మరికొన్ని వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
1 comments:
thanks for sharing
Post a Comment