ఈ ఏడాది జూన్ 7 న కోర్టు తీర్పుతో ప్రారంభమై, జూన్ 29న ప్రధాని మన్మోహన్ సింగ్ "అండర్సన్ ను భారత్ రప్పిస్తాం. భోపాల్ కేసు ముగిసిపోలేదు" అంటూ ముక్తాయించటంతో ముగిసి, నిన్న పార్లమెంట్ లో చిదంబరం అదే డైలాగ్ తో ముక్తాయించిన... భోపాల్ విషవాయువు లీక్ కేసు ప్రకంపనల నేపధ్యంలో...

దాదాపు 2 నెలలు నడుస్తున్నా... అనేక ఇతర వార్తలు పతాక స్థానం సంపాదించుకొని, ఆపైన పాతబడి, మరుగైపోయినట్లుగానే... అండర్సన్ కేసు అటకెక్కి పోయింది. తిరిగి పార్లమెంట్ లో అర్జున్ సింగ్, చిదంబరాల ప్రకటనలతో మెలికలు తిరుగుతోంది.

‘అండర్సన్ ని అమెరికాకి క్షేమంగా తిప్పి పంపించింది పీవీజీనే’ అంటూ నేటి కాంగ్రెస్ కాకిగోల చేసింది. కోర్టు తీర్పు వచ్చిన తొలిక్షణం అర్జున్ సింగ్, అధినేత్రిని కలిసాడు. [పాదాలు పట్టి దాసోహం అనేసాడేమో!] ఆపైన వ్యూహాత్మకంగా కొన్నిరోజులు మౌనం పాటించాడు. ‘తర్వాత తీరిగ్గా అప్పుడు ప్రజలు ఆగ్రహోదగ్రులై ఉన్నారు. అండర్సన్ దొరికితే చంపేసి ఉండేవాళ్ళు. భద్రతరీత్యా అతణ్ణి అమెరికా పంపించేయాల్సి వచ్చిందని.... అర్జున్ సింగ్ అప్పుడే ఫలానా [?] పత్రికలో చెప్పాడు’ అంటూ ప్రణబ్ ముఖర్జీ కితాబు లివ్వడంతో, అర్జున్ సింగ్ వ్యవహారం అంతటితో తేలిపోయింది.

"న్యాయం దగా పడ్డది. న్యాయం జరగటంతో ఆలస్యం అవ్వటం అంటే బాధితులకి అన్యాయం జరిగినట్లే!" అంటూ సిద్దాంత ప్రవచనాలు చెబుతూ... ప్రస్తుత న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటనలివ్వడంతో... ప్రకరణం పూర్తయ్యింది. [బహుశః పంచ్ డైలాగులు కొట్టాననుకొని ఉంటాడు, ఈ రచయిత cum రాజకీయవేత్త!]

ఇక, అండర్సన్ విలాసంగా భారత్ వచ్చి ‘బైబై ఇండియా’ చెప్పేసి వెళ్ళిపోవటం, అమెరికాలో అతడి విలాసవంతమైన విశ్రాంతి జీవనం - ‘అండర్సన్ పలాయనంలో పీవీజీ హస్తమే ఉండి ఉండవచ్చంటూ’ నాటి విదేశాంగ కార్యదర్శి రస్గోత్రా ప్రకటనలు... గట్రా ఎన్నో అంశాలతో కూడిన ఈ వ్యవహారంలో, అడ్మినిస్ట్రేషన్ లో రెడ్ టేపిజం నడిచిందన్నా... రాజకీయాలు నడిచాయి అన్నా.... పేరు ఏదైనా నడిచింది గూఢచర్యమే!

ఎందుకంటే - రాజకీయం, రెడ్ టేపిజం సమానార్దకాలయ్యాయి. రెడ్ టేపిజం అనే పదం, నేటి పరిస్థితులలో గూఢచర్యానికి పర్యాయపదమై పోయింది.

ఈ ‘నడిచిన కథ’లో... ఏదేమిటో విశ్లేషించే ముందు, ఓ చిన్న సంఘటనని వివరిస్తాను. అదీ మా జీవితం నుండే!

అప్పట్లో మేం సూర్యాపేటలోని చికెన్ దుకాణం యజమాని ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. అప్పటికి ఆ ఇంట్లో దిగి నాలుగైదు నెలలై ఉంటుంది. ఓ రోజు ఇంటి యజమాని పదిరోజులు ముందుగానే అద్దె అడిగాడు. "ఇంకా డేట్ రాలేదు కదా అంకుల్! ఇస్తాన్లెండి!" అన్నాను. "ఆ! అవసరం ఉండీ అడిగాను" అన్నాడు. నిజానికి వాళ్ళు డబ్బులు వడ్డీకి తిప్పుతారు.

అప్పుడు మా చేతుల్లో డబ్బుల్లేవు. [Increasing of Expenditure, Decreasing of Income స్థితి]. ఆ మర్నాడే, ఓ విద్యార్ది ఫీజు కట్టాడు. "సరే! ఎప్పుడైనా కట్టాల్సిన అద్దె! పది రోజులు ముందు కడుతున్నాం. అంతే! అడిగాడు కదా, ఇద్దాం" అనుకుని, ఇంటాయనకి రెండు వేల వంద రూపాయలు ఇచ్చాము.

ఆ తర్వాత రెండు రోజులకి, ఇంటామె, మాకు అద్దెకిచ్చిన పైవాటా తమకి కావాలని, క్రింది వాటాలోకి దిగమనీ చెప్పింది. గోడలోకి సింకు నీళ్ళు లీక్ అవుతున్నాయనీ... ఇలా రోజుకో వంకతో విసిగించింది. చివరికి ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పాల్సి వచ్చే స్థితికి తరిమింది.

అప్పటి వరకూ ఆమె దగ్గర, మాపట్ల ఉన్న గౌరవం, మన్ననా... అన్నీ, వాళ్ళు అడిగినట్లు మేం అద్దె డబ్బు ఇవ్వగానే మాయమై పోయాయి. అంత దాకా "ఏమో! గుంటూరు లెక్చరర్ అంటూ టౌన్ లో మంచి ఇమేజ్ ఉంది. విద్యార్దులకి ర్యాంకులు తెప్పించిన కెరీర్ ట్రాక్ ఉంది. లక్షల్లో జీతం తీసుకుంటారనీ పేరుంది. బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఏమో!" అనే జాగ్రత్త మాపట్ల ఉండేది. అవన్నీ పటాపంచలై పోయాయి.

అప్పట్లో మాకు అంతగా అవగాహన లేకపోయింది గానీ, ఆ పరిస్థితులని మాత్రం గుర్తుంచుకున్నాం. 2005 తర్వాత ఆలోచించినప్పుడు మాకు అవన్నీ బాగానే అర్దమయ్యాయి. అప్పుడేం జరిగిందంటే... అతడు అద్దె అడిగాడు, పదిరోజులు ముందుగానే! మా దగ్గర డబ్బులేదు. విద్యార్ది ఫీజు కట్టగానే,... అదే డబ్బు ఆమెకిచ్చాం. ఆ డబ్బే నోట్ల నంబర్లతో సహా ఆమెకు అంతకు ముందు చూపబడి, తర్వాత మా విద్యార్ది చేత మాకు ఇవ్వబడింది. అవే నోట్లు తిరిగి మేము ఆమెకి ఇవ్వగానే... "చూశావా! పైకి పేరే గానీ, వాళ్ళ దగ్గర డబ్బులేం లేవు. వెనక బ్యాక్ గ్రౌండ్ కూడా ఏం లేదు. బంధుమిత్రులు గానీ ఎవరూ వచ్చి పోవటం చూశారా? లేదు కదా? కాబట్టి ధైర్యంగా మేం చెప్పినట్లు చెయ్!" అని చెప్పబడితే చాలు కదా!

ధీమాగా వేధింపు మొదలు పెట్టింది. నాలుగు సార్లకి కూడా, మేం ఆమెని ఏ విధంగానూ నిరోధించలేక పోయాక... మరింత ధైర్యం వచ్చింది. "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కు లేదు" అనేంత ధైర్యం, బండబూతులు తిట్టేంత ధైర్యం!

ఆ విధంగా... మేం ఎంత బలహీనులమో, తన వెనక చేరిన తామెంత బలవంతులో.... మా ఇంటి ఓనర్ కి డెమోగా చూపిస్తే... ఏం చెప్పినా చేస్తుంది, చేసింది.

సరిగ్గా అలాంటి ‘పట్టు’నే, యూనియన్ కార్పైడ్ లీక్ వ్యవహారంలో, అండర్సన్ భారత్ సందర్శించి ‘బై ఇండియా’ అని చెయ్యూపి వెళ్ళటంలోనూ ప్రదర్శించారు.

"చూశారా? ఇండియా ఏమీ చెయ్యలేక పోయింది!" అన్న దాన్ని డెమో చేయటం కోసమే జరిపించబడిన సంఘటన అది! కాకపోతే... ఇప్పుడు నెం.5 వర్గపు పనితీరు కారణంగా పామై మెడకి చుట్టుకుంది. దాన్ని ఎలాగైనా పీవీజీ మెడలో వెయ్యాలన్న దుగ్ధ సోనియాది, ఆమెకి మార్గదర్శకత్వం వహిస్తున్న నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులది!

మరో స్పష్టమైన, బహిరంగ ఉదాహరణ చెప్పాలంటే - తెలుగు సినిమాలలో... కృష్ణకుమారి, బి.సరోజా దేవిల వంటి తారల తర్వాత, వెలిగిపోయిన ఓ నటి... వాణిశ్రీ. ఈమె భక్త ప్రహ్లదలో ఐటమ్ గాళ్. శ్రీ కృష్ణతులాభారం, ఉమ్మడి కుటుంబం వంటి చిత్రాలలో హాస్యనటి.

ఆమె, హీరోయిన్ అయ్యేనాటికే, సినిమా రంగంలో చాలా ఏళ్ళు, కెరీర్ కోసం పెనుగులాడింది. సక్సెస్ అందుకొనేటప్పటికే 3 1/2 పదుల వయస్సు దాటి ఉంటుంది. అయితే, ఒకసారి హీరోయిన్ అయ్యాక, ఆమె ప్రభ ఎంతగా నడిచిందంటే... కొన్ని చక్కని పైకారణాలతో ‘ఆమెకు అగ్ర హీరోల కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వబడింది’ అనే ప్రచారింపబడి, మరింతగా ఇమేజ్ ఇవ్వబడింది.

ఆమె, ప్రొడక్షన్ యూనిట్ కి తన కుర్చీ తను తెచ్చుకునేదనీ, అదనీ, ఇదనీ... వార్తలు... సినిమా పత్రికలలో నిండిపోయేవి. అప్పటి వరకూ తన అందంతో గానీ, నటనా సామర్ధ్యంతో గానీ ఆమె పొందలేని ‘హవా’ని, ఒకసారి ‘గాడ్ ఫాదర్ ల’ ఆశీర్వాదం పొందాక... పొందగటం, ఆ విధంగా ప్రదర్శింపబడింది.

మరో మాటలో చెప్పాలంటే - సదరు హీరోయిన్ కి ‘హవా’ నడుస్తోందన్న ప్రచారంతో, గాడ్ ఫాదర్ లు తమ పట్టు ప్రదర్శించుకున్నారు. తర్వాతే సినిమా రంగంలో నాణ్యత మరింతగా పడిపోయింది.

అప్పట్లో... "మేకప్ లేకుండా చూస్తే [బాబూ మోహన్ కన్నా] నల్లగా ఉండే వాణిశ్రీ... నిన్న మొన్నటి దాకా ‘ఎక్ స్ట్రా’ వేషాలేసిన వాణిశ్రీ... ఈ రోజు కళాభినేత్రిగా వెలిగిపోతోంది. అంతే మరి! ఫలానా ఫలానా వాళ్ళ ఆశీర్వాదాలుండాలే గానీ, పైకి రావడం ఎంత సేపు?" అంటూ సదరు గాడ్ ఫాదర్ ల ‘పై బొమ్మల పేర్లు’ పరిశ్రమలో నానేవి!

అదీ... తమ పట్టుని, సినిమారంగంలో, నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులు ప్రదర్శించుకున్న తీరు!

సరిగ్గా... ఇలాంటి వ్యూహమే యూనియన్ కార్బయిడ్ భోపాల్ గ్యాస్ లీక్ వ్యవహారంలో నడిపించబడింది. వివరంగా చెబుతాను.

1984 అక్టోబరు 31 న ఇందిరాగాంధీ హత్య చేయబడింది. రాజకీయాల్లో నాలుగేళ్ళ అనుభవంతో, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే, రాజీవ్ గాంధీ, గూఢచర్యంలో ఓనమాలు రాని పసివాడితో సమానుడే!

గూఢచర్యంలో... చాలా వరకూ... ఏ సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. జరిపించబడతాయి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా యాదృచ్చికంగా జరిగినా, వెంటనే గూఢచర్యం దాన్ని ఆవరించేస్తుంది.

1984 డిసెంబరు 2న జరిగిన భోపాల్ మిక్ గ్యాస్ లీక్ ప్రమాదం కూడా అలాంటిదే! కావాలనే వ్యూహాత్మకంగా జరిపింపబడింది.

పాతిక వేల మంది ప్రాణాలు, లక్షలాది మంది వేదనలు, గూఢచార వ్యవస్థలకు పట్టవన్నది...

తమ పట్టు చూపించుకునేందుకు హిరోషిమా, నాగసాకిల పైన అణుబాంబులు వేసిన కౄరత్వం సాక్షిగా, ప్రపంచం జీర్ణించుకోవలసిందే!

దేశ విభజన నాడు, దాదాపు 30 లక్షల మంది మనుష్యులు, జంతువుల కన్నా హీనంగా చంపబడిన వికృత రాజకీయాల సాక్షిగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జీర్ణించుకోక తప్పదు.

కాబట్టి - జరిపించబడినా, జరిగినా, భోపాల్ ఘటనలో... తదుపరి నడిచిన దంతా రాజకీయపు యవనిక నేపధ్యంగా గూఢచర్యమే!

అప్పటికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినా, ఇందిరాగాంధీ కేబినేట్ ని మార్పుల్లేకుండా కొనసాగిస్తున్నాడు. అప్పటికే ఎన్నికలకు సిద్దమై ఉంది దేశం! ఇందిరాగాంధీ కేబినెట్ లో, పీవీజీ కీలకమైన హోంమంత్రిత్వ శాఖని నిర్వహిస్తున్నాడు.

కాబట్టి అప్పటి విదేశాంగ కార్యదర్శి రస్గోత్రా... అండర్సన్ ని అమెరికాకి పంపించి వేయటంలో పీవీజీ ప్రమేయం ఉందనీ, ఉండి ఉండొచ్చనీ... అలవోకగా అనేసాడు.

[ఇతడు లాహోరు వాసి. దేశ విభజన సమయంలో భారత్ కు వలసవచ్చిన వాడు. 1949లోనే IFCలో చేరాడు. అప్పట్లో... లాహోరు, కరాచీల నుండి ఇటు వచ్చిన వాళ్ళలో చాలామంది అందుకున్నట్లే, వ్యూహాత్మక విజయాలని, పదవులనీ అందుకున్న వాడు!]

ఇక, సాక్షాత్తూ కాంగ్రెస్ అధిష్టానం, భోపాల్ పాపాలేం ఖర్మ... జరిగిపోయిన, జరగబోయే... అన్ని అనర్దాలనీ, పీవీజీ తలకి చుట్టటానికి సదా సంసిద్దంగా ఉంటుందన్నది ఇప్పటి వరకూ అందరూ చూసిందే!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇందిరాగాంధీ హయంలో హోంశాఖ వంటి కీలక శాఖల్ని నిర్వహించిన పీవీజీకి, 1985లో, సార్వత్రిక ఎన్నికల అనంతరం, రాజీవ్ గాంధీ అప్పగించిన శాఖ ఏమిటో తెలుసా? అప్పుడే కొత్తగా సృష్టించిన మానవ వనరుల శాఖ! పీవీజీ వంటి అనుభవజ్ఞుడికీ, ఉద్దండ ప్రాజ్ఞుడికీ ఇవ్వాల్సిన శాఖేనా అది? అయినా ఆ స్థిత ప్రజ్ఞుడు అదేమీ పట్టించుకోలేదు.

కీలక శాఖల్ని నిర్వహించినంత నిష్కామంగానే దాన్నీ నిర్వహించాడు. అయితే ‘మిస్టర్ క్లీన్’ గా ముందస్తుగా వ్యూహాత్మకంగా ప్రశంసించబడ్డ రాజీవ్ గాంధీ.... బోఫోర్సుపాఠంతో, గూఢచర్య మర్మాలని కొంత పసిగట్టగలిగాక, అనుభవంతో చేతులు కాలాక... ఇల్లాలైన సోనియాని ‘అపరిణతి’ అనుకొని దూరం పెట్టి, తిరిగి పీవీజీ వంటి సీనియర్ల వైపుకి మొగ్గాడు. దాంతో .... 1989లో మరోసారి ఎన్నికలకి దేశం సిద్దమయ్యేనాటికి, పీవీజీ, విదేశాంగ శాఖని నిర్వహిస్తున్నాడు.

అంతగా... అప్పట్లోనే కాదు, మొదటి నుండీ పీవీజీ మీద నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయుల గురి ఉండటం గురించి, రాజకీయాలకు సంబంధించిన గత టపాలలో వివరంగా వ్రాసాను.

అలాంటి నేపధ్యంలో... 1984, డిసెంబరులో అండర్సన్ భారత దేశ పర్యటన - అచ్చంగా సూర్యాపేటలోని మా ఇంటి ఓనర్ వ్యవహారం, వాణిశ్రీ వ్యవహారం లాంటిదే!

అండర్సన్ ఇండియాకి వచ్చి, సురక్షితంగా... మరికొంత ఎకసెక్కంగా "బై ఇండియా" అని చెప్పేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి విమానంలోనే ఢిల్లీకి వెళ్ళిపోయి, అక్కడి నుండి అమెరికా వెళ్ళిపోగలగటాన్ని... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు, అప్పట్లో అతి క్రియాశీలకంగా ఉన్న సీఐఏ లు... ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశంలోని తమ ఇతర ఏజంట్లకి తమ ‘పట్టు’గా ప్రదర్శించుకున్నాయి.

ఒక ఉదాహరణ గమనించండి.

ఒక గలాటా జరుగుతుందనుకొండి. భారీగా కన్పిస్తున్న ఓ వ్యక్తిని, ఒకడు కొట్టాడు. ఆ భారీ కాయుడు, తనని కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టలేక పోయాడు. మరొకడు కొట్టాడు. వాణ్ణీ ఏం చెయ్యలేకపోయాడు. ఆపైన మరొకడు. అదే కథ! చూస్తున్న వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది? మెల్లిగా... అందరూ ఆ భారీ కాయుణ్ణి కొట్టటానికీ, కొట్టి వినోదించటానికీ సిద్దపడతాడు.

సరిగ్గా... భారత ప్రభుత్వం భారీకాయుడైతే.... అండర్సన్ నీ, అర్జున్ సింగ్ లనీ ఏం చెయ్యలేక పోవటమే, అక్కడ ప్రదర్శన చేయబడింది. అంతే! ఎంతగా పరిస్థితులు రెచ్చిపోయాయో... ‘నాటి వార్తల నేటి ఉటంకింపులే’ చెబుతున్నాయి. గత చరిత్రా చెబుతోంది.

ఈ రెచ్చిపోవటం... 1991 లో పీవీజీ ప్రధాని అయ్యే వరకూ నిరాఘాటంగానే సాగింది.

1992 ఫిబ్రవరిలో, పీవీజీ హయాంలో, కొంత నష్టపరిషారాన్ని బాధితులకి పంచటం జరిగింది. అండర్సన్ ని, కోర్టు సమన్లని ధిక్కరించినందుకు, నేరస్తునిగా ముద్రవేసి, కేసు రిజిస్టర్ లో వ్రాసారు.

తర్వాతే... యూనియన్ కార్బయిడ్ కంపెనీ, UCIL [దాని భారత శాఖ] కొంచెం జాగ్రత్త పడాలని ప్రయత్నించాయి. UCIL ని, కోల్ కతా కంపెనీ మిక్ లియోడ్ కి అప్పగించేందుకు, 1994లో, సుప్రీం కోర్టు UCIL కి అనుమతి నిచ్చింది.

1999 అగస్టులో UCC ని ‘డీ కెమికల్స్’ లో విలీనం చేసారు. 2001 లో... UCIL భారం తమది కాదని UCC వాదించింది. ఇవన్నీ... చట్టపరంగా, చట్టాల్లో ఉన్న కన్నాల సహకారంతో... రెడ్ టేపిజం చూపుతూ... తమని తాము కాపాడుకునేందుకు చేసిన శతాధిక ప్రయత్నాల్లోనివే!

1996 సెప్టెంబరులో, దేవెగౌడ హయాంలో [అంటే పీవీజీ ప్రధాని పదవీ నుండి దిగిపోయిన నెలల వ్యవధిలో, హడావుడిగా] భోపాల్ నిందితులకి ప్రయోజనం చేకూర్చుతూ, కేసుని 304[2] నుండి 304[A] బదలాయించి, కేసుని నీరు కార్చారు. 2002లో, అంటే భాజపా [ఎన్డీయే] హయాంలో... సిబిఐ, మళ్ళీ అదే సిఫార్సు చేస్తూ కోర్టులో కేసు వేసింది. సెక్షన్ మార్చి కేసుని బలహీనం చేయటం, నేరగాళ్ళని రక్షించటం, అప్పటికే జరిగిపోయినందున, సిబిఐ 2002లో వేసిన రిట్ ని, కోర్టు కొట్టివేసింది.

ఆ విధంగా భాజపా కూడా... అండర్సన్ నే కాదు, UCIL ఛైర్మన్ కేశుభ్ మహీంద్రతో పాటు, మరి 8 మంది నేరగాళ్ళని కాపాడేందుకు, అత్యుత్సాహం చూపింది. మళ్ళీ నంగనాచిలా "అప్పటి పీవీ నరసింహ రావు నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం, అండర్సన్ ని భారత్ కు రప్పించే ప్రయత్నం చెయ్యకపోవటం దురదృష్టకరం" అంటూ గంభీర ప్రకటనలు చేసింది.

>>>అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆండర్సన్‌ను భారత్‌కు రప్పించకపోవడం దురదృష్టకరమని బీజేపీ వ్యాఖ్యానించింది. 1996లో నిందితులపై సు ప్రీంకోర్టు అభియోగాలను తగ్గించడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ తప్పుపట్టారు. భోపాల్‌ దుర్ఘటన కేసు తుది తీర్పును మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తామని బీజీపీఎంయూఎస్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ భోపాల్‌ గ్యాస్‌ ప్రమాద బాధితుల సంక్షేమం కోసం పోరాడుతోంది.

పై వార్తాంశంలో, పీవీజీ 1996లో అధికారంలో ఉన్నాడు కాబట్టి, పీవీజీ ప్రభుత్వమే అభియోగాలను తగ్గించిందన్నట్లు, భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నాడు. నిజానికి... పీవీజీ అధికారం నుండి దిగిపోయి, దేవగౌడ ప్రభుత్వంలో [1996 సెప్టెంబరులో] ఈ అభియోగాలను [సెక్షన్ లను మార్చటం!] తగ్గించారు. కానీ, పైవార్తాంశంలో పీవీజీనే ఇదంతా చేసినట్లు, పాఠకుడికి అన్పించేలా ఉంది. ఇదీ.... మీడియా మాయాజాలం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

7 comments:

modatinundi pvg ki kotari lekapovadamto kaangeela tappulannee aayana talaku chutti veyadamlo uttaraadi vaaru anta partee bhedaalu lekunda chestunnaaru. prastutam vaatini khandinche sthitilo aayana svanta raashtramlo koodaa okkadu lekapovadam telugu vaallu siggupadaalsina vishayam..

mee visleshana chaala informative ga vundi. thanks..

http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20100813a_004101002&ileft=35&itop=106&zoomRatio=130&AN=20100813a_004101002

Unbelievable article from EENADU.

పొయిన వాళ్ళను వాడుకొవడం, Congress Party కి కొత్త కాదుగా!. ఇటు లాభానికి (e.g. Mahatma Gandhi)వాడుకొవచ్చు, మరియు నష్టం పూడ్చుకొవడానికి (e.g. P.V.) వాడుకొవచ్చు.

కెక్యూబ్ గారు: నెనర్లండి!

మొదటి అజ్ఞాత గారు: ఈనాడులో అప్పుడప్పుడు అలాంటివి వస్తాయి. వాటి కార్యకారణ సంబంధాలు వేరే ఉంటాయి లెండి!:)

రెండవ అజ్ఞాత గారు: బాగా చెప్పారు. నెనర్లు!

* మొదటి నుంచి పి.వి.జికి కొటారి లెకపొవడంతొ కాంగీల తప్పులన్నీ ఆయన తలకు చుట్టి వెయడంలొ ఉత్తరాది వారు అంతా పార్టీ భేదాలు లేకుండా చేస్తున్నారు...*
అసలికి ఇక్కడ పి.వి. గారి కోటారి సమస్య కాదు. కాంగ్రెస్ లో పైకి కోటారి బలం ఉనంట్లు కనిపిచినా అది ఎప్పుడు ఆ కుటుంబం రక్షించటానికి పని చేస్తుందే తప్ప మిగతా ఎంత పెద్ద నాయకులకు కోటారి ఉన్నా దాని బలం పని చేయదు. ఇందుకు ఉదాహరణ నట్వర్ సింగ్, జదీష్ టైట్లర్, విలాసరావ్ దేశ్ ముఖ్ లాంటివారు అధికారం లో ఉన్నని రోజులు చాలా బలమైన నాయకుల లా కనిపించినా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవర్రికి తెలియదు. అర్జున్ సింగ్ ఆరోజుల్లో లెక్క లేనన్ని లేఖాలు పి.వి. గారి కి రాసి బయటకు పోయి తివారి తో కలసి పార్టి పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తునాం కదా సదరు తివారి గారి రాస లీలలు. గత ప్రభుత్వం లో అర్జున్ సింగ్ గారి అవినీతిని టైంస్ టి.వి. వారు తమీళ నాడు మేడికల్ కాలేజిల విషయం లో చూపించిందే చూపి, ఈ సారి ఆయన గారు తనకు ఎక్కడ మంత్రి సీటు ఇవ్వ లేదని పత్రికలకి ఎక్కె ముందు లోపలే ఆయనని కోరలు తీసిన పామును చేసి చావా చితక గొట్టి ఆయన నోరు మూశారు. ఇటువంటి చెత్త గాంగ్ ఆ రోజుల్లో పి.వి. గారికి రోజుకొక సమస్య తెచ్చి పెడుతుంటె మీడియా లో అర్జున్ లేఖాస్రం అని శీర్హికలు పెట్టి వారేదో అరివీర భయం కరులు వారు లేక పోతే పార్టికి నష్టం అన్ని రీతీ లో రాసేవారు. వీరిని పి.వి. గారు సరి ఐన సమయం లో బయటకు పంపారు. అసలికి ఇంటువంటి వారిని సంజాయిషి అడగటం మొదటి తప్పు. వారు చెప్పినదంతా నిజం లా రాయటం ఇంకొక తప్పు. అసలికి అర్జున్ సింగ్ నుంచి పి.వి. గారి మీద ఇంత కన్నా మనం ఎమీ ఎక్కువ ఆశించగలం?

Ramana

అవసరమైనపుడు మా తెలంగాణాలో మేధావులకు కొదువ లేదు. కవులు, కళాకారులు, మేధావులను గుర్తించి గౌరవించే సంస్కృతి గల తెలంగాణా వారికి పి.వి. గారిని విమర్శిస్తుంటె చీమ కుట్టినటైనా అని పించదా? ఎన్ని సార్లు బ్లాగులో తెలంగాణాను ఆ ప్రాంత ప్రజలను పల్లెత్తు మాట అననీయకుండా సమర్ధిస్తూ రాసే వారు ప్రభాకర్ మందార, వేణుగోపాల్ లాంటి వారు పి.వి. గారి విమర్సిస్తుంటే నోరు మెదపరెందుకని నాకు అనుమానం వస్తుంది.

Ramana Garu, Anonymous Garu: Well Said!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu