ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, నా జీవన ప్రయాణంలో... నేను ఎందరో అవినీతిపరులనీ, పరమ నీచ ప్రవృత్తి కలవారినీ చూశాను. అదే విధంగా... నిజాయితీ పరులనీ, తమ పనిపట్ల నిబద్దత గలవారిని, సామాజిక బాధ్యతా, స్పృహా గల వారినీ చూశాను.

అప్పట్లో గుంటూరు జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC)లో జనరల్ మేనేజర్ గా వెంకట రామయ్య అనే అధికారి ఉండేవారు. దాదాపు రిటైర్ మెంట్ వయస్సులో ఉన్నారు. ఆయన నన్నెంత గానో ప్రోత్సహించి, ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాలసీల గురించి, రూల్సు&రెగ్యులేషన్స్ గురించి గైడ్ చేస్తుండేవాళ్ళు. తమ కుమార్తెనన్నట్లుగా భావించి, నాకు అవగాహన కలిగించేవాళ్ళు.

అప్పట్లో మా నాన్న నాకు తోడుగా ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ వచ్చేవాళ్ళు. [అధికారులతో మాట్లాడటం, ఫామ్స్ నింపి, సబ్ మిట్ చేయటం గట్రా అడ్మినిస్టేషన్ పనంతా నేను చూసుకునేదాన్ని. బైక్ మీద మా నాన్న నన్ను తీసుకెళ్ళెవారు. వేరే ఊళ్ళకు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై గట్రా కూడా, నాన్నే వెంట వచ్చేవాళ్ళు. తర్వాత్తర్వాత తమ్ముళ్ళు వచ్చేవాళ్ళు.]

మా నాన్నని కూడా వెంకట్రామయ్య గారు ఎంతో గౌరవంగా ఆదరించేవాళ్ళు. అది చూసి నాన్న ఎంతగానో ముచ్చటపడేవాడు. మాతోనే కాదు, DIC కి వచ్చే ఇతర సందర్శకులని కూడా, ఎంతో ఓపికగా రిసీవ్ చేసుకుని, క్రింది సిబ్బందికి పురమాయించి పనులు చేయించే వాడాయన.

నేను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. వెనక ధనిక లేదా రాజకీయ నేపధ్యమేమీ లేదు. NISIET వాళ్ళు నిర్వహించిన పోటీ పరీక్షలో శిక్షణావకాశాన్ని సంపాదించాను. [నాలుగు వేల మంది నుండి వ్రాత+మౌఖిక పరీక్షలో 20 మందిని ఎంపిక చేశారు. తర్వాత తెలిసిందేమంటే ఈ 20 మందిలో కూడా కొందరు రికమెండేషన్లతో వచ్చిన వాళ్ళని!]

అందులో భాగంగా, మార్కెట్ సర్వే, స్టాండర్డ్ బ్యాటరీ ముంబై [అప్పట్లో బొ౦బాయి] లో స్వల్పకాల శిక్షణ పొందాను. బ్యాంకర్స్ తో సమావేశాల్లో [సెమినార్స్] పాల్గొన్నాను. మా శిక్షణా కార్యక్రమంలో బ్యాంకుల ఉన్నతాధికారులు [నంబియార్ వగైరా] కూడా పాల్గొన్నారు. ఆ సర్టిఫీకేట్లే పెట్టుబడిగా రంగంలోకి దిగాను.

అప్పట్లో జోకులేసేదాన్ని, యండమూరి ‘డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు’ లో గాంధీ పదిపైసలు పెట్టుబడి పెట్టాడు, నేనదీ పెట్టకుండానే ఫ్యాక్టరీ పెట్టానని! కొద్దిపాటి డబ్బు నిల్వలని పెట్టుబడిగా పెట్టి, కొంత అప్పు గా తెచ్చి, వేలంలో కొన్న పాత ఐస్ ఫ్యాక్టరీని బ్యాటరీ ఫ్యాక్టరీగా మారుస్తూ, పెట్టుబడి సొమ్ములో చాలా వరకూ దాని నుండే నిధులు సమకూర్చుకున్నాను.

అందురీత్యా కూడా... మరికొందరు ధనిక వర్గం నుండి వచ్చిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కన్నా, నేనెక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నానేమోనని, అప్పట్లో విశ్లేషించుకునేదాన్ని.

వెంకట్రామయ్య గారు నన్ను ఎంతగా ప్రోత్సహించే వాళ్ళంటే, ఏదైనా ఇతర డిపార్డ్ మెంట్లతో నేను ఇబ్బందులు ఎదుర్కున్నప్పుడు, తాను స్వయంగా ఫోన్ చేసి, ఆయా అధికారులకు రికమెండ్ చేసి, నా పని అయ్యేటట్లుగా చెప్పేవాళ్ళు. ‘ఫస్ట్ జనరేషన్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్. మంచి ఉత్సాహం ఉన్న అమ్మాయి. పైకి వస్తే మన జిల్లాకే పేరొస్తుంది’ అంటూ, అవతలి అధికారులని కన్విన్స్ చేసేవారు.

నేను ఫ్యాక్టరీ స్థాపించడానికి తీసుకున్న శ్రమనంతా వివరిస్తూ ‘ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ అవార్డుకి నా పేరుని ప్రతిపాదించి పంపిస్తూ, కమీషన్ రేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కూడా పట్టుబట్టి నా ఫైల్ నడిపించారు.

దాంతో పైరవీలు పక్కన బెట్టి, 1990వ సంవత్సరానికి గాను ఉత్తమ పారిశ్రామిక అవార్డుని నాకు ఇవ్వక తప్పలేదు. దాన్ని అప్పుడే గవర్నరుగా మన రాష్ట్రానికి వచ్చిన కృష్ణకాంత్ నుండి అందుకున్నాను. ఆ రోజు టీవీ వార్తల్లో, ఆ క్లిప్పుంగు చూసుకుని, ఎంత మురిసిపోయానో! అందునా అప్పుడు దూరదర్శన్ తప్పించి, లోకల్ ఛానెల్స్ ఉండేవి కావు.

ఆయన నాకు ఈ అవార్డునిప్పించినందుకంటే... ‘నా ఫ్యాక్టరీ నిలదొక్కుకునేంతగా, ప్రభుత్వ ఆఫీసుల్లో పనితీరు గురించి నాకు అవగాహన కలిగించినందుకు, ఆ పెద్దాయనకు నేనెంతో ఋణపడి ఉన్నాను’ అనుకునేదాన్ని. ఆ విధంగా ఓనమాలు దిద్దుకున్నాను. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని వచ్చే నాలాంటి చాలామందిని, ఆయన నన్ను ప్రోత్సహించినట్లుగానే ప్రోత్సహించారు.

రెండేళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. తర్వాత వచ్చిన అధికారి ఎవరెళ్ళినా ధుమధుమ లాడుతుండేవాడు. అప్పటికి నాకు ఆ కార్యాలయంతో పని ముగిసినట్లే! ఏడాది కోసారి లైసెన్సు రెన్యువల్ తప్ప పెద్దగా పని ఉండక పోవటాన, నేనంతగా ఇబ్బంది పడలేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

http://innaiahn.blogspot.com/2010/04/blog-post_10.html

Sleeping with your boss 'can boost your career'
http://in.news.yahoo.com/139/20100828/385/ten-
sleeping-with-your-boss-can-boost-yo_1.html

Sat, Aug 28 12:30 PM
London, Aug 28 (ANI): Sleeping with your boss can do wonders to your career, especially if you are a woman, new research shows.
In the study, some 37 per cent of office workers said that from their experience those who slept with their superiors were rewarded with a career boost.
The research for the U.S. Centre for Work-Life Policy found that no matter how high achieving, female executives will not reach the very top of their profession unless they find a 'sponsor' who will speak out on their behalf, reports the Daily Mail.ome 34 per cent of women in executive positions said they knew a female colleague who had slept with their boss.
Even at director level or above, 15 per cent of women admitted to having had an office fling.
In terms of morale, 61 per cent of men and 70 per cent of women lose respect for a leader involved in an affair.
The study also showed that 60 per cent of male executives and 65 per cent of female executives suspect that salary hikes and plum assignments are being traded for sexual favours.ome 48 per cent of men and 56 per cent of women feel animosity towards the involved couple, and 39 per cent of men and 37 per cent of women see a fall off in productivity as the team splinters.
Relationships expert Jean Hannah Edelstein said: "Office affairs are a bad idea. Your boss already has a lot of power of you so once your start sleeping with him, how do you know that he's going to fulfil his end of the bargain?
"Even if it happens in the short term, everyone will know what's going on and you'll lose their respect.
"It poisons the atmosphere and in the long run it is not worth it and will follow you around the industry." (ANI)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu