ముందుగా ఆగస్టు 16వ తేదీ 2010, ఈనాడు వార్తాపత్రికలో ప్రచురింపబడిన క్రింది వార్తాంశాన్ని పరిశీలించండి.

>>>ఆచార్యపై ఆయనకే నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి.
>>>ఎమ్మార్ వ్యవహారంలో ఏపీఐఐసీకి సంకటం.
>>>వివాదంలో చిక్కుకున్న అధికారి ఉన్నత స్థాయిలో ఉంటే ఆయన గురించి అభియోగాల నివేదికను ఆయన చేతికే ఇవ్వాల్సిన వస్తే... వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి వెళతాయా? తన గురించి నివేదికను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారా?
~~~~~~

ఎవరి మీద ఫిర్యాదు లేదా అవకతవకలను గురించిన నివేదిక ఉందో, దాన్ని వాళ్ళ దగ్గరికే, విచారణకై పంపిస్తే....? తమ మీద తామే చర్య తీసుకుంటారా? తమని తామే శిక్షించుకుంటారా?

"ఆయనే ఉంటే మంగలెందుకు?" అన్న సామెత చందాన, అంత సచ్చీలతే ఉంటే అసలు అవకతవకలకీ, అక్రమాలకీ పాల్పడరు కదా!?

ఇక్కడ మీకు కొన్ని వాస్తవ సంఘటనలు వివరిస్తాను.

1991లో... అప్పట్లో, నేను బ్యాటరీ తయారీ సంస్థ అధినేతగా... ఇండియన్ బ్యాంకు ఖాతాదారుని. అయితే ఆ బ్యాంకు రీజనల్ మేనేజరు, మరో అధికారి, నన్ను బాగా చికాకులకి గురి చేస్తుండేవాళ్ళు. ఆ మీదట, అప్పట్లో ఢిల్లీ లో ఫైనాన్షియల్ అఫైర్స్ లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న కె.జె.రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసాను. [ఈయన 1992 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ నుండి బదిలీ అయి వచ్చాడు.]

తక్షణమే నా సమస్య మీద స్పందించి, ఫోన్ ద్వారా ఇండియన్ బ్యాంకు హెడ్డాఫీసు[చెన్నై]లోని ఉన్నతాధికారితో మాట్లాడి, పరిష్కార మార్గం సూచించాడు.

అంతే తప్ప... రీజనల్ మేనేజరు మీది ఫిర్యాదుని, అతడికే పంపలేదు.

అలాగే... 1992లో ఆర్టీసీలో ఒక డైరెక్టరు, బినామీ పేరుతో బ్యాటరీ సంస్థ నడుపుతూ, మాలాంటి చిన్న సంస్థలని దెబ్బకొడుతున్నాడు. దాని మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే, సీఎం సెక్రటరీ చక్రపాణి అనే ఐఎఎస్ అధికారి, దానిపై విచారణ చేసాడు.

అంతేతప్ప... అతడి మీద ఫిర్యాదుని, అతణ్ణే విచారించుకొమ్మని, సదరు ఆర్టీసీ మెటీరియల్ డైరెక్టరుకి పంపలేదు!

ఇక 2004 తర్వాత......

మేము శ్రీశైలంలో స్కూలు నడుపుకుంటున్న రోజుల్లో, మాపై నడుస్తున్న వ్యవస్థీకృత వేధింపు, అందులో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రమేయం గురించిన ఫిర్యాదుని... కాంగ్రెస్ అధ్యక్షురాలూ, యూపీఏ ప్రభుత్వ కుర్చీవ్యక్తీ అయిన సోనియాకీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీ, అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కీ పంపించాము.

ఆ ఫిర్యాదు, విచారణ నిమిత్తమై, తిరిగి రాష్ట్రప్రభుత్వానికే పంపబడింది. ఆ విషయాన్ని... సిబిసీఐడీ ఐజీ కృష్ణ్ర రాజ్ స్వయంగా ధృవీకరించాడు. ఆ ఫిర్యాదు కాగితాలను, నేను శ్రీశైలం పోలీసు స్టేషన్ లో, సిఐ చూపగా కూడా చూసాను.

అలాగే 2007లో మా స్కూలు ఊడగొట్టబడ్డాక, మొత్తం వేధింపుని వివరిస్తూ, వై.యస్. మీద... ప్రధానికి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు యధాతధంగా రాష్ట్రప్రభుత్వానికే పంపబడింది. ఆ ఫిర్యాదును పట్టుకుని సిబిసీఐడీ అధికారి, మా ఇంటికి వచ్చాడు. అతడి మాటల్లోనే "నేను మీ గురించి పాజిటివ్ గా వ్రాస్తానండి. తరువాత పైఅధికారులు మారిస్తే నాకు తెలియదు. భగవంతుడు మీకు మంచి చేయాలని కోరుకుంటాను" అని చెప్పాడు.

అంటే వై.యస్. మీద పెట్టిన ఫిర్యాదుని, విచారించి చర్య తీసుకొమ్మని, తిరిగి వై.యస్.కే పంపించాడన్న మాట.[అది ఒకటికి రెండోసారి!]

మరొక సంఘటన....

ఆ కోవలోనే... మేము శ్రీశైలంలోని సీఐ కరుణాకర్ మీద... ‘మాపై వ్యవస్థీకృత వేధింపు గురించీ, దానికి దారి తీసిన మా మొదటి ఫిర్యాదు [పీవీజీకి రాజీవ్ హత్యపై రామోజీరావు సంబంధం గురించిన ఫిర్యాదు] గురించీ, స్థానిక సీఐ దృష్టికి తీసికెళ్ళి, సహాయం కోరితే అతడు, మా మీద, పీవీజీ మీద కూడా జోకులేసాడు. ఆ విషయమై నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.కీ, సోనియాకీ, ప్రధానికీ, రాష్ట్రపతికీ ఫిర్యాదు పంపాము.

అదీ... చాలా మామూలుగా... మళ్ళీ మా ఊరి సీఐ దగ్గరికే, విచారణ నిమిత్తం పంపించబడింది. ఆ విషయం అతడే ధృవీకరిస్తూ మా దగ్గరి నుండి స్టేట్ మెంట్లు వ్రాయించుకున్నాడు. [అప్పటి వివరాలన్నీ పీవీజీ-రామోజీరావు-మా కథ’ అనే లేబుల్ లో వివరంగా వ్రాసినవే!]

అంటే - సీఐ మీద పెట్టిన ఫిర్యాదు, విచారణ చేసి చర్య తీసుకునే నిమిత్తం సీఐకే పంపబడింది.

పోనీ... ఫిర్యాదు అతడి డిపార్ట్ మెంట్ పనితీరు మీదనైనా అయితే.... "సర్లే! ఎక్కడ లోటుపాట్లున్నాయో తెలుసుకొని సరిదిద్దుకుంటాడు" అని పంపించారనుకోవచ్చు.

అసలు ఫిర్యాదే అతడి అక్రమాల గురించి అయినప్పుడు... ఎవరి మీదైతే ఫిర్యాదు ఇచ్చామో... వాళ్ళకే దాన్ని పంపించడ మంటే... ఏమిటి సంకేతం?

"ఇదిగో! వీళ్ళెవరో! నీ మీదే ఫిర్యాదు చేసేరు. వాళ్ళ సంగతేమిటో ఓ చూపు చూస్కో!" అనటమే కదా?

[అలాగే ముఖ్యమంత్రీ, సీఐ లు కూడా మా భరతం పట్టే ప్రయత్నమే చేసారు లెండి.]

మరో సంఘటన ఏమిటంటే...

ఇప్పుడు మేమున్న నంద్యాలలో, అప్పుడప్పుడూ మా ఇంటర్ నెట్ కనెక్షన్ అంతరాయం పొందుతూ ఉంటుంది. సరిగ్గా శనివారం[ఎక్కువగా] రోజంతా పనిచేయకపోవటం జరుగుతుంటుంది. ఓ సారైతే వారంలో మూడు సార్లు ఇలా జరిగింది.

సదరు అధికారి జె.ఇ. ఎప్పుడు ఫోన్ చేసినా, కార్యాలయానికి వెళ్ళి కలుద్దామన్నా సీట్ లో ఉండడు. ఫోన్ లో ఫిర్యాదు ఇచ్చినా అది సా...గుతుంది గానీ, మనకి సర్వీసు పునరుద్దరింపబడదు.

దాంతో విసిగి పోయి ఓసారి "ఫలానా జేఇ మీద ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి చెప్పండి" అని అడిగాము.

దానికా డిపార్టుమెంటు ఉద్యోగి "ఎవరికిచ్చినా తిరిగి అది మా దగ్గరికే వస్తుంది మేడం" అన్నాడు.

‘అంటే అది పైనుండి క్రింది దాకా విస్తరించిన అడ్మినిస్ట్రేషన్ తీరన్న మాట’ అనుకున్నాము.

ఇక ఇలాంటి చోట, అవినీతి ప్రభుత్వాధికారి, ప్రజలకేం న్యాయం చేస్తాడు? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్దం! ఎందుకంటే ప్రజల విధులలో ఒకటి - అక్రమాలు దృష్టికొచ్చినప్పుడు ఫిర్యాదు చేయటం.

1992కు ముందు అడ్మినిస్ట్రేషన్ తీరు ఇలా లేదు. తరువాత ఎప్పుడు చల్లగా చట్టాలు మార్చుకున్నారో తెలియదు. మొత్తానికీ, ఎంచక్కా, తమకు అనుకూలంగా చట్టాలు మార్చుకున్నారు. ఎవరయినా అవినీతి గురించి ప్రశ్నిస్తే ఇక అంతే సంగతులన్న మాట. బహుశః అది యూపీఏ ప్రభుత్వ ప్రత్యేకత కాబోలు!

అలాంటి చోట...
ఎమ్మార్ లో ఆచార్య అయినా
పార్ద సారధి అయినా
ఏమున్నది వింత?

ఇక్కడో గమ్మత్తు ఉంది!

మనం పుణ్యక్షేత్రాలకీ, పర్యాటక కేంద్రాలకీ వెళ్ళినప్పుడు... గుడి గోడల మీదా, రాళ్ళు రప్పల మీదా... రంగుల్తోనో, బొగ్గుముక్కలతోనో, పదునైన కత్తితో చెక్కబడో, పేర్లు వ్రాసి ఉంటాయి. ఫలానా పేరు ఊరు అనో, ఫలానా వాళ్ళు లవ్ ఫలానా అనో... ఇలా!

అవి చూసి మేమెప్పుడూ "బహుశః జీవితంలో ఎటూ పేరు తెచ్చుకోలేం అనుకొని, ఇలాంటి వాళ్ళు, గుడిగోడలను ఖరాబు చేస్తుంటారేమో!" అనుకుని నవ్వుకుంటుంటాము.

సరిగ్గా... అలాగే... ఈ ఎమ్మార్ లో విల్లాలు కట్టుకున్న గొప్పొళ్ళల్లో కొందరు ఐఎఎస్ లు, సలహాదారులు, ఆ కాలనీలో రోడ్లకీ, భవనాలకీ తమ పేర్లు పెట్టించుకున్నారట. ఆచార్య మార్గ్ అనీ, పార్దసారధి భవన్ అనీ!

ఇలాంటి చోట... పీవీజీ పేరిట ఏమీ లేకపోవటమే మేలేమో! లేకపోతే... ఇలాంటి ఐఎఎస్ లు, వీధివీధిలో విగ్రహాలు నెలకొల్పించుకునే మాయవతులు, వై.యస్సులూ..... కూడా, ఒకే జాబితాలోకి చేరిపోగలరు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

very good

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu