గత టపాలో చెప్పినట్లుగా.... చంద్రబాబుల్లాంటి ఇంద్రయ్యలనందర్నీ... గల్లీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకూ ‘బ్యాలెన్స్’ చేసుకోవటం కంటే ‘రసవత్తరమైన శిక్ష’... నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకు మరొకటుండదు.

అందునా గతంలో.... ప్రపంచవ్యాప్తంగా, అన్ని దేశాలలో, అందరు సెలబ్రిటీలనీ, ఆయా దేశాల అగ్రనేతల్నీ, అన్ని వ్యవహారాలనీ బ్యాలెన్స్ చేస్తున్నామనీ, చిటికైన వ్రేలి మీద భూగోళాన్ని తిప్పుతున్నామనీ, అందరి తలరాతల్నీ తామే లిఖిస్తున్నామనీ, అనుకుంటూ... మనో వైకల్యాలతో వ్యవహారించిన నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి.... ఇప్పుడు అందర్నీ, అన్నిటినీ ‘బ్యాలెన్స్’ చేయవలసి రావటమే... అసలైన, వాళ్ళకి తగిన ‘సువర్ణముఖి’.

ఇది ఎలా నిర్వహింపబడుతుందంటే - ఎక్కడైనా, ఎప్పుడైనా, తాము లాలూచీ పడి, ఒకరి అవినీతిని మరొకరు, ఒకరి లొసుగుల్ని మరొకరు, ఒకరు లోగుట్టుల్ని మరొకరు, బయటపెట్టుకోకుండా గమ్మునుందామన్నా కుదరని స్థితే! ఉదాహరణకి, కాందహార్ హైజాక్ విషయంలో, అద్వానీ లోగుట్టుల్ని జస్వంత్ సింగ్ బయటపెట్టినట్లు. ఇప్పుడు రామోజీరావు పత్రికా విలువల్ని, 420 తనాన్ని, సాక్షి పత్రిక బయటపెడుతున్నట్లు!

ఎందుకంటే - జస్వంత్ సింగ్ లాంటి ఎవరి ముందైనా ఉన్న స్థితి ‘చంపు లేదా ఛస్తావ్!’ ‘దెబ్బకొట్టు లేదా దెబ్బతింటావ్’ అన్నదే! జగన్ లూ, చంద్రబాబులూ గట్రా ఇంద్రయ్యలందరూ జస్వంత్ సింగ్ వంటి వాళ్ళే!

అంతే కాదు, ఒక విషయం... దానికి సంబంధించిన చోటనే కాకుండా, ప్రపంచంలో మరెక్కడో కూడా బయటకి పొక్కవచ్చు. ‘ఇటలీ ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి’ అన్న విషయం, అతడి మరణానంతరం, కొన్ని దశాబ్దాల తర్వాతైనా సరే, లండన్ లో బయటికి వచ్చినట్లు! వికీలీక్స్, అమెరికా-పాక్ ఐ.ఎస్.ఐ.- తాలిబాన్ ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీని బయటపెట్టినట్లు!

వై.యస్. మరణోదంతంలోని లొసుగుల్ని, ఎక్కడో ఓ అనామక అంతర్జాల పత్రిక ‘ఎగ్జైయిల్డ్’ వ్రాసినట్లు! ‘ఎగ్జైయిల్డ్’ వ్రాసిన దాంట్లో నిజానిజాల సంగతి తర్వాత! అసలైతే వై.యస్. హెలికాప్టర్ ప్రమాదంలో ‘మతలబు’ ఏదో ఉందని మాత్రం, సదరు అంతర్జాల పత్రిక అరిచి చెప్పింది! ఎటూ రామోజీరావు తన ఈనాడు, హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, న్యూయార్క్ టైమ్స్, లాంటివి తప్ప, మిగిలిన పత్రికలన్నీ అబద్దాలే వ్రాస్తాయంటాడను కోండి! ఏదైతేనేం, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావు వగైరాల గురించీ, వాళ్ళ ఏజంట్ల గురించీ, గుప్త సమాచారం, ప్రపంచంలో మరెక్కడో బయటికి పొక్కవచ్చు. ఎన్నిటినని బ్యాలెన్స్ చేయగలరు?

ప్రపంచమంతా తమదే ‘పట్టు’ [గ్రిప్] అయినప్పుడు, అన్నీ ఫర్ ఫెక్ట్ గానే నడుపుకో గలిగారు. ఇప్పటి పరిస్థితి అదికాదు. అప్పుడు ఏది అడ్వాంటేజ్ అయ్యిందో, అదే ఇప్పుడు డిస్ అడ్వాంటేజ్ కావటమే భగవంతుడి లీల! జీవితంలో పగలు రాత్రి, కష్టమూ సుఖమూ ఉన్నట్లే... ఎవరికైనా ఇది తప్పదు. దేవుణ్ణీ ధర్మాన్ని నమ్మినవాడు దీన్ని గుర్తిస్తాడు. డబ్బు అధికారాలని నమ్మినవాడు అది గుర్తించలేక అహంకరిస్తాడు. అంతే తేడా!

ఇక ఈ విషయం ఇక్కడికి ఆపి, తిరిగి ఇంద్రయ్య గుళికల కథ దగ్గరికి వస్తే....

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని వివరిస్తాను. రామోజీరావు గూఢచర్య కార్యకలాపాల మీద, 1992లో, నాటి ప్రధాని పీవీజీకి మేము ఇచ్చిన ఫిర్యాదు, తదుపరి రామోజీరావు మాపై జరిపించిన వ్యవస్థీకృత వేధింపు కేసు విషయంలో...

1996లో పీవీజీ పదవి దిగిపోయిన నాటి నుండి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలున్నాయి. 1999 నాటి నుండీ 2004 వరకూ, భాజపా ప్రధాన పార్టీగా, ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. రాష్ట్రంలో, 1995 నాటి నుండి 2004 వరకూ, చంద్రబాబు నాయుడి హయాం నడిచింది. 2000 లో మేము ఎంసెట్ అవకతవకల గురించి, దాని పర్యవసానంగా మాపైన వ్యవస్థీకృత వేధింపుల గురించి ఫిర్యాదు చేశాము. అప్పుడెప్పుడూ కూడా, మా ఫిర్యాదులలో రామోజీరావు ప్రసక్తి లేదు. అసలతడి ప్రమేయం గురించి అప్పటికి మేమే గుర్తించలేదు.

అలాంటి చోట -

రామోజీరావు తెదేపాకి ప్రాణం, ఎన్డీయే ప్రభుత్వ నిర్మాణంలో కీలక పాత్రధారి! "అలాంటి ‘తమ వాడి’ మీద మేము ఫిర్యాదు చేసాం కాబట్టి, తెదేపా మా కేసుని పరిష్కరించలేదు, మాకు న్యాయం చేయలేదు" అనటానికి లేదు. ఎందుకంటే - అప్పటి మా ఫిర్యాదులలో రామోజీరావు ప్రసక్తి లేదు కనుక! రామోజీరావు ప్రసక్తే లేనప్పుడు, మాపై వేధింపుల కేసును చంద్రబాబు నాయుడు ఎందుకు పరిష్కరించనట్లు?

అదే విధంగా... 2004 నుండి ఇప్పటి వరకూ... కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2005లో మేము రామోజీరావు గూఢచర్యం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఫిర్యాదు చేశాము. 2007 వరకూ మా అడ్మినిస్ట్రేషన్ యుద్దం కొనసాగించాము.

రామోజీరావు, వ్రాతపూర్వకంగా, స్వయంగా చెప్పుకున్న కాంగ్రెస్ వ్యతిరేకి! అలాంటి చోట, అతడి మీద చర్య తీసుకోవటానికి... యూపీఏ, కాంగ్రెస్ ప్రభుత్వాలకి అభ్యంతరం ఉండకూడదు.

అయినా గానీ... తెదేపా, కాంగ్రెస్, ఎన్డీయే, యూపీఏ లకి రామోజీరావు ప్రేమాస్పదుడు కావటమూ... మేమే గాక, మా ఫిర్యాదుకు స్పందించిన పీవీజీ కూడా, పేరు సైతం ఎత్తరానంత బద్ద శత్రువు కావటమే ఇక్కడ చిత్రం!

ఆ విధంగా రామోజీరావుని off/on చేసి, తార్కికంగా, దృష్టాంతపూరితంగా ‘పీవీజీ-రామోజీరావు-మాపై వేధింపు’ అనే కేసు నిరూపితం అయ్యిది.

ఇదే పోలిక... ఇప్పుడు చంద్రబాబు, వై.యస్.జగన్ వంటి ఇంద్రయ్యలకీ వర్తిస్తుంది.

చంద్రబాబుకి రామోజీరావు అనుకూలుడూ, కాంగ్రెస్ కి వ్యతిరేకీ! అలాంటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సోనియా కీ వ్యతిరేకి కావాలి. అటువంటప్పుడు... సోనియా చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతీసినా, ఐటీ దెబ్బలు వేసినా, నాకాబందీలతో నల్లడబ్బు పట్టుకున్నా.... అర్దం చేసుకోవచ్చు. అయితే, రామోజీరావు చంద్రబాబుని నెత్తికెత్తుకోకపోగా, శల్య సారధ్యం వంటి వ్రాతలతో తానూ ఎందుకు దెబ్బకొడుతున్నట్లు?

అలా కానట్లయితే... ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్... రోశయ్య వర్గం, సీనియర్లు, జగన్ శిబిరం అంటూ చీలికలూ పేలికలై కొట్టుకుంటున్నారు. "ఈ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఎప్పుడూ కుర్చీ కోసం కొట్టుకోవటమే జరుగుతుంది" అంటూ... ఒకప్పటి అంజయ్య హయాం మరియు తెదేపా ఆవిర్భావం సమయంలో లాగా, తెదేపాకి అనుకూలంగా పరిస్థితులని ప్రభావ పరుస్తు వ్రాసేవాడు కదా ఈనాడులో? వ్రాస్తే ఎలా వ్రాస్తాడో వై.యస్. మరణం తర్వాత అతణ్ణి ‘దేవుణ్ణి’ చేసినప్పుడూ, తెదేపా పుట్టినప్పుడు ఎన్టీఆర్ ని ‘సంచలనం’ చేసినప్పుడూ మనకు తెలిసిందే!

అంతగా... సోనియా, రామోజీరావులిద్దరికీ చంద్రబాబు ‘అయిష్టుడు’ లేదా ‘శతృవు’ ఎలా అయ్యాడు?

అలాగే, వైయస్సార్ మరియు జగన్ ల వ్యవహారం కూడా! రామోజీరావుకీ, సోనియాకీ కూడా జగన్ అయిష్టుడూ లేదా శతృవు ఎందుకయ్యాడు? అందునా వై.యస్. మరణించినప్పుడు అతణ్ణి ‘దార్శనికుడు, మార్గదర్శి’ అంటూ కన్నీటితో, గద్గద స్వరంతో పొగిడిన సోనియాకి, పది రోజులు తిరిగేసరికి వై.యస్.జగన్ బద్ద శతృవు అయిపోయాడెందుకు? ఇప్పుడింకా, వై.యస్. అవినీతి, అవకతవకలు కూడా, అధిష్టానానికి హఠాత్తుగా కనిపిస్తున్నాయి.

రామోజీరావు విషయంలో... మార్గదర్శి చిట్స్ Vs ఇనుపగనులు పైకారణంగా [over leaf reason] చెప్పబడితే, సోనియా విషయంలో.... ‘జగన్ సీఎం పదవిని కోరుతున్నాడు’ అన్నది పైకారణంగా చెప్పబడుతోంది! ఒకవేళ జగన్ కోరుతున్నది సీఎం పదవే అయితే, ముందుగా పదవి ఇచ్చి, తరువాత సమస్యలు పరిష్కరించ లేకపోతున్నాడని పైకారణంగా చెప్పి, పదవి ఊడబెరికితే, నోరుమూసుకు కూర్చుంటాడు కదా! అలాంటి నైపుణ్యాలు అధిష్టానం దగ్గర కావాల్సినన్ని ఉన్నాయి.

కాబట్టి, ఇలాంటి పైకారణాలు గాక, లోపలి కారణం ఏమిటంటే ‘గూఢచర్యపు లోగుట్టు బయటకు కక్కటమే!’ దాని గురించి... ‘కాంగ్రెస్ అధిష్టానం Vs జగన్ శిబిరాల మధ్య అంతర్లీన పోరు’ అనే టపాల మాలికలో కొంత వివరించాను. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి... ‘వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం వెనుక అసలు మతలబులు’ అనే టపాల మాలికలోనూ మరికొంత వివరించాను.

ఇక, దేశం నిండా ఇందరు ఇంద్రయ్యలున్నారు! ఎవరికైనా ‘గూఢచర్యపు లోగుట్టు’ బయటకు కక్కక తప్పని స్థితే! అంటే - చేసింది చెప్పకా, తిన్నది కక్కకా తప్పని స్థితి!

ఎవరి ‘బ్రేక్ పాయింట్’ ఎంతో, ఇప్పటికే లేచిన తెరమీద చూడవలసిందే! ‘ఎవరూ చూడటం లేదు, ఎవరూ ఏ విధంగానూ శిక్షించలేరు’ అనుకొని ప్రజాద్రోహం, దేశద్రోహం చేసేటప్పుడూ చేసారు గానీ, సువర్ణముఖి అనుభవించవలసి వచ్చేసరికి ‘బేర్’మంటున్నారు.

కారణాలేవైనా, భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టడాలూ, చాలా మంది చేస్తుండగా చూస్తూనే ఉన్నాం! అది చంద్రబాబు లూ, జగన్ లే కాక, యడ్యూరప్పలూ, లాలూ ప్రసాద్ యాదవ్ లూ గట్రాలు! కాకపోతే కార్యకారణ సంబంధం అర్దం కావటానికి సమయం పడుతూ ఉంది పాపం!

1992లో, ఈనాడులో ఉపసంపాదకురాలిగా పనిచేసే నా స్నేహితురాలు, రామోజీరావు గురించి చెబుతూ "పేపరులో ఒక్క అక్షరం కూడా వృధాగా వ్రాయంచడే మా ఛైర్మన్! ప్రతీ దానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలుంటాయి" అంది.

తర్వాత, సంవత్సరాల తరబడి పరిశోధనలో, మాపై వేధింపు అనుభవంతో, మేము రామోజీరావు గురించి... "ప్రతీ విషయంలోనూ, ఎవరైనా, వంద అవకాశాలు ఉపయోగించుకో చూస్తే..., రామోజీరావు 110 అవకాశాలు చూస్తాడు" అనుకునే వాళ్ళం. ఎందుకంటే - ప్రతీ సన్నివేశాన్నీ, చివరికి తనకి ఏదైనా ఎదురు దెబ్బ, ఈడ్చి తగిలినా కూడా... అందులోనుండే..దాన్నీ... ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడతడు. బహుశః పదార్ద వాదులే అంత కాబోలు!

ఇప్పుడు ఈ పదార్ద వాదుల బుర్రలకి ‘సత్యాన్ని’ ఇంకించేందుకు... నెం.5 వర్గం కూడా ‘ఒకే అంశాన్ని, విభిన్న కోణాలతో’ నిర్వహిస్తోంది. ఒకే సంఘటనకు విభిన్న కోణాలు, విభిన్న విషయాలు ప్రతిఫలించడమూ అందులో భాగమే!

ఉదాహరణకి... ‘బాబు బాబ్లీ యాత్ర సంఘటన’నే తీసుకుంటే -

౧. ఇందులో, భారతదేశంలో రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చి, తమ ‘విభజించి పాలించే’ సూత్రాన్ని ఇప్పటికీ అమలు చేస్తోన్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి సోనియాల ప్రవర్తన గురించిన ‘బహిర్గతం’ [expose] ఉంది. చవాన్, రోశయ్యలు సోనియా చేతిలోని కీలు బొమ్మలే! ఈనాడు వ్రాతలూ, సాలూర రగడ సహితంగా అదే నిరూపించింది.

౨. చంద్రబాబుని ‘కుళ్ళ బొడవటం’ ద్వారా, తనను టార్గెట్ చేసుకుని విమర్శించేవాళ్ళ పట్ల, కాంగ్రెస్ అధిష్టానం సోనియా దృక్పధం expose అయ్యింది.

౩. అందులో చంద్రబాబు సువర్ణముఖి ప్రజల పరంగానూ, మా పరంగానూ ఉంది.

౪. చంద్రబాబుని ‘కుళ్ళ బొడిపించటం’ ద్వారా, నెం.5 వర్గం... నకిలీ కణిక వ్యవస్థకి ఏజంట్లుగా పనిచేసిన వారందరికీ... ఒక దెబ్బలబ్బాయిని చూపెట్టింది. చేసిన కర్మని, చేసిన తీరులోనే అనుభవిస్తారని, దృష్టాంత సహితంగా చూపించింది.

౫. ముఖ్యమంత్రిగా కెరీర్ రికార్డు కలిగి ఉన్నా సరే, ప్రజలకు దేశానికి వ్యతిరేకంగా... ‘చేసింది చెప్పే వరకూ, ప్రజల సొమ్ము తిన్నది కక్కే వరకూ’ ఎంత తీవ్ర దశకైనా తీసుకుపోతాం తప్ప, విడిచి పెట్టేది లేదన్న విషయం... నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ ఏజంట్లతో పాటు కీలక వ్యక్తులకి కూడా... నెం.5 వర్గం ఇంకిస్తోంది.

లేకపోతే ఏముంది? ఈ కోర్టులూ, ఈ చట్టాలూ, ఈ తీర్పులూ.... వీళ్ళకి అసలు లెక్కేలేదు. వాటిల్లో సవాలక్ష ‘కన్నాలు’ వీళ్ళకి తెలుసుమరి! కావాలనే అలాంటి కన్నాలతో కూడిన చట్టాలని నిర్మించుకున్నారయ్యె!

ఇక్కడో విషయం గమనించండి. మొన్నా మధ్య [జూలై లో], అమెరికాలో రష్యా గూఢచారులు పట్టుబడ్డారు. [వాళ్లల్లో ఒకరు పైకారణంగా [over leaf reason] చేసే వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం!] కొన్ని ఒడిదుడుగులూ, సంచలనాల వార్తలు జరిగిపోయాక.... అమెరికా రష్యా దేశాలు రెండూ , తమ దేశాలలో ఎదిరి దేశపు ఏజంట్లున్నారని అంగీకరించాయి. అది సహజమే నంటూ ఇరు దేశాల ఎంబసీలు ధృవీ కరించాయి. ఆనక, ఎంచక్కా, ఎవరి దేశస్తులని వాళ్ళు మార్పిడి చేసేసుకున్నారు. సంబంధిత ఒప్పందం రెండు దేశాల మధ్య ఉందని ప్రకటించారు.

ఆ ప్రకారం, అమెరికాలో గూఢచర్యం చేసిన రష్యాదేశస్థులని, అమెరికా రష్యాకి అప్పగించేసింది. అలాగే రష్యాలో గూఢచర్యం చేసిన అమెరికా దేశస్థులని, రష్యా అమెరికాకి అప్పగించింది.

ఆ విధంగా, విదేశీ ఏజంట్లని సదరు రెండు దేశాలూ మార్పిడి చేసేసుకున్నాయి. అంతటితో అన్నీ ముగిసిపోయాయి.

మరి, డేవిడ్ కోల్మన్ హెడ్లీ...? అతడు అమెరికా దేశీయుడు! భారత్ కు వ్యతిరేకంగా, పాక్ కు అనుకూలంగా గూఢచర్యం నడిపాడు. మరి అతణ్ణి అమెరికా ఏం చేస్తుంది?

అలాగే మనదేశంలో, మన దేశస్థులే పాక్ ఏజంట్లుగా పనిచేస్తున్న వాళ్ళు పాత బస్తీల్లో, ముంబైల్లో చాలామందే ఉన్నారు. వాళ్ళని పాకిస్తాన్ కి అప్పగించేస్తే సరిపోతుందా?

రేపు ఇటలీ వాళ్ళు ఇండియాలో, ఇండియా వాళ్ళు ఇటలీలో గూఢచర్యం నిర్వహిస్తూ పట్టుబడితే.. ఇటలీ వాళ్ళని ఇటలీ పంపించేసి, ఇండియా వాళ్ళని ఇండియాకి రప్పించేస్తే సరిపోతుందా?

డేవిడ్ కోల్మన్ హెడ్లీ ని, అమెరికా... పాకిస్తాన్ కి అప్పగిస్తుందా, భారత్ కి అప్పగిస్తుందా? అమెరికా రష్యా గూఢచారులని ఆయా దేశాలకి అప్పగించేస్తే... వాళ్ళు చేసిన రహస్య కార్యకలాపాలు పరిహారమైపోతాయా? వాటి మూలంగా జీవితాలు నాశనమైన ప్రజలకీ న్యాయం చేసినట్లయి పోతుందా?

డేవిడ్ కోల్మన్ హెడ్లీని, అమెరికా... పాకిస్తాన్ కో, ఇండియాకో అప్పగించేసినా, లేదూ అమెరికా కోర్టులోనే, సంవత్సరాల పాటు విచారించి, తీరిగ్గా తీర్పులిచ్చి శిక్షించినా... ముంబై ముట్టడిలో ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళకి న్యాయం జరిగినట్లువుతుందా?

కుటుంబంలో ఆప్తుల్ని కోల్పోయి, తల్లిదండ్రుల్ని కోల్పోయి, జీవితాలు తల్లక్రిందులైన వారి ఆక్రందనలు, ఆయా కుటుంబీకులకే తెలుస్తాయి. కసబ్ లకి గానీ, కసబ్ ల వంటి వారి తరుపున వాదించే రాంజఠ్మలానీలకి గానీ తెలియవు. విలాస్ రావు దేశ్ ముఖ్ లకీ, శివరాజ్ పాటిళ్ళకీ, చిదంబరాలకీ, మన్మోహన్ లకీ, సోనియాలకీ... అంతకంటే తెలియబోవు!

కాబట్టి కూడా... నెం.5 వర్గం, ఈ విషయంలో నిక్కచ్చిగానూ, పక్కాగానూ సువర్ణముఖిలు అమలు చేస్తోంది. గూఢచర్య పరంగా.... రహస్యంగా చేసిన ‘కర్మల ఫలితాలని’, ఆయా ఏజంట్లకు [ఇంద్రయ్యలకు] గూఢచర్యపరంగానే, కాకపోతే బహిరంగంగా అమలు చేస్తోంది.

ఎందుకంటే ..... గూఢచర్యం అతి ప్రాచీనమైనది. అంతే కాదు, అవసరమైనది కూడా! శ్రీరాముడు, ధర్మరాజు, వంటి పురాణ పురుషులే గాక, చాణిక్య చంద్రగుప్తులూ, తిమ్మరసు శ్రీకృష్ణ దేవరాయల వంటి చారిత్రక పురుషుల దాకా, అందరూ... రాజ్య పరిపాలనలో భాగంగా గూఢచర్యాన్ని అనివార్యంగా నిర్వహించిందే!

అయితే దేశ రక్షణకి, ప్రజలలో ధర్మానువర్తన, నీతి నియమ పూర్వక ప్రవర్తన ఉండేందుకు, ఉపయోగించే గూఢచర్యాన్ని...
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకి, సుఖశాంతుల పరిపుష్టికి ఉపయోగించిన గూఢచర్యాన్ని...

స్వార్దానికి, దేశాల మీద కుట్రలు చేయటానికీ, ప్రజలను దోపిడి చేయటానికి ఉపయోగించటం దారుణం, పరమ నీచం కూడా!

నకిలీ కణిక వ్యవస్థ, తానీషా కాలంలో కంచెర్ల గోపన్న విషయమై ప్రారంభించి.... అదే గొప్ప తెలివి తేటలనీ... అదే సామర్ద్యమనీ అనుకుని, ప్రజల మీద గూఢచర్యాన్ని ఉపయోగించటాన్ని కొనసాగించింది. భారతంలోని కణిక నీతినీ, నారద నీతికి విపర్యయాన్నీ, ప్రపంచమంతా పకడ్బందీగా విస్తరించింది.

అదంతా తెలియకుండా, తమకి తెలిసిందే చాలా ఎక్కువనుకుంటూ, ‘సందు దొరికింది కదా!’ అని దూరేసి, ‘పైకి రావటానికి ఇదే పరమావధి’ అనుకుంటూ, అసైన్ మెంట్లు నిర్వహించిన చంద్రబాబులూ, శరద్ పవార్ ల కందరికీ.... ఇప్పుడు నెం.5 వర్గం... ఇంత నిక్కచ్చిగా శిక్ష విధిస్తోంది కూడా అందుకే!

ఈ భీభత్స కాండ అంతా ముగిసే సరికి ‘పగ వాడికి కూడా వద్దురా ఈ బాధ’ అన్పించాల్సిందే!

మరి గూఢచర్యపు గుళిక కడుపులో ఉండగా... కూర్చోనివ్వదు, తిననివ్వదు, తాగనివ్వదు కదా! చిత్రమైన బాధ, చెప్పుకోలేని బాధ! చేసింది చెప్పే దాకా, తిన్నది కక్కేదాకా అంతేనయ్యె! ఇలాంటి ఇంద్రయ్యల నందర్నీ చూసాక, ఎవరికైనా సరే... స్వార్ద ప్రయోజనాలని ఆశించి, ప్రజాద్రోహానికి దేశ ద్రోహానికి ఒడిగట్టలన్నా, గూఢచర్యం నిర్వహించాలన్నా... ముచ్చెమంటలు పోయాలి. ‘ఎందుకొచ్చిన కర్మలే భగవంతుడా!’ అనిపించాలి.

వచ్చే కొన్ని శతాబ్దాల పాటు, రానున్న వెయ్యేళ్ళపాటు, ఎవ్వరూ, తమ స్వార్దప్రయోజనాల కోసం ‘గూఢచర్యం’ అనే దాని జోలికి కూడా పోకూడదు. అందుకే నిక్కచ్చిగా నెం.5 వర్గం, సువర్ణముఖి శిక్షలు విధిస్తోంది!

ఇలాగ్గాక .... వీళ్ళందరినీ... తమ వాదనని చెప్పుకోనిచ్చి, కౌన్సిల్ చేసి, మంచి బుద్ది తెచ్చుకోమంటే వింటారా? ఇంకా పైగా తమ వాదనలు ఎంతగా వినిపిస్తారంటే.....


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

సొనియా ఒక గూఢా చారా? దీని మీద మీరు research ఎమైనా చెచారా?

అజ్ఞాత గారు: రెడ్డొచ్చే మొదలాడ మనటం అంటే ఇదే!

మీరు గమనించారా మొన్న జగన్ ఆస్తులను బయటపెడతానని రామోజీరావు బెదిరించబోయాడు, కానీ జగన్ నాకు ఓపిక నశిస్తోందని చెప్పగానే ఆస్తులను బయటపెట్టే కార్యక్రమం ఆగిపోయింది.

Relevant links ఇవ్వండి please.

"రెడ్డొచ్చే మొదలాడ మనటం" ఈ సామెత కి రెడ్డి కులం వాళ్ళు atrocity case file చెస్తారెమొ చూడండి. జాగ్రత్త.

రెండవ అజ్ఞాత గారు: నిజమే సుమా!
మొదటి అజ్ఞాత గారు: ప్రక్కన ‘అన్ని లేబుల్స్ ఒకే టపాలో’ అన్న లేబుల్ ని చూడండి. ఆపై మీ ఓపిక!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu