నిజానికి, భోపాల్ ప్రమాదం జరిగింది 1984 లో! తర్వాత కేంద్రంలో, అయిదేళ్ళు, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. అర్ధాయుష్షులతో వీపీ సింగ్, చంద్రశేఖర్ ల ప్రభుత్వాలు నడిచాయి. తర్వాత పీవీజీ ప్రభుత్వం! ఆ తరువాత దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలు, ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలు, నడిచాయి. అవేవీ ఉటంకించకుండా... అదేదో పీవీజీ మాత్రమే దానికి బాధ్యుడన్నట్లు భాజపా ప్రకటన ఉంది.

నిజానికి అండర్సన్ ని భారత్ కు రప్పించే ప్రయత్నమే కాదు, అతడి మీద దోషి ముద్రవేసిందీ పీవీజీ హయాంలోనే! బాధితులకి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వబడిందీ పీవీజీ హయాంలోనే!

ఇక ఇప్పుడు, యూపీఏ హయాంలో అయితే నేరగాళ్ళకి ఏ పాటి శిక్ష పడిందో... రెండు నెలల క్రితం అందరమూ చూసిందే!

పాపం! న్యాయమూర్తి ఉదారంగా... నేరస్తులంతా ముసలి వాళ్ళయ్యారనీ, గుండె జబ్బులూ గట్రాలతో బాధపడుతున్నారనీ, ఎంతో జాలి పడ్డాడు. సింపుల్ గా రెండేళ్ళ శిక్ష విధించాడు. అదీ పై కోర్టుకీ అప్పీలు చేసుకోవచ్చాన్నాడు. బెయిల్ వెంటనే ఇచ్చేసాడు. నేరస్తులంతా, దర్జాగా, కోర్టుకి వచ్చిన కార్లోనే ఇంటికెళ్ళిపోయారు.

ఇదంతా జరిగాక కూడా... కేంద్ర న్యాయమంత్రి వీరప్పమొయిలీ ‘న్యాయం దగా పడిందనీ’ దుఃఖిస్తూ మొసలి కన్నీరు కార్చాడు. ఎంత అందమైన స్ర్కిప్టుతో నడుస్తున్న నాటకం ఇది!? పైగా సిబిఐ, అండర్సన్ గురించి ‘పరారీలో ఉన్నవాడి’గా లిఖితపూర్వకంగా పేర్కొంది.

గమ్మత్తేమిటంటే .... అండర్సన్ అచూకీ అలభ్యమైనదేమీ కాదనీ, అతడి చిరునామా సహితం తెలుసనీ, ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన నిర్మలా కరుణన్ సుస్పష్టంగా ప్రకటించింది. ఓసారి దిగువ వార్త పరిశీలించండి.

>>>అండర్సన్‌ జాడ చెప్పాం: గ్రీన్‌పీస్‌
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో నిందితుడు అండర్సన్‌ జాడ గురించి, తాము కొన్నేళ్ల క్రితమే సీబీఐకి చెప్పామని 'గ్రీన్‌ పీస్‌' పర్యావరణ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. 2002లో తాము, అమెరికాలో ఓ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నప్పుడు ‘ఓ అపరిచిత వ్యక్తి’ అండర్సన్‌ ఎక్కడున్నారో చెప్పారని, సంస్థ సలహాదారు నిర్మల కరుణన్‌ తెలిపారు. అప్పుడు తాము అండర్సన్‌ ఇంటికి వెళ్లామని, అయితే ఆయన, ఇంటి వెనుక ద్వారం నుంచి తప్పించుకొని బయటికెళ్లారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై అమెరికా, భారత్‌ కోర్టులతోపాటు, సీబీఐకి కూడా, తాము సమాచారమందించామని చెప్పారు.
~~~~

>>>అండర్సన్‌ వైభోగం
విలాసవంతంగా విశ్రాంతి జీవితం...

భారత్‌ నుంచి 1984లోనే పారిపోయినా, అండర్సన్‌ 1986లో రిటైరయ్యేంత వరకు, యూనియన్‌ కార్బైడ్‌ సీఈవోగా కొనసాగాడు. ప్రస్తుతం దాదాపు తొంభయ్యేళ్ల వయసుకు చేరువైన అతడు, న్యూయార్క్‌లోని ఒక విలాసవంతమైన భవంతిలో విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాడు. అండర్సన్‌ అప్పగింత కోసం, భారత్‌ చేసిన విజ్ఞప్తిని 2004లో, అమెరికా తిరస్కరించింది. బాధితుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో, 2009లో, కోర్టు అతడిపై అరెస్టు వారంట్‌ జారీ చేసింది. అండర్సన్‌ను పరారైన నిందితుడిగా ప్రకటించిన పదేళ్లకు... అంటే 2002లో భారత్‌కు చెందిన జర్నలిస్టు శక్తి భట్‌ అతడి ఆచూకీని కనుగొన్నారు.

రిడిఫ్‌ డాట్‌ కామ్‌ యాజమాన్యంలోని 'ఇండియా అబ్రాడ్‌' పత్రిక ద్వారా, న్యూయార్క్‌లోని అతడి విలాసవంతమైన విశ్రాంతి జీవితాన్ని, బాహ్య ప్రపంచానికి వెల్లడించారు. న్యూయార్క్‌లోని బ్రిడ్జిహాంప్టన్‌ ప్రాంతంలో ఉన్న అతడి భవంతి ఫొటోలను ప్రచురించారు. అండర్సన్‌, అతడి భార్య లిలియన్‌, ఈ భవంతిలో నివసిస్తున్నారు. అండర్సన్‌కు ఫ్లోరిడాలోని వీరో బీచ్‌లోను, గ్రీన్‌విచ్‌, కనెక్టికట్‌ ప్రాంతాల్లోను విలాసవంతమైన భవంతులు ఉన్నాయి.

Pasted from

ఇక ఈ కేసులో బాధితులకి వ్యతిరేకంగా, UCC కంపెనీని 1997లో చట్టపరంగా కొన్న డౌ కంపెనీ తరుపున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ కు అధికార ప్రతినిధి! మరో న్యాయవాది అరుణ్ జైట్లీ భాజపా పార్టీ నేత! ఎవ్వరు కాపాడాలి ఈ దేశాన్ని, ఈ ప్రజలని?

[జూన్ 7 న తీర్పు వచ్చాక] కొద్ది రోజులు గలభా సృష్టించీ, ఆనక చల్లార్చిన అంశాలలో ఇదీ ఒకటి.

మీడియా... ప్రభుత్వం... కుమ్మక్కుగా నడుపుతున్న వ్యూహాత్మక నాటకాలవి! లేనట్లయితే, మీడియా... ప్రజల తరుపునా, భోపాల్ గ్యాస్ లీక్ బాధితుల తరుపునా, విషయాలని వెలుగులోకి తెస్తూ, ఫాలో అప్ చేస్తూ, పోరాడుతూనే ఉండాలి కదా?

బదులుగా, భోపాల్ పాపాన్ని పీవీజీ నెత్తికి రుద్దే కాంగ్రెస్ అధిష్టానపు ప్రయత్నానికీ, అందుకు సహకరించే రస్గోత్రాల వ్యాఖ్యానాలనీ ప్రచురిస్తుంది. అంతే! నిజానికి... మీడియా, కాంగ్రెస్ అధిష్టానానికి సయామీ కవలలాగే, ఒకే దిశలో, ఒకే వేగంతో, నడుస్తూ సహకరిస్తుంటుంది.

ఏదైనా విషయం, ప్రజలకి అర్దంగాకుండా చేయాలన్నా, తప్పుదోవ పట్టించాలన్నా... కొన్ని సత్యాలని, కొన్ని అసత్యాలని కలగలపి, నాయకుల స్టేట్ మెంట్ల రూపంలో, జనం నెత్తి మీద వేస్తే... ఆ విషయం జనానికి అర్దం గాకుండా పోతుంది. తరువాత ఆ విషయాలను, తమకు అనుగుణంగా నడుపుకోవచ్చు. అదే అండర్సన్ కేసు విషయంలో జరుగుతోంది. ఈ విషయం అర్దం కావాలంటే ఈ వ్యాసం చివరగా నివ్వబడిన వార్తాంశాలను ఒకసారి గమనించండి. మీకే అర్దమవుతుంది.
~~~~~

>>>అది పరిస్థితుల ప్రభావం
ఆండర్సన్ పరారీకి కాంగ్రెస్ కొత్త కలర్
శాంతి భద్రతల కోసమే ఆ నిర్ణయం: ప్రణబ్
ఇందులో రాజీవ్ పాత్ర లేదు: అరుణ్ నెహ్రూ
కోల్‌కతా, జూన్ 13: వారెన్ ఆండర్సన్ పరారీని కాంగ్రెస్ కొత్త మలుపు తిప్పుతోంది. తప్పు రాజీవ్‌గాంధీదో, అర్జున్‌సింగ్‌దో కాదని... అప్పటి 'పరిస్థితులది' అంటూ వివాదానికి కొత్త రంగు పులుముతోంది. విష వాయువు లీకేజీ, వేలమంది మరణంతో భోపాల్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యానే ఆండర్సన్‌ను అక్కడి నుంచి పంపించాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. '1984 డిసెంబర్ 8 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో అర్జున్ వివరణ ప్రచురితమైంది.

‘భోపాల్‌లో అప్పటికే శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని, భావోద్వేగాలు తారస్థాయికి చేరుకున్నాయని, అందువల్లే ఆండర్సన్‌ను భోపాల్ నుంచి పంపడం మంచిదనే నిర్ణయానికి వచ్చామని అర్జున్‌సింగ్ స్పష్టం చేశారు' అని ప్రణబ్ ఆదివారం, కోల్‌కతాలో తెలిపారు. మరోవైపు... ఆండర్సన్‌ను భోపాల్ నుంచి పంపించాలన్న నిర్ణయం పూర్తిగా అర్జున్‌సింగ్‌దేనని కేంద్ర మాజీ మంత్రి, రాజీవ్‌కు అత్యంత సన్నిహితుడైన అరుణ్ నెహ్రూ తెలిపారు. 'అర్జున్‌సింగ్ 1984 డిసెంబర్ 7న విలేఖరులకు చెప్పిన వివరాలు చూస్తే... ఆండర్సన్‌ను భోపాల్ నుంచి పంపింది ఆయనే అని అర్థమవుతుంది. ఇందులోకి రాజీవ్‌ను లాగాలనుకోవడం తప్పు' అని అన్నారు.
~~~~~

>>>రాజీవ్ పాత్రపై భిన్న వాదనలు
రాజీవ్‌పై పీసీ అలెగ్జాండర్ పరోక్ష విమర్శ

న్యూఢిల్లీ, జూన్ 11 : ఆండర్సన్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఈ విషయంలో రాజీవ్‌పై పరోక్షంగా వేలెత్తి చూపిన అప్పటి రాజీవ్ ముఖ్యకార్యదర్శి పీసీ అలెగ్జాండర్.. ఆండర్సన్ విడుదల వెనుక అనేక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ రోజు కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత రాజీవ్‌ను అర్జున్‌సింగ్ కలుసుకున్నారని, ఆ తర్వాత ఆండర్సన్ విడుదలయ్యారని చెప్పా రు. ఈ వ్యవహారంలో మంత్రులకు ఏమీ తెలియదని ఒక చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు.

ఇదిలా ఉండగా... తొలుత రాజీవ్‌పై వేలెత్తిన అలెగ్జాండర్ తర్వాత తన స్వరం మార్చారు. ఆండర్సన్ పరారీ అంశంలో ఆయన పాత్ర ఉండి ఉండకపోవచ్చని పీటీఐ వార్తా సంస్థతో చెన్నైలో అన్నారు.
~~~~

పై రెండు వార్తాంశాలలో: శాంతి భద్రతల సమస్య కారణంగానే ‘అండర్సన్ ను విడుదల చేసి, విమానం ఎక్కించి పంపించడం’ అర్జున్ సింగ్ చేసాడని, అప్పుడు అతడు విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ... ప్రణబ్ ముఖర్జీ [గతంలో] చెప్పాడు. మరి పార్లమెంట్ లో, అర్జున్ సింగ్, అంతా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వత్తిడి మేరకే విడుదల చేసానని [నిన్న] ఎలా చెప్తున్నాడు?

క్యాబినెట్ మీటింగ్ తరువాత రాజీవ్ గాంధీని అర్జున్ సింగ్ కలిసిన తరువాత, అండర్సన్ విడుదల అయినపుడు, మరి పీవీజీ మీదకి నెపం ఎలా నెట్టబడుతుంది? క్రింది వార్తాంశంలో రస్గోత్రా, ఆ రోజు రాజీవ్ గాంధీ ఢిల్లీలోనే లేడని చెప్తున్నాడు. మరి క్యాబినెట్ మీటింగ్ తరువాత రాజీవ్ ని అర్జున్ సింగ్ కలిసాడని, రాజీవ్ కార్యదర్శి పీసీ అలెగ్జాండర్ ఎలా చెప్తున్నాడు?
~~~~~

>>>న్యూఢిల్లీ: భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు వారెన్‌ ఆండర్సన్‌ పరారీ వివాదం గురువారం మరో మలుపు తిరిగింది. అతన్ని సురక్షితంగా దేశం దాటించాలనే నిర్ణయాన్ని నాటి కేంద్ర హోంమంత్రి పీవీ నరసింహారావే తీసుకుని ఉంటారని అప్పట్లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంకే రస్గోత్రా అభిప్రాయపడ్డారు. ఆండర్సన్‌ అరెస్టు సరికాదని పీవీ భావించారని గురువారం సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ చానల్లో కరణ్‌ థాపర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనన్నారు. ఈ నిర్ణయం గురించి నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి తర్వాత తెలిసిందని, అందుకాయన అభ్యంతరమేమీ చెప్పలేదని వివరించారు.

"భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ ద్వారా ఆండర్సన్‌ మమ్మల్ని సంప్రదించారు. సురక్షితంగా తిరిగి వెళ్లనిచ్చే పక్షంలో ఆండర్సన్‌ భారత్‌ వచ్చి భోపాల్‌ దుర్ఘటనను పరిశీలిస్తారని, అందుకు వీలు కల్పించాలని యూఎస్‌ మిషన్‌ డిప్యూటీ చీఫ్‌ గార్డన్‌ స్ట్రీబ్‌ నన్ను కోరారు. విషయాన్ని నేను హోం శాఖ, కేబినెట్‌ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నిర్ణయాన్ని పీవీకే వదిలేశాం. అదే రోజు అందుకు అంగీకారం లభించింది. బహుశా పీవీయే అందుకు ఆదేశించి ఉంటారు' అని రస్గోత్రా చెప్పుకొచ్చారు.

ఈ విషయమై విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రాజీవ్‌ను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించగా, అప్పుడాయన ఢిల్లీలో లేరని బదులిచ్చారు. 'దాంతో నిర్ణయం తీసుకోవాల్సింది హోం శాఖేనని భావించాను. వారే నిర్ణయం తీసుకున్నారు' అని చెప్పారు. ఆండర్సన్‌ అరెస్టు తప్పిదమని, క్షేమంగా తిప్పి పంపాలన్న అతని విజ్ఞప్తి సమంజసమేనని రస్గోత్రా అభిప్రాయపడ్డారు. భారత ప్రయోజనాల రీత్యా ఆండర్సన్‌ను వదిలేయడమే సరైనదన్నారు.

~~~~

రెండు విరుద్దప్రకటనలు:

>>>పీవీ, జైల్‌సింగ్‌లను కలిసిన ఆండర్సన్!
భోపాల్ దుర్ఘటన జరిగిన తర్వాత విడుదలైన వారెన్ ఆండర్సన్ 1984 డిసెంబర్ 7న నాటి హోం మంత్రిని, రాష్ట్రపతిని కలిశారు! ఈ విషయాన్ని నాటి రాజీవ్ మంత్రివర్గంలో పనిచేసిన అరుణ్ నెహ్రూ స్వయంగా చెప్పారు. "విడుదలైన తర్వాత ఆయన రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ఢిల్లీ వచ్చారు. నాటి హోం మంత్రి పీవీ నరసింహారావును, రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలిశారు. ఈ విషయాన్ని నిర్ధారించాల్సింది ప్రభుత్వమే'' అని అరుణ్‌నెహ్రూ తెలిపారు.

Pasted from: http://www.andhrajyothy.com/nationalNewsShow.asp?qry=2010/jun/15/national/15national2&more=2010/jun/15/national/nationalmain&date=6/15/2010

కేంద్రమే ఏర్పాట్లు చేసింది: స్ట్రీబ్‌

ఆండర్సన్‌ దాటివేతకు కేంద్రమే ఏర్పాట్లు చేసిందని నాటి యూఎస్‌ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గార్డన్‌ స్ట్రీబ్‌ వెల్లడించారు. భోపాల్లో హౌస్‌ అరెస్టు నుంచి ఆండర్సన్‌ను విడిపించడం, అక్కణ్నుంచి విమానంలో అతన్ని ఢిల్లీ పంపడం విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోనే జరిగాయని ఎన్డీటీవీ ఇంట ర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. 'ఆండర్సన్‌కు ఎలాంటి హానీ జరగొద్దని అమెరికా భావించింది. నాటి విదేశాంగ కార్యదర్శి రస్గోత్రా నాకందుకు హామీ ఇచ్చారు.

కానీ భోపాల్లో ఆయన్ను అరెస్టు చేసినట్టు తెలియడంతో రస్గోత్రాను సంప్రదించాను. తర్వాత ఆండర్సన్‌ను ఢిల్లీ తీసుకొచ్చారు. ఆయన ఉన్నంతసేపు యూఎస్‌ ఎంబసీలోనే గడిపి, తర్వాతి విమానంలోనే అమెరికా వెళ్లిపోయారు' అని చెప్పుకొచ్చారు.
~~~~~

పై రెండు వార్తాంశాల్లో ఏది నిజం? అండర్సన్ ఢిల్లీ వచ్చిన తర్వాత అమెరికా ఎంబసీలో గడిపినట్లా? పీవీజీ, జైల్ సింగ్ లని కలిసినట్లా?
~~~~~
పాతికేళ్ల గాయం
1984 డిసెంబర్ 3: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) పురుగు మందుల ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ (మిక్) అనే విషవాయువు లీక్. 15 నుంచి 25 వేల మంది మృతి. 5 లక్షల మందికి పైగా తీవ్రంగా అనారోగ్యంపాలు. ముందు తరాలపై కూడా దుష్ప్రభావం.
1984 డిసెంబర్ 4: యూసీఐఎల్ మాతృసంస్థ అమెరికాలోని యూసీసీ చైర్మన్ వారెన్ అండర్‌సన్, తదితరుల అరెస్టు. భారత్‌కు తిరిగి వస్తానంటూ ఇచ్చిన హామీపై అండర్‌సన్ బెయిలుపై విడుదల.
1985 ఫిబ్రవరి: నష్ట పరిహారంగా 330 కోట్ల డాలర్లు చెల్లించాలంటూ యూసీసీపై అమెరికా కోర్టులో భారత్ దావా.
1986: సంబంధిత కేసులన్నిటినీ భారత దేశానికి బదలాయించిన అమెరికా కోర్టు.
1987 డిసెంబర్: అండర్‌సన్, ఇతర దేశాల్లోని యూసీలు, తదితర నిందితులపై సీబీఐ చార్జిషీటు.
1989 ఫిబ్రవరి: అండర్‌సన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ. బేరానికి వచ్చిన యూసీసీకి, భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన కోర్టు వెలుపలి ఒప్పందం కింద ఆ కంపెనీ 47 కోట్ల డాలర్లు (సుమారుగా రూ.1,880 కోట్లు) చెల్లింపు.
1989 ఫిబ్రవరి-మార్చి: ఈ ఒప్పందంపై సుప్రీం కోర్టులో రిట్లు.
1992: కార్బైడ్ కంపెనీ చెల్లించిన పరిహారంలో కొంత బాధితులకు చెల్లింపు.
1992 ఫిబ్రవరి: సమన్లను ధిక్కరించినందుకు అండర్సన్‌పై నేరస్తుడిగా ముద్ర.
1994 నవంబర్: యూసీఐఎల్ తమ వాటాను కోల్‌కతా కంపెనీ మెక్ లియోడ్ రస్సెల్‌కు విక్రయించుకోడానికి యూసీసీకి సుప్రీం అనుమతి.
1996 సెప్టెంబర్: యూసీఐఎల్ భారత అధికారులు 8 మందిపై అభియోగాల తీవ్రతను తగ్గించిన సుప్రీం.
1999 ఆగస్టు: అమెరికా కంపెనీ డౌ కెమికల్‌్ లో విలీనమైపోతున్నట్టు యూసీసీ ప్రకటన.
2001 ఫిబ్రవరి: భారత్‌లోని యూసీఐఎల్ భారం మోసే ప్రసక్తి లేదంటూ యూసీసీ తిరస్కారం.
2002 ఆగస్టు: యూసీసీ చైర్మన్ ఆండర్‌సన్‌పై భారత కోర్టులో శిక్షార్హమైన హత్యాభియోగం నమోదు.
2004 జూన్: అండర్‌సన్‌ను అప్పగించాలంటూ భారత్ చేసిన వినతికి అమెరికా తిరస్కృతి.
2004 జూలై 19: యూసీఐఎల్ చెల్లించిన పరిహారం మొత్తంలో రూ.1,500 కోట్లకు పైగా బాధితులకు చెల్లించాల్సిందిగా సుప్రీం ఆదేశం. తరువాత అక్టోబర్ 26న ఇచ్చిన ఉత్తర్వులో మొత్తం పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశం. ఈలోగా పరిహారం చెల్లించడం లేదంటూ బాధితుల నిరసనల వెల్లువ.
2010 జూన్ 7: యూసీఐఎల్ భారత చైర్మన్ కేశుబ్ మహీంద్రాతో సహా 8 మంది కంపెనీభారత అధికారులూ దోషులుగా కోర్టు తీర్పు.
Pasted from: http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jun/8/main/8main6&more=2010/jun/8/main/main&date=6/8/2010
~~~

ఈ కేసు... అన్ని ప్రభుత్వ కాలాలలో నడిచింది. దోషుల మీద చర్యల కోసం ఎంతో కొంత క్రియాశీలంగా పనిచేసిన ప్రభుత్వాలు రాజీవ్, పీవీజీలవే! మిగతా అన్ని ప్రభుత్వాలు [వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకేగుజ్రాల్, భాజపా ప్రధాన భాగస్వామ్యంతో ఎన్డీయే, ఇటలీ కాంగ్రెస్ ప్రధాన భాగస్వామ్యంతో యూపీఏ ప్రభుత్వాలు] దోషులకు వెసులు బాటు కల్పించే ప్రయత్నాలే చేసాయి. ఈ విధంగా కూడా... నెం.5 వర్గం, ఈ ప్రభుత్వాల చిత్తశుద్దిని దృష్టాంతపూరితంగా నిరూపించింది.
~~~~~~

>>>అండర్సన్‌ విడుదలను భారత్‌ వేగవంతం చేసింది: సీఐఏ
న్యూఢిల్లీ: యూనియన్‌ కార్బైడ్‌ మాజీ సీఈవో అండర్సన్‌ను గృహ నిర్బంధం నుంచి విడిపించే ప్రక్రియను నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం వేగంగా ముగించిందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ పత్రాల్లో వెల్లడైంది. 'అండర్సన్‌ను నిన్న రాత్రి విడుదల చేయడంలో భారత ప్రభుత్వం వేగంగా స్పందించింది. యూనియన్‌ కార్బైడ్‌పై రాజకీయ లబ్ధి పొందేందుకు నాయకులు ఆరాటపడుతున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది.

ముఖ్యంగా పార్లమెంట్‌ ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉండటంతో కేంద్ర, రాష్ట్ర నాయకులు భోపాల్‌ దుర్ఘటన బాధ్యతను యూనియన్‌ కార్బైడ్‌పై నెట్టేసి దాని మాతృ సంస్థ నుంచి పరిహారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు' అని 1984 డిసెంబర్‌ 8న సీఐఏ రహస్య పత్రాల్లో పేర్కొంది. ఈ పత్రాలను సీఐఏ 2002 జనవరిలో వర్గీకృత జాబితా నుంచి తొలగించింది.

Pasted from: http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=525993%26Categoryid=1%26subCatId=32
~~~~~~

వార్తాంశాల సాక్షిగా, దృష్టాంతాలని పరిశీలిస్తే, భోపాల్ పాపాలు ఎవరివో స్పష్టంగా అర్దమౌతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

మీకు వీలైతే "అసలేం జరిగింది అంటే by P.V.R.K. Prasad" బుక్ చదవండి. P.V. నరసింహ రావు గురించి తెలుసుకోవలసిన ఎన్నో మంచి విషయాలు అందులో వున్నాయి. P.V తన చివరి రోజుల్లో కోర్టు ఖర్చులు కోసం తన ఇల్లు అమ్మిపెట్టమని P.V.R.K. ప్రసాద్ కి చెప్పారంట. అది చదివి చాల బాధ వేసింది. అలాంటి వ్యక్తి మన దేశ ప్రధాన మంత్రి అవ్వటం మన అదృష్టం.

http://www.eveninghour.com/books/Asalem%20Jarigindante%20/5142.html

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu