ఏడాదికో రోజు మాతృదినోత్సవం...
ఓ రోజు పితృదినోత్సవం...
ఓ రోజు స్వాతంత్ర్య దినోత్సవం...
మూడు వందల అరవై అయిదు రోజులలో
ఒకరోజు మాత్రమే తలచుకోదగినదా అమ్మంటే!?
అమ్మ... మన జీవన ప్రదాత!
నాన్న... మన జీవిత నిర్మాత!
మాతృభూమి...? మన జీవితం!
ఈ నేల... నీరిచ్చి, నీడనిచ్చి
అన్నంపెట్టే అమ్మనిచ్చి
నడక నేర్పే నాన్న నిచ్చింది.
అమ్మబొజ్జలో పదినెలలే!
నాన్న వెనక పాతికేళ్ళే!
మాతృభూమి ఒడిలో....?
చివరి శ్వాస విడిచే వరకూ....!
చితిలో కాలినా
సమాధిలో ఒదిగి పోయినా
కలిసి పోయేది ఈ మట్టిలోనే!
అమ్మనీ నాన్ననీ కన్న మాతృదేశాన్ని
ఏడాది కొకసారి....
జండా పండగ అనుకుని
జైహింద్ అనేస్తే....!?
అరవై మూడేళ్ళ క్రితం
ఎందరో ఆత్మార్పణ చేస్తే
పొందిన అర్ద స్వాతంత్రం!
ఇదిగో... ఇలాగే...
శూన్యమై పోతుంది!
‘జననీ జన్మభూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసి’ అనుకున్న
శ్రీరాముడే ప్రతి హృదయంలో నినదిస్తే
పూర్ణ స్వాతంత్రమై
భువి వెలుగుతుంది.
జై హింద్!
7 comments:
మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
- శిరాకదంబం
మీరు చెప్పింది నిజమే .
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
జై హింద్ .
well said
చాలా మంచి భావాలు. మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.
Well said..Wish you all the best.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
SR Rao గారు, మాలా కుమార్ గారు, చిలమకూరు విజయమోహన్ గారు, జయ గారు, అక్షరమోహనం గారు, సత్యేంద్ర గారు: నెనర్లండి!
Post a Comment