టైం మెషిన్ ఎక్కి, బాలకృష్ణ చంద్రబాబులూ, వై.ఎస్.జగన్, చివరికి కాంగ్రెస్ అధిష్టానం సోనియా కూడా గత కాలంలోకి ప్రయాణించి రావటం చూశాక... చిరంజీవికి కూడా టైం మెషిన్ ఎక్కాలన్న ఉబలాట కలిగింది. బావమరిది అరవింద్ తో చర్చించాడు.

"వెళ్ళిరా బావా! ఎవరైనా వద్దంటే, వాళ్ళ నాలుకలు కోయటానికి నేను కత్తితో సిద్దంగానే ఉన్నా!" అంటూ భరోసా ఇచ్చాడు అల్లు అరవింద్.

దాంతో చిరంజీవి ధైర్యం కూడ గట్టుకొని, వేలం పాటలో పాల్గొని, టైం మెషీన్ ఎక్కేందుకు ‘టికెట్’ కొనుకున్నాడు.

గతంలోకి ప్రయాణించి మామ అల్లు రామలింగయ్య దగ్గరికి చేరాడు.

అల్లుణ్ణి చూడగానే అల్లు రామలింగయ్య "నాయనా ఆంజనేయ వర ప్రసాద్! ఎంత పని చేశావోయ్! ఏదో సినిమాలు చేసుకుని, పది రాళ్ళు వెనకేసుకుంటావని పిల్లనిచ్చి, ఆపైన నా లాబీయింగ్ గొలుసులన్నీ అందిస్తే... మూడు సినిమాలు, ఆరు అవార్డులుగా ముందుకు పోకుండా ‘తగదునమ్మా’ అని రాజకీయాల్లోకి ఎందుకెళ్ళావ్? ఇప్పుడు చూడు! నేను తెర మీద మాత్రమే కమేడియన్ ని అయితే... నువ్వు రాజకీయ జీవితంలో కమేడియన్ వి అయిపోయావ్" అన్నాడు ఏడుపాపుకుంటూ!

అది చూసి చిరంజీవికీ దుఃఖ మాగలేదు. "అక్కడికీ నేనెంతో గుంజాటన పడ్డాను మామయ్యా! ఎంతో వెనక ముందులాడాను. చివరికి ‘తమిళ సూపర్ స్టార్ ‘రజనీ కాంత్’ ల వంటి వాళ్ళు దూకటానికి ప్రయత్నిస్తున్నారు కదా! మనకేం తక్కువని?’ రంగంలోకి దూకాను. తీరా చూస్తే... రాజకీయాల్లో నా పరిస్థితి చూసి, ‘ఎందుకొచ్చిందిలే?’ అన్నట్లు వాళ్ళంతా వెనక్కి తగ్గారు" అన్నాడు వెక్కిళ్ళు పెడుతూ!

"ఎవరో ఏదో చెప్పారని చేస్తారటయ్యా, పిచ్చి సన్నాసివి గాకపోతే!".... ఎన్నో సినిమాలలో రావుగోపాల రావు వెనకాల నక్కి డైలాగులు చెప్పిన అలవాటు కొద్దీ, అదే మాడ్యులేషన్ లో అనేసాడు అల్లు రామలింగయ్య.

"ఎవరో కాదు మామయ్యా! మీ కొడుకు అరవింద్ కూడా అదే సలహా చెప్పాడు" బిక్కముఖం వేసాడు చిరంజీవి.

"సర్లే! జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా, పరిస్థితులు చక్కదిద్దుకో! నిజానికి సినిమాలైనా, రాజకీయాలైనా, గాడ్ ఫాదర్ ల కాళ్ళు పట్టుకోవటమే అసలు టెక్నిక్! ఏమైనా... సినిమాలే మనకి మెయిన్ ప్రొఫెషనూ! రాజకీయాలంటూ ఏదో చేసినా, ఎవర్ని పట్టుకుంటే సినిమాలు హిట్టువుతాయో చూసుకో!" అని, తన అనుభవాన్నంతా రంగరించి సుద్దులు చెప్పాడు మామ అల్లురామలింగయ్య.

బుద్దిగా తలూపి, కళ్ళు తుడుచుకొని, టైం మెషీన్ ఎక్కి వెనక్కొచ్చాడు చిరంజీవి.

మెషీన్ దిగీ దిగగానే, ‘పేకప్’ అంటూ పరుగేఠుకొని ఇంటి కెళ్ళి పోయాడు, విలేఖర్లతో సహా ఎవరూ, తనని ఏ ప్రశ్నలూ వేసే అవకాశం ఇవ్వకుండా!

~~~~~
‘అందరూ గతంలోకి వెళ్ళొస్తున్నారు, తము వెళ్ళకపోతే తెలంగాణా ఉద్యమం పట్ల తమకు చిత్తశుద్ది లేదంటారు. తెలంగాణాకేం తక్కువా!?’ అనుకొని, కేసీఆర్ కూడా టైం మెషీన్ ఎక్కేసాడు.

గతంలోకి ప్రయాణించి హైదరాబాద్ నిజాం దగ్గరికెళ్ళి పోయాడు. కేసీఆర్ ని చూడగానే.... నిజాం, సంతోషంగా ఎదురొచ్చి కౌగలించుకున్నాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఆత్మీయుణ్ణి చూసినట్లు, ఆపకుండా కబుర్లు చెప్పాడు.

"కేసీఆర్! నిజంగా నువ్వే నాకు అప్తుడవయ్యా! ‘మంచైనా, చెడైనా మా నిజాం మాకు గొప్ప’ అని తెగేసి చెప్పావు. నా సొమ్ము తిన్న ఒవైసీ కుటుంబం కూడా చెప్పలేదు. బ్రతికి ఉండగా తెలంగాణా సాయుధ పోరాటం అంటూ, నన్ను నానా చీకాకులు పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళలో పీవీ నరసింహారావూ ఒకడు. అతణ్ణేమన్నా కిమ్మనవు గానీ, నా మీద ఈగ వాలనివ్వవు కదా! ఓప్రక్క ‘తెలంగాణా విమోచన దినోత్సవం గొప్పగా నిర్వహిచాలంటావ్!’ మరో ప్రక్క ‘నిజాం జిందాబాద్’ అంటావ్. నీ రెండు నాల్కల ధోరణి అంటే నాకెంతో ఇష్టమో! తిట్టటం నీ పేటెంట్ హక్కు చేసుకున్నావు.

ఎదుటి వాళ్ళు చీదరపడి ‘ఛీ! వీళ్ళతో మనకెందుకు? ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండటమే మేలు. విడిపోదాం’ అనుకునేంతగా పరిస్థితులు కల్పిస్తావు. నీలాంటి వాళ్ళు నాకు అప్పట్లో దొరికి ఉంటే, హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో కలిసే ఉండేది కాదు. మన హైదరాబాద్ రాష్ట్రంలో ఎంచక్కా మధ్య పాకిస్తాన్ పేరుతో ఉండేవాళ్ళం. ప్చ్, ఏం చేస్తాం!? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం!" అంటూ ప్రేమగా హత్తుకున్నాడు.

పిచ్చి సన్నాసి! నిజంగ వీణ్ణీ పొగిడాననుకుంటున్నాడు. ఏదో ముస్లింల మద్దతు ఉంటుందని అన్నాను గానీ!"... అనుకున్నాడు మనస్సులో కేసీఆర్! అంతలోనే అతడి ద్వంద్వ ప్రవృత్తి అతణ్ణి హెచ్చరించింది.

దాంతో, కేసీఆర్ కి గుండెలు ఉప్పొంగి పోయాయి. నిజాంకి తానే నిలువెత్తు ప్రతినిధిని అనుకున్నాడు. "ఇక నుండీ తెలంగాణాలో సీమాంధ్రుల్నే కాదు, నిజాం భక్తుల్ని తప్ప ఎవ్వర్నీ తిరగనివ్వ కూడదు" అని ధృఢంగా నిశ్చయించుకుని, నిజాం దగ్గర సెలవు పుచ్చుకొని వెనక్కొచ్చాడు.
~~~~~~
ఇందరు తము తయారు చేసిన టైం మెషీన్ ఎక్కి గతంలోకి వెళ్ళి వస్తున్నారు. "ఒకసారి తామూ వెళ్ళొస్తే...?" అనుకున్నారు అంబానీ సోదరులు. ‘వొద్దులే బిజినెస్ దండగా’ అని కాస్సేపు ఊగిసలాడినా... "ఎప్పుడూ వ్యాపారమేనా? కాస్సేపు స్వంత జీవితం ఉండొద్దూ! వెళ్ళి నాన్న గారిని చూసి రండి" అని, తల్లి కోకిలా బెన్ కౌన్సిల్ చేయటంతో, సరేనని... ముఖేష్ అనిల్ అంబానీలిద్దరూ టైం మెషీన్ ఎక్కారు.

గతంలో కెళ్ళి తండ్రిని కలుసుకున్నారు. అన్నతమ్ములిద్దర్నీ చూడగానే ధీరూభాయ్ అంబానీకి మండిపోయింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆపకుండా ఉపన్యసించినట్లు, అరగంట పాటు... తిట్టిన తిట్టు తిట్టకుండా కొడుకులిద్దర్నీ తిట్టిపోసాడు.

తిట్లవాన తగ్గాక, అలుపు తీర్చుకుంటూ... "వెర్రి నాగన్నల్లారా! నేను అష్టకష్టాలు పడి, వెండి స్మగ్లింగులూ గట్రా చేసి, లైసన్స్ రాజ్ కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి, విస్తరించి... మీ చేతుల్లో పెడితే.... దాన్ని మరింత మరింతగా అభివృద్ది చేయటం మీద దృష్టి పెట్టాలి గానీ, మీలో మీరు తన్నుకొని లొసుగులు బయటపెట్టు కుంటార్రా? ఆస్థుల విలువలు పెరిగి వ్యాపార సామ్రాజ్యం బలపడినట్లు కన్పిస్తోంది గానీ... నా హయాంతో పోలిస్తే, మీరు చేసిన అభివృద్ధి నిష్పత్తి తక్కువ తెలుసా?" అన్నాడు కోపంగా!

సోదరులిద్దరూ సోది ముఖం పెట్టారు. మెల్లిగా మాటలు కూడదీసుకుంటూ, "ఇక బుద్దిగా ఉంటాం" అన్నారు.

"ఏడిసారు పొండి!" అన్నాడు ధీరూభాయ్!

‘ఏదో ఒకటి! పొమ్మన్నాడు. అంతే చాలు" అనుకుంటూ... ఒక్కదుటున వచ్చి టైం మెషీన్ లో పడ్డారు అన్నదమ్ములిద్దరూ!

~~~~~~~~~
ఇది సైన్స్ ఫిక్షన్ లాగా రాజకీయ ఫిక్షన్ కథ! ఇందులో ఈకలు పీకటం, లాజిక్కిలు అడగటం చెయ్యకండేం! అడిగారను కోండి! ఏముంది? మిమ్మల్ని కూడా టైం మెషీన్ ఎక్కించేసి ‘ఏదో కాలానికి, ఎక్కడికో’ పంపించేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

మరోసారి తీరికగా టైం మెషీన్ దొరికినప్పుడు మరికొన్ని....


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~

4 comments:

Hi,
Visit my Blog : http://gsystime.blogspot.com/

This is having spiritual and general society information.
The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
I written from 2009 December onwards.
I wtitten in Telugu and English languages (In English few things are wrote).
Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
the title as symbol of '*').
Main Topics are : (Read in order to better understand)
Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
Eng - (Jan, 2010) ' * How Brain Works'
Eng - (Jan, 2010) ' * Where Dream World?'
Eng - (Jan, 2010) ' * Why the Food?'
Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
chendavaa shwaasa neelone kadaa!" '
Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
"Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
These two caption's so many written along with these.
* * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
lines : for Record).

As soon as possible please give reply to my mail, about my Blog.

Regards,
Nagaraju G
Contact : +91 9741005713 for any queries

mee blog gurinchi


http://edisatyam.blogspot.com/2010/08/aka.html

అమ్మా నమస్తే,
మీ బ్లాగుల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఇన్నాళ్ళకి నాక్కూడా చాలా సంఘటనలు ఒకదానితో ఒకటి సంబంధం వున్నట్లు కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్లు- ఆంధ్రజ్యోతి, ఈనాడు చదవండి- జగన్ను విమర్శించడం కనా అధిష్టానం ఓ పెద్ద పవర్‌ సెంటర్‌ అని భయపెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. జగన్‌ మీద ముప్పేట దాడి జరిగినా బెదరుకుండా ముందుకే వెళ్ళగలగడం-సోనియా గురించిన కొన్ని రహస్యాలని బహిర్గతం చేయగలను అన్న నమ్మకం అనిపిస్తోంది. ఇవాళ జరిగిన ఓ సంఘటనలో "రాజీవ్‌ ని చంపింది జగనా?" అన్నాడుట సబ్బం హరి. సోనియాకి రాజీవ్‌ హత్యతో ఏమాత్రం సంబధం వున్నా ఇప్పుడూ వెనకడుగువేయబోతోంది.
మీనుండి ఫిక్షన్‌ కధలకన్నా సమకాలీన రాజకీయలపై మీ స్పందనని ఎదురుచూస్తాం :)

అజ్ఞాతలకు నెనర్లండి!

అజ్ఞాత గారు: పరిశీలన విషయాలపై అవగాహన కలిగిస్తుందండి. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu