ఆదివారం ఆరామంగా చదువుకొనేందుకు ఓ చిన్న టపా.
రెండు విషయాలు ఈ రోజు మీదృష్టికి తేవాలనుకుంటున్నాను.
మొదటిది : క్రింది ఫోటో చూడండి.
ఇందులో బొమ్మ ఒంటిమీద చిత్రించుకున్న వారందరూ ఎక్కడెక్కడో ఉన్నారనుకొండి. వాళ్ళ ఒంటిమీద ఉన్న బొమ్మ ఏమిటో మనకి ఎప్పటికీ అర్ధం కాదు. అందరూ ఒకచోట, అదీ ఓ క్రమపద్దతిలో నిలబడినప్పుడు మాత్రమే, వారిమీద చిత్రించిన బొమ్మ ఏమిటో చూపరులకి అర్ధమౌతుంది. లేనట్లయితే చిత్రకారుడికి మాత్రమే ఆ బొమ్మ ఏమిటో తెలిసి ఉంటుంది. చివరికి ఆ బొమ్మలోని భాగాలు తమ ఒంటి మీద చిత్రింపజేసి కొన్నవారికి కూడా, ఆ బొమ్మ ఎందులోని భాగమో, మొత్తం బొమ్మ ఏమిటో తెలిసే అవకాశం కొంత మాత్రమే. మన మీద జరిగిన, జరుగుతున్న సుదీర్ఘకుట్ర ఇటువంటిదే.
ఇక రెండవ విషయం :
ఇది చర్చించే ముందు ఓ పోలిక చెబుతాను. ఉదాహరణకి మన కాలనీలో మెయిన్ రోడ్డు ఉందనుకొండి. చూడటానికి రోడ్డు బాగానే ఉంది. కానీ రోడ్డుపై ప్రయాణిస్తున్నావారు ప్రమాదాలకి గురవుతున్నారు. అంతేకాదు, చిత్రంగా అందరూ కొన్ని నిర్ధిష్టమైన ప్రదేశాల్లోనే ప్రమాదాలకి గురవుతున్నారు. రోడ్డు నిర్మాణం లోనే పైకి కనబడని ఎత్తుపల్లాలు ఉన్నాయెమో తెలియదు. మొత్తానికి రోజూ ఎవరో ఒకరు ప్రమాదానికి గురవుతున్నారు. రోజూ కాళ్ళు, చేతుల ఎముకలు విరగొట్టుకుంటూనే ఉన్నారు. ఓ రోజు మన పిల్లాడు సైకిలు తొక్కుతూ రోడ్డు మీద జారిపడి మోకాలిచిప్ప పగలగొట్టుకున్నాడు. అందరూ గుమిగూడారు. కొందరు పిల్లాణ్ణి లేవదీసారు. మరికొందరు సైకిలు సైతం లేపారు. కారుతున్న రక్తం తుడిచి కట్టుకట్టారు. కబురు తెలిసి మనం పరిగెత్తుకెళ్ళాం. అప్పటికే అక్కడ కాలనీ వాళ్ళంతా చేరి చర్చిస్తున్నారు.
ఒకరన్నారు :
ఈరోడ్దు మీద ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు పడిపోతూనే ఉన్నారు. ఎప్పుడూ ఒకే చోటులో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇంకొకరు :
రోడ్డు నాసిగా వేసి ఉండవచ్చు గదా!
మరొకరు:
ఎవరా కాంట్రాక్టరు. హెచ్చరిక చేద్దాం. ఇలా నాసిరోడ్డు మరోసారి వెయ్యకుండా చూద్దాం.
ఇంకొకరు:
అదీ అయ్యింది. ఈసారి అందరం జాగ్రత్త తీసుకొని మరీ, రోడ్డు వేస్తున్నప్పుడు నాణ్యత ఉండేలా జాగ్రత్త తీసికున్నాం. అయినా మళ్ళీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
మరొకరు:
ఈ పిల్లలు కూడా నిర్లక్ష్యంగా సైకిలు తొక్కి ఉంటారు లేదా సైకిలు తొక్కుతూ విన్యాసాలు చేసారేమో. పడిపోయి దెబ్బలు తాటించుకున్నారు.
ఇంకొకరు :
పిల్లలే కాదు. పెద్దలు కూడా పడుతూనే ఉన్నారు గదా! పెద్దవాళ్ళయితే నిర్లక్ష్యంగానో, విన్యాసాలు చేస్తునో ప్రయాణించరు గదా?
మరొకరు:
రోడ్డు నిర్మాణంలోనే మతలబు ఉందనుకుంటా. ఈ రోడ్డు నిర్మాణం వెనుకనున్న రహస్యం ఏమిటై ఉంటుంది?
తక్కినవాళ్ళు:
అవును, ఈ రోడ్డు నిర్మాణంలోనే మతలబు ఉన్నది. దీని సంగతి కనిపెట్టాలి!
అన్నారు ముక్తకంఠంతో అందరూ!
ఇదంతా జరుగుతుండగా చుట్టు ముగిన జనంలోంచి హఠాత్తుగా కొందరు రంగనాయకమ్మలూ, అరుంధతీ రాయిలూ, ఎర్ర చొక్కాలు, కాషాయ చొక్కాలు, ఖద్దరు చొక్కాల వారు పెద్దగొంతుతో అరవటం మొదలుపెడతారు. వాళ్ళ వాదన ఇలా ఉంటుంది.
"ఇదంతా అనవసర చర్చ. ఫాల్ట్ రోడ్డులోనూ లేదు. గోతుల్లోనూ లేదు. సైకిల్ తొక్కడం లోనూ లేదు. అసలు రోడ్డు ఏ ప్రిన్సిపుల్ మీద వేస్తారో తెలుసా? నిర్ధిష్ట నిష్పత్తిలో సిమెంట్, ఇసుకా, కంకరా కలిపి రోడ్డువేస్తారు. రోడ్డు వేయడం అన్న ప్రక్రియ ఫలానా ‘XYZ’ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సైకిలు ‘రెండు చక్రాలు, వాటికి కలిపే గొలుసు’ సిద్దాంతం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ సిద్ధాంతాలు ‘XYZ’ దేశాల్లో విజయవంతం అయ్యాయి. కావాలంటే ఫలానా వారు వ్రాసిన ఫలానా పుస్తకం చదివి తెలుసుకొండి.”
ఇలా గట్టిగా గావుకేకలు పెడతారు. అంతలో గబాలున మీడియా వాళ్ళొచ్చి ఈ రంగనాయకమ్మలూ, అరుంధతమ్మలు, ఎర్రచొక్కాలూ, కాషాయ చొక్కాలూ, ఖద్దరు చొక్కాల వారి మీద ఫ్లడ్ లైట్ వేసి, మైకులు పెడతారు. ఆ హడావుడికి మనకళ్ళు జిగేలుమంటాయి. మనగొంతు మనకే వినబడదు. వాళ్ళ అరుపులు మాత్రం మన చెవుల్లో మార్మోగిపోతాయి. అలా మీడియా సమకూర్చిన ఫ్లడ్ లైట్లు, మైకులూ చేతబూని ఈ అతిమేధావులు మనల్ని మన ’వాస్తవిక యదార్ధ జీవితపు అనుభవం’ కంటే – ఎవరో అతిమేధావులు వ్రాసిన పుస్తకాల్ని, అందులోని సిద్దాంతపు వ్రాతల్ని నమ్మమంటారు. ఎటూ ఆయా పుస్తకరచయితలు వీళ్ళలాంటివారే. ఈవిధంగా మన అనుభవం అనే ’మన చేతిలోని నల్లమేక’, మేక కాదు, ఈ అతిమేధావులైన పుస్తక రచయితలనబడే నలుగురు దొంగలు వ్రాసిన సిద్దాంత రచనలైన నల్లకుక్కే నిజం, నమ్మండి అంటారు. నమ్మే వరకూ గోలపెడతారు. నమ్మకపోతే నలుగురు అతిమేధావులకి మరో నలభైమంది తోడొస్తారు. అప్పటికీ నమ్మకపోతే మనల్ని అక్కణ్ణుండి తరమగొడతారు.
వెరసి మన పిల్లలు పడి దెబ్బలు తగిలించుకోవడానికి కారణమైన రోడ్డు విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకేదో పనికిమాలిన రోడ్డు నిర్మాణం, సైకిలు పనితీరు ప్రిన్సిపల్సూ గురించి రాద్దాంతాలు మొదలౌతాయి. మనం నోరు మూసుకొని ఇంటికెళ్ళిపోతాం. మర్నాడు మరో పెద్దాయన పడతాడు. మళ్ళీ టించరూ, దూది తీసికొని కట్టు కట్టించుకోవటం యధాతధం!
ఎప్పుడు మనం ఆరోడ్డు నిర్మాణం గురించి ఆరాతీయబోయినా, అక్కడ పడి మన బతుకులు అతుకుల మయం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినా, అప్పుడు అర్జంటుగా ఈ అతిమేధావులు బయటికొస్తారు. వాళ్ళ వితండవాదాలతో చర్చని ప్రక్కదారి పట్టించి అసలు నిజం బయటకు రాకుండా ’గోతులు తీస్తున్న పెద్దమనుష్యులకు’ ఈవిధంగా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి సహాయంగా ఆ పెద్దమనుషులు వీళ్ళకి ఫ్లడ్ లైటూ, మైకూ అందిస్తారు. వెనక నుండి పైకమూ జమచేస్తారు.
కాబట్టే ఈ రంగనాయకమ్మలూ, అరుంధతమ్మలూ, అన్ని రంగుల చొక్కాల [ఎర్ర,కాపాయ,…..] వాళ్ళు తమ వితండవాదంతో ఎంత వైషమ్యాన్ని, విద్వేషాన్ని ప్రజల నుండి మూటగట్టుకున్నా బెదరరు, చెదరరు. ఇలాంటి వారు 1980 ల్లో చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాంటి వారు అంటే ’గోతుల తీసే పెద్దమనుషులకు’ మద్దతుదారులు దేశమంతటా ఉన్నారు.
అలాంటి వారే పైన ప్రచురించిన ఫోటోలోని ఒంటిపైన రంగుల బొమ్మలోని భాగాలని చిత్రింపజేసికొన్న వారన్నమాట.
ఈ అవాంతరాలని దాటి, ఎప్పుడైతే మనం మన కాలనీ రోడ్డు రహస్యాన్ని ఛేదించగలుగుతామో, తప్పు మన పిల్లల సైక్లింగ్ లోనూ, రోడ్డు నాణ్యతలోనూ లేదని, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటామో – అప్పుడు రోడ్డు మీద కనబడని ఎత్తుపల్లాల రహస్యాన్ని, కనరాని గోతులు తీస్తున్నవారి అస్థిత్వాన్ని కనిపెట్టగలుగుతాం.
మన భారతీయ సంస్కృతి రోడ్దు లాంటిదైతే, మన సైక్లింగ్ మన సంస్కృతిపట్ల మనకు గల నిబద్దతలాంటిది.
నిజం చెప్పాలంటే ఈ రంగనాయకమ్మలూ, అరుంధతమ్మలూ, అన్నిరంగుచొక్కాల వాళ్ళు కుట్రదారుల మద్దతుదారులే. వీరు భగవద్గీతలో చెప్పిన అసురీ స్వభావులు, తామసులు. ఆ అసురీ, తామస లక్షణాలనే కుట్రదారులు ప్రోత్సహిస్తున్నారు. ఇవే మనకి కనబడని ఎత్తుపల్లాలు, గోతులు.
ఈ విషయం గీత మనకి స్పష్టంగా చెబుతుంది.
శ్లోకం:
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృతా
సర్వార్ధాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్ధ! తామసీ
భావం:
అధర్మాన్ని ధర్మంగాను, అన్ని విషయాలనూ అపసవ్యంగాను గ్రహించేది తామస బుద్ధి.
శ్లోకం:
అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్
అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్
భావం:
వీళ్ళు[అసురీ స్వభావులు] ఈ ప్రపంచమంతా మిధ్య – అస్ధిరం అంటారు. దేవుడనే వాడంటూ యెవడూ లేడనీ – స్త్రీ పురుష సంయోగం వలననే సృష్టి అంతా జరుగుతోందనీ – కామంవినా మరే కారణమూ లేదనీ వాదిస్తారు.
శ్లోకం:
ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మా నోల్ప బుద్దయః
ప్రభవ స్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః
భావం:
అల్పబుద్ధులైన ఈ అసురీ స్వభావులు – ప్రపంచానికి నిష్ప్రయోజకాలూ, హానికరాలూ అయిన పనుల్ని చేస్తూంటారు.
శ్లోకం:
చిన్తామపరమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః
కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాః
శ్లోకం:
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః
ఈహంతే కామభోగార్ధ మన్యాయే నార్ధసంచయాన్
భావం:
కామక్రోధవశులై, విషయవాంఛలే పురుషార్ధంగా యెంచి, వాటి అనుభవంకోసమే ఆక్రమ ధనార్జన చేస్తూ, జీవితాంతం నిత్యమూ అశాపాశాలలో చిక్కుకొని ఉంటారు.
గమనించి చూడండి సర్వత్రా ప్రోత్సహింపబడుతోంది తామస లక్షణాలే! తామస గుణం, తామస యఙ్ఞం, తామస దానం, తామస త్యాగం, తామస ఙ్ఞానం, తామస కర్మ[పని], తామస బుద్ది, తామస ధృతి [పట్టుదల], తామస సుఖం, తామస కర్తృత్వం, తామస అహారం – వీటిని గురించిన పూర్తివివరాలు గుణత్రయ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగయోగం, దైవాసురసంపద్విభాగయోగం, మోక్ష సన్యాస యోగంలో ఉన్నాయి. నేను ఒకటి రెండు శ్లోకాలే ఉటంకించాను.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు! .
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
9 comments:
baagumdamdi mee tapaa.konasaagimchamdi.
అమ్మా! అద్భుతం గా చెప్పారు.
అమ్మా! చాలా బాగా చెప్పారు.
తర్క శాస్త్రం సహాయం తోనో, ఇంకో పద్ధతిలోనో ఇలాంటి విషయాలు చర్చిస్తే జనం అనాసక్తి మూలాన వినకపోయే అవకాశం ఉంది. మీరు చెప్పిన పధ్ధతి చాలా చక్కగా ఉంది.
This is your best post ever! I am tempted to call this THE best post ever on Telugu Blogs!
best is yet to come for a best person malak. if u decide this as best then best will never come.
చాలా బాగా మీ దృక్పధాన్ని వివరించారు.
@ravigaaru,
ఒక శిఖరాన్ని చేరుకున్నాక మరో శిఖరాధిరోహణ చెయ్యాలి. ఇప్పుడు ఉన్నది ఉత్తమమనుకుంటే అప్పుడు రేపటికి మరో ఉత్తమం వస్తుంది. నైలు నది పొడవైనదని గంగా నదిని అపహాస్యం చెయ్యలేం కదా
good one
best post which makes everyone to think.........
prati okkaru anubhavam kaakunda pustakaalanu enduku reference chestaaro..............
Post a Comment