అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, చౌదరి చరణ్ సింగ్ ఉపప్రధానిగా అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీకి సిద్దాంతకర్తగా, మార్గదర్శిగా జయప్రకాష్ నారాయణ్ నిలిచాడు. మీడియా ఆయన్ని లోక్ నాయక్ గా, ఎన్నో ఆదర్శభావాలున్న వ్యక్తిగా అభివర్ణించింది. ఆయన గురించి నాకు తెలిసిందల్లా జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకూ ఈయన్ని బాగా ఉపయోగించుకున్నారనీ, అందుకే మీడియా ఆయనకి బాగా ప్రచారం ఇచ్చిందనీ, జనతా ప్రభుత్వం కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఏర్పడిన స్వల్పవ్యవధిలోనే జయప్రకాష్ నారాయణ్ మరణించారని మాత్రమే.

ఇలాంటి విషయాల్లో కుట్రదారుల స్ట్రాటజీ కొంత క్లిష్టంగా ఉంటుంది. ప్రజల్లో ఒక తరంగం [wave] సృష్టించాలంటే నిజాయితీ, నిజమైన గాఢమైన, భావాలు గల వ్యక్తులు కావాలి. ఎందుకంటే వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు కాబట్టి. భావప్రకంపనలు గల నాయకులే ప్రజల్ని స్పందింపచేయగలరు కాబట్టి. అందుచేత, ఆ పరిస్థితికి తగిన భావాలు, నిజాయితీ గల వ్యక్తుల్ని నాయకులుగా చేసి, వారి వెనుక కుట్రదారులూ, వారి మద్దతుదారులూ చేరతారు. ఈ నాయకులు పాపం నిజంగానే తమ ఆదర్శాలూ, భావాలూ వాస్తవరూపం దాల్చబోతున్నాయనుకొని ఎంతో శ్రమిస్తారు. తీరా పబ్బం గడిచాక ఈ నాయకుల్ని పక్కకు నెట్టి కుట్రదారుల మద్దతుదారులు చక్రం తిప్పడం మొదలెడతారు. ఇలాంటి స్ట్రాటజీ జయప్రకాష్ నారయణ్ మీద ప్రయోగింపబడిందేమో తెలియదు గానీ జనతా ప్రభుత్వం ఏర్పడిన కొద్దినెలల కాలంలోనే జయప్రకాష్ నారాయణ్ అనారోగ్యంతో మరణించాడు.

రెండేళ్ళ పైచిలుకు కాలం అధికారంతో ఉండి జనతా ప్రభుత్వం భారతీయులకీ, దేశానికీ ఏమి మంచి చేసిందో తెలియదు గాని, నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వ్యక్తిగత విషయం మాత్రం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. హఠాత్తుగా ఓ రోజు ఓ విదేశీ ’ఇన్వెస్టిగేటివ్’ విలేఖరి ప్రధాని మురార్జీ దేశాయ్ ని “మీరు ప్రతీరోజూ మీ మూత్రం తాగుతారట కదా!” అని అడిగాడు. దాన్ని నిర్ధ్వంద్వంగా అంగీకరిస్తూ మొరార్జీదేశాయ్ అది తనకు చాలా కాలం నుండీ ఉన్న అలవాటనీ, దాన్ని తను ’జీవజల పానం’ అని పిలుచుకుంటాననీ, ఆ కారణంగానే తను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాననీ చెప్పాడు.

ఇక చూస్కోండీ, ఇంటా బయటా [అంటే స్వదేశీ మరియు విదేశీ మీడియా] ఒకటే రచ్చ. దాని మీద జోకులూ, కథనాలు. ఎంతో నీచంగా, జుగుప్సాకరంగా!

ఇది సహజంగానే దేశభక్తిపరులకి అవమానకరంగా, కుములు బాటుగా అన్పించేది. దేశప్రధానిని వ్యక్తిగా చూడటం సాధ్యం కాదు గదా! అదీగాక మీడియా ‘మొరార్జీ దేశాయ్’ ని అనటం లేదు, భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ ని అంటోంది. ప్రపంచదేశాలన్నీ, వార్త సంస్థలన్నీ, ప్రపంచ ప్రజలంతా ఇండియాని చూసి ఎగతాళి చేస్తున్నారనీ, విరగబడి నవ్వుతున్నారనీ, భారతీయులు అవమాన పడేలా ప్రచారం ఉండేది. అప్పటికే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ కళ్ళుమూసాడు.

ఈ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మీద కొన్ని రాజకీయ అభియోగాలు, మరికొన్ని పెట్టీకేసులు [ఎక్కడో మారుమూల మణిపూర్ లో కోడిపిల్లను దొంగిలించిందన్న నేరాలు నిరూపణ దశకు చేరుకోలేక పోయాయి] మోపి, అరెస్టు చేసి, సంకెళ్ళు వేసి మరీ తీహార్ జైలుకు తీసికెళ్ళింది.

కారణాలు ఏమయినా గానీ, ఇందిరాగాంధీ దొంగో, నేరస్తురాలో కాదు. క్రిమినల్ కాదు. ఇప్పుడైతే టెర్రరిస్టులూ, మావోయిస్టులూ, ఇతర నేరస్తులు సైతం జైల్లో వసతుల్నీ, తమని డీల్ చేయటంలో గౌరవాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితి అప్పడూ ఉండేది. అలాంటిది ఒక రాజకీయ నాయకురాలిని, కేడీ గాళ్ళకు వేసినట్లు చేతులకి సంకెళ్ళు వేసి జైలుకు తీసికెళ్ళారు.

ప్రధాని కావాలని ఆశపడి, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధి వైపు మొగ్గినందున భంగపడి, 1966 - 67 లలో ఇందిరాగాంధీ కాబినెట్లో ఉపప్రధానిగా పనిచేసిన మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్ ప్రభృతులు అంతగా ఆవిడని అవమానించి పగతీర్చుకున్నారు. నిజానికి అది ఆవిడమీద వారి agoni. ఇంకా చెప్పాలంటే అది కుట్రదారులైన సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిషు ఇంకా అనువంశిక నకిలీ కణికులకీ, అప్పటికే వ్యాపారవేత్తలుగా మారిన మాజీ రాజులు, రాణులు, ఇతర బడావ్యాపారులకీ, [వీరంతా కుట్రదారులకు మద్దతుదారులు.] ఇందిరాగాంధీ మీద ఉన్న పగా ప్రతీకారేచ్ఛ. ఆవిడపట్ల కుట్రదారులకున్న ద్వేషమే అది.

ఇందిరాగాంధీ మీద కుట్రదారులకి ఉన్న విద్వేషం ఎంతటి దంటే – 1971 పాకిస్తాన్ యుద్దానంతరం ఇందిరాగాంధీ అమెరికా పర్యటనకు వెళ్ళింది. నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ని కలవటానికి శ్వేత సౌధానికి వెళ్ళిన ఇందిరాగాంధీని ఇచ్చిన అపాయింట్ మెంట్ ను దాటి పదిహేను నిముషాలు వేచి ఉండేలా చేశారు. 1971 పాకిస్తాన్ పై యుద్దవిజయానంతరం అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇందిరా గాంధీని, ఏదో సాయమర్ధించడానికి వచ్చిన ఓ పేద దేశపు ప్రధానిని డీల్ చేసినట్లు చేయాలని శ్వేత సౌధపు ప్రయత్నం. భారతీయుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఆవిడ నిక్సన్ తో కుశల ప్రశ్నలు అడిగి మర్యాదాపూర్వకంగా కలవడానికి వచ్చానని అన్నది. ఆ క్రోధంతో ఆతడు ఆవిడని మంత్రగత్తె [witch] అన్నాడు. అంత విద్వేషం ఎంతకి తెగబడిందంటే ఇందిరాగాంధీ చేతులకి సంకెళ్ళు వేసి తీహార్ జైలుకి తీసికెళ్ళేంత వరకూ. అలాంటి శ్వేతసౌధానికి ఈనాటి సోనియా గాంధీ, ఆమె చేతిలోని రిమోట్ బొమ్మ మన్మోహన్ సింగూ ఎంత సాగిల పడుతున్నారో అందరికీ తెలిసిందే కదా!

అయితే – రాజకీయనాయకులైన మొరార్జీదేశాయ్, తదితరులకి కనీసపాటి విలువలు లేకపోయినా, కనీస మర్యాదా పద్దతుల్ని కావాలనే మరచిపోయినా, సామాన్య భారతీయులు మాత్రం ఈ నైచ్యాన్ని భరించలేకపోయారు. అలాంటి అవమానం ఇందిరాగాంధీకి కాక మరో నాయకుడికి లేదా నాయకురాలికి జరిగినా ప్రజలలాగే స్పందించి ఉండేవారు. వీధి కొళాయి దగ్గరి ఘర్షణల్లా, పార్లమెంట్ స్థాయి రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు ఉండటాన్ని అప్పటి తరం ఓటర్లు ఓర్చలేకపోయారు. వారి లోకఙ్ఞానానికి [common sense] సంబంధించిన స్పందన ఇలా ఉండింది. “ఎమర్జన్సీ కాలంలో ఆవిడ ఏ పొరపాట్లయినా చేసి ఉండొచ్చు గాక! కానీ ఇదిమాత్రం ఆవిడ పట్ల ప్రవర్తించాల్సిన తీరుకాదు. ఆమె భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కూతురు. వారి కుటుంబం తమ విలువైన ఆస్థుల్ని దేశ స్వాతంత్ర సమరం కోసం త్యాగం చేసి, వితరణగా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తమ ’ఆనంద్ భవన్’ని ఇచ్చేసిన త్యాగశీలత వారిది. భారతదేశపు అభివృద్ది కోసం, అంతర్జాతీయ వేదిక మీద దేశ గౌరవం కోసం ఎంతో శ్రమించిన వారు నెహ్రు, ఇందిరాగాంధీ. ఆవిడ మన కోసం, పేదల కోసం ఎన్నో మంచిపనులు చేసింది. అలాంటి వ్యక్తిపట్ల ఇంత అమర్యాద సరైంది కాదు. మొరార్జీ దేశాయ్, అతడి అనుచరులూ దాదాపు ఆవిడని, కౌరవసభలో దుర్యోధనాదులు ద్రౌపదీ దేవిని అవమానించినంతగా అవమానించారు.” [ఇక్కడ ఆవిడ గొప్పదనం చెప్పాలని నా ఉద్దేశం కాదు, ఆవిడవి ఎన్నో తప్పులు ఉండవచ్చు, ఒప్పులు ఉండవచ్చు, కాని ఆవిడ ఒంటరిగా చేసిన పోరాటాన్ని చెప్పటమే నా ఉద్దేశం. అది కుట్ర మీద పోరాటం కాబట్టి. ఆవిడ పుట్టుకతో యోధురాలు, Born Fighter.]

ఈ రకపు స్పందన దేశమంతా పాకింది. 2+ సంవత్సరాల్లోనే జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఉపప్రధాని చౌధురి చరణ్ సింగ్ ప్రధాని కుర్చీ ఆశించడంతో మొరార్జీ దేశాయ్ పదవీచ్యుతుడయ్యాడు. కొద్ది రోజుల్లోనే చరణ్ సింగ్ ప్రభుత్వమూ కూలిపోయింది. ప్రధానిగా ఒక్కరోజు కూడా పార్లమెంట్ కు హాజరుకాలేని ప్రధానిగా చౌధురి చరణ్ సింగ్ [ఇప్పటి నాయకుడు అజిత్ సింగ్ తండ్రి] రికార్డుల కెక్కాడు. తదుపరి 1980 లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి ప్రజాబలం మళ్ళీ సమకూడింది. జనతా ప్రభుత్వపు హయాంలో, మొరార్జీ దేశాయ్ ప్రభృతులు ఆవిడని అవమానించినా ప్రజలు మాత్రం ఆవిడనే తిరిగి ఆహ్వానించినట్లయ్యింది. తిరిగి ప్రధానిగా సౌత్ బ్లాక్ లోకి ప్రవేశించిన ఇందిరాగాంధీ, ఎమర్జన్సీ ప్రకటించే ముందుటి కంటే పెరిగిన అవగాహనతో, మరింత తీవ్రంగానూ, చురుకుగానూ కుట్రదారులని అన్వేషించే పనిలో పడింది. ఎమర్జన్సీ కాలంలో తానెదుర్కున్న అంతర్జాతీయ ఒత్తిడి, కుట్రదారుల బలం పట్ల తనకున్న అంచనాలని మరింత సవరించుకొనేలా చేసింది. రాష్ట్రాలలో కూడా తనకి నమ్మకమయిన వాళ్ళను సి.ఎం. పదవిలో కుర్చోబెట్టసాగింది. కాని అది కాస్తా, ఈరోజు నమ్మకం అనిపించిన వాడు మరునెలకు అపనమ్మకం కలిగే విధంగా పరిస్థితి తయారయ్యింది. దాంతో ఆవిడ వాళ్ళను మార్చి మళ్ళీ ఇంకొకరు, ఇలా మ్యూజికల్ ఛైర్ లాగా ముఖ్యమంత్రి పదవి తయారయ్యింది. ఇంత జరిగినా ఎవరూ కూడా అప్పటికే ఇంటిలో స్థిరపడిన ట్రాన్స్ ప్లాంటర్ సోనియాగాంధీని అనుమానించలేదు. సోనియాగాంధీ నేర్పరితనపు నటనా చాతుర్యం ఇందిరాగాంధీకి కోడలు కాదు కూతురన్నంత దగ్గర చేసింది. ఇందిరాగాంధీ జీవితచరిత్ర వ్రాసిన రచయిత్రి [పేరు మరిచిపోయాను] ఈ విషయాన్ని తన రచనలో ఉటంకించింది. 1992 లో ఇండియా టుడే[తెలుగు] పక్షపత్రికలో దీనిపై సమీక్షా వ్యాసంలో ఈ సమాచారమంతా పొందుపరిచారు. రచయిత్రి మాటల ప్రకారం – ‘1977 నుండి 80 వరకూ జనతా ప్రభుత్వహయంలో ఇందిరాగాంధీ చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఆవిడ ఆర్ధిక సమస్యలతో సహా ఎన్నో సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని సైతం ఎదుర్కొంది. ఓసారి నన్ను 50,000/-Rs. చేబదులు[ఇంటి ఖర్చుల నిమిత్తం] అడిగింది’ అని వ్రాసింది. రచయిత్రి ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలు కూడాను.

అది చదివినప్పుడు, ’భారత దేశపు మాజీ ప్రధాని, దివంగత ప్రధాని నెహ్రు కుమార్తె, అత్యంత ధనికుడైన మోతీలాల్ మనువరాలు, తమ ’ఆనంద్ భవన్’ను కాంగ్రెసుకు విరాళంగా ఇవ్వగలిగిన ధనిక కుటుంబ వారసురాలు అయిన ఇందిరాగాంధీ ఇంత గడ్డుపరిస్థితిని, అందునా ఆర్ధిక దుస్థితిని అనుభవించిందా?’ అని ఆశ్చర్యపోయాను. నమ్మలేక పోయాను కూడా. గూఢచర్యంలో ఏదైనా సాధ్యమే అన్నది అప్పుడు గాకపోయినా తర్వాత పరిశీలనలో కొంత అర్ధమయ్యింది. పోటీ పత్రిక ’ఉదయం’ ఆర్ధిక మూలాలు దెబ్బతీసేందుకు ఈనాడు 1992 లో దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిందని మొన్నీ మధ్య మరో పత్రిక సాక్షిలో చదివినప్పుడు మరికొంత అర్ధమయ్యింది. శతృనాశనానికి ముందు వారి ఉత్సాహాన్ని, సంపదని నాశనం చేయాలని చెప్పే కణికుడి కూటనీతిని చదివాక బాగా అర్ధమయ్యింది.

ఇలాంటి క్లిష్టస్థితిలో అత్తగారికి మరింత చేరువైంది కోడలు సోనియా గాంధీ. ఈ కోడలికి కుట్రదారులతో ఎక్కడా ఏవిధమైన ప్రత్యక్ష సంబంధం లేదు. గడపదాటి బయటకు రాని ఇంటి కోడలిపై ఎలా అనుమానం వస్తుంది? ప్రతీ విషయంనుండీ, ప్రతీ సంఘటన నుండీ అడ్వాంటేజీని పొందగలిగేంత గ్రిప్ కుట్రదారులకీ, వారి గూఢచర్య నెట్ వర్కుకీ అప్పటికే సమకూడింది.

1980 లో తిరిగి అధికారంలోకి వచ్చాక, ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ ఓ రోజు ఫ్లయింగ్ క్లబ్ కి వెళ్ళి శిక్షణ విమానం కూలిన ప్రమాదంలో మరణించాడు. ఇది కన్నతల్లి ఇందిరాగాంధీకి భయంకరమైన ఎదురుదెబ్బ. అది సహజమైన యాదృచ్చిక ప్రమాదం కాదని తెలుసు. నిరూపించగలిగే అవకాశం లేదు. ఏ ఆధారం లేకుండా ఆరోపించి ప్రయోజనం ఏముంది? అందునా తన రాజకీయ వారసుడిగా సంజయ్ గాంధీని ఎంచుకున్న ఆవిడకి, అతని మరణం అశనిపాతమే. ఆరోజు ఉదయం సంజయ్ గాంధీ మరణవార్త అనంతరం, ఆసుపత్రికి, అతడి మృత దేహన్ని చూడటానికి ఇందిరాగాంధీ వెళ్ళింది. ‘మనిషి తొణక లేదనీ, వార్డులోకి ప్రవేశించే ద్వారం దగ్గర మాత్రమే ఆవిడ కాళ్ళు తడబడ్డాయనీ’ వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. పైకి దుఃఖాన్ని ప్రకటిస్తూ గుండెలు బాదుకొని ఏడ్చే స్థితిలో ఆ కన్న తల్లి లేదు. కడుపు కోతని అయినా బహిరంగంగా ప్రకటించి కుట్రదారుల ముందు ఓడిపోదలచని పోరాట యోధురాలు ఇందిరాగాంధీ. యుద్ధభూమిలో, ఎదుటి శతృవు ఆయుధం మననెంతగా బాధించినా, ఓర్చి పోరాటం సాగించటం ధీరలక్షణం. అంతమాత్రం చేత ఆప్తులను కోల్పోయిన దుఃఖం ఉండదా? ఆవిడ దుఃఖాన్నిపైకి ప్రదర్శించలేదన్న వార్తలు వ్రాసిన విలేఖరులే, ఒకవేళ ఆవిడ గనుక బాహాటంగా దుఃఖించి ఉంటే ఎన్ని వైనవైనాలుగా కథనాలు వ్రాసి ఉండే వారో!

ఈ ఎదురుదెబ్బతో ఆవిడ తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని తనకు మద్దతుగా రాజకీయాల్లోకి రమ్మన్నది. ఆ ప్రధాని పదవుల్లో బావుకునేందుకు ఏదో ఉందని, ఆ సంపదని కొడుక్కి కట్టబెట్టాలనీ ఆవిడ రాజీవ్ గాంధీని రాజకీయ ప్రవేశం చెయ్యమనలేదు. ఎందుకంటే ప్రధానిగా ఆవిడ అక్రమార్జన చేసి ఉంటే ఎమర్జన్సీ అనంతర జనతా ప్రభుత్వహయంలో మిత్రురాల్ని ఋణాలడగాల్సిన స్థితిలో ఉండదు. అంతేగాక కుట్ర గురించి తెలిసిన వ్యక్తి! ఎంత సంపద అయినా ప్రాణం కంటే విలువైనది కాదు కదా! రాజకీయాల్లో ఉన్నందున చిన్న కొడుకు ప్రమాదం రూపంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు, అదే ప్రమాదం తనకూ, తన పెద్ద కొడుక్కూ మాత్రం ఉండవా? అయినా ఆవిడ రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి పిలిచిందంటే అది నిశ్చయంగా తన స్వార్ధం కోసం కాదు, దేశం కోసం మాత్రమే. ఎందుకంటే – ఆవిడ, దేశం మీద జరుగుతున్న కుట్ర విషయంలో ఎవరినీ నమ్మే స్థితిలో గానీ, నమ్మగల స్థితిలో గానీ లేదు.

ఈ స్థితిలో రాజీవ్ గాంధీ తల్లి నిర్ణయానికి తలబగ్గే ముందు భార్యని సంప్రదించాడు. ఈవిషయం అతడి భార్య సోనియా గాంధీ స్వయంగా వివిధ ఇంటర్యూలలో, స్వీయ వ్రాతలలో ధృవీకరించింది. అయితే సోనియాగాంధీ రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ససేమిరా అంది, ఆడ బెబ్బులిలా పోరాడిందట.

మరి అలాంటి వ్యక్తి 1998 తర్వాత ఎందుకు రాజకీయాల్లోకి వచ్చిందో ఆమెకే తెలియాలి. 1980 నాటికి ఉన్న ప్రాణభయం[రాజకీయాల్లో భద్రత, ప్రశాంతత లేదన్నది ఆమె వాదన], 1991 లో నిజమై కనబడిన ప్రాణభయం, 1998 లో లేకుండా ఎలా పోయింది? అప్పటికి బాంబుదాడులు [1993 మార్చి నెలలో అప్పటి బొంబాయిలో వరుస బాంబులు పేలాయి] మరింత పెరిగాయి. ఆత్మాహుతి దాడులూ పెరిగాయి. మరి తనకీ, తన పుత్రునికీ రాజకీయాల్లోకి ప్రవేశించినందున ప్రాణభయం ఉండదన్న భరోసా ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎవరిచ్చారు?

అంతేకాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి విపరీత అక్రమార్జన చేస్తూ అందులో కేంద్ర కుర్చీవ్యక్తి అయిన కాంగ్రెస్ అధిష్టానానికి సూట్ కేసుల కొద్దీ డబ్బు దోచీ రోజువారీ రవాణా చేస్తున్నాడనీ, అందుకే ఎవరెంత గగ్గోలు పెట్టినా వై.ఎస్. మీద ఇసుమంత చర్య కూడా కేంద్రం తీసుకోవటం లేదని ప్రతిపక్ష పార్టీలూ, నాయకులు ప్రత్యక్షంగా బహిరంగంగా అరిచి గోల పెడుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నా, సరుకుల దొంగ రవాణా అవుతున్నా ప్రభుత్వం వ్యూహాత్మక ఉదాసీనత చూపుతుంది అంటేనే వారి వాటా వారికి అందుతున్నదని అర్ధం. ఇక సెజ్ ల పేరుతో రైతుల పొలాలు లాక్కొని కార్పోరేట్ కంపెనీలకి కట్టబెడుతున్న తీరు చూసి మనం నోరెళ్ళ బెడుతున్నదే. నోటుకి ఓటు అంటూ కోట్లాది రూపాయలు పెట్టి ఎం.పీ.లని కొని 2008, జులై22 న విశ్వాస పరీక్ష నెగ్గిన యు.పి.ఏ. ప్రభుత్వాన్ని టీ.వీ.లో ప్రత్యక్ష ప్రసారం చూసిందే. అందులో క్రాస్ ఓటింగ్ వేసిన ప్రతిపక్ష ఎం.పీ.లకు టిటిడి ఛైర్మన్ పదవీ, ఏపి భవన్ లో కాబినేట్ హోదా పదవి, సి.ఎం. పదవి ఇవ్వటం అందరికీ తెలిసిందే.

ఇవన్నీ చెప్పడం లేదా సోనియా గాంధీ పనితీరు ఏమిటో? ఇలాంటి వ్యక్తి 1980 లో రాజకీయాలు వద్దని భర్తతో ఎందుకు పోరాడినట్లు? ఎందుకు తాను అధికారంలోకి వచ్చాక ’రాజకీయాలు బాగానే ఉన్నాయి’ అన్నట్లు? ఇంతటి ఈమెని కాంగ్రెసు వాళ్ళు ’అమ్మా, సోనియమ్మా! త్యాగశీలివమ్మ! ‘X’ సార్లు ప్రధాని కాగల అవకాశాన్ని త్యాగం చేశావమ్మ’ అంటూ ఆమె కాళ్ళ మీద పడి దండాలు పెట్టడం చూస్తే ఎంత జుగుప్స కలుగుతుందో చెప్పలేం. ఆమెని చూసి కంటే ఈ కాంగ్రెస్సోళ్ళని చూసి నిర్ఘాంతపోక తప్పడం లేదు.

సరే, మళ్ళీ ప్రస్తుత కాలం నుండి వెనక్కి 1980 కి వెళ్దాం. సంజయ్ గాంధీ మరణానంతరం సంజయ్ గాంధీ భార్య మనేకా గాంధీ, పుత్రుడు ఫిరోజ్ వరుణ్ గాంధీ ఇంటి నుండి బయటి కొచ్చారు. అత్తాకోడళ్ళ జగడం, తోడి కోడళ్ళ తగదాలు అంటూ పత్రిక పతాక శీర్షికలు వచ్చిన మరునాడే ఇందిరాగాంధీ ఆస్తి పంపకం చేసేసింది. మనేకా గాంధీ, వరుణ్ గాంధీ ప్రస్తుతం బి.జే.పి.లో ఉన్నారు. బహుశః సోనియాగాంధీతో పోల్చుకుంటే మనేకా గాంధీ తమకంత ఎక్కువుగా ఉపయోగపడగల వ్యక్తిగా కనబడలేదేమో, కుట్రదారులు మనేకా గాంధీకి పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. అయితే ఈమె పాత్ర మరి అంత తక్కువ కూడా కాదు. మనేకా గాంధీ సైతం కుట్రదారుల పావే. ఎందుకంటే వారి ప్రధాన గురి ఇందిరాగాంధీ గనుక. ఆవిడ కుట్రకు వ్యతిరేకంగా పోరాడుతుంది గనుక. కుట్రదారుల కాటాలో సోనియాగాంధీ ఎక్కువ బరువు తూగిందేమో, ఇప్పటికైతే గాంధీ – నెహ్రు కుటుంబ వారసులు పాపం మనేకా గాంధీ,ఆమె పుత్రుడు వరుణ్ గాంధీ కాకుండా పోయారు. కేవలం ఈ విదేశీ సోనియా గాంధీ, ఆమె సంతతి వారే అయ్యారు. ఇందిరాగాంధీ వారసులలో నాయకత్వ లక్షణాలను పెంపకంలోనే నలిపేసారు. [ఇద్దరిలో ఎవరైనా మనకి ఒకటే అన్న విషయం ఇక్కడ గమనార్హం!] స్వాతంత్ర సమర యోధుల వారసుల మీద కూడా ఇదే ప్రయోగించారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

well written,

Here is my 2 cents.

You brought up a good point here. "తీరా పబ్బం గడిచాక ఈ నాయకుల్ని పక్కకు నెట్టి కుట్రదారుల మద్దతుదారులు చక్రం తిప్పడం మొదలెడతారు. ఇలాంటి స్ట్రాటజీ జయప్రకాష్ నారయణ్ మీద ప్రయోగింపబడిందేమో తెలియదు గానీ జనతా ప్రభుత్వం ఏర్పడిన కొద్దినెలల కాలంలోనే జయప్రకాష్ నారాయణ్ అనారోగ్యంతో మరణించాడు."

Patel, Jinna*, Shatriji, Subhash Chandra Bose, and many other prominent leaders were either died naturally or misteriously just before achieving Independance or just after independance.

It paved the way for Dynastic rule of Nehru. He and his Daughter cling to power until their death. They prevented the growth of next generation of leaders in India.

Greatest concentration of power happened under Nehru and his daughter Indira. Even British, Aurangajeb, Akbar, Gupta's and Maurya's failed to achive such concentration of power in the past. That lead to dicatoship of Indira and get hold of supreme powers by suspending Indian Constitution, imposing Emergency, and mutilation of Indian Constitution at thier whims.

And Indians paid dearly for the mis-rule of Nehru and Indira. India was relegated to third world country by rest of the nations. Today 500 Million people live in absolute poverty (less than 1 dollar a day). It was the result of mis-rule of Nehru and Indira that stagnated Indian economy for 50 years. At the same time Communist China working with Capitalist America achieved economic wonders. China able to control its population, where as Indira and Nehru failed to stem the growth of population in India, now that is threatning survival of Indic Civilization.

Too much of any thing is not desirable, particularly population. Decadence and degradation of human values in India today, refelcts that.

Indians are one of the adventures people in the wolrd. In the past they re-build their economy and became number one (or number two) in the world and dominated the world Commerce, Economy, Military, Sciences, Religion, Philosophy, Astronomy, Mathematics, Chemistry and Literature.

After independance, instead of unleashing the natural talents of Millions of Indians, Nehru and Indira held them back. They made India a dumping ground for useless weaponary of West, scrap metals, subpar food grains.

Naturally Indians were pioneers in many fields, but 1000 years of slavery under Islam and Christianity robbed their soul.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu