కుట్రదారులైన సి.ఐ.ఏ., బ్రిటిషు రాణి ప్రభుత్వం, అనువంశిక నకిలీ కణికుడు వారి మద్దతుదారులైన కార్పోరేట్ కంపెనీలు [ఆయుధ తయారీదారులతో సహా] వీలయినన్ని కుటిల నీతుల్నీ, పధకాలని ప్రయోగించి స్వాతంత్ర సమర యోధుల మధ్యఎన్ని విభేదాలు సృష్టించినా, స్వాతంత్ర సమరానికి ఎన్ని అవాంతరాలు సృష్టించినా, భారత దేశానికి స్వాతంత్రం ఇవ్వటం తప్ప వారికి గత్యంతరం లేకపోయింది. ఎందుకంటే మహాత్మాగాంధీ నాయకత్యంలో సత్యం, అహింస ఆయుధాలుగా భారతీయులు సల్పిన పోరు బ్రిటీషు వారి అమానుషాన్ని, మాటలకీ చేతలకీ మధ్య దూరన్ని, వారి కపటాన్ని ప్రపంచానికి మరింతగా ప్రదర్శింపబడేలా చేసింది.
భారతీయులే గనుక ఆయుధాలని వాడి ఉంటే [ఆయుధ సంపత్తి మనకి లేదు. ఒకవేళ ఆయుధాలు ఉండి, అవి వాడి ఉంటే] లేదా హింసని ఆయుధంగా తీసికొని ఉంటే కుట్రదారులు [సి.ఐ.ఏ., బ్రిటిషు మరియు నకిలీ కణికుడి వంశీయులు] కావలసినన్ని ద్వంద్వాలు సృష్టించి ఉండే వాళ్ళు. భారతీయులే మా పోలీసుల్ని కొట్టారు, దానితో మావాళ్ళు భారతీయుల్ని కాల్చారు లాంటివన్న మాట. ఇలాంటి ద్వంద్వాలు లెక్కకు మిక్కిలి రెండు ప్రపంచయుద్ధాల్లో జరిగాయి. కానీ భారతీయులు ఆయుధాలు ధరించలేదు. సత్యం, అహింస, వందేమాతర గీతం - ఇవే వారి ఆయుధాలు. బ్రిటీషు ముష్కర పోలీసుల్ని ఎదుర్కొనేందుకు ధైర్యమే వారి శంఖం. సహనమే కవచం. ఇలాంటి భావవాద పూరిత యుద్ధం ప్రపంచానికి చాలా కొత్త. సబర్మతి ఆశ్రమం నుండి 200 మైళ్ళ దూరంలోని దండికి 25 రోజుల్లో చేరిన ఉప్పు సత్యాగ్రహ ప్రజా వాహిని, అదేదో రాజకీయ ఉద్యమంలా గాక దేశభక్తీ, దైవభక్తి లతో ఉర్రూతూలూగుతూ, భజన కీర్తనలతో, దేశ భక్తి గీతాలతో మారుమ్రోగుతూ ఒక ఉత్సవ కళని సంతరించుకుందంటే ఆ స్ఫూర్తి ఎంతటిదో ఊహించవలసిందే! ఇలాంటి ఈ స్ఫూర్తి, ఈ సహనం, శాంతం – సత్యాన్ని, బ్రిటీషు వారి క్రౌర్యాన్ని ప్రపంచానికి Expose చేసింది. నిరాయుధులైన సత్యాగ్రహులపై బ్రిటీషు వారి కౄరత్వాన్ని, అమానుషాన్ని [జలియన్ వాలా బాగ్ లాంటి దురంతాలతో సహా] భారతీయ మీడియా ప్రపంచానికి ఎలుగెత్తిచెప్పింది. అప్పటికి దేశభక్తుల చేత నడిపించబడిన మీడియా సత్యాగ్రహంకీ, స్వాతంత్ర సమర యోధులకీ ఎంతో బాసటనీ, మనోస్థైర్యాన్ని ఇచ్చింది. ఎలాంటి వక్రీకరణలూ లేకుండా అసలు నిజాలని చాటి చెప్పింది.
అంతే కాదు – చోరా చౌరీ సంఘటన, చంపారన్ సంఘటన, హోంరూలు ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, జలియన్ వాలా బాగ్ సంఘటన, తదనంతర విచారణ నాటకం, జనరల్ డయ్యర్ కి ఇవ్వబడిన బిరుదు నిజం, దండి సత్యాగ్రహం, బాపూజీ నిరాహార దీక్షలు, నాయకుల అరెస్టులు, ప్రజలు నాయకులని అనుసరిస్తున్న తీరు, వెల్లివిరుస్తున్న దేశభక్తి, స్వేచ్ఛాస్ఫూర్తి, నాయకుల త్యాగాలు, ప్రజల త్యాగాలు – ఏ ఒక్క విషయమూ విడిచి పెట్టకుండా వాస్తవాలని ఆనాటి మీడియా ప్రజలకి, ప్రపంచానికి తెలియ జెప్పింది. ఆనాటి పత్రికలు ప్రజలకు అవగాహన కలిగించాయి, ఉత్తేజితుల్ని చేశారు, వారిలో స్ఫూర్తి రగిలించాయి. వారి దృక్పధాన్ని ప్రభావశీలం చేశాయి. నాటి కళారూపాలు కూడా వాటి పాత్రనవి అమితంగా పోషించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి మీడియాకి భారతీయుల మీద ఉన్న ప్రభావం, పట్టు, ప్రజల్ని నడిపించగల సామర్ధ్యం ప్రస్ఫుటంగా కనబడింది.
అందుకే తర్వాత కుట్రదారులు భారతదేశాన్ని పతనం చేయటానికి, అన్ని కోణాలలోనూ, అన్ని రంగాల్లోనూ కుట్రని అమలు చేయటానికి, మీడియానే ఎన్నుకొన్నారు. అందుకు కుట్రదారుల ఏజంట్లు మీడియా ప్రతినిధులుగా మారారు. అందులో ప్రధాన కుట్రదారు ఓ స్థానిక పత్రిక ముసుగు వేసుకున్నాడు. ఇంత చిన్న పత్రిక అధిపతికి అంత సీన్ ఎలా ఉంటుందిలే అన్న చులకన భావం అతనికి రక్షణ కవచమౌతుంది కదా! అందుచేత ఈ ముసుగు చక్కగా సరిపోతుంది. ఈ విషయాన్ని ఇంకా వివరంగా RAMOJI RAO’S WRITINGS AND ACTIVITIES BEFORE 1992 AND AFTER 1992 లో చూడగలరు.
ఇక, ఈ కారణంగానే కుట్రదారుల ఏజంట్లుగా The Hindu ఎన్. రామ్, Indian Express రామ్ నాధ్ గోయంకాలు ప్రముఖలుగా ఎదిగారు. ఈ విధంగా మీడియా భారత దేశం మీద వివిధ రంగాల్లో కుట్రని ఎలా అమలు చేసిందో చెప్పాలంటే అది చాలా సుదీర్ఘమైనది. వరుసగా చెప్పవలసిందే తప్ప ఒక్కమాటలోనో, ఒక్క టపాలోనో చెప్ప సాధ్యం కానిది. మరిన్ని వివరాలు కావాలంటే Coups On World లోని 27 శీర్షికలలో చూడగలరు.
ఈ విధంగా కుట్రదారుల పైముసుగుగా అవతరించిన మీడియాకి, ఎప్పుడూ బాధ్యతలు గుర్తుండవు. పత్రికాస్వేచ్ఛలాంటి హక్కులు మాత్రమే గుర్తుంటాయి. ఓ ప్రక్క విషబీజాలని ప్రజల్లో నాటుతునే నీతులు వల్లిస్తాయి. అంతేకాదు, పత్రికా రంగంతో పాటు వివిధ వ్యాపారాలు ఈ మీడియా అధిపతులకి ఉంటాయి. మీడియా తమ కుట్రకి సంబంధించి ప్రధాన ఉద్దేశానికి దెబ్బతగలనంత వరకు ప్రజల పట్ల తమ బాధ్యత నెరవేరుస్తాయి. వాటికే తమ పత్రికలు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నాయని ప్రచారించుకుంటాయి.
అందుకే పత్రికలు, మీడియా ఈ రోజు తమ స్వప్రయోజనాల కోసం ఎంతగా వార్తల్ని వక్రీకరిస్తున్నయో, బాకాలు ఊదుతున్నాయో, అబద్దాలు అదేపనిగా ప్రచారిస్తున్నాయో, యదార్ధాలు తొక్కిపడుతున్నాయో మనందరం నిద్రలేచింది మొదలు నిద్రపోయే వరకూ ప్రతీరోజూ చూస్తూనే ఉన్నాం.
అయితే ఇదంతా ఇప్పుడు! ఆనాడు అంటే స్వాతంత్ర సమరం రోజుల్లో మీడియా దేశభక్తులతో నిండి ఉంది. నిజాయితీపరులతో నిండి ఉంది. [క్రమంగా స్వాతంత్రానంతరం అలాంటి దేశభక్తులూ, నిజాయితీ పరులూ, ప్రక్కకి తోసివేయబడ్డారు.] దాంతో నాటి మీడియా బ్రిటీషు వారి దమననీతిని ప్రపంచ వేదికపై నగ్నంగా నిలబెట్టింది.
ఈ సంఘటనల్లో అతిదారుణమైనది జలియన్ వాలా బాగ్ మారణ కాండ. వేలాది పేదప్రజలు స్థానిక స్టేడియంలో ప్రభుత్వం పట్ల తమ అసంతృప్తిని, నిరసనని ప్రకటించేందుకు, తమ స్థానిక సమస్యల్ని గురించి చర్చించేందుకు సమావేశమయ్యారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికా లేకుండా జనరల్ డయ్యర్ తన సైనిక సిబ్బందితో వచ్చాడు. నిరాయుధులైన నిరుపేదల్ని, దారులు బంధించి ఉన్న ఆ స్టేడియంలో విచక్షణారహితంగా, పిట్టల్ని కాల్చినట్లు కాల్పించాడు. దాదాపు 1500 వందల మంది [బాల వృద్ధులతో సహా] ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఉన్నదారి కడ్డుగా సైనికులు నిలిచి కాల్పులు జరుపుతున్నారు. మరోదారి లేదు. గోడలు ఎత్తుగా ఉన్న స్టేడియం అది. కొందరు ప్రజలు ప్రాణాలు కాపాడుకొనేందుకు గోడలెగబ్రాక ప్రయత్నిస్తే డయ్యర్ తన సైనికులని అటువైపు గురిపెట్టమన్నాడట. కొందరు ప్రాణరక్షణకై ఆ అవరణలో ఉన్న గోతిలోకి దూకినప్పుడు అందులోకి కాల్పులు జరపమని సైనికులకి ఆఙ్ఞాపించాడట.
ఎంత కౄరుడు డయ్యర్? అలాంటి వాడికి బ్రిటీషు ప్రభుత్వం ‘సర్’ బిరుదు నిచ్చి సత్కరించింది. [నాటి మీడియా, నాటి రాజకీయ నాయకులు, ప్రజలు తీవ్రనిరసన తెలిపినందున డయ్యర్ ని బదిలీపై లండన్ కి తిప్పిపంపారు. ఆ తర్వాత ’సర్’ బిరుదునిచ్చారు. దీన్ని బట్టే చెప్పవచ్చు, డయ్యర్ కోపంతోనో, అప్పటికప్పుడో ఆ దారుణ మారణకాండ జరపలేదని, పక్కా అసైన్ మెంటుతోనే ప్రజలున్న స్టేడియంకి వచ్చాడని.
స్వాతంత్ర సమరం ముమ్మరం అయ్యేసరికి, బ్రిటీషుకి ఇండియాని వదిలి పెట్టిపోక తప్పలేదు. మరోప్రక్క రెండు ప్రపంచయుద్ధాలు, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటీషు ఆర్ధిక స్థితి చితికిపోయింది. ఒక్కవ్యక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడా, భయపెట్టగలడా, ప్రచారంతో గ్రిప్ చేయగలడా అన్న ప్రయోగం హిట్లర్ తో నిర్వహింపబడింది. హిట్లర్ కి డూప్ లు ఉండేవారనీ, [సద్ధాం హుస్సేన్ కి కూడా డూప్ లు ఉన్నారన్న ప్రచారం ముమ్మరంగా ఉండేది] నిజమైన హిట్లర్ బ్రతికే ఉండగా అతడి డూప్, అతడి భార్య ఇవా బ్రౌన్ డూప్ బంకర్ లో ఆత్మహత్య చేసుకున్నారనీ జోరుగా ప్రచారాలు మీడియాలో సాగాయట, ఆలాంటి కథలతో మాత్రం సినిమాలు, నవలలు కొకొల్లలుగా వచ్చి బాగా డబ్బు చేసుకున్నాయి. హిట్లర్ డూప్ ప్రయోగాలకు సంబంధించిన కధనం ఫిబ్రవరి8, 2009 ఈనాడు ఆదివారం సంచిక చూడగలరు.
ఇలాంటి ప్రపంచ యుద్దాలనేపధ్యంలో సైతం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకుండా ఉండేందుకు బ్రిటీషు ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. ప్రపంచ యుద్ధాలని కారణంగా చూపి కొన్నాళ్ళు వాయిదా వేసారు. భారతీయులకి తమని తాము పాలించుకోవటం రాదని, అంచేత అంచెలంచెలుగా స్వాతంత్రం ఇస్తామనీ అన్నారు. నిజానికి యూరప్ కళ్ళు తెరవక ముందే భారత్ లో ఉన్నత, పరిణత నాగరికత పరిఢవిల్లింది. వేల సంవత్సరాల నాగరికత, వాఙ్ఞ్మయం, చరిత్ర భారతీయులకి ఉన్నాయి. అయినా ఏమాత్రం సిగ్గూ, మొహమాటం లేకుండానే బ్రిటీషు ప్రభుత్వం ’భారతీయులకి తమని తాము పాలించుకునే నైపుణ్యం లేదని’ వాదించింది. మరింత సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే ఈనాటి కుట్రదారుల భజనపరుల మాదిరిగానే ఆనాటి భజనపరులు కూడా ఆ వాదనని సమర్ధించారు. ఈ వాదనని వ్యూహాత్మకంగా ఇతర దేశనాయకులు బలపరిచారు. కానీ ఈ కుటిల పన్నాగాలన్నీ సత్యం, అహింసలతో గూడిన భారత స్వాతంత్ర సమరం ముందు ఓడిపోయాయి.
దానితో స్వాతంత్రం ఇవ్వక తప్పని స్థితి ఎదురయ్యేసరికి కుట్రదారులు ‘దేశ విభజన’ అన్న పన్నాగం అమలు చేశారు. పశ్చిమ పాకిస్తాన్, తూర్పుపాకిస్తాన్ మధ్యలో ఇండియా! ఎంత కుటిలం కాకపోతే ఇండియాకి ఇరువైపులా పక్కలో బల్లెల్లా రెండు పాకిస్తాన్ లు. సర్ధార్ పటేల్ పుణ్యమాని తప్పిపోయింది గానీ, లేకపోతే ఇండియా గుండెల మీద మండే నిప్పుల కుంపటి లాగా మధ్యపాకిస్తాన్ [హైదరాబాద్ నిజాం సంస్థానం] వెలిసిఉండేది. ఇందులో మరో దారుణం ఏమిటంటే రెండు వైపులా ఇండియా పాకిస్తాన్ ల సరిహద్దుగా ఎలాంటి ప్రకృతి సహజ గుర్తులూ లేకపోవటం. ఓ నదిగానీ, సరస్సులు గానీ, కాలువలో, లోయలో, కొండలో ఎలాంటి గుర్తు లేని, విస్తారమైన భూమిలో ఈ పాయింట్ వరకూ ఇండియా, ఇది దాటితే పాకిస్తాన్ లేదా బాంగ్లాదేశ్ అని ఎలా విభజించటం? అంత విస్తారమైన కంచె వేయగలమా? వేసినా శివారు ప్రజలు జరపకుండా ఉంటారా? కంచెలో దూరి అటుఇటూ వలసలు రాకుండా ఉంటారా? లేదంటే మనం కూడా మరో చైనా గోడ కట్టుకోవాలా? అలాంటి సరిహద్దు చూసి ఆనాటి భారతీయులు నోరు తెరిచారట. మరిన్ని వివరాలు కావాలంటే పి.వి. నరసింహారావు గారి లోపలి మనిషి [ఇన్ సైడర్] చదవగలరు. అయితే భారతీయుల్లా పాకిస్తాన్ నాయకులు తెల్లబోలేదు. ఎందుకంటే అయాచితంగా, అనుకూలంగా అన్నీ కలిసి వస్తుంటే ఎవరైనా ఎందుకు తెల్లబోతారు చెప్పండి.
1962 లో చైనా యుద్ధంలో ఓడిపోయే వరకూ దేశంలో ఎవరూ, ఏ కుట్రనీ అనుమానించలేదు. దీన్ని గురించిన వివరాలు తర్వాత చర్చిస్తాను. అయితే 1966 నుండి 1984 వరకూ తాను అధికారంలో ఉన్నన్నీ రోజులూ[మధ్యలో 1977 ఎమర్జన్సీ తర్వాత కొంతకాలం అధికారంలో లేదు] ఇందిరా గాంధీ, ఎప్పుడు భారత్ మీద విదేశీ కుట్రని చెప్పబోయినా, అప్పటికే ఎన్.రామ్ లూ, గోయంకాలతో నిండిన మీడియా, వారి మద్దతుదారులూ పెద్దగొంతులతో ’ఇందిరా గాంధీ తన రాజకీయ కెరీర్ కోసం, తన ప్రభుత్వాన్ని కాపాడు కోవటానికి ’పాక్ బూచి’ని చూపిస్తోందని’ గోలపెట్టేవారు. అయితే ఇప్పుడు మనం స్పష్టంగా – మన దేశం మీద జరుగుతున్న ప్రతీ కుట్రా, బాంబు పేలుళ్ళు వంటి తీవ్రవాదం కానివ్వండి, నకిలీ స్టాంపులూ, నకిలీ కరెన్సీ, నకిలీ పాస్ పోర్టులు వంటి అడ్మినిస్ట్రేషన్ కుంభకోణాల్లో కానివ్వండి, కిరాయి నేరగాళ్ళు, కిరాయి టెర్రరిస్టులు అటు పాక్ నుండో, ఇటు బంగ్లా దేశ్ నుండో హైదరాబాద్ కు రావడం వరుసగా చూస్తూనే ఉన్నాం కదా! అటువంటప్పుడు ఆరోజుల్లో, ఆవిడ చూపెట్టబోయిన కుట్ర అప్పుడు అపహాస్యం చేయబడినా, ఈ రోజు నిజమై మన కళ్ళముందు కన్పిస్తూనే ఉందికదా! ఆవిడ ’వెర్షన్’ మీద జోకులు వేసో, కుట్రకి వ్యతిరేకంగా ఆవిడ చేస్తోన్న పోరాటాన్ని విమర్శించో, ఆనాటి రాజకీయ నాయకులు దాదాపు ఆవిడని ఒంటరిని చేశారు. తెలిసో, తెలియకో, కావాలనో, పధకంలో భాగంగానో కాసు బ్రహ్మానందరెడ్డి, దేవరాజ్ ఆర్స్, జగ్ జీవన్ రామ్, నీలం సంజీవరెడ్డి, మొరార్జీ దేశాయ్ వంటి ఎందరో సీనియర్ నాయకులు కూడా కుట్రలో తమ పాత్ర తాము పోషించారు. చాలా కొద్ధిమంది రాజకీయ నాయకులు, నిఘా సంస్థలూ ఆవిడకి అండగా నిలిచాయి. కాబట్టే కుట్ర ఫలించే దశకు చేరడానికి ఇంత ఎక్కువకాలం పట్టింది. కాబట్టే ఇంకా ‘ఇండియా’ అంటూ ఒక దేశం ముక్కచెక్కలు కాకుండా ఇంకా నిలబడి ఉంది. బ్రిటిషు వాళ్ళు వదిలి వెళ్తూ ’మీకు మీరు పరిపాలించుకోలేరు. మళ్ళీ ఇండియా,పాక్ లు ముక్కలు కాకతప్పదు. మళ్ళీ మమ్మల్నే పరిపాలించమని అడిగేరోజు వస్తుందని’ అన్నారన్న ప్రచారం కూడా ఉంది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు! .
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
ఇంతకుముందు అంతా చాపకింద నీరులా ఉండేది. ఇప్పుడు అంతా బాహాటంగానే జరుగుతోంది. పాకిస్తాన్ లో ముస్లింలకంటే , భారతంలోనే ముస్లింలు ఆనందంగా ఉన్నారన్నది నిజమే
ఏ ఒత్తిడుల వల్ల లాహోర్ వరకూ వెళ్ళి వెనక్కు వచ్చామో అందరికీ తెలిసిందే. అంతకంటే పెద్ద దృష్టాంతమేముంటుంది?
earlier you asked about linking paragraphs in a perticular post. I will try to to help my level best---
first you need to make your target post as parts(in some webpages you may find "goto top" links .this is same like that). then your link can be altered to point the perticular part. more details can be found if you refer HTML code
Post a Comment