నిజానికి నకిలీ కణికుడికీ, కుట్రదారులకీ ఇలా సినిమా తారలని రాజకీయాల్లో ఉపయోగించడం కొత్తేమీ కాదు. ఎన్.టి.ఆర్. కంటే ముందే తమిళ నాడు లాంటి రాష్ట్రాల్లో ఎమ్.జి.ఆర్. లూ, అమెరికా లాంటి దేశాల్లో రోనాల్డ్ రీగన్ లూ ఉన్నారు. రోనాల్డ్ రీగన్ సినిమా కెరీర్ తో రాజకీయాల్లో ప్రవేశించి 1981 లో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడైతే చిన్నాచితక నటులు కూడా రాజకీయ రంగంలోకి తొంగి తొంగి చూస్తున్నారు. ఆంధ్రలో చిరంజీవి రంగం మీదకి వచ్చేశాడు. తమిళ నాట రజనీ కాంత్ రేపో ఎల్లుండో అంటున్నాడు. వారు తమ రంగంలో, తమ గతంలో ఏవిధంగా అవినీతిని ఎదుర్కున్నారో, ఏంచేశారో, రేపు భవిష్యత్తులో ప్రజలకి ఏంచెయ్యబోతున్నారో వాళ్ళకి తెలియాలి, భగవానునికి తెలియాలి.

ఇక్కడ ఓ ఆసక్తి కరమైన సంఘటన చెబుతాను – 1972 లో, ఇండో పాక్ యుద్ధం, బాంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఆనాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లోని శ్వేత సౌధానికి [వైట్ హౌస్] ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ని కలవటానికి వెళ్ళింది. నిర్ధిష్టమైన అపాయిట్ మెంట్ ఉన్నప్పటికీ సామాన్యవ్యక్తికి లాగా ఆమెని 15 నిమిషాలు పాటు వేచి ఉండేలా చేశారు శ్వేత సౌధాధికారులూ, సదరూ అధ్యక్షుడూను. ఆనాటి మీడియా ఈ విషయాన్ని తెగ ప్రచారించింది. ఆనాటి ఙ్ఞాపకాల పేరుతో దీనిని ఇండియా టుడే పత్రిక పునఃప్రచురించినప్పుడు ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అది చదివినప్పుడు భారతదేశంలోని కోట్లాది ఇతర చదువరులు ఎలా అనుకున్నరో నాకు తెలియదు గానీ నాకు చాలా ఆవేశం, ఉక్రోషం కలిగాయి. భారత ప్రధానిని [ఆ పదవిలో ఎవరున్నా సరే] అలాగ అవమానించడమంటే అది మన దేశాన్ని అవమానించడం వంటిదే. అయితే ఇప్పుడు అద్భుతమైన పరిణామాంగా అదే అమెరికా, అదే శ్వేత సౌధంలో అదే అధ్యక్ష పదవిలోని వ్యక్తి [ఈసారి ఆ సీట్లో జార్జ్ వాకర్ బుష్ ఉన్నాడు లెండి] భారత ప్రధాని ని [ఇప్పుడు సీట్లో మన్ మోహన్ సింగ్ ఉండగా] ఓ వైపు బెయిల్ అవుట్ బిల్లు చట్టసభలో పాస్ చేయించుకొనే పని వత్తిడిలో ఉన్నా కూడా ఆత్మీయం[?]గా, అత్యవసరంగా రిసీవ్ చేసుకున్నాడు. మొన్న అంటే సెప్టెంబరు 26, 2008 న. అంతేకాదు [1992 తర్వాతే] ఇటీవలి కాలంలోనే ఇండియా, అమెరికా వారికి అత్యంత ప్రీతిపాత్రమై వారి సభా సమావేశాలని వేద మంత్రాలతో ప్రారంభిస్తున్నారు. ఇదీ గూఢచర్యం తెచ్చే మార్పు. పైకారణంగా [Over leaf reason] గా ఏ ఆర్ధిక కారణాలు చూపనివ్వండి గాక అంతర్గత కారణం మాత్రం గూఢచర్యమే.[Spying]

1972 లో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని వేచి ఉండేలా చేసి అవమానించన శ్వేత సౌధం సంగతి అటుంచితే, తదనంతర కాలంలో అదే శ్వేతసౌధంలో మరో సంఘటన చోటు చేసుకుంది. భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.ఆర్. బైపాస్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ అతడికి శ్వేత సౌధాన్ని దర్శించవలసిందిగా, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ని కలవాల్సిందిగా ఆహ్వానం అందింది. అలా కలిసి వచ్చిన ఎన్.టి.ఆర్., ఇండియాకి వచ్చాక అదే విషయాన్ని ఒకింత గర్వంతో ప్రకటించుకున్నాడు. ఆయన భావోద్వేగాలని ఇక్కడ నేను విమర్శించడం లేదు. [ఆయా భావాలు ఉద్వేగాలు అతడి వ్యక్తిగతమైనవి కాబట్టి.] అయితే పదేపదే ఛాతీ మీద బైపాస్ సర్జరీ తాలూకూ గుర్తును ప్రదర్శిస్తూ ఎన్.టి.ఆర్. ప్రకటించుకున్న విషయాల్ని అప్పటి మీడియా, ముఖ్యంగా ఈనాడు ప్రముఖంగా ప్రచారించింది. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ తిరుగులేని విజయాన్ని సాధించిన ఎన్.టి.ఆర్. గురించి విన్న ఆనాటి అమెరికా ప్రెసిడెంటు ఎన్.టి.ఆర్. ని చూడాలనీ, కలవాలనీ ఉత్సాహం, ఆసక్తి ప్రదర్శించడంతో ఎన్.టి.ఆర్.ని శ్వేధసౌధం ఆహ్వానించడం జరిగిందన్న ప్రచారం జోరుగా సాగింది. పైకారణం [Overleaf reason] గా ఇది ఎంత సహజంగా ఉంది. కానీ ఇందులో గూఢచర్యం అంతర్లీన కారణమని ఎందుకు సందేహించకూడదు? గూఢచార తంత్రాలన్నీ ఇలా పైకి మామూలుగా కనబడే కారణాలనే పైముసుగుగా వాడుకుంటాయి గదా! ఈవిధంగా నకిలీ కణికుడు శ్వేతసౌధంలో తనకు ఎంత పట్టుఉందో తన అనంగు మద్దతుదారులకీ చూపించుకున్నాడు.

ఆ రోజుల్లో [అంటే 1980 నుండి 1984] ఇందిరా గాంధీ అంటుండేది – “మన దేశంలో ఏదో కుట్ర జరుగుతోంది. కుట్ర అమలు జరపబడుతోంది. ఏవో విదేశీ సంస్థలు మన దేశ భద్రతకీ, శ్రేయస్సుకీ వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయి. ఏదో విదేశీ హస్తం మన మీద పనిచేస్తోంది” అని. చివరికి తనను చంపుతారని కూడా ఆమె అంచనా వేయగలిగింది. అందుకే భువనేశ్వర్ సభలో తన చివరి రక్తం బొట్టుకూడా దేశం కోసం ధారపోస్తానని చెప్పింది. అదే ఆవిడ చివరి బహిరంగ సభ. తరువాతే ఆమె హత్యకు గురైంది. [నిజానికి కుట్రలు పన్నే విదేశీ కోడల్ని ఇంట్లో పెట్టుకొని బయటంతా వెదికిందావిడ. ఆ వివరాలు గత టపా – ‘ అమ్మకింత బలం, ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా – 1 & అమ్మకింత బలం, ఇంత శక్తి ఎలావచ్చాయబ్బా – 2 లో చర్చించాను. మరిన్ని వివరాలకి Coups On World లోని Coup On Politics లో చూడగలరు.

ఈ విదేశీ హస్తం విషయం మీద ఇందిరాగాంధీ వ్యాఖ్యానించగానే ఇక ఆనాటి ప్రతిపక్షాలూ, మీడియా తెగ విమర్శించాయి. మీడియా తెగ జోకులు పేల్చింది. వాటిల్లో ఈనాడు లో ప్రచురింపబడిన కార్టూన్ ఒకటి వ్రాస్తున్నాను.

ఆ కార్టూన్లో గాంధీ టోపీ పెట్టుకున్న ఓ కాంగ్రెస్ నాయకుడు స్టేజీ మీద మైకు ముందు నిలబడి ప్రజలనుద్దేసించి ఉపన్యసిస్తుంటాడు. అంతలో అతడి పి.ఏ. పరుగెట్టుకు వచ్చి “సార్! శుభవార్త. మీ శ్రీమతి ప్రసవించారు. మీకు కొడుకు పుట్టాడు” అంటాడు.

వెంటనే ఈ రాజనీయ నాయకుడు “ఠాఠ్! నేను నమ్మను. ఇందులో ఏదో విదేశీ హస్తముంది” అంటాడు.

ఇది చదివి అప్పడందరూ నవ్వుకున్నారు. అయితే ఇప్పుడందరం చూస్తూనే ఉన్నాం కదా దేశంలో ఎక్కడబడితే అక్కడ అదే విదేశీ హస్తం బాంబులు పేల్చడాన్ని, దాడులు చేయడాన్ని? పాక్ తీవ్రవాదులు, ఐ.ఎస్.ఐ., సి.ఐ.ఏ. ఏజంట్లు ఎవరైనా ’విదేశీ’లే. ఇక స్వదేశంలోనే ఉన్న విదేశీ నాయకులకీ మనకి కొదవ లేదు గదా. దేశంలో పేలుతున్న బాంబుల విషయంలోనే కాదు, ఐ.ఎస్.ఐ. లాంటి విదేశీ హస్తాలు మన దేశంలో ఆర్ధిక తీవ్రవాదం సృష్టించడం కూడా చూస్తునే ఉన్నాం. దొంగ కరెన్సీ నోట్లు ముద్రణా, చెలామణి, దొంగ స్టాంపు పత్రాల ముద్రణా, చెలామణి[తెల్గీ, అబూసలేం, కృష్ణాయాదవ్, నటి మోనికా బేడి ... ఇలా ఎందరో ఈ కుంభకోణంలో పాత్రదారులు] లాంటివి కోకొల్లలు.

అంతే కాదు – రాజీవ్ గాంధీ బోఫర్స్ కుంభకోణంలో కూరుకుపోయినప్పుడు [ఇందులోని విదేశీ హస్తాన్ని తర్వాత పూర్తిగా వివరిస్తాను.], రాజీవ్ గాంధీ మారణానంతరం బోఫోర్స్ కుంభకోణం మీద మన దేశం లోనూ విదేశంలోనూ విచారణ నడుస్తుండగా అందులో ప్రమేయమున్న హిందూజా సోదరుల్లో ఒకడు హఠాత్తుగా గుండెపోటు[?]తో మరణించినప్పుడు, స్విస్ లోనూ, మన దేశంలో బోఫోర్స్ విచారణ రెడ్ టేపిజంతో అతిమందగొడిగా నడుస్తున్నప్పుడు, అందరికీ స్పష్టంగా కనబడుతోంది ఈ ‘విదేశీ’హస్తమే! ఈ నేపధ్యంలోనే ’ఇటలీ’ కంపెనీల వంటి ఇతర దేశ సంస్థలు involvement గురించిన వార్తలొచ్చాయి. తెర వెనుక సూత్రధారులు విదేశీ హస్తాలు కావా?

1992 తరువాత సంవత్సరాలలో ఒకసారి మురళీ మనోహర్ జోషి తనని బి.జె.పి. అధ్యక్షుడు కాకుండా సి.ఐ.ఏ. అడ్డుకుంటోందని ప్రకటించాడు. ఇది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలన వార్త అయ్యింది. బహుశః ఉక్రోషంతోనో, ఉద్రేకంలోనో, బ్యాలెన్స్ కోల్పోయి బహిరంగ ప్రకటన చేసినందుకో ఏమో ఈ సంఘటన తర్వాత ఒకప్పటి బి.జె.పి. అధ్యక్షుడూ, అగ్రనేతల్లో ఒకడూ అయినటువంటి మురళీ మనోహర్ జోషి రాజకీయ రంగ తెర మీద మసకబారి పోయాడు.

1992 లో అప్పటి ప్రధాన మంత్రి పి.వీ. నరసింహా రావు గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి అయిన సోలంకి కొరియర్ షిప్ చేస్తూ రెడ్ హ్యండెడ్ గా కాగితాలతో సహా పట్టుబడి మంత్రిపదవి కోల్పోయాడు. అతడు విలేఖరులతో “నిజంగా ఆ స్లిప్పు నా జేబులోకి ఎలా వచ్చిందో, అందులో ఏం వ్రాసి ఉందో నాకు తెలీదు. నేను ఎయిర్ పోర్టులో ఉండగా ఎవరో కుర్రాడు వచ్చి ఇది నా చేతికి ఇచ్చాడు. ఏమీ ఆలోచించకుండానే యధాలాపంగా నేను ఆ స్లిప్పుని జేబులో పెట్టుకున్నాను” అన్నాడు. ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా? ఎయిర్ పోర్టులో ఓ కేంద్ర క్యాబినెట్ మంత్రి దగ్గరికి ఓ అల్లాటప్పా కుర్రాడు వెళ్ళగలడా? వెళ్ళి ఓ కాగితాన్ని ఇవ్వగలడా? ఇస్తే మంత్రి తీసుకొని జేబులో పెట్టుకుంటాడా? మన చెవిలో పువ్వు పెట్టడం గాకపోతే?

ఈ విధంగా గతంలోని విదేశీ హస్తపు జోకు కాస్తా వాస్తవమై కూర్చుంది. మరి ఇప్పుడు రామోజీ రావు తన మీద, సి.ఐ.ఏ. మీద, ఐ.ఎస్.ఐ. మీద, ఇటలీ నుండి వచ్చి ఇండియానేలేస్తున్న ఈ విదేశీ కోడలి మీద విదేశీ హస్తం మీద ఇప్పుడేం జోకు లేస్తాడో? [రామోజీ రావుకీ, సోనియా గాంధీకి ఏమిటి connection అనుకుంటున్నారా? సాక్ష్యాధారాలతో సహా వ్రాస్తాను. వెంటనే చూడాలనుకుంటే Coups On World లోని నాకేసు వివరాలు, Events list, ఇతర Complaints and Correspondence…. లో చూడగలరు.]

ఇక ఈ ’విదేశీ హస్తం’ గురించి చెప్పాలంటే భారతీయ స్వాతంత్ర సమర చరిత్ర దగ్గర నుండీ నేటి సోనియా గాంధీ పాత్ర వరకూ భారత రాజకీయ రంగాన్ని మరోసారి అవలోకించాలి.

మనం ఇంతకు ముందు 1498 లో భారతదేశానికి సముద్రమార్గం కనుగొన బడ్డ దగ్గర నుండి 1857 లో సైనిక తిరుగుబాటు వరకూ జరిగిన ఎన్నో సంఘటల్ని చర్చించాం. 1857 లో సిపాయిల తిరుగుబాటు [మన దృష్టిలో తొలి స్వాతంత్ర సమరం] తర్వాత భారతదేశం పై అధికారం బ్రిటీషు రాజ వంశానికి బదలాయించబడింది. దాంతో ఎలిజబెత్ రాణి భారతదేశానికి కూడా రాణి అయ్యింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలినా, బ్రిటీషు రాణి ఏలినా ఇండియాని లూటీ చేయటంలోనూ, ఇండియన్స్ రక్తం పీల్చడంలోనూ తేడా మాత్రం లేదు. కొండొకచో పరిస్థితి మరింత దిగజారి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది. నిజం చెప్పాలంటే ఈ దోపిడి లక్షణం యూరోపియన్లకీ, ముఖ్యంగా బ్రిటీషు వారికి సహజ లక్షణం. నిజానికి పదార్ధవాదం లేదా భౌతికవాదం యొక్క లక్షణం ఇది. ఇక బ్రిటీషు వారూ, యూరోపియన్లు ఎక్కడికెడితే అక్కడ వ్యాపారం కాదు, దోపిడే! మొదటగా వ్యాపారం పేరుతో తాము అడుగు పెట్టిన ఆయా దేశాల్లో స్థానిక ప్రజల మీద అంటురోగాల్ని [ రోగ క్రిముల్ని] ప్రయోగించేవారు. అలాంటి ప్రక్రియలతో చాలా దీవుల్లో, ఆస్ట్రేలియా, అమెరికాల్లో అప్పటి స్థానికులైన గిరిజనులు దాదాపు అంతర్ధానమైపోయారు. ఆస్ట్రేలియాలోని స్థానిక గిరిజనులు ఇప్పుడు అక్కడి Slum Area ల్లో నివసిస్తూ విదేశీ టూరిస్టులకి తమ విద్యలూ, కళలూ ప్రదర్శిస్తూ భిక్షాటన చేయటం, అమెరికాలో అసలు రెడ్ ఇండియన్స్ దాదాపు చిరునామా కూడా లేకపోవటం అందరికీ తెలిసిందే. ఎక్కడ ఈ బ్రిటీషు వారు అడుగుపెట్టినా ముందు అక్కడి ప్రజల్లో అంటూ రోగాలు ప్రబలతాయి. అలా బలహీనపడిన ప్రజలపై ఇంకా బలహీన పరచడానికి ఆయుధప్రయోగాలు, కుట్రలూ, Divide and Rule Policy లు తోడయ్యాయి. నకిలీ కణికుడి గూఢచార నైపుణ్యం తోడయ్యింది. దానా దీనా బ్రిటీషు రాజ కుటుంబం విశ్వాధినేత అయ్యింది.
అందుకే బ్రిటీషు వారు ఎంతో గర్వంగా ’రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం’ అన్న విశేషణాన్ని విశేషంగా [అంటే ఎక్కువుగా] వాడేవారు. అంటే బ్రిటీషు సామ్రాజ్యం భూగోళాన్నంతా వ్యాపించిందనీ, వారి సామ్రాజ్యంలోని ఓ భాగంలో సూర్యాస్తమయమయ్యేసరికి మరో భాగంలో సూర్యోదయం అవుతుందనీ, వెరసి తమ సామ్రాజ్యంలో ఎప్పటికీ సూర్యుడు అస్తమించడనీ ఆ విశేషణం యొక్క విలక్షణ అర్ధం.

ఈ సందర్భంలో మీకు ఒక ఆసక్తి కరమైన అంశం చెప్పాలి.

ఓసారి ఓ మీటింగ్ లో స్థానిక బ్రిటీషు అధికారి ఎంతో గర్వంగా ఉపన్యసిస్తూ పదే పదే సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం అంటున్నాడు. దాంతో మన తాపీ ధర్మారావు గారు తాపీగా చిరునవ్వు నవ్వుతూ “అవును. బ్రిటిషు సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు. చీకటి పడితే బ్రిటీషు వాళ్ళని నమ్మకూడదని సూర్యభగవానునికీ తెలుసు” అన్నారట. తాపీ వారి చతురోక్తి నిజం కదా! [చీకటి పడితేనే కాదు, వెలుగులోనూ వారు నమ్మదగని వారేనేమో! నేను ఈ మాట బ్రిటీషు ప్రజలని ఉద్దేశించి అనటం లేదు. బ్రిటీషు పాలకులని ఉద్దేశించి అంటున్నాను.]

అప్పటికే ముస్లిం రాజుల దాడులతో, దోపిడి తో మానసికంగా, అధ్యాత్మికంగా దారిద్ర్య స్థితికి చేరిన భారత దేశం, ఇక బ్రిటీషు వారి దోపిడితో భౌతికంగా కూడా పరమ పేదరికానికి చేరింది. [నేటి ఆర్ధిక నిర్వచనాల ప్రకారం, బ్రిటిషు వారు భారతదేశానికి వచ్చినప్పుడు మన జి.డి.పి. రేటు 24%. ఇప్పుడు? అంటే వాళ్ళ చేతుల్లో ఎంత దోపిడికి గురైంది అలోచించండి.] అంగళ్ళ రతనాలు రాశిగ పోసి అమ్మిన భారతదేశం లవంగాలు, మిరియాలు కొనటానికి వచ్చిన బ్రిటిషు వారి చేత చిక్కి, చిక్కి శల్యమయ్యింది. వారిక్కడి నుండి ముడి సరుకులు తీసుకుపోయి, తాము తయారు చేసిన సరుకులు ఇక్కడికి తెచ్చి, తాము చెప్పిన ధరకి కొనిపించి భారతీయుల్ని పీల్చి పిప్పి చేశారు. ఈ దోపిడి విధానమే వారి వ్యాపారం. నిజానికి బాపూజీ బ్రిటీషు వారి పాలనకి వ్యతిరేకంగా పోరాడాడని కాదు అనవలసింది. వారి వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడాడని అనాలి. అందుకే ఆయన సత్యాహింసలతో పాటు ఖాదీ వస్త్రాల్ని, చరఖాని కూడా తన ఆయుధాలుగా చేసుకొని స్వదేశీ ఉద్యమం, దండి సత్యాగ్రహం లాంటి వాటిని వేదికలు చేసుకొని పోరాడాడు. బ్రిటీషు వారి ఈ రకపు దోపిడి పాలనతో ఇక్కడి నుండి కొల్లగొట్టుకుపోయిన విలువైన వస్తువులు ఈనాటికీ లండన్ వేలశాలల్లో వేలానికొస్తుండటం చూస్తునే ఉన్నాం. పత్రికల్లో ఆ వేలపు వార్తలూ, అందులో వేలం వేయబడ్డ షాజహాన్ కత్తులూ, గట్రాల గురించి వ్రాస్తారు గానీ, ఆయా వస్తువుల్ని ఎవరు స్వంతదారులుగా ప్రకటించుకొని వేలం వేసారో, వారికా వస్తువు ఎలా సంక్రమించిందో ఎప్పుడూ వ్రాయరు, ఇది గమనార్హం.

ఇలాంటి బ్రిటీషు పాలన రోజుల్లో అది సెప్టెంబరు 11, 1893 వ సంవత్సరం, చికాగో నగరం. అక్కడ అంతర్జాతీయ మత మహా సభ జరుగుతోంది. కాషాయంబరాలు ధరించిన తేజో మూర్తి, స్వామీ వివేకానంద, భారతీయ హిందూ సనాతన ధర్మం మీద ఉపన్యసించేందుకు ఉద్యుక్తుడయ్యాడు. గంభీర కంఠస్వరంతో “అమెరికా సోదరీ సోదరులారా!” అన్న ఒక్కమాట. ఒక్క సంభోదన. ఆ ఒక్కమాట విశ్వమానవుని ఆత్మని ప్రతిబింబించింది. విశ్వమానవ ఐక్యతనీ, సమానతనీ, మానవ హృదయాల్లో లోలోపలి పొరల్లో ఘనీభవించిన దివ్వప్రేమని తట్టి లేపింది. అప్పటి వరకూ ఆ విశ్వమత మహాసభలోని ప్రతీ ఉపన్యాసమూ “స్త్రీలారా! పురుషులారా!” [Ladies and Gentle men] అని ప్రారంభింపబడ్డాయి.

స్వామి వివేకానందుని గొంతులోంచి దుమికిన ఈ సజీవ ధర్మ జలపాతం అక్కడి అమెరికన్లని ముగ్ధుల్ని చేసింది. నిజానికి అమెరికా, భారతదేశపు భవిష్యత్తులో ఉంది, లేదా అమెరికా గతపు స్థితిలో నేటి భారత దేశం ఉంది. అంటే ఇప్పుడు ఏ పరుగులైతే కార్పోరేట్ రంగం భారతదేశం మీద ప్రయోగించగా భారతీయులంతా నలిగి అల్లాడుతూ, అనివార్యమై పదార్ధవాదం వైపు పరుగుపెడుతున్నారో ఆ స్థితిలో వందేళ్ళ క్రితం అమెరికా ఉంది.

దాంతో ఆనాటి అమెరికన్ లు కార్పోరేటిజం లో అలిసిపోయి ’నిజం’ కోసం దాహార్తులై ఉన్నారు. దాంతో స్వామీ వివేకానంద ఎలుగెత్తి చాటిన సనాతన ధర్మంలోని ’నిజం’ పట్ల అమెరికనులు ఆకర్షితులైయ్యారు. ఇది సి.ఐ.ఏ.కీ వారీ మద్దతుదారులైన కార్పోరేట్ కంపెనీల వారికీ రాబోయే ప్రమాదానికి సూచికగా కనిపించింది. ప్రజలు ’సత్యం’ పట్ల దాహార్తులైతే, జీవిత సత్యాలేమిటో తెలుసుకుంటే, జీవితానికి అర్ధం, ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటే, మనిషి జీవితానికి అసలైన గమ్యం ఏమిటో తెలుసుకుంటే, ఇంకా చెప్పాలంటే నిజమైన ’ఆనందం’ ఎక్కడ ఉందో ప్రజలకి అర్ధమై పోతే – అది కార్పోరేట్ బిజినెస్ కీ, ఆ పేరుతో వాళ్ళు చేసే దోపిడికీ ఎంత ముప్పు?

ప్రజలు గనుక భావ సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని, ఆధ్యాత్మికతనీ, తాత్త్వీక చింతననీ, భక్తినీ, ఆనందించడం నేర్చుకుంటే ఇక వాళ్ళని లగ్జరీల వైపు, వినిమయ వస్తువులు వైపు ఎలా పరుగులెత్తించటం? అప్పుడు ఎలా వారికి అర్ధం లేని మోజులూ, ట్రెండ్లూ, ‘మానియా’లూ ఎక్కించి తమ చెత్త సరుకంతా వారిచేత కొనిపించటం? అప్పుడది తమ నెట్ వర్క్ కి, నల్లమేక నలుగురు దొంగలు కథలోని తోడు దొంగల్లా ముసలివాడి లాంటి ప్రజలని నమ్మిస్తూ చేసే వ్యాపారం కాస్తా ప్రజలకి అర్ధమైపోతే ఇంకేమైనా ఉందా? ప్రజలు ఇక తమనెలా నమ్ముతారు? మందార మకరంద మాధుర్యమునదేలు మధువంపు మదనములకు పోనట్లే సత్యానేషిలై, సత్యదర్శనంతో ఆనందించటం నేర్చుకుంటే ప్రజలు కూడా తాము సృష్టించే ఒరవడులకి పడరు. కాబట్టే సి.ఐ.ఏ., కార్పోరేట్ కంపెనీలు అప్రమత్తం అయిపోయాయి. అప్పటికే నిగూఢంగా బలపడిన గూఢచార వంశం నకిలీ కణికుడూ బ్రిటిషు ప్రభుత్వం మాటున ప్రపంచమంతా తమ అదృశ్యహస్తాన్ని విస్తరించీ, విస్తరిస్తూ ఉన్నాడు.

ఇక్కొడొక విషయం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. మనకు తెలియని, సుదూర ప్రాంతంలోని ఓ వ్యక్తి ఏదైనా ఘనకార్యం సాధించాడంటే మనలో చాలామంది ’అబ్బో! అపూర్వం’ అంటారు. అదే మనకి తెలిసిన, మన దగ్గరలోని వాడే అంటే “ఆ! వాడికంత సీన్ లేదులే!” అంటారు. వాడినే ఏ మీడియానో లేదా ప్రక్క దేశం వాళ్ళో గుర్తిస్తే అప్పుడు ప్రక్క వాళ్ళతో “అతడిని రోజు చూస్తూనే ఉంటానండి. చాలా మామూలుగా ఉంటాడు. అతడి దగ్గర ఇంత సీన్ ఉందని నేను ఇప్పటికీ నమ్మలేకున్నాను” అంటారు. దీనికి కారణం బాల్యం నుండే పాతుకుపోయిన ఆత్మన్యూనత కావచ్చు, లేదా ‘మనకీ తెలిసిన వాడు, మన దగ్గరలోని వాడు కదా అన్న చులకన’ కారణం కావచ్చు, లేదా భావ బానిసత్వం కారణం కావచ్చు. ఆ ఘనకార్యం మంచి అయినా చెడు అయినా మనలో చాలా మంది ప్రతిస్పందన ఇలాగే ఉంటుంది. ప్రపంచమంతా విస్తరించిన Divide and Rule అన్న Policy ప్రకారం, మరికొన్ని దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందేమో. కాబట్టే హైదరాబాద్ కీ నకిలీ కణికుడికీ సంబంధం ఉందంటే నమ్మబుద్దికావటం లేదు చాలామందికి. అదే విదేశాల్లోని ఏ ప్రాంతానికో చెందిన వాడంటే నిర్వివాదంగా ఒప్పుకుంటారేమో! ఎవరికో సాధ్యం అయినప్పుడు అది మనకి తెలిసిన, మన ప్రాంతం వాడికి మాత్రం ఎందుకు సాధ్యం కాదు? ఇలా ఆలోచిస్తే నకిలీ కణికుడి అస్థిత్వం, పనితీరు మనకి బాగా అర్ధమౌతాయి.

సరే, ఈ మీమాంస ఇక్కడికి వదిలేసి మళ్ళీ AD 1893, అమెరికా దగ్గరికి వచ్చేద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

6 comments:

చాలా పొడవుగా,చాలా భాగాలుగా ఉన్న ఈ బ్లాగులో కిందకీ మీదకీ వెళ్ళి వెతుక్కోలేకపోతున్నా! ఇంకా దొరకలేదు.అందుకని, దయచేసి మూడు ప్రశ్నలకి సమాధానమివ్వండి :

౧. నేను కణిక వ్యవస్థ/కుటుంబం/వంశం ఉన్నదని నమ్మేశాను. ఇప్పుడు మీ అభిప్రాయంలో ఆ కణికులెవరో చెప్పగలరా? అంటే:
ఇప్పటి మన సమాజంలో కణికులు ఎవరు!? నాగమ్మ -సోనియా గాంధీ,NTR,రామోజీ వరకు అర్ధమయ్యారు.ఇంకా కొన్ని అలాంటి ప్రముఖుల పేర్లు చెప్పండి.

౨.కణికులు కాని వ్యక్తులు ఎవరు!?
పి.వి నరసింహారావా!? అలా మీర్రాసినట్టు అనిపించింది ఒక చోట. కానీ,ఆయన కాలంలోనే కదా మీరు ఫిర్యాదు ఇచ్చానన్నారు!? పోనీ, ఇందిరాగాంధీ అనా!!ఇప్పుడు NTR లాగా చిరంజీవి కణికుడా, కాదా!!ఎవరు!!??

3.అసలు చివరికి వీటంతటికీ లభ్థిదారులెవరూ!?(ఎందుకంటే రామీజీ లు, సోనియా గాంధీలు కణికుల చేత ఇంప్లాంట్ చేయబడ్డ కణికులు కదా!అసలు లబ్ధిదారులెవరు.లేక వీరంతా మళ్ళా పంచుకుంటారా!?)

పై ప్రశ్నలు నా కర్ధమయినదాన్ని బట్టి అడిగినవి.కాక,వీటన్నిటికి విరుద్ధంగా మీ అభిప్రాయం కేవలం "విభజించి పాలించి" లబ్ధి పొందుతున్న వ్యవస్థలో వ్యక్తులందరూనా!?

Anonymous garu,

క్రింది link లో గల నా గత టపా చూడగలరు.
http://ammaodi.blogspot.com/2008/12/blog-post_08.html#comments

ఏంటో , మీ దృస్టి లో మంచి వాళ్ళు ఎవరైనా వున్నారా? మంచి, చెడ్డల కలయికే కదా మనిషి. ఈ మంచి ,చెడు కూడా కాలానుగుణంగా మారుతుంటాయి కదా ? ఈ రోజు మీకు చెడు అనిపించింది నాడు మంచి జరుగుతుందని చేసి వుండవచ్చు కదా?

so u are asking me to read all the posts! mmm..ok.

can at aleast on my understanding with respect to Q1 and Q2. because u ve already written the names in ur posts. the reason is this: i need to have a consistency in my understanding of your posts. While u seem to support yourself from the media reports, you also seem to say they are just creations as per their convenince. Those are two contradictory things unless you had reason to beleive that some are out of this Kanika rule; isn't it!?

at least i have to beleive you are not part of the Kanika implant. isn't it!? similary i need to know who among, your 19 posts, had been working/fighting like you or who tried to undertand the working of the kanika!?

please provide that list: just from this blog, so that i need read your posts like a suspense novel in which i keep suspecting the real villains.

నిన్న నా ఇంగ్లీషు కామెంట్ ప్రచురింప బడలేదు అంటే నా భావాన్ని మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారేమో అని మళ్ళా తెలుగులో అడుగుతున్నా.

మీ బ్లాగుని అర్ధం చేసుకునేటప్పుడు, లాజిక్ లో చిన్న కంఫ్యూజన్. ఎవరన్నా వ్యవస్థలో మీలాగా కణికులు కాని వారున్నారని మీరు భావించబట్టే , కొన్ని మీడియా ప్రచురణలను సాక్ష్యాలుగాను,కొన్ని మీడియా ప్రచురణలను కణిక ప్రచారంగానూ మీరు చెప్ప గలిగి ఉండాలి.కానీ, నాకొక్క చోట ఒకే వ్యక్తి చెప్పిన దాన్ని కాసేపు కణికంగానూ,కాసేపు వాస్తవంగాను మాట్లాడుతున్నట్టు అనిపించింది.

ఇది నా అపోహగావచ్చుగాన,నాకు క్లారిటీ ఇమ్మని అడుగుతున్నాను.

ఇంతవరకు మీరు రాసిన రచన వరకైనా మీ దృష్టిలోని కణీకుల లిస్టూ, కానీ వారి లిస్టూ ఒకటి ఇస్తే, నేను -నాలాంటి వాళ్ళు కొంచెం తేలికగా అర్ధం చేసుకుంటాము అని నా భావం.

Anonymous garu,

క్రింది లింక్ లోని నా టపా చూడగలరు.
http://ammaodi.blogspot.com/2009/01/blog-post_17.html,

భాస్కర రామి రెడ్డి garu,

నేను ఈ బ్లాగుని ఎవ్వరి పట్లా వ్యక్తిగత అభిమానంతోనో, లేక వ్యక్తిగత ద్వేషంతోనో వ్రాయటం లేదండి. జరిగిన, జరుగుతున్న కుట్రని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను కుట్రలోని వాళ్ళ భాగస్వామ్యం గురించి మాత్రమే చర్చిస్తున్నాను. ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడైనా తన భార్యబిడ్డలకి ప్రేమాస్పదుడే అవుతాడు. అలాగే ఓ వ్యక్తి దావూద్ ఇబ్రహీంతోనో, బిన్ లాడెన్ తోనో స్నేహం చేస్తే ఆ వ్యక్తికి వాళ్ళలోనూ మంచిలక్షణాలు కన్పిస్తాయి.

*********

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu