1968 లో సోనియాగాంధీ ఇండియాకి వచ్చింది. 1969 లో ఇందిరాగాంధీ ఇంట కోడలిగా, రాజీవ్ భార్యగా అడుగుపెట్టింది. వివాహానికి పూర్వం ఆవిడ అమితాబ్ బచ్చన్ ఇంట అతిధిగా ఉంది. ఆ కుటుంబంతో సోనియా గాంధీకి సన్నిహిత స్నేహసంబంధాలుండటం అప్పటి వార్తల్లో ప్రధానాంశంగా ఉండేది. ఆవిడ అమితాబ్ బచ్చన్ ని ’అమిత్ భయ్యా’ అని పిలిచేది. [ఇలా అని సోనియాగాంధీ స్వయంగా చెప్పినట్లూ ఓ ఇంటర్యూలో ప్రచురించారు.] ఈ స్నేహం 1991-92 ల దాకా కొనసాగింది. రాజీవ్ గాంధీ దహన సంస్కారలప్పుడు కూడా సోనియాకీ, అమితాబ్ పెద్దదిక్కుగా వ్యవహరించాడు. 1980 ల్లో సంజయ్ గాంధీ మరణానంతరం, ఇందిరకు మద్దతుగా రాజీవ్ రాజకీయరంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు సోనియా గాంధీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆడబెబ్బులిలా[like a tigress] వ్యతిరేకించానని ఆవిడే అన్నట్లుగా పైన చెప్పిన ఇంటర్ వ్యూలో చదివాను. ఆ ఇంటర్ వ్యూ 1992 లో ఇండియా టుడే లోనూ ఇతర పత్రికల్లోనూ ముద్రితమైంది. అప్పుడు అంటే 1980 లో సోనియాగాంధీ నిర్ణయాన్ని అమితాబ్ బచ్చన్ సమర్ధించాడని వార్తలు అప్పట్లో ఉండేవి. అమితాబ్ బచ్చన్ కూడా తర్వాత అంటే 1980 ల్లో రాజకీయాల్లోకి రావడం అందరికీ తెలిసిందే. పార్లమెంట్ సభ్యుడిగా కూడా కొంతకాలం అతడు పనిచేసాడు. అలాగే 1996 తర్వాత కూడా సోనియాగాంధీని రాజకీయాల్లోకి ప్రవేశించవద్దని సలహా ఇచ్చాడని వినికిడి. అప్పటికి అతడి రాజకీయ కెరీర్ వెనుకంజలో పడింది కూడా! అయితే ఏం జరిగిందో తెలియదు గానీ 1992 తర్వాత అమితాబ్ – సోనియాల మధ్య స్నేహ సంబంధాలు సన్నిగిల్లాయి. 1998 తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలోనే అమితాబ్ కుమారుడు అభిషేక్ – ఐశ్వర్యరాయ్ ల వివాహానికి సోనియా కుటుంబం హాజరవుతుందా అన్న చర్చ ఆ మధ్య అంతటా ఆసక్తి గొలిపింది. ’అర్ధం లేని ప్రశ్న’ అంటూ సోనియా కుమార్తె ఈ ప్రశ్న అడిగిన విలేఖరికి తెగేసి చెప్పటంతో చర్చ ముగిసింది.

అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఇప్పడందరికీ తెలిసిన విషయమే, ముంబాయిలోని హిందీ సినిమారంగం, సినీ నటీనటుల కెరీర్ ఐ.ఎస్.ఐ. ఏజంట్లయిన దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ వంటి మాఫియాలీడర్ల కనుసన్నల్లో ఉందన్నది. అటువంటప్పుడు సోనియా గాంధీ – అమితాబ్ బచ్చన్ ల నాటి స్నేహ సౌభాతృత్వాలనీ, నేటి ఉదాసీన ఎడాపెడా ముఖాలనీ ఎందుకు సందేహించగూడదు? అందునా ఈ స్నేహ సంబంధాలు 1992 తర్వాత, అంటే ఏ సంవత్సరంలో అయితే రామోజీరావు వంటి ప్రధాన కుట్రదారు ఉనికి నాటి భారత ప్రభుత్వానికి తెలిసిందో ఆ తర్వాత అంతరించిందంటే, ఏ నిఘా సంస్థల కన్నుగప్పడానికి ఈ స్ట్రాటజిక్ వైరుధ్యం సృష్టించబడిందో?

మళ్ళీ 1971 ఇండో – పాక్ యుద్దానంతర కాలం దగ్గరికొద్దాం. యుద్దానంతర విజయం ఇంటా బయటా ఉత్సాహపరచగా భారతీయులు, ఇందిరా గాంధీ హయంలో హరితవిప్లవం పేరిట అధిక ధాన్యోత్పత్తి సాధించారు. దాంతో ధరలు అందివచ్చాయి. [ఇప్పుడూ రికార్డుల ప్రకారం అధిక ధాన్యోత్పత్తి జరిగిందనీ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పత్రికల్లో ప్రచారం చేస్తుంది కాని బియ్యంధరలు మాత్రం 30/- దాటి మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఇలాంటి మాయా మతలబు లెక్కలు కావు ఆనాటివి. ఆనాడు అధిక ధాన్యోత్పత్తి జరిగింది అని ప్రభుత్వరికార్డులు చెబితే తదనుగుణంగా ప్రజల అనుభవానికి కూడా ధాన్యపు ధరలు తగ్గేవి. దీనికి విరుగుడుగా తర్వాతి దశాబ్ధంలో అన్ని వస్తువుల ధరల కంటే ఉల్లి ధర అమాంతం హఠాత్తుగా పెరిగి ఇందిరాగాంధీని గొప్ప ఇబ్బందిలోకి నెట్టింది. అలాగే పాల పొడి డబ్బాల ధరలు కూడా. ఆ స్ట్రాటజీ గురించి తర్వాత వివరిస్తాను.]

ఇక హరిత విప్లవంతో పాటు శ్వేత విప్లవం అంటూ పాలు, పాల ఉత్పత్తులు పెంచే ప్రాజెక్టులు చేపట్టారు. అంతేగాని పింఛన్లూ, రేషన్ బియ్యం, ఆరోగ్యశ్రీ అంటూ [చేపలు ఇచ్చే] సంక్షేమ పధకాలు చేపట్టలేదు. ప్రజల ఉపాధి పెరిగేటట్లు, ప్రజలు తమ కాళ్ళు మీద తాము నిలబడేలా చేయాలని యోచించిన [చేపలు పట్టడం నేర్పే] ప్రాజెక్టులు చేపట్టారు.

ఈ విజయాలతో పాటు, ఇందిరాగాంధీకి నాటి పత్రికల్లో అధికభాగం నైతికమద్దతుగా ఉండేవి.

ఇక మెల్లిగా ప్రధాని ఇంట్లో ఇన్ స్టాల్ చేయబడిన ట్రాన్స్ ప్లాంటర్, [స్పై] ఇంటికోడలు హోదాలో స్థిరపడిన తాలూకూ అడ్వాంటేజ్ లు బయటికి తేవటం మొదలు పెట్టారు కుట్రదారులు. [సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిషు, అనువంశిక నకిలీ కణికుడు వారి మద్దతుదారులు] ముందుగా ఇంటికోడలు సోనియా గాంధీ ఆ ఇంట నమ్మకం సంపాదించుకొనే వరకూ చాలా సహనంగా వేచి ఉన్నారు. నిజం చెప్పాలంటే సోనియాగాంధీని, అత్త ఇందిరాగాంధేయే కాదు, యావత్భారత దేశమూ ఇంట అడుగపెట్టిన కోడలన్నట్లే అదరించింది, విశ్వసించింది. ఏ మాత్రమూ శంకించలేదు. ఎందుకంటే అది భారతీయుల జన్మతః సంస్కారం. ఇంటి కోడల్ని అనుమానించకూడదన్న సెంటిమెంటు. దాన్ని అఙ్ఞానం అనీ అమాయకత్వం అనీ అనవచ్చోలేదో గానీ సంస్కారం అనిమాత్రం అనవచ్చు. “విదేశీయురాలైనంత మాత్రాన, ఇటలీ లో జన్మించినంత మాత్రాన, ఇంటి కోడల్ని అనుమానించకూడదు. దేశాల హద్దులకీ, జాతిభేదాలకీ అతీతమైనవి మానవతా విలువలు, మానవ భావోద్వేగాలూ, ప్రేమానుబంధాలు. పాశ్చాత్య దేశాల వారికి ప్రేమలూ, అనుబంధాలూ, అప్యాయతలూ, విలువలూ ఉండవనుకోవడం ఒకవిధంగా జాత్యహంకారమూ, జాతివివక్షా వంటివే. పుట్టుకని బట్టి మనిషిని సందేహించటం కుసంస్కారమే” – ఇదీ భారతీయుల సెంటిమెంటు. ప్రక్క మతాన్ని విమర్శించకూడదు అనుకొనే ఈ సంస్కారం విషయంలో కుట్రదారులు పాకిస్తాన్ కు అనుకూలంగా ముస్లింలను, క్రైస్తవంకు అనుకూలంగా సోనియాగాంధీని ఉపయోగించుకోవటం ఇప్పుడు మనకి కన్పిస్తుంది.

కాబట్టే సామాన్య ప్రజలు గానీ, నాటి ప్రభుత్వ వ్యక్తులు గానీ, నిఘా సంస్థలు గానీ, స్వయానా అత్తగారూ, దేశప్రధాని అయిన ఇందిరాగాంధీ గానీ సోనియా గాంధీని సందేహించలేదు. [ఇప్పుడు 2004 లో అధికారంలోకి యు.పి.ఏ. వచ్చాక, అంతకు ముందు 1998 లో AICC అధికార పగ్గాలు చేపట్టాక కదా నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి!] అంతేగాక సోనియాగాంధీ నటనా కౌశలం కూడా చాలా గొప్పది. గొప్ప శిక్షణతోనూ, తర్బీదు తోను పూర్తిగా రాటుతేలిన నటనా వైదుష్యం అది. తెర మీద లేదా స్టేజి మీద నటించే వారే తెలుసు మనకు. నిజ జీవితంలో నటించ గల నైపుణ్యం నిజంగా అనుభవంలోకి వచ్చాకే తెలుసుకోగలం. కాబట్టే అందుకోసమే ప్రత్యేక శిక్షణ తీసుకొని వచ్చిన సోనియాగాంధీ, జయప్రదంగా, తన కార్యకలాపాలని ఎవరికీ అనుమానం రానంత నేర్పుగా నిర్వహించుకు రాగలిగింది. ఎంత నేర్పుగా అంటే ఎమర్జన్సీ అనంతర క్లిష్ట, కష్ట దశలో ఇందిరాగాంధీకి సోనియా గాంధీ ఎంతగా తలలో నాలుక అయ్యిందంటే ‘కోడలు కాదు, కూతురు అన్నంతగా’ అంతగా నమ్మించగలిగింది కాబట్టే అత్తగారి motives, moods, opinions, emotions – అన్నిటినీ ముందస్తుగా బయటికి చేరవేయగలిగింది. ఎంత Advanced Technology ని ఉపయోగించిందో మరి!

ఇక్కడ మరో అంశం ఏమిటంటే – కుట్రదారులు కూడా సోనియా గాంధీ, భారత ప్రధాని ఇంట్లో నమ్మకంగా స్థిరపడేదాకా Time allow చేశారు. తదనుగుణమైన డ్రామాలే నడిపారు. నమ్మించగలిగామన్న పూర్తి నమ్మకం కలిగాక ఇక అప్పుడు ఈనాడు రామోజీరావు పత్రికాధిపతిగా అవతరించాడు. అయితే ఇది అంటే ’ఈనాడు’ చాలా చిన్న పత్రిక. స్థానిక భాషా పత్రిక. జాతీయ పత్రికలైన The Hindu, The Indian Express లాంటి పత్రికల మీద, వాటి ఎడిటర్ లైన ఎన్.రామ్, రామ్ నాధ్ గోయంకా మొదలైన వ్యక్తుల మీద భారత నిఘా సంస్థల దృష్టి పడేట్లు ’హైజాక్’ స్ట్రాటజీ అమలుచేయబడింది. దృష్టి అంతా అక్కడ కేంద్రీకరింప చేసి చల్లగా తమపని తాము చేసుకోవటం అనే స్ట్రాటజీ ఇదే. బ్యాంకులో డబ్బు డ్రా చేసుకొచ్చే కస్టమర్ మీద దొంగలు ప్రయోగించే ట్రిక్ లాంటిది. చిన్న పరిణామంలో చూస్తే అంత సింపుల్ ట్రిక్. పెద్ద పరిమాణంలో చూడాలంటే ఎంతో క్లిష్టమైన ట్రిక్.

సహజంగానే అందరూ ఒక స్థానిక భాషా పత్రికకు అధిపతి అయిన ఓ చిన్న వ్యాపారికి అంత సీన్ ఉంటుందని అనుకోరు. అదే పెద్ద రక్షణ కవచం. అందునా ఏమాత్రం ప్రమాద హెచ్చరిక అన్పించినా పత్రికా స్వేచ్ఛ అన్న స్లోగన్ ఎత్తుకొని తప్పించుకోవచ్చు.

స్వాతంత్ర సమయంలోనూ, 1962 చైనా యుద్ధం, 1965, 1971 ల్లో ఇండో – పాక్ యుద్దాల్లోనూ అప్పటి ఇండియా మీడియాలో అత్యధిక భాగం, నిజాలు వ్రాస్తూ, దేశభక్తినీ, స్ఫూర్తినీ ప్రజల్లోనూ, సైనికుల్లోనూ నింఫుతూ భారత్ కోసం పరిశ్రమించాయి, ప్రభుత్వానికి మద్దతుగా కృషి చేశాయి. అందుకే కుట్రదారుల తదుపరి తంత్రం మీడియా అయ్యింది. ఎక్కడ ఓటమి ఎదురయ్యిందో అక్కడి నుండే మళ్ళీ ప్రయత్నం ప్రారంభించడమన్న స్ట్రాటజీ ఇది.

ఈ స్ట్రాటజీలో భాగంగానే రామోజీ రావు తన ’ఈనాడు’ ని సంచలనాత్మకంగా [టెక్నాలజీ పరంగా కూడా] సమాజంలోకి ప్రవేశపెట్టాడు.

ఆ రోజులలో ఆనాటికి మార్కెట్లో ఉన్న పేపర్లన్నీ ప్రజలకి ఆలస్యంగా చేరేవి. ఒక్కోరోజు ఉదయం 11 గంటలయ్యేది. పేపరూ, ముద్రణా కూడా నాసిగా ఉండేవి. అంతేగాక ముద్రారాక్షసాలు ఎక్కువుగా ఉండేవి. నలుపు తెలుపు ఫోటోలతో, అనాసక్తి కరమైన వార్తా శీర్షికలతో, రొటీన్ వార్తలతో, తక్కువ పేజీలతో ఉండేవి.

అయితే ’ఈనాడు’ పత్రిక మార్కెట్లోకి రావడమే రాకెట్ లా దూసుకొచ్చింది. నాణ్యత గల, మృదువుగా మెరిసే పేపరు. ఆకర్షణీయమైన రంగుల్లో ముద్రణ. ముద్రారాక్షసాలు లేవు. రంగురంగుల వర్ణచిత్రాలు. ఆసక్తికరమైన, శృతి లయలతో, ప్రాసలతో కూడిన పతాక శీర్షికలూ, వార్తా శీర్షికలు! చదివించే కధనాలు. మనస్సుకి హత్తుకునే విధంగా వ్రాయబడిన వార్తలు. ఎక్కువపేజీలు. సరసమైన ధర. రకరకాల, వైవిధ్యపూరిత పేజీలు, క్రీడా పేజీ, సినిమా పేజీ, పిల్లలకీ రోజూ కార్టూన్ కథ ….. ఇలా. ధర కంటే కూడా నాణ్యత చాలా ఎక్కువుగా ఉండింది.

అంతేగాక ప్రారంభంలో ప్రజలు ’ఈనాడు’కి అలవాటు పడేందుకోసం, ప్రచారంలో భాగంగా కొన్నిరోజులపాటు పేపరు ఉచితంగా, ప్రజలకి, సూర్యోదయానికి ముందే ఇంటి గడపలోకి ఇవ్వబడింది. ఇవన్నీ వ్యాపార పరంగా, విజయ సోపానాలే. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతీయులకి ’టీ’ అలవాటు చేసేందుకు గ్రామ కూడళ్ళల్లో పొలాలకి వెళ్ళే రైతులకి కొన్ని రోజుల పాటు ఉచితంగా ’తేనీరు’ అందించిన స్ట్రాటజీ ఇక్కడ కన్పిస్తుంది. అంతే! మా వూరిలో ఈనాడు వారం రోజులు ఉచితంగా ఇవ్వబడింది. అప్పటికి విద్యార్ధి దశలో ఉన్నమాకు అదో సంచలనమే.

ఆవిధంగా ‘ఈనాడు’ సంచలనాత్మక వ్వాపార విజయాన్ని నమోదు చేసింది. కుట్రదారులకు మద్దతుదారులైన కార్పోరేట్ కంపెనీల వారు ’ఈనాడు’ విజయానికి సాక్షీభూతంగా తమ వ్యాపార ఉత్పత్తుల వాణిజ్యప్రకటనలను భారీఎత్తున ’ఈనాడు’కి ఇచ్చారు. ఇదంతా ప్రజల్ని మరింత అకర్షించింది. ఫలితంగా పేపర్ circulation పెరిగింది. ఈనాడు circulation పెరిగింది కాబట్టి కార్పోరేట్ కంపెనీలు తమ వాణిజ్యప్రకటనలకు ఈనాడుని మరింతగా prefer చేశాయి. ఇది మరింత circulation ని పెంచింది….. ఇలా ఇదో చక్రభ్రమణం. దీంతో అనివార్యంగా అన్ని పత్రికలు ఇదే ట్రెండ్ ని తొక్కాయి. లేకుంటే వ్యాపార పోటీ తట్టుకోలేరు కదా!

నెమ్మదిగా, సహజంగా అన్ని పత్రికలూ ఈనాడుని ఫాలో అవటం మొదలెట్టాయి. పత్రిక ముసుగులో ఈనాడు మెల్లిగా తన కుట్రని అమలుచేయటం ప్రారంభించింది. దీన్ని గురించిన మరిన్ని వివరాలు Coups on World లోని Responsibility of Media లో పొందుపరిచాను. తరువాతి టపాల్లో ’ఈనాడు’ వ్రాతల్లోని మతలబు ఏమిటో, అది ఏవిధంగా కుట్రలో భాగమో వివరిస్తాను.

’ఈనాడు’ – నాణానికి ఒకవైపు అయితే, ఇందిరాగాంధీ ఇంట్లో ట్రాన్స్ ప్లాంట్ చేయబడిన ఏజంటు సోనియా గాంధీ, నాణానికి రెండో వైపు వంటిది. ప్రధాని ఇంట్లోని వ్యక్తిగా ప్రధాని ఇంటి [PMR] లోనూ, ప్రధాని అఫీసు [PMO] లోనూ జరుగుతున్న విశేషాలని ఎప్పటికప్పుడు బయటికి చేరవేయగలిగింది. ఎంత అధునాతన రహస్య సమాచార టెక్నాలజీ వాడారో తెలియదు గానీ అతి నైపుణ్యంగా మాత్రం ఆ పనిని ఆ నటి నిర్వహించింది. అంతేగాక ప్రధానమంత్రి తత్కాల, తాత్కాలిక emotions తాలూకూ information ని కూడా చేరవేసేది. అంటే ఎలాంటి విషయాల మీద ఇందిరాగాంధీ ఇరిటేట్ అవుతోంది, బ్యాలెన్స్ కోల్పోతోంది, ఎలాంటి లేదా ఏ విషయాల మీద ప్రస్తుతం ఆసక్తితో ఉంది, ఇలాంటి వన్నీ. ఈ సమాచారం కుట్రదారులైన సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., అనువంశిక నకిలీ కణికులకి ఇందిరాగాంధీని మరింత ట్రబుల్ చేయడానికీ, ఇరిటేట్ చేయడానికి, మిస్ గైడ్ చేయటానికి, ఎంతో సహాయపడింది. ఈ సౌలభ్యంతో ప్రభుత్వ యంత్రాంగపు పనితీరుని సైతం బడిదుడుగులకు గురిచేయగలిగారు. ఇక ఇందిరాగాంధీ ఊపిరి సలుపుకోవడానికి వీల్లేనంతగా సమస్యల వెల్లువ సృష్టించబడినది. అన్నీ ద్వంద్వపూరిత విషయాలే అంటే Paradox అన్నమాట. మీరు వెనక్కి పరిశీలించి చూడండి – సోనియా గాంధీ అడుగుపెట్టిన తర్వాత ఇందిరాగాంధీ, అలాగే ఇండియా కూడా సమస్యల వలయంలో కూరుకుపోయింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

6 comments:

i wonder how you could write such long and large posts along with proper reasoning at the rate of at least one post per day.Hats off to you madam. they are very much informative too.i don't understand one thing.on one hand enaadu criticizes ysr but it accepts and publishes many ads that too in front and back pages and also on special pages too involving huge sums of public money praising ysr's govt. and its activities.
the inference i draw is that eanaadu and ysr are both equal to one another and the readers,if they believe these ads, may again vote for congress --and they both will go on repeating the same game on public once again involving huge public funds.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారూ,

మీ పరిశీలన నిజమండి. మనం ఇలా పరిశీలిస్తూ పోతే జరుగుతున్న చాలా విషయాల్లో ఇంకా స్పష్టత పెరుగుతుంది.

ఈనాడు మొదట్లొ బ్లాక్ & వైట్ లొ వుండెది కదా? ఆకర్షణీయమైన రంగుల్లో ముద్రణ అని రాశారు?

నేను చాలాసార్లు అబ్బురపడ్డాను మీరు రోజుకో టపా రాయడం చూసి, అన్ని టపాలు కొండవీటి చాంతాడులా ఉంటాయి. మీ రహస్యమేంటి. నాకో అనుమానం మీరు ఉపాధ్యాయిని కదా పిల్లల్కు పాఠాలు చెబుతున్నారా? :)

మంచుపల్లకి గారు,

రామోజీరావు ఈనాడుని మొదట 1974 లో వైజాగ్ ఎడిషన్ గా ప్రారంభించాడు. 1975 లో హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమయ్యింది. తర్వాత సంవత్సరాల్లో విజయవాడ ఎడిషన్ వచ్చింది. విజయవాడ ఎడిషన్ రావటమే వర్ణచిత్రాలతో వచ్చింది. కాబట్టి మా స్మృతిపధంలో అదే గుర్తుంది. అలాగే హైదరాబాద్ వారికి మొదట నలుపు తెలుపు ఫోటోలు, తర్వాత రంగుల ఫోటోలు గుర్తుండటం సహజం గదా! మొత్తంగా నా టపాలో నేను చెప్పిందేమిటంటే – వార్తాపత్రికల్లో వర్ణచిత్రాలను మొదటగా అతడే ప్రవేశపెట్టాడనీ, అతడే ట్రెండ్ సెట్టర్ అనీ. ఒక్క వర్ణచిత్రాలే కాదు, మొత్తంగా వార్తాపత్రికల్లో ‘ఈనాడు’ కొత్త ఒరవడి సృష్టించిందని స్వయంగా రామోజీరావే సగర్వంగా ప్రకటించుకోవటం మనకు తెలియంది కాదు.

పేపర్ చదవడం అన్న మంచి అలవాటు ఈనాడు తోనే మొదలయ్యింది. చినప్పటి నుంచి ఈనాడు చదవే అలవాటు అవడం తో వేరే పేపర్ కి కళ్లు సెట్ అవడం లేదు . పేపర్ వచ్చిన కొత్తల్లో ఆదివారం నమ్మలేని నిజాలు అంటు 'దెయ్యం పట్టిన రైలు '
అన్న సంఘటనలో ఒక వూళ్ళో పూర్తీ గా జనాలతో నిండిన రైలు సిగ్నల్ తో ఏ మాత్రం సంభంధం లేకుండా సంవత్సరం లో ఒక రోజు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ దూసుకు పోతూ వుంటుంది. స్టేషన్ మాస్టర్ ఇతరులు ఎన్ని విధాల అపుదమన్న అది ఆగదు తర్వాత విషయం కనుక్కుంటే అదే సంవత్సరం అదే రోజు ఆ రైల్ ప్రమాదానికి గురయ్యి వందలాది మండి చని పోవడం తో ఆ దయ్యం పట్టిన రైల్ ప్రతి సంవత్సరం ఆ స్టేషన్ మీదు గా దూసుకు పోతుందని కధనం.చినప్పుడు చదివిన అ సంఘటన నాస్మృతి పదం లో వుండి పోయింది.చాల కలం క్రితం ఈ శిర్షిక తీసేశారు.అలాగే అంజయ్య , యాదగిరి హెలికాప్టర్ మీద పాపా గారి కార్టూన్స్. ..ఈనాడు లో బొమ్మల విషయం లో సభ్యత పాటించేవారు మొన్నటి దాక deccan chronicle లో లా pub లో మందు కొడుతున్న అమ్మాయిలు కురచ దుస్తుల్లో వేసే వారు కాదు కానీ ఈ మద్య dc ని అనుకరిస్తూ pub ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.లక్ష్మి గారు మీరు వుహిస్తున్నంత కుట్ర ఈనాడు ద్వార లేదని నా అభిప్రాయం బహుశా మీరు భూతద్దం లో చూస్తున్నారేమో ?అంత కాంగ్రెస్ అభిమాని అయి వుంటే ntr కి అంత ప్రచారం ఇచ్చి cm అవడానికి దోహద పడే వారు కాదేమో .చెన్నారెడ్డి టైం లో విద్యుత్ సౌధ దాటగానే రోడ్ మీదకి చిన్న గార్డెన్ దాని లో ఈనాడు బోర్డు అందం గా ఖైరతాబాద్ నుంచు టర్న్ అవగానే కని పించేది మేము ఎర్రమంజిల్ లో వుండేవాళ్ళం ఖైరతాబాద్ దాటి లోపలికి రాగానే కుడి పక్క ఆంజనేయుడి గుడి కొంచెం ముందుకు రాగానే ఈనాడు బోర్డు ఇల్లు వచ్చేసిందన్న సంతోషం అదో గొప్ప అనుభూతి. చెన్నారెడ్డి ముందు గా encroachment అని ఆ గార్డెన్ బోర్డు పికిన్చేసారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లో చాల కష్టాలే ఎదుర్కున్న ఈనాడుకి, సోనియా రాక కి ,కుట్రకి సంభంధం అంటే ఆవకాయ బిర్యాని లా అని పిస్తోంది .

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu