ఈ రోజు ఏ చిన్న ‘రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి’ మీద ఐ.టి. గానీ, ఎ.సి.బి. గానీ దాడిచేసినా కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగు చూస్తున్నాయి. మామూలుగా మీడియా ఈ విషయాన్ని పెద్ద అక్షరాల్లో వేస్తుంది. అది తప్పుకాదు, అలా చేయటం పత్రికల బాధ్యత కూడాను. కాకపోతే ఆ రాతల్లో సదరు ఉద్యోగిని సిగ్గిల్ల చేసే విధంగా గానీ, పశ్చాత్తాప పడే విధంగా గానీ ఉండదు. “ఒర్నాయనో! ఎంత సంపదా, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎంచక్కా ఎంత సంపాదించుకోవచ్చు!” అనే విధంగా ఉంటాయి. అంతేకాదు తదుపరి వార్తల్లో, సదరు ఉద్యోగి ఏవిధంగా తన సస్పెన్షన్ కాన్సిల్ చేయించుకున్నదీ, పదోన్నతి పొందిదీ ‘అక్రమార్కులకే పట్టం’ ఇత్యాది శీర్షికలతో ప్రింటవుతాయి. [’ఏమిటి అవినీతి?’ అంటూ దూబగుంట్ల సారా ఉద్యమంలా విడవకుండా చేసే పోరాటం ఉండదు] డబ్బుతో మేనేజ్ చేసిన సదరు ఉద్యోగి…... మళ్ళీ రెట్టింపు అక్రమార్జన….. పట్టుబడితే మళ్ళీ డబ్బుతో మేనేజ్ చేయటం…. ఆలోచించండి. ఈ రకం వార్తలు సమాజంలోకి ఏరకమైన సంకేతాలు పంపుతాయో!
చాలా మామూలుగా ప్రజలు “Money makes many things” అనుకుంటారు. లేదా “ఈరోజుల్లో అవినీతి పరులు, డబ్బు మింగిన వాళ్ళే అన్నీ చేయగలుగుతున్నారు” లేదా “డబ్బుల కోసమే ఐ.టి., ఎ.సి.బి. దాడులు చేయిస్తుంటారు. తమ వాటా తమకు ముట్టగానే ఈ పొలిటిషియన్లూ, బ్యూరాక్రాట్లూ చక్కగా సదరు అవినీతి పరుల కొమ్ముకాస్తారు” లేదా “ఇదంతా మామూలే! ఎన్నిసార్లు చూడలేదు? డబ్బుంటే కానిదేముంది! ప్రతి వాడి నిజాయితీకి ఓ రేటుంది, అంతే” అనుకుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ కల్పించడం ద్వారా పత్రికలు, ప్రజలకి సైకిలాజికల్ గా, అవినీతి చాలా మామూలు అన్న విషయం ఇంకిస్తాయి. సినిమాల్లో వయొలెన్స్ భయకరంగా చూపటం ద్వారా మనుష్యులలో సున్నితత్వాన్ని పోగొట్టం ఎలాగో ఇది అలాంటిదే. సినిమాల్లో స్త్రీలను అసభ్యకరంగా చూపటం ద్వారా ఆడవాళ్ళ పట్ల గౌరవభావం పోగొట్టడం ఎలాగో ఇది అలాంటిదే. ఇలా కుట్రదారులు తాము ఏరంగాన్ని ప్రభావితం చేయలనుకుంటారో వాటి మీద ఇలాంటివి ప్రయోగిస్తారు.
కావాలంటే తాజా ఉదాహరణ చూడండి. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు, జైల్లో ప్రత్యేక తరగతి సౌకర్యాలు పొందుతున్నాడనీ, ఆ కేటగిరి క్రింద ప్రత్యేక గది [attached bathroom], గ్యాస్ స్టౌ, వంట సౌకర్యం, బయట నుండి ఆహార సరఫరా అనుమతి, టివీ గట్రా సౌకర్యాలు సమకూరాయని ప్రచారించినంతగా…………
ఒకప్పుడు – రతన్ టాటాలూ, రామోజీ రావులూ వేదిక క్రింద ఆహూతుల్లో కూర్చోని ఉండగా, నాటి రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడూ, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ల సరసన, వేదిక మీద కూర్చొని వెలిగిపోయిన రామలింగరాజు, నేడు దొంగలూ, హంతకులూ, నేరగాళ్ళుండే జైలులో ఉన్నాడని ప్రచారించాయా? సిగ్గిల్ల చేశాయా? ప్రజల మనస్సుకి హత్తుకునేలా, నేరం చేస్తే ఎప్పుడైనా శిక్ష తప్పదు, అవమానం తప్పదు అని, దురాశ దుఃఖాన్ని తెస్తుందని ప్రచారించాయా? అదే తమకు కావలసిన ప్రచారమైతే చెవిన [మైకు] ఇల్లు కట్టుకొని పదేపదే ప్రచారిస్తాయి.
ఆ విధంగా కుట్రదారులు, మీడియాని జయప్రదంగా భారతీయుల మీద కుట్రని అమలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ప్రపంచమంతా కూడా మీడియా, ఇదే ప్రజల మీద ప్రయోగిస్తుంది.
ఇలాంటి కుట్రలో భాగంగానే మీడియా బాపూజీని తన కుటుంబం పట్ల Concern లేదనీ, తన కీర్తి ప్రతిష్ఠల మీదే ’యావ’ అనీ ప్రచారించాయి. ఇటీవల గాంధీజీ ముని మనమరాలు ఇలాగాంధీ “నిజంగా ఈప్రచారం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. గాంధీజీ తన కుటుంబం సభ్యుల మీద ప్రేమ వర్షం కురిపించారు” అన్నది. 2008 లో ఆవిడ దక్షిణాఫ్రికా నుండి ముంబైకి, ఓ కార్యక్రమంలో పాల్గొన డానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ ని నేను ఈనాడులోనే మధ్య పేజీల్లో ఓమూల అప్రాముఖ్య వార్తల్లో చదివాను.
నిజానికి మనం ఆయన వ్రాసిన సత్యశోధన[ఆత్మకథ] చదివినా, స్వాతంత్రసమరం లో ఆయన పాత్ర పరిశీలించినా, ఆ చిరునవ్వు వెనుక ఉన్న అపారప్రేమ అర్ధమౌతుంది. సామాన్య మనిషిగా, ఓ న్యాయవాదిగా ఆయన డర్బన్, దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్లేగు సోకిన తగిలిన ’గిరిమిటియా’లకి సేవ చేసేందుకు పరుగున వెళ్ళాడు. తన సాటి మనుష్యుల పట్ల ఆయనకి అపారప్రేమ. తన కుటుంబమంటే తన పిల్లలంటే తనకు చాలా ప్రేమ అని అయనే చెప్పుకున్నాడు. [ఆయన కుమరుల్లో ఒకరైన రామదాసు[?]కు తండ్రితో విభేదాలు కుట్రలో భాగమే.] ఎవరో తెలియని సాటి మనుష్యుల మీదే అంత ప్రేమ గల వ్యక్తికి తన స్వంత మనుషుల మీద ప్రేమ ఉండదా? ఈ ప్రచారంలో ఎంతో కుటిలతతో నిండి ఉంది. అంత ప్రేమ మూర్తి, సహన శీలి, సత్యదర్శి భగవంతుడి సృష్టిలో నిజంగా ఓ అద్భుతం.
ఆయన ‘My Experiments with Truth’ లో తన జలవైద్యం, మట్టివైద్యంల గురించి వర్ణించాడు. కస్తుర్బాకు జబ్బు చేస్తే ఓసారి తన స్వంత వైద్యమే చేశాడు. ఓ సారి తన రెండో కుమారుడికి జ్వరం వచ్చినప్పుడు అదే వైద్యం చేసాడాయన. ఆ సందర్భంలో ఆయన తన నమ్మకం మీద ధృఢంగా నిలిచిన తీరు మనల్ని అబ్బురపరుస్తుంది. ఆయనకి దేవుడి మీద ఉన్న నమ్మకం, తన కొడుకు మీది ప్రేమ, ఆ సన్నివేశాలు చదువుతున్నప్పుడు మనస్సుకి హత్తుకుంటాయి. ఆయనే స్వయంగా అన్నాడు “ముక్తి సాధనలో భాగంగానే నేను రాజకీయాల్లోకి వచ్చాను” అని. ఆయన అసిధారవ్రతం పాటించాడు. అంటే బ్రహ్మచర్యం. భార్య ఉండగా బ్రహ్మచర్యం. [ఎన్.టి.ఆర్. 70 సంవత్సరాల వయస్సులో రెండో పెళ్ళి, తరువాత స్టెరాయడ్స్ తీసుకొని, దాని ఫలితంగా మరణించాడని ఆరోపణ. అలాంటి వాడికి మీడియా ఇచ్చిన బిరుదులు యుగపురుషుడు, రాజర్షి, మహానుభావుడు మొదలైనవి.]
గీతలో చెప్పిన స్థితప్రఙ్ఞతని సాధించడానికి ఆయన జిహ్వతో సహా అన్ని ఇంద్రియాలు నియంత్రించేందుకు సాధన చేశాడు. అందులోని సాధక బాధకాలని అనుభవపూర్వకంగా తెలిసికొని వివరించాడు. అంతటి కర్మయోగి. అలాంటి ధృఢచిత్తం, ఆత్మస్థైర్యం గల వాడికి ఈ కుట్రదారులు ’కీర్తి కండూతి’ అన్న కామాన్ని, అపాదించగలిగారంటే అది దారుణమే కదా!
నిజానికి కుట్రదారుల ఈ ప్రచారం నీచం. ఇంతకంటే నీచం ఏమిటంటే 1980 ల్లో చాలామంది భారతీయులు ఈ ప్రచారానికి కన్విన్స్ అవ్వటం, ప్రభావితం అవ్వడం. వారిలో ఒక్కరు కూడా తమ జీవితంలో కనీసం ఒక్కరోజు కూడా అబద్దాలాడకుండా ఉండలేరు. కానీ తమ నాలుకని మాత్రం తాటి పట్టని ఉపయోగించినట్లు ఉపయోగించేవారు. వాళ్ళల్లో ఎవ్వరూ సత్యం పలక లేరు, సత్యం వినలేరు, సత్యం చూడలేరు, సత్యాన్ని నమ్మలేరు కూడా! కానీ యధేచ్ఛగా గాంధీజీ వ్యక్తిత్వం మీద మాత్రం వాదనలు చేసేవాళ్ళు.
నిజానికి బాపూజీ ఒక దార్శనికుడు. ఒక తత్త్వవేత్త. ఒక యోగి, ఒక గురువు, సత్యదర్శి. ఓసారి ఆయన యంత్రీకరణ గురించి మాట్లాడుతూ “ఒక యంత్రం లేదా ఒక పరిశ్రమ ఎక్కువమంది ప్రజల ఉపాధిని నలిపివేసేటట్లయితే, వారికి ప్రత్నామ్నాయం చూపేవరకూ ఆ యంత్రీకరణని వాయిదా వేయాలి. ప్రత్యామ్నాయం చూపలేకపోతే అసలు యంత్రీకరణనే ఆపివేయాలి” అన్నాడు. అదీ అయన దూరదృష్టి, ప్రజల జీవితం పట్ల ఆయనకున్న నిశిత ఆలోచనాపటిమ.
ఒక్కప్పుడు మన కాలనీలలో కొన్ని బేకరి కుటుంబాలు, స్వీటు తయారీదారులు, జంతికలు, ఆలూచిప్స్ వంటి తినుబండారుల తయారీదారులు తప్పనిసరిగా ఉండేవారు. అద్దాల పెట్టెల్లో స్వీట్లు పెట్టుకొని వీధుల్లో తిరిగే మర్వాడీ సేఠ్ లు ఉండేవాళ్ళు. ఇప్పుడు కుర్ కురే, అంకుల్ చిప్స్, హల్దీరామ్స్ మార్కెట్ ని గ్రిప్ చేయకుముందు ఎందరికో ఇలా ప్రత్యక్ష ఉపాధి ఉండేది. చిప్స్ ఒక్కటే కాదు, కారం, ఉప్పు, పసుపు, సేమ్యా, బిస్కట్లు ఇలా చాలా రంగాలలో కార్పోరేట్ వాళ్ళు వచ్చి చిన్న చిన్న వ్యాపారులు స్వతంత్రంగా బ్రతికే అవకాశం లేకుండా చేసేశారు. ఆకర్షణీయమైన రంగుల టీవీ ప్రకటనలు చిన్న వాళ్ళని మార్కెట్లోంచి తరిమేసాయి. ఇప్పుడు డ్వాక్రా సంఘాల నుండి జంతికల వంటి కొన్ని ఉత్పత్తులు మళ్ళీ మార్కెట్లో కన్పిస్తోన్నాయి. ఈ డ్వాక్రా సంఘాలు 1992 తర్వాత ప్రారంభింపబడ్డాయి. ఇలా చూస్తే, భారీగా ప్రవేశపెట్టబడిన పరిశ్రమలు ప్రత్నామ్నాయం చూపకుండానే చిన్నవారి ఉపాధిని పోగొట్టాయి కదా! ఇలాంటి ప్రమాదాలు ముందుగానే ఊహించగలిగిన స్వాప్నికుడు గాంధీజీ. ఆయన కలలు గన్న గ్రామరాజ్యం పాడిపంటలతో సుఖశాంతులతో తులతూగేది. అంతేగానీ పార్టీ, ముఠా కక్షలతో, ఫ్యాక్షనిజంతో [ఈ ముసుగులోనూ ఉంది వ్యాపార దందాయే.], గడ్డివాముల్ని, పంటకుప్పల్ని తగలబెట్టుకునే గ్రామాలని కాదు. మనస్సుని కోతితో పోలుస్తూ “చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు” అన్న గాంధీ గారి మూడు కోతుల బొమ్మ పిల్లల్ని అలరించేది.
మరో వాదన కూడా విన్నాము. భావవాదంలో ఓ Defect ఉందట. డబ్బుకోసమో, భౌతిక సుఖం కోసమో పరుగు పెట్టినట్లేనట కీర్తికోసం ప్రయత్నించడం కూడా! నిజమే, కీర్తి అంటే మంచిపేరు సంపాదించుకోవాలనుకోవటం, డబ్బు సంపాదించుకోవటం లాంటిదే! అయితే ఓ వ్యత్యాసం కూడా ఉంది. డబ్బుకోసం పరుగు ప్రక్కవాడికి కీడు చేయడానికి వెనుకాడదు. కానీ మంచిపేరు కోసం పరుగు ప్రక్కవాడికి మేలు చెయ్యాలని ప్రయత్నిస్తుంది కదా! అలాంటప్పుడు ఏది మంచి ’పరుగు’?
ధన సంపాదన, పుణ్యసంపాదన ఒక లాంటిదేనంటుంది గీత. ధనం ఇహలోక సుఖం కోసం, పుణ్యం పరలోక లేదా స్వర్గలోక సుఖం కోసం. రెండూ శాశ్వతం కాదు. పుణ్యం ఖర్చయిపోతే మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టే శాశ్వతమైన ముక్తి పొందమని చెబుతుంది గీత. అందుకోసం కర్తృత్వహంకారం [ఈపని నేను చేశాను అనుకోవటం], కర్మఫలాసక్తి, [దీని ఫలితం నాకే చెందాలి లేదా ఏ ఫలితం వస్తుందో అనుకోవటం] లేకుండా కర్తవ్యాన్ని ఆచరించమని చెబుతుంది గీత. ముక్తి మార్గసాధనలో అన్ని అరిషడ్వర్గాలనీ దాటుతూ, అన్నిటి పట్లా ఉదాసీనత పొందుతూ, అన్నిటినీ సన్యసిస్తూ క్రమంగా ముక్తిని కూడా త్వజించే స్థితికి సాధకుణ్ణి గీత తీసుకువెళ్ళుతుంది. కాబట్టే గీతలో అన్నిటికంటే చివరన ఉన్న 18 వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం అయ్యింది. ఎందుకంటే మోక్షమంటూ ఎక్కడో లేదు. ఇహంలోనే మోక్షం ఉంది. అని గీత మోక్ష సన్యాసయోగంతో చెబుతోంది. దీన్ని గురించిన వివరమైన చర్చ నా ఆంగ్లబ్లాగు Coups on World గీత వ్యాసంలో ఉంది. తెలుగులోకి అనువాదం తర్వాత చేస్తాను.
ఈ విధంగా మనిషిని మోక్షం పేరుతో మానవత్వం అనే Ultimate goal కి తీసుకువెళ్ళడమే గీత. అందుకే గీతని మత గ్రంధం అనకూడదు. అదొక జీవన విధానం. మోక్షసన్యాస యోగం దగ్గరికి మనిషిచేరితే అప్పుడు బ్రహ్మనందాన్ని పొందగలమంటుంది గీత. అందుకోసమే ఇంద్రియాలని నియంత్రించమంటుంది. స్థితప్రఙ్ఞత సాధించమంటుంది. ఎందుకంటే ఇంద్రియాలతో మనం పొందే సుఖం, ముందు అమృతతుల్యంగా అనిపించి పిదప విషపరిణామాలకి దారితీస్తుంది. [తాగుడూ, ధూమపానం కేన్సర్ కి దారితీసినట్లు, విచ్చలవిడి శృంగారం ఎయిడ్స్ కి దారితీసినట్లు] అయితే స్థితప్రఙ్ఞత కోసం, మోక్షం కోసం చేసే ప్రయత్నం మొదట విషతుల్యంగా అన్పించి పిదప అమృతతుల్యమైన బ్రహ్మనందాన్ని మనకి ఇస్తుంది. ఇది అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. అలా అనుభవంతో తెలుసుకున్న మహాత్ములు మనకి దాన్ని గురించి చెప్పి నడిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారినే మనం గొప్పవారిగా పూజిస్తాం. [ఇప్పటి మీడియా సృష్టించిన సెలబ్రిటీల వంటి గొప్పవారు కారు. ]
ఇక్కడ ఓ ఉదాహరణ చెబుతాను. మనం ఏ ఎగ్జిబిషన్ కో లేదో ధీమ్ పార్కుకో వెళ్ళమనుకొండి. గేటు దగ్గర చక్కని బొమ్మలూ, బెలూన్లు, వింతలూ ఉన్నాయి. పిల్లలు అక్కడి నిలబడి పోతారు. కదలమని మొరాయిస్తారు. అప్పుడు మనమేం అంటాం? "లేదు నాన్నా! లోపల ఇంకా బాగుంటాయి. అన్ని చూడొద్దా? గేటు దగ్గరే అగిపోతే ఇక ఎప్పటికీ లోపల ఉన్నవి చూడలేం. పోదాం నాన్నా!” అంటాం కదా!
భౌతిక సుఖాల వెంట, డబ్బువెంట పరుగుపెట్టే వారిని, విలువల గురించి ఆలోచించమని చెప్పిన మన మహాత్ములు కూడా అలా అన్నవారే! ఇక్కడే కుట్ర యొక్క స్వరూపం మనం చూడగలము. మహాత్ములు చెప్పిన వాళ్ళ మాటలు మన దగ్గరకు చేరకుండా, దుప్ప్రచారంతో వాళ్ళకు నెగిటివ్ లు అంటకట్టి అవి మన దగ్గరకు చేర్చి, గీత పట్టుకుంటే మట్టి కొట్టుకుపోవటం ఖాయం అన్న ప్రచారం ముమ్మరంగా నడుస్తుంటుంది. ఆ విధంగా ’భగవద్గీత’ను మన సమాజం నుండి దూరం చేశారు. నిజానికీ భగవద్గీత వ్వక్తిత్వవికాస పుస్తకం లాంటిది. మనిషిని, సంపూర్ణవ్యక్తిగా మారుస్తుంది. దాంట్లో ఏముందో ’ఆచరిస్తే’కదా తెలిసేది?
గీత – జీవుడు వాసనలు మోసుకొస్తాడని అంటుంది. జన్మజన్మకీ పరిణితి పెరిగేందుకు [కృషి] కర్మ చేయాలి అంటుంది. ‘వస్తా ఉట్టిదే, పోతా ఉట్టిదే, ఆశ ఎందుకంటా! చేసిన కర్మము చెడని పదార్ధం, చేరును నీవెంట’ అంటుంది. దీన్నే మనం ఇటీవల వచ్చిన దశావతారం సినిమాలో చూశాం.
విష్ణువు కోసం ప్రాణాలర్పించిన ‘రంగరాజ నంబి’. మరుజన్మలోనా అన్నట్లు అదే పోలికలతో ఉన్న శాస్త్రవేత్త ’గోవిందు’పాత్ర మతం నుండి మానవత్వం వైపు ప్రయాణించే దశలో ఉంటుంది. అదే ‘పుణ్యకోటి’ పాత్ర మానవత్వమే ఉతృష్ఠగమ్యం అన్న పరిణితితో ఉంటుంది. మరణం ముందు రంగరాజ నంబి కళ్ళల్లో ఉన్న అమోమయం, అదే మరణం ముందు పుణ్యకోటి కళ్ళల్లో ఉండదు. [ఇక్కడ కమల్ హాసన్ నటన గురించి చెప్పాలంటే నాకు మాటలు కరువే.] అదే రంగరాజనంబి భార్య లక్ష్మి – ప్రాణం కోసం అష్టాక్షరి మంత్రం నుండి పంచాక్షరి మంత్రానికి మారిపొమ్మని భర్తని బ్రతిమాలిన లక్ష్మి – మరుజన్మలోనా అన్నట్లు అదే పోలికలతో ఉన్న కృష్ణవేణిబామ్మ మనుమరాలు లక్ష్మి – గోవిందరాజ స్వామి విగ్రహాం కోసం లైఫ్ రిస్క్ తీసుకొంది. సాధన తీరు ఆ కథలో అలా ప్రతిబింబిస్తుంది. [ఈ సినిమా గురించిన సమీక్ష తర్వాత చేద్దాం.]
ఈ దృష్టితో చూస్తే మంచిపేరు సంపాదించు కోవాలన్న కాంక్ష, డబ్బు సంపాదించు కోవాలన్నా కాంక్ష కంటే మంచిదే కదా!
అలాగయినా సరే, బాపూజీకి కీర్తి కాంక్షని అంటగట్టడం మాత్రం ఘోరం. ఇలాంటి దుష్ ప్రచారాలు ఆయన వ్యక్తిత్వం మీద చేయడమే కుట్రలో ఓ భాగం.
స్వాతంత్ర సమరం నాటికి, భారతీయసమాజంలో కొన్ని వర్గాల ప్రజలు అంటరానివారుగా పేర్కొనబడి, ఆర్ధికంగా, సామాజికంగా అణగదొక్కబడి, వెనకబడి ఉన్నారు. దాన్ని ఆయన వ్యతిరేకించాడు. అది మానవత్వం. అన్నమయ్య దగ్గరి నుండి ఎందరో మహాత్ములు ఇలాంటి వివక్షని వ్యతిరేకించారు. గాంధీజీ అలాంటివారినీ ’హరిజనులు’ అని పిలిచాడు. వారి జీవితాలని అభివృద్ధి చేయాలని పరితపించాడు.
అందుకోసం తరువాతి కాలంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో కులప్రాతిపదికన రిజర్వేషన్ అన్న పద్దతి ప్రవేశపెట్టబడింది. [దీన్ని గురించిన వివరమైన చర్చ తరువాతి టపాల్లో వ్రాస్తాను.] అయితే కాలగతిలో అది రాజకీయ నాయకుల, కుట్రదారుల చేతిలోపడి దుర్వినియోగం అవ్వటానికి గాంధీజీ బాధ్యుడు కాడు కదా? ఆయన బ్రతికి ఉంటే, తప్పకుండా, దానిని యధాతధంగా కొనసాగించడాన్ని వ్యతిరేకించేవాడు. కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి దీనికి మార్పులు చేసి ఉండేవాడు. ఎందుకంటే ఆయనకి ఓట్లు అవసరం లేదు. ఆయన అంతిమలక్ష్యం కులమతాలకి అతీతంగా పేదవాడికి న్యాయం జరగటం, మేలు జరగటం. ఆయన సంకల్పం ఎప్పుడూ ’ప్రజా శ్రేయస్సే’ అన్నదానికే కట్టుబడి ఉంటుంది. ఆయనకి తన రాజకీయ కెరీర్ గురించిన Concern లేదు. ఆయన తన సహచరులతో అనేవాడట “మనం ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసికోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా చర్య తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి మన కళ్ళముందు పేద, సామాన్య భారతీయుణ్ణి ఊహించుకొండి. మన ఈ నిర్ణయం, చర్య అతడికి ఏ చిన్న మేలయినా చేస్తుందా లేదా అని ఆలోచించండి” అని అనేవాడట.
ఇదీ ఆయనకి పేదలపట్ల ఉన్న నిబద్దత, ప్రేమ, బాధ్యత. ఒకసారి ఆయన “మనం ప్రతీ పైసాకి ప్రజలకి లెక్క చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము” అని అన్నాడు. నిజానికి అది ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలు. ఈనాటి నాయకుల చేతిలో అయితే ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసిన పన్నులూ, రుసుములే.
అలాంటిదీ ఆయన నిజాయితీ!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
7 comments:
చిన్నపుడు గాంధీగారి గురించి ఎక్కువ తెలియలేదు నాకు. అప్పట్లో అక్బరు, బాబరు, ఔరంగజేబు, గాంధీ.. వీళ్ళంతా ఒకటే అనేలా ఉండేవి పాఠాలు!! పెద్దయ్యాక తెలుస్తున్నది ఆయన గొప్పదనం. ఆయలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ ఎందరు ఎన్ని కుట్రలు చేసినా ఆయన మన జాతిపిత, మన దేవుడు అన్న సత్యాన్ని ఒక వయసు తర్వాత చాలామంది గ్రహిస్తున్నారు.
ఈ సందర్భంగా మీకొక ఆనందం కలిగించే విషయం: నా దగ్గర గాంధీగారి ఆటో బయోగ్రఫీ ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి ఎయిర్‌పోర్టులో carry on చెక్ చేయడానికి పక్కకు పిలిచి అన్నీ చూస్తుండగా ఆ పుస్తకం కనపడింది. పుస్తకం పైన గాంధీగారి బొమ్మ చూసిన వెంటనే నల్లజాతీయుడయిన ఆ సెక్యూరిటీ ఆఫీసరు Oh, He is great అని నాతో మరింత ఆప్యాయంగా మాట్లాడి పంపించాడు.
నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)గారు,
మీరిచ్చిన ఈ సలహాని నేను 2001 లోనే అమలు చేసానండి. 2001 లో సూర్యాపేటలో నిర్ణీత రుసుము కట్టి, ప్రెస్ మీట్ పెట్టి – ఎంసెట్ ర్యాంకు కుంభకోణాలు, ఇంటర్ పేపర్ లీకులూ, నాపైన వ్యవస్థీకృత వేధింపుల గురించి వ్రాతపూర్వకంగా, సాక్ష్యాలతో సహా [Coups on World లోని Documentary Evidence లో Scanned Copies, Press meet వివరాలు, ఇంకా ఇతర పత్రాలూ ఉన్నాయి.] ఇచ్చాను. అప్పటి కింకా స్థానిక కాలేజీలు నన్ను వేధిస్తున్నాయనుకున్నాను. ఒక్కరంటే ఒక్క పేపరు వాళ్ళు ప్రచురించలేదు. తర్వాత ఈనాడు కిరణ్ ని కలిసేందుకు సోమాజీగూడ వెళ్ళి ప్రయత్నించాను. రెండురోజులు తిప్పించుకొని, విషయం కూడా వినకుండానే ‘No’ చెప్పారు.
మళ్ళీ 2007 జనవరిలో విజయవాడ ఆంధ్రజ్యోతికి వెళ్ళి ఎడిటర్ ని కలిసాను. అంతా విన్నాక ఆయన “The strength and the mode of the weapon can be determined by your enemy, but not by yourself. I think, మీరిక్కడ fail అవుతున్నారనుకుంటాను” అన్నాడు. నాకు అర్ధం గాక ఆమాటని ఒకటికి రెండుసార్లు చెప్పించుకొని, ’ఇంతకు నాకేసు ప్రచురించగలరా లేదా?’ అని అడిగాను. ‘తమకి అంత స్వాధికారం లేదని, హైదరాబాద్ లోని తమ హెడ్డాఫీసుకి అప్రోచ్ అవ్వమనీ’ చెప్పారు. “పోనీ మీరే పంపకూడదా? జిరాక్స్ కాపీ ఇస్తాను” అన్నాను. “లేదు మీరే హైదరాబాద్ వెళ్ళి కలవండి” అని చెప్పారు. చేసేది లేక వెనుదిరిగాను. మళ్ళీ 2007, మార్చిలో హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రజ్యోతి ఎడిటర్ ని కలిసే ప్రయత్నం చేశాను. కుదర లేదు. ‘వార్త’ ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ సబ్ ఎడిటర్ ని కలిసాను. ఆయన ఓ గంట పాటు నా కేసంతా విని “మీరిదే దారిలో వెళ్తూ మీ జీవితమే గాక మీ పాప జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కావాలంటే శ్రీశైలంలో చుట్టుప్రక్కల గిరిజన తండాలకు మీరు వెళ్ళి సేవ చేయండి. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను, మీరు వ్రాసి పంపండి. మేం పేపర్లో వేస్తాం. నేను 18 ఏళ్ళు ఈనాడులో పనిచేసాను. ఎల్.టి.టి.ఇ. సానుభూతిపరుణ్ణంటూ లంకలో పనిచేస్తుండగా జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు ‘వార్త’లో పని చేస్తున్నాను. మేం పేపరులో వేస్తే ఓ రెండురోజులు మీకేసు పాపులర్ అవుతుంది. అంతే! తర్వాత అందరూ మర్చిపోతారు. తర్వాత మీజీవితం మరింత అధ్వాన్నం అవుతుంది” అని సలహా ఇచ్చాడు. “అయినా అందుకు నేను సిద్దమే. పేపరులో ప్రచురించండి” అన్నాను.
“ఆ నిర్ణయం తన చేతుల్లో లేదని, యాజమాన్యం చేతుల్లో ఉందనీ, యాజమాన్యం కూడా వారి పరిమితికి లోబడే వార్తలు ప్రచురిస్తారనీ, ఎండోమెంట్ కమీషనర్ తనకు తెలుసునని, కావాలంటే ఆయనకి రికమెండ్ చేసి శ్రీశైలంలో మీ రూం కాన్సిల్ ని, రికాల్ చేసేటట్లు చేస్తానని” చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అప్పుడే ’పోటీ పత్రికలకి కూడా వారి వ్యాపారపరిమితులు వారి కుంటాయన్నమాట’ అనుకొని చేసేది లేక వెనుదిరిగాను.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కుర్చీవ్యక్తి, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర సి.ఐ.డి., హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్, లోకాయుక్త, మానవహక్కుల సంఘం, ఇలా అందరినీ అప్రోచ్ అయ్యాను. అప్పటి రాష్ట్రపతి శ్రీ ఎ.పి.జె.కలాం గారు నాకేసుని రాష్ట్రప్రభుత్వానికి, కేంద్రహోంమంత్రికీ పంపుతున్నట్లుగా నాకు లేఖలు వ్రాసారు. ఆ ప్రకారం కేంద్రహోంమంత్రికి వ్రాసినా, రాష్ట్ర సి.ఎం.కీ వ్రాసినా 1½ సంవత్సరాలుగా మౌనమే సమాధానం. 2007, మేలో అప్పటి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ నుండి ఒక లేఖ నందుకున్నాను. దానితో ఢిల్లీ వెళ్ళి ఆయన్ని కలిసాను. ఆయన వై.ఎస్.కి రికమెండేషన్ లెటర్ ఇవ్వగా, ఎ.పి.భవన్ కెళ్ళి అప్పుడక్కడే ఉన్న వై.ఎస్.ని పర్సనల్ గా కలిసి ఇచ్చాను. పావుగంట మాట్లాడి “ముందు ఉండటానికి రూం ఉండాలిగా, తరువాత కేసు చూద్దాం” అని చెప్పి, అన్ని వివరాలు వ్రాతపూర్వకంగా తీసికొన్న సి.ఎం. నుండీ ఈనాటికీ స్పందన లేదు.వీటికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు Coups on World లోని Documentary Evidence లో ఉంచాను.
ఇలా, నేను తట్టని తలుపు లేదండి. అయినా – ఈ పత్రికల వారికి తమ పోటీ పత్రికలు, ఇతర మీడియా, ఇతర వార్తస్రవంతులలో ఏంజరుగుతుందో పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులుంటారు. అలాంటి చోట, ఈనాడు అధిపతికి ఇదంతా తెలియదంటారా? అదీగాక నా URL, బ్లాగు పేర్లు రహస్యాలు కావు. ఈపాటికి ఎవరైనా వాటిని ఎవరి దృష్టికైనా తీసుకు వెళ్ళి ఉండవచ్చు. అలాంటప్పుడైనా వాళ్ళకి తెలిసే అవకాశం ఎక్కువే కదా!
2005 లో దీనంతటి వెనుక ఈనాడు రామోజీ రావుని అనుమానించి నేపెట్టిన Complaints తనకి Farward అయ్యాయంటు సి.ఐ.డి.,ఐ.జీ. కృష్ణరాజ్ ఫిబ్రవరి,2007 లో నాకు ఫోన్ చేయటంతో ప్రారంభమైన issue, శ్రీశైలం సి.ఐ.[అందరి దగ్గరా స్టేట్ మెంట్ తీసుకొన్నాడట], నా దగ్గరా తీసుకోవటంతో ముదిరి, రెడ్ టేపిజం చూపిస్తూ నా రూమ్ కాన్సిల్ చేసారు. ఆదెబ్బతో నా వృత్తి, నివాసం రెండు కోల్పోయాను. ఆ కేసు పూర్వాపరాలన్నీ పత్రాలతో సహా Coups On World [Documentary Evidence] లో ఉంచాను.
ఇదండీ సంగతి!
మీకు నాపట్ల ఉన్న Concern కి కృతఙ్ఞతలు సార్!
జీడిపప్పు గారు,
ఇది నాకే కాదు, మనందరికి ఆనందం కలిగించే విషయం.
Nizamandi ... I desam lo Gandhi gaariki unna viluva manadeseam lo ledemo anipidustundi appudappu
hats off
ఇలాంటీ విషయమే, నా మిత్రుడొకరు డాక్యుమెంటరీ పనిమీద జింబాబ్వే వెళ్లినప్పుడు, దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా ఇల్లలో గాంధీ చిత్రపటాన్ని చూడటం తటస్థించిందట
పొరుగింటి పుల్లకూర రుచెక్కువ అని ఊరకే అన్నారా, అందుకే మనకు పొరుగింటి ఓబామా లే ముందుగా కనబడేది.
mee kashtaniki em prati falam dakkutundo naaku telidu. kaani em asinchakunda meeru pade kashtanni chadivina varandariki idi boldanta atma viswasanni istundi. bahusa idi meeru uhinchani prati falam anukunta
Post a Comment