ఇక ఇందిరాగాంధీ ఊపిరి సలుపుకోవడానికి వీల్లేనంతగా సమస్యల వెల్లువ సృష్టించబడింది. అన్నీ ద్వంద్వపూరిత విషయాలే! అంటే Paradoxes అన్నమాట. ముస్లిం ప్రత్యేక చట్టాలు, కోర్టు తీర్పులు, సామాజిక అంశాల్లాంటివి. ఉదాహరణకి: ముస్లిం విడాకుల చట్టం. అప్పట్లో ’షాబానో’ అనే ముస్లిం మహిళ విడాకుల కేసు సంచలనం సృష్టించింది. ఈ విషయం ఎన్నో విమర్శలకీ, విబేధాలకీ, సిద్దాంతరాద్దాంతాలకీ తెరతీసింది. ముస్లింల చట్టం ప్రకారం – వారి మతంలో ఉన్న అమానుషత్వం రీత్యా గానివ్వండి, స్త్రీలపట్ల వారికున్న చిన్నచూపురీత్యా కానివ్వండి, భార్యనుండి విడాకులు తీసుకోవాలంటే మూడుసార్లు ‘తలాక్!’ అంటే చాలు. దీని మీదట సిద్దాంత చర్చలు ఎలా రేగాయంటే – “ఇది న్యాయసమ్మతమా?", "ఇది అమానుషమా కాదా?", "ఎందుకు ముస్లింలు మతం పేరిట సౌలభ్యాలు అనుభవించగలుగుతున్నారు?" "కోర్టు ముందు అందరికీ ఒకే చట్టం ఉండాలి గానీ ముస్లింలకి ప్రత్యేక చట్టం ఉండటమేమిటి?" ఇలా.

ఇక్కడ కొంచెం ముస్లిం మతం గురించి చర్చించాలి. సాటి మనిషిని, మనిషి జన్మకు సగం కారణమైన స్త్రీని, తల్లినీ, చెల్లినీ, భార్యనీ తమకి సమానంగా వారు గౌరవించరు. ఒక పురుషుడు నలుగురు స్త్రీలని వివాహం చేసుకోవచ్చు. రాజులూ రంగప్పల రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా! వద్దనుకుంటే భరణాల్లేవు, కేసుల్లేవ్. తలాక్ అని 3 సార్లంటే చాలు. తల్లి పిల్లల్ని 16 ఏళ్ళు పెంచి, పిల్లలు చేతి కొచ్చే వయస్సుకి తండ్రికి అప్పచెప్పాలి. ఆ విధంగా స్త్రీ శరీరశ్రమకి కూడా విలువలేదు. స్త్రీ ఒక భోగ వస్తువు తప్ప సాటి మనిషి కాదు వారి దృష్టిలో. ఇప్పుడు చూస్తున్నాం కదా స్వాత్ లోయలోని షరియా చట్టాన్ని? ఆడపిల్లలు చదువుకోగూడదు. తన్ని, బడులు మూయిస్తున్నారు. మళ్ళీ రోగమొస్తే ఆడవాళ్ళు మగ డాక్టరు చేత వైద్యం చేయించుకోకూడదు. ఆడ డాక్టరు దగ్గరే వైద్యం చేయించుకోవాలి. ఆడవాళ్ళు చదువు కోకూడని చోట ఆడ డాక్టర్లు ఎక్కడ నుండి వస్తారూ? అంటే రోగమొస్తే చావండి అని పరోక్షంగా ఆడవారిని శాసిస్తున్నారన్న మాట. సాటి మనిషినే మనిషిగా గుర్తించని మతం – ‘సర్వే జనాః సుఖినో భవంతు’, ‘సమస్త సన్మంగళాని సంతు’ అని సర్వజీవుల క్షేమాన్ని కాంక్షించే హిందూ మతపు మానవత్వ స్థాయిని అందుకోగలదా? అందుకోవటం సంగతటుంచి, కనీసం అర్ధం కూడా చేసుకోలేదు. ఒకటో తరగతి చదివే కుర్రాడికి Theory of Relativity నో లేక Theory of Probability నో చెప్పడం లాంటిది ఆ మతఛాందస వాదులతో వాదించి నిజం అంగీకరింపచేయలను కోవటం. ఎందుకంటే అది వారి మానసిక స్థాయికి అర్దంకాని, అందని పరిణతి. అదృష్టవశాత్తు భారతీయ ముస్లింలలో అధికులు తాలిబాన్లంత మత చాందసులు కాకపోవటంతో భారత్ లో స్వాత్ లోయలు పుట్టలేదు.

ఇక మళ్ళీ ’షాబానో’ కేసు దగ్గరికి వద్దాం.

ఇక అలాంటి రోజుల్లో, ఓ రోజు ఈనాడు పత్రిక “ఈ రోజు భారతదేశంలో ఇందిరాగాంధీ కంటే నాకే ఎక్కువ పేరుప్రఖ్యాతులున్నాయి” అని షాబానో అన్నదని వ్రాసింది. అంతేగాక క్రమం తప్పకుండా ‘ఈనాడు’ షాబానో వార్తల్ని, కొన్ని ఎడిటోరియల్ వ్యాసాలతో సహా ప్రచురించి follow up ఇచ్చింది. ఇప్పుడు సానియా మీర్జా కి ఇస్తున్నట్లన్న మాట. మరో పోలిక చెప్పాలంటే 2008లో బిల్ గేట్స్ కంటే బిన్ లాడెన్ కే ప్రజల్లో గుర్తింపు [ర్యాంకింగ్] ఉందని వ్రాసినట్లన్నమాట. బిన్ లాడెన్ notorious, బిల్ గేట్స్ famous. మొదటి వాడు విధ్వంసకారి, రెండో వ్యక్తి నిర్మాణాత్మక కార్యశీలి.

అదేవిధంగా షాబానో notorious ఇందిరాగాంధీ famous. కాలం గడిచాక, ఈరోజు షాబానో ఎవరో ఎవరికీ తెలియదు. అదే ఇందిరాగాంధీ అయితే అందరికీ తెలుసుకదా! అందుకే అంటారేమో మన పెద్దలు ’నిజం నిలకడ మీద తెలుస్తుంది’ అని.

కానీ ఆ రోజుల్లో ఆ తాత్కాలిక ఇమేజిలో [అదీ పత్రికలు షాబానోకి ఇచ్చిందే, తమ News Coverage తో] షాబానో వ్యాఖ్యలూ, తదుపరి చెత్త[Nasty] చర్చలతో మీడియాలో హోరిత్తించబడింది. ఈ చర్చలతో, ఇలాంటి వ్యాఖ్యల ప్రచురణలతో ఏవిధంగా మీడియా ప్రజలకి సేవ చేసినట్లో ఎవరికీ తెలియదు, ఎవరూ ప్రశ్నించలేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా మీడియా ప్రచురించదు కదా! ఇలాంటి వార్తల కవరేజ్ తో, ఎడిటోరియల్స్ తో ప్రజలపట్ల మీడియా బాధ్యత నెరవేర్చినట్లు ఎలా అవుతుందో, ఇలాంటి సంచలనాత్మక వార్తలతో ఎలా ప్రజా సేవ చేసినట్లో రామోజీరావుకి మాత్రమే తెలియాలి. ఇలాంటి వార్తలే ఎక్కువగా పేపర్లో ఉండేవి. [నీనా గుప్తా గర్భానికి తండ్రెవరు లాంటివి మరికొన్ని.] అప్పట్లో బడిలో ప్రతిరోజూ వార్తా పత్రికా పఠనం నా బాధ్యత అయినందున ఇలాంటి వార్తలు నాకు బాగా గుర్తున్నాయి. అయితే అలాంటి వార్తలు ప్రజల్లో అసహనాన్ని రేపేవి. ఇందిరాగాంధీని, ఆవిడని అభిమానించే సామాన్యప్రజలని అవి మరింత చికాకు పెట్టేవి.

మరొక వైపు, ఈ కుట్రలో భాగమా అన్నట్లు విలేఖరులు, వివిధ సందర్భాల్లో, ఇందిరాగాంధీని ఇంటర్యూలలో ఈవిషయం మీద ప్రశ్నించటమో లేదా వ్యాఖ్యానించమని అర్ధించటమో చేసేవారు. కొంతమంది మంత్రి పుంగవులు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు వ్యాఖ్యనించేవారు. దాని మీద మళ్ళీ ఇందిరాగాంధీని విలేఖర్లు వ్యాఖ్యనించమని అడుగుతుండే వాళ్ళు. సహజంగానే ఇలాంటి nastiness కొనసాగితే ఎవరైనా సైకలాజికల్ గా బ్రేక్ అవుతారు. ఇందిరాగాంధీ అయినా, మరొకరైనా ఈ సహజ ప్రక్రియకి అతీతులు కారు. అందునా బ్రేక్ అయ్యేంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది కూడా. అలా బ్రేక్ అయ్యి, ఏ స్పందన చూపినా, ఇక మీడియా ’చూస్కో నా తడఖా’ అంటుంది. ఈ స్పందనతో మరింతగా తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల మీద గురిపెట్టి మరీ మరింత ఇరిటేట్ చేస్తుంది. నల్లమేక నలుగురు దొంగలు కథలోని దొంగల్లా నలుగురు విలేఖర్లు ఇరిటేట్ చేయలేకపోతే 40 మంది విలేఖర్లు పుట్టుకొచ్చి మరీ కొనసాగిస్తారు.

ఎటూ, ఇంకా ఎంత ఇరిటేట్ చేస్తే ఇందిరాగాంధీ బ్రేక్ అవుతుందో, ఆవిడ motives, moods, opinions, emotions బయటకి చేరవేయడానికి ఇంటిలోపల కోడలుంది. బయట ఇందిరాగాంధీ మంత్రి వర్గంలోనూ, కార్యాలయంలోనూ అప్పటికి మరికొందరు అవతరించారు.

ఈవిధంగా సందేహాస్పదం కాకుండా, జయప్రదంగా కుట్రదారుల స్ట్రాటజీ 1974 తర్వాత మరింత జోరుగా సాగింది. 1974 ఎందుకంటున్నానంటే ఈనాడు పుట్టింది 1974 ల్లోనే. ఖచ్చితంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ ప్రధానిగా 1966 లో బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ఎన్నికల్లో పాల్గొని తదుపరి ప్రధాని అయ్యింది. 1966 నుండి 5½ సంవత్సరాల్లో అంటే 1971, 72 వరకూ ఆవిడ ఖాతాలో ఎన్నోవిజయాలున్నాయి. బ్యాంకుల జాతీయకరణ, ప్రీవీ పర్సులు రద్దు[రాజాభరణాల రద్దు], 500/-, 1000/-Rs. నోట్లచలామణి రద్దు, 1971 ఇండో – పాక్ యుద్ధం విజయం, బంగ్లా దేశ అవతరణ, హరిత విప్లవ రూపేణా అధిక ధాన్యోత్పత్తి, శ్వేతవిప్లవం అంటూ పాల ఉత్పత్తి పెరుగుదల, ఇంకా పార్టీ పరంగా కాంగ్రెసు సీనియర్లలతో పార్టీ చీలికలని తట్టుకొని పార్టీని గ్రిప్ చేయగలిగింది…….ఇలా.

అయితే 1974 తర్వాత, ముఖ్యంగా ఇంటికోడలిగా సోనియా గాంధీ నమ్మకంగా ఇంట్లో స్థిరపడ్డాక, ఇందిరాగాంధీ అతివేగపు సమస్యల ఒరవడిలో పడిపోయింది. దేశంలో శాంతి నశింపసాగింది. డ్రగ్స్ వాడకం గురించిన వార్తలు, మేధోవలసల తాలూకూ వత్తిళ్ళు, స్త్రీ రాజ్యమేలుతున్న దేశంలో పసిపిల్లల పాలపొడి డబ్బాలకు కరువు లాంటి సమస్యలతో అల్లాడింది. మనలో మనమాట. భారతదేశంలో అప్పటికి వేలసంవత్సరాలుగా తల్లులు లేరా, పిల్లలు లేరా? అప్పుడెప్పుడూ పాలపొడి డబ్బాల అవసరం రాలేదు. తల్లిపాలు తాగే పిల్లలు పెరిగారు. కానీ ఇందిరాగాంధీ హయంలో 1975 నాటి కల్లా పిల్లలకి పాలిస్తే శరీర సౌష్ఠవం దెబ్బతింటుందన్న మీడియాకథలూ, సినిమా కథల ప్రచారంతో పాలపొడి డబ్బాల వాడకం పెరిగింద[ట]. వాటికీ కరువొచ్చింది. అప్పటికే మధ్యతరగతి ప్రజల్లో కూడా తల్లిపాలు చాలక పిల్లలకి డబ్బాపాలు పట్టడం మొదలయ్యింది. గర్భిణిలకు ఇవ్వబడిన మందుల మూలంగానే ఈ defects అనే వార్తలూ వచ్చాయి. నిజానిజాలు మాత్రం భగవంతుడికే తెలియాలి. అప్పుడు అనుమానించకపోయినా, కుట్రదారుల అమానుషత్వం తెలిసాక ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీలని అనుమానించకుండా ఉండలేం కూడా. ఏది ఏమయినా ఇలాంటివి సెంటిమెంట్ తో కూడిన విషయాలు. ఇవి ఇందిరాగాంధీని ఇబ్బందిపాలు చేసినవి.

ఇందిరాగాంధీ ఈ కుట్రలకీ, దేశంలో అశాంతి చెలరేగడానికి కారణం విదేశీ కుట్ర, ముఖ్యంగా పాకిస్తాన్ కుట్ర అనేది. అప్పటికే పాకిస్తాన్ కి అమెరికా బాహాటంగా సహాయసహకారాలు ఇస్తూండేది. రష్యాతో భారత్ స్నేహం మాటల్లో కోటలు దాటేది, చేతుల్లో గడపలు దాటేది కాదు. చిన్న చిన్న సాయాలు తప్పితే రష్యా ఎప్పడూ స్నేహంలో నిబద్దత చూపింది లేదు. దాన్ని క్రయోజనిక్ ఇంజన్ల అమ్మకం విషయంతోనూ, అన్నిటితోనూ కాలం నిరూపించింది. ఇప్పుడంటే – అస్సలు సామరస్యం లేని చైనా, అమెరికాకి రెండు ట్రిలియన్ల డాలర్ల విదేశీ ద్రవ్యం సమకూరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల వెనుక ఉన్నది ఒకే చోదకశక్తి అని తెలుస్తోంది గానీ అప్పుడంటే దాన్ని ఊహించను కూడా లేంకదా! అందుచేత ఇందిరాగాంధీ దేశంలో జరుగుతున్న అలజడులకీ, అశాంతికీ పాకిస్తానే కారణం అనేది. దాంతో మీడియా “ఇందిరాగాంధీ ‘పాక్ బూచి’ని చూపెట్టి తనపదవినీ, అధికారాన్నీ, ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజల్ని గ్రిప్ చేయటానికి పాక్ బూచిని చూపెడుతుంది” అని ఎలుగెత్తి అరిచేది.

అయితే ఈ సంఘటనలకి ముందు, ఖచ్చితంగా చెప్పాలంటే 1974 కు ముందు ఇండియా మీడియా “ఇందిరంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా” అనేది. అదే మీడియాలో 1974 తర్వాత పరిస్థితి ఇలా మారిపోయింది.

మీడియా ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ మీద గురిపెట్టింది. అతణ్ణి ’రాజ్యాంగేతర శక్తి’గా అభివర్ణించేది. ప్రతీరోజూ పత్రికల్లో అతడి గురించిన కథనాలు వచ్చేవి. కొన్ని సార్లు అతడి సమర్ధతని పొగుడుతున్నట్లు వ్రాసేవాళ్ళు. కొన్నిసార్లు అతణ్ణి rude and egoistic అని వ్రాసేవాళ్ళు. వెరసి అతడు మంచివాడో, చెడ్డవాడో, అసలెలాంటి వాడో తెలియదు. ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ రాజకీయాల పట్ల విమఖడు. అతడి భార్య సోనియా గాంధీ కూడా అతణ్ణి సపోర్ట్ చేయటంతో అతడు పైలట్ గా ఉద్యోగంలో కొనసాగేవాడు. దాంతో ఇందిరాగాంధీ పూర్తిగా తన రెండవ కుమారుడు సంజయ్ గాంధీ మీద ఆధారపడింది. బహుశః రాజకీయాల గురించి, దేశం మీద కుట్రల గురించి తనకున్న అవగాహనని కుమారుడికి పంచుతూ, అతణ్ణి educate చేసుకుంటూ, తన వారసుణ్ణి తయారు చేసుకోవాలనుకొనేది. కుమారుడి పట్ల ఆవిడ పనితీరు అలాగే ఉండేది.

కొన్నాళ్ళు ఇందిరాగాంధీ తండ్రికి వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసింది. పిల్లలని తీర్చిదిద్దుకోవాలను కున్నప్పుడు ఆవిడ ఇంటికి పరిమితమైపోయింది. తరువాత చైనా యుద్దం తరువాత మళ్ళీ తండ్రికి సహాయకురాలిగా పనిచేసింది. తండ్రితనకి ఎలా శిక్షణ ఇచ్చాడో ఆవిడకి స్పృహ ఉంది. బహుశః అలాగే తనూ తన కొడుక్కి రాజకీయాల గురించి, అందులో తీవ్రసమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవలసిన తీరు గురించి, సవాళ్ళ గురించీ, రాజకీయ పరిశీలన, నీతిఙ్ఞతల గురించి శిక్షణ ఇవ్వాలనుకోనేది కాబోలు. అందుకోనేమో ఈనాడు రామోజీరావు, అతడి అనుచర పత్రికలు సంజయ్ గాంధీ మీద గురిపెట్టాయి. నాటి కొన్ని సినిమాల్లో ఆ పోలికల్తో విలన్లుండేవారు. అతణ్ణి దురుసు, అహంకారి గా చిత్రించాయి. అప్పటికే పైకి కనబడకుండానే establish అయిన అనువంశిక నకిలీ కణికుడి నెట్ వర్క్, దాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్ళేటట్లు ప్రత్యక్ష పరోక్ష ప్రచారం గావించింది.

1971 నుండి 1975 వరకూ 5 ½ ఏళ్ళల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఊపిరిసలపని సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. ఎక్కడో ఏదో జరుగుతుందని అర్ధమయ్యేది. ఎక్కడో, ఎలాగో, ఎవరు చేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. ఆవిడతో పాటుగా ఆవిడ కాబినెట్లో ఉన్న కొందరు నాయకులు [భారతదేశం పట్ల నిబద్దతగల నాయకులైన పి.వి.నరసింహా రావు లాంటి కొందరు] కూడా ఈ కుట్ర అస్థిత్వాన్ని గుర్తించగలిగారు. కుట్రతీరు ఏమిటి, ఎలా పనిచేస్తూందీ, ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు మద్దతిస్తున్నారు – ఇలాంటి వివరాలు అయోమయంగా ఉండేవి. ఉదాహరణకి ఈరోజు ఒకవ్యక్తి ఒకతీరున కన్పించి, అనుమానిస్తే మరికొన్నాళ్ళు పరిస్థితులన్నీ మారిపోయి ఆవ్యక్తి ఫక్తు దేశభక్తుడిగా కన్పించేవాడు. అతణ్ణి దేశద్రోహిగా అనుమానించి పొరపాటుపడ్డామనే భావన ఇందిరాగాంధీకి, ఆవిడ అనుచరులకీ కలిగేది. [ఇక్కడ ఇంటి ‘స్పై’ సోనియాగాంధీ పాత్ర చాలా ముఖ్యమైనది.]

ఇందిరాగాంధీ తన మంత్రివర్గంలోని దేశభక్తి, నిబద్దత, నిజాయితీ గల ఇతర సహచరులతో కుట్ర గురించి లోతైన చర్చలు జరపకుండా, తన అవగాహనని ఇతర సహచరులతో పంచుకోకుండా, ఆవిడకి అక్రమసంబంధాల పుకార్లు అంటగట్టేవారు. ఎందుకంటే ఒక బుర్రకి పదిబుర్రలు కలిస్తే క్రమంగా దేశభక్తుల బలం పెరుగుతుంది గనుక. ఎలాగైనా ఆవిడని ఒంటరిని చేయటమే లక్ష్యం, ఒంటరి వ్యక్తిని బ్రేక్ చేయడం సులభం గనుక. అందుకే ఇక్కడా ‘విభజించు పాలించు’ అన్న సూత్రమే అమలు చేయబడింది.

ఇంత జరుగుతుంటే ఆనాడు నిఘాసంస్థలకి తెలియ లేదా అంటారేమో? ఇది గడిచి 33 ఏళ్ళు అయ్యింది గనుకా, నిజం నిలకడ మీద తెలుస్తుందన్న పెద్దల మాట ప్రకారం ఇప్పటికి నిజం నిగ్గు బాగా తేలుతోంది గనుకా మనకి కుట్ర అర్ధమౌతుంది. అంతేగాక, గడిచిన 33 ఏళ్ళలో ప్రధాన కుట్రదారుగా రామోజీరావు ఉనికి తెలిసి 16 ఏళ్ళు అయ్యింది గనుకా, ఇప్పుడు మరింత స్పష్టంగా, కుట్రదారునితో పాటుగా కుట్రా తెలుస్తోంది. ఎందుకంటే ఈ 16 ఏళ్ళల్లో సినిమా మాధ్యమం గూడా ఎన్నో ’ఎత్తు పై ఎత్తుల్నీ’, కుట్రల్నీ, మేధోమిశ్రిత రాజకీయాల్నీ, పవర్ గేముల్నీ ప్రజా బాహుళ్యంలోకి పరిచయం చేసింది. కాబట్టే మనకి కుట్ర తీరు మరికొంత విశదంగా తెలుస్తోంది. మరోసారి గుర్తు చేస్తున్నాను. 1992 కు ముందర ‘ఢీ’, ‘గమ్యం’, …… లాంటి సినిమాలు ఉండేవి కావు. శ్రీవారి ముచ్చట్లు, రామకృష్ణులు, రాముడు కాదు కృష్ణుడు, రావణుడే రాముడైతే లాంటివి ఉండేవి. కణిక నీతిలోని తొలివాక్యం – “శతృ నాశనానికి ముందు వారి ఉత్సాహాన్ని హరించాలి” అన్న పద్దతిలో కళలు ఉండేవి. కంచు కాగడాతో వెదికినా మన సినిమాల్లో తార్కికత ఉండేది కాదు [ఏ భాషైనా ఒకటే.]

అందుచేత కుట్రతీరుని ప్రజలు అర్ధం చేసుకొనే స్థాయిలోఉండేవారు కాదు. అర్ధం చేసే ప్రయత్నము ఎవరూ చేసేవారు కాదు. నిఘా సంస్థలు సైతం కుట్రని ఎదుర్కొనే స్థితిలో ఉండేవి. ఎందుకంటే దెబ్బకాచుకునే వాడికి, ఇక దెబ్బకొట్టేదెవరో, ఎక్కడి నుండి, ఎలా దెబ్బకొడుతున్నారో తెలుసుకోగలిగేంత ఓపికా, తీరికా ఉండవు కదా! నిరంతరం డిఫెన్స్ లోనే ఉండాలి. ఓ పోలిక చూడండి.

ఒడ్డునున్న మనకి, నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి అందుబాటులో చెట్టో, దుంగో ఉన్నట్లు కన్పిస్తుంది. అందులో పడి ఈదేవాడికి మాత్రమే ఒరవడి ఎంతో తెలుస్తుంది. ఆ చెట్టునో, దుంగనో ఆసరాగా తీసుకోగలిగే అవకాశం ఎంతుందో తెలుస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోగలరో లేదో, వాళ్ళ ఒత్తిడి, అనుభవమూ వాళ్ళవి. కొన్నిసార్లైనా అలాంటి అవకాశం వదులుకోకుండా పోరాడారు గనుకే ఇంకా ఇండియా అంటూ ఓదేశం ప్రపంచపటంలో మిగిలి ఉంది అని నేను అనుకుంటాను. ఈ కుట్రని మొత్తంగా కాలంతో పోల్చిచూస్తేనే బాగా అర్ధమౌతుంది.

ఇలాంటి సందర్భంలోనే ఇందిరాగాంధీ ‘విదేశీ హస్తం’ గురించి రిఫర్ చేసేది. భారత్ మీద విదేశీ కుట్ర జరుగుతుందనడం ఆవిడ ఉద్దేశం. ఆకుట్ర కీలకం ఇంట్లో తిష్ఠవేసిన కోడలని అనుకోకపోవటం ఆవిడ దురదృష్టం. ఇక ఈ విదేశీ హస్తం మీద లెక్కలేనన్ని జోకులూ ఎగతాళీ పుట్టాయి. వాటి గురించి ఇంతకుముందే మనం ముచ్చటించుకున్నాం. ఆరోజైతే ‘భార్య గర్భవతి అయినా ఇందులో విదేశీ హస్తం ఉదంటుంది కాంగ్రెస్’ అంటూ పచ్చి జోకులు వేసాడు రామోజీరావు. మరి ఇప్పుడు నకిలీ స్టాంపులు, నకిలీ పాస్ పోర్టులూ, నకిలీ నోట్లు, పేలుతున్న బాంబులు, ముంబాయి దాడులూ అన్నింటిలో విదేశీ హస్తం , ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో అన్నింటిలో విదేశీ హస్తం నిరూపితమై కూర్చున్నాయి. కళ్ళముందే కన్పిస్తున్నాయి కదా! మరి ఇప్పుడు జోకులు వేయడేం సోనియాగాంధీ మీద, ఆవిడ రాజ్యాంగేతర శక్తిమీద, ఇంకా ఆవిడ కుమారుడి మీద? ఇది అనువంశిక పాలన కాదా? కేవలం ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలు మాత్రమే మహారాణి – యువరాజులా? [అనువంశిక పాలకులా?] సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కారా? నిన్న మొన్న కూడా ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నాయకులు కూడా ‘ప్రధాని కాగల అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయి’ అంటూ ప్రకటించారే? అసలు ’ప్రభుత్వానికి కుర్చీవ్యక్తి’ అనే పదవి రాజ్యాంగంలో ఉందా? ఇప్పుడు ఈవిషయాల మీద కిమ్మనడం లేదు గానీ అప్పట్లో రామోజీరావు చండ్రనిప్పులు కురిపించేవాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

2 comments:

ayyo achhu tappu avi 5000 and 10000 notlandy babu

పర్ఫెక్ట్! యూ హావ్ హిట్ ఇట్!

కేవలం ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలు మాత్రమే మహారాణి –యువరాజులా? [అనువంశిక పాలకులా?] సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కారా? వారిని తెగనాడుతూ ఎందుకు జోకులు లేవు!? అవును కడుపు మండిపోతోంది. ప్రతి వాళ్ళు కొడుకులు, కూతుళ్ళని తీసుకొస్తే, మిగిలిన వాళ్ళెందుకు!!?? చంకనాకనికా!? ఒక్క రామోజీరావేం ఖర్మ - ప్రతి మీడియా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తోంది నాకు.అసలు సోనియా గాంధీ అవసరం ఏంటి!? అసలు రాహుల్ గాంధీ ఎందుకు!!??

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu