గత టపాలో చెప్పినట్లుగా మహమ్మదాలీ జిన్నా, తన చివరి రోజుల్లో, దేశవిభజనకు తమ దోహదపడినందుకు విచారించాడని వదంతులొచ్చాయి. వాటి ప్రకారం అతడు తమ సన్నిహిత మిత్రులతో – “నేను మోసగింపబడ్డాను. ఇండియా పాకిస్తాన్ లు విడిపోవటం నిజంగా దురదృష్టం” అనేవాడట. ఈ వదంతులలో నిజమెంతో ఎవరికీ తెలియదు. భగవంతుడికి తెలియవలసిందే. ఎందుకంటే మీడియా సైతం ఈ వదంతుల్ని నిర్ధారించ లేదు అలాగని ప్రచారించకుండా విడిచిపెట్టనూ లేదు. మీడియా చేసే మాయాజాలంలో ఇలాంటి కొన్ని జిమ్మిక్కులకి తక్షణ అర్ధం, ప్రయోజనం సామాన్యులకి బోధపడదు. బహుశ మీడియా అర్ధం, ప్రయోజనం మీడియాకి ఉంటుందేమో!

ఏదేమైతేనేం ......[సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., అనువంశిక నకిలీ కణికుడు కుట్రలు నడుస్తున్నా] భారతదేశంలో ’కనీస’ ప్రజాస్వామ్యం ఈ నాటి వరకూ నడుస్తుండగా పొరుగునున్న పాక్ లో మాత్రం సైనికపాలనే ఎక్కువకాలం మనగలుగుతుంది. అడపాదడపా ప్రజాస్వామ్యం నడిచినా అది పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం. ఎందుకంటే పాక్ ఐ.ఎస్.ఐ., అమెరికా సి.ఐ.ఏ. జట్టుకాబట్టి. వారికి తమ దేశ శ్రేయస్సు పట్ల నిబద్దత లేదు కాబట్టి, ఆయా ఏజంట్లకి తమ స్వలాభమే తమకు ఎక్కువ కాబట్టి.

భారతదేశంలో ముస్లింలు ఎలా జీవిస్తున్నారో, పాకిస్తాన్ లో హిందువులు, భారత వలస ముస్లింలు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు ప్రపంచానికంతటికీ తెలుసు. ఇండియా నుండి పాక్ వెళ్ళిన ముస్లింలూ 2 వ తరగతి పౌరులు. ఇక హిందువులు? అదే పాక్ నుండి ఇండియా వచ్చిన వారు ఇక్కడ Top Persons. [మన్మోహన్ సింగ్, అద్వానీ, కులదీప్ నయ్యర్, రాజ్ కపూర్, దేవానంద్, సునిల్ దత్, ర్యాన్ బాక్సీ అధినేత, ....... ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది.] యూ.పి.ఏ. అధికారంలోకి వచ్చినా, ఎన్.డి.ఏ. అధికారంలోకి వచ్చినా ఇండియాకి కాబోయే ప్రధాని పాక్ నుండి వచ్చిన వారే. ఇదంతా చాలా మామూలుగా, ఏ పకడ్బందీ లేకుండా జరిగిందా? దశాబ్దాల తీవ్రతర కుట్రకి ఇది ఒక నిదర్శనం మాత్రమే.

ఇంకా – ఎలా చూసినా భారత్ లోని ముస్లింలు పాక్ లోని ముస్లింల కంటే కూడా హాయిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే భారత్ లోని ముస్లింలకి మహా’గారాబం’ నడుస్తుంటుంది. కాకపోతే ఈ ’గారాబం’ ఒక్క భారత్ లోనే కాదులెండి, యావత్ర్పపంచంలోనూ నడుస్తుంటుంది. ఇలా ముస్లింల గారాబం లేదా ప్రాముఖ్యత కారణంగానే ప్రపంచంలో దేశాలకి దేశాలు ముస్లిందేశాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఒక్కప్పటి బుద్దిస్ట్ దేశం ఇండోనేషియా ఈరోజు ముస్లిం దేశమే. మలేషియా ఎప్పుడో ముస్లిం దేశంగా మారిపోయింది. చైనాలో కూడా ముస్లింలు, ముస్లిం ఉగ్రవాదులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నేపాల్ ప్రస్తుతానికి హిందూ దేశం అన్న మార్కు నుండి మావోయిస్టుల దేశంగా మారుతుంది. తరువాత స్టేజ్? ఇలాగే చూస్తు ఉంటే భవిష్యత్తులో ఏదో నాటికి భారతదేశం కూడా ముస్లిం దేశంగా మారిపోవచ్చేమో. గల్ఫ్ దేశాలు, ప్రపంచ దేశాలలోని ముస్లింల జీవనోపాధి పెంచడానికి ఎటువంటి సహాయాలు చేయవు. మదర్సాలకు మాత్రం అర్ధికసాయం చేస్తాయి. మదర్సాలలో ఏమి జరుగుతుందో మనకందరికి తెలిసిందే. ఇక బిన్ లాడెన్ అమెరికాని హెచ్చరించాడు కూడా ’ముస్లింలుగా అమెరికా పౌరులు మారాలని, అల్లా సామ్రాజ్యం స్థాపిస్తాననీ, అమెరికా ముస్లిం దేశంగా మారిపోవాలని.’ ఇది 2008 లో అన్ని పత్రికలలో వచ్చిన వార్త.

వాస్తవానికి సి.ఐ.ఏ.కి వివిధ దేశాల్లో తన పధకాలని, కుట్రలనీ అమలు చేయటానికి ఏజంట్లు కావాలి. ఎటూ ఆయా దేశాల్లో కార్పోరేట్ కంపెనీల్లో అధినేతలుగా, ఉన్నతోద్యోగులుగా, ప్రభుత్వోన్నత పదవుల్లో, రాజకీయ పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు సి.ఐ.ఏ.కి ఏజంట్లుగా పనిచేస్తుంటారు. [సి.ఐ.ఏ. తన ఏజంట్లుగా రాజకీయ, సినిమా, కళారంగం,పత్రికా రంగం, టీచింగ్, వ్యాపార రంగం, లాయర్లు, డాక్టర్లు మొదలైన రంగాలలో ఏర్పాటు చేసుకుంటారని 1994 – 95 సంవత్సరంలో ఈనాడులో ప్రచురించబడింది. ] కార్పోరేట్ సంస్థలు, వారికి సహాయ సహకారాలందిస్తూ రాజకీయ నాయకులు, ప్రజలని చేసే వ్యాపారదోపిడిలో నుండి సి.ఐ.ఏ. వాటా, సి.ఐ.ఏ.కి వస్తుంటుంది. కానీ ఈ ఆర్ధిక వలయానికి ఆవల సి.ఐ.ఏ.కి మరికొందరు ఏజంట్లు కావాలి. భయోత్పాతాలు సృష్టించడానికి. ఇలాంటి ’అసైన్ మెంట్’కి కార్పోరేట్ వంటి వ్యాపార ఏజంట్లు, రాజకీయ ఏజంట్లు ఉపయోగపడలేరు.


ఈ కీలకమైన పనికి సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.ఏజంట్లునీ, ముస్లింలనీ వాడుకుంటోంది. ఎందుకంటే ఇలా భయోత్పాతం సృష్టించగల, దారుణ మారణకాండలు రగిలించగల తీవ్రవాద కార్యక్రలాపాలు నిర్వహించడంలో ఆయా ఏజంట్లు తమ జీవితాలకి రిస్క్ తీసుకోవాలి. అలాంటి ‘రిస్క్ అసైన్ మెంట్స్’ ని వైట్ కాలర్డ్ ఏజంట్సు అయిన కార్పోరేట్ మరియు రాజకీయ రంగ ఏజంట్లు నిర్వహించలేరు. ఇలాంటి ప్రమాదపూరిత ఆపరేషన్లకీ, అసైన్ మెంట్లుకీ సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ. లు పేద ముస్లింలకి వాడుకుంటోంది. మరిన్ని వివరాలు నా గత టపా 'మన మీద జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 2 [ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు]' చర్చించాను.

ఉదాహరణకు కాశ్మీరులోని ఉగ్రవాదం గురించి చర్చించడం అవసరం. కాశ్మీరులో ఉగ్రవాదం ఊడలు దిగడానికి ముందు విదేశీ పర్యాటకులతో కళ కళ్ళాడింది. సినిమా షూటింగుల సందడి ఉండేది. కుంకుమ పువ్వు, యాపిల్ పళ్ళూ, మంచు కొండల సౌందర్యం డబ్బు తెచ్చిపెట్టేవి. ఉగ్రవాదం కాళ్ళూనే ముందు ఓ పధకం ప్రకారం అక్కడి కాశ్మీర్ పండాల మీద దాడులు జరిగాయి. ఘర్షణలు పైకారణం [Over leaf reason] గా పేర్కొనబడ్డాయి. ఆస్థులు తగలబెట్టడం, దాడులకి పాల్పడం, అఘాయిత్యాలు చేయటం వంటి వేధింపులు తట్టుకోలేక కాశ్మీర్ లోని హిందువులు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాలకి ఎక్కువుగా ఢీల్లీకి వలస పోయారు. ఇళ్ళు, వాకిళ్ళు, భూములూ వదిలేసి స్వదేశంలో కాందీశీకుల్లా, చితికిన బతుకులు వెళ్ళదీస్తున్న వారు కొకొల్లలున్నారు. ఆ తర్వాత మెల్లిగా ఉగ్రవాదం ఊపందుకొంది. 70 వ దశకం చివరి సంవత్సరాలల్లో నుండి 80 వ దశకం తొలి సంవత్సరాల్లో కాశ్మీరు సందర్శనకి వచ్చిన విదేశీ టూరిస్టులు వరుసగా హత్య చేయబడ్డారు. హృదయ విదారకమైన ఆ కధనాలు ‘మీడియా’ని ముంచెత్తాయి. వెంటనే బ్రిటన్, అమెరికా వంటి దేశాలు తమ ప్రజలని కాశ్మీరు పర్యటనకి వెళ్ళవద్దని హెచ్చరించాయి. దాంతో టూరిస్టు ఆదాయం గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో స్విస్ తన మంచుకొండలు ప్రదర్శిస్తూ వ్యాపార అవకాశాన్ని అంది పుచ్చుకుంది. భారత్ వ్యాపారం దెబ్బతినటం, స్విస్ వ్యాపారం పుంజుకోవటం దాదాపు ఏకకాలంలో జరిగాయి. మంచుకొండలు ప్రకృతి సౌందర్యం రెండు దేశాల్లో ఉందాయె మరి! స్విస్ కీ సి.ఐ.ఏ.కి మధ్య డబ్బు డీల్ కుదిరితే, ఈవిధంగా ప్రక్కవాడి వ్యాపారాన్ని దెబ్బగొట్టి మరొకరికి వ్యాపారం పెరిగేలా చేయటం అసాధ్యం కాదు గదా!

దెబ్బతో మనం కూడా సినిమాల్లో డ్యూయట్ ల కోసం స్విస్ పోక తప్పలేదు. ఇలా ఆర్ధిక మూలాలు దెబ్బతిన్న తర్వాత కాశ్మీర్ ని Capture చేయటం సులభం కదా! అప్పుడు అక్కడ తీవ్రవాదం పెరగడానికి కారణాలుగా, ఎన్ని పనికి మాలిన సిద్ధాంతాలలైనా చెప్పవచ్చు. అసలు కారణాన్ని తొక్కిపట్టి, సామాజిక, రాజకీయ లేక మత పరమైన సిద్ధాంతాలు ప్రతిపాదించి వ్రాయడానికి కులదీప్ నయ్యర్ లాంటి అతి మేధావులు మీడియాలో ప్రత్యక్షమౌతారు. అప్పటికే స్థలం ఖాళీ చేయబడ్డ కాశ్మీర్ లోకి ప్రక్కదేశం నుండి పసితనం నుండే మత్మోనాదం ఎక్కించుకున్న టీనేజర్స్ భుజాన తుపాకులు పట్టుకొని దిగబడతారు. ఈ గోలంత పడలేమని దీనికంటే కాశ్మీర్ ని వదిలేసుకోవడమే ఉత్తమమనే వాదనలు ప్రచారిస్తారు. అవి నమ్మి కొందరు ప్రజలు ’అవునేమో’ అనుకొంటారు. ఇప్పుడు కాశ్మీరుని వదిలేస్తే మర్నాడు పంజాబ్ తో మొదలెడతారు. [ఇప్పటికే ఒకసారి పంజాబ్ ఖలిస్తాన్ అంటూ మొదలెట్టి, ముదరబెట్టి 1992 తర్వాత చల్లబడ్డారు.] ఆ పైన హర్యానా, ఆపైన మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇలా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా వస్తారు. వరుసగా వదిలేసుకుందామా?

ఇదీ కుట్ర పనిచేసే తీరు. ఇలా తీవ్రవాదం తో ఇతరుల్ని, మనల్ని, విసిగించేందుకే సి.ఐ.ఏ.కి పేద ముస్లింలు కావాలి. [ఇప్పటికి సి.ఐ.ఏ.నే పెద్దన్న. సి.ఐ.ఏ. పతనం చెందాక అప్పుడు అసలు సూపర్ పెద్దన్న బయటికొస్తాడు. ఇంకా పరిస్థితులు పరిపక్వం కాలేదనుకుంటే మరో పెద్దన్నని పైకి లేపుతారు.]

దీన్ని సుసాధ్యం చేయడానికే సామాన్యప్రజల్లోని ముస్లిం కుటుంబాలు కాలం గడిచే కొద్దీ మరింత మరింత పేదలౌతున్నారు. [నిజానికి వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్లక్ష్యం చేయడం అనే చాప క్రింద నీరు లాంటి ప్రక్రియ చాలా కొద్దిమందికే తెలుసు. నేడు ముస్లింల turn అయిపోతే తరువాతి వంతు మిగిలిన ప్రజలది.] బ్రూనే సుల్తాన్, దుబాయ్ రాజు వంటి ముస్లింరాజులూ, పెట్రోలు బావుల అధిపతులు అయిన కొద్దిమంది మాత్రమే నానాటికీ ధనవంతులౌతున్నారు. ధనిక దేశాలుగా పేర్కొనబడే గల్ఫ్ దేశాల్లో కూడా ధనిక కుటుంబాలు కొన్నే. ధనికులతో పోల్చితే పేద కుటుంబాల నిష్పత్తే ఎక్కువ. ఇక పాక్, ఆఫ్ఘాన్ వంటి దేశాల్లో అయితే అత్యధికులు పేద ముస్లింలే.

సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., అనువంశిక నకిలీ కణికుడి కుట్రల ప్రకారం – ప్రజలు ఎంత పేదలైతే, ఎంతగా ఆకలి పీడితులైతే అంత తేలికగా తమకి టెర్రరిస్టులు కిరాయికి దొరుకుతారు. దీనికి దృష్టాంతము – మన దేశంలోని రద్దీ ప్రాంతాల్లో బాంబు విస్ఫోటకాలు చేయటానికి వస్తోన్న తీవ్రవాదుల్లో కొందరు చెచెన్యా, ఆఫ్గాన్, పాక్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి రావడం గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.

వాళ్ళకీ, భారతదేశానికీ ఏమాత్రమూ సంబంధం లేదు. అంతేకాదు వాళ్ళకి ఓ సిద్ధాంత ప్రాతిపదిక కూడా ఏదీ లేదు. తమ తమ ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబాల్ని పోషించుకోవటానికి డబ్బు కావాలి. అంతే. ఇటీవలి నవంబరు 26,2008 ముంబై దాడుల్లో పట్టుబడిన ’కసబ్’ తను 1½ లక్షల రూపాయల కోసం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాని చెప్పినట్లు మనం చూశాం, చదివాం.

ఇలాంటి ప్రమాదపూరిత తీవ్రవాద అసైన్ మెంట్స్ నిర్వహించేందుకు చౌకగ, తేలికగా తీవ్రవాదులు దొరకాలంటే దారిద్ర్యాన్ని సృష్టించడం ఒక పద్ధతి. మతం పట్ల దురఃహకారాన్ని, ఇతర మతాల పట్ల విద్వేషాన్ని, మతోన్మాదాన్ని, విచక్షణారహిత హింసోన్మాదాన్ని సృష్టించడం మరొక పద్దతి. ఇది మరింత సులభమైన శక్తివంతమైన మరియు గురి తప్పని పద్దతి.

ఎందుకంటే, ఎంతగా జనాలు పేదరికంతో బాధలు పడుతున్నా, వారి పేదరికపు స్థాయితో పోలిస్తే టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకొంటే ఇవ్వజూపుతున్న డబ్బు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి, మానవబాంబులుగా తయారు కావటానికి ముందుకొచ్చే వారు తక్కువే.

ఈ నేపధ్యంలో – చిన్న వయస్సు నుంచే, బాల్యం నుండే మతోన్మాదాన్ని ప్రవేశ పెట్టి అదే తిండీ, నీరూ, గాలీ నిద్రగా పెంచితే ….. అప్పుడు మానవబాంబుల్ని, కరుడుగట్టిన హింసోన్మాదాన్నీ ఉత్పత్తి చేసుకోవటం చాలా తేలిక. ఆ విధంగా చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడే పేద ముస్లిం పిల్లల్ని దగ్గరికి తీసి వారిని ప్రేమరాహిత్యంతోనూ, పగా ప్రతీకారాల నూరిపోతల తోనూ, ప్రాషాణ హృదయంతోనూ, మంచి మీద ఏమాత్రం నమ్మకం లేనివారిగానూ, నెగిటివ్ ఆలోచనాధోరణి తోనూ పెంచడం అన్న ప్రక్రియని అమలుచేస్తోన్నారు. [ఇది ఖచ్చితంగా మానవజాతి మీద కుట్ర.] కాబట్టే తాలిబన్లలో ఎక్కువమంది పాక్, ఆఫ్గాన్ లలోని 20 – 30 ఏళ్ళ లోపు యువకులే!

కొంతమందికి సందేహం రావచ్చు – “తాలిబాన్లు కదా 11,సెప్టెంబరు 2001 న న్యూయార్క్ లోని WTC మీద విమానదాడి జరిపింది? అందుకోసమే కదా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాకర్ బుష్ మొన్నటి దాకా ఆల్ ఖైయిదా, బిన్ లాడెన్, తాలిబాన్లకు వ్యతిరేకంగా యుద్ధం కూడా చేశాడు? అమెరికా సైన్యాలు ఆఫ్గాన్ మీదా, ఇరాన్ మీద యుద్ధంచేశాయి. ఇరాక్ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ ని ఉరితీసి చంపాడు కూడా. ఈ విధంగా సి.ఐ.ఏ., తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, ఎలా మీరు సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ. కలిసి ముస్లిం టెర్రరిస్టుల్ని భారత దేశానికి, ప్రపంచానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగా వాడుకుంటోంది అంటున్నారు?" అని.

ఇది నిజంగా ఆసక్తి కరమైన, కుటిల మేధస్సుతో కూడిన తంత్రం [స్ట్రాటజీ]. ఇలాంటి సందేహాలు సృష్టించగల ఎలీబీలు ఎన్ని ఉంటే, వారంత సులభంగా ఈ కుట్రలోని తమ ’భాగస్వామ్యం’ అన్న అరోపణ, అనుమానాలని రాకుండా చేయగలదు.

ఏవిధంగా ఐ.ఎస్.ఐ., తమ మాతృదేశం పాక్ కీ, పాక్ ప్రజల శ్రేయస్సుకి కట్టుబడి లేదో – ఆ విధంగానే సి.ఐ.ఏ.లోని చాలామంది ఉన్నతస్థాయి వ్యక్తులు USA కీ, USA లోని ప్రజల శ్రేయస్సుకీ బద్ధులై లేరు. అసలు అనువంశీక నకిలీ కణికుడి కుట్రలో మానవ జాతిపట్ల కనీస Concern కూడా లేదు. వారి Concern అంతా కేవలం కార్పోరేట్ వ్యాపారం మీద, ఆ పేరుతో జరిగే దోపిడి పట్ల మాత్రమే. దీన్ని గురించిన విపులమైన చర్చ Coup On Business Field……. లో చూడగలరు.

ఈ స్ట్రాటజీని బాగా అర్ధం చేసుకోవాలంటే ఇప్పటి శ్వేతసౌధం, ఇరాక్ లోని పెట్రో బావులు, ప్రపంచ ఆర్ధిక మాంద్యం వంటి నేపధ్యాలతో కూడిన ప్రస్తుత పరిస్థితిని పరిశీలించండి.

సెప్టెంబరు11,2001 లో WTC పై వైమానిక దాడి మనందరం టీవీల్లో చూసిందే. హైజాక్ చేసిన విమానాలు 110 అంతస్థుల జంట భవనాల్ని ఢీ కొని క్షణాల్లో నేలమట్టం చేశాయి. ఎంత వేగంతో ఢీ కొనాలో, ఎంత ఎత్తులో ఢీ కొనాలో చాలా జాగ్రత్తగా పధకం పన్ని మరీ ఢీ కొన్నారు. విమాన వేగాన్ని బట్టి ఎంత Kinetic Energy భవనాల్ని తాకాక Potential Energy గా మారుతుందో, అప్పుడు పేలిన Fuel Tanks కారణంగా పుట్టే మంటలు వేడికి ఎంతగా భవన నిర్మాణంలో వాడిన ఇనుము కరుగుతుందో, దానిపై Gravitational Pull ఎంత ఉంటుందో, అందుకోసం ఎంత ఎత్తులో [ఎన్నో అంతస్థు] భవనాన్ని ఢీ కొనాలో ఎంతో Scientific గా లెక్కలు గట్టి మరీ ఢీ కొట్టారు. అందరూ చూస్తుండగా కళ్ళ ముందే క్షణాల్లో జంట భవనాలు నేలకూలాయి. ఆ భవన నిర్మాణం తాలుకూ వివరాలు ఎవరు ఇచ్చిఉండాలి? విమానాలు హైజాక్ చేయడానికి ఎవరు సహాయం చేసి ఉండాలి? విమానాలు వైట్ హౌస్ మీద దాడికి వస్తున్నాయని అనగానే బుష్ బంకర్ లో దాగున్నాడు. చీమ చిట్టుకుమంటే సి.ఐ.ఏ.కి తెలుస్తుంది అనే మాట ఉన్నప్పుడు తమ దేశంలోని విమానాల హైజాక్ తెలియదా? ఇంటి దొంగలు సహకరించకుండా ఎవ్వరికి సాధ్యం కాదు కదా? అలా కూల్చిన బిన్ లాడెన్ పాక్ లోనే ఉన్నాడని వార్తలున్నా అమెరికా పాక్ ని ఏమీ చేయలేదు సరికదా బుజ్జగిస్తోంది, ఆర్ధిక సాయాన్ని ఆపకుండా చేస్తూనే ఉంది. పెంటగాన్ కంటే కూడా ఐ.ఎస్.ఐ. కే ఎక్కువ గ్రిప్ ఉండటం ఇక్కడ స్పష్టంగానే కన్పించడం లేదూ? 1947 లో మనతో పాటే ప్రాణం పోసుకున్న పాక్ కి, దాని ఐ.ఎస్.ఐ., కి ఇంత బలం ఎక్కడది? మన ముంబైముట్టడిలోనూ దాని బలం కన్పిస్తూనే ఉంది.

ఈ విమాన దాడి తర్వాత అమెరికా తక్షణమే ఆఫ్గానీస్తాన్ మీద యుద్ధం చేసింది. ఆ తర్వాత జార్జి వాకర్ బుష్ ఇరాక్ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ తీవ్రవాదులకి సహాయ సహాకారాలందిస్తున్నాడనీ, ఇరాక్ లో రసాయనిక, అణ్యాయుధాలున్నాయని ఆరోపిస్తూ ఇరాక్ మీద యుద్ధం ప్రకటించాడు. ఇరాక్ ని ఓడించి సద్ధాం హుస్సేన్ ని బంధించారు. 2006, డిసెంబరు 30 న ఉరితీసారు. అంతా అయిపోయింది. అయితే బుష్ ఇరాక్ నుండి అమెరికా సేనల్ని మాత్రం ఉపసంహరించలేదు. అందుమూలంగా అమెరికాకి ఎంత ప్రయోజనం ఒనగూడిందో తెలియదు గానీ ప్రజల వ్యతిరేకిస్తున్నా కూడా అమెరికా సైన్యాల్ని బుష్ ఇరాక్ నుండి ఉపసంహరించ లేదు.

ఇది కారణంగా చూపెట్టి ఒపెక్ దేశాలు, ముడి చమురు ధరలు విపరీతంగా పెంచి సొమ్ము చేసుకున్నాయి. మన బ్లాగ్ మిత్రుల్లో ఒకరు తెలుగు వాడినిబ్లాగులో ఏ కార్పోరేట్ కంపెనీకి ఎన్ని మిలియన్లడాలర్లు వ్యాపారం కట్టబెట్టబడిందో వివరంగా వ్రాసారు. ఆ నిజాలు చదివితే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే! అంతేకాదు, ముడిచమురు ధరలు పెరిగాయన గానే [ఈ ధరల్ని ఒపెక్ దేశాలు మాత్రమే నియంత్రించటం ఇక్కడ గమనార్హం. ఇంతాచేసి ప్రపంచ చమురు ఉత్పత్తిలో వీరి వాటా 40% కంటే కూడా తక్కువే.] నిత్యాసవరాల దగ్గరనుండి అన్నింటి ధరలూ, ప్రపంచవ్యాప్తంగా పెరగటం పరిపాటే. ఈ విషయం మన కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరమే గాక ఎన్నో దేశాల ఆర్ధికవేత్తలు ధృవీకరించిందే.

కారణం చూపించకుండా ఇరాక్ లో సైన్యాన్ని కొనసాగించటం లోని స్ట్రాటజీ – అలా గల్ఫ్ దేశాలకి ప్రయోజనం సమకూర్చటమే. బుష్ కి వెనక సి.ఐ.ఏ. ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. గల్ఫ్ దేశాలతో పాటు ఇలా ఎవరెవరికి ఎంత ప్రయోజనం సమకూర్చటానికి ఇదంతా జరుగుతుందో సి.ఐ.ఏ.కి తెలియాలి, భగవంతుడికి తెలియాలి.

అంతేకాదు – మన దేశంలో 1989 ఎలక్షన్ల లో గెలవడానికి ఆనాటి రాజకీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ దేశ ఆర్ధిక స్థితిని పట్టించుకోకుండా 10,000/- రూపాయల లోపు వ్యవసాయ ఋణాలని మాఫీ చేసింది. తత్ ఫలితంగా తదుపరి కేంద్రప్రభుత్వం ప్రపంచ విఫణిలో భారతదేశపు బంగారాన్ని కుదవ పెట్టాల్సి వచ్చింది. [చెప్పిందే చెబుతున్నానని అనుకోకండి. ఎందుకు మరోసారి చెప్పాల్సివచ్చిందో వివరంగా చెబుతాను.]

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బియ్యం ఉచితం, కరెంటు ఉచితం, ఇక అందరికీ అన్ని ఉచితం అన్న చందాన ఒకరి తో ఒకరు పోటీలు పడి మరీ సంక్షేమ ప్రకటనలిస్తున్నారు. ‘ఫలితంగా రాష్ట్ర ఆర్ధిక స్థితి కుప్పకూలితే?’ అన్నవిషయం ఎవరికీ పట్టడం లేదు.

గత ఎలక్షన్లలో తమిళనాడులో అధికారంలోకి రావటానికి DMK పార్టీ ఇంటికో కలర్ టీవీని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చాక అమలు కూడా చేసింది. [ఎంత శాతమో తెలీదు.]

ఇంటికో టీవీ వంటి పధకాలు రాజ్యాంగబద్దం కాదు. ఇప్పటికీ కేసు కోర్టులో తేలలేదు. కానీ మౌలిక వసతుల అభివృద్ధి విడిచిపెట్టి, ప్రజల సొమ్మును సంక్షేమ పధకాలకి మళ్ళిస్తే, అంతిమంగా జరిగేది దేశా లేదా రాష్ట్రం యొక్క ఆర్ధిక స్థితి కుప్పకూలటమే. ఇదేమీ పార్టీలకు పట్టటం లేదు. [పట్టనట్టు నటిస్తున్నారు] ఎక్కడ రేసులో వెనకబడి పోతామో, మన కంటే ప్రత్యర్ధి పార్టీ మరింత ఆకర్షణీయమైన పధకాన్ని ప్రకటిస్తుందేమో నన్న పరుగులో పడి కొట్టుకుపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో లాగా, తమిళనాడులో లాగా, ఇండియాలో లాగా, అమెరికాలో కూడా జార్జ్ వాకర్ బుష్ గత ఎలక్షన్లలో నెగ్గేందుకు స్వంత ఇంటి ఋణపధకం వంటి జనాకర్షక పధకాలు ప్రకటించడం [అంటే బ్యాంకులు, గ్యారెంటీ లేకపోయిన ఋణాలివ్వమనడం ద్వారా వారిలో స్వంత ఇంటి కలలని రేపడం], ఫలితంగా బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయి కుప్పకూలడం ఇప్పుడు సబ్ ప్రైమ్ సంక్షోభం [ఎవరి లాభం వాళ్ళు చూసుకోవడం వలన] పేరిట మనం వీక్షిస్తున్నాం. ఎన్ని బెయిల్ అవుట్లు ప్రకటించినా ఆర్ధికమాంద్యంలోకి ప్రపంచంలోని ఎన్నో దేశాలు కూరుకుపోవటం మన కళ్ళ ఎదుటే జరుగుతుంది.

ఇలా చూస్తే ప్రపంచమంతా ఒకటే స్ట్రాటజీ అమలు చేయబడటం లేదూ? ఒకే స్ట్రాటజీ అమలు చేయబడుతుందంటే ఒకే వ్యవస్థ దీన్నంతటనీ నడుపుతుందన్న మాటే కదా! 1990 కి ముందు ఇలాంటి విషయాల్లో USSR తాలుకూ KGB ని అనుమానించే వారు. ఆ నేపధ్యంలో ఎన్నో గూఢచార కథలతో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సి.ఐ.ఏ.నే బిగ్ బ్రదర్. మరి అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడుతున్న ఒకే స్ట్రాటజీని నడుపుతున్న వ్యవస్థకీ, సి.ఐ.ఏ.కీ సంబంధం లేదా? అంతటి సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.ని ఏమీ చేయలేకపోతుందంటే ఇస్లామాబాద్ కీ బలమెక్కువన్న మాట. ఇస్లామాబాద్ మూలాలు హైదరాబాద్ లో తేలుతున్నాయి మరి. అలాంటప్పుడు ఈ హైదరాబాద్ కీ, నకిలీ కణికుడికీ సంబంధం ఎందుకు ఉండకూడదు? ఈ సందేహానికి సమాధానాలు, తార్కిక అనువర్తనలూ The Writings and Activities of Mr. Ramoji Rao ….. లో చూడగలరు.

ఇక పోతే, ఇలాంటి స్ట్రాటజీలు అమలు చేయాలంటే సి.ఐ.ఏ.కి తమ దేశంలోనే గాక ఇతర దేశాల ప్రభుత్వాల మీద కూడా గ్రిప్ ఉండాలి. అలాంటి గ్రిప్ కోసమే ఆర్ధిక తీవ్రవాదాన్ని, హింసోన్మాద తీవ్రవాదాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే వ్యూహత్మక శతృత్వం సి.ఐ.ఏ.కీ – ఆల్ ఖైదా, తాలిబాన్లూ, బిన్ లాడెన్ ల మధ్య ఉంది. [ఒకప్పుడు అమెరికా – రష్యాల మధ్య ఉండేది.] అలాంటి వ్యూహాత్మక స్నేహము సి.ఐ.ఏ.కీ – పాక్ కీ, ఐ.ఎస్.ఐ. కీ మధ్య ఉంది. ఈ అన్నింటి వెనుకా ఉన్నది శతాబ్ధాల అనుభవంతో గూఢచర్య చక్రాన్ని నడుపుతున్న నకిలీ కణిక వంశీయుల తంత్రమే! కాబట్టే ఒకప్పుడు బ్రిటీషు వెలిగింది. తర్వాత KGB వెలిగింది. ఆ సిరిస్ లో ఇప్పుడు సి.ఐ.ఏ., చైనా ఉన్నాయి. అన్నిటివీ ఉత్థాన పతనాలే. ఇది చెప్పడం లేదా – మొన్నటి బ్రిటిషు, నిన్నటి KGB, ఇవేళ్టి సి.ఐ.ఏ. అన్నిటి వెనుకా అంతిమ లబ్ది పొందుతుంది గల్ఫ్ ముస్లింలూ. అంతిమ పట్టు ఇస్లామాబాద్ కి అని! ఇప్పుడు ఆలోచించి చూడండి.

దీన్ని మరింత స్పష్టంగా చూడాలంటే మరోసారి మనం భారత స్వాతంత్రసమరాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిందే.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu